lpg subsidy
-
పేదలకు ఎల్పీజీ సబ్సిడీ కొనసాగుతుంది
అగర్తలా: పేదలకు అందిస్తున్న ఎల్పీజీ సబ్సిడీ ఇకమీదటా కొనసాగుతుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం స్పష్టం చేశారు. ‘సాధారణ ప్రజలు, పేదలకు ఎల్పీజీ, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తేసే ప్రణాళికలేవీ లేవు’ అని ప్రధాన్ మీడియాకు చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుంచి త్రిపురకు సహజవాయువు తెచ్చేందుకు పైపులైను వేసే ప్రాజెక్టును చేపట్టామని ప్రధాన్ తెలిపారు. -
ఇక వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్!
-
ఇక వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్!
న్యూఢిల్లీ : అత్యధిక మొత్తంలో ఆదాయాలు ఆర్జిస్తున్నా ప్రభుత్వ అందిస్తున్న వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎందుకు వదులుకోవాలంటూ వ్యవహరిస్తున్న వారందరికీ కేంద్రప్రభుత్వం షాకివ్వబోతుంది. నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తున్న పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని పెట్రోలియం, ఆయిల్ మంత్రిత్వశాఖకు మార్పిడి చేస్తోంది. ఈ సమాచార మార్పిడితో రూ.10 లక్షల కంటే ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారి వివరాలను పెట్రోలియం శాఖకు అందనున్నాయి. దీంతో వంటగ్యాస్‌పై సబ్సిడీ వివరాలను చెక్ చేసి, ఒకవేళ ఎవరైనా రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తూ సబ్సిడీ పొందుతున్నట్టు తెలిస్తే వారికి వెంటనే గ్యాస్ సబ్సిడీలో కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పన్ను చెల్లింపుదారుల ఆదాయ ఆర్జన వివరాలతో పాటు వారి వ్యక్తిగత వివరాలు పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, జెండర్, ఐటీ డేటా బేస్‌లోని అందుబాటులో ఉండే అన్నీ అడ్రస్‌లు, ఈ-మెయిల్ ఐడీ, ఇంటి ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్లు వంటి వాటిని ఐటీ డిపార్ట్మెంట్ పెట్రోలియం శాఖకు అందించనుంది. దీనికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్కు, మంత్రిత్వశాఖకు ఓ అవగాహన ఒప్పందం జరుగనుందని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం పన్నుచెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా పంచుకోనున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయాన్ని ఆర్జించే వారికి వంటగ్యాస్‌పై సబ్సిడీ కోత విధించబోతున్నారు. ఆటోమేటిక్‌గా వారి ఈ సబ్సిడీలను విరమించబోతున్నారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ అందుబాటులో ఉండేందుకు వీలుగా ధనికులు తమ గ్యాస్ సబ్సిడీలను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా సబ్సిడీలను వదులుకున్న సంగతి తెలిసిందే. -
ఐటీ పరిధికి వస్తే... సబ్సిడీ కట్!
♦ రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ ♦ ఆధార్ అనుసంధానంగా బ్యాంక్ ఖాతాలపై ఆరా ♦ డిపాజిట్ల పరిమితి మించితే రేషన్ కార్డు, గ్యాస్ సబ్సిడీ కట్.. హైదరాబాద్: బ్యాంక్ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేసి..ఆదాయ పన్ను(ఐటీ) పరిధిలోకి వచ్చారో..? ఆహార భద్రత (రేషన్) కార్డు, గ్యాస్ సబ్సిడీపై వేటుపడటం ఖాయం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆహార భద్రత లబ్ధిదారులు, గ్యాస్ వినియోగదారులపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ఆధార్ అనుసంధానం ఆధారంగా బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్ వివరాలు ఆరా తీసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించిన ఆదాయ పన్నుశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీలపై ఆంక్షల నేపథ్యంలో నిరుపేదల ఖాతాల్లో సైతం భారీగా డిపాజిట్లు వచ్చి చేరాయి. కేవలం జన్‌ధన్ కు సంబంధించిన సుమారు 17.49 లక్షల ఖాతాల్లోనే దాదాపు రూ.900 కోట్ల డిపాజిట్ ఉన్నట్లు సమాచారం. వీరంతా దాదాపు ఆహార భద్రత లబ్ధిదారులు, గ్యాస్ వినియోగదారులే. వాస్తవంగా కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల ఆదాయం మించితే ఆహార భద్రత కార్డుకు, రూ.10 లక్షలు మించితే గ్యాస్ కనెక్షన్‌పై సబ్సిడీకి అనర్హులవుతారు. ఇప్పటికే స్వంత ఇళ్లు, వాహనం, వ్యాపారం కలిగి ఉండి వివిధ పన్ను పరిధిలోకి వచ్చిన కుటుంబాలకు సంబంధించిన ఆహార భద్రత కార్డులపై పౌరసరఫరా శాఖ వేటు వేసింది. ఇక చమురు సంస్థలు ఆదాయ వర్గాలు సబ్సిడీ వదులుకోవాలని గత రెండేళ్లుగా గీవ్ ఇట్ అప్పై విసృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు రెండున్నర లక్షల కార్డులపై అనర్హత వేటుపడగా. దాదాపు 8 వేల కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లపై సబ్సిడీ వదులుకున్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో అనర్హులను గుర్తించి వేటు వేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఇదీలెక్క... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 11 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులు, సుమారు 29.18 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే ఆహార భద్రత కార్డుల ఆధార్ నంబర్లతో, గ్యాస్ కనెక్షన్లు ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. దీంతో కుటుంబ వార్షికాదాయం, ఆర్థిక పరిస్థితి దాచిపెట్టినప్పటికి ఆధార్ అనుసంధానం ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని డిపాజిట్లు వివరాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు. అసలైన నిరుపేదలకు సబ్బిడీ వర్తింపజేయలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా అనర్హులను గురించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదాయ పన్నుల శాఖ బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించి పరిమితికి మంచి ఉన్న డిపాజిట్ లపై నోటీసులు ఇచ్చేందుకు సిద్దపడుతుండటంతో నోటీసులు సైతం పరిగణలోకి తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సమయత్తమవుతోంది. -
మోదీకి లేఖ రాసిన 84ఏళ్ల వృద్ధురాలు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 84ఏళ్ల రిటైర్డ్ టీచర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రే స్వయంగా మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా వెల్లడించారు. తాను ఇచ్చిన 'గివ్ ఇట్ ఆప్' పిలుపుకు స్పందించిన ఆమె సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకుందని చెప్పారు. ఆమె లేఖలో సారాంశం ఇలా ఉంది. దేశంలోని పేద తల్లులకు మీరు మంచి చేస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వారికి విముక్తిని కల్పిస్తున్నారు. దేశంలోని పేద తల్లులకు పొగరాని పొయ్యిలను అందించడానికి తన వంతుగా 50వేల రూపాయల సాయం చేస్తున్నానని ఆమె తెలిపారు. కాగా లేఖపై స్పందించిన మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ఆమె గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఎంత డబ్బు సాయం చేశారనేది ముఖ్యం కాదని అన్నారు. పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న ఓ తల్లి దేశంలోని సోదరుల కోసం సాయం చేయడం గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. దేశంలోని గొప్ప తల్లుల దీవెనలు తనకు ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లేఖలో ఆమె తనను ప్రధానమంత్రి మోదీగా కాకుండా మోదీ భయ్యా అని సంభోదించారని ఉద్వేగంగా తెలిపారు. ఇటువంటి సంఘటనలు దేశ ప్రజలకు ఏదైనా చేయాలనే స్ఫూర్తిని తనలో రగుల్చుతుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా 'గివ్ ఇట్ అప్' పిలుపు మేరకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పీఎం తరఫున ఆమె ఇంటికి వెళ్లిన ప్రతినిధి ఒకరు మోదీ స్వయంగా రాసిన ఉత్తరాన్ని అందజేశారు. ఎల్పీజీ సబ్సిడీ కనెక్షన్ ను వదులుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రయోజనం తక్కువే!
ఎల్పీజీ సబ్సిడీపై కేంద్రం ప్రకటనను తప్పుబట్టిన కాగ్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ. 1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలుతో ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని, వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ. 35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ వల్ల జరిగిన మిగులుగా ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లే(15 శాతం) డీబీటీఎల్ వల్ల మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనంగా వచ్చిందేనని పేర్కొంది. ఇక సబ్సిడీ మొత్తం, 67.27 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని వదులుకోవడం వల్ల మిగిలిన మొత్తానికి సంబంధించి చమురు సంస్థలు, పెట్రోలియం శాఖల లెక్కలకు పొంతన లేదని పేర్కొంది. తప్పుడు విధానంలో ‘ఏఆర్‌సీఐ’ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ‘ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ(ఏఆర్‌సీఐ)’ని ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేకుండా ఇలాంటి సంస్థ ఏర్పాటు.. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధమని, ఇప్పటికైనా ఆ అనుమతి తీసుకోవాలని సూచించింది. -
నగదు బదిలీతో మిగులు తక్కువే!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ.1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలు ద్వారా ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లుగా ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని... వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ.35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ పథకం కారణంగా జరిగిన మిగులుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లు మాత్రమే డీబీటీఎల్ కారణంగా మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనం కారణంగా వచ్చిందేనని పేర్కొంది. -
ఆదాయ పన్ను శాఖ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై ఆదాయపు పన్ను విభాగం కొరడా ఝళిపించనుంది. పన్ను చెల్లించని వారిపట్ల కఠినంగా స్పందించిన ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పన్ను డిఫాల్టర్ల పాన్ కార్డ్ బ్లాక్ చేయడం, గ్యాస్ సబ్సిడీలను రద్దు చేయడంతో పాటు రుణాలు మంజూరుకాకుండా చేయడం లాంటి చర్యలను తీసుకోబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ చర్యలు మొదలు పెట్టడానికి పకడ్బందీ చర్యలకు దిగింది. ఎక్కువ మంది పన్నులను తప్పించుకోవడం, ఎగవేతకు పాల్పడుతుండటంతో వీటిని నిరోధించడానికి ఈ చర్యలను ఎన్నుకుంది. దీనికి సంబంధించి అన్ని పత్రాలను తయారుచేసింది. పీటీఐ నుంచి అనుమతిని కూడా పొందింది. ఈ నిర్ణయం మూలంగా ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగొట్టే వారి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డును బ్లాక్ చేస్తారు. డిఫాల్టర్లకు ఇకమీదట దేశంలో ఎక్కడా కూడా రుణాలు మంజూరు కావు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం కూడా రద్దు కానుంది. వారికి ఇన్నాళ్లుగా వచ్చే గ్యాస్ సబ్సిడీ సౌకర్యాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించడంతో, డిఫాల్టర్లకు ఈ సౌకర్యాన్ని కూడా తీసేస్తున్నట్టు పేర్కొంది. ఈ చర్యలు డిఫాల్టర్లకు ఆటంకంగా మారి, పన్ను చెల్లిస్తారని ఆదాయపు పన్ను విభాగం చెప్పింది. బ్లాక్ చేసిన పాన్ కార్డులను రిజిస్ట్రార్ ఆఫ్ ప్రాపర్టీస్ లకు పంపనుంది. దానివల్ల వాళ్ల ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు కూడా సాధ్యం కావని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. టాక్స్ ఆఫీసులన్నింటికీ డిఫాల్టర్ల సమాచారం వెళ్తుందని, దానివల్ల దేశమంతటా ఎక్కడ కూడా డిఫాల్టర్లు రుణాలు, సబ్సిడీలు పొందలేరని పన్ను అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సిబిల్) డేటాను ఆదాయపు పన్ను విభాగం సబ్ స్క్రైబ్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ సబ్ స్క్రిప్షన్ తో డిఫాల్టర్ల ఆర్థిక లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. పన్నులను రాబట్టుకోవడం, ఆస్తులను ఫ్రీజ్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. గతేడాది మొదట్లోనే డిఫాల్టర్ల సమాచారాన్ని "నేమ్ అండ్ షేమ్"గా పేర్కొంటూ ఎక్కువ పన్ను ఎగవేతదారులు వివరాలను జాతీయ పత్రికలలో, అధికారిక వెబ్ పోర్టల్ లో పొందుపర్చడం ప్రారంభించింది. -
నేనే శ్రామిక్ నంబర్1
ప్రధాని మోదీ వ్యాఖ్య ♦ 5 కోట్ల పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ల పథకం ప్రారంభం ♦ కార్మికుల సంక్షేమానికి పలు పథకాలు తెచ్చాం ♦ ఎందరో ప్రధానులను అందించిన యూపీలో పేదరికం అలాగే ఉంది ♦ వారణాసిలో ఈ-బోట్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ బాలియా (యూపీ): ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను శ్రామిక్ (కార్మికుడు) నంబర్ 1 గా అభివర్ణించుకున్నారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చే ‘ఉజ్వల యోజన’ను ఆయన ఆదివారమిక్కడ ప్రారంభించి ప్రసంగించారు. కార్మికుల శ్రేయస్సుకోసం కేంద్రం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు పేదలకు చేసింది శూన్యమని మోదీ విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో 5 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తుందని తెలిపారు. మొదటి ఏడాది కోటిన్నర మందికి ఆ తర్వాత మూడేళ్లలో మిగిలిన పేదలకు ఈ కనెక్షన్లు అందజేస్తామన్నారు. ‘భారతదేశానికి ఉత్తరప్రదేశ్ చాలామంది ప్రధానులను ఇచ్చింది. కానీ ఇక్కడి పేదరికం మాత్రం ఇలాగే ఉంది. ఎన్నో పథకాలను తెచ్చారు. లెక్కలేనన్ని హామీలిచ్చారు. కానీ అవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. నిజంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించినవి కాదు’ అని మోదీ అన్నారు. పేదలకు సరైన విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు, ఇళ్లు, తాగునీరు, వంటి అవకాశాలిచ్చి సాధికారత కల్పించినపుడే పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే దీన్ని సాధిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసమే ఈ పథకాన్ని ప్రారంభించారంటూ వస్తున్న విమర్శలపై ప్రధాని మండిపడ్డారు. ‘రాజకీయ పండితులు ఎన్నికల ప్రచారం ప్రారంభమైదంటున్నారు. కానీ వీరికి తెలియనిదేమంటే దేశంలో అతి తక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న (ఇక్కడ ప్రతి వంద ఇళ్లలో సగటున ఎనిమిదిళ్లకే కనెక్షన్ ఉంది) జిల్లా అయినందునే బాలియాలో దీన్నిప్రారంభిస్తున్నా’ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా పేదలను దృష్టిలో ఉంచుకునేనన్న విషయాన్ని మరవొద్దని తెలిపారు. వెయ్యి రూపాయల కనీస పెన్షన్, కార్మికులకు గుర్తింపు నంబరు(ఎల్‌ఐఎన్) ఇచ్చిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనన్నారు. వారణాసిలో బిజీ బిజీ: అనంతరం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 11 వేలమంది లబ్ధిదారులకు ఈ-రిక్షా లను ప్రధాని పంపిణీ చేశారు. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కళాకారులు, విద్యావేత్తలు, న్యాయమూర్తులు, స్వయంసహాయక బృందాలతో ప్రధాని సమావేశమయ్యారు. ఇటీవల 126 గంటలపాటు నిర్విరామంగా కథక్ నృత్యం చేసి ప్రపంచరికార్డు నెలకొల్పిన కళాకారిణి సోనీ చౌరాషియాను ప్రధాని కలిసి అభినందించారు. అనంతరం అస్సీఘాట్‌లో 11 సోలార్ విద్యుత్‌తో నడిచే బోట్లను స్థానిక నిషాద్ (గంగానదిలో బోట్లు నడిపేవారు) లకు అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ-గాంధీ కుటుంబంపై మోదీ నిప్పులు చెరిగారు. భారతదేశం సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటుచేసుకునేందుకు ఇటీవలే ప్రవేశపెట్టిన ఉపగ్రహ వ్యవస్థకు ‘నావిక్’ అని పేరుపెట్టామని.. గాంధీ కుటుంబంలో వారి పేర్లు పెట్టలేదని ఎద్దేవా చేశారు. చెప్పిందే చేస్తున్నాం ఇప్పటివరకు విద్యుత్ స్తంభం కూడా చేరని 18వేల గ్రామాలకు వెయ్యిరోజుల్లో విద్యుత్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని.. హామీ ఇచ్చిన 250 రోజుల్లోనే 1,326 గ్రామాలకు విద్యుత్ వెలుగులిచ్చామని మోదీ వెల్లడించారు. ప్రజలు కూడా తమ కార్యక్రమాలకు సహకరిస్తున్నారని కోటి పదిలక్షల మంది ఒక్క పిలుపుతోనే ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్నారని గుర్తుచేశారు. స్వేదం చిందించటం ద్వారా ప్రపంచాన్ని ఐక్యం చేయటం ఈతరం కార్మికుల నినాదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. -
5 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు
♦ మే 1న కొత్త పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని ♦ ‘గివిట్ అప్’ డబ్బు ఈ పథకానికి వినియోగం న్యూఢిల్లీ: దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా 5 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెన్షన్లు ఇవ్వాలని కేంద్ర ం నిర్ణయించింది. దీనికి సంబంధించి రూ. 8 వేల కోట్లతో కొత్త పథకం ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’కు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 1న ప్రధాని మోదీ దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రారంభించనున్నారు. మే 15న గుజరాత్‌లోని దహోడ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘గివిట్ అప్’ ప్రచారంతో స్వచ్ఛందంగా సబ్సిడీని త్యజించిన వినియోగదారుల ద్వారా వస్తున్న డబ్బును ఈ పథకానికి వినియోగిస్తారు. ఇప్పటి వరకు 1.13 కోట్ల మంది వినియోగదారులు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నారని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సబ్సిడీని వదులుకున్న రాష్ట్రాల జాబితాలో 14.44 లక్షలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్నారు. గివిట్ అప్‌తో ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు సబ్సిడీ ఆదా అయిందని తెలిపారు. గడిచిన ఏడాదిలో పేదలకు 60 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చామన్నారు. కొత్త పథకం ప్రారంభమైన తర్వాత తొలి ఏడాదిలో 1.5 కోట్ల కనెక్షన్లు ఇస్తామన్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ. 1600 లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయిస్తామన్నారు. -
ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్న వారు కోటి
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సబ్సిడీ వదులుకున్న వినియోగదారుల సంఖ్య కోటి దాటిందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. వంట చెరకుపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం కొత్త గ్యాస్ కనెక్షన్ ఇచ్చే వెసులబాటు కలుగుతుంది. ప్రస్తుతం మొత్తం 15.34 కోట్ల కనెక్షన్లకు సబ్సిడీ అందిస్తున్నారు. స్తోమత కలిగిన వారు సబ్సిడీని స్వచ్ఛందంగా విరమించుకోవాలని ప్రధాని మోదీ పోయిన ఏడాది మార్చి 27న పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. -
ఎరువుకు నగదు బదిలీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని తెలిపారు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం ఏటా రూ.73 వేల కోట్ల దాకా వెచ్చిస్తోంది. అయితే ఈ సబ్సిడీని రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు అందిస్తోంది. ఆ కంపెనీలు సబ్సిడీని మినహాయించి రైతులకు ఎరువులు అందిస్తున్నాయి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, సబ్సిడీ పక్కదారి పడుతోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘ఇప్పటికే గ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) అనుసరిస్తున్నాం. ఇది విజయవంతమైన నేపథ్యంలో ఎరువులకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నాం’ అని జైట్లీ తెలిపారు. ఎరువులకు డీబీటీ వర్తింజేసేందుకు వీలుగా కేంద్రంలోని ఎరువుల విభాగం రైతులను గుర్తించే కార్యాచరణ రూపొందిస్తోంది. నగదు బదిలీని ఎరువుల పరిశ్రమలు స్వాగతించాయి. -
తక్కువ ఆదాయ వర్గాలపైనా గురి!
వంటగ్యాస్ సబ్సిడీ రద్దుకు ఇదే సరైన సమయమంటూ ఐసీఆర్ఏ నివేదిక జనవరి నుంచి 20 లక్షల మందిపై భారం ముంబై: వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ రద్దు నిర్ణయంతో ఏడాదికి ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఆదా కానుంది. జనవరి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది రాయితీ కోల్పోనున్నారు. రాయితీ రద్దుతో అధిక ఆదాయ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదని ఐసీఆర్ఏ(ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) తెలిపింది. అధికాదాయ వర్గాలకు సబ్సిడీ నిలిపివేతకు ఇదే సరైన సమయమని, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తగ్గుతూ వస్తుండడమే ఇందుకు కారణమని ఐసీఆర్ఏ ఒక నివేదికలో వెల్లడించింది. గత 3 నెలలుగా గ్యాస్‌పై దాదాపు రూ.150 నుంచి రూ.190 సబ్సిడీ ఇస్తున్నారు. అధికంగా వంట గ్యాస్ వినియోగిస్తున్న తక్కువ ఆదాయ వర్గాలకు కూడా సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వానికి ఇదే సరైన సమయమని ఐసీఆర్ఏ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల ప్రభుత్వం భారీగా ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ వర్గాలే ఎల్పీజీని ఎక్కువగా వినియోగిస్తున్నారని, రాయితీ లేని గ్యాస్ కొనగలిగే స్థితిలో వారు ఉన్నారని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఒక కుటుంబం 45 రోజులకు ఒక సిలెండర్ వినియోగిస్తున్నారని అంచనావేసింది. తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీ ఎత్తివేస్తే కుటుంబంపై నెలకు అదనంగా రూ.100 నుంచి రూ.125 భారం మాత్రమే పడుతుంది. ప్రస్తుతమున్న క్రూడాయిల్, ఎల్పీజీ ధరల ఆధారంగా ఈ లెక్కలు వేసింది. -
వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్‌పై సబ్సిడీ కట్
కేంద్రం నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఎల్పీజీ వినియోగదారులపై కేంద్రం మరో బాంబు పేల్చనుంది. ఈ సారి వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని సబ్సిడీ ఎత్తివేసేందుకు ప్రణాళిలు సిద్ధం చేసింది. వార్షికాదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు వంట గ్యాస్ సబ్సిడీపై కోత పెట్టనుంది. రాయితీ భారాన్ని మరింత తగ్గించుకునేందుకుకేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి నుంచే అమల్లోకి వచ్చే ఈ నిబంధన ప్రకారం.... వినియోగదారులైన భార్యా, భర్తల్లో ఎవరో ఒకరు పదిలక్షల కంటే ఆదాయం ఉండి పన్ను చెల్లిస్తుంటే వంట గ్యాస్ రాయితీని కోల్పోతారు. ప్రారంభంలో వినియోగదారుడి ప్రమాణ పత్రం ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు. 2014-15లో కేంద్రం ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.40,551 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ ఏడాది ఆయిల్ ధరలు తగ్గడంతో ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో రూ.8,814 కోట్లు మాత్రమే కేంద్రం భరించింది. ఈ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా సబ్సిడీలకు కోతపెడుతోంది. ప్రస్తుతం వినియోగదారులందరికీ ఏడాదికి 12 సిలిండర్లను అందిస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ రూ.608 ఉండగా సబ్సిడీపై రూ.419.26కు అందిస్తున్నారు. ధనవంతులు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు రాయితీని వదులుకోవాలంటూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు మంచి స్పందనే వచ్చింది. దేశంలోని 15 కోట్ల మంది వినియోగదారుల్లో 57.5 లక్షల మంది రాయితీని రద్దు చేసుకున్నారని పెట్రోలియం శాఖ తెలిపింది. గత యూపీఏ హయాం నుంచి ఎల్పీజీ మంటలు కొనసాగుతున్నాయి. సంవత్సరానికి ఆరు సిలెండర్లే అంటూ 2012లో యూపీఏ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దానిపై వ్యతిరేకత రావడంతో 2013 జనవరిలో తొమ్మిదికి పెంచింది. జనవరి 2014న మళ్లీ సమీక్షించి ఏప్రిల్ నుంచి 12 సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. -
సంపన్నులకు గ్యాస్ సబ్సిడీలో కోత
-
'0' నొక్కితే గ్యాస్ రాయితీ వదులుకున్నట్లే
ఇలా సరి చేసుకోవచ్చు గ్యాస్ బుకింగ్ చేసే సమయంలో పొరబాటున 0 నొక్కి రాయితీ కోల్పోతే సంబంధిత డీలర్‌ను సంప్రదించాలి. డీలర్ వద్దకు వెళ్లి ఫారం పూర్తి చేసి సమర్పిస్తే సరిపోతుంది. రాయితీ వదులుకోవాలనుకున్నా ఫారం-5 ఇవ్వాలి. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నకలు పత్రాలు సమర్పించాలి. సాక్షి నెట్వర్క్ : సెల్‌ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ పద్ధతిలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా. కాస్త ఆలోచించండి. ఏమాత్రం అజాగ్రత్తగా నంబరు నొక్కినా తిప్పలు తప్పవు. 0 నొక్కితే గివ్ ఇట్ అప్ కింద మీ రాయితీ అర్హత వదులుకున్నట్టే. ఆ తర్వాత తిరిగి రాయితీ అర్హత పొందాలంటే నానా అవస్థలు పడాలి. దరఖాస్తు ఫారం పూర్తి చేసి డీలర్‌కు ఇవ్వాలి. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాలి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొద్దిపాటి అప్రమత్తంగా ఉంటే చాలు. గ్యాస్ బుక్ చేయాలంటే .. ప్రభుత్వం నేరుగా సెల్‌ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ పద్ధతిలో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇండేన్, భారత్, హెచ్‌పీ సంస్థల బుకింగ్ నంబరుకు ఫోన్ చేయగా.. డీలర్ ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్‌ను కంప్యూటర్ అడుగుతుంది. కొన్నిసార్లు వినియోగదారుడి గ్యాస్ నంబరు కోరుతుంది. ఈమధ్య బుకింగ్ నంబరు డయల్ చేయగానే, వినియోగదారుని నంబరు చెబుతుంది. ఈ నంబరు చెప్పడం పూర్తికాగానే, సిలిండర్ బుక్ చేయాలంటే 1 నొక్కండని, గ్యాస్ రాయితీ వదులు కోవాలని భావిస్తే 0 నొక్కండని, ఆధార్ నమోదు చేయకపోతే 2 నొక్కండని చెబుతుంది. ఈ విషయం తెలియక రెండోసారి చెప్పే 0 అనే అంకెను నొక్కుతున్నారు. దీంతో గ్యాస్ సబ్సిడీ స్వచ్ఛందంగా వదులుకున్నట్టు అవుతోంది. గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం గ్యాస్ సబ్సిడీకి సంబంధించి పొరబాటుగా 0 నొక్కిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. వారిని పూర్తి ధరతో గ్యాస్ తీసుకోవాలని డీలర్ల ఒత్తిడి చేసేవారు. తమ చేతిలో ఏమీ లేదని తప్పించుకునేవారు. ఏప్రిల్ నుంచి రాయితీ కింద మార్పు చేసుకోవచ్చని సూచించేవారు. కాగా 0 నొక్కి పొరబాటు చేసే వారి సంఖ్య పెరిగిపోతుండడంతో.. ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులు చేసే తప్పును సరిదిద్దే అవకాశం ఇటీవల డీలర్లకు అప్పగించారు. ఎవరిని సంప్రదించాలి? డీలర్లకు ఈ సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారు. డీలర్ల వద్ద కూడా ఇది పరిష్కారం కాకపోతే, సంబంధిత చమురు కంపెనీల అధికారులను సంప్రదించాలి. గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇండేన్ : 98488 24365, భారత్ : 94401 56789, హెచ్‌పీ : 96660 23456. -
గ్యాస్ నగదు బదిలీతో 14వేల కోట్ల మిగులు
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ప్రత్యక్ష నగదు సబ్సిడీ ద్వారా రూ. 14,672 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015 ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో రిజిస్టర్ అయిన వంటగ్యాస్ వినియోగదారులు 18.19 కోట్లు ఉన్నారని.. అందులో 14.85 కోట్ల మంది నిజమైన వినియోగదారులని.. 3.34కోట్ల మంది బోగస్ వినియోగదారులన్నారని ఆ ప్రకటనలో తెలిపింది. -
నేను వదిలేశా.. మరి మీరో!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని తన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీని సోమవారం స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు 'గివ్ ఇట్ అప్' దరఖాస్తుపై సంతకాలు చేసిన అమల, ఆ పత్రాలను ఆయిల్ కంపెనీ ప్రతినిధికి అందజేశారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు మరో ఐదుగురు కూడా 'గివ్ ఇట్ అప్' చేసినట్లు హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్ ఆర్.ఉమాపతి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే ఆమె సబ్సిడీని వదులకున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్సిడీని వదులుకోగా, అందులో తెలంగాణ హెచ్‌పీసీఎల్ వినియోగదారులు 13,420 మంది ఉన్నారని తెలిపారు. -
‘గివ్ ఇట్ అప్’కు కానరాని స్పందన!
సినీతారలతో ప్రచారం చేయించేందుకు ఆయిల్ కంపెనీల కసరత్తు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ రాయితీ వదులుకున్నవారి సంఖ్య 19 వేలే హైదరాబాద్: సంపన్న వర్గాలు వంటగ్యాస్ రాయితీ వదులుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిపై స్పందన పెద్దగా కానరావడం లేదు. కేంద్రం ఆదేశాలతో ఆయిల్ కంపెనీలు ‘గివ్ ఇట్ అప్’ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ దుకాణాలు, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా సబ్సిడీ వదులుకున్న వారి సంఖ్య ఆశాజనకంగా లేదు. దీంతో బుధవారం నుంచి ఎంపిక చేసిన ప్రదేశాల్లో సినీతారలు, వాలంటీర్లతో ప్రచారం చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. చిరంజీవి, రామ్‌చరణ్ వంటి హీరోలను ప్రచారానికి రావాల్సిందిగా కోరాలని నిర్ణయించినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సబ్సిడీలు వదులుకునేందుకు ముందుకొచ్చే వారికి ఆకర్షణీయ బహుమతులు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు వివరించారు. ‘గివ్ ఇట్ అప్’ ప్రచారానికి ముందు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 కలిపి మొత్తం 16,964 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వారి సంఖ్య మరో 2 వేలు మాత్రమే పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలో 11వేలు, ఏపీలో 8వేల మంది వరకు మాత్రమే సబ్సిడీ వదులకున్నారు. -
10 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు
చెన్నై: గ్యాస్ సబ్సిడీ రద్దు చేసుకోవాలంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి అన్యూహ్య స్పందన లభిస్తుంది. దేశ్యవాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్సిడీని రద్దు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2.09 లక్షల మంది వినియోగదారులు ఈ సబ్సిడీని రద్దు చేసుకుని.. ఆ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని మహారాష్ట్ర కైవసం చేసుకుంది. కోటి మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్బిడీని రద్దు చేసుకునే లక్ష్యంగా గ్యాస్ కంపెనీలు ఇప్పటికే మీడియా సాధనాల ద్వారా ప్రచార ఉద్ధృతిని పెంచాయి. దేశంలోని గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటంబానికి హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ గ్యాస్, ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీలు రాయితీపై ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున... వినియోగదారుడికి అందజేస్తుంది. అయితే ఒక్కో సిలిండర్‌కు రూ. 207 అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దాంతో ఏటా రూ. 40 వేల కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీ రాయితీ వదులుకుని... మరో పేద కుటుంబానికి ఆ అవకాశం కల్పించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
వంటగ్యాస్ రాయితీని వదులుకోవడం దేశభక్తి కాదా?
వంటగ్యాస్ రాయితీని వదులుకుని నిరుపేదలకు ప్రయోజనం కలిగించడంలో మధ్యతరగతి ప్రజలు చొరవ చూపటం లేదు. దీనిపై ప్రధానమంత్రి కేంపెయిన్ మొదలుపెట్టాక వినియోగదారుల్లో 0.35 శాతం మంది మాత్రమే అనుకూలంగా స్పందించారు. దేశంలోని 15 కోట్ల కుటుంబాల్లో 6 లక్షల కుటుంబాలు మాత్రమే వంటగ్యాస్‌ను మార్కెట్ ధరతో కొనేందుకు స్వచ్ఛందంగా సమ్మతించాయి. కొన్ని నెలల క్రితం, బెంగళూరులో ఉన్న మా ఇంటికి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయడానికి ప్రయత్నించాను. ప్రస్తుతం ఇండియాలో ఈ పని చేయడం చాలా సులువని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు ఒక నంబర్‌కు కాల్ చేస్తారు. వెంటనే ఒక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ మీ అభ్యర్థనను నమోదు చేసుకుంటుంది. తమ సేవను ఉపయోగించుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చేస్తుంది. ఇదంతా కేవలం 15 సెకనుల కంటే తక్కువ సమయంలోనే ముగిసి పోతుంది. మరికొద్ది రోజుల్లో సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. అయితే ఈసారి సిలిండర్ అంత సులువుగా మా ఇంటికి రాలేదు. నాకు ఆశ్చర్యమేసింది. భారత్ గ్యాస్ కార్యాలయానికి ఫోన్ చేశాను. నేను సబ్సిడీ గ్యాస్ పొందాలంటే కొన్ని ఆర్థిక దస్తావేజులు సమర్పించాలని వారు చెప్పారు. దాంతో సబ్సిడీకి నేను అర్హుడిని కానని, గ్యాస్ పూర్తి ధరతో పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుందని అడిగాను. సబ్సిడీ గ్యాస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయడం కోసం తమ ఆఫీసుకు రావాలని వారు చెప్పారు. అక్కడికి వెళ్లాను కూడా. (అలా చేయడం ఇదే తొలిసారి). భారత్ గ్యాస్ కార్యాలయం రద్దీగా ఉంది. ఫారం 5 అనే పేరున్న డీ రిజి స్ట్రేషన్ పత్రం గురించే అక్కడున్న కొంతమంది సిబ్బందికి తెలీదు. పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ఆ పత్రాలు ఒకచోట కుప్పలాగా పడి ఉన్నాయి. ఫారం 5ని పూరించడం, మరోసారి గ్యాస్ కంపెనీ కార్యాలయానికి రావడం జరిగాక, ఎట్టకేలకు నా గ్యాస్ సబ్సిడీ సౌకర్యాన్ని డీ రిజిస్టర్ చేయించుకోగలిగాను. పూర్తి ధరతో సిలిండర్ పొందగలిగాను. కొద్ది రోజుల తర్వాత, ఒక వ్యక్తి నుంచి నేను ఫోన్ కాల్ అందుకున్నాను. ఆయన చాలా చక్కగా మాట్లాడారు. అతనెవరో నాకు తెలీదు కానీ నన్ను పేరు పెట్టి మరీ పలకరించారు. తను ఇలా గ్యాస్ రాయితీని డీ రిజిస్టర్ (ఉపసంహరించుకోవడం) చేసుకున్న వ్యక్తులకు కాల్ చేసే అధికారి అట. వినియోగదారులు తాము స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకుంటున్నట్లుగా బహి రంగంగా ఒక పత్రంపై సంతకం చేయడం కోసం (అదీ మంత్రి సమక్షంలో) మరుసటి దినం అంటే ఆదివారం నాడు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఆ అధికారి చెప్పారు. నేను ఇదివరకే అలా సంతకం చేశానని చెప్పాను. ఆ విషయం తనకు తెలుసనీ, అయితే మరోసారి బహిరంగంగా అలా చేయడానికి మీరు తప్పనిసరిగా రావాల్సి ఉందని ఆ అధికారి సౌమ్యంగానే అభ్యర్థించారు. అలా రాలేనని ఆయనకు చెప్పేశాను. నేనీ విషయాన్ని ఇప్పుడెందుకు రాస్తున్నానంటే, స్వచ్ఛందంగా వంట గ్యాస్ సబ్సిడీని వదులుకోవాల్సిందిగా ప్రధానమంత్రి కేంపెయిన్ మొదలుపెట్టి మూడు నెలలు గడిచిన తర్వాత కూడా వినియోగదారుల్లో 0.35 శాతం మంది మాత్రమే వంట గ్యాస్‌పై రాయితీని వదులుకున్నారు. దేశంలోని 15 కోట్ల గృహాల్లో కేవలం 6 లక్షల గృహాలు మాత్రమే మార్కెట్ ధరకు వంట గ్యాస్‌ను కొనేందుకు స్వచ్ఛం దంగా సమ్మతించాయి. మధ్యతరగతి భారతీయులు వంట గ్యాస్ రాయితీని వదులుకోవాలనీ, అప్పుడే రాయితీ ధరతో పేదలకు అందించవచ్చనీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సంవత్సరం జనవరి నుంచి పదే పదే అభ్యర్థిస్తూ వచ్చారు. రాయితీ వల్ల ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ. 207లు నష్టపోతోంది. వంట గ్యాస్ రాయితీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి మొత్తం మీద రూ.40,000 కోట్లు నష్టం సంభవిస్తోంది. కాబట్టి ప్రభుత్వం నష్టపోకుండా తాము కాస్త దోహద పడటం అనేది మధ్యతరగతికి సులువైన పనే. కానీ ఇంతవరకు వీరు ఈ విషయంలో పెద్దగా చొరవ చూపటం లేదు. చివరకు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇంతవరకు తమ వంట గ్యాస్ రాయితీని వదులుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. చిన్న కారణం ఏమిటంటే, వినియోగదారులు తమ రాయితీ సౌకర్యాన్ని డీరిజిస్టర్ చేసుకోవడాన్ని ప్రభుత్వం కష్టసాధ్యంగా చేయడం. నా అనుభవం ద్వారా నాకు ఇదే విషయం బోధపడింది. వంట గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయడం చాలా సులువు. ఎందుకంటే నమోదైన మొబైల్ నంబర్ ద్వారా సబ్స్క్రయిబర్లను సిస్టమ్ గుర్తించగలదు. (ఇదెంత సులువంటే నా సబ్స్క్రయిబర్ సంఖ్య తెలీకు న్నప్పటికీ ఆటోమేటెడ్ సిస్టమ్ (స్వయం చాలక వ్యవస్థ) ద్వారా నేను గ్యాస్‌ను సులువుగా బుక్ చేసుకోగలను). రాయితీ వంట గ్యాస్ సౌకర్యాన్ని కూడా ఇంతే సులువుగా డీరిజిస్టర్ చేసుకోగలగాలి. కాని అలా సాధ్యం కావటం లేదు. ఇక్కడ కూడా ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అమలుచేయడానికి బదులుగా దస్తావేజులు, క్యూలు అవసరం అవుతున్నాయి.. ఇలా రాయితీ గ్యాస్ సౌకర్యాన్ని డీరిజిస్టర్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది. www.MyLPG.in. నేను అందులోకి వెళ్లి ప్రయ త్నించాను. కాని ఆ వెబ్సైట్ డిజైన్‌ను ఎంత ఘోరంగా రూపొందించారంటే, ఆన్లైన్లో డీరిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి ఐచ్ఛికాన్ని నేను అక్కడ కనుగొన లేకపోయాను. ఆ సమయంలో నేను నా గ్యాస్ సిలిండర్‌ను పొందటంలో సమ స్యను ఎదుర్కోనట్లయితే, గ్యాస్ కంపెనీ వద్దకు బహుశా వెళ్లి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం గొప్ప అసౌకర్యంగా తయారై ఉంది. కాబట్టి వంట గ్యాస్ రాయితీ ఉపసంహరణ విషయంలో ప్రధానమంత్రి పథకం విఫలమైందని కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నట్లయితే, ఆ వైఫల్యంలో కొంత శాతాన్ని ఆయన సైతం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇదివరకే చెప్పినట్లు ఇది ఒక చిన్న కారణం. తమ వంతు భారం మోసే విషయంలో భారతీయ పౌరులు ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజల అయిష్టత ప్రధాన కారణంగా కనబడుతోంది. ఇది మరీ సాధారణ ప్రకటనలా కనిపించవచ్చు కానీ ఈ వాదనకు తగిన ఆధారాలను చూపించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారతీయులలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఏదో ఒక రకంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వీరిలో కూడా ఎక్కువమంది ఉద్యోగులు. వీరి వేతనాల్లోంచి పన్నులను స్వయంచాలకంగా తీసివేసుకుంటారు. అందుకే మనది దొంగల జాతి అని నేను చాలా తరచుగా భావిస్తుంటాను. మనం మన ప్రభుత్వం నుంచి దొంగిలిస్తున్నాము. అదే సమయంలో మనం అత్యంత దేశభక్తిపరులమని మనకు మనమే జబ్బలు చరుచుకుంటుంటాము. ‘ఏ మేరే ప్యారే వతన్’ అంటూ దేశభక్తి గేయాన్ని లేదా మన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సందర్భంగా మనం కన్నీళ్లు కారుస్తుంటాము. కాని అవసరమైన సందర్భాల్లో మాత్రం మన దేశభక్తి స్థాయి ఇలా ఉంటోంది మరి. పేదల నుంచి డబ్బును మనం ఇలా దొంగిలిస్తుండటం, కాస్త సహకరిం చమంటూ ప్రభుత్వం మనల్ని ప్రాధేయపడుతుండటం వంటి సందర్భాలను చూస్తున్నప్పుడు మనం చాలా వెలితి మనుషులుగా కనబడతాం. అంతేకాకుండా మన దేశం పరువు కూడా తీసేస్తున్నాం. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్ -
ఇక అన్ని రాయితీలు బ్యాంకుల్లోనే
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సబ్సిడీ తరహాలోనే ఇకపై అన్ని రాయితీలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. చెన్నైలో సోమవారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయితీల దుర్వినియోగం అరికట్టి, లబ్ధిదారుకు పూర్తిస్థాయిలో మేలు జరిగేందుకే రాయితీలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. చమురు, వ్యవసాయ ప్రాధాన్యతలపై కేంద్రం పెద్ద ఎత్తున రాయితీలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2015-16 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలోగా బ్యాంకు ఖాతాల్లోకి అన్ని రాయితీల్ని చెల్లించే విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడే విధంగా రూపొందించిన సరుకు, సేవాపన్ను విధింపును రాష్ట్ర ప్రభుత్వాలన్నీ స్వాగతిస్తున్నాయని చెప్పారు. ఈ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఒక్కపైసా కూడా నష్టం జరగదని తెలిపారు. రైతుల భూముల ధరలు పెరగడం, నిరుద్యోగులకు ఉపాధి కలగడం వంటి మంచి జరగడం వల్ల భూసేకరణ బిల్లుపై ఆపోహలు వీడిపోయాయన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఆర్థికంగా చితికిపోగా, బీజేపీ అధికారంలోకి వచ్చాకే ప్రగతి పథం వైపు పరుగులు పెడుతోందన్నారు. విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడమే దేశ ప్రగతికి తార్కాణమని చెప్పారు. దేశ ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచేందుకే నీతి ఆయోగ్ ప్రవేశపెట్టామన్నారు. -
గడువు పెంపు
సాక్షి, చెన్నై : వంట గ్యాస్ సబ్సిడీ నిమిత్తం ‘డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ విధానానికి గాను దరఖాస్తులు చేసుకునేందుకు మరింత గడువు పెంచారు. దరఖాస్తులు చేసుకోని వినియోగదారులకు జూలైతర్వాత సబ్సిడీ రద్దవుతుంది. రాష్ట్రంలో గురువారం నుంచి ఈ సబ్సిడీ విధానం అమల్లోకి వచ్చింది. వంట గ్యాస్ వినియోగదారులకు ఇదివరకు డీలర్ల ద్వారా సబ్సిడీ రూపంలో సిలిండర్ల పంపిణీ జరిగేది. సబ్సిడీ భారం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించే పనిలో పడింది. దేశంలో గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు నేరుగా సబ్సిడీని బ్యాంక్ ద్వారా అందించేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను, ఆధార్ నంబర్లను సేకరించే పనిలోపడింది. ఒకే ఇంట్లో రెండు మూడు కనెక్షన్లు ఉన్నా, వాటిని రద్దు చేయడానికి ఈ విధానం దోహదకారిగా మారింది. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీఎల్) విధానం అమల్లోకి తెచ్చేందుకుగాను వినియోగదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పర్వం వేగవంతమైంది. అయితే, రాష్ర్టంలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని చెప్పవచ్చు. గతంలో ఉచిత సింగిల్ సిలిండర్ పథకం అమలు చేసిన దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ వినియోగం దరిచేరింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతాలు కల్గిన వారి సంఖ్య తక్కువే. అదే సమయంలో ఆధార్ కార్డు మంజూరు అంతంత మాత్రమే. గడువు పెంపు జనవరి ఒకటో తేదీలోపు డీబీటీఎల్ విధానంలో చేరిన వారు పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసుకోవాలి. సబ్సిడీ మొత్తం రెండు లేదా నాలుగు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఐవోసీ, హెచ్‌పీ, భారత్ తదితర పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు ప్రకటించాయి. ఆ మేరకు ఈ విధానం రాష్ట్రంలో గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, రాష్ట్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గురువారం నాటికి ఆ పథకంలోకి చేరిన వారి సంఖ్య గ్యాస్ వినియోగదారుల సంఖ్య కంటే తక్కువే. ఈ నేపథ్యంలో గడువును పెంచేందుకు సిద్ధయయ్యారు. మార్చి 31వ తేదీలోపు బ్యాంక్ ఖాతా నంబర్లు సంబంధిత డీలర్లకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక, ప్రతి ఆదివారమూ ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ విషయంగా ఐవోసీ అధికారి వెట్రి సెల్వన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీ విధానంలో అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ వారివారి బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ జమ చేయడం జరుగుతుందన్నారు. మరె ందరో వినియోగదారులు దరఖాస్తులు సమర్పించాల్సిన దృష్ట్యా, గడువును పెంచినట్టు తెలిపారు. మార్చి 31లోపు దరఖాస్తులు సమర్పించే వారికి త్వరితగతిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ చేస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దరఖాస్తులు చేసుకున్న పక్షంలో వారికి మూడు నెలల అనంతరం బ్యాంక్‌ల్లో సబ్సిడీ జమవుతుందన్నారు. జూన్ నెలఖారుకు ఈ ప్రక్రియను ముగియనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకోని గ్యాస్ వినియోగదారులు శాశ్వతంగా సబ్సిడీని కొల్పోయినట్టేనని స్పష్టం చేశారు. -
నగదు ‘బదిలీ'..భారమే!
నగదు బదిలీ పథకం.. ఆ పేరు వింటేనే జిల్లాలో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లూ సబ్సిడీ ధర చెల్లించి వంటగ్యాస్ రీఫిల్లింగ్ పొందిన వారు ఈ ప్రక్రియ అమలైతే అదనపుభారం మోయకతప్పదు. నగదు జమతో ప్రతి వినియోగదారుడిపై వ్యాట్ రూపేణా అదనంగా రూ.23 పడనుంది. ఇదిలాఉండగా, జిల్లాలో గతేడాది నగదు బదిలీ అమలైన సందర్భంలో బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమకాకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గుర్తుచేసుకుని మరింత ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నగదు బదిలీ పథకం వినియోగదారులకు భారంగా మారనుంది. ఈ పథకం అమలైతే గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్‌కు సబ్సిడీయేతర ధర రూ.972 చెల్లించి వినియోగదారుడు తీసుకోవాలి. అనంతరం సబ్సిడీ రూ.444 పోనూ వారి బ్యాంకుఖాతాలో ప్రభుత్వం రూ.504నగదు జమచేస్తుంది. ఇంకా వ్యాట్‌రూపంలో ప్రభుత్వం విధించే రూ.23ను వినియోగదారుడే చెల్లించాలి. అంటే సబ్సిడీ కంటే అదనంగా ఈ భారం పడనుంది. ఈ ధర స్థిరంగా కొనసాగుతుందని అనుకోవడానికీ వీల్లేదు. అంతర్జాతీయ మార్కెట్ డాలర్‌ను అనుసరించి ఓ మారు పెరుగుతూ.. మరోమారు తగ్గుతూ ఉం టుంది. దీనిని బట్టి వ్యాట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముందు నగదు చెల్లించి తీసుకునే రీఫిల్లింగ్ ధర కూడా పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. 4.38లక్షల మందిపై భారం జిల్లా వ్యాప్తంగా ఇండియన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 4.38లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నగదు బదిలీ అమలైతే జిల్లా వాసులపై ప్రతినెలా రూ.10.95లక్షల భారం పడనుంది. వీరిలో 90శాతం మంది వినియోగదారులు సామాన్యులే. పైగా వీరిలో బ్యాంక్ ఖాతాల్లేని వారు ఎంతోమంది ఉన్నారు. గతేడాది జిల్లాలో నగదు బదిలీ అమలైన సందర్భంలో చాలామందికి బ్యాంక్‌ఖాతాలో సబ్సిడీ జమకాక నానాపాట్లు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఇబ్బందులను మరువకముందే నగదు బదిలీ ప్రక్రియ వారిలో ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి అమలు నగదు బదిలీ జిల్లాలో జనవరి నుంచి అమలుకానుంది. మొ దటి విడతగా తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాల్లో అమలుచేసే ప్రభుత్వం రెండోవిడతగా జనవరిలో జిల్లాలో అమలుచేయనుంది. ఇందుకుగాను గ్యాస్ వినియోగదారులకు సం బంధించి ఆధార్, బ్యాంక్ ఖాతాల నెంబర్లను సేకరించే పని లో అధికారులు, గ్యాస్ డీలర్లు బిజీగా నిమగ్నమయ్యారు. -
ధనికులకు గ్యాస్ సబ్సిడీ కట్!
ఆ దిశగా కేంద్రం యోచన: జైట్లీ న్యూఢిల్లీ: దేశంలోని ధనికులకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచి స్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, హర్షించకపోయినా దేశ శ్రేయస్సు దృష్ట్యా అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉన్నత స్థాయి లో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా సులువుగా పరిష్కారమవుతుందన్నారు. బొగ్గు గనులు, డీజిల్, గ్యాస్ ధరలు, తదితర సమస్యలపై గత ప్రభుత్వాలు వీటిపై ఏళ్లు వృథా చేశాయని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.