luxury cars
-
లగ్జరీ కార్ల పండుగ
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్‌పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి. కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్స్‌ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి.. సాధారణంగా ఈ సీజన్లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు. కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్‌ఫాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్‌ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్‌లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
కారు.. మేకోవర్ జోరు
దేశంలో యువ తరంగం ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్న తమ కలను సాకారం చేసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. తమకు నచ్చినట్టుగా దాన్ని ముస్తాబు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కోరుకున్నట్లుగా కారును కస్టమైజ్ చేసుకోవడానికి సై అంటున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా ఎలా కావాలంటే అలా.. ఏది కావాలంటే అది నేరుగా ప్లాంట్లలోనే మార్పుచేర్పులు చేసి కస్టమర్ల చెంతకు చేరుస్తున్నాయి. తాజాగా ఆడి ఇండియా భువనేశ్వర్‌లో ఒక కారు కొనుగోలుదారు కోసం ‘ఆర్ఎస్ క్యూ8’లో 17 రకాల మార్పులు చేసి మరీ అందించడం విశేషం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పెయింట్ షేడ్. ‘జావా గ్రీన్‘గా పిలిచే ఈ పెయింట్ వర్క్ ఒక్కదానికే కస్టమర్ ఏకంగా రూ. 12.29 లక్షలు వెచి్చంచడం మేకోవర్ మేనియాకు నిదర్శనం. ఇక కోయంబత్తూరుకు చెందిన మరో యువ కార్ లవర్... ఆడి ఫ్లాగ్íÙప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ‘ని ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడు. దీనికి కార్బన్ ఫైబర్ రూఫ్, మ్యాట్రిక్స్ డిజైన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ (లైట్ బీమ్ ఫర్ఫెక్ట్గా పడేందుకు ఒక్కో హెడ్‌ల్యాంప్‌లో 10 లక్షల మైక్రో మిర్రర్లు ఉంటాయి), ఆల్–కాంటారా టెక్స్‌టైల్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి పలు రకాల హంగులను జోడించేందుకు పెట్టిన ఖర్చు రూ. 36 లక్షలు. ముంబైలో మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ / ఏఎంజీ జీ63 మోడళ్లకు చెందిన మూడు కార్లను 30కి పైగా కస్టమైజేషన్లతో విక్రయించింది. ఈ మార్పుల కోసం కొనుగోలుదారులు జస్ట్ రూ.1.5 కోట్లు ధారపోశారట! యువ కస్టమర్ల హల్ చల్ అరుదైన పెయింట్ వర్క్ దగ్గర నుంచి ప్రత్యేకంగా చేతితో మలిచిన లెదర్ ఇంటీరియర్స్. నచ్చిన పరికరాలు, న్యూమరాలజీ, జ్యోతిష నమ్మకాలకు అనుగుణంగా స్పెషల్ రిజి్రస్టేషన్ నంబర్ ఇలా ప్రతిదీ సరికొత్త లగ్జరీయే. ‘జీ–వ్యాగన్స్‌లో 70%, మేబ్యాక్ మోడళ్లలో 74% కస్టమర్లు కోరుకున్న మార్పులతోనే అమ్ముడవుతున్నాయి. రంగులు, మెటీరియల్, ఫ్యాన్సీ నంబర్లు ఇలా తమ అభిరుచులకు అదనంగా చెల్లించేందుకు మా కొనుగోలుదారులు ఎప్పుడూ సిద్ధమే’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీ సంతోష్ అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ డిమాండ్‌కు తోడు ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ యువరక్తంతో పరవళ్లు తొక్కుతోంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ కస్టమర్ల సగటు వయస్సు 38 ఏళ్లే. ప్రపంచవ్యాప్తంగా మనోళ్లే ఈ కంపెనీకి యువ కొనుగోలుదారులు కావడం మరో విశేషం. ’కస్టమర్లు ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. తమ కార్లను వ్యక్తిత్వ చిహ్నంగా భావిస్తున్నారు’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ «థిల్లాన్ చెబుతున్నారు. ఆడి భారతీయ కస్టమర్లు తమ కార్లలో హంగుల కోసం రూ. 70 లక్షల వరకు వెచి్చస్తున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికొస్తే, మేబ్యాక్, ఏఎంజీ వంటి టాప్–ఎండ్ మోడళ్ల కస్టమర్లు కారు ధరలో 20% కస్టమైజేషన్‌కు వెచ్చి స్తున్నారు. బీఎండబ్ల్యూ కస్టమర్లు రూ. 50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ మోడల్స్‌లో చాలా కార్ల ప్రారంభ ధర రూ. 1.5 కోట్లు పైనే. కార్తీక్.. హైదరాబాద్‌లో యువ వ్యాపారవేత్త. కొత్తగా లగ్జరీ కారు కొన్నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చుపెడితే.. అందులో తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల హంగులను జోడించడం కోసం సదరు కార్ల కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు! కార్ల కస్టమైజేషన్ క్రేజ్‌కు ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే... -
Luxury Cars: లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీస్ క్రేజ్
నగరంలో నివసించే స్టార్లు.. తమ ఇమేజ్‌కు తగ్గట్టుగా షి‘కార్లు’ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లకు ధీటుగా రెమ్యునరేషన్స్‌లో పోటీపడుతున్న టాలీవుడ్ స్టార్స్ కార్ల వేటలోనూ ముందున్నారు. దీంతో రూ.కోట్ల విలువ చేసే కార్లకు నిలయంగా మన భాగ్య నగరాన్ని మార్చడంలో టాలీవుడ్ సెలబ్రిటీలదే పైచేయి. ఆ విషయం ప్రస్తుతం మన స్టార్ల దగ్గరున్న ఖరీదైన కార్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీని గురించిన మరిన్ని విశేషాలు...⇒బాలీవుడ్ స్టార్లకు ధీటుగా మోడళ్లు.. ⇒కాస్ట్లీ కార్లకు కేరాఫ్‌గా హైదరాబాద్.. ⇒అరడజన్కు తగ్గకుండా కలెక్షన్.. ⇒లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీస్ క్రేజ్ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. గత తరం సూపర్ స్టార్స్ లాగా టాలీవుడ్ యంగ్ స్టార్స్.. ఒకటీ అర కార్లతో సరిపుచ్చుకోవడం లేదు. టాప్ 5 హీరోలుగా ఉన్న వారంతా కనీసం అరడజను కార్లకు తగ్గకుండా కలెక్షన్‌ను మెయిన్టైన్ చేస్తూ, కార్లపై వారికి ఉన్న క్రేజ్‌ను చాటుకుంటున్నారు.అల్లు అర్జున్‌ని దాటేసిన రామ్‌చరణ్..ఇప్పటిదాకా టాలీవుడ్లో అత్యంత ఖరీదైన స్టార్ కార్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర ఉన్న రూ.6.95 కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ క్యులినన్ కాగా ఆ తర్వాత స్థానం రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గర ఉన్న రూ.6 కోట్ల విలువైన లంబొర్గని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టార్ ది కాగా ఇప్పుడు వీరిద్దరినీ తోసిరాజని రామ్ చరణ్ తాజాగా కొన్న రూ.7.5 కోట్ల ఖరీదైన బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా నెం1 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే రామ్ చరణ్‌కు రూ.2.8కోట్ల ఖరీదైన మెర్సిడస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600తో పాటు పలు కంపెనీల లగ్జరీ కార్లు ఉన్నాయి.స్టైలిష్ కలెక్షన్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర కూడా మంచి కలెక్షన్ ఉంది.. ఆయన దగ్గర రూ.2.5కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ వోగ్, రూ.1.6 కోట్లు ఖరీదైన వాల్వో ఎక్స్‌సీ90టీ8 లతో పాటు మరికొన్ని కార్లూ ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రూ.3.10 కోట్లు ఖరీదు చేసే లంబొర్గని యురస్ని తో పాటుగా పోర్ష్ 718 కేమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, రేంజ్ రోవర్, మెర్సిడస్ మేబ్యాచ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్.. తదితర కార్లతో అదిరిపోయే కలెక్షన్ ఉంది. రూ.4.37కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీని నాగ చైతన్య వినియోగిస్తున్నారు. ఆయన గత నెల్లోనే తన లగ్జరీ కార్ల కలెక్షన్‌కు రూ.3.51 కోట్లు ఖరీదైన పోర్ష్ 911 జీటీ3 ఆర్ఎస్ కార్‌ను కూడా జత చేశారు. ఇక ప్రిన్స్ మహేష్‌బాబు రూ.2.6కోట్ల విలువైన రేంజ్‌రోవర్ వోగ్ వాడుతుండగా. ఆయన సమకాలీకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రూ.4.5 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ 3.0 ఎస్వి ఆటోబయోగ్రఫీ ఉంది. గత తరం టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి రూ.2 కోట్లపైన విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉండగా, కింగ్ నాగార్జున రూ.2.5 కోట్లు విలువ చేసే మెర్సిడస్ బెంజ్ జీ3 ఏఎమ్‌జీ వాడుతున్నారు. స్టార్స్‌ని మించిన కార్స్.. టాలీవుడ్ సెలబ్రిటీలను తలదన్నుతూ నగరానికి చెందిన వ్యాపారవేత్త నజీర్ ఖాన్ రూ.12 కోట్లు విలువ చేసే మెక్ల్యారెన్ 765ఎల్టీ స్పైడర్‌ను గత ఏడాది కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. అప్పటి దాకా ఇదే భారతదేశంలో ఖరీదైన కారు కావడం విశేషం. -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్‌లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
తెలంగాణ మంత్రులకు లగ్జరీ కార్లు
-
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్వీర్ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. చెర్రీ ఇవాళ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుమలకు వెళ్లిన చెర్రీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బర్త్ డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ ఆస్తులపై నెట్టింట చర్చ మొదలైంది. రామ్ చరణ్ ఆస్తుల గురించి సినీ ప్రియులతో పాటు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఎంత? నెలకు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. ఓ నివేదిక ప్రకారం మెగా హీరో రామ్ చరణ్‌కు దాదాపు రూ.1370 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్కు ముందు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల పారితోషికం తీసుకునే చెర్రీ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటనకు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు. ప్రస్తుతం నెలకు కేవలం ప్రకటనల ద్వారానే రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. లగ్జరీ హోమ్ రామ్ చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఆధునాతన సౌకర్యాలున్నాయి. ఆ ఇంటి విలువు దాదాపు రూ.38 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంతే కాకుండా రామ్ చరణ్‌కు ముంబయిలోనూ ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్లు మన గ్లోబల్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.4 కోట్ల విలువైన మెర్సిడెజ్‌తో పాటు ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఈ బ్యానర్లో ఖైదీ నెం.150 మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు రామ్ చరణ్‌కు ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్ సంస్థను నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఆస్తులు, వాణిజ్య ప్రకటనలు, బిజినెస్ కలిపితే రామ్ చరణ్ ఆస్తులు రూ.1370 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐటీ దాడులు.. ఆ కార్ల విలువే 60 కోట్లు!
ఢిల్లీ: ఇన్కమ్ టాక్స్ (ఐటీ) దాడులనగానే.. కరెన్సీ లేదంటే నగలు లేకుంటే కీలక పత్రాలు బయటపడుతుండడం చూస్తుంటాం. కానీ, ఖరీదైన కార్లు.. అందునా కోట్లు విలువ చేసే పోష్ కార్లు బయటపడడం ఎప్పుడైనా చూశామా?.. తాజాగా ఓ టొబాకో కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో ఇదే వెలుగుచూసింది. అధికారుల దాడుల్లో అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడ్డాయి. తమ దాడుల్లో కనిపించిన ఖరీదైన కార్లను చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. శుక్రవారం ఐటీ అధికారుల బృందం.. కాన్పూర్‌కు చెందిన ఓ టొబాకో కంపెనీపై దాడిలు చేసింది. ఢిల్లీలోని ఆ కంపెనీ యజమాని నివాసంలో కూడా సోదాలు జరిపిపారు. ఈ సోదాల్లో వారికి ఆశ్చర్యపరిచే రీతిలో అత్యంత ఖరీదైన.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెక్లారెన్, లంబోర్ఘిని, ఫెరారీ కార్లు పట్టుపడ్డాయి. వాటివిలువ సుమారు రూ.60 కోట్లు ఉండనుందని ఐటీ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను బృందం అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు కంపెనీ యజమాని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలతో ఉన్న పలు బ్యాగులతో సుమారు రూ.4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాన్పూర్‌కు చెందిన బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం నుంచే సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న ఐదు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఏకకాలంలో 15-20 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు పరిశ్రమలకు పొగాకు సంబంధిత సరుకు ఎగుమతి చేసే ఈ కంపెనీ.. భారీ ఎత్తున టాక్స్‌లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ యజమాని అయిన పారిశ్రామికవేత్త కేకే. మిశ్రా (అలియాస్ మున్నా మిశ్రా) సంబంధించిన ప్రాపర్టీ వివరాలు.. పలువురితో చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. తమకు ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ మాత్రమే వస్తుందని చెబుతోంది. కానీ, ఆ కంపెనీ అసలు టర్నోవర్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని ఐటీ భావిస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో లభ్యమైన పలు ఖరీదైన కార్లతో పోజులు ఇచ్చిన కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శివం మిశ్రా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాలోని ‘కహో నా ప్యార్ హై’ అనే పాటలోని ఉన్న వేషధారణతో ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు(శుక్రవారం) కూడా ఐటీ దాడుల కొనసాగుతున్నాయి. -
జియో మాల్‌పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్‌డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్‌తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్
Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్‌డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార గిఫ్ట్‌గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్‌లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్‌లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
గన్స్ & కార్స్
సాక్షి, హైదరాబాద్: సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు. ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు .22 పిస్టల్ వారసత్వంగా రాగా.. యాకుత్‌పుర బరిలో ఉన్న జాఫర్ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్నగర్ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి టెక్సాస్ నుంచి టెస్లా, ల్యాండ్ రోవర్ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు. విదేశాల నుంచి గన్స్ దిగుమతి.. యాకుత్‌పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ మిరాజ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్ బ్రాండ్ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్ రివాల్వర్, .32 పిస్టల్ రాఫ్టర్ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్ కూడా ఉంది. మలక్‌పేట అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్ గన్లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ వాహనాలున్నాయి. బలాలకు షహనాజ్ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్వీ, టొయోటా ఫార్చ్యూనర్ కార్లున్నాయి. హరీశ్ వర్సెస్ రేవంత్.. రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్ ఉన్నాయి. రేవంత్ పేరు మీద సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్‌తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. ఎస్బీబీఎల్ పంప్ యాక్షన్ గన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్ సింగిల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (ఎస్బీబీఎల్) పంప్ యాక్షన్ గన్ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్‌సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్‌తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్ ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీ నుంచి.. గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి. ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్‌గా భావించే .22 పిస్టల్ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు. 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్ డబుల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (డీబీబీఎల్) గన్ కూడా ఉంది. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ కూడా అక్బరుద్దీన్ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్ఎక్స్ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. స్పోర్ట్స్ కారులో అజార్, టెస్లాలో శ్రీలత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్–వీ కార్లున్నాయి. హుజూర్నగర్ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి. రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి వద్ద 2021 మోడల్ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్ ల్యాండ్ రోవర్ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
అవార్డుల జాతర.. నామినేషన్ కోసం సిద్దమైన కార్లు ఇవే!
2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి. ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా): ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు) టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మారుతి ఫ్రాంక్స్ హ్యుందాయ్ వెర్నా హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు) మెక్లారెన్ ఆర్టురా మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్‌స్టర్ ఆస్టన్ మార్టిన్ డీబీ12 హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎంజీ కామెట్ సిట్రోయెన్ ఈసీ3 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్ వోల్వో C40 రీఛార్జ్ బీఎండబ్ల్యూ ఐ7 ఆడి క్యూ8 ఈ-ట్రాన్ -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్‌వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్‌వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు
Pari-Raghav Chadha Networth బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్లో లేటెస్ట్ బజ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్బర్డ్స పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి నెట్‌వర్త్ 120 రెట్లు ఎక్కువ అని టాక్. 2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్ చేస్తే, భర్త రాఘవ్ స్విఫ్ట్ డిజైర్‌ను నడుపుతాడు అంటూ సోషల్ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ పరిణీతి సొంతం. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) లగ్జరీ కార్లు పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి సొంతం. ఇంకా 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4, రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, షూ ఫ్యాన్ 2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్‌తో కనిపించింది .అలాగే ఒక ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా. జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్లంటే మోజు. నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా. ప్లేబ్యాక్ సింగర్‌గా ఐకానిక్ సాంగ్ బతెరి మిట్టి మహిళా వెర్షన్‌తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని చూపించింది ఇషాక్జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్మాల్ ఎగైన్ (2017) బ్లాక్‌బస్టర్ హిట్మూవీల్లో నటించిన పరిణీతి మిషన్ రాణిగంజ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్కిలా’లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి చమ్కిలా లో యాక్ట్ చేసింది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్లో భారతీయ సైన్యానికి డీలర్ కూడా తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్లో, UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్‌లో బి.ఎ. హానర్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌కు PRగా తన వృత్తిని ప్రారంభించింది. రాఘవ్ చద్దా నికర విలువ రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా పాపులర్అయిన ఈ ఆప్ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు. నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్ కారు. -
భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు. ఇదీ చదవండి: దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా! 2022 పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్లతో ఈవీ పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా. -
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిశీలిస్తున్నాం...
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్ఆర్ ప్రస్తుతం జాగ్వార్ భారత్‌లో ఐ–పేస్ అనే ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌ను విక్రయిస్తోంది. జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్ అవుట్‌లెట్స్, 27 సరీ్వస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్ఆర్ ఇటీవలే కొత్త రేంజ్ రోవర్ వేలార్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే వేలార్‌కు 750 బుకింగ్స్ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. -
ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?
స్కిల్డ్ పేసర్‌గా పాపులర్ అయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న బుమ్రా అంగద్ జస్ప్రీత్ బుమ్రా అంటూ తన బుజ్జాయి పేరును కూడా ప్రకటించేశాడు. దీంతో బుమ్రా-సంజన దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఫ్యాన్స్ కూడా తెగ సంతోష పడిపోతున్నారు. ఈ క్రమంలో బుమ్రా నెట్‌వర్త్, కార్లు తదితర ఆస్తులపై ఆసక్తి నెలకొంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి, క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో జట్టులో కీలక క్రికెటర్‌గా ఎదిగిన వాడు బుమ్రా. తనదైన స్పెషల్ బౌలింగ్ యాక్షన్ , యార్కర్లతో నిలకడైన బౌలింగ్ సామర్థ్యంతో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా తరువాతే ఎవరైనా. ఇప్పటివరకు తన చిన్న కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బుమ్రా 2013 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ జట్టుకు కీలక టైటిళ్లను అందించిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇంత పాపులర్ అయిన బుమ్రా సంపాదన, ఇతర వివరాలను పరిశీలిస్తే.. వివిధ మీడియా నివేదికల ప్రకారం 2023 మార్చి నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర విలువ రూ. 55 కోట్లు(7 మిలియన్ డాలర్లు)గా అంచనా. అలాగే కాంట్రాక్టు ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లింపు విధానం ప్రకారం బుమ్రా వార్షిక వేతనం రూ.7 కోట్లు. దీనికి తోడు భారత జట్టు కోసం ఆడే ప్రతి టెస్ట్, ODI, T20I మ్యాచ్‌లకు అందే రెమ్యునరేషన్ వరుసగా రూ. 15 లక్షలు, రూ. 6 లక్షలు , రూ. 3 లక్షలు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) బ్రాండ్లు భారత క్రికెట్ జట్టు గ్రౌండ్లో స్టార్ క్రికెటర్‌గానే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టీమ్ కాంట్రాక్టులు,బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కూడా బుమ్రా సంపాదన పెరుగుతూనే ఉంది. బుమ్రా డ్రీమ్11, ఆసిక్స్, వన్‌ప్లస్ వేరబుల్స్, జాగల్, బోట్, సీగ్రామ్ రాయల్ స్టాగ్, కల్ట్స్పోర్ట్, ఎస్ట్రోలో, యునిక్స్ భారత్ పే వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లు అతని చేతిలో ఉన్నాయి. ప్రముఖ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్‌తో పెళ్లి తరువాత బుమ్రా పూణేలోని అనేక ఆస్తులతో పాటు, ముంబైలో సుమారు రూ. 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లును సొంతం చేసుకున్నాడు. 2015లో అహ్మదాబాద్‌లో విలాసవంతమైన డిజైనర్ ఇంటిని కొనుగోలు చేశాడు.దీని విలువ ప్రస్తుతం రూ. 3 కోట్లు. ఈ ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా పలు రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడా కలిగి ఉన్నాడు. లగ్జరీ కార్లు: బుమ్రా గ్యారేజీలో రూ. 2.54 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ S560, రూ. 2.17 కోట్ల విలువైన నిస్సాన్ GT-R, రూ. 90 లక్షల విలువైన రేంజ్ రోవర్ వెలార్ , టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటి విలువ రూ.25 లక్షలు. కాగా బుమ్రా డిసెంబర్ 6, 1993న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్ కోసం ఆడుతున్న క్రమంలో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2013లో, జస్ప్రీత్ తన తొలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా జనవరి 2016లో, జస్ప్రీత్ ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ T20 అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు తన కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్నాడు. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ఇండియాకు తిరిగి రావడంతో ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఆ భారత్ సూపర్-4కు క్వాలిఫై అయిన తరువాత పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 10న తదుపరి మ్యాచ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన ఆనందంలో ఉన్న బ్రుమా సూపర్-4 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్‌వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?
ఇండియన్ సౌత్ ఫిల్మ్స్ మెగాస్టార్ గురించి పరిచయం అవసరం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ మన్మధుడిగా అక్కినేని నాగార్జున ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరు. అలనాటి టాప్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, తనదైన నటన, ప్రతిభతో సూపర్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రమేకాదు బాకాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీలతో అటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. అద్భుత నటనలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. కేవలం నటుడుగా మాత్రమే కాదు నిర్మాతగా, థియేటర్ ఆర్టిస్ట్, పాపులర్ టీవీ షోకు హోస్ట్‌గా పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఆకట్టు కోవడం ఆయన స్పెషాల్టీ. ‘నాగ్’ బర్తడే సందర్భంగా ఆయన నెట్‌వర్త్ తదితర విషయాలను గురించి చూద్దాం. 1959, ఆగస్టు 29న చెన్నైలో పుట్టిన నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే అనేక బాక్లబస్టర్ సినిమాలను అందించి స్టార్‌గా తన వారసత్వాన్ని నిలుపు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవర్ గ్రీన్ కింగ్ నటనా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అలాగే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నాడు. దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో నాగార్జున కూడా ఒకరు. 2016లో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ.16 కోట్లకు పైగా ఉన్నాయి. 2023 నాటికి నాగార్జున నికర విలువ 950 కోట్ల రూపాయలుగా ఇండస్ట్రీ వర్గాల అంచనా. వార్షిక ఆదాయం దాదాపు 40కోట్ల రూపాయలు. నాగార్జున లగ్జరీ కార్లు: BMW 7-సిరీస్ , ఆడి A-7 తదితర కార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో కారు ధర 1- 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సినిమాలే. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం భారీ మొత్తంలోనే వసూలు చేస్తాడని ఇండస్ట్రీ టాక్. నాగార్జునకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని లగ్జరీ భవనం ఉంది. దీని అంచనా విలువ దాదాపు రూ.42.3 కోట్లు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు ఆస్తులు కూడా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులున్నాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ జ్యువెలర్స్ మినహా కళ్యాణ్ జ్యువెలర్స్‌కు అక్కినేని నాగార్జునకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేవు. దీనికి ఏడాదికి రూ.2 కోట్లు తీసుకుంటాడు. మరో పాపులర్ షోకు సంబంధించి 40 ఎపిసోడ్ల షో కోసం నాగార్జున రూ.3 కోట్లు ప్లస్ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు తాజా సంచలనం. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 9-11 కోట్ల ఉంటుంది. దీనికి తోడు కేబీసీ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడుకి నాగార్జున హోస్గ్గా భారీ మొత్తంలోనే సంపాదించాడు. నాగార్జున పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. HIV/AIDS అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2010లో, అతను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో స్థాపించబడిన టీచ్‌ఎయిడ్స్ రూపొందించిన ఒక HIV/AIDS యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్‌లో కూడా నటించాడు. -
మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..
తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా కీర్తి పొంది, ఎంతోమంది యువ నటులకు ఆదర్శమైన 'చిరంజీవి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నేడు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆయన ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారు? నెట్‌వర్త్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన చిరంజీవికి అన్యదేశ్య కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom) ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదలకాక ముంచే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! నెట్‌వర్త్ (Net Worth) చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన & విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. ఇదీ చదవండి: దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే? చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో నాగబాబుతో కలిసి 'అంజన ప్రొడక్షన్స్ హౌస్' స్థాపించారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ బ్యానర్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద మెగాస్టార్ ఆస్తుల విలువ సుమారు రూ. 1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. -
మెర్సిడెస్ నుంచి మరో 4 మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్‌సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్‌లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
‘దేవర’ స్టార్ యాక్టర్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు: తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్యాన్ ఇండియాస్టార్ జూ.ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ దేవర మూవీలో విలన్ అలరించబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్. బర్త్‌డే సందర్భంగా సైఫ్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న సైఫ్ భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ హిట్ల లిస్ట్ పెద్దదే. మంచి నటుడిగా, ఫిట్నెస్ ఫ్రీక్‌గా అంతకుమించి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భర్తగా మంచి మార్కులే కొట్టేశాడు.ఆ క్రమంలో సైల్ అలీ ఖాన్ ఆస్తిఎంత? సినిమాకు ఎంత తీసుకుంటాడు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) పర్సనల్ లైఫ్, రాయల్ ఫ్యామిలీ 1970, ఆగస్టు 16న నటుడు, ప్రముఖ క్రికెటర్ , భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా చలామణి అయ్యారు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌తో వివాహ జరిగింది. వీరికి సారా అలీ ఖాన్ ,ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు సంతానం.. అయితే 13 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012, అక్టోబర్ 16న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు తైమూర్ అలీ ఖాన్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. దశాబ్దాల సినీ కరియర్ 1993లో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన దగ్గరనుంచీ ఐకానిక్ క్యారెక్టర్స్‌తో వెనుదిరిగి చూసింది లేదు. ఓంకార, లవ్ ఆజ్ కల్, కల్ హో నా హో, హమ్ తుమ్, దిల్ చాహ్తా హై, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, లాల్ కప్తాన్, మెయిన్ ఖిలాడి తూ అనారీ, పరిణీత, సలామ్ నమస్తే, రేస్ ఆదిపురుష్ , బంటీ ఔర్ బబ్లీ-2తదితర చిత్రాలలో సైఫ్ గుర్తుండిపోయే పాత్రలు చాలా ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కోట్ల విలువైన ఆస్తులు మీడియా నివేదిక ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని ప్రసిద్ధ ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ దాదాపు రూ. 4.2 కోట్లు. దీంతోపాటు సైఫ్ తమ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది దీన్ని అద్దెకిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముంబైలో 6 కోట్లు విలువ చేసే మరో లగ్జరీ బంగ్లా కూడా ఉంది. జిస్టాడ్‌లో సైఫ్ అలీ ఖాన్ చాలెట్ విలువ రూ. 33 కోట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కి ఫారిన్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కొత్త ప్రదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తుంటాడు. స్విట్జర్లాండ్‌లో జిస్టాడ్‌లో చాలెట్( ఫాంహౌస్ లాంటిది) ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని రూ. రూ. 33 కోట్లు. భార్య కరీనా, పిల్లలు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్‌లతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు, పటౌడీ ప్యాలెస్ ముంబైలో సైఫ్ అలీ ఖాన్ కలిగి ఉన్న అన్ని అత్యంత ఖరీదైన ఆస్తులతో పాటు, హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ చాలా ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. సైఫ్ వారసత్వ సంపద విలువ రూ. 5000 కోట్లు. చివరి పాలక నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, దివంగత మన్సూర్ అలీ ఖాన్ వారసత్వ ఆస్తిలో ముఖ్యమైంది. పటౌడీ ప్యాలెస్ 'ఇబ్రహీం కోఠి' పేరుతో కూడా పిలుస్తారు.150 గదులు, ఏడు బెడ్రూమ్లు, పలు డ్రాయింగ్ రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూమ్లులాంటి ఫీచర్లతో హర్యానాలో 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బహుళ నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. అలాగే భోపాల్‌లోని పటౌడీ ప్యాలెస్ రూ. 4,200 కోట్లు. లగ్జరీ కార్లు రాయల్ ఇమేజ్, డాషింగ్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ కార్లు అతని గ్యారేజీలోఉన్నాయి. లగ్జరీ కార్ కలెక్షన్లో ఫోర్డ్ మస్టాంగ్ జిటి (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు) , లెక్సస్ 470 (రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), బెంజ్ ఎస్- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు) . డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. బ్రూనై సుల్తాన్ కుమార్తె నుండి తనకు లభించిన బహుమతి అని సైఫ్ ఒక సందర్భంలో వెల్లడించాడు. అంతేకాదు కోటి రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ను ఒకానొక సందర్బంగా విక్రయించాలని చూశాననీ, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన భార్య కరీనా కపూర్‌కి ఇచ్చినట్టు తెలిపాడు. రెమ్యూనరేషన్, నెట్‌వర్త్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో ‘రావణ్’ పాత్రకోసం 12 కోట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని రెమ్యూనరేషన్ రూ. ఒక్కో సినిమాకు 10-15 కోట్లుగా అంచనా. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఓటీటా ప్రాజెక్ట్‌లలో కూడా చాలా యాక్టివ్. అలా వార్షిక ఆదాయంరూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పైమాటే. సో సుదీర్ఘకాలంగా బాలీవుడ్లో కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ నికర విలువ సుమారు రూ. 1,180 కోట్లుగా ఉంటుందని అంచనా. -
HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్‌కి అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్‌డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ బ్యాక్‌యార్డ్‌లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్‌తో పాటు మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్‌డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
లగ్జరీ కార్ల జోరు : అదీ లెక్క
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 2023 జనవరి-జూన్‌లో భారత్‌లో 8,528 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.1.5 కోట్లకుపైగా ధర కలిగిన టాప్ ఎండ్ వెహికిల్స్ (టీఈవీ) వాటా 25 శాతంపైగా నమోదై 2,000 యూనిట్లకు చేరింది. 2022 జనవరి-జూన్‌తో పోలిస్తే టీఈవీల అమ్మకాలు 54 శాతం పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ఈ ఏడాది టాప్ ఎండ్ వెహికిల్స్ విభాగంలో అయిదు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. టీఈవీలకు వెయిటింగ్ పీరియడ్ 6-24 నెలలు ఉన్నప్పటికీ విక్రయాలు పెరుగుతున్నాయి. రెండవ అర్ధ భాగంతోపాటు పూర్తి ఏడాదికి మొత్తం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం. నూతన తరం జీఎల్సీ మోడల్‌ను మూడవ త్రైమాసికంలో పరిచయం చేస్తున్నాం. పండుగల సీజన్‌కు ముందే ఈ కారు రానుంది’ అని వివరించారు. 2022లో భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ నుంచి మొత్తం 15,822 యూనిట్లు రోడ్డెక్కాయి. వీటిలో 69 శాతం వృద్ధితో 3,500 పైచిలుకు టాప్ ఎండ్ వెహికిల్స్ ఉన్నాయి.