Kotla Surya Prakash Reddy
-
కాళ్లు పట్టించుకున్న పచ్చ ఎమ్మెల్యే..
-
డోన్ ఎమ్మెల్యే దుశ్చర్య.. యువకుల్ని చితకబాదిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయనేది అనే సంఘటనలు రుజువు చేశాయి. చేస్తూనే ఉన్నాయి. తాజాగా, కర్నూలులో ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరు యువకుల్ని కర్రలతో చితకబాదిన వీడియో వైరల్‌గా మారింది.పంచాయితీ పేరుతో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు. తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని దూషిస్తూ కర్రతో కొట్టారు.వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయితీ పెట్టి వారిని కొట్టారు ఎమ్మెల్యే. వాల్మిక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల్ని ఇంత దారుణంగా అవమానించడం పట్ల కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు,న్యాయ వ్యవస్థ ఉండగా ఇలా ఎమ్మెల్యేనే తీర్పు చెప్పి దండించడం ఏంటని కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. -
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
టీడీపీలో అంతే.. సీనియర్ నేతకు సీటు కష్టాలు!
ఆయన కర్నూల్ జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయనేమో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను పాతాళంలో పాతేయడంతో చేసేది లేక పచ్చ పార్టీలో చేరారు. టీడీపీలో ఆయన సీనియారిటీకి గౌరవం ఇవ్వడంలేదట. అసలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కూడా ఆ సీనియర్ నాయకుడు నానాపాట్లు పడుతున్నారని టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడిగా, కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాశరెడ్డికి పరిచయం అక్కర్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో సూర్యప్రకాశరెడ్డి అనివార్యంగా తెలుగుదేశంలో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో చంద్రబాబు కోట్లకు ఎన్నో హామీలిచ్చారు. కోట్ల వంటి సీనియర్లు పార్టీకి అవసరం అని చెప్పారు. అప్పుడు కోట్ల అడిగిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేశారు. కానీ ఇప్పుడేమో కోట్ల కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే ఇస్తామని..అది కూడా అన్నీ అనుకూలిస్తేనే అని మెలిక పెడుతున్నారు. అయితే, కోట్ల సూర్యప్రకాశరెడ్డి మాత్రం తనకు ఎమ్మిగనూరు సీటు ఇవ్వాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ప్రస్తుతం బి.వి జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి తన వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది తెలుసుకున్న జయనాగేశ్వరరెడ్డి టీడీపీ అధిష్టానానికి కోట్లపై ఫిర్యాదు చేసారు. అప్పటికి ఏదో సర్దుబాటు అయ్యింది కాని కోట్ల మాత్రం ఎమ్మిగనూరు సీటు కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఓడిపోయాక నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తల్ని పట్టించుకోకపోవడంతో మొత్తంగా తెలుగుదేశం పార్టీయే ఆయనకు దూరంగా జరిగింది. ఈ పరిస్థితుల్నే ఆసరాగా తీసుకుని కోట్ల సూర్యప్రకాశరెడ్డి అక్కడ కుంపటి పెట్టారు. కోట్ల ఎంట్రీ ఇచ్చాక జయనాగేశ్వరరెడ్డి నా సీటు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ కేడర్‌కు ఇబ్బందిగా మారింది. నారా లోకేష్ పాదయాత్రలోనూ రెండు వర్గాలు ఆధిపత్య ధోరణి కొనసాగించాయి. ఎన్నికలకు ఏడాది ముందే ఇలా ఉంటే.. టిక్కెట్లు ప్రకటించేనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చంద్రబాబు కోరిన టిక్కట్ ఇస్తారో లేదో తెలియదు.. అసలు టిక్కెట్ ఇస్తారో ఇవ్వరో కూడా అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా చదవండి: TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే? -
ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? అందుకు ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? అనే దిశగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కనీసం కొన్ని స్థానాలైనా గెలిచి ఉనికి కాపాడుకోవాలని, అందుకు తగ్గట్లు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని ఇటీవల పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే.. ఇందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో టిక్కెట్ల కేటాయింపుపై మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితో చంద్రబాబు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలలో వైఎస్సార్, కర్నూలు మొదటిస్థానంలో ఉన్నాయి. జిల్లాలో 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కేవలం నాలుగు మాత్రమే. గత ఎన్నికల్లో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఆ పార్టీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే తప్పవని తేలినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులపై చర్చించి నియోజకవర్గాలకు బాధ్యులను నియమించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యేగా పోటీచేసే యోచనలో కోట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తిరుగులేని నేత. తమకు పార్టీ బలం కాదని, పార్టీకి తామే బలమనే యోచనలో ఆయన ఉండేవారు. 2014లో కాంగ్రెస్, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల ప్రస్తుతం ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు దఫాలుగా ఓటమి ఎదురవడంతో స్వతహాగా తనకు గెలిచే శక్తి లేదని, పార్టీ బలం కీలకమనే వాస్తవంలోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2024లో కూడా కర్నూలు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఉంటుందని గ్రహించారు. అత్యధిక అసెంబ్లీ సీట్లు ఆపార్టీ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చారు. పైగా టీడీపీ 40ఏళ్ల చరిత్రలో 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999లో కేఈ కృష్ణమూర్తి మినహా కర్నూలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో ఎంపీగా పోటీచేస్తే ఓటమి తప్పదని, అదే జరిగితే రాజకీయంగా ఇక శుభం కార్డు పడినట్లే అని కోట్ల ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీకి పోటీచేస్తే కనీసం నియోజకవర్గంపై శ్రద్ధపెట్టి గెలిచేందుకు ప్రయతి్నంచొచ్చని ఎమ్మిగనూరు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ కోటాలో సుజాతమ్మ ఔట్ కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామనే నిర్ణయాన్ని టీడీపీ అమలు చేస్తే కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే ఆలూరు టిక్కెట్ రేసులో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్ కూడా ఉన్నారు. వీరితో పాటు వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలు బోయ, కురబ. ఈ క్రమంలో బోయ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తే వీరిని కాదని చివరి నిమిషంలో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కర్నూలు టిక్కెట్ మైనార్టీలకే ఇచ్చే యోచన కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా టీజీ భరత్ ఉన్నారు. రాజకీయంగా చురుగ్గా లేకపోవడం, టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో ఉంటూ రాజకీయంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. పైగా వైఎస్సార్సీపీ కర్నూలులో అత్యంత బలంగా ఉంది. ఈ క్రమంలో టీజీ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని, తాము కూడా మైనార్టీ నేతను బరిలోకి దింపితే కనీసం గట్టిపోటీ అయినా ఇవ్వగలమనే యోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్‌ను కర్నూలు బరిలో నిలిపేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోట్ల చొరవతోనే అహమ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఐదునెలల కిందట కర్నూలు అసెంబ్లీ సీటుపై చంద్రబాబుతో జరిగిన సమీక్షలో భరత్ ఈ విషయాన్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నుంచి భరోసా రాలేదు. దీంతో భరత్ నిరాశగా వెనుదిరిగారు. టీజీ వెంకటేశ్ కూడా టీడీపీలో చేరితే అప్పుడు కర్నూలు ఎంపీ లేదా రాజ్యసభ ఇచ్చి, అసెంబ్లీ నుంచి పక్కనపెట్టే యోచనకు టీడీపీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు టీడీపీ వర్గాన్ని కలుపునేలా పావులు ఎమ్మిగనూరులో గత డిసెంబర్లో టీడీపీ కార్యాలయాన్ని కోట్ల ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేశారు. జయనాగేశ్వరరెడ్డి వ్యతిరేక వర్గీయులైన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగమునితో పాటు పలువురిని ఆహ్వానించారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని కోట్ల ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లద్దగిరిలోని ఆయన నివాసానికి వచ్చేవారిలో అత్యధిక శాతం ఎమ్మిగనూరు నేతలు, కార్యకర్తలే ఉంటున్నారు. జయనాగేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కోట్లనే బరిలోకి దిగుతారని ఎమ్మిగనూరులోని కీలక టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు
సాక్షి, కర్నూలు: ఎన్నికల్లో వరుస పరాజయాలను మూట కట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బలమైన వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కుదేలైన టీడీపీ లో తాజాగా ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధంతో ముసలం మొదలైంది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు రగిలింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు.. రెండేళ్ల క్రితం టీడీపీ వేదికగా కలిసి పని చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనంతో ఘోర ఓటమి ఎదురైంది. తాజాగా రాజకీయ ఉనికిలో భాగంగా ఎవరికి వారు ఆధిపత్యపోరుతో సొంత పార్టీలోనే కుంపటి రగిల్చారు. ఈ పంచాయితీ ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇరువర్గాలకు ఆయన చేసిన సూచనలతో ఇటు కోట్లతో పాటు కేఈ వర్గం కూడా డీలా పడింది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా కోట్ల సుజాతమ్మ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల అనంతరం కూడా పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఇటీవల కేఈ ప్రభాకర్ ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం మారెమ్మ గుడిలో మొక్కు ఉందనే కారణంతో భారీగా టీడీపీ శ్రేణులకు విందు ఇచ్చారు. ఈ విందు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల పరిచయ వేదికగా ప్రభాకర్ మలుచుకున్నారు. ఆపై దేవనకొండ మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆలూరుకు పదే పదే వస్తున్నారు. ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నిస్తే ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా!’ అని బదులిచ్చారు. దీంతో ఆలూరు టిక్కెట్ ఆశావహుల జాబితాలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలోని కీలక నేతలను పిలిపించుకుని మాట్లాడటం, వచ్చే ఎన్నికల్లో తాను ఆలూరు బరిలో ఉంటానని, అందరూ సహకరించాలని కోరుతున్నారు. కోట్ల కుటుంబానికి ఒక సీటే? కేఈ ప్రభాకర్ వ్యాఖ్యల నేపథ్యంలో సుజాతమ్మ చంద్రబాబును కలిశారు. జిల్లా రాజకీయ పరిస్థితులు వివరిస్తూ ఆలూరు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ తరఫున ఆయన జోక్యాన్ని అరికట్టేలా ఆదేశించాలని కోరినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు బదులిస్తూ ‘ఆలూరు కంటే మీకు డోన్ బాగుంటుందని, డోన్ బాధ్యత మీకు అప్పగిస్తా’నని చెప్పినట్లు సమాచారం. 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచావని, నియోజకవర్గంలో పరిచయాలు కూడా ఉన్నందున డోన్ బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. అయితే ఎంపీగా తన భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి, ఆలూరు అయితే పార్లమెంట్‌కు కూడా కలిసొస్తుందని చెప్పినా.. చంద్రబాబు ఆమె మాటను పెడచెవిన పెట్టి డోన్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆయన మాటల వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోట్ల కుటుంబానికి డోన్ ఇస్తే సూర్యప్రకాశ్‌రెడ్డి, సుజాతమ్మలో ఎవరు నిలబడినా పార్టీకి అభ్యంతరం లేదని, ఆ కుటుంబానికే ఒక సీటు మాత్రమే అనేది తేటతెల్లమవుతోంది. కేఈ ప్రతాప్‌కు టిక్కెట్టు లేనట్టే.. డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019లో కేఈ ప్రతాప్ పోటీ చేశారు. 2014 ఎన్నికలకు ముందు వ్యాపారవేత్తగా ఉన్న ప్రతాప్ ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఏర్పడి డోన్ టిక్కెట్ ఆశించారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సోదరుడే కావడంతో ఆయన ప్రమేయంతో డోన్ టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే రెండుసార్లు వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2024లో కోట్ల కుటుంబానికి డోన్ టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉండటంతో ప్రతాప్‌కు టిక్కెట్టు దక్కనట్లేనని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం.. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాం నుంచి కోట్ల కుటుంబం కాంగ్రెస్‌లో, కేఈ కుటుంబం టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఈ క్రమంలో సూర్యప్రకాశ్‌రెడ్డి రాజకీయ ప్రత్యామ్నాయం లేక విధిలేని పరిస్థితిలో టీడీపీలో చేరారు. దీంతో కేఈ, కోట్ల కుటుంబాలు ఒకేపార్టీ వేదికగా పనిచేయాల్సి వచ్చింది. అయితే రెండేళ్లలోనే తిరిగి రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇప్పటికే జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఘోర ఓటమితో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. దీనికి తోడు అన్ని మునిసిపాలిటీలు, అన్ని మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయ ప్రయాణం సాగిస్తోన్న తెలుగు తమ్ముళ్లకు కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆశించిన టిక్కెట్లు దక్కనపుడు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీలో ఉంటూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, అవి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత 20 ఏళ్లలో టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఫలితాలు సాధించలేదని, కర్నూలు జిల్లాలో అత్యంత బలహీనంగా టీడీపీ ఉందని, ఎవరు ఏ స్థానం ఆశించినా, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
టీడీపీలో నాయకత్వ లేమి.. జిల్లాలో పూర్తి డీలా
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ పరిస్థితి చూస్తే నాయకత్వ లేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు 20 ఏళ్లుగా జిల్లాలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నేళ్లు ‘సైకిల్’పై ప్రయాణం చేసినా రాజకీయ లక్ష్యాన్ని చేరుకోలేమని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ∙ సాక్షి, కర్నూలు : రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. వైఎస్సార్ జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా వైఎస్సార్ జిల్లా తర్వాత కర్నూలే! గత 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచింది 2009 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా నాలుగు స్థానాలే. తక్కిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. ఈ ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది. ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు నేతల తప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది. విశ్వాసం కోల్పోయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి జిల్లాలో రాజకీయంగా గౌరవం ఉండేది. అయితే.. ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాన్ని కోట్ల వర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మను కూడా ఘోరంగా ఓడించారు. వారు కనీసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే గౌరవం ఉండేది. కానీ కొన్నేళ్లుగా వైరం నడిపిన కేఈ కుటుంబం ప్రయాణిస్తున్న ‘సైకిల్’లోనే వీరు ఎక్కడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆయన వర్గంగా ఉన్న వారు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు కోట్ల కుటుంబం రాజకీయంగా చెల్లని కాసైపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బలహీనపడిన ‘భూమా’, కేఈ వర్గాలు జిల్లా టీడీపీలో కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి బలమైన నేతలుగా ఉండేవారు. భూమా మృతితో కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్యంగా భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి... అఖిల ప్రియతో విభేదించి తనవర్గాన్ని దూరంగా ఉంచారు. భూమా సోదరుడి కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి బంధువైన శివరామిరెడ్డి కూడా అఖిలతో విభేదించారు. క్రషర్ విషయంలో అఖిల భర్తకు, శివరామిరెడ్డికి తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులే ఆమెకు దూరం కావడం, రాజకీయంగా పరిణతి లేకపోవడంతో పాటు కుటుంబం కూడా టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్సార్సీపీ, ఆపై తిరిగి టీడీపీలో చేరడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. మండల, గ్రామస్థాయి నేతలు కూడా వారికి దూరమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో టీడీపీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యాంబాబు పార్టీని వీడితే కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే. ఆదోనిలో మీనాక్షినాయుడుకు వయసైపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే! ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత కుటుంబం టీడీపీలో చేరడాన్ని సొంత వర్గీయులే జీర్ణించుకోలేకపోయారు. గతంలో టీడీపీ వైఖరితోనే గౌరు కుటుంబం దెబ్బతింది. అదే పార్టీలో చేరడంతో కేడర్‌కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత, వెంకటరెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ముగుస్తుందని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. టీజీ ద్వారా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో టీజీ వెంకటేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ తీర్థం పుచ్చుకునే టీజీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. తన కుమారుడిని మాత్రం టీడీపీలోనే కొనసాగిస్తున్నారు. వ్యాపార రంగంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకే టీజీ బీజేపీలో చేరారనేది బహిరంగ సత్యం. తండ్రీ కొడుకుల ‘డబుల్‌గేమ్’తో బీజేపీ, టీడీపీ ఇద్దరినీ విశ్వసించడం లేదు. ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ముందు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గస్థాయి నేతలు గత 20 ఏళ్ల ఫలితాలను బేరీజు వేసుకుని..మరో 20 ఏళ్లు టీడీపీతో ప్రయాణం చేసినా ఎమ్మెల్యేలం కాలేమని నిర్ధారణకు వస్తున్నారు. అందుకే ‘సైకిల్’ ప్రయాణాన్ని వీడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. -
ప్రచారంలో మైకు కోసం టీడీపీ నేతలు వాగ్వాదం
ఆస్పరి: అధికారపార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. మండలంలోని ములుగుందంలో కోట్ల వర్గం, టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వీరభద్రగౌడ్ వర్గీయుల మధ్య చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వీరభద్రగౌడ్‌ను కాదని ఇటీవల పార్టీలో చేరిన కోట్లసుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన వర్గీయులు లోలోపల అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేయాలని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో కోట్ల సుజాతమ్మ.. వీరభద్రగౌడ్‌తో కలిసి ఆదివారం మండలంలోని ములుగుందంలో ఎన్నికల ప్రచారానికొచ్చారు. ప్రచార రథంపై నుంచి స్థానిక గ్రామ నాయకులు మాట్లాడుతుండగా కోట్ల వర్గీయుడైన మనోహర్‌రెడ్డి మొదట మైకు తీసుకున్నాడు. పక్కనే ఉన్న వీరభద్రగౌడ్ వర్గీయుడు మాజీ సర్పంచ్ మల్లికార్జున రెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మనోహర్‌రెడ్డి వద్ద ఉన్న మైకును లాక్కున్నాడు. దీంతో ఇద్దరి నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సత్తా ఉంటే గ్రామంలో ఎక్కువ ఓట్లు వేయించాలని మనోహర్‌రెడ్డి సవాల్ విసరగా.. నీలాగా మేము పార్టీలు మారేవాళ్లం కాదని మల్లికార్జునరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇలా గ్రామస్తుల ఎదుటే ఇద్దరు నాయకులు మధ్య మాటామాటా పెరగడంతో వీరభద్రగౌడ్ కలగజేసుకుని సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
‘పెద్దాయన ఆత్మ క్షోభిస్తుంది’
సాక్షి, కర్నూలు : మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిపై ఆయన సోదరుడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడిందని, అలాంటిది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వెళ్లటం వల్ల పెద్దాయన( కోట్ల విజయభాస్కర్ రెడ్డి) ఆత్మ క్షోభిస్తుందన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలోకి చేరడాన్ని కార్యకర్తలు జీర్ణంచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఆలూరు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మార్చి 2వ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ సభలో మరోసారి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీలో చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
చంద్రబాబు సభ; చెప్పు విసిరిన దుండగుడు
-
చంద్రబాబు సభ; చెప్పు విసిరిన దుండగుడు
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరారు. వీరిని చంద్రబాబు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. డోన్ అసెంబ్లీ సీటును సుజాతమ్మకు కేటాయించాలంటూ ఈ సందర్భంగా కోట్ల వర్గీయులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం రేగడంతో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఒక చెప్పు వేదిక ముందు పడింది. ఆ సమయంలో వేదికపై సూర్యప్రకాశ్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సెక్యురిటీ వెంటనే స్పందించి వేదిక ముందు పడిన చెప్పును అక్కడి నుంచి తొలగించారు. (కోట్ల కుటుంబం రహస్య మంతనాలు) చంద్రబాబు ఎంత ప్రయత్నించినప్పటికీ కోట్ల, కేఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదరలేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. డోన్ సీటును సుజాతమ్మకు కేటాయిస్తే కేఈ ప్రతాప్‌కు ఆశాభంగం తప్పదు. ఈ నేపథ్యంలో నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీ చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోడుమూరు టీడీపీ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరుకాకపోవడం అనుమానాలు రేకిస్తోంది. (సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా) -
‘రాజీనామా చేయాల్సిరావడం బాధాకరం’
కర్నూలు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని చాలా ప్రయత్నించామని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఆ ప్రాజెక్టులు ఇస్తేనే టీడీపీలో చేరతామని చెప్పినట్లు వెల్లడించారు. కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు తప్పుడు జీవోలు ఇవ్వాల్సిన ఖర్మ పట్టలేదని వెనకేసుకొచ్చారు. తిరిగి అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని జోస్యం చెప్పారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. -
‘కోట్ల.. రెండు సీట్ల భిక్ష కోసం టీడీపీలోకి వెళ్తావా?’
సాక్షి, కర్నూలు : దశాబ్దాలుగా కేఈ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాల మధ్య ఎందరో నలిగిపోయారు. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పి కోట్ల.. ఓట్లు అడుగుతారని వైఎస్సార్సీపీ నాయకుడు బీవీ రామయ్య ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వేసే ఒకటి రెండు సీట్ల భిక్ష కోసం కోట్ల.. జిల్లా రైతాంగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడం విచారకరమన్నారు. నిజంగానే కోట్ల కుటుంబానికి రైతుల మీద ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా పెండింగ్ ప్రాజెక్ట్‌లపై ఎందుకు పొరాటం చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన స్వార్థం కోసం రైతుల పేరు అడ్డుపెట్టుకోవడం కోట్ల దిగజరారుడుతనానికి నిదర్శనమని రామయ్య మండిపడ్డారు. 2014, ఆగస్టు 15న చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు జీవనాడి అయిన గుండ్రేవుల, వేదవతి పనులు చేయకపోగా.. హంద్రీనీవా నుంచి చెరువులకు చుక్క నీరు కూడా ఇవ్వలేదంటూ మండి పడ్డారు. కర్నూల్ స్మార్ట్ సిటీ, ఆలూరు జింకల పార్క్, ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్, నియోజకవర్గాల్లో గోడౌన్ల నిర్మాణం వంటి పనులు ఏం జరగలేదని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 60 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. నీతివంతులం అని చెప్పుకుంటున్న నాయకులు వాటిపై నోరు కూడా విప్పలేదని ధ్వజమెత్తారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు చేసిందేమిటో బహిరంగా చర్చకు రావాలని కోట్లను డిమాండ్ చేశారు. చేరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై కోట్ల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే నీతి, నిజాయతీ, విలువలు అంటూ ఊదరగొట్టే కోట్ల కుటుంబం నేడు వాటి విలువలను నడిబజార్లో విప్పేశారని మండి పడ్డారు. -
‘ప్రాణాలు అర్పించైనా రాహుల్‌ను ప్రధాని చేస్తాం’
సాక్షి, కర్నూలు : ప్రాణాలు అర్పించైనా తమ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ప్రియాంక గాంధీలను త్వరలోనే కర్నూలుకు తీసుకువస్తామన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌ను వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీల నాయకుల్ని లాక్కోవడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఆయన తన దూకుడును పెంచినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీలోకి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి
కోడుమూరు: అందరం జగనన్నకే జై కొడదామని, వైఎస్సార్సీపీలో చేరదామని కోట్ల వర్గీయులు ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునేందుకు శనివారం కోడుమూరు పట్టణంలోని స్నేహవినాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ మండలాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జై జగన్..జై హర్ష నినాదాలతో కల్యాణ మండపం మార్మోగింది. ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీడీపీ దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ఎదుర్కొవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే సరైనదని స్పష్టం చేశారు. నా రాజకీయ శత్రువు టీడీపీనే రాజకీయంగా శాశ్వత శత్రువుగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకొని అనైతిక రాజకీయాలు చేసేందుకు ఆత్మాభిమానం అడ్డురావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. జవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించలేనని తెలుసుకొని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, కోట్ల అభిమానులను కాపాడుకోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన అనంతరం ఫిబ్రవరి 6వతేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుదామన్నారు. తన సోదరుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయాలు చేద్దామన్న విషయాలు తన మనసును నొప్పించాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందువల్లే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, ప్యాలకుర్తి హర్షవర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచు సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు ఈశ్వరరెడ్డి, రామేశ్వరరెడ్డి గంగాధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నక్క పరమేష్, మల్లారెడ్డి, తేనేశ్వరరెడ్డి, మాదులు, బోరెల్లి సోమన్న, టెలిఫోన్ రాముడు, పుట్టపాశం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌ను విమర్శించే అర్హత కోట్లకు లేదు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి లేదని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో కోట్ల కుటుంబానికి విలువలు ఉన్నాయని, టీడీపీ ఇచ్చే ఒకటి, రెండు సీట్ల కోసం వాటిని దిగజార్చుకోవద్దని సూచించారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తులో ఎంపీ అవుతానని సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కంటున్నారని, పొత్తులో పోటీ చేస్తే ఆయన చిత్తవడం ఖాయమన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంతో కొన్ని ఓట్లయినా పడ్డాయని, విలువలు లేకుండా రాజకీయాలు చేస్తే 2019లో ఆ ఓట్లు కూడా పడబోవని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ పార్టీని 2014లోనే ప్రజలు తిరస్కరించారని, మళ్లీ ఆ పార్టీని ఆదరించే ప్రసక్తే లేదన్నారు. ఆనాడు రామారావుకు.. ఈనాడు టీడీపీకి వెన్నుపోటు... సీఎం చంద్రబాబునాయుడు రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన దివంగతులయ్యేలా చేశారని బీవై రామయ్య గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన టీడీపీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాళ్ల దగ్గర పెట్టి తెలుగువారి ఆత్మభిమానాన్ని చంపేశారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఏమాత్రం విలువలు లేవని, కేవలం అధికారమే పరమాధిగా సాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో 13 సీట్లకే టీడీపీని పరిమితం చేసి రాహుల్‌గాంధీతో సీఎం చంద్రబాబునాయుడు వేదికను పంచుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఆ రెండు పార్టీల పొత్తును ప్రజలు అంగీకరించడంలేదని, ఓటమి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మనోహర ఆచారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీతో పొత్తు ఉండబోదని ప్రకటించగలవా? టీడీపీ–కాంగ్రెస్ పొత్తు ఉండే ప్రసక్తే లేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి చెబుతూ వచ్చారని రామయ్య గుర్తు చేశారు. కేఈ కృష్ణమూర్తి.. ఏకంగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని ప్రకటించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని, ఒకే వేదికను పంచుకుంటున్నా.. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా.. వీరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయని టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు, మంత్రి యనమల రామకృష్ణుడు, రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చిన అశోక్‌గెహ్లాట్ ప్రకటించినా..వీరికి వినిపించలేదా అన్ని ప్రశ్నించారు. కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి దమ్ము ఉంటే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉండబోదని ప్రకటించాలని సవాల్ విసిరారు. అవినీతి సామ్రాట్‌ను సీఎం చేయాలనుకుంటున్నావా? టీడీపీ అధినేత అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని గతంలో విమర్శించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి.. టీడీపీతో పొత్తు అనగానే చంద్రబాబు నీతిమంతుడు అయ్యారా అని బీవై రామయ్య ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షాన్ని విమర్శిస్తారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ఆరోపణలు చేయడం కాంగ్రెస్, జనసేనతోపాటు కొన్ని పార్టీలకు అలవాటైందన్నారు. వీరందరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం ధ్యాస లేదన్నారు. తమ పార్టీ అధినేత ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏడాదిగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి రోజూ వేలాది మంది ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తులో ఎంపీ కావాలనుకుంటున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని, ఆ రెండు పార్టీలను ప్రజలు ఛీ కొడతారన్నారు. -
పార్టీని నమ్ముకుంటే గౌరవం ఇదేనా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులు ఆ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారా? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో స్థానం కల్పించకపోవడంపై మండిపడుతున్నారా? పార్టీని నమ్ముకుని కృషి చేస్తున్నా.. గుర్తింపు ఇవ్వకపోవడంతో అధిష్టానం వ్యవహారశైలిని తప్పుపడుతున్నారా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అవమానాలకు గురిచేస్తోందని ఆయన అనుచరులు వాపోతున్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపు సందర్భంగానూ ఆయన్ను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. తాజాగా పార్టీలో కేంద్ర బిందువైన సీడబ్ల్యూసీలో కూడా స్థానం కల్పించకపోవడం తమ నేతను అవమానించడమేనని అంటున్నారు. ఆదర్శవంతమైన కుటుంబమని, రెండుసార్లు సీఎంగా చేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని గుర్తించడం లేదని కోడుమూరు మండలానికి చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోట్లను ఢిల్లీకి ఆ పార్టీ అధిష్టానం పిలిపించినట్టు తెలుస్తోంది. ఎన్ని ఆఫర్లు వచ్చినా... వాస్తవానికి కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలు పార్టీ మారినప్పటికీ కోట్ల మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అధికార పార్టీ ఆహ్వానించడంతో పాటు భారీ ఆఫర్లను కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఏకంగా సీఎం చంద్రబాబు స్థాయిలో కోట్లను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు కోరినట్టుగా సీట్లు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను కోట్ల సున్నితంగా తిరస్కరించారు. ఏకంగా కోట్ల బంధువు ద్వారా హైదరాబాద్‌లో కలిసి మరీ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా కోట్ల కుటుంబంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సూర్యప్రకాష్‌రెడ్డి కుమారుడు రాఘవేంద్ర వివాహం సందర్భంగా ఆయన కుటుంబంతో చర్చలు జరిపి.. డోన్, ఆలూరుతో పాటు ఎంపీ స్థానం ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని కోట్లకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆయన టీడీపీలో చేరేదిలేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. కాగా.. కోట్లకు తగినంత గుర్తింపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఆయన వర్గీయుల్లో బలంగా ఉంది. రాజ్యసభ సీటు కేటాయిస్తారని ఆశించారు. అది జరగకపోగా.. తాజాగా సీడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి నుంచి అదే తీరే! నిజానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నప్పటికీ సరైన న్యాయం చేయడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే నెలకొని ఉంది. అనంతపురం జిల్లాకు రాహుల్‌గాంధీ వచ్చిన సందర్భంగానూ కోట్ల కినుక వహించారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో తనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను మాత్రమే అనుమతించి.. ముఖ్య అనుచరులను రానివ్వకపోవడంపై కినుక వహించారు. ఆ కార్యక్రమాన్ని కాస్తా బహిష్కరించి వెనువెంటనే జిల్లాకు తిరిగొచ్చారు. ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయానికి (కళా వెంకట్రావు భవన్) తాళం వేశారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోట్ల చల్లబడలేదు. ఏకంగా ఏఐసీసీ నుంచి దిగ్విజయ్‌సింగ్ వచ్చి మరీ కోట్లకు క్షమాపణలు చెప్పారు. దీంతో వివాదం కాస్తా సద్దుమణిగింది. తాజాగా సీడబ్ల్యూసీ ప్రకంపనలు ఎటువైపు దారి తీస్తాయోనన్నది వేచిచూడాలి. -
'పచ్చ నేతలు రూ.300కోట్లు దోచేశారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం ఫైరయ్యారు. పోలవరంపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. రెయిన్ గన్ ల వ్యవహారంలో టీడీపీ నేతలు రూ.300 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. మాట మీద నిలబడని బాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. -
చంద్రబాబు రాయలసీమ ద్రోహి
సీమ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి త్వరలో ఉద్యమం కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబు రా యలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమై, సీమ ద్రోహిగా మి గిలిపోయారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. త్వరలో నే రాయలసీమ సాగునీటి హక్కును కాపాడుకోవడానికి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన శ నివారం మడకశిర మండలం నీలకంఠాపురంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జ రుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రైతుల ప్రయోజనాల ను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాంలో నీటిమట్టాన్ని 854 అడుగుల వ రకు కాపాడితేనే సీమ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ అక్రమం గా వాడుకుని నీటి మట్టం ఇంతకన్నా తగ్గిపోతే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్ర కాశం జిల్లాల రైతులు కూడా నష్టపోతార న్నారు. త్వరలో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమానికి రూలకల్పన చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ రెండేళ్ల పాలనలో టీడీపీ నాయకులు దోచుకోవడానికే పరిమిత మయ్యారని ఆరోపించారు. సమావేశంలో అనంతపురం, కర్నూలు డీసీసీ అధ్యక్షులు కోటాసత్యం, లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్
* మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం * చివరి సర్వే కోసం లక్నో నుంచి వచ్చిన నిపుణుల బృందం * బృందంతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అలంపూర్ రూరల్: తెలంగాణ, ఏపీ సరిహద్దు అలంపూర్‌లో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. దీని నిర్మాణానికి ఏపీ, తెలంగాణ ప్రాంతంలో 123 ఎకరాల భూములను గుర్తించారు. ఈ మేరకు గురువారం ఈ పనులకు సంబంధించి లక్నో నుంచి సీఏవో దినేష్‌కుమార్, సీఎంఈ సునీల్‌కుమార్, సీఈ సహాయకులు ఏకే సింగ్, కోచ్ ఫ్యాక్టరీ ఇన్చార్జ్, డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఏకే శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్కే సింగ్, సీనియర్ ఇంజనీర్ ఆఫ్ మెకానికల్ శర్మ అలంపూర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. రైల్వే లైన్ స్థలంలో ఓ పారిశ్రామికవేత్త రోడ్డు వేసుకున్నారని.. ఆ రోడ్డును తొలగిస్తామని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక చొరవ... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెండింగ్‌లో ఉండడంతో ఆదిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కేంద్రంతో సంప్రదింపు లు జరిపిన అనంతరం ఈ పనులకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో అలంపూర్ వచ్చిన అధికారులతో ఎంపీ రేణుక కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడి, ప్లాన్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని 123 ఎకరాల భూములు గుర్తించినట్లు చెప్పారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లా దగ్గర గల పంచలింగాలలో 100 ఎకరాలు, తెలంగాణ అలంపూర్ రైల్వేస్టేషన్ వరకు మరో 23 ఎకరాలను గుర్తించినట్టు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. ఈ విషయమై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ విషయాలను కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని.. మాట్లాడుతున్నారని ఎంపీకి వారు వివరించారు. తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. మరో పది రోజుల్లో అంతా ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ పనులు ఇక వేగవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్
మహబూబ్‌నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఎట్టకేలకు లైన్క్లియిర్ అయింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన భూమిని రైల్వే శాఖ ఉన్నతాధికారులు దినేష్‌కుమార్, సునీల్‌కుమార్ తదితరులు గురువారం అలంపూర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. గతంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం 123 ఏకరాల స్థలాన్ని గుర్తించారు. ఎంపీ బుట్టా రేణుక చొరవ.. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ తదితర అంశాలు పెండింగ్‌లో ఉండడంతో మొదటిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కర్నూల్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుకా కేంద్రప్రభుత్వంలో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన సమాచారాన్ని ఎంపీ బుట్టా రేణుకా తెలుసుకున్నారు. అనంతరం ఆమె కూడా అలంపూర్ చేరుకుని... కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత మాస్టర్ ప్లానింగ్‌ను పరిశీలించారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుక విలేకరులతో మాట్లాడుతూ... కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని సుమారు 123 ఎకరాల భూములను గుర్తించినట్టు తెలిపారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లాలో పంచలింగాలలో 100 ఎకరాలను గుర్తించామని... అలాగే తెలంగాణలో అలంపూర్ రైల్వేస్టేషన్ వద్ద మరో 23 ఎకరాలను గుర్తించినట్టు వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు బుట్టా రేణుక పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. అయితే కొంతమంది రైతులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆ అంశాన్ని కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని..మాట్లాడుతున్నారని ఎంపీకి ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ బుట్టారేణుక తెలిపారు. ప్రస్తుతం మరో పది రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని బుట్టారేణుక ఆశాభావం వ్యక్తం చేశారు. -
సారీ సూర్యా..ఓకే దిగ్గీ
ఒక్క సారీతో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కోపం తగ్గిపోయిందట. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభావేదికపైకి వెళ్లనీయకుండా సూర్యప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తననే అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలిగి అక్కడి నుంచి నేరుగా కర్నూలుకు వెళ్లిపోయారు ఆయన. పార్టీకి చెందిన ముఖ్యనేతలు పొరపాటు జరిగిందని బుజ్జగిస్తున్నా పట్టించుకోకుండా వారిపై తిట్ల పురాణం పఠిస్తూ ఆయన వర్గీయులతో సహా వెళ్లి కర్నూలు కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేశారు. అసలే కాంగ్రెస్ పార్టీ బతకలేని పరిస్థితుల్లో సూర్యప్రకాశ్‌రెడ్డి లాంటి నాయకుడు పార్టీని వీడితే కష్టమని అధిష్టానం భావించింది. విజయవాడలో శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్(దిగ్గీ రాజా) నేతల సమక్షంలోనే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి క్షమాపణ కోరారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో సూర్యప్రకాశ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలపై కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. దిగ్విజయ్ సింగ్ ఆయనకు సారీ చెప్పడంతో ఇక అసంతప్తి, కోపతాపాలన్నీ కూడా సర్దుకున్నట్లేనని పార్టీలో చర్చించుకుంటున్నారు. -
ఈ పనికిరాని మీటింగులెందుకు?
రైల్వే బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఎంపీల ఆగ్రహం ♦ ఈ భేటీలతో టైం వేస్ట్ తప్ప.. ఫలితమేముంది? ♦ మా ప్రతిపాదనలను పట్టించుకునే నాథుడే లేడు ♦ మేం గతంలో చేసిన సూచనలను ఎందుకు పక్కన పడేశారు ♦ జీఎం చెప్పేది వినడం తప్ప చేసేదేమీ లేదు ♦ మళ్లీ భేటీ ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రి లేదా బోర్డు చైర్మన్ రావాలి సాక్షి, హైదరాబాద్: ‘‘రెండు దశాబ్దాల కిందట మంజూరైన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలు కాలేదంటే రైల్వేశాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. బడ్జెట్లో నిధులిచ్చినా పనులు మొదలు కాలేదంటే నా జీవితంలో దాన్ని చూస్తానన్న నమ్మకం పోయింది. దీనిపై పార్లమెంటులో సభాహక్కుల తీర్మానం పెడతా.. అక్కడ నిరాహారదీక్షకు కూర్చుంటా..’’ - నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ‘‘ఎలాంటి ఫలితం లేని ఈ సమావేశాలతో మా విలువైన సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మళ్లీ భేటీ ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రి లేదా రైల్వే బోర్డు చైర్మన్ రావాల్సిందే..’’ - మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ...రైల్వే బడ్జెట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీల ఆగ్రహావేశాలివీ! బుధవారం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని ఎంపీలతో జీఎం రైల్‌నిలయంలో భేటీ నిర్వహించారు. ఎంపీలు నగేశ్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, జితేందర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, రాపోలు ఆనంద భాస్కర్, దేవేందర్‌గౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే పనితీరుపై ఎంపీలు నిప్పులు చెరిగారు. ప్రజలేం కోరుకుంటున్నారో గుర్తించి రైల్వే శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచితే వాటిని పట్టించుకునే నాథుడే లేడంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. డిమాండ్లను రైల్వే బోర్డుకు చేరవే సి చేతులు దులుపుకునే ఇలాంటి సమావేశాలతో.. సమయం వృథా తప్ప మరో ఉపయోగమే లేదంటూ మండిపడ్డారు. ఈసారి వాళ్లొస్తేనే మీటింగ్.. గత బడ్జెట్ ముందు ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో తాము చేసిన సూచనలను పట్టించుకోకపోవటాన్ని ఎంపీలు ఈ సందర్భంగా లేవనెత్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలు వినడం తప్ప జీఎం చేసేదేమీ లేనప్పుడు ఈ సమావేశాలెందుకని ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రైల్వే మంత్రి లేదా రైల్వే బోర్డు చైర్మన్ పాల్గొంటే తప్ప వచ్చేసారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయొద్ద న్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ అధికారులు తమను పట్టించుకోవటం లేదని బాల్క సుమన్ మండిపడ్డారు. నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారిని నియమించి తమతో కలిసి పనుల పురోగతిని పరిశీలించే ఏర్పాటు చేస్తేనే ఉపయోగం ఉంటుందని సుమన్‌తోపాటు జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వాకౌట్ చేసిన గుత్తా రైల్వే శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. నల్లగొండ-మాచెర్ల మధ్య 20 ఏళ్ల కిందట కొత్త లైన్ మంజూరైందని, దాన్ని 2011 బడ్జెట్లో ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారని చెప్పారు. గత బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారని కానీ ఇప్పటివరకు పనులే ప్రారంభించలేదన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉండగా.. పనులు మొదలుపెట్టాలని కోరినా పట్టించుకోలేదన్నా రు. ఇదే విషయమై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామని, అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన జీవితకాలంలో ఆ ప్రాజెక్టును చూస్తానన్న నమ్మకం కూడా లేదం టూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జగ్గయ్యపేట-మేళ్లచెరువు లైన్ విషయంలో భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్, తాను రైతులతో మాట్లాడుతున్నా రైల్వే అధికారులెవరూ రావటం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్-ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రారంభించండి పెద్దపల్లి-నిజామాబాద్ కొత్త మార్గంలో చిన్న బిట్ మాత్రమే పెండింగులో ఉందని, ఆ పనులు వేగంగా పూర్తిచేసి తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవమైన జూన్ 2న కరీంనగర్-ముంబై మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించాలని ఎంపీవినోద్ కోరారు. ‘ఈ ప్రాంతం నుంచి ముంబై వెళ్లేవారి సంఖ్య తీవ్రంగా ఉన్నందున నిత్యం 100 బస్సులు తిరుగుతున్నాయి. అంత డిమాండ్ ఉన్న మార్గం అయినందున దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. అయితే ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉన్నందున డిసెంబర్ వరకు అది సాధ్యం కాదని జీఎం తెలిపారు. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ పనులు ఆర్‌వీఎన్‌ఎల్‌కు కేటాయించొద్దని, నేరుగా రైల్వే శాఖనే నిర్వహించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. చర్లపల్లి, నాగులపల్లి, హైటెక్‌సిటీ రైల్వే స్టేష న్ల వద్ద ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నం దున 3 చోట్ల భారీ టెర్మినళ్లు నిర్మించి ప్రస్తుత స్టేషన్లపై భారం తగ్గించాలని వినోద్ సూచిం చారు. బోగస్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో కొందరు రైల్వే ఉద్యోగాలు పొందారని, వారిని గుర్తించి విధుల్లోంచి తొలగించి కేసులు నమోదు చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రైల్వేలోని గ్రూప్-డి పోస్టుల్లో తెలంగాణ వారిని కాదని యూపీ, బిహార్, రాజస్థాన్ వారిని స్థాని కంగా నియమించటాన్ని తప్పు పట్టారు. సమ్మక్క జాతర నేపథ్యంలో విజయవాడ-బల్లార్షా మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. మరోవైపు కాజీపేటకు మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను రైల్వే అటకెక్కించినట్లు ఈ సమావేశం ద్వారా తేలిపోయింది. అక్కడ వ్యాగన్ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు జీఎం గుప్తా ఎంపీల దృష్టికి తెచ్చారు. -
దిశానిర్దేశం లేని రైల్వే బడ్జెట్ ఇది..
-
దిశానిర్దేశం లేని బడ్జెట్: మాజీ మంత్రి కోట్ల
హైదరాబాద్: తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శించారు. యూపీఏ హయాంలో ఇచ్చిన హామీలు, ప్రతిపాదనలే కేంద్రమంత్రి సురేష్ ప్రభు మరోసారి చదివి వినిపించారని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నిధులు సమకూర్చుకోవటం, కొత్త ప్రాజెక్టులు రూపొందించటం ప్రతి బడ్జెట్లోనూ ఉంటాయని కోట్ల అన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మామూలు అంశాలు కూడా లోపించాయని విమర్శించారు. ఈ బడ్జెట్ ప్రజలను పూర్తిగా నిరాశ పరచిందని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. -
అక్రమాలు మీకే చెల్లు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): అక్రమాలకు పాల్పడటం కేఈ సోదరులకే చెల్లు అని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక కళావెంకట్రావ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నాడని ఇటీవల టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈనెల 26న కేడీసీసీ బ్యాంకు సమావేశంలో మాజీ మంత్రి కె.ఈ.ప్రభాకర్ చైర్పర్సన్ కుర్చీలో కూర్చోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేఈ సోదరులు డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లో మైన్స్ పరిశ్రమల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ రవాణాదారులతో కుమ్మక్కయ్యారన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ పట్టా భూములను దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారన్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్న కేఈ సోదరులపై వ్యాఖ్యానిస్తే ఖండించేందుకు సోమిశెట్టి ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి నుంచి శ్రీదేవిని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇద్దరు ఎస్పీలు క్లీన్చిట్ ఇచ్చినా చెరుకులపాడు నారాయణరెడ్డిపై పాత కేసులను తిరగదోడే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఏడాదికాలం పనిచేసినా జిల్లాకు ఎంతో మేలు చేకూర్చారన్నారు. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా గౌరవం నిలుపుకోకుండా రౌడీయిజం ప్రదర్శించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ రైతులను అవమానపరిచేలా మాట్లాడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి కోట్ల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, నాయకులు సర్దార్ బుచ్చిబాబు, ఎం.పి.తిప్పన్న, వై.వి.రమణ, ఎస్.ఖలీల్‌బాష, చెరుకులపాడు నారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అహ్మద్‌అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీ పడక.. ఒత్తిళ్లకు బెదరక
కర్నూలు: రాజకీయ ఒత్తిళ్లకు బెదరకుండా.. అధికార పార్టీ నాయకులతో రాజీపడకుండా ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లాలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన శాఖా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పోలీస్ శాఖ పనితీరును గాడిలో పెట్టారు. జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం మీతో మీఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి కూరుకుపోకుండా ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ చూపారు. ఆదోని, కోసిగి, కర్నూలు టౌన్‌కు చెందిన యువకులకు 600 మందికి శిక్షణనిచ్చి కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు ఆదోనిలో పేరు మోసిన మట్కా కింగ్. ఈయన ఆస్తుల విషయంలో విచారణ జరిపించాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఆమ్వే కంపెనీకి చెందిన సీఈఓ విలియం స్కాట్ పింకినేను ఢిల్లీలోని గూర్గావ్లో అరెస్టు చేశారు. జిల్లాలో సంచలనం రేపిన నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారం మొదలుకొని కర్నూలు-నంద్యాల జంట హత్యలను ఛేదించారు. మాల్‌ప్రాక్టీస్ ముఠా గురివిరెడ్డి ముఠాను అరెస్టు చేయించడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించి ఫలితాలు సాధించారు. వసంత గోల్డ్, అక్షయ గోల్డ్, అవని గోల్డ్ సంస్థలకు సంబంధించి డిపాజిటర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టుబడుల చట్టాన్ని ఉపయోగించి వాటి నిర్వాహకులను కటకటాలకు పంపారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఏడాది క్రితం ఎస్పీగా జిల్లాకు వచ్చిన ఆయన నేతల ఒత్తిళ్ల మధ్యనే విధులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన మూడున్నర నెలలకే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఆయనను బదిలీ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగేలా ఉత్తర్వులు పొంది సంచలనం సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈయన బదిలీ వెనుక జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వద్ద పంచాయితీ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. -
పట్టాలెక్కని కోట్ల రైలు
* రైల్వే సహాయ మంత్రిగా కోట్ల ఉన్నా ఒరిగింది అంతంతే * ఊరించి తుస్సుమన్న వర్క్‌షాపు ఏర్పాటు * పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల్లేవు.. కొత్తవాటి ఊసేలేదు * మంత్రాలయం లైను మరిచిన మంత్రి కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఒరిగింది అంతంతమాత్రమే. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులు జిల్లాకు తెప్పించడంలో విఫలం అయ్యారు. వర్క్‌షాపు ఏర్పాటు ఊరించి తుస్సు మంది. కర్నూలు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి 2012 అక్టోబర్ 28వ తేదీన రైల్వే శాఖ సహాయం మంత్రి ప్రమాణం చేశారు. 2013లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఆయన మార్కుల పెద్దగా లేదు. ఒక ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఒక ప్యాసింజరు రైలుతోనే సరిపెట్టారు. ఏళ్లతరబడి ఉన్న డిమాండ్లకు పరిష్కారం చూపలేదు. 2014 బడ్జెట్ కూడా ప్రయాణికులు, నిరుద్యోగులకు నిరాశ పర్చింది. కొత్త ప్రాజెక్టుల అసలు ఊసే లేదు. ఆయన ఎంతో ప్రతిష్టా త్మకంగా ప్రకటించిన వర్క్‌షాపు నిర్మాణానికి మార్గం పడలేదు. దశాబ్దాల నాటి డిమాండ్ ఉన్నా మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం తొలగించలేదు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.2వేల కోట్లు కావాల్సి ఉండగా అరకొరే విదిల్చారు. 44 ఏళ్ల ప్రతిపాదనకు గ్రహణం అధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన రైల్వేలైనుకు పట్టిన గ్రహణం వీడ లేదు. సహాయ మంత్రిగా కర్నూలు ఎంపీ ఉన్నప్పటికీ గ్రీన్‌సిగ్నల్ దొరకలేదు. 44 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈలైనుకు ఇప్పటికీ మోక్షం లభించకపోవడం గమనార్హం. 2004లో రైల్వే మంత్రి నితీష్‌కుమార్ అప్పటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించడంతో సర్వే పూర్తి చేసి నివేదికలిచ్చారు. 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్లో కొత్త లైను ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. 2011 ఫిబ్రవరి 23న సర్వే పనుల కోసం రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. గతంలో రూపొందించిన మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని సర్వే కాంట్రాక్టర్ నివేదిక అందజేశారు. తాజాగా ఇప్పుడు నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100కోట్లకు చేరుతుందని అంచనా. మంత్రి కోట్ల కనీసం చిల్లిగవ్వ కూడా మంజూరు చేయించలేకపోయారు. దీంతో రెండు సార్లు సర్వే చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయి. నీరుగారిన మరిన్ని హామీలు: * కర్నూలులో రైల్వే వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు గత ఏడాది బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. * దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్ (నిర్వాహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు. * సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణానికి, ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నిధుల్లేవు. * హోస్పెట్ - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామని కోట్ల హామీ ఇచ్చినామోక్షం లభించలేదు. * ఎర్రగుంట్ల - నంద్యాల లైను పెండింగ్ పనులకు, గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలో మీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు విదిల్చలేదు. * కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు. జగనన్న మాట: రైల్వే బడ్జెట్లో ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందని, ఎన్నికల్లో అధికమంది ఎంపీలను గెలుచుకొని మన రాష్ట్రానికి రైల్వే మంత్రి పదవి దక్కించుకోవాలని పదేపదే ప్రకటించారు. రైల్వే మంత్రి వస్తే జగనన్న ఇచ్చిన హామీ మేరకు జిల్లాతోపాటు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తితోపాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇచ్చే ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో నడిచే ఎంపీలు, ఎమ్మెల్యేలనే గెలిపిస్తామని తేల్చి చెబుతున్నారు. -
కోట్లా.. ఇదెట్ల?
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి చెప్పులు తొడుగుతున్న వ్యవహారం చర్చనీయాంశమైంది. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా గుడిపాడులో ఒక ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్కనే ఉన్న చనుగొండ్ల పంచాయతీ సర్పంచ్ సుజాతమ్మ భర్త జి.రంగనాయకులు.. మంత్రి చెప్పులు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వాటిని శుభ్రం చేసి ‘కోట్ల’ పాదాలకు తొడిగారు. అయినా మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు అడ్డు చెప్పకుండా చూస్తుండిపోయారు. - న్యూస్‌లైన్, గూడూరు -
'కర్నూలును రాజధాని చేయకపోతే మరో ఉద్యమం'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాలను రాజధానిగా చేయాలంటే నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అంశానికి సంబంధించి కేంద్రం ఏ వైపు అడుగులు వేసినా సీమాంధ్రలో మాత్రం అలజడి మొదలైంది. తాజాగా కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాస్త స్వరం పెంచారు. గత ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూల్ ను సీమాంధ్ర రాజధానిగా చేయాలని కోట్ల డిమాండ్ చేస్తున్నారు. కాని పక్షంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడిన వారు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఆదరించరని కోట్ల అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్‌కు రెండంతస్తుల రైలు
మరో నెలలో సేవలు ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది. ఎరుపు, పసుపు రంగుల్లో అందంగా ముస్తాబైన డబుల్ డెక్కర్ రైలు గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చేసింది. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లన్నింటికంటే మరింత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. రైల్వే భద్రతా కమిషన్ నివేదిక అనంతరం మరో నెల రోజుల్లో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కాచిగూడ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి గుంటూరు మార్గాల్లో ఈ డబుల్ డెక్కర్ రైలు నడవనుంది. గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డబుల్ డెక్కర్ ట్రైన్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే అలార్మ్ వ్యవస్థ ఈ ట్రైన్ ప్రత్యేకత అని, ఇప్పటి వరకు మరే డబుల్ డెక్కర్ ట్రైన్‌కు ఈ సదుపాయం లేదని మంత్రి వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ అగర్వాల్, సీపీఆర్వో కె.సాంబశివరావు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు. దేశంలో ఇది ఆరో డబుల్ డెక్కర్.. ఇది దేశంలో 6వ డబుల్ డెక్కర్ రైలు. ఇప్పటి వరకు ధన్‌బాద్-హౌరా (12385/86), అహ్మదాబాద్-ముంబై (12932/31), ఢిల్లీ-జైపూర్ (12986/85), ఇండోర్ నుంచి హజారీబాగ్, భోపాల్ (2216/ 185), బెంగళూర్-చెన్నై (22626/625) మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఈ కొత్త రైలుకు 14 ఏసీ చైర్‌కార్స్, 3 పవర్ బోగీలు ఉంటాయి. పూర్తి ఏసీ సదుపాయంతో నడిచే ఈ ట్రైన్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వంటివి చోటు చేసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయిలోనే పొగ, మంటలను గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేసే వెస్‌డా (వెరీ ఎర్లీ స్మోక్/ఫైర్ డిటెక్షన్ విత్ అలార్మ్) టెక్నాలజీని ఏర్పాటు చేశారు. *ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. * ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీల్లో 1,680 సీట్లు ఉంటాయి. * భద్రతా ప్రమాణాల పరిశీలన తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ కాచిగూడ-గుంటూరు బై వీక్లీ, కాచిగూడ -తిరుపతి బై వీక్లీగా నడవనుంది. *కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ పగటిపూట మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు కూర్చొని వెళ్లవలసి ఉంటుంది. -
కర్నూల్ రాజధాని కావాలి: కోట్ల
హైదరాబాద్: సీమాంధ్ర కోసం కర్నూలును రాజధానిగా చేయాలని పోరాడనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చెప్పారు. డబుల్ డెక్కర్ రైలును పరిశీలించేందుకు గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల తీవ్ర అన్యాయానికి గురైన రాయలసీమకు రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణమధ్య రైల్వే సహా అన్ని అంశాలపై కమిటీలు వే శారని, ఆ కమిటీ నివేదిక మేరకు రైల్వేలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తిగా సీమాంధ్ర రైల్వే ప్రధాన కార్యాలయం కూడా కర్నూల్లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వాల్తేరు డివిజన్ విలీనం పైన కూడా కమిటీ నివేదిక మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఇంకా భూమి లభించలేదన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు పట్టదా?: కోట్ల
కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజలు ఛీకొడుతున్నా అధిష్టానం పట్టించుకోవడంలేదని.. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోం దని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, చచ్చేవరకూ ఆ పార్టీలో ఉండాలనుకున్నా.. పార్టీ పెద్దల నిర్ణయంతో ఎందుకు కొనసాగాలనే ఆలోచనకు వచ్చానని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పార్లమెంట్ ఘటనతో ప్రభుత్వం, దేశపరువు బజారున పడిందన్నారు. -
'కమల్' ప్లాన్ ప్రకారమే సీమాంధ్ర ఎంపీలపై దాడి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ ఓ ప్లాన్ ప్రకారమే పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలపై దాడులు చేయించారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కర్నూలు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని అందుకే రాష్ట్ర విభజనకు తమ పార్టీ అధిష్టానం ఓకే అంటోందని పేర్కొన్నారు. సొంత పార్టీ ఎంపీలు పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీకే అవమానం ఆయన అభివర్ణించారు. విభజనపై సొంతపార్టీ నేతలతో చర్చించడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కానీ ప్రధాని కానీ సమయం ఉండదని, బీజేపీ నేతలతో విందు రాజకీయాలు చేయడానికి మాత్రం సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షమైన బీజేపీతో విందులు చేయడం శోచనీయమని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
డబుల్ డెక్కర్ వచ్చేనా?
ఇదొక్కటే ఆశ కొత్త రైళ్లపై దృష్టి పెట్టని ప్రజాప్రతినిధులు అధికారుల ప్రతిపాదనలకు ఆమోదం లభించేనా? నేడు రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సాక్షి, విజయవాడ : రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విజయవాడకు కొత్త రైళ్లు వచ్చే సూచనలు కనపడటం లేదు. విజయవాడ మీదుగా వెళ్లేలా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు కావాలని రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి ప్రతిపాదించారు. ఇదొక్కటే 2014-15 సంవత్సరానికి గాను బుధవారం ప్రవేశపెట్టే రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆమోదం పొందే అవకాశం కనపడుతోంది. మిగిలిన రైళ్లు ఏవీ వచ్చే పరిస్థితి కనపడటం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రజాప్రతినిధుల నుంచి ఒక్క ప్రతిపాదనా లేదు... సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుండటంతో రైల్వే బడ్జెట్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఎంపీలు గాని దృష్టి పెట్టలేదు. వారి నుంచి ఈ ఏడాది ఒక్క ప్రతిపాదన కూడా రైల్వేకు వెళ్లలేదు. పైగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు వచ్చే అవకాశాలు లేవు. కొత్త రైళ్లు, స్టేషన్లలో వసతులకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రకటిస్తామని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున కార్గే ప్రకటించారు. విజయవాడ డివిజన్ నుంచి కొత్త రైళ్ల కోసం గత నెలలో రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. అవి వచ్చే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చోటు దక్కించుకుంటాయో లేదో చూడాలి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి రెండు వైపులా రాత్రిపూట రైలు నడపాలని, విజయవాడ నుంచి గౌహతికి వారానికోసారి నడుపుతున్న ఎక్స్‌ప్రెస్‌ని ప్రతిరోజూ నడపాలని, కాకినాడ నుంచి యశ్వంత్‌పూర్, గుంటూరు నుంచి ధర్మవరం, మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ , అమరావతి - విజయవాడ రైళ్లను కూడా రోజూ నడపాలని ప్రతిపాదనలు పంపారు. రాజస్థాన్, గుజరాత్, ముంబై, కోయంబత్తూరు, మంగుళూరు, సేలం తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు కావాలనే ఈ ప్రాంత ప్రయాణికుల డిమాండ్ నెరవేరడం లేదు. గుంటూరు-తెనాలి-విజయవాడ మధ్య సర్క్యులర్ రైళ్ల ఏర్పాటుకు ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. వీటిలో కొన్నింటికైనా ఆమో దం దొరకాలని అధికారులు ఆశిస్తున్నారు. -
సికింద్రాబాద్-తిరుపతిల మధ్య మార్చిలో డబుల్ డెక్కర్: కోట్ల
గద్వాల, న్యూస్‌లైన్: సికింద్రాబాద్-తిరుపతి మధ్య పగటిపూట ప్రయాణించే డబుల్ డెక్కర్ రైలు మార్చిలో పట్టాలపైకి రానుందని రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇది తొలి ప్రయత్నమన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో విలేకరులతో మాట్లాడుతూ గద్వాల-రాయచూర్‌ల మీదుగా ద్రోణాచలం(డోన్)-ముంబై ఎక్స్‌ప్రెస్‌నూ మార్చిలోనే ప్రారంభిస్తామన్నారు. కర్నూలు వద్ద కోచ్ మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు రూ. 2,050 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కనుందని, రైల్వే భద్రతా విభాగంలో మహిళలకు 10 శాతం ఉద్యోగాలిస్తామని చెప్పారు. -
కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన జాతీయ జెండను ఎగురవేసి అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సిబ్బందితోపాటు ఆయన నివాసంలో విధులు నిర్వహించేవారు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అందరికీ మిఠాయిలు పంచారు. ఏటా తన నివాసంలో మంత్రి కోట్ల స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. -
కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సిబ్బందితోపాటు ఆయన నివాసంలో విధులు నిర్వహించే వారు పాల్గొన్నారు. అనంతరం అందరికీ మంత్రి మిఠాయిలు పంచారు. ఏటా తన నివాసంలో మంత్రి కోట్ల స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. -
మిగిలింది ఆయనే!
2009లో... రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో కొలువయ్యారు. ఫలితంగా ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్ దొరకడం ప్రతిష్టాత్మకంగా భావించారు. 2014లో... తెలుగు ప్రజలను నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ పరిస్థితుల్లో పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా బరిలో నిలిచే అభ్యర్థులు కరువయ్యారు. పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదానికి తెరతీసింది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన వైపు ఆ పార్టీ వేస్తున్న ఒక్కో అడుగు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఇతర పార్టీల ఆహ్వానం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచినా అటువైపు అడుగులేసే నాయకుడు కరువయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కోట్ల కుటుంబం పెద్ద దిక్కుగా మారింది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించే అభ్యర్థులే కరువయ్యారు. విధిలేని పరిస్థితుల్లో ఈ విడత కోట్ల కుటుంబమంతా బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బరిలో నిలుస్తుండగా.. కుటుంబ సభ్యులు రెండు అసెంబ్లీ స్థానాల నుంచి.. అనుచరుడు మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం ఉంది. కోట్ల తన కుమారుడు రాఘవేందర్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం ఆలూరు నియోజకవర్గం నుంచి చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ స్థానం నుంచి అనుచరుడిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. ఇక డోన్ అసెంబ్లీ స్థానం నుంచే తాను బరిలో నిలవనున్నట్లు కోట్ల సుజాతమ్మ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ఆ మేరకు గత ఆదివారం స్థానికంగా ఆమె ఓ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై మద్దతు కోరడం తెలిసిందే. తక్కిన పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను సైతం అధిష్టానం కోట్ల భుజస్కంధాలపైనే ఉంచినట్లు పార్టీ వర్గీయుల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మిగనూరు బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీడీపీ నేత ఒకరికి పార్టీ తీర్థం ఇప్పించి పోటీ చేయించవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి టీజీ వెంకటేష్ ఒకవేళ పార్టీ మారితే ఎవరిని బరిలో నిలపాలనే విషయమై కోట్ల ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రచారం జరుగుతున్నట్లుగా టీజీ పార్టీ వీడితే టీడీపీ నేత ఒకరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని పోటీ చేయించేందుకు అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
నువ్వా....నేనా? ....రచ్చ
జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న కేంద్ర రైల్యే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైంది. వీరిద్దరి మధ్య రచ్చ ముదిరి పాకాన పడింది. నువ్వా.. నేనా? అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలిద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలతో శ్రేణుల్లో కలకలం రేగుతోంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే వీరిద్దరు రచ్చకెక్కారనే చర్చ జరుగుతోంది. శనివారం ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా మంత్రి కోట్ల టీజీనుద్దేశించి మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌లో ఉంటూ మంత్రి పదవులు అనుభవిస్తూ పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్న వారు బయటకు వెళ్లిపోవాలని’ విమర్శించారు. ఆ తర్వాత 24 గంటలు గడవక మునుపే మంత్రి టీజీ సైతం అదే రీతిలో మంత్రి కోట్లపై ఘాటైన విమర్శలు చేశారు. ఆదివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లకు ఆహ్వానం అందకపోగా.. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు పాల్గొనడం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. పార్టీలు మారడం ఆయనకే చెల్లు పార్టీలు మారడం మంత్రి టీజీకి కొత్తేమీ కాదని.. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు చుట్టేసి వచ్చారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీది కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎలాగూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని.. ఎంత త్వరగా బయటకు వెళితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని.. రాజకీయాల్లోనూ ఎదుగుదల సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపనలు చేయాలే కానీ.. జిల్లా కేంద్రంలో ఉండి వ్యవహారం నడిపితే ఎలాగని ప్రశ్నించారు. ఆ పనులన్నింటికీ తాను ఆయా ప్రాంతాలకు వెళ్లి తిరిగి శంకుస్థాపన చేస్తానన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండగా.. టీజీ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. 2004లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తానే తగుటబెట్టినట్లు ఆరోపించడం సత్యదూరమన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పొరపాటును తనకు అంటగట్టడం సరికాదన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని.. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి టీజీ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్న విషయమై విలేకరులు ప్రశ్నించగా.. అది కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చూసుకుంటారని దాటవేశారు. విభజన వల్ల ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చునని, 2019లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కార్యాలయాన్నే తగులబెట్టించావు ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. -
టీజీ వెంకటేష్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు: కోట్ల
కర్నూలు : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంతపార్టీ నేతలపైనే ధ్వజమెత్తారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపుకాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ద్రోహం చేసే మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని కోట్ల డిమాండ్ చేశారు. మంత్రి టీజీ వెంకటేష్‌పై స్పీకర్ ఫిర్యాదు చేస్తామని...ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం అందుతుందని ఆయన అన్నారు. -
కర్నూలు మీదుగా డబుల్ డెక్కర్ రైలు
డోన్, న్యూస్‌లైన్ : సికింద్రాబాదు నుంచి కర్నూలు, డోన్ మీదుగా తిరుపతి వరకు డబుల్‌డెక్కర్ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక రైలులో కర్నూలు నుంచి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలో డోన్ రైల్వేస్టేషన్లో వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే రైల్వేబడ్జెట్‌లో తగిన న్యాయం చేస్తానన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి కావలసిన సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఫ్యాక్టరీలు, అదనపు రైళ్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదు నుంచి నడికుడి మీదుగా విజయవాడకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాదు నుంచి డోన్ మీదుగా తిరుపతికి డబుల్‌డెక్కర్ రైలు ఏర్పాటు చేస్తామన్నారు. దూపాడు వద్ద రూ.6.50 కోట్ల వ్యయంతో బోగీల మరమ్మతు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. అందుకోసం త్వరలో భూ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. డోన్, గుంతకల్, వాడీ మీదుగా ముంబాయి, షిర్డీకి రైలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డోన్ రైల్వేస్టేషన్లో రద్దీ దృష్ట్యా అదనపు ప్లాట్‌పాం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ఇటీవల రైళ్లలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై విచారణ కమిటీలు ఏర్పాటు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధర్మవరం వద్ద జరిగిన రైలుప్రమాదంలో 26 మంది, ముంబాయి వద్ద 9 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు రైల్వేశాఖ నుంచి ఒక్కోక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట హైదరాబాదు ఏడీఆర్ఎం రాజ్‌కుమార్, ఏసీఎం భానుప్రకాష్, ఏఈఈ ఉస్మాన్, ఏఓఎం త్రినాథ్‌కుమార్, గుంతకల్ డీఆర్ఎం మనోజ్జోషీ, సీనియర్ డీసీఎం స్వామినాయక్, సీనియర్ డీఈ ఎన్ సివిల్ మనోజ్‌కుమార్ ఉన్నారు. రూ.లక్ష రివార్డు అనంతరం ఆయన డోన్ రైల్వేస్టేషన్ లోని విశ్రాంతి గదులను పరిశీలించారు. గదుల్లో పరిశుభ్రతను పాటించినందుకుగాను స్టేషన్ సూపరింటెండెంట్‌కు లక్షరూపాయల రివార్డును ప్రకటించారు. స్టేషన్లో ప్రయాణికులకు సరైన వసతులు కల్పించడం, స్టేషన్లో సౌకర్యాలు కల్పించడంపై మంత్రి సిబ్బందిని అభినందించారు. -
కేంద్ర మంత్రి కోట్ల డౌన్ డౌన్
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో సమైక్య సెగ తగిలింది. జిల్లాలోని డోన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం తనిఖీకి వెళ్లిన ఆయన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఒకానొక సందర్భంలో కోట్ల డౌన్, డౌన్ అంటు ఆయన్ని నిలువరించారు. కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్యవాదులు కోట్లను డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై గతేడాది జులై 30న కేంద్ర ప్రకటన వెలువడిన వెంటనే పదవికి రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని వారు కోట్లను నిలదీశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎంపీలపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
-
ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. రైలు ప్రమాదం జరగటం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించినట్లు కోట్ల తెలిపారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు అయిదు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష, స్వల్పంగా గాయపడినవారికి యాభైవేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని కోట్ల తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఆయన అన్నారు. పదిరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కోట్ల పేర్కొన్నారు. మరోవైపు... సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది పరీక్షల తర్వాత గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశముంది. -
‘అయ్యవార్ల’కు చాలు పప్పుబెల్లాలు!
సమైక్యానికి స్వస్తి.. ప్యాకేజీలపై దృష్టి అధిష్టానం దారిలోకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు నివాసాల్లో రెండు దఫాలుగా మంతనాలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం శరవేగంగా ముందుకు తీసుకెళ్తుండడంతో ఇక సమైక్య రాష్ట్ర డిమాండ్‌కు స్వస్తి చెప్పడమే మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదంటున్న అధిష్టానంతో సహకరించి సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ అన్యాయం జరుగకుండానైనా చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం రెండు దఫాలుగా సమావేశమై తెలంగాణేతర ప్రాంతాలతో మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్వరాభివృద్ధికి కేంద్రం నుండి రాబట్టుకోవాల్సిన అదనపు నిధులు, సంస్థలు, పథకాల జాబితాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉదయం పల్లంరాజు నివాసంలో, పురందేశ్వరి, కృపారాణి మినహా మిగిలినవారు సాయంత్రం మరోసారి కావూరి నివాసంలో సమావేశమై సీమాంధ్ర అవసరాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఏడుగురు మంత్రుల కమిటీ (జీవోఎం) శుక్రవారం సమావేశం కానున్న నేపథ్యంలో తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నారు. కేంద్రం నుండి తమ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు సాధించడం ద్వారానైనా సమైక్యాంధ్ర కోసం రెండు మాసాలుగా ఉద్యమిస్తున్న ప్రజల ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం చేయాలన్నది వీరి ఉద్దేశంగా చెబుతున్నారు. కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసే విషయంలో సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కొరవడడం, తామెంత వత్తిడి తెచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశమే లేదని తేలిపోవడంతో ఒకరి తర్వాత ఒకరుగా అంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనడంతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలు, రక్షణ, వ్యవసాయరంగ పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరుతూ కిశోర్‌చంద్రదేవ్ ఆంటోనీ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధ, గురువారాలలో దీనిపై ప్రాథమిక కసరత్తు మాత్రమే జరిగిందని, వచ్చే 15వ తేదీన గురువారం హాజరుకాని చిరంజీవి, కిశోర్‌చంద్ర దేవ్‌లతో పాటు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో కలిసి మరోసారి చర్చించిన తర్వాత ‘ప్యాకేజీలపై’ తమ ప్రతిపాదనలతో షిండే నేతృత్వంలోని జీవోఎంతో భేటీ కావాలని కేంద్ర మంత్రులు నిర్ణయించుకొన్నారు. సోనియాతో కావూరి, పురందేశ్వరి చర్చలు ఉదయం సమావేశం ముగిసిన తర్వాత కావూరి సాంబశివరావు, పురందేశ్వరి విడివిడిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చర్చల వివరాలను వెల్లడించడానికి వారు నిరాకరించినప్పటికీ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న భయాందోళనలను, సమస్యల తీవ్రతను వివరించి విభజన తర్వాత దేశంలో అతిపేద రాష్ట్రంగా మిగిలిపోకుండా కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. -
కోట్ల సూర్య, టీజీలు శనిగ్రహాలు
పత్తికొండ/పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న టీజీ వెంకటేష్‌లు శనిగ్రహాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకులు, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి ఆయనకు టెంకాయ నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ కోట్ల, టీజీలు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తన భర్త కోట్లతో రాజీనామా చేయిస్తానని డోన్‌లో శపథం చేసిన సుజాతమ్మ ఇంతవరకు ఆ పని చేయించలేకపోయారన్నారు. ఈ విషయంలో సమైక్య ఉద్యమకారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా టీజీ వెంకటేష్ ముఖం చాటేయడంలో అర్థం లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే.. కీలకమైన సమయంలో ఆయన వారికి అండగా నిలవకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణను విడదీసి టీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే పది సీట్లయినా వస్తాయనే కాంగ్రెస్ అధిష్టానం విభజనకు తెరలేపిందన్నారు. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలనే స్వార్థంతోనే సీమాంధ్ర ప్రజల మనోభావాలను లెక్క చేయక సోనియా గాంధీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, టీడీపీలు రోజుకో కుట్ర పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులకు కల్లబొల్లి మాటలతో కాలయాపన చేయడం అలవాటైపోయిందన్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని.. యాత్ర ప్రారంభమైతే ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. నాయకులు ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పదవుల కోసం పాకులాడే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతాడన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు పత్తికొండకు వచ్చారో లెక్కేసుకుంటే ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి సమైక్యాంద్ర ఉద్యమ కారులను హిజ్రాలతో పోల్చడంపై ఆయన నిప్పులు చెరిగారు. సంస్కారం మరచి మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. రాష్ట్రం ముక్కలైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కనీస జ్ఞానం లేని నాయకులు ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు కొదమసింహాలై కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు బాల నాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నాయకులు ఎస్.రామచంద్రారెడ్డి, పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, డాక్టర్ గిడ్డయ్య, పల్లె ప్రతాప్‌రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, శ్రీరంగడు, దామోదర్ఆచారి, పత్తికొండ సర్పంచ్ బనావత్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘సమస్యను పరిష్కరించాకే విభజన నిర్ణయం జరగాలి’
ఢిల్లీ: ఇప్పటికే పలుప్రాంతాల్లో తాగు, సాగు నీరుకు సంబంధించి సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాకే విభజన నిర్ణయం జరగాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన జరిగితే రాయలసీమ ప్రజలు ఎక్కువ నష్ట పోతారని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో తాగు, సాగు నీరుపై అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నించాలన్నారు. సమైక్యాంధ్రకే తన మొదటి ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గతంలోనే వెల్లడించారు. రాయలసీమ జిల్లాలను విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్సకు స్పష్టం చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో ప్రత్యేక రాయలసీమా ఏర్పాటు చేయాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
పదవి కోసం కోట్ల పాకులాట: మారెప్ప
కర్నూలు : కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిభావంతమైన నాయకత్వంతో తెలుగు ప్రజల అభిమానం పొందిన ఆదర్శ నేతగా కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరు గడిస్తే ...ఆయన కుమారుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి మాత్రం పదవి పట్టుకొని పాకులాడుతూ రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం శోచనీయమని ఇప్పటికైనా మనసు మార్చుకొని రాజీనామా చేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
రాయల తెలంగాణకే కర్నూలు జిల్లా నేతలు సై!
సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలపాలంటూ గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు తగిన కారణాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఈ మేరకు వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆమెతో సమావేశం కానున్నారు. ‘రాయల తెలంగాణపై అభిప్రాయం చెప్పేందుకు’ వారిప్పటికే అధినేత్రి అపాయింట్మెంట్ కోరినట్టు, ఆమె కార్యాలయం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది! దిగ్విజయ్‌తో కర్నూలు నేతల భేటీ సోమవారం రాత్రి కర్నూలు జిల్లా నేతలు దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతత్వంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, మురళీకృష్ణ వీరిలో ఉన్నారు. విభజనపై వ్యక్తమవుతున్న నిరసనలు, నేతల రాజీనామాలు, నదీ జలాల అంశం వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నా... విభజనకు తమ ప్రాంత ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, విభజన అనంతరం సీమ మరింత వెనుకబడుతుందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలంగా ఉందని నేతలు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు జరిగితే తమ ప్రాంతంలో నదీ జలాల వివాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే తుంగభద్ర నీటి కేటాయింపుల విషయంలో సరిహద్దున ఉన్న మహబూబ్‌నగర్‌తో నిత్య పోరాటం చేస్తున్నామని, రాజోలిబండ వాటర్ స్కీం కింద సైతం వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు వస్తుందని, అక్కడ నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేస్తే తమ జిల్లాకు చుక్క నీరందదని, తమ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుందని తెలిపారు. అందువల్ల తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వారు కోరినట్లు సమాచారం. రాజకీయ కోణంలో కూడా కర్నూలును తెలంగాణలో కలిపితేనే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మూడుగా విభజించాల్సిందే: కోట్ల రాష్ట్రం సమైక్యంగా ఉండటానికే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, అలా కుదరని పక్షంలో రాష్ట్రాన్ని మూడుగా విభజించాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. లేనిపక్షంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, హైదరాబాద్‌తోనే తాము కలిసుంటామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. నేడు సోనియాతో భేటీ.. కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మంగళవారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలువనున్నారు. కోట్ల ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారని, సోనియా కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.