Land distribution scheme
-
పాదయాత్రలో ఇచ్చిన హామీ కన్నా మిన్నగా
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో 23 వేల ఇళ్లు ఇస్తున్నామంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితమే అని వైఎస్సార్సీపీ ఎంపీ బాల శౌరి అన్నారు. పేదల కోసం సీఎం జగన్ చేసిన యజ్ఞం ఫలించిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ కన్నా మిన్నగా సీఎం జగన్ పేదలకు ఇళ్లు కేటాయించారని గుర్తుచేశారు. 30లక్షల 70 వేల ఇళ్లు ఇచ్చి ఒక్క అడుగు ముందుకు వేశారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని, సీఎం జగన్ ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 170 సీట్లు ఖాయంగా వైఎస్సార్సీపీ గెలుస్తుందన్నారు. రూ.450కోట్లతో పెనమలూరు నియోజకవర్గంలో సీఎం జగన్ 23వేల ఇళ్లు కట్టించనున్నారని తెలిపారు. మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్ చెప్పాడంటే చేస్తారని, ఇళ్ల నిర్మాణం ద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. -
అటకెక్కిన మూడెకరాలు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అర్హులైన దళితులకు వ్యవసాయయోగ్యమైన మూడెకరాల భూ పంపిణీ ఉమ్మడి జిల్లాలో అటకెక్కింది. అందుబాటులో లేని ప్రభుత్వ భూమి, రెక్కలు తొడిగిన ప్రైవేట్ భూముల ధరల ఫలితంగా భూ పంపిణీకి బ్రేక్‌పడింది. పలు చోట్ల పంపిణీ చేసిన భూములు రైతుల పేరిట పట్టాలు చేయకపోవడం.. మూడెకరాల లోపే పంపిణీ చేయడం.. సాగునీటి సదుపాయం లేకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి జిల్లా మొత్తంలో కేవలం 772 మందికి 1,537.66 ఎకరాల భూమి పంపిణీ చేశారు. అందులో రూ.6.76కోట్ల విలువ చేసే సుమారు 700 ఎకరాల ప్రైవేట్ భూమిని అర్హులకు అందించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. తప్పని ఎదురుచూపులు.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,93,948 మంది ఎస్సీలు ఉన్నారు. వీరిలో సగానికి పైగా మందికి భూమి లేదు. వీరందరూ ప్రభుత్వం పంపిణీ చేసే భూములపై ఆశలు పెట్టుకున్నారు. కానీ.. అవసరం మేరకు భూమి అందుబాటులో లేకపోవడంతో భూపంపిణీ ప్రక్రియకు బ్రేక్‌పడింది. మరోవైపు క్షేత్రస్థాయిలో భూమి కోసం దళితుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో అధికారులు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 251మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి 684.13 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ భూమిని 104 మంది పట్టాదారు రైతుల వద్దే కొనుగోలు చేశారు. ఆయా భూముల్లో నీటి వనరుల ఏర్పాటు కోసం 27బోర్లు అవసరమని అధికారులు గుర్తించారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం బోర్లు కూడా మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 19 బోర్లు వేశారు. మిగిలిన ఎనిమిది బోర్లు కూడా త్వరలోనే వేస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.రాములు తెలిపారు. అయితే మరో 94.04 ఎకరాలను ప్రభుత్వ అధికారులు గుర్తించి దానికి సంబంధించి పట్టాదారు రైతుల వద్ద ఎకరాకు రూ.3.90లక్షల చొప్పున చెల్లించేందుకు 2018 ఏప్రిల్ మాసంలో ఒప్పందం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రెండేళ్ల క్రితమే బ్రేక్‌పడింది. ప్రస్తుతం మార్కెట్ విలువ పెరగడంతో తాజాగా రెండేళ్ల క్రితం ఎకరానికి రూ.3.90 లక్షల చొప్పున ఇస్తామని ముందుకొచ్చిన రైతులు రూ.6లక్షలు ఇస్తేనే అమ్ముతామని చెబుతున్నారు. ఇదే పరిస్థితి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు, పారిశ్రామీకరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో ఆయా ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భూములు అప్పగించేందుకు ప్రైవేట్ భూ యజమానులు ముందుకు రావడం లేదు. ఏడాది క్రితం రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉన్న భూముల ధరలు ఇప్పుడు అమాంతంగా రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెరిగాయి. అప్పుడు అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆలస్యంగా నిధులివ్వడంతో భూముల ధరలు పెరిగిపోయాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో, నారాయణపేట జిల్లా ధన్వాడ, నర్వ, మరికల్, మక్తల్ మండలాల్లో భూ పంపిణీ జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం పులిజల్, తంగాపూర్, చౌటుప్పలి, ఉప్పునుంతల మండలం పెనిమళ్ల, అయ్యవారిపెల్లి, కొల్లాపూర్ మండలం చింతలపల్లి, పెంట్లవెల్లి మండలం కొండూరు, సింగవరం, జాతప్రొలి, లింగాల, తెలకపల్లి మండలం గౌరారం, గడ్డంపల్లి, పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి, కొల్లాపూర్ మండలం మాల చింతల్‌పల్లి, మాచినేనిపల్లి, నర్సింహాపూర్, లింగాల మండలం చిన్నంపల్లి, అంబటిపల్లిలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, దేవరకద్ర, హన్వాడ, మిడ్జిల్, మూసాపేట, కోయిల్‌కొండ, సీసీ కుంట, అడ్డాకల మండలాల్లో భూ పంపిణీ అరకొరగా జరిగింది. అయితే నారాయణపేట జిల్లా ధన్వాడలో రెండేళ్ల క్రితం 50మందికి అధికారులు పంపిణీ చేసిన భూమికి పట్టాలు ఇవ్వలేదు. దీంతో చాలామంది అందులో వ్యవసాయం చేయడం లేదు. నాణ్యమైన భూమి ఇవ్వలేదు నా పేరు తగరం అలివేలమ్మ. భర్త మద్దిలేటి. మాకు ఎలాంటి భూమి లేదు. మాది వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు. ఎలాంటి జీవనాధారం లేని మాకు 2018లో ప్రభుత్వం తరఫున మూడెకరాల భూమి ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ 1.20ఎకరాలు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన భూమి వ్యవసాయయోగ్యానికి అనుకూలంగా లేవు. బండరాళ్లతో నిండి ఉంది. కనీసం బోరు కూడా లేదు. వ్యవసాయానికి అనుకూలమైన మూడెకరాలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. మా మండలంలో చాలా మందికి తక్కువ భూమి వచ్చింది. పట్టా పుస్తకాలు అందించాలి దళితుల కోసమంటూ ప్రభుత్వం మాకు మూడు ఎకరాల భూమిని ఇచ్చింది. నాలుగు సంవత్సరాలుగా పంటను సాగు చేసుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. భూమి కూడా సరైనది ఇవ్వలేదు. సొంత డబ్బులు పెట్టి చదును చేయించుకున్నాం. ఇప్పుడు భూమి మాకు ఇస్తారో లేదో తెలియడం లేదు. పాసు పుస్తకాలు లేకపోవడంతో మాకు రైతుబంధు పథకం అందడం లేదు. ప్రభుత్వం చొరవ చూపి పాసు పుస్తకాలు అందజేయాలని వేడుకుంటున్నాం. – ఎలుక బాల్‌రాజు, కిష్టాపూర్, నారాయణపేట జిల్లా -
ఉగాదిలోగా ఇళ్ల స్థలాల పంపిణీపై కసరత్తు
-
చెప్పేది ఘనం.. చేసింది శూన్యం..
అంత చేశాం..ఇంత చేశాం..అని గొప్పలు చెప్పుకోవడమే గానీ ఎంత చేశారని ప్రశ్నిస్తే..సమాధానం మాత్రం ఉండదు. నాలుగు రోడ్లేసి అభివృద్ధి ఇదేనంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడమే గానీ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోరు. మా సమస్యలను పరిష్కరించడని అడిగితే అదిలించి..బెదిరించి భయపెట్టారే గానీ సమస్యను మాత్రం పరిష్కరించలేదు. సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం): ‘అది 2014 ఎన్నికల సమయం.. అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే జనార్దన్‌రావు ఎంతో వినయంగా నన్ను గెలిపిస్తే మీరు అడిగిన హామీలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అదంతా అబద్ధమేనని తెలుసుకోవడానికి మండల ప్రజలకు ఎక్కువ రోజుల పట్టలేదు. ఈ ఐదేళ్లలో ఏం చేశారంటే..చేసింది శూన్యమే..ఏవో నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోడ్లేసి ఇదే అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం ఇచ్చారు. ఇక జన్మభూమి గ్రామాల్లో సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో బయటకు పంపించడమో, స్టేషన్‌కు తరలించడమో చేసి వారి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో ఏం హామీలతో ముందుకు వస్తారోనని ఓటర్లంతా చర్చించుకుంటున్నారు. ఆశ..నిరాశే.. మోటుమాల గ్రామంలో 1200 ఎకరాలు ఉప్పు కొఠారు భూములు ఉన్నాయి. ఈ భూములను సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యే కాగానే అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు, పాసుపుస్తకాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ ఐదేళ్లలో దాని ఊసే లేదు. గ్రామసభల్లో దీనిపై ప్రశ్నించినా ఏదో సమాధానం చెప్పి కాలయాపన చేశారు గానీ సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులంతా నిరాశ చెందారు. ఎన్నో చెప్పారు..ఎన్ని చేశారు..? మండలంలో సెంట్మెంట్ ప్రకారం శుభ సూచికగా గుండమాల గ్రామం నుంచి ప్రచారం మొదలు పెడతారు. గుండమాలల్లో 2014ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జనార్దన్ ఎన్నో హామీలు ఇచ్చారు. గ్రామం నుంచి సముద్రం దగ్గరకు వెళ్లే రోడ్డును గ్రావెల్ రోడ్డుగా మారుస్తామని, వలలు భద్రపరుచుకోవడానికి, ఇతర అవసరాలకు షెడ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఒకే ఇంట్లో రెండేసి, మూడేసి కాపురాలుఉంటున్నాయని, వారందరికీ ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే వీటిలో ఒక్క సమస్యను పరిష్కరించలేదు. దీనిపై మొదటి జన్మభూమి గ్రామసభలోనే మత్స్యకారుడు ఎమ్మెల్యే జనార్దన్‌ను ప్రశ్నిస్తే స్థానిక టీడీపీ నాయకుడు కోపంతో కూర్చోబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బలవంతంగా లాక్కుంటారా..? మోటుమాల గ్రామంలో సర్వే నంబర్ 465ఏలో భూమిని ఎన్నో ఏళ్లుగా చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే వికలాంగులకు ఇళ్ల స్థలాల పేరుతో వారి దగ్గర భూమిని బలవంతంగా లాక్కకున్నారు. మాట వినకుంటే కేసులు పెట్టించి కోర్టులకు సైతం పంపించారు. వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం మరొకరి భూమిని దౌర్జన్యంగా లాక్కోవడం ఏంటని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా సదరు రైతులకు అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని ఆశ చూపి భూమిని లాక్కకున్నారు. కానీ సెంటు భూమికి కూడా పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదు. ఆన్‌లైన్‌కు అష్టకష్టాలు.. కొత్తపట్నం, కె.పల్లెపాలెం గ్రామాల్లో సర్వే నం.1680లో 115 ఎకరాల భూమిని ఆన్లైన్ కోసం అన్నదాతలు ఎన్నో కష్టాలు పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే జనార్దన్‌ను సైతం కలిసి విన్నవించారు. కానీ వారి గోడు అరణ్యరోదనగానే మిగిలిపోయింది. సర్యేనెంబర్ 1204లో 150 ఎకరాలు ఉప్పు కొటారు భూమి ఆన్లైన్ చేయలేదు. కొత్తపట్నం పడమర దళితవాడ రైతులకు 38 ఎకరాలు భూమి ఆన్లైన్ చేయలేదు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళితే..నెల రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే మీ కాలనీకే రానని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆన్లైన్ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ► పాదర్తి, రంగాయపాలెం గ్రామాల్లో ఉన్న ప్రజలకు శ్మాశానికి దారి ఏర్పాటు చేస్తామని, ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని, భూమి ఆన్లైన్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. 81ఏలో 300 ఎకరాలు ఉప్పు కొఠారు భూమిని పంపిణీ చేస్తామన్నారు. ఒక్క సెంటు పంపిణీ చేయలేదు. దీని కోసం కొంత మంది దగ్గర నగదు కూడా వసూలు చేసినట్లు సమాచారం..అదే విధంగా మండలంలోని పాస్టర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. కమీషన్ల పనులకే అధిక ప్రాధాన్యం కమీషన్లు వచ్చే పనులకే ఎమ్మెల్యే జనార్దన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నోసార్లు మండలానికి వచ్చినా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదు. జన్మభూమి గ్రామాల్లో ప్రశ్నించినా పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో అర్హులకు అన్యాయమే జరిగింది. - ఆళ్ల రవీంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు -
భూ పంపిణీకి మంగళం
‘అనంత’ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి పనిచేస్తారు. కానీ చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భూపంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బాంధవుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. నాలుగున్నరేళ్లలో కనీసం సెంటు భూమి కూడా పంపిణీ చేయకుండా వేధిస్తోంది. దీంతో అర్హులైన నిరుపేదలు ఇప్పటికీ అర్జీలు చేతబట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చిత్రంలోని దంపతులు వన్నూర్‌వలి, వహిదాబేగం. వీరిది బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామం. వీరికి గోవిందపల్లి పంచాయతీలోని రేగడి కొత్తూరు గ్రామం రోడ్డు సమీపాన సర్వేనంబర్ 14–1 లో 4.61 ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి, పత్తి పంటలను వేస్తూ 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నా.. అధికారులు పట్టా ఇవ్వలేదని వాపోయారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆరు సార్లు, ‘మీ కోసం’లో కలెక్టర్‌కు రెండు సార్లు, ఆర్డీఓకు రెండు సార్లు అర్జీ ఇచ్చినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ : కొన్ని పథకాలు నిరుపేదల జీవితాలనే మార్చేస్తాయి. వారి బతుకులకు భరోసానిస్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన భూపంపిణీ పథకం అలాంటిదే. ఈ పథకం వల్లే ఎందరో నిరుపేదలు భూములు పొంది పంటలు సాగుచేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. కానీ నిరుపేదల పాలిట వరంగా మారిన భూపంపిణీ పథకానికి టీడీపీ ప్రభుత్వం పాతర వేసింది. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా... పేదలకు ఎకరా భూమి కూడా పంపిణీ చేయకుండా మోసం చేసింది. తమది పేదల ప్రభుత్వమని చెబుతూనే వారి ఆశలపై నీళ్లు పోసింది. ఏడు విడతల భూ పంపిణీ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదలకు భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2005లో ప్రారంభమైన ఈ యజ్ఞం 2013 వరకు కొనసాగింది. అప్పటికి ఏడు విడతల్లో 34,750 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని పేదలకు 79,027.17 ఎకరాలను పంపిణీ చేశారు. 2004లో ఆయన అధికారం చేపట్టి, ఏడాది వ్యవధిలో రెండు విడతలుగా 6,646 మంది పేదలకు 15,727.51 ఎకరాలను పంపిణీ చేయడం గమనార్హం. కానీ టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకూ ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదు. అక్రమాలకు తెరతీశారు టీడీపీ నేతలు..తమది పేదల ప్రభుత్వమంటూ గొప్పలు చెబుతారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లలో భూపంపిణీ చేపట్టి పేదలను ఆదుకున్నది లేదు. అయితే అధికారులు, అధికారపార్టీ నాయకులు కుమ్మకై అక్రమాలకు తెరతీశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికి అధికారులు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. శింగనమల, కూడేరు మండలాల్లో ప్రభుత్వ భూములకు దొంగ లెటర్లు సృష్టించి దాదాపు 3 వేల ఎకరాలను దిగమింగారు. ఈ అక్రమాలపై విపక్ష పార్టీలన్నీ రోడ్డెక్కి పోరాడటం...పత్రికలు పతాకశీర్షికల్లో ప్రచురించడంతో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు నిజమని తేలడంతో కూడేరు తహసీల్దారు, ఆరుగురు సిబ్బందిపై ఇటీవలే సస్పెన్షన్ వేటు వేశారు. అసైన్మెంట్ కమిటీకి పంపకుండానే... సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఏళ్లగా సాగు చేసుకుంటుంటే ఆ వివరాలను అసెన్మెంట్ కమిటీకి పంపిస్తారు. కమిటీ ఆమోదం తీసుకున్న తర్వాత సాగుదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. అయితే శింగనమల, కూడేరు మండలాల పరిధిలో మాత్రం అసైన్మెంట్ కమిటీతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా పట్టాలు ఇచ్చారు. రాళ్ల గుట్టలు, వంకలు, ఖాళీ స్థలాల సర్వే నంబర్లకు లెటర్లు çసృష్టించారు. ఆ నంబర్ల ప్రకారం డబ్బులు ఇచ్చిన వారికి, అధికారపార్టీ నాయకులు సిఫారసు చేసిన వారికి... ఖాతా నంబరు తయారు చేసి 1–బీ, అండగల్‌లో పేర్లు ఎక్కించడంతో పాటు పాసుపుస్తకం ఇచ్చారు. 1–బీ, అడంగల్‌లో భూమి పట్టాదారునికి ఏ విధంగా సక్రమించింది...? లేదా సాగు చేశారా...? అనే కాలమ్‌లో... కొన్నింటికి డీ.పట్టా, కొన్నింటికి అనువంశికం, మరికొన్నింటికి పిత్రార్జితం అంటూ నమోదు చేశారు. భూ పంపిణీపై నిర్లక్ష్యం భూమిలేని నిరుపేద రైతులకు భూ పంపిణీ చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నాం. పేదలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. నాలుగున్నరేళ్లలో నిరుపేదకు భూమిని పంపిణీ చేసిన దాఖలాలు లేవు. పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతోంది. – డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
పట్టాలు సరే భూములేవి!
నాగిరెడ్డిపేట(నిజామాబాద్): భూమిలేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. లబ్ధిదారులకు మూడెకరాల చొ ప్పున భూమిని పంపిణీ చేయాల్సి ఉం డగా.. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో మాత్రం పట్టాలు మాత్రమే ఇచ్చి భూముల విషయం మరిచారు. దీంతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అసలేం జరిగింది... భూ పంపిణీ పథకం కింద మాల్తుమ్మెద గ్రామంలో మొదటి విడతలో షెడ్యూల్కులాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేశారు. రెండోవిడతలో మరో ఎనిమిది మందిని ఎంపికచేసిన అధికారులు.. వారికి భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన భూమిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇదే గ్రామానికి చెందిన 16 మంది రైతులను సంప్రదించారు. గ్రామస్తుల సమక్షంలో పలుమార్లు వారితో చర్చలు జరిపిన అనంతరం వారి భూములను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 23 ఎకరాల 35 గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తుల సమక్షంలో అప్పటి జాయింట్ కలెక్టర్ సత్తయ్య సమావేశాలు నిర్వహించారు. ఎకరాకు రూ. 4.80 లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. 16 మంది పట్టాదారులలో ఇద్దరికి సంబంధించిన భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో వారికి మాత్రం ఎకరాకు రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్ లేకపోవడంతో పట్టాదారులకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగింది. మరోవైపు పట్టాదారులకు డబ్బులు చెల్లించకుండానే భూ పంపిణీ పథకానికి ఎంపికచేసిన ఎనిమిది మంది పేరిట అంబేద్కర్ జయంతి రోజున జిల్లాకేంద్రంలో కలెక్టర్ చేతులమీదుగా పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులలో ఎవరెవరికి ఏ ఏ సర్వేనంబర్లలో ఎంతెంత భూమి ఉందో పట్టా సర్టిఫికెట్లలో వివరంగా పేర్కొన్నారు. లబ్ధిదారులకు పట్టాలను మాత్రమే పంపిణీ చేసిన అధికారులు వారికి భూములను మాత్రం చూపలేదు. తమకు డబ్బులు చెల్లించేవరకు తమ భూముల్లోకి లబ్ధిదారులను రానిచ్చేదిలేదని పట్టాదారులు స్పష్టం చేశారు. భూమి కోసం లబ్ధిదారులు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాగుకు నోచుకోక బీళ్లుగా... లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎంపికచేసిన మాల్తుమ్మెద గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి పంటలూ సాగు చేయడం లేదు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉందన్న కారణంతో ఆ భూముల్లో ఎలాంటి పంటలు వేయవద్దని భూములను విక్రయించాడని ముందుకు వచ్చిన రైతులకు అధికారులు సూచించారు. దీంతో వారు పంటలు వేయడం లేదు. మరోవైపు తమకు డబ్బులు ఇచ్చేంతవరకు భూములపై హక్కు వదులుకునేది లేదని పట్టాదారులు పేర్కొంటున్నారు. దీంతో భూములు బీళ్లుగానే ఉంటున్నాయి. భూములను విక్రయించేందుకు విముఖత గతంలో తమ భూములను విక్రయించేందుకు ముందుకు వచ్చిన రైతుల్లో ఐదుగురు ప్రస్తుతం భూమిని ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వీరికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. తీర్మానం చేసిన సమయంలో నిర్ణయించిన ధరకంటే ప్రస్తు తం తమ భూముల ధరలు పెరిగాయంటున్నారు. మరోవైపు మాల్తుమ్మెద గ్రామంలో భూ పంపిణీకి ఎంపికైన లబ్ధిదారులు కటిక పేదరికంలో మగ్గుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని చెప్పడంతో వారిలో ఆశలు రెకెత్తాయి. కానీ పట్టాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా భూములు చూపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఊళ్లో పనిదొరక్క వలస వెళ్తున్నారు. ఐదుగురు లబ్ధిదారులు హైదరాబాద్, ఆర్మూర్ ప్రాంతానికి వలస వెళ్లారు. పట్టాలు ఇచ్చి భూములను మరిసిండ్రు మూడు ఎకరాల భూమి ఇస్తామం టే మాకు ధైర్యం వచ్చింది. బతుకు మీద భరోసా కలిగింది. కానీ ఇప్పుడు ఊట్టి కాగితాలే ఉన్నయి. మాకు ఇంకా భూములు సూపట్టలేదు. మాకు భూములను పంచుతామని చెప్పిన అధికారులు పట్టాలను ఇచ్చి భూములను మరిసినట్టుండ్రు. – నీరుడి రణీల, లబ్ధిదారు, మాల్తుమ్మెద ఊట్టి కాగితాలే ఇచ్చిండ్రు మూడెకరాల భూమి ఇస్తమని చెప్పిన సార్లు ఊట్టి కాగితాలే చేతిల పెట్టిండ్రు. మాకు ఇచ్చిన భూమి యాడున్నదో తెలుస్తలేదు. భూముల పైసలు ఇయ్యలేదని వాటి పట్టాదార్లు మమల్ని ఆ భూములళ్లకు రానిస్తలేరు. పెద్దసార్లు దయసూపి మాకు భూములు సూపెట్టాలే. – రాజిపేట లక్ష్మి, లబ్ధిదారు, మాల్తుమ్మెద కలెక్టర్‌కు నివేదిక అందించాం మాల్తుమ్మెదలో భూ పంపిణీ పథకానికి రెం డోవిడతగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సం బంధించి ఇటీవలే కలెక్టర్‌కు నివేదికను పంపా ను. భూమిని కొనుగోలు చేయకుండా లబ్ధిదారులకు పట్టాలెలా ఇచ్చారో నాకు కూడా అర్థం కావడంలేదు. భూమిని విక్రయించేందుకు ముందుకు వచ్చిన పట్టాదారుల్లో కొంతమంది రైతులు అప్పుడు నిర్ణయించిన ధరలకు వారి భూములను అమ్మదానికి ప్రస్తుతం ముందుకు రావడంలేదు. దీంతో ముందుగా ఎంపికచేసిన లబ్ధిదారులకు భూ పంపిణీ సమస్యగా మారింది. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ అహ్మద్ మస్రూ, తహసీల్దార్, నాగిరెడ్డిపేట -
భూ పంపిణేది.?
ఆదిలాబాద్‌అర్బన్: భూమిలేని దళిత కుటుంబాలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి పంపిణీ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందించేలా ప్రభుత్వం 2014 ఆగస్టులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బస్తీ పథకం పేదలకు భరోసా ఇవ్వలేకపోతోంది. దళిత మహిళల పేరిట ఏటా భూ పంపిణీ చేసి వ్యవసాయానికి అనువైన భూములు కొనివ్వాలనేది పథకం ఉద్దేశం. మూడెకరాల భూమితోపాటు ఇచ్చిన మొదటి యేడాది పెట్టుబడి ఖర్చులు సైతం ప్రభుత్వం అందజేస్తోంది. పథకం అమలు ఇంతవరకు బాగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అర్హులకు లబ్ధి చేకూరడం లేదు. జిల్లాలో 18 మండలాలు ఉండగా, ఇంకా మూడు మండలాల్లో ఈ పథకం ప్రారంభమే కాలేదు. వ్యవసాయానికి అనువైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకానికి నిధులు రాకపోవడంతో పథకం అమలుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూములు అమ్మేందుకు యాజమానులు ముందుకు వస్తున్నా.. నిధులు లేక అధికారులు ముందడుగు వేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో 1101 మంది లబ్ధిదారులకు 2,924 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జిల్లాలో ప్రగతి ఇలా.. జిల్లాలో 18 మండలాల్లో పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. 15 మండలాల్లో భూ పంపిణీ జరిగింది. ఆదిలాబాద్ అర్బన్, మావల, సిరికొండ మండలాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. మైదాన ప్రాంతాలతోపాటు ఏజెన్సీ గ్రామాలున్నాయి. జిల్లాలో ఈ నాలుగేళ్లలో 1101 మంది లబ్ధిదారులకు 2,924 ఎకరాల వ్యవసాయ భూములు కొని పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,670 ఎకరాలు పంపిణీ చేయగా, 642 మంది మహిళలకు లబ్ధి చేకూర్చారు. ఇందుకు రూ.70.12 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక బోథ్ నియోజకవర్గంలో 1,254 ఎకరాలు కొనుగోలు చేసి 459 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇందుకు రూ.51.39 కోట్లు ఖర్చు చేశారు. అత్యధికంగా జైనథ్ మండలంలో 1302 ఎకరాలు కొని 515 మంది మహిళలకు అందజేయగా, అతి తక్కువగా నేరడిగొండ మండలంలో 8.36 ఎకరాలు కొనుగోలు చేసి ముగ్గురికి పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులో 650 ఎకరాలు.. మూడెకరాల భూమి కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు రాకనే కొనుగోలుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. దీంతో వ్యవసాయానికి అనువైన భూములు కొనుగోలు చేసేందుకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్పా భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి తోడు జిల్లాలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో పథకం అమలు మరింత వెనుకబడుతోంది. మంచి భూములను అమ్మేందుకు పట్టాదారులు ముందుకు వచ్చినా నిధులు లేక వెనుకడుగు వేయక తప్పడం లేదు. నియోజకవర్గంలో ఆర్డీవో, కింది స్థాయి అధికారులు దళిత బస్తీ కింద వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు గడిచిన వేసవిలో భూములు పరిశీలించారు. వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను గుర్తించి సిద్ధంగా ఉంచారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 650 ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, పరిశీలన చేసి కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూముల కొనుగోలుకు సరైన సమయమిదేనని, వర్షకాలం కావడంతో ఏ రకం భూముల్లో ఎంత మేరకు పంటలు ఉన్నాయో, దిగుబడి సాధించవచ్చవచ్చో.. లేదో.. తెలుసుకునే అవకాశం ఉందని విక్రయదారులు, లబ్ధిదారులు కోరుతున్నారు. ఫలితంగా భూములు సాగుకు యోగ్యమైనవా.. కావా..? అని గుర్తించవచ్చని చెబుతున్నారు. డిసెంబర్ వరకు రైతులు వేసుకున్న పంటలు ఉంటాయని, పంపిణీకి అవకాశం లేకున్నా భూములను పరిశీలించేందుకు అనువైన సమయమని పేర్కొంటున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపులు.. భూముల పంపిణీ కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూçస్తున్నారు. ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో భూములు పంపిణీ చేస్తామని చెబుతున్నా అధికారులు ఇంకా ఏ ఒక్క మండలంలో పూర్తిగా అన్ని గ్రామాల్లో భూములు పంపిణీ చేసిన దాఖాలాలు లేవు. పథకాల ప్రక్రియ అమలులో భాగంగా గ్రామాలకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సైతం భూ పంపిణీని వేగవంతం చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెబుతున్నారే తప్పా ఆచరణలోకి తేవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్‌కు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూపంపిణీకి మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం అటకెక్కుతోంది. ఈ పథకం అమలుకు సంబంధించి వార్షిక లక్ష్యాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 159 మంది లబ్ధిదారులకే భూ పంపిణీ చేసేలా ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించడం గమనార్హం. భూపంపిణీ పథకం కింద 2017–18 వార్షిక సంవత్సరంలో రూ.165 కోట్లు కేటాయిస్తూ.. 1,529 మంది దళిత రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు 3,609 ఎకరాలు గుర్తించింది. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి విక్రయించి దళితులకు ఇచ్చేలా ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుత వార్షిక సంవత్సరంలో లక్ష్యాలు దారుణంగా పతనమయ్యాయి. గతేడాదితో పోలిస్తే 2018–19 వార్షిక సంవత్సరంలో పదోవంతు మందికే భూపంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తంగా 159 మంది లబ్ధి్ధదారులకు 406 ఎకరాల భూమిని పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. రూ.18.5 కోట్లు బడ్జెట్ కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. 22 జిల్లాలు నిల్.. : పట్టణీకరణ ప్రభావంతో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ పథకం మొదటి నుంచీ అమలు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా భూపంపిణీ నుంచి మినహాయింపునిచ్చారు. తాజా వార్షిక సంవత్సరంలో 22 జిల్లాలో భూపంపిణీ పథకాన్ని అమలు చేయట్లేదు. భూపంపిణీ అమలు కాని జాబితాలో జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి జిల్లాలున్నాయి. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో 107 మందికి భూపంపిణీకి లక్ష్యాన్ని నిర్దేశించారు. జోగుళాంబ గద్వాల, కామారెడ్డి జిల్లాలకు కలిపి 27 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 14, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 మందికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురికి ఎస్సీ కార్పొరేషన్ భూపంపిణీ చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రియల్ ఎస్టేట్ భూమ్ అంతటా విస్తరించింది. దీంతో భూపంపిణీకి భూముల సమస్య తలెత్తింది. -
భూ మాఫియా రుబాబు!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: వారికి అనువంశికంగా వచ్చిన భూములవి. ఈ భూములను గత ఏడాది దళితులకు భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆ కుటుంబాలు ముందుకొచ్చాయి. ఎంతో ఔదార్యంతో ఆ కుటుంబాలు ముందుకొచ్చినా అక్కడ ఉన్న భూ మాఫియా.. ‘ఈ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దు.. పదికో, పరక్కో మాకే ఇవ్వాలి’ అంటూ ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. సూర్యాపేట జిల్లా చింతపాలెం మండలం వెల్లటూరులో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. జిల్లాలోని హుజూర్‌నగర్‌కు చెందిన అమరవాది రవిచందర్, అమరవాది గోపాలకృష్ణమూర్తి, అమరవాది చంద్రమౌళీశ్వర ప్రసాద్‌తో పాటు మరో పదిమంది బ్రాహ్మణ కుటుంబాలకు చింతపాలెం మండలం వెల్లటూరు గ్రామంలో భూములున్నాయి. ఈ గ్రామంలోని సర్వే నంబర్ 488 లో అనువంశికంగా వచ్చిన సుమారు 135 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 70 ఎకరాలను ఆ 13 కుటుంబాలు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాయి. వెంటనే స్పందించిన కలెక్టర్, సదరు దరఖాస్తులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలంటూ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. భూ రికార్డులను పరిశీలించి వివరాలు పంపాలని జేసీ, చింతపాలెం తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఆ భూముల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులు తేల్చలేదు. పదికో.. పరకో మాకే అమ్మాలి! ఈ భూములను బ్రాహ్మణ కుటుంబాలు ప్రభుత్వానికి ఇస్తున్నాయని తెలుసుకున్న స్థానిక భూ మాఫియా వీరిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆ భూమిని తమకే పదికో.. పరకో అమ్మాలని బెదిరింపులకు పాల్పడుతోంది. మూడు రోజుల క్రితం ఆ భూములను పరిశీలించేందుకు జేసీ వెళ్లారు. భూములు తమ అ«ధీనంలో ఉన్నాయని, తమకు కొందరు అమ్మారంటూ భూ మాఫియా జేసీ ముందు వాదించింది. జేసీ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బ్రాహ్మణ కుటుంబాలను భూ మాఫియా సభ్యులు భయభ్రాంతులకు గురిచేయడంతో వారు దీనిపై కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పట్టించుకోని స్థానిక రెవెన్యూ సిబ్బంది .. ప్రభుత్వానికి ఇస్తామన్న భూమిపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రైతుబంధు పథకం కింద ఇటీవల ఈ భూములకు సంబంధించి కొత్త పట్టేదారు పాస్ పుస్తకాలు కూడా సదరు బ్రాహ్మణ కుటుంబాల్లో కొందరికి వచ్చాయి. మిగతావి తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నా యి. ‘ప్రభుత్వానికి ఇస్తే ధర తక్కువగా వస్తుందని, ఎంతకో కొంతకు భూ మాఫియా సభ్యులకే అమ్మండి’ అంటూ స్థానిక రెవెన్యూ యంత్రాంగం వారికి వత్తాసు పలుకుతోందని బ్రాహ్మణ కుటుం బాలు ఆరోపిస్తున్నాయి. మళ్లీ సీఎంవో మెట్లెక్కిన బాధితులు ఈ భూముల విషయమై తమను భయాందోళనకు గురిచేస్తున్నారంటూ ఆ బ్రాహ్మణ కుటుంబాలు శుక్రవారం సీఎంవోను ఆశ్రయించాయి. స్థానిక రెవెన్యూ సిబ్బంది భూ మాఫియాతో చేతులు కలిపి ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని సీఎంఓ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. తమ భూములవైపు వెళ్తే భూ మాఫియా తమను హత్య చేయాలని చూస్తోందని, తమకు రక్షణ లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు న్యాయం చేయాలి.. ఈ భూములను దళితుల భూ పంపిణీ పథకానికి ఇవ్వడానికి ముందుకొస్తే భూ మాఫియా సభ్యులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవి మావి కావడంతోనే కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయి. మిగతావి రెండో విడతలో ఇస్తామంటున్నారు. మాకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. – అమరవాది రవిచందర్, హుజూర్నగర్ మా భూములని వీళ్లు, వాళ్లు అంటున్నారు.. బ్రాహ్మణ కుటుం బాలు వెల్లటూరులోని వారి భూములను దళితుల భూ పంపిణీ పథకానికి ఇస్తామని దరఖాస్తు చేసింది వాస్తవమే. ఆ భూముల పరిశీలనకు జాయింట్ కలెక్టర్ వచ్చారు. అయితే ఆ భూములు తమవంటే.. తమవని బ్రాహ్మణ కుటుంబాలు, గ్రామస్తులు అంటున్నారు. ఈ భూముల విషయాన్ని పరిశీలిస్తున్నాం. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు బ్రాహ్మణ కుటుంబాలకు వచ్చాయి. – జె.కార్తీక్, తహసీల్దార్, చింతపాలెం మండలం -
గిరిపుత్రులకూ భూపంపిణీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేద గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారికి సాగు భూములను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పేద దళిత కుటుంబాలకు అమలు చేస్తున్న భూపంపిణీ పథకాన్ని గిరిజనులకూ విస్తరించనుంది. ఈ మేరకు గిరిజన అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వచ్చేవారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రకటన చేసే అవకాశముందని గిరిజనాభివృద్ధి శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దళితులకు భూపంపిణీ పథకం కింద ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తున్నారు. ఆయా చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే.. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి అందజేస్తున్నారు. ఇలా నాలుగేళ్లలో దాదాపు 10 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇలా భూములు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా నిర్ధారించుకున్న ప్రభుత్వం.. గిరిజనులకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఎకరా నుంచి మూడెకరాల వరకు.. దళితులకు భూపంపిణీ పథకం కింద ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తున్నారు. అదికూడా వారు నివాసం ఉండే గ్రామాలకు సమీపంలోనే అందజేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా సమస్య ఏమీ లేకపోయినా.. ప్రధాన రహదారులు, నగర ప్రాంతాలకు చేరువలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో పథకం అమలు ఇబ్బందికరంగా మారింది. ఆయా చోట్ల భూముల ధరలు భారీగా ఉండటం వల్ల మూడెకరాల భూమి పంపిణీ కోసం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. తాజాగా గిరిజనులకు భూమి పంపిణీ అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే గిరిజనులకు భూపంపిణీతో పెద్దగా భారం ఉండబోదని అధికారవర్గాలు భావిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు, తండాల్లో భూముల ధరలు తక్కువగా ఉంటుండటం, ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు యోగ్య భూములు ఎక్కువగా అందుబాటులో ఉండటం వంటి వాటితో భూపంపిణీ ప్రక్రియ సులభమేనని అంచనా వేస్తున్నాయి. కానీ గిరిజనులకు కచ్చితంగా మూడెకరాలు ఇవ్వాలన్న సీలింగ్ కాకుండా.. ఎకరా నుంచి మూడెకరాల వరకు అందుబాటులో ఉన్నంత మేర భూమిని పంపిణీ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఏటా గరిష్టంగా 3 వేల కుటుంబాలకు భూమి పంపిణీ చేయవచ్చని గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశముందని మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. -
‘మూడెకరాల’కు కొత్త కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: దళితులకు మూడెకరాల భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. 2017–18 వార్షిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు వేగవంతం చేసింది. నెలరోజుల ప్రణాళిక రూపొందించిన కార్పొరేషన్.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8924.21 ఎకరాల భూమిని దళిత రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది పంపిణీ ప్రక్రియ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ ఏడాది గడువుకు ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలివ్వాలని భావిస్తోంది. నెలరోజుల కార్యాచరణ జిల్లాల వారీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు భూ పంపిణీ లక్ష్యాలు నిర్దేశించిన ఎస్సీ కార్పొరేషన్.. ఆ మేరకు భూమి సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. భూముల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను పక్షం రోజుల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే భూముల రిజిస్టర్, డీమార్కేషన్ ప్రక్రియను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. దీంతో జిల్లా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 30 రోజుల పనిదినాల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరోవైపు పంపిణీకి గుర్తించిన భూముల్లో నీటి వసతి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. పంట ఖర్చుల పంపిణీ.. లబ్ధిదారులకు ఏడాదిపాటు సాగు ఖర్చులివ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. పథకం మార్గదర్శకాల్లోనూ నిబంధనలు పొందుపరిచింది. తాజాగా 2014–15 వార్షిక సంవత్సరానికి రైతులకు ఇవ్వాల్సిన సాగు ఖర్చుల పంపిణీకి ఎస్సీ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. 2014–15లో రాష్ట్రవ్యాప్తంగా 11,786 ఎకరాలు పంపిణీ చేయగా.. 6053.10 ఎకరాల్లో పంటలు వేస్తున్నారు. రైతులకు ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక సాయం అందించాలని, మిగిలిన భూమికి నవంబర్ నెలాఖరులోగా నిధులివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
పట్టాలిస్తిరి.. భూములేవీ సారూ..!
- దళితుల భూ పంపిణీ పథకం కింద 3,668 మందికి పట్టాలు - 9,659.95 ఎకరాలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు - మెజారిటీ లబ్ధిదారులకు భూమి అప్పగించని యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం గాడితప్పుతోంది. ఈ పథకం కింద అర్హులైన వారికి మూడు ఎకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమిని అందించినట్లు పట్టాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీన వైఖరితో లబ్ధిదారులకు మాత్రం భూములను అప్పగించలేదు. దీంతో ఈ పథకం కింద ఎంపికైనా లబ్ధిదారుల కుటుంబాల ఆర్థిక స్థితిలో మాత్రం ఏ మార్పు కలగలేదు. పేద దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చే క్రమంలో భాగంగా 2014–15 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద విడతల వారీగా అర్హులను ఎంపిక చేస్తూ.. మూడు ఎకరాల వరకు వ్యవసాయ భూమిని ఉచితంగా ఇస్తోంది. ఈ క్రమంలో అర్హుల ఎంపిక, భూ పంపిణీ కార్యక్రమాన్ని చకచకా చేస్తున్న అధికారులు.. రైతులకు భూమిని అప్పగించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా పలు జిల్లాల్లో మెజారిటీ రైతులు భూ పంపిణీ కింద సర్టిఫికెట్లు పొందినా.. తమ పొలం ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పట్టాల పంపిణీతోపాటు భూమి వివరాలు స్పష్టం చేసినప్పటికీ.. ఆ భూమి వివాదాలపాలు కావడంతో లబ్ధిదారుల పరిస్థితి గందరగోళంగా మరింది. పంపిణీ 9,659.95 ఎకరాలు.. 2014–15 సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన భూ పంపిణీ పథకం ద్వారా ఇప్పటివరకు 3,668 దళిత కుటుంబాలకు 9,659.95 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ.. కొన్ని చోట్ల భూ లభ్యత, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల మధ్య విస్తీర్ణంతో పంపిణీ చేశారు. ఈ మేరకు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ భూమి పొజిషన్ చూపి అప్పగించలేదు. దీంతో పంపిణీ చేసిన భూమి పడావుగా ఉండగా.. లబ్ధి దారులు వ్యవసాయ కూలీలుగా ఇతరుల పొలాల్లో పని చేస్తున్నారు. 406.21 కోట్ల ఖర్చుతో.. భూ పంపిణీ పథకం కింద పంపిణీ చేసే భూమి సాగుకు యోగ్యమైనదిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటే వర్షాలు లేని సందర్భంలోనూ రైతు సాగు చేసుకునే వీలుంటుందని భావించింది. దీంతో ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి అంతా దాదాపు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిందే. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.406.21 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో ఎకరానికి సగటు రూ.4.28 లక్షలు ఖర్చు చేసింది. ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేసినా అర్హులైన రైతులు ఇప్పటికీ సాగు చేయకపోవడం గమనార్హం. తాజాగా మరో 10 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసేలా ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించి రూ.447.35 కోట్ల మేర నిధులకు పచ్చజెండా ఊపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 4,007 కుటుంబాలకు భూ పంపిణీ చేయాలని ఆ శాఖ భావిస్తోంది. భూమి ఎప్పుడు చూపుతారు.. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పగిడ్యాల, నాగసముందర్, అగ్గనూరు గ్రామాల్లో దాదాపు 40 మంది రైతులకు భూ పంపిణీ చేసినప్పటికీ ఒక్కరికీ పొజిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ రైతులంతా ఉపాధి కూలీ పనులకు వలస కడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామ పరిధిలో 50 మంది లబ్ధిదారులకు మూడు ఎకరాల చొప్పున 150 ఎకరాలు పంపిణీ చేసినప్పటికీ పొజిషన్ మాత్రం ఇవ్వలేదు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో అధికారులు కొనుగోలు చేసిన భూమి వివాదాస్పదమైంది. దీంతో ఆ రైతులకు కొత్తగా వేరేచోట భూమి కొనుగోలు చేసి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అది నెరవేరలేదు. -
జైలంటే జైలూ కాదు...
జైలనగానే ఊచలుండి, గాలి, వెలుతురు రాని నాలుగు గదుల గోడ, రుచీ పచీ లేని తిండి, చుట్టూ తుపాకులతో పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం గుర్తొస్తాయి. కానీ నార్వేలోని బాస్టాయ్ జైలు ఇందుకు విరుద్ధం. ఆ జైలు పక్షుల దైనందిన జీవితం గురించి వింటే నేరం చేసి జైలుకు వెళితే బాగుం డునేమోననిపిస్తుంది. అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేకుండానే క్రమశిక్షణతో పొద్దున్నే లేస్తారు. వ్యాయామం చేస్తారు. జిమ్‌కు వెళతారు. అల్పాహారం తీసుకొంటారు. తర్వాత పక్కనే బీచ్‌లో సన్‌బాత్ చేస్తారు. నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు కాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు. ఈ బాస్టాయ్ జైల్లో కటకటాల గదులుండవు. చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులుంటాయి. ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటారు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు. ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడిపోతారు. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. నేరస్థుల్లో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది. కూలీ పనికి పోయేదాన్ని కాదు.. ఏడాది కిందట మూడెకరాలిచ్చారు. రికార్డుల్లో పేరు ఎక్కిస్తానని పట్వారి పట్టాలు తీసుకున్నాడు. హద్దులు చూపించిన వెంటనే పాసు పుస్తకాలు ఇస్తామన్నరు. ఇప్పటివరకూ హద్దులు చూపలేదు. కలెక్టర్ ఆఫీస్‌లో రెండు సార్లు సంప్రదించాం. వారంలో పని అయిపోతుందని సార్లు చెప్పారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మా భూమికి హద్దులు చెప్తే దుక్కులు దున్ని సాగు పనులు చేసుకునేదాన్ని. ఖాళీగా ఉండలేక కూలీ పనికి పోతున్నా. - నర్సమ్మ, బాగాయిపల్లి, వికారాబాద్ జిల్లా హద్దు రాళ్లు సిద్ధం చేసుకున్నా.. భూ పంపిణీ పథకం కింద నాకు 1.30 ఎకరాలు ఇచ్చారు. పాసు పుస్తకాలు, టైటిల్ ఇచ్చినప్పటికీ భూమి హద్దులు మాత్రం చూపించలేదు. దీంతో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. ‘సర్వే చేసి హద్దులు చూపిస్తాం రాళ్లు తెచ్చుకోండి’ అని సార్లు చెప్తే మరుసటి రోజే రాళ్లు తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నా. కానీ సార్లు రాలేదు.. హద్దులు చూపలేదు. కాలం అయిపోయాక ఇస్తే మళ్లీ ఏడాది పాటు ఆగాల్సిందే. – తీగమళ్ల లక్ష్మి, నాగసముందర్, యాలాల మండలం, వికారాబాద్ జిల్లా -
దళితులకు చేయూత
ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా కార్యాచరణ భూపంపిణీతో పాటు పలు పథకాల వర్తింపు కచ్చితంగా భూమి సాగులోకి వచ్చేలా సాయం వ్యవసాయ శాఖ ద్వారా మొదటి పంటకు పెట్టుబడి, మెళకువలపై శిక్షణ కూడా.. ఇప్పటి వరకు 130 మందికి 359.07 ఎకరాలు పంపిణీ వరంగల్ రూరల్: రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న భూపంపిణీ పథకం ద్వారా జిల్లాలోని అర్హులైన దళితులకు భూమి అందజేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచన మేరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. నిరుపేద దళితులకు భూమి అందజేయడం ద్వారా బలహీనులైన వారిని దళితులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. భూమి ఇవ్వడమే కాకుండా సాగుకు యోగ్యంగా సిద్ధం చేయడానికి భూమి అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా సారవంతమైన మట్టిని తీసుకొచ్చి చదును చేయించనున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 359.07 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో కొనుగోలు చేసిన ఈ భూమిని 130 మంది భూమి లేని నిరుపేద దళిత మహిళలకు అందచేశారు. మొదటి పంటకు పెట్టుబడి కూడా.. నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయడంతో పాటు పలు పథకాలు వర్తింప జేయనున్నారు. భూములను సాగుకు అనువుగా మార్చేలా ఉపాధి హామీ పథకం ద్వారా సారవంతమైన మట్టి తెప్పించి చదును చేయిస్తారు. అలాగే, మొదటి పంటకు పెట్టుబడితో పాటు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు, దున్నుడు కూళ్లు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సమకూర్చాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఇంకా సబ్ ప్లాన్ ద్వారా 13 బోర్లు వేయించగా.. మరో 40 బోర్లు, బావులు మంజూరు చేశారు. జాతీయ ఉపాధి హమీ పథకంలో.. దళితులకు ఇచ్చిన భూమి కచ్చితంగా సాగులోకి రావాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు సాగు అవసరాల కోసం ప్రతీ 6–9 ఎకరాలకు ఒక వ్యవసాయ బావి తవ్వనున్నారు. అనంతరం భూములను నాగళ్లతో లోతుకు చాళ్లు వేయిస్తారు. రైతుల పంట పొలాల్లో నాడెపు కంపోస్టు ఫిట్, ఫాం పాండ్ తవ్విస్తారు. ఆ తర్వాత రైతుల పంట పొలాల్లో కూరగాయల సాగుకు అనుగుణంగా తీగ జాతి కూరగాయల సాగుకు పందిల్లు వేయిస్తారు. అవసరమైతే పశువుల కొట్టం కూడా ఏర్పాటు చేయిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ జిల్లాలో భూమి అందజేసిన 130 మంది లబ్ధిదారులకు భూమి అభివృద్ధి, మెరుగైన పంటల సాగుపై వరంగల్ రూరల్ జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ ఆధ్వర్యాన ఒక రోజు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు వరంగల్ రూరల్ జిల్లా ఎస్సీ కార్పోరేషన్ అధికారి డి.సురేష్ తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాగులో తీసుకోవాల్సిన మెళకువలపై అవగాహన కల్పిస్తామన్నారు. పంటలు, కూరగాయలే కాకుండా పశుపోషణపై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. భూమి కొనుగోలు ఇలా.. వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం పులుకుర్తిలో 20.17 ఎకరాలు, చెన్నారావుపేట మండలం కోనాపూర్‌లో 24 ఎకరాలు, లింగగిరిలో 22.04 ఎకరాలు, దుగ్గొండి మండలంలోని ముద్దునూరులో 25.12 ఎకరాలు, తిమ్మంపేటలో 10.39 ఎకరాలు, వెంకటాపూర్‌లో 8.12 ఎకరాలు, నల్లబెల్లి మండలంలోని గోవిందపూర్‌లో 11 ఎకరాలు, రాంపూర్‌లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నెక్కొండ మండలంలోని నాగారం 43.28 ఎకరాలు, దీక్షకుంటలో 21 ఎకరాలు, పరకాల మండలం వరికోలులో 7.32 ఎకరాలు, నాగారంలో 12.27 ఎకరాలు, చౌటుపర్తిలో 12.32 ఎకరాలు , పర్వతగిరి మండలంలోని వడ్లకొండలో 44.11 ఎకరాలు, శాయంపేట మండలం కాట్రాపల్లి లో 64.39 ఎకరాలు భూములు కొనుగోలు చేసి 130 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. త్వరలో రైతులకు శిక్షణ ఇస్తాం – డి.సురేష్, వరంగల్ రూరల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి (ఫొటో వస్తుంది) జిల్లాలో భూమి కొనుగోలు పథ«కంలో భూములు పొందిన నిరుపేద ఎస్సీలకు త్వరలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించాం. వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, హార్టికల్చర్, భూమి సెల్, ఆర్డీలతో భూ సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నుంచి అంద -
లక్ష్యానికి దూరంగా దళితుల భూపంపిణీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంపై ఆధారపడిన భూమిలేని పేద దళితుల కుటుంబాలకు భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ ఆశయం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. దళితులకు భూపంపిణీ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదివేల ఎకరాలు పంపిణీ చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించట్లేదు. ఈ ఏడాది 3,334 మందికి భూపంపిణీ చేయాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) నిర్ణయించింది. ఇటీవలే ఈ పథ కం తీరుతెన్నులపై కార్పొరేషన్ అధికారులు, జిల్లా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించి మార్చి రెండోవారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు 1,598 మందికి 4,190 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు. అంటే మరో పది, పదిహేను రోజుల్లో ఇంకా 1,730 మందికి 5,810 ఎకరాలు పంపిణీచేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఇది ఏ మేరకు సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటిదాకా 4,190 ఎకరాలను లబ్ధిదారులకు మంజూరు చేసినా, కేవలం 902 మందికి 2,450 ఎకరాలు మాత్రమే భూమిని రిజిష్టర్ చేసి పట్టాలు, పాసు పుస్తకాలు అందజేశారు. అదీగాక భూమి పంపిణీ చేసిన రైతులకు భూమి అభివృద్ధి కింద కూడా కరెంట్ మోటార్లు బిగించడం, వ్యవసాయానికి అవసరమైన వివిధ రకాల సహాయాలు అందించాల్సి ఉంది. అయితే దీనిపైనా జిల్లాస్థాయిలో కలెక్టర్లు మొదలుకుని కిందిస్థాయి వరకు పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. -
నత్త నడకన భూ పంపిణీ !
* ఇప్పటికి 28 శాతమే లక్ష్య సాధన * లక్ష్యం 8,634 ఎకరాలు.. పంపిణీ చేసింది 2,449 ఎకరాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు భూపంపిణీ పథకం నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది (2015-16) లక్ష్య సాధన మరీ తీసికట్టుగా మారింది. నిర్దేశించుకున్న లక్ష్యాలకు కేవలం 28 శాతం మేరకేసాధించడంతో.. రాబోయే రోజుల్లో ఇది ఏవిధంగా వేగం పుంజుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ భూమి తగినంత లేకపోవడంతో ఎకరాకు రూ. 2-7 లక్షల మధ్య వెచ్చించి ప్రైవేట్‌భూమి కొనుగోలు చేసి వ్యవసాయాధార ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ కేటాయించింది. అయితే భూమి కొనుగోలుకు సంబంధించి వివిధ ప్రక్రియలను పూర్తిచేయడం అటు జాయింట్ కలెక్టర్ మొదలుకుని కిందిస్థాయిలో రెవెన్యూ సిబ్బందికి, ఇటు ఎస్సీకార్పొరేషన్ ఈడీ మొదలుకుని, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇబ్బందిగా పరిణమించింది. మొత్తం 2,878 మంది లబ్ధిదారులకు 8,634 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ఎస్సీ కార్పొరేషన్.. 9 జిల్లాల (హైదరాబాద్ మినహా) అధికారులను ఆదేశించింది. అయితే ఇప్పటివరకు (ఈనెల 12 నాటికి) కేవలం 903 మందికి 2,449.61 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు. లక్ష్యసాధనలో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా మాత్రమే 54 శాతం సాధించి మెరుగ్గా ఉండగా, మెదక్ 43, ఆదిలాబాద్ 42, వరంగల్ జిల్లా 29 శాతం లక్ష్యాలను సాధించాయి. మిగిలిన ఇతర జిల్లాలు 20 శాతం లోపున్నాయి. రంగారెడ్డి జిల్లా కేవలం 12 మందికి 35.39 ఎకరాలు పంపిణి చేసి అట్టడుగున నిలిచింది. భూమి కొనుగోలుకు రూ.431.70 కోట్లు అందుబాటులో ఉంచగా, కేవలం రూ.103.82 కోట్లు ఖర్చుచేశారు. పంపిణీ చేసిన భూమిలో 659 మంది లబ్ధిదారులకు 1,814 ఎకరాలు మాత్రమే భూమి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను అందజేశారు. ఇంకా మూడోవంతు మందికి భూమిని రిజిష్టర్ చేయాల్సి ఉంది. అదీగాక ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి అభివృద్ధికి తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో లబ్ధిదారులకు ప్రయోజనం కలగడం లేదు. -
నత్తనడకన భూపంపిణీ
7 నెలల్లో ఇచ్చింది కేవలం 663 మందికే అధికారుల మధ్య సమన్వయ లేమితో కుంటుతున్న పథకం వచ్చే మార్చి కల్లా మరో 5 వేల ఎకరాల పంపిణీ లక్ష్యం ఇలాగైతే లక్ష్యం చేరిది గగనమే.. హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు భూ పంపిణీ పథకం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న తీరుగా సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు ముగిసిపోయినా పథకం అమలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య మొత్తం 663 లబ్ధిదారులకు 1,822 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారు. వచ్చే మార్చిలోగా (ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా) మరో 5 వేల ఎకరాలను పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.. దాన్ని చేరుకునే దాఖలాలు కనిపించడం లేదు. పథకాన్ని మరింత మెరుగ్గా చేపట్టేందుకు రెవెన్యూ శాఖతో మరింత సమన్వయం పెంచుకోవాలని, జిల్లాల్లో జేసీలు మొదలుకుని, ఆర్డీవోలు, ఎమ్మార్వోలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని భావించినా అది ఆచరణకు నోచుకోవడం లేదు. జిల్లాల్లోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల(ఈడీ) ఆఫీసుల్లో ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను డిప్యుటేషన్‌పై నియమించి, భూపంపిణీ పనులను వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకున్నా అవీ అమలు కావడం లేదు. పథకం అమలుకు రెవెన్యూ శాఖపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తుండడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,462 మందికి 3,936 ఎకరాల మేర మాత్రమే భూమిని పంపిణీ చేయగలిగారు. అందులో 1,203 మందికి 3,274 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినా.. 946 మందికి మాత్రమే ల్యాండ్ రికార్డులు పంపిణీ చేశారు. ఈ ఏడాది తీరిది! రాష్ట్రంలో 9 జిల్లాల్లో గత ఏడు నెలల్లో మొత్తం 663 లబ్ధిదారులకు 1,822 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరం కూడా పంపిణీ చేయలేదు. ఇక హైదరాబాద్‌కు పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాల్లో భూములకు అధిక రేట్లు, కోర్టు కేసులు, వివాదాలు ఉండడంతో కేవలం ఆరుగురికి 17 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇక నల్లగొండ జిల్లాలో 30 మందికి 66 ఎకరాలు, నిజామాబాద్‌లో 45 మందికి 116 ఎకరాలు, కరీంనగర్లో 63 మందికి 183 ఎకరాలు, వరంగల్‌లో 79 మందికి 221 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 111 మందికి 320 ఎకరాలు, మెదక్‌లో 118 మందికి 277 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 211 మందికి 621 ఎకరాలు ఇచ్చారు. ఈ పథకాన్ని ప్రారంభించిన కిందటేడాది ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు భూమి అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోలేదు. మెదక్, వరంగల్, ఆదిలాబాద్ మినహా మిగతా జిల్లాల్లో భూమిలో అవసరమైన సౌకర్యాలు, పంట వేసుకునేందుకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలను చేపట్టలేదు. -
దళితులు.. భూమి.. ఒక ఏడాది!
సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులకు కూడా సరైన వసతులు కల్పించడంలేదు. మరోవైపు ఈ పథకం కింద ఆగస్టు 15న మరో 650 మందికి పట్టాలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో 250 మందికి, మహబూబ్‌నగర్ 200, వరంగల్ 150 , నల్లగొండ 50, ఆదిలాబాద్‌లో 25 మందికి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకాన్ని చారిత్రక గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ప్రారంభించి ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాదిలో 1,349 మంది లబ్ధిదారులకు 3,600 ఎకరాలను పంపిణీ చేశారు. వారిలో 893 మందికి 2,400 ఎకరాల భూమి రిజిస్టర్ చేయగా, వారిలో 743 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలినవారితోపాటు మరో 500 మంది లబ్ధిదారులకు ఆగస్టు 15న పట్టాలు పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భూమిని పొందిన లబ్ధిదారుల్లో అన్నిరకాల వసతులు అందినవారు తక్కువగా ఉన్నారు. భూపంపిణీ పథకం ఆచరణలో కొన్ని జిల్లాలు మరీ వెనుకబడి ఉన్నాయి. గత ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 22 మందికి 59 ఎకరాలు, రంగారెడ్డిలో 22 మందికి 65 ఎకరాల మేర మాత్రమే పంపిణీ చేశారు. ఇక ఈ ఏడాది అంటే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఒక్క ఎకరం కూడా పంపిణీ కాలేదు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు లబ్ధిదారులకు 17 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. మెదక్‌లో అత్యధికంగా 356 మందికి 864 ఎకరాలు పంపిణీ చేయగా అందులో 217 మందికి భూమి రిజిస్టర్ చేసి, పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఇక ఆదిలాబాద్‌లో 244 మందికి 706 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 174 మందికి 512 ఎకరాలు, కరీంనగర్లో 167 మందికి 434 ఎకరాలు, వరంగల్‌లో 137 మందికి 392 ఎకరాలు, నల్లగొండలో 123 మందికి 290 ఎకరాలు, నిజామాబాద్‌లో 104 మందికి 283 ఎకరాలు పంపిణీ అయ్యాయి. ఈ పథకం అమలుపై మొత్తంగా రెవెన్యూశాఖపై ఆధారపడాల్సి రావడం, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం కూడా ప్రధానసమస్యగా మారింది. ఎన్ని నెలల్లో ఎంత భూమి పంపిణీ చేయాలన్న దానిపై స్పష్టత కరువైంది. భూమి కొనుగోలు నిబంధనలపై స్పష్టత కొరవడడంతో పథకం అమలు నత్తనడకన సాగుతోంది. -
భూమి ఇయ్యలే !
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితులకు భూ పంపిణీ పథకం జిల్లాలో అటకెక్కింది. ప్రభుత్వ పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులు ఈ పథకం గురించి పట్టించుకోవడంలేదు. జిల్లాలోని భూమి లేని దళిత కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వంద కుటుంబాలకు కూడా భూమి పంపిణీ చేయలేదు. భూ పంపిణీ పథకం ప్రారంభించిన ప్రారంభోత్సవం రోజున హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ పెద్దలు ఈ పథకంపై ఒక్కసారీ సమీక్షించడం లేదు. ఫలితంగా భూ పంపిణీ జిల్లాలో అధ్వానంగా మారింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితలకు భూ పంపిణీ పెద్ద అంశగా మారనుందని అధికార, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 3 లక్షలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా. సామాజిక, ఆర్థిక అంశాలపై ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) విభాగం సర్వేలో జిల్లాలో భూమి లేని దళిత కుటుంబాలు 40 వేలు ఉన్నట్లు తేలింది. అధికారులు మాత్రం ఇంత సంఖ్య ఉండదని చెబుతున్నారు. ఇదే నిజమైనా జిల్లాలో భూమి లేని దళిత కుటుంబాలు 30 వేలు ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం ఉన్న దళిత కుటుంబానికి రెండు ఎకరాలు... రెండు ఎకరాలు ఉన్న కుటుంబానికి ఒక ఎకరం చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2014 ఆగస్టు 15న భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది.ఏడాది కావస్తున్నా జిల్లాలో కేవలం 82 కుటుంబాలకు 241 ఎకరాల భూమిని పం పిణీ చేశారు. దళిత కుటుంబాలకు పంపిణీ చేసిన భూమిలో 214 ఎకరాలను ఇతరుల నుంచి కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీకి వినియోగించారు. భూ పంపిణీకి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియే లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు భూమి అందుబాటులో ఉన్న గ్రామాల్లోనే అర్హులను గుర్తిస్తున్నారు. ఇప్పటికి ఏడు నియోజవర్గాల్లోనే భూ పంపిణీ మొదలైంది. జిల్లాలో కేవలం 9 మండలాల్లోనే ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో భూ పంపిణీ మొదలే కాలేదు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నగర ప్రాంత నియోజకవర్గాలు కావడంతో ఈ పథకం అమలు చేయడం సాధ్యంకాదు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కాట్రపల్లిలో 26 కుటుంబాలకు 73.01 ఎకరాలు పంపిణీ చేశారు. డోర్నకల్‌లో నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో 19దళిత కుటుంబాలకు 53.08 ఎకరాలు పంచారు.పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం ఆరు కుటుంబాలకు 17.04 ఎకరాలను పంపిణీ చేశారు. ఇదే నియోజకవర్గం కొడకండ్ల మండలం రంగాపురంలో ఏడు కుటుంబాలకు 18.28 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. నర్సంపేట మండలం బానోజీపేటలో ఏడు కుటుంబాలకు 27 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలం బొడ్లాడలో ఏడు కుటుంబాలకు 21 ఎకరాలు పంచారు. వర్ధన్నపేటలోని పర్వతగిరి మండలం వడ్లకొండలో ఆరు దళిత కుటుంబాలకు 17 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గం నర్మెట మండలం అమ్మపూర్లో నాలుగు కుటుంబాలకు 10.07 ఎకరాల భూమిని పంచారు. 3 కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున, ఒక కుటుంబానికి 1.07 ఎకరా పంపిణీ చేశారు. -
దళిత క్రైస్తవులకూ భూపంపిణీ
సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులకు (షెడ్యూల్ కులాల నుంచి క్రైస్తవులుగా మారినవారికి) భూపంపిణీ పథకంలో భాగంగా మూడు ఎకరాల పంపిణీ, భూ కొనుగోలు పథకాలు ప్రభుత్వం వర్తింపజేయనుంది. దళిత క్రైస్తవులకు చట్టబద్ధమైనహక్కులు (విద్యా,ఉద్యోగ రిజర్వేషన్లు తదితర సౌకర్యాలు) మినహా ఇతర రాయితీలను వర్తింపజేస్తూ రాష్ట్ర షెడ్యూల్కులాల అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ) జె.రేమండ్ పీటర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. షెడ్యూల్కులాల సహకార ఆర్థిక సంస్థ మంజూరు చేసే ఆర్థిక సహకార పథకాలతోపాటు, ఏయే పథకాలు షెడ్యూల్ కులాల(హిందువులు)వారికి వర్తిస్తాయో(చట్టబద్ధ హక్కులు మినహా) అవన్నీ ఎస్సీ కన్వర్డెడ్ క్రిస్టియన్లకు, బౌద్ధమతంలోకి మారిన వారికి కూడా వర్తింపజేస్తున్నట్టు ఈ జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ (మైనారిటీస్) సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార ఆర్థికసంస్థ వైస్-చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ జీవోలో తెలిపారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటివి షెడ్యూల్కులాల వారికే వర్తిస్తాయని జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ రాయితీలను పొందేందుకు దళిత క్రైస్తవులు అనర్హులని స్పష్టం చేసింది. -
జనవరి నుంచే ‘ఆహార భద్రత’
ప్రహసనంగా మారిన దరఖాస్తుల ప్రక్రియ 15వ తేదీలోగా అర్జీలు పరిశీలించాలంటున్న ప్రభుత్వం ఇంకా 44 శాతం మిగిలి ఉన్న దరఖాస్తులు భూ వివరాల సేకరణలో అధికారులు బిజీ సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రత పథకంపై అయోమయం నెలకొంది. ఆహారభద్రత కింద జనవరి నుంచే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు భావిస్తున్నప్పటికీ.. జిల్లాలో మాత్రం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రహసనంగా మారింది. లక్షల్లో దరఖాస్తులు రావడం.. వాటి పరిశీలనకు సిబ్బంది కొరత తలెత్తడం.. మరోవైపు రెవెన్యూ వ్యవహారాల భారం పెరగడంతో ఆహారభద్రత దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 13,67,372 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 7,66,724 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. ఇందులో 6,33,171 అర్హులుగా గుర్తించారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : జనవరి నుంచే ఆహారభద్రత పథకం అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అనంతరం లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఆహార భద్రత కార్డులు, ఓటర్ల జాబితా సవరణ, దళితులకు భూ పంపిణీ, పౌరసరఫరాల గోదాముల నిర్మాణం తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల, వికారాబాద్ డివిజన్లలో దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మల్కాజిగిరి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్‌లో వెనకబడిందన్నారు. ఆయా డివిజన్లలో పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న డివిజన్లలో అదనంగా సిబ్బందిని నియమించి గడువులోగా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు, ఓటరు జాబితా సవరణకుగాను దరఖాస్తుల స్వీకరణకు వచ్చే రెండు ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆయా కేంద్రాల్లో బీఎల్ఓలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 500 పోలింగ్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని, బీఎల్ఓల నియామకం పూర్తిచేయాలన్నారు. దళితులకు భూ పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి భూ పంపిణీ చేయడం జరిగిందని, సంబంధిత లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడంతోపాటు వాటిని వ్యవసాయ భూములుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన వ్యవసాయ, ఉద్యానవన, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్ శాఖల అధికారుల సమన్వయ కమిటీలను సమావేశపర్చి ఎస్సీలకు పంపిణీ చేసిన భూముల్లో పంటలసాగుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
3,649 ఎకరాల ప్రైవేటు భూమి గుర్తించాం
ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకం కింద కొనుగోలు చేసి కేటాయించేందుకు 3,649 ఎకరాల ప్రైవేట్ భూమిని గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమరంగ సలహాదారు రామలక్ష్మణ్ ‘సాక్షి’కి తెలి పారు. ఈ భూమి పంపిణీకి అనువుగా ఉందా లేదా అన్న అంశాన్ని మండ ల, జిల్లా యంత్రాంగం పరిశీలించాక, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ మొత్తం భూముల కొనుగోలుకే కాకుండా లబ్ధిదారులైన రైతులకు ఇరిగేషన్ సౌకర్యాలు, మోటార్లు, పంపుసెట్లు, పైపులైన్లు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు. ఈనెల 15 తర్వాత అధికారులపై ఒత్తిడి తగ్గి, పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. ఇప్పటివరకు వంద ఎకరాల ప్రభుత్వ భూమి, 542 ఎకరాల ప్రైవేట్ భూమి కలిపి 642 ఎకరాలకు పైగా భూమిని 221 మందికి పైగా ఎస్సీ మహిళా రైతుల పేరిట రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలుకు ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసిందన్నారు. -
గరీబోళ్ల భూములపై గద్దలు!
దళిత భూ పంపిణీలో అవినీతి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండాపూర్: ప్రతి నిరుపేద దళితుణ్ణి మూడు ఎకరాల సాగు భూమికి ఆసామిని చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన దళితులకు భూమి పంపిణీ పథకం ప్రహసనంగా మారుతోంది. భూమి కొన్నది ముగ్గురి దగ్గర నుంచే.. పంచింది కూడా ముగ్గురికే కానీ, ఈ ముగ్గురిని.. ఆ ముగ్గురిని కలిపి ఓ గ్రామ సర్పంచ్ భర్త అనుచరులు, మధ్యవర్తులు కలసి ముప్పై ఆరు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. పథకం మొదలైంది కేవలం నాలుగైదు మండలాల్లో మాత్రమే.. కానీ అప్పుడే అవినీతి వ్యవహారం వెలుగు చూడటంతో దళిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలివిడత కింద 9 నియోజకవర్గాల్లో కనీసం 167మంది రైతులకు మూడు ఎకరాల చొప్పున 900 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం కోసం 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 6 మంది.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోల్కొండ కోట వద్ద పట్టాలు తీసుకోగా.. 34 మంది దళిత మహిళలు మంత్రి హరీష్‌రావు చేతుల మీద సంగారెడ్డిలో పట్టాలు తీసుకున్నారు. ఎమ్మార్వో పేరు చెప్పి.. కొండాపూర్ మండలం మారేపల్లిలో 11 మంది మహిళలు మొదటి విడత పంపిణీకి అర్హులని, ఇందుకోసం 33 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు నిర్ధారించారు. మారేపల్లి శివారులోని అనంతసాగర్ గ్రామాలకు చెందిన రైతులు మడిగెల శేఖర్, రామప్ప, అమృతమ్మల వద్ద నుంచి 41 సర్వే నంబర్లో ప్రభుత్వం తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేసింది. అధికారులు, గ్రామ కమిటీ కలసి ఎకరాకు రూ 3.50 లక్షలు నిర్ధారణ చేయగా ప్రభుత్వం పూర్తి డబ్బును చెక్కు రూపంలో రైతులకు చెల్లించింది. ఈ భూమిని మచుకూరి చంద్రకళ, లక్ష్మి, పట్లూరి సుజాత అనే దళిత మహిళలకు పంపిణీ చేశారు. అయితే భూమి ధర నిర్ణయంలో, లబ్ధిదారుల ఎంపికలో సర్పంచ్ భర్త అనుచరులు కీలక పాత్ర పోషించారు. పంపిణీ కార్యక్రమం మరుసటి రోజు నుంచే సర్పంచ్ భర్త అనుచరులు తమకు కాగితాల ఖర్చులు, అధికారుల రాకపోకలకు ఖర్చులు అయ్యాయని చెప్పి లబ్ధిదారుల నుంచి మనిషికి రూ. 10 వేలు చొప్పున తీసుకున్నారు. ఇక పట్టాదారులపై వల విసిరారు. తమ వల్లే భూమికి ఎక్కవ ధర వచ్చిందని, రూ 2 లక్షలు కూడా పలకని భూమిని రూ 3.50లక్షలు ఇప్పించాము కాబట్టి ఎకరాకు రూ 50 వేల చొప్పున తమకు ఇవ్వాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన అనుచరుడు మల్లేష్ ద్వారానే ఈ దందా నడిచినట్లు తెలుస్తోంది. పై అధికారుల నుంచి సర్పంచ్ మీద ఒత్తిడి ఉందని, ఎమ్మార్వోకు కూడా డబ్బులు ఇవ్వాలంటూ రైతుల్ని బెదిరిస్తున్నారు. ఎకరాకు రూ. 50 వేలు ఇస్తేనే భూమి తీసుకుంటామని, లేదంటే మీ భూమి మీరు తీసుకోండి అంటూ మధ్యవర్తి రైతులను బెదిరిస్తుండగా సాక్షి పేపర్, సాక్షి టీవీ రికార్డు చేసింది. కాగా బెదిరింపులు మేం భరించలేమని ప్రభుత్వం కోరితే ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటామని రైతులు ఆవేదన తో ‘సాక్షి’తో చెప్పారు. మరో ట్విస్ట్.. అధికారులు ముగ్గురు మహిళలకు మూడు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తూ పట్టాలిచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా లబ్ధిదారులకు ఒక మెలికపెట్టారు. పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్లు ఈ ఏడాది సాగు చేసుకోవడానికి వీల్లేదని మెలికపెట్టారు. ఇప్పటికే వెంకయ్య అనే కౌలు రైతు చేతిలో ఉన్న ఈ భూమిని, ఆయన కౌలు గడువు ముగిసిన తర్వాతనే కబ్జాలోకి వెళ్లాలని ఆధికారులు ఆదేశించడంతో పాపం లబ్ధిదారులు సంతోషపడలేక, బాధపడలేక మౌనంగా ఉండిపోయారు. డబ్బులు ఇవ్వకుంటే.. నేను సర్కారుకు మూడు ఎకరాలు అమ్మిన. ఎకరానికి రూ. 3.50 లక్షల చొప్పున ఇచ్చిండ్రు. ఈ డబ్బుల నుంచి రూ. 80 వేలు ఇవ్వమని పెద్దపటేల్ అనుచరులు మధ్యవర్తితో సెప్పుతుండు. గన్ని పైసలు ఎట్టా ఇత్తా పటేలా అంటే ఇంటలేడు. తాశీల్దారు గీతమ్మకు ఇయ్యాలనిజెప్పి ఒక్కటే గాయ్..గాయ్ జేస్తుండు. ‘డబ్బులు మాత్రం ఎవరికీ ఇవ్వొద్దని’ తాశీల్దార్ మేడం స్వయంగా నాతో చెప్పారు. కానీ మధ్యవర్తులు రూ .80వేలు ఇత్తవా? లేదా? అంటూ బెదిరిస్తున్నారు. నా భర్త చనిపోయాడు. బిడ్డ పెళ్లిజేసిన అప్పులు మీద పడ్డయ్. భూమి అమ్మి అప్పులు కట్టుకున్న. ఇప్పుడు సర్పంచు భర్త మనుషులు వచ్చి డబ్బులు ఇవ్వకుంటే భూమి లాక్కుంటామని బెదిరిస్తున్నారు. - మడిగెల అమృతమ్మ, అనంతసాగర్ -
దళిత మహిళలకు భూ పంపిణీ
ఆనందంలో లబ్ధిదారులు సాక్షి, సంగారెడ్డి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి హరీష్‌రావు శుక్రవారం దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి విడతలో ఎంపికైన 45 మంది లబ్ధిదారులకు 135 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కూలినాలి చేసుకునే తమకు ప్రభుత్వం మూడెకరాలు అందజేసి మా కుటుంబాలను రైతు కుటుంబాలుగా మార్చిందని ఆనందంగా తెలిపారు. ఇదిలా ఉంటే భూ పంపిణీ పథకం కింద ఎంపికైన జిల్లాకు చెందిన ఆరుగురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. దళితులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీయాదవ్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రారంభం పరిమితమే!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ సర్కారు ఎంతో ఆర్భాటంగా అమలు చేస్తున్న దళితులకు భూపంపిణీ పథకం అమలులో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ భూపంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రకటించిన ప్రభుత్వం తొలిసారి పరిమితంగానే లబ్ధిదారులను ఎంపిక చేసింది. కేవలం ఐదుగురు లబ్ధిదారులతో ఈ పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లాకు చెందిన ఈ ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లబ్ధిపత్రాలు జారీ చే యాలని నిర్ణయించారు. మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండ లం కాప్రి గ్రామానికి చెందిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అయితే జిల్లాలో మాత్రం కొందరికి ఈ లబ్ధిపత్రాల ను అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లాలో 52గ్రామాల్లో అ ర్హులైన దళిత నిరుపేద కుటుంబాలకు భూ పంపిణీ చేయాల ని నిర్ణయించారు. కానీ ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయడం వీలుకుదరకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామం చొ ప్పున ఎంపిక చేశారు. అయినప్పటికీ పంపిణీ చేయాల్సిన భూముల సేకరణ పూర్తికాకపోవడంతో కేవలం ఐదుగురు ల బ్ధిదారులతో సరిపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.పంద్రాగస్టు వేడుకల్లో వీలైతే కొందరికి లబ్ధిపత్రాలను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో వేలాది దళిత కుటుంబాలు భూము లు లేక నిరుపేద రైతుకూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఐకేపీ, సెర్ఫ్ వంటి ప్రభుత్వ శాఖల సర్వే ప్రకారం జిల్లాలో సుమారు 91వేలకు పైగా దళిత కుటుంబాలున్నట్లు అంచనా. కొలిక్కిరాని భూసేకరణ భూమిలేని నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని భారీ లక్ష్యంతో తెలంగాణ సర్కారు ఈ దళిత బస్తీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే సాగుకు యోగ్యమైన భూములు జిల్లాలో తగినన్ని అందుబాటులో లేకపోవడంతో ఈ పథకం అమలులో అవాంతరాలు ఎదురవుతున్నాయి. పట్టా భూమిని కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతానికి జిల్లాలో పది నియోజకవర్గాల పరిధిలో 110 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి మూడెకరాల చొప్పున భూ పంపిణీ చేసేందుకు 323.39 ఎకరాలు సాగుభూమి అవసరం ఏర్పడింది. కానీ ప్రభుత్వ భూమి కేవలం 53.10 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో మిగిలిన 270.03 ఎకరాలు ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ భూసేకరణ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించారు. జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆయా డివిజన్ల ఆర్డీవోలు సభ్యులుగా ఉన్నారు. విడుదల కాని నిధులు జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు భూములను సేకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఈ భూ సేకరణకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. కేవలం సర్వే నిమిత్తం రూ.25 లక్షలు మాత్రమే మంజూరైనట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఈ నిధులు విడుదలవుతాయని తెలిపారు.