lover suicide
-
ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో....
శంషాబాద్: ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుమన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కొత్వాల్‌గూడకు చెందిన సిద్దాంతి చంద్రయ్య కుమారుడు సిద్దాంతి శివ (23) ఆటో డ్రైవర్. అదే బస్తీకి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల యువతికి వారి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేయడంతో పాటు తాంబులాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మూడురోజుల కిందట శివ ఫోన్‌ను తీసుకుని అందులో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో పాటు అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి ఆటోతో బయలుదేరిన శివ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. చెన్నమ్మ హోటల్ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు చనిపోయాడని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల బెదిరింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఇంటి ముందు బైఠాయింపు కాగా శివ ఆత్మహత్య ఘటన కొత్వాల్‌గూడలో ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, బస్తీవాసులు సిద్దాంతి శివ మృతదేహాన్ని యువతి ఇంటి ముందు పెట్టి బైఠాయించారు. అక్కడే గోతి తవ్వి పూడ్చివేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. యువతి కుటుంబ సభ్యులే శివ మృతికి కారణమని నినాదాలు చేశారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఏసీపీ భాస్కర్లు గ్రామానికి చేరుకుని బాధితులు, బస్తీ వాసులను సముదాయించారు. మృతదేహాన్ని తీసుకెళ్లినప్పటికీ రాత్రి 9.30 గంటలకు ఖననం చేయలేదు. శివ శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు ఊ రుకునేది లేదన్నారు. రాత్రి వరకు కూడా పోలీసులు సముదాయించినప్పటికీ కొత్వాల్‌గూడలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. -
ప్రియుడు మృతిచెందాడని.. పనిచేస్తున్న ఇంట్లోనే..
గద్వాల క్రైం: తను ప్రేమించిన యువకుడు మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాలలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ రామస్వామి కథనం మేరకు.. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి (22) డిగ్రీ పూర్తి చేసింది. చదువుకొనే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా జయంత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి రెండ్రోజుల క్రితం స్నేహితురాలైన సంగీతతో కలిసి ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదన, మనస్తాపానికి గురైంది. రామేశ్వరి, సంగీత కొంతకాలంగా గాం«దీచౌక్‌లో ఉండే రామతులసి ఆరోగ్య బాగోగులు చూసేందుకు ఆమె ఇంట్లో విధులు నిర్వర్తిస్తుండేవారు. ఈ క్రమంలో పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్నేహితురాలైన సంగీత మంగళవారం ఉదయం విధులకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామేశ్వరి తల్లి కుర్మక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్మెంట్కు ముందు!
అతనికే ఇదివరకే పెళ్లి అయ్యింది. అది తెలిసి కూడా ఆమె అతన్నే ప్రేమించింది. రెండో భార్యగా అయినా సరే అతనితో జీవితం పంచుకునేందుకు సిద్ధపడింది. ఇష్టపడ్డ వ్యక్తి సహా సమాజం అందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధపడింది. సరిగ్గా నిశ్చితార్థం ముందు.. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, మనసు చంపుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ‘‘నేను నా ఇష్టపూర్వకంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నా... ఐ లవ్ యూ దీపక్. బతికుండగా నీదానిని కాలేకపోయా. ఎందుకంటే.. మీకు ఇప్పటికే పెళ్లయ్యి పోయింది. ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు చాలా మంచివారు. మా తమ్ముడు ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను మరోలా అర్థం చేసుకోకండి.. ఐ లవ్ యూ దీపక్’’ అంటూ రక్తంతో సూసైడ్ లేఖ రాసి ప్రాణం తీసుకుంది 23 ఏళ్ల శివాని. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని నాగిన్ నగర్లో ఉంటోంది శివాని కుటుంబం. స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమె పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆ ఏరియాలోనే దీపక్‌కు శానిటరీ షాపు ఉంది. ఆయన వివాహితుడు. అది తెలిసి కూడా శివాని ప్రేమ పేరుతో ఆయన వెంటపడింది. ఈ విషయంపై దీపక్ భార్య, శివాని ఇంటికి వచ్చి గొడవ పడింది కూడా. ఆ సమయంలో.. దీపక్‌కు రెండో భార్యగా ఉంటానంటూ శివాని చెప్పగా, పెద్ద పంచాయితీయే జరిగింది. ఈ గొడవ తర్వాత కుటుంబ సభ్యులు శివానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై శివానికి విజయ్ నగర్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం.. ఇంట్లో ఎవరూ లేని టైంలో శివాని బలవన్మరణానికి పాల్పడింది. ముందు బ్లేడ్‌తో చేతులు, కాళ్లు కోసుకున్న శివాని.. ఆ రక్తంతో సూసైడ్ నోట్ రాసింది. ఆపై ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, దీపక్ లేని జీవితం ఊహించుకోలేక చనిపోతున్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఈ మేరకు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. -
ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..
సాక్షి,జన్నారం(మంచిర్యాల): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌లో జరిగింది. ఎస్సై సతీశ్, మృతుడి తల్లి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన గొలాట రమేశ్ – సత్తవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కార్తీక్ సంతానం. జన్నారం ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా యువతి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్ ఈనెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత తన స్నేహితుడు నాగుల హరీశ్‌కు ఫోన్‌చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే హరీశ్ తన స్నేహితులు రమేశ్, వెంకటేశ్‌తో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేట్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కార్తీక్ తల్లి సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో.. -
ప్రేమకథ విషాదాంతం.. కలిసి బతకలేక.. విడిచి ఉండలేక..
సాక్షి, చెన్నై: రాణిపేట జిల్లా అమ్మూరు సమీపంలోని వేలంపుదూరు గ్రామానికి చెందిన సుబ్రమణి కుమార్తె సంధ్య (18) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫ్లస్‌టూ చదువుతోంది. ఈమె పక్క ఇంటికి చెందిన కాశి కుమారుడు కదిర్‌వేల్(24)ను ప్రేమించింది. ఈక్రమంలో సంధ్యను వివాహం చేసుకునేందుకు కదిర్‌వేల్ కుటుంబ సభ్యులతో కలిసి గతవారం సంధ్య ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. చదవండి: జగత్ కిలాడీలకు ఝలక్ అయితే సంధ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మనోవేదనకు గురైన సంధ్య బుధవారం సాయంత్రం ఇంటి వెనుక వైపున ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మృతితో కదిర్‌వేల్ ఆవేదనకు గురై.. షోళింగర్ సమీపంలోని నరసింహపురం వద్ద అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. షోళింగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో..
గుర్రంపోడు: ‘నువ్వే నా ప్రాణమని చెప్పా.. ఇక బతికినా నీతోటే... చచ్చినా నీతోటే అని చెప్పినా నువ్వు పట్టించుకోలేదు.. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. అందుకే చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. ఇదే నా ఆఖరి కోరిక’ అంటూ ఓ యువకుడు ప్రియురాలిని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా గుర్రంపోడుకి చెందిన మైదాసు రమేశ్, యాకాశమ్మ దంపతుల కుమారుడు రాకేశ్ నల్లగొండలో డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. రాకేశ్ అదే ప్రాంతానికి చెందిన యువతిని కొంతకాలంగా ఇష్టపడుతున్నాడు. అయితే, తాను ప్రేమించిన యువతికి మరొకరితో జూన్ 2న వివాహం నిశ్చయించారని తెలుసుకున్న రాకేశ్ మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం తాను చని పోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి ఉరేసుకున్నాడు. వేరే ఊరిలో బంధువుల పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఇంటికి వచ్చి.. ప్రాణాపాయస్థితిలో ఉన్న రాకేశ్‌ను నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..! -
విషాదం: ప్రేమపెళ్లికి ఓకే, అయినా కూడా..
సాక్షి, ఖమ్మం: నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అడిగినంత కట్నం ఇవ్వాలి, లేదంటే పెళ్లి జరగదని ప్రియుడు ప్రియురాలికి తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. లింగారంతండా శివారు బోటిమీది తండాకు చెందిన ఎంఫార్మసీ చదువుతున్న వడిత్యా లైలా (23)అదే తండాకు చెందిన డిప్లొమా చదువుతున్న బాణోత్ ప్రవీణ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇరువురు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఇటీవల పెద్దల సమక్షంలో వివాహం జరిపేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో కట్నంగా కొంత నగదు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కాగా యువకుడు, అతని తల్లిదండ్రులు కట్నం సరిపోదని, మరింత ఎక్కువ ఇస్తేనే పెళ్లి అని భీష్మించుకున్నారు. మనస్తాపానికి గురైన లైలా ఈనెల 9వ తేదీన పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ప్రవీణ్, తల్లిదండ్రులు మంగు, బుజ్జి, తమ్ముళ్లు గణేష్, ప్రశాంత్‌పై మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: వివాహేతర సంబంధం: మహిళ దారుణ హత్య దారుణం: కారు కోసం 3 నెలల కొడుకును అమ్మేసిన తల్లిదండ్రులు -
ప్రియుడి నాటకంతో శానిటైజర్ తాగి ప్రియురాలి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు... సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన అలవాల డేవిడ్‌రాజు, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూష(18) సిరిసిల్లలో డిప్లొమా చదువుతోంది. కరోనా కారణంగా క్లాసులు లేకపోవటంతో గతేడాది నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోందని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష అమ్మమ్మ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉండటంతో అక్కడకు వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో అదే ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న బండి భాస్కర్‌రావు, వెంకటమ్మల కుమారుడు జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత జగదీష్ పెళ్లికి నో చెప్పడంతో.. మనస్తాపానికి గురైన ప్రత్యూష ఏప్రిల్‌లో 30న హైదరాబాద్‌లో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. దీంతో ప్రియుడు జగదీష్ కారణంగానే ప్రత్యూష మృతి చెందిందని బషిర్‌బాగ్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తుంబూరులో నివాసం ఉంటున్న ప్రియుడు జగదీష్ ఇంటి ఎదుట మంగళవారం ప్రత్యూష మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో జగదీష్, తల్లిదండ్రులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి, ధర్నాను విరమింపజేశారు. -
ప్రియురాలు దూరం, 3 లక్షలు ఫైన్, ప్రియుడి సజీవదహనం
సాక్షి, తిరువొత్తియూరు : కులాంతర ప్రేమ ఇద్దరు ప్రేమికుల్ని బలిగొంది. ప్రేమికుడి కుటుంబానికి పంచాయితీ చేసిన ఓ రాజకీయ ప్రముఖుడు రూ.3 లక్షలు జరిమానా విధించారు. ప్రేమికుల్ని విడదీశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియురాలు నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ప్రియుడు సైతం ఆమె జ్ఞాపకాలు తలచుకుంటూ కుంగిపోయాడు. చివరకు అతనూ ప్రియురాలి తరహాలోనే నిప్పంటించుకుని తనువు చాలించాడు. వివరాలు..రామనాథపురం జిల్లా కేల్ కరై సమీపం పనయం గాడుకు చెందిన ప్రవీణ్ (20), కూలాంకులానికి చెందిన నంబుగులాంతో పరిచయం కలిగింది. కళాశాలలో చదువుతున్న సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వేర్వేరు కులాలు. ప్రేమజంట వ్యవహారం తెలుసుకున్న బి.కీరందయి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలి భర్త అయిన అన్నాడీఎంకే నాయకుడు అర్పుదరాజ్ పంచాయితీ చేశాడు. ప్రేమికులిద్దరినీ విడదీశాడు. అంతేకాకుండా ప్రవీణ్ కుటుంబం రూ. 3 లక్షలు జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశాడు. ఈ వ్యవహారాలతో కలత చెందిన నంబుగులా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రవీణ్ కుంగిపోయాడు. రెండు నెలల తరువాత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తానూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటలు తాళలేక అతను కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి, అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: సినిమా తరహా పక్కా స్కెచ్: అనాథగా అవతారమెత్తి.. -
టీ కోసం ప్రియునితో గొడవ.. ఆత్మహత్య
కర్ణాటక, తుమకూరు: అనుమానాస్పద స్థితిలో యువతి చికెన్ దుకాణంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం శిర తాలూకా కళ్లంబెళ్లలో చోటు చేసుకుంది. బెంగళూరులోని మారతహళ్లికి చెందిన అశ్వని (25) అక్కడికి సమీపంలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో రెండేళ్లుగా పని చేస్తుండేది. డయాగ్నస్టిక్ సెంటర్ యజమాని ప్రభాత్, అశ్వని కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మంగళవారం టీ చేసే విషయంపై ఇరువురి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన యువతి స్కూటీపై కళ్లంబెళ్లకు చేరుకొంది. అక్కడే ఖాళీగా ఓ చికెన్ షాపులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
కాచిగూడ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి నెయిల్ పాలీష్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ కుమార్తె కె.లోచన ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మిర్యాలగూడకు చెందిన దోసాపాటి సిద్దార్థతో షాదీ డాట్‌కామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునే వారు. గత కొద్దిరోజులుగా లోచన పెళ్లి ప్రస్తావన తేగా సిద్దార్థ దాటవేస్తున్నాడు. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు అతడికి నచ్చజెప్పినా సిద్దార్థలో వైఖరిలో మార్పు రాకపోగా, తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో మనస్తాపానికి లోనైన ఆమె సోమవారం రాత్రి నెయిల్ పాలీష్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాచిగూడ పోలీసులు బాధితురాలిని విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. లోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. -
విడిపోలేక పోతున్నాం..ఇదే మా లాస్ట్ వీడియో..!
చిత్తూరు, చంద్రగిరి/శ్రీకాళహస్తి: వారిద్దరూ ఫేస్బుక్ ప్రేమికులు. ఇద్దరి కులాలూ వేరు. అయితేనేం ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారారు. తమ ప్రేమను పెద్దలు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో ఇద్దరూ రెండు రోజుల క్రితం అదృశ్యమై వివాహం చేసుకున్నారు. అయినా తమను విడదీస్తారనే అనుమానంతో ఇద్దరూ కలిసే చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తాము చనిపోవడానికి గల కారణాలను అందులో వివరించారు. అనంతరం సోమవారం అర్ధరాత్రి తర్వాత ఇద్దరూ రైలు కింద పడి మృత్యు ఒడిలోకి జారుకున్నారు. తెల్ల వారిజామున విగత జీవులుగా వారి దేహాలు రైలు పట్టాల వద్ద దర్శనమిచ్చాయి. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున మొరవపల్లె సమీపంలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, ప్రేమ జంట బంధువుల కథనం... శ్రీకాళహస్తిలోని పీర్లచావడి వీధిలో నివాసముంటున్న రవిబాబు, సుమతిల కుమార్తె పల్లవి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అలాగే, మండలంలోని మొరవపల్లె దళితవాడకు చెందిన దొరస్వామి, రాజమ్మల కుమారుడు ధనుంజయ(19) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ కొంత కాలం క్రితం ఫేస్బుక్ ద్వారా కలిగిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు వ్యతిరేకిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో 13న ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడడంతో ఇంటర్నెట్ సెంటర్లో ఫలితాలను చూసుకువస్తానంటూ పల్లవి ఇంటి నుంచి బయల్దేరింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె బంధువులు గాలించారు. అనంతరం శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక, అదే రోజున ధనుంజయ తన మిత్రులతో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లాడు. అనంతరం ప్రేమికులిద్దరూ 14న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం మరణాన్ని ఆశ్రయించారు. సోమవారం అర్ధరాత్రి అనంతరం మొరవపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని, రైలు కింద పడి తనువు చాలించారు (సరిగ్గా ధనంజయ ఇంటికి అర కిలోమీటరు దూరంలోనే). ఉదయాన్నే ఇది వెలుగులోకి రావడంతో ధనుంజయ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకుని దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. మమ్మల్ని కాటికి పంపిస్తావనుకుంటే.. మాకన్నా ముందు నువ్వు వెళ్లావా..నాయనా..! అంటూ వారి రోదనలు పలువురినీ కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పాకాల రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రేమజంట మృతదేహాలను తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గంట ముందు.. ‘‘బై అన్నా..బై వదినా..బై మా..బై డాడీ..బై విక్రమ్.. అందరికీ బై.. ఇదే మా లాస్ట్ వీడియా.. బతకాలనుకోవడం లేదు..చచ్చిపోతున్నాం.. పెళ్లికూడా అయిపోయింది.. (అప్పుడు తన మెడలోని పసుపుకొమ్మును పల్లవి చూపించింది) విడిపోలేక చచ్చిపోతున్నాం.. మా చావే అందరికీ ఉదాహరణ. దయచేసి ఎవరు లవ్ చేసుకున్నా.. వాళ్లెలాంటి వారైనా, ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మిమ్మల్నందరినీ చాలా బాధపెడుతున్నాం.. బై..గుడ్‌బై..’’ ఆత్మహత్యకు పాల్పడటానికి ఒక గంటకు ముందు వారిద్దరూ 45 సెకన్ల నిడివి గల ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇందులో ధనంజయ ఎక్కువసేపు మాట్లాడాడు. నవ్వుతూనే, ఇద్దరూ గుండె నిబ్బరంగా మాట్లాడటం గమనార్హం! అయితే సెల్ఫీ వీడియో చివరలో లిప్తపాటు సమయం పల్లవి కళ్లలో తడి కనిపించింది. బహుశా ఆమె కళ్లల్లో తల్లిదండ్రులు, ఆత్మీయులు, స్నేహితులు కదలాడారేమో!! -
ప్రేమ పేరిట వంచన
ప్రేమ పేరిట బాలికను మోసం చేశాడు ఓ యువకుడు. తమకు న్యాయం చేయాలని బాలికతో పాటు తల్లి నాలుగు నెలలుగా గ్రామ పెద్దలు చుట్టూ తిరిగారు. నాలుగు రోజుల కిందట పోలీసుస్టేషన్‌కూ వెళ్లారు. అయినా న్యాయం దక్కలేదు. ఇక న్యాయం జరగదని భావించిన తల్లీకూతుళ్లు పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన శనివారం లక్కవరపుకోటలో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఎస్ఐ కె.ప్రయోగమూర్తి, బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... లక్కవరపుకోట: మండలంలోని రేగ గ్రామానికి చెందిన బాలిక కళ్లేపల్లి గ్రామానికి చెందిన కోరాడ సాయిశంకర్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కలిసి తిరిగారు. విషయం కాస్త బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సాయిశంకర్‌ను నిలదీశారు. నాలుగు నెలల కిందట పెద్దల సమక్షంలో పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టారు. ప్రేమికులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలని సాయిశంకర్‌కు చెప్పారు. దీనికి ప్రియుడు నిరాకరించాడు. తరువాత పలుసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలుగు రోజుల కిందట బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన విషయం చెప్పి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు సాయిశంకర్‌తో పాటు తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను స్టేషనకు రప్పించి చర్చిం చారు. అయినా సాయిశంకర్ నిరాకరించాడు. కేసులొద్దు... తనకు సాయిశంకర్‌తో పెళ్లి చేయాలని, కేసులొద్దని బాలిక పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగింది. స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పినా బాలిక ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బాలిక తన తల్లితో పోలీసుస్టేషన్‌కు వచ్చి మరోసారి పోలీసులకు విన్నవించింది. దీంతో ఎస్ఐ, ఏఎస్ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే పోలీ సుస్టేషన్ వెలుపలికి వచ్చి ఇంటి నుంచి తెచ్చుకున్న పురుగుల మందును ఒక్కసారిగా తాగేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు. తల్లీకూతుళ్లను ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. తల్లీకూతుళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రియుడు కోసం ఆరా... పురుగుల మందు తాగి ఎస్.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాలిక, తల్లి నుంచి పోలీసులు స్టేట్మెంటు రికార్డు చేశారు. ప్రియుడు సాయిశంకర్ కోసం ఆరా తీస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కౌన్సెలింగ్ చేశాం... ఈ ఘటనపై ఎస్ఐ ప్రయోగమూర్తి మాట్లాడుతూ ఇద్దరు మైనర్లు కావడంతో పలుసార్లు కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ప్రియుడిపై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా బాలిక నిరాకరించడంతో తామేమి చేయలేకపోయామని పేర్కొన్నారు. ఎస్.కోట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకూతుళ్లు ప్రియుడు సాయిశివశంకర్ -
ప్రియురాలి మృతిని తట్టుకోలేక..
అన్నానగర్: చిదంబరంలో మంగళవారం ప్రియురాలి మృతిని తట్టుకోలేక మనస్తాపంతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా చిదంబరం పరమేశ్వరనల్లూర్ సొక్కలింగం నగర్‌కు చెందిన నారాయణన్ కుమారుడు వైతీశ్వరన్ (22). చిన్న వయస్సులోనే వైతీశ్వరన్ తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నాన్న శరవణమురుగన్ వద్ద పెరుగుతున్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వైతీశ్వరన్ విదేశంలో పని చేసి కొన్ని నెలల కిందట సొంత ఊరికి వచ్చాడు. తరువాత అతను విదేశానికి వెళ్లలేదు. ఈ స్థితిలో వైతీశ్వరన్ చిదంబరం సమీపం కీళమూంగిలడిలో ఉన్న ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాండియన్ కుమార్తె రత్తినప్రియ (21) ప్రేమించుకుంటూ వచ్చారు. గత 9వ తేదీ రత్తినప్రియ ప్రియుడితో సెల్‌ఫోన్‌తో మాట్లాడుతుండగా ఇమె తల్లి ఇంధ్ర (45) చూసి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రత్తినప్రియ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వైతీశ్వరన్ సోమవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలకు వెళ్లాడు. ప్రియురాలు మృతి చెందిన మనస్తాపంతో వైతీశ్వరన్ రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అతని మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఈ స్థితిలో మంగళవారం బంధువులు, స్నేహితులు వైతీశ్వరన్ మృతదేహాన్ని చూడటానికి పోస్టుమార్టం గదికి వచ్చారు. అతని శరీరంపై పలుచోట్ల ఎలుకలు కొరికిఉన్నాయి. దీంతో ఆవేశం చెందిన బంధువులు ఆస్పత్రిని ముట్టడించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. -
కోరిక తీరాక.. పెళ్లి వద్దన్నాడు
సాక్షి, సూర్యాపేట క్రైం : ప్రియుడు మోసం చేశాడని.. ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన కక్కిరేణి సత్తయ్య కుమార్తె ఉమారాణి డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. ఇదే క్రమంలో దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన సుద్దబావి శ్రీకాంత్ చండూరు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉమారాణి చెర్వుగట్టుకు వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీకాంత్ చిన్నమ్మ జయ ద్వారా ఉమకు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం తాళ్లవీరప్పగూడేనికి ఉమారాణిని జయ రప్పించింది. ఓ గదిలో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఉమారాణికి ఇచ్చింది. అనంతరం శ్రీకాంత్ గదిలోకి వెళ్లి శారీరకంగా అనుభవించాడు. ఉమారాణి మత్తునుంచి తేరుకున్న శ్రీకాంత్, జయను నిలదీయగా ఇద్దరం ఒకే కులానికి చెందిన వారం కావడంతో వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. రెండేళ్లనుంచి శారీరకంగా అనుభవిస్తూ కాలం వెల్లదీస్తూవచ్చా డు. శ్రీకాంత్ తన చెల్లి వివాహం జరిగాక వివాహం చేసుకుందామని చెప్పాడు. ఇటీవల శ్రీకాంత్ చెల్లి వివాహం జరగగా.. శ్రీకాంత్ తమ మేనత్త కూతురితో వివాహ నిశ్చయం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని జయ ఉమారాణికి ఫోన్ ద్వారా నెల రోజుల క్రితం చేరవేసింది. ఉమారాణి మాట్లాడేందుకు శ్రీకాంత్‌కు ఫోన్ చేయగా.. లిఫ్టు చేయ లేదు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం సూర్యాపే ట డీఎస్పీ నాగేశ్వరరావును కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. శ్రీకాంత్‌ను డీఎస్పీ నాగేశ్వరరావు పిలిపించాడు. ఇరువర్గాలు మాట్లాడుకోవాలని చెప్పి కొంతకాలం గడిచాక సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి.. కేసు పెట్టలేమని చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు పెట్టిన కొంతకాలం సమయం గడిపి వారి ప్రేమాయణం ఇక్కడ సాగలేదంటూ ఎక్కడ సాగిందో అక్కడే కేసు పెట్టుకోవాలన్నారని.. ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతూ ఉందని వాపోయారు. దీంతో ఉమారాణి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసేందుకు మంగళవారం పోలీసు కార్యాలయానికి చేరుకుంది. సమయానికి ఎస్పీ ఇతర సమావేశాల్లో ఉండగా.. ఎదురుచూసి చేసేదేమిలేక వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఏరియాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఉమారాణికి ఏరియాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ప్రియుడి ఇంటిఎదుట యువతి బైఠాయింపు
సారంగపూర్(నిర్మల్): మూడేళ్లుగా తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర ఆందోళన చెందిన యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించిన ఘటన ఆదివారం మండలంలోని బీరవెల్లిలో చోటు చేసుకుంది. బీరవెల్లి గ్రామానికి చెందిన మద్ది నర్సయ్య–లక్ష్మి దంపతుల కుమార్తె శ్యామల(21) అదే గ్రామానికి చెందిన కొక్కుల రాజేశ్వర్–లక్ష్మి దంపతుల కుమారుడు దినేష్(25) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దినేష్ ఉన్నత చదువుల నిమిత్తం బయటకు వెళ్లడంతో ప్రతీరోజు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇరువురు ఒకే కులానికి చెందినవారు కావడంతో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇదే క్రమంలో రోజు తనతో ఫోన్లో సంభాషించే దినేష్ నెలరోజులుగా మాట్లాడకపోవడంతో నిరాశ చెందిన శ్యామల ఇంట్లోఉన్న సూపర్‌వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో విషయం ఇంట్లోవాళ్లకు తెలిసి సదరు యువతిని విచారించగా ప్రేమ వ్యవహారం తెలిసింది. దినేష్‌తో తన పెళ్లి జరిపిస్తామని యువతిని ఒప్పించిన ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి న అనంతరం యువతి దినేష్ ఇంటిఎదుట బై ఠాయించింది. ఐద్వా మహిళా సంఘం ప్రతిని« దులు సునీత, తదితరులు యువతికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో రెండుకుటుంబాలకు చెందిన పెద్దలను పిలిపించి సర్పంచ్ ఎల్లన్న, ఎస్సై సునీల్‌కుమార్ ప్రేమజంటను ఏకంచేసే ప్రయత్నం చేశారు. -
అవమానభారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం
గిడ్యాల: కుల పెద్దల సమక్షంలో ఎదురైన అవమానాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన లక్ష్మాపురం ఎస్సీకాలనీలో ఆదివారం కలకలం రేపింది. బాధితుడి భార్య వివరాల మేరకు..వెంకటాపురం గ్రామానికి చెందిన శ్రావణజ్యోతి అవ్వతాతల ఊరైన లక్ష్మాపురం వెళ్లేది. ఈక్రమంలో గ్రామానికి చెందిన ప్రభుదాసు కుమారుడు చిన్నాతో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులను ఎదురించి గ్రామపెద్దల సమక్షంలో ఆరు నెలల క్రితం నందికొట్కూరు బ్రహ్మంగారి మఠం వద్ద పెళ్లి చేసుకుంది. చిన్నా పెంచుకున్న బాతులు శ్రావణజ్యోతి అవ్వ ఇంటి పరిసరాల్లోకి వెళ్లడంతో గొడవ జరిగింది. ఈక్రమంలో చిన్నా తన భార్య పిన్ని దివ్యభారతిని అసభ్య పదజాలంతో దూషించాడని ఉదయం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీన్ని అవమానంగా భావించిన అతడు ఇంట్లోకి వెళ్లి చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తమకు ఎలాంటి సమచారం అందలేదని ముచ్చుమర్రి ఏఎస్ఐ కృష్ణుడు తెలిపారు. -
పశ్చిమ గోదావరిలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. తనను ప్రేమించలేదనే కోపంతో కత్తితో నరికి చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బాపుజీ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలివి.. ప్రేమ పేరుతో కిరణ్ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియురాలి వేధింపులు తాళలేక..
సిద్దిపేటటౌన్: ప్రియురాలితో పాటు ఆమె బంధువులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ప్రేమికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన పేకర్ల కృష్ణకుమార్ వృత్తి రీత్యా కారు డ్రైవర్. అతను అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏప్రిల్‌లో వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. ఈ క్రమంలో సదరు యువతి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కృష్ణకుమార్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేయగా ఈనెల 3న స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కృష్ణ కుటుంబ సభ్యులు అతనికి వేరే అమ్మాయితో ఈ నెల 11న వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువతి పెళ్లి ముందు రోజు కృష్ణ ఇంటికి వచ్చి తనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవద్దని గొడవ చేసి, కోహెడ పోలీస్ స్టేషన్లో కృష్ణపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ శుక్రవారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద పురుగుల మందు తాగి పడి పోయాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు అతడిని 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల కోసం అతని జేబులు వెతకగా సూసైడ్ నోట్ లభించింది. అందులో అతను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య , బావ తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, రౌడీలతో కొట్టిస్తున్నారని, తన చావుకు కారణమైన వీరందరిని కఠినంగా శిక్షించాలని రాసిన సూసైడ్ నోట్ లభించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా కేసు నమోదు కాలేదని తెలిపారు. -
ప్రేమికుడిని కాపాడబోయి అస్వస్థతకు..
సిద్దిపేటటౌన్: సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో ప్రేమికుడు ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన సోమవారం రాత్రి కలకలం సృష్టించింది. ప్రేమికుడు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగగా.. అతడిని కాపాడబోయిన ప్రేమికురాలు అస్వస్థతకు గురై సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించి పోలీసులు, ఇరువురి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెజ్జంకి మండలం రేగులపల్లికి చెందిన సంతోష్‌రెడ్డి(28) అదే గ్రామానికి చెందిన బోనగిరి రాణి(28) చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో చాలాసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది. రాణికి గతంలోనే పెళ్లి జరగగా.. విడాకులు తీసుకుని ఇంటి వద్దే ఉంటోంది. సంతోష్‌రెడ్డికి ఇటీవలే గ్రామంలోని మరో యువతితో వివాహం నిశ్చయమైంది. ఆ వివాహం చేసుకోవడం సంతోష్‌రెడ్డికి ఇష్టం లేకపోవడంతో శనివారం రాణితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకుని ఏదైనా పని చేసుకుంటూ జీవిస్తామని తెలిసిన వారికి చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో బస్సు దిగి అక్కడే చాలా సేపు వేచి ఉన్నారు. అంతకుముందే సంతోష్‌రెడ్డి తన వెంట పురుగుల మందు తెచ్చుకున్నాడు. బాత్రూంకు వెళ్లోస్తానని రాణికి చెప్పి సంతోష్‌రెడ్డి బస్టాండ్‌లో ఉన్న బాత్రూంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు. కాసేపటికి నోట్లో నుంచి నురగలు కక్కుతూ బయటకు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో సంతోష్‌రెడ్డి పడిపోయిన చోటుకు వచ్చిన రాణి అతడి నోట్లో నుంచి వస్తున్న నురగను తీసేస్తూ నోటితో శ్వాస అందించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో విష ప్రభావానికి గురైన రాణి కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రేమికుల జంటను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన 5 నిమిషాల్లోపే సంతోష్‌రెడ్డి మృతిచెందాడు. రాణి కోమాలోకి వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉంటే ఇద్దరూ విషం తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడంలో తమకు ఎవరి పైనా అనుమానం లేదని, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తమకు తెలియవని ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ లెటర్ సంతోష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసినట్టు తెలిసింది. అందులో తనకు పెళ్లి నిశ్చయమైన అమ్మాయి అంటే ఇష్టం లేదని, ఇక తాను బతకనని పేర్కొంటూ అమ్మ, నాన్న క్షమించాలని రాసినట్టు తెలిసింది. తన తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవడమే అని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుంటే తాను బతకలేను అనే విషయం తెలియక ఇంట్లో వారు తనకు వేరే అమ్మాయితో పెళ్లికి నిశ్చయించడమే ఆత్మహత్యకు కారణంగా లేఖను బట్టి తెలుస్తోంది. మృతుడు సంతోష్‌రెడ్డి రాసిన లేఖను 108 సిబ్బంది తీసుకుని పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి పోలీసులు ఈ లేఖ విషయం ఎందుకు దాచి పెట్టారో అర్థం కాని విషయంగా మారింది. -
లవర్‌తో వీడియో కాల్, లైవ్ లో ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : క్షణికావేశంతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయంతో నిండు జీవితాం అర్థాంతరంగా ముగిసింది. ప్రేమికురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల అజ్మీర్ సాగర్ మల్కాజ్‌గిరిలోని వినాయక్ నగర్లో తన సోదరితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సాగర్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆ యువతి బంధువులతోపాటు, ఇంట్లోవాళ్లు కూడా ఈ ప్రేమ వ్యవహరంలో సాగర్ని హెచ్చరించారు. సాగర్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూడటంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె నువ్వు చనిపోతే నీ మీద కోపం పోతుంది అంటూ సాగర్‌కు వాట్సాప్‌లో సందేశం పంపింది. ఈ విషయంపై మాట్లాడాలంటూ సాగర్ గురువారం ఉదయం ఆమెకు మెసేజ్ చేశాడు. తాను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్ చేయమని కోరాడు. ఆ యువతి వీడియో కాల్ చేయగానే.. సాగర్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అయితే సాగర్ సీరియస్‌గా చెప్పినప్పుటికీ ఆ విషయాన్ని ఆమె సరదాగా తీసుకోవడంతో సాగర్ ... వీడియో కాల్ మాట్లాడుతూనే సీలింగ్ ఫ్యాన్‌కి ఊరేసుకుని తనువు చాలించాడు. -
భగ్నప్రేమికుల బలవన్మరణం
కోదాడ/నేరేడుచర్ల: భగ్నప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం చేయడాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా, తను లేకుండా జీవించలేనని అమ్మాయి కూడా బలవన్మరణం చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ, నేరేడుచర్లలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నేరేడుచర్లకు చెందిన గూడూరు ప్రశాంత్ (25) అలియాస్ ఉప్పి కోదాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. కోదాడకు వచ్చిపోయే క్రమంలో కోదాడలోని వీటీ కాలనీకి చెందిన శాలిని (18) అనే బంధువుల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. శాలిని కోదాడలోని ఓ డిగ్రీ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజుల క్రితం వీరి ప్రేమకు శాలిని తల్లిదండ్రులకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వేరే వ్యక్తితో నిశ్చాతార్థం చేశారు. వీడియోకాల్‌లోనే ఆత్మహత్యకు నిర్ణయం నేరేడుచర్లలో శుక్రవారం రాత్రి మిత్రులతో మాట్లాడి ఇంటికి వచ్చాడు. ఉదయం 6 గంటలకే తనను నిద్ర లేపాలని ఎదురింట్లో ఉండే ఓ మహిళకు చెప్పాడు. అయితే.. శనివారం ఉదయం ఆమె వచ్చి తలుపుకొట్టగా ఉలుకూపలుకూలేదు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగులకొట్టి చూడగా ప్రశాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు. అటు కోదాడలో కూడా శాలిని తెల్లవారుజామునే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నా చివరి క్షణంలో వీడియోకాల్ ద్వారా మాట్లాడుకొని ఒకే సమయంలో పురుగుల మందు తాగారు. -
అతని కోసం ఆమె.. ఆమె కోసం అతను!
ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ప్రాణాలు విడిచిన వైనం ప్రేమ త్యాగాన్ని కోరుకుంటోంది. కానీ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లా గ్రామంలో ప్రాణాలను కోరింది. పొరుమల్ల గ్రామానికి చెందిన కుంట రాజశేఖర్, పక్క గ్రామానికి చెందిన యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం కావడంతో...పెళ్లికి ఒప్పుకుంటారని భావించారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆస్తి లేదని దూరం పెట్టారు. దీంతో పరువుగా ఫీలైన రాజశేఖర్ ....డబ్బు సంపాదన కోసం గల్ఫ్ వెళ్లాడు. ఈ క్రమంలో యువతిపై తల్లిదండ్రులు పెళ్లి ఒత్తిడి తెచ్చారు. తాము చూపించిన అబ్బాయిని చేసుకోవాలని కోరారు. దీంతో వలచిన ప్రియుడ్ని మరవలేక....తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోలేక...ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రియురాలు లేదని తెలిసిన రాజశేఖర్ 2 నెలల కిందట.. గల్ఫ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతదేహాం శనివారం స్వగ్రామానికి చేరడంతో.. బాధిత కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. -
ప్రేమ పంచాయితీ.. యువకుడి ఆత్మహత్య
హిందూపురం అర్బన్ : ప్రేమ వ్యవహారంలో ఎదురుదెబ్బలు తిన్న ఓ యువకుడు శనివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బెదిరించడం.. బయటి వ్యక్తులు దాడికి పాల్పడటం వల్ల మనస్తాపంతోనే ప్రాణాలు తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం మేరకు... హిందూపురంలోని బోయపేటకు చెందిన సుశీలమ్మ, ఆదినారాయణ కుమారుడు పవన్‌కుమార్(20) బెంగళూరులోని పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయితో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. ఇద్దరి ఇళ్లలో పెద్దలు మందలించారు. దీంతో వారిద్దరూ శుక్రవారం ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు సునంద, నరసింహులు మైనర్ అయిన తమ కుమార్తెను పవన్ ఎత్తుకుపోయాడని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పవన్ తండ్రి ఆదినారాయణను స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పవన్‌కుమార్ అమ్మాయితో కలిసి పోలీసుల వద్దకు వచ్చాడు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక కావడంతో కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించి ఇద్దరినీ విడదీసి వారి తల్లిదండ్రుల వెంట పంపించారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తులైన ధర్మవరం రవి, గోపి ఈ విషయంలో కల్పించుకుని పవన్‌కుమార్‌ను చితకబాదారు. తీవ్ర మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ రాత్రంతా మానసికంగా కృంగిపోయి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే శవమై కనిపించిన కొడుకును చూసిన తల్లిదండ్రులు సుశీలమ్మ, ఆదినారాయణ, బంధువులు బోరున విలపించారు. చెట్టంత కొడుకును కొట్టి బెదిరించి పోలీసులు, అమ్మాయి బంధువులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ స్థానిక చిన్నమార్కెట్ సర్కిల్ వద్ద పవన్ మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. వారి ఆందోళనతో బెంగళూరు రోడ్డులో రాకపోకలు స్తంభించిపోయాయి. సీఐ మ«ధుసూదన్, సిబ్బంది అక్కడకు చేరుకుని బాధితులను శాంతపరించేదుకు ప్రయత్నించినా వారు వినలేదు. అనంతరం వాల్మీకి సేవాదళ్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ, బోయసంఘం నాయకులు అక్కడికి చేరుకుని బాధితులకు బాసటగా నిలిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు రవి, గోపిలపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ప్రేయసికి పెళ్లి చేశారని..
జమ్మలమడుగు: తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారనే మనస్థాపంతో జమ్మలమడుగు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఆదినారాయణ(18) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన జి.ఆదినారాయణ, దువ్వూరు మండలం మన్నెరాంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకొని వచ్చారు. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు దువ్వూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి చేసుకున్న యువతీ యువకులిద్దరు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే వీరిద్దరూ మైనర్లు అని ఈ వివాహం చెల్లదని పోలీసులు తేల్చి చెప్పారు. మూడు సంవత్సరాల వరకు ఎవరూ వివాహం చేయకూడదని పోలీసులు ఇరువర్గాల పెద్దల అంగీకారంతో అగ్రిమెంట్ రాశారు. మూడు సంవత్సరాల తర్వాత ఆ యువతిని తాను ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుంటానని చెబితే అప్పుడు వివాహం జరిపించాలి. లేదంటే ఎవరంతట వారు ఉండాలని పోలీసులు సూచించారు. అయితే అగ్రిమెంట్‌ను కాదని యువతి తల్లిదండ్రులు సోమవారం ఆమెకు వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు మైనర్‌కు వివాహం చేశారని, తమ కుమారుడి మరణానికి అమ్మాయి తల్లిదండ్రులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.