new version
-
టాలీ నుంచి ప్రైమ్ 5.0
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార నిర్వహణ సాఫ్ట్వేర్ సంస్థ టాలీ తాజాగా ఏపీఐ ఆధారిత టాలీప్రైమ్ 5.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. జీఎస్టీ పోర్టల్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా ‘కనెక్టెడ్ జీఎస్టీ’ ఫీచరు పొందుపర్చిన ఈ సమగ్ర వెర్షన్‌తో సంస్థలకు సమయం ఆదా అవుతుంది. అలాగే కచి్చతత్వం పెరుగుతుందని కంపెనీ సౌత్ జోన్ జీఎం అనిల్ భార్గవన్ తెలిపారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 30–40 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 25 లక్షలుగా ఉన్న కస్టమర్లను 2026–27 నాటికి 35 లక్షలకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఇందుకోసం ఏటా మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు అనిల్ వివరించారు. -
AP: 25 నుంచి 31 వరకు ఈ–ఆఫీస్‌లు పనిచేయవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. -
మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్‌కు వచ్చేశాయ్! ధరలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ 2023 వర్షన్ ఎంట్రీ లెవెల్ సెడాన్ అయిన ఏ–క్లాస్ లిమోసిన్‌ను రూ.45.80 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. ఎనిమిదేళ్ల వారంటీ ఉంది. 10.25 అంగుళాల ఎంబీయూఎక్స్ డిజిటల్ డిస్ప్లే, 17 అంగుళాల 5 స్పోక్ అలాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. అలాగే ఎంట్రీ లెవెల్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ఏ 45 ఎస్ ఏఎంజీ 4మేటిక్ ప్లస్‌ను రూ.92.5 లక్షల ధరలో పరిచయం చేసింది. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఏఎంజీ పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. ఇదీ చదవండి: ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం -
కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. డిజైన్ సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫీచర్స్ 2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & స్పెసిఫికేషన్స్ కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. -
ఇన్నోవా క్రిస్టాలో రెండు కొత్త గ్రేడ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఇన్నోవా క్రిస్టా వాహనానికి సంబంధించి రెండు టాప్ గ్రేడ్ల (జెడ్ఎక్స్, వీఎక్స్) ధరలను టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) ప్రకటించింది. ఇందులో జెడ్ఎక్స్ గ్రేడ్ ధర రూ. 25.43 లక్షలు కాగా, వీఎక్స్ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 23.79–23.84 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుందని తెలిపింది. వీటిలో 7 ఎయిర్బ్యాంగ్లు, ముందు..వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. దీనితో ప్రస్తుతం మొత్తం నాలుగు గ్రేడ్లలో (జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్) కొత్త ఇన్నోవా క్రిస్టా లభిస్తున్నట్లవుతుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. రూ. 50,000 చెల్లించి ఆన్లైన్లో లేదా డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో కొత్త వెర్షన్ వందే భరత్ రైళ్లు
-
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. లుక్ మొత్తం మారనుందా?
ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న మోస్ట్ పాపులర్ మేసేజింగ్ యాప్‌లో బెస్ట్ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'వాట్సాప్' (WhatsApp). ఎంతో మంది నిత్యజీవితంలో భాగమైపోయిన ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో ‘వాట్సాప్’ లుక్ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం ఆండ్రాయిడ్ యాప్‌కు కొత్త 'యూజర్ ఇంటర్ఫేస్' ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఇది మునుపటికంటే చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా ఫీచర్లను యూజర్లు సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం, ఆండ్రాయిడ్ యాప్ యూఐను పూర్తిగా మార్చేందుకు వాట్సాప్ సన్నదవుతోంది. ఇందులో భాగంగానే యాప్ బాటమ్‌లో నేవిగేషన్ బార్‌ను యాడ్ చేస్తోంది. బాటమ్ బార్లో చాట్స్, కమ్యూనిటీస్, స్టేటస్, కాల్స్ ట్యాబ్స్ ఉంటాయని దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేసింది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్ స్పెషలేంటో తెలుసా? ఎన్ని కోట్లు ఉంటుందంటే..?) త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్స్ అన్నీ దాదాపు వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ని ఐఓఎస్ యాప్‌లాగా మార్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీటా అప్డేట్ 2.23.8.4 ఆండ్రాయిడ్ వెర్షన్లో వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. ఇప్పటికీ కొంత మంది వాట్సాప్ బీటా యూజర్లకు కొత్త ఇంటర్ఫేస్తో కూడిన అప్డేట్ వచ్చేసింది. ఒకవేళ సాధారణ యూజర్ అయితే ఈ అప్డేట్ కోసం మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. బీటా యూజర్లు టెస్ట్ చేసిన తరువాత అందులో బగ్స్ ఏవీ లేవని నిర్దారించుకున్న తరువాత అప్డేట్ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది. (ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో నయా కారు విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) అంతే కాకుండా వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఇది మెసేజ్ సెండ్ చేసిన తరువాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫీచర్స్ ప్రకారం మనం పంపించే మెసేజ్‌లో తప్పు ఉంటే దానిని డిలీట్ చేయడమే తప్పా వేరే మార్గం లేదు. వాట్సాప్ ఎడిట్ ఫీచర్ అందుబాటులో వచ్చిన తరువాత ఈ ఇబ్బందికి చెక్ పెట్టేయొచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో
మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్లో అప్లికేషన్లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
గుడ్‌న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్‌తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్‌సమ్‌వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
ఇదో రకం బాదుడు, యూట్యూబ్ తరహాలో వాట్సాప్ ప్రీమియం సర్వీస్.. పైసలు కట్టాల్సిందే!
వాట్సాప్‌లో(WhatsApp) కూడా యూట్యూబ్ తరహాలో త్వరలో ప్రీమియం అకౌంట్ సర్వీసును అందించనుంది. అంటే ఈ ప్రత్యేక సర్వీస్‌ను పొందాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం పలువురు బీటా వినియోగదారులతో ఈ కొత్త వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త సర్వీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లకు ప్రీమియం మెనూ, అదనపు ఫీచర్లుంటాయని తెలిపింది. అయితే సాధారణ యూజర్లు కంగారుపడాల్సిన అవసరం లేదని ఈ కొత్త WhatsApp ప్రీమియం సబ్స్క్రిప్షన్ కేవలం వాట్సాప్ బిజినెస్ వెర్షన్ కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది. వాళ్ల కోసమే ప్రీమియం సర్వీస్ కొత్తగా రాబోతోన్న ఈ సర్వీస్‌లో ప్రత్యేక నేమ్‌తో వాట్సాప్ కాంటాక్ట్ లిస్టునూ క్రియేట్ చేసుకుని అందరికీ షేర్ చేసుకోవచ్చు. అంతేకాక ఏకకాలంలో 10 డివైజ్‌లలో లాగిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీమియం వెర్షన్లో 32 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చ. వీటికి ఎంత వరకు ఛార్జ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా మెటా ఇప్పటికే చాలా ఆదాయాన్ని పొందుతుంది. ఎలాంటి ప్రకటనలు లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు వంటి ఆదాయ వనరులు లేకుండా సంస్థ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న ఏకైక సేవ WhatsApp మాత్రమే. అందుకే దీని నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించాలని సంస్థ భావిస్తోంది. అందుకోసమే నిర్దిష్ట వ్యాపారాల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురాబోతందని తెలిపింది. వాట్సాప్‌లో కొత్తగా రాబోతున్న ప్రీమియం వర్షన్ ఐచ్ఛికం మాత్రమేనని తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
హ్యుందాయ్ ఎన్–లైన్ మెటావర్స్ కమింగ్ సూన్, బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎన్–లైన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 6న ఈ కొత్త మోడల్ భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. అప్డేటెడ్ ఫీచర్లతో హ్యుందాయ్ ఇండియా కొత్త వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనుంది. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసింది. అధికారిక వెబ్సైట్లో రూ.21,000 చెల్లించి ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ ఎన్-లైన్ మెటావర్స్ శ్రేణిలో ఐ20 ఎన్-లైన్ తర్వాత రెండో మోడల్. స్పోర్టీ లుక్స్, మెరుగైన పనితీరు ఈ శ్రేణి ప్రత్యేకత. కారు లోపల, వెలుపల పలు మార్పులు చేశారు. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు ఉంది. -
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్‌తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!) -
2023 ఆడి క్యూ3 బుకింగ్స్ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు
సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్ చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) వినూత్న డిజైన్,బెస్ల్ఇన్ క్లాస్ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్లైన్లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ప్లస్ అండ్, టెక్నాలజీ, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) అలాగే, మొదటి 500 మంది కస్టమర్లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది. 2023 ఆడి క్యూ3లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
టాటా టియాగో కొత్త వెర్షన్ వచ్చేసింది! ధర చూస్తే...
సాక్షి, ముంబై: టాటామోటార్స్ టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ కారును బుధవారం లాంచ్ చేసింది. ఎన్ఆర్జీ తొలివార్షికోత్సవాన్ని పురస్కరించు కుని, క్రాస్ఓవర్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. 6.42 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఊహించినట్టుగానే ఎక్స్‌టీ వేరియంట్‌తో పోలిస్తేకొత్త ఫీచర్లను జోడించిమరీ 41వేల రూపాయల ధర తగ్గించింది. ఇంజీన్, ఫీచర్లు టాటా కొత్త ఎంట్రీ-లెవల్ కారు టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్ 2 ట్రిమ్‌లలో లభిస్తుంది. మాన్యుల్ గేర్ బాక్స్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్‌ను పొందుపర్చింది. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్, హర్మాన్ 3.5-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ లాంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రిథమ్ ప్యాక్ కావాలంటే అదనంగా 30వేలు చెల్లించాలి. మిడ్నైట్ ప్లమ్ కలర్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ ఫ్లేమ్ రెడ్ కలర్స్‌లో ఇది లభ్యం. The wait is finally over! Introducing the all-new Tiago XT NRG, built for the ones who dare to #LiveDifferent. Get, Set, and #DoMoreWithXTraNRG in your all-new #TiagoXTNRG. Visit https://t.co/Hq2GY0aoPI to book your #Tiago.#TiagoNRG #UrbanToughroader #SeriouslyFun pic.twitter.com/8CNPaaGOV1 — Tata Motors Cars (@TataMotors_Cars) August 3, 2022 -
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
రెనో క్విడ్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా క్విడ్ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో 0.8 లీటర్, 1.0 లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్ మై22 క్లైంబర్ శ్రేణి తయారైంది. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉందని వివరించింది. -
బ్రహ్మోస్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని సు– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన సు–30 విమానాలు 40 ఉన్నాయి. -
డుకాటి పనిగలే సరికొత్తగా ...! ధర ఎంతంటే..!
ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం డుకాటి భారత మార్కెట్లలోకి సరికొత్త అప్డేట్డ్ వెర్షన్ బైక్‌ను లాంచ్ చేసింది. వీ4 శ్రేణిలో ‘డుకాటి పనిగలే వీ4 ఎస్పీ’ టాప్-ఆఫ్-ది-లైన్ వెర్షన్ బైక్‌ను డుకాటి ఇండియా విడుదల చేసింది. 2021డుకాటి పనిగలే వీ4 ఎస్పీ ధర 36.07 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. దీని ధర డుకాటి వీ4 ఎస్ బైక్ మోడల్ కంటే ఎక్కువ. ట్రాక్ఫోకస్డ్, తేలికైన బైక్ మోడల్‌గా డుకాటి పనిగలే నిలవనుంది. ఇందులో తేలికైన అల్లాయ్ వీల్స్‌తో పాటుగా కార్బన్ ఫైబర్‌తో బైక్ బాడీను రూపొందించారు. దీంతో సుమారు 1.4 కిలోల బరువు తగ్గింది. చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎలక్ట్రిక్ స్కూటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! డుకాటి పనిగలే స్టాండర్డ్ వెర్షన్ డిజైన్‌ను వీ4 ఎస్పీ పొందనుంది. అయితే ఈ బైక్ ప్రత్యేకమైన 'వింటర్ టెస్ట్' డిజైన్‌తో రానుంది. ఈ కొత్త డిజైన్ మోటోజీపీ, ఎస్బీకే మోటర్‌సైకిళ్ల ప్రేరణతో రూపొందించారు. ఫ్యూయల్ ట్యాంక్‌పై ఎరుపు రంగుతో, బ్రష్డ్-అల్యూమినియం ఫినిషింగ్‌తో రానుంది. డుకాటి పనిగలే ఇంజిన్ విషయానికి వస్తే... డెస్మోసెడిసి స్ట్రాడేల్ 1103 సీసీ ఇంజిన్‌తో రానుంది. ఇది 13000 ఆర్పీఎమ్ వద్ద 211 బీహెచ్పీ ఉత్పత్తి చేస్తోంది. 9500ఆర్పీఎమ్ వద్ద 124ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ బైక్ ఓపెన్ కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్, లైసెన్స్ ప్లేట్ రిమూవల్ ప్లగ్, మెషిన్డ్ మిర్రర్ బ్లాక్-ఆఫ్ ప్లేట్లను కలిగి ఉంది. ఈ బైక్‌లో ప్రత్యేక ఆకర్షణగా డేటా ఎనలైజర్+జీపీఎస్ మాడ్యూల్‌ను ఏర్పాటుచేశారు. క్విక్‌షిఫ్టర్, రైడింగ్ పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి మరిన్నింటితో సహా అనేక ఎలక్ట్రానిక్ ఎయిడ్లతో రానుంది. చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
మరో మైలురాయి దాటిన క్విడ్.. ఆరేళ్లలోనే వశమైన రికార్డు
ఎంట్రీ లెవల్ కారుగా మార్కెట్లోకి వచ్చిన క్విడ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. బడ్జెట్ కారుగా మార్కెట్లోకి వచ్చినా.. తర్వాత కాలంలో ప్రజలు ఇష్టమైన కారుగా ముద్ర పడిపోయింది. తాజాగా క్విడ్ మరో మైలు రాయిని దాటింది. 2015 నుంచి ఫ్రెంచ్ కారు తయారీ కంపెనీ రెనాల్ట్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ కారుగా రెనాల్ట్ది ప్రత్యేక స్థానం. మొదటిసారిగా 2015లో ఈ కారుని ఇండియాలో లాంఛ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వాటిని దాటుకుంటూ అనతి కాలంలోనే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2019లో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని రెనాల్ట్ మార్కెట్లోకి తెచ్చింది. నాలుగు లక్షలు రెనాల్ట్ కారు ఇండియా మార్కెట్లోకి వచ్చి సుమారు ఆరేళ్లు అవుతోంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల క్విడ్ కార్లను అమ్మినట్టు రెనాల్ట్ ప్రకటించింది. నాలుగో లక్ష కారును కొనుగోలు చేసిన యజమానికి రెనాల్ట్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మల్హోత్ర స్వయంగా హ్యాండోవర్ చేశారు. 2022 సెప్టెంబరులో క్విడ్‌లో మరో వెర్షన్ రాబోతున్నట్టు కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అత్యాధునిక ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండటం వల్ల క్విడ్ ఇండియా మార్కెట్లో సుస్థిర స్థానం దక్కించుకోగలిగింది. ఎంట్రీ లెవల్ క్విడ్ కారులో 800 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ 54 హెచ్‌పీ సామర్థ్యంతో 72 ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. హైఎండ్‌లో 91 ఎన్ఎం టార్క్ రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.4.11 లక్షల నుంచి రూ. 5.59 లక్షల వరకు ఉంది. అధునాత ఫీచర్లు టచ్‌స్ర్కీన్ ఇన్ఫోంటైన్మెంట్, యాపిల్ కార్ ప్లే, డ్యూయల్ ఎయిర్ ఫ్రంట్ బ్యాగ్స్, ఏఈబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. రెడిన్ డాట్సన్ గో, హ్యుందాయ్ సాంత్రో, మారుతి సూజుకి ఎస్ప్రెసో కార్లకు ధీటుగా క్విడ్ ఇక్కడి మార్కెట్లో పట్టు సాధించింది. చదవండి:2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ? -
అప్రీలియా ఎస్ఆర్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో ఎస్ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది. ఫీచర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుపరిచారు. ఎస్ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్ఐ ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌తో తయారైంది. -
జోరుమీదున్న బీఎమ్‌డబ్ల్యూ 5 సీరీస్
ముంబై: జర్మనకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎమ్‌డబ్ల్యూ గురువారం 5 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.62.90 లక్షలు, రూ.63.90 లక్షలు, 71.90 లక్షలుగా ఉన్నాయి. 6.1 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ ఈ కార్లలో బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్ వేరియంట్ 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 5200 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 252 హెచ్‌పీని, 4800 ఆర్పీఎం 350 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 5 సిరీస్‌కి చెందిన కార్లకు ఇండియాలో మంచి ఆధరణ లభిస్తుండటంతో బీఎండబ్ల్యూ వరుసగా వేరియంట్లను రిలీజ్ చేస్తోంది. చదవండి : లాక్డౌన్లు ఎత్తేస్తే.. టూర్లకు రెడీ -
బీఎండబ్ల్యూ 6 సిరీస్ కొత్త వెర్షన్
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.67.9 లక్షలుగా ఉంది. సరికొత్త వెర్షన్‌ను పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే 630ఐ ఎమ్ స్పోర్ట్‌లో 2.0 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 258 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.67.9 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్లలో లభించే 620డీ కారులో 2.0 లీటర్ ఇంజిన్ ఉంది. ఇది 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 7.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధరను రూ.68.9 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా 630డీ కారులో అమర్చిన 3 లీటర్ల ఇంజిన్ 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కూడా కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్ ధర రూ.77.9 లక్షలుగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాలను దృష్టిలో పెట్టుకొని 6 సిరీస్ సెడాన్‌లో కొత్త వెర్షన్ విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ విక్రమ్ పావా తెలిపారు. -
సరికొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ : ధర?
సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్‌లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్‌లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది.