Kolkata airport
-
Dana Cyclone: కోల్ కతా ఎయిర్ పోర్ట్ మూసివేత
-
లక్నో ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వర్షాలు.. వరదనీటిలో రన్‌వే
లక్నో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. దీంతో రాజధాని కోల్కతాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వరదనీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోని రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమనాల టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరదనీటిలోనే విమానాలు పార్క్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్, మరియు బరాక్‌పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. 📍Kolkata | Flight operations at Kolkata Airport are proceeding normally despite heavy rainfall. Both the runway and all taxiways are fully operational. However, a few parking stands are affected by waterlogging for which additional pumps have been deployed. pic.twitter.com/ddrEu4rmVE— NDTV (@ndtv) August 3, 2024 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోందని, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై చురుకైన రుతుపవన ద్రోణిని మోస్తోందనిఎడతెగని వర్షాలకు కారణమైందని పేర్కొన్నారు. -
‘రెమాల్’ తుపాన్ టెన్షన్.. కోల్‌కత్తాకు విమానాలు బంద్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్‌ను రెమాల్ తుపాన్ టెన్షన్ పెడుతోంది. తుపాన్ కారణంగా బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్‌కత్తాకు రెడ్ అలర్ట్ విధించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తుపాన్ కారణంగా కోల్‌కతాలోని విమానాశ్రయం, పోర్టులో రాకపోకలను నిలిపివేశారు.కాగా, రెమాల్ తుపాన్ ప్రభావం బెంగాల్‌ను వణికిస్తోంది. కోల్‌కత్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగాల్ నుంచి విమానాల రాకపోకలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. #WATCH | West Bengal: As per IMD, cyclone 'Remal' is to intensify into a severe cyclonic storm in the next few hours and cross between Bangladesh and adjoining West Bengal coasts around May 26 midnight as a Severe Cyclonic Storm (Visuals from Sundarbans, South 24 Parganas) pic.twitter.com/1yp3xRxUPr— ANI (@ANI) May 26, 2024మరోవైపు, కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టుని కూడా మూసివేస్తున్నట్టు పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. అన్ని కార్గో షిప్, కంటైనర్ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు నిలివేస్తున్నామన్నారు. ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోర్ట్ వద్ద రైల్వే కార్యకలాపాలు సైతం నిలిసివేయనున్నట్టు స్పష్టం చేశారు. #CycloneRemal is here already! Earlier than predicted. Hoping that it doesn't do much damage. For the last five years, South Bengal is being badly hit by annual cyclonic storms. In 2020, Kolkata was rampaged by #Amphaan- more than 48 hours of no cell receptivity, no electricity pic.twitter.com/GQmHXMt7Hj— Srija Naskar (@writer_srija) May 25, 2024ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. పశ్చిమ బెంగాల్, బంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుపాన్ ప్రభావంతో బెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెమాల్ తుపాన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. Next 24 hours are difficult for the eastern coast, esp the state of Bengal. #CycloneRemal will hit the coastal areas of East Medinipur, South Kolkata, Howrah etc. Around 12 coy of NDRF have been deployed. pic.twitter.com/ORnGCtFd63— Pranay Upadhyaya (@JournoPranay) May 26, 2024 -
Indigo: పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు
కోల్‌కతా: బెంగళూరు నుంచి కోల్‌కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్‌పిట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఘటనలు జరిగినపుడు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టేక్ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. గూడ్సు రైలు కలకలం.. డ్రైవర్ లేకుండానే ముందుకు వెళ్లి -
విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్‌కు పగుళ్లు..కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోల్‌కతా: సౌదీ అరేబియాకు చెందిన కార్గో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా.. విండ్ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో పైలట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి చేశాడు. దీంతో విమానాశ్రయంలో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఇటీవలే బెంగళూరు నుంచి అబుదాబి వెళ్తున్న ఎటిహాద్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కాసేపటికే తిరిగి బెంగళూరు విమానాశ్రాయానికి వచ్చింది. ల్యాండింగ్ అనంతరం ఫ్లైట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విమానం తిరగి బయల్దేరి గమ్యస్థానాన్ని చేరుకుంది. ఏప్రిల్ 1న ఢిల్లీ ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన ఫెడ్ఎక్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ సమన్లపై సీఎం కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ -
ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం!
కోల్‌కతా: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన క్రమంలో విమానాన్ని కోల్‌కతాకు మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 159 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. ‘కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికుడు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం 4.50 గంటల నుంచి 6.50 గంటల పాటు సుమారు 159 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ’ అని తెలిపారు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు. ఇదీ చదవండి: ‘2020లో సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి’.. బీజేపీ విమర్శలపై నితీశ్ క్లారిటీ -
వీడియో వైరల్: విమానమెక్కిన పాము.. హడలెత్తిన ప్రయాణికులు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలోని ఎయిర్‌పోర్టులో ఓ పాము జనాలను హడలెత్తించింది. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించిన పాము విమానంలోకి కూడా చొరబడి సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది. రాయ్‌పూర్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ముంబైకు బయల్దేరే ముందు విమానంలో పాము కనిపించింది. సామాన్లు ఉంచే బెల్ట్ చుట్టూ పాము చుట్టుకొని ఉంది. అయితే అదృష్టవశాత్తు అప్పటికీ ఇంకా ఎక్కువమంది ప్రయాణికులు విమానం ఎక్కలేదు. పామును గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అటవీశాఖ అధికారులను పిలిచింది పామును పట్టుకొని తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టులో పాముకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేశాడు. ‘బహుశా ఇటీవల ఇండిగో 15యానివర్సరీ కావడంతో పాము విమానం ఎక్కాలని కోరుకుందేమో.. కానీ చివరికి కోల్‌కతా అటవీశాఖ దాన్ని తీసుకెళ్లింది. ఒకసారి పాము ఎంత వేగంగా వెళుతుందో చూడండి’ అని ట్వీట్ చేశారు. అయితే రాయ్‌పూర్ నుంచి వచ్చిన తర్వాత విమానంలో బ్యాగేజీని ఆఫ్‌లోడ్ చేస్తున్నప్పుడు పాము విమానంలోకి ప్రవేశించిందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ముంబై వెళ్లే విమానంలో ప్రయాణించాల్సిన ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించినట్లు అధికారులు తెలిపారు -
ఆ నగరాల నుంచి కోల్‌కతాకు విమానాల్లేవ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాల ద్వారా ఒక నగరం నుంచి మరో నగరానికి వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు తేలడంతో ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు విమానాల రాకపోకలను నిలిపివేస్తూ అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్, అహ్మదాబాద్ నుంచి కోల్‌కతాకు ప్యాసింజర్ ఫ్లైట్లు ఉండబోవని కోల్‌కతా ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
కోల్‌కతాకు ఆరు ప్రాంతాల నుంచి విమానాలు బ్యాన్
కోల్‌కతా : కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తరణ ఎక్కువగా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణే, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ ప్రాంతాల నుంచి కోల్‌కతాకు విమానాల సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జూలై 6 నుంచి 19 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతకముందు కరోనా వైరస్ హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల సర్వీసులను నిలిపివేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు. -
ఉంపన్: నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు
కోల్‌కతా : ‘ఉంపన్’ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఉంపాన్ తీవ్ర రూపం దాల్చడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభంవించింది. రవాణా వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. ఉంపాన్ దాటికి పశ్చిమబెంగాల్, ఓడిశా రాష్ట్రాల్లో యుద్ద పరిస్థితులు నెలకొన్నాయి. ఉంపన్ తుపాను పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసిన తరువాత ప్రస్తుతం కోల్‌కతా విమానాశ్రయాన్ని తాకింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కతా ఎయిర్పోర్ట్ నీట మునిగింది. ఎయిర్‌పోర్టు నీటితో నిండిపోవడంతో విమానాశ్రయం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. నీటితో నిండిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు దృశ్యాలు చూస్తుంటే పెను తుపాన్ ఉంపన్ ఎంత వినాశనం కలిగించిందో తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
జలదిగ్బంధంలో కోల్‌కతా ఎయిర్పోర్ట్
-
అవమాన ప్రయాణం
కోల్‌కతా ఎయిర్పోర్ట్. వీల్ చైర్ కావాలని ఎయిర్‌లైన్ సిబ్బందిని కోరారు జీజా ఘోష్. ఎంతసేపటికీ రాలేదు. అదేమని విచారిస్తే ‘‘ఈరోజు స్టాఫ్ తక్కువగా ఉన్నారు’’ అని సమాధానం వచ్చింది సిబ్బంది నుంచి. ఎట్టకేలకు దీర్ఘ నిరీక్షణ తర్వాత వీల్ చైర్ వచ్చింది. తీరా చెకిన్ కౌంటర్‌కు వెళ్లాక ‘‘ఎవరూ తోడు లేకుండా మీరొక్కరే ప్రయాణం చేయడానికి వీల్లేదు’’ అని చెప్పారు ‘గో ఎయిర్’ చెకిన్ కౌంటర్లో. ఆశ్చర్యపోయారు జీజా.. ‘‘ఒంటరి ప్రయాణం నాకు కొత్తకాదు.. ప్రపంచమంతా ఒక్కదాన్నే చుట్టొస్తుంటా’’ అని. ఆ విషయాన్నే సిబ్బందితో చెప్పారు కూడా. అయినా ససేమిరా అన్నారు వాళ్లు. దాంతో తనతోపాటు న్యూఢిల్లీకి ప్రయాణం చేసే మిగతా సహచరులు వచ్చేవరకు ఆమెకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఆ సహచరుల్లోనే ఒకరైన కుహూ దాస్‌కూ ఇలాంటి అవమానమే ఎదురైంది! ఆమెకు పోలియో. దాంతో క్యాలిపర్స్ పెట్టుకొని వచ్చారు. సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) తనిఖీ కోసం ప్యాంట్స్ తీసేయమన్నారట. షాక్ అయ్యారు కుహూ దాస్.. ఇన్నేళ్లుగా ఫ్లైట్లలో ప్రయాణం చేస్తున్న తనకు ఏ రోజూ ఇలాంటి అవమానం ఎదురు కాలేదు. ‘‘వాళ్లు ఆ మాట అనగానే ఒక్క క్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయా. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏ ఆఫీసర్ ఇలా అడగలేదు. ఇంత ఇన్సల్ట్ చేయలేదు’’ అన్నారు కుహూ. కుహూనే కాదు జీజా ఘోష్ కూడా వికలాంగురాలే. 2019 ఎలక్షన్ కమిషన్ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ కూడా అయిన జీజాకు సెరిబ్రల్ పాల్సి. ఈ ఇద్దరూ.. న్యూఢిల్లీలో జరగబోయే వికలాంగ మహిళల హక్కుల సమావేశానికి హాజరయ్యేందుకు మొన్న ఆదివారం కోల్‌కతా నుంచి బయలుదేరారు. ఆ సమయంలో వాళ్లకు జరిగిన అవమానం ఇది. ఈ సంఘటనలతో వాళ్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ వివక్ష మీద అక్కడే నిరసననూ తెలిపారు. దాంతో ఆ చెకిన్ కౌంటర్లోని వ్యక్తి ‘సారీ’ చెప్పింది ఈ ఇద్దరికి. ‘‘ఆ అమ్మాయి మీద మాకేం కోపం లేదు. ఇది ఆ అమ్మాయి ఒక్కరి తప్పు కాదు.. మాలాంటి వాళ్లను ఎయిర్‌లైన్ ఎలా ట్రీట్ చేస్తుందో.. ఎంత చులకనగా చూస్తుందో అనడానికి ఇదొక ఎగ్జాంపుల్’’ అన్నారు జీజా, కుహూ. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది జీజా ఘోష్, కుహూ దాస్‌లను క్షమాపణ కోరుతూ.. జరిగిన తప్పిదాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే పూచీని సంబంధిత ఎయిర్‌లెన్స్ అధికారులకు అప్పగించామని కోల్‌కతా ఎయిర్ పోర్ట్ సిబ్బంది ట్వీట్ చేశారు. ►మన దేశంలో దాదాపు ఎనిమిదికోట్ల మంది వికలాంగులున్నారు. రకరకాల వైకల్యాలతో బాధపడుతున్న వాళ్లకు కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాల సంగతేమో కాని పనిగట్టుకొని ఇలా అవమానించకుండా ఉంటే చాలు. -
ప్రధాని భార్యను పలకరించిన మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని మోదీ భార్య జశోదాబెన్‌తో మాట్లాడారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకునేందుకు బయలుదేరిన సీఎం మమత కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్‌కతా నుంచి ధన్‌బాద్ వెళ్లేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ‘విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు సీఎం మమత చీర బహూకరించారు’అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, మమత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. -
విమానం డోర్లో చిక్కుకుని వ్యక్తి మృతి
కోల్‌కతా : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన టెక్నిషియన్ ప్రమాదవశాత్తు ల్యాండింగ్ గేర్‌లో ఇరుక్కొని మృతి చెందారు. కోల్‌కతా ఏయిర్ పోర్ట్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బంబార్డియర్ క్యూ400 విమానంలో రోహిత్ పాండే అనే టెక్నిషియన్ మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ల్యాండింగ్ గేర్ డోర్ మూసుకుపోయింది. దీంతో పాండే అందులో చిక్కుకొని ప్రాణాలు వదిలారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో టెక్నిషియన్ మృతదేహాన్ని వెలికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అసజహ మరణం కింద కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా ఏయిర్పోర్ట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఫోరెన్సిక్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. శిక్షణా ప్రమాణాల్లో నాణ్యత లోపించినట్లు డీజీసీఏ గత వారమే ఈ సంస్థకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమానార్హం. -
ఫొని షాక్ : కోల్‌కతా విమానాశ్రయం మూసివేత
కోల్‌కతా : ఫొని తుపాన్ పలు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపుతోంది. ఒడిషా తీరాన్ని తాకిన ఫొని తుపాన్ ప్రచండ వేగంతో కదులుతుండగా కొల్కతా విమానాశ్రయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం వరకూ మూసివేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు డీజీసీఏ పేర్కొంది. ఫొని తుపాన్ పురోగతిని పరిశీలించి కోల్‌కతా విమానాశ్రయంలో విమాన రాకపోకల నిలిపివేత సమయాన్ని సవరించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు విమానాల రద్దుపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో కోల్‌కతా విమానాశ్రయంలో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. -
శిథిలావస్థలో ‘డకోటా’
భువనేశ్వర్: రాష్ట్ర చరిత్రలో బిజూ పట్నాయక్ ధీరునిగా స్థానం సాధించారు. ధీరత్వ కార్యశైలిలో అడుగడుగునా అనుక్షణం డకోటా విమానం తోడుగా ఉండడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదో స్మారక చిహ్నంగా వెలుగొందాల్సిన అద్భుత నమూనా. మౌలిక ఆదరణకు దూరమై కోల్కత్తా విమానాశ్రయంలో మరుగున పడి ఉంది. ఈ అపురూప డకోటా విమానాన్ని అపురూపంగా పదిలపరచుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీని వైపు దృష్టి సారించకపోవడం విచారకరం. భారత విమానాశ్రయాల విభాగం రాష్ట్రానికి మేల్కొలిపింది. దివంగత ముఖ్యమంత్రి ధీరత్వానికి ప్రతీకగా ప్రతిబింబించాల్సిన డకోటా విమానం ఆదరణపట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభ్యర్థించింది. ఈ అభ్యర్థనతో రాష్ట్ర ప్రభుత్వం చైతన్యవంతమైంది. రాష్ట్రానికి తక్షణమే తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అనుబంధ విభాగాలు, వర్గాలతో సంప్రదింపులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో బిజూ పట్నాయక్ డకోటా విమానం రాష్ట్రానికి తరలివస్తుంది. ఆశ్రయం ఎక్కడ? అపురూపమైన డకోటా విమానం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ప్రతీకగా రాష్ట్రానికి తరలివస్తుంది. రాష్ట్ర ప్రజలతో పాటు పర్యాటకులు, సందర్శకులు తిలకించేందుకు అనుకూలమైన ప్రాంతంలో దీనిని ప్రదర్శించడం అనివార్యంగా భావిస్తున్నారు. అటువంటి అనుకూల ప్రాంతంపట్ల తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో దీనిని పదిల పరిచే యోచనతో బిజూ జనతా దళ్ వర్గాలు యోచిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జన్మ స్థలం, సొంత భవనం కటక్ నగరంలో ఆనంద భవన్ మ్యూజియంగా వెలుగొందుతోంది. ఈ ప్రాంగణంలో డకోటా విమానాన్ని ప్రదర్శించాలనే యోచన పార్టీ శ్రేణుల్లో బలంగా కనిపిస్తోంది. అయితే అందుకు అవసరమైనంత స్థలం ఈ ప్రాంగణంలో అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. అంతర్జాతీయ పర్యాటకుల కోసం ప్రియతమ నాయకుని అద్భుత విహంగ విన్యాసాల్ని ప్రతిబింబించే డకోటా విమానం స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఉండాలనే ఆకాంక్ష పలువురి హృదయాల్లో ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ విమాన యాన పర్యాటకుల దృష్టిని ఆకట్టుకుంటుందని ఈ వర్గం అభిప్రాయం. నిర్వహణ శైలి కూడా ఉన్నతంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బిజూ పట్నాయక్‌కు చేదోడు వాదోడుగా ఉపయోగపడిన డకోటా విమానం భద్రపరిచేందుకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికార వర్గాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోల్కత్తా విమానాశ్రయంలో మరుగున పడిన బిజూ పట్నాయక్ డకోటా విమానంపట్ల శ్రద్ధ వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్రో తెలిపారు. ఈ లేఖపట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రవాణా చేసేందుకు అనుబంధ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు త్వరలోనే ప్రభుత్వ అధికారి కోల్కత్తా సందర్శించి డకోటా తరలింపు వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం బదులు లేఖ రాసినట్లు వివరించారు. పరిశోధకుల మాట పెడ చెవిన రాష్ట్ర కీర్తి చిహ్నంగా నిలవాల్సిన బిజూ పట్నాయక్ మిత్రుని లాంటి డకోటా విమానం మరుగున పడి ఉండడంపట్ల పరిశోధకుల వర్గం హృదయాల్ని కలిచి వేస్తోంది. బిజూ పట్నాయక్ చారిత్రాత్మక విజయాలకు ఈ విమానం సారథిగా నిలిచింది. అటువంటి అపురూప విమానం నేడు పొరుగు రాష్ట్రం విమానాశ్రయంలో శిథిలమవుతోంది. తక్షణమే సంరక్షించి రాష్ట్రంలో సురక్షిత ప్రాంతంలో పదిల పరచాలి. ప్రధానంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో దీనికి స్థానం కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు యుద్ధ పరిశోధకుడు అనిల్ ధీర్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ 5 ఏళ్ల నుంచి నిరవధికంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయన అభ్యర్థనలపట్ల ముఖ్యమంత్రి పెడచెవి ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఘనం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జీవిత చరిత్రలో డకోటా విమానం పాత్ర ఎంతో ఘనం. చరిత్రకారులు దీని పాత్రను అనన్యంగా పేర్కొంటున్నారు. శత్రు వర్గాలతో తలపడిన, వైరి వర్గాల స్థావరాల నుంచి స్వాతంత్ర సమర యోధుల్ని మాతృ భూమికి తరలించాల్సిన అపురూప సందర్భాల్లో డకోటా విమానమే బిజూ పట్నాయక్ వ్యూహాత్మక కార్యశైలికి సారథిగా నిలిచింది. ఇండోనేషియా స్వాతంత్ర సమరం, శ్రీనగర్ ఎదురు కాల్పులు, భారత సేనకు ఆహార సరఫరా వగైరా క్లిష్ట పరిస్థితుల్లో డకోటా సహాయంతో బిజూ పట్నాయక్ సాహస కృత్యాల్ని విజయవంతంగా నిర్వహించి జాతికి వన్నె తెచ్చిన చరిత్రని ఆవిష్కరించారు. ఈ ఘన చరిత్రకు డకోటా విమానమే వారధిగా చరిత్రకారులు పేర్కొంటారు. బిజూ బాబు సాహసానికి ఇదే ప్రేరణగా పేర్కొంటారు. బిజూ పట్నాయక్ వీర గాథ గుర్తు వస్తే డకోటా విమానం పాత్ర విస్మరించడం ఎవరి తరం కాదు. ఇది బిజూ పట్నాయక్ కళింగ ఎయిర్ లైన్స్‌లో ఒకటి. పాకిస్థాన్ శత్రువలయాన్ని ఛేదించి శ్రీనగర్‌లో బందీలుగా ఉన్న భారత సైన్యాన్ని విమానం గుండా దేశానికి తరలించిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డకోటా విమానం బిజూ పట్నాయక్‌కు సహకరించింది. సేనకు అవసరమైన ఔషధాలు, గుర్రాలు వగైరా రవాణా, ఇండోనేషియా ప్రధాన మంత్రిని డచ్ కబ్జా నుంచి విముక్తి కలిగించి ఆ దేశానికి అప్పగించడంలో డకోటా సేవలు అనన్యం. కోల్కత్తా నేతాజీ విమానాశ్రయం డంపింగ్ యార్డులో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ధైర్య సాహసాలు ఆయన సొత్తు ధైర్య సాహసాలతో సంక్లిష్ట పరిస్థితుల్ని అవలీలగా ఎదురీదిన ధీరునిగా దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మిగిలారు. బిజూ జీవితం పలు సాహస కృత్యాలకు ప్రతీకగా ప్రతిబింబిస్తుంది. పైలెట్‌గా ఆకాశ వీధుల్లో ఆయన సాధించిన ఘన విజయాలు అత్యద్భుతం. ఆయన సాహస కృత్యాలకు ప్రతీకగా ఇండోనేషియా భూమి పుత్రునిగా స్వీకరించింది. నేటికి ఆయన కుటుంబీకుల ఆత్మీయ, అనురాగాల్ని పంచుకుంటోంది. -
కోల్‌కతా విమానాశ్రయంలో కొకైన్ స్వాధీనం
కోల్‌కతా: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ విదేశీయుడిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.కోటి విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ 170 గ్రాములు ఉంటుందని, కెవిన్ ఎడ్వర్డ్ అనే ఇతను ఇక్కడి నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం ముంబై నుంచి వచ్చిన విమానంలో ఇక్కడికి వచ్చాడని కోల్‌కతా జోనల్ డైరెక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఇక్కడ వివరించారు. నిందితుడు ఢిల్లీలోని ఐజీఐ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మన దేశంలోకి వచ్చాడని, అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. ముంబైలో ఉంటున్న మరో నైజీరియన్ జాన్ అలియాస్ టోనీ ఇతనికి ఈ పని అప్పగించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
విమానం టేకాఫ్.. దట్టమైన పొగలు
సాక్షి, కోల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానం నుంచి పొగలు రావడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆ వివరాలిలా.. కోల్‌కతాలోని ఎయిర్పోర్ట్ నుంచి రాయల్ భూటాన్ ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్‌కు బయలుదేరింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో రన్‌వేపైనే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి క్షేమంగా కిందకి దించేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎయిర్‌లైన్స్ వద్దకు చేరుకుని మంటలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనిపై ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అటల్ దీక్షిత్ మాట్లాడుతూ.. విమానంలో మొత్తం 80 మంది ఉన్నారు. టేకాఫ్ అవుతుంటే దట్టమైన పొగలు రావడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించాడు. గాయాలైన కొందరికి చికిత్స అందించాం. ఇతర విమానాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని' వివరించారు. -
సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం!
కోల్‌కతాలో విమానాశ్రయంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ఫీ పేరిట దురుసుగా వ్యవహరించిన అతని తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తాజా చిత్రం ’బేగం జాన్’ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న విద్యా బాలన్ కోల్‌కతా విమానాశ్రయంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి తనతో సెల్ఫీ దిగాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకుంది కూడా. అయితే, సరిగ్గా మొబైల్‌ఫోన్‌తో సెల్ఫీ క్లిక్ చేసే సమయంలో ఆమె చుట్టూ చేయి వేసి వికృతబుద్ధి బయటపెట్టుకున్నాడు. చుట్టూ చేయి వేయడంతో కంగుతిన్న ఆమె అతని తీరును తీవ్రంగా వారించింది. అయినా అతను ఫొటోలు తీస్తూ ఉండటంతో సహనం కోల్పోయిన ఆమె ఆ వ్యక్తిపై తీవ్రంగా మండిపడింది. ’అసలు ఏం చేస్తున్నావు. సక్రమంగా ప్రవర్తించడం తెలియదా?’ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఈ ఘటన గురించి విద్యాబాలన్ స్పందిస్తూ..’ఓ అగంతకుడు మీ చుట్టూ చేతులు వేస్తే.. పురుషులైనా, మహిళలైనా అసౌకర్యంగా భావిస్తారు. అది వ్యక్తిగత పరిధిలోకి చొరబడటమే అవుతుంది. మేం పబ్లిక్ ఫిగర్లమే కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు’ అని పేర్కొంది. -
తాగేసి మహిళ బ్యాగ్‌పై మూత్రం పోశాడు!
ఒడిషా నుంచి వచ్చిన ఓ వ్యాపారి తప్పతాగి.. కోల్‌కతా విమానాశ్రయంలో ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రం పోయడంతో అతడిని పోలీసులు అరెస్టుచేశారు. ప్రభాకర్ దొర అనే ఈ వ్యాపారి కోల్‌కతా నుంచి చెన్నై వెళ్లేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అతడు మోతాదుకు మించి తాగేయడంతో.. అతడిని విమానం నుంచి దింపేశారు. అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి, తర్వాత మరో విమానం వచ్చేవరకు ఆగాలని చెప్పారు. అప్పటిలోగా అతడి పరిస్థితి అదుపులోకి వస్తుందని ఇండిగో సిబ్బంది భావించారు. రాత్రి 11 గంటలకు చెన్నై వెళ్లడానికి చిట్ట చివరి విమానం ఉంది. దాంతో మిగిలిన ప్రయాణికులతో పాటు దొర కూడా బోర్డింగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అతడి మత్తు అప్పటికి ఇంకా దిగలేదు. దాంతో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రవిసర్జన చేశాడు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ ఎయిర్‌పోర్టు మేనేజర్ గదిలోకి వెళ్లి, ఫిర్యాదుచేశారు. దాంతో దొరను పోలీసులకు అప్పగించారు. రాత్రంతా జైల్లోనే ఉన్న ప్రభాకర్ దొరను తెల్లవారిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌పై విడుదలయ్యాడు. -
ఆ సీనియర్ లీడర్ ను వీఐపీలా చూడలేదు
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్కిన ఎయిరిండియా విమానం 14 గంటలు ఆలస్యంగా బయలుదేరినా.. ఎయిరిండియా అధికారులు ఆయనను కనీసం పట్టించుకోలేదు. ఆయనను వీఐపీలా పరిగణించి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీనిపై ఏచూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా తనకు కనీసం ఆతిథ్య మర్యాదలు ఇవ్వలేదని, విమానాల్లో ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో ఇప్పటికీ ఆ సంస్థ తెలుసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిరిండియా 701 విమానంలో ఆదివారం రాత్రి ఏచూరి ఎక్కారు. అయితే ఈ విమానం 14 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరింది. ఎయిరిండియా విమానం జాప్యంతో తనకు ఎదురైన అనుభవాన్ని ఏచూరి వివరిస్తూ.. 'నేను మళ్లీ పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ డిన్నర్ చేయాల్సి వచ్చింది. మా పార్టీ కారు వచ్చేవరకు నేను ఎయిర్ పోర్టులోనే వేచి చూసాను. మరో అంతర్జాతీయ విమానంలో నాలుగు సీట్లు ఉన్నాయి. కానీ, పాకిస్థాన్ ప్రయాణికులు కనెక్టింగ్ విమానం ద్వారా అంతర్జాతీయ ఫ్లయిట్ ను అందుకోవాల్సి ఉండటంతో వారికోసం స్వచ్ఛదంగా ఆ సీట్లను వదులుకున్నాను. ఎట్టకేలకు సోమవారం ఉదయం టికెట్ బుక్కయింది. ఇది జరిగింది' అని ఏచూరి వివరించారు. గతంలోనూ వీఐపీల పట్ల ఎయిరిండియా ఇలాగే వ్యవహరించిందని, తనను, పాకిస్థాన్ హైకమిషనర్ ను, ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పాక్ ఆతిథులను ఇలాగే అవమానించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సాంకేతికలోపంతోనే ఈ విమాన ప్రయాణంలో జాప్యం తలెత్తిందని ఎయిరిండియా చెప్తోంది. -
కోల్‌కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. 24 గంటల్లోగా విమానాశ్రయాన్ని పేల్చివేస్తామంటూ ఈ రోజు ఉదయం ఎయిర్పోర్ట్ మేనేజర్‌కు ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్ జర్మనీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో విమనాశ్రయాధికారులు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో నిఘాను పెంచి తనిఖీలను ముమ్మరం చేశారు. -
విమానానికి తప్పిన పెద్ద ప్రమాదం
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానానికి మంగళవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి 211 మందితో బయలుదేరిన విమానం కోల్ కతా విమానాశ్రయంలో దిగగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన తర్వాత విమానం టైరు ఊడిపోయినట్టు గుర్తించిన రన్ వే సిబ్బంది వెంటనే ఏసీటీకీ సమాచారం అందించారు. రన్ వేపై లభ్యమైన టైరు శకలాలు స్పైస్ జెట్ విమానానికి చెందినవేనని నిర్ధారించుకున్న తర్వాత పైలట్ కు ఏసీటీ సమాచారం అందించింది. దీంతో విమానం భద్రతపై ఆందోళన మొదలైంది. ముందు జాగ్రత్తగా విమానాన్ని కోల్ కతా ఎయిర్ పోర్టులో దించేశారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా కిందకు దించడంతో ఉత్కంఠకు తెరపడింది. ల్యాండ్ అయిన వెంటనే విమానంలోని వారందరినీ కిందకు దించేశారు. విమానంలోని వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. టైరు ఊడిపోయిందా, పేలిందా అన్నది విచారణలో తేలనుంది. దీనిపై పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అధిపతి ఎం సాధి విచారణకు ఆదేశించారు. -
ఓ కునికిపాటుకు.. రూ. కోట్లు నష్టం
కోల్‌కతా: డ్రైవర్ నిద్రమత్తులో చేసిన తప్పిదం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాన్ని నిద్రమత్తులో ఢీకొట్టినట్టు జెట్ ఎయిర్ వేస్ బస్ డ్రైవర్ మొమిన్ అలీ విచారణలో చెప్పాడు. మొమిన్‌ను ప్రశ్నించి, వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏకే శర్మ తెలిపారు. మొమిన్ సోమవారం నైట్ డ్యూటీలో ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. జెట్ ఎయిర్వేస్ బస్సు ఢీకొన్న విమానం విలువ 400 కోట్ల రూపాయలని, విమానం చాలా వరకు దెబ్బతిన్నట్టు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో కానీ, బస్సులో కానీ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసోం వెళ్లాల్సిన ఈ విమానాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పార్క్ చేశారు. ఈ ప్రమాదం అనంతరం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సిన రెండు విమానాలను రద్దు చేసినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ప్రమాద ఘటనపై పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. -
అత్యవసరంగా దిగిన సింగపూర్ విమానం
కోల్ కతా: సింగపూర్ ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దిగింది. 15 మందితో వెళుతున్న ఈ విమానం ఇంధన లీకేజీ కారణంగా కిందకు దిగినట్టు అధికారులు వెల్లడించారు. కఠ్మాండు నుంచి సింగపూర్ వెళుతున్న ఈ విమానంలో 6 నిమిషాలకు మాత్రమే సరిపడా ఇంధనం ఉండడంతో అత్యవసరంగా కిందకు దించారు. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ఇంధన లీకేజీ గుర్తించిన పైలట్ కిందకు దిగేందుకు కోల్ కతా ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అనుమతి కోరాడని వెల్లడించారు. లోపాన్ని సరిచేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు విమానం మళ్లీ పైకి ఎగిరింది.