Legends League Cricket 2022
-
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023.. ఇండియా, ఆసియా కెప్టెన్లుగా బద్ద శత్రువులు
మార్చి 10 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనబోయే ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ జట్లు తమ కెప్టెన్ల పేర్లను నిన్న (మార్చి 1) ప్రకటించాయి. ఆసియా లయన్స్‌కు షాహిద్ అఫ్రిది, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్, ఇండియా మహారాజాస్‌కు గౌతమ్ గంభీర్‌ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జట్లు అనౌన్స్ చేశాయి. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్, తిలకరత్నే దిల్షాన్, క్రిస్ గేల్, బ్రెట్ లీ తదితర లెజెండ్స్ ఆడనున్నారు. ఆసియా లయన్స్‌కు సారధ్యం వహించనున్న షాహిద్ అఫ్రిది.. ఎల్ఎల్సీలో తొలిసారి ఆడుతుండగా.. ఇండియా మహారాజాస్ సారధి గౌతమ్ గంభీర్ 2022 ఎల్ఎల్సీ సీజన్లో ఇండియా క్యాపిటల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అఫ్రిది-గంభీర్.. వారు క్రికెట్ ఆడుతున్న జమానా నుంచి ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బద్ద శత్రువులుగా ఉన్నారు. కాగా, ఎల్ఎల్సీ 2023 సీజన్ మ్యాచ్‌లు మార్చి 10 నుంచి 20 వరకు ఖతార్‌లోని దోహాలో ఉన్న ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఎల్ఎల్సీ 2022 సీజన్ విజేతగా ఇండియా క్యాపిటల్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో క్యాపిటల్స్.. బిల్వారా కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో విజయం సాధంచి, టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియా క్యాపిటల్స్ ఆటగాడు రాస్ టేలర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. టేలర్‌కు జతగా.. మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (19 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరంలో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ జట్టు.. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయంపాలైంది. -
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్న రాబిన్ ఊతప్ప
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో ఇండియా మహారాజా తరపున ఆడేందుకు భారత మాజీ ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్ సిద్దమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఊతప్ప ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అదే విధంగా గతేడాది లెజెండ్స్ లీగ్ సీజన్లో ఊతప్ప కామేంటేటర్‌గా వ్యవహరించాడు. "లెజెండ్స్ లీగ్ క్రికెట్ చివరి సీజన్లో వాఖ్యతగా వ్యవహరించినప్పడే ఈ టోర్నీలో ఆడాలని నిర్ణయించకున్నాను. ఇప్పుడు నా పాత సహచరులతో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది" అని రాబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక గత సీజన్లో భిల్వారా కింగ్స్ తరపున ఆడిన శ్రీశాంత్.. ఈ ఏడాది సీజన్లో ఇండియా మహారాజాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు శ్రీశాంత్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ సెకెండ్ సీజన్ అద్భుతంగా జరిగిది. ఈ టోర్నీలో పోటీ మా అంచనాలకు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మరి కొంత మంది మాజీ ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కావాలని నేను ఆశిస్తున్నాను. అయితే భారత్ తరఫున ఆడడం ఎప్పుడూ గర్వంగా భావిస్తాను అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు -
రిటైరయ్యాక కూడా ఇరగదీశారు.. అప్పుడూ ఇలానే, కానీ..!
ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సత్తా చాటి, రిటైరైనా తగ్గేదేలే అని యువ క్రికెటర్లకు సందేశం పంపిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్లు, సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు ఆ రెండు సిరీస్‌ల్లో తమతమ అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. రోడ్ సేఫ్టీ సిరీస్, లెజెండ్స్ లీగ్‌లు ఒకే సమయంలో షెడ్యూలైనప్పటికీ పఠాన్ సోదరులు రెండిటిలోనూ పాల్గొని తమ జట్లను గెలిపించారు. 13 ఫ్లయిట్లు, 17 మ్యాచ్‌లు, 2 ఫైనళ్లు అంటూ ఇర్ఫాన్ పఠాన్.. తన సోదరుడు యూసఫ్‌ను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ వేదికగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో బిల్వారా కింగ్స్ జట్టు తరఫున ఆడారు. ఈ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను మట్టికరిపించి వరుసగా రెండో సీజన్లోనూ ఛాంపియన్‌గా నిలువగా.. లెజెండ్స్ లీగ్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమిపాలైంది. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 341 పరుగులు చేసి, బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు 30+ స్కోర్లు ఉన్నాయి. ఇక తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ విషయానికొస్తే.. ఇర్ఫాన్ ఈ రెండు టోర్నీల్లో కలిపి 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు 30+ స్కోర్లు ఉన్నాయి. అలాగే ఇర్ఫాన్ బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ 27 సిక్సర్లు, 22 ఫోర్లు బాదగా.. ఇర్ఫాన్ పఠాన్ 11 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, పఠాన్ సోదరులు గతంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనే చేసినప్పటికీ వివిధ కారణాల చేత సరైన అవకాశాలు రాక వారి కెరీర్లు అర్థంతరంగా ముగిశాయి. ఇర్ఫాన్ 27 ఏళ్ల వయసులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. దాదాపు పదేళ్ల పాటు జట్టులో చోటు కోసం నిరీక్షించి చివరకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున హ్యాట్రిక్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన ఇర్ఫాన్ పఠాన్.. 2007 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే తానాడిన చివరి వన్డేలో ఐదు వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్ విషయానికొస్తే ఇతనిది దాదాపు తమ్ముడి పరిస్థితే. కీలక మ్యాచ్‌ల్లో భారీ సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన యూసఫ్‌కు కూడా సరైన అవకాశాలు రాక కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాడు. -
విధ్వంసం సృష్టించిన టేలర్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా గంభీర్ సేన
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్ టేలర్, జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్ 41 బంతుల్లో 82 , జాన్సెన్ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం. ఇక అఖరిలో నర్స్(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్ రెండు, బ్రెస్నెన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భిల్వారా కింగ్స్.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్ వాట్సన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే, పవన్ సయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ప్లంకెట్, భాటియా చెరో వికెట్ సాధించారు. Time for #legendary Celebrations! 🥳@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf — Legends League Cricket (@llct20) October 5, 2022 చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ ఇద్దరు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్ అనంతరం యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌లు ఒకరినొకరు క్షమాపణ చెప్పుకున్నారు. అయితే గొడవకు ప్రధాన కారణం యూసఫ్ పఠాన్ మహిళా అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించడమేనని ఫాక్స్ క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్లో పేర్కొంది. బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మ్యాచ్‌కు కిమ్ కాటన్ అంపైరింగ్ విధులు నిర్వహించింది. కాగా మ్యాచ్ సందర్భంగా మిచెల్ జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఒక బంతిని కిమ్ కాటన్ వైడ్ కాల్ ఇవ్వలేదు. దీంతో కాటన్‌ను ఉద్దేశించి యూసఫ్ పఠాన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. ఇదే విషయమై ఓవర్ తర్వాత ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందని పేర్కొంది. ''మిచెల్‌ది ఏం తప్పు లేదు.. పఠాన్ మహిళా అంపైర్ కిమ్ కాటన్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. అందుకే గొడవ జరిగింది'' అంటూ తెలిపింది. యూసఫ్‌ను తోసేసిన కారణంగా మిచెల్ జాన్సన్‌కు క్రమశిక్షణ చర్యల కింద లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. ఇక యూసఫ్ పఠాన్ మాత్రం జరిమానా నుంచి తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహేజా స్పందించాడు. ''లెజెండ్స్ లీగ్ ద్వారా ఒక సీరియస్, కాంపిటీటివ్ క్రికెట్‌ను మాత్రమే ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఆదివారం మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ బాధాకరం. అయితే గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఉందో తెలుసుకోవడానికి వీడియోను చాలాసార్లు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పెవరిదనేది పక్కనబెడితే మిచెల్ జాన్సన్.. పఠాన్‌ను తోసేసినట్లు క్లియర్‌గా కనిపించడంతో అతనికి జరిమానా విధించాం. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నాం. మళ్లీ రిపీట్ అయితే ఉపేక్షించేది లేదు. సీరియస్ యాక్షన్ కచ్చితంగా ఉంటుంది'' అని పేర్కొన్నాడు. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: యూసఫ్ పఠాన్,మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! -
గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బిల్వారా కింగ్స్ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో బిల్వారా కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.ఓపెనర్లు విలియం పోర్టర్‌ఫీల్డ్ (43 బంతుల్లో 60 పరుగులు), మోర్నీ వాన్విక్ 31 పరుగులు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్(24 బంతుల్లో 48 నాటౌట్) చివరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఆఖర్లో పఠాన్ బ్రదర్స్ యూసఫ్ పఠాన్(21), ఇర్ఫాన్ పఠాన్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రియాన్ 45, యశ్పాల్ సింగ్ 43, తిలకరత్నే దిల్షాన్ 36 పరుగులు చేశారు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్ 2, పనేసర్, ఎడ్వర్ట్స్, బ్రెస్నన్, త్యాగిలు తలా ఒక వికెట్ తీశారు. ఇక అక్టోబర్ 8న(శనివారం) ఇండియా క్యాపిటల్స్‌తో జరగనున్న ఫైనల్లో బిల్వారా కింగ్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆదివారం(అక్టోబర్ 2న) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! Glimpses of @Bhilwarakings from tonight! #BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/JadTaqN5gK — Legends League Cricket (@llct20) October 3, 2022 -
యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ తారాస్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు. అంపైర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు తలదూర్చి వారిని విడదీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బిల్వారా కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు బ్యాటర్ యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.ఇండియా క్యాపిటల్స్ బౌలర్ మిచెన్ జాన్సన్ బౌలింగ్ పఠాన్ బౌండరీలు బాదాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత మిచెల్ జాన్సన్ పఠాన్‌పై నోరు పారేసుకున్నాడు. తాను ఏం తక్కువ తినలేదంటూ యూసఫ్ పఠాన్ కూడా జాన్సన్‌ను తిట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపంతో యూసఫ్ పఠాన్ జాన్సన్ వైపు దూసుకొచ్చాడు. అయితే జాన్సన్ పఠాన్‌ను తోసేశాడు. ఇక గొడవ తారాస్థాయికి చేరిందన్న క్రమంలో అంపైర్ తలదూర్చి జాన్సన్‌ను పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా తగ్గలేదు. ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే 48 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 65 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 59, యూసఫ్ పఠాన్ 48, రాజేష్ బిష్ణోయి 36 నాటౌట్ రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రాస్ టేలర్ 39 బంతుల్లో 84 పరుగులు చేయగా.. చివర్లో ఆష్లే నర్స్ 28 బంతుల్లో 60 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక క్వాలిఫయర్ 1లో ఓడినప్పటికి బిల్వారా కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ జెయింట్స్‌తో బిల్వారా కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 5న ఇండియా క్యాపిటల్స్‌తో ఫైనల్ ఆడనుంది. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: ఓయ్ చహల్.. ఏంటా పని? 'బౌలింగ్ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్ 23నే' -
మంజ్రేకర్ ఫొటో షేర్ చేస్తూ జడేజా ట్వీట్.. రిప్లైతో మనసు గెలిచేశాడు!
Ravindra Jadeja- Sanjay Manjrekar: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ను ఉద్దేశించి.. ‘‘నా ప్రియమైన మిత్రుడిని స్క్రీన్ మీద చూస్తున్నా’’ అంటూ జడ్డూ మంజ్రేకర్ ఫొటో షేర్ చేశాడు. కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమైన ఈ ఆల్‌రౌండర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా మంజ్రేకర్ మాట్లాడుతున్న దృశ్యాన్ని పంచుకున్న జడ్డూ అతడిని డియర్ ఫ్రెండ్ అని సంభోదించాడు. ప్రియ మిత్రులుగా మారారా?! ఇక ఇందుకు స్పందనగా.. ‘‘హహా.. నువ్వు త్వరగా మైదానంలో అడుగుపెడితే చూడాలని నీ ఈ ప్రియమిత్రుడు ఎదురుచూస్తున్నాడు’’ అంటూ మంజ్రేకర్ బదులిచ్చాడు. ట్విటర్లో వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘వామ్మో.. ఒకప్పటి ‘శత్రువులు’ ఇప్పుడు మిత్రులుగా మారిపోయారా!? నీ రిప్లైతో జడ్డూ మనసు గెలిచేసుకున్నావన్న మాట’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అప్పుడేమో అలా.. వన్డే వరల్డ్‌కప్-2019 సెమీ ఫైనల్ సందర్భంగా మంజ్రేకర్.. జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు స్పందించిన జడ్డూ.. ‘‘నా కెరీర్లో ఇప్పటి వరకు నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడతాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచింది. అయితే, ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. అతడితో మాట్లాడేందుకు మంజ్రేకర్ వచ్చాడు. మంజ్రేకర్‌ను చూసి జడ్డూ నవ్వగా.. జడ్డూ నాతో మాట్లాడం ఇష్టమేనా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా మాట్లాడుతా అంటూ జడేజా నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! తాజాగా జడేజా ట్వీట్‌తో మరోసారి వీరిద్దరు వార్తల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో గాయపడిన జడేజా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు.. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్-2022 ఆడే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. చదవండి: T20 WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే! Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU — Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022 -
చెలరేగిన జింబాబ్వే బ్యాటర్.. టైగర్స్‌పై గంభీర్ సేన ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కటక్ వేదికగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇండియా క్యాపిటల్స్ విజయ భేరి మోగించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి గంభీర్ సేన.. 17.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇండియా క్యాపిటల్స్ బ్యాటర్లలో హామిల్టన్ మసకద్జా మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 4సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో, మురళీధరన్, మూఫు తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మణిపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మణిపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జెస్సీ రైడర్ (79), కైఫ్(67) పరుగులతో రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ప్లంకెట్, భాటియా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానంలో నిలిచింది. చదవండి: IND vs SA: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. తొలి భారత కెప్టెన్‌గా -
రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అబుదాబి టీ10లీగ్‌లో రైనా పాల్గొనున్నాడన్నది ఆ వార్త సారంశం. అంతేకాకుండా ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడనున్నుట్లు అతడి అభిమానులు ట్విటర్ వేదికగా హల్చల్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని దైనిక్ జాగరణ్ కూడా తమ నివేదికలో పేర్కొంది. Suresh Raina will play the Abu Dhabi T10 league!❣️🔥@ImRaina #SureshRaina pic.twitter.com/DOukgFOD8Q — That's Raina For You (@Thatsrainaforu) September 28, 2022 " నేను ఇంకా రెండు, మూడు ఏళ్లు ఆడాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్‌లో దేశీయ జట్టులో ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. నేను ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోషియషన్ నుంచి అనుమతి దృవీకరణ పత్రం కూడా పొందాను. విదేశీ లీగ్‌లలో ఆడేందకు సముఖత చూపిస్తున్నాను" అని రైనా పేర్కొన్నట్లు దైనిక్ జాగరణ్ వెల్లడించింది. కాగా రైనా ప్రస్తుతం రోడ్‌సెప్టీ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ ఈవెంట్లో మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఇంతకుముందు అబుదాబి టీ10 లీగ్‌లోఅబుదాబి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఎస్ బద్రీనాథ్, రీతీందర్ సింగ్ సోధి, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్ వంటి భారత మాజీ ఆటగాళ్లు భాగమయ్యారు. చదవండి: Ind Vs SA: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ -
LLC 2022: దంచికొట్టిన బ్యాటర్లు.. భిల్వారా కింగ్స్ ఘన విజయం! సెహ్వాగ్ సేనకు పరాభవం
Legends League Cricket 2022- Gujarat Giants vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ సేనపై ఇర్ఫాన్ పఠాన్ బృందం ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పఠాన్ సారథ్యంలోని భిల్వారా కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు! ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, జెయింట్స్ బౌలర్లు భిల్వారా కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కింగ్స్ ఓపెనర్లు మోర్నీ వాన్ విక్ అర్ధ శతకం(28 బంతుల్లోనే 50 పరుగులు) సాధించగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 33 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 34 పరుగులతో రాణించగా.. జేసల్ కారియా 29 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు (5 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు) మెరిపించగా.. రాజేశ్ బిష్ణోయి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు సాధించాడు. ఇలా బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు స్కోరు చేసింది. చేతులెత్తేసిన జెయింట్స్ బ్యాటర్లు! గేల్, సెహ్వాగ్ కూడా విఫలం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెవిన్ ఒ బ్రెయిన్ 2, క్రిస్ గేల్ 15 పరుగులకే నిష్క్రమించారు. కెప్టెన్ సెహ్వాగ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యశ్పాల్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాద్, కేపీ అప్పన్న కాసేపు పోరాడినా.. అప్పటికే పరిస్థితి చేజారడంతో 165 పరుగులకే సెహ్వాగ్ సేన కథ ముగిసింది. 57 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. ఇక కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి. జేసల్ కారియా, ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్ ఒకటి, దినేశ్ ఒకటి, మాంటీ పనేసర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కింగ్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన విలియం పోర్టర్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై -
యూసఫ్ పఠాన్ మెరుపులు వృథా.. టైగర్స్ చేతిలో కింగ్స్ ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో మణిపాల్ టైగర్స్ తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం కటక్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో మణిపాల్ టైగర్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మణిపాల్ పేసర్ దిల్హార ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అఖరి ఓవర్లో భిల్వారా కింగ్స్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఫెర్నాండో కేవలం 5 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇకతొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మణిపాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టైగర్స్ బ్యాటర్లలో ఓపెనర్లు జెస్సీ రైడర్(35 బంతుల్లో 47), తాటెండ తైబు(30 బంతుల్లో 54) రాణించారు. భిల్వారా బౌలర్లలో బెస్ట్ మూడు వికెట్లు, యూసఫ్ పఠాన్ రెండు, కరియా, ఎడ్వర్డ్స్ తలా వికెట్ సాధించారు. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భిల్వారా కెప్టెన్ యూసప్ ఫఠాన్ 21 బంతుల్లో 42 పరుగుల(2 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు అఖరిలో ఔట్ కావడంతో మ్యాచ్ మణిపాల్ వైపు మలుపు తిరిగింది. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్బజన్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ -
జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి బిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్ 78 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు భారీ స్కోరు చేసింది. జింబాబ్వే ఆటగాడు సొలొమన్ మైర్ (38 బంతుల్లో 82 పరుగులు, 7 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. మరో జింబాబ్వే బ్యాటర్ మసకద్జా 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో యూసఫ్ పఠాన్ మూడు వికెట్లు తీయగా.. బెస్ట్, టిమ్ బ్రెస్నన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 19.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. తన్మయ్ శ్రీవాత్సవ 27 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. నమన్ ఓజా 20 పరుగులు చేశాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో బిల్వారా కింగ్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో రజత్ బాటియా, ప్రవీణ్ తాంబే, పంకజ్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. -
పార్థివ్ పటేల్ కీలక ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో గుజరాత్ జెయింట్స్ విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. సోమవారం గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ రెండు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మణిపాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రవికాంత్ శుక్లా 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ కైఫ్ 24 పరుగులు చేశాడు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో దిల్షాన్, దిండా రెండు వికెట్లు తీయగా.. ఎమ్రిత్, పెరీరా చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 17.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. పార్థివ్ పటేల్ 34 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. తిసారా పెరీరా 22, కెవిన్ ఒబ్రెయిన్ 23 పరుగులు చేశారు. లక్ష్యం తక్కువగా ఉన్నప్పటికి గుజరాత్ జెయింట్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో చివర్లో ఉత్కంఠ నెలకింది. కానీ పెరీరా 4 ఫోర్లు బాది జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. మణిపాల్ టైగర్స్ బౌలర్లలో క్రిస్ మోఫూ, పర్వీందర్ ఆవానా, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ తలా రెండు వికెట్లు తీశారు. -
మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము!
భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్ ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. అదే విధంగా ఈ లీగ్‌లో వివిధ దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు భాగమై ఉన్నారు. కాగా ఈ లీగ్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్లో జాన్సన్ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో కోల్‌కతాలో తన బస చేస్తున్న హోటల్ గదిలో పాము ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను జాన్సన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఫోటోకు " ఇది ఏ జాతికి చెందిన పాము..ఎవరికైనా తెలుసా? నా గది తలుపుకు వేలాడుతున్నాను" అని క్యాప్షన్‌గా అతడు పెట్టాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడిన జాన్సన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. గుజరాత్ జైయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ వికెట్‌ను జాన్సన్ తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Mitchell Johnson (@mitchjohnson398) చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిది ఆడకూడదు: పాక్ మాజీ ఆటగాడు -
కైఫ్ అర్ధ శతకం వృథా! పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! ఉత్కంఠ పోరులో భిల్వార కింగ్స్ గెలుపు
Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో మ్యాచ్‌లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది. చెలరేగిన ఫిడెల్! ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ! ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్‌ను ఛేదించింది. ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్ T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
కెవిన్ ఒబ్రెయిన్ సెంచరీ .. గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
ఐర్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో శతకంతో మెరిశాడు. అతని విధ్వంసం ధాటికి గుజరాత్ జెయింట్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆష్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. దినేశ్ రామ్‌దిన్ 31 పరుగులు చేశాడు. వీరిద్దరి మినహా మిగతావారెవరు పెద్దగా రాణించింది లేదు. గుజరాత్ జెయింట్స్ బౌలింగ్‌లో తిసారా పెరీరా, ఎమ్రిత్, అప్పన్న తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 18.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల చేయగా.. పార్థివ్ పటేల్ 24, యష్పాల్ సింగ్ 21 పరుగులు చేశారు. ఇండియా క్యాపిటల్స్ బౌలింగ్‌లో ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ 2, ఆష్లే నర్స్, మిచెల్ జాన్సన్లే తలా ఒక వికెట్ తీశారు. -
ఇండియా మహరాజాస్ Vs వరల్డ్ జెయింట్స్ మ్యాచ్ దృశ్యాలు
-
కోహ్లిని మించినోడు భూప్రపంచంలో లేడు.. ఇలాంటి వారు తరానికొక్కరు పుడతారు..!
టీమిండియా తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని మించినోడు ఈ భూప్రపంచంలో లేడని ఆకాశానికెత్తాడు. కోహ్లి లాంటి ఆటగాడు తరానికొక్కరు పుడతారని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇదే సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్ కలిస్‌లను కూడా శ్లాఘించాడు. క్రికెట్లో వీరంతా ఆణిముత్యాలని కొనియాడాడు. చాలా మంది లాగే తాను కూడా కోహ్లికి వీరాభిమానినని తెలిపాడు. ఇదే సందర్భంగా లీ.. కోహ్లి ఫామ్‌పై కూడా స్పందించాడు. ఎంత రన్‌మెషీన్ అన్ని పిలుచుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్‌లో కోహ్లి వందకొట్టాలని ఆశించడం అత్యాశ అవుతుందని అన్నాడు. ఇది అతనిపై తీవ్ర ఒత్తిడి పెంచుతుందని పేర్కొన్నాడు. 1020 రోజుల పాటు కోహ్లి సెంచరీ చేయలేకపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. 130 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లి నుంచి ప్రతి మ్యాచ్‌లో సెంచరీ ఆశించడం సబబు కాదని చెప్పుకొచ్చాడు. కోహ్లిని ప్రతి మ్యాచ్‌కు ముందు భూతద్దంలో చూడటం మానేసి, అతని పాటికి అతన్ని వదిలేస్తే సత్ఫలితాలు వస్తాయని సూచించాడు. క్రికెట్‌కు కోహ్లి కోహీనూర్ అని, అతనో ఆల్‌టైమ్ గ్రేట్ అని కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే సందర్భంగా లీ.. సచిన్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. సచిన్ ఎంతో సౌమ్యమైన క్రికెటర్ అని, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన, అఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన ఒకేలా ఉంటాయని, సచిన్‌ని అందరూ అభిమానించేవారని తెలిపాడు. సచిన్‌కు బ్యాటింగ్ చేస్తున్న మాట్లాడితే అస్సలు నచ్చేది కాదని చెప్పాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన లీ.. మీడియాతో ఈ విషయాలకు పంచుకున్నాడు. -
అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ?
టీమిండియా జట్టుకు ఆడాలని ప్రతీ క్రికెటర్ కలగనడం సహజం. కానీ తుది జట్టులో 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నప్పటికి కొందరు అనామక క్రికెటర్లుగా మిగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకునే క్రికెట్లో నీచ రాజకీయాల వల్ల ఆటకు దూరం కావాల్సి వస్తుంది. గతంలో జరిగింది.. ఇప్పుడు జరుగుతుంది.. ఇకపై కూడా ఇలాంటి రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకు సంజూ శాంసన్ చక్కటి ఉదాహరణ. మంచి బ్యాటింగ్ టెక్నిక్ గల సంజూ శాంసన్‌కు టి20 ప్రపంచకప్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. అతన్ని ఎంపిక చేయకపోవడంపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడంటే ఐపీఎల్ లాంటి క్రికెట్ లీగ్స్‌తో జాతీయ జట్టుకు ఆడకపోయినా దండిగానే డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇండియా మహారాజాస్‌కు ఆడిన పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు అద్బుత ప్రదర్శన చేశారు. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగి బౌలింగ్‌లో అదరగొడితే.. మరొకరు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించి క్లాస్ ప్రదర్శన చేశాడు. అద్భుత ప్రదర్శనతో పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఎవరీ పంకజ్ సింగ్? ఉత్తరప్రదేశ్‌కి చెందిన పంకజ్ సింగ్, టీమిండియా తరుపున 2 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన పంకజ్, శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో వికెట్ తీయలేక జట్టులో చోటు కోల్పోయాడు. తన రెండో టెస్టులో పంకజ్ సింగ్ జో రూట్, జోస్ బట్లర్‌లను ఔట్ చేశాడు . మొదటి మ్యాచ్‌లో పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అలిస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన పంకజ్.. అరంగ్రేట మ్యాచ్‌లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంకజ్ సింగ్ ఏకంగా 179 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం పంకజ్ సింగ్‌కి ఘనమైన రికార్డు ఉంది. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పంకజ్ సింగ్ 472 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. 76 లిస్టు ఏ మ్యాచ్‌లో 115 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ద్వారా పరిచయం.. పంకజ్ సింగ్‌తో పాటు తన్మయ్ శ్రీవాస్తవ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఇండియా మహారాజాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన తన్మయ్.. ఐపీఎల్లో మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు.34 మ్యాచుల్లో 649 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్లో తన్మయ్ శ్రీవాస్తవ 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు.లిస్టు ఏ క్రికెట్లో 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేసిన తన్మయ్... 2020లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' -
కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వికెట్ కీపర్ హెల్మెట్ ఇండియా మహారాజాస్ కొంపముంచింది. వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ అశోక్ దిండా వేశాడు. ఓవర్ మూడో బంతిని ఫుల్‌లెంగ్త్‌తో వేశాడు. క్రీజులో ఉన్న పెరీరా టచ్ చేయాలని చూశాడు. కానీ బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కీపర్ పార్థివ్ పటేల్ వైపు వెళ్లింది. అయితే పార్థివ్ బంతిని అడ్డుకోలేకపోయాడు. దీంతో బౌండరీ వెళుతుందని మనం అనుకునేలోపే కీపర్ హెల్మెట్‌కు తాకిని బంతి అక్కడే ఆగిపోయింది. దీంతో నిబంధనల ప్రకారం అంపైర్ బైస్ రూపంలో ఇండియా మహారాజాస్‌కు ఐదు పరుగుల ఫెనాల్టీ విధించారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మహారాజాస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. 5 Runs when ball Hits Keeper Helmet ⛑️😂😂 Dinda Parthiv Bhajji all Smiles 😊@llct20 #LLC pic.twitter.com/fON67VE3hm — Kagiso Rabada (@cricketer_jii) September 16, 2022 -
పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బీసీసీఐ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో తన్మయ్ శ్రీవాత్సవ, యూసఫ్ పఠాన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. ఇండియా మహారాజాస్ బౌలింగ్‌లో పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, జోగిందర్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులు చేసి నిరాశ పరచగా.. తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. వరల్డ్ జెయింట్స్ బౌలింగ్‌లో టిమ్ బ్రెస్నన్ 3 వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? -
నాకంటే అతడే బెటర్.. చాలా నేర్చుకున్నా: ముత్తయ్య మురళీధరన్
1990లలో ప్రత్యర్ధి బ్యాటర్లను తమ స్పిన్ మయాజాలంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.. మరొకరు శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. తాజాగా గ్రేట్ షేన్ వార్న్‌ను గుర్తుచేసుకుని ముత్తయ్య మురళీధరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. వార్న్‌ను చాలా మిస్స్ అవుతున్నాము అని అతడు తెలిపాడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో వార్న్ స్పిన్ మ్యాజిక్‌ను దగ్గరి నుంచి చూసే వాడిని అని ముత్తయ్య అన్నాడు . "వార్న్ నాకంటే చాలా గొప్పవాడు అని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. నేను శ్రీలంక తరపున ఆడుతున్నప్పుడు అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడు అల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్. మేము అందరం షేన్ను మిస్ అవుతున్నాం" అని మురళీధరన్ పేర్కొన్నాడు కాగా భారత్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మురళీధరన్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మణిపాల్ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన -
కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని..
Legends League Cricket 2022- Asghar Afghan- Team India- T20 World Cup 2022: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరిని అవుట్ చేస్తే సగం జట్టును పెవిలియన్‌కు పంపినట్లే భావించేవాళ్లమని పేర్కొన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వీరి సొంతమంటూ హిట్‌మ్యాన్ రోహిత్, రన్‌మెషీన్ కోహ్లిలను కొనియాడాడు. గంభీర్ సారథ్యంలో.. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో అస్గర్ అఫ్గన్ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన అస్గర్ హిందుస్థాన్ టైమ్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసియా కప్-2022లో టీమిండియా ప్రదర్శన, టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన విజయావకాశాలపై తన అభిప్రాయాలు తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా.. టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచించేవాళ్లు అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇండియాతో మ్యాచ్ అంటేనే.. మా మొదటి ప్రాధాన్యం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లే! కోహ్లిని ఆపడం కష్టం! వాళ్లిద్దరినీ అవుట్ చేస్తే సగం జట్టును అవుట్ చేసినట్లే అని అనుకునేవాళ్లం. ప్రపంచంలోని మేటి బ్యాటర్లు అయిన వీళ్లిద్దరి గురించే మా చర్చంతా! ఎందుకంటే ఒంటిచేత్తో వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు! అందుకే... ముందు రోహిత్, కోహ్లిలను అవుట్ చేస్తే చాలు అనుకునేవాళ్లం. లేదంటే.. టీమిండియాను ఎదుర్కోవడం మరింత కష్టతరంగా మారుతుందని మాకు తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి.. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనని ఆపడం కష్టం. రోహిత్, కోహ్లిలను పెవిలియన్‌కు పంపితే వన్డేల్లో టీమిండియా స్కోరులో 100- 120... టీ20లలో 60- 70 పరుగులు తగ్గించవచ్చని భావించేవాళ్లం’’ అని అస్గర్ అఫ్గన్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్‌లో ఓటములకు అదే కారణం! అయితే.. ఇక ఆసియా కప్-2022లో రోహిత్ సేన సూపర్-4లో వరుస మ్యాచ్‌లు ఓడటానికి రవీంద్ర జడేజా లేకపోవడం కూడా ఒక కారణమని అస్గర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ టోర్నీలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్ రూపంలో వారికి మంచి అవకాశం వచ్చిందని.. కచ్చితంగా టీమిండియా ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లి.. ఆసియాకప్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో రాణించి విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతేడాది మేలో కెప్టెన్సీ కోల్పోయిన అస్గర్ అఫ్గన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీ-2021లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం! Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! -
విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..!
ఈనెల (సెప్టెంబర్) 16 నుంచి ప్రారంభంకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండో సీజన్ ఆడేందుకు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మరోసారి భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారధ్యంలోని గుజరాత్ జెయింట్స్ యూనివర్సల్ బాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం అదానీ స్పోర్ట్స్‌లైన్ శనివారం అధికారికంగా దృవీకరించింది. పొట్టి క్రికెట్లో అనేక రికార్డులు కలిగిన గేల్ ఎల్ఎల్సీలో ఆడటం చాలా సంతోషంగా ఉందని లీగ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. కాగా, గేల్‌తో ఒప్పందానికి ముందే గుజరాత్ జెయింట్స్ 15 మంది సభ్యుల బృందాన్ని (రూ. 5.51కోట్లు ఖర్చుతో) ఎంపిక చేసుకుంది. డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీ పర్సులో (మొత్తం 8 కోట్లు) కొంత డబ్బు మిగిలి ఉండటంతో (రూ. 2.48 కోట్లు) గేల్‌తో ఒప్పందం చేసుకోవాలని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా యునివర్సల్ బాస్‌తో సంప్రదింపులు జరిపి డీల్‌కు ఖాయం చేసుకుంది. సెహ్వాగ్, గేల్‌తో పాటు గుజరాత్ జెయింట్స్ జట్టులో డేనియల్ వెటోరీ, కెవిన్ ఓబ్రెయిన్, లెండిల్ సిమన్స్, అజంతా మెండిస్, గ్రేమ్ స్వాన్, మిచెల్ మెక్‌లాగెన్, రిచర్డ్ లెవి, క్రిస్ ట్రెమ్లెట్, పార్ధివ్ పటేల్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. గుజరాత్ జెయింట్స్ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, డేనియల్ వెటోరి, కెవిన్ ఓబ్రెయిన్, స్టువర్ట్ బిన్నీ, మిచెల్ మెక్‌లాగెన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా, అజంతా మెండిస్. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..?