NCRB
-
పని ప్రదేశమే ప్రాణాంతకమైతే?
ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన అనేక కథనాలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం మునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్ లో కూడా జరుగుతోంది. ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కలవరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి ఎంతమాత్రమూ వీలు లేదు. మార్పు ఇప్పటికే మొదలు కావాల్సింది!ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో ఇటీవలి కేసు... మహిళల భద్రత విషయంలో ఉన్న సమస్యల తీవ్రతనూ, అత్యంత సురక్షితంగా భావించే పరిస రాలలో కూడా వారు ఎదుర్కొంటున్న సర్వవ్యాప్త హింసనూ గుర్తు చేస్తోంది.శిక్షణలో ఉన్న ఒక యువ వైద్యురాలు అనేక గంటలపాటు విధి నిర్వహణను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, తగిన భద్రత ఉంటుందని భావించిన ఆసుపత్రి ఆవరణలోనే ఆమెపై లైంగికదాడి జరిపి హత్య చేశారు. ఈ భయానక నేరం ఒక విడి సంఘటన కాదు. మన సమాజంలోని ప్రతి అంశంలోనూ విస్తరిస్తున్న, మహిళ లపై హింసకు సంబంధించిన విస్తృతమైన అంటువ్యాధిలో ఇదొక భాగం. ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన వార్తలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం అంతకుమునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. ఇవి వార్తలలోని కేవలం పాదసూచికలు కాదు. సగం జనాభా భద్రత విషయంలో విఫలమైన సమాజంపై ఇవి స్పష్టమైన నేరారోపణలు. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్లో కూడా జరుగుతోంది.మహిళలపై నేరాలు దారుణంగా పెరుగుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’(ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క 2022లోనే 4,45,256 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రతి గంటకు దాదాపు 51 ఎఫ్ఐఆర్లకు సమానం. 2020, 2021 సంవత్సరాల నుంచి భయంకరమైన పెరుగుదలను ఈ డేటా వెల్లడిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు మహిళలపై నేరాల రేటు 66.4గా ఉంది. అయితే ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ నివేదిక ప్రకారం, అలాంటి కేసులలో ఛార్జ్‌షీట్ రేటు 75.8గా నమోదైంది. నమోదైన మొత్తం కేసులలో, 18.7 శాతం వరకు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడే ఉద్దేశ్యంతో దాడికి పాల్పడినవే. కాగా 7.1 శాతం అత్యాచారం కేసులుగా నమోదయ్యాయి. ఈ భయంకరమైన గణాంకాలు వాస్తవ ఘటనల్లో అతి చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. భయం, అవమానం లేదా సామాజిక ఒత్తిడి కారణంగా అసంఖ్యాకమైన కేసులు వెలుగులోకే రావు.మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తాయి. స్త్రీలు సరుకులుగా కుదించబడినప్పుడు, హింస అనేది రోజు వారీ సంఘటనగా మారుతుంది. ఈ హింస భౌతిక దాడికి మాత్రమే పరిమితమైనది కాదు; ఇది ఆర్థికపరమైన, భావోద్వేగపరమైన వేధింపు వరకు విస్తరించింది. ముఖ్యంగా పని స్థలాల్లో అధికార చలన సూత్రాలు తరచూ మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయి.సాధారణంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టంగా పిలుస్తున్న, ‘‘పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం, 2013’ వంటి చట్టాలను మహిళల రక్షణ కోసం రూపొందించారు. కానీ వాస్తవికత దానికి భిన్నమైన చిత్రాన్ని చూపు తోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించినప్పటికీ, ఈ కమిటీల నిర్మాణం సహజంగానే లోప భూయిష్టంగా ఉంది.అదే సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులతోపాటు ఒక ఎన్జీవో లేదా అలాంటి సంస్థకు చెందిన బయటి సభ్యులతో కూడిన ఈ కమిటీలు, బాధితురాలికి న్యాయం చేయడం కంటే కూడా కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికే తరచుగా ప్రాధాన్యత ఇస్తాయి. అధికారిక చలనసూత్రాలు (కమిటీ సభ్యులు కంపెనీలో స్వార్థ ప్రయో జనాలను కలిగి ఉండవచ్చు) నిజమైన విచారణను, జవాబుదారీ తనాన్ని నిరుత్సాహపరిచే వాతావరణాన్ని సృష్టిస్తాయి.అయితే ఈ సవాళ్లు నేడు పని స్థలాలను దాటి విస్తరించాయి. ప్రారంభంలో అవకాశాలు, అనుసంధానం కోసం ఉద్దేశించిన ఇంట ర్నెట్, ఇప్పుడు మహిళలకు సంబంధించిన కొత్త యుద్ధభూమిగా మారింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021లో సైబర్ క్రైమ్ సంఘటనల సంఖ్య 2019తో పోలిస్తే 18.4 శాతం పెరిగింది. మహిళలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు గణనీయంగా 28 శాతానికి పెరిగాయి. 2021లో నమోదైన 52,974 సైబర్ నేరాల్లో 10,730 అంటే 20.2 శాతం మహిళలపై నేరాల కేసులు. వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం వంటి వాటి నుండి ప్రతీకారం తీర్చుకునే పోర్న్, ఆన్ లైన్ వేధింపుల వరకు, పాత రకాల హింసలను కొనసాగించడానికి డిజిటల్ రంగం కొత్త మార్గాలను అందిస్తోంది.ఇంటర్నెట్లో అజ్ఞాతంగా ఉండటం అనేది నేరస్థులకు ధైర్యాన్నిస్తుంది. కాగా, కఠినమైన సైబర్ చట్టాలు లేకపోవడం, చట్టపరమైన సహాయం నెమ్మదిగా ఉండటం బాధితులకు హాని చేస్తున్నాయి.మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? ప్రస్తుత పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కల వరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. లైంగికదాడి కేసులలో 95 శాతం అపరిష్కృతంగా ఉంటున్నాయని ‘ఎన్ సీఆర్బీ’ 2021 నివేదిక నొక్కి చెబుతోంది. ఈ గణాంకాలు స్త్రీల దుఃస్థితి పట్ల వ్యవస్థ అలసత్వంతో పాటు, తరచుగా ఉదాసీనతను కూడా సూచిస్తు న్నాయి. న్యాయ విచారణలో జాప్యం, సానుభూతి లేని పరిపాలనా వ్యవస్థ అనేవి బాధితులు ముందుకు రాకుండా వారిని మరింత నిరుత్సాహపరుస్తాయి.లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దానిని పోలి ఉండే ఇతర చట్టాలు అవసరమైనప్పటికీ, అవి సరిపోవు. హాని సంభవించిన తర్వాత మాత్రమే సమస్యను పరిష్కరిస్తాయి. పైగా పనికి సంబంధించిన దైహిక, లింగ స్వభావాన్ని సవాలు చేయడంలో విఫలమవు తాయి. ఇది మహిళలకు మొదటి దశలోనే హాని చేస్తుంది. కాబట్టి నిష్పాక్షికత, న్యాయబద్ధతను నిర్ధారించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూర్పు విషయంలో పునః మూల్యాంకనంతో ప్రారంభించి, తక్షణ సంస్కరణలు అవసరం. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించి, అది కొనసాగేలా చూడడం యజమానుల బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే వారిపై కఠినమైన జరిమానాలు విధించాలి.ఇది చట్టపరమైన వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక వైఫల్యం కూడా! సమానత్వం కోసం మాత్రమే కాకుండా ప్రాథమిక గౌరవం కోసం పోరాడుతుండే మహిళలు తరచుగా బాధామయ జీవితాల్లో నిశ్శబ్ద శృంఖలాల పాలవుతుంటారు. ప్రతీకారం, ఉద్యోగ నష్టం, వ్యక్తిత్వ హననాల భయం చాలామందిని నోరు విప్పకుండా చేస్తుంది. ఇది శిక్ష పడుతుందనే భయం లేని సంస్కృతి వృద్ధి చెందడానికి వీలు కలిగిస్తుంది. అధికార శక్తులు దోపిడీకి పాల్పడుతూనే ఉండటం, బాధితులు తరచుగా ఎటువంటి సహాయం లేకుండా మిగిలిపోవడం అనేది ఒక విష వలయం.చట్టపరమైన రక్షణలు, పెరుగుతున్న అవగాహన పురోగతిని సూచిస్తున్నప్పటికీ, సంఖ్యలు మాత్రం మరో కథను చెబుతున్నాయి. అది ఆచరణలో కంటే సిద్ధాంతంలోనే ఎక్కువగా ఉనికిలో ఉంటున్న చట్టాలతోపాటు, ప్రతి మలుపులోనూ మహిళల విలువను తగ్గించే సామాజిక వ్యవస్థ వైఫల్య గాథ. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి వీలు లేదు. అవి మన శ్రద్ధను, మన ఆగ్రహాన్ని, మరీ ముఖ్యంగా మన చర్యను డిమాండ్ చేస్తున్నాయి. మార్పు ఎప్పుడో మొదలు కావాల్సింది!వి. విజయ సాయి రెడ్డి వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు;వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
ఆ 3 గంటల్లోనే మృత్యు ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మూడు గంటల్లోనే ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2022 నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా 4,46,768 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా.. ఈ మూడు గంటల్లోనే 90,663 ప్రమాదాలు జరిగినట్టు నివేదిక తెలిపింది. అదే సమయంలో తెలంగాణలో 4,544 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. కార్యాలయాల పనివేళలు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు, పలు రకాల పనులపై ఇంటి నుంచి బయటికి వచ్చే వాహనదారులతో రోడ్లు రద్దీగా ఉండటం... సాయంత్రం వేళల్లో సరైన వెలుతురు లేకపోవడం, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తదితర కారణాలతోనే సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రోడ్డు భద్రత నిపుణులు చెబుతున్నారు. -
మనోనిబ్బరం కోల్పోతున్న పురుషులు
హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)– 2022 గణాంకాలు ఓ కీలక విషయాన్ని బయటపెట్టాయి. నగరంలో గతేడాది నమోదైన ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో పాటు మనోనిబ్బరం విషయంలో స్త్రీల కంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2022లో నగరంలో మొత్తం 544 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ మృతుల్లో పురుషులు 433 మంది కాగా... మహిళలు 111 మంది ఉన్నట్లు మంగళవారం విడుదలైన ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మహత్యల సంఖ్యలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ పదో స్థానంలో ఉంది. అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే పురుషులు కష్ట,నష్టాలు ఎదుర్కోవడంలో మాత్రం డీలాపడిపోతున్నారు. నిరాశ, నిస్పృహలతో అర్ధాంతరంగా జీవితాలు ముగించడానికే మొగ్గు చూపుతున్నారు. అనేక సమస్యలతో.. ► గత ఏడాది దేశ వ్యాప్తంగా 1,70,924 ఆత్మహత్యలు రికార్డుల్లోకెక్కగా.. వీటిలో 9,980 రాష్ట్రానికి సంబంధించినవే. మెట్రో నగరాలతో పోలిస్తే ప్రథమ స్థానంలో ఢిల్లీ (3367), ద్వితీయ స్థానంలో బెంగళూరు (2313) ఉండగా.. 1004 కేసులతో తర్వాత స్థానం సూరత్‌ది. సిటీలో జరిగిన ఆత్మహత్య మృతుల్లో పురుషులు 544 మంది ఉండగా... సీ్త్రలు 111 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు కొన్ని రెట్ల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా కారణం అవుతున్నాయి. ► నగరంలో గత ఏడాది జరిగిన ఆత్మహత్యల్లో 20.5 శాతం అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేకపోవడం వంటి కారణాల వల్లే జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన ఆత్మహత్యల్లో ఉన్న ముగ్గురు మృతులూ పురుషులే అని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ కలహాలు కారణంగా ఆత్మహత్య చేసుకున్న 120 మందిలో 87 మంది పురుషులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో 138 మంది సూసైడ్ చేసుకోగా వీరిలో మగవారు 100 మంది ఉన్నారు. సన్నిహితులు చనిపోయారనే కారణంతో ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో ప్రేమ వ్యవహారాల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులు ఏడుగురు ఎక్కువ ఉన్నారు. నిరుద్యోగం కారణంగా చనిపోయిన 13 మంది పురుషులే కావడం గమనార్హం. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావు.. ఎన్సీఆర్బీ రాష్ట్ర పోలీసులు ఇచ్చే జాబితా ఆధారంగా నివేదిక రూపొందిస్తుంది. ఈ జాబితా ఠాణాలో నమోదయ్యే కేసుల ఆధారంగా తయారవుతాయి. ఆత్మహత్యల ఉదంతాలకు సంబంధించి అనేక కేసుల్లో అసలు కారణాలు వెలుగులోకి రావు. కొన్ని ఉదంతాలు అసలు పోలీసు రికార్డుల్లోకే ఎక్కవు. మహిళలు, యువతులకు సంబంధించి ఉదంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, విఫల ప్రేమలు, వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఉదంతాలు బయటకు రాకూడదనే కుటుంబీకులు ప్రయత్నిస్తారు. ఒకవేళ పోలీసుల వరకు వచ్చి అసలు కారణాలు బయటకు చెప్పరు. ఇలాంటి అనేక కారణాలు ఎన్సీఆర్బీ గణాంకాలపై ప్రభావం చూపిస్తుంటాయి. – నగర పోలీసు ఉన్నతాధికారి -
ఆమెపై ఆగని అకృత్యాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్తున్నా.. ఆధునికంగా ప్రపంచం ఎంత వేగంగా ముందుకు పయనిస్తున్నా.. మహిళలపై వేధింపులు, హింస తగ్గడం లేదు. వివక్ష అంతరించడం లేదు. పరువు హత్య లు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు.. ఎక్కడా మహిళలకు రక్షణ లేని దుస్థితి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయినిలో జరిగిన సంఘటన దీనికి మరో నిదర్శనం. అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక భయంతో వణికిపోతూ, అర్ధనగ్నంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరుగెత్తడం.. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఘట నా ఇలాంటిదే. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక పోకడలు పోతున్నా.. దేశంలో ఇంకా అనాగరిక దుష్కృత్యాలు కొనసాగడం ఆందోళనకరం. 2011–2021 మధ్య 87 శాతం పెరుగుదల.. గత దశాబ్దంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు దాదాపు 87 శాతం మేర పెరగడం ఏ అభివృద్ధికి సంకేతమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. మన దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస/వేధింపులు కొనసాగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగానే 2011లో 2,28,650 మంది మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే.. 2021నాటికి ఈ సంఖ్య 4,28,478కు అంటే.. 87శాతం మేర పెరగడం ఆందోళనకరం. అయితే దీనిని పోలీసు యంత్రాంగం మరో విధంగా చూస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలు కేసులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదని.. పెరిగిన విద్యావకాశాలు, పోలీసుల ఔట్రీచ్ కారణంగా ముందుకొచ్చి కేసులు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దేశ మహిళా జనాభాలో 7.5శాతం పశ్చిమ బెంగాల్లో ఉంటే.. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు 12.7 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలు హింసను భరించాలని దేశంలోని దాదాపు 65శాతం మంది పురుషులు అభిప్రాయంతో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ మెన్ అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్)’స్పష్టం చేసింది. కుటుంబం కలసి ఉండాలంటే మహిళలు ఈ హింసను భరించాల్సిందేనన్న ధోరణి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఇక గృహ హింసకు సంబంధించి కుటుంబ పరువు పేరిట చాలా వరకు మహిళలు కేసులు పెట్టడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ మహిళా జనాభాలో కనీసం 33.7% మంది ఏదో ఒక సమయంలో నేరాలు/వేధింపులకు గురైనవారే. పరువు పేరిటహత్యలెన్నో.. దేశంలో ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయి.కుటుంబ పెద్దల అంగీకారం లేకుండా ప్రేమించి కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్నవారిని.. పరువుకు భంగం కలిగించారనే భావనతో వారి కుటుంబాలే హత్య చేయిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఖాప్ పంచాయతీలు నిర్వహించి మరీ మరణ శాసనాలు లిఖిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యాచార దారుణాలు.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలూ దారుణంగా పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దకాలంలో ఇలాంటి దారుణాలపై కేసులు బాగా పెరిగాయి. 2008లో దేశంలో 21,467 అత్యాచార కేసులు నమోదవగా.. 2021లో ఈ సంఖ్య 31,677కు పెరిగింది. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు కూడా.. తమపై వేధింపులకుసంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులూపెరిగాయి. 2022లో మొత్తం 33,906 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 54.5 శాతం ఫిర్యాదులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్, హరియాణావంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ప్రయోజనం దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై హింస మరింత పెరిగి క్రూరమైన రూపాలను సంతరించుకుంటోంది. కరోనా లాక్డౌన్ కాలంలో స్త్రీలపై హింస విపరీతంగా పెరిగినట్టు మేం గమనించాం. మతం పేరిట, ఇతర రూపాల్లో ద్వేషం, విషపూరిత వాతావరణం నెలకొని గతంలోని స్నేహపూర్వక పరిస్థితి లేకుండా పోయింది. ఇది అన్నిరకాల హింసలకూ దారితీస్తోంది. నిర్భయ చట్టం తీసుకొచ్చినపుడు.. స్త్రీల హక్కులేమిటి? వారిపై హింసకు ఎందుకు పాల్పడకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించింది. ఇప్పుడైతే మహిళల హక్కులు అనే స్పృహ లేకుండా చేస్తున్నారు. మíహిళలకు సంబంధించిన రంగాలు, అంశాలపై బడ్జెట్ కేటాయింపులను కూడా తగ్గించడం దురదృష్టకరం. మహిళలపై ఎలాంటి దాడులకు పాల్పడినా తమకేమీ కాదులే అన్న మొండి ధైర్యం హింసకు దారితీస్తోంది. చట్టాలను అమలుచేయాల్సిన పోలీసు, ఇతర వ్యవస్థలు అవినీతితో పారదర్శకతను కోల్పోతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు దిగొస్తాయి. - వి.సంధ్య సామాజిక కార్యకర్త,పీవోడబ్ల్యూ -
ఆశల సౌధం నుంచి.. ఆత్మహత్యల వైపు...
►నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష (21) శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ తనువు చాలించాడు. ►హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని దివ్య (21) శనివారం ఉరేసుకొని చనిపోయింది. కుటుంబçÜభ్యులతో కలసి సంజయ్‌గాంధీనగర్‌లో ఉండే దివ్య ఇంటి వెనుకాలే ఉరేసుకొని చనిపోవడం అందరినీ కలిచివేసింది. ►వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ధారావత్ ప్రీతి సీనియర్ వేధిస్తున్నాడంటూ ఈనెల 22న ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఆదివారం రాత్రి కన్నుమూసింది. సాక్షి ప్రతినిధి, వరంగల్: తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను అందుకోలేకపోతున్నామన్న ఒత్తిడి.. సీనియర్ల వేధింపులు.. ఆరోగ్య సమస్యలు.. కారణాలేవైతేనేం.. క్షణికావేశంలో విద్యార్థులు అనేక మంది ఆశల సౌధం నుంచి ఆత్మహత్యల ఒడిలోకి జారుతున్నారు. బంగారు భవిష్యత్‌ను బలి చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 1995 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా 1,88,229 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో గత 12 ఏళ్లలోనే 55.28% (1,04,053 మంది) విద్యార్థులు అసువులు బాశా రు. 2019లో మొత్తం జరిగిన 10,355 ఆత్మహత్యల్లో మహారాష్ట్రలో 1,487, మధ్యప్రదేశ్ (927), తమిళనాడు (914), కర్ణాటక (673), ఉత్తరప్రదేశ్ (603)లో కలిపి 44% మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆత్మహత్యలు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 2018లో 401 మంది, 2019లో 426, 2020లో 430, 2021లో 459 మంది ఐదో తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వివరాలను 2022 డిసెంబర్లో విడుదల చేసిన నివేదికలో ఎన్సీఆర్బీ పేర్కొంది. ఎన్సీఆర్బీ నివేదిక 2021 ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకొనేలా చూడాలి ఆత్మహత్యల నివారణపై ఓ ఉద్యమం జరగాలి. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకొనేలా నైతిక బలాన్ని, శక్తిని ఇవ్వడానికి ప్రయత్నించాలి. ప్రధానంగా విద్యార్థులు ఒత్తిళ్లకు దూరంగా చదువుకొనేలా చూడాలి. ప్రాథమిక విద్యలో పిల్లలు సెల్ఫోన్లకు అతుక్కోకుండా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో మార్పులను గమనించాలి. ఏదైనా బాధలో ఉంటే సానుకూలంగా ఓదార్చాలి. అనారోగ్య సమస్యలు ఉంటే కౌన్సెలింగ్, చికిత్సలు లేకుండా నిరుత్సాహపరచకూడదు. – డాక్టర్ బి.కేశవులు, మానసిక వైద్య నిపుణుడు ఆత్మహత్య నిర్ణయం వద్దు.. ఏదైనా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన, నిర్ణయం తీసుకుంటే మానుకోవాలి. రెండు రోజుల తర్వాత కూడా అదే ఆలోచన ఉంటే దాని నుంచి బయటపడే మార్గం అన్వేషించాలి. ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఉంటుంది. మనం చేయకపోతే ఇతరులు చేస్తారు. అంతే తప్ప నా జీవితం ఇంతే.. నాకు ఎప్పుడూ ఇంతే అనే భావాలను మనసులోకి రానివ్వొద్దు. ఎవరైనా ఒకే విషయాన్ని పదేపదే ఆలోచిస్తే వారిని ఆ విషయం నుంచి బయటకు తీసుకురావడానికి కౌన్సెలింగ్ అవసరం. – ఏవీ రంగనాథ్, పోలీస్ కమిషనర్, వరంగల్ -
వాటి జోలికెళ్తే.. ఐదేళ్లు జైలుకే..!
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి దారితీస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళ్తే జైలుకు వెళ్లడం ఖాయం. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫొటోలను పోస్టు చేసినా, షేర్ చేసినా, చివరికి వీక్షించినా కూడా నేరమే. ఐదేళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇంటర్నెట్తోపాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)’పనిచేస్తోంది. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి వీడియోలు, ఫొటోల (చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్– సీఎస్ఏఎం)ను, వాటి గురించి సెర్చ్ చేస్తున్నవారు, వీక్షిస్తున్నవారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం హైదరాబాద్‌లో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. మైనర్లకు సంబంధించిన అసభ్య, అశ్లీల చిత్రాలన్నీ చైల్డ్ పోర్నోగ్రఫీ కిందికి వస్తాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సాహిత్యం తదితరాలను సీఎస్ఏఎంగా పరిగణిస్తారు. ఎన్‌సీఎంఈసీ ఆధ్వర్యంలో.. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1984 జూన్ 13న ఎన్‌సీఎంఈసీ ఏర్పాటు చేసింది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ చర్యలు ముమ్మరమయ్యాయి. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకన్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోందని అంచనా వేసింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. 2021లో భారత్ నుంచే 25 వేలకుపైగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. ఆధునిక టెక్నాలజీతో పటిష్ట నిఘా.. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతూ ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంటెంట్‌ను, సెర్చింగ్‌ను గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ గురించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా.. వారు వినియోగించిన కంప్యూటర్/ల్యాప్‌టాప్/ఫోన్ల ఐపీ అడ్రస్‌లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ వివరాలను ఎన్‌సీఎంఈసీ క్రోడీకరించి ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తుంది. మనదేశంలో జాతీయస్థాయిలో హోంశాఖ అధీనంలోని ఎన్సీఆర్బీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీనికి అందిన వివరాలను రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తుంది. రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు ఈ వివరాలను సంబంధిత బాధ్యులు నివసించే ప్రాంత సైబర్ క్రైమ్ పోలీసులకు పంపిస్తారు. వారు కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి.. అరెస్టు చేయడం/ నోటీసులివ్వడం వంటి చర్యలు చేపడతారు. స్మార్ట్ఫోన్లతో పెరిగి.. కోవిడ్‌తో విజృంభించి.. విస్తృతమైన ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసగా మారుతున్నారు. కోవిడ్ లాక్డౌన్, ఆ తర్వాతి సమయంలో ఈ ధోరణి మరింత పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు, 2019లో 103 కేసులు నమోదుకాగా.. 2020 నాటికి ఈ సంఖ్య 738కి, 2021లో 969కి పెరగడం గమనార్హం. జరుగుతున్న ఉదంతాల్లో కనీసం ఒక శాతం కూడా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి కేసులుగా మారట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాల్లో సర్వర్ల కారణంగా.. అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. కానీ వాటి నిర్వాహకులు వెబ్సైట్ పేరులో స్వల్ప మార్పులు చేసి మరో వెబ్‌సైట్‌గా అందుబాటులోకి తెస్తున్నారు. వాటిపై ఫిర్యాదులు వచ్చి చర్యలు తీసుకునేవరకు ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. వాటిపై ఫిర్యాదులు వచ్చినా నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. బాగా చదువుకున్నవారూ నిందితుల్లో.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలపై గత ఏడాది హైదరాబాద్‌లో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. పోలీసులు నిందితులతోపాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ఈ కేసుల్లో ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. అన్నిరకాలా నష్టం పోర్నోగ్రఫీకి బానిస అవుతున్నవారు అన్నిరకాలా నష్టపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్‌తో పాటే వైరస్లు ఉంటాయని.. ఆయా వెబ్సైట్ల ద్వారా వైరస్‌లను పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డులు, ఇతర వివరాలూ హ్యాకర్లకు చేరి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల జైలు చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీనికోసం ఎవరు సెర్చ్ చేసినా, వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్ చేసిన వారి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందుతుంది. వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 67–బీ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం. ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ వేస్తాం. కోర్టులో నేరం నిరూపితమైతే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే.. పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదవుతాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు పడే ఆస్కారం ఉంది. –గజరావ్ భూపాల్, సంయుక్త పోలీసు కమిషనర్, సీసీఎస్, హైదరాబాద్ -
కన్నపేగు కన్నీరు!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది. కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు. ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ -
తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1
న్యూఢిల్లీ: 2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది 2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ తెలంగాణలో అధికమని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
శతమానం భారతి: పౌర రక్షణ
నేరాలు మన సమాజంలోని చీకటి కోణాలను వెల్లడిస్తే, వాటి నివారణకు అనుసరించే మార్గాలు సమాజం తాలూకు సున్నితత్వాన్ని, అదే సమయంలో దాని దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాయి. ఏటా గడిచిన సంవత్సరంలో జరిగిన నేరాలపై విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెలువడతాయి. నేరాల సంఖ్య పెరిగిందని, ఎప్పటిలానే మహిళల భద్రత విషయంలో సంతృప్తికరమైన ప్రగతి సాధించలేకపోయామని, ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి ఏమంత గర్వకారణంగా లేదని ఆ నివేదిక చూస్తే అర్థమవుతుంది. నమోదైన కేసుల ఆధారంగా మాత్రమే ఎన్సీఆర్బీ నివేదిక రూపొందుతుందని మరిచిపోకూడదు. బాధితుల భయాందోళనలవల్ల పోలీసుల దృష్టికి రాని కేసులు, వచ్చినా రకరకాల ప్రభావాలకు లొంగి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి కారణాల వల్ల నమోదైన కేసులతో పోలిస్తే... జరిగినవి అనేక రెట్లు అధికంగా ఉండొచ్చు. సామాజిక దురాచారాలు, సంస్కృతి పేరుతో చలామణి అవుతున్న విలువలు, అధికారంలో ఉన్నవారు బాధ్యతారహితంగా మాట్లాడే తీరు మారనంతకాలం నేరాలను సమూలంగా నాశనం చేయడం అసాధ్యం. అమృతోత్సవాల సందర్భంగా నేర నిరోధక, నేర నివారణ, నేర రహిత భారత్ ఏర్పడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని మోదీజీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును సమాజంలోని అన్ని రంగాలవారు, అన్ని స్థాయిలలోని వారు అందుకుని ‘సురక్షిత భారత్’ కోసం పాటు పడాలి. -
మానవ అక్రమ రవాణా కట్టడి
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా మాఫియాకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసుల నమోదు, అరెస్టుతోపాటు బాధితులను రక్షించడంలోనూ ఏపీ ముందుంటోంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి వారిపై చార్జిషీటు వేయడం దేశంలో సగటున 85.2 శాతం ఉంటే ఏపీలో 99.2 శాతం ఉండటం విశేషం. గడిచిన ఏడాదిలో ఈ తరహా కేసుల్లో ఏకంగా 619 మంది నిందితులను అరెస్టు చేయడం మరో రికార్డు. అలాగే 257 మంది బాధితులను కాపాడారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) కొద్ది రోజుల కిందట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2020లో మొత్తం 1,714 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అయ్యాయి. కేసుల నమోదులో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ వరుస స్థానాల్లో నిలిచాయి. గడిచిన మూడేళ్ల గణాంకాలను గమనిస్తే ఏపీలో గతేడాది మానవ అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పట్టినట్టు తేటతెల్లమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టడం అభినందనీయం. ప్రధానంగా మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మూడు ఏహెచ్‌టీయూలు ఉన్నాయి. మరో పది ఏర్పాటు చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లతో వీటిని అనుసంధానం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులతో మానవ అక్రమ రవాణా మరింత పెరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధితులను కాపాడి, వారి పునరావాసంపై దృష్టి సారిస్తోంది. – ఎన్.రామ్మోహన్, హెల్ప్ సంస్థ డైరెక్టర్ -
నువ్వేమైనా అందగత్తెవా?!.. విపరీతమైన కామెంట్లు రావడంతో..
దీపిక (పేరు మార్చడమైనది) ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమైన కూతురును బాగా చదివించాలన్నది తండ్రి ప్రసాద్(పేరుమార్చడమైనది) కల. అందుకు తగినట్టుగానే దీపిక బాగానే చదువుతుంది. ఫ్యాషన్ అంటే ఆసక్తి ఉండే దీపిక తన డ్రెస్సింగ్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. తన డ్రెస్సింగ్‌ను నలుగురూ మెచ్చుకోవాలన్న ఆలోచనతో రకరకాల మోడళ్లలో డ్రెస్సులు ధరించి, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. వచ్చిన లైక్స్, మెచ్చుకోలు కామెంట్స్ చూసుకొని మురిసిపోయేది. టిక్‌టాక్ వీడియోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది దీపిక. ఆరు నెలలు గడిచిపోయాయి. ఓ రోజు మెసేజ్‌లు చూసుకుంటున్న దీపిక ఉన్నట్టుండి ఫోన్ విసిరికొట్టింది. అది చూసిన తల్లి దీపికను మందలించింది. తల్లివైపు కోపంగా చూసి తన రూమ్‌కి వెళ్లిపోయింది దీపిక. ముంచుకొచ్చే కోపం రాత్రి భోజనానికి రమ్మని ఎంత చెప్పినా కూతురు బయటకు రాలేదు. ఈ మధ్య దీపిక చాలా ముభావంగా ఉంటోందని, ఏదడిగినా త్వరగా కోపం తెచ్చుకుంటుందని భర్తకు చెప్పింది. ‘ఆ వయసు అలాంటిది. అవేమీ పట్టించుకోకు. కొన్ని రోజులు పోయాక తనే తెలుసుకుంటుందిలే’ అన్నాడు ప్రసాద్. ‘అన్నింటికీ కూతురును ఇలాగే వెనకేసుకొస్తారు. అన్నం తినమన్నా అదేదో తిట్టులాగే వినపడుతోంది మీ కూతురుకి’ అంటూ తన అసహనాన్ని తెలియజేస్తూ గిన్నెలు సర్ది పడుకుంది. ఊహించని సంఘటన మరుసటి రోజు పది దాటుతున్నా దీపక రూమ్‌లోంచి ఎలాంటి అలికిడి లేదు. రాత్రి భోజనం కూడా చేయకుండా గది తలుపులు వేసుకొని పడుకుంది. ఇప్పటికీ లేవలేదు. ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. తల్లి ఎంత పిలుస్తున్నా కూతురు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి, దీపికను అదేపనిగా పిలిచాడు ప్రసాద్. అయినా ఎలాంటి అలికిడి లేదు. ఇంటి వెనకాల నుంచి వెళ్లి, కిటికీ డోర్ తీసి చూశాడు. కూతురు ఉరివేసుకొని కనపడటంతో ప్రసాద్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. ముంచేసిన కామెంట్స్ పోలీసులు దీపిక తల్లి తండ్రులనూ, ఇంటి చుట్టుపక్కల వారినీ విచారించారు. దీపిక ఆత్మహత్యకు కారణమేంటనేది తెలియలేదు. పోలీసులు దృష్టి దీపిక వాడుతున్న ఫోన్ మీద పడింది. పూర్తి డేటా తీసిన పోలీసులు దీపిక సోషల్ మీడియా పేజీలను కూడా చూశారు. దాంట్లో నెల రోజులుగా దీపిక పోస్టులకు అనుచితమైన కామెంట్స్ రావడం, దానికి దీపిక ఎదురు సమాధానాలు ఉండటం చూశారు. పాతికమందికి పైగానే దీపిక అప్లోడ్ చేసిన ఫొటోలకు ‘నువ్వో పెద్ద అందగత్తెవా!’ అని ఒకరు, ‘నీకంత సీన్ లేదు’ అంటూ ... ఎన్నో విపరీతార్థాలతో ఉన్న కామెంట్స్ ఉన్నాయి. కొన్నాళ్లుగా నెగిటివ్ కామెంట్స్‌కు తట్టుకోలేని దీపిక, వారికి ఘాటుగానే సమాధానాలు ఇచ్చేది. దీంతో దీపికను ఏడిపించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాళ్లు ఎవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలియని దీపిక ఈ నెగిటివ్ కామెంట్స్‌కి తనలో తనే కుమిలిపోతూ వచ్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే బాధపడతారని మౌనంగానే ఉండిపోయింది. మెసెంజర్ లో వచ్చే మెసేజ్‌లలో తప్పుడు కామెంట్స్ వచ్చేవి. వాటిని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతూ ఉండేది. రోజు రోజుకీ దీపికలో అసహనం, కోపం తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తనపైన వచ్చే విమర్శలను తట్టుకోలేక దిగులుగా ఉండేది. తండ్రి అడిగితే ‘ఒంట్లో బాగోలేదని’ చెప్పేది. తల్లి అడిగితే మాత్రం కోపంగా విరుచుకుపడేది. విపరీతమైన ఒత్తిడికి లోనైన దీపిక ఆత్మహత్యా యత్నం చేసింది. పూర్తిగా శోధించిన పోలీసులకు వాళ్ల కాలనీలోని అబ్బాయిలే ఆమెను టార్గెట్ చేశారని తెలిసింది. ఆత్మహత్యకు రెండవ ప్రధాన కారణం.. ఏ తల్లిదండ్రులకైనా వారి అతి పెద్ద పీడకల ఏంటంటే తమ పిల్లల మరణానికి సాక్ష్యం ఇవ్వడం. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం 2018లో 10,159 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే 2019కి ఆ సంఖ్య 3.4 శాతం పెరిగిందని తన నివేదికలో పొందుపరిచింది. ప్రతి రోజూ 381 టీనేజర్లు ఆత్మహత్య లు చోటుచేసుకుంటున్నట్టు, దీంట్లో పరీక్షల్లో ఫెయిలవడం ఇతరత్రా కారణాలు మొదటి కారణంగా ఉంటే, సోషల్ మీడియానే రెండవ ప్రధాన కారణంగా ఉంటోందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే 67 శాతం టీనేజర్ల జీవితాలు అధ్వానంగా ఉన్నట్టు, 73 శాతం మంది ఇతరులకు తమ రూపాన్ని చూపించుకునే ఫొటోలు పోస్ట్ చేయడం పట్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు, 60 శాతం జనాదరణ కోసం, 80 శాతం మంది సోషల్ మీడియా డ్రామా ద్వారా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు. పది నుండి 14 ఏళ్ల వయసు గల బాలికలలో ఆత్మహత్య శాతం మూడు రెట్లు పెరిగిందని, సోషల్‌మీడియా వాడకం రోజుకు 2–3 గంటలపాటు ఏకధాటిగా ఉపయోగించే టీనేజర్లలో బాధ, ఆత్మహత్య టెండెన్సీ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అమెరికా పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తమ నివేదికలో పొందుపరిచారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీనేజర్లు ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ చేయడం మేలు సోషల్ మీడియాలో అందరి మెప్పు పొందడం అనేది అసాధ్యం. వ్యతిరేక వ్యాఖ్యలు రావచ్చు అనే అవగాహన కూడా ఉండాలి. అలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కావాలని రెచ్చగొట్టే వాఖ్యలకు పాల్పడుతున్నవారి అకౌంట్‌ను బ్లాక్ చేయడం అనేది మేలైన, సులువైన ఆప్షన్. లేదంటే, పట్టించుకోకుండా వదిలేయవచ్చు. కామెంట్స్ డిలీట్ చేసే ఆప్షనూ ఉంటుంది. దీనిని ఉపయోగించుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకుండా నిరోధించవచ్చు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్టే వ్యతిరేక కామెంట్స్ పట్ల కూడా సరైన నిర్ణయం తీసుకునే సమర్థత మీ చేతుల్లోనే ఉంది. ఇతర వ్యక్తులు ఎలాగూ అగ్నికి ఆజ్యం పోయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి, వ్యతిరేక వ్యాఖ్యల çపట్ల మరింతగా ప్రోత్సహించేవారిని కూడా అకౌంట్లో లేని విధంగా నియంత్రించుకునే అధికారం మన చేతుల్లోనే ఉందని గ్రహించాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్ గైడెన్స్ అవసరం టీనేజర్స్‌లో ఒత్తిడి పెంచే వాటిలో సోషల్‌మీడియా వాడకం ప్రధానంగా ఉంటోంది. వీటిలో జరిగే రకరకాల నేరాలు ముఖ్యంగా అమ్మాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేరం జరిగేంత వరకు చూడకుండా తల్లిదండ్రులే ముందస్తు గైడెన్స్ ఇవ్వడం మంచిది. సోషల్‌మీడియా ప్రభావం గురించి టీనేజర్స్‌తో తల్లితండ్రులూ తరచూ సంభాషిస్తూ ఉండటం, వారి అకౌంట్స్‌ను గమనిస్తూ ఉంటే సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. దీపికా పాటిల్, స్పెషల్ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్ -
అతి వినియోగం.. అన్ని వయసులవారూ బలి
సాక్షి, బెంగళూరు: దేశంలో 2017–19 మధ్యకాలంలో మాదకద్రవ్యాల అతి వినియోగం వల్ల 2,300 మంది మృత్యువాతపడ్డారు. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన వివరాల ప్రకారం మితిమీరి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల 2017 ఏడాదిలో 745 మంది, 2018లో 875 మంది, 2019లో 704 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రస్థానంలో రాజస్థాన్, కర్ణాటక, యూపీ అతి ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్న రాష్ట్రాల్లో కర్ణాటక రెండో స్థానంలో నిలవడం గమనార్హం. మొదటి స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 2017–19లో రాజస్థాన్‌లో 338 మంది, కర్ణాటకలో 239 మంది, ఉత్తరప్రదేశ్‌లో 236 మందిని డ్రగ్ ఓవర్‌డోస్ బలిగొంది. అన్ని వయసులవారూ బలి డ్రగ్స్ భూతానికి 30–45 ఏళ్ల మధ్య వయసున్న వారే అత్యధికంగా (784) మంది మరణించారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు డ్రగ్స్‌కు బానిసయ్యారు. 14 ఏళ్ల లోపు వయసున్న వారు 55 మంది, 14–18 ఏళ్ల మధ్య ఉన్నవారు 70 మంది డ్రగ్స్‌కు అసువులుబాశారు. మృతుల్లో 18–30 ఏళ్ల మధ్య వయసున్న వారు మొత్తం 624 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్లు పైబడిన వారు 241 మంది మత్తు సేవనానికి బలయ్యారు. చదవండి: నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా?: మాజీ సీఎం టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి -
నేరాలు పెరిగాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేరాలు పెరిగాయి. ‘ఆమె’పై అఘాయిత్యాలు అధికమయ్యాయి. పిల్లల పరిస్థితీ అంతే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)–2019 తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో పెరిగినట్లు ఎన్సీఆర్బీ గుర్తించింది. ఈ నేరాల్లో ఉత్తర్‌ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. పిల్లలు, వృద్ధులపై అఘాయిత్యాలు, అవినీతి, ఆర్థిక నేరాలు కూడా 2018తో పోలిస్తే అధికంగానే నమోదయ్యాయి. జువనైల్ కేసుల విషయంలో మాత్రం తగ్గుదల కనిపించడం గమనార్హం. సైబర్ నేరాల్లోనూ పెరుగుదల నమోదవగా, వాటిల్లో కర్ణాటక దేశంలోనే టాప్‌గా నిలిచింది. 2018, 2019లో తెలంగాణలో నమోదైన ఆయా నేరాలు, దేశంలోని మొత్తం నేరాల్లో మన రాష్ట్రానివి ఎంత శాతమనే వివరాలతోపాటు అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయి... -
నేరాలు తగ్గినట్టేనా?
జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) 2017నాటి నివేదిక వెలువరించిన మూడు నెలల్లోనే 2018 సంవత్సరం నివేదికను విడుదల చేసింది. ముగియబోయే సంవత్సరం నివేదికను ఏడాది చివరిలోనో, ఆ మరుసటి ఏడాది మొదట్లోనో విడుదల చేయడం రివాజు. దాన్ననుసరించి 2017 వార్షిక నివేదిక 2018లో రావాల్సివుండగా, ఏడాది ఆలస్యమై నిరుడు విడుదలైంది. అంత జాప్యం చోటుచేసుకున్నందుకు వచ్చిన విమర్శల వల్లకావొచ్చు... 2019 ముగిసిన కొన్ని రోజులకే 2018 నివేదిక బయటికొచ్చింది. స్థూలంగా చూస్తే నేరాల రేటు తగ్గినట్టు కనిపించినా మహిళలపై జరుగు తున్న నేరాలు పెరిగాయి. నేరాల రేటును గణించడంలో కొత్త విధానం అనుసరిస్తూ, దాని ద్వారా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయం కలిగిస్తున్నారని నిపుణుల విమర్శ. లక్షమంది జనాభాకు జరిగే నేరాల సంఖ్యను బట్టి ఈ నేరాల రేటును లెక్కేయడం ఎప్పటినుంచో ఆనవాయితీ. అయితే 2016 మొదలుకొని ఈ విధానం మారింది. దాని ప్రకారం ఒక ఎఫ్ఐఆర్లో వేర్వేరు నేరాలు నమోదైనప్పుడు వాటిల్లో గరిష్టంగా శిక్షపడగల తీవ్రమైన నేరాలను మాత్రమే పరిగణనలోకి తీసు కుంటారు. దాంతో ఇతర నేరాలన్నీ లెక్కలోకి రాకుండా పోతున్నాయి. ఒక బాలుడిని అపహరించి, గుర్తుతెలియని చోట నిర్బంధించి, అతన్ని హింసించి హత్య చేసిన సందర్భాలున్నప్పుడు ఎన్సీ ఆర్బీ ఇందులో అపహరణ, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు పెట్టడం, హత్య చేయడం వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని గణాంకాల్లో చూపేది. కొత్త విధానం ప్రకారం గరిష్టకాలం శిక్ష పడే అవకాశంవున్న హత్యా నేరాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందువల్ల దేశంలో జరిగే నేరాల స్వభావంపైనా, వాటి తీరుపైనా అవగాహనకు రావడం కష్టమవుతుంది. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన 2017నాటి నివేదిక తొలిసారి మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాలను, దళితులపై జరిగే అఘాయిత్యాలను, అవినీతి ఉదంతాలను భిన్నవిధాలుగా వర్గీకరించారు. నకిలీ నోట్లనూ, నల్లధనాన్ని అరికట్టడానికి 2016లో పెద్ద నోట్లు రద్దు చేశాక విడుదల చేసిన రూ. 2,000 నోట్లపై నేరగాళ్ల దృష్టి పడిందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో వేర్వేరు చోట్ల పట్టుబడిన నకిలీ కరెన్సీలో ఈ నోట్ల వాటా 61.01శాతం వున్నదంటే పరిస్థితి ఏవిధంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు. 2017లో ఈ నోట్ల వాటా 53.30 శాతంవుంటే, ఇప్పుడది మరింత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్లో రూ. 2,000 నకిలీ నోట్లు అధికంగా పట్టుబడగా, తదనంతర స్థానాల్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వున్నాయి. ఆ నోటును అనుకరించడం అసాధ్యమని అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ప్ర కటించడం గమనార్హం. సగటున రోజూ దేశవ్యాప్తంగా 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 అపహరణలు జరుగు తున్నాయని తాజా నివేదిక వెల్లడిస్తోంది. 2017లో ఈ నేరాల సంఖ్య 3,45,989 కాగా, 2018లో అవి 3,78,277కి చేరుకున్నాయి. అంటే నేరాలు 1.3 శాతంమేర పెరిగాయి. ఉత్తరాది ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. ఆ రాష్ట్రంలో మహిళలపై మొత్తం 59,445 నేరాలు జరిగాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇవి దాదాపు 3,500 అధికం. అత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్లలో 93.7శాతం మంది బాధితులకు తెలిసినవారే. 2017నాటి నివేదిక కూడా ఈ సంగతినే నిర్ధారించింది. మహిళలు గతంతో పోలిస్తే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే తీరు పెరిగినందువల్ల అత్యాచార కేసుల సంఖ్యలో పెరుగుదల కనబడుతోందన్నది వాస్తవం. అయితే ఇప్పటికీ బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకురాని స్థితి సమాజంలో వుంది. కనుక ఎన్సీఆర్బీ నివేదికలు వెల్లడించే సంఖ్యను మించి ఈ నేరాలు ఉండొచ్చుననే భావించాలి. ప్రభుత్వాల వైఖరి మారితే తప్ప ఈ నేరాలు తగ్గే అవకాశం వుండదు. అత్యాచారం జరి గినట్టు ఫిర్యాదు అందినప్పుడు వెనువెంటనే కదిలి నేరగాళ్లను అదుపులోనికి తీసుకుని, త్వరితగతిన దర్యాప్తు చేసినప్పుడు, న్యాయస్థానాల్లో సాధ్యమైనంత త్వరగా నేరగాళ్లకు శిక్షలు పడినప్పుడు మాత్రమే ఇవి అంతరిస్తాయి. అలాగే బాధితులను బాధితులుగా చూడకుండా, తప్పంతా వారిదే అయినట్టు ప్రశ్నించే పోలీసుల తీరు కూడా ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనకాడేలా చేస్తోంది. పోలీసు గస్తీ పెంచడం, సమాచారం అందినవెంటనే స్పందించడం, ప్రజారవాణా విభాగాన్ని పటిష్టం చేయడం అత్యవసరం. మహిళలను చిన్నచూపు చూసే సామాజిక, సాంస్కృతిక ధోర ణులను అరికట్టడం అన్నిటికన్నా ముఖ్యం. మహిళలపై నేరాలను అరికట్టడం ప్రభుత్వాలకూ, పోలీసు విభాగాలకూ ప్రాధాన్యతాంశంగా మారినప్పుడు ఇవన్నీ సరిచేయడం సులభమవుతుంది. అంతక్రితంతో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గణాంకాలు చెప్పడం ఊరటనిస్తుంది. అయితే వాటిని తరచి చూస్తే పంటలు సరిగా పండని ప్రాంతాల్లో, వర్షపాతం సరిగాలేని ప్రాంతాల్లో ఈ ఆత్మహత్యలు ఇప్పటికీ గణనీయంగా వున్నాయని బోధపడుతుంది. రైతుల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వాల చూపు మరింత నిశితం కావాల్సిన అవసరాన్ని ఇది ఎత్తిచూపుతోంది. దేశంలోని రైతుల్లో పది శాతంమంది భూమిలేనివారే. కౌలుకు తీసుకున్న భూముల్లో సాగు చేస్తూ, అందుకవసరమైన అప్పు బ్యాంకుల్లో దొరక్క, అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. దాంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఈమాదిరి అప్పులు సాగు ఉత్పత్తుల విలువలో సగానికిపైగా వుంటాయి. ఇలాంటి రైతులకు సైతం బ్యాంకు రుణాలు లభించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా, ప్రకృతి విపత్తుల నిర్వహణ వగైరాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. 48 లక్షలమంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ. 13,500 చొప్పున అందించింది. ఇతర రాష్ట్రాలు సాగు రంగంలో ఈ తరహా చర్యలు తీసుకుంటే రైతుల ఆత్మహత్యలు అరికట్టడం సాధ్యమవుతుంది. -
తూటాలకు వీరతిలకం!
ఆ ‘దుర్మార్గుల’ శరీరాల్లో మొత్తం 11 బుల్లెట్లు దిగ బడ్డాయి. ‘ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది. ఆ తుపా కులను ముద్దాడాలని ఉంది’ అంటున్నారు సెలబ్రిటీలు.తనదైన ఒక అందమైన నవజీవితాన్ని అప్పుడప్పుడే నిర్మించుకోవడం మొదలుపెట్టిన ఆ యువ డాక్టర్‌ను అతిదారుణంగా చిదిమేసిన ‘మానవమృగాలు’ పోలీసులపై కూడా తిరగబడ్డాయట. రాళ్లతో దాడి చేశాయట. వారి పిస్తోళ్లను కూడా లాక్కొని కాల్పులు జరిపాయట. గత్యంతరం లేని స్థితిలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులకు హతమైపోయాయి. ఇటువంటి ఎన్కౌంటర్ కథనాలు మనదేశంలో కొత్తకాదు. కొన్నివేల ఎన్కౌంటర్లు జరిగి వుంటాయి. అవన్నీ వేరు. ఈ ఎన్కౌంటర్ వేరు. ఈ వార్త కీచకవధ వార్తలాగా క్షణాల్లో దేశాన్ని చుట్టేసి జనాన్ని ఉత్తేజితం చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పండితులూ, పామరులూ అందరూ ముక్తకంఠంతో శభాష్ అన్నారు. ఈరోజే కదా నిజమైన దీపావళి అని కూడా వ్యాఖ్యానిం చారు. విద్యార్థినులు, యువతులూ డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ‘ఊరికి ఒకడే రౌడీ వుండాల. ఆడు పోలీసోడే అయివుండాల’ వగైరా ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ‘సింగం.. సింగం..’ అనే ట్యూన్లు న్యూస్ చానెళ్లలో విని పించాయి. చివరికి, సర్వోన్నత చట్టసభైన పార్లమెంట్లో సైతం ఎన్‌కౌంటర్‌కు సమర్థనగా ప్రసంగాలు సాగాయి. అదేమిటి? పోలీసులే తీర్పు చెప్పేసి శిక్షలు వేస్తూ పోతే ఇక న్యాయవ్యవస్థ దేనికి? కోర్టులు – జడ్జీలు ఎందుకు? అంటూ అక్కడక్కడా కొన్ని స్వరాలు వినిపించాయి. బహుశా రోజులు గడిచేకొద్దీ ఈ స్వరాలు ఇంకొంచెం బలం పుంజుకోవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం పోలీసు తీర్పు సమర్థించారు.ఇదొక కఠిన వాస్తవం. ఈ కఠిన వాస్తవానికి వెనుక కచ్చితమైన కారణాలు ఉన్నాయి. సంస్థాగతమైన లోపాలతో మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కునారిల్లుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో న్యాయస్థానాల సంఖ్య, జడ్జీల సంఖ్య పెరిగి ఉండాల్సింది. పెరగకపోగా జడ్జీ పోస్టుల్లో ఎప్పుడూ చాలా భాగం భర్తీ కాకుండా ఖాళీగానే వుంటున్నాయి. దేశంలోని వివిధ కోర్టుల్లో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. క్రిమినల్ కేసులే రెండు కోట్లు. ఇందులో పదోవంతు కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో వున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీ ఆర్బీ) లెక్కల ప్రకారం 2017లో 32,500 అత్యా చారం కేసులు నమోదయ్యాయి. అప్పటికే పెండింగ్‌లో వున్న వాటితో కలిపి ఈ సంఖ్య లక్షా 46 వేలకు చేరింది. వాటిలో ఆ సంవత్సరం వివిధ కోర్టుల్లో పరిష్కారమైన రేప్ కేసుల సంఖ్య 18,300 మాత్రమే. అంటే ఏటా పదిశాతం కేసులు పరిష్కారమవుతుంటే 30 శాతం కేసులు పెండింగ్ జాబితాకు అదనంగా తోడవుతున్నాయి. భారతదేశంలో వున్న పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలంటే 70 వేలమంది అదనపు జడ్జీలు అవసరమవుతారని మూడేళ్ల కింద అప్పటి ప్రధాన న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ పరిస్థితి కూడా అదేవిధంగా వున్నది. సాధారణ స్థాయిలో నేరాలు జరిగే దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు 225 మంది పోలీసులుం డాలని ఒక లెక్క వుంది. నేరాలు ఎక్కువగా జరిగే భారతదేశంలో మాత్రం లక్షకు 138 మంది పోలీసులు న్నారు. ఈ సంఖ్యలో 25 శాతం పోస్టులు ఎప్పుడూ ఖాళీగానే వుంటాయట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన పోలీసుల సంఖ్యలో సగానికంటే తక్కువమందితో మన పోలీసు వ్యవస్థ నెట్టుకొస్తున్నది. ఇంత పెద్ద దేశంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు మూడో నాలుగో వున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్టు రావాలంటే నెలలపాటు వేచి వుండాల్సిన దుస్థితి. మన మార్చురీల నిర్వహణ ప్రపంచంలో ఎక్కడా లేనంత దారుణంగా వుంది. ఈ కారణాలు కూడా నేర పరిశోధనకు సవాల్ విసురుతు న్నాయి. అనేక కేసుల్లో నేర నిరూపణలో వైఫల్యాలకు ఇవి కూడా కారణాలే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వచ్చిన స్పందనను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. యావత్తు దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతంలో దోషులకు మరణశిక్ష పడి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ అమలు జరగలేదు. తొమ్మిదేళ్ల పసి బాలికపై అత్యాచారం కేసులో కింద కోర్టు విధించిన మరణశిక్షను పైకోర్టు యావజ్జీవ శిక్షగా సవరిం చింది. అత్యాచారాలకు, హత్యలకు బలైన బిడ్డల తల్లి దండ్రులు తీరని కడుపుకోత వేదనను అనుభవిస్తుంటే, నేరస్తులు మాత్రం నిర్భయంగా సంచరిస్తున్న ఘటనలు జనంలో న్యాయస్థానాల తీర్పుపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో దిశ ఉదంతం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతంలో, దేశంలోనే అతిపెద్ద జాతీయ రహ దారి పక్కన, నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరువలో ఒక యువ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన మీడియాలో విస్తృతంగా ప్రచార మైంది. ‘నాకు భయమేస్తున్నది పాప’ అన్న దిశ గొంతుక ప్రతి గుండెను తాకింది. ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి పెరిగింది. జాతీయ మీడియాలో పూనకాల స్వాములు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఒక ఉద్యమ నాయ కుడు, రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకునిపట్ల కనీస గౌరవం లేకుండా ఆయన మౌనంపై పూనకాల స్వాములు ప్రశ్నల వర్షం కురిపించారు. మౌనా నికి అర్థం మూగ తనం కాదు. పోలీసు భుజంమీద వేలా డుతున్న తుపాకీ కూడా మౌనంగానే వుంటుంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు వచ్చిన శబ్దానికి ప్రపంచమే ఉలిక్కి పడింది. భుజం మాత్రం పోలీసులదే. ఇప్పుడిక్కడ కలవరం కలిగించే మరో అంశం ముందుకొచ్చింది. దిశపై అత్యాచారం జరగడానికి మూడు రోజుల ముందు అసిఫాబాద్ జిల్లాలో ఒక ముప్పయ్యేళ్ల వివాహిత, దళిత యువతిపై కూడా గ్యాంగ్‌రేప్ జరిగింది. పరమ కిరాతకంగా ఆ యువతి చేతివేళ్లను, గొంతునూ కోసి చంపి, అడవిలో శవాన్ని పారేశారు. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు మీడియాలో అరకొర ప్రాధాన్యతే లభించింది. దిశ కేసులో చెప్పినట్టు, బాధిత మహిళ పేరు గోప్యంగా ఉంచాలని మీడియాకు ఈ యువతి కేసులో ఏ అధికారి సలహా ఇవ్వలేదు. మా మాన ప్రాణా లకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ దళిత సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. మరొక వైరుధ్యాన్ని కూడా ప్రజలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతున్నారు. దిశ కేసులో నిందితులు నిరుపేదలు. దిశను బలితీసు కున్న పదో రోజున ఆ నిందితులు పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితులు బడాబాబులు. ఘోరం జరిగి సరిగ్గా ఏడాది నిండగానే ఆ బాధితురాలిని బడాబా బులు నడిరోడ్డుపై నిప్పుపెట్టి చంపేశారు. ఇక్కడ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన రోజే అక్కడ బాధితు రాలి హత్య జరగడం కేవలం కాకతాళీయమే కావచ్చు. కానీ పోలీసు తూటాలు చెప్పే తీర్పులో ధనిక – పేద వివక్ష ఉండితీరుతుందని ఈ ఘటనలు స్పష్టం చేశాయి. ఎందుకంటే బాధితురాలిపై దాడులు జరుగుతాయని తెలిసినా పోలీసులు ఆమెకు రక్షణ ఇవ్వలేదు. ఎన్కౌంటర్ జరిగిన మరుసటిరోజు తెలుగు టెలివి జన్ చానళ్లలో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. చర్చల్లో పాల్గొన్న విశ్లేషకులతోపాటు ఫోన్ కాలర్స్ సైతం న్యాయవ్యవస్థ వ్యవహారశైలిలోని వైరుధ్యాలను ఎత్తి చూపారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో ఆధారాలతో చంద్రబాబునాయుడు దొరికిపోయినా, ఆ కేసును స్వీకరించడానికి న్యాయస్థానాలు నేటివరకు అంగీకరించకపోవడానికి కారణమేమిటని ఒక విశ్లేష కుడు ప్రశ్నించాడు. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణపై ఉన్న స్టేను ఎత్తివేయడానికి 14 సంవత్సరాలు పట్టిం దని, ఇక విచారణ జరిగి తీర్పు రావడానికి ఇంకెన్నేళ్లు పడతాయని ఒక కాలర్ ఆవేదనతో ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ – తెలుగుదేశం కలిసి రాజకీయ కక్షతో వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై ఎటువంటి ఆధారాలు లేకుండా సాదాసీదా పిటిషన్ వేస్తే న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. సదరు న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం మరో ఉన్నత పదవి లభించింది. చంద్రబాబుపై డాక్యుమెంటరీ ఆధారాలతో సహా వైఎస్ విజయమ్మ దాఖలుచేసిన పిటిషన్‌ను అదే న్యాయస్థానం సీబీఐ దగ్గర సిబ్బంది లేరనే సాకుతో తిరస్కరించింది. ఈ వైరుధ్యాలను మరో కాలర్ గుర్తుచేశాడు. న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతున్నదనే ఆందోళనకర మైన అంశం ఈ చర్చల్లో ప్రతిఫలించిన కారణంగానే ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితి లోనే ఎన్కౌంటర్ రూపంలో దొరికిన సత్వర పరిష్కా రాన్ని ప్రజలు ఆమోదించినట్టు కనిపిస్తున్నది. ఆడపిల్లల మీద అత్యాచార ఘటనలను సంపూ ర్ణంగా అరికట్టాలంటే చేపట్టవలసిన చర్యలు చాలానే ఉన్నాయి. తొలుత న్యాయ – పోలీస్ వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగేలా రూపొందించాలి. మారిన అవసరాలకు అనుగుణంగా వాటిని పటిష్టం చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించేలా చట్టాలను సవరించుకో వాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ చెబుతున్నట్టు విచ్చలవిడి మద్యం విక్రయాలపై నియం త్రణ విధించాలి. మొబైల్ ఫోన్లలో అశ్లీల వరద ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఒక భాగం మాత్రమే. ప్రధానంగా జరగాల్సింది సాంస్కృతిక ప్రక్షాళన. ‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెప్పిన మను ధర్మశాస్త్ర వారసత్వం మన నడవడిలో, మన ఆలోచ నలో, మన అంతరంగాల్లో అంతర్లీనంగా ప్రవహిస్తూనే వున్నది. అభ్యుదయ వాదులమని చెప్పుకునే వాళ్లు కూడా ‘పురుషులు కొంచెం ఎక్కువ సమానం – స్త్రీలు కొంచెం తక్కువ సమానం’ అనే భ్రష్ట సమానత్వ భావనతో వ్యవహరిస్తుంటారు. చిన్నతనం నుంచే మగ పిల్లవాడెక్కువ, ఆడపిల్ల కొంచెం తక్కువ అనే ఆలోచనా ధోరణికి ప్రయత్నపూర్వకంగా వీడ్కోలు చెప్పాలి. ‘నీవలెనే, నావలెనే... నీ అక్కా, నా చెల్లీ’ అనే భావం చిట్టి మెదళ్లలో ఎక్కాలి. అతడు – ఆమె ఈ ప్రపంచానికి సమాన పట్టాదారులని చెప్పాలి. ఆశలు ఇద్దరివీ, ఆశ యాలు ఇద్దరివీ, అవకాశాలు ఇద్దరివీ, ఆకాశం ఇద్దరిదీ, అంతరిక్షం ఇద్దరిదీ, అనంతకోటి నక్షత్రాలు ఇద్దరివీ అనే సమభావం చిన్నవయసులో నాటగలిగితే స్త్రీని భోగ వస్తువుగా చూసే మనస్తత్వం అలవడదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కారణంగానే స్త్రీల మీద విచ్చలవిడి అత్యాచారాలు కనిపించవు. ఆ స్థితికి చేరుకోవడం అనేది అత్యున్నత నాగరిక దశ. అప్పటివరకు కనీసం దోషు లకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. అందుకు రాజకీయ నాయకత్వానికి స్థిరచిత్తం ఉండాలి. కానీ, దురదృష్టవ శాత్తు స్త్రీలను కించపరిచే ధోరణి మన నాయకత్వంలోనే ఉన్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దం టుందా’ అని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి బహిరంగంగా సామెతను విసరడం మూర్తీభవించిన ఆయన పురుషా ధిక్య భావజాలానికి బండగుర్తు. ఈ అహంభావం వల్లనే మహిళా అధికారిని అవమానించిన ఒక మాజీ ఎమ్మె ల్యేను ఇప్పటికీ చంద్రబాబు తనకు ఆదర్శం అని చెబుతున్నాడు. ఈ అహంభావం వల్లనే నిస్సహాయ మహిళల పరువును దోచేసే ‘కాల్‌మనీ’ ముఠాను పార్టీలో ప్రోత్సహించాడు. ఇటువంటి రాజకీయ నాయక త్వాన్ని ఎండగట్టాలి. అప్పటివరకూ పోలీసులు వెయ్యి అత్యాచారాలకు ఒక ఎన్కౌంటర్ చేస్తారు. అలా చేసిన ప్పుడల్లా ఆడబిడ్డలతోటి ఆ పోలీసుల తుపాకీ గొట్టాలకు రాఖీలను కట్టిద్దాం. వారు పేల్చే తూటాలను ఏరుకొచ్చి వీరతిలకం దిద్దిద్దాం. పోలీసువారికి విన్నపం... మరో సారి ఇటువంటి సందర్భంలో సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేయ డానికి వెళ్లినప్పుడు ఇప్పటి మాదిరిగానే బలహీనులైన పోలీసులను తీసుకొని వెళ్లాలి. ఎందుకంటే నిందితులు తిరగబడి పోలీసుల తుపాకులు లాక్కోవాలి కదా. అప్పుడే కదా ఎన్కౌంటర్ జరిగేది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఎన్సీఆర్బీ నివేదికలో ‘డేటా’ గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో దేశంలో జరిగిన వివిధ రకాల నేరాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషించిన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)’ సోమవారం ఆ డేటాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. 2018లోనే విడుదల చేయాల్సిన ఈ డేటాను ఏడాది ఆలస్యంగా విడుదల చేయడానికి కారణం ఏమిటో వివరించలేదు. విడుదల చేసిన డేటాలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. దేశంలో చోటు చేసుకున్న మూక హత్యలు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు చేసిన లేదా చేయించిన హత్యల వివరాలు, కాపు పంచాయతీల ఆదేశాల మేరకు జరిగిన హత్యలు, మత ఘర్షణల్లో చనిపోయిన వారి డేటాను విడుదల చేయలేదు. ఈ నేరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించినప్పటికీ డేటాను ప్రచురించక పోవడం ఆశ్చర్యంగా ఉందని, దీన్ని చివరి నిమిషంలో ప్రచురించకుండా ఎందుకు నిలిపివేశారో ఉన్నతాధికారులకే తెలియాలని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. దేశంలో 2017లో గోరక్షణ పేరిట మూక హత్యలు, మత విద్వేష సంఘటనలు ఎక్కువగా జరిగాయి. ‘పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు వచ్చారు’ అంటూ సోషల్ మీడియా ప్రచారం వల్ల జరిగిన హత్యల వివరాలు కూడా డేటా నుంచి పూర్తిగా మాయమయ్యాయి. పైగా ఈ సారి నివేదికలో ముడుపెన్నడూ లేనిది ‘జాతి వ్యతిరేక శక్తుల’ పేరిట మూడు కొత్త కేటగిరీలను చేర్చారు. వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటుదారులు, రెండు నక్సలైట్లు లేదా వామపక్ష తీవ్రవాదుల, మూడు జిహాది టెర్రరిస్టులు సహా టెర్రరిస్టులు. ఈ మూడు వర్గీకరణల కిందకు వచ్చే వారంతా జాతి వ్యతిరేక శక్తులంటూ వారు ఇంత వరకు భారతీయ శిక్షా స్మతి, ఆయుధాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చేసిన నేరాల గురించి వెల్లడించారు. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన హిందువుల గురించి ఇచ్చారు. హిందువుల దాడుల్లో మరణించిన ముస్లింల గురించి ఎక్కడా, ఏ కేటగిరీ కింద కూడా ఇవ్వలేదు. డేటాలో పలు నేరాలకు సంబంధించిన వివరాలు గల్లంతవడం వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలా జరగడం ఇదే కొత్త కాదు. బీజీపీ ప్రభుత్వం తన రాజకీయ లక్ష్యాల కోసం గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి సమాచారాన్ని దాస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఒక్క నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక గణాంకాల వివరాలను తొక్కిపెట్టింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగుల శాతం వివరాలను దాచేయడమే కాకుండా మూడు నెలలకోపారి నిరుద్యోగంపై జరిగే సర్వేలను నిలిపి వేసింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించి కులాల విశ్లేషణా వివరాలను కూడా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను కూడా బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడుతూ వస్తోంది. ఇలా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమే కాదు. ఇలాంటి నేరాలు, ఆర్థిక గణాంకాలు విడుదల చేయకపోతే భవిష్యత్తుతో నేరాలను అరికట్టేందుకు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు విధాన నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుందని మేథావులు ప్రశ్నిస్తున్నారు. -
మతవిద్వేష దాడుల్ని ఆపండి!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తారు. ఈ మూకహత్యలను వెంటనే అరికట్టేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ నటీనటులు అపర్ణాసేన్, కొంకణ్‌సేన్ శర్మ, రేవతి, సౌమిత్రో ఛటర్జీ, గాయని శుభా ముగ్దల్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ, సామాజిక కార్యకర్త బినాయక్ సేన్, సామాజికవేత్త ఆశిష్ నంది సహా 49 మంది బహిరంగ లేఖ రాశారు. కోల్‌కతాలో నటి అపర్ణాసేన్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో.. ‘‘మోదీజీ.. మనదేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న దురదృష్టకరమైన సంఘటనలపై మేమంతా కలత చెందుతున్నాం. మనది శాంతికాముక దేశం. కానీ దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీ మతస్తులను చంపేస్తున్నారు. దీన్ని నిలువరించాలి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చూసి విస్తుపోయాం. ఎందుకంటే ఒక్క 2016లోనే దళితులపై 840 దాడి ఘటనలు నమోదయ్యాయి. 9 ఏళ్లలో మతవిద్వేష దాడులు అమాంతం పెరిగిపోగా, అందులో 62 శాతం మంది బాధితులు ముస్లింలే. 2009, జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకూ దేశవ్యాప్తంగా 254 మత విద్వేష ఘటనలు నమోదుకాగా, వీటిలో 91 మంది చనిపోయారు. ఈ విద్వేషదాడుల్లో 90 శాతం 2014, మే తర్వాతే(మోదీ వచ్చాకే) నమోదయ్యాయి. ఈ నేరాల్లో శిక్షలు పడుతున్న కేసులు గణనీయంగా తగ్గిపోవడం ఇంకా దారుణం. మోదీజీ.. మీరు పార్లమెంటులో ఈ మూకహత్యలను ఖండించారు. కానీ అది మాత్రమే సరిపోదు. హత్య కేసుల్లో పెరోల్ లేకుండా జీవితఖైదు పడుతున్నప్పుడు అంతకంటే దారుణమైన మూకహత్యలకు అదే శిక్ష ఎందుకు వర్తించదు? ఇలాంటి ఘటనల్లో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ దేశంలో కూడా ప్రజలు భయంతో బతకకూడదు. మెజారిటీ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు. కానీ, ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయింది. ఆయన పేరుతో హత్యలు చేయడానికి ఇది మధ్యయుగం కాదు. ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలి. మతవిద్వేష దాడులతో శ్రీరాముడి పేరును అపవిత్రం చేయడం ఆపండి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, జాతివ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేయడం సరికాదు. అధికార పార్టీని విమర్శిస్తే∙దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఎక్కడైతే భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతిని వినిపించేందుకు అవకాశముంటుందో అదే బలమైన దేశంగా రూపుదిద్దుకుంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అందరూ సురక్షితమే: నఖ్వీ భారత్‌లో ముస్లింలు దళితులు సహా మైనారిటీలంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మూకహత్యలు, మతవిద్వేష దాడుల్ని అరికట్టాలని 49 మంది దర్శకులు, నటులు, ఇతర కళాకారులు ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన తప్పుపట్టారు. నేరాలకు మతం రంగు పులమడం సరికాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మతఘర్షణలు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. ‘‘2014 ఎన్నికల తర్వాత ‘అవార్డు వాపసీ’ పేరుతో ఇలాంటి కార్యక్రమాన్నే మనమంతా చూశాం. ఇది దానికి పార్ట్–2 మాత్రమే. విద్వేష నేరాలు, మూకహత్యలను అరికట్టడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ తమనుతాము మానవ హక్కుల పరిరక్షకులుగా, లౌకికవాదానికి కస్టోడియన్లుగా చెప్పుకునే కొందరు ఈ నేరాలకు మతం రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ రాజీవ్ జైన్, రీసెర్చ్ అండ్ అనాలిసిన్ వింగ్(రా) కార్యదర్శి అనిల్ ధస్మనాల పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు వారు పదవిలో ఉంటారు. ఎన్నికల ముంగిట వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పదవుల్లో మార్పులు చేయడం ఇష్టంలేకే ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధస్మనా డిసెంబర్ 29న, జైన్ డిసెంబర్ 30న విరమణ చేయాల్సి ఉంది. 1985 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అనిల్ శ్రీవాస్తవకు నీతి ఆయోగ్ సలహాదారు నుంచి ప్రధాన సలహాదారుగా పదోన్నతి కల్పించారు. 1988 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐపీఎస్ అధికారి రాంపాల్ పవార్‌ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డైరెక్టర్‌గా నియమించారు. -
ఎట్టకేలకు కదలిక
మూడేళ్లు గడిచాక... దాదాపు 48మంది మరణించాక... ఒక చట్టం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మూక దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయటం కోసం ఉన్నతాధికారుల కమిటీ, మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మూక దాడులు జరిగినప్పు డల్లా ఆరోపణలు రావడం, వాటిని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఖండించడం, ఎదురు దాడి చేయడం తప్ప దాడుల్ని ఆపడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. మూక దాడులు జరగకుండా చూడమని రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెల మొదట్లో కోరింది. పిల్లల్ని అపహరించుకుపోతున్నారన్న అను మానంతో వ్యక్తులను కొట్టి చంపుతున్న ఘటనలు ముదిరాక ఈ పని చేసింది. గోరక్షణ పేరుతో మూకలు చెలరేగినప్పుడే ఇలాంటి ప్రయత్నం జరిగితే... ఈ అనాగరిక హత్యాకాండను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నదన్న సంకేతాలు వెళ్తే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో శనివారం జరిగిన ఉదంతమే దీనికి రుజువు. మూక దాడులు జరిగినప్పుడల్లా పోలీసులు నిందితుల్ని కాపాడుతున్నారని, అరెస్టులో అల సత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు రావడం రివాజు. తాజా ఉదంతంలో పోలీసుల ప్రవర్తన మరింతగా దిగజారింది. ఉన్మాదులు తీవ్రంగా కొట్టడంతో ఒంట్లో ప్రతి అవయమూ చిట్లిపోయి నెత్తుటి ముద్దలా మారిన బాధితుడి గురించి వారు అసలు పట్టించుకోనేలేదు. గో రక్షక భటుల్లా మారి అక్కడున్న రెండు ఆవులనూ గోశాలకు తరలించేలా చూసి, ఆ తర్వాత ఓ దుకాణం వద్ద తాపీగా టీ తాగి అటుపై అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడినుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు మనిషిని తీసుకెళ్లారంటే అది అబద్ధమవుతుంది. అతని మృత దేహాన్ని తీసుకెళ్లారని చెప్ప టమే సబబు. ఘటన జరిగింది మొదలు ఆసుపత్రికి తీసుకెళ్లేవరకూ చూస్తే మూడుగంటల సమ యం పట్టింది. ఈ సమయంలో బాధితుడు ఎంతసేపు ప్రాణాలతో ఉన్నాడోగానీ... ముందు నడి రోడ్డుపై, ఆ తర్వాత పోలీస్ వ్యాన్‌లో, అటుపై పోలీస్‌స్టేషన్‌లో నరకయాతన అనుభవించి ఉంటాడు. తమకు పశువులే తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని చెప్పే ఉన్మాద మూకలకూ, ఈ పోలీసులకూ తేడా ఏమైనా ఉందా? మూక దాడుల్ని చూసీచూడనట్టు వదిలేయటమే కాదు... అలాంటి దాడుల్లో పాల్గొన్నవారికి వెన్నుదన్నుగా ఉంటున్న ప్రభుత్వాల తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇదే అల్వార్ జిల్లాలో ఇంతవరకూ అయిదుగుర్ని ఉన్మాద మూకలు పొట్టనబెట్టుకోగా... వారిలో చాలామంది బెయిల్‌పై బయటికొచ్చారు. నిరుడు ఏప్రిల్‌లో 55 ఏళ్ల పాల ఉత్పత్తిదారును ఇదే సాకుతో గోరక్షక మూక తీవ్రంగా కొట్టి చంపింది. చనిపోయే ముందు బాధితుడిచ్చిన మరణ వాంగ్మూలంలో దాడికి కారకులైన అయిదుగురి పేర్లిస్తే... పోలీసులు మాత్రం వారంతా ఘటన జరిగినప్పుడు వేరేచోట ఉన్నారని తేల్చి అసలు అరెస్టే చేయలేదు! రాజస్తాన్ ప్రభుత్వం ఏ ఉదం తంలోనూ బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించలేదు. తాజా ఉదంతంలో మాత్రం రూ. లక్షా 25 వేలు ఇస్తామని ప్రకటించింది. అదే పెద్ద ఔదార్యమనుకోవాలి! దాడిలో మరణించిన రక్బార్‌ఖాన్ పశువులు అమ్మడం కొనడం ప్రధాన వ్యాపకంగా ఉండే రబారీ సంచారతెగకు చెందిన వాడు. ఆ తెగలో హిందువులూ ఉంటారు. ముస్లింలూ ఉంటారు. వందల ఏళ్లనుంచి రబారీ తెగ ఆ వ్యాపారమే చేస్తోంది. గోరక్షణ మూకల ఆగడాలు మితిమీరుతున్నాయి గనుక దాన్ని ప్రస్తుతానికి మానుకోవాలని కొందరు హితవు చెప్పినా, ఇది తప్ప తమకు బతుకుతెరువు లేదని ఆ తెగ మొత్తు కుంటోంది. గుజరాత్ నుంచి రాజస్తాన్ వరకూ ఉండే వందల కిలోమీటర్ల దూరం వీరు నడిచి పోతూ పశువుల సంతలో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తారు. గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ఆవులు... ఇలా వేటిని తోలుకుంటూ వెళ్లినా మూక ఎదురుపడినప్పుడల్లా కప్పం కట్టి బతుకు కొనుక్కుంటు న్నామని ఆ తెగ అంటోంది. గోరక్షణ పేరుతో జరిగిన దాడులతోపాటు పిల్లల్ని అపహరిస్తున్నారన్న అనుమానంతో కొట్టి చంపుతున్న కేసులు కూడా ఈమధ్య పెరిగాయి. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి హింసాయుత వాతా వరణాన్ని ఎలా పెంచుతుందో చెప్పడానికి మూకదాడులే ఉదాహరణ. 2015 వరకూ గోరక్షణ దాడుల్లో అత్యధికభాగం అంటే 76 శాతం ఉత్తరాదిలో జరిగాయని, ఆ తర్వాత కాలంలో అవి దాదాపు దేశమంతా వ్యాపించాయని ‘ఇండియాస్పెండ్’ వెబ్సైట్ గణాంకాలు చెబుతున్నాయి. చిత్రమేమంటే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) దగ్గర అసలు గోరక్షకæ దాడుల లెక్కలే లేవు! పిల్లల్ని అపహరించడానికొచ్చారన్న అనుమానంతో 2012లో ఒకే ఒక దాడి జరగ్గా నిరుడు జనవరినుంచి లెక్కేస్తే 69 మూకదాడి ఉదంతాల్లో 33మంది చనిపోయారని ఆ వెబ్సైట్ వెల్లడిం చింది. గోరక్షక మూకల దాడుల్ని అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటం పర్యవ సానంగానే అవి వేరే రకాల దాడులకు చోటిచ్చాయి. కనీసం ఈ దశలోనైనా కదిలినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆధ్వర్యంలో ఉన్న తాధికారుల కమిటీ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎలాంటి చర్యలు అవసరమో పక్షంరోజుల్లో సూచి స్తుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం వాటిని పరిశీలించి ప్రధానికి తుది సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీకి ఎలాంటి గడువూ లేదు. మూకదాడుల నియం త్రణకు చట్టం తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా సీఆర్పీసీలో కొత్తగా ఒక నిబంధన చేర్చాలని ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయో లేక రాష్ట్రాల స్థాయిలో చట్టా లుంటే సరిపోతుందని చెబుతాయో వేచిచూడాలి. అయితే ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సైతం నేరాల్లో సహ భాగస్వాములుగా పరిగణిస్తే తప్ప ఈ దాడులు ఆగవు. -
‘మంటల్లో’ రాజధాని
సాక్షి, ముంబై : విద్యుత్ పరికరాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల దేశంలో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. అగ్ని ప్రమాదాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై రెండో స్థానంలో నిలువగా.. అహ్మదాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత పదేళ్ల కాలంలో షార్ట్-సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల ఢిల్లీలో 424 మంది, ముంబైలో 418 మంది, అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 2006 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో సంభవించిన అగ్ని ప్రమాదాల వివరాలను నివేదిక వివరించింది. మాజీ అగ్నిమాపక దళాధిపతి పీడీ కర్గూపికర్ మాట్లాడుతూ.. నామమాత్రపు చర్యలతో అగ్ని ప్రమాదాల్ని ఆపలేమన్నారు. ఇంజనీర్లతో ఎలక్ట్రికల్ ఆడిట్లు నిర్వహిస్తేనే సమస్యలకు కొంతమేర పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మంటల్లో విలువైన ఆధారాలు ఎన్నో నష్టపోతామన్నారు. మంటలార్పే క్రమంలో నీటి ధాటికి మిగిలిన ఆధారాలు కూడా లభించవన్నారు. తద్వారా ప్రమాదానికి షార్ట్-సర్క్యూట్ కారణమా..? లేక మరేదైనా కారణమా? అనేది తేల్చడం కష్టమౌతుందన్నారు. ప్రధాన అగ్నిమాపక అధికారి పీ.ఎస్.రహంగ్దలే మట్లాడుతూ... నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడకపోవడం వల్లే షార్ట్-సర్క్యూట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వైరింగ్ లోపం వల్ల, ఓవర్‌లోడ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికమవుతుందన్నారు. భవనాలు, అపార్ట్‌మెంటుల్లోని చెత్త చాలా రోజుల పాటు అలాగే పెట్టేస్తారు. దాంతో చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేక.. వెలువడిన పొగ, విష వాయువుల్ని పీల్చడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎట్టకేలకు గట్టి బిల్లు
ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డులు మొదలుకొని బాలబాలికలు, యువతుల వరకూ వేలాదిమందిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న మాఫియా ముఠాల ఆట కట్టించేందుకు ఎట్టకేలకు ఒక సమగ్ర చట్టం రాబోతున్నది. దీనికి సంబంధించి రూపొందించిన బిల్లు ప్రస్తుతం మంత్రుల బృందం(జీఓఎం) పరిశీలనలో ఉంది. నాగరిక విలువలనే సవాలు చేస్తున్న మనుషుల అక్రమ తరలింపు దుర్మార్గాన్ని అరికట్టడానికి అమల్లో ఉన్న చట్టాలు చాలడం లేదని, ఆ విషయంలో అత్యంత కఠినమైన చట్టం తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నడో 2004లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై ఆ న్యాయస్థానం ఆదేశాలిచ్చి కూడా రెండేళ్లు దాటింది. ఇన్నాళ్లకు ఆ బిల్లు రూపుదిద్దుకుంది. మాదక ద్రవ్యాల తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత వ్యవస్థీకృతంగా చాపకింద నీరులా సాగిపోతున్న నేరం మనుషుల అక్రమ తరలింపే. ఈ మాఫియా సామ్రాజ్యంలో మాయమాటలు చెప్పి అమాయక ఆడపిల్లల్ని వలలో వేసుకునే దళారులు మొద లుకొని అనేకులున్నారు. బాధితుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికీ తర లించడం, దేశ సరిహద్దులు కూడా దాటించడం ఇటీవలికాలంలో పలుమార్లు బయటపడింది. ఈమధ్యే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న వీరేందర్ దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న మూడు కేంద్రాలపై దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మూడు కేంద్రాల్లో దాదాపు 50మంది యువతులు, బాలికలను కాపాడారు. దాడులు జరగ బోతున్నాయని ముందస్తు సమాచారం అందుకుని చాలామందిని అప్పటికే వేరే చోటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. నిరుడు పశ్చిమబెంగాల్లో వెల్లడైన ఉదంతం మరింత దుర్మార్గమైనది. రోజుల వయసున్న పిల్లల్ని బిస్కెట్ల పెట్టెల్లో పెట్టి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు బయటపడింది. ప్రసవించిన తల్లికి బిడ్డ పుట్టగానే మరణించిందని అబద్ధం చెప్పి, అందుకు కోర్టు గుమాస్తాల ద్వారా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తెప్పించి ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పుడప్పుడు దేశంలో వివిధ రైల్వే స్టేషన్లలో పదులు, వందల సంఖ్యలో పిల్లల్ని తరలిస్తూ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తున్నవారిలో బాలికలనైతే వ్యభిచార కేంద్రాలకు విక్రయించడం, మగపిల్లల్ని వెట్టి చాకిరికి వినియోగించుకోవడానికి అమ్మడం సర్వసాధారణం. ఇవికాక పిల్లల అవయవాలు తొలగించి వారిని యాచక వృత్తిలోకి నెట్టడం కూడా రివాజు. మనుషుల అక్రమ తరలింపు రకరకాల ముసుగుల్లో సాగుతోంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామని, ఇంటి పనులకు అవసరమని, అనాథలకు ఆశ్రయమిస్తామని, దత్తత కోసమని మభ్యపెట్టి అమాయక బాలబాలికలను తెచ్చి నరకకూపాల్లోకి తోస్తున్నారు. వ్యవసాయంలో, ఇటుకల పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేయించడానికి లేదా వ్యభిచారం చేసేందుకు తరలిస్తున్నారు. పిల్లలను చీకటికొట్టాల్లో బంధించి, చిత్రహింసలకు గురిచేసి వారిని దారికి తెచ్చుకుని ఇదంతా సాగిస్తున్నారు. అపహ రించిన పిల్లల ద్వారా ఏటా దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం సాగుతున్నదని అంచనా. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం నిరుడు మనుషుల అక్రమ తరలింపు కేసులు 8,132 నమోదయ్యాయి. అంతక్రితం సంవత్సరం ఈ మాదిరి కేసులు 6,877. రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌లలో మహిళల అపహరణలు అధికంగా ఉన్నాయి. న్యాయస్థానాల్లో కూడా ఈ మాదిరి కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. 2015లో న్యాయస్థానాల ముందు 5,003 కేసులుంటే కేవలం 384 కేసుల విచారణ మాత్రమే పూర్తయింది. ఇందులో 55 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే 14.4 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. చట్టంలో నేరాల నిర్వచనం సక్రమంగా లేకపోవడం, ఆ చట్టాల అమలులో చూపే నిర్లక్ష్యం నేరగాళ్లకు పరోక్షంగా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మన దేశంలో భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. మనుషుల అక్రమ తరలింపుపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికి మూడుసార్లు ముసాయిదా బిల్లులు రూపొందించింది. అయితే అందులోని లోటుపాట్లు ఎత్తి చూపి వాటిని సవరిస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని వివిధ సంస్థలు, వ్యక్తులు చెప్పడంతో తగినంత సమగ్రతతో తాజా బిల్లు రూపొందించారు. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయనాలు లేదా హర్మోన్లు ప్రయోగించడం, అవయవాలను తొలగించి పిల్లలను భిక్షాటనలో పెట్టడం, వెట్టిచాకిరీ కోసం మనుషుల్ని తర లించడం, వ్యభిచార వృత్తిలోకి దించడం, పిల్లలను మానవ కవచాలుగా లేదా సైనికులుగా వినియోగించడం, లైంగిక దోపిడీకి పాల్పడటం, వారిని అశ్లీల చిత్రాల్లో వినియోగించడం వగైరా నేరాలకు తాజా బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదించింది. అలాగే జాతీయ స్థాయిలో మనుషుల అక్రమ తరలింపు కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం నెలకొల్పాలని నిర్దేశించింది. రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక అధి కారులుంటారు. మనుషుల అమ్మకాలు, కొనుగోళ్లలో పాలుపంచుకునేవారికి ఈ బిల్లు కనీసం ఏడేళ్ల కఠిన శిక్ష, గరిష్టంగా పదేళ్ల శిక్ష ప్రతిపాదిస్తోంది. లైంగిక నేరాలకు పాల్పడి వాటిని ప్రచారంలో పెడతామని బెదిరించి బాధితులనుంచి లేదా వారి కుటుంబాలనుంచి డబ్బులు వసూలు చేసినా, ఇతరత్రా ఒత్తిళ్లు తెచ్చినా మూడు నుంచి ఏడేళ్ల శిక్ష విధిస్తారు. ఈ బిల్లు సాధ్యమైనంత త్వరగా చట్టంగా మారడం తక్షణావసరం. అలాగే ఎంత కఠినమైన చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో పనిచేయకపోతే ఉద్దేశం నెరవేరదు. అందువల్ల నేరగాళ్లతో కుమ్మక్కయ్యే, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుండాలి. బాధితులకు పునరావాసం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తేనే ఈ దుర్మార్గం దుంపనాశనమవుతుంది. -
రూ.2 వేల దొంగనోట్లు.. ఎప్పుడొచ్చాయంటే?!
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి, నల్లధనం, దొంగనోట్లపై ఉక్కుపాదం అంటూ ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు గురించి రోజుకో సమాచారం బయటకు వస్తోంది. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు ప్రకటన జరిగిన రోజులు గడవకముందే భారీగా కొత్త రెండువేల రూపాయల దొంగనోట్లను అధికారులు పట్టుకున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు జరిగితే.. నవంబర్30న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారులు 2,272 దొంగనోట్లను పట్టుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రెండువేల రూపాయల నోట్లే కావడం గమనార్హం. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన కరెన్సీని సైతం దొంగనోట్ల ముఠా రోజుల్లోనే వాటిని ముద్రించింది. ముద్రించిన కొత్త కరెన్సీని దేశవ్యాప్తంగా సరఫరా చేసే ప్రయత్నంలో ఉండగా.. ఎన్సీఆర్బీ అధికారులు వాటిని పట్టుకున్నారు. పెద్ద నోట్లు రద్దు జరిగిన నవంబర్8 నుంచి డిసెంబర్31 మధ్యలో అత్యధికంగా గుజరాత్లో 1300, పంజాబ్‌లో 548, కర్నాటక 254, తెలంగాణ 114, మహారాష్ట్ర 27, మధ్యప్రదేశ్ 8, రాజస్తాన్ 6, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో 3 నోట్ల చొప్పున అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. రెండువేల రూపాయల దొంగనోట్లతో సహా, రూ.1000, రూ. 500, రూ. 100 విలువగల 2 లక్షల, 82 వేల 839 దొంగనోట్లను అధికారులు పట్టుకోవడం విశేషం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దొంగనోట్లలో 82,494 నోట్లు రూ. 1000వేకావడం విశేషం. రూ. 500 దొంగనోట్లు లక్ష, 32 వేల 227ను అధికారులు పట్టుకున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వ అధికారులు పట్టుకున్న దొంగనోట్ల విలువ.. రూ. 10 1,222,821. దేశంలో అత్యంత తక్కువగా కేవలం 21 దొంగనోట్లు గోవాలో పట్టుపడ్డాయి. -
ఇది తగునా?!
బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు నోరు పారేసుకోవడం తరచు జరిగేదే. మహిళలకు సంబంధించిన అంశాల్లో ఈ ధోరణి మరీ ఎక్కువ. పక్షం రోజుల నుంచి దేశమంతా పెద్ద నోట్ల రద్దు, దాని పర్యవసానాలపైనే దృష్టంతా కేంద్రీకరించగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అత్యాచారాల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటని చెప్పి అందరినీ దిగ్భ్రమపరిచారు. ఆమె చెప్పిన గణాంకాలు, వాటిని వివరించిన తీరు మహిళల్ని మాత్రమే కాదు... అందరినీ బాధిస్తాయి. ఈమధ్య ఆమె స్వీడన్ పర్యటనకెళ్లినప్పుడు మహిళలకు భారత్‌లో భద్రత లేదని అన్నప్పుడు ఈ గణాంకాలు చెప్పానని ఆమె వివరించారు. అంతే కాదు... మన దేశంలో ఆ ఉదంతాలు మీడియాలో ఎప్పటికప్పుడు వెల్లడవు తుండటంవల్ల అధికంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోందని వివరించానన్నారు. ఈ మాదిరి ఘటనల్లో బాధితులనే నేరస్తులుగా చూసే మనస్తత్వం వల్ల కావొచ్చు... బయటకు వెల్లడైతే పరువు పోతుందని, భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆందోళన పడటం వల్ల కావొచ్చు... ఏళ్లతరబడి దర్యాప్తు పేరుతో, విచారణ పేరుతో తిరగాల్సి వస్తుందన్న బెంగతో కావొచ్చు- చాలామంది బాధితులు మన దేశంలో ధైర్యంగా ముందుకు రావడం లేదు. పెపైచ్చు రాజకీయ ఒత్తిళ్లు, డబ్బు ఎర చూపడం, కేసుల వరకూ వెళ్లకుండా చూడటం వంటివి సరేసరి. నేరగాళ్లు బాధితులకు సమీప బంధువులైతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ఫిర్యాదు ఇవ్వడానికొచ్చే బాధితుల్ని పోలీస్స్టేషన్లలో ప్రశ్నించే తీరు సరేసరి. ఇన్ని అవరోధాలు దాటుకుని కేసులు వెలుగులోకొచ్చినా అవి నత్తనడకన సాగు తున్నాయి. ఈలోగా నిందితులు నిర్బంధంలో ఉండి లేదా బెయిల్‌పై బయటికొచ్చి బెదిరిస్తున్నారు. ఇటీవల అసోం నుంచి మధ్య ప్రదేశ్ వరకూ జరిగిన వేర్వేరు ఉదంతాల్లో నిందితులు బెయిల్‌పై బయటికొచ్చి బెదిరించిన పర్యవసానంగా కనీసం ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఒకరు మరణించారు. నిప్పంటించుకున్న ఒక దళిత బాలిక 40 శాతానికి పైగా కాలిన గాయాలతో నరకం చవిచూస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే మేనక ఏ ప్రాతిపదికన మన దేశం మెరుగ్గా ఉన్నదని చెప్పగలిగారో... ప్రతి లైంగిక నేరం మీడియాలో వస్తున్నదని అనగలిగారో అనూహ్యం. నిజమే... నిర్భయ ఉదంతం తర్వాత లైంగిక నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయడం పెరిగింది. అప్పట్లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాలు చూసి తమకు సమాజం అండ దండలుం టాయని, కేసులు సత్వరం కొలిక్కి వస్తాయని, నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడతాయని బాధితులు ఆశించడమే ఇందుకు కారణం. అయితే మారిందేమీ లేదని అర్ధమయ్యాక మళ్లీ పూర్వస్థితే ఏర్పడింది. మహిళలపై సాగుతున్న నేరాలను అరికట్టడానికి కఠినమైన చట్టాలుండటం ఒక్కటే చాలదని... ఆ తరహా కేసుల్ని సత్వరం పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చూడటం అవసరమని మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. న్యూఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పుడు వెల్లువెత్తిన ఆందోళనల పర్యవసానంగా నిర్భయలాంటి కఠిన చట్టం వచ్చింది. కానీ దాని వల్ల నేరాలు తగ్గిన దాఖలాలు లేవు. కారణం పాతదే. యథాప్రకారం నిందితుల అరెస్టు మొదలుకొని ఆ కేసుల దర్యాప్తు, విచారణ వరకూ అన్నీ ఎప్పటిలా నత్త నడకన నడుస్తున్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను బట్టి చూస్తే నిరుడు మన దేశంలో 34,651 అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. అందులో 95.5 శాతం కేసుల్లో నేరగాళ్లు బాధితులకు తెలిసిన వారు. అయినా పోలీసులు విఫలమవుతున్నారు. ఇక శిక్షపడిన సందర్భాలు అత్యల్పం. నిరుడు కేవలం 29.37 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షపడింది. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దేశాల మధ్య పోలిక తీసుకురావడం వేరు. నేర గణాంకాలు ముందు పెట్టుకుని ఎవరెంత మెరుగ్గా ఉన్నారో లెక్కలేయడం సాధ్యంకాదు. లైంగిక నేరాల విషయమే తీసుకుంటే స్వీడన్ అవగాహనకూ, మన అవగాహనకూ ఎంతో తేడా ఉంది. అక్కడ మహిళలపై జరిగే వివిధ రకాలైన 52 నేరాలను అత్యాచారం పరిధిలో చేర్చారు. 2005లో అక్కడి సోషల్ డెమొక్రటిక్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం ఒక మహిళను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకినా దాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు. భర్త తనపై నాలుగుసార్లు అత్యా చారం చేశాడని మహిళ ఫిర్యాదు చేస్తే అతనిపై నాలుగు రేప్ కేసులు పెడతారు. వేరే దేశాల్లో ఇవన్నీ ఒక కేసుగానే పరిగణిస్తారు. మన దేశంలో అదీ లేదు. దాంప త్యంలో ఇలాంటివి చోటు చేసుకున్నా ఆ సమస్య ‘సున్నితమైనది, సంక్లిష్టమైనది’ గనుక ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, మన దేశంలోని పరిస్థితులు అందుకు అనుమతించవని ఇదే మేనకాగాంధీ అయిదు నెలలక్రితం లోక్‌సభలో చర్చ సంద ర్భంగా చెప్పారు. పైగా స్వీడన్‌లోని సామాజిక స్థితిగతులు లేదా ఇలాంటి కేసు లతో వ్యవహరించడంలో అక్కడి పోలీసులు అనుసరించే విధానాలు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి వీలుకల్పిస్తున్నాయి. ఇలాంటి అంశాలపై ఉన్నతాధికారులతో, పౌర సమాజ ఉద్యమకారులతో చర్చిస్తే మంత్రికి వాస్తవ పరిస్థితిపై అవగాహన కలగడం కష్టం కాదు. మహిళలు, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టడానికి అవరోధమవుతున్నవేమిటో, వాటిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుందో మేనకాగాంధీ దృష్టి పెట్టాలి. నేరగాళ్లు ఎందుకు తప్పించుకుంటున్నారో, ఎక్కడ వైఫల్యాలు ఎదురవుతున్నాయో ఆరా తీయాలి. అంతేతప్ప ఇక్కడ అంతా సవ్యంగా ఉన్నదని, అందరికన్నా మనమే మెరుగ్గా ఉన్నామని భ్రమపడితే సమస్య తీరదు సరికదా... మరింత జటిలమ వుతుంది. అత్యాచారాల విషయంలో కొందరు మగ నేతలు ఎటూ బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు. మహిళలు, అందునా మేనకాగాంధీలాంటి వారు అసంకల్పితంగానైనా ఆ ధోరణికి చోటీయడం మంచిది కాదు. -
జైళ్ల ‘సంస్కరణ’
మన జైళ్లలో ఖైదీల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని ఈమధ్యే విడుదలైన జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని బెయిల్ ఇచ్చేవారు లభించక...అందుకు అవసరమైన స్తోమత లేక ఎందరో ఖైదీలు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఖైదీల్లో అత్యధికులు ఈ కేటగిరిలోనే ఉంటారు. ప్రతి 10మంది ఖైదీల్లో ఏడుగురు విచారణను ఎదుర్కొంటు న్నవారే! వీరికితోడు జీవిత ఖైదీల సంఖ్య కూడా రాను రాను పెరుగుతున్నదని ఎన్సీఆర్బీ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యావజ్జీవ శిక్ష పడి హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లినవారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని గురు వారం ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు అలాంటివారికి ఉపశమనం కలిగించడంతో పాటు జైళ్లపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. యావజ్జీవ శిక్ష పడి ఐదేళ్ల శిక్షను అనుభవించినవారి అప్పీల్ పెండింగ్‌లో ఉంటే అలాంటివారికి బెయిల్ ఇవ్వొచ్చు నని జస్టిస్ సి. వి. నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం. ఎస్. కె. జైశ్వాల్‌లతో కూడిన ధర్మా సనం చెబుతూనే అందుకు కొన్ని మార్గదర్శకాలు సూచించింది. బెయిల్ మంజూ రయ్యే వారికి రెండు షరతుల్ని కూడా విధించింది. ఈ మార్గదర్శకాలైనా, షరతు లైనా కరుడుగట్టిన నేరస్తుల విడుదలను నిరోధిస్తాయి. అదే సమయంలో విడుద లైనవారి కదలికలపై సైతం తగినంత నిఘా ఉండేలా చూస్తాయి. వీటితోపాటు ఆయా కేసుల ప్రత్యేక స్వభావాన్ని, అందులో ఇమిడివున్న పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్నాకే బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడమన్న నిర్ణయం జరగాలని ధర్మాసనం చెబుతోంది. మన జైళ్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఖైదీల సంఖ్య నానాటికీ పెరగడమేనని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. జాతీయ స్థాయిలో ఖైదీల శాతం 114 దాటగా, తీహార్ జైల్లో అది 226 శాతంగా ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలే. ఇలా అధిక ఖైదీల సమస్యతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. పరిమితికి మించి ఖైదీలు ఉండటంవల్ల వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇంతమందిని అదుపు చేయడం అరకొరగా ఉండే సిబ్బందికి పెను సమస్య అవుతోంది. గార్డులకు సంబంధించి 33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారుల స్థాయిలో ఇది 36 శాతంగా ఉన్నదని ఎన్సీఆర్బీ నివేదిక అంటున్నది. మొత్తంగా వివిధ జైళ్లలో 80,000 సిబ్బంది అవసరంకాగా అందులో 27,000కు పైగా పోస్టులు భర్తీ చేయలేదు. సిబ్బందికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రమే. ఇలాంట పుడు వారినుంచి మెరుగైన పనిని ఆశించలేం. ఈమధ్యే చోటుచేసుకున్న భోపాల్ సెంట్రల్ జైలు ఉదంతంలోని నిజానిజాలేమిటన్న అంశాన్ని పక్కనబెడితే నిరుడు వివిధ జైళ్లనుంచి 200మంది పారిపోవడానికి కారణం తగినంతగా సిబ్బంది లేకపోవడమే. భోపాల్ సెంట్రల్ జైలే తీసుకుంటే అక్కడ గార్డుల పోస్టుల్లో 28 శాతం, అధికార్ల స్థాయిలో 35 శాతం ఖాళీలున్నాయి. పర్యవేక్షణ లోపం ఖైదీల పరా రీకి మాత్రమే కాదు...ఇతరత్రా సమస్యలకు కూడా దారితీస్తోంది. నిరుడు జైళ్లలో మొత్తంగా 1,584మంది మరణించారు. అంటే సగటున రోజుకు నలుగురన్న మాట! ఇందులో 1,469 సహజమరణాలని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. పోష కాహార లోపంవల్లనో, సకాలంలో అవసరమైన వైద్యం అందుబాటులో లేకపోవ డంవల్లనో మరణించినవారు కూడా ఈ ఖాతాలో జమ అయి ఉన్నా ఆశ్చర్యం లేదు. స్వతంత్ర సంస్థ ఏదైనా ఈ అధికారిక గణాంకాల లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తే మరిన్ని దిగ్భ్రాంతికర అంశాలు బయటపడవచ్చు. ఇవిగాక మిగిలిన 115 మర ణాలు అసహజమైనవిగా నివేదిక చెబుతోంది. ఇందులో 77 ఆత్మహత్యలున్నాయి. మిగిలినవి హత్యలు. ఇదొక విషాదకరమైన స్థితి. జాతీయ మానవ హక్కుల సంఘం ఈమధ్యే జైళ్లలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. వీటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ అంతంతమాత్రంగా ఉన్న సిబ్బందితో నెట్టుకొచ్చే జైళ్లు ఖైదీల మానసిక స్థితిని, వారిలో కనిపించే ఇతర లక్షణాలను పసిగట్ట స్థితిలో ఉన్నాయా అన్నది అనుమా నమే. ఒకవేళ పసిగట్టినా అలాంటివారికి అవసరమైన వైద్యం అక్కడ అందుబా టులో ఉండదు. దేశంలోని ఖైదీలందరికీ అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టులైనా, సైకాలజిస్టులైనా కేవలం 18మంది మాత్రమే! అంటే ప్రతి 23,000మంది ఖైదీలకు ఒక సైకియాట్రిస్టు లేదా సైకాలజిస్టు ఉన్నారు. ఇంత అమానవీయమైన, అత్యంత దారుణమైన పరిస్థితులు మరెక్కడా ఉండవు. సిబ్బంది కొరత వల్ల జైళ్ల పర్యవేక్ష ణకు అధికారులు శిక్షపడిన ఖైదీల సాయం తీసుకుంటున్నారు. ఖైదీల్లో ఎవరికి ఆహారం, మందులు వగైరా అందాలో...ఎవరి ప్రవర్తన బాగోలేదో, వారిని దారికి తెచ్చేందుకు ఏం చేయాలో నిర్ణయించేది వారే. ఏమాత్రం శిక్షణలేకుండా, నేర ప్రవృత్తితో ఉండే ఇలాంటివారి దయాదాక్షిణ్యాలకు ఖైదీలను వదిలేయడంవల్ల మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. జైళ్ల గురించి ఎన్సీఆర్బీ వెల్లడించిన అంశాలు ఇక్కడి సామాజికార్ధిక అస మానతలకు అద్దంపడతాయి. మన జైళ్లలో సర్వసాధారణంగా ఖైదీ అణగారిన కులాలకు లేదా ఆదివాసీ వర్గానికి చెంది, చదువుసంధ్యలు లేని నిరుపేద అయి ఉంటాడని నివేదిక అంటున్నది. ప్రతి ముగ్గురు ఖైదీల్లో ఇద్దరు దళితులు. అత్యధికులు పదో తరగతికి ముందే చదువు మానేసినవారు. వారి సంఖ్య 57,610 ఉంటే... నిరక్షరాస్యులు 36,406మంది. మనిషిలో అమానవీయతనూ, నేరప్రవృ త్తినీ పెంచే జైళ్ల ప్రస్తుత స్థితి మారాలంటే సిబ్బందిని పెంచడం, పర్యవేక్షణ సక్ర మంగా ఉండేలా చూడటంతోపాటు అందులో పరిమితికి మించి ఖైదీలు లేకుండా చర్యలు తీసుకోవడం కూడా అవసరం. ఆ దిశగా ఉమ్మడి హైకోర్టు తీర్పు దోహద పడుతుంది. మొత్తంగా జైళ్ల స్థితిగతులపై న్యాయస్థానాలు మరింత లోతుగా దృష్టి సారిస్తే అవి మెరుగుపడే ఆస్కారం ఉంటుంది. అధికార యంత్రాంగాలు ఈ విష యంలో తమంత తాము చర్యలు తీసుకోగలవన్న ఆశ ఎవరికీ లేదు. -
రాత్రి తొమ్మిది దాటితే...యమగండం!
- నగరంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - ప్రాణాలు కోల్పోతున్న వేలాదిమంది జనం - రాత్రి తొమ్మిది తర్వాతే ప్రమాదాల సంఖ్య అధికం - నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రిపోర్టులో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒకచోట రహదారులు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఏటికేడు ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా...చర్యలు చేపడుతున్నా ఫలితం శూన్యం. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన 2014 గణాంకాల ప్రకారం నగరంలో 2013 కంటే రోడ్డు ప్రమాదాలు పెరిగాయని స్పష్టమైంది. 2013లో 2439 రోడ్డు ప్రమాదాలు జరిగితే, 2014లో ఆ సంఖ్య 2908కు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. మొత్తమ్మీద ఏడాదిలో 19.2 శాతం పెరుగుదల నమోదైంది. చెన్నైలో 9,465 ప్రమాదాలు, ఢిల్లీలో 7,191 ప్రమాదాలు, బెంగళూరులో 5215 ప్రమాదాలు, భోపాల్‌లో 4,807 ప్రమాదాలు, కోల్‌కతాలో 4789 ప్రమాదాలు, నాసిక్‌లో 3367 ప్రమాదాలు, జైపూర్‌లో 3,085 ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర నగరాలతో పొల్చుకుంటే హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా... 2013 కంటే సంఖ్య పెరగడం ఆందోళనకర అంశం. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 361 మంది పురుషులు, 50 మంది మహిళలు మృత్యువాతపడ్డారు. 2,561 మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాతే అధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో వాహనాల నియంత్రణ కొరవడడం...ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని, 2013లో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటల మధ్యలో 634 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని రిపోర్టు వెల్లడించింది. పాదచారుల క్రాసింగ్ వద్దే ఎక్కువగా... నగరంలో ఎక్కువగా పాదచారులు రోడ్డు దాటుతున్న సమయాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థల సమీపంలో 26 మంది పురుషులు చనిపోతే, ఒక మహిళ దుర్మరణం చెందింది. నివాస ప్రాంతాలకు సమీపంలో 41 మంది పురుషులు మరణిస్తే, ఎనిమిది మంది యువతులు మృతి చెందారు. ప్రార్థన స్థలాల వద్ద ఏడుగురు పురుషులు దుర్మరణం చెందితే, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. సినిమా హాల్ల సమీపంలో ఆరుగురు పురుషులు, ఫ్యాక్టరీ, ఠమొదటిపేజీ తరువాయి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇద్దరు పురుషులు మృతి చెందారు. పెడిస్ట్రియల్ క్రాసింగ్ వద్ద అత్యధికంగా 48 మంది మగవాళ్లు చనిపోతే, ఎనిమిది మంది మహిళలు దుర్మరణం చెందారు. ఇతర ప్రాంతాల్లో 231 మంది పురుషులు, 32 మంది మహిళలు అసువులు బాశారు. కాగా, కోల్‌కతాలో అత్యధికంగా 214 మంది, చెన్నైలో 206 మంది, ఢిల్లీలో 137 మంది, ముంబైలో 131 మంది, విశాఖపట్టణంలో 123 మంది, భోపాల్‌లో 82, విజయవాడలో 75 మంది, రాంచీలో 62 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానం తొమ్మిదిలో 56 మందితో హైదరాబాద్ ఉంది. ‘ఢీ’సెంబరే... నూతన ఏడాదికి స్వాగతం పలికే డిసెంబర్ మాసంలోనే మన సిటీలో అత్యధికంగా 515 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో 235 మంది, జనవరి, మార్చినెలల్లో 233 మంది, జూలైలో 228 మంది, సెప్టెంబర్‌లో 226 మంది, జూన్‌లో 218 మంది, ఏప్రిల్‌లో 215 మంది, నవంబర్‌లో 213, ఆగస్టులో 199, మేలో 198, ఫిబ్రవరిలో 195 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే డిసెంబర్ నెలను పరిశీలిస్తే చెన్నైలో అత్యధికంగా 825 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఢిల్లీలో 601 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 515 రోడ్డు ప్రమాదాలతో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది. అదుపు తప్పుతున్న అనుభవం... రోడ్డు ప్రమాదాలు అనగానే సాధారణంగా బైక్‌లపై రయ్...మంటూ దూసుకెళ్లే యువకులే గుర్తుకొస్తారు. అయితే తాజాగా ఎన్సీఆర్బీ నివేదికను చూస్తే...మన నగర రహదారులపై 30 నుంచి 45 సంవత్సరాలున్నవారే ఎక్కువగా ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఈ వయసు గల పురుషులు 503 మంది, 93 మంది మహిళలు దుర్మరణం చెందారు. 45 నుంచి 60 ఏళ్ల వయస్సుగలవారు 596, 18 నుంచి 30 ఏళ్ల వయసు గలవారు 554 మంది మృతిచెందారు. 60 సంవత్సరాలు దాటినవారు 253 మంది, 14 ఏళ్లలోపు పిల్లలు 57 మంది ఉన్నారు. ఫుట్‌పాత్‌లు పడగొట్డడం వల్లే... మనవాళ్లు రోడ్ల అందాలకే ప్రియార్టీ ఇస్తున్నారు. విస్తరణ సమయంలో ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఉన్న ఫుట్‌పాత్‌లను పడగొడుతున్నారు. పాదచారుల కోసం ఎటువంటి వ్యవస్థ లేదు. కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నగరంలో కనిపిస్తున్నా వాటిని ఎవరూ ఉపయోగించడం లేదు.పాదచారుల రక్షణ చూడకపోతే ప్రమాదాలు జరుగుతాయి. రాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్ చేస్తున్న వారు కరెక్ట్‌గానే నడిపినా...ఎక్కడ క్రాస్ చేయాలో తెలియని పాదచారులు అడ్డు రావడంతో ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి. - కాంతిమతి కన్నన్, రైట్ టూ వాక్ ఫౌండేషన్ నివారణ చర్యలు తీసుకుంటున్నాం ట్రాఫిక్ పోలీసు శాఖ వంతుగా రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ చేపడుతున్నాం. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారికి జరిమానాలు విధిస్తున్నాం. ట్రాఫిక్‌పై అవగాహన కలిగించే దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు వాహనచోదకుల్లో అవగాహన పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటాం. - జితేందర్, అదనపు సీపీ, హైదరాబాద్ ట్రాఫిక్