Krishna river Management board
-
కేఆర్ఎంబీ చైర్మన్‌గా అశోక్ గోయల్
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా అశోక్ ఎస్.గోయల్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ నియమించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న శివ్‌నందన్‌కుమార్ రెండేళ్లుగా కృష్ణా బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్‌గా అశోక్‌ను కేంద్రం నియమించింది. జూన్ 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పీపీఏ సీఈవోగా మరొకరిని నియమిస్తారా లేదా అశోక్‌కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. -
రూ. పది కోట్లు డిపాజిట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాలో రూ.పది కోట్లు కట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు చేపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రమౌళీశ్వరరెడ్డి వేర్వే రుగా దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ చెన్నై బెంచ్ గతంలో విచారించిన సంగతి తెలిసిందే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రూ.528 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అదనంగా రూ.300 కోట్లు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.920.85 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దు మొత్తం జరిమానా ఎంతంటూ ధర్మాసనం ప్రశ్నించగా డిండి ప్రాజెక్టు విషయంలో రూ.92 కోట్ల జరిమానా విధించారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ఎవరు పరిష్కరించాలి? కేంద్ర ప్రభుత్వమా? లేక కోర్టు చొరవ తీసుకోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నుంచి తగిన మార్గదర్శకాలు తీసుకుంటానని న్యాయవాది తెలుపగా మార్గదర్శకాలు త్వరగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, ప్రస్తుత డిండి కేసుతో సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. చివరగా... ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిండి ప్రాజెక్టుకు విధించిన రూ 92 కోట్ల జరిమానాలో రూ.పది కోట్లను కేఆర్ఎంబీ ఎదుట మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన జరిమానా విషయంలో ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై అభ్యంతరం ఉంటే నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనులు కొనసాగించుకోవచ్చు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తాగు నీటి అవసరాలకు సంబంధించి 75 టీఎంసీల మేర పనులు కొనసాగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఎనీ్టటీ విధించిన రూ.528కోట్ల జరిమానాలపై స్టే ఇస్తూ ఫిబ్రవరి 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రెండు పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయా లని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
ఆ జలాలు మావే
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలా శయంలోని కొద్దిపాటి నీళ్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కొత్త వివాదాన్ని రేకెత్తించాయి. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి విడుదల చేయాలని ఆ రాష్ట్రం చేసిన విజ్ఞ ప్తిపై మంగళవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశం కొత్త వివాదానికి వేదికైంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే నేతృత్వంలో మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ సి.నారాయణరెడ్డి పాల్గొనగా, తెలంగాణ ఈఎన్సీ సి.ముర ళీధర్ గైర్హాజరయ్యారు. ఏపీ ఈఎన్సీ నారా యణరెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ సాగర్ కుడికాల్వకి తాగునీటి కోసం 5 టీఎంసీలను విడుదల చేయాల్సిందేనని పట్టు బట్టారు. తెలంగాణ ఈఎన్సీ హాజరు కానందున నీటి విడుదలపై ఇండెంట్ జారీ చేయ లేమని త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రా యిపూరే స్పష్టం చేశారు. మళ్లీ త్రిసభ్య కమి టీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. బోర్డుతో తెలంగాణ ఈఎన్సీ భేటీ.. త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసిన తర్వా త తెలంగాణ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ప్రత్యేకంగా కృష్ణా బోర్డు అధికారులను కలి సి చర్చించారు. సాగర్‌లో నిల్వలు అడుగంటిపోయాయని, ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా నదికి ఎలాంటి వరద ప్రవా హం లేదని బోర్డుకు వివరించారు. గతేడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తమ వాటాకి మించి కృష్ణా జలాలను ఏపీ వాడుకుందని... హైదరాబాద్ జంట నగరాల తాగునీటి, భగీరథ అవసరాల కోసం తాము సాగర్‌లో తమ వాటా నీళ్లను మిగిల్చి ఉంచామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం సాగర్‌లో ప్రసుత్తం 517 అడుగుల వరకే నిల్వలున్నాయని, 510 అడుగులకు తగ్గితే హైదరాబాద్ నగరానికి నీళ్లను సరఫరా చేసే అప్రోచ్ కాల్వకు నీళ్లు అందవని నారాయణరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను సంప్రదించిన అనంతరం ఆయన అనుమతితో ఏపీకి 5 టీఎంసీల నీటిని విడుదల చేసే అంశంపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని వివరించినట్టు తెలిసింది. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 5 టీఎంసీలు అవసరం లేదని అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. -
శ్రీశైలం జలాశయం ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా సాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాలకు జలాశయం నుంచి నీళ్లను తరలించడంతో జలాశయంలో నిల్వలు కనీస నీటి మట్టానికి దిగువన పడిపోయాయి. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గురువారం నాటికి కేవలం 51.92 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలాయి. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. సాగునీటి అవసరాలకు 854 అడుగులు, విద్యుదుత్పత్తి అవసరాలకు 834 అడుగుల కనీస నీటి మట్టం(ఎండీడీఎల్) ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 830 అడుగులకు పడిపోయింది. సాగునీటి, తాగునీటి అవసరాల పరిరక్షణ కోసం తక్షణమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసేలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. నిల్వల్లో ఏపీకి మిగిలింది 13 టీఎంసీలే ! తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 932.07 టీఎంసీల జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే 725.51 టీఎంసీలను రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. మొత్తం లభ్యత జలాల్లో తాత్కాలిక కేటాయింపుల నిష్పత్తి 66: 34 ప్రకారం ఏపీకి 615.17 టీఎంసీలు, తెలంగాణకు 316.90 టీఎంసీల వాటా ఉంది. ఇప్పటికే ఏపీ 542.45 టీఎంసీలను వాడుకోగా, ఆ రాష్ట్రం పరిధిలోని ఇతర జలాశయాల్లో నిల్వ ఉన్న 59.68 టీఎంసీల కృష్ణా జలాలను కలుపుకుని ఆ రాష్ట్రం మొత్తం 602.13 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. తెలంగాణ 183.05 టీఎంసీలను వాడుకోగా, ఇక్కడి ఇతర జలాశయాల్లోని 10.2 టీఎంసీల నిల్వలు కలిపి మొత్తం 193.26 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 136.67 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, అందులో ఏపీకి 13.03 టీఎంసీలు, తెలంగాణకు 123.63 టీఎంసీల కోటా ఉందని తెలంగాణ పేర్కొంటోంది. కల్వకుర్తి ఎత్తిపోతలకు కష్టకాలమే ! శ్రీశైలం జలాశయంలో 800.52 అడుగుల కనీస నీటి మట్టం ఉంటేనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2.38లక్షల ఎకరాల ఆయటకట్టుకు సాగునీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి సరఫరాకు వీలు కానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సాగునీటి అవసరాలకు 13.6 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 4.40 టీఎంసీలు కలిపి మొత్తం 18టీఎంసీలు అవసరం. ప్రస్తుతం జలాశయంలో 51టీఎంసీలే మిగిలి ఉండగా, రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడంతో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలను పరిరక్షించడానికి తక్షణమే రెండు రాష్ట్రాలతో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. గతేడాది శ్రీశైలం జలాశయంలో నిల్వలు డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా వేసవి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం జలాశయంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను ఎత్తిపోయాల్సి వచ్చింది. నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీలో కృష్ణా బోర్డు కన్వీనర్‌తో పాటు ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు పాల్గొననున్నారు. రబీ ఆయకట్టుతో పాటు వేసవి తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. -
హంద్రీనీవా, గాలేరునగరి విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాలను పరీవాహక ప్రాంతం బయటకు తరలించేలా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని తెలంగాణ ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కృష్ణాజలాలపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా కృష్ణానదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్రప్రతాప్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఆయా ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పర్యావరణ మదింç³# అథారిటీలకు కూడా విడివిడిగా రాసిన లేఖలో్లనూ విస్తరణ ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావరణ అనుమతి(ఈసీ) అమలు కాకుండా నిలిపివేయాలని కోరారు. ఈ విస్తరణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని పలుమార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 ఆగస్టు 26న గాలేరునగరి నుంచి హంద్రీనీవాకు నీటితరలింపు నిమిత్తం రూ.5,036 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించిందని వివరించారు. గాలేరునగరి కాలువ 56 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న చెరువులకు 15.53 టీఎంసీల కృష్ణాజలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ వివరాలివ్వండి ప్లీజ్ శ్రీశైలం–నాగార్జునసాగర్ రూల్‌కర్వ్ ముసాయిదా రూపొందించడానికి ప్రమాణాలేంటీ, ఏ ప్రాతిపదికన రూల్‌కర్వ్ సిద్ధం చేశారో ఆధారాల్విండంటూ మరో లేఖను ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాశారు. దీనిపై కేఆర్ఎంబీ స్పందిస్తూ ‘కేఆర్ఎంబీకి సహకరించండి. తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వి వాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించడానికే సమావేశం ఏర్పాటు చేశాం’అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ లేఖపై స్పందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ స్టేక్ హోల్డర్ కావడం వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నదని జల వనరుల సంఘం, ప్రణాళిక సంఘం శ్రీశైలం ప్రాజెక్టును ఆమోదించిన పత్రాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు మురళీధర్‌రావు కోరారు. 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం, శ్రీశైలం కుడి కాల్వతోపాటు పోతిరెడ్డిపాడుకు కేంద్రం అను మ తి జారీచేసిన పత్రాలు ఇవ్వాలని కోరు తున్నా మ న్నారు. రూల్‌కర్వ్ ఎలానిర్ణయించారో తెలుసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
తెలంగాణ లేకుండానే ఆర్ఎంసీ తొలి భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఈఆర్ఎంబీ) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో కలసి ఏర్పాటు చేసిన ‘రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ)’తొలి సమావేశం శుక్రవారం ఇక్కడి జలసౌధలో జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్ కర్వ్, కృష్ణాలో మిగులుజలాల అంశాలను తేల్చడానికి ఈ భేటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని బోర్డు తోసిపుచ్చింది. కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేఆర్ఎంబీ మెంబర్(పవర్) ఎల్.బి.ముత్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ సుజయకుమార్ హాజరయ్యారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తికి సాగు, నీటి అవసరాలే ప్రామాణికం కావాలని నారాయణరెడ్డి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవోలు, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకొని జలవిద్యుత్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. నీటి కేటాయింపులు, నిబంధనలు పాటిస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. తుంగభద్ర జలాశయంలోంచి నీటివిడుదలపై తుంగభద్ర బోర్డు అనుసరిస్తున్న ఆపరేషన్ ప్రొటోకాల్‌ను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోనూ అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విడుదల చేసిన రూల్ కర్వ్ ముసాయిదాపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులను పిలిపించి రూల్ కర్వ్‌పై చర్చించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. కృష్ణాలో మిగులు జలాలను లెక్కించరాదని కోరింది. కాగా, తదుపరి సమావేశంలో జలవిద్యుత్ ఉత్పాదనపై స్పష్టత వస్తుందని కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ పిళ్లై స్పష్టం తెలిపారు. -
చారిత్రక అన్యాయాలను సరిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం రెండు విభాగాలుగా గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరి చేయాలని, గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఒకే విభాగంగా పొందుపర్చాలంటూ నీటిపారుదల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.మురళీధర్ ఆదివారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు మరోసారి లేఖ రాశారు. 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 25 టీఎంసీల నీటి తరలింపు సామర్థ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కాంపోనెంట్–1గా, నీటి తరలింపును 40 టీఎంసీలకు పెంచడంద్వారా ఆయకట్టును 3.65 లక్షల ఎకరాలకు పెంచేందుకు తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన ప్రాజెక్టు విస్తరణ పనులను కాంపోనెంట్–2గా గెజిట్ నోటిఫికేషన్లోకేంద్రం పేర్కొంది. ఒకే ప్రాజెక్టును రెండు విభాగాలుగా చూపడం సరికాదని లేఖలో తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టును 2.5 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచారని, నీటి కేటాయింపులను ఇందుకు అనుగుణంగా పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో పెంచిన ఆయకట్టుకే తెలంగాణ ప్రభుత్వం సరిపడా నీటి కేటాయింపులు చేసిందని, కొత్తగా ఆయకట్టు పెంచలేదన్నారు. కొత్త వనరుల నుంచి నీటిని తీసుకోవడం లేదన్నారు. మా ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లోవే.. ఏపీవి కావు! శ్రీశైలం జలాశయంలో 800కుపైగా అడుగుల వద్ద నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మిస్తామని 2006లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని తెలంగాణ గుర్తుచేసింది. 885 అడుగులపైన నీటిమట్టం నుంచి నీటిని తోడుకొనేలా గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను డిజైన్ చేసినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించిందని పేర్కొంది. కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టే కావడంతో అప్పట్లో శ్రీశైలం జలాశయంలోని 800 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారని తెలిపింది. పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాజెక్టులు కావడంతో గాలేరు–నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ వంటి ఆంధ్ర ప్రాజెక్టులను శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా డిజైన్ చేశారని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సైతం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇదే కారణంగా 800కుపైగా అడుగుల నుంచి నీటిని తోడుకొనే విధంగా డిజైన్ చేసినట్లు వివరించింది. 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలను కల్వకుర్తికి కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు వాదించామని తెలిపింది. గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగులు జలాలనే ఏపీ కోరిందని, 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలు కేటాయించాలని కోరలేదని తెలిపింది. -
తెలంగాణకు 17.. ఏపీకి 25 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ఆయకట్టు అవసరాల కోసం ఈ నెల 15 వరకు ఏపీ 25 టీఎంసీలు, తెలంగాణ 17 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. రబీ సీజన్ జల అవసరాలపై ఈ నెలాఖరులోగా ప్రతిపాద నలు సమర్పించాలని రెండు రాష్ట్రాలను కోరింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్‌గా సమావేశమైంది. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ తమ తమ అవసరాలను వివరించారు. 331.708 టీఎంసీల లభ్యత ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అంటే.. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 350.585 టీఎంసీల కృష్ణా జలాలను వాడు కున్నామని నారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణ 108.235 టీఎంసీలు వాడుకుందని వివరించారు. ఖరీఫ్ అవసరాల కోసం ఈనెల 15 వరకు సాగర్ కుడి కాలువకు 11.77, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 5.22, హంద్రీ–నీవాకు 4.14 వెరసి 23.68 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ఇప్పటిదాకా వినియోగిం చుకున్న జలాలుపోనూ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, మధ్యతరహా ప్రాజె క్టుల్లో కనీస నీటి మట్టాలకుపైన లభ్యతగా ఉన్న జలాలకు, తుంగభద్ర డ్యామ్‌లో రెండు రాష్ట్రాల వాటా నీటిని కలుపుకొంటే మొత్తం 331.708 టీఎంసీల లభ్యత ఉంటుందని వివరించారు. ఇందులో ఏపీ వాటా 171.163 కాగా, తెలంగాణ వాటా 160.545 టీఎంసీలని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పందిస్తూ.. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను ఖరీఫ్ పంటలు పూర్తయిన తర్వాత తేలుద్దామన్నారు. ఈనెల 15 వరకు రెండు రాష్ట్రాలు అవసరమైన మేరకు నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసింది. కాగా నెలాఖరులోగా రబీ నీటి అవసరాలకు ప్రతిపాదనలను పంపాలన్న బోర్డు సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. -
ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య మంగళవారం జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్‌ను అమలు చేయనున్నట్లు కేఆర్ఎంబీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. 'విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోకపోతే మాకు అంగీకారం కాదని చెప్పాము. శ్రీశైలం, సాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏపీ ఆమోదించింది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ ఇస్తుందో లేదో మాకు తెలియదు. మిగతా విషయాలు బోర్డు చూసుకోవాలి. రెండు మూడు నెలలు సంధికాలం ఉంటుంది' అని ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలారావు అన్నారు. తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మాట్లాడుతూ.. '65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్నోటిఫికేషన్ ఆపాలని కోరాం. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ కోరింది, మేము అంగీకరించలేదు. మాకు విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పాం. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా అడిగాం' అని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. చదవండి: (తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ) -
కొనసాగుతున్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు. -
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ
సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీకి ఏపీ వాస్తవాలు వివరించింది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ జెన్కో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ఇవీ చదవండి: కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! కర్నూలులో ఓ భక్షక భటుడి లీలలు.. -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ
న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నివేదిక నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని ఎన్జీటీ వెల్లడించింది. ఆగస్టు 27కల్లా నివేదిక దాఖలు చేయాలని కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. కేఆర్ఎంబీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. అయితే జులై 7వ తేదీనే పనులు నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. కేఆర్ఎంబీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏపీ న్యాయవాదులకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సూచించింది. -
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్ తీర్మానం
-
తెలంగాణతో జలవివాదం: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్ దృష్టిసారించింది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ బుధవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా... శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్ తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ అయింది. కాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ -
‘రాయలసీమ ఎత్తిపోతల’ పరిశీలనకు కృష్ణా బోర్డు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పరిశీలనకు కృష్ణా బోర్డు సిద్ధమవుతోంది. ఓ పక్క జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అందిన ఆదేశాలు, మరోపక్క కేంద్ర జల శక్తి శాఖ నుంచి పెరిగిన ఒత్తిడి. వీటికితోడు తెలంగాణ రాసిన లేఖ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసుకుంటోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో పాటే గతంలో ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని లేఖలో కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం సైతం దీనిపై త్వరగా తేల్చి తమకు నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ బోర్డుకు సూచించింది. దీంతో కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సోమవారం సభ్యులతో భేటీ అయ్యారు. బోర్డు సభ్యులు హరికేశ్ మీనా, లుతాంగ్, సభ్య కార్యదర్శి దేవేందర్ తదితరులతో ఆయన పర్యటన విషయమై చర్చించారు. అయితే ఇప్పటికే పర్యటనకు సంబంధించి ఓ నోడల్ అధికారిని నియమించాలని ఏపీని కోరిన విషయాన్ని సభ్యులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. గతంలో పర్యటన చేస్తామని చెప్పిన సమయంలో ముందుగా తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాలంటూ ఏపీ లేఖ రాసిందని, అయితే నోడల్ అధికారి నియామకంపై మాత్రం ఇంతవరకు స్పందించలేదని వెల్లడించారు. మంగళవారం ఉదయం వరకు వేచిచూసి సాయంత్రానికి రాయలసీమ ప్రాజెక్టు పర్యటన షెడ్యూల్ ఖరారు చేయాలని, అవసరం అయితే కేంద్రానికి సమాచారం అందించి భద్రత కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి వారం, పది రోజుల్లో వాస్తవాలను కేంద్రానికి నివేదించాలని సభ్యులు దృఢ సంకల్పంతో ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. -
Hydero Power: 100% జల విద్యుత్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వాటి స్థాపిత సామర్థ్యంలో గరిష్టంగా 100% వరకు ఉత్పత్తి జరపాల్సిందిగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో ఈ అంశంపై చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘రాష్ట్ర రైతాంగం ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి జలాలను ఎత్తిపోయ డం తప్ప రాష్ట్రానికి మరో మార్గం లేదు. దీనికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 2,500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల నుంచి చాలా తక్కువ విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని 100% స్థాపిత సామర్థ్యంతో జలవిద్యుదుత్పత్తి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ జెన్కో సీఎండీని ఆదేశించారు. సాధ్యమైనంత అధికంగా ఉత్పత్తి: జెన్కో సాగు ప్రాజెక్టుల నిర్మాణం, నదీ జలాల విని యోగం విషయంలో గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నడుస్తుండ డం, ఇటీవల తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి లభ్యత, రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు జలవిద్యుదుత్పత్తి చేశామని, ప్రభుత్వ ఆదేశాలతో సాధ్యమైనంత అధికంగా ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని తెలంగాణ జెన్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్ర జెన్కోకు కేఆర్ఎంబీ లేఖ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం తక్షణమే నిలిపి వేయాలని కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో హైడల్ విభాగం డైరెక్టర్‌కు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా విద్యుదుత్పత్తి చేస్తుండగా, ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువకు నీటి విడుదలను నిలుపుదల చేయాలని ఈ నెల 23న కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే శ్రీశైలం జలాశయానికి వచ్చిన మొత్తం 8.98 టీఎంసీల జలాల్లో 3.09 (34శాతం) టీఎంసీలను జల విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ కిందకు విడుదల చేసిందని, శ్రీశైలంలో కనీస నిర్వహణ స్థాయి అయిన 834 అడుగుల కన్నా తక్కువగా నీటి మట్టం ఉందని పేర్కొంటూ అదేరోజు ఏపీ ప్రభుత్వం మరోసారి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. -
కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్ ఇటీవల వరకు ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్ ఆర్గనైజేషన్) సీఈవోగా పనిచేయగా.. జూన్ 1న ఆయనకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ఎంïపీ సింగ్ సర్థార్ సరోవర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేసిన పరమేశం మే 31న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కేఆర్ఎంబీ ఇన్చార్జి చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ (గ్రూప్–ఏ) సర్వీసెస్ (సీడబ్ల్యూఈఎస్) హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ (హెచ్ఏజీ)గా పదోన్నతి పొందిన ఎంపీ సింగ్‌ను సీడబ్ల్యూఎస్ హెచ్‌ఏజీగా పరిగణిస్తూ.. ఈ నెల 1 నుంచి బాధ్యతలు స్వీకరించే వరకు జీతభత్యాలు కేఆర్ఎంబీ చెల్లించాలని పేర్కొంది. చదవండి: Andhra Pradesh: ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అరుదు 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగింది -
కృష్ణా బోర్డే సుప్రీం
సాక్షి, అమరావతి: నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై కృష్ణా బోర్డు పంపిన ముసాయిదాపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ ముసాయిదాను ఆమోదించడం ఇక లాంఛనమే. జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు సరపడా ఉన్నా.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో బోర్డు కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ♦ కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం) –2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాదనను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ♦ కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకు 2015లో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు చేస్తామని తేలి్చచెప్పారు. (కేంద్రం కోర్టులోకి ‘నియంత్రణ’) కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు తుంగభద్ర నదిపై.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెచ్చెల్సీ తుమ్మిళ్ల ఎత్తిపోతల ఎల్లెల్సీ - కేసీ కెనాల్ ఆర్డీఎస్ కృష్ణా నదిపై.. జూరాల ప్రాజెక్టు: తెలంగాణ 1.జూరాల ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం 2.జూరాల కుడి కాలువ, ఎడమ కాలువ 3.భీమా ఎత్తిపోతల 4.నెట్టెంపాడు ఎత్తిపోతల 5.కోయిల్‌సాగర్ ఎత్తిపోతల శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, (తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి) 1.కల్వకుర్తి ఎత్తిపోతల 2.కుడి విద్యుత్కేంద్రం 2.ఎడమ విద్యుత్కేంద్రం 3.హంద్రీ–నీవా (మల్యాల) 3.పాలమూరు–రంగారెడ్డి, డిండి 4.హంద్రీ–నీవా (ముచ్చుమర్రి) 4.ఎస్సెల్బీసీ 5.వెలిగొండ - నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ 1.సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2.జలవిద్యుత్కేంద్రం 3.ఏఎమ్మార్పీ 4.ఎఫ్ఎఫ్సీ 5.హైదరాబాద్ తాగునీటి పథకం పులిచింతల ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే 1.జలవిద్యుత్కేంద్రం ప్రకాశం బ్యారేజీ 1.కృష్ణా డెల్టా కాలువలు చిన్న నీటి వనరుల విభాగం: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.భైరవానితిప్ప ప్రాజెక్టు 1.సీతారామభక్త ఎత్తిపోతల 2.గాజులదిన్నె ప్రాజెక్టు 2.డిండి ప్రాజెక్టు 3.మూసీ ప్రాజెక్టు 4.పాలేరు ప్రాజెక్టు.. తదితర చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ► కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 23న బోర్డు పరిధిపై ముసాయిదాను కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం కేంద్రానికి పంపారు. దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ► ఈ ప్రాజెక్టుల స్పిల్ వే లతోపాటు జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు బోర్డు పరిధిలోకి తేవాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన భైరవానితిప్ప, గాజులదిన్నె, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులు, సీతారామభక్త ఎత్తిపోతల పథకాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ ముసాయిదాపై ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోద ముద్ర వేశారు. ఇక ఆ శాఖ మంత్రి ఆమోద ముద్ర వేయగానే బోర్డు పరిధిని కేంద్రం నోటిఫై చేయనుంది. ► ఈ ప్రాజెక్టుల వద్ద పనిచేసే ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు పరిధిలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి లభ్యతను బట్టి.. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమై వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది. () -
ఇక బోర్డే బాస్!
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి జవసత్వాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బోర్డు పరిధి, కార్య నిర్వాహక నియమావళి (వర్కింగ్ మాన్యువల్)ను తక్షణమే ఖరారు చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్ మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన ఆరున్నరేళ్ల తర్వాత పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయడం ద్వారా బోర్డుకు పూర్తి స్థాయిలో అధికారాలను కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధం కావడం గమనార్హం. కృష్ణా జలాల పంపిణీ, వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని విభజన చట్టం సెక్షన్-85లో కేంద్రం పేర్కొంది. ఆ మేరకు కృష్ణా బోర్డును ఏర్పాటు చేస్తూ 2014 మే 28న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లో అదనపు కార్యదర్శి స్థాయి అధికారిని బోర్డు చైర్మన్‌గానూ, సీఈ స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగానూ, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ఇంజనీర్- ఇన్-చీఫ్‌లను సభ్యులుగా, జలవిద్యుత్ నిపుణుడిని బోర్డు సభ్యుడిగా నియమించాలని అందులో పేర్కొన్నారు. అయితే విభజన చట్టం సెక్షన్-85(2)కు విరుద్ధంగా కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. వివాదాలు ఇలా... కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి (కేడబ్ల్యూడీటీ)-2 తీర్పును కేంద్రం నోటిఫై చేసే వరకూ బోర్డు పరిధిని ఖరారు చేయరాదని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తుండటంతో ఇప్పటిదాకా పరిధిని ఖరారు చేయలేదు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణకు కేంద్రం అప్పగించింది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ తన అధీనంలోకే తీసుకోవడం వివాదాలకు దారి తీసింది. నీటి వాటాల కేటాయింపు... ఉమ్మడి రాష్ట్రంలో నైసర్గిక స్వరూపం ఆధారంగా కేడబ్ల్యూడీటీ-1 ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం కేడబ్ల్యూడీటీ-2 గడువును కేంద్రం పొడిగించింది. ఆ తీర్పు వెలువడే వరకూ కేడబ్ల్యూడీటీ-1 తీర్పు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీల నిష్పత్తిలో వాటాలను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుల మేరకు నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును నిర్దేశించింది. ఇన్నాళ్లూ అధికారాలు లేకపోవడంతో... - పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయకపోవడంతో బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. - నీటి కేటాయింపులు చేస్తూ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కిన రాష్ట్రంపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. - బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు నీటిని తరలించడం.. సాగర్ కుడి, ఎడమ కాలువలకు కేటాయించిన నీటిని విడుదల చేయకుండా మోకాలడ్డటం ద్వారా ఏపీ ప్రయోజనాలను తెలంగాణ దెబ్బతీస్తూ వస్తోంది. - విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీల పరిశీలనకు డీపీఆర్‌లను పంపకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, ఎత్తిపోతలను తెలంగాణ సర్కారు కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ సామర్థ్యాలను పెంచింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసినా బోర్డు చర్యలు తీసుకోలేకపోయింది. బోర్డు అధీనంలోకి శ్రీశైలం, సాగర్.. తమ ప్రయోజనాలకు తెలంగాణ విఘాతం కలిగిస్తున్నందున బోర్డు పరిధిని నోటిఫై చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపినప్పటికీ బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పరిధిని నోటిఫై చేస్తే శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ఆ ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ అధికారులు బోర్డు పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది. ఇరు రాష్ట్రాల బేసిన్లో ప్రాజెక్టుల ద్వారా కేటాయింపులు, విడుదల, వినియోగించిన నీటిని ఎప్పటికప్పుడు టెలీమీటర్ల ద్వారా బోర్డు లెక్కిస్తుంది. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు. -
కృష్ణా బోర్డు కేటాయింపులు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచిం చింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించితుది నిర్ణయం తీసుకుందామని కృష్ణా బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా అధ్యక్షతన బోర్డు గురువారం సమావేశమైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి ఎ. పరమేశం వివరించారు.. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పందిస్తూ.. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు వి/æ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం ఉందని.. అప్పుడు వారిరువురూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కనీస నీటి మట్టాలకు ఎగువన 233 టీఎంసీలు.. కాగా, రబీలో సాగు, వేసవిలో తాగునీటి అవసరాలకు 98 టీఎంసీలు కేటాయించాలని ఏపీ, 157 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనలపై బోర్డు చర్చించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 66, తెలంగాణకు 34 శాతం చొప్పున కేటాయిస్తూ కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఈ ఏడాది నీటి కేటాయింపులు చేస్తామని బోర్డు స్పష్టంచేసింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టాలకు ఎగువన ప్రస్తుతం 233 టీఎంసీల నీరు ఉందని.. ఆవిరి నష్టాలు తీసివేయగా మిగిలిన 224 టీఎంసీల్లో ఏపీకి 84, తెలంగాణకు 140 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇదిలా ఉంటే.. రెండో దశలో టెలీమీటర్ల ఏర్పాటుకు అవసరమైన నిధులను బోర్డుకు విడుదల చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సర్కార్ తరఫున ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎజెండా రెడీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ నెల 11న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కృష్ణాబోర్డు, తెలంగాణ సమాయత్తమవుతున్నాయి. సమా వేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు, చేయాల్సిన అభ్యర్థనలపై కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగిరం చేశాయి. ఇప్పటికే కృష్ణా బోర్డు నాలుగైదు ప్రధానాంశాలతో ఎజెండా సిద్ధం చేయగా, తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ప్రధానంగా గోదావరి మళ్లింపు జలాల అంశం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్రం ఈ నెల 11న కీలక సమావేశం ఏర్పాటు చేయనుండగా, ఇందులో నాలుగు ప్రధాన అంశాలను కేంద్రం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. ప్రధానంగా ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న గోదావరి మళ్లింపు జలాల అంశాన్ని చర్చించనుంది. పట్టిసీమ, పోలవరంల ద్వారా గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తే, అందులో వాటాగా తెలంగాణ 80 టీఎంసీల మేర కృష్ణా జలాలు వాడుకునే అంశంపై స్పష్టత కోరనుంది. దీంతో పాటే చెన్నై తాగునీటి అవసరాలకు నీటి సరఫరా అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించనుంది. సమయానుకూలంగా ఇరు రాష్ట్రాల తమ వాటా మేరకు నీటిని విడుదల చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్ణయించింది. వీటితో పాటే ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ అంశం ప్రతిసారీ బోర్డు సమావేశాల్లో చర్చకు వస్తున్నా, దీనికి ఓ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. గతంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చినా పనులు మాత్రం పూర్తవలేదు. ఈ దృష్ట్యా దీనికి పరిష్కారం వెతకనున్నారు. ఇటు టెలిమెట్రీ ఏర్పాటును బోర్డు తెరపైకి తెస్తోంది. నిధులపైనే ఫోకస్.. ఇక తెలంగాణ మాత్రం ఈ భేటీ ద్వారా బహుళార్ధక సాధక ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవాలన్న భావనలో ఉంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు.. అయితే జాతీయ హోదా, లేని పక్షంలో ఇప్పటికే కేంద్రం ముందుంచిన మాదిరి నీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం కోరేందుకు సిద్ధమైంది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల పనులు పూర్తి చేసినందున, మిగిలిన పనుల పూర్తికి కేంద్ర సాయాన్ని కోరనుంది. ఇటు ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా 30 వేల చెరువులకు పైగా పునరుద్ధరించినందున వాటికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేయనుంది. దీంతో పాటే కృష్ణా జల వివాదాలకు సత్వర పరిష్కారం, ట్రిబ్యునల్‌లో కొత్త సభ్యుడి నియామకంపైనా తెలంగాణ ప్రస్తావించేందుకు నిర్ణయం తీసుకుంది. -
‘తెలంగాణకు నీటిని నిలిపేయండి’
సాక్షి, హైదరాబాద్: నీటి వినియోగంపై తెలంగాణ–ఏపీ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం తలెత్తేలా ఉంది. తెలంగాణకు నీటి సరఫరా నిలిపివేయాలంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తాజాగా ఏపీ లేఖ రాయడమే ఇందుకు కారణం. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఏపీకి 63.13 శాతం, తెలంగాణకు 36.87 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఏపీ మొత్తం 75.74 శాతం నీటిని వినియోగించుకుంది. అంటే పది శాతం నీటిని అధికంగా వాడుకుంది. తెలంగాణ విషయానికి వస్తే... 24.26 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంది. తెలంగాణ కేవలం 34.10 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోగా.. ఇంకా 48.4 టీఎంసీలను వాడుకోవాల్సి ఉంది. అయితే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ)కు పంపకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఇప్పటికే 110 టీఎంసీలు తీసుకెళ్లింది. తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నందున, తెలంగాణ శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా నీటిని ఎన్ఎస్పీకి విడుదల చేస్తే నీటి మట్టం తగ్గి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ బోర్డుకు లేఖ రాసింది. -
6న కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్ : వర్షాల ఆరంభానికి ముందే నెలాఖరులోగా జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం జూన్ 6వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే నిర్ణయించిన ఎజెండా అంశాలపై సమావేశంలోనే చర్చిద్దామంటూ బోర్డు కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. నిజానికి ఈనెల 28న బోర్డు సమావేశం నిర్వహించాలని తెలంగాణ కోరగా, ఏపీ అభ్యంతరం తెలుపుతూ, జూన్ 1న సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో తమకు వీలుపడదని తెలంగాణ స్పష్టం చేయడంతో బోర్డు సమావేశ తేదీని 6న ఖరారు చేసింది. -
నిత్యం నన్నే తలుచుకోండి
♦ జన్మభూమి సభలో చంద్రబాబు వేడుకోలు ♦ చేస్తున్న మేలుకు కృతజ్ఞులై ఉండండి ♦ సభికులతో ప్రతిజ్ఞ చేయించిన సీఎం సాక్షి ప్రతినిధులు, శ్రీకాకుళం/ విజయనగరం: ‘చంద్రన్న బీమా అమలు చేస్తున్నా. తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌లు పెట్టించా. పండుగలకు కానుకలు ఇస్తున్నా. ఇంకా ఎన్నో చేస్తున్న నన్ను గుర్తు పెట్టుకోవాలా... వద్దా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్న వారంతా నన్నే తలుచుకోవాలి. చేస్తున్న మేలుకు కృతజ్ఞతలు చెప్పండి. నిత్యం గుర్తుంచుకోవాలి. ఆశీర్వదించాలి..’ అంటూ సీఎం చంద్రబాబు ప్రజలను ప్రాధేయపడ్డారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించు కున్నారు. బాబు వైఖరి సభికులకు నవ్వు తెప్పించింది. మరోవైపు శిక్షణ ఇచ్చిన వ్యక్తుల చేత మాట్లాడించడం, ఆద్యంతం పొగిడించుకోవడంతో జన్మభూమి సభలు టీడీపీ సభలను తలపించాయి. జన్మ భూమి–మా ఊరు లో భాగంగా శుక్రవారం బాబు శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా ద్వారపూడిలో నిర్వహిం చిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజాంలో సీఎం అంతా తానై రెండు గంటల పాటు సభ నడిపించారు. ‘జీవితంలో ఎదగ డానికి ఎంతో మేలు చేసిన ప్రకృతి, తల్లి దండ్రులు, గురువులు, జన్మభూమి, ప్రభు త్వం... ఈ ఐదింటిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఆ మాదిరిగానే ఎన్నో చేస్తున్న నాకు కూడా నిత్యం కృతజ్ఞులై ఉండాలి..’ అని పదేపదే అన్నారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను జన్మభూమి ప్రతిజ్ఞలోనూ చేర్పించి అందరితోనూ పలికించారు. ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు: సీఎం సాక్షి, అమరావతి: నీటి కొరత ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవు తున్నాయని కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ హెచ్‌కే హల్దార్‌ను విజయవాడలో కలసి సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. -
ఏపీకి తక్షణమే 4 టీఎంసీలు
- రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాశారు. ఈ నెల 20న జరిగిన త్రిసభ్య కమిటీ భేటీలో చర్చకొచ్చిన కొన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) నుంచి 2 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకుందని గుర్తుచేశారు. శ్రీశైలంలో పెరిగిన నీటిమట్టం కర్ణాటకలోని జలాశయాల నుంచి జూ రాలకు వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరడంతో ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోంది. దీంతో జూరాల దిగువనున్న శ్రీశైలానికి నీరు వచ్చి చేరుతోంది. సోమవా రం సైతం శ్రీశైలానికి 31,692 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. దీంతో ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 28.29టీ ఎంసీల నీటి లభ్యత ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 9.28 టీఎంసీల నిల్వ ఉంది.