karunya
-
పీఆర్ శాఖలో త్వరలో కారుణ్య నియామకాలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈ ఈ) నాణ్యతపై రాజీలేకుండా, ప్రమాణాలు పాటిస్తూ శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. తమ శాఖ పరిధిలో త్వరలోనే 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకా రం తెలిపారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1, 375 కోట్లతో రోడ్లు వేయబోతున్నామని, ఏఈఈల ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభం కావడం అదృష్టమని తెలిపారు. ‘అభివృద్ధి పనుల్లో మీ మార్కును చూపాలి. నాణ్యత లేని పనులు చేస్తే సస్పెండ్ అవుతారు’అని హెచ్చరించారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు మంగళవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు మూతపడుతున్నాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందపడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే గురుకులాల అద్దె లు రూ. కోట్లలో పెండింగ్‌లో పెట్టారని చెప్పా రు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పార్టీ సమీక్ష అనంతరం ఆమె గాం«దీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులివే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. పోస్టుల భర్తీకి టైమ్‌లైన్.. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి. సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. మృతిచెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి. -
పాత రోజులు గుర్తొచ్చాయి.. విశ్వనాథ్ మెచ్చిన పాట
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. సినిమా పేరుకు తగ్గట్లే అచ్చమైన తేనెలొలికించే తెలుగు పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వాసవసుహాస.. అంటూ సాగే పాటను కళా తపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. కల్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్, కారుణ్య గాత్రం పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. వాసవసుహాస కమనసుధ.. ద్వారవతీతిరనాడ్వటీవసుధ.. అంటూ రమ్యంగా సాగుతుందీ పాట. ఈ పాటను విన్న విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట చూస్తుంటే నా పాత రోజులు గుర్తొస్తున్నాయని, వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ కూడా చాలా బాగుందని ప్రశంసించారు. కాగా ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్.. బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే? కృష్ణం రాజు కోసమే కైకాల ఆ పనికి ఒప్పుకున్నారు: శ్యామలా దేవి -
కారుణ్య చీకట్లు.. చావు వైపు తండ్రుల చూపు
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లైన్ కాలనీకి చెందిన మల్లేశం (59) సింగరేణి ఓసీపీ1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కుమారునికి ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ మల్లేశం గత సంవత్సరం మెడికల్ అన్‌ఫిట్ కోసం సింగరేణి మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బోర్డు ఆయనను అన్‌ఫిట్ చేయలేదు. దీంతో తన కుమారుడికి వారసత్వ ఉద్యోగం రాదన్న మనోవేదనతో మల్లేశం ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన రాజయ్య (59) ఆర్జీ2 పరిధిలోని పోతన కాలనీలో ఉంటూ ఓసీపీ 3లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం గుండె ఆపరేషన్ కావడంతో విధులకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కుమారుడికి వారసత్వ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేశాడు. గత డిసెంబర్ 20న కొత్తగూడెంలో సింగరేణి మెడికల్ బోర్డుకు వెళ్లివచ్చాడు. అయితే సానుకూలంగా స్పందన రాకపోవడంతో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాననే మనోవేదనతో అదే నెల 22న పురుగు మందు తాగి చికిత్స పొందుతూ 27న తనువు చాలించాడు. సింగరేణి కుటుంబాల్లో ‘కారుణ్యపు’ చీకట్లకు ఈ రెండు సంఘటనలు ఉదాహరణలు. సాక్షి, పెద్దపల్లి : పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలన్న తపన, వారికి మంచి ఉద్యోగాలు రాకపోతే ఏమిటన్న బెంగ పలువురు సింగరేణి ఉద్యోగులను మృత్యువు వాకిట్లోకి నెట్టేస్తోంది. ‘మెడికల్ ఇన్వాలిడేషన్’ కాకపోవడం, పిల్లలకు వారసత్వంగా ఉద్యోగం ఇప్పించలేకపోతుండడంతో ఉద్యోగులు పదవీ విరమణకు ముందే జీవితాన్ని ముగిస్తున్నారు. ఏ విధంగా చనిపోయినా తమ వారసులకు వారసత్వ ఉద్యోగం లభిం చే వెసులుబాటు ఉండటంతో కొందరు విధిలేని పరిస్థితుల్లో బలవంతంగా తనువు చాలిస్తున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తూ.. సంస్థలో భాగమైన ఉద్యోగుల వారసులకు కూడా సింగరేణిలో ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విధులు నిర్వర్తించడానికి ఆరోగ్యం సహకరించని ఉద్యోగులను మెడికల్‌గా అన్‌ఫిట్ అని పరిగణిస్తూ వారి వారసుల (కొడుకు, కూతురు, అల్లుడు)కు సింగరేణిలో ఉద్యోగం కల్పిస్తారు. పదవీ విరమణకు రెండేళ్ల ముందు వరకే ఈ కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. ఆ తరువాత అవకాశం ఉండదు. కానీ సర్వీసు ఒకరోజు మిగిలి ఉండగా మృతిచెందినా, వారసులకు ఉద్యోగ అవకాశం ఉం టుంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తమ ఉద్యోగ విరమణ అనం తరం వారసులకు శాశ్వత ఉ పాధి చూపించాలనే తపనతో చాలామంది సింగరేణి ఉద్యోగులు కారుణ్య నియామకాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆరోగ్యంగా ఉన్న ఉ ద్యోగులు కూడా మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ దరఖాస్తులను మెడికల్ బోర్డు తిరస్కరించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పిల్లల భవిష్యత్‌కోసం తండ్రులు చివరకు ప్రా ణాలు కూడా తీసుకుంటుండడం ప్రస్తుతం సింగరేణి వ్యా ప్తంగా కలవరం సృష్టిస్తోంది. ఆరోగ్యం బాగోలేకపోతేనే.. కారుణ్య నియామకాల కోసం సింగరేణి మెడికల్ బోర్డు నెలలో కనీసం రెండుసార్లు కొత్తగూడెంలో భేటీ అవుతోంది. అప్పటివరకు వచ్చిన దరఖా స్తుల ఆధారంగా ఉద్యోగులను పరీక్షించిన వైద్యు లు, వారి ఆరోగ్యం ఉద్యోగం చేయడానికి అనువుగా ఉందా, లేదా అన్నది నిర్ధారిస్తారు. అన్‌ఫిట్ అయితేనే వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. సదరు ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నాడని పరీక్షలో తేలితే అదే ఉద్యోగం లో కొనసాగాలని ఆదేశిస్తారు. 2018 ఏప్రిల్ 7 నుంచి 2021 జనవరి 6 వరకు 66 సార్లు మెడికల్ బోర్డు భేటీ కాగా, 12,117 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 7,524 మంది మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. 2,537 మంది ఉద్యోగుల దరఖాస్తులను తిరస్కరించారు. కాగా తమ వారసు ల భవిష్యత్‌కు బాటలు వేసే క్రమంలో మూడు, నాలుగు దశాబ్దాల శ్రమ అనంతరం ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడపాల్సిన స్థితిలో సింగరేణి ఉద్యోగులు ఇలా వారసుల కోసం అర్ధంతరంగా తనువులు చాలిస్తున్న వ్యథ ప్రస్తుతం సింగరేణిని కలచివేస్తోంది. -
ప్రముఖ గాయకుడుకి మాతృ వియోగం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య మాతృమూర్తి కన్నుమూశారు. మీర్‌పేట కార్పోరేషన్ బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో కారుణ్య తల్లి జానకి (70), తండ్రి మధు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ బీడీఎల్ విశ్రాంత ఉద్యోగులు. జానకి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సైదాబాద్ శ్మశాన వాటికలో జానకి అంత్యక్రియలు నిర్వహించారు. జానకి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
హారర్.. సెంటిమెంట్
సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ ఫేమ్ సాయి తుషిత టైటిల్ లోగో ఆవిష్కరించారు. దర్శక–నిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. కన్నడలో రెండు చిత్రాలు చేసిన నేను తెలుగులో తొలిసారి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. కారుణ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై చిత్రీకరణ చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా తాతగారితో ‘మహానటి’లో నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నా’’ అని సాయి తుషిత చెప్పింది. ‘‘ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కారుణ్య. నటుడు భద్రం, రచయిత గోపీవిమలపుత్ర, కెమెరా చందు, ఎడిటర్ వెంకట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
కళ్లు చెమర్చేలా...
సుమన్ బాబు, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సి.హెచ్. సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ నెల 15న షూటింగ్ ప్రారంభించి మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. కథలో ప్రధాన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించాం. ఎంతో హృద్యంగా ఉండే ఈ సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ‘మహానటి’ ఫేం బేబి సాయి తుషిత పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబి డమరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, సంగీతం: ప్రమోద్ పులగిల్ల, కెమెరా: చందు. -
అందమైన వినోదం
‘మహానటి’ ఫేమ్ బేబి తుషిత ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎర్రచీర’. చెరువుపల్లి సుమన్ బాబు, ‘శంభో శంకర’ ఫేమ్ కారుణ్య, కమల్ కామరాజు ముఖ్య తారలుగా నటించనున్నారు. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ 15 నుంచి తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సి.హెచ్ సుమన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలోని అందమైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఆద్యంతం సస్పెన్స్ కట్టి పడేస్తుంది. కథ, కథనం హైలైట్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ చిత్రానికి సంగీత దర్శకుడు ప్రమోద్ సారథ్యంలో రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అలీ, రఘుబాబు, ఉత్తేజ్, మహేష్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం : పమ్రోద్ పులిగిల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్. -
ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు డబ్బులు వచ్చాయి
‘‘పది కోట్ల బడ్జెట్‌తో చేయాల్సిన ‘శంభో శంకర’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే రూపొందించాం. పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకున్నా, సినిమా బాగా రావాలని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు వారు పెట్టిన డబ్బులు వచ్చాయి’’ అని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు. ‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ – ‘‘మా సినిమా పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అని కచ్చితంగా చెప్పగలను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి శివాజీరాజాగారితో కలిసి తిరిగాను. ఆయన మంచితనాన్ని, సేవలను స్ఫూర్తిగా తీసుకుని నా వంతు సహకారాన్ని అందించాలనుకుంటున్నా. ‘శంభో శంకర’ ద్వారా వచ్చిన కొంత అమౌంట్లో పది వేలు చొప్పున పది మంది నిరుపేదలకు అందించాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం శంకర్, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ సినిమా హిట్‌తో ఆ భయం పోయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు డైరెక్టర్ శ్రీధర్. ‘‘మా సినిమా హిట్ అవడంతో మాకంటే ఎక్కువగా ప్రేక్షకులు హ్యాపీగా ఉన్నారు. థియేటర్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మా కష్టం ఫలించింది. ఇకపై కూడా ఇదే విధంగా నిజాయితీగా, నమ్మకంగా సినిమాలు చేస్తా’’ అన్నారు ‘షకలక’ శంకర్. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా, కథానాయిక కారుణ్య, నటులు ఏడిద శ్రీరామ్, ప్రభు, నాగినీడు పాల్గొన్నారు. -
మా ఆవిడ వార్నింగ్ ఇచ్చింది
‘హీరో అయిపోవాలని సినిమా చేయలేదు. పని లేక ఖాళీగా ఉండటం ఇష్టం లేక హీరోగా ‘శంభో శంకర’ సినిమా స్టార్ట్ చేశా. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత నేను అనుకున్న రేంజ్ సినిమాలు రాలేదు. కొన్ని నా మనసుకు నచ్చలేదు. మనసుకు సంతృప్తినిచ్చే క్యారెక్టర్స్ రాలేదు’’ అని శంకర్ అన్నారు. శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’. రమణా రెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శంకర్ పంచుకున్న విశేషాలు... ► దొంగతనం చేయడానికి భయం ఉండాలి. అవకాశాలు ఇవ్వమని అడగడానికి భయమెందుకు? నా వద్ద కథ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు సినిమా నిర్మించమని త్రివిక్రమ్‌గారు, రవితేజగారు, ‘దిల్’ రాజుగారి దగ్గరికి వెళ్లాను. వాళ్లు ఎవ్వరూ చేయం అని అనలేదు. కానీ, టైమ్ పడుతుంది అన్నారు. పని లేకుండా ఉండటం నా వల్ల కాదు. అందుకే ఈ సినిమా స్టార్ట్ చేశాం. ► ‘శంభో శంకర’ కథను నేను, శ్రీధర్ కలిసి తయారు చేసుకున్నాం. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే (నవ్వుతూ). ఈ సినిమాని అందరం ప్రేమించి పనిచేశాం. శంకర్ హీరో ఏంటి? అని తక్కువగా చూడలేదు. ఒక్క సీన్‌కి కాదు.. ఈజీగా పది సన్నివేశాలకు ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు రమణారెడ్డిగారికి, సురేశ్ కొండేటిగారికి ధన్యవాదాలు. ► మొన్నటి దాకా ఆర్థికంగా అందరికీ సహాయపడుతుండే వాణ్ణి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నా. మా ఆవిడ వార్నింగ్ కూడా ఇచ్చింది (నవ్వుతూ). క్యారెక్టర్ అడుగుదాం అని వెళ్తే అక్కడే ఓ పది మంది ఉంటారు ఇంకేం అడుగుతాం. హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తా. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రం చేశా. -
దూసుకెళుతోన్న శంకర
హాస్య నటుడు ‘షకలక’ శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ‘దిల్’ రాజు వంటి అగ్ర నిర్మాత మా సినిమా టీజర్‌ని ప్రశంసించారంటే ఫలితం ఊహించవచ్చు. మా చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ టాక్ వినిపించడం హ్యాపీ’’ అన్నారు. ‘‘శంకర్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాడన్న ధీమా ఉంది’’ అన్నారు నిర్మాత సురేష్ కొండేటి. -
రెండేళ్లు సినిమా చాన్సులు లేక..
‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘శంభో శంకర’. ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె పిక్చర్స్ సమర్పణలో వై.రమణా రెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘ఆఫీస్‌బాయ్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు శంకర్. ‘గబ్బర్‌సింగ్’ సినిమాకు అద్భుతమైన స్కెచ్‌లు గీశాడు శంకర్. ఈ చిత్రాన్ని 35 రోజుల్లో కంప్లీట్ చేయడం గ్రేట్. ఆ విషయంలో చిత్రబృందాన్ని అభినందిస్తున్నా’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ – ‘అందరూ ఎక్సర్సైజులు చేసి తగ్గాను అనుకుంటున్నారు. రెండేళ్లు సినిమా చాన్సులు లేక తిండిలేక తగ్గిపోయాను (నవ్వుతూ). ఆ సమయంలో ఈ అవకాశం వచ్చింది. నా వంతు ప్రయత్నం చేశాను. ప్రేక్షకుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా. దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’ అన్నారు. ‘శంకర్‌ని దృష్టిలో పెట్టుకునే చేశాను. నా నెక్ట్స్ సినిమా కూడా తనతోనే ఉంటుంది. పాటలు, కెమెరా అన్నీ బాగా కుదిరాయి. టీమ్ సహకారంతో మంచి సినిమా తీయగలిగాం’’ అన్నారు శ్రీధర్. ‘‘సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చుతుంది’ అన్నారు రమణారెడ్డి. ‘కథ నచ్చడంతో నేను కూడా ఇందులో పార్టనర్ అయ్యాను. శంకర్ అద్భుతంగా నటించాడు’ అన్నారు సురేశ్ కొండేటి. -
కన్నీళ్లు పెట్టిస్తాడు
హాస్యనటుడు శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్.ఎన్ దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తయింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలిచిత్రం ‘శంభో శంకర’. నిర్మాతల సహకారం వల్లే సినిమా అనుకున్నట్టుగా తీశా. పాటలు, ఫైట్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు దర్శకుడు శ్రీధర్. ‘‘ఇప్పటి వరకూ కమెyì యన్‌గా అలరించిన శంకర్ ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపిస్తాడు. సెంటిమెంట్ సీన్స్‌లో అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తాడు. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మరో నిర్మాత సురేష్ కొండేటి. ఈ సినిమాకు సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రాజశేఖర్. -
మూడు కోకిలలు.. ఆరు పాటలు
ప్రతిరోజూ పండగలానే... ఉగాది అనగానే నాకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పిండివంటలు. ఇప్పటివరకు నేను ఎనిమిది భాషల్లో మూడు వందలకు పైగా పాటలు పాడాను. బాలీవుడ్లో కూడా చాలా మంచి పాటలు పాడి పేరు సంపాదించాను. ఉగాది అని ప్రత్యేకంగా చెప్పను కాని ప్రతి రోజూ పండగ లాగానే ఉంటుంది. మన తెలుగువారందరూ విళంబి నామ సంవత్సరంలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రోజూ అందరూ చాలా కష్టపడి పని చెయ్యాలి. నా విషయానికొస్తే నాకైతే ఇంకా అన్ని భాషల్లో పాటలు పాడాలి అని ఉంటుంది. అలాగే నేను నటిస్తానని కూడా అందరికీ తెలుసు. ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘ఉగ్రం’ అనే సినిమాలో జేడీ చక్రవర్తి, నేను కలిసి నటిస్తున్నాం. ఈ ఉగాదికి స్పెషల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్‌లో నా కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘దరీమిక్స్’ అనే షో ప్రసారమౌతుంది. నాకు చాలా పేరొస్తుందనే గట్టి నమ్మకముంది. వారానికి ఒక షో రిలీజవుతుంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇందులో సింగింగ్, డాన్సింగ్‌కి చాలా స్కోప్ ఉంది. హిందీలో మంచి ఆల్బమ్స్ చేస్తున్నాను. వచ్చే ఉగాది లోపు నటుడిగా మంచి అవకాశలొస్తాయని ఆశిస్తున్నా. – శ్రీరామచంద్ర బాలీవుడ్లో ఎంటరవుతా 2017 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని సొంతం చేసుకున్నా. ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉగాది ఇది. మాది మధ్యతరగతి కుటుంబం. కంబైన్డ్ ఫ్యామిలీ. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి పచ్చడి మిస్సవుతానేమో అనుకొన్నాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికంటే ముందే నేను ఉగాది పచ్చడి రుచి చూశాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా వెళ్లే ముందే మా అమ్మగారు నాకు ఉగాది పచ్చడి ఇష్టమని ముందే తయారు చేసి రుచి చూపించారు. గతేడాది ఉగాదికి నేను మన రాష్ట్రాంలోని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఈ ఉగాదికి భారతదేశం మొత్తం తెలుసు. ఎప్పుడైతే నా పేరు పక్కన ‘ఇండియన్ ఐడల్’ అని చేరిందో అది నా జీవితాన్ని మార్చేసింది. ఉగాది పండగ స్పెషల్ ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్ని రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. మనం జీరోలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలాగే మనం ఏదైనా సాధించగానే అందరూ మనవాళ్ల లాగే మన దగ్గరికి వస్తారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కష్టం, మన యాటిట్యూడ్ మాత్రమే మనల్ని మనలా నిలబెడతాయి. అవే మనకెప్పుడూ మనతో పాటు తోడుంటాయి. ఈ ఉగాది సందర్భంగా నేను కొన్ని అనుకొంటున్నాను. అవేంటంటే.. నా సింగింగ్‌తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అవుతా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. – రేవంత్ అప్పుడే తీపి విలువ తెలుస్తుంది ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అందరూ బతకటం కోసం తింటే నేను మాత్రం తినడం కోసమే బతుకుతాను. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత కూడా ఉంది కదా. మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేటప్పుడు కనీసం ఫోను కూడా క్యారీ చెయ్యం. ఒక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను కూడా మేం డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురాం. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన మనుషులతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. ఎందుకు ఫుడ్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఉగాది పండగలోని ఆరు రుచులు మన లైఫ్ ఫిలాసఫీని గుర్తు చే స్తాయి. అందులో చేదు రుచిని చూస్తేనే కదా మనకు తర్వాత వచ్చే తీపి విలువ తెలుస్తుంది. 2006 సంవత్సరంలో నేను మొదట ఇండియన్ ఐడల్ గెలిచిన ఉగాదిని ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఉగాది నా కెరీర్‌కే మైల్స్టోన్ లాంటిది. ఆ తర్వాత ఎన్నో బెస్ట్ ఉగాదులు నన్ను పలకరించినా 2017 ఉగాది మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రస్తుతం నాకు సింగింగ్ అనేది వృత్తికాదు, ప్రవృత్తి మాత్రమే. నేను గతేడాది నా సొంత యూట్యూబ్ చానల్ని ప్రారంభించింది ఉగాది రోజునే. అదిప్పుడు పదిలక్షల మంది సభ్యులకు చేరువలో ఉంది. నా చానెల్ కోసం యస్పీ బాలసుబ్రమణ్యం లాంటి వారు వీడియోలు చేయటం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. అలాగే గతేడాది ఉగాది నుండి ఈ ఏడాది ఉగాదికి నేను మూడు పెద్ద పనులు ప్రారంభించాను. అవేంటంటే మొదటిది నాకు నేనుగా నా యూట్యూబ్ చానల్ కోసం సంగీతం తయారు చేసుకోవటం, రెండోది మా పెద్దనాన్న వాళ్లు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. వారు సొంతంగా తయారు చేసుకున్న లలిత సంగీతాన్ని ఇప్పటివరకు మా ఇంట్లో మేం మాత్రమే పాడుకున్నాం. అవి బయట వారికి తెలియవు. ఇప్పుడు వాటిని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజలకు అందజేయటం . ఇక మూడోది కర్ణాటక సంగీత కచేరీలను కూడా మొదలెట్టాను. సినిమాలు కాకుండా ముచ్చటగా ఈ మూడు పనులను ఉగాది నుండి ఉగాది వరకు అన్నట్టు చేసుకున్నాను. ఈ ఉగాదికి ‘సాక్షి’ పాఠకులందరూ ఆరు రుచులతో హాయిగా ఉండాలి. – కారుణ్య -
సంగీతమే ప్రాణం
నెల్లూరు(బృందావనం): చిరుప్రాయం నుంచి సంగీతమే ప్రాణంగా జీవితాన్ని గడుపుతున్న తనకు నెల్లూరులో జరుగుతున్న త్యాగరాజస్మరణోత్సవాల్లో పాల్గొనే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీగాయకుడు ఎన్.సి.కారుణ్య పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం నుంచి ప్రారంభమైన 53వ శ్రీత్యాగరాజస్మరణోత్సవాల కార్యక్రమానికి కారుణ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగీతంలో తమ ఆరాధ్య దైవంగా భావించే ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు నెల్లూరుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంగీతం జీవితానికి సంతృప్తిని ఇస్తుందని, సంగీతమంటే అర్థంకాకుండా చేసే గానం కాదన్నారు. బాల్యం నుంచి శాస్త్రీయ సంగీతం న్యూజెనరేషన్ వాగ్గేయకారులు తన పెద్దనాన్న వాగ్దేయ విద్వాన్మణి నల్లాన్ చక్రవర్తిమూర్తి సహకారంతో సంగీతసాధన చేశానని తెలిపారు. గురుసేవగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టానని పేర్కొన్నారు. శాస్త్రీయసంగీతమే తన పాటలకు బీజమన్నారు. ఇండియన్ ఐడల్ జడ్జి సోనునిగమ్ తన ఇంటికి పిలిపించి పాటలనుస్పష్టంగా పాడేందుకు గల కారణం శాస్త్రీయ సంగీతమే సాధన అని తెలుసుకుని ప్రశంసించారని పేర్కొన్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో అక్టోబరు 6వ తేదీ, డిసెంబరు 25వ తేదీన తొలి కర్ణాటక సంగీత కచేరి నిర్వహించానన్నారు. తొలిసంగీత కచేరి సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఆహ్వానించేందుకు వెళ్లిన తాను ఆయన ఆహ్వానం మేరకు ఆరునెలల తిరుగకమునుపే నెల్లూరు వచ్చి శాస్త్రీయసంగీత కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంంగా ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి సంగీతంపై పట్టు 15 ఏళ్ల నుంచి సంగీతంపై పట్టు ఉందని కారుణ్య తెలిపారు. ఇప్పటికీ ఎన్.సి.కారుణ్య యూ ట్యూబ్ వీడియో ఉందని పేర్కొన్నారు. ఎన్.సి.కారుణ్య అని టైప్‌చేస్తే మంచి సంగీతం వినొచ్చని తెలిపారు. వందే భావగురుమ్ శీర్షికతో సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన లబ్దప్రతిష్టులైన గురువులను స్మరిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నడూ తనచేత కచేరిపెట్టించుకుంటారని అనుకోలేదన్నారు. శాస్త్రీయ సంగీతమంటే తొడగొట్టుకుంటూ పాడడంకాదని, సాహిత్యం, భావం అర్థమయ్యే రీతిలో శాస్త్రీయ సంగీతానికి విశేష ప్రచారం కల్పించాలని ఉందన్నారు. రాగాలు, కొత్త ప్రక్రియలు, థిల్లానా పాడనున్నట్లు పేర్కొన్నారు. -
వినోదాల సోడా
హీరో హీరోయిన్స్‌గా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ గోలీసోడ’. ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్య సింధుజ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వస్తున్న ఫస్ట్ సినిమా. కంప్లీట్ ఎంటర్టైనర్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆడియన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘కుటుంబం మొత్తం కలిసి చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. హీరో, హీరోయిన్ ఎంతో ఇష్టంతో కష్టపడి చేశారు. సినిమా రిలీజ్ కావాలంటే ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కావాలి. ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు హరిబాబు. మానస్ మాట్లాడుతూ – ‘‘టీమ్ సపోర్ట్ ఉంటే సినిమా బాగా వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మంచి సినిమాను ఆడియన్స్ ఆదరించాలని దర్శక–నిర్మాతలు సినిమా తీశారు. అందరూ కష్టపడి చేశారు. సినిమాలో మంచి రోల్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణ భగవాన్. ఈ చిత్రానికి సహనిర్మాత: భువనగిరి శ్రీనివాసమూర్తి. -
కామెడీ సోడా
మానస్, నిత్య నరేష్, కారుణ్య ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ– ‘‘హాస్యం ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది. తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ కమెడియన్స్ అందరూ మా సినిమాలో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అన్ని కమర్షియల్ విలువలతో తెరకెక్కించాం. తప్పకుండా మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, కెమెరా: ముజీర్ మాలిక్. -
నవ్వులే నవ్వులు
మానస్ హీరోగా, నిత్య నరేష్, కారుణ్య హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. ‘మొత్తం గ్యాస్’ అన్నది ట్యాగ్‌లైన్. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలనే ఈ సినిమా తీశాం. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సీనియర్ కమెడియన్స్ అందరూ మా చిత్రంలో ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమా ఉంటుంది. పాలకొల్లు, హైదరాబాద్‌లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. భరత్ మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు మానస్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. అతి త్వరలో విడుదల చేయనున్నాం’’ అన్నారు సత్య సింధూజ. -
సౌందర్యలా చేశావని అంటున్నారు
శ్రీరత్ శ్రీరంగం, కారుణ్య జంటగా అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్పా శ్రీరంగం, సరిత గోపీరెడ్డి నిర్మించిన చిత్రం ‘సీత రాముని కోసం’. ఈ నెల 15న సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా కారుణ్య మాట్లాడుతూ – ‘‘సీత రాముని కోసం’ సినిమా కంటే ముందు నేను కొన్ని సినిమాలు చేశా. అయితే, ప్రేక్షకులకి పెద్దగా రీచ్ కాలేదు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులకి దగ్గరవుతాననే నమ్మకం ఉంది. అందుకే ‘సీత రాముని కోసం’ నా తొలి సినిమాలా భావిస్తా. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. ఈ చిత్రంలో నా పాత్ర పేరు సీత. అనిల్‌గారు ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ. బాపుగారి సినిమాల్లో హీరోయిన్స్ ఎలా ఉంటారో ఇందులో నేనలా కనిపిస్తా. సెట్స్‌లో అందరూ సీత అనే పిలిచేవారు. నా నటన చూసి సౌందర్యలా చేశావని యూనిట్ సభ్యులు అన్నారు. ఆమె గొప్ప నటి. సౌందర్యగారిలో నేను ఒక శాతం నటించినా గొప్పగానే భావిస్తా. ఆమెలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలనుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి’’ అన్నారు. -
మరణం తర్వాత కూడా ప్రేమ కోసం...
శరత్, కారుణ్య జంటగా నటించిన చిత్రం ‘సీత... రాముని కోసం’. తస్మయ్ చిన్మయ ప్రొడక్షన్, రోల్ కెమెరా యాక్షన్ పతాకాలపై ఇబాక్స్ తెలుగు టీవీ సమర్పణలో అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి, డా నంద నిర్మించారు. ఈ చిత్రం టీజర్, మేకింగ్ వీడియోను ఒకేసారి ఇటు హైదరాబాద్‌లోను అటు అమెరికాలోను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మేకింగ్‌ని హీరో తల్లి జ్యోతి రిలీజ్ చేయగా, టీజర్‌ని స్వామి చిదాత్మానంద రిలీజ్ చేశారు. స్వామి చిదాత్మానంద మాట్లాడుతూ – ‘‘టీజర్ చాలా బాగుంది. చిన్నప్పట్నుంచి హీరో కావాలన్నది శరత్ కల. ఈ చిత్రంతో అది నెరవేరింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ– ‘‘వైకుంఠ పాళి’, ‘బిస్కెట్’ చిత్రాల తర్వాత రెండేళ్ల పాటు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. ఫస్ట్ ఐ ఫోన్ లో టెస్ట్ షూట్ చేసిన తర్వాత రెడ్ కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్ చేశాం. డెఫినెట్‌గా ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. శరతకి ఇది ఫస్ట్ సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియస వున్న హీన్లా నటించాడు. ఓ అబ్బాయిని ఒక అమ్మాయి ఎంతలా ప్రేమించింది? తాను చనిపోయాక కూడా ఆ ప్రేమను పొందడానికి ఎలా పరితపించింది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రానికి మ్యూజిక్ నేనే చేశాను. మొత్తం 5 పాటలున్నాయి. సెకండాఫ్ అంతా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వుంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ అద్భుతంగా వుంది. సినిమా దానికంటే రెండింతలు వుంటుంది’’ అన్నారు హీరో శరత్. అద్భుతమైన పాత్ర చేశానని హీరోయిన్ కారుణ్య చెప్పారు. పాటల రచయిత వెంగి, మాటల రచయిత వేణు రాచరల తదితరలు పాల్గొన్నారు. -
ఎవరికీ వ్యతిరేకం కాదు
భాను, శరత్, కారుణ్య, హరిణి, అనుషా, జై ముఖ్య తారలుగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరీష్ కుమార్ గజ్జల నిర్మించిన సినిమా ‘ద్యావుడా’. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రజల్ క్రిష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను షకీలా విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ–‘‘ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్‌తో వస్తున్నా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘ఈ నెల 13న విడుదల సినిమాను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్. -
ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి
‘‘దర్శకుడు తండ్రయితే నిర్మాత తల్లి. నటీనటులు వారి పిల్లలు. సినిమా అన్నది ఒక కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలంటే ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అని నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మానస్ హీరోగా, నిత్యానరేష్, కారుణ్య హీరోయిన్లుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ.. గోలీసోడ’. భరత్ మధుసూదనన్ స్వరకర్త. ఈ సినిమా పాటల సీడీని హరికృష్ణ రిలీజ్ చేసి, నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి. సినిమా మీద మక్కువతో సత్యసింధుజ ఈ చిత్రం నిర్మించారు. మానస్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’అన్నారు. ‘‘నా మొదటి సినిమాలో మానస్ విలన్‌గా నటించాడు. తను మంచి నటుడే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో నవీన్‌చంద్ర. -
కామెడీ సోడా
మానస్, కారుణ్య, మహిమా అలేఖ్య ముఖ్య తారలుగా హరిబాబు మల్లూరి దర్శకత్వంలో ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించనున్న ‘సోడా గోలీసోడా’ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత సత్య సింధూజ క్లాప్ ఇవ్వగా, స్వామిగౌడ్ కెమేరా సిచ్చాన్ చేశారు. నటుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సమాజంలో పరిస్థితులను ఆవిష్కరించే సందేశాత్మక చిత్రమిది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం. పాలకొల్లు, హైదరాబాద్‌లలో టాకీ, అవుట్ డోర్లో సాంగ్స్ షూటింగ్ చేస్తాం’’ అన్నారు హరిబాబు మల్లూరి. ‘‘మంచి చిత్రాలు అందించాలనే సంకల్పంతో నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నం ఈ సినిమా’’ అన్నారు సత్య సింధూజ. నిర్మాత రాజ్ కందుకూరి, మానస్ తల్లి పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
క్యూలో ఏం జరిగింది?
పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే కథతో తీసిన చిత్రం ‘ఏటీఎం వర్కింగ్’. పవన్, కారుణ్య, రాకేశ్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్ ముఖ్య తారలుగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో కిశోరి బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘125 కోట్లమంది భారతీయులపై ప్రభావం చూపిన ఓ నిర్ణయంపై సరదాగా సినిమా చేశాం. ‘ఏటీఎం నాట్ వర్కింగ్’ అని టైటిల్ పెడితే.. సెన్సార్ సభ్యులు ‘నాట్’ అనే పదాన్ని తొలగించారు. ప్రజలకు నిజాలేంటో తెలుసు. రాజకీయ నేపథ్యంలో కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చర్చిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమా తీశాం. ఏటీఎం క్యూలో ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, రాజ.సి, పీఎల్కే రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి. -
మనుషులు.. మనసులు....
సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య తారలుగా శ్రీమతి శైలజ సమర్పణలో శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం నిర్మించిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు అవసరాల శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ‘‘నేటి యువత చిన్న చిన్న విషయాలను అపార్థం చేసుకుంటున్నారు. తద్వారా మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే చిత్ర కథ. ఈ నెల 17న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.