New Building
-
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్‌కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణంలో ఊగిసలాటలు
మహా నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు వందల ఏళ్ల నుంచి ప్రాణ ప్రదాయిని. లక్షలాది మంది పేద రోగులకు ప్రాణభిక్ష పెట్టిన ఘన చరిత్ర. అద్భుతమైన భవన నిర్మాణ శైలికి ప్రతీక.. అడుగడుగునా ఉట్టిపడే కళా సౌందర్యం. కానీ.. కాలం రివ్వున తిరిగింది. అన్నింటికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఆ కళాఖండం కూడా చరమాంక దశకు చేరుకుంది.. అదే నగర నడి»ొడ్డున శతాబ్దం క్రితం నిర్మించిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించి రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని కొందరు.. చారిత్రక కట్టడాలను కూల్చవద్దని మరికొందరు వాదిస్తుండటంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ప్రభుత్వం కూడా ఎటూ తేల్చకుండా సందిగ్ధావస్థలో పడింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని 1910లో రూ.50 వేల వ్యయంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మితమైంది. డంగు సున్నం, గచ్చుతో రెండంతస్తుల్లో దీనిని నిర్మించారు. అప్పట్లో 200 మంది రోగులు చికిత్స పొందేవారు. పెరుగుతున్న రోగుల తాకిడితో పాత భవనం ప్రాంగణంలోనే 1971లో ఓపీ బ్లాకును నిర్మించారు. 1992లో కులీ కుతుబ్‌షా బ్లాక్‌ను నిర్మించారు. ప్రస్తుతం రోజూ సుమారు 2 వేల మంది అవుట్ పేషెంట్లు, మరో 200 మంది రోగులు ఇన్పేòÙంట్లుగా చికిత్స పొందుతున్నారు. దేశంలోని అత్యున్నత బోధనాసుపత్రుల్లో ఉస్మానియా ఆస్పత్రి ఒకటి. ప్రమాదకారిగా మారి.. ఎంతో మందికి ఎనలేని సేవలందిస్తూ వచి్చన ఉస్మానియా ఆస్పత్రి భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడిపోయి.. ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితికి చేరుకుంది. జులై 2020లో భారీ వర్షాల కారణంగా వరద నీరు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకుంది. దీంతో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఖాళీ చేయించారు. రోగులను వేరే భవనాల్లోని ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. పరిపాలనా విభాగంతో పాటు శస్త్రచికిత్సల విభాగాలను కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఉన్న భవనాల్లో కొత్త పేషెంట్లను చేర్చుకోవడం, రోగులకు సేవలందించడం చాలా కష్టంగా మారిపోయింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం వేల మంది రోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆస్పత్రి భవనం నిర్మాణానికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. చిక్కుముడుల వలలో చిక్కుకుపోతోంది. వందేళ్ల కింద నిర్మించిన భవనం కావడం.. హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండటంతో దీన్ని కూల్చడం కష్ట సాధ్యంగా మారింది. దీన్ని ఇలాగే ఉంచి మిగిలిన ప్రాంతంలో కొత్త భవనం నిర్మించాలని కొందరు అంటున్నారు. అయితే.. పాత భవనాన్ని కూల్చేసి పూర్తిగా కొత్త భవనం నిర్మిస్తే పూర్తి స్థాయిలో రోగులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకురావొచ్చని చెబుతున్నారు. గత ప్రభుత్వం కూడా పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని భావించింది. కొందరు దీనిపై కోర్టుకెళ్లారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కమిటీ ఇలా చెప్పింది.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం స్థితిగతులు, కొత్త భవనం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అప్పటి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. పాత భవనం ఉపయోగించేందుకు పూర్తిగా పనికి రాదని తేలి్చంది. భవనానికి మరమ్మతులు చేయొచ్చని, ఆస్పత్రి కోసం కాకుండా వేరే వాటి కోసం వాడుకోవచ్చని సూచించింది. ఇలా చేస్తే ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించే స్థలం తక్కువ అవుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.25 ఎకరాల్లో పది అంతస్తుల్లో.. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన సముదాయాన్ని దాదాపు 25 ఎకరాల్లో నిర్మించాలని ఆస్పత్రి పరిపాలనా విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో టవర్‌లో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల్లో భవనం నిర్మించాలని సూచించింది. ఒక్కో టవర్‌ను 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించాలని పేర్కొంది. దీంతో రోగులతో పాటు, వైద్య విద్యార్థులు, డాక్టర్లకు అన్ని రకాల సదుపాయాలు అందించవచ్చని తెలిపింది. నర్సింగ్ కాలేజీ కూడా నిర్మించే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా మొత్తం 35,75,747 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంది. అక్కడ నిర్మించాలని ప్రతిపాదన.. పాత భవనం హెరిటేజ్ జాబితా కిందకు రావడంతో దాన్ని కూల్చకుండా మధ్య మార్గంలో వేరే ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తే ఎలా ఉంటుందని కొందరు అంటున్నారు. చంచల్‌గూడ, కొత్తపేట మార్కెట్, గోషామహల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాలను పరిశీలించారు. కానీ.. అందుకు కొందరు అంగీకరించట్లేదు. ఇప్పుడున్న ప్రాంతంలోనే భవనం నిర్మించాలని పట్టుబడుతున్నారు.చిక్కుముడులు విప్పేందుకు కృషి.. కొత్త భవనం నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ఎంతో నిబద్ధతతో ముందుకు వెళ్తోంది. కానీ.. చిక్కుముడులు మాత్రం వీడట్లేదు. ఎలాగైనా కొత్త భవనం నిర్మించి రోగులకు మేలైన సేవలు అందించాలనేదే నా కోరిక. – డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రిపాత భవనంతో ప్రయోజనం లేదు.. పాత భవనం అలాగే ఉంచితే అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తే పేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాత భవనాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది. ఎప్పుడు కూలిపోతుందో.. ఎప్పుడేం అవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. – వి.నర్సింగ్ రావు, జియాగూడ -
తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు -
Narendra Modi: నా మూడో ఇన్నింగ్స్ పక్కా!
సూరత్: ప్రధానమంత్రిగా తన మూడో ఇన్నింగ్స్‌లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తాను వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేలి్చచెప్పారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకితభావానికి ఒక ప్రతీక అని చెప్పారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కలి్పస్తోందని ప్రశంసించారు. కొత్త వాణిజ్య సముదాయంతో మరో 1.5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. సూరత్ కీర్తికిరీటంలో మరో వజ్రం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న వజ్రం కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రమని వ్యాఖ్యానించారు. దీని వెలుగుజిలుగుల ముందు ప్రపంచంలోనే పెద్దపెద్ద భవనాలు కూడా వెలవెలబోతాయని అన్నారు. ప్రపంచంలో వజ్రాల పరిశ్రమ గురించి ఎవరూ మాట్లాడుకున్నా ఇకపై సూరత్‌ను ప్రస్తావించాల్సిందేనని చెప్పారు. సూరత్ భాగస్వామ్యం పెరగాలి వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్దేశించుకుందని మోదీ చెప్పారు. దేశాన్ని దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల(10 లక్షల కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడంతోపాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు, ఆభరణాల పరిశ్రమకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు నేడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎన్నో అంశాల్లో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడిన్ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్‌గా మారిందన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్ డ్రీమ్ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సూరత్ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటిగ్రేటెడ్ టెరి్మనల్ బిల్డింగ్‌ను మోదీ ఆదివారం ప్రారంభించారు. -
తెలంగాణకు కొత్త హైకోర్టు
-
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు... సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్‌సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు. నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్‌ఖడ్, బిర్లాలకు సీఆర్పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి. రేపు ఎంపీల ఫొటో సెషన్ ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్‌కు రావాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ కోరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది. -
పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్లో మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పార్లమెంట్లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ -
మోడల్‌గా టూటౌన్ పోలీసు స్టేషన్
సిద్దిపేటకమాన్: రూ.4కోట్లతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయనున్న టూటౌన్ పోలీసు స్టేషన్ నూతన భవనానికి మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 10,500 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించనున్నారు. రెండు అంతస్థుల్లో రిసిప్షెన్, ఏఎస్ఐ రూం, ఇంటర్వ్యూ గది, లాకప్, ఎస్హెచ్ఓ రూం, రీడింగ్ రూం, రికార్డు గది, డైనింగ్ హాల్, జిమ్, ఉమెన్ బ్యారెక్, మెయిన్ బ్యారెక్, మీటింగ్ హాల్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఆరు నెలల్లో అందుబాటులోకి రానుంది. -
పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు
ఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు లోకసభ స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో భవనం ప్రారంభించి.. జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. వందేళ్ళ కాలంనాటి పాత పార్లమెంటులో సరైన వసతులు లేకపోవడంతో పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం చేపట్టింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్భరకు సంకేతంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఉండనుంది. భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా భారత సంస్కృతి చిహ్నాలతో నిర్మాణం చేపట్టారు. కొత్త భవనంలో.. లోక్‌సభలో 888 మంది ఎంపీలు, రాజ్యసభలో 300 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశం.. లోక్ సభలోనే నిర్వహించనున్నారు . ఇక.. ఉభయ సభల సంయుక్త సమావేశంలో 1280 మంది ఎంపీలు కూర్చునే ఏర్పాట్లు చేశారు. -
..ఏ లొల్లి లేకుండా హాయిగా ఉంది సార్!
..ఏ లొల్లి లేకుండా హాయిగా ఉంది సార్! -
పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ గురువారం సాయంత్రం పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రధాని మోదీ అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను తనిఖీ చేశారు. నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడారు. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో కల్పించే వివిధ సదుపాయాలను ఆయన పరిశీలించారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. గత నవంబర్‌కే ఇది పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీనిని మరికొద్ది రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి. -
కొత్త భవనంలో యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: అమెరికా.. నూతన కాన్సులేట్ భవనాన్ని మార్చి 20న హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ప్రారంభిస్తోంది. రూ. 27.87 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం నుంచే ఇక నుంచి యూఎస్ కాన్సులేట్ కార్యకలాపాలు సాగనున్నాయి. నూతన కాన్సులేట్‌లో అందించే వివిధ సేవల వివరాలను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కొనసాగుతున్న బేగంపేట ‘పైగా ప్యాలెస్’లో ఈనెల 15 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 15వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల నుండి 20వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు కాన్సులేట్ మూసివేసి ఉంటుంది. ఈ నెల 20న ఉదయం 8.30 గంటల నుంచి అధికారికంగా నూతన భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. మార్చి 20 ఉదయం 8:30 వరకు అత్యవసర సేవలు కోరే అమెరికా పౌరులు +91 040–4033 8300 నంబర్ పైన సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ వివరించింది. మార్చి 20 ఉదయం 08:30 తరవాత అత్యవసర సేవలు కోరుతున్న అమెరికా పౌరులు +91 040 6932 8000 పై సంప్రదించవలసి ఉంటుంది. అత్యవసరంకాని సందేహాల కోసం, అమెరికా పౌరులు HydACS@ state.gov కి ఈ–మెయిల్ చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ అపాయింట్మెంట్లు, ‘‘డ్రాప్‌బాక్స్’’అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (Vఅఇ) లో కొనసాగుతాయని తెలిపింది. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. వీసా సేవలకి సంబంధించి సందేహాలకు +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్ చేయాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. కొత్త ఆఫీస్ చిరునామా సర్వే నం. 115/1, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. -
HYD: నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్.. సేవలు ఎప్పటినుంచి అంటే..?
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ తమ కార్యకలాపాలను ఇక నుంచి నానక్‌రామ్‌గూడ నుంచి నిర్వహించనుంది. ఈ నెల 20న నూతన కాన్సులేట్ భవనం ప్రారంభం కానుంది. 340 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం అమెరికా - భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని, ఈ సందర్భంగా అందించే వివిధ సేవల వివరాలను యూ.ఎస్. కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో ఈ నెల 15 వరకూ సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. అయితే, మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలకు అమెరికా పౌరులు, +91 040-4033 8300 నంబర్‌పై సంప్రదించాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. మార్చి 20 ఉదయం 08:30 తర్వాత, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు 91 040 6932 8000 నంబర్‌పై సంప్రదించాలని తెలిపింది. అత్యవసరం సేవలకు అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొంది. సంబంధిత వార్త: వైఎస్సార్.. జార్జిబుష్‌ని ఒప్పించిన వేళ! మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్ సూచించింది. బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081, లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)లో కొనసాగుతాయి. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్ వివరించింది. వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644, +91 22 62011000పై కాల్ చేయాలి. నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. Twitter (@USAndHyderabad), Instagram (@USCGHyderabad), Facebook (@usconsulategeneralhyderabad) నాడు మహానేత కృషి 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఆయన చొరవతోనే హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటునకు ఆనాటి అధ్యక్షుడు బుష్ ప్రకటన చేశారు. ఆ వెంటనే బేగంపేటలో ప్యాలెస్‌ను వైఎస్సార్ కేటాయించి.. అదే ఏడాది అక్టోబర్ 24న ఆయనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఆ భవనం.. 14 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఇప్పుడు యూఎస్ కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలోని కొత్త భవనానికి షిఫ్ట్ కానుంది. -
మరో కొత్త ఇల్లు కట్టబోతున్న యాంకర్ శ్యామల.. భర్తతో కలిసి భూమి పూజ..
యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఆమె ఒకరు. యాంకర్‌గానే కాదు నటిగానూ ఆమె గుర్తింపు పొందింది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్ చేస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తు రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక ఆమె భర్త కూడా నటుడనే విషయం తెలిసిందే. టీవీ నటుడు యువరాజ్(అలియాస్ నరసింహా)ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కూడా యాంకర్‌గా రాణిస్తున్న శ్యామల తాజాగా మరో కొత్త ఇంటికి శ్రీకారం చుట్టింది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. గతేడాది ఓ లగ్జరీ ఇంటిని కోనుగోలు చేసిన ఆమె ఏడాది తిరక్కుండానే మరో ఇంటిని నిర్మించడంపై నెటిజన్ల నుంచి రకరకాలుగా ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. కొత్త ఇంటి కోసం భూమి పూజ చేసిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది. దీనికి ‘మేము కట్టబోయే కొత్త ఇంటికి భూమి పూజ చేశాం’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో రీసెంట్‌గానే కదా కొత్త ఇల్లు కొన్నావ్, ఆప్పుడే మరో ఇల్లా? అంత డబ్బు ఎక్కడిది అంటూ తనపై పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి ఈ ఫొటోల్లో శ్యామల తన భర్త నరసింహా, కొడుకుతో కలిసి భూమి పూజ చేసింది. కాగా గతేడాది జులైలో ఆమె లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హోంటూర్ చేసి తన సొంతింటి కల నెరవేరిందంటూ కొత్త ఇంటిని చూపిస్తూ మురిసిపోయింది. ఇప్పుడు తాజా మరో మరో కొత్త ఇంటి కోసం నిర్మాణం చేపట్టడంతో యాంకర్ శ్యామల వార్తల్లో నిలిచింది. View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) -
నూతన భవనంలోనే బడ్జెట్ సమావేశాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. నూతన భవన నిర్మాణ పనులు దాదాపు ముగింపుకు వచ్చాయని, ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023–24 ఆర్ధిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భవనంలోనే ప్రవేశపెడతారని, ఇందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నాయి. 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ నూతన భవనంలో విశాలమైన హాళ్లు, ఆధునిక లైబ్రరీ, అత్యాధునిక రాజ్యాంగ హాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన కార్యాలయాలు, కమిటీ గదులు ఉన్నాయి. కొత్త భవనంలోని లోక్‌సభలో 888 సీట్ల అమరిక నెమలి ఆకారాన్ని స్ఫూరించేలా, రాజ్యసభ హాలులో కమలం పువ్వును గుర్తుకు తెచ్చేలా 384 సీట్ల అమరిక ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ పాత భవనంలోనే రాబోయే బడ్జెట్ సెషన్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 31న ప్రసంగిస్తారని స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం వెల్లడించారు. మరోవైపు లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంటు కొత్త భవనాన్ని యాక్సెస్ చేయడానికి ఎంపీల కోసం కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తున్నారు. కొత్త భవనంలో వినియోగించే ఆడియో విజువల్ పరికరాలపై ఎంపీలకు శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ కొత్త భవనంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన పక్షంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే తొలి విడత సమావేశాలను పాత భవనంలో, మార్చి 13 నుంచి జరిగే రెండో విడత సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. నానక్రామ్గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడాలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. హైదారాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. ఇదిలాఉండగా.. గత నెలలోనే బెగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్సార్ చొరవతో.. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్ -
Hyderabad: నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
-
నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా దౌత్య కార్యాలయం. 2008, అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో అమెరికా జెండా తొలిసారి ఎగిరింది. పైగా ప్యాలస్‌లోని కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అక్కడ ఇదే చివరి వార్షికోత్సవం కానుంది. త్వరలోనే సుమారు 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనంలోకి మారనున్నారు. ఈ క్రమంలో పైగా ప్యాలస్‌లో కాన్సులేట్ స్టాఫ్ తుది వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అగ్రరాజ్య సంబంధాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. -
రజనీకాంత్‌తో నడిగర్ సంఘం భేటీ..
చెన్నై సినిమా: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవనం నిర్మాణం గురించి నటుడు రజనీకాంత్ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. సంఘ కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్ తదితరులు గురువారం (జూన్ 2) ఉదయం స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయని, దీంతో నిర్మాణంలో ఉన్న సంఘం నూతన భవన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం నూతన భవనం వివరాలను రజినీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని, అలాగే పలు సూచనలను సలహాలను ఇచ్చారని నాజర్ తెలిపారు. చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం
చిక్కడపల్లి: నగరంలో శిథిలస్థితికి చేరిన గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పి.పద్మజ పేర్కొన్నారు. ఆరు నెలలకు ఓ సారి నిర్వహించే కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్న, పద్మజ మాట్లాడుతూ.. నగరంలో గ్రంథాలయాలను పాఠకుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు పాఠకుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పుస్తకాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు, పెన్షన్‌తో పాటు నగరంలోని 82 గ్రంథాలయాలను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని, ఇకపై ప్రతి నెలా ఇచ్చే అంశంపై చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది గ్రంథాలయాల అభివృద్ధి, జీత భత్యాలు తదితర వాటికి దాదాపు రూ.2కోట్ల పైచిలుకు నిధులకు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సమావేశంలో సభ్యులు వాసుదేవ్‌రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రేపు గుడ్‌న్యూస్ చెబుతా : మంచు విష్ణు
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కార్యచరణ మొదలు పెట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ ఫైల్‌పై సైన్ చేసిన విష్ణు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే మాకు సొంత బిల్డింగ్ కట్టిస్తానని ప్రకటించిన మంచు విష్ణు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. చదవండి : ఘనంగా వైవా హర్ష వివాహం.. ఫోటోలు వైరల్ ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు,మూడు చోట్ల స్థలాలను కూడా చూసినట్లు పేర్కొన్నారు. తాజాగా 'మా'కు సంబంధించి రేపు గుడ్‌న్యూస్ చెబుతానంటూ హింట్ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ రాజీనామాలపై కూడా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న సస్పెన్స్ కూడా నెలకొంది. చదవండి : ఆరోజు జరిగింది ఇదే..వీడియో రిలీజ్ చేసిన మంచు విష్ణు సమంత డబ్బుల కోసం కేసులు వేయలేదు : లాయర్ Have a very good news to share on #MAA front. Will share it tomorrow 💪🏽 — Vishnu Manchu (@iVishnuManchu) October 21, 2021 -
మహిళలకు అన్నివిధాలా అండగా..
బన్సీలాల్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణలో మహిళలకు అన్నివిధాలా ధైర్యాన్ని, రక్షణను, భరోసాను కల్పించే దిశగా రాష్ట్ర మహిళా కమిషన్ ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహిళలకు అన్ని విధాలా రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని, మహిళా సాధికారతకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అనేక పథకాలు మహిళల సంక్షేమం కోసం ఇస్తున్నామంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారి పేరిటే ఇస్తున్నామని, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిం చామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒంటరి మహిళలను, బీడీ కార్మికులను ఆసరా పథకంలో చేర్చి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. షీటీమ్స్ మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. మహిళా చట్టాలపై అవగాహన రాష్ట్రంలో ప్రభుత్వం అనేక పథకాలను మహిళ పేరిట అమలు చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ అనేక సమస్యల నుంచి మహిళలకు విముక్తి కల్పించడంతోపాటు అన్ని విధాలా న్యాయం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల కోసం రూపొందించిన చట్టాలు పకడ్బందీగా అమలు జరిగేలా కమిషన్ పనిచేస్తోందన్నారు. మహిళా చట్టాలపై మహిళలతోపాటు పురుషులకు కూడా అవగాహన కల్పిస్తామని, జిల్లాల్లో పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కమిషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా, సత్య వతి రాథోడ్ కమిషన్ లోగోను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యతోపాటు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. -
రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం
బాలీవుడ్ నటి, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హిందీ దర్శకుడితో ప్రేమలో ఉన్నారని టాక్. అంతేకాదు.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలో రూ. 175 కోట్ల విలువ చేసే బంగ్లాలో సహజీవనం చేయనున్నారట. బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్‌ను కూడా ఖరారు చేశారట. కాగా జాక్వెలిన్ ప్రేమలో ఉన్నది ప్రముఖ దర్శకుడు–వ్యాపారవేత్త అయిన సాజిద్ ఖాన్‌తోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో ‘హౌస్‌ఫుల్ 2’ చిత్రీకరణ సమయంలో సాజిద్ ఖాన్‌తో ఆమె డేటింగ్ చేశారని, 2013లో బ్రేకప్ అయ్యారని టాక్. అయితే ఆ బ్రేకప్‌కి ఇద్దరూ ఫుల్స్టాప్ పెట్టి, ప్రేమను కంటిన్యూ చేస్తున్నారని బాలీవుడ్ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ‘సాహో’లో ప్రత్యేక పాట ‘బ్యాడ్ బాయ్’కి జాక్వెలిన్ డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
సెంట్రల్ విస్టా: కేంద్రానికి ఊరట, పిటిషనర్‌కు ఫైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమేనని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్ కు లక్ష రూపాయల జరిమానాను విధించింది. దీంతో కేంద్రానికి మరో ఊరట లభించింది. కరోనా ఉద్ధృతి సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం అంతగా అవసరం లేదని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ సోహైల్ హష్మీ, ట్రాన్స్‌లేటర్ అన్యా మల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో సంయుక్తంగా పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. కరోనా బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది. ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది. నిర్మాణ పనులకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తుచేసింది. అత్యవసరం కూడా.. పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా నిర్మాణ పనుల్ని కొవిడ్ ఉధృతి వేళ కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అని న్యాయస్థానం పేర్కొంది. నిర్మాణ పనులను ఆపేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేగాక, ఇది నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరి ప్రోద్బలంతోనే వేసిన పిటిషన్లా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా సుమారు వెయ్యి కోట్లకు పైగా ఖర్చుతో పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ కు అనుగుణంగా నవంబర్ లోపు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ.. సెంట్రల్ విస్టాను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
యూట్యూబ్ డబ్బుతో 25 కోట్ల భవంతి
సాక్షి, న్యూఢిల్లీ: తన పాటలతో, నృత్యాలతో ప్రేక్షకులను అదరకొడుతున్న ప్రముఖ యూట్యూబర్ జోజో సివా. కుప్పలు తెప్పలుగా వచ్చి పడిన డబ్బులతో కొత్త భవంతిని కొనుగోలు చేశారు. ఇంతవరకు అమెరికా, కాలిఫోర్నియాలోని ఓక్స్‌లో తల్లిదండ్రులతో ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు లాస్ ఏంజెలిస్ రాష్ట్రంలోని టార్జానా నగరంలో కొత్తగా నిర్మించిన భవంతిని 25 కోట్లకు కొనుగోలు చేశారు. తన ఇంటిని పరిచయం చేస్తూ ఆమె తీసిన వీడియోను ఆమె గురువారం సోషల్ మీడియాకు విడుదల చేయడంతో అది వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన 16 ఏళ్ల జోజో అనతికాలంలోనే ప్రముఖ యూట్యూబర్‌గా ఎదిగారు. ఆమెకు ఇప్పుడు అందులో కోటిన్నర మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తద్వారా ఆమెకు యాడ్స్ రూపంలో ఊహించని డబ్బు పచ్చి పడుతోంది. అలా కూడ బెట్టిన డబ్బులో పాతిక కోట్లను వెచ్చించి ఆమె ఈ భవంతిని కొన్నారు. ఆరువేల చదరపు గజాల విస్తీర్ణం గల ప్రాంగణంలో నిర్మించిన ఈ భవంతిలో హాలు, కిచెన్, బెడ్ రూములతోపాటు డైనింగ్ రూమ్, ఫన్ రూమ్, స్నూకర్స్ రూమ్ ఉన్నాయి. ఇంటి వెనకాల పలు సిట్ అవుట్లతోపాటు ఆకర్షణీయమైన స్విమ్మింగ్ ఫూల్ ఉంది. బాస్కెట్ బాల్ కోర్టు అదనపు ఆకర్షణ. కిచెన్‌లో పాప్‌కార్న్ మేకర్, పిజ్జా వారియర్లతోపాటు పలు వంట మిషిన్లు ఉన్నాయి.