Man of the match
-
స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్‌లో సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్లో 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్, విరన్‌దీప్ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా తలో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్, విరన్లను అధిగమించి తన పేరిట సింగిల్‌గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా, స్కై, విరాట్, విరన్ తర్వాత రోహిత్ శర్మ (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.జింబాబ్వే, గాంబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. బ్రియాన్ బెన్నెట్ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్ 6న బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్‌లు ఆడి 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విరన్‌దీప్ 84 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్‌దీప్, విరాట్ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (15), ఆఫ్ఘన్ ఆటగాడు మొహమ్మద్ నబీ (14), టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఉన్నారు.కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్‌కు సిద్ధం! -
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్‌ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్‌కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్‌లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
కోహ్లికి 121 మ్యాచ్‌లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్‌కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్‌లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్‌దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
IPL 2024 CSK VS KKR: ధోని రికార్డు సమం చేసిన జడేజా
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Ravindra Jadeja - The Game Changer of CSK with ball. 🔥pic.twitter.com/HsyMhbDsTJ — Johns. (@CricCrazyJohns) April 8, 2024 బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్‌తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్‌తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో నరైన్‌తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024 RCB VS PBKS: ధోని రికార్డును సమం చేసిన కోహ్లి
పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"గా నిలిచిన ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు. ఐపీఎల్లో ధోని ఇప్పటివరకు 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. నిన్నటి మ్యాచ్‌తో కోహ్లి ఆ సంఖ్యను (17) సమం చేశాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శశాంక్ సింగ్ (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ (25), సామ్ కర్రన్ (23), జితేశ్ శర్మ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ హాఫ్ సెంచరీతో (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేయగా.. అతనికి మహిపాల్ లోమ్రార్ (8 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్ (3), గ్రీన్ (3), మ్యాక్స్‌వెల్ (3), పాటిదార్ (18), అనూజ్ రావత్ (11) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ (4-0-13-2), రబాడ (4-0-23-2) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ మిగతా బౌలర్ల నుంచి వారికి సహకారం లభించలేదు. -
చరిత్ర సృష్టించిన దృవ్ జురెల్
టీమిండియా నయా సంచలనం దృవ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా అరంగేట్రం సిరీస్‌లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జురెల్‌కు ముందు భారత వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అజయ్ రాత్రా ఈ ఘనత సాధించాడు. 2002 వెస్టిండీస్ పర్యటనలో రాత్రా.. తన డెబ్యూ సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జురెల్ అరంగేట్రం సిరీస్ రెండో మ్యాచ్‌లో ఈ అవార్డు అందుకుంటే.. రాత్రా తన డెబ్యూ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆంటిగ్వా వేదికగా విండీస్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో రాత్రా సెంచరీ (115) చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే, ఆ సెంచరీ తర్వాత రాత్రా కనీసం ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. రాత్రా ఆ ఘనత సాధించిన 22 ఏళ్ల తర్వాత జురెల్ మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ రెండు సార్లు ఈ ఘనతను సాధించగా.. నయన్ మోంగియా, వృద్దిమాన్ సాహా, అజయ్ రాత్రా, దృవ్ జురెల్ చెరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. కాగా, రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయమైన 39 పరుగులు చేసి జురెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో (192) తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. జురెల్, శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. -
కోహ్లి తర్వాతి స్థానంలో షకీబ్.. మూడో స్థానంలో రోహిత్ శర్మ
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విషయంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో షకీబ్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 42వ సారి మ్యాన్ ఆఫ్్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒక్కడే ఈ విభాగంలో షకీబ్ కంటే ముందున్నాడు. కోహ్లి అత్యధికంగా 63 మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటే, షకీబ్ 42 సార్లు, ఆతర్వాత రోహిత్ (37), వార్నర్ (37), గప్తిల్ (34), కేన్ విలియమ్సన్ (28), స్టీవ్ స్మిత్ (26), డికాక్ (25), రూట్ (25), జడేజా (24) వరుసలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే.. క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు అందుకున్న ఘనత దిగ్గజ క్రికెటర్ సచిన్ సొంతం చేసుకున్నాడు. సచిన్ అత్యధికంగా 76 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాత విరాట్, జయసూర్య (58), కలిస్ (57), సంగక్కర (50), పాంటింగ్ (49), అఫ్రిది (43) వరుసలో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (22), అజ్మతుల్లా (25), కరీం జనత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, ముస్తాఫిజుర్, షకీబ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లిటన్ దాస్ (35), ఆఫీఫ్ హొస్సేన్ (24), షకీబ్ (18 నాటౌట్) రాణించడంతో 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఓమర్జాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌తో తొలి మ్యాచ్‌లోనూ నెగ్గిన బంగ్లాదేశ్ 2-0తో ఆఫ్ఘనిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ (2-1), ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్ గెలుచుకున్నాయి. -
ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక స్పిన్నర్లు చెలరేగడంతో మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఫ్యాన్స్ ఫైర్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. జైస్వాల్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డ్‌పై తాజాగా నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ప్రస్తుతం దీనిపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియా వేడి వేడిగా చర్చ కూడా మొదలైంది. అసలు ఈ రచ్చ అంతా ఎందుకంటే.. యశస్వి జైశ్వాల్‌కు రివార్డుగా ఇచ్చిన మొత్తం 500 అమెరికా డాలర్లు కావడమే. ఈ మొత్తం మన భారత కరెన్సీలో సుమారు రూ.41,000 మాత్రమే. ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు కారణం ఇదేనా! ఈ రివార్డ్ మనీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భారత దేశవాళీ క్రికెట్ లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పారితోషికం ఎక్కువ అని సెటైర్లు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్ బోర్డు పరిస్ధితి ఆర్థికంగా అంతగా బాలేదని చెప్పాలి. వాస్తవానికి టీమ్ ఇండియా కూడా ఈ సిరీస్ ఆడేందుకు ప్రధాన కారణమే వెస్టిండీస్ బోర్డుకు ఆర్థిక సహకారం అందించడమే. ఈ కారణం వల్లే వెస్టిండీస్ బోర్డు రివార్డ్ మొత్తాన్ని 500 అమెరికన్ డాలర్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంత తక్కువ మొత్తంలో రివార్డ్ బహుకరించడం నెట్టింట అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనికంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్ అని జోకులు పేల్చుతున్నారు. Only $500? pic.twitter.com/RMLvMvziJu — Apoorv Sood (@Trendulkar) July 15, 2023 చదవండి Ind Vs Wi: వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్! -
ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు..
MS Dhoni: 350 వన్డేలు.. 10వేలకు పైగా పరుగులు(10773) .. 321 క్యాచ్‌లు.. 123 స్టంపింగ్స్‌లో భాగం.. ఓ వరల్డ్‌కప్ ట్రోఫీ.. వన్డే ఫార్మాట్లో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ట్రాక్ రికార్డు ఇది. అయితే, విచిత్రంగా తన కెరీర్లో వందలాది మ్యాచ్‌లు ఆడిన మహీ గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు మాత్రం 21. అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ఓవరాల్‌గా 33, టీమిండియా ఆటగాళ్లలో ఏడోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఓ మ్యాచ్‌లో తనకు అన్యాయం చేసి మరీ ధోనికి అవార్డు కట్టబెట్టారంటూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తాజాగా ఆరోపించాడు. ‘‘నిజంగా అది నా దురదృష్టమే. టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరైన మూడో మ్యాచ్‌లో వాళ్లను 175 పరుగులకే ఆలౌట్ చేయడంలో నాదే ముఖ్యపాత్ర. ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మేమే గెలిచాం. ఆ మ్యాచ్‌ల్లోనూ నేను మెరుగ్గా రాణించా. నా కెరీర్లో అత్త్యుత్తమ గణాంకాలు నమోదు చేశా. నాకు అన్యాయం చేశారు కానీ.. 175 పరుగులలో ఏవో కొన్ని రన్స్ తీసి.. రెండు క్యాచ్‌లు డ్రాప్ చేసినందుకేమో తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. నిజంగా ఇది అన్యాయం. అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికిస్తారో తెలుసా? ఓ మ్యాచ్‌లో జట్టు గెలిచినా ఓడినా సరే.. అత్యుత్తమంగా ఆడిన ప్లేయర్‌కే ఇవ్వాలి. కానీ ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది కాబట్టి ధోనికి అవార్డు ఇచ్చారు. అది కూడా క్యాచ్‌లు వదిలేసినందుకే అనుకుంటా’’ అంటూ అజ్మల్ ధోని ఆట తీరును కించపరిచే విధంగా మాట్లాడుతూ అక్కసు వెళ్లగక్కాడు. నాదర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ నంబర్ 1 బౌలర్.. ఒక్క అవార్డు లేదు కాగా అజ్మల్ వన్డే, టీ20లలో వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా ఎదిగినప్పటికీ ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఒక్క మ్యాచ్‌లోనూ గెలిచింది లేదు. మరి ధోనిపై మాత్రం ఎందుకంత ఏడుపు!’’ అని తలా ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేస్తున్నారు. 2012-13లో పాకిస్తాన్ భారత పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా.. రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. టీ20 సిరీస్‌లో దాయాదులు చెరో మ్యాచ్ గెలవగా.. వన్డే సిరీస్‌ను మాత్రం పాక్ 2-1(తొలి రెండు గెలిచి)తో కైవసం చేసుకుంది. మతిమరుపు వచ్చిందా? ఇక వన్డే సిరీస్‌లో నాడు ధోని సాధించిన పరుగులు వరుసగా.. 113(నాటౌట్- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 54 నాటౌట్, 36. సయీద్ అజ్మల్ ఆరోపించినట్లు నాటి మ్యాచ్‌లో రెండు సులువైన క్యాచ్‌లు వదిలేయలేదు. కేవలం ఒకటి మాత్రమే మిస్ చేశాడు. అంతేకాదు సయీద్ అజ్మల్ ఇచ్చిన క్యాచ్ పట్టి అతడిని పెవిలియన్‌కు పంపాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో అజ్మల్ 9.4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి టీమిండియా 167 పరుగులకే కుప్పకూలడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, 45 ఏళ్ల సయీద్ అజ్మల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ టీమిండియా 175 పరుగులకు ఆలౌట్ అయిందని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని హైలైట్ చేసిన ధోని అభిమానులు.. ‘‘మతిమరుపులో ఏం మాట్లాడుతున్నావో అర్థం కానట్టుంది. పైగా ధోని గురించి అవాకులు చెవాకులు పేలడం.. ఇదేం బాగాలేదు.. నువ్వు ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది’’అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్‌మెషీన్‌ను మించిపోయేలా ఉన్నాడు! -
CSK VS SRH: ఎట్టకేలకు 28 మ్యాచ్‌ల తర్వాత రిపీటైంది..!
ఐపీఎల్ 2023 సీజన్లో తొలిసారి ఓ సీన్ రిపీటైంది. సన్‌రైజర్స్-చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్ ఈ రిపీటెడ్ సీన్‌కు వేదికైంది. ఇంతకీ ఏంటా రిపీటైన సీన్ అనుకుంటున్నారా..? ఇది చదవండి. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి 28వ మ్యాచ్ వరకు ఒక్క ప్లేయర్‌కు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రెండోసారి దక్కలేదు. అయితే నిన్న జరిగిన లీగ్ 29వ మ్యాచ్‌లో ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ప్రస్తుత సీజన్లో తొలిసారి ఓ ప్లేయర్ రిపీటెడ్‌గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. లీగ్ 12వ మ్యాచ్‌లో (ముంబై) తొలిసారి ఈ సీజన్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రవీంద్ర జడేజా, నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసిన జడ్డూ.. కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టినందుకు గాను అతన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. జడేజా టైట్ బౌలింగ్, డెవాన్ కాన్వే (77 నాటౌట్) బాధ్యతాయుతమైన ఫిఫ్టి కారణంగా సీఎస్కే..సన్‌రైజర్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ గెలుపుతో పసుపు దండు 8 పాయింట్లు (0.355) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాగా, గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకుని ఆసీస్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. పునరాగమనంలో అదరగొడుతూ.. ఇప్పటివరకు (రీఎంట్రీలో) ఏకంగా 5 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, ఓ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ల వివరాలు... సీఎస్కే వర్సెస్ గుజరాత్: రషీద్ ఖాన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ కేకేఆర్: అర్షదీప్ సింగ్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఢిల్లీ: మార్క్ వుడ్ (లక్నో) రాజస్థాన్ వర్సెస్ సన్‌రైజర్స్: జోస్ బట్లర్ (రాజస్థాన్) ఆర్సీబీ వర్సెస్ ముంబై: డుప్లెసిస్ (ఆర్సీబీ) సీఎస్కే వర్సెస్ లక్నో: మొయిన్ అలీ (సీఎస్కే) గుజరాత్ వర్సెస్ ఢిల్లీ: సాయి సుదర్శన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ రాజస్థాన్: నాథన్ ఇల్లిస్ (పంజాబ్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: శార్దూల్ ఠాకూర్ (కేకేఆర్) లక్నో వర్సెస్ సన్‌రైజర్స్: కృనాల్ పాండ్యా (లక్నో) రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: యశస్వి జస్వాల్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్కే) కేకేఆర్ వర్సెస్ గుజరాత్: రింకూ సింగ్ (కేకేఆర్) సన్‌రైజర్స్‌వర్సెస్ పంజాబ్: శిఖర్ ధవన్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఆర్సీబీ: పూరన్ (లక్నో) ముంబై వర్సెస్ ఢిల్లీ: రోహిత్ శర్మ (ముంబై) రాజస్థాన్ వర్సెస్ సీఎస్కే: అశ్విన్ (రాజస్థాన్) గుజరాత్ వర్సెస్ పంజాబ్: మోహిత్ శర్మ గుజరాత్) సన్‌రైజర్స్ వర్సెస్ కేకేఆర్: హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్) ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ: విరాట్ కోహ్లి (ఆర్సీబీ) పంజాబ్ వర్సెస్ లక్నో: సికందర్ రజా (పంజాబ్) ముంబై వర్సెస్ కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్) రాజస్థాన్ వర్సెస్ గుజరాత్: షిమ్రోన్ హెట్‌మైర్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ: డెవాన్ కాన్వే (సీఎస్కే) ముంబై వర్సెస్ సన్‌రైజర్స్: కెమారూన్ గ్రీన్ (ముంబై) లక్నో వర్సెస్ రాజస్థాన్: మార్కస్ స్టోయినిస్ (లక్నో) ఆర్సీబీ వర్సెస్ పంజాబ్: మహ్మద్ సిరాజ్ (ఆర్సీబీ) ఢిల్లీ వర్సెస్ కేకేఆర్: ఇషాంత్ శర్మ (ఢిల్లీ) సీఎస్కే వర్సెస్ సన్‌రైజర్స్: జడేజా (సీఎస్కే) రీఎంట్రీలో జడేజా గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆసీస్‌తో తొలి టెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆసీస్‌తో రెండో టెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ (సంయుక్తంగా) ఆసీస్‌తో తొలి వన్డే ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌పై ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్‌పై -
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 'ఇలా' తొలిసారి
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్‌ల్లో 26 మంది వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్్ ద మ్యాచ్ అవార్డులకు ఎంపికయ్యారు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇన్ని వరుస మ్యాచ్‌ల్లో వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులకు ఎంపిక కాలేదు. ప్రస్తుత ఐపీఎల్లో ఇలా జరగడం శుభపరిణామమని అభిమానులు అనుకుంటున్నారు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు సత్తా చాటడం క్రికెట్‌ను ఫాలో అయ్యే వాళ్లకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, ఈ ఐపీఎల్ సీజన్లో అన్ని జట్ల ఆటగాళ్ల ప్రదర్శన అమోఘంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ల వివరాలు... సీఎస్కే వర్సెస్ గుజరాత్: రషీద్ ఖాన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ కేకేఆర్: అర్షదీప్ సింగ్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఢిల్లీ: మార్క్ వుడ్ (లక్నో) రాజస్థాన్ వర్సెస్ సన్‌రైజర్స్: జోస్ బట్లర్ (రాజస్థాన్) ఆర్సీబీ వర్సెస్ ముంబై: డుప్లెసిస్ (ఆర్సీబీ) సీఎస్కే వర్సెస్ లక్నో: మొయిన్ అలీ (సీఎస్కే) గుజరాత్ వర్సెస్ ఢిల్లీ: సాయి సుదర్శన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ రాజస్థాన్: నాథన్ ఇల్లిస్ (పంజాబ్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: శార్దూల్ ఠాకూర్ (కేకేఆర్) లక్నో వర్సెస్ సన్‌రైజర్స్: కృనాల్ పాండ్యా (లక్నో) రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: యశస్వి జస్వాల్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్కే) కేకేఆర్ వర్సెస్ గుజరాత్: రింకూ సింగ్ (కేకేఆర్) సన్‌రైజర్స్‌వర్సెస్ పంజాబ్: శిఖర్ ధవన్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఆర్సీబీ: పూరన్ (లక్నో) ముంబై వర్సెస్ ఢిల్లీ: రోహిత్ శర్మ (ముంబై) రాజస్థాన్ వర్సెస్ సీఎస్కే: అశ్విన్ (రాజస్థాన్) గుజరాత్ వర్సెస్ పంజాబ్: మోహిత్ శర్మ గుజరాత్) సన్‌రైజర్స్ వర్సెస్ కేకేఆర్: హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్) ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ: విరాట్ కోహ్లి (ఆర్సీబీ) పంజాబ్ వర్సెస్ లక్నో: సికందర్ రజా (పంజాబ్) ముంబై వర్సెస్ కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్) రాజస్థాన్ వర్సెస్ గుజరాత్: షిమ్రోన్ హెట్‌మైర్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ: డెవాన్ కాన్వే (సీఎస్కే) ముంబై వర్సెస్ సన్‌రైజర్స్: కెమారూన్ గ్రీన్ (ముంబై) లక్నో వర్సెస్ రాజస్థాన్: మార్కస్ స్టోయినిస్ (లక్నో) -
MI VS CSK: వారెవ్వా జడ్డూ భాయ్.. నువ్వు సూపర్.. ఎందుకో చదవండి..!
ఇటీవలికాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, సీఎస్కే కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా పట్టిందల్లా బంగారమే అవుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోట విజయమే పలకరిస్తుంది. గాయం కారణంగా గతేడాది ఓ మోస్తరు విరామం తీసుకున్న జడ్డూ భాయ్, ఆ మధ్యలోనే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రివాబాను ఎమ్మెల్యేగా గెలిపించుకుని, ఆతర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలో తొలి మ్యాచ్‌లోనే (రంజీ ట్రోఫీతో తమిళనాడుపై 8 వికెట్లు) అదరగొట్టిన జడ్డూ భాయ్, ఆతర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సిరీస్‌లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన అతను, భారత్ గెలిచిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుపొందాడు. అతర్వాత ఆసీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెచ్చిపోయిన జడేజా, తొలి వన్డేలో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా జడ్డూ మరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకుని, ఈ అవార్డుకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు. ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో (4-0-20-3) అద్భుత ప్రదర్శన కనబర్చి ఈ అవార్డును దక్కించుకున్నాడు. గత 10 మ్యాచ్‌ల్లో జడేజా ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగో సారి కావడం విశేషం. మరో విశేషమేమిటంటే.. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా.. అమిత్ మిశ్రా (12), రహానే (12), కేఎల్ రాహుల్‌లతో సమంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (18) అగ్రస్థానంలో ఉండగా.. ధోని (17), యూసఫ్ పఠాన్ (16), కోహ్లి (14), రైనా (14), గంభీర్ (13) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో ఉన్నారు. -
'నేనేం గాలిలో తేలడం లేదు.. తగలాల్సిన చోట తగిలింది'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. కోహ్లి కెరీర్లో ఇది 28వ శతకం. డబుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగిన కోహ్లి తన ఇన్నింగ్స్‌తో టీమిండియా 571 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం వచ్చేలా చేశాడు. అయితే ఈ టెస్టు సెంచరీకి ముందు కోహ్లిపై మరోసారి విమర్శలు వచ్చాయి. వన్డేలు, టి20ల్లో మాత్రమే కోహ్లిని ఆడించండి.. టెస్టులకు పక్కనబెట్టండి.. అంటూ పేర్కొన్నారు. కానీ కోహ్లి ఎన్నడూ వారి మాటలను పట్టించుకోలేదు. కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో వరుసగా శతకాలతో రెచ్చిపోయాడు. కానీ ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం కోహ్లి ఆకట్టుకోలేదంటూ వార్తలు రాశారు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది కోహ్లి ఆటపై కాదు.. పిచ్ తీరు గురించి. ఎందుకంటే తొలి మూడు టెస్టుల్లో కోహ్లియే కాదు ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుంటూ బ్యాటర్లు ఎలా పరుగులు చేయగలరు. పైగా మూడు టెస్టులో ఒకేరీతిలో రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. మరి ఇలా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగుస్తుంటే కోహ్లి మాత్రం ఎలా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సరైన బ్యాటింగ్ పిచ్ కోసం కోహ్లి ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులు మలి టెస్టులోనే ఫలించాయి. అహ్మదాబాద్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై కోహ్లి తన పవరేంటో చూపించాడు. ఒక్క సెంచరీతో చాలా మంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు తీసుకుంటూ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈ ఒక్క సెంచరీతో నేనేం గాల్లో తేలడం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు.. కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదు. విఫలమయ్యానన్న ప్రతీసారి నిలదొక్కుకుంటూ వస్తున్నా. ఎవరికి తగలాలో వాళ్లకి గట్టిగానే తగిలింది. నేను ఎందుకు ఫీల్డ్‌లో కొనసాగుతున్నానో చూపించాలనుకున్నా.. చూపించా. ఇక ఆట ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. నా డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. నాగ్‌పూర్ టెస్టు నుంచి బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినప్పటికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించిన తొలి మూడు టెస్టుల్లో బ్యాటింగ్‌లో రాణించేందుకు గతంలోలాగే నా శాయాశక్తులా ప్రయత్నించా. కానీ బ్యాటింగ్ సరిగా చేయకపోవడంతో కొంత నిరాశకు గురయ్యా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
Ravindra Jadeja: కోహ్లి, అశ్విన్‌లతో సమానమయ్యాడు.. నెక్స్ట్ టార్గెట్ అనిల్ కుంబ్లే
BGT 2023 IND VS AUS 2n Test: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం విధితమే. గాయం కారణంగా (ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు) గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్.. వచ్చీ రాగానే టెస్ట్‌ల్లో తన మార్కు హవాను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో (5/47, 70, 2/34) పాటు కీలకమైన హాఫ్‌సెంచరీ చేసిన జడ్డూ.. న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో బంతితో భీకర స్థాయిలో విజృంభించి ఏకంగా 10 వికెట్లు (3/68, 26, 7/42) పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో పర్వాలేదనిపించిన జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన 26 పరుగులు స్కోర్ చేశాడు. 10 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టి, ఆసీస్ వెన్నులో వణుకు పుట్టించినందుకు గాను జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును జడేజా తన 62 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్లో తొమ్మిదోసారి అందుకున్నాడు. ఈ అవార్డు అందుకునే క్రమంలో జడ్డూ.. సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లిల రికార్డును సమం చేశాడు. కోహ్లి తన 106 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్లో 9 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకోగా.. అశ్విన్ 90 టెస్ట్‌ల కెరీర్లో ఇన్నే సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు. జడ్డూ మరోసారి టెస్ట్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంటే, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేస్తాడు. భారత తరఫున అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జడేజా, అశ్విన్, కోహ్లి వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో 200 టెస్ట్‌లు ఆడిన సచిన్ 14 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా.. 163 టెస్ట్‌లు ఆడిన ద్రవిడ్ 11 సార్లు, 132 మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే 10 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున జడేజా ఈ సిరీస్‌లోనే ద్రవిడ్ రికార్డును కూడా సమం చేసే అవకాశం ఉంది. ఇండోర్‌లో మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, అహ్మదాబాద్‌లో మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం టీమిండియా ఆసీప్తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, వైజాగ్, చెన్నైల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. -
Ravindra Jadeja: 'నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా..'
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో మరోసారి తన ముద్ర చూపించాడు. దాదాపు ఐదు నెలలు ఆటకు దూరమైనప్పటికి రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అలరించి ఆల్‌రౌండర్ అనే పదానికి మరోసారి సరైన నిర్వచనం చెప్పాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన జడ్డూ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా 70 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 88 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టమైన స్థానంలో నిలిపాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు గానూ జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విజయం అనంతరం జడేజా మాట్లాడాడు. ''అద్భుతమమైన అనుభూతి కలుగుతుంది. దాదాపు ఐదు నెలల తర్వాత క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చి వంద శాతం ప్రదర్శన(బ్యాట్‌తో పరుగులు, బంతితో వికెట్లు) ఇస్తే ఎవరికైనా సంతోషమే కలుగుతుంది. రీఎంట్రీలో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. రీఎంట్రీకి ముందు ఎన్సీఏలో చాలా కష్టపడ్డా.. అందుకు సహకరించిన ఎన్సీఏ స్టాఫ్‌తో పాటు ఫిజియోలకు ప్రత్యేక కృతజ్థతలు. ఒక్కోసారి ఆదివారాలు కూడా నాకోసం పనిచేసేవారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంతి వికెట్ల మీదకు వస్తుండడంతో మా పని సులవుగా మారింది. ఆసీస్ ఆటగాళ్లు తప్పు చేశారంటే మాకు చాన్స్ వచ్చినట్లే. దానిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. ఇక బ్యాటింగ్‌లోనూ రాణించడం మంచి పరిణామం. ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తున్నామన్నది ముఖ్యం కాదు.. 5,6,7.. ఇలా ఏ స్థానమైన నాకు పర్లేదు.. ఎందుకంటే చివరికి నా బ్యాట్ నుంచి వచ్చేది పరుగులే కాబట్టి.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
FIFA WC: తండ్రి మారడోనాతో.. కొడుకు మెస్సీతో
అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా, పోలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో పోలాండ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమి పాలైన రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ కూడా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. అర్జెంటీనా మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌లో ఒకటి జట్టు మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్ చేశాడు. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనాకు గోల్ అందించాడు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అలిస్టర్‌కు ఇచ్చేశాడు. దీని వెనుక ఒక కారణం ఉంది. అలెక్సిస్ మాక్ అలిస్టర్ తండ్రి కార్లోస్ మాక్ అలిస్టర్ కూడా ఫుట్‌బాలర్‌గా జట్టుకు సేవలందించాడు. కార్లోస్ దిగ్గజం మారడోనాతో కలిసి అర్జెంటీనాతో పాటు బోకా జూనియర్స్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మారడోనాతో కలిసి తండ్రి కార్లోస్ అలిస్టర్ ఆడితే.. ఇప్పటితరం గొప్ప ఆటగాళ్లలో ఒకడైన లియోనల్ మెస్సీతో కలిసి కొడుకు అలెక్సిస్ మాక్ అలిస్టర్ వేదికను పంచుకున్నాడు. అందుకే మెస్సీ అలెక్సిస్ తండ్రిపై ఉన్న గౌరవంతో అతనికి వచ్చిన అవార్డును అలెక్సిస్‌కు అందించాడు. ఇదే విషయమై అలెక్సిస్ మాక్ అలిస్టర్ స్పందింస్తూ.. ఇది ఎప్పటికి మరిచిపోలేనిది. నా తండ్రి దిగ్గజం మారడోనాతో కలిసి ఆడడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు నా ఆరాధ్య దైవం మెస్సీతో కలిసి ఆడడం మరిచిపోలేని అనుభూతి. అతను నాకు ట్రైనింగ్ ఇస్తున్న తీరుకు ఫిదా అయ్యా. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న అర్జెంటీనా డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అటు పోలాండ్ డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు' -
యాదృచ్చికం.. కింగ్ కోహ్లి, సూర్య భాయ్ ఒకేలా..!
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కెరీర్లు ఒకే రకంగా సాగకపోయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఈ ఇద్దరికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. జట్టులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరూ..యాదృచ్చికం ఓ విషయంలో ఒకే రకమైన గణాంకాలు కలిగి ఉన్నారు. అదేంటంటే.. పొట్టి క్రికెట్లో ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. తమ టీ20 కెరీర్లో 9వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును 39వ ఇన్నింగ్స్‌లోనే గెలుపొందారు. Fact of the day:Virat Kohli Had Won his '9th T20I M.O.M Award' in his 39th Inning! Suryakumar Yadav Won his '9th T20I M.O.M Award' in his 39th Inning!— IPLnCricket | Everything 'Cricket' & #IPL2023 🏏 (@IPLnCricket) November 24, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ పోటీపడి మరీ పరుగులు సాధించారు. మెగా టోర్నీలో చెరో 6 మ్యాచ్‌లు ఆడిన ఇద్దరూ.. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 1, 3 స్థానాల్లో నిలిచారు. కోహ్లి 4 హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేయగా.. సూర్య 3 అర్ధశతకాలతో 239 రన్స్ చేశాడు. వీరిద్దరూ రాణించినప్పటికీ.. టీమిండియా వరల్డ్‌కప్‌లో సెమీస్ గండాన్ని దాట లేకపోయింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జగజ్జేతగా కూడా అవతరించింది. వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇదివరకే భారత జట్టు 1-0 తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకోగా.. రేపటి నుంచి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో సూర్య భాయ్ సుడిగాలి శతకంతో చెలరేగిపోయాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
Ind Vs Pak: ఏం మాట్లాడాలో తెలియట్లేదు.. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(82 నాటౌట్-53 బంతుల్లో 6X4, 4X6) అద్బుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానలు రోమాలు నిక్కొబొడిచేలా చేసింది. మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ' కోహ్లి మాట్లాడాడు. 'ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదంతా ఎలా జరగిందో ఐడియా లేదు. నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరం చివరి వరకు క్రీజులో నిలబడితే విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్య బలంగా నమ్మాడు. షహీన్ అఫ్రిదీ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్‌కు రాగానే ఆ ఓవర్లో పరుగులు రాబట్టాలని డిసైడ్ అయ్యాం. హరిస్ రౌఫ్ వాళ్లకు ప్రధాన బౌలర్. అతని బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదా. స్పిన్నర్ నవాజ్‌కు ఇంకో ఓవర్ మిగిలి ఉందని తెలుసు. అందుకే సింపుల్ కాల్కులేషన్తో హరీస్ బౌలింగ్‌లో అటాక్ చేస్తే పాక్ టీం భయపడుతుందని అనుకున్నాం. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు సిక్సర్లతో 6 బంతుల్లో 16 పరుగులే కావాల్సి వచ్చింది. నా సహజ ప్రవృత్తిని కట్టుబడి ఆడా. ఇప్పటివరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే నా కేరీర్లో బెస్ట్. కానీ ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంతకంటే ఎక్కువ. హార్దిక్ నన్ను పద పదే ఎంకరేజ్ చేశాడు. క్రౌడ్ నుంచి స్పందన అద్భుతం. నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వాళ్లకు రుణపడి ఉంటా' - మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ. 160 పరుగుల లక్ష్య చేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయపథంలో నడిపాడు కోహ్లి. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌తో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
ఆ అవార్డును మా అమ్మకు అంకితమిస్తున్నా: మెకాయ్
సెయింట్స్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. విండీస్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెద్ మెకాయ్ కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను మెకాయ్ ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపి ఆదిలోనే భారత్‌ను మెకాయ్ దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో మెకాయ్ 17 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మెకాయ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన మెకాయ్.. తనకు దక్కిన ఈ అవార్డును అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. తను ఒక ఉత్తమ ఆటగాడిగా ఎదగడంలో తన తల్లి కీలక పాత్ర పోషించదని మెకాయ్ అన్నాడు. "దేవుడికి కృతజ్ణతలు చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడు దయ వల్ల ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించగలిగాను. నాకు దక్కిన ప్లేయర్ ఆప్‌ది మ్యచ్‌ను మా అమ్మకు అంకిమిస్తున్నా. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. అయినప్పటికీ నన్ను ఆమె ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఈ అవార్డును తనకి అంకితమివ్వాలి అనుకుంటున్నాను. ఇక తొలి బంతికే వికెట్ సాధించి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చింది. పవర్‌ప్లేలో ఎప్పుడూ నేను వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నిస్తాను. తొలి టీ20లో నేను అంతగా రాణించలేకపోయాను. అయితే అప్పుడు చేసిన తప్పులను ఈ మ్యాచ్‌లో సరిదిద్దు కోవడం సంతోషంగా ఉంది" అని మెకాయ్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం(ఆగస్టు2)న జరగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20: లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 138 (19.4) ►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2) ►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు ►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే! -
బాబర్ ఆజం ఊహించని చర్య.. ఆ ఆటగాడి కోసం!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన క్రీడా స్పూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజాం(103) సెంచరీతో చెలరేగి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బాబర్ ఆజాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే బాబర్ అందరనీ ఆశ్చర్యపరుస్తూ.. తనకు దక్కిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ షాకు బాబర్ అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాబర్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఖుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఖరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించి జట్టుకు ఖుష్దిల్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్‌పై విజయం చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! Beautiful gesture from the skipper 😍@babarazam258 gives his player of the match award to @KhushdilShah_ 🏆👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/7BrSiV7TyL — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే!
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో.. 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అవేష్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అద్భత ప్రదర్శన చేసిన అవేష్ ఖాన్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆసుపత్రిలో తన తల్లికి అవేష్ ఖాన్ అంకితం చేసాడు. "నాకు దక్కిన ఈ అవార్డును ఆసుపత్రిలో ఉన్న మా అమ్మకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఆమె నాకు చాలా సపోర్ట్‌గా ఉండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత, నేను మా అమ్మతో వీడియో కాల్లో మాట్లాడాను. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను ఆమెతో చెప్పాను. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల ఆమె సంతోషించింది. దేవుని దయతో, ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది అని మ్యాచ్ అనంతరం ఇంటరాక్షన్‌లో అవేష్ ఖాన్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..! Stylish fifty 👌 Game-changing 4️⃣-wicket haul 💥 Special dedication 🤗@Avesh_6 & @HoodaOnFire - stars of the @LucknowIPL's win over #SRH - discuss their favourite moments from the #SRHvLSG clash. 👍👍 - By @ameyatilak Full interview 🎥 🔽 #TATAIPLhttps://t.co/C0nlc61PbZ pic.twitter.com/sUgmRaVTkU — IndianPremierLeague (@IPL) April 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అక్షర్ పటేల్..
Axar Patel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021సెకెండ్ ఫేజ్ లో రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే వారి చివరి రెండు విజయాల్లో ఆ జట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్టార్ట్ స్పిన్నర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గత రెండు మ్యాచులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఐపీఎల్లో ఒక స్పిన్నర్ ఇలా వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం 2011 తర్వాత ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ లో పంచుకుంది. కాగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో అక్షర్ పటేల్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. చదవండి: T20 World Cup: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! That feeling of becoming the first spinner to win consecutive MOTM awards in IPL, since 2011 😏#YehHaiNayiDilli #IPL2021 #DCvCSK pic.twitter.com/PQYn7f34AQ — Delhi Capitals (@DelhiCapitals) October 5, 2021 -
అసలు హీరో శార్దూల్ ఠాకూర్.. నాకంటే అతనే అర్హుడు
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయం వెనుక జట్టు సమిష్టి కృషి ఉందనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీకి ఎంత విలువ ఉందో.. శార్దూల్ ఠాకూర్ ట్విన్ హాఫ్ సెంచరీలకు అంతే ప్రాధాన్యం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు రెండుగా చీలిపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రోహిత్ శర్మ అర్హుడని కొందరు అంటే.. లేదు శార్దూల్‌కే ఆ అర్హత ఉందని మరికొందరు వాదించారు. ప్రస్తుతం ఇది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే రోహిత్ శర్మ తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడంపై మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు. చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర ''నాలుగో టెస్టులో అసలు హీరో శార్దూల్ ఠాకూర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకంటే శార్దూల్‌కు ఇచ్చి ఉంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. తొలి ఇన్నింగ్స్‌లో తామంతా బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు శార్దూల్ మాత్రం మెరుపు అర్థసెంచరీతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటైన తర్వాత పంత్‌తో కలిసి దాదాపు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే గాక మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్‌లోనూ తన సత్తా ఏంటో చూపించాడు. 100 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను దెబ్బతీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇలాంటి మొమరబుల్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్‌కు ఇవే నా కృతజ్ఞతలు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు నాకంటే శార్దూల్‌కే ఎక్కువ అర్హతలున్నాయి. ఏది ఏమైనా నా దృష్టిలో నేను ఈ అవార్డును శార్దూల్‌తో పంచుకున్నా. ప్రస్తుతం ఫామ్ దృశ్యా అందరం అద్భుతంగా ఉన్నాం.. ఇక సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడం సంతోషంగా అనిపిస్తుంది. చివరి మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రతిభను కనబరిచి 3-1తో సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.దీనిని ఇలాగే కొనసాగిస్తాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Kohli Winning Celebration: వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా