MG Motors
-
ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన ఎంజీ మోటార్: ధర & వివరాలు
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ లైనప్‌ను విస్తరించడంతో భాగంగా.. ఒకేసారి రెండు కొత్త 7 సీటర్ వేరియంట్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి హెక్టర్ ప్లస్ 7 సీటర్ 'సెలెక్ట్ ప్రో' కాగా, మరొకటి 'స్మార్ట్ ప్రో'. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.19.71 లక్షలు, రూ.20.64 లక్షలు.హెక్టర్ ప్లస్ 7 సీటర్ సెలెక్ట్ ప్రో వేరియంట్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్లు వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఐ-స్మార్ట్ టెక్నాలజీతో కూడిన 14 ఇంచెస్ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారులో సుమారు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ బ్లేడ్-స్టైల్ కనెక్టెడ్ టెయిల్ లాంప్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందిన కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ లెథెరెట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..లేటెస్ట్ డిజైన్ కలిగిన ఎంజీ హెక్టర్ ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ వంటి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్లకు ఎంజీ షీల్డ్ ప్రోగ్రామ్ కింద.. 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న 'మిఫా 9' ఇదే..
భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో 'మిఫా 9' (Mifa 9) ఎంపీవీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ కారు విక్రయాలు 2025 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నట్లు సమాచారం.ఎంజీ మిఫా 9 కారు 2023లోనే మొదటిసారి ఆటో ఎక్స్పోలోలో కనిపించింది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కీయ కార్నివాల్‌కు ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు ఒట్టోమన్ సీట్లతో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫ్రంట్ ఫాసియా అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఉంటుంది. వెనుకవైపు ఎంపివి మధ్యలో లైట్ బార్‌తో వీ షేప్ ఎల్ఈడీ టైల్లైట్ సెటప్ ఉంటుంది. ఇది పవర్ స్లైడింగ్ రియర్ డోర్స్ పొందనున్నట్లు సమాచారం. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కాగా కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్
హైదరాబాద్: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించిన భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్ రూపొందింది. స్టార్బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఎంజీ విండ్సర్ ఎక్సైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్ రూ. 14,49,800, ఎసెన్స్ రూ. 15,49,800లుగా కంపెనీ పేర్కొంది. విండ్సర్ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది IP67 సర్టిఫికెట్ పొందింది. నాలుగు (ఎకో ప్లస్+, ఎకో, నార్మల్, స్పోర్ట్) డ్రైవింగ్ మోడ్లతో 100KW (136ps) పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. రేంజ్ (ARAI) అందిస్తుంది. ఈ వాహనానికి బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. -
సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేయొచ్చు!.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగా కొంత మంది ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ ఇండియా.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది.ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంజీ మోటార్.. హెచ్పీసీఎల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు హైవేలపై, ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 50 kW, 60 kW DC ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నారు. ఫలితంగా ఇకపై ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారు నిశ్చింతగా కొనేయొచ్చు.‘‘భారతదేశంలో హెచ్‌పీసీఎల్ భారీగా విస్తరిస్తోంది. ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీల పునర్వినియోగం వంటి అంశాలపై కొత్తగా సమర్థమైన చర్యలు తీసుకోవచ్చు.’’ అని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.దేశమంతటా 15,000 ఛార్జింగ్ స్టేషన్స్ఇప్పటికే ఎంజీ మోటార్ కంపెనీ.. టాటా పవర్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఫోర్టమ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 15,000 పబ్లిక్, ప్రైవేట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేసింది. పబ్లిక్ EV ఛార్జర్ల ఇన్స్టాలేషన్ కోసం ఈ కార్ల తయారీ సంస్థ భారత్ పెట్రోలియం, జియో-బీపీతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది.హెచ్‌పీసీఎల్ 3600 ఛార్జింగ్ స్టేషన్స్హెచ్పీసీఎల్ కంపెనీ కూడా అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో ఈవీ ఛార్జీల నెట్‌వర్క్‌ను విస్తరించాయి. హెచ్‌పీసీఎల్ దేశవ్యాప్తంగా 3600 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2024 చివరి నాటికి 5000కు పెంచాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. -
ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతీ తరహా విప్లవం.. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు. ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
ఎంజీ మోటార్స్.. ఏడాది చివరి నాటికి 400 షోరూమ్స్ దిశగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాదాపు 330 స్టోర్స్ ఉండగా.. ఏడాది ఆఖరు నాటికి వీటిని 400కు పెంచుకోనుంది. తెలంగాణలో 9 స్టోర్స్ ఉండగా.. వీటిని 20కి పెంచుకోనుంది. హైదరాబాద్‌లో కొత్తగా మూడు స్టోర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డిప్యుటీ ఎండీ గౌరవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. తెలంగాణలో 13,000 పైచిలుకు వాహనాలను విక్రయించినట్లు ఆయన వివరించారు. గతేడాది ఇక్కడ 4,000 పైచిలుకు వాహనాలను విక్రయించగా, ఈసారి 5,000 వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పుంజుకుంటోందని చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తమ స్టోర్స్ ఉన్నట్లు తెలిపారు. ఏడాదికో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ముందుకెడుతున్నామని.. వచ్చే సంవత్సరం మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం హెక్టర్, జియస్, కామెట్ తదితర వాహనాలను విక్రయిస్తోంది. -
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్‌తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్‌క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్‌లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్‌గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్‌లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
అమ్మకాల్లో అదరగొట్టిన ఎంజీ మోటార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా 2023 జనవరి–జూన్‌లో దేశవ్యాప్తంగా 29,000 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రంగ ప్రవేశం చేసిన హెక్టర్ తదుపరి తరం వేరియంట్‌తోపాటు జడ్ఎస్ ఈవీకి భారీ డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని వెల్లడించింది. కంపెనీ నుంచి అత్యధికంగా 2023 మార్చిలో 6,051 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎంజీ మోటార్ ఇండియా భారత్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. హలోల్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ఈ ఏడాది 1.5 లక్షల యూనిట్లను చేర్చనుంది. ఈ ప్లాంటు విస్తరణకు రూ.820 కోట్లు వెచ్చిస్తోంది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. 2028 నాటికి దేశంలో కార్యకలాపాల విస్తరణకు రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోంది. -
అమ్మకాల్లో పావు వంతు ఈవీలే
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కైవసం చేసుకుంటాయని భావిస్తోంది. ఈవీ విభాగంలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుండడం ఇందుకు కారణమని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ఈవీలు విక్రయించామని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 2023 జనవరి–జూన్‌లో 20.62 శాతం వృద్ధితో మొత్తం 29,040 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో ఈ సంఖ్య 48,063 యూనిట్లు నమోదైంది’ అని వివరించారు. కొత్త వేరియంట్ ఫీచర్లు ఇవే.. జడ్ఎస్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అటానమస్ లెవెల్–2తో (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొలిషన్ వారి్నంగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్స్, లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి 17 రకాల ఫీచర్లను జోడించారు. ఇందులోని 176 పీఎస్ పవర్‌తో కూడిన 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పరిమిత కాల ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.27.89 లక్షలు ఉంది. కంపెనీ నుంచి రెండవ ఈవీ అయిన కామెట్ ఎక్స్‌షోరూం ధర రూ.7.98 లక్షలు పలుకుతోంది. భారత్‌లో ఇదే చవకైన ఈవీ. -
మరింత అందంగా తయారైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!
MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్‌తో పాటు రూప్ రైల్స్, టెయిల్ల్యాంప్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్‌స్టార్మ్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్‌ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్‌బోర్డ్‌లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) Presenting THE ADVANCED GLOSTER BLACKSTORM with an all-new dark exterior, sporty-red accents and a luxurious dark-theme interior. With its Intelligent 4X4, 7-Terrain Modes & ADAS features you can take on anything the road throws at you and #DriveUnstoppable on your adventures! pic.twitter.com/bTqkG6BaLK — Morris Garages India (@MGMotorIn) May 29, 2023 ఇంజిన్ & పర్ఫామెన్స్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
చీపెస్ట్ ఈవీ ‘ఎంజీ కామెట్’ వెయిటింగ్‌కు చెక్: బుకింగ్ ప్రైస్ తెలిస్తే!
సాక్షి, ముంబై: ఎంజీ మోటార్స్ కాంపాక్ట్ ఈవీ కామెట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కంపెనీ తీపి కబురు. భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఇవీ ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఎంజీ మోటార్ ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్లు కేవలం రూ. 11వేలు మాత్రమే చెల్లించి మే బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ‘MyMG’ యాప్‌లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ కార్ బుకింగ్‌ల స్టేటస్‌ను వారి ఫోన్ల నుండే ట్రాక్ చేయవచ్చు. కామెట్ ఈవీ ప్రత్యేక ఆఫర్ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ప్లే, ప్లష్ వేరియంట్ ధరలు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఆఫర్ మొదటి 5వేల బుకింగ్‌లకు మాత్రమే పరిమితం. మే నెలలోనే దశలవారీ డెలివరీలు ప్రారంభమని కంపెనీ తెలిపింది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) కామెట్ ఈవీ: 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ట్విన్ డిస్ప్లే వైడ్స్క్రీన్తో వస్తోంది. ఫుల్లీ కస్టమైజ్డ్ విడ్జెట్లతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ కీ మరో ప్రత్యేక లక్షణం, స్టైలిష్ డిజైన్ కామెట్ ఒకే ఛార్జ్‌పై దాదాపు 230 కి.మీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. Introducing the MG Comet EV, the no-nonsense car that keeps it real. The car’s latest tech keeps you connected with your squad and has all the space for your fam. Experience the plush interiors, latest tech and futuristic design of the Comet EV! Bookings open now! #MGCometEV — Morris Garages India (@MGMotorIn) May 13, 2023 ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
భారత్‌లో ఎంజీ మోటార్ రెండో ప్లాంటు!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. 2028 నాటికి మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 65–75 శాతానికి చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్య కంపెనీ లేదా థర్డ్ పార్టీ ద్వారా సెల్ తయారీ, హైడ్రోజన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీలోని ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో ఉద్యోగుల సంఖ్యను 20,000 స్థాయికి చేర్చాలని భావిస్తోంది. మెజారిటీ వాటా విక్రయం.. వచ్చే 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను స్థానిక భాగస్వాములకు విక్రయించాలన్నది ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళిక. 2028 నాటికి దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ.. తదుపరి దశ వృద్ధికి నిధులు సమకూర్చేందుకు కొంత కాలంగా మూలధనాన్ని సమీకరించాలని చూస్తోంది. చైనా నుండి భారత్‌కు మరింత మూలధనాన్ని తీసుకురావాలన్న కంపెనీ ప్రణాళికలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఎంజీ మోటార్ ఇండియా మూలధనాన్ని పెంచడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభించింది. లక్ష మంది విద్యార్థులు.. ఎంజీ నర్చర్ కార్యక్రమం కింద 1,00,000 మంది విద్యార్థులను ఈవీ, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ ఛాబా తెలిపారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ చేతుల్లో ఉంది. భారత మార్కెట్లో హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. ఇటీవలే చిన్న ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను ఆవిష్కరించింది. -
ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి
ఎంజి మోటార్ ఇండియా ఇటీవల తన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచ్ సమయంలో కంపెనీ కేవలం ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది, కాగా ఇప్పుడు వేరియంట్స్, వాటి ధరలను కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు: ఎంజి కామెట్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి పేస్ (Pace), ప్లే (Play), ప్లస్ (Plus). ఈ మూడు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 7.98 లక్షలు, రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెల చివర నాటికి మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే మొదటి బుక్ చేసుకున్న 5000 మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తిస్తాయి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. (ఇదీ చూడండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన ఎంజి కామెట్ చూడటానికి చిన్నదిగా ఉన్నపటికీ మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. రెండు వింగ్ మిర్రర్స్ కనెక్టెడ్ క్రోమ్ స్రిప్ కలిగి ముందు వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బాస్ కలిగి, సైడ్ ప్రొఫైల్ 12 ఇంచెస్ వీల్స్ తో ఉంటుంది. రియర్ ఫ్రొఫైల్ లో కూడా వెడల్పు అంతటా వ్యాపించి ఉండే లైట్ బార్ చూడవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ముందు భాగంలో ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి లోపల వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ముందు ప్యాసింజర్ సీటులో వన్ టచ్ టంబుల్ అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. అయితే రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చూడండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?) బ్యాటరీ అండ్ రేంజ్: ఎంజి కామెట్ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ పొందుతుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. ఇది 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కామెట్ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్‌తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. -
మొదలైన 'ఎంజీ కామెట్' టెస్ట్ డ్రైవ్స్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
ఇటీవల భారతదేశంలో విడుదలైన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ కామెట్' ఎంతో మంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు 2023 మే 15 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు, టెస్ట్ డ్రైవ్స్ వంటి వివరాలు ఇక్కడ చూసేద్దాం.. గత నెల చివరిలో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా డెలివరీలు మే నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఎంజి కామెట్ చూడటానికి చిన్న కారు అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ కలిగి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ లైట్ బార్ కింద ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న కారు 10.25 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే రెండూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు 55కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) 3.67 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI దృవీకరించింది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఎంజి కామెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎంజీ ఇండియా నుంచి మరో చిన్న ఎలక్ట్రిక్ కార్
-
రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్ కామెట్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.98 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 17.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఏడు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. రెండు డోర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ ఇప్పటికే భారత్‌లో జడ్ఎస్ ఈవీ మోడల్‌ను విక్రయిస్తోంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో కామెట్ కార్లను తయారు చేస్తున్నారు. -
ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చేస్తున్న ఎంజీ బుజ్జి ఈవీ కామెట్ లాంచ్ అయింది. అందరూ ఊహించినట్టుగానే రూ. 10లక్షల లోపు ధరతోనే తీసుకొచ్చింది. పరిచయ ఆఫర్‌గా దీని ప్రారంభ ధరను రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిటీ రన్‌అబౌట్ కోసం చూస్తున్న కొనుగోలుదారులే లక్ష్యంగా స్పోర్టీ లుక్, యూనిక్ కలర్స్‌లో కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసింది. అందుబాటులో లభ్యం కానున్న ఈ కారు ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువేనని సగటున నెలకు ధర రూ. 519 ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ధర, లభ్యత కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్). ఏప్రిల్ 27 నుండి టెస్ట్ డ్రైవ్‌కి అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు నెల తర్వాత మొదలవుతాయి. వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బ్లాక్ రూఫ్‌తో గ్రీన్, బ్లాక్ రూఫ్‌తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో ) ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ఫీచర్లు ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఇది 41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో కామెట్ ఈవీని తీసుకొచ్చింది. 2,974mm పొడవు, 1,505mm వెడల్పు ,1,640mm ఎత్తును 2,010mm వీల్‌బేస్‌తో వచ్చింది. ఇక పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారతదేశంలో లభించే ఇతర చిన్న కారు ఆల్టో K10 కంటే , కామెట్ ఈవీ కంటే 556 మిమీ పొడవు తక్కువ. 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్లలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేగా, రెండోది ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేగా ఉంటుంది. యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఆటో కంట్రోల్‌లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇంకా 12 ఇంచుల వీల్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. టాటా టియాగో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కార్లకు ఎంజీ కామెట్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుంది. టాటా టియాగోతో పోలిస్తే ధర కూడా తక్కువే కావడం గమనార్హం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
ఎంజీ మోటార్లో జేఎస్డబ్ల్యూకి వాటా!
న్యూఢిల్లీ: ఆటోరంగ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో వాటా కొనుగోలుకి డైవర్సిఫైడ్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీవైడీ ఇండియాలోనూ వాటాను సొంతం చేసుకునేందుకు స్టీల్ నుంచి స్పోర్ట్ వరకూ విభిన్న బిజినెస్‌లు కలిగిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఉత్సాహంగా చర్చిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎఫ్‌వో శేషగిరి రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. వెరసి ఫోర్ వీలర్స్ తయారీపై గ్రూప్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. తద్వారా మరిన్ని రంగాలలోకి గ్రూప్ విస్తరించనున్నట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం అటు ఎంజీ మోటార్ ఇండియా, ఇటు బీవైడీ ఇండియాలతో వాటా కొనుగోలు నిమిత్తం ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై స్పందించడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! మరోపక్క కంపెనీ విధానాల ప్రకారం ఇలాంటి అంచనాలపై స్పందించలేమంటూ ఎంజీ మోటార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. -
ఈవీ విక్రయాలపై ఎంజీ మోటార్ కన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టిపెట్టిన ఎంజీ మోటార్స్ ఈ ఏడాది ఈవీ విక్రయాల్లో 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వచ్చే నెలలో ఈవీ విభాగంలో మరో మోడల్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో జెడ్ఎస్ ఈవీని విక్రయిస్తున్న కంపెనీ రెండు డోర్ల ఈవీ మోడల్ కామెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మే నెల నుంచి దశలవారీగా దేశమంతటా వాహ నాలను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ చాబా పేర్కొన్నారు. వెరసి ఈ ఏడాది రెండు ఈవీ మోడళ్ల ద్వారా 80, 000–90,000 యూనిట్ల విక్రయాలను సాధించగలమని విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. -
ఎంజీ చిన్న ఈవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ భారత్‌లో అడుగుపెడుతోంది. ఏప్రిల్ 26న కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. బుకింగ్స్ సైతం అదే రోజు మొదలు కానున్నాయి. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంటుంది. ఇండోనేషియాలో ఎంజీ విక్రయిస్తున్న వ్యూలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించనుంది. రెండు డోర్లతో తయారైంది. నలుగురు కూర్చునే వీలుంది. పొడవు సుమారు 3 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, ఎత్తు 1.63 మీటర్లు ఉంటుంది. 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2–స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి హంగులు ఉన్నాయి. కామెట్ ఈవీని భారత్‌లో తయారు చేసేందుకు ఎంజీ కసరత్తు ప్రారంభించింది. బావొజున్ యెప్ ఎస్యూవీ 2025లో దేశీయ మార్కెట్లో రంగ ప్రవేశం చేయనుంది. -
MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?
ఎంజీ మోటార్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందగలిగింది. కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా చరిత్ర తిరగరాసిన ఈ కంపెనీ త్వరలో ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ లాంచ్ డేట్, రేంజ్, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: ఎంజీ మోటార్ ఇండియా ఈ నెల 26న (2023 ఏప్రిల్ 26) దేశీయ మార్కెట్లో 'కామెట్ ఈవీ' (Comet EV) విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ సమయంలో ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడిస్తుంది, ఆ తరువాత అన్ని వేరియంట్స్ ధరలను మే నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉన్న 'సిట్రోయెన్ సి3'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. అంచనా ధరలు: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్న కారుని విడుదల చేయనుంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే ధరలు అధికారికంగా వెల్లడికాలేదు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) డిజైన్: ఈ చిన్న కారు చూడగానే ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుంది. కావున ఇది ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లకంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం రెండు డోర్స్ కలిగి మంచి కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని ఫోటోల ద్వారా ఈ కారు డిజైన్ చూడవచ్చు. ఫీచర్స్: ఆధునిక కాలంలో విడుదలవుతున్న దాదాపు అన్ని కార్లు లగ్జరీ ఫీచర్స్ పొందుతాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంజి కామెట్ ఈవీ సరసమైన ధర వద్ద లభించే మంచి ఫీచర్స్ కలిగిన కారు కావడం విశేషం. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకుండా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ కలిగిన, నాలుగు-సీట్ల కారు ఈ కామెట్ ఈవీ. కార్ టెక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్రైవ్ మోడ్స్, వాయిస్ కమాండ్ వంటివి ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) బ్యాటరీ ప్యాక్ & రేంజ్: త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీకి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు, కానీ ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ ఏప్రిల్ 26 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. -
ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించిన 'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్ కామెట్ దేశీయ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ భావిస్తోంది ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్‌తో అర్బన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్ ఈవీ కామెట్‌ను లాంచ్ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్‌ఫారమ్‌ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. కాగా లాంచింగ్‌కుముందు కంపెనీ విడుదల టీజర్ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్‌తో పాటు డాష్‌బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో బాక్సీ డిజైన్ ఎల్ఈడీహెడ్లైట్లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే టియాగో ఈవీ, CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. కొత్త కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఫ్రాంక్స్, మెర్సిడెస్ బెంజ్ GT63 S ఈ-పెర్ఫార్మెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఇతర వివరాలేంటి అనే సమాచారం ఈ కథనంలో.. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన మారుతి ఫ్రాంక్స్ ఈ నెల రెండవ వారంలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్స్ పొందనుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో ఈ నెల 11న ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్ విడుదల చేయనుంది. ఇది 4-డోర్ కూపే నుంచి వచ్చిన ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కావడం విశేషం. ఇది 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ & 204 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఈ లగ్జరీ కారు ఫ్రంట్ బంపర్‌పై పెద్ద గ్యాపింగ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, పనామెరికానా గ్రిల్, బెస్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ లిడ్‌పై స్పాయిలర్ పొందుతుంది. దీని ధర కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ సుమారు రూ. 3 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. లంబోర్ఘిని ఉరస్ ఎస్: ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో ఉరస్ ఎస్ SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2023 ఏప్రిల్ 13న అధికారికంగా విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఇది 4.0 లీటర్, V8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి అద్బుతంగా పర్ఫామెన్స్ అందిస్తుంది. ఎంజి కామెట్ ఈవీ: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ ఈ నెల చివరిలో కామెట్ EV అనే ఎలక్ట్రిక్ కారుని విడుదలచేయనుంది. దీనిని నగర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకంగా రూపొందించారు. కాంపాక్ట్ డైమెన్షన్లు, టూ-డోర్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటివి దీనిని చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 250 కిమీ రేంజ్ అందిస్తుందని, ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.