kuna ravikumar
-
వైరల్ గా మారిన టీడీపీ నేత కూన రవికుమార్ బూతు పురాణం
-
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్
-
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం: ఏడు రోజులుగా అజ్ఞాతంలో వున్న టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పొందూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయారు. ఆయనను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్‌కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయిన సంగతి విదితమే. చదవండి: కూన తీరు మారదు.. పరుగు ఆగదు! ‘కూన’ గణం.. క్రూర గుణం -
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మళ్లీ పరారయ్యారు. ఫ్రస్టేషన్‌తో దాడులకు దిగడం, ఆపై పారిపోవడంలో కూన రవికుమార్ హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ సాధిస్తున్నారు. పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అంశం, పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అవుతారన్న భయంతో మళ్లీ ముందస్తుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపైన నమో దైన కేసుల మేరకు అరెస్టు చేసేందుకు శనివారం పోలీసులు ప్రయత్నించగా అప్పటికే ఎక్కడికో ఉడాయించేశారు. ఇప్పుడాయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్న కూన రవికుమార్ వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. ఎప్పటిలాగే దురుసుగా వ్యవహరిస్తూ జిల్లాలో అశాంతికి కారణమవుతున్నారు. అటు వైఎస్సార్సీపీ నాయకులపైన, ఇటు అధికారులపైన దాడులకు ప్రోత్సహించడంతో ఆమదాలవలస నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొంటోంది. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త తమ్మినేని మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. ఇదంతా కూన రవికుమార్ అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా ఇలా చూడు.. బైఎలక్షన్ వస్తుందని బెదిరింపులకు దిగారు. దీంతో కూన రవికుమార్ అండ్‌కోపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ పొందూరు పోలీ సు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే దాడి జరిగిన రోజున శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నింస్తుండగా పోలీసు అధికారుల వి ధులకు కూడా కూన ఆటంకం కలిగించారు. ఈ రెండు విషయాల్లో తనను విచారించి, అరెస్టు చేస్తారన్న భయంతో కూన పరారీ అయిపోయారు. శనివారం శ్రీకాకుళం టౌన్ పోలీసులు కూన రవికుమార్ కోసం ఆయన ఇంటికి వెళ్లి గాలించారు. అప్పటికే కూన రవికుమార్ పరారీలో ఉండటంతో వెనక్కి వచ్చేశారు. ఆయన శుక్రవారమే ఉడాయించారని, ఎప్పటిలాగే ముందస్తు బెయిల్ కోసం ప్ర యతి్నస్తున్నారని ఆ పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. అప్పట్లో కూడా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గత ఏడాది అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేయడానికి నరసన్నపేట పోలీసు స్టేషన్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు టీడీపీ నాయకులు యతి్నస్తుండగా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కూన రవికుమార్ తీవ్రస్థాయిలో నోరు పారేసుకున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మా న్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత ..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడారు. అంతకుముందు పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాల ని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘నేను ఖాళీ చేయను, నువ్వు మర్యాదగా బీహేవ్ చేస్తే ఫరవాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని కూన రవికుమార్ బెదిరించారు. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా అంటూ బెదిరింపులకు దిగారు. అంతకుముందు పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చా రు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తానంటూ’ అంటూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చున్నా లా క్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని.. పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భ యపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్‌డీపైనా విరుచుకుపడ్డారు. ‘నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమా రే కాదు. నీ బతుకెంతరా నా కొడకా...’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్‌ను పరుష పదజాలంతో బెదిరించారు. చదవండి: దేవినేని ఉమాపై సీఐడీ కేసు చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు -
‘కూన’ గణం.. క్రూర గుణం
వరుసగా ఎదురవుతున్న పరాజయాలతో కాలు నిలవని అసహనం.. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాలను తట్టుకోలేని మనస్తత్వం.. ఏళ్ల తరబడి చలాయించిన ఆధిపత్యానికి గండి పడుతూ ఉంటే.. భవిష్యత్తులో తలవంచి నిలబడే పరిస్థితి కళ్లెదుట కనబడుతూ ఉంటే.. ఏం చేయాలో పాలుపోని భయం. ఇవన్నీ కొందరిలో కక్షలను రెచ్చగొడుతున్నాయి. కార్పణ్యాలను ఎగదోస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల స్థానిక పోరు వరకు ప్రతి దశలోనూ వెక్కిరిస్తున్న ఫలితాలు కసిని ప్రేరేపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లోనూ అపజయం అనివార్యమయ్యేట్టు కనిపిస్తూ ఉంటే.. నాయకులమంటూ తెగ మిడిసిపడ్డ వారిలో ఈర్ష్యాద్వేషాలు బుసకొడుతున్నాయి. అవి విషమించి దాడులకు దారిచూపుతున్నాయి. గురువారం ఎన్నికల తరువాత ఇటువంటి అరాచక పరిస్థితులే అగుపించి ప్రజలను నిర్ఘాంతపోయేలా చేశాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అనుచర గణాలు గురువారం రాత్రి పెనుబర్తి ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మరళీ కృష్ణ ఇంటిపై దౌర్జన్యానికి దిగడం.. అతడిని బెదిరించి, భయపెట్టి తీవ్రంగా హెచ్చరించడమే కాక, విలువైన ఆస్తులను ధ్వంసం చేయడం చూస్తూ ఉంటే.. పరిస్థితులు ఎటు దారి తీస్తాయోనన్న భయాందోళనలు అందరిలో ముప్పిరిగొంటున్నాయి. పొందూరు: పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో.. పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణను లక్ష్యంగా చేసుకుని మాజీ విప్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ వర్గీయులు మరణాయుధాలు, కర్రలతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఇప్పటికే సొంత గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన రవికుమార్ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఓటమి తప్పదని వచ్చిన సంకేతాలను జీర్ణించుకోలేక గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై, పంచాయతీ కార్యాలయంపై దాడి చేశారు. ఓటమిని ఎదుర్కోలేక రవికుమార్ దాడులకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పెనబర్తి అలమాజీపేటకు చెందిన తమ వర్గీయులతో కూన రవికుమార్ నేరుగా ఎంపీటీసీ అభ్యర్థి నివాసంపై దాడికి పూనుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాగ్వాదానికి దిగారు. అదే అదునుగా కొంతమంది మురళీ ఇంటిపై దాడిచేసి ఏసీలు, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. ఖరీదైన రెండు కార్లను పగలగొట్టారు. దీంతో భయాందోళనకు గురైన మురళీ, భార్య ఝాన్సీరాణి(సర్పంచ్) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమకు ప్రాణభయం ఉందని తెలిపారు. తమతో పాటు వైఎస్సార్సీపీ ముఖ్య అనుచరులను చంపేస్తామని భయపెడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో అసహనానికి గురైన రవికుమార్ హత్యలు చేయించేందుకు ప్రయత్నించడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పటికీ రక్షణ లేకుండాపోయిందని వాపోయారు. ఘర్షణలకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీతో కూన వాగ్వాదం కారులో పెనుబర్తి నుంచి వెళ్తున్న కూన రవికుమార్‌ను డీఎస్పీ మహేంద్ర నిలువరించారు. దీంతో తనను ఆపినందుకు డీఎస్పీతో ఆయన వాగ్వాదానికి దిగారు. రెండేళ్లలో అధికారంలోకి వస్తామని, ఎక్కడున్నా నిన్ను గుర్తుపెట్టుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. చదవండి: పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ.. -
అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల బహిష్కరణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమారే ధిక్కరించారు. చంద్రబాబు చెప్పినట్టుగా తాము వ్యవహరించాల్సిన అవసరం లేదన్నట్టుగా పరిషత్ ఎన్నికల బరిలో ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎన్నికలు బహిష్కరించాలని ప్రెస్‌మీట్ పెట్టి మరోవైపు తన నియోజకవర్గంలో బరిలో ఉన్న వారందరినీ ప్రచారం చేయించడంలో కూన రవికుమార్ ఘనత వహించారు. తన సొంత గ్రామమైన ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని కోటిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో తన భార్య కూన ప్రమీల తరఫున ఆది వారం నేరుగా ఆయన ప్రచారం చేశారు. ఇదే బాటలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుపై తిరుగుబావుటా ఎగురవేసి ఎన్నికల బరిలో నిలబడతామంటున్నారు. కాదంటే అవుననిలే... టీడీపీ డ్రామాలాడే పార్టీ అని మరోసారి నిరూపించుకుంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అదే విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో ఆ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో తాము భిన్నమని ఆ పార్టీ నేత లు నిరూపిస్తున్నారు. చెప్పిందేదీ చేయమన్నట్టు గా సాక్షాత్తూ కూన రవికుమారే అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేశారు. ఒకవైపు పార్టీ శ్రేణులంతా ఎన్నికలు బహిష్కరించాలని పిలుపుని చ్చి మరోవైపు తన భార్య ప్రమీల పోటీ చేస్తున్న పొందూరు మండలంలోని కోటిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్లో ఆదివారం ప్రచారం చేపట్టారు. కేడర్‌కు ఒక పిలుపునిచ్చి, ఆ పిలుపును తానే విస్మరించి ప్రచారం చేయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. ఇక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం, కళా వెంకటరా వు నియోజకవర్గమైన ఎచ్చెర్ల, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట తదితర నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పెట్టి పోటీ చేయాలని తీర్మానాలు చేసుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: చంద్రబాబుపై ‘తిరుగు’బావుటా! ఇక సన్యాసమే శరణ్యమా! -
జాగ్రత్త.. ఎవడక్కడ.. ఎవరాయ్ అక్కడ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం /నరసన్నపేట: ‘జాగ్రత్త.. ఇలాగే ఉంటుందనుకుంటున్నారా.. లిస్టు ఎక్కిపోతే మీరు శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త... ఎవడక్కడ.. ఎవరాయ్ అక్కడ.. ఏంటీ మీరు డిస్కస్ చేసేది.. నువ్వు డిస్కస్ చేసేదేంటి? మీ స్థాయి ఎంత ..మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి మాజీ విప్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ నోరు పారేసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు సీఐ, ఎస్ఐలు నిశ్చేష్టులయ్యారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదా స్పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా కోవిడ్ నిబంధనల మేరకు ముగ్గురే లోపలకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలంటూ పోలీసులు గేట్‌ను క్లోజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన కూన రవికుమార్ తదితరులు పోలీసు లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కూన రవికుమార్ మరోమారు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. అయితే పోలీసులు సంయమనం పాటించారు. దీంతో వారంతా గేట్ వద్దే బైటాయించి పోలీసులపై దుర్భాషలాడారు. (చదవండి: ఆగని టీడీపీ నేత ‘కూన’ ఆగడాలు) కూన రవికుమార్కి ఇదేమీ కొత్త కాదు. నోటి దురుసుతో మాట్లాడటం ఆయనకు అలవాటైపోయింది. ఆ మధ్య ఎంపీడీఓను, ఆ తర్వాత పంచాయతీ విస్తరణా«ధికారులు, వీఆర్ఓలను, తదుపరి తహసీల్దార్‌ను ఇష్టారీతిన తిట్టారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై బయట ఉన్నారు. కానీ ఆయన తీరులో మాత్రం మా ర్పు రాలేదు. ఇన్ని కేసులు, ఆరోపణలు ఉన్నా చంద్రబాబు ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో ఏకంగా పోలీసులపైనే విరుచుకుపడ్డారు. (చదవండి: అంతే వీరు.. మారదు తీరు) కూన బాగోతమిది పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీని బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అంటూ రెచ్చిపోయారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌ను బెదరింపులతో పాటు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. తాజాగా పోలీసులతోనూ ఇష్టారీతిన మాట్లాడారు. కరోనా నిబంధనల దృష్ట్యా గేటు వేస్తే వీరంగం సృష్టించారు. చివరికి ఉన్నతాధికారుల అనుమతి, శాంతి భద్రతల దృష్ట్యా కొద్ది మందిని పోలీసులు లోపలికి అనుమతించడంతో ఫిర్యాదు ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అశోక్, పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకటరావు, మాజీ ఎమ్మెల్లే బగ్గు రమణమూర్తి, చౌదరి బాబ్జీలు ఉన్నారు. -
ఆగని టీడీపీ నేత ‘కూన’ ఆగడాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన పంథా మార్చుకోవడం లేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అరెస్టై... బెయిళ్లతో బయట తిరుగుతున్న రవికుమార్.. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా ఫోనుల్లోనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇక తన మాట వినని వారు ఎదురుగా కనబడితే ఇంకెంత దురుసుగా వ్యవహరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తనను ఎవరేం చేయలేరు... మహా అయితే కేసులు పెడతారు... బెయిల్‌పై వచ్చేయవచ్చు అనే ధోరణితో రెచ్చిపోతున్నారు. జిల్లాలో వివాదాస్పద నాయకుల్లో తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా కూన రవికుమార్ వ్యవహరిస్తున్నారు. ఇంటి యజమానికి బెదిరింపు పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వారి్నంగ్ ఇచ్చారు. ‘నేను ఖాళీ చేయను. నువ్వు మర్యాదగా బిహేవ్ చేస్తే పరవాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంద’ని బెదిరించా రు. తన ఇబ్బందుల గురించి ఆలోచించమని గుడ్ల మోహ న్ అడిగితే ‘నాకనవసరం, నీ గురించేంటి తొక్క.. ఆలోచించేద’ని కూన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సరే మీ ఇష్టం సార్’ అని గుడ్ల మోహన్ అంటూ ఉండగా ‘నువ్వు గాని మర్యాద తప్పి ప్రవర్తిస్తే నేనూ మర్యాద తప్పుతాన’ని మళ్లీ బెదిరించారు. ‘మీరు ఏది చేస్తే అది చేసేయండి.. చంపేస్తే చంపేయండి సార్’ అని గుడ్ల మోహన్ అనడంతో ‘అంతే చేస్తాను. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే అంతే చేస్తా’ అని ఫోన్ కాల్ ముగించారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఖాళీ చేయనని చెబుతున్న భవనం ఇదే.. (ఇన్సెట్) గుడ్ల మోహన్, భవన యజమాని ఈ ఫోన్ సంభాషణ చూస్తుంటే రవికుమార్‌కు ఏదైనా ఇస్తే.. మళ్లీ తిరిగి తీసుకోవడం కష్టమే’ అన్న భావన కలిగించడంతోపాటు ఇచ్చినదేదైనా వదులుకోవల్సిందే అన్నట్టుగా స్పష్టమవుతోంది. పొరపాటున ఎవరైనా తనకు గాని, తన అండ ఉన్న వారికి గాని ఇళ్లు గాని ఏదైనా చేబదులు గానీ ఇస్తే అంతే సంగతులు అనుకునే పరిస్థితి కనబడుతోంది. మొన్నటి వరకు మండల స్థాయి అధికారులను బెదిరించిన సంఘటనలు చూశాం. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఆయనెప్పుడు ఎవర్ని ఏమంటారో.. ఏం చేస్తారో.. తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్టుగానే నడుచుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడే ఇలా వ్యవహరిస్తున్నారంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత రెచ్చిపోయేవారో అర్థం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నోరు కాదు... పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే ‘తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తానం’టూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కురీ్చలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై అంతెత్తున లేచారు. ‘నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా...’ అంటూ తీవ్ర ఆగ్రహావేశాలు చూపించారు. మొన్నటికి మొన్న మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహశీల్దార్‌కు బెదరింపులతోపాటు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లయింట్ చేస్తాను. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా?’ అంటూ రాయలేని భాషలో ఒక మండల మేజి్రస్టేట్గా ఉన్న పొందూరులో పనిచేసిన తహసీల్దార్‌ను ఇష్టారీతిన మాట్లాడారు. తాజాగా ఒకప్పుడు తనకు సన్నిహితునిగా ఉన్న గుడ్ల మోహన్ అనే వ్యక్తి తన భవనాన్ని ఖాళీ చేయమన్నందుకు నోటికొచ్చినట్టు మాట్లాడి బెదిరింపులకు దిగారు. తనతోపాటు లేరని, ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారనే అక్కసో మరేంటో తెలియదు గాని భవనం ఖాళీ చేయమన్నందుకు దురుసుగా మాట్లాడారు. ఈ రకంగా తరచూ బెదిరింపులకు దిగడంతో స్థానికులు భయపడుతున్నారు. కూన రవికుమార్ అంటేనే హడలెత్తిపోతున్నారు. ఉద్యోగులైతే మరింత ఆందోళన చెందుతున్నారు. ఎన్ని కేసులు నమోదైనా తన తీరు మారలేదని బాధితులు వాపోతున్నారు. తప్పులు చేసి, దౌర్జన్యాలకు పాల్పడి.. పోలీసులు చర్య తీసుకోబోతే.. ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఎదురుదాడికి దిగడం, హల్చల్ చేయడం రవికుమార్‌తోపాటు ఆ పార్టీ వర్గాలకు అలవాటైపోయింది. కూన రవికుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు పొందూరు: మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను ఫోన్లో బెదిరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడ్ల మోహన్ ఫిర్యాదు చేశారని ఎస్సై కొల్లి రామకృష్ణ తెలిపారు. మండల కేంద్రంలో గుడ్ల మోహన్‌కు చెందిన భవనంలో చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కొనసాగుతోందని చెప్పారు. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కార్యాలయం ఉందని, కొన్ని నెలల క్రితం తాను వైఎస్సార్సీపీలో చేరానని అందుకే పార్టీ కార్యాలయం రంగులు మార్చేందుకు ప్రయత్నించామని ఫిర్యాదులో ఉంది. భవనానికి రంగులు మారుస్తుండగా కూన రవికుమార్ ఫోన్ చేసి బెదిరించారని, బిల్డింగ్ వద్దకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. -
మరోసారి టీడీపీ నేత ‘కూన’ రౌడీయిజం
పొందూరు: ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి గతంలో మూడుసార్లు అరెస్టయి బెయిల్‌పై ఉన్నా టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తీరు మారలేదు. ఈసారి పొందూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుడ్ల మోహన్‌ను బెదిరించాడు. మోహన్‌కు చెందిన భవనంలో గత పదేళ్లుగా టీడీపీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన ఆయన తన భవనాన్ని ఖాళీ చేయాలని కూన రవికుమార్‌ను కోరారు. అయితే.. కూన మాత్రం ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలని మోహన్ ఫోన్ చేయగా రవికుమార్ తన బెదిరింపు స్వభావాన్ని మరోసారి బయటపెట్టారు. ‘నేను ఖాళీ చేయను. నువ్వు ఎక్కువ చేస్తే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని బెదిరించారు. తన ఇబ్బందుల గురించి ఆలోచించాలని మోహన్ అడిగితే ‘నీ ఇబ్బందులు నాకనవసరం.. నీ గురించి నేను ఆలోచించేదేంటి?’ అంటూ రెచ్చిపోయారు. ‘సరే మీ ఇష్టం సార్’ అని అనగా ‘నువ్వు మర్యాద తప్పి ప్రవర్తిస్తే నేనూ మర్యాద తప్పుతా’ అని బెదిరింపులకు దిగారు ‘మీరు ఏది చేస్తే అది చేసేయండి సార్.. చంపేస్తే చంపేయండి సార్’ అని మోహన్ అనడంతో ‘అంతే చేస్తాను. నువ్వు బిల్డింగ్ దగ్గరకు వస్తే అంతే చేస్తా’ అని ఫోన్ కాల్ ముగించారు. పార్టీ మారినందుకే కక్ష సాధింపు 1983 నుంచి ఆర్నెల్ల క్రితం వరకు టీడీపీలో ఉన్నాను. టీడీపీ కార్యకలాపాలకు నా భవనాన్ని ఉచితంగానే ఇచ్చాను. కరెంటు బిల్లు నేనే కట్టుకుంటున్నాను. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. నెల రోజుల నుంచి ఖాళీ చేయాలని అడుగుతుంటే నా బిల్డింగ్ అప్పగించడం లేదు. పార్టీ మారినందుకే కూన రవికుమార్ కక్ష సాధిస్తున్నారు. చంపేస్తానని బెదిరించారు. –గుడ్ల మోహన్, వైఎస్సార్సీపీ నేత, పొందూరు -
అడ్డంగా దొరికి.. ఎదురుదాడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తహసీల్దార్‌పై నోరు పారేసుకుని అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రవికుమార్ బుధవారం ఉదయం పొందూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయే సమయంలో ప్రత్యారోపణలకు దిగారు. తన మాట వినని వారిని అవినీతి అధికారులని, తానెవరినీ వదలనని అంటూనే.. వారికి అండగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేశారు. వాస్తవానికి గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపు వ్యవహారంలోనే కాదు అంతకుముందు కూడా తహసీల్దార్ రామకృష్ణపై బెదిరింపులకు దిగారు. చెరువు వ్యవహారంతోపాటు మరో రెండు విషయాల్లో తహసీల్దార్ తమకు అడ్డంకిగా నిలిచారని టార్గెట్ చేసుకున్నారు. దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా... కూన రవికుమార్ తొలి నుంచి ఉద్యోగులపై దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. వీఆర్ఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, తహసీల్దార్... ఇలా ప్రతి ఒక్కరినీ బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటారు. అధికారం లేకపోయినా తన మాటే చెల్లుబాటు కావాలని, తాను చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎవరైతే తన మాటను వినరో వారిని టార్గెట్ చేసుకుని తొలుత లంచాలు ఎర చూపడం, ఇంకా లెక్క చేయకపోతే బూతు పురాణాలకు దిగడం, అంతకీ లొంగకపోతే అవినీతి ముద్ర వేసి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ విషయంలోనూ, ఈఓపీఆర్డీ విషయంలోనూ, వీఆర్ఓల విషయంలోనూ ఇదేరకంగా వ్యవహరించి నోటికొచ్చినట్టు తిట్టి ఆడియోల ద్వారా దొరికిపోయారు. అయినా తన వైఖరి మార్చుకోకుండా ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుందని, బెయిల్‌పై వచ్చేస్తానన్న ధీమాతో నోటికి పనిచెబుతూనే ఉన్నారు. చివరికి రవికుమార్ బెదిరింపులతో ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. వారి అనుచరులు ఏం చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది తొలిసారి కాదు.. తహసీల్దార్ రామకృష్ణను బెదిరించడం ఇది తొలిసారి కాదు. దీనికి ముందు రెండు ఘటనలు జరిగాయి. వాటిలోనూ తహసీల్దార్‌ను దురుసుగా మాట్లాడారన్న వాదనలున్నాయి. కూన రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో తన ఇంటి వెనక రెండు ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఆ గ్రామంలో మరెక్కడా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో 31మంది పేదల ఇళ్ల స్థలాల కోసం ఆ గ్రామ కంఠాన్ని ప్రతిపాదించారు. ఖాళీగా ఉన్న స్థలం కావడంతో సామాజిక పోరంబోకుగా గుర్తించి పేదల స్థలాల కోసం కేటాయించేందుకు గ్రామంలో తీర్మానం కూడా చేశారు. కానీ, రవికుమార్ వెనకుండి తన అనుయాయులు కొందర్ని రంగంలోకి దించి, ఆ భూమి తమ స్వాధీనంలో ఉందని చెప్పి అడ్డు తగలడం ప్రారంభించారు. ఉపాధి నిధుల కింద చేపట్టిన చదును పనులను అడ్డుకున్నారు. దీంతో వారందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, నోటీసులు ఇచ్చిన తహసీల్దార్‌కు సమాధానం ఇచ్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో కంగుతిన్నారు. దీంతో అధికారులు ఆ గ్రామ కంఠాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసే పనిలో పడ్డారు. కూన రవికుమార్‌కు ఇదంతా రుచించలేదు. తహసీల్దార్‌ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకోవడం ప్రారంభించారు. ఇక, ఆ తర్వాత పెనుబర్తి పంచాయతీ పరిధిలో అలమాజీపేటలో ప్రభుత్వ నిధులతో వేస్తున్న రోడ్డుకు అడ్డంగా రవికుమార్ అనుయాయులు గోడ కట్టేశారు. దీని విషయంలోనూ తహసీల్దార్ ముందుకెళ్లడంతో ఆ సమయంలో కూడా రవికుమార్ బెదిరింపులకు దిగారు. తాజాగా గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూన రవికుమార్ ఏకంగా ఫోన్లో ఇష్టారీతిన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ దుర్భాషలతోపాటు.. కొంతమంది తరుచూ వెంబడిస్తుండటం, ఫోన్లో సతాయించడంతో భరించలేక టీడీపీ నేత నోటి దురుసు ఆడియోను తహసీల్దార్ బయటపెట్టారు. వాస్తవంగా రామసాగరం చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీల చేత మట్టి తవ్వకాలు జరపాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూన రవి సోదరుడు, మరికొంతమంది జేసీబీతో తవ్వకాలు జరిపి, లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో జేసీబీతో తవ్వకాలు చేపట్టకూడదు. అందుకు భిన్నంగా చేసి ఇప్పుడు చెరువులో మట్టిని ఎందుకు తరలించకూడదని, తరలిస్తే తప్పేముందని వితండవాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా తహసీల్దార్ అవినీతి పరుడని, అవినీతిపరులైన ఉద్యోగులను వదలనని, వారికి ఉద్యోగ సంఘాలు వత్తాసు పలుకుతున్నాయని ఎదురు దాడికి దిగడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కారణాలు వెతుకుతున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అధికారులంటే అంత చులకనా? పొందూరు: తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడారు. తహసీల్దార్‌ను ఏకవచనంతో సంబోధించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. అడ్డంగా దొరికి ఎదురుదాడికి దిగడం తగదని, క్షమాపణ చెబితే పరువు నిలుస్తుందని హితవు పలుకుతున్నారు. గతంలో గ్రామ కంఠం భూమి విషయంలో, నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అడ్డంగా తన అనుయాయులు కట్టిన గోడకు అభ్యంతరం పెట్టిన విషయంలో తహసీల్దార్‌పై కోపం పెంచుకొని.. ఇప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని వారంటున్నారు. పొందూరు స్టేషన్లో లొంగిపోతూ రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలున్న అతనిని ఉద్యోగ సంఘాలు వెనకేసుకు రావడం తగదని సమర్థించుకోజూశారు. -
పీఎస్‌లో లొంగిపోయిన కూన రవికూమార్
-
లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పొందూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. తహసీల్దార్‌ను ఫోన్లో దుర్భాషలాడిన కూన రవికుమార్, మూడురోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసినందుకు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని కూన రవికుమార్ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం.. మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్లో హెచ్చరిక ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఇచ్చిన వార్నింగ్ చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. -
‘కూన’ కోసం గాలింపు
మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్లో హెచ్చరిక ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఇచ్చిన వార్నింగ్ చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. ఇది టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూన రవికుమార్ ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. అంతం చేస్తానని భయపెడుతున్నారు. ‘ఏమవుతుంది.. మహా అయితే కేసు పెడతారు... బెయిల్‌పై వచ్చేస్తాను’ అన్న ధీమాతో నిర్భీతిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఘటన మరింత ఆశ్చర్యం కల్గిస్తుంది. అందితే జుత్తు లేకపోతే కాలు అన్నట్టుగా బెదిరింపులతో దారికొస్తే ఫర్వాలేదు... లేదంటే లంచం పేరుతో ఇరికించవచ్చన్న ధోరణి చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్ ఏకంగా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టయి బెయిల్‌పై వచ్చారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఉద్యోగులను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాను చెప్పినట్టు వినకపోతే దుర్భాషలాడి బెదిరించడం టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌కు అలవాటైపోయింది. కూన రవికుమార్ రౌడీయిజాన్ని చూసి ఉద్యోగులు వణికిపోతున్నారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన పడుతున్నారు. రౌడీషీట్ తెరవాలని ఉద్యోగుల డిమాండ్ కూన రవికుమార్ వ్యవహారం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన రాజకీయ నాయకుడా ? వీధి రౌడీయా అని పెదవి విరుస్తున్నారు. బాధ్యత గల నాయకుడెవరూ బెదిరింపులకు దిగరని, రౌడీయిజం చేద్దానుకునే వారే చంపుతాను, పాతేస్తాను, వెదవా అంటూ బెదిరిస్తారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులను బెదిరిస్తూ, భయాందోళనకు గురిచేస్తున్న కూన రవికుమార్ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. అజ్ఞాతంలో రవికుమార్.. కేసు నమోదు పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కూన రవికుమార్, ఆయన సోదరుడు కూన వెంకట సత్యారావు, చంద్రారెడ్డి మరో ఇద్దరిపైనా పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 353, 506 రెడ్‌విత్ 34సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కూన రవికుమార్ పట్టుకోవడానికి ఆమదాలవలస, శ్రీకాకుళంలో గాలింపు చేపట్టారు. కాకపోతే అప్పటికే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూన రవికుమార్ ఇళ్లల్లోనూ, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కానీ, రవికుమార్ ఆచూకీ దొరకలేదు. ఎవరో సన్నిహితుల ఇళ్లల్లోనే దాక్కుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ‘కూన’ కోసం గాలింపు ఆమదాలవలస: టీడీపీ నాయకుడు, మాజీ విప్ కూన రవికుమార్, అతని అనుచరులు తనను ఫోన్లో బెదిరించినట్టు పొందూరు పూర్వ తహసీల్దారు టి.రామకృష్ణ పొందూరు పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు ప్రారంభించారు. అరెస్టుకు రంగం సిద్ధమవడంతో రవికుమార్ సహా నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు, పొందూరు ఎస్ఐ డి.విజయ్‌కుమార్, పోలీసు సిబ్బంది ఆమదాలవలస పట్టణంలో దర్యాప్తు చేశారు. కేసులో అరెస్ట్ చేయాల్సిన చంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్త, కాంట్రాక్టర్ ఆమదాలవలస పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో నివాసముంటున్నాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వచ్చి తనిఖీ చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో సుమారు గంట సమయంపాటు ఇంటి వద్ద వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. ఆమదాలవలస సీఐ ప్రసాదరావు పట్టణంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను పిలిపించి విచారణ జరిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. తెల్లారేసరికే పరార్ శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన కేసులో అరెస్టు చేసేందుకు నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కూన రవికుమార్ ఇంటికి సోమవారం తెల్లవారుజామునే పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని పోలీసులు చెప్పి ఇల్లంతా వెతికారు. గతంలో ఓ ఎంపీడీవోను, మరికొందరిని దుర్భాషలాడినప్పుడు పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు ఆయని ఇంటికి వెళ్లిన సందర్భంగా జరిగిన తంతే సోమవారం కూడా జరిగింది. అప్పట్లో నెల రోజులకి పైగా పోలీసుల కళ్లుకప్పి రవికుమార్ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. -
తహశీల్దారు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ మళ్లీ ఓ ప్రభుత్వ అధికారి మీద విరుచుకుపడ్డారు. పొందూరు తహశీల్దారు టి.రామకృష్ణను ఫోన్లో దుర్బాషలాడుతూ లంచం తీసుకోమని హెచ్చరించారు. ఈనెల 16న పొందూరు మండలం గోరింట చెరువు గర్భంలో మట్టిని తరలిస్తుండగా తహశీల్దారు అడ్డుకున్నారు. 4 లారీలను, ప్రొక్లైన్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుని లారీలను విడుదల చేయాలని కూన రవికుమార్ తహశీల్దారును బెదిరించారు. ఫోన్లో తీవ్రంగా దుర్బాషలాడారు. -
పదే పదే అదే తప్పు..
నీకెంత ఒల్లు బలిసిందిరా నా కొడకా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు.. నీ బతుకెంతరా నా కొడకా.. నిన్న ఓ ఇన్చార్జి ఈఓపీఆర్డీకి ఫోన్లో కూన రవికుమార్ చేసిన బెదిరింపులివి. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను.. నన్ను ఎవరూ ఆపలేరు.. చెట్టుకు కట్టి కాల్చేస్తాను.. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా.. ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు కూన రవికుమార్ చేసిన హెచ్చరికలివి. చెప్పినట్టు వినకపోతే కుర్చీ లో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా.. పంచాయతీ కార్యదర్శులను భయపెడుతూ కూన అన్న మాటలివి.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కూన రవికుమార్ దౌర్జన్యాలు ఆగడం లేదు. నేరుగా అధికారుల వద్దకు వెళ్లి, వారికి ఫోన్ చేసి కాల్చి చంపుతానంటూ.. గోతిలో పాతేస్తానంటూ.. బెదిరిస్తుండడంతో ఉద్యోగులు భయపడుతున్నారు. ఇలాగైతే పనిచేయలేమని వారంటున్నారు. ఇప్పటికే ఒక కేసులో బెయిల్‌పై ఉన్న రవికుమార్ మళ్లీ అదే రకంగా బెదిరింపులు, రౌడీయిజానికి పాల్పడుతుండటం చూస్తే ఆయన వల్ల ఏం హాని జరుగుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమకు కూన రవికుమార్ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, ఇప్పటికే ఉన్న బె యిల్‌ను రద్దు చేయాలని, జైలు నుంచి బయ టకు రాకుండా చూడాలని ప్రభుత్వ ఉద్యో గు లు డిమాండ్ చేస్తున్నారు. కూన వ్యవహార శైలికి వ్యతిరేకంగా సోమవారం జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలియజేశారు. నల్ల రిబ్బన్లతో విధులకు హాజరయ్యారు. ఉద్యోగులు కలెక్టర్ జె.నివాస్‌ని కలిసి కూన రవికుమార్‌తో ఉన్న ప్రాణ భయాన్ని తెలియజేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూన రవికుమార్ వ్యవహారం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఆయనొక రాజకీయ నాయకుడా? రౌడీయా? అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. బాధ్యత గల నాయకుడెవరైనా ఇలా బెదిరింపులకు దిగరని, రౌడీయిజం చేద్దామనుకునేవారే చంపుతాను, పాతేస్తానంటూ బెదిరిస్తారని పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అరాచకాలు సృష్టించారని, ఇసుకనైతే దోచేశారని, తప్పని పరిస్థితుల్లో రవి ఆగడాలు భరించామని, ఓడిపోయాక కూడా అదే దౌర్జన్యం చేస్తుండడం దారుణమని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ఒకసారి బెయిల్‌పై వచ్చిన వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని, కానీ కూన రవికుమార్ అందుకు భిన్నంగా మరింత రెచ్చిపోయి బెదిరింపులకు దిగుతున్నారని, ఈ సారైనా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోకుండా కూన రవి నోరు అదుపులో పెట్టుకోవాలి. కొద్దినెలల కిందటే ఓ ఎంపీడీఓపై కూడా ఇలాగే బెదిరింపులకు దిగడంతో కూన రవిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే ధోరణితో ప్రవర్తించ డం దారుణం. మాజీ విప్ రవి లాగానే అప్ప ట్లో వ్యవహరించిన బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలను ప్రజలు ఛీత్కరించారు. అయినప్పటికీ వీళ్లకి బుద్ధి రాలేదు. ఈ ఘటనలో కూనపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కిల్లారి నారాయణరావు, పీఆర్ ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షుడు ఇది క్షమించరాని నేరం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం తగదు. ఇలా ఎవరు ప్రవర్తించినా క్షమించరాని నేరంగా పరిగణించాలి. మా జీ విప్ కూన రవికుమార్ గతంలో కూడా అధికారులపై దురుసుగా వ్యవహరించా రు. ఇప్పుడు కూడా అలాగే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇది దారుణం. దీన్ని తోటి ఉద్యోగిగా తీవ్రంగా ఖండిస్తున్నారు. – కేసీహెచ్ మహంతి, డిప్లమా ఇంజినీర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు హేయమైన చర్య ప్రభుత్వ ఉద్యోగులపై భౌతికంగా, మానసికంగా దాడులకు దిగడం మంచి సంస్కృతి కాదు. ఈఓపీఆర్డీపై కూన రవి వ్యవహరించిన తీరు హేయమైన చర్య. గతంలో ఇలాంటి ప్రవర్తన వల్లనే ఇబ్బందులు తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఉద్యోగులను బెదిరించడం.. పత్రికలు రాయలేని భాషలో దూషించడం దారుణం. దీన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి. – పి.జయమ్మ, జెడ్పీ యూనిట్ ఉద్యోగుల అధ్యక్షురాలు -
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వారిని ఆమదాలవలస కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ గూపపు అప్పలనాయుడును ఫోన్ చేసి బూతులు తిట్టిన వైనం ప్రస్తుతం వైరల్ అవుతోంది. (మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..) -
మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసి బూ తులు తిట్టే ఈ నాయకుడి వైఖరి మరోసారి బట్టబయలైంది. ఓడిపోయానన్న బాధ ఇంకా పోలేదో.. అధికారంలో లేనన్న సంగతి గుర్తు లేదో గానీ ప్రభుత్వ అధికారిపై మరోసారి నోరుజారారు. రాయ లేని భాషలో బెదిరింపులకు దిగారు. ఆ మధ్య ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ జే ఈని బెదిరించగా, తాజాగా సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్డీకి ఫోన్ చేసి బూతులు తిట్టిన వైనం ఆదివారం బయటపడింది. ఇన్చార్జి ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడుతో కూన రవికుమార్ జరిపిన ఫోన్ సంభాషణ ఇది.. కూన రవి: హలో ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడు : సార్ నమస్తే సార్ కూన రవి: ఆ.. నమస్తే.. ఏమయ్యా నీవు బాగా పెద్దోడివయ్యినట్లు ఉన్నావ్ ఈఓపీఆర్డీ: లేదు.. లేదు సార్ కూన రవి: నీకు ఎంత ఒల్లు బలిసిందంటే నా కొడకా... నా నంబర్‌తో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవా ఈఓపీఆర్డీ: వీసీలో ఉన్నాను సార్.. ఫోన్లు తీయలేదు కూన రవి: ఆ తర్వాత ఏం చేశావ్...... ఈఓపీఆర్డీ: ఆ తర్వాత చూడలేదు సార్ కూన రవి: చూడకపోతే ఫోన్ చేయవా ఈఓపీఆర్డీ : ఫోన్ పక్కన పెట్టేసి మర్చిపోయా సార్.. కూన రవి: ఒరే నా కొడకా హస్కీలో ఉన్నా నిన్ను భూమిలోంచి తీసి నిన్ను పాతీకిపోతాను నా కొడకా... నీవు హస్కీలో ఉండు నా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమార్‌నే కాదు నా కొడకా.. నీ బతుకెంతరా నా కొడకా ఈఓపీఆర్డీ: విషయం.. విషయం ఏమిటి చెప్పండి సార్.. కూన రవి : దొంగనా కొడకా.. నీకు విషయం చెప్పాల్రా నేను ఈఓపీఆర్డీ : ఏమిటి చెప్పండి సార్ కూన రవి : దొంగనా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే.. నీవు ఈఓఆర్డీగా వచ్చావురా.. నీ ఉద్యోగం ఏమిటి అక్కడ? ఈఓపీఆర్డీ: ఈఓపీఆర్డీ చెప్పండి కూన రవి : ఆ... ఈఓఆర్డీ నీకెంత ధైర్యంరా మరల అక్కడకే వచ్చినావు ఈఓపీఆర్డీ : రాలేదు సార్ నేను ఎఫ్ఏసీ కూన రవి : ఏటి ఎఫ్ఏసీ నీకెవడురా ఇచ్చారు అక్కడ. జూనియర్ అసిస్టెంట్‌కు ఎఫ్ఏసీరా నీకు ఈఓపీఆర్డీ : సీనియర్ అసిస్టెంట్‌ని సార్ కూన రవి : రావివలస పంచాయతీ డబ్బులు ఆ రాయుడుకు ఎందుకురా ఇవ్వలేదు. ఈఓపీఆర్డీ : రావివలసది 30వేలు ఉంది సార్ అక్కడ. కూన రవి : రూ.30వేలు ఉంటే తీసి ఇవ్వలేవా ఈఓపీఆర్డీ : రూ.30వేలు అంటే రూ.70వేలు ఆయనది. కూన రవి : ఆ.. ఈఓపీఆర్డీ : రూ.20వేలు కొడుతుంటే ఆన్లైన్లో రిజెక్టెడ్ అని వస్తుంది సార్ అక్కడ కూన రవి : ఏంటి రిజెక్ట్ అని వస్తుంది ఈఓపీఆర్డీ : ఆ అమౌంట్ సరైన అమౌంట్ లేదని రిజెక్ట్ వస్తుంది, అది పెట్టమంటే మీకు రేపు పెడతా. కూన రవి : రేపు ఇమ్మీడియట్‌గా పెట్టు లేదా రూ.10లేదా రూ.15వేలు కొట్టు ఈఓపీఆర్డీ : పెడతా సార్ వాట్సాప్‌లో పెడతా సార్ కూన రవి : వాట్సాప్‌లో పెట్టు. ఈసారి లగాయత్తు.. న నంబర్ గానీ ఎత్తకపోయావో వైజాగ్‌లో ఉన్నా నీ ఇంటికి వచ్చి ఎత్తుకుపోతా నా కొడకా.. అంటూ ఫోన్ పెట్టేశారు. ఇలా సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా ఉన్న గూనపు వెంకట అప్పలనాయుడుపై బండ బూతులు తిట్టి విరుచుకుపడ్డారు. కూన రవికుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగారు. ‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. అలాగే, బూర్జలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ ని కూడా నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఇక పంచాయతీ కార్యదర్శులకైతే లెక్క లేదు. చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చొన్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే సరుబుజ్జిలి ఎంపీడీఓ, గత ఈఓపీఆర్డీని బెదిరించిన కేసులో బెయిల్‌పై ఉన్నారు. బయటికొచ్చినవి కొన్నే. కానీ నియోజకవర్గంలో ఆయన ఆగడాలు ఇంతా అంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని పురుగుల్లా చూస్తున్నారని నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఎన్నో ఉన్నాయి. కూనతో ప్రాణహాని ఉంది.. మాజీ విప్ కూన రవికుమార్ బెదిరింపులు తట్టుకోలేకపోతున్నాం. ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ప్రజాస్వామ్యంగా పనులు చేసుకోవాలే తప్ప. ఇలా బెదిరిస్తూ, తిడుతూ పనులు చేయించాలనుకోవడం సరికాదు. గతంలో కూడా నాతో దురుసుగా మాట్లాడారు. ఆయనకిది అలవాటైపోయింది. ఇలాగైతే పనిచేయలేం. తరుచూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. గతంలో కూడా వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. ప్రస్తుతం నేను వైజాగ్‌లో ఉన్నా తంతాను అని బెదిరించారు. నాకు ప్రాణహాని ఉంది. దీనిపై ఆమదాలవలస సీఐ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశాను. – గూనపు వెంకట పెద అప్పలనాయుడు -
కూన రవికుమార్ మరోసారి రౌడీయిజం
-
అచ్చెన్నాయుడు, రవికుమార్లకు నోటీసులు
సాక్షి, అమరావతి : స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. -
అందరివాడు ఒకరైతే అందనివాడు మరొకరు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ఎన్నికలు వస్తే పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరు..? వారి గుణగణాలు, కుటుంబ నేపథ్యం, సమాజసేవ వంటి విషయాలను ప్రజలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటారు. ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిని గెలిపిస్తే వారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా..లేక ప్రజాధనాన్ని దోచుకుంటారా అనేది బేరీజు వేసుకుంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు వారు చేసిన అభివృద్ధి ఎలా ఉంది. అవినీతిలో అతని స్థానం ఏంటనేది నియోజకవర్గాల్లో లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్మనేని, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వివరాల్లోకి వెళ్తే... తమ్మినేని సీతారాం ♦ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ♦ గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. ♦ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై పట్టు ఉన్న వ్యక్తి ♦ సమస్య ఉందని ఆశ్రయిస్తే సత్వరమే స్పందించే గుణం కలవారు ♦ ఎంతో మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ♦ రైతులకు సాగు నీరు అందించడానికి గతంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి కూన రవికుమార్ ♦ గత ఎన్నికల తరువాత ప్రజలకు దూరంగా ఉన్నారు ♦ స్థానికంగా కాకుండా శ్రీకాకుళంలో నివాసం ఉంటారు ♦ నియోజకవర్గం అభివృద్ధి కంటే తన అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ♦ నదీ గర్భాలను కొల్లగొట్టి కోట్లకు పడగెత్తారనే అభియోగం ఉంది ♦ ఉద్యోగ అవకాశాలు కోసం వెళ్లిన యువతతో దురుసుగా మాట్లాడే స్వభావం ♦ బెదిరింపులు, రౌడీ రాజకీయం చేస్తారనే ఆరోపణ ♦ భూములను దోచుకునేందుకు కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి -
టీడీపీ జెండా పట్టుకో లేదంటే..
-
టీడీపీ జెండా పట్టుకో లేదంటే.. వెంటాడి వేటాడుతా
శ్రీకాకుళం, పొందూరు: ఆయన ఓ ప్రజా ప్రతినిధి. ప్రజల కోసం పని చేయాల్సిన వ్యక్తి. చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి అడుగులో ఆదర్శం, విలువలు చూపించాల్సిన మనిషి. కానీ మన జిల్లా ప్రజా ప్రతినిధి మాత్రం ఆదర్శాలను గాలికి వదిలేశారు. కేవలం నచ్చిన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడనే కక్షతో ఓ సామాన్యుడిపై విరుచుకుపడ్డారు. రాయలేని భాషను ఉపయోగిస్తూ బెదిరింపులకు తెగబడ్డారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ దిగజారుడు రాజకీయాలకు పాల్ప డ్డారు. ఎమ్మెల్యే స్థాయికి తగని మాటలతో విలువలకు నిలువునా పాతరేశారు. గంగిరెడ్ల శివ వైఎస్సార్ సీపీ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ తన పార్టీ జెండా పట్టుకోకుంటే వెంటాడివేటాడుతానని బెదిరించారు. ఆ ఫోన్ సంభాషణ సాగిందిలా.. విప్: వినమ్మా ఇవన్నీ నాకు అనవసరం. ఒక యాంగిల్ నన్ను చూశావు, రెండో యాంగిల్ కూడా నువ్వు చూడాలనుకుంటే నేను చెయ్యాలనుకుంటే ఏం చేస్తానన్నది నువ్వు చూద్దువు గానీ. శివ: మీరు అలా అనడం సరికాదు సార్. ఇక్కడున్న డిస్టబెన్స్ వల్ల నేను బయటకు వెళ్లాను సార్. విప్: ఈ రోజు డిస్టబెన్స్ ఏంటిరా, ఎవడ్రా డిస్టబెన్స్ మీకు. పనిచేసినప్పుడు డిస్టబెన్స్ లేదు. శివ: మీ కార్యకర్తలు నన్ను అవాయిడ్ చేశారు. నేను మొదటి నుంచి వారితోనే తిరిగాను. విప్: కార్యకర్తలు ఎవాయిడ్ చేయటమేంటి, తమాషానా.. మీ కార్యకర్త అంటావేంటి తమాషాగా మాట్లాడుతున్నావా నువ్వు. ఏ కార్యకర్త అనుకుని బీసీ కార్పొరేషన్ లోన్ నీకు చేశాను. తమాషా చేస్తున్నావేమి, వెధవ మాటలు మాట్లాడి నువ్వేదో పెద్ద పోటుగాడిలా మాట్లాడకు. శివ: అలా అంటే నేనేమీ చెప్పలేను సార్. విప్: నువ్వు మళ్లీ ఎక్కడైనా ఈ రోజు లగాయతు కనిపించినా కాన్సీక్వెన్సెస్ చాలా సీరియస్‌గా ఉంటాయి. ఆ తర్వాత మీ అమ్మ కాదు, మీ మేనమామ కాదు ఎవ్వడొచ్చినా సరే, నేను మనిషిని పట్టించుకోనంత వరకే, పట్టించుకొన్నానంటే ఎక్కడకు పాతేస్తానో నాకు తెలుసు, ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీకు చేతనైతే నీకు విశ్వాసముంటే నీవు మనిషివైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు. లేదంటావు ఆ తర్వాత కాన్సీక్వెన్సీ ఏం చేయాలో అది చేస్తా. నేను ఒకే ఒక్కడినే క్షమిస్తాను. ఎవ్వడికో వాడికీ నచ్చలేదు ఆడేదో పూర్వం నుంచి పార్టీ జెండా పట్టుకొని ఉన్నాడు. వాడి ఊసు çనేను పట్టను. వాడి బతుకు వాడు బతుకుతాడు వాడు మటుకు వాడు ఉంటాడు. నువ్వు అది కాదు నువ్వు తిరగబడుతున్నావు. నువ్వు తిరగబడితే మాత్రం పాతాళానికి తొక్కేస్తాను. శివ: నేను మీకు వ్యతిరేకంగా వెళ్లలేదు. నేనైతే విప్: వినయ్యా నువ్వు ఇవన్నీ నాకు చెప్తావేంటి. మీరేం చేస్తారో ప్రతి అంగులం నాకు తెలుసు. నేనేం చూడటం లేదు అనుకుంటున్నారు. ఈ రోజు వరకు డెవలప్మెంట్పై దృష్టి పెట్టాను. ఈ రోజు లగాయితు రాజకీయం మళ్లీ చేస్తాను. ఇదీ వెరీ క్లియర్. చెబుతున్నాను. నువ్వు నీ ఆలోచన మార్చుకో, నీ టెండెన్సీ మార్చుకో, నీ నడక మార్చుకో, మార్చుకోకపోతే కాన్సిక్వెన్సీస్ భవిష్యత్‌లో చాలా సీరియస్‌గా ఉంటాయి. ఒకేమ్మా. నువ్వు నా కటౌట్లు తీసే స్థాయికి వచ్చిందంటే. శివ: సార్ నేను మీ కటౌట్లు తీయలేదు సారు, నిన్న ఊర్లోనే లేను సార్. విప్: మొత్తమంతా ఇప్పుడు జల్లెడ పట్టేస్తాను. శివ: ఎవరో వచ్చారు విప్: ఎవడా వచ్చిన నాకొడుకు, ఎవడా వచ్చినోడు? శివ: కాంట్రాక్టర్లు ఎవరో వచ్చి కట్టుకెళ్లారంటే నాకు తెలియదు సార్. విప్: సీతారాంకే కాదు...... నీకెవ్వడూ కాపాడడు గుర్తు పెట్టుకో. ఈ రోజు లగాయితు నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నీకు చేతనైతే తెలుగు దేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగూ. లేదనంటావా కాన్సీక్వెన్సెస్ చాలా సీరియస్‌గా ఉంటాయి. వెంటాడి వెంటాడి వేటాడుతాను. గుర్తు పెట్టుకోండి రైట్. -
ఆధారాలు చూపిస్తా.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?
పొందూరు: ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చేసిన అక్రమాలను ఆధారాలతో చూపిస్తా... అతనిని సస్పెండ్ చేయగలరా? అని వైఎస్సార్సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును సూటిగా ప్రశ్నించారు. స్థానిక పట్టుశాలీ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన అ నంతరం రవికుమార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై సమాచారమందిస్తానని తెలిపారు. నదీతీర ప్రాంతాలైన నిమ్మతొర్లాడ, జీకే వలస, ముద్దాడ పేట, దూసి, గోపీనగరం, సింగూరు, పురుషోత్తపురం, పెద్దసవలాపురం, యరగాం గ్రామాల్లో ఇసుక ర్యాంపులను అనధికారంగా ప్రారంభించి ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. మైనింగ్, లిక్కర్, భూ మి, ఇసుక మాఫియాలకు అండగా నిలుచొని అక్రమాలకు పాల్పడటం శోచనీయమని చెప్పారు. ఇసుక ర్యాంపుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా తనకు ఉన్నాయని ఆధారాలతో నిరూపిస్తే బహిరంగంగా ఉరి తీయండని సవాలు విసిరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి జిల్లాల్లో భూములను విప్ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, మండల పార్టీ అ«ధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి బిఎల్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి లోలుగు కాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంట్యాడ రమేష్, ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షంపై సర్కార్ మరోసారి ఎదురుదాడి
అమరావతి: ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేసిన ప్రతిపక్షంపై ప్రభుత్వం మరోసారి ఎదురుదాడినే మార్గంగా ఎంచుకుంది. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసిన వైఎస్ఆర్ సీపీ సభ్యులకు ప్రత్యేక వ్యాధి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. ముగిసిపోయిన అంశంపై ఇంకా చర్చ ఏంటి..అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీసి పారేశారు. రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా లేదు కనుక, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అధికార పార్టీ సభ్యులు ప్రత్యేకహోదాపై మాట్లాడటమే తప్పన్నట్టు వ్యవహరించారు. -
'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'
హైదరాబాద్: విభజన చట్టం ప్రకారమే సెక్షన్ -8 ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆంధ్రప్రదేశ్ టీడీపీ విప్ కోన రవికుమార్ సూచించారు. సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం కూడా చెల్లదని ఆయన స్పష్టం చేశారు. సెక్షన్ - 8పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైదరాబాద్‌లో కోన రవికుమార్ స్పందించారు. విభజన చట్టం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. విద్యుత్, నీరు, ఇతర అంశాలన్నీ విభజన చట్టం ప్రకారమే జరిగిందన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని తమ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌కు కలసి విజ్ఞప్తి చేసిన ఆయన స్పందించకపోవడం దారుణమని కోన రవికుమార్ ఆరోపించారు.