Mahesh Vijapurkar
-
పరువు తీసిన విశ్వసనీయత
ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనాలను ప్రత్యర్థులు కేజ్రీవాల్ క్షమాపణలతో సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకు పోయింది. తెలుగుదేశం కుట్రపన్నుతోం దని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు 1980ల ఆరంభంలో ఆరోపించారు. దానికి సంబంధించిన లిఖిత పూర్వక వివరాలు ‘తగిన సమయంలో’ వెల్లడిస్తానని తర్వాత ముఖ్యమంత్రి, గవ ర్నర్ పదవులు చేపట్టిన ఈ నేత ప్రకటించారు. అయితే, తర్వాత ఆయన ఆ పని చేయ లేదు. ‘‘ మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే ఇప్పుడే ఈ ఆరోప ణను నిరూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని కర్నూలు విలేకరుల సమావేశంలో ప్రశ్నించాను. ఈ విషయం నేతల విశ్వసనీయతకు సంబంధించినది. అనేక పత్రికలు ఆయన ఆరోపణను ప్రచురించాయి. కానీ, ఆయన చెప్పిన విషయాన్ని నేను పనిచేస్తున్న ‘ద హిందూ’ పత్రికలో రాయడానికి నేను ఇష్టపడలేదు. అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. పుకార్లు వ్యాప్తి చేసే సంస్థలు కూడా నెమ్మదిగానే పనిచేసేవి. ఇప్పటిలా ఇంటర్నెట్లో నిరాధార ఆరోపణలు, వార్తలు వ్యాప్తి చేయడం నాడు ఊహించడానికి కూడా అసాధ్యం. అబ ద్ధాలు, అవాస్తవాలతో ప్రజాభిప్రాయాన్ని విజయవం తంగా కోరుకున్న విధంగా మలచుకోవడం ఇప్పుడు పద్ధతి ప్రకారం జరుగుతోందనే వాస్తవం మనకు తెలుసు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే నేడు ఏది సత్యమో కనీసం నమ్మదగిన సమాచారంగా కూడా మనకు తెలియడం లేదు. అంటే, నిజం అనేది నిర్ధారిం చుకోదగిన లేదా అందుబాటులో ఉన్న వాస్తవం స్థాయికి దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకుని, నిర్ణయించుకునే సమాచారం ఇలా పంపిణీ అవుతోంది. ఇక వాట్సాప్ ద్వారా వాయు వేగంతో వచ్చిపడే అంశాల్లో ఏది సమాచారం? ఏవి గాలి కబుర్లో తేల్చుకోవడం కష్టం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు తప్ప మొత్తం సీట్లను కైవసం చేసుకున్నాక దేశంలో అత్యంత నమ్మదగిన రాజకీయ నాయకుడిగా అవతరించారు. అన్ని పార్టీలూ ఆప్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయనే కారణంగా ప్రజలు కేజ్రీవాల్ మాటలు నమ్మారు. అప్పట్లో ఆప్‌ను అప్రదిష్ట పాల్జేయడానికి స్టింగ్ ఆపరేషన్ పేరిట రూపొందించిన వీడియోలను ఇష్టారాజ్యంగా మార్చేసి అన్ని రాజకీయపక్షాలూ చేయని ప్రయత్నాలు లేవు. సామాన్యుడికి నిర్ణాయక శక్తి ఉండే కొత్త తరహా రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న రోజులవి. కేజ్రీవాల్ అప్పుడు చేసిన ఆరోపణలన్నిటినీ జనం విశ్వ సించారు. రాజకీయనాయకులు, పార్టీలు మోసపూరిత కుయుక్తులతో ఓట్లు సంపాదించి అధికారంలో కొన సాగుతూ ఆటలాడుకుంటారన్న విషయం మనలాంటి సామాన్య ప్రజానీకానికి తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను దెబ్బదీయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ తన ఆరోపణలను రుజువు చేసు కోలేకపోయారు. ఫలితంగా వీటికి సంబంధించి దాఖ లైన పరువునష్టం దావాలపై విచారణ ముగియక ముందే ఆయన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పుకోవాల్సివచ్చింది. సామాన్య ప్రజానీకం ముఖ్య విషయాలను రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయకుండా తామే స్వయంగా నిర్ణ యించే వేదికలా ఆమ్ఆద్మీ పార్టీ నాకు కనిపించింది. కేజ్రీవాల్ నేడు విశ్వసనీయత కోల్పోవడంతో ఓ ఆదర్శ రాజకీయ వేదికగా ఆప్ బలహీనమైంది. ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్‌ను పూర్తిగా లొంగిపోయిన నేతగా చిత్రిస్తున్నారు. నలుగురికి క్షమాపణలతో కేజ్రీవాల్ పరువు పోయింది! ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమా పణ చెప్పారు. అంతకు ముందు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీఠియాకు, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ కొడుకు అమిత్ సిబ్బల్‌కు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. జైట్లీ–ఢిల్లీ క్రికెట్ క్లబ్ సంబంధంపైన, పంజాబ్‌లో మాదకద్రవ్యాలకు మజీఠియాకు ఉన్న వ్యవహారంపైన తాను చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ నిరూపించు కోలేకపోయారు. ఆయనపై ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నందున పరిపాలనపై దృష్టి పెట్టడానికే ప్రత్య ర్థులకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారని సమర్థించు కోవడం తేలికే. ఆప్‌లో నానాటికీ పెరుగుతున్న అంతర్గత కీచు లాటలను అదుపు చేసి పార్టీని సమైక్యంగా ఉంచ డానికి పరువునష్టం కేసుల నుంచి త్వరగా బయటపడితే మేలని కేజ్రీవాల్ భావించి ఈ పనిచేశారని కూడా వివరించ వచ్చు. అయితే, కేజ్రీవాల్ ఇతర రాజకీయ నాయకుల మాదిరి ఎదిగిన నేత కాదు. ఆయన అనుసరించిన కొత్త తరహా రాజకీయాలను ఓడించడానికి అన్ని పార్టీలూ రహస్యంగా చేతులు కలిపాయి. ఆయన అందరికీ సవా లుగా, ముప్పుగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు కేజ్రీ వాల్ క్షమాపణల కారణంగా అన్ని పక్షాలూ లబ్ధిపొందు తాయి. ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవ ర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనా లను ఆయన క్షమాపణలతో ప్రత్యర్థులు సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకుపోయింది. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు mvijapurkar@gmail.com -
నిషేధం అమలయ్యేనా?
విశ్లేషణ ప్లాస్టిక్ నిషేధంలో సానుకూల కారణమేదంటే.. తయారీదారు, సరఫరాదారుతోపాటు వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో జాప్యమే నిషేధం అమలులో ప్రధాన అవరోధం. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధానికి సంబంధించిన అనుభవం సానుకూలంగా మాత్రం లేదు. మహారాష్ట్రలోని దాదాపు అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో 20 మైక్రాన్లకంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించారు కానీ, రెండు సాధారణ కారణాల వల్ల ఈ నిషేధం ఉల్లంఘనకు గురవుతోంది. ఒకవైపు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లడం సౌకర్యవంతంగా ఉండటం, మరోవైపు ప్లాస్టిక్ నియంత్రణ యంత్రాంగం నిబంధనలను పట్టించుకోకపోవడం. ప్లాస్టిక్ మురుగుకాలువలను అడ్డుకుంటుంది. బహిరంగ స్థలాలను చెత్తతో నింపుతుంది. డంపింగ్ కేంద్రాలలో ప్లాస్టిక్ పోగుపడుతోంది. ప్రతి సంవత్సరం నగరాల్లో వరదలకు భారీవర్షాలు కారణం కాదు. మురుగుకాలవలను ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుకోవడం వల్లే కారణమని తెలిసిందే. ఇప్పుడు ఉన్నట్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఉగాది (గుడిపర్వ) నుంచి ప్లాస్టిక్ నిషేధంపై జీవో జారీ చేసింది. కానీ ఇది ఎలా అమలవుతుందన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఈ నిషేధం ఎందుకు పనిచేస్తుందో, ఎందుకు పని చేయదో చెప్పడానికి ప్రాథమికంగా రెండు కారణాలున్నాయి. సానుకూల కారణమేదంటే, ప్లాస్టిక్ తయారీదారు, సరఫరాదారు మీదే కాకుండా వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. అందుకే ఇప్పటికే జనాభాలోని ఒక చిన్న విభాగం ఈ కొత్త నిబంధనకు కట్టుబడాలని నిర్ణయించుకుంది. పర్యావరణ కారణాలపై కాదు కానీ జరిమానా భయంతోనే అన్నది నిజం. ఎందుకంటే ప్లాస్టిక్‌ని వినియోగించినందుకు తొలిసారి తప్పు కింద రూ. 5,000లు రెండో తప్పుకు రూ. 10 వేలు జరిమానా విధిస్తారు, ఇక మూడో తప్పుకింద రూ. 25,000ల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మరో కోణం ఏదంటే, ప్లాస్టిక్ నిషేధ యంత్రాంగం పనితీరులో జాప్యం కారణంగా ప్లాస్టిక్ సంచులను చాలా షాపులు ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నాయి. నిఘా యంత్రాంగం క్రియాశీలం అయ్యేంతవరకు వీటిని ఉపయోగిస్తూనే ఉంటారు. ప్లాస్టిక్ చెత్తను సేకరించే కేంద్రాలను నెలలోపు ఏర్పర్చి వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో ఉంచాలని అన్ని ప్రభుత్వ సంస్థలకూ ఆదేశాలు వెళ్లాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందని ప్రశ్నార్థకమే. ఇలా సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ సంచులు, స్పూన్లు, థర్మోకోల్ వంటివి ఉంటాయి. వీటిని విస్తృతంగా వినియోగిస్తున్న రీత్యా వీటి నిషేధం పెద్ద లక్ష్యమే అవుతుంది. అదే సమయంలో ఇప్పటికే తయారీదారుల వద్ద ఉన్న ప్లాస్టిక్ నిల్వలను అవి అమ్ముడయేంతవరకు మార్కెట్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అనుమతించింది. ఒక నెలలో ఈ నిల్వలన్నీ ఖాళీ చేయాలనడం అయోమయం కల్గించే వైరుధ్యమే. పెద్దపెద్ద బాటిళ్లు కాకుండా నీటిని నిల్వచేసిన అర్ధ లీటర్ బాటిళ్లను వదిలించుకోవలసిన చెత్తగా ప్రకటించడం గందరగోళం కలిగిస్తోంది. ఇది తర్క విరుద్ధంగా ఉంది. బ్రాండ్ ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశం చెబుతోంది. ప్యాక్ చేసిన ప్లాస్టిక్ పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత రిటైలర్లమీదే ఉంటుందని 2016లో ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవానికి పూర్తిగా విఫలమైంది. అందుకే ఇప్పుడు కూడా వాటిని మినహాయించారు. మరింత చిక్కు ఏమిటంటే పాల ప్యాకెట్లతో వ్యవహరించవలసి రావడం. పాల ప్యాకెట్లను డెయిరీలు సేకరించి వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుం టాయి. అయితే అసంఘటిత రంగంలో సాగుతున్న పాల పంపిణీ రంగం ఈ కొత్త ఆదేశాలతో ఎలా వ్యవహరిస్తుందన్నది అస్పష్టమే. పాల ప్యాకెట్లు, బాటిళ్ల తయారీదారులను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోలేదు. పునర్వినియోగానికి సిద్ధం కావలి సిందిగా వీరికి ప్రభుత్వం చెప్పడం లేదు. పైగా ఇలాంటి వాటిని ఏర్పర్చుకోవడం రాత్రికి రాత్రే జరిగిపోదు. ఒక బ్యాగ్ రీసైకిల్ చేసే ప్రక్రియలో 50 పైసలు పాల డైరీకి వెళుతుంది. అలాగే, బ్యాటిల్ తయారీదారులు 500 మిల్లీ లీటర్ల బ్యాటిల్‌కి రూపాయి లెవీ వసూలు చేస్తారు. ముందే చెప్పినట్లుగా ప్రభుత్వాదేశం ప్రకారం ప్లాస్టిక్ బ్యాటిల్స్ పునర్వినియోగ వసతుల ఏర్పాటు చట్టం చేసినంత సులభమైన విషయం మాత్రం కానే కాదు. పైగా ఇక నుంచి ఆహారం రుచి కూడా కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత దానిలోని దినుసుల రుచి మారిపోవచ్చు లేదా మార్పులేకుండా ఉండవచ్చు. కానీ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు అనే మంచి ఉద్దేశం కూడా మహారాష్ట్రకు పెద్ద సమస్యే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే 1000 బ్యాటిల్స్ తయారీ సంస్థలను మూసివేసింది. వాటిలో 500 సంస్థలు చాలా పెద్దవి. రోజుకు మహారాష్ట్రలో 30 లక్షల నీటి బ్యాటిళ్లు అమ్ముడవుతుంటాయి. వీటన్నింటినీ కలిపితే సంవత్సరానికి అయిదు లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం పోగుపడుతుంది. దీన్ని ఉన్న పళానా తొలగించడం అన్నదే ప్రధాన సమస్య. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
నిజాయితీకి నిదర్శనాలు
విశ్లేషణ దమ్ముంటే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బదిలీ చేయాలంటూ థానే మునిసిపల్ కమిషనర్ చేసిన సవాలు నేతలకు షాక్ కలిగించింది. నిబంధనలకు కట్టుబడే అధికారుల ధోరణి పెరుగుతుండటం అభినందనీయం. మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారుల్లో బలపడుతున్న ఒక ధోరణి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరముంది. వారు నియమ నిబంధనలకు కట్టుబడటానికి ప్రయత్నిస్తూ, తమకు అప్పగించిన విధుల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నారు. జనం దృష్టికి వచ్చిన తాజా ఉదంతం ఏమిటంటే, థానె మునిసిపల్ కమిషనర్ ఇటీవలే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో.. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, దమ్ముంటే తనను బదిలీ చేయాలంటూ సవాలు చేశారు. ఇది తొలిసారి జరిగిన విషయం ఏమీ కాదు. కొన్ని నెలల క్రితం కూడా ఆ అధికారి తాను ముఖ్యమంత్రిని కలిసి బదిలీ చేయించుకుంటానని సర్వ సభ్య సంఘానికి తెలియజేశారు. కాని అతడి ప్రతిపాదనను అప్పట్లో అంగీకరించలేదు. ఇప్పుడు తనపై అవిశ్వాస ప్రకటన చేయాలన్న అతడి డిమాండ్ పట్ల కూడా రాజకీయ నేతలు కలవరపడలేదు. సంజయ్ జైస్వాల్ అనే ఆ అధికారి మరికొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇలాంటి అదికారి విషయంలోనూ వారు నిలకడతనాన్ని పాటించలేదు. పైగా వారు అతడిని అప్రతిష్టపాలు చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎదుగుతున్న లేక ముంబైలాగా కిక్కిరిసిపోయి, జనసమ్మర్థంగా ఉంటున్న థానే నగరం రాజకీయ నేతలకు, మధ్య దళారీలకు అద్భుతమైన అవకాశాలను ఇస్తోంది. నిర్మాణ రంగం ఇక్కడ అతి పెద్ద పరిశ్రమగా మారడంతో రాజకీయ నేతలే దళారీలుగా మారుతున్నారు. నగరం ఎదుగుతున్నట్లయితే, నూతన గృహాల నిర్మాణం వేగం పుంజుకుంటుంది. నగరం ఇప్పటికే ఇరుగ్గా మారి ఉన్నట్లయితే చట్టాలను అతిక్రమించాల్సి ఉంటుంది. అనేక పెద్ద నగరాల్లో నిర్మాణరంగ వాణిజ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాని వాటా కలిగి ఉంటున్నారని చెబుతున్నారు. థానేలో దాదాపు 20 లక్షల మంది జనాభాతో మహారాష్ట్రలో గుర్తించదగిన నగరంగా విస్తరిస్తోంది. కానీ ఇరుగ్గా మారుతుండటంతో నగర పాలనను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరమెంతైనా ఉంది. ఇప్పుడు సుపరిపాలన కావాలి. కానీ తమ వ్యక్తిగత అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన రాజకీయనేతలు పురపాలక సంస సమర్థ నిర్వహణపై ఆసక్తి చూపడం లేదు. తనకంటే ముందు పనిచేసిన ఐఏఎస్ అధికారి టి. చంద్రశేఖర్ లాగే జైస్వాల్ కూడా ప్రజానుకూల అధికారి. 2000ల మొదట్లో ఐఏఎస్ అధికారి టి. చంద్రశేఖర్ రాజ కీయ నేతల అడ్డంకులను ఎదుర్కొని థానే నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించారు. ప్రజాపక్షపాతిగా, నగరాభివృద్దే లక్ష్యంగా కార్యాచరణకు పూనుకున్నారు. అందుకే జైస్వాల్ నేతల దారిలో ముల్లు అయి కూర్చున్నారు. నగర ఆదాయ మార్గాలను పెంచారు. వీటన్నింటితో ప్రజలు అతడి వెన్నంటే నిలిచారు. పైగా నగరంలోని స్వార్థ ప్రయోజన శక్తులను అడ్డుకుంటూ బహిరంగ ప్రకటనలు పంపిణీ చేశారు కూడా. రక్షణ కోసం పురపాలక సంస్థ ఖర్చుతో ప్రైవేట్ బౌన్సర్లను నియమించుకున్న ఏకైక పురపాలక సంస్థ అధినేత బహుశా ఆయనే కావచ్చు. అక్రమ నివాసాలను తొలగిస్తున్నప్పుడు లేక కూల్చివేస్తున్నప్పుడు అతడిని దూషిం చడమే కాకుండా తన డిప్యూటీపై దాడి చేశారు కూడా. జైస్వాల్ ఒంటరి కాదు. నవీ ముంబై కార్పొరేషన్ అధిపతి తుకారాం ముండే కూడా రాజకీయ నేతలకు తలవంచని పాపానికి కొద్దికాలంలోనే బదిలీకి గురయ్యారు. పింప్రి నుంచి చించ్వాద్కు అక్కడి నుంచి నాసిక్కి తరచుగా తన విషయంలో జరిగిన బదిలీలను ఆయన కిమ్మనకుండా, సాహసోపేతంగా స్వీకరించారు కానీ ప్రజాస్వామ్యంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని రాజకీయ నేతలు తోసిపుచ్చరాదని ఈ ఉదంతాలు తెలుపుతున్నాయి. వ్యక్తుల కంటే సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇకపోతే మహేష్ జగాడే ఉదంతాన్ని తీసుకోండి. రాజకీయ నేతలకు వంగి నమస్కారాలు పెట్టకపోవడంతో ఈ అధికారిని కూడా చాలాసార్లు బదిలీలపై పంపారు. ఆహారం, మందుల సంస్థ కమిషనర్ స్థాయిలో ఉన్న తనను జిల్లా స్థాయికి కుదించివేశారు. కానీ ఏ పదవిని అలంకరించినా, స్వార్థ ప్రయోజన శక్తులకు లొంగకుండా తన పని విషయంలో ఆయన రాజీలేకుండా వ్యవహరించారు. మహారాష్ట్రలో పలువురు నిజాయితీ పరులైన అధికారులున్నారు. అవినీతిమయమైన వ్యవస్థ లొసుగులను చక్కదిద్దారు. ఉదాహరణకు దేశంలోనే అతిపెద్దదైన నగరాల్లో ఒకటైన ముంబై పురపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన డిఎమ్ శుక్తాంకర్, చాలాకాలం తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన ఎస్ఎస్. టినైకర్ ఇద్దరూ పురపాలన అనేది పౌరుడి కేంద్రకంగానే ఉండాలని రాజకీయనేతలు, కాంట్రాక్టర్లు తెలుసుకునేలా చేశారు. చంద్రశేఖర్, జైస్వాల్, ముండే వంటివారు ఉత్తమ అధికారులుగా మహారాష్ట్ర నగర పాలనపై తమ ముద్ర వేశారు. మహారాష్ట్రకే కాదు దేశంలోని ప్రతి స్థాయిలోనూ ఇలాంటి మంచి అధికారులు తప్పక పనిచేయాలి. అధికారులు నిబంధనలకు పూర్తిగా కట్టుబడి పనిచేసే ఈ ధోరణి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. మొదటిగా నగర పాలనకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే నగరాలు పౌర జీవితాల సమ్మేళనం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేశ్ విజాపుర్కర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ప్రజలకు దక్కని ప్రయోజనాలు!
ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ స్వార్థ ప్రయోజనాలు పట్టుసాధిస్తున్నాయి. ప్రజలు నష్టపోయే ప్రక్రియలనే అమలు చేస్తూ వస్తున్నారు. ఈ అసంబద్ధ పరిణామం సంభవించని ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉందా? ఎన్నికైన ప్రజాప్రతినిధి తనను ఎన్నుకున్న ప్రజలనే పట్టించుకోకుండా పోతే ఏం జరుగుతుంది? ఎన్నికైన వారికి ఏమీ కాదు. ఎందుకంటే మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అతడు లేక ఆమెకు తమదైన మార్గాలు ఉండి ఉంటాయి. కులం, డబ్బు, పరి చయాలు, పోలింగ్ సమయంలో అందించే ప్రోత్సాహ కాలతోపాటు గతంలో కండబలం ప్రదర్శించేవారు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఉపయోగించేవారు కూడా. సిద్ధాంతాలు అనేవి కేవలం నటన మాత్రమే, లేదా అవి సీజన్లో అద్దే ఫ్లేవర్ల లాంటివి. ఇవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మన దేశంలో అయితే దానిపట్ల నమ్మకంతో పనిలేకుండా ఓట్లు సాధించే శక్తి ఉన్నంతవరకు సిద్ధాంతం మారుతూనే ఉంటుంది. హరియాణా ఎమ్మెల్యే గయాలాల్ 1967లో కేవలం పక్షం రోజుల్లోనే మూడుసార్లు పార్టీలు మారినప్పుడు ప్రజాగ్రహం పెల్లుబికింది. చివరకు తన పేరుతో ఆయారాం, గయారాం పేరు కూడా ఇలాంటివారికి స్థిరపడిపోయింది. సైద్ధాం తిక నిబద్ధతే పార్టీలు మారడానికి కారణం కాకపోవచ్చు లాభం ఆశించి పార్టీలు మారటం అనేది ఆధునిక భారత రాజకీయాల్లో తెలియని విషయమేమీ కాదు. ప్రస్తుతం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి త్వరగా మారిపోతున్నారు. దీని ఉద్దేశం సొంత సీటును కాపాడుకోవడం మాత్రమే కాదు. కుటుంబ పరిరక్షణ కోసం కూడా ఫిరాయిస్తున్నారు. పార్టీలు మారటం అనేది ఇప్పుడు కుటుంబ వ్యాపారంగా మారిపోయింది. దీంతో నియోజకవర్గాలు కూడా వారసత్వంగా తయారయ్యాయి. కాబట్టి ప్రజా ప్రతినిధి అనే పదానికి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. దీంట్లో ప్రజలు రెండో స్థానంలోకి పడిపోయారు. దేశంలో చాలా నియోజకవర్గాలు ఇప్పుడు వారసత్వ జమానాలుగా మారాయి. పలువురు జాతీయ నేతలు కూడా దీంట్లో భాగమే. కనీసం ఒక జాతీయ పార్టీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగితే ఆ పార్టీ నేతలు భోజనాల బల్ల వద్ద విస్తరించిన పెద్ద కుటుంబంలా కనిపిస్తుంటారు. ప్రజలకు దీంతో ఏవగింపు కలుగుతోంది. రాజకీయాల్లో భవన నిర్మాతలు ప్రవేశించడంతో మేం ఇక ఎవరిని సంప్రదించాలి అని సామాజిక కార్యకర్తలు ఆవేదన చెందుతుంటారు. 1,560 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి వారు పోరాడుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు ఇది మునకలో ఉంటుంది. ఒకప్పుడు మాగాణినేలగా ఉన్న దీన్ని తర్వాత ఉప్పు తయారీకి లీజుకిచ్చేశారు. బృహన్ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో వాసై–విరార్‌లో ఉంటున్న భూమి ఒక అభివృద్ధి కేంద్రంగా గుర్తింపు పొందింది. చెరువులు, కుంటలను ఆక్రమించి కాలనీలుగా మార్చిన హైదరాబాద్ తరహాలోనే వాసై–విరార్ ప్రాంతాన్ని కూడా గత సంవత్సరం వర్షాలు ముంచెత్తాయి. ముంబై ఇప్పుడు రుతుపవనాల సమయంలో ఏర్పడే జలాశయాలను కోల్పోయింది. వాటిని ముట్టకుండా ఉండి ఉంటే నగర ప్రాంతాలకు అది ఊపిరి పోసేది. కాని రాజకీయాలతో కలగలిసిన రియల్ ఎస్టేట్ లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం నగరంలోని అనేక ప్రాంతాల్లో తిష్ట వేసింది. వాసై–విరార్ కేసును చూస్తే, ఆ నియోజకవర్గం, పురపాలక సంస్థ దాదాపుగా ఒక కుటుంబం యాజమాన్యంలో ఉంది. వీరు భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో, నిర్మాణ రంగంలో మునిగితేలుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామీణ పట్టణ ప్రాదేశిక వాతావరణాన్ని ప్రజలు కోల్పోతున్నారు. ప్రజా ప్రతినిధులు తమ సొంత వ్యాపార ప్రయోజనాలను కాకుండా తమ నియోజకవర్గ సామూహిక ప్రయోజనాలను గౌరవించాలని ప్రజలు భావిస్తున్నారు. కానీ మన రాజకీయ, పాలనా నీతి నేపథ్యాన్ని చూస్తే సొంత ప్రయోజనాలే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంటాయి. కానీ అలా జరగకూడదు. వరదల నుంచి తమకు రక్షణ కావాలని ప్రజలు కోరితే దానికి న్యాయం చేకూర్చాలి. అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షను తోసిపుచ్చకూడదు. గత 30 ఏళ్లలో, సుదూరంలోని పట్టణ శివార్లలో ప్రజలకు గోదాములను కట్టి ఉంచేవారు. ఒక ప్రణాళిక, పథకం లేకుండా ఎదుగుతున్న ముంబైకి అవి శ్రామికులను అందించేవి. అభివృద్ధి అంటే 1,560 ఎకరాల భూమిని గ్రోత్ సెంటర్ కోసం తీసుకుని మొత్తం నగర ప్రాంతాన్నే ప్రమాదంలో ముంచెత్తడం అని కాదు అర్థం. ఆ ప్రాంతం ఇప్పటికే జనంతో నిండి ఉంటే, ఈ భూమిలో జరిగే కొత్త ఆర్థిక కార్యాచరణ లేవనెత్తే సంక్షోభానికి నగరం చెల్లించవలసిన మూల్యం ఎంత? ఇందుకు రాజకీయ వర్గాన్ని మాత్రమే తప్పుపట్టే పనిలేదు. నగర ప్లానర్లు, ప్రభుత్వం కలిసే ఆ వృద్ధి కేంద్రం ఏర్పాటును ప్రతిపాదించాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ స్వార్థ ప్రయోజనాలు ప్రస్తుతం పట్టుసాధిస్తున్నాయి. ఉన్నతాధికారవర్గం, ఆర్థిక ప్రయోజనాలు చివరకు ప్లానింగ్ కూడా అంతిమంగా ప్రజలు నష్టపోయే ప్రక్రియలనే అమలు చేస్తూ వస్తున్నాయి. ఈ అసంబద్ధ పరిణామం సంభవించని ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉందేమో వెనక్కు తిరిగి ఆలోచించండి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
‘ఆరోగ్య సంరక్షణ’ కలేనా?
2016లోనే ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రకటించారు. కానీ అది అమలులోకి రాలేదు. 2017 బడ్జెట్ ప్రసంగంలో దీన్ని ప్రస్తావించలేదు. మళ్లీ కొత్త పథకం తేవడంలో అర్థం ఏమిటి? జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకంలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం’ అనే అస్పష్టమైన పదాలున్నాయి. ఇది ఇటీవల పార్లమెంటుకు సమర్పిం చిన కేంద్ర బడ్జెట్ స్వయంగా చాటుకున్న పదబంధం. ఈ కార్యక్రమం పరిధిలోకి 10 కోట్ల కుటుంబాలు రానున్నాయి. కుటుంబానికి సగటున 5గురు సభ్యులని భావిస్తే మొత్తం 50 కోట్లమంది భారతీయులు అంటే జనాభాలో మూడోవంతు మంది ఈ పథకం కిందికి వస్తారు. ఏడాదికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమాగా పొందటం అంటే భారతీయ కుటుంబాలకు నిజంగానే అదొక వరం. దేశంలో చాలామంది అతి స్వల్పమాత్రపు వైద్య ఖర్చులను కూడా భరించలేని స్థితిలో ఉంటున్నారు. మంచి ఆరోగ్య సేవలందించే ఆసుపత్రి వద్దకు ప్రయాణ ఖర్చులు భరించడం కూడా చాలామందికి కష్టమవుతోంది. తమ వేతనాలు కోల్పోవలసిరావడం, కుటుంబాలు ఎదుర్కొనే విషాద పరిస్థితుల గురించి చెప్ప పనిలేదు. కుటుంబంలో సంపాదనపరుడికి వైద్యఖర్చుల భారం మరణంతో సమానమే. దురాశాపరులైన వడ్డీ వ్యాపారుల నుంచి, ఇతరత్రా వైద్య ఖర్చులకోసం తీసుకునే రుణాలను కుటుంబాలు తట్టుకోలేవు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన జాతీయ ఆరోగ్య బీమా ఎప్పుడు, ఎలా అమలు చేస్తారన్నది మనకు తెలీదు. ఈ భారీ పథకానికి అయ్యే వ్యయం గురించి.. ప్రభుత్వం మనకు తెలియపర్చడం లేదు. ఎంత వ్యయం అవుతుందనే అంశాన్ని స్పష్టం చేయకుంటే ఏ ప్రకటనైనా సరే పురుడు పోసుకోవడం కష్టం. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో తెలీదు. ఎందుకంటే 40 శాతం ఖర్చును అవే భరించాలి. అయితే ఏ రాష్ట్రం కూడా దీన్ని దాటవేయాలని భావించదు. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు తమ ఆర్థిక వనరులను పునర్నిర్మించుకోవలసి ఉంటుంది. ఇది అంత సులభం కాదు. ఒక బ్లాగులో ప్రచురించిన పరిశోధనా పత్రం ఈ పథకం అమలు గురించి తీవ్ర సందేహాలను వ్యక్తపరిచింది. ఈ పరిశోధనా పత్ర రచయిత్రి మీటా చౌదరి ఒక ఫ్యాకల్టీ మెంబర్. ఆమె అభిప్రాయం ప్రకారం, ‘2016 లోనే ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రకటించారు. ప్రతి బీపీఎల్ కుటుంబానికి ఏటా రూ. 1 లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులను ఈ పథకం కింద అందించడమవుతుంది. కానీ ఆ పథకం అమలులోకి రాలేదు. పైగా 2017 బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన కూడా చేయలేదు. ఆనాటి పాత భావనను నేడు కొత్త భావనలో కలిపేశారని మనం భావించినప్పటికీ, అది ఇప్పటికీ కాగితంమీది భావనగానే ఎందుకు మిగిలి ఉందనే ప్రశ్నకు సమాధానాలు లేవు. పైగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధుల పరిమాణం, ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తారు, దాన్ని అమలు చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఆరునెలల్లోపు ఈ పథకాన్ని అమలు చేస్తారన్న అంచనా ఉంటోంది. ఈ అంశంలో అర్థం చేసుకోవలసిన మరొక విషయం కూడా ఉంది. ప్రైవేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ ఖర్చుల విషయంలో, అనవసరమైన ప్రక్రియల నిర్వహణలో పేరుమోసి ఉన్నాయి. బీమా సంస్థలు వాటిలో కొన్నింటిని అనుమతించనప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు ఉద్దేశపూర్వకంగా పెంచే ఇతర ఖర్చులు కూడా రోగులపై పడే అవకాశముంది. దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు ఏటా రూ. 5 లక్షలను ఆరోగ్య సంరక్షణ కింద అందించడం నిజంగా వరంలాంటిది. అయితే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ రంగమే దీనిద్వారా లబ్ధి పొందుతుంది. ఇప్పటికే వీటి సామర్థ్యం అవసరానికి మించి పెరిగిపోయి ఉన్నప్పటికీ ఈ కొత్త మార్కెట్‌ను వేగంగా వినియోగించుకునే అవకాశం వీటికే ఉంది. విరాళాల ద్వారా నిర్వహిస్తున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దేశీయంగా ఎంతో బలహీనంగా ఉంది. కొనసాగుతున్న కొద్ది సంస్థలను పాలనాపరంగా, వైద్యపరంగా కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. వైద్యుల కొరత, మందుల కొరత, డిమాండ్‌తో పోలిస్తే ఎప్పటికీ సరిపోలని అతి తక్కువ నిష్పత్తితో ఉండటం వంటివి ప్రభుత్వ వైద్య వ్యవస్థలకు వినాశ హేతువులుగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఆరోగ్య పథకాలను, వ్యవస్థలను ఎలా నడుపుతున్నాయనేది తెలిసిన విషయమే. కాబట్టి ప్రభుత్వ వైద్య వ్యవస్థలో మార్పులకు సంబంధించిన ప్రకటనలు అమలులో మాత్రం నత్తనడక సాగిస్తాయి. దీంతో అధిక బిల్లులతో ప్రజల ఊపిరి తీసే ప్రైవేట్ రంగం మరింత పెరుగుతూనే ఉంటుంది. జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాలకు ప్రభుత్వం కేటాయించేది పెద్దగా ఉండకపోవడం, ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెరుగుదలకు రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం వంటి వాటి నేపథ్యంలో కనీసం రూ. 1.5 లక్షల ఆరోగ్య పథకానికి రూ. 1,200 కోట్ల కేటాయించడం కూడా చాలా పెద్ద లక్ష్యమే అవుతుంది. ప్రైవేట్ రంగం, వితరణశీలురు ఆరోగ్య సంరక్షణకు ఇస్తున్న తోడ్పాటు నిధుల కేటాయింపులో ప్రభుత్వ నిబద్ధతను సందిగ్ధావస్థలోకి నెడుతున్నాయి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మన నగరాలపై కుక్కకాటు
విశ్లేషణ 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. ఈ వ్యాసం రెండు రకాల శునక ప్రేమికులకు నచ్చదు. శునకాలను గారాబంగా పెంచుకునేవారు, పెంచకున్నా వీధికుక్కలకు తిండి పెట్టేవారు. మొదటి విభాగంలో మళ్లీ రెండు రకాల వాళ్లున్నారు. పురపాలక సంస్థలనుంచి శునకాలకు లైసెన్స్ తీసుకునేవారు (వీరి సంఖ్య చాలా తక్కువ). అసలు అలాంటి ఆలోచనే చేయనివారు. ఏ పురపాలక సంస్థ అయినా సరే పెంపుడు జంతువులు లేదా వీధికుక్కలు లేక రెండింటి జనాభాను తన పరిధిలో అదుపులోకి తీసుకోగలదు అంటే నమ్మశక్యం కాదు. ఏరకంగా తీసుకున్నా సమాజంలో పెంపుడు కుక్కల కంటే వీధికుక్కల జనాభానే ఎక్కువ. పైగా వీధుల్లో కుక్కలకు తిండిపెట్టడాన్ని వ్యతి రేకించడం అనేది పెద్ద నేరం కిందే లెక్క. అలా చేస్తే జంతువులపై క్రూరత్వ నివారణ సమితి మీపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. నేను శునక ప్రేమికుడిని కాదు. కానీ పెంపుడు కుక్కల యజమానులు, వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారి హక్కులను నేను గుర్తిస్తాను. కానీ వారు కొంచెం బాధ్యతతో వ్యవహరించాలన్నది పలువురి అభిప్రాయం. మీ పెంపుడు కుక్క మీ ముఖం నాకుతూ, మీ పరుపుమీదే పడుకుంటూ ఉన్నప్పుడు మల విసర్జనకు దాన్ని బయటకు ఎందుకు తీసుకెళ్లాలి? తమ కుక్కలు వీధుల్లో మలవిసర్జన చేయడం కోసం కొంతమంది రోజువారీగా కొందరికి డబ్బులిస్తుంటారు. వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారు ఆ చర్యను ఎవరైనా వ్యతిరేకిస్తే మూకుమ్మడిగా వచ్చి మాట్లాడుతుం టారు. సాధారణంగా ఇలాంటివారు ఒకేచోట కుక్కలకు తిండిపెడుతుంటారు కాబట్టి వీధికుక్కల ప్రేమికులకు, ఆ వీధికుక్కలకు కూడా అక్కడే తామేదో శాశ్వత నివాసముంటున్నట్లుగా తిష్టవేయడం పరిపాటిగా అవుతోంది. ఇలాంటి ప్రాంతాలే కుక్క కాట్లకు నెలవులుగా ఉంటాయి. వీధుల్లో కుక్కలకు తిండిపెడుతున్నవారిని ఆ కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయిస్తుంటారా అని అడిగి చూడండి చాలు. ఏ ఒక్కరూ దీనికి నేరుగా సమాధానం ఇవ్వరు. పైగా ఎవరినైనా ఏ కుక్క అయినా కరిచిందా, దానివల్ల ఎవరైనా బాధపడ్డారా అంటూ వాదిస్తుంటారు, ఎదురుప్రశ్నలు వేస్తుంటారు. పైగా కుక్కల జనాభా వృద్ధిని నిలిపేందుకు తగు చర్యలు తీసుకోవడంలో పురపాలక సంస్థకు సహకరించే పని కూడా చేయరు. పురపాలక సంస్థలు కుక్కలను నపుంసకంగా మార్చడంలో ఘోరంగా విఫలమవుతుండటం మరొక విషయం. కానీ శునక ప్రేమికులు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. వీరికి రోడ్డుపైన లేక పక్కన కుక్కలు మలవిసర్జన చేయడం అభ్యంతరం అనిపించదు. కానీ ఆ పక్కనే నడిచి వెళ్లేవారికి ఇది మహా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కుక్క విసర్జితాన్ని తీసివేసేం దుకు ఏ ఒక్కరైనా గెరిటలాంటిది తీసుకెళతారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. మనదేశంలో మనుషులు బహిరంగ మల విసర్జన చేయకుండా నివారించడం అలవిగాని పని అని మనకు తెలుసు. స్వచ్ఛభారత్ సర్‌చార్జి ద్వారా ప్రభుత్వ ప్రచారానికి మనం డబ్బు చెల్లిస్తున్నందున ఈ లక్ష్యం మనపై భారం వేస్తోంది కూడా. కానీ కుక్కలను, ప్రత్యేకించి వీధికుక్కలను ప్రేమించడం అనేది కొద్దిమేరకు పౌర బాధ్యతకు కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ముంబైలో కుక్క కాటు వల్ల రేబిస్‌కు గురై చాలామంది చనిపోయారు. కుక్కకాటు మరణాల సంఖ్య భీతిగొలిపేదిగా ఉంది. 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. దీంతో వీధికుక్కలపై మనమే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వార్త నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళలో కుక్క కాటుకు గురి అయిన వారికి చెల్లిస్తున్న పరిహారం మితిమీరుతోందని, కొన్ని ప్రత్యేక కేసుల్లో అయితే రూ.20 లక్షల రూపాయల దాకా చెల్లించాల్సి వస్తోందని కేరళ ప్రభుత్వం సమీక్షించింది. కుక్కకాటు బాధితులకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. మునిసిపాలిటీలే వీటిని చెల్లిస్తున్నందున వీటిపై మరింత బాధ్యత పెట్టే అవకాశం లేదని తేల్చేసింది. కానీ మనం చూడాల్సింది కుక్కకాటు చెల్లింపులు మితిమిరిపోయాయా అని కాదు. తమ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమవుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇది చిన్న విషయం కాదు. మన దేశంలో దాదాపు మూడు కోట్ల వీధికుక్కలున్నాయి. 20 వేలమంది ప్రతి సంవత్సరం రేబిస్‌తో మరణిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే, మనుషులు నడవడానికి చోటు లేదు కానీ, 1994–2015 మధ్య కాలంలో 13 లక్షల కుక్క కాట్లు నగరంలో నమోదయ్యాయి. దేశంలోని ప్రతి నగరం, పట్టణం కూడా కుక్కకాట్లకు సంబంధించి సంతోషం కలిగించని గణాంకాలను కలిగిఉంటున్నాయి. ఉదాహరణకు భివండీలో రెండవ తరగతి విద్యార్థి ధీరజ్ యాదవ్ ఉదంతం భయం గొలుపుతుంది. చెత్త నిల్వ కేంద్రంలో ఆడుకుంటున్న ధీరజ్ అనుకోకుండా కుక్కపై పడ్డాడు. తోడుగా ఉన్న తొమ్మిది ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క అతడిని ఎంతగా కరిచిందంటే స్థానిక ఆసుపత్రి అతడిని పెద్దాసుపత్రికి తరలించాల్సిందిగా సిఫార్సుచేసింది. చివరకు ధీరజ్ మరణించాడు. కొన్నేళ్ల క్రితం తొమ్మిదేళ్ల షాహిద్ నసీమ్ సయ్యద్ ముఖం, చేతులు, వక్షంపై 100 కుక్కకాట్లు పడ్డాయి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఇళ్లు చూపే అంతరాలు
ముంబైలో మురికివాడల ఉనికిని చాలామంది గుర్తించనప్పటికీ నగర ఆర్థిక వ్యవస్థకు బాగా దోహదం చేస్తున్న పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. నిజానికి మురికివాడలు లేకుంటే ముంబై స్తంభించిపోవచ్చు. విశ్లేషణ భూమ్మీద సంపన్నులు, పేదల మధ్య అంతరం మరీ కొట్టొచ్చినట్లు కనిపించే నగరం ఉందంటే అది ముంబైనే అని చెప్పాలి. దేశంలోనే అతి సంపన్నుడైన ముఖేష్ అంబానీ నివసిస్తున్న 27 అంతస్తుల నివాస భవనం ఇక్కడే ఉంది. 36 ఫ్లోర్లతో టెక్స్టైల్ టైకూన్ గౌతమ్ సింఘానియా నిర్మించిన భారీ భవంతీ ఇక్కడే ఉంది. అనిల్ అంబానీ 19 ఫ్లోర్ల భవనంలో ఉంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ తన కుటుంబం కోసం తొమ్మిదంతస్తుల భవంతి నిర్మించుకున్నారు. ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా ఏడు ఫ్లోర్లతో కూడిన నివాసంలో కుటుంబంతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ సామాజిక శ్రేణిలో ఉంటున్న ఇతరులకు కూడా అద్భుత భవనాలు ఉన్నాయి కానీ పైన చెప్పిన ఆకాశ హర్మ్యాలు వీరికిలేవు. ఈ సంపన్నుల సంపదపై లేక వారి డాంబికాలతో నాకు పేచీ లేదు. కానీ ఇదీ కొన్ని పోలికలకు తావిస్తోంది. నందన్ నీలేకని రాసిన ‘ఇమేజింగ్ ఇండియా: ఐడియాస్ ఫర్ ది న్యూ సెంచురీ’ పుస్తకంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా చెబుతున్న ధారవిలో ఉన్న తుక్కు, తోలు, రీసైక్లింగ్ పరిశ్రమ సంవత్సరానికి 1.7 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తోందని తెలిపారు. ఇది అంబానీ నూతన గృహ నిర్మాణానికి పెట్టినంత వ్యయానికి సమానమని అంచనా. ఈ ఆకాశహర్మ్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, కనిపించని గుడిసెలు ముంబైలో అధిక భాగంలో వ్యాపించి ఉన్నాయి. వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థతో అతి పెద్దనగరంగా ముంబైకి ఉన్న ప్రతిష్టను ఇది పలుచబారుస్తోంది. మురికివాడల శ్రమతో ముంబై ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న తోడ్పాటును ఆర్థికవేత్తలెవరూ అర్థం చేసుకోలేదు. మురికివాడలు లేకుంటే ముంబై నగరం స్తంభించిపోవచ్చు. మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ ముంబై నగరంలో 12.5 లక్షల గుడిసెల్లో 62 లక్షల మంది గుడిసెవాసులు ఉన్నట్లు తేల్చింది. 1995కి ముందునుంచీ నగరంలో ఉన్న గుడిసె వాసులకు ఉచితంగా గృహాలను కల్పిస్తామని మొదట్లో చెప్పారు. తర్వాత దానిని 2000 సంవత్సరం వరకు పొడిగించారు. ఇక్కడ చెప్పొచ్చే అంశం మురికివాడల ఉనికి, నత్తనడకన నడుస్తున్న వాటి పునరావాసం మాత్రం కాదు. మురికి వాడలు, గుడిసెవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇక్కడ చర్చనీయాంశం. ఇటీవలే నగరంలోని అసల్ఫా మురికివాడ సుందరీకరణలో భాగంగా దాని వెలుపలి గోడలకు రంగులద్దారు. గుడిసెవాసుల జీవితాలకు కాస్త రంగులద్దడం అన్నమాట. కంటికి వికారంగా ఉండే వారి జీవితాలను పరోక్షంగా చిన్నచూపు చూసే చర్య ఇది. మురికివాడలకు వెలుపల ఉన్నవారు నగరంలో మురికివాడలు ఉన్నాయన్న విషయాన్ని నమ్మేందుకు కూడా ఇష్టపడరు. పైగా నగరాన్ని వృద్ధి చేయడంలో వారి పాత్రను గుర్తించాలని కూడా వీరు భావించరు. అనియత రంగంలో చాలాభాగం మురికివాడల నిర్వహణలోనే సాగుతోంది. మీ ఇళ్లలో పనిమనుషులు, మీ డ్రైవర్లు లాగే ఫైవ్ స్టార్ హోటల్స్‌లో వెయిటర్లు కూడా ఈ మురికివాడలకు చెందినవారే. చాలా సందర్భాల్లో వీరు నివసించే గుడిసెలు కుటుంబం మొత్తానికి కూడా 100 నుంచి 140 చదరపు అడుగులకు మించి ఉండవు. పునరావాసం కింద వీరికి కల్పిస్తున్న గృహాలు 225 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంటే వారు ఇంతవరకు నివసిస్తున్న నివాస ప్రాంతం ఇప్పుడు రెట్టింపు అవుతుం దన్నమాట. కానీ ఇవి కూడా వారికి అందటం కష్టమే. ఎందుకంటే వీరికి గృహాలను నిర్మించి ఇవ్వవలసిన బిల్డర్లు, డెవలపర్లు మురికివాడల్లో నిర్మాణ హక్కులను పొందడమే కాకుండా అనుమతించిన మేరకు గుడిసె వాసులు కాని వారికి ఇలా కట్టిన గృహాలను అమ్ముకుం టారు. దీనికి వీరు గుడిసెవాసులకు డబ్బు చెల్లిస్తారు. గత రెండు దశాబ్దాల్లో ఉచితంగా 1.7 లక్షల మందికి గృహ నిర్మాణ పథకాలు మంజూరయ్యాయి. వీటిలో 1,441 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. కానీ ఇవన్నీ అమలై ఉంటే నగర గృహ కల్పన విధానంపై ఇది ప్రభావం చూపి పేదలకు మెరుగైన జీవితాన్ని అందించే అవకాశముండేది. ఇప్పుడు ప్రభుత్వం గుడిసెవాసులకు 322 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలుస్తోంది. ఈ అదనపు స్థలంలో కుటుంబాలు కాస్త సౌకర్యవంతంగా ఉంటాయి. మొదట్లో 100–140 చదరపు అడుగుల్లో ఉన్న స్లమ్ యూనిట్లు తర్వాత పునరావాసంలో 225 చదరపు అడుగులకు పెరిగాయి. తర్వాత వీటిని 269 చదరపు అడుగులకు పెంచారు. ఈ పెంపుదల ప్రభుత్వం ఉదారంగా తీసుకున్నది కాదు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 322 చదరపు అడుగుల పరిమితిని విధించింది మరి. అందుచేత, భూమి లభ్యతపైనే ఇంటి పరిమాణం ఆధారపడుతుంది. ముంబైలో ఇళ్లలో 10 శాతం మాత్రమే సగం జనాభా ఉంటున్న మురికివాడల స్వాధీనంలో ఉన్నాయి. అందుకే ముంబైలో కొన్ని అతి భారీ భవంతులు ఉండగా మరికొన్ని బతకడానికి మాత్రమే సరిపోయే పరిమాణంలో ఉంటున్నాయి. చివరకు మురికివాడలకు దూరంగా ఉండే ప్లాట్లలోని వారు కూడా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకంలో తలపెట్టనున్న పరిణామం కలిగిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
కనుమరుగౌతున్న పొగ గొట్టాలు
ముంబై గత వైభవ చిహ్నాలుగా నిలిచిన బట్టల మిల్లుల పొగగొట్టాలు ఒక్కటొకటిగా అంతరిస్తుంటే వాటి కంటే ప్రమాదకరమైన విషవాయువులను వెదజల్లుతున్న నగల తయారీ గొట్టాలు పెనుసమస్యకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు ముంబైలో దాదాపు 80 టెక్స్టైల్ మిల్లులుండేవి. మొదటి ప్రపంచ యుద్ధ కాలం వరకు నగరంలో ప్రధాన పారిశ్రామిక కార్యాచరణ పత్తిని దుస్తులుగా మార్చడంగానే ఉండేది. నల్లమందు వ్యాపారంలోని మిగులుతో ఇవి 1850ల మధ్యలో వృద్ధి చెందాయి. ఇటీవలి వరకు దాదాపు 200 అడుగుల ఎత్తున్న బట్టల మిల్లుల పొగ గొట్టాలు ముంబై నగరానికి విశిష్ట చిహ్నంగా ఉండేవి. ప్రముఖ కార్మిక నేత దత్తా సామంత్ నేతృత్వంలో 1982లో మిల్లు కార్మికులు విఫల సమ్మెను చేపట్టాక ముంబై మిల్లులు పనిచేయడం ఆగిపోయింది. దీంతో పరిస్థితి మారిపోయింది. 1990లో ప్రభుత్వం మిల్లులకు చెందిన భూములను రియల్ ఎస్టేట్‌లోకి మార్చడానికి అనుమతించింది. దీంతో ముంబై ఉజ్వల గతానికి చిహ్నంగా నిలిచిన ఎల్తైన చిమ్నీల స్థానంలో ఇప్పుడు ఆఫీసులు, మాల్స్, గృహసముదాయాలతో కూడిన ఆకాశాన్నంటే టవర్లను ఎవరైనా చూడవచ్చు. కష్టంతో అయినా సరే, మీకు మంచి గైడ్ దొరి కితే, ముంబైలో ఇంకా మిగిలివున్న ఒకటీ, రెండు మిల్లుల గొట్టాలను మీరు గుర్తించవచ్చు. కానీ ఇవి కూడా త్వరగానో, తర్వాతో కూల్చివేతకు సమీపంలో ఉన్నాయి. భూమి కోసం తహతహలాడుతున్న నగరంలో ఖాళీ స్థలాలకు విలువ పెరుగుతోంది. కానీ ఇప్పుడు ఎల్తైన చిమ్నీలు కాకుండా, మరెన్నో పొగగొట్టాలను నగరంలో చూడవచ్చు. కానీ ఇవి చిన్నపాటి స్థలంలో ప్రధానంగా అత్యంత రద్దీ ఉండే దక్షిణ ముంబైలోని కల్బాదేవి ప్రాంతంలో కనిపిస్తాయి. అయితే ఈ చిమ్నీలు బంగారాన్ని నగలుగా మార్చే యూనిట్లకు సంబంధించినవి. ఇక్కడ తయారైన నగలను వలస వచ్చిన మహిళలు ఉపయోగిస్తుంటారు. ఇవి సమీపంలోని జవేరి బజార్‌కు తరలి వెళతాయి. దేశంలోని అతి పెద్ద బంగారం మార్కెట్ ఇదే. ఇవి కల్బాదేవి ఆవరణలో ఈ తయారీ యూనిట్లున్నాయి కాబట్టే ఇక్కడినుంచి జవేరి బజార్‌కు తరలించడం సులభం. కానీ ఇక్కడి ఇతర నివాస ప్రాంతాలకు దీనివల్ల కలుగుతున్న అసౌకర్యం కానీ, ఆరోగ్యానికి కలుగుతున్న ప్రమాదం గురించి కానీ ఆలోచించరు. బట్టల మిల్లులకు చెందిన పొగగొట్టాలు చిమ్మే పొగలాగా కాకుండా, ఈ నగల తయారీ గొట్టాలు వాటినుంచి విషవాయువులను వెదజల్లుతాయి. ఈ పొగ గొట్టాలు సమీపంలోని పాతవీ, అతి చిన్నవి అయిన నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటున్నాయి. చావల్స్ అని పిలుస్తున్న ఈ చిన్న అపార్ట్మెంట్లు నగరంలోని తొలి సామూహిక గృహాలకు సంకేతాలు. ఒక ఉమ్మడి వరండాలో విడి గదులు ఉంటాయి. వీటి చివరలో ఉమ్మడి మరుగుదొడ్లు ఉంటాయి. ఇవి ప్రారంభంలో మిల్లులకు సమీపంలో బట్టల మిల్లుల కార్మికులకు నివాసం కల్పించాయి. తర్వాత బట్టల మిల్లులకు వెన్నెముకగా ఉండే విస్తరిస్తున్న నగర ఆర్థిక వ్యవస్థకు సేవ చేసేందుకు వచ్చినవారికి ఆశ్రయం కల్పించాయి. ఈ చిన్న చిన్న గదులు ఇరుగ్గా, గాలి తక్కువగా, సౌకర్యాల లేమితో ఉంటున్నందున జనాభా గణన అధికారులు వీటిని సులువుగా మురికివాడలుగా గుర్తించేవారు. ఈ గృహాలు అక్కడి మొత్తం ప్రాంతాన్ని ప్రమాదకరంగా మార్చేశాయి. ఈ నగల తయారీ యూనిట్లలో యాసిడ్లను, పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలెండర్లను నిలువ చేస్తారు. ముడి బంగారాన్ని వీటితో కరిగించి ఒక రూపానికి తెస్తారు. ఈ క్రమంలో వచ్చే వాయువులు అగ్నిప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఈ ఇళ్లకు చెందిన మెట్లు సాధారణంగా కొయ్యతో చేసి ఉంటాయి. ఇది మరీ ప్రమాదకరం. బంగారం వేడి చేసేటప్పుడు వచ్చే పొగలు ఇక్కడ రోజువారీ సమస్యగా మారిపోయాయి. ఇక్కడ అగ్నిప్రమాదాలు ఏర్పడే సమస్యే కాదు. ఇక్కడి రోడ్లు ఇరుగ్గా ఉండటంతో ఫైర్ ఇంజన్లు లోపలికి రాలేవు. ఇటీవల సంభవించినట్లుగా అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం ఇక్కడ పెనుసవాలు. నగల వ్యాపారం చేసే జిల్లాల నుంచి వచ్చే రోజువారీ జనాలు మరిన్ని సమస్యలకు కారణమవుతుంటారు. ఈ నగల తయారీ యూనిట్లను తొలగించాలని ముఖ్యమంత్రి పురపాలక సంస్థను ఆదేశించినప్పటికీ, పసిడి రంగానికి చెందిన సంపన్న, శక్తివంతమైన శక్తులే ఈ యూనిట్ల వృద్ధికి కారకులని పురపాలక సంస్థకు తెలుసు కాబట్టి ఇక్కడ నివాసముంటున్న వారు పరిస్థితి మార్పుపై పెద్దగా ఆశలు పెట్టుకోరు. నగల తయారీ గొట్టాలను తొలగించాలని ఆదేశించి అమలు చేసినా, మళ్లీ అవి ఎలాగోలా ఏర్పడుతుండటంతో పురపాలక అధికారులు హేళనకు గురవుతుంటారు. బులియన్ మార్కెట్ చాలా కఠోరమైంది. మొండిపట్టు గలది. బాంద్రా–కుర్లా కాంప్లెక్స్ లోని అత్యంత విలువైన డైమండ్ మార్కెట్లోని స్థలాలను వీరు కొనుగోలు చేసినప్పటికీ గత దశాబ్దంగా వీటిలో నివసించిన వారే లేకపోయారు. ఎందుకంటే జవెరీ బజార్ వారి వ్యాపారానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంది. వ్యాపారానికి ముఖ్యమైనది సామీప్యతే కదా. కాబట్టి ఈసారి ఈ సమస్య పరిష్కారం అటు ముఖ్యమంత్రికీ, ఇటు మునిసిపల్ కార్పొరేషన్‌కీ పరీక్షే మరి. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆ ఆగ్రహం సమర్థనీయం!
చీలికలు పేలికలుగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని దళితులు కొత్త సంవత్సరం తొలిరోజున తమ శక్తి ఏమిటో చూపించారు. కోరెగాంలో జరిగిన ఘటనపై వారి అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చడం అంత సులభం కాదు. రెండు వందల ఏళ్ల క్రితం, ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలు కోరెగాం వద్ద ఒక యుద్ధాన్ని గెలుచుకున్నాయి. దాంతో మూడో ఆంగ్లో– మరాఠా యుద్ధం ముగిసింది. ఈ విజయంతో భారత ఉపఖండ యజమానులుగా బ్రిటి ష్వారు తమ స్థానాన్ని స్థిరపర్చుకున్నారు. పైగా, ఈ యుద్ధంతో పీష్వాల పాలనను సైనిక కమ్యూనిటీకి చెందిన మహర్లు ఖతం చేసినట్లుగా వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. శివాజీ అనంతరం మరాఠా సామ్రాజ్యాన్ని పీష్వాలు నడిపారు. సమతకు పట్టం కట్టిన శివాజీ పాలనకు భిన్నంగా పీష్వాలు బ్రాహ్మణిజం సంప్రదాయాలతో కులతత్వం అద్దారు. బ్రిటిష్ సైన్యం స్థానికులు, ఇంగ్లిష్ వాళ్లు రెండింటితో కూడి ఉండేది. ఎక్కువమంది భారతీయులే. రెండు జాతులకు సంబంధించిన సైనికులను కలిపి రూపొందించిన బెటాలియన్లు లేదా ప్లటూన్లు చాలా తక్కువ. కానీ ఇరు జాతుల సైనికులను కలిపి విశాల ప్రాతిపదికన బ్రిటిష్ సైన్యం అనేవారు. బ్రిటిష్ సైన్యంలో స్థానికులు ఎందుకు చేరారంటే ఇక్కడి పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటులో భాగమై ఉండవచ్చు లేదా జీవిక కోసం అయినా అయి ఉండవచ్చు. మెహర్లను సైన్యంలో చేర్చుకోవడానికి పీష్వా యంత్రాంగం తిరస్కరించడంతో, మరాఠాలను అణచివేయాలని చూస్తున్న బ్రిటిష్ వారితో చేతులు కలపాలని మెహర్లు నిర్ణయించుకున్నట్లు ప్రస్తుతం కథనాలు చెబుతున్నాయి. కోరెగాం స్థూపంలో పేర్కొన్న మృత సైనికులలో 22 మంది మెహర్లే అన్న వాస్తవం దీనికి సమర్థనగా కనిపిస్తోంది. ఆనాడు కోరెగాంకు వెళ్లిన సైనిక దళాల్లో ఎక్కువమంది మెహర్లే. బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యూహం పన్నారా? దీనిని చరిత్రకారులు అధ్యయనం చేయాల్సి ఉంది. బీఆర్ అంబేడ్కర్ 1927 జనవరి 1న కోరెగాం స్మారకస్థూపాన్ని సందర్శించినప్పటి నుంచి, ఆ తర్వాత జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులలో కూడా.. బ్రిటిష్ వారి తరఫున జరిగిన యుద్ధాల్లో అస్పృశ్యులే గెలిచారని ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ అంబేడ్కర్ కన్నా ముందు నుంచే దళితులు ఆ స్థూపాన్ని సందర్శించేవారు. కానీ దళితులు వీధుల్లోకి వచ్చి హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కొత్త సంవత్సరం మరాఠాలు కొత్త యుద్ధం ప్రారంభించినట్లయింది. జేమ్స్ లియన్ శివాజీపై రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు మొదలెత్తినప్పటి నుంచి, దళిత ప్రజా సంఘాలు మహారాష్ట్రలో ప్రాధాన్యత సంతరించుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దళితులను కొట్టిన సంఘటన వారికి మరాఠాలపై అమిత ఆగ్రహం కలిగించింది. పైగా ఒక దళితుడి స్మారక స్థూపాన్ని ధ్వంసం చేయడంతో మహారాష్ట్రలో దళితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను వధించిన మరాఠా పాలకుడు శంభాజీ దేహాన్ని ఎవరైనా తాకితే తీవ్రపరిణామాలు ఉంటాయని ఔరంగజేబ్ చేసిన హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా శంభాజీ అంత్యక్రియలను ఆ దళితుడు నిర్వహించాడు. దళితులు ఈ రెండు సంఘటనలలో తమ పాత్రకుగాను గర్వపడుతుంటారు. ఒకటి– మరాఠా పాలకుడి తరపున పాలించే పీష్వాలను ఓడించడం. రెండు– మరాఠాల పనుపున మొఘల్ రాజునే ధిక్కరించిన ఘటన. కాబట్టి ఇప్పుడు సమస్య సంక్లిష్టంగా తయారైంది. దీని మొత్తం సారాంశం ఏమిటంటే, మహారాష్ట్ర ఇప్పుడు కులతత్వంతో ఉడికిపోతోంది. అస్పృశ్యతా నిరోధక చట్టాన్ని పలుచబారేలా చేసి, భూమిపై యాజ మాన్యం కలిగి ఉన్నప్పటికీ తమకు కూడా కోటా వర్తింపు చేయాలని మరాఠాలు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాల కోటాలో తమకూ వాటా కావాలంటున్న మరాఠాల డిమాండ్లతో దళితులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మరాఠాలు, దళితులు ఇద్దరూ కూడా ప్రస్తుత బీజేపీ పాలనను పీష్వా పాలనగానే చూస్తున్నారు. పైగా ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు కూడా. వీటి మధ్య ఇతర వెనుకబడిన కులాలు నిరాశకు గురవుతున్నాయి. మహారాష్ట్రలో దళితులు ఒక రాజకీయ బృందంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పలు చీలిక బృందాలుగా చెల్లాచెదురైపోయారు. దళితులు సంఘటితమైతే అది రాష్ట్ర సామాజిక, ఆర్థిక వేదికపై నిస్సందేహంగా కొత్త రేఖను ఏర్పరుస్తుంది. దళితుల్లోని ఒక వర్గం ప్రయోజనాలను ఇది తటస్థపరుస్తుంది. ఉదా. హిందూత్వ వాదులతో పొత్తు కుదుర్చుకుని మొదట శివసేనతో కలిసిన దళితనేత రామ్‌దాస్ అథవాలే తరువాత బీజేపీతో చేతులు కలపడానికి దాన్ని వదిలిపెట్టేశారు. తమ సంఖ్యాపరమైన బలాన్ని సంఘటితం చేసుకోవాలంటే దళితులు తమదైన రాజకీయ వేదికను ఏర్పర్చుకోవాలి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో అథవాలే మాత్రమే దళిత రాజకీయాలనుంచి లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త పరిణామం బీజేపీయేతర, శివసేనేతర కూటములను ఇంకా బలపరుస్తుంది. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ తదుపరి ఎన్నికలకు ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం గురించి చర్చించింది కూడా.అయితే ఈ సానుకూల ఫలితాలు ఎలా ఉన్నా, చీలి కలు పేలికలుగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని దళితులు కొత్త సంవత్సరం తొలి రోజున మొదటిసారిగా తమ శక్తి ఏమిటో చూపించారు. ఈ విషయమై దళితుల అసంతృప్తిని చల్లార్చడం అంత సులభం కాదు. కోరెగాంకు 3 కిలోమీటర్ల దూరంలోని వధుబద్ర క్లో గోవింద్ మెహర్ సమాధిని ధ్వంసం చేసి అగౌరవపర్చిన ఘటన పట్ల మీడియా మొదట్లో పరమ నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు కోరెగాంలో దళితులపై దాడులను కూడా పట్టించుకోకపోగా, ముంబై వంటి నగరాల్లో బంద్‌లు అనేవి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తాయని మీడియా చెప్పడంతో దళితులు కుపితులైపోయారు. మహారాష్ట్రలోని కుల నిర్మాణాల్లో భూకంపం వంటి పెను కదలిక చోటు చేసుకుంటోది కానీ దాని రాజకీయ ప్రభావాలను మాత్రం ఎవరూ సరిగా అర్థం చేసుకోవడం లేదు. దీని పట్లే దళితులు అయిష్టత ప్రకటిస్తున్నారు. వారి ఆగ్రహ ప్రదర్శన అర్థం చేసుకోదగినదే. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆలయాలలో సంబరాలా?
విశ్లేషణ కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లోకి అర్ధరాత్రి భక్తులను అనుమతిం చడంపై నిషేధాన్ని న్యాయస్థానాలు సమ్మతించకపోవచ్చు.. కానీ, మన పూజా స్థలాలను మన కష్టాలు తెలుపుకునే చోటుగా మాత్రమే ఉంచాలి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా భక్తులు ఆలయాల్లో అర్ధరాత్రిపూట చేసే పూజ లను, దైవ సందర్శనలపై నిషేధించడానికి గత వారం మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అదేవిధంగా, హైదరాబాద్‌లోని హైకోర్టు కూడా భక్తుల హక్కులను ఎత్తిపట్టింది. ఈ రెండింటి మధ్య పోలికకు ప్రాధాన్యముంది. అంతకుముందు హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి నూతన సంవత్సరం సందర్భంగా ఆలయం లోపల తనకు ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లయితే వారిని శిక్షిస్తానని హెచ్చరించారు. ఎందుకంటే నూతన సంవత్సరం అనేది ఇంగ్లిష్ సంప్రదాయమే కానీ భారతీయ సంప్రదాయాలతో దానికి సంబంధం లేదట. ఎవరైనా తనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపితే వారిచేత ఆరు గుంజీళ్లు తీయిస్తానని ఆయన అన్నారు. ఆలయ సందర్శనకు వచ్చేవారు గర్భగుడి చుట్టూ ప్రశాంతతకు భంగం కలిగించకూడదంటూ ఆలయ పూజారి భక్తులను హెచ్చరించడంలో తప్పేమీ లేదు. నూతన సంవత్సరాది నాడు అలాంటి భక్తుల వైఖరి ఇతర భక్తులను ఇబ్బంది పెడుతుంది. వేడుకలను జరుపుకోరాదని చెప్పడం ఒక ఎల్తైతే , తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పినవారిని శిక్షిస్తానని చెప్పడం మరొక ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా జార్జియన్ కేలండర్ ప్రకారం జరుపుకునే కొత్త సంవత్సరాదిని తోసిపుచ్చడం భావ్యం కాదు. మన విశ్వాసాలతో పాటు ఇతర విశ్వాసాలు కూడా ప్రజలపై పనిచేస్తుంటాయి. పైగా మనందరికీ చాలా సులభంగా అర్థమయ్యే కేలండర్ అది. ఈ ప్రపంచంలో వారాంతాలను ఎలా నిర్ణయిస్తున్నారు? మన వారాంతపు సెలవు దినం ఏదో మనం ఎలా తెలుసుకోగలం? మనకు వేతనం వచ్చే రోజు ఎప్పుడని రూఢిగా చెప్పగలం? ఎందుకు ఇప్పుడు గందరగోళం సృష్టించడం? ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. ముస్లింలు తమదైన లూనార్ కేలండర్‌ని అనుసరిస్తారు. హిందువుల పర్వదినాల్లాగే ముస్లింల పర్వదినాలు కూడా జార్జియన్ కేలండర్‌కు భిన్నమైన తేదీల్లో జరుగుతుం టాయి. పంచాంగం ఒక స్వయంసిద్ధ గణకుడిలాగా సమాచారం అందిస్తుంది. ఇది జార్జియన్ కేలండర్ లాగే రోజులు, తేదీలను లెక్కిస్తుంది. హిందువులు తమ పంచాంగానికి, ముస్లింలకు తమ సంప్రదాయాలకు కట్టుబడినట్లయితే, ఈద్ పండుగ ఏ తేదీన వస్తుందో ఎవరికి తెలుసు? బ్యాంక్ సెలవు ఎప్పుడు? పాఠశాలకు, కాలేజీకి, ఆఫీసుకు మనం ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు? లేదా మన అంగడిని ఎప్పుడు తెరువకూడదు వంటివి మనకు ఎలా తెలుస్తాయి? దీపావళి ఎప్పుడు వస్తుందో, తమ పర్వదినం ఎప్పుడు వస్తుందో ముస్లింలు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇలాంటి ప్రశ్నలు సాదాసీదాగానే కనిపిస్తాయి కానీ, మన రోజువారీ జీవితాల్లో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జార్జియన్ కేలండర్ మినహా మరే ఇతర కేలండర్ లేని క్రైస్తవులు వారు భారతీయులైనప్పటికీ తక్షణమే ఇంగ్లిష్ వాళ్లయిపోతారా? నిస్సందేహంగా ఇదొక అసంబద్ధ విషయం. మన దేశం రెండు రకాల జీవితం గడుపుతున్న ఈ సందర్భంలో, మన పంచాంగం ఇస్లాం పర్వదినాలను సూచించడం లేక ఇస్లామిక్ పంచాంగం కూడా హిందూ పర్వదినాలను సూచించడం పెద్ద విషయమేమీ కాదు. కాగా, జార్జియన్ కేలండర్ రెండు మత విశ్వాసాలకు చెందిన పర్వదినాలను తనలో కలుపుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇది సులభంగా ఉపయోగించే కేలండర్‌గా మారింది. మరోవైపున రెండు మతాలకు చెందిన సంకుచిత నాయకులు మనకంటూ ఒక ఉమ్మడి కేలండర్‌ను అనుమతించనంతగా మనం వేరుపడిపోయాం. నూతన సంవత్సరాదికి కాకుండా ఉగాదికి ఆలయ పూజారి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, మనం జార్జియన్ కేలండర్‌ని పాటిస్తున్నందున, ఆయనకు అలా చెప్పే హక్కు, అధికారం ఉంటాయి. అయితే చాలామంది రెండు పర్వదినాలనూ జరుపుకోవాలని భావిస్తున్నారు. కాగా, డిసెంబర్ 31, జనవరి 1 సంబరాల పేరిట తిని, తాగి జనం పాటించే భోగాలను ఆలయంలోకి తీసుకురావడం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారికి అభ్యంతరకరమైతే దాన్ని అర్థం చేసుకోవలసిందే మరి. మన పూజా స్థలాలను మనం దేవుడిని అభ్యర్థించే చోటుగా, ప్రశాంతంగా, హుందాగా ఉంచాల్సిన అవసరం ఉంది. పూజా స్థలాల్లో మనం ఇతరులతో గట్టిగా సంభాషించం. పైగా ఆలయ ప్రశాంతతకు అంతరాయం కలిగించకూడదు. అజాన్ మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా మన సొంత గలాభా అనేది గర్భగుడి ప్రశాంతతను చెదరనివ్వకూడదు. మన ప్రవర్తన వాంఛనీయమైనదిగా ఉండాలి. అలాంటి ప్రవర్తనను పాటించాలి అనుకుంటున్న ఆలయ పూజారికి నా మద్దతు ఉంటుంది. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు
ప్లాస్టిక్ మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చింది, దాని పర్యవసానాలు పట్టించు కోండి, ప్రకృతే దాని సంగతి చూసుకుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. పర్యావరణ స్పృహగల ముంబై పౌరులు కేవలం వంద వారాంతపు రోజుల లోనే అక్కడి ఒక బీచ్ నుంచి 90 లక్షల కేజీల ప్లాస్టిక్‌ను సేకరించారు. పోటు మీదున్నప్పుడు సముద్రం లోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ చెత్త ఇది. మునిసిపాలిటీ దాన్ని అక్కడి నుంచి తరలించి ఏ గోతుల్లోనో కప్పెట్టెయ్యలేనంత భారీ పరిమాణం ఇది. దీంతో నిరుత్సాహానికి గురైన పౌరులు ఇక మనం చేయగలిగేదేమీ లేదని ఆ పని ఆపేశారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకో వాల్సి వచ్చింది. ఇది ముంబైలోని ఒక బీచ్ కథ మాత్రమే కాదు. నిరాటంకంగా సముద్రంలోకి గుమ్మరించిన ప్లాస్టిక్ దాదాపు ప్రతి బీచ్లోనూ ఇలా ఒడ్డుకు కొట్టుకు వస్తూనే ఉంటుంది. మందం ఎంతో ఇంకా కచ్చి తంగా లెక్కగట్టని ప్లాస్టిక్ ద్వీపాలు ప్రధాన సముద్రా లలో ఉన్నట్టు వివిధ కథనాలు తెలిపాయి. అవి ఒడ్డుకు కొట్టుకు రాని ప్లాస్టిక్ దీవులు. మానవ శరీ రాల్లోకి సైతం చొర బడగల స్థాయికి ఇప్పుడు ప్లాస్టిక్ శిథిలమ వుతోందని కనుగొన్నారు. 1950ల నుంచి ప్రపంచం 9 లక్షల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసింది. ఇందులో 9 శాతాన్ని మాత్రమే రీసైకిల్ చేశారు. అంటే ఇంత భారీగా ఉత్ప త్తయిన ప్లాస్టిక్ ఉపయోగంలో ఉన్నది లేక కాస్త ముందు వెనుకలుగా చెత్తగా పారేయాల్సినది, లేక కప్పేసిన గోతుల్లో ఉన్నది. లేదంటే కాలువలు, నదులు, సముద్రాలలో లేదా ముళ్ల పొదలకు గుచ్చు కునో ఉంటుంది. ఇది, స్వీయ పరాజయంలో మాన వులు సాధించిన ఘనత. భూగోళపు జీవితంలోని ఆంత్రోప్రోసిన్ (ప్రకృతిని మానవులు ప్రభావితం చేసే) శకంలో మానవులు చేజేతులా ప్రపంచాన్ని నాశనం చేసుకునే ప్రధాన దశ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తయారైన 9 లక్షల కోట్ల టన్నుల భారీ ప్లాస్టిక్లోంచి దాదాపు 100 వారాల్లో ఒకే ఒక్క చిన్న బీచ్‌లోనే తొంబై లక్షల కేజీల ప్లాస్టిక్ బయటపడింది. ఆట వస్తువుల నుంచి పారి శ్రామిక వస్తువులు, పాల సంచుల వరకు అన్నిటికీ ప్లాస్టిక్‌నే వాడేలా యుద్ధానంతర కాలంలో మన ప్రవర్తన మారిపోయింది. చిన్న కొత్తిమీర కట్టకు కూడా ప్లాస్టిక్ సంచిని స్వీకరిస్తున్నాం. దీని పర్యవ సానాలేమిటో ప్రపంచం అర్థం చేసుకోవడం ఇప్పుడే మొదలై ఉండవచ్చు. బయటపడటం సులువేమీ కాని పరిస్థితిలో మనంతట మనమే ఇరుక్కున్నట్టున్నాం. ఈ నేపథ్యం నుంచి చూస్తే, 2018 మధ్యకల్లా ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం పథకం ఆహ్వానించదగినది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టం కావచ్చు. ప్లాస్టిక్ సంచుల తయారీ, పంపిణీలోనే పెను మార్పు రావడం అందుకు అవసరం. సార్వత్రికంగా అంతా ప్లాస్టిక్‌కు బాగా అలవాటుపడిపోయిన మనుషులు తమ అల వాట్లను మార్చుకోవాలని ఆశించడం కష్టమే. పాకె ట్లకు బదులుగా పాలను సీసాల్లో పంపిణీ చేయవచ్చా వంటి సమంజసమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని శుభ్రం చేసి తిరిగి ఉపయోగించడానికి చాలా నీరు అవసరం అవుతుంది. తాగడానికి, సాగుకే నీరు అవసరంగా ఉంది. కొత్త ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండాలంటే మన జీవితాలనే పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుంది. గుడ్డ బ్యాగులు పట్టుకుని మార్కెట్‌కు వెళ్లడం, ప్లాస్టిక్ సీసాల్లోని నీటిని తాగడానికి నిరాక రించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ బాటిల్ నీరే పరిశుభ్రమైనదని విశ్వసించే స్థితికి మనం చేరాం. పౌర సంస్థ సరఫరా చేసే నీటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అది మరింత విద్యుత్ వినియోగంతో కూడినది, మన కర్బన వినియోగాన్ని పెంచేది. మనం కొనే ప్రతి వస్తువూ ప్లాస్టిక్‌తో చుట్టి నదే, రోడ్డు పక్క చాయ్ వాలా ఇచ్చే టీ కూడా వాడి పారేసే ప్లాస్టిక్ కప్పులోనే. పునర్వినియోగానికి పనికిరాని, లేదా రీసైకిల్ చేయడం కష్టమయ్యే ప్లాస్టిక్ సంచులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉంది. చెత్త ఏరుకునే వారు సైతం వాటిని పనికిరానివిగానే చూస్తారు. నిషేధం విధిస్తే పౌరులు తమంతట తామే దాన్ని పాటిస్తారని అధికారులు విశ్వసించారు. అదేసమయంలో కారణాలేవైనా వాటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. మురికివాడల్లోని కార్ఖానాల్లో సైతం అవి తయారవుతున్నాయి. మనం అంతా పెరగనిచ్చిన విపత్తు ఇది. బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఒక సంపా దకీయంలో ‘‘అసలు సమస్య ప్లాస్టిక్ కాదు, మనమే. ఆ అద్భుతమైన పదార్థాన్ని మనం తిరస్కరించలేం. దాన్ని చెత్తగా చూడటానికి బదులు అపురూపమైనదిగా వ్యవహరిస్తుంటాం’’ అని పేర్కొంది. అంటే, ప్లాస్టిక్‌ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అది మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చిందనే దానితో సహా పట్టించుకుని, ప్రకృతే దాని సంగతి చూసు కుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పద్మావతిపై ఎందుకీ కన్నెర్ర?
ఇంతటి ఆగ్రహానికి గురికాదగ్గది ఏదీ ఆ సినిమాలో లేదని దాన్ని చూసిన మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. సినిమా చూడకుండానే, సెన్సార్ కాకముందే ప్రదర్శిస్తున్న ఈ అర్థరహిత అసహనం ఎటు దారి తీస్తుంది? రెండు దశాబ్దాల క్రితం, స్వలింగ సంపర్కసంబంధం గురించి తీసిన ఫైర్ సినిమా చిక్కుల్లో పడింది. అది, మన దేశంలో తీసిన అలాంటి మొట్ట మొదటి సినిమా. మితవాదవర్గానికి చెందిన వారు ఆ సినిమాను ప్రదర్శిం చడానికి వీల్లేదంటూ నిరస నకు దిగారు. ఆ సినిమా నిర్మాతపైన, నటీనటులపైన కోపంతో ఆ యూనిట్ తదుపరి చిత్రం వాటర్ సెట్లను ధ్వంసం చేశారు. అది ‘భారత సంస్కృతికి వ్యతిరేకమై న’దంటూ రాజకీయవేత్తలు ఆ గూండాయిజాన్ని వెనకే సుకొచ్చారు. ఇప్పుడు, సెన్సార్ సర్టిఫికెటైనా లభించని పద్మావతి సినిమాపై కూడా అలాంటి ఆగ్రహాన్నే తిరిగి ప్రదర్శిస్తున్నారు. సినిమాలోని పద్మావతి ప్రచారంలో ఉన్న జానపదగాథల్లోని వ్యక్తే తప్ప, విశ్వసనీయమైన చరిత్రలోని వ్యక్తికాదనీ, ఒకరిని మరొకరుగా పొరబడ రాదనీ గుర్తించడానికి సైతం నిరాకరించేటంత తీవ్ర ఉద్రేకంతో వ్యక్తమౌతున్న ఈ సామూహిక అనుచిత ప్రవర్తనకు నేడు మనం అలవాటుపడిపోయాం. ఈ దురభిమానులు సినిమాను చూడనైనా చూడ కుండానే తమ తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తు న్నారు. బహిరంగంగానూ, టీవీల్లోనూ ఆ నటీనటుల ముక్కులను కోస్తామని బెదిరిస్తున్నారు, నిర్మాత, ప్రధాన నటి తలలకు రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించారు. రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువగా అవసరమైన కత్తిరింపులు చేయకుండా ఆ సినిమా విడుదలను అనుమతించరాదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కోరింది. కథను చెప్పడంలో సిని మాకు ఉండే కళాత్మకమైన స్వేచ్ఛకూ, వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకూ కూడా వ్యతిరేకమైన అసహనం నేడు సుస్పష్టంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై తీసిన ఎన్ ఇన్సిగ్నిఫికేంట్ మ్యాన్ అనే డాక్యుమెంట రీకి సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హక్కును ఎత్తి పట్టింది. అయినా అది పద్మావతి వ్యతిరేక బృందాల ఉద్రేకాన్ని చల్లార్చలేకపోయింది. ఈ అసహనం 15 రోజుల్లోనే పెను దుమారంగా మారింది. గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన న్యూడ్ (మరాఠీ), ఎస్. దుర్గ (మలయాళం) సినిమాల ప్రదర్శనను సమా చార, ప్రసార మంత్రిత్వశాఖ నిలిపివేస్తున్నట్టు ప్రక టించింది. ఎందుకో కనీసం ఒక్క వాక్యం వివరణనైనా ఇవ్వలేదు. ఈ రెండూ సెన్సార్ సర్టిఫికేట్లతో విడుదల య్యాయి కూడా. చూడబోతే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సెన్సార్ సర్టిఫికెట్లన్నా, తామే ఏర్పాటు చేసిన జ్యూరీ ఎంపిక అన్నా లెక్క లేన ట్టుంది. దీనికి నిరసనగా జ్యూరీ సభ్యులు వరుసగా చేస్తున్న రాజీనామాల పరంపరగానీ, తామే ఏర్పాటు చేసిన సంస్థలు, ప్యానెళ్లను విలువలేకుండా చేస్తూ ఇష్టా నుసారం చేసిన ఈ నిర్ణయాల పట్ల నిరసనగానీ ఆ మంత్రిత్వశాఖ అంతరాత్మను ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్టు లేదనుకుంటా. తగు కత్తిరింపులు లేనిదే పద్మావతి విడుదలకు అనుమతిని ఇవ్వరాదంటూ స్మృతి ఇరానీకి వసుంధరా రాజే రాసిన లేఖలో ఇది స్పష్టంగానే కని పించింది. ఎలాంటి వివరణా లేకుండానే న్యూడ్, ఎస్. దుర్గ సినిమాలను తొలగించడం కచ్చితంగా నిరంకుశ వైఖరే. అవి రెండూ అంతర్జాతీయంగా ప్రశంసలను, గుర్తింపును పొందినవి. అవి అశ్లీలతను లేదా మహిళల పట్ల అసభ్యతను చూపినవి కావు. ఎస్. దుర్గ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పద్మావతి సినిమాను తీసిన వారుగాక మరెవరూ ఇంతవరకూ ఆ సినిమాను చూసిందే లేదు. కొందరు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు దాన్ని ప్రద ర్శించి చూపారు. అలా చూసినవారంతా ఆ చిత్రంపై ఇలా మాటల దాడులను, నిరసన ప్రదర్శలను సాగిం చాల్సినది, తలలకు, ముక్కులకు వెలలు కట్టాల్సినది సినిమాలో ఏమీ లేదని అంటున్నారు. ఆందోళనకారు లకు విచక్షణారహితంగా సమయాన్ని, స్థలాన్ని కేటా యిస్తూ మీడియా అగ్నికి ఆజ్యం పోస్తోంది. అందు వల్లనే కావచ్చు నిర్మాతలు మీడియాకు సినిమాలో ఏమి ఉందో తెలియాలని అనుకున్నట్టుంది. సెన్సార్ బోర్డు ఈ అంశాన్ని అనుమానాస్పద దృష్టితో చూస్తోంది. అది అన్ని వేపులనుంచీ చుట్టి ముట్టివేతకు గురై ఉంది, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సినిమా చూడని నిరసన కారుల పక్షం వహించాయి, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోంది, నిర్మాతలు ఏది ఏమైనా త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు ఏమి జరగనుందో ఎవరికీ తెలియదు. సినిమాను ‘‘అనుమతించడానికి’’ ముందు బ్లాక్ మెయిల్ చేసి, నిరసన తర్వాత అనుమతించటం జరు గుతుందా? అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? కర్ణీ సేన ఒక సినిమాకు ప్రచారం లభించేట్టు చేయడం కోసం సంకేతాత్మక నిరసన తెలిపి, నెలరోజులపాటూ రక్షణను కల్పించడానికి అంగీకరించడాన్ని ఇండియా టుడే ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టింది. దాన్ని మీడియా విస్మరించింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆదర్శ ఓటరు అంతరంగం
భావజాలం నేడు అవకాశవాదానికి ముసుగ్గా ఉంటోంది. వ్యక్తిగత ప్రయోజ నాల కారణంగా వ్యక్తులు ఒక పక్షాన్ని వీడి, మరో పక్షాన చేరిపోవడం స్పష్టం గానే కనిపిస్తుంది. పార్టీ ఆశయాలకంటే గెలుపే ఎక్కువగా లెక్కలోకి వస్తోంది. శతాధిక వృద్ధుడు శ్యామ్ శరణ్ నేగీ నిజంగానే అద్భు తమైన వ్యక్తి. ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చేలా ఉత్తే జితులను చేయడం కోసం ఎన్నికల కమిషన్ ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడంలో ఆశ్చర్య మేమీ లేదు. హిమాచల్‌ప్రదేశ్ వాసి నేగీ స్వాంతంత్య్రానంతరం జరిగిన తొలి సార్వ త్రిక ఎన్నికల్లో ఓటు చేసిన ఏకైక వ్యక్తేమీ కాడు. కానీ అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ తప్పని సరిగా ఓటు చేస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటు చేయడానికి వచ్చినçపుడు ఆయనకు ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతం పలికారు. వృద్ధుడు, దుర్బ లుడైన ఆయనను కల్పా పోలింగ్ స్టేషన్‌కు తీసుకు రావడానికి రవాణా సదుపాయాన్ని కూడా కల్పిం చారు. మరెవరైనా, అంటే ఏ అభ్యర్థో లేదా పార్టీనో ఇలా ఓటర్ను పోలింగ్ బూత్‌కు తరలించడం నిషిద్ధం. అది, ఓటర్లను ప్రలోభపెట్టడం అవుతుంది. కానీ, ఓటు విలువపై నేగీ ఉంచిన నమ్మకాన్ని గౌరవించాలని ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాటు చేసింది. సగటు పోలింగ్ రేటు 65 శాతాన్ని దాటడం కష్ట మయ్యే మన దేశంలో ఇతరులకు ఆదర్శంగా నేగీ నిలు స్తారు. ప్రత్యేకించి, ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొన డానికి బదులు, పడక కుర్చీ విమర్శకులుగానే ఉండి పోయే పట్టణ మధ్యతరగతి వారిలోని చాలా మంది ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. దేశ భవి తను నిర్ణయించడంలో తన ఓటు నిర్ణయాత్మకమైనది కావ చ్చునని ఓటరు అర్థం చేసుకోవాలి. ఓటరుగా తన పౌర ధర్మాన్ని పాటించాలనేదానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టుబడి ఉండటం మాత్రమే కాదు, ‘‘రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి’’ అని ఆయన గుర్తించారు. అయితే, ఆ విషయాన్ని ఆయన అంతకంటే వివరించలేదని ఓ మరాఠీ వార్తాపత్రికలో చదివాను. అయినా, ఆయన వ్యాఖ్యను నేను బెదిరింపులు, బుజ్జగింపుల రాజకీయాల్లోకి దేశం జారిపోయినట్టు కనిపించడంపై చేసినదని వ్యాఖ్యానిస్తాను. అభ్యర్థిని ఎంచుకోవడానికి తనకున్న హక్కును ఉపయోగించు కోవడానికి ఓటర్లు ఎంత దృఢంగా కట్టుబడినాగానీ, ఎంచుకోవడానికి వారి ముందు ఉండే అభ్యర్థుల జాబితా ఏమంత ఆకర్షణీయమైనదిగా ఉండటం లేద నేది ఆయన వ్యాఖ్యకు అర్థమని అనుకుంటాను. దేశం కంటే కుటుంబాన్నే ముందుంచడం, నియోజకవర్గాల్లో వంశపారంపర్య రాజకీయ వారసత్వాన్ని పెంపొందిం పజేయడం నేడు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ధోరణి. బహుశా అది ఆ వృద్ధునికి చికాకు కలిగించిందేమో. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయ పార్టీలపై వంశపారంపర్య ఆధిపత్యపు నమూనా నుంచే నియోజకవర్గాల్లో అవినీతి, వంశపారంపర్య ఆధి పత్యాలు కూడా పుట్టుకొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబం, ములాయంసింగ్, లాలూప్రసాద్ యాద వ్ల కుటుంబాలు, పవార్ కుటుంబీకులు వగైరాలు ఉన్నత స్థాయిలవి. ఆ స్థాయిలలోనే ఇది జరుగు తుంటే, నియోజకవర్గం స్థాయిలోని అంతకంటే అతి చిన్న నేతలు కూడా ఇది సరైనదేనని అనుకుంటారు. వాస్తవంగానూ, వ్యక్తిగతంగానూ అది వారికి ఉపయో గకరమైనది. మరి అలాంటప్పుడు ఓటరు ఎందుకు ఓటు వేయాలి? కారణాలు చెప్పాలంటే బారెడంత జాబితా ఉంది. వాటిలో కొన్ని ఇవి: హక్కుగా ప్రభుత్వం చేయాల్సిన పనిని అధికార యంత్రాంగపు కాలయా పన, లంచాల డిమాండ్లు లేకుండానే ఓటరుకు రాజ కీయవేత్త చేయించి పెడతాడు. తద్వారా ఓటరుకు వ్యక్తిగతంగా లబ్ధి కలుగుతుంది కాబట్టి ఓటు వేయొచ్చు. లేదంటే సదరు నేత ఓటరుకు ఏదైనా చట్టవిరుద్ధమైన పనిని చేసి పెట్టవచ్చు, అందుకు కృతజ్ఞతగా ఓటు వేయాలి. లేకపోతే ఆ రాజకీయవేత్త ఆగ్రహాన్ని చవి చూడాలి. లేదా, నిబంధనల ప్రకారం సరైన పనిని చేయడం కంటే గుట్టుచప్పుడు కాకుండా హాని చేయగలిగిన శక్తివంతుడైన రాజకీయవేత్త దృష్టి లో మంచి అనిపించుకోవడం కోసమే కావచ్చు. ఎప్పుడు ఏ విధివశాన ఓటరు, రేపటి ఎన్నికల పోరాట యోధుడిని ఆశ్రయించక తప్పని పరిస్థితి సంభవిస్తుందో ఎవరికి తెలుసు. వారి దృష్టిలో బుద్ధి మంతుల్లా ఉండటం ఉపయోగకరం. అంతకంటే విస్తృ తమైనదైన భావజాలం, అభ్యర్థుల ఎంపికలో నిర్ణయా త్మకంగా ఉండే అవకాశాలు చాలా సందర్భాల్లో అతి స్వల్పం. నిజానికి భావజాలం నేడు అవకాశవాదానికి ముసుగుగా ఉంటోంది. వ్యక్తిగత ప్రయోజనాల కార ణంగా వ్యక్తులు ఒక పక్షాన్ని వీడి, మరో పక్షాన చేరిపోవడం స్పష్టంగానే కనిపిస్తుంది. పార్టీ ఏ ఆశ యాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబు తోందో, వాటికంటే గెలుపే ఎక్కువగా లెక్కలోకి వస్తోంది. ఒక భావజాలానికి నిన్నటి ప్రత్యర్థి, సరిగ్గా అందుకు విరుద్ధమైన భావజాలానికి నేడు కొత్త అనుయాయిగా మారుతున్నాడు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆకాశ హర్మ్యాల దిగువన...
విశ్లేషణ ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్లో భాగమైన శివారు ప్రాంతాలు కూడా నివాసగమ్యంగా లేవు. భౌగోళికంగా, జనాభా పరంగా ముంబైని రెండురకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఒకటి నియతమైనది, సభ్యమైనది. రెండోది మురికివాడలకు సంబంధిం చినది. ఇలాంటి విభజనకు తగిన కారణాలున్నాయి. దాదాపు నగరంలోని సగం జనాభా మురికివాడల్లోనే నివసిస్తోంది. మురికివాడల్లో నివసించనివారి మధ్యన మురికివాడల్లో ఉంటున్నవారు ఎల్లప్పుడూ ‘వారు’ గానే ఉండిపోతారు. ముందుభాగంలో పూర్తిగా అద్దాలు పరిచిన భవంతులు నగర ప్రాంతంలోని ఆకాశంలోకి ఎగబాకి ఉంటాయి. అయితే మురికివాడలు అంటే తప్పకుండా భూమికి ఆనుకుని ఉంటాయని భావించనవసరం లేదు. ఇవి చాలావరకు రెండు అంతస్తులతో కూడి ఉంటాయి. కానీ ఇవి పెద్దగా కనిపించవు. వాస్తవానికి ఇవి తమతమ స్థానాల్లో తాము ఉంటున్నప్పటికీ పరస్పరం కలిసిపోయి ఉంటాయి. అయినప్పటికీ ఈ స్థితి ‘వారిని’ ‘మనంగా’ మార్చడం లేదు. నగరం జనసమ్మర్దంతో కిటకిటలాడుతూ ఉండటానికి మురికివాడల జనాభానే తప్పుపడుతుంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నగరంలోని మురికివాడలన్నీ కలిసి నగర భూభాగంలో పదిశాతం కంటే తక్కువ స్థానంలో ఏర్పడి ఉన్నాయి. ఇంత తక్కువ స్థలంలో ఇంత జనాభా కిక్కిరిసి ఉంది కాబట్టే మురికివాడలు కిటకిటలాడుతుంటాయి. ప్రతి 100 లేదా 125 చదరపు అడుగుల్లో ఐదుగురు నివసిస్తుంటారు. ధారవి ప్రాంతంలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, స్థానిక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఈ మురికివాడలు కనిపిస్తాయి. ఇక కొత్త ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడటం అసాధ్యం. పైగా సాధారణ గృహనిర్మాణ రంగం బహుళ అంతస్తుల రూపంలో కొత్త వర్గీకరణ విధానాన్ని రంగంలోకి తీసుకువచ్చింది. నేలను ఆనుకుని ఉండే మురికివాడలు ఇటుక గోడలు, తగరపు రేకుల పైకప్పులతో ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే ఇళ్లు మూడు వరుసలతో ఉంటాయి. ఇవి కూడా దాదాపుగా తగరపు పైకప్పుతోనే ఉంటాయి. ఇవి నేలకు ఆనుకుని ఉన్న ఇళ్ల మధ్యలో పైకి సాగి వచ్చినట్లుంటాయి. ఇటీవలే కూల్చివేతకు గురైన బాంద్రా సమీపం లోని మురికివాడలు పూర్తిగా నిలువుగా ఉండి నాలుగు అంతస్తులతో కూడి ఉండేవి. పురపాలక చట్టాలు మురికివాడల్లో నివాసాలకు 14 అడుగుల ఎత్తువరకు అనుమతించాయి కాబట్టి ఈ పరిధిలోనే ఉండే కుటుంబాలు కొంతమేరకు మరింత సౌకర్యంగా ఉంటాయి. దీంతో పై అంతస్తులో ఉన్న ఇళ్లను అద్దెకు ఇస్తుంటారు. ఇది అటు కిరాయి మార్కెట్‌కు, ఇటు మురికివాడల్లో స్థలం కొరత కొనసాగింపునకు సంకేతంగా నిలుస్తోంది. నివాసాల ఎత్తును 20 అడుగుల వరకు అనుమతించడానికి చేసిన ప్రతిపాదన దశాబ్ద కాలంగా నలుగుతూనే ఉంది. బాంద్రాలో జరిగిన విధ్వంసం వంటిది చోటు చేసుకున్నప్పుడే మురికివాడల గురించిన చైతన్యం ఆకస్మికంగా ఏర్పడుతూ ఉంటుంది. గృహరుణాలు అందుబాటులో ఉన్నా, మధ్యతరగతి ప్రజలకు కూడా గృహనిర్మాణం భారీ ఖర్చుతో కూడి ఉంటున్నందునే మురికివాడలు ఉనికిలో ఉన్నాయని మర్చిపోతుం టారు. ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్లో భాగంగా చేసిన సుదూరంలోని శివారు ప్రాంతాలు కూడా నివాసానికి అనుకూలమైన గమ్యంగా ఆకర్షించడం లేదు. ముంబై మురికివాడల గురించి ముఖం చిట్లించుకునేవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారనే చెప్పాలి. మురికివాడలను తీసేయండి. అప్పుడు సబర్బన్ రైళ్లకు అంతరాయం కలి గితే ఎలా ఉంటుందో అలా ముంబై నగరం స్తంభించిపోయిన మజిలీలాగా మారిపోతుంది. మీ డ్రైవర్, మీ పనిమనిషి, మీ క్యాబ్ డ్రైవర్, మీ ఆటోరిక్షావాలా, షాప్ అటెండెంట్లు, చిరువ్యాపారులు మొదలైన వారందరూ ఈ మురికివాడల నుంచే వస్తుంటారు. మురికివాడలు అసభ్యకరంగానే కనిపిస్తాయి. అవును. అవి చూసేవారి కళ్లకు పుండులాగే కనిపిస్తాయి. కానీ కోటిమంది జనాభాలో సగం మందికి అవి నివాసప్రాంతాలుగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1996లో మురికివాడల పునరావాస పథకాన్ని ప్రారంభించారు. ఉచిత భవంతులలో వారికి ఇళ్లను కట్టివ్వడం, దీనికోసం ఫ్రీ మార్కెట్లో అమ్ముకునేందుకు గృహనిర్మాతలకు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి అనుమతించడం ఈ పథకం ఉద్దేశం. అయితే వేలాది పునరావాస ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఎందుకంటే భవననిర్మాతలు ఈ ప్రాజెక్టులకు అనుమతి మాత్రమే పొంది, వాటిని సొంతం చేసుకుంటారు. తర్వాతెప్పుడో లాభం పొందేందుకు దాన్ని అలాగే వదిలేస్తారు. ఉన్నట్లుండి రాజకీయనేతలు చొరబడతారు, భవన నిర్మాతలతో కుమ్మక్కవుతారు. మరోవైపు ముంబై మురికివాడలు నిలువుగా పైకి పెరుగుతుంటాయి. ఎవరికీ ప్రయోజనం లభించదు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
హాకర్ల సమస్య పరిష్కారం?
విశ్లేషణ అధికారులు పూనుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచగలరు. హఠాత్తుగా వీధి వ్యాపారులు మటుమాయం కావడమే అందుకు నిదర్శనం. కానీ, వీధి వ్యాపా రుల విధానాన్ని తేలేకపోతే వారి జీవనోపాధి హక్కుకు భంగం కలుగుతుంది. రెండు ఘటనలు, ముంబై ప్రాంత స్థానిక రైల్వే స్టేషన్ల లోకి ప్రయాణికుల రాకపో కలు, స్టేషన్ లోపలి కదలికలు స్వేచ్ఛగా సాగడానికి ఉన్న అడ్డంకులను తొలగించాయి. ఒకటి, ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాట. మరొ కటి, స్టేషన్ల బయటా లోపలా ఉండే వీధి వర్తకులు (హాకర్స్) 15 రోజులలోగా ఖాళీ చేయాలని రాజ్ ఠాక్రే జారీ చేసిన హెచ్చరిక. అలా చేయక పోతే, పరిణామాలు హింసా త్మకంగా ఉండగలవని ఆయన సంకేతించారు కూడా. వీధి వ్యాపారులతో తలెత్తున్న ఈ సమస్య పట్ల అధి కారులు ఎప్పటికప్పుడు అలసత్వం చూపుతూ వస్తు న్నారు. ఒక సందర్భంలోనైతే ప్రజలు వారిని ఆదరించ రాదని కోరుతూ, ఆ బాధ్యతను వారి మీదకే నెట్టేశారు. ఎంత గట్టి చర్యలను చేపట్టినా వీధి వ్యాపారులు మొండి కేస్తున్నారని తరుచుగా అధికారులు చెబుతుండేవారు. కాబట్టి ప్రజలు తమను తామే తప్పు పట్టుకోవాలని అర్థం. వీధి వ్యాపారులు మొండివారు నిజమే, కానీ అధి కారులు పట్టుదలతో ప్రయత్నించారనడం మాత్రం నిజం కాదు. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సమితి కొంత కాలంగా పలుకుబడిని కోల్పోతోంది. దాని క్యాడర్ పునాది బలహీనపడింది. పని ప్రదేశాలకు సురక్షి తంగా Ðð ళ్లి రావడం అనే సమస్య సరిగ్గా సమయానికి వారి చేతికి అందివచ్చింది. రాజ్, రైల్వే కార్యాలయాలను సందర్శించి వచ్చి ‘‘15 రోజుల్లోగా వీధి వ్యాపారులను తొలగించకపోతే మా తదుపరి మోర్చా శాంతియుతంగా జరగకపోవచ్చు’’ అని చెప్పారు. ఇది అందరి మనసు ల్లోని ఆందోళనను తాకింది. రాజ్ వ్యతిరేకించే బిహార్, యూపీ వారు సహా ప్రతి ప్రయాణికుడి హృదయాన్నీ ఆయన మీటారు. ఈ సమస్య అంత సార్వత్రికమైనది మరి. ఇది, తెలివి ఉన్నా చాకచక్యంలేని ముంబై నగర నిర్వహణా వ్యవస్థలోని ఒక ముఖ్య బలహీనతకు సంబంధించినది. వీధివర్తకుల సంఖ్య ఎంతో కూడా తెలియని నగర పాలక సంస్థల నిర్వహణకు సంబంధించిన ఈ బలహీనత... విధానాలు సహా అన్ని స్థాయిలలో వీధి వర్తకులతో వ్యవహరించే అందరిలోనూ ఉంది. అయితే, ఈ కాలమ్‌లో రాజ్ ఠాక్రేపై కంటే ఎక్కు వగా వీధి వర్తకులపైనే దృష్టిని కేంద్రీకరిద్దాం. సమస్యా త్మకమైన ముంబై నగర జీవితంలో వారు ఒక భాగం. అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ పుట్టుకొచ్చేసి వీధి వర్తకులు స్టేషన్లకు వెళ్లివచ్చే దారులను, కాలినడక వంతెనలను, వీధి పక్క పాదచారుల బాటలను ఆక్రమిం చేస్తుంటారు. ప్రయాణికులు వారి సమస్యగురించి చికాకు పడుతూనే వారిని ఆదరిస్తుంటారు. అందుబాటులోని దుకాణాలుగా వ్యవహరిస్తూ వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో భాగమై పోయారు. వలస వచ్చినవారికి, ఇటీవలి కాలంలో స్థానికులకు సైతం అది తేలికగా, త్వరితగతిన సంపాదించుకోగలిగిన జీవనోపాధి కావడమే అందుకు కారణం. నగర ప్రాంత స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు బహుశా వీరికి సంబంధించిన గణాంకాలను లెక్కలోకి తీసుకుని ఉండరు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్ ధరల మూలంగా చిన్న ఇంటి దుకాణం పెట్టుకోవడం కూడా అసాధ్యంగా మారింది. ఇది కూడా వారి ఉనికికి కారణం. పార్లమెంటు, వీధి వ్యాపారంపై చట్టపరమైన నిబం ధనలను, రూపొందించింది. వీధి వ్యాపారుల జీవనో పాధి హక్కుకు రక్షణను కల్పించే తీర్పును సుప్రీం కోర్టు 2014లోనే ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వీధి వ్యాపార విధానాన్ని ఇంతవరకు రూపొందించనే లేదు. వారు చెల్లించే రూ. 2,000 కోట్ల విలువైన ముడుపులే ఇందుకు కారణమని, కనీసం ఒక వీధి వ్యాపారుల ట్రేడ్ యూనియన్ చెప్పింది. ఆ సంఖ్య బహుశా ఎక్కువగా చేసి చెప్పనది కావచ్చు. కానీ, వీధి వ్యాపారులతో వ్యవహరించే శాఖకు చెందిన ఉద్యోగులు ఉంటారు కాబట్టి స్వార్థ ప్రయో జనం ఉన్నది నిజమే. వీధి దుకాణదారులను తొలగిం చాక, వారు జరిమానా చెల్లించేసి తిరిగి వస్తారు, జరిమా నాల పెంపుదల వారిని నిరోధించేదిగా ఏం పని చేయక పోగా, లంచాల మొత్తంలో పెరుగుదలకు కారణమౌ తుంది. ముంబై నగర జనాభాను బట్టి చూస్తే చట్టప్రకా రమే మూడు లక్షల మంది వీధి వ్యాపారులను వారి వృత్తులను కొనసాగించుకోడానికి అనుమతించవచ్చు. రహదారుల పక్క కాలిబాటలకు, రోడ్లపై పయ నించే వారికి కనీసమైన అటంకం మాత్రమే కలిగించే విధంగా వారిని వేరే చోట్లకు తరలించడంతోపాటూ, వారి ప్రయోజనాలను కూడా కాపాడటం సులువేమీ కాదు. ప్రధాన రహదారులకు దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతాల నివాసులు వారిని ఆహ్వానించరు. వీధివ్యాపారులూ అలాంటి చోట్లకు వెళ్లాలని కోరుకోరు. వీధి వ్యాపారాలు చేస్తున్నామని చెప్పే వారిలో చాలా మంది ఇంత జాగా సంపాదించుకోవాలనుకునే నకిలీ వ్యాపారులని ఒక సర్వేలో తేలింది. అధికార యంత్రాం గం నివారించగలిగిన తలనొప్పులే ఇవన్నీ. ప్రస్తుతానికే అయినా రైల్వే స్టేషన్ల లోపల, చుట్టూతా ఉండే వీధి వర్తకులంతా రాత్రికి రాత్రే ఒక్కరూ కనబడకుండా మటుమాయం కావడం అనే ఘటన.. అధికారులు కోరుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచ గలరనే భరోసాను మనకు తిరిగి కల్పించాలి. అయితే, వీధి వ్యాపారుల విధానాన్ని రూపొందించడంలో అన వసర జాప్యం చేయడం వల్ల నగర జనాభాలోని గణ నీయమైన భాగపు జీవనోపాధి హక్కుకు భంగం కలి గించినట్టు అవుతుంది. కావాలంటే ఆ చట్టాన్ని ప్రశ్నించ వచ్చుగానీ, అలాంటి చట్టం ఉన్నదని విస్మరించలేం. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆలోచించి ‘ఫార్వార్డ్’ చేయండి!
విశ్లేషణ ‘‘విచక్షణాశక్తిని అతి తక్కువకు కుదించడంగా సోషల్ మీడియా మారిపోయింది. మా దేశంలో విచక్షణా శక్తి మరీ అధ్వానమైనంత తక్కువగా ఉంది’’ అన్నాడు ఒక మిత్రుడు. చివరకు ఎవరైనా అదే నిర్ధారణకు వస్తారు. ముంబై వాసులు దిటవు గుండెల వారు. ఎలాంటి ఇబ్బందినైనా త్వరితగతిన అధిగమించగలుగుతారు. 1993 నాటి మతకల్లోలాలను, ఆ తదుపరి సంభవించిన ముంబై వరుస బాంబు దాడు లను, చివరికి 2005 నాటి కుంభవృష్టి సృష్టించిన ఉప ద్రవాన్ని కూడా వారు తట్టుకోగలిగారు. అయితే, ఆనాటి కుంభవృష్టి మాత్రం వారి మనస్సుల్లో సజీవంగా నిలి చిపోయింది. భారీ వర్షాలు పడ్డప్పుడల్లా వారు ఆందో ళనకు గురవుతుంటారు. ఆగస్టు 29న కూడా అదే జరి గింది. నగరం తిరిగి కోలుకుని యథాత«థ స్థితికి చేరింది. ఆ రోజున ఒక డాక్టర్ మూతలేని ఓ మ్యాన్‌హోల్‌లో పడి, కొట్టుకుపోయిన ఘటనకు కారణాలను నగర ప్రభు త్వానికి, కోర్టులకు వదిలేశారు. సెప్టెంబర్ 20న ఆ ప్రాంతంలో మరోమారు గాలివానలు కురిసినప్పుడు అనవసరమైన భయం వ్యాపించింది. ఆ భయానికి కారణం సామాజిక మాధ్యమాలు. ఆ రోజున మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు తుఫాను కేంద్రం ముంబైను తాకుతుందనే ఒక సందేశం సోషల్ మీడి యాలో చక్కర్లు కొట్టడంతో ఆందోళన తారస్థాయికి చేరింది. కార్యాలయాలన్నీ ఖాళీ అయిపో యాయి. భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ముందే మూసే శారు. కానీ, ఆగస్టులో విద్యామంత్రి పంపిన ట్వీటర్ సందేశాన్ని ఎవరో కొందరు సెప్టెంబర్ 20న తిరిగి ట్వీట్ చేశారు. అసలు తుపాను ఏర్పడే పరి స్థితులు పెంపొందుతున్నాయనే ప్రకటనే వెలువడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందే శాలు ఉద్దేశపూర్వకంగా చేసిన తుంటరి పనుల కోవకు చెందుతాయి. తుపాను పరిస్థితులు నిజం గానే పెంపొందడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టింది. దాని కదలికలను చక్కగా గుర్తించగలిగారు. కాబట్టి అది హఠాత్తుగా ప్రజలపైకి వచ్చి పడలేదు. అంతకు ఒక వారం ముందు, ఆహారం, నీళ్లు, పాలు, మందులు తదితరాలను నిల్వ చేసుకోమని ప్రజలు కోరుతూ మరో సందేశం చక్కర్లు కొట్టింది. అది కూడా ఒక్క కుదుపు కుదిపేసింది. తుపాను హెచ్చరిక ఏదీ జారీ చేయలేదనే వివరణతో మునిసిపల్ కార్పొ రేషన్, పోలీçసులు ప్రకటించారు. కానీ, ముంబై వాసులు తాము దేన్ని నమ్మదలుచుకునారో దాన్నే... ఎక్కడ నుంచి వచ్చిందో తెలియని ఓ వాట్సాప్ సందేశాన్ని నమ్మారు. ఎందుకైనా మంచిదని ప్రజలు జాగ్రత్త వహిం చారని దీని గురించి అనుకోవచ్చు. కానీ ఇది రెండు కీలక అంశాలను సూచిస్తోంది. ఒకటి, క్షీణిస్తున్న మీడియా విశ్వసనీయత. టీఆర్పీ రేటింగ్‌ల కోసం దేనినైనా సరే సంచలనాత్మకం చేయా లని కొత్త వార్తా చానళ్లు పడే ఆరాటం దీనికి కారణం. రెండు, ఏ ప్రయోజనాలనూ ఆశించని వారు ఇతరులకు సహాయం చేయాలనే కోరికతో పంపినది కాబట్టి సోషల్ మీడియా సందేశం నమ్మదగినదనే విశ్వాసం. బూటకపు వార్తల ప్రచారానికి ఎక్కువగా వాడేది సోషల్ మీడి యానే. కాగా, సంప్రదాయక మీడియాను బూటకపు వార్తలను వ్యాపింపజేసిదిగా చూస్తున్నారు. వాతావరణ సంస్థ కార్యాలయం వారి చిత్రాల సహాయంతో నేను ఈ తుపాను పుకార్లను అదే సామా జిక మధ్యమాన్ని వేదికగా చేసుకుని ఎదుర్కొన్నాను. ‘సామాజిక మాధ్యమాల’కు వంచించగల సామర్థ్యం ఉన్నదనడం ఎక్కువ మందినేం చికాకు పెట్టలేదు. సామాజిక మాధ్యమాలను వాడుకుని నిరాధారంగా అబ ద్ధాలను, అతిశయోక్తులనూ చెబుతూ ప్రత్యర్థులపైన ఎలా అప్రతిష్టపాలు చేశారో కొందరు గుర్తు చేశారు. ఇది ‘సామాజికమైనది’ కాదు, ‘అసామాజికమైనది’ అనేది చికాకు పడ్డవారందరి సాధారణాభిప్రాయం. వాటిని ఉపయోగిస్తున్నది అందుకోసమేనని వారి వాదన. సరిచూసుకోలేని సమాచారం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుండగా, తాము సమకూర్చుకునే సమాచారం విశ్వసనీయతను రూఢిచేసుకునే ఏర్పాట్లున్నాయని ఆశిం చగల వ్యవస్థాగత మీడియా ఇప్పడు అనుమానాస్పదమై నదిగా మారింది. ‘‘మీరు నా పై ఆరోపణ చేస్తారా? మీరు అదే చేశారుగా, మీరు చెయ్యలేదూ?’’ అనే ఇలాంటి కుతర్కపు చర్చలు సైతం ఇతర వేదికలపై సాగుతున్నాయి. ఈ కపట తర్కం, ముఖ్యమైన సమస్యలను విస్మరించి సమాజానికి అపారమైన నష్టాన్ని కలు గజేస్తుంది. ఊరి బావి వద్ద ఊసుపోత కబుర్లు తక్కువ హానికరం. అవి ప్రచారమయ్యే క్రమంలో మరిన్ని మసాలాలను పులు ముకునే క్రమంలో అతిశయోక్తులకు దారి తీస్తాయి. ఇదొక ముఖ్యాంశమే. కానీ దాని భౌగోళిక ప్రాంతం తక్కువ. మెరుపు వేగంతో సామాజిక మాధ్యమాలు సరిహద్దు లను దాటుతాయి. వార్తా పత్రికలు, టీవీల వార్తలపై ఆధారపడేవారు ‘‘ఇది వాట్సాప్‌లో వచ్చింది. టీవీలో ఎందుకురాలేదు?’’ అని అడుగుతారు. ఇటీవలే హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక మిత్రుడు ‘‘చిట్టచివరకు ఒక భీకర శక్తి వేళ్లూనుకుంది. అది నిజం గానే భయం పుట్టించేది’’ అన్నాడు. మరో మిత్రుడు ‘‘విచక్షణాశక్తిని అతి తక్కువకు కుదించడంగా సోషల్ మీడియా మారిపోయింది. మా దేశంలో విచక్షణా శక్తి మరీ అధ్వానమైనంత తక్కువగా ఉంది’’ అన్నాడు. చివ రకు ఎవరైనా అదే నిర్ధారణకు వస్తారు. సందేహాస్ప దమైన సందేశాలను ఎలాంటి ఆలోచనాలేకుండా ఫార్వార్డ్ చేయడాన్ని పక్కన పెడితే... సోషల్ మీడియా వల్ల ముఖ్యమైన, సహాయకరమైన ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. కాకపోతే, వాటిలో సభ్యులుగా చేరే వారు ‘ఫార్వార్డ్’ కీ నొక్కడానికి ముందు ఒకటికి రెండుసార్లు తీవ్రంగా ఆలోచించాలి. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
అక్కడ జీవితమే ఒక సర్దుబాటు
విశ్లేషణ జనంతో నిండి ఉండే కోచ్‌లలో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు శరీరాలు నొక్కుకుంటూ, తోసుకుంటూ చేయవలసిన దుర్భర ప్రయాణపు అనుభవం ముంబై ప్రజల ప్రధాన లక్షణం. వీరికి మరో ప్రత్యామ్నాయం లేదు కూడా. ప్రజలు తమ నగరాలకు ఒక గుణశీలతను కల్పిస్తూ వాటిని తీర్చిదిద్దుతారా లేక నగరాలు తమ నివాస ప్రజల ‘ప్రవర్తన’ను తీర్చిదిద్దుతాయా? ఒకటి మరొకదాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ ముంబైలో మాత్రం అవినీ తిపరులైన శక్తులు బలవంతంగా తమపై రుద్దుతున్న పథకాలకు సంబంధించి ప్రజలకు ఎంచుకునే అవకాశాలు చాలా తక్కువ. నగర ప్రజలు ఎలా సర్దుకుపోవాలో నేర్చుకుంటారు. ప్రత్యేకించి ముంబై బతకడానికే తప్ప నివసించడానికి తగిన అవకాశం కాదు. రాజకీయనేతలు, అవినీతిపరులైన అధికార వర్గం ద్వారా ఏర్పడుతున్న మానవ నిర్మిత సంక్షోభాన్ని చాలావరకు నగర ప్రజలు సహించాల్సి ఉంటుందనే దీనర్థం. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నత్తనడక నడుస్తూ కాల వ్యవధిని పాటిం చని బస్సుల కోసం ముంబై ప్రజలు బస్టాండులలో క్యూ కట్టరు. అదేసమయంలో నిత్యం తోసుకుంటూ పెనుగులాడుతూ ప్రయాణించవలసిన రైలు ప్రయాణాన్నే వీరు ఎంచుకోవలసి ఉంటుంది. ముంబైలో ఏ స్థానిక రైలులో అయినా ప్రవేశిం చేటప్పుడు తోసుకోవడం, పెనుగులాడటం చాలా సాధారణమైన అనుభవం. రైలులో ఉన్నవారు దిగటం కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. ఎందుకంటే కొత్త వారు బోగీలో ప్రవేశించడానికి అది కొంత స్థలాన్ని కల్పిస్తుంది మరి. ఈ మొత్తం క్రమం 20 సెకన్లలోపే ముగుస్తుంది. పెద్ద స్టేషన్లలో మాత్రం రైళ్లు కాస్త ఎక్కువసేపు అంటే 30 నుంచి 45 సెకన్లవరకు నిలుస్తాయి. అంటే ప్లాట్‌ఫామ్‌ల మీద ఉన్న ప్రయాణికులకు సెకను సమయం కూడా చాలా విలువైనదే. రెప్పపాటు కాలంలో గుంపు కోచ్ నుంచి దిగుతూ, లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ప్రతి పనిదినాన కనీసం 80 లక్షలమంది ప్రయాణించే బృహత్ వ్యవస్థలో ప్రతి నిమిషం కనిపించే నియంత్రిత ఉపద్రవం అన్నమాట. ఆదివారాలు, సెలవుల్లో మాత్రమే ప్రయాణికుల సంఖ్య తగ్గుతుంటుంది. జనం రద్దీతో నిండిపోయే కోచ్‌లలో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు శరీరాలు నొక్కుకుంటూ, తోసుకుంటూ చేయవలసిన దుర్భర ప్రయాణపు అనుభవం ముంబై ప్రజల ప్రధాన లక్షణం. వీరికి మరో ప్రత్యామ్నాయం లేదు కూడా. ఒక చోట నివాసముంటూ మరొకచోటికి వెళ్లి పనిచేసి తిరిగి రావడం తప్పదు. పనే ముఖ్యం కాబట్టి దానికి సంబంధించినంతవరకు అన్ని రాజీలూ, సర్దుబాట్లూ క్రమంలోనే ఉంటాయి. ఇక రెండో తరగతి కోచ్‌లలో ముగ్గురు ప్రయాణించే సీటులో నాలుగో ప్రయాణికుడు కాస్త బతి మిలాడుకుని సీటులో కూర్చోవచ్చు. అయితే అతడు సగం సీటులోనే కూర్చోవాల్సి ఉంటుంది. కానీ నిలబడి చిత్రహింసలు అనుభవించే స్థితితో పోలిస్తే ఇది పెద్ద ఉపశమనమే. మొదటి తరగతి కోచ్‌లో ఇలాంటి సర్దుబాటుకు అవకాశమే ఉండదు. వీటిలో ప్రయాణించేవారు మురికివాడల మధ్య గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారే. నగరంలో తిరిగే రైళ్లను దక్షిణాన కొలాబా, ములంద్, దషిర్, ఉత్తరాన మంకుర్డ్ మధ్య మునిసిపల్ పరిధులకు పరిమితం కాని బృహన్ ముంబైకి సంబంధించిన అతి సూక్ష్మప్రపంచంగా చెప్పవచ్చు. మూడింట రెండు వంతుల మంది ముంబైలో నివసిస్తుండగా, మిగిలిన ఒకవంతు మంది మెట్రో ప్రాంతంలో నివసిస్తుంటారు. ఎనిమిది నగర కార్పొరేషన్లలో, 23 కౌన్సిల్స్‌లో మెట్రో ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాలన్నింటి వైఖరి ఒకటే. జనాభా పరిమాణం ప్రజలకు సంబంధించిన అనేక లక్షణాలను నిర్దేశిస్తూ ఉంటుందనడానికి బోలెడు సాక్ష్యాలు. వీటిలో కొన్ని వారిని నిత్యం బలీయంగా ప్రభావితం చేస్తుంటాయి. పెరుగుతున్న ధరలతో కుంగిపోతున్న చిన్నచిన్న అపార్ట్మెంట్లకే ఇది పరిమితం కాదు. జీవితం ఇక్కడ నిత్యం సర్దుబాట్లతోనే సాగుతుంది. మనుషులు నడిచే పై వంతెనలను ఉపయోగించేటప్పుడు కూడా ఈ తరహా సర్దుబాటు కనిపిస్తూనే ఉంటుంది. రైల్వే స్టేషన్లలో నడవాల్సిన మార్గం పట్ల అవగాహన లేని లేదా నగరానికి కొత్త అయిన ప్రయాణీకులు కుడివైపునే నడుస్తుంటారు. ప్రయాణీకులను సులువుగా దాటుకుంటూ పోవడానికి జనం ఎప్పుడూ ఎడమవైపే నడుస్తుంటారు. కానీ ఆ దారుల మధ్యే హాకర్లను అనుమతిస్తూ ప్రయాణ మార్గాన్ని అడ్డుకునే అధికారులను కూడా మీరు లెక్కించవచ్చు. కొంతమంది ప్రయాణికులు కాలుమీద కాలు వేసుకుని రైలులో ప్రయాణిస్తుంటారు. ఇలా కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం ప్రయాణికులకు కాస్త సౌకర్యాన్ని కల్పించవచ్చు కానీ, వేలాడుతున్న మోకాలు రైలు ఒకవైపునకు ఒరిగినప్పుడల్లా ఎదుటి సీటులో కూర్చున్న ప్రయాణికుడికి తగులుతూ ఉంటుంది. ఇవి ముంబైవాసుల రైలు మర్యాదల్లో భాగమే. రైళ్లలో సౌకర్యాలకు దూరమైన గుంపులు పెట్టే బాధలతో పాటు వ్యక్తులు కూడా ప్రయాణికులకు మరింత భారాన్ని జోడిస్తుంటారు. కానీ ఎవరూ ఇలాంటి స్థితిపట్ల ఫిర్యాదు చేయరు. ఇదే ముంబై స్ఫూర్తి పట్ల ఎప్పుడూ దురభిప్రాయం కలిగించే లక్షణం. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పరిశుద్ధ నగరం పగటి కలా?
విశ్లేషణ వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించిన కాలువలను చెత్తతో నింపేసి, అది నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు, అందుకు కారణమైన తమను తప్పుపట్టుకోకుండా నగర పాలన సంస్థ వైపు వేలెత్తి చూపుతుంటారు. బహిరంగ ప్రదేశాలను చెత్త చేస్తున్నందుకు 14 లక్షల మందిని హెచ్చరించి, 5 లక్షలకంటే ఎక్కువ మందికి జరిమానాలు విధించి ఒక్క ఏడాదిలోనే రూ. 8.27 కోట్లను జరిమానాలుగా వసూలు చేశారంటే... ఆ నగరం చెత్తకు పూర్తి అతీ తంగా కాకపోయినా, మరింత పరిశుభ్రమైనదిగా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దేశంలోనే అతి పెద్ద, సుసంపన్న పట్టణ ప్రాంతమైన ముంబై విషయంలో అలా జరగలేదు. నగర పరిశుభ్రతపై అన్ని హెచ్చరికలను జారీ చేశాక గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జరిమానాలు విధించడం మొదలెట్టాయి. నగర పాలక సంస్థ ఉద్యోగులు, ఔట్ సోర్స్డ్ ఉద్యోగులు యూనిఫారాలు ధరించి, రసీదు పుస్తకాలు పట్టుకుని నిర్లక్ష్యంగా నగరాన్ని చెత్త చేసే వారిపై కన్నేసి ఉంచుతున్నారు. ఆ నగర జనాభా 1.24 కోట్లు. పగటి వేళల్లో అంతకంటే గణనీయంగా ఎక్కువ జనాభాతో కిటకిటలాడిపోతుంటుంది. శివారు ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా జనం పని చేయడం కోసం నిత్యం ముంబైకి వస్తుంటారు. శివారు ప్రాంతాలు నిజానికి సొంత స్థానిక పరిపాలనా సంస్థలు గల ఇతర నగరాలే. నగర పాలక సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పథకాలలో ఎక్కడా కిక్కిరిసిన మురికివాడలు కానరావు. బ్రహ్మాండమైన ఈ నగరంలోని గొప్ప వైరుధ్యం ఇది. 300 మంది ఉపయోగించే ఒక్కో మరుగుదొడ్డి శుద్ధికి అతి కొద్దిగానే నీరు లభ్యం కావడం, చెత్త చెదారం వగైరాలను తరలించేవారు లేకపోవడం వంటివి ఈ మహా నగర పారిశుద్ధ్య సమస్యలకు అదనం. పారిశుద్ధ్య పరిరక్షకులు ఈ మురికివాడలను సందర్శించరు. జనం ఎక్కువగా తిరిగే స్టేషన్లలాంటి ప్రాంతాలకే వారు పరిమితమవుతారు. ప్రకాశవంతమైన, ఉజ్వలమైన ముంబై అనే భావనకు మురికివాడలు ఒక వైరుధ్యంగా నిలుస్తాయి. కార్యాలయాలుండే అద్దాల టవర్లు, నివాసాలుండే ఆకాÔ¶ హర్మ్యాలకు ఆనుకునే మురికివాడలుంటాయి. చెత్తకు నిలయంగా పేరు మోసిన నగరంలోని ఆ పది శాతం ప్రాంతంలోని మురికివాడలు నగర జనాభాలో సగానికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. నగర ప్రణాళికల నమూనాలలో ఎక్కడా వాటికి చోటుండదు. ముంబైని పరిశుభ్రమైన నగరమని అనలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది, మురికివాడల నుంచి చెత్తను తీసుకుపోవడం, అక్కడ నివసించేవారికి తాగునీటిని, దాదాపుగా పనికిరాకుండా ఉండే ఉమ్మడి మరుగుదొడ్లకు నీటిని అందించడానికి సంబంధించిన సమస్యలు నగర నిర్వాహకుల దృష్టికి సుదూరం నుంచైనా కానరావు. బిల్డర్ల దృష్టిలో మురికివాడలంటే అక్కడివారికి ప్రత్యామ్నాయ గృహవసతిని కల్పించి, బహిరంగ మార్కెట్ కోసం అదనపు నిర్మాణాలను నిర్మించి భారీ లాభాలతో జేబులు నింపుకునే రియల్ ఎస్టేట్ ఆస్తులు. అంతేగానీ జనావాసాలు మాత్రం కావు. దక్షిణ ముంబై, నగరంలోని అతి గొప్ప ప్రాంతం. వలస కాలం నాటి భవనాలు, వ్యాపార ప్రాంతాలు, సముద్ర తీరానికి అభిముఖంగా ఉండే ప్రాంతాలు, భారీ మైదానాలు అక్కడే ఉంటాయి. పారిశుద్ధ్య పరిరక్షకులు (క్లీన్ అప్ మార్షల్స్) విధుల్లో ఉన్నా అక్కడి బహిరంగ ప్రదేశాలు సైతం శుభ్రంగా ఉండవు. వీధిలో ఏమైనా పారేసినందుకు లేదా ఉమ్మినందుకు రూ. 200, మలమూత్ర విసర్జనకు రూ. 200, పెంపుడు కుక్క మలమూత్ర విసర్జన చేయడాన్ని అనుమతించినందుకు రూ. 500 జరిమానాలను విధిస్తున్నారు. సదరు పౌరులు వారితో వాదులాడినా చాలావరకు జరిమానాలను చెల్లిస్తున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, దుకాణాలను ఏర్పాటు చేసుకుని పాదచారులు వాటిని ఉపయోగించుకోనివ్వకుండా చేసే వీధుల్లోని చిన్నవ్యాపారులు ఇప్పుడు జాగ్రత్తగా తమ వ్యర్థాలను చెత్తబుట్టలో వేస్తున్నారు. కాబట్టి ఒకప్పటి కంటే నగరం ఇప్పుడు మరింత శుభ్రంగా ఉందని నగర పరిపాలనా విభాగం చెప్పుకోవచ్చు. కానీ అది, మొత్తంగా ఈ కథనంలోని ఒక భాగం మాత్రమే. ఇది నా ఇల్లు కాకపోతే చాలు, చెత్తా చెదారం పడేసి మురికిమయం చేయదగిన ప్రాంతమేననే ప్రజల వైఖరి ఈ కథనంలోని మరో భాగం. ఆసక్తికరంగా, ఈ జరిమానాల గురించిన అధికారిక గణాంక సమాచారంతో మీడియా నివేదిక వెలువడిన రోజునే మరో కథనం కూడా వెలువడింది. అది, నగరంలోని ప్రధానమైన కాలువలలో చెత్త పడేయడాన్ని నిరోధించడానికి వాటిపై పాలీకార్బనేట్ (దృఢమైన «థర్మో ప్లాస్టిక్) షీట్లను కప్పే పథకం గురించినది. ఈ కాలువలు నిజానికి వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించినవి. కానీ అవి అతి పెద్ద చెత్త పడేసే స్థలాలుగా మారాయి. కాలువల్లో చెత్త పేరుకుపోయి, నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు... అందుకు కారకులైన తమను తప్పుపట్టుకోకుండా నగర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతుంటారు. పౌరులు గొంతును శుభ్రపరచుకుని ఎక్కడబడితే అక్కడ ఊసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగానే పరిశుభ్రత కానరాదు. అలా ఊసేట ప్పుడు అది దారిన పోయేవారిపై పడకుండా ఉండటం అరుదు. ఇద్దరూ దీనికి ఎంతగా అలవాటు పడిపోయారంటే పాన్, తంబాకు నమిలేవారు ఆ పనిని... పారి శుద్ధ్య పరిరక్షకుల కంటపడితే తప్ప... సర్వసాధారణమనే భావిస్తుంటారు. పరిశుభ్రతను అలవాటుగా చేయడానికి బహుశా ఇప్పుడున్న దానికి వేల రెట్ల బలమైన భారీ బలగం అవసరం కావచ్చు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
సెంట్రల్ హాలుకు అవమానం?
విశ్లేషణ మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా? లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి దిగజారిపోతున్నాయా? రెండూ కావచ్చు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అర్ధరాత్రి ప్రారంభించడం.. 1947ని అవమానించేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. జవహర్లాల్ నెహ్రూ సుప్రసిద్ధమైన ప్రసం గం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ‘తో అధికార మార్పిడి జరిగిన సందర్భం అది. జీఎస్టీ ప్రారంభోత్సవ ఘటనను బహిష్కరిం చడం ‘సైద్ధాంతిక‘ పరమైనదని కాంగ్రెస్ చెప్పుకుంది. సెంట్రల్ హాల్ అనేది సంసద్ భవన్లో ఒక భాగం. ఇక్కడే లోక్‌సభ, రాజ్యసభ కూడా ఉన్నాయి. ఇక్కడినుంచి చర్చ, వాదన ద్వారా, ఏకాభిప్రాయం లేదా వోటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఉభయ సభలు సమావేశమైనప్పుడు సెంట్రల్ హాల్ నుంచే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. మన రాజ్యాంగాన్ని కూడా ఇక్కడే ఆమోదించారు. అందుచేత సెంట్రల్ హాల్ అలనాటి ఉజ్వల ఘటనలకు సంబంధించిన మ్యూజియం కాదు. పార్లమెంటరీ వ్యవహారాల నిర్వహణకు చెందిన కీలకమైన స్థలం. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఏ ముఖ్య నేతనయినా ఆహ్వానించినప్పుడు సెంట్రల్ హాల్లోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్ ఆనంద్ శర్మ ‘అవమానం’ అని మాట్లాడుతున్నారంటే దానిని జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ తరఫున చేసిన సానుకూల సమర్థనగానే చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటు పట్ల రాజకీయ వర్గం వైఖరిని పరి శీలించడానికి ఈ పరిణామం ఒక కారణాన్ని మనకు అందిస్తుంది. కాంగ్రెస్ కానీ, మరే ఇతర పార్టీ కాని సెంట్రల్ హాల్ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే సందర్భాల్లో దానిలో జరిగే కార్యక్రమాల పట్ల ఆ పార్టీల వైఖరి ఇలా ఉండదు. సెంట్రల్ హాల్ పట్ల గౌరవ ప్రదర్శన అనేది లోక్ సభ, రాజ్యసభల్లో వ్యవహారాలను నిర్వహిస్తున్న పార్టీల వైఖరి బట్టి ఉండకూడదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే పార్లమెంటేరియన్లను తీవ్రంగా మందలించారు. ‘‘మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. పార్లమెంటులో వ్యవహారాలను నిర్వహించడానికి మీరున్నారు.’’ పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయాలు కలిగించడం అమోదించదగినది కాదు. ఉభయ సభల్లో గలాభా కొనసాగడం వల్ల గంటల కొద్దీ అమూల్య సమయం వృథా కావడం కొనసాగుతోందని, ఇలా కొనసాగితే సెంట్రల్ హాల్లో ఆమోదం పొందిన రాజ్యాంగం సూచించినట్లుగా పార్లమెంటు ఉద్దేశమే ఓటమికి గురవుతుందనడానికి రాష్ట్రపతి వద్ద బోలెడు రుజువులున్నాయి కూడా. రాష్ట్రపతి ఆగ్రహాన్ని పౌరుల తీవ్ర వ్యాకులతతో సరిపోల్చవచ్చు. పార్లమెంటు కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చడం తప్ప ఎంపీలనుంచి మరేమీ ఆశించలేమని పౌరులు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారు. బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కపటధోరణితో వాదిస్తూ, విచ్ఛిన్నపర్చటం, అవరోధాలు కల్పించడం ప్రయోజనకరమైనవేననీ, పార్లమెంటు సజావుగా సాగిపోతే ప్రభుత్వం చర్చల ద్వారా తప్పించుకునే అవకాశముంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చని రాజకీయ పార్టీని చూడటం ఇప్పుడు చాలా కష్టం. కాబట్టి పార్లమెంటులో ఏ ప్రదేశానికైనా సరే అవమానం జరిగిందని ఏ రాజకీయ నేత అయినా మాట్లాడుతున్నాడంటే అది అబద్ధం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలను మృదువుగా సాగేటట్లు చేసి ఉంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలక సంకీర్ణ కూటమిని కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేస్తే అది నిజాయితీ ప్రదర్శించినట్లు లెక్క. చర్చకు, వాదనకు సంబంధించిన వేదికను నిత్య ప్రతి ష్టంభన వేదిక స్థాయికి కుదించకూడదు. పార్లమెంటు కార్యకలాపాలను పదే పదే విచ్ఛిన్నపర్చే అలవాటును కొనసాగిస్తూ సెంట్రల్ హాల్ గౌర వం గురించి పేర్కొనడం అసంబద్ధమైన విషయం. ఒకప్పుడు ప్రతిపక్షం వాకౌట్ చేయడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే పద్ధతిగా ఉండేదని అనిపిస్తుంది. సంఖ్యాబలం లేని ప్రతిపక్షం మెజారిటీ సాధిం చేందుకు ప్రయత్నిస్తుందనీ, విచ్ఛిన్నకర విధానాలతో వ్యవహరించేందుకు ప్రభుత్వానికి ఎప్పుడూ ఓ మార్గం ఉంటుందనుకోవడం తప్పుడు అవగాహన మాత్రమే. అత్యధిక భాగం నిరక్షరాస్యులుగా ఉన్న దేశ జనాభాచే ఎన్నికైన తొలి లోక్‌సభ ఉన్నట్లుండి పెద్దమనిషి తనంలోకి మారిపోయి పార్లమెంటు కార్యకలాపాల్లో ఒక గంట సమయం కూడా వృథాపర్చకుండా గడపటం సూచ్యార్థంగా కనబడుతుంది. ఆనాడు అలా జరిగిందంటే ఆనాటి నేతల నడవడికే కారణం. గత శీతాకాల సీజన్లో 16వ లోక్‌సభ సమయంలో 30 శాతం, రాజ్యసభ సమయంలో 35 శాతం కేవలం విచ్ఛిన్నకర చర్యలవల్లే వృథా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఉనికిలోకి వస్తున్న ప్రశ్న ఏదంటే, మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా మనం పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా అన్నదే. లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి తీవ్రంగా పతనమవుతున్నాయా? రెండూ కావచ్చు. కానీ రాజకీయ ప్రపంచపు ద్వంద్వత్వంలో రెండు విరుద్ధ రాజకీయాల మధ్య సహకారం అనేది చిట్టచివరి అంశంగా మారుతోంది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పేదింటికి అవమానపు ముద్ర
పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే. ఆవశ్యక ఆర్థిక వనరులు కొరవడితే ఎవరైనాగానీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది లేదా వచ్చే కొద్దిపాటి రాబడికి అల్పస్థాయి జీవన ప్రమాణాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మానవాభివృద్ధి సూచికను కొలిచే మూడు కొలబద్ధలలో ఒకటి, ఆదాయం. డబ్బు లేకపోయాక మిగతా రెండిటిని... ఆరోగ్యాన్ని, పాఠశాలల్లో నేర్చుకోగల జ్ఞానాన్ని పొందడం కష్టమౌతుంది. కాబట్టి పేదరికాన్ని అతి పెద్ద అసౌకర్యమని చెప్పుకోవచ్చు. కానీ అది దాన్ని తక్కువ చేసి చెప్పడం అవుతుంది. పేదలను ప్రభుత్వం కేవలం ఒక గణాంకంగా చూడటం ద్వారా వారికి సంబంధిం చిన మానవాంశను నిర్మూలించి, పుండుకు కారం రాసినట్టుగా అవమానిస్తుంటే.. అంతకంటే హీనమైనదిగా మారుతుంది. ‘పేద’ పేటెంటు కాదగిందే కావచ్చుగానీ, పేదలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం పేదలు తమ ఇంటి ముందు గోడలపై ప్రజా పంపిణీ వ్యవస్థ సహా వారు వేటికి అర్హులో సూచించే నోటీసులను రాయించుకునేలా చేసి అవమానించే చర్యలు చేపట్టింది. ఇది పూర్తిగా మతిలేని పని. దీంతో పేదలను వేలెత్తి చూపి, ఆదాయాల రీత్యాగాక, వారికి ఇంకా సొంతంగా మిగిలిన వాటిని కూడా హరించి వేయడం జరుగుతుంది. అందులో వారి వల్ల సమాజానికి ఉన్న ఉపయోగం ఒకటి. పేదలుగా గుర్తించేవారి ఆదాయ స్థాయి ఏమిటో గ్రామమంతటికీ తెలిసిందే. అయినా వారి ఇంటి గోడలపై దాన్ని రాయడం వెనుక ఉన్న ఉద్దేశం రికార్డులను నమోదు చేయడం కాదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీకి రేషన్ పొందేవారికి ఇప్పటికే రేషన్ కార్డులున్నాయి. వారి స్థానం ఏమిటో గుమాస్తాలు రిజిస్టర్లలో జాగ్రత్తగా నమోదు చేసి ఉంటారు. పరిపాలనాపరమైన ఈ పూర్తి వెర్రిబాగులతనానికి రాజస్థాన్ ప్రభుత్వం ఇంతవరకు సమంజసమైన వివరణను ఇవ్వలేదు. పేదలను సర్వే చేయడానికి వచ్చే ఇన్స్పెక్టర్ల దృష్టిని ఆకర్షించడం కోసం వారు తమ గోడలకు ఈ రంగు ముద్రలను వేయించుకోవాలనేట్టయితే.. అంతిమంగా అది అత్యాధునికమైన ఈ పంపిణీ వ్యవస్థలోని అధికారగణం నిజాయితీ గురించి చాలానే చెబుతుంది.ఇప్పటికే పీకల లోతు పేదరికంలో మునిగి ఉన్న పేదలు తమ ఇంటి గోడలకు ఈ రంగులు, రాతలు వేయించుకోగలరని ఆశించడం మరో మతిమాలిన పని. ఒకవేళ ప్రభుత్వమే అందుకు ఆర్థిక వనరులను సమకూరుస్తుండి ఉంటే, ఏదో ఒక స్థాయిలో డబ్బు చేసుకునే రాకెట్ ఏదో నడుస్తుండి ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇంటి గోడలపై పచ్చ రంగు మాసికలను వేసే ఈ కార్యక్రమాన్ని... బహుశా పైలట్ ప్రాజెక్టుగా కామోసు భిల్వారా జిల్లాలోని పేదల ఇళ్లకు పరిమితం చేశారు. దీనికి ముందే, ప్రభుత్వాధికారులకు సర్వసాధారణంగా మారిన ఈ తోలు మందపుతనం మధ్యప్రదేశ్‌లో కనిపించింది. పేదరికం నేరమన్నట్టుగా పేదలు ముద్రలు వేసుకోవడం అవసరమైంది. ఇలాంటి మూర్థత్వానికి హేతువు ఏమిటో మాత్రం అంతుబట్టడం లేదు. గొప్ప సంపన్నులను బహిరంగంగా వారి ఆదాయపు పన్ను రిటర్నులను బహిరంగపరచాలని కోరితే, అది వారి ప్రైవసీపై దాడి అంటూ తక్షణమే గగ్గోలు పుడుతుంది. బ్యాంకులకు భారీ మొత్తాల్లో ప్రజాధనాన్ని బకాయిపడ్డ వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం బ్యాంకు పరపతి క్రమాలను దెబ్బ తీస్తుందని రిజర్వ్ బ్యాంకు, సుప్రీం కోర్టుకు చెప్పింది. మొండి బకాయిదార్లయిన కార్పొరేట్ల పేర్లను వెల్లడించి, వారిని అవమానించడానికి అది తిరస్కరించింది. కార్పొరేట్లు అంతరాత్మగలిగిన మానవులు కారు. అయినా అవి ఎగవేతదార్లుగా సుప్రీంకోర్టు ముందు గుర్తింపును పొందడాన్ని ప్రజా వ్యవహారాలకు సంబంధించిన సమస్యగా భావించి పట్టించుకున్నాయి. కానీ రాజస్థాన్లోగానీ, మరెక్కడైనాగానీ పేదలు మనుషులు కాబట్టి, వారికి మనసులు ఉంటాయి. ఈ అంశాన్నే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పేదలైన కారణంగానే పేదలను అంత మొరటు పద్ధతిలో చులకన చేయవచ్చు అన్నట్టుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ప్రతి బడ్జెట్లోనూ కేటాయింపులను చేస్తుండటమే గాక, క్రమం తప్పకుండా కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తున్నాయి. కాబట్టి పేదలు ఎన్నడో లేకుండా పోయి ఉండాల్సింది. కానీ అవేవీ పని చేయకపోవడం వల్లనే పేదలు ఇంకా పేదలుగా మిగిలారు. పేదరిక రేఖ స్థాయిగా సూచించిన ఆదాయానికి మించి ఒక్క రూపాయి సంపాదించినా గణాంక రీత్యా అలాంటి వారు పేదరికం నుంచి బయటపడిపోయినట్టే. కాబట్టే పేదల జనాభా కుచించుకుపోతోంది. అందువలన పేదరిక నిర్మూలనా కార్యక్రమాల రూపకల్పన, అమలుతో ముడిపడి ఉన్న వారంతా... కేంద్ర మంత్రుల నుంచి, గ్రామ పెద్దల వరకు తమ వైఫల్యాన్ని సూచించేలా తమ ఇళ్లకు ఆరెంజ్ రంగు వేయిం చుకోవాల్సిన సమయం బహుశా ఇదే కాదా? పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆయన దారే వేరు
విశ్లేషణ నారాయణ రాణేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ద్వారా లభించగల అత్యు న్నత పదవిౖయెన ముఖ్య మంత్రిగా పని చేసినా, ఆయన చుక్కాని లేని నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న రాజకీయ వేత్త. శివసేనను వదిలిపెట్టే శాక ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారు. శివసేన ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకోవడమూ లేదు. రాణే స్వతం త్రంగా, సూటిగా వ్యవహరించే మనిషి. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ అశోక్ చవాన్‌కు ఆ పదవిని కట్టబెట్టింది. అసమ్మతిని వ్యక్తంచేసిన రాణేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన కాళ్లావేళ్లా పడి తిరిగి పార్టీలోకి ప్రవేశించారు. కానీ ఆ పార్టీలోని ఇతరులకు పెద్ద తలనొప్పిగా మారారు, ఆయనా సౌఖ్యంగా ఉన్నది లేదు. అయినా కాంగ్రెస్ ఆయనను పార్టీలోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉండటంతో రాణే భార తీయ జనతా పార్టీ వాకిటికి చేరారు లేదా దగ్గరయ్యారు. అయితే తలుపులు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఆయన ప్రవేశానికి ఆ పార్టీలో కొంత విముఖత ఉన్న దనిపిస్తోంది. పూర్తిగా ‘ఎన్నికలపరమైన ప్రతిభ’ లేదా ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఉన్నవారినే పార్టీలోకి తీసుకుంటామంటున్నా... అభ్యంతరకరమైన నేపథ్యా లున్న ఎందరికో బీజేపీ దేశవ్యాప్తంగా తలుపులు తెరి చింది. రాణేను అనుమతించడం జరిగి, ఒక్కసారి ఆయన పార్టీలోకి ప్రవేశించారూ అంటే క్రమశిక్షణకు కట్టుబడరనీ, తిరిగి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పద విని చేజిక్కించుకోవడానికి సమయం కోసం వేచి చూçస్తూ నిరంతరం ప్రకంపనాలను సృష్టిస్తుంటారనీ రాష్ట్ర బీజేపీలోని అత్యున్నతస్థాయి నాయకత్వ శ్రేణు లకు భయం ఉంది. మనోహర్ జోషి స్థానంలో బాల్ ఠాక్రే, రాణేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిం చారు. అయితే 1999 ఎన్నికల్లో శివసేనను తిరిగి అధికా రంలోకి తేవటంలో ఆయన విఫలమయ్యారు. రాణే దేన్నీ లెక్కచేయని దురుసు మనిషి. తాను ఏమైనా మాట్లాడాలని నిర్ణయించుకుంటే చాలు, నీళ్లు నమలకుండా సూటిగా చెప్పేస్తారు. ఉద్ధవ్ ఠాక్రే శివ సేనను నడుపుతున్న తీరును చూసి నిరాశచెంది ఆయన ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన తనపై భౌతిక దాడులు జరుగుతాయనే భయం లేదన్నారు. శివసేన అత్యున్నత నాయకత్వంతో ఘర్షణ పడి, పార్టీని వీడే తిరుగుబాటుదార్లకు తరచుగా పట్టే గతి అదే.‘‘సేనలో ఉన్నప్పుడు పార్టీ వీధి కార్య కలాపాలను నడిపినది నేనే’’ అన్నారు రాణే. కాంగ్రెస్ లోనూ ఆయన తనకు పరిస్థితి కాస్త సౌఖ్యంగా ఉండేలా చేసుకుంటున్నది లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ)తో ఎన్నికల అనంతరం చెలిమి చేస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతం రైతులను కలుసుకునే కార్యక్రమాన్ని చేప ట్టింది. ఆ కార్యక్రమం సజావుగా సాగడం లేదని, దయ నీయస్థితిలోని రైతులు దాని పట్ల స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తృణీకారంతో ఆయన దానికి దూరంగా ఉన్నారు. ఆయన తనకు తోచిందే చేసే స్వతంత్ర వ్యక్తిత్వంగల మనిషి. తనకు మేలు చేసినందుకు ఆయన ఎవరికీ ఏవిధం గానూ రుణపడి లేరు. వీధుల్లోని శివ సైనికుని స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరారంటే అందుకు కారణం ఆయన నేర్పరితనమే. ముఖ్య మంత్రిగా విజయవంతమౌతూ వినమ్ర ప్రియభాషిగా పేరు తెచ్చుకుంటున్న జోషితో బాల్ ఠాక్రే అసౌకర్యంగా ఉన్నారని పసిగట్టడంతోనే ఆయన ఆ స్థానం కోసం కృషి మొదలెట్టేశారు. బహుశా ఆయన ఎవరితోనైనా ఒప్పందం అంటూ కుదుర్చుకుని ఉంటే అది ఒక్కసారే కావచ్చు. ఈ వైచిత్రి, రాణే వృద్ధిలో భాగమే. నేడు దారి తెన్నూ లేకుండా కొట్టుకుపోతున్నా, ఆయన తన సొంత జిల్లా సింధుదుర్గ్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన ఎంత ఆత్మవిశ్వాసం గల మనిషంటే శివసేనను వీడిన వెంటనే ఆయన ఒక ఉప ఎన్నికలో శాసనసభకు గెలిచి, తాను ముఖ్యుడిననే అంశాన్ని రుజువుచేసి చూపారు. ఆయన సామ్రాజ్యం కేవలం వ్యాపారానికే పరి మితం కాలేదు, ఒక రాజకీయ కుటుంబం ప్రారం భమైంది. ఆయన ఒక కుమారుడు నీలేష్ 2009లో రత్నగిరి–సింధుదుర్గ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో కుమారుడు నితేష్ రాష్ట్ర శాసన సభ సభ్యునిగా ఉన్నారు. నితేష్ కార్మిక సమస్యలను కొంత మేరకు పట్టించుకునే ఒక ఎన్జీఓను నడు పుతున్నారు. అది కూడా శివసేనలాగే మాట్లాడుతుంది, అదే పద్ధతులను అనుసరిస్తుంది. రాణే తన ప్రయోజనా లను, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోడానికి ఒక మరాఠీ దినపత్రిక ‘ప్రహార్’ను (మృత్యు ఘాతం) ప్రారంభించారు. ఆ పత్రిక పేరే ఆయన శైలి రాజ కీయాలను సూచిస్తుంది. ఆ పత్రిక వృత్తినైపుణ్యంతోనే పని చేయాలని యత్నిస్తోంది. అయితే చాలా మంది రాజకీయవేత్తలు, రాజకీయపార్టీలు ఎంచుకున్న మార్గ మైన టెలివిజన్ రంగంలోకి రాణే ప్రవేశించలేదు, సమీప భవిష్యత్తులో అది జరిగేట్టూ లేదు. అయితేనేం, ఆయన సమరశీలత నిత్యం కనబడుతుంటూనే ఉంటుంది. మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
గతి తప్పిన నగరాభివృద్ధి
విశ్లేషణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దాదాపు సగం పట్టణీకరణ చెందాయి. అయినా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మూడో వంతు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నగరాలు మరింత వృద్ధి చెందుతున్నాయి, చిన్న పట్ట ణాలు నగరాలుగా మారుతున్నాయి. అయినా మనకు నగరాల నిర్మాణంపై సుస్పష్టమైన అవగాహన లేదు. స్వాతంత్య్రానంతరం చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, కాండ్లా నగరాలను నిర్మించారు, ప్రపం చంలోనే అతి పెద్ద కొత్త నగరం నవీ ముంబై నిర్మా ణంలో ఉంది. ఇక అమరావతి నగర నిర్మాణం కొత్త ప్రాజెక్టు. అయినా దేశవ్యాప్తంగా పట్టణాల నిర్వహణ అధ్వానంగానే ఉంది. ‘ప్రణాళిక’ అని పిలిచేది ఉన్నా, మనం మాత్రం ‘అభివృద్ధి’ వైపే కొట్టుకుపోతున్న ట్టుంది. ముంబైలో దాదాపు ఒక ఏడాదిగా కొత్త కట్టడాల నిర్మాణాన్ని హైకోర్టు నిషేధించింది. నిర్మాణ క్రమంలో పోగుబడే రాళ్లూరప్పలు తదితరాలను తరలించే మార్గ మేదీ ఆ నగరానికి లేదు మరి. ముంబైకి ఆనుకుని ఉన్న థానేలో కూడా అలాంటి ఆంక్షే ఉంది. ఆ నగరం నీటి సరఫరా సమస్యను పరిష్కరించలేకపోవడం అందుకు కారణం. ఆ నగర పాలక వ్యవస్థ నీటి సరఫరాపైగాక ఇతర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తోంది, అదీ నగర కేంద్రితమైనదే. ఢిల్లీలోని చాలా విస్తృత ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా సదుపాయం లేదు. కాబట్టి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడానికి ఆ నగరానికి జల్ బోర్డ్ ఉంది. హైదరాబాద్ పరిస్థితీ అదే. బిల్డర్–డెవలపర్లు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. కానీ, పౌర పరిపాలనా సంస్థలు మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తాయి. నీటి సరఫరా, నిర్మాణ పనుల వల్ల పోగుబడే చెత్తను తరలించడం వంటివి తాము పట్టించుకోవాల్సినవేనని వారు భావిస్తున్నట్టు కన బడదు. తప్పనిసరిగా చెత్తను సేకరించుకు వెళ్లడం సహా ఇలాంటి విషయాలలోని లోటుపాట్లు ఒక నగరం లేదా పట్టణంలో ఉండేవారికి ఎవరికైనా చిర్రెత్తించేవే. కొన్ని పట్టణాలు, నగరాలలోపల నామమాత్రపు బస్సు సర్వీసులు సైతం లేవు. దీంతో ప్రైవేటు వాహ నాలతో రోడ్లు కిక్కిరిసివుంటాయి. అన్ని విధాలా తగి నంతగా సంతృప్తికరంగా ఉన్న ఒక్క నగరమైనా కనబడటం కష్టమే. అయినా ప్రజలు గుంపులు గుంపు లుగా బతుకు తెరువుల కోసం నగరాలకు, పట్టణా లకు ఎగబడతారే తప్ప, జీవించడానికి అవి సము చితమైనవని మాత్రం కాదు. వారు పట్టణ ప్రాంతా లను విస్తరింపచేయడమే కాదు, అధ్వానంగా మారు స్తారు. ఇక యూరోపియన్ పట్టణాలు, నగరాలతో సరితూగే వాటి గురించి మాట్లాడనవసరమే లేదు. ఈ నేపథ్యం నుంచి చూస్తే, ‘స్మార్ట్ సిటీ’ అనే భావన ఓ చిన్న బ్యాండ్ ఎయిడ్ పట్టీ లాంటిదే. ఎంతో కొంత ఉపయోగకరమే కాబట్టి వాటిని ఆహ్వానించా ల్సిందే గానీ, అది సరిపోదు. ఏ అంశానికి సంబం ధించి నగరాలు, పట్టణాలు డిమాండు కంటే వెనుకబడి ఉండరాదు. పేరుకుపోయిన పాత పనులు దిగ్భ్రాంతి కరమైనంత భారీ ప్రమాణంలోనివి. పెద్ద నగర ప్రాజెక్టులో భాగమైన నవీ ముంబైలో మూడో వంతు మురికివాడలే. ఆ నగరం విషయంలో ఏదీ సజావుగా సాగు తున్నట్టు అనిపించదు. ఏం చేసినా గానీ అది డిమాం డు–సప్లయి రేఖ కంటే వెనుకబడే ఉంటుంది. చాలా వరకు నగరాలు, పట్టణాలలో సేకరించని చెత్త, పాద చారుల హక్కులకు తిలోదకాలిచ్చేస్తూ ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, వీధులను ముంచెత్తే ట్రాఫిక్ నత్తనడక సాగుతుండటం, రోడ్ల మీద గుంతలు, మురికి వాడలే గాక గూడు కరువు కావడం, అందుబాటులో లేని వసతి సదుపాయాలు కనీసంగా ఉండే ప్రతికూలాం శాలు. అయినా మనది వేగంగా పట్టణీకరణ సాగుతున్న దేశం. ఈ లోటుపాట్లన్నీ అసలు నగరాలకు స్వాభావిక మైనవే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మన ప్రణాళికా రచన, విధానాల అమలు ఎంత అధ్వానంగా ఉంటాయో ఇది వేలెత్తి చూపుతుంది. ఆర్థికపరమైన ప్రతిబంధకాల వంటి కారణాలు కూడా ఉండవచ్చు గానీ... అవినీతి, అధ్వానమైన అమలు అనే రంధ్రా లను పూడ్చుకోగలిగితే ఆ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. చివరకు ఇదంతా కలసి ప్రజా జీవితంలో కానరాకుండా పోయిన నిజాయితీ వద్దకు చేరుస్తాయి. విపత్కరమైన ఈ క్షీణత కొనసాగడాన్ని అను మతించడానికి పౌరులు సుముఖంగా ఉండటం మరిం తగా ఆందోళనకలిగించే అంశం. అయినా పట్టణాలు, నగరాలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. గతానుభ వంపై ఆధారపడి పౌరులలో నెలకొన్న నిరాశావాదం, సుపరిపాలన కొరవడటం కొనసాగుతూ ఉండటం, పౌరులకు ఇంతకంటే మెరుగైనదానికి దేనికీ అర్హత లేదని, ఇప్పటికే వారికి చాలా చేసేశామని పాలక వర్గా లలో ఉన్న విశ్వాసాల పర్యవసానమిది. కాబట్టి ఇక మార్పు దేనికి? వ్యాసకర్త: మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
సేవాపన్ను మాయాజాలం!
విశ్లేషణ సేవాపన్ను చెల్లించడం తప్పనిసరి కాదని, రెస్టారెంట్ల యజమానులు బిల్లులో ఖాళీ చోటును వదిలిపెడితే, తాము పొందిన సేవకు ద్రవ్యపరమైన విలువను చెల్లించడంపై కస్టమర్లే నిర్ణయించుకుంటారని కేంద్ర మంత్రి సూచించారు. బిల్లు భారీగా ఉన్నప్పటికీ, మంచి ఆహారాన్ని ఆస్వాదించి, చక్కటి సేవను పొందిన కస్టమర్.. వెయిటర్‌కు టిప్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. తాను పొందిన సేవకే ఆ అభినందన కాబట్టి మీకు సేవ చేసిన వ్యక్తికి ఆ టిప్ అందుతుంది లేదా అందాలి కూడా. వెయిటర్ హోటల్లో ఉద్యోగి అయినప్పటికీ టిప్ తనకే అందుతుంది. చాలా కాలంగా ఇలాగే జరుగుతూ వస్తోంది కూడా. అయితే హోటల్ పరిశ్రమ దీన్ని మరోలా చూస్తోంది. మీకు సేవలందించిన వెయిటర్‌కి మీరు టిప్ ఇస్తారా లేదా అనేది మీ ఛాయిస్. కానీ టిప్‌తో సంబంధం లేకుండా బిల్లులో పొందుపర్చే సేవా పన్నును మాత్రం మీరు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అలాగని ఇది కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రతి వస్తువుపైనా క్రమానుగతంగా విధించే సేవా పన్ను వంటిది కాదు. మీడియాలో పేర్కొన్న అనేక వాదనల బట్టి, సేవా పన్ను అనేది వెయిటర్‌కి మాత్రమే వెళ్లడం లేదని, ఆ హోటల్లోని చెఫ్, క్లీనర్ వంటి మంచి సేవలను అందించిన ప్రతి ఒక్కరికీ వెళుతున్నట్లు కనిపిస్తుంది. పైగా యజమాని కూడా దాంట్లో కొంత భాగాన్ని తీసుకుంటాడని అనుమానం ఉంది. గతంలో అయితే చాల ప్రాంతాల్లో వెయిటర్‌కి తక్కువ జీతం ఇచ్చేవారు. తగిన సేవతో కస్టమర్‌ని అతడు సంతృప్తిపర్చినట్లయితే, టిప్ మొత్తంగా లేదా దాంట్లో చాలా భాగం తనదే అవుతుందని చెప్పేవారు. కాబట్టి సిబ్బంది ఖర్చుల చెల్లింపు భారం యజమాని నుంచి బదిలీ అయ్యేది. ఇప్పుడు మనం సేవా పన్ను కూడా అలాగే ఉంటుందని మనం ఊహించవచ్చు. బిల్లులో ఈ చార్జిని సూచించారు. ఇది తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం కాదని కేంద్రం చెప్పడానికి ముందు, అది సేవా పన్నువంటిదేనని దానిని చెల్లిం చాల్సి ఉంటుందని రెస్టారెంట్లకు వచ్చే పలువురు సందర్శకులు లేదా కస్టమర్లు భావించేవారు. పైగా చాలావరకు ఆ సేవా రుసుము అనేది వెయిటర్కే పోతుందనుకునేవారు. కానీ ఆ టిప్‌ను కూడా ఉద్యోగులు, యజ మానులూ అందరూ పంచుకునేవారని ఇంతవరకు మనకు తెలీదు. ఇప్పుడు కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్.. సేవాపన్ను చెల్లించడం తప్పనిసరి కాదని, దాన్ని చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమర్ నిర్ణయించుకుంటారని, రెస్టారెంట్ యజమానులు బిల్లులో కాస్తంత ఖాళీ చోటును వదిలి పెడితే తాము హోటల్ సిబ్బంది నుంచి పొందిన సేవకు ద్రవ్యపరమైన విలువను చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమరే నిర్ణయించుకుంటారని సూచించారు. పైగా, రెస్టారెంట్ యజమానులు బిల్లుల్లో తాము విధించిన సర్వీస్ చార్జిని తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడు సేవా రుసుమును దానికీ వర్తింపజేయాలా వద్దా అనేది కస్టమరే నిర్ణయించుకుంటాడు. అంటే ఈ సర్వీస్ చార్జీని కూడా తాము చెల్లించాలా వద్దా అనేది కస్టమరే తేల్చుకుంటాడు. ప్రజారంగంలో పనిచేస్తున్న రెస్టారెంట్ యజమానులకు మొత్తంమీద ఈ సూచన బాగానే ఉన్నట్లుంది. తాము హోటల్లో ఆరగించే పదార్ధాలపై సర్వీస్ చార్జీ ఉంటుందని ముందుగానే కస్టమర్లకు సూచించినట్లయితే, అప్పటి నుంచి సర్వీస్ చార్జి విధించని రెస్టారెంట్లకు మాత్రమే అలాంటి కస్టమర్లు వెళతారని వీరంటున్నారు. ఈ సేపా పన్ను లేదా లెవీపీ తొలి అధికారిక దృష్టికోణం ఈ సంవత్సరం జనవరి నెలలోనే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి తట్టింది. ఇప్పుడు దాన్ని ఒక తప్పనిసరి అవసరంలాగా పొందుపరుస్తూ. అధికారికంగా ప్రకటించారు. ఇకపై హోటల్లో అందుకున్న సేవలకు గాను సర్వీస్ చార్జి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం కస్టమరే తేల్చుకుని నిర్ణయించుకోవడానికి తగిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ మార్గదర్శక సూత్రాల ఉల్లంఘనను ఎవరైనా అతిక్రమించినట్లయితే స్థానికంగా ఉండే కన్సూమర్ కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఇలాంటి ఫిర్యాదులతో వ్యవహరించడానికి ఒక సాధికార సంస్థ ఏర్పాటుకు కొత్త చట్టం అనుమతిస్తుంది. ఇది నిజంగానే విచిత్రమైనదే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది గుర్రం ముందు బండిని కట్టడం లాంటిదే. ఏదేమైనా ప్రస్తుతం ఒక పరిణామానికి మీరు సిద్ధపడాల్సిందే మరి. వంటగది నుంచి మీ టేబుల్ వద్దకు ఆహారం తీసుకురావడం తమ పని కాదని ప్రకటిస్తూ దానికోసం కస్టమర్‌కి సర్వీస్ చార్జిని విధిస్తున్న రెస్టారెంట్లు ఇకపై సేవారుసుమును పొందుపరుస్తూనే మరోవైపున దానిని దాచిపెట్టే సమగ్ర బిల్లును ఎంచుకోవచ్చు. వాస్తవం ఏమిటంటే సేవా పన్నును కలిపిన అలాంటి బిల్లులను నేను గతంలో బలవంతంగా చెల్లించి ఉన్నాను. నాకు తెలిసిన ఒక చార్టర్డ్ అకౌం టెంట్‌తో దీన్ని తనిఖీ చేసినప్పుడు, ఆహారం ధరలు, సర్వీస్ చార్జి వివరాలను స్పష్టంగా హోటల్ యజ మానులు అధికారులకు తెలియపరుస్తున్నంతవరకు అలాంటి బిల్లు అనుచితమైంది కాదని ఆయన చెప్పారు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
క్లౌడ్‌సోర్సింగ్‌తో కుడ్య చిత్రకళ
విశ్లేషణ కుడ్య చిత్రకళలో ఇది కొత్త నియంత్రిత ప్రక్రియ. చూసేవారికి వెంటనే సందే శాన్ని అందించడానికి జట్టంతా కలసి కళా సృజనను నిర్వహించడం. సృజనాత్మక ఉద్వేగాలను కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏకత్వాన్ని సాధించడం. బిల్హార్, మహాబలేశ్వర్ పంచాగ్ని ప్రాంతంలోని ఒక గ్రామం. అక్కడ పండించే స్ట్రాబెర్రీ పండ్లను కొనుక్కోవడం కోసం పర్యాటకులు అక్కడికి రావడం పరిపాటే. గ్రామంలోని పాతికకు పైగా గోడలపై చిత్రాలను గీయ డానికి పెద్ద చిత్రకారుల బృందం అక్కడకు వచ్చింది. ‘స్వత్వ,’ వాట్సాప్ ఆధారిత సాంప్రదాయేతర చిత్రకళాకారులు, చిత్ర కళారాధకుల అనుసంధాన సంస్థ. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే పుస్తకాలను భద్రపరచడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వివిధ గృహాల గోడలపై తమ రంగులు, కుంచెలకు పని చెప్పే బాధ్య తను పురమాయించింది. ఇలా పుస్తకాలను భద్రపరచే ఇళ్లు తదితర ప్రదేశాలలో ఒక చోట బాల సాహిత్యం, మరో చోట మహిళలకు సంబంధించినవి, ఇంకో చోట రుషిపుంగవుల రచనలు వగైరా ఉంటాయి. ప్రభుత్వం అందించిన పది వేల పుస్తకాలను 22 చోట్ల భద్ర పరచడానికి వీలుగా వాటిని వేరు చేశారు. ‘పుస్తకాంచె గావో’ (మరా ఠీలో పుస్తకాల గ్రామం) భారీ లక్ష్యంతో చేపట్టిన పథకం. ఇది రెండు ఉద్దేశాలతో చేపట్టినది. మహాబలేశ్వర్, పంచాగ్ని పర్యాటకులు అక్కడ కాలం వెళ్లబుచ్చి పోవడం గాక, పుస్తకాలతో కాలక్షేపం చేసే అవకాశాన్ని కూడా కల్పించడం, అది ఆ ప్రాంత వాసులలో పఠనాసక్తిని ప్రేరేపించగలదనే ఆశ సైతం ఉంది. రెండు బస్సులలో శుక్రవారం ఉదయం వచ్చి, ఆది వారం రాత్రికి తిరిగి వెళ్లిన 70 మంది చిత్రకళాకారు లలో వివిధ స్థాయిల ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నవారు న్నారు. వారిలో ఒకడినైన నాకు, నూతనమైన ఈ చిత్రకళను క్రౌడ్‌సోర్సింగ్... ప్రపంచంతో పంచుకోవా ల్సినదనిపిస్తోంది. కుడ్య చిత్రకళలో ఇది ఒక కొత్త నియంత్రిత ప్రక్రియను సృష్టిస్తోంది. ఇది గోడలను కంటికింపైన రంగులతో నింపి వెళ్లడానికి మించినది. ఇది వ్యక్తులు తమ సృజనాత్మక వాంఛల వెంటపడి చిత్రించుకుపోవడం కాదు. అందుకు భిన్నంగా చూసే వారికి వెంటనే ఒక సందేశాన్ని అందించడం కోసం ఒక జట్టు మొత్తం కలసి కళా సృజనను నిర్వహించడం. కాబట్టి, ఇది సృజన్మాత్మక ఉద్వేగ ప్రవాహాలను క్రమ పద్ధతిలో కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏక త్వానికి హామీని కలగజేయడం. అయితే అందుకు పీడ కలా సదృశమైన సరఫరాలు, నియంత్రణ, నిర్వహణ తదితర ఏర్పాట్లు అవసరం. ప్రతి వ్యక్తి తన లోలోపలి స్వీయత్వాన్ని వెలికి తెచ్చేలా చేయాలని స్వత్వ కోరుకుంటుంది. ఈ కృషిలో పాల్గొనదలచిన ఔత్సాహికులలో ఏ ఒక్కరినీ స్వత్వ వద్దన్నది లేదు. ప్రధానంగా థానే కేంద్రంగా పనిచేసే స్వత్వకు ఇండోర్, పుణేల వంటి సుదూర ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చి చేరడం మహో త్తేజాన్ని కలిగించింది. సామాజిక మాధ్యమాల పుణ్య మాని ఇది సాధ్యమైంది. ఈ పర్యటనలో బడి వసతి గృహంలో ఉంటూ, పిల్లల స్నానాల గదిలో ఒకేసారి ఆరుగురు స్నానాలు చేస్తూ గడ్డు జీవితం గడపాల్సి వచ్చింది. సుప్రసిద్ధులు, చెప్పుకోదగిన గుర్తింపున్న కళాకారులు కొత్తవాళ్లతో భుజాలు రాసుకునే కాదు, ఆవేశాలను పూసుకు తిరిగారు. థానే మునిసిపాలిటీ మద్దతుతో పలు గోడలపై చిత్రాలను వేసేటప్పుడు చూసేవారు ఎవరైనా బ్రష్‌తో చేయి కలుపుతానంటే ఆహ్వానించారు. ఇలాంటి ఔత్సాహికులు చేసే పొరపాట్లను సీని యర్ కళాకారులు చడీచప్పుడు లేకుండా సరిచేసేవారు. లేదంటే తక్షణమే లేదా ఆ తర్వాత ఉప యోగకరమైన సూచనను చేసే వారు. అయితే దాని ఉద్దేశం మాత్రం ప్రోత్సహించడమే. అయితే, థానేకు 250 కిలోమీటర్ల దూరంలోని బిల్హార్లో చేపట్టిన ఈ సాహసం అందుకు భిన్న మైనది. కేవలం మూడు రోజు ల్లోనే అంతా చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన బృందం లోని వారు ఒకరికొకరు పరిచయ మైనది బస్సు ఎక్కేటప్పుడు, వారి నైపుణ్యాలతో పరి చయమైనది గోడల మీద బొమ్మలు వేసే పని చేయడం మొదలయ్యాకే. ప్రతి జట్టులోని వారికి నేతృత్వం వహించడానికి ఒక అనుభవజ్ఞుడైన కళాకారులు ఉండే వారు. ఆయన లేదా ఆమె తమ జట్టు సభ్యులు ఒక్కొ క్కరిలో ఉన్న భిన్న నైపుణ్యాలతో కూడిన ప్రతిభను ఒకే సమష్టి సృజనాత్మకతగా వ్యక్తమయ్యేలా మార్గదర్శ కత్వం వహించాల్సివచ్చింది. అలా పెంపొందిన సృజ నాత్మక సమన్వయం వల్ల జట్లు దాదాపు ప్రతిరోజూ రాత్రింబవళ్లూ పని చేశాయి. రంగులు, కుంచె చేయగల అద్భుతాలకు విభ్రాం తులై, ముందు ముందు ఏమైనా చేయవచ్చనుకున్న వారు సైతం జట్లలో చేరారు. అలాంటి వారు కేవలం అదీ ఇదీ అందిం^è డం, తెచ్చి ఇవ్వడం లాంటి పనులు చేయడానికి వెనుకాడలేదు. ఆ తరువాత వాళ్లు చిత్ర కళను తమంతట తాముగానే నేర్చుకుంటామని లేదా చిత్రకళ కోర్సులో చేరుతామని చెప్పారు. కొన్ని సంద ర్భాల్లో ప్రముఖులైన సీనియర్లు వాట్సాప్ ద్వారా తమ మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తామని ముందుకొచ్చారు. చిత్రలేఖనాన్ని 64వ ఏట మొదలుపెట్టిన నేను ఇంకా దాన్ని కొనసాగిస్తుండటానికి వారు సహాయపడ్డారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
బిల్డర్ల నగరం ముంబై
విశ్లేషణ ముంబై నగర నిధులు భారీగా బ్యాంకుల్లో మూలుగుతున్నా అది అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. వాటిని సముచితంగా వినియోగిస్తే పౌరులకు సత్వరమే అవసరమైన సదుపాయాలను అందించగలరు. కానీ ఆ పని చేయరు. ముంబై మునిసిపల్ కార్పొ రేషన్‌పై నియంత్రణ కోసం రాజకీయ పార్టీలన్నీ తహ తహలాడుతాయి. అందుకు కారణం సుసంపన్నమైన ఆ నగర పాలక సంస్థ ఖజానా చేతికి అందుతుందనే ఆశే అనే భావన ఉంది. అది తప్పుడు అభిప్రాయమేం కాదు. ఆ నగర భారీ బడ్జెట్ రూ. 37,000 కోట్లు. అయి నాగానీ, అందులోంచి దొంగిలించగలిగినది మాత్రం తక్కువే. అదెలాగంటారా.. మొత్తం బడ్జెట్లో అత్యధిక భాగం వేతనాలకు, రుణ చెల్లింపులకు, పురపాలక సంస్థ నిర్వహణకే పోతుంది. అది 70 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఇక మిగిలే భాగం నుంచే పౌరులకు అన్నిటినీ సమకూర్చాలి. ఆ పనిని అది అరకొరగానో లేక అంటీ ముట్టనట్టుగానో చేస్తుంది. 2015–16 వరకు గడచిన దశాబ్దకాలంలో ముంబై పుర పాలక సంస్థ సగటున ఏడాదికి 19.33 శాతం మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణల కోసం ఖర్చు చేసింది. జనాభా, అవసరాలు తప్ప మిగతా అన్నీ కొరతగానే ఉండే ఈ నగరానికి అది శోచనీయ మైనంత తక్కువ మొత్తం. అయినాగానీ, ప్రజలను మెప్పించడానికి భారీ కేటాయింపులను మాత్రం చేస్తుం టారు. చేసే ఖర్చు మాత్రం ఆ దరిదాపులలో ఎక్కడా ఉండదు. అంటే, అంకెల రీత్యా చూస్తే, కొల్లగొట్టడానికి మిగిలేది చాలా చిన్న మొత్తమే, అది ఎందుకూ చాలేది కాదు. కాకపోతే బొత్తిగా నాణ్యతలేని రోడ్లను నిర్మించే వారు, ఏటా వాటికి మరమ్మతులు చేయాల్సిన వారు అయిన కాంట్రాక్టర్ల నుంచి నేతలకు, అధికారులకు ముడుపులు అందుతాయి. అయితే, నియమ నిబంధన లను విరుద్ధంగా భవన నిర్మాణాలను అనుమతించడం ద్వారా, అలాంటి ఇతర కట్టడాలకు నిర్మాణ అనుమతు లను జారీ చేయడం, మొదలైనవాటి ద్వారానే వారికి అధికంగా డబ్బు రాలుతుంది. అందు వల్లనే ముంబైకి ‘‘ప్రజల నగరం’’గా గాక, ‘‘బిల్డర్ల నగరం’’గా పేరు. ఇలా అధికారంలో ఉన్న అన్ని స్థాయిల వారికి అక్రమ పద్ధతుల్లో డబ్బు అందడాన్ని ఎంత ఉదారంగా చూసినా, మాఫియా అనడం తప్పు కాదు. ఇక్కడ అక్రమ ధనం చేతులు మారేది నగర పాలక సంస్థ నిధుల నుంచి కాదు, మరెవరో ఇచ్చేది. కాబట్టి ఈ అక్ర మాలను మాఫియా అనడం సమంజసమే. అయితే, ఇది రియల్ ఎస్టేట్ వ్యయాలను పెంచి, ఫ్లాట్ ధరను పెంచుతుందనే వాస్తవం మాత్రం మిగులుతుంది. ముంబైవాసులకు అవి దాదాపుగా అందుబా టులో ఉండవు. ఎవరు అధికారంలో ఉన్నా చిన్న వీధుల్లో బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని అనుమతిస్తారు. మౌలిక సదుపాయాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడో ఒక చోట పౌరులు ఎవరి ధన పిపాసకో మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాకపోతే ఈ రంగంలో ధన పిపాస మరీ అసాధారణమైన భారీ స్థాయిలో ఉంటుంది. ఫలానా ఫలానా జేబుల్లోకి ఇంతింత అంటూ పుచ్చుకోడానికి బదులుగా అక్రమార్జనాపరులు బిల్డర్లతో భాగస్వామ్యా ల్లోకి ప్రవేశిస్తున్నారు. నిర్మాణ నిబంధనలు అనుమ తించే దానికంటే కొన్ని అంతస్తులను అధికంగా నిర్మించి, సదరు అధికారినో లేక రాజకీయవేత్తనో బిల్డర్లు భాగస్వామిగా చేసుకుంటున్నారు. అంతేతప్ప బేరసారాలు ఉండవు. అయితే ఇక్కడో చిక్కుముడీ ఉంది. కాంట్రాక్టర్లకు నిధుల మంజూరు నుంచి, చెత్త తరలింపు, రోడ్ల నిర్మాణం వగైరా ప్రతి చోటా జిత్తుల మారితనం ప్రయోగించినా ఇష్టానుసారం ఖర్చు చేయ డానికి లభించేవి చిన్న మొత్తాలే. అయినాగానీ ఆ నగరానికి భారీ చరాస్తులు ఉండటమే విడ్డూరం. అవి వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు. డిపాజిట్ చేసే మొత్తాలు భారీవి కాబట్టి బ్యాంకర్లు వడ్డీరేట్లపై బేరసారాలు సాగిస్తారు. తాజా సమాచారం ప్రకారం నగర పాలక సంస్థకు రూ. 61,510 కోట్ల ఫిక్సెడ్ డిపా జిట్లు ఉన్నాయి. వీటిని సముచితమైన రీతిలో మదుపు చేస్తే నగర అవసరాలను సత్వరంగా తీర్చడానికి సరి పోయేవే. ఈ డిపాజిట్లలో ప్రావిడెంట్ ఫండ్, మిగులు ని«ధులు ఒక భాగం. అయినా మిగతా మొత్తం నమ్మ శక్యం కానంతటి పెద్దది. నగర ప్రభుత్వం అంత పెద్ద భారీ నిధులను నిరు పయోగంగా ఉంచడమేమిటనేది మాత్రం బహిరంగ చర్చకు నోచుకోలేదు. ఈ ఆస్తులపై ఏడాదికి 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి వచ్చినా, అది పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని అందుబాటులోకి తెస్తుంది. అయినా నగర ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతుంది. నగదు మిగులు అందుబాటులో ఉన్నా అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటో వివరించరు. చూడబోతే ముంబై నగరం బ్యాంకుల ద్రవ్యత్వాన్ని కాపాడటం కోసం నిర్మించాల్సిన పౌర సదుపాయాలను లేదా పౌర సేవలను మెరుగుపరచడాన్ని పరిత్యజించిందని అనిపి స్తుంది. నగర ప్రభుత్వానికి చెందిన ఇంతటి భారీ మొత్తాలు బ్యాంకులకు ఎలా చేరాయనే విషయమై ప్రజ లకు జవాబుదారీ వహించేవారు లేరు. దాన్ని పట్టించు కునే వారు ఎవరూ లేరు. బడ్జెట్లో కేటాయించిన డబ్బును ఖర్చు చేయకపోవడం వల్లనే ఆ నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయనేది స్పష్టమే. కేటా యించిన నిధులను ఖర్చు చేయలేకపోవడం ఏటా జరిగేదే. ప్రణాళికాబద్ధంగా కార్యకలాపాలను సాగిం చడం మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణాపరమైన శక్తిసామర్థ్యాలకు మించిన పని అనే దీనర్థం. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com