lamborghini car
-
రూ.9 కోట్ల కారు నడిరోడ్డులో ఆగిపోతే.. అంత పొగరెందుకు?
లగ్జరీ కార్స్ మేకర్ లాంబోర్గినీపై రేమండ్స్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మండిపడ్డారు. ముంబైలో లాంబోర్గినీ రివల్టో కారును టెస్ట్ డ్రైవ్‌కు తీసుకెళ్లగా నడిరోడ్డులో ఆగిపోయిందని, దీనిపై ఫిర్యాదు చేసినా లంబోర్గినీ ఇండియా, ఆసియా అధిపతులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు."(లాంబోర్గినీ)ఇండియా హెడ్ శరద్ అగర్వాల్, ఆసియా హెడ్ ఫ్రాన్సిస్కో స్కార్డొని అహంకారాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. కస్టమర్ సమస్యలు ఏమిటో తెలుసుకునేందుకు కూడా ఎవరూ స్పందించలేదు" అని సింఘానియా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఈ లగ్జరీ కారు డెలివరీ అయిన 15 రోజులకే సమస్యలు వచ్చినట్లు పేర్కొన్నారు.విలాసవంతమైన జీవనం గడిపే గౌతమ్ సింఘానియా ప్రత్యేకమైన లగ్జరీ కార్స్ కలెక్షన్‌కు ప్రసిద్ధి చెందారు . ఫార్ములా వన్ రేసర్‌ను నడపడానికి ఆయనొకసారి ఫ్రాన్స్‌కు కూడా వెళ్లారు. సొగసైన ఫెరారీ 458 నుండి ఆడి క్యూ7, ఎల్పీ570 సూపర్లెగ్గేరా, నిస్సాన్ స్కైలైన్ జీటీ-ఆర్, లాంబోర్ఘిని గల్లార్డో వంటి ఖరీదైన కార్లెన్నో ఆయన కలెక్షన్లో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20,000 డిస్కౌంట్అత్యంత ఖరీదైన లాంబోర్ఘిని రివల్టో కారు ప్రారంభ ధరే రూ.8.89 కోట్లు (ఎక్స్‌షోరూం). ఈ కారుపై గౌతమ్ సింఘానియా పెట్టిన పోస్టుకు యూజర్లు కూడా స్పందించారు. లాంబోర్ఘిని కస్టమర్లను విస్మరించడాన్ని తప్పుపడుతూ విమర్శలు చేశారు. -
రూ.కోటి రూపాయాల కారుకు నిప్పు
రంగారెడ్డి: కొనుగోలు ముసుగులో స్పోర్ట్స్ కారుకు నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి తన లంబోర్ఘిని కారు (డిఎల్ 09 సివి 3636) అమ్మాలని నిర్ణయించుకొని పరిచయస్తుడైన అయాన్‌కు చెప్పాడు. దీంతో కస్టమర్ ఉంటే చూడాలంటూ అయాన్ తన స్నేహితుడైన మొఘల్‌పురాకు చెందిన అమన్ హైదర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్‌హౌస్ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్ చెప్పడంతో, అయాన్ కారు తీసుకొచ్చి జల్పల్లి వద్ద అమన్‌కు ఇచ్చాడు. జల్పల్లి నుంచి అమన్ తన స్నేహితుడు హందాన్‌తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు మళ్లి కారును ఆపారు. అనంతరం అహ్మద్, అతనితో పాటు మరికొంత మంది హోండా సిటీ, వ్యాగనార్ కార్లు, బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. నీరజ్ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్, అతని వెంట వచ్చిన వారు బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒక్కసారిగా లంబోర్గిని కారుపై పోసి నిప్పంటించారు. ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్సై మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉండవచ్చని తెలిపారు. -
పుట్టినరోజున రూ.5 కోట్లతో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
కొడుకు పుట్టిన రోజున డ్రెస్, మొబైల్.. మరీకాదంటే బైక్లాంటివి గిఫ్ట్ ఇస్తుంటారు. ఇదంతా మధ్య తరగతివారికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. మరి ధనవంతుల ఇళ్లలో పుట్టినరోజుకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడి బర్త్‌డే రోజున ఏకంగా రూ.5 కోట్లు విలువచేసే ‘లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ’ మోడల్కారును బహుమానంగా ఇచ్చారు. ఈమేరకు తనకు గిఫ్ట్ ఇస్తుంటే తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వీకేఆర్ గ్రూప్ అధినేత వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుష్ రుంగ్తా 18వ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో దుబాయ్‌లోని లాంబోర్గినీ సంస్థను సంప్రదించారు. కంపెనీ తయారుచేసిన హురకాన్ ఎస్టీఓ కారును కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త ఆ సూపర్ స్పోర్ట్స్ కారును చూసిన తరుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా స్పందిస్తూ.. ‘నా 18వ పుట్టినరోజును డ్రీమ్కారు గిఫ్ట్‌గా ఇచ్చి మరింత అద్భుతంగా మార్చినందుకు నాన్నకు కృతజ్ఞతలు! తన ప్రేమాభిమానాలు ఎప్పటికే నాతోనే ఉంటాయి’ అని తెలిపారు. Indian businessman Vivek Kumar Rungta gifted a Lamborghini Huracan STO worth ₹5 Crore to his son Tarush on his 18th birthday pic.twitter.com/nNe4GMIGqI — Rosy (@rose_k01) April 11, 2024 -
ఏంజెల్ బ్రోకింగ్ సీఈఓ 'దినేష్ ఠక్కర్' రూ.5 కోట్ల సూపర్ కారు (ఫోటోలు)
-
Hyderabad: కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది.. పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్‌లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేశారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1 నుంచి లాంబోర్గిని కారు (టీఎస్09 జీడీ 9777)లో ఓ యువకుడు మితిమీరిన వేగంతో, భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. ఈ కారును ఓ యువకుడు ఫొటోలు తీశాడు. ‘కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు’ అంటూ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. సోమవారం రోజంతా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కారు నడిపిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. లాంబోర్గిని కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు వేట ప్రారంభించారు. ట్వీట్ చూసిన సదరు కారు నడిపిన యువకుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Shraddha Kapoor: లంబోర్గిని కారు కొన్న శ్రద్ధా కపూర్ (ఫోటోలు)
-
నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
2010లో టీన్ పట్టి చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధా కపూర్. లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత ఆషికి-2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ఏడాది రణ్‌బీర్ కపూర్ సరసన తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రంలో నటించింది. తాజాగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్ టెక్నికా అనే మోడల్ కారును సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు విలువ దాదాపు రూ.4 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె రాజ్ కుమార్ రావు సరసన స్ట్రీట్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2018లో వచ్చిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) View this post on Instagram A post shared by Pooja Choudary (@poojachoudary_9) -
ర్యాష్ డ్రైవింగ్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి గాయాలు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ మాజీ కొడుకుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సదురు ఎమ్మెల్యే కొడుకుపై ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా కుమారుడు తక్షీల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం ఉదయం తన ఖరీదైన లాంబోర్గినీ హురాకాన్ కారులో హైస్పీడ్‌లో వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తక్షీల్ గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం సందర్భంగా కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భారత్‌లో లాంబోర్గినీ హురాకాన్ ధర రూ.3.5 కోట్ల వరకు ఉంటుందన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వర్లీ పోలుసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: దీప్తి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ.. షాక్‌లో పేరెంట్స్! -
లగ్జరీ కారును కొన్న సచిన్ టెండ్కూలర్.. ధర ఎంతంటే?
గాడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండ్కూలర్‌కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి ఇంట్లో దాదాపు ఎనిమిది లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా సచిన్ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. లేటెస్ట్ టాప్ వేరియెంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎగ్జరీ కారును సచిన్ కొనుగోలు చేశాడు. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ 4.18 కోట్లగా ఉంది. ఈ కారు ఉరుస్ లైనప్‌లో వచ్చిన రెండవ మోడల్. ఇది ఉరుస్ పెర్ఫార్మంట్ మోడల్ కంటే తక్కువ ధర. ఇక టెండూల్కర్ ఈ లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సీఎస్ 12 వోల్గ్స్(CS 12 Vlogs) అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది. కాగా 2012 నుంచి ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి గ్యారేజీలో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. అదే విధంగా సచిన్‌కు మారుతి 800 అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సచిన్ తన మెుట్టమెుదటి కారు ప్రయాణం మారుతి 800 తోనే ప్రారంభమైంది. 1989 లోనే సచిన్ ఈ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ఇప్పటికీ అతడి గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
భారత్‌లో విడుదలైన ఇటాలియన్ సూపర్ కారు - ధర అక్షరాలా..
Lamborghini Urus S: ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2022లో 'ఉరుస్ ఎస్' (Urus S) SUV గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి అంతకంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ ఎస్యువి ధర రూ. 4.18 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఉరుస్ పెర్ఫార్మంటే కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉరుస్ లైనప్‌లో ఉన్న రెండవ మోడల్. డిజైన్ & ఫీచర్స్: లంబోర్ఘిని ఉరుస్ ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కొత్త బంపర్, కూలింగ్ వెంట్స్‌తో కూడిన కొత్త బానెట్‌తో కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందుతుంది. కానీ బయట కనిపించే కార్బన్-ఫైబర్ బానెట్, కార్బన్-ఫైబర్ రూఫ్ మాత్రం పెర్ఫార్మంటే మోడల్ని గుర్తుకు తెస్తుంది. ఫీచర్స్: కొత్త ఉరుస్ ఎస్ లోపలి భాగంలో ఉరుస్ ఎస్ ఉరుస్ పెర్ఫార్మంటే మాదిరిగానే అదే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ కొంత విభిన్నమైన మెటీరియల్ చూడవచ్చు. పెర్ఫార్మంటే బ్లాక్ ఆల్కాంటారా ఇంటీరియర్‌ను స్టాండర్డ్‌గా కలిగి చోట ఉరుస్ ఎస్‌లోని ఇంటీరియర్ లెదర్‌ను స్టాండర్డ్‌గా పొందుతుంది. (ఇదీ చదవండి: ChatGPT: మీరు చేసే ఈ ఒక్క పని మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది.. డోంట్ మిస్!) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ సూపర్ SUV 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది 666 హెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ సూపర్ కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేస్తుంది. ఉరుస్ ఎస్కి శక్తినివ్వడం ఉరుస్ పెర్ఫార్మంటే వలె అదే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8, 666hp మరియు 850Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఉరుస్ పెర్ఫార్మంటే క్లెయిమ్ చేయబడిన 3.3 సెకన్లలో గంటకు 0-100కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు, ఉరుస్ ఎస్ దానిని 3.5 సెకన్లలో (క్లెయిమ్ చేయబడింది) నిర్వహిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు పంపబడుతుంది. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్, ఆడి RSQ8, ఆస్టన్ మార్టిన్ DBX 707, పోర్స్చే కయెన్ టర్బో జిటి, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.6 కోట్ల కారు.. పార్కింగ్ చేయమని ఇస్తే నాశనం చేశారు..
కాన్బెర్రా: రెండు లాంబోర్గిని కార్లు. వీటి విలువ రూ.12 కోట్లు. ఓ లగ్జరీ హోటల్‌కు వెళ్లిన కోటీశ్వరుడు ఈ కార్లను తీసుకెళ్లాడు. అయితే పార్కింగ్ చేయమని చెప్పి ఈ కార్ల కీస్‌ను హోటల్ సిబ్బందికి ఇచ్చాడు. ఇంత ఖరీదైన కారు ఎక్కానని ఆనందంలోనే, లేక డ్రైవింగ్ సరిగ్గా రాకనో తెలియదు గానీ.. హోటల్ సిబ్బంది ఈ కారును ప్రమాదానికి గురి చేశాడు. అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. అంతేకాదు ముందున్న మరో లాంబోర్గినిని కూడా ఢీకొట్టాడు. దీంతో ఓనర్ కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Craig Jones (@craigjonesbjj) ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. ఈ కార్ల యజమాని పేరు లారెన్స్ ఎస్కలాంటే. పెర్త్‌లోని లగ్జరీ హోటల్ క్రౌన్ టవర్స్‌కు అతను వెళ్లినప్పుడు ఇలా జరిగింది. చదవండి: చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పనీర్ పెట్టలేదని రచ్చ రచ్చ.. వీడియో వైరల్.. -
ప్రభాస్ లంబోర్గిని కారు తీసుకొని చక్కర్లు కొట్టిన డైరెక్టర్
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూట్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ గ్యారేజీలు పలు ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆ జాబితాలోకి లంబోర్గిని కూడా వచ్చి చేసింది. ప్రభాస్ కూడా ఈ కారులోనే షూటింగ్స్‌కి హాజరువుతున్నాడు. తాజాగా డైరెక్టర్ మారుతి ప్రభాస్ లంబోర్గినిని డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడుఉ నెట్టింట చక్కర్లు కొడుతుంది. #Prabhas anna Lamborghini driving by @DirectorMaruthi 🤩👌 pic.twitter.com/RjoAFdFdrQ — ᴠɪꜱʜᴀʟ 🏹 (@vishal_x_x_7) January 29, 2023 -
ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్‌తో దూసుకుపోతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
లంబోర్గినీ సూపర్ ఎస్యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!
హైదరాబాద్: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ తాజాగా భారత్‌లో ఊరూస్ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీని పరిచయం చేసింది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.4.22 కోట్లునుంచి ప్రారంభం. స్టాండర్ట్ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు ఎక్కువ. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్‌లో బ్రాండ్ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్లను తెరవడంలో ఊరూస్ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్ అగర్వాల్ తెలిపారు. -
భారత్‌లో మరో మైలురాయి దాటిన లంబోర్గిని
న్యూఢిల్లీ: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ లంబోర్గినీ సరికొత్త మైలురాయిని అధిగమించింది. భారత్‌లో ఇప్పటి వరకు 400 కార్లను విక్రయించి రికార్డు సాధించినట్టు సో మవారం ప్రకటించింది. దేశంలో 2007 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ‘భారతదేశంలో 400 లంబోర్గినీ కార్ల విక్రయ రికార్డును సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రయా ణంలో మాకు మద్దతుగా నిలిచిన మా కస్టమర్లకు అభినందనలు’’ అని లంబోర్గిని ఇండి యా హెడ్ శరద్ అగర్వాల్ పేర్కొన్నారు. -
అదిరిందయ్యా!! అప్పుడు ఎన్టీఆర్..ఇప్పుడు రోహిత్ శర్మ!
తన కెప్టెన్సీలో వరుస విజయాలతో మాంచి జోరుమీదున్న టీమ్ ఇండియా రథ సారధి రోహిత్ శర్మ ఖరీదైన లాంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేశాడు. ఇప్పటికే బీఎండబ్ల్యూ ఎం5, టయోటా ఫార్చునర్, మెర్సిడెస్ జీఎల్ఎస్ 350డీ, బీఎండబ్ల్యూ5, బీఎండబ్ల్యూ ఎక్స్3ని కొనుగోలు చేసిన రోహిత్ తాజాగా లాంబోర్ఘినితో.. కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన సెలబ్రిటీల సరసన నిలిచారు. లంబోర్ఘిని ఉరుస్ ఫీచర్లు రోహిత్ శర్మ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరస్ కారు ప్రస్తుతం టీమిండియా జెర్సీ కలర్ లో ఉంటుంది. రూ.3.15కోట్ల విలువైన ఈ కారు ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఎస్ యూవీలలో ఒకటిగా పేరుంది. 4.4 లీటర్ల టర్బోఛార్జ్తో వీ8 ఇంజన్‌తో పనిచేస్తుంది. దీని మోటార్ గరిష్టంగా 641 బీపీహెచ్ శక్తిని, 850 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా.. గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. టాలీవుడ్లో ఎన్టీఆర్.. గతేడాది ఆగస్ట్‌లో టాలీవుడ్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును కొనుగులు చేశారు. రణ్వీర్ సింగ్, కార్తిక్ ఆర్యన్, డైరక్టర్ రోహిత్ శెట్టీ, రజినీ కాంత్ లు సైతం లంబోర్ఘిని ఊరుసును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఎన్టీఆర్ లంబోర్ఘిని ఊరుస్ కారు, దేశంలో తొలి వ్యక్తిగా తారక్ -
దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారిలోనూ సూపర్ లగ్జరీ కార్లకు ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలీ లంబోర్గినీ భారత్‌లో అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. 2021లో 69 కార్లను విక్రయించింది. 2020తో పోలిస్తే ఇది 86 శాతం అధికం. భారత్‌లో లంబోర్గినీ కార్ల ధర రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2019లో దేశంలో 52 లంబోర్గినీ కార్లు రోడ్డెక్కాయి. 52 మార్కెట్లలో 173 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 8,405 యూనిట్లను విక్రయించింది. సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో ఇదే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ది. తొలి స్థానంలో ఉన్న యూఎస్‌లో 2,472 యూనిట్లు అమ్ముడయ్యాయి. చైనా, జర్మనీ, యూకే, ఇటలీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు..ఐనా సరే కొనాల్సిందే !
సూపర్ స్పోర్ట్స్ కార్ లంబోర్గిని సంచలనం సృష్టించింది. బ్రాండ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా మార్కెట్లో చొచ్చుకుపోయింది. కరోనా సంక్షోభం ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్నా డోంట్ కేర్ అన్నట్టుగా అమ్మకాల్లో టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. 59 ఏళ్ల రికార్డులు ఇటాలియన్ కార్ బ్రాండైన లంబోర్గినికి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్పోర్ట్స్ కార్ కేటగిరిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. లంబోర్గిని కార్లకు అన్ని దేశాల్లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. రెండేళ్లుగా కరోనాతో తగ్గిన లంబోర్గిని అమ్మకాలు 2021లో పుంజుకున్నాయి. అమ్మకాలు ఏకంగా 59 ఏళ్ల రికార్డులను తిరగ రాశాయి. ఉరుస్దే పై చేయి లంబోర్గిని బ్రాండ్‌కి సంబంధించి 2021 ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 8405 కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధికంగా లంబోర్గిని ఉరుస్ మోడల్ కారు సేల్ అయ్యింది. ఉరుస్ మోడల్ కార్లే 5,021 అమ్ముడయ్యాయి. ఇండియాలో ఉరుస్ కారు ఎక్స్‌షోరూం ధర కనిష్టంగా రూ.3.15 కోట్ల నుంచి రూ.3.43 కోట్ల వరకు ఉంది. ఉరుస్ తర్వాత స్థానంలో హురాకాన్ మోడల్ నిలిచింది. రూ.3.21 కోట్ల నుంచి రూ.4.99 కోట్ల రేంజ్లో లభించే హురుకాన్ మోడల్ కార్లు 2586 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవెంటాడోర్ అదుర్స్ ఉరుస్, హురున్ తర్వాత అవెంటడార్ మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 798 అవెంటడార్ కార్లు అమ్ముడయ్యాయి. ఇండియాలో అవెంటాడోర్ ధర రూ. 6.25 కోట్లు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. 2020తో పోల్చితే అమ్మకాల్లో 13 శాతం వృద్దిని లంబోర్గిని కనబరిచింది. ఇండియాలో ఉరుస్ మోడల్‌కి డిమాండ్ ఎక్కువ. దేశవ్యాప్తంగా 300 ఉరుస్ మోడల్ కార్లను లంబోర్గిని విక్రయించింది. చదవండి: డుగ్గుడుగ్గు బండికి గట్టి పోటీ.. యజ్డీ రీ ఎంట్రీ -
కంగారులో బ్రేకు, యాక్సలరేటర్, పెడల్‌ని కలిపి నొక్కాడు..ఇక అంతే !
వియన్నా: ఒక్కోసారి ఆందోళనగా లేదా గందరగోళంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు ఎంత ప్రమాదకరంగా మారతాయో చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఆందోళనగా ఉన్నప్పుడూ కాసేపు నిధానంగా ఉండమని పెద్దులు చెబుతారు కాబోలు. కానీ ఆస్ట్రియాకు చెందిన ఒక వ్యక్తి ఇదే విధంగా గందరగోళంలో ఒక చెత్త పనిచేసి ఎంత పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నాడో చూడండి. (చదవండి: ఏవరు ఈమో నా పియానో వాయిస్తుంది ?) లంబోర్ఘి హురాకాన్ అనే కారు యజమాని సమీపంలోని సరస్సు వద్ద కారు రివర్స్ చేస్తూ పొరపాటున బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్‌ను ఒకేసారి నొక్కేశాడు. ఇంకేముంది కారుతో సహా ఆ యజమాని కూడా సరస్సులో పడిపోయాడు. కానీ అదృష్టవశాత్తు హురాకాన్ కారు నుంచి ఏదోరకంగా బయటపడి సరస్సు నుంచి ఈదుకుంటు వచ్చాడు. అయితే అతని కారు మాత్రం నీటిలో 50 అడుగుల లోతులో మునిగిపోయింది. ఈ మేరకు సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ హురాకాన్ లగ్జరీ కారుని బయటకు తీసింది. అంతేకాదు పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి విచారించడమే కాక ఆ కారు యజమానికి స్వల్ప గాయలవ్వడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడోకరు ఆ కారు యజమాని బ్రేక్ ,యాక్సిలరేటర్ పెడల్లను మిక్స్ చేసి కారుని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించడం గమనార్హం. (చదవండి: వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం) -
సరికొత్త ఘనత సాధించిన సూపర్ లగ్జరీ కారు లంబోర్ఘిని ఉరుస్
ఇటాలియన్ సూపర్ లగ్జరీ కారు తయారీ కంపెనీ లంబోర్ఘిని సరికొత్త ఘనత సాధించింది. ప్రముఖ లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ కారు ప్రపంచంలోనే ఎత్తైన లడఖ్ ప్రాంతంలోని ఉమ్లింగ్ లా పాస్ రహదారిపై నడవడం ద్వారా భారతదేశంలో మరో మైలురాయిని సాధించిందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 8, 9న రెండుసార్లు సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌లో ఉరుస్ ప్రయాణించడంతో ఇప్పటి వరకు లంబోర్ఘిని ప్రయాణించిన ఎత్తైన ప్రాంతం ఇదేనని లంబోర్ఘిని ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నడపడం కష్టం ఉమ్లింగ్ లా పాస్ అనేది భారతదేశంలోని లడఖ్‌లో ఒక పర్వత మార్గం. ఈ మార్గం సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల అక్కడ వాహనం నడపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ మార్గంలో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. "లంబోర్ఘిని ప్రపంచంలోని అత్యధిక క్లిష్టమైన రహదారిపై నడుస్తున్నపుడు మాకు నిజంగా గర్వించదగ్గ క్షణం" అని లంబోర్ఘిని ఇండియా అధిపతి శ్రీ శరద్ అగర్వాల్ చెప్పారు. (చదవండి: ఆరు రోజులు.. రూ.10.56 లక్షల కోట్ల సంపద) ఈ సంధర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ)కు అభినందనలు తెలియజేశారు. లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ప్రపంచంలో అన్ని మార్గాలలో ప్రయాణించే అగ్రశ్రేణి కారు. 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ తో నడిచే ఈ ఉరుస్ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక క్లిష్టమైన రోడ్డులో నడవడంతో తన సామర్థ్యాలను ప్రదర్శించిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో లంబోర్ఘినికి ఉరుస్ ప్రారంభ ధర ₹3.16 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రస్తుతం 8-10 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్
లగ్జరీ స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో లంబోర్గిని స్ట్రేచరే వేరు. లుక్, డిజైన్, కెపాసిటీ ఇలా అన్ని విభాగాల్లో లోపాలకు తావే లేకుండా ఉంటుంది. అందుకే ఈ కాస్ట్లీ కారుకి ఇండియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఓ లోపం కారణంగా ఈ కారుని లంబోర్గిని రీకాల్ చేసింది. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ లంబోర్గిని బ్రాండ్‌తో కార్లను మార్కెట్లోకి తెస్తోంది. ఇందులో ప్రస్తుతం ఉరూస్ మోడల్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. ఈ కారు ఇండియాలో ఎక్స్ షోరూం ధర రూ. 3.10 కోట్లుగా ఉంది. బిజినెస్ మ్యాగ్నెట్లు, సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఈ మోడల్ కార్లను వినియోగిస్తున్నారు. ఇండియాలో లంబోర్గిని ఉరూస్ మోడల్ కార్లు 300ల వరకు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ కార్లలో లోపాలను ఉన్నట్టుగా లంబోర్గిని దృష్టికి వచ్చింది. వెంటనే ఆయా కార్లను పరిశీలించింది. 2021 ఫిబ్రవరి 12 నుంచి 24 మధ్య తయారైన కార్లలో సీటు బెల్టుకి సంబంధించి ఆటోమేటిక్ లాకింగ్ రిట్రాక్టర్ (ఏఎల్ఆర్) ఫంక్షన్లో లోపాలు ఉన్నట్టుగా తేలింది. ఇలాంటి లోపాలు ఇండియాలో మూడు కార్లలో ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే లోపాలు ఉన్న కార్లను అక్టోబరు 1న వెనక్కి తీసుకోనుంది లంబోర్గిని. లంబోర్గిని కార్ల క్వాలిటీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ అస్సలు కాంప్రమైజ్ కాదు. ఈ ఘటన జరగడానికి ముందు 2020 డిసెంబరులో ప్రపంచ వ్యాప్తంగా స్వల్ప లోపాలు ఉన్న 80 ఉరూస్ కార్లను వెనక్కి తీసుకుంది. లంబోర్గిని ఉరుస్‌లో 4 లీటర్ ట్విన్ టర్బో వీ 8 ఇంజన్ అమర్చారు. ఈ కారు కేవలం 3.6 సెకన్ల వ్యవధిలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. లంబోర్గిని ఉరుస్ కార్లను 2018లో మార్కెట్లోకి తెచ్చారు. ఫస్ట్బ్యాచ్లో 1000 కార్లను తయారు చేయగా అందులో ఇండియాకి 25 కార్లను కేటాయించారు. చదవండి : Tesla Cars:'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్ మస్క్ -
ఇంటికి చేరుకున్న ఎన్టీఆర్ లగ్జరీ లంబోర్ఘిని, ధర ఎంతంటే..
సినీ సెలబ్రెటీలకు ఖరీదైన కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి కొత్తరకం మోడల్ కార్లు వస్తే చాలు వాటిని తమ సొంత చేసుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్, మెర్సిడేస్, ఆడి వంటీ కార్లను తమ గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. కాగా ఇటీవల తారక్ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో లాంచ్ అయిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్ బుక్ చేసుకున్నాడు. 3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్ బుధవారం ఇటలీ నుంచి శంషాబాద్ ఎయిరపోర్టుకు ఆ తర్వాత తారక్ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్ అయ్యింది. (చదవండి: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ) ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. 3,16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు. దీంతో ఎన్టీఆర్ లంబోర్ఘీన ఊరుస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్ 20పైగా కార్లు ఉన్నాయట. -
లగ్జరీ కార్ల కేసు: ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న కార్లు ఇవే
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ కార్ల కేసుల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లను అధికారులు గుర్తించారు. అవి.. ► కిషన్ లోహియా (హురాకన్ లంబోర్గిని) ►నిశాంత్ సాబు (హురాకన్ లంబోర్గిని) ►అమీర్‌శర్మ (ఫెరారీ 488) ►సికిందర్ దారేడియా (హురకిన్ లంబర్గిని) ►ముజీబ్ (రోల్స్ రాయిసి) ►నితిన్‌రెడ్డి (ఫెరారీ) ►రాహుల్ (ఫెరారీ) ►నిఖిల్ (ఫెరారీ) చదవండి: హైదరాబాద్‌లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి కాగా పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు. చదవండి: పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి పట్టుబడితే 200 శాతం కట్టాల్సిందే.. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన బైక్‌లు, కార్లు, తదితర వాహనాలు కనీసం నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఇక్కడ తిరిగితే తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు స్వచ్ఛందంగా ఈ పన్ను చెల్లించాలి. కానీ చాలా మంది వాహనదారులు తాము పొరుగు రాష్ట్రాల్లో చట్టబద్ధంగానే వాహనాలను నమోదు చేసుకున్నట్లు భావించి ఇక్కడ చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు. ‘వాహనదారులే స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే నిబంధనల మేరకు వసూలు చేస్తాం. ఆర్టీఏ దాడుల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు పెనాల్టీల భారం పడుతుంది’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు తాజా దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా హైఎండ్ లగ్జరీ వాహనాలపైన దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు డీటీసీ పాపారావు తెలిపారు. అవసరమైతే వాహనదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అయితే హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
Lamborghini : వావ్... అప్పటి వరకు ఆగలేం?
హై ఎండ్ అల్ట్రా మోడ్రన్ లంబోర్గిని తన ఫ్యాన్స్‌కు కిర్రెక్కించే పని చేసింది. సూపర్ కార్గా పేరొందిన అవెంటడోర్ మోడల్లో నెక్ట్స్ వేరియంట్‌కి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టులలో అవెంటడోర్ లుక్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. జులైన 7న మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు లంబోర్గిని తెలిపింది. చివరి వేరియంట్ సక్సెస్ఫుల్ మోడల్ అవెంటడోర్కి ఘనమైన ముగింపు పలికేందుకు లంబోర్గిని సిద్ధమైంది. 2011లో తొలిసారిగా అవెటడోర్ని మార్కెట్లోకి తెచ్చింది. సూపర్‌కార్‌గా మార్కెట్‌ని ఉర్రూతలూగించింది అవెంటడోర్. పదేళ్లు గడిచిన తర్వాత అవెంటడోర్లో చివరి వేరియంట్‌ని అవెంటడోర్ ఎస్ జోటా పేరుతో లంబోర్గిని రిలీజ్ చేయబోతుంది. కేవలం ఒకే ఒక్క ఫోటో రిలీజ్ చేసి లంబోర్గిని లవర్స్‌లో ఉత్సుకతని రేపింది. 2021 జులై 7వ న కంపెనీ వెల్లడించే వివరాల కోసం ఎదురు చూసేలా చేయడంలో లంబోర్గిని విజయం సాధించింది. ఈవీపై ఫోకస్ అవెంటడోర్ మోడళ్లలో అత్యంత పవర్ఫుల్ కారుగా ఎస్ జోటా రాబోతుంది. ఇందులో 1.5 లీటర్ వీ 12 ఇంజన్ని అమర్చారు. ఈ కారు 796 హర్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా లంబోర్గిని కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న హురకాన్, అవెంటడోర్, ఉరస్ స్పోర్ట్స్ మోడళ్లలో ఒకదాన్ని పూర్తిగా ఈవీకి షిఫ్ట్ చేసే దిశగా లంబోర్గిని అడుగులు వేస్తోంది. చదవండి : హైస్పీడులో లగ్జరీ కార్ సేల్స్ -
యూట్యూబ్ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు!
యూట్యూబ్ వీడియోలనును ఖరీదైన అందులోనూ లాంబొర్గిని లాంటి విలాసవంతమైన స్పోర్ట్స్ కారును తయారుచేయడం సాధ్యమేనా? అంటే కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు అసోంకు చెందిన ఒక మెకానిక్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన అన్నట్టు తాను అనుకున్నది సాధించి తీరాడు..తన డ్రీం కార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కారుతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అస్సాంలోని కరీమ్గంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన మోటారు మెకానిక్ నూరుల్ హక్ (30 )ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. భంగా ఏరియాలో ఎన్ మారుతి కార్ కేర్ అనే గ్యారేజీ నిర్వహించే నూరుల్‌కు స్పోర్ట్స్ కార్లంటే మోజు. అందులోనూ లంబోర్ఝిని అంటే మరీ ప్రాణం. ఎలాగైనా అలాంటి కారును నడపాలని, సొంతం చేసుకోవాలని కలలుకన్నాడు. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఇబ్బందులు వచ్చి పడ్డాయి. పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. తన డ్రీంకార్ తయారీపై దృష్టిపెట్టాడు.ఎట్టకేలకు తనకున్న తక్కువ వనరులోనే స్విఫ్ట్ కారు ఇంజీన్ మార్చి తన సొంత వెర్షన్నుతయారు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఎట్టకేలకు తన పాత స్విఫ్ట్‌కారును ఇటాలియన్ లగ్జరీ కారు లగ్జరీ కారు లంబోర్ఘిని మోడల్లో తీర్చి దిద్దాడు. ఎనిమిది నెలలపాటు శ్రమించి తన ప్రాజెక్టును పూర్తి చేశాడు. దీని కోసం .రూ.6.2 లక్షలు ఖర్చు చేశానని నూరుల్ చెప్పాడు.అంతేకాదు తన నెక్ట్స్ టార్టెట్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కారు ఫెరారీ అని స్పష్టం చేశాడు. View this post on Instagram A post shared by Nurul Haque (@haquenurul786786)