Lakshmi Manchu
-
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్!
మంచు ఫ్యామిలీ గొడవ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం మొదలైన వివాదం చివరికీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే మంగళవారం మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మంచు మనోజ్ దంపతులను లోపలికి రాకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.అయితే మంచు ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం ముంబయిలో ఉన్నారు. గొడవ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే.. తాజాగా ఆమె చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా తన కూతురి వీడియోను పోస్ట్ చేస్తూ పీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఈ పోస్ట్‌పై నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూస్తే శాంతించండి అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మంచు లక్ష్మి సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్‌బాబు), మోహన్‌లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
నా కెరీర్‌కు కుటుంబమే అడ్డు పడుతోంది: మంచు లక్ష్మి
హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది మంచు లక్ష్మి. అక్కడిదాకా ఎందుకు? అసలు తాను నటిగా మారడం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ.. నా జీవితానికి, కెరీర్‌కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా? అంటే అది నా కుటుంబమే! మేమంతా కలిసే ఉంటాం. అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు.. అసలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువులాంటిది. అందులో చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా? అని భయపడ్డారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడూ.. ముంబైకి వచ్చేయొచ్చుగా అని అంటూ ఉండేది. హీరో రానా కూడా.. నువ్వు ఎల్లకాలం హైదరాబాద్‌లోనే ఉండిపోలేవని అంటుండేవాడు. నాక్కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను.సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణులను సినిమాలో సెలక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటివాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్న (మోహన్‌బాబు)కు కూడా నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే! నా తమ్ముళ్లు ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్‌లోనే కాదు దేశమంతటా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్యే హాట్‌స్టార్‌లో విడుదలైంది.చదవండి: నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా? -
మంచు లక్ష్మి కూతురు యాపిల్‌కు 10 ఏళ్లు.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
Lakshmi Manchu: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు.. ఎంత గ్రాండ్‌గా ఉందో! (ఫోటోలు)
-
ఆడపడుచు అంటే నీలా ఉండాలి.. మంచు లక్ష్మిపై ప్రశంసలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్‌పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంలో మంచు లక్ష్మి పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీలా ఉండాలి.. ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్, మౌనిక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేవుడి దీవెనలతో చిన్ని దేవత వచ్చిందని మంచు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆ పాపను ప్రేమతో ఎమ్.ఎమ్.పులి అని పిలుస్తామని కూడా ఆమె తెలిపింది. తాజాగా మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. తమ గారాల ముద్దు బిడ్డను తొలిసారి ఇంట్లోకి తీసుకునిపోతున్న సందర్భంలో హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పాపకు పెద్ద సోదరుడిగా ఉన్న ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Dhanesh Babu ( Work ) (@endless_celebrity) -
ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, యోగా ట్రైనర్ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు 'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ. డ్యాన్స్, నవ్వులు.. అవన్నీ.. మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మేము అదృష్టవంతులం సెంథిల్, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి -
Pragya Jaiswal Birthday Photos: ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి..ఫొటోలు వైరల్
-
బీచ్ లో పార్టీ చేసుకున్న రకుల్, ప్రజ్ఞా, లక్ష్మి, ఫోటోలు.. ఒక్క లుక్ వేయండి
-
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఇంద్ర భవనమే.. ఎలా ఉందో చూశారా?
యాంకర్, నటి మంచు లక్ష్మి కొన్ని నెలల క్రితం ముంబైకి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడకు షిఫ్ట్ అయినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా యూనిక్‌గా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్‌లోని తన ఇంటితో పాటు మోహన్‌బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది. ఎక్కడున్నా ఎవరికైనా ఇల్లే స్వర్గం.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. ఫైనల్‌గా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఉద్దేశించి దీనిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పింది. కానీ అక్కడ వస్తువులన్నీ చాలావరకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి తెచ్చుకున్నవే అని ఆమె తెలిపింది. ఎంతో అద్భుతంగా ఉన్న మంచు లక్ష్మీ ఇంటిని మీరూ చూసేయండి. ముంబైకి షిఫ్ట్ అయ్యాక లక్ష్మి ఏం చెప్పింది అంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. అని గతంలో తెలిపింది. -
Lakshmi Manchu 46th Birthday Celebrations: మంచు లక్ష్మి బర్త్‌డే పార్టీ.. బాలీవుడ్ స్టార్స్ సందడి (ఫోటోలు)
-
ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి, అవకాశాల కోసమే!
యాంకర్, నటి మంచు లక్ష్మి ముంబైకి చెక్కేసింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలు. నాపై నమ్మకముంచి నా మీద ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించే అభిమానులందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది. అయితే టాలీవుడ్లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని బాలీవుడ్‌కు మకాం మార్చేయలేదు. తన నటనా పరిధిని విస్తృతపరిచుకునేందుకే ముంబైకి షిఫ్ట్ అయినట్లు పేర్కొంది. ఆఫీసుకు రమ్మన్నా వస్తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. నాన్న అలాగే భయపడ్డాడు కానీ మా అమ్మ ఒకరకంగా భయపడి బెంగపెట్టేసుకుంది. సరే, అయితే ముంబైకి షిఫ్ట్ అవుతానని చెప్పా.. అమ్మ సరేనంది. తను ఎప్పుడూ నా నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. నాన్న మాత్రం ముంబై అనగానే అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు? అని అడిగాడు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో మకాం పెట్టిన మంచు లక్ష్మి ఆదివారం నాడు తన స్నేహితులకు బర్త్‌డే పార్టీ ఇచ్చింది. చదవండి: సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశా, ఆయనను కలిసిన తెల్లారే హత్య.. అలా కేసులో ఇరుక్కున్నా -
సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఇటీవలే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్లో పాల్గొన్న మంచు లక్ష్మికి ఓ వ్యక్తి చేసిన పనికి కోపం తెప్పించింది. తాను మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాలకు అడ్డు రావడంతో అగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా 'నీ యవ్వా' వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా ఓ దెబ్బ వేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దక్షిణాది నటీనటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా(SIIMA) అవార్డ్స్- 2023 ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 తేదీలలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లకు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. అయితే ఈ వేదికపైనే మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరాలకు అతను అడ్డుకోవడంతో కోపంతో కొట్టేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి అక్కడికి రావడంతో కెమెరా వెనకకు వెళ్లండి డ్యూడ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ సమర్థించగా.. మరికొందరేమో తప్పుపడుతున్నారు. కాగా.. మంచు లక్ష్మి టాలీవుడ్లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా రంగప్రవేశం చేసింది. అంతే కాకుండా లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్ట కథలు, మాన్స్టర్, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు లాస్ వెగాస్ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో కనిపించింది. ఆమె డెస్పరేట్ హౌస్‌వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్, మిస్టరీ ఈఆర్ లాంటి హాలీవుడ్ సిరీస్‌ల్లో నటించింది. ఎవడ్రా మా లచ్చక్క మాట్లాడే అప్పుడు మధ్యలో అడ్డం వస్తున్నారు ని అవ్వ 😁 హాల్లో డుర్ go behind the camera dude🤣@LakshmiManchu pic.twitter.com/Ry5FBNyN3A — 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) September 21, 2023 -
మనోజ్‌కు రాఖీ కట్టిన మంచు లక్ష్మి.. మరి విష్ణు ఎక్కడ?
మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదంతా ఏమీ లేదని వాళ్లు చెప్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో వారి మధ్య ఉన్న గొడవలు, డిస్టబెన్స్ ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య మనోజ్ అనుచరుడిపై విష్ణు గొడవకు దిగిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మనోజ్ పెళ్లిలో విష్ణు కుటుంబం సందడే కనిపించలేదు. విష్ణు ఫ్యామిలీ సమయానికి వచ్చి నాలుగు అక్షింతలు వేసి అతిథిలా వచ్చి వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. అటు మంచు లక్ష్మి మాత్రం తమ్ముడి పెళ్లిని భుజాన వేసుకుని స్వయంగా తన ఇంట్లోనే జరిపించింది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసి మంచు ఫ్యామిలీలో సఖ్యత లోపించిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో మరోసారి ఈ ఊహాగానాలకు తెర లేపింది. మంచు మనోజ్‌కు రాఖీ కట్టిన లక్ష్మి వారితో కలిసి ఓ రెస్టారెంట్లో లంచ్ చేసింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్రేమ, సరదా, రుచికరమైన భోజనంతో రాఖీ లంచ్ జరిగింది' అని రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోల్లో మంచు విష్ణు లేడు. ఇది చూసిన జనాలు అంతా బానే ఉంది.. కానీ, మంచు విష్ణు ఎక్కడ? అని కామెంట్లు చేస్తున్నారు. విష్ణుకు రాఖీ కట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాఖీ లంచ్ అంటూ మనోజ్‌తో మాత్రమే దిగిన ఫోటోనే షేర్ చేసిందంటే విష్ణుకు రాఖీ కట్టనట్లుంది అని అభిప్రాయపడుతున్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతోందని అనుమానిస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌కు వెళ్లాల్సి ఉండగా నటి ఇంట విషాదం -
నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్
టాలీవుడ్లో మంచు లక్ష్మీ పేరు అంటే అందరికి తెలిసే ఉంటుంది.. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను అందుకుంది. నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్మీ పలు సహాయక కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు బుల్లితెర షోలలో కూడా మెప్పిస్తుంది. తాజాగా ఆమె టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: టీజర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్ని.. ఇక్కడికి ఎందుకొచ్చానో అని కూడా అనిపిస్తుందని ఆమె తెలిపింది. ఆ దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు రెడీగా ఉన్నాని తెలిపింది. ఇక్కడి తెలుగు ఆడియన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వారి సొంత రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రం ఆదరించరని మంచు లక్ష్మీ పేర్కొంది. ఇక్కడివారిని ఒక్కశాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. మధుశాలినితో పాటు శివాత్మిక,శివాని ఎందుకు చేయడం లేదు.. .. అని ఆమె ప్రశ్నించింది. వీరందరూ దేనిలో తక్కవ అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా అంటూ ఫైర్ అయింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా ముంబయి,పంజాబీ,కేరళ, తమిళ, కన్నడ హీరోయిన్లే కావాలి.. కానీ తెలుగు వారు మాత్రం వద్దంటారని ఫైర్ అయింది. మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ నిజమే కదా అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
నగల దుకాణంలో సినీ నటి మంచు లక్ష్మి సందడి (ఫోటోలు)
-
Lakshmi Manchu: ఘనంగా మంచు లక్ష్మీ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో మెరిసిన మంచు లక్ష్మి ( ఫొటోలు)
-
మనోజ్ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మి ఏమందంటే?
జీవితంలో కొత్త మజిలీ ప్రారంభించబోతున్నా, త్వరలోనే కొత్త చాప్టర్ అన్‌లాక్ చేస్తున్నా అంటూ ఊరించిన మంచు మనోజ్ చివరికి తన సినిమా అప్డేట్ చెప్పి అభిమానులను ఉసూరుమనిపించిన విషయం తెలిసిందే! అతడు గుడ్‌న్యూస్ అన్న క్షణం నుంచి ఫ్యాన్స్ అంతా కచ్చితంగా అది పెళ్లి వార్తే అయి ఉంటుందని ఫిక్స్ అయ్యారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వాట్ ద ఫిష్ మూవీని ప్రకటించాడు. అయినప్పటికీ మనోజ్ త్వరలో పెళ్లిపీటలెక్కడం ఖాయమంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మంచు లక్ష్మీ చెవిన పడింది. ఆదివారం నాడు మంచు లక్ష్మీ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె మాట్లాడుతూ.. 'నేను గుడికి వచ్చినప్పుడు పర్సనల్ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి అతడినే అడగండి. నా సినిమాల గురించి అడిగితే చెప్తాను. అగ్ని నక్షత్రం సహా నాలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. శివరాత్రికి ఓ పాట రిలీజ్ చేస్తున్నాను. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవోలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 40 మంది యాక్టర్స్ వస్తున్నారు. దాని ద్వారా 45వేల మందికి మంచి విద్య అందించగలుగుతున్నాం. ఇవన్నీ నా పరిధిలోవి కాబట్టి చెప్పాను. నా పరిధిలో లేనివి అడిగితే చెప్పలేను' అని పేర్కొంది మంచు లక్ష్మి. చదవండి: శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్ -
సరిదిద్దుకోలేని తప్పులు చేశాను.. మళ్లీ అలాంటివి చేయను : మంచు లక్ష్మీ
నటి మంచు లక్ష్మీ మోహన్ బాబు కూతురిగానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా దూసుకుపోతున్న లక్ష్మీ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. మొహమాటం లేకుండా తన ఓపీనియన్‌ని నిక్కచ్చిగా చెబుతుంటుంది. తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. కాబట్టి మళ్లీ ఆ తప్పులు చేయను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఏ విషయంలో మంచు లక్ష్మీ తప్పు చేసింది అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
సోషల్ హల్చల్: హన్సిక సూఫీ నైట్, మూన్‌లైట్‌లో జాన్వి కపూర్
► ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి ► ఎదపై టాటూ, ముక్కు పుడకతో అనుపమ, కొత్త లుక్ వైరల్ ► ప్యారిస్‌లో ఫరియా చక్కర్లు ► మంచులో తడుస్తున్న శృతి హాసన్ ► హన్సిక సూఫీ నైట్, ఆకట్టుకుంటున్న ఫొటోలు ► స్టార్ హోటల్లో బోల్డ్ బ్యూటీ అరియాన గ్లోరీ, గ్లామరస్ ఫొటోలు వైరల్ ► మూన్‌లైట్‌లో కలవమంటున్న బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ► హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) -
ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్‌గా సెట్స్‌కు వెళ్తే డల్‌గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నందుకు మోహన్‌లాల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్ -
శ్రీకాకుళంలో మంచు లక్ష్మి సందడి.. చూసేందుకు ఎగబడిన జనం
శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మోహన్‌బాబు అరసవల్లి క్షేత్రానికి వెళ్లాలని సూచించారని, అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు. ఇక తాము ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3 లక్షలతో డిజిటల్ తరగతిని (స్మార్ట్ క్లాస్‌రూం)ను సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమెతో పాటు జిల్లా డీఈఓ జి.పగడాలమ్మ, ఎంఈఓలు సీహెచ్ మణికుమార్, కె.రాంబాబు, ప్రధానోపాధ్యాయు డు సింహాచలం, సర్పంచ్ జక్కర ఉమా, ఎంపీటీసీ మడ్డు సుగుణ కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే హిరమండలం మండలంలోని సవరచొర్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూంను కూడా ఆమె ప్రారంభించారు.