Nizam College
-
నిజాం కాలేజీలో విద్యార్థినుల ధర్నా
-
నూకల బియ్యం పెడుతున్నారు.. ఇంత దారుణమా
-
రోడెక్కిన నిజాం కాలేజీ విద్యార్థినులు
-
ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా
సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, నిజాం కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. చదవండి: (అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్) -
నిజాం కళాశాలలో కొనసాగుతున్న డిగ్రీ విద్యార్థులు ఆందోళన
-
నిజాం కాలేజీ విద్యార్థినుల సమస్యలను పరిష్కరించండి: భట్టి విక్రమార్క
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభా ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కళాశాల విద్యార్థి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు శనివారం ఆయన హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ 10 రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిజాం కాలేజీని అప్పట్లో డిగ్రీ విద్యార్థుల కోసమే నెలకొల్పారని, సీట్లు మిగిలితే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేవారని గుర్తుచేశారు. విద్యార్థులకు సరిపడా భవనాలను నిర్మించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని భట్టి పేర్కొన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ విద్యార్థులను బెదిరించడం సరికాదని, ఆయన ఒక ఐఏఎస్ అధికారిలా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల న్యాయపరమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామిలతో పాటు కాలేజీ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: నిజాం కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్థినులకు కూడా హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన హాస్టల్ గదుల్లో సగం పీజీ చదివే విద్యార్థినులకు, మరో సగం డిగ్రీ చదివే విద్యార్థినులకు వసతి సదుపాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. నిజాం కాలేజీలో ఇప్పటి వరకూ డిగ్రీ చదివే బాలురకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. కాగా, తమకు కూడా హాస్టల్ సౌకర్యం కల్పించాలని నిజాం కాలేజీ విద్యార్థునులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో, సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కేటీఆర్.. విద్యా శాఖ మంత్రి సబితను కోరారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఉన్నతాధికారులతో చర్చించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 200 మందికి హాస్టల్ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల మెరిట్, వారి స్వస్థలానికి హైదరాబాద్‌కు ఉండే దూరాన్ని బట్టి సీట్లు కేటాయిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థినుల ఆందోళనపై ప్రభుత్వం మానవతా కోణంలో స్పందించి, తక్షణ పరిష్కారం చూపిందని మంత్రి సబిత ట్వీట్ చేశారు. అయితే డిగ్రీ విద్యార్థుల కోసం అదనంగా మరో అంతస్తు నిర్మాణంపై అధికారికంగా సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా మంత్రిని కోరినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. అప్పటి వరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం చెట్టుకిందే పాఠాలు విని.. అక్కడే భోజనాలు చేశారు. శనివారం కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. -
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
‘నిజాం’ మహిళా హాస్టల్ ఏర్పాటు సమంజసమేనా?
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో మ హిళా హాస్టల్ ఏర్పా టుచేయాలన్న విద్యా ర్థిసంఘాల డిమాండ్ నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారుల ను విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించా రు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్, కాలేజీ విద్య కమిషన్ నవీన్‌మిట్టల్ సహా పలువురు అధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. నిజాం కాలేజీలో హాస్టల్ ఏర్పాటుపై వచ్చిన డిమాండ్ ఎంత వరకు సమంజసమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ డిమాండ్ లేవ నెత్తిన విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సంప్ర దించాలన్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువు తున్న బాలురకు ఏళ్లుగా హాస్టల్ సౌకర్యం ఉందని, కానీ బాలికలకు అక్కడ హాస్టల్ సదు పాయం లేదని అధికారులు మంత్రికి వివరించారు. హాస్టల్ ఏర్పాటు చేసే స్థలం కూడా లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
బషీర్ బాగ్ నిజాం కాలేజ్ లో విద్యార్థుల ఆందోళన
-
అన్యాయాలపై సంధించిన సూటి ప్రశ్న!
మోసం పునాదులమీద నిలబడ్డ మీ సంకుచిత మత విశ్వాసాలని ధ్వంసం చేస్తాను కూకటివేళ్లతో సమూలంగా పెకలించి వేస్తాను మతవిద్వేషపు కళంకాన్ని ఊడ్చేస్తూ నా ఆశలు సగర్వంగా ఆకాశంలో ఎగురుతాయి – జోష్ మలీహాబాదీ అది 1972 ఏప్రిల్ 14 సాయంత్రం. జార్జిని ధూల్ పేట కిరాయి గూండాలు హత్య చేశారని ఒక మిత్రుడు హడావుడిగా వచ్చి చెప్పాడు. నమ్మలేదు. హిమాయత్ నగర్లో ఉన్న మరొక మిత్రుని దగ్గరకు వెళ్లే సరికి అప్పటికే జార్జి హత్యపై తాను రాసిన కరపత్రంతో కనిపించాడు. చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని జార్జి తరచూ మాతో చెప్పేవాడు. ఏప్రిల్ 15న డీడీ కాలనీలోని ఇంటిదగ్గర శవపేటికలో జార్జి మృత దేహం మా కళ్ళముందున్నది. తన దేహంపై 32 కత్తిపోట్లు... హంతకుల ద్వేషానికి సాక్ష్యంగా! రెండువేల మంది విద్యార్థులు గుమికూడారు. కన్నీళ్ళు, నిశ్శబ్దం అలుముకున్న ఉద్విగ్న విషాద వాతావరణం. అంతలో ఎవరిదో ఒక గొంతు నుండి ‘జార్జిరెడ్డి అమర్ రహే’ నినాదం! వేల గొంతులు ఒక్కటిగా పిక్కటిల్లాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందునుంచి జార్జి శవయాత్ర సాగేటప్పుడు కట్టలు తెగిన ఉద్రేకం! మేము అప్పుడు నిగ్రహం పాటించకపోతే ఏమయ్యేదో తెలియదు. జార్జిని నారాయణగూడ శ్మశానవాటికలో ఖననం చేశాం. ఎవరీ జార్జి? అత్యంత ప్రతిభాశాలియైన విద్యార్థి. అణుభౌతిక శాస్త్రంలో స్వర్ణపతక గ్రహీత. పీహెచ్డీ పరిశోధనకు నమోదు చేసుకోవాలనుకున్నపుడు, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లో ప్రొఫెసర్లు ఎవరూ తనకి గైడ్‌గా ఉండడానికి సిద్ధపడలేదనీ, ఒక ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ముందుకు వచ్చిన తర్వాతనే తాను పరిశోధనకు ఉపక్రమించాడనీ అనుకునేవాళ్ళు. పరీక్షా పత్రాలలో తన జవాబులను చదివిన ప్రొఫెసర్ ఒకరు తనని ప్రత్యక్షంగా చూడాలని బొంబాయి నుంచి వచ్చి కలిశాడు. అయితే జార్జిని యాభై సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నది అసాధారణమైన ఈ ప్రతిభాపాటవాల వల్ల మాత్రమే కాదు. జార్జి అణగారిన ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆ రోజులలో రిక్షాలు ఎక్కువగా ఉండేవి. ఒకసారి మేము రిక్షా కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం. ‘ఒక మనిషి రిక్షాని ఎగువకి లాగుతుంటే, ఇంకో మనిషి ఆ రిక్షాలో కూర్చోవడాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంద’ని జార్జి అడగడం నాకు గుర్తుంది. జార్జి స్వార్థంలేని మనిషి. జార్జి అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. అన్యాయాన్ని సహించక ఎదురుతిరిగేవాడు. సిద్ధాంత రాజకీయ చర్చలలో ప్రశ్నలతో ఆలోచనలు రేకెత్తించేవాడు. వివిధ కళాశాలల విద్యార్థులతో అధ్యయన బృందాలు నెలకొల్పి పుస్తకాలపై చర్చించే వాడు. సైన్స్ కాలేజిలోని ఆస్ట్రానమీ డిపార్ట్ మెంట్ పక్కనే ఉండిన ఒక క్యాంటీన్ తన చర్చలకు ఒక కేంద్రంగా ఉండేది. అక్కడ కూర్చుని మేం వివిధ అంశాలపై చర్చిస్తూ జార్జి విశ్లేషణలను వింటూ ఉండేవాళ్ళం. అక్కడకు వచ్చేవాళ్ళలో ‘అట్లాస్ ష్రగ్డ్’, ‘ఫౌంటెన్ హెడ్’ వంటి అయన్ రాండ్ పుస్తకాలను చేతిలో పెట్టుకుని చర్చించే మార్క్సిస్ట్, సోషలిస్టు వ్యతిరేకులు కూడా వుండేవాళ్ళు. సైన్సు, తత్వశాస్త్రం, సిద్ధాంతం, విప్లవం వంటి అంశాలపై నిశితమైన చర్చలు అక్కడ ఉండేవి. అచ్చెరువొందించే తెలివితేటలూ, అన్యాయానికి స్పందించి తిరగబడడంతో పాటు, ప్రగతిశీల భావాలని ప్రోదిచేసి విద్యార్థులను సమీకరించిన కృషియే జార్జిని ప్రత్యేకంగా నిలబెట్టింది. నిర్దిష్టమైన పోలికలు లేకపోయినా జార్జి... తన నడక, నడవడికలతో విప్లవ స్ఫూర్తి ‘చే గువేరా’ని స్ఫురింపజేసేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సైన్స్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్న నాకు జార్జి సహచరునిగా పనిచేసే అవకాశం లభించింది. జార్జి మరణం తర్వాత పీడీఎస్‌యూ ఆవిర్భావానికి దారులు వేసిన ప్రగతిశీల విద్యార్థుల బృందంలో నేనొకడిని. ఆనాటి పరిస్థితులపై ‘క్రైసిస్ ఇన్ క్యాంపస్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అందులో జార్జి సమాజంలో హింస గురించీ, ధిక్కారాన్ని సహించని వ్యవస్థ శాంతియుత నిరసనను ఎలా హింసతో అణచివేస్తుందో వివరిస్తాడు. ఆ చర్చ, ప్రశ్నలు ఇప్పటికీ వర్తించేవే. ‘చావు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎప్పుడైనా రావచ్చున’నే చే గువేరా మాటలని జార్జి ఉటంకించేవాడు. జార్జి జీవితం చావును ధిక్కరించడంలో వుంది. జార్జి మరణం సమాజంలో అన్యాయాలపై సంధించిన సూటైన ప్రశ్న! (క్లిక్: ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...) 1960ల నాటి విప్లవ జ్వాల... జార్జి వంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. ప్రజల కోసం మరణించిన స్ఫూర్తిగా జార్జి కొనసాగుతున్నాడు. సంక్లిష్టమైన పరిస్థితులలో, వేర్వేరు రూపాలలో జార్జి వారసత్వం ఈనాటికీ కొనసాగుతూనేవుంది. జార్జి ఆలోచనలూ, రేకెత్తించిన ప్రశ్నలూ, మెరుగైన సమసమాజ స్వప్నాలూ ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ స్వప్నాలను ఎవ్వరూ చిదిమి వేయలేరు. యాభై సంవత్సరాల తర్వాత కూడా చావును ఎదిరించి గేలి చేసిన ధిక్కారానికి ప్రతీకగా, సజీవంగా జార్జి నిలిచి వున్నాడు! (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) - బి. ప్రదీప్ వ్యాసకర్త జార్జిరెడ్డి సహచరుడు bpkumar05@rediffmail.com -
1971 ఇండియా–పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు!: ఒక్కడున్నాడు
సైనికుడిగా సరిహద్దుల్లోసేవలందించడం విద్యార్థులుగా చాలామంది కల. ఆ కలను నిజం చేసుకున్నారు ఇద్దరు మిత్రులు. యుద్ధంలో పాల్గొనడం ప్రతి సైనికుడి ఆశయం. ఆ ఆశయంలోనూవాళ్లు పాలుపంచుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే... ఇంకొకరు ఆ మిత్రున్ని ఇలా స్మరించుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విమోచనలో భాగంగా జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండాయి. ఆ యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 11 మంది అధికారులు ఉన్నారు. వారిలో మాజీ కల్నల్ డాక్టర్ వీఆర్కే ప్రసాద్, అమరుడైన సెకండ్ లెఫ్ట్‌నెంట్ విక్రమ్ బర్న్ అప్పలస్వామి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టభద్రులయ్యారు. సికింద్రాబాద్‌లో నివసిస్తూ ప్రస్తుతం రెండు ప్రైవేట్ వర్సిటీలకు వీసీగా సేవలు అందిస్తున్న వీఆర్కే ప్రసాద్ ఆప్తమిత్రుడైన విక్రమ్ గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... మాణిక్ షాకు లేఖ రాసిన విక్రమ్... విక్రమ్ బర్న్ అప్పలస్వామి, నేను హిమాయత్‌నగర్, నారాయణగూడల్లోని పక్కపక్క కాలనీల్లో నివసించే వాళ్లం. నిజాం కాలేజీలో 1967–69 మధ్య బీఎస్సీ పూర్తి చేశాం. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్నోసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లినా విజయం సాధించలేదు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉందని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం వరించట్లేదని విక్రమ్ అప్పటి ఆర్మీ జనరల్ మాణిక్ షాకు ఓ లేఖ రాశారు. దీన్ని చూసిన మాణిక్ షా తన అధికారిక లెటర్ హెడ్‌పై ‘నిరాశ పడకుండా ప్రయత్నించు. నీ పట్టుదల చూస్తుంటే కచ్చితంగా సాధిస్తావనే నమ్మకం ఉంది’ అని ప్రత్యుత్తరం రాశారు. దాంతో విక్రమ్ మరెంతో స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత ఇద్దరం ఎంపికయ్యాం. విక్రమ్ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో, నేను కోర్ ఆఫ్ సిగ్నల్స్‌లో (టెలిమ్యూనికేషన్స్ బ్రాంచ్) బాధ్యతలు తీసుకున్నాం. సెకండ్ లెఫ్ట్‌నెంట్ హోదాలో విక్రమ్ «గుజరాత్లో దరంగ్‌ధరలోని ఫీల్డ్ రెజిమెంట్‌లో, నేను పఠాన్‌కోట్ సిగ్నల్ రెజిమెంట్‌కు వెళ్లాం. అప్పట్లో ఉత్తరప్రత్యుత్తరాలు, గ్రీటింగ్ కార్డుల ద్వారా మాత్రమే మా మధ్య సమాచార మార్పిడి జరిగేది. ఎయిర్ బేస్‌లపై ఏక కాలంలో దాడులు.. 1971 సెప్టెంబర్ నుంచి యుద్ధవాతావరణం నెలకొంది. డిసెంబర్ 3న పఠాన్‌కోట్ కమ్యూనికేషన్ సెంటర్లో విధుల్లో ఉన్నా. సాయంత్రం 5.45కి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. బయటకు వెళ్లి చూస్తే అక్కడి సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ పొగలు కక్కుతోంది. ఆరా తీస్తే పాకిస్థాన్ యుద్ధ విమానాలు ఓ బాంబు వేసి వెళ్లాయని చెప్పారు. అది మొదలు పఠాన్‌కోట్, ఆగ్రా, గ్వాలియర్.. ఇలా ఉత్తరాన ఉన్న ఎయిర్‌ఫీల్డ్స్‌పై ఒకేసారి ఎయిర్ ఎటాక్ జరిగింది. దీన్ని మన బలగాలు సమర్థంగా తిప్పి కొట్టాయి. డిసెంబర్ 16 సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మధ్యలోనే విక్రమ్‌కు ఓ లేఖ రాశాను. అయితే యుద్ధం నేపథ్యంలో అది పోస్టు చేయడం సాధ్యం కాలేదు. ఆ నెలాఖరు వరకు విక్రమ్‌నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్రిస్ట్మస్, న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో విక్రమ్ కోసం గ్రీటింగ్ కార్డులు సిద్ధం చేసే పనిలో ఉన్నా. నిజాం కాలేజీకే గర్వకారణం.. ఈ లోపు మా సిగ్నల్స్ ఛానల్లో ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. విక్రమ్ బర్న్ అప్పలస్వామి యు ద్ధంలో చనిపోయారు. అసలు ఏం జరిగిందనేది ఎంతో శోధించి తెలుసుకున్నా. అప్పట్లో విక్రమ్ వాళ్ల రెజిమెంట్‌కు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన వాహనం కమాండింగ్ ఆఫీసర్ వాహనం వెనుకే ఉంటుంది. డిసెంబర్ 5న ఈ జీపు రాజస్థాన్‌లోని బర్మేర్ సెక్టార్లో శత్రు సైన్యం ఏర్పాటు చేసిన ఓ యాంటీ ట్యాంక్ మైన్ మీద నుంచి వెళ్లింది. ఆ పేలుడు ధాటికి విక్రమ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ 9న కన్ను మూశారు. తర్వాత జమ్మూ నుంచి జోథ్‌పూర్ బదిలీ అయ్యా. అప్పుడు విక్రమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు సెలవుపై వెళ్లి విక్రమ్ అంత్యక్రియలు నిర్వహించిన పాస్టర్‌ను కలిశాను. ఆయన చెప్పిన వివరాలతో వెళ్లి సమాధిని గుర్తించి నివాళులర్పించా. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ వచ్చా. నిజాం కాలేజీకే గర్వకారణమైన విక్రమ్ ఫొటోను ఆ కాలేజీలో పెట్టించా. ఇప్పటికీ ఏటా విక్రమ్ సంస్మరణ లెక్చర్ ఇస్తున్నా. వీఆర్కే ప్రసాద్ -
టెన్నికాయిట్ చాంప్ నిజాం కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి పురుషుల టెన్నికాయిట్ టోర్నమెంట్లో నిజాం కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఉస్మానియా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని టెన్నికాయిట్ కోర్టులో ఈ పోటీలు నిర్వహించారు. ఫైనల్లో నిజాం కాలేజి 2–1 స్కోరుతో డా. బీఆర్ అంబేడ్కర్ డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఓయూ టెక్నా లజీ జట్టు 2–0తో భవన్స్ సైనిక్‌పురిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో నిజాం కాలేజి 2–0తో ఓయూ టెక్నాలజీపై గెలుపొందగా, బీఆర్ అంబేడ్కర్ కాలే జి జట్టు 2–0తో భవన్స్ సైనిక్‌పురిపై విజ యం సాధించింది. లీగ్ దశలో ఓయూ టెక్నా లజీ జట్టు 2–0తో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజిపై, బీఆర్ అంబేడ్కర్ కాలేజి 2–1తో ఓయూ ఆర్ట్స్ కాలేజిపై, నిజాం కాలేజి 2–0తో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ (సైఫాబాద్)పై గెలుపొందాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫె సర్ బి.సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చే సి బహుమతులు అందజేశారు. ఇందులో టెన్నికాయిట్ కోచ్ సద్గురు, ప్రొఫెసర్ దీప్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటప్ప పాల్గొన్నారు. -
30న హైదరాబాద్‌లో ‘జాతీయ రెడ్డి గర్జన’
జాతీయ రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడి నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రెడ్ల అభివృద్ధి, ఐక్యతే ధ్యేయంగా ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ‘జాతీయ రెడ్డి మహాగర్జన’ నిర్వహించనున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గుంటూరులోని ట్రావెల్స్ బంగ్లాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుం చి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది మంత్రులను, 16 మంది పార్లమెంటు సభ్యు లు, 108 మంది శాసనసభ్యులకు, అలాగే 46 మంది ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేషన్ చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రెడ్లలో అత్యధిక శాతం మంది కడు పేదరికంతో దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గత 65 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు లేక రెడ్లు ఉద్యోగ అవకాశాలకు దూరమ య్యారని 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కరుణా కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డి మహాగర్జన సందర్భంగా పేద విద్యార్థుల సంక్షేమానికి, ఉన్నత విద్య కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా సినిమాల్లో రెడ్లను అసభ్యకరంగా, దుర్మార్గులుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని, ఇలాంటి చర్యలను నియంత్రించాలని ఆయన కోరారు. సభ నిర్వహణకు చంద్రబాబు అడ్డుపుల్లలు: జాతీయ రెడ్డి మహాగర్జనను తొలుత అమరావతిలోని గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించామని కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీకి చెందిన నేతల ద్వారా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై
హైదరాబాద్ : నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ విద్యాసంస్థ నిజాం కాలేజీ డిజిటల్ క్యాంపస్ గా మారిపోయింది. టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, నిజాం కాలేజీలో జియోనెట్ హై స్పీడ్ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం నిజాం కాలేజీ ఆడిటోరియంలో ఈ సర్వీసులను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రర్ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. నిజాం కాలేజీ లాంటి పాత విద్యాసంస్థ సరికొత్తగా డిజిటల్ సేవలతో ముందుకు దూసుకెళ్లడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ రెడ్డి అన్నారు. ఈ వైఫై సేవలను స్టాఫ్, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జియో డిజిటల్ క్యాంపస్ పేరిట, రిలయన్స్ జియో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో హై-స్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 500కు పైగా కాలేజీలో జియోనెట్ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఈ సేవలనందిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ ఈవెంట్లో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్ బాలబ్రహ్మం చారీ, జియో ప్రతినిధులు రమణ సురభి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు కోసం ఉమ్మడి పోరు
⇒ అసెంబ్లీలో తీర్మానానికి కృషి చేస్తా ⇒ నిజాం కళాశాలలో జరిగిన ⇒ బహిరంగ సభలో శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానానికై పోరాడతామని పలు ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిజాం కళాశాల మైదానంలో ‘సీపీఎస్ రద్దు శంఖారావం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, శాసనసభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ఐదేళ్ల పదవీకాలం ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలకు పింఛన్ ఇస్తున్న ప్రభుత్వాలు 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పింఛన్ ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక హక్కన్నారు. పాత పెన్షన్ విధానానికై ప్రభుత్వాలతో పోరాడతామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్ సొమ్మును స్టాక్ మార్కెట్లలో పెట్టి లాభం వస్తే పింఛన్ ఇస్తాం.. అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. కింగ్‌ఫిషర్ సంస్థ లాంటి అధినేతలు చేతులెత్తేస్తే స్టాక్ మార్కెట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉందని, ఈ వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిదిగా ఉందన్నారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాలు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానానికై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఐక్య కార్యాచరణ రూపొందిస్తాం... టీఎన్జీవో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుకై పోరాటానికి ఐక్య కార్యాచరణను రూపొందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాట ప్రకారం మన మధ్య అభిప్రాయ బేధాలను పక్కకుపెట్టి అందరికీ అనుకూలైన కార్యాచరణతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సీపీఎస్ విధానాల్లో తెలిసో తెలియకో చేరిన రాష్ట్ర ప్రభుత్వం నిర్భయంగా దాని నుంచి బయటకు రావచ్చని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చెప్పారు. ఉద్యోగుల పెన్షన్‌ను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెపుతున్నారని, కానీ ఇప్పటి వరకు లాభాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. యూపీ రాష్ట్ర ఉపా«ధ్యాయ సంఘం అధ్యక్షుడు విజయ్బంధు మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుకై ఢిల్లీలో లక్షమందితో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత, తెలంగాణ రాష్ట్ర గ్రూప్ –1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు కారెం రవీందర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, పంజాబ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సృజిత్సింగ్, జూనియర్ కాలేజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసుదన్‌రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, పీఆర్టీయూ (టీఎస్) అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావుతో పాటు వివిధ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నిజాం కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
నిజాం కళాశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్ చాంబర్ వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. గిరిజన విద్యార్ధులపై దాడులకు పాల్పడిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పలు విద్యార్ధి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగాఏబీవీపీ నిజాం కళాశాల యూనిట్ అధ్యక్షులు బంగ్ల చైతన్య, పీడీఎస్‌యూ నేత ఆనంద్ తదితరులు మాట్లాడారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కనక లింగేశ్వర్ అగ్రవర్ణ అహంకారంతో దళితులపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. కళాశాలకు సంబంధం లేని బయటి వ్యక్తులు ప్రిన్సిపల్ ఎదుటే సహచర విద్యార్ధులపై దాడులకు పాల్పడుతుండడం కళాశాలలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమైతోందని అన్నారు. కాగా, పలు విద్యార్ధి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కనక లింగేశ్వర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
టీమ్ చాంపియన్ నిజామ్ కాలేజ్
సాక్షి, హైదారాబాద్: అవంతి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఉస్మానియా అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో నిజామ్ కాలేజ్, కస్తూర్బా గాంధీ కాలేజ్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. ఆదివారం ఉస్మానియా ప్రాంగణంలో జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ పోటీల్లో 87 పాయింట్లు సాధించి నిజామ్ కాలేజ్ విజేతగా నిలవగా... 153 పాయింట్లతో భవన్స్ వివేకానంద కాలేజ్, 217 పాయింట్లతో బద్రుక కాలేజ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్ని దక్కించుకున్నాయి. మహిళల టీమ్ ఈవెంట్లో కస్తూర్బా గాంధీ కాలేజ్ (38 పాయింట్లు), సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ (42 పాయింట్లు), కోఠి మహిళల యూనివర్సిటీ కాలేజ్ (54 పాయింట్లు)లు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. మరోవైపు 5 కి.మీ పరుగు మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రియాంక (వనిత మహావిద్యాలయ) 19: 58.7 నిమిషాల్లో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఆర్. కలైవాణి (20:53 ని., సెయింట్ ఆన్స్), కె. మానస (22:14.3ని.) రన్నరప్‌లుగా నిలిచారు. 12 కి.మీ రేసులో పురుషుల వ్యక్తిగత విభాగంలో కె. ఆనంద్ (41: 39.8ని., న్యూ గవర్నమెంట్ కాలేజ్, శేరిలింగంపల్లి), ఎస్. వినోద్ (42:02.08ని., నిజామ్ కాలేజ్), బి. రంగయ్య (42:07.8ని., న్యూ బద్రుక కాలేజ్) తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. -
'26న నిజాం కాలేజీలో ఇఫ్తార్ విందు'
హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 26న నిజాం కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం ఆయన రంజాన్ పండుగపై సమీక్ష నిర్వహించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాని సూచించారు. రంజాన్ సందర్భంగా 2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజిలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ.. డిగ్రీ సెకండియర్ చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలిపింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. నిజాం కాలేజీలో బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థినినీ అదే కాలేజీకి చెందిన రాజశేఖర్ అనే సీనియర్ డ్రెస్ కోడ్ సరిగా లేదని బుధవారం సాయంత్రం చెప్పాడు. ఈ విషయం గురువారం కాలేజీ మొత్తం తెలియడంతో తోటి విద్యార్ధినులు రాజేశ్వరిని ఈ విషయం గురించి అడిగారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బర్కత్‌పురలోని తన హాస్టల్‌కు వెళ్లి కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమైన నారాయణగూడ పోలీసులు హాస్టల్‌కు వెళ్లి అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆబిడ్స్ పోలీసులకు అప్పగించారు. సీనియర్ రాజశేఖర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఇద్దరినీ జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను కేవలం డ్రెస్ కోడ్ సరిగా లేదని మాత్రమే సలహా ఇచ్చానని రాజశేఖర్చెప్పడం, అదే విషయాన్ని రాజేశ్వరి ధ్రువపర్చడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
'కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చివేయటం ఖాయం'
హైదరాబాద్‌సిటీ : తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ (ఎన్‌టీవీపీ) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖాలకు బ్లాక్ రిబ్బన్లు కట్టుకొని గురువారం నిజాం కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ... విద్యార్థుల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు విద్యార్థుల సమస్యలు గాలికొదిలి తన అధికార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రాధాన్యమిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అలాంటి విధానాలను కేసీఆర్ విడనాడాలని, లేకపోతే విద్యార్థులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చివేయడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీవీపీ సభ్యులు చక్రపాణి, రంజిత్, అశోక్, కృష్ణ, జగదీష్, సచిన్, చరణ్, పృథ్వీ, కరణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ తర్వాత..
ఇంటర్మీడియెట్ ప్రతి విద్యార్థి జీవితంలో కీలక మలుపు.. ఈ దశలో ఎంచుకున్న గ్రూప్, ఆ తర్వాత వేసే అడుగులే ఉజ్వల కెరీర్‌కు మార్గం వేస్తాయి. అందుకే ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక భవిష్యత్తు ప్రణాళికలపై అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రూప్ ఏదైనా పక్కాగా ప్లానింగ్ చేసుకోవాలి.. అప్పుడే సరైన గమ్యం దిశగా అడు గులు పడతాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలు మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రూప్‌ల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య,ఉద్యోగావకాశాలపై ఫోకస్.. కాంపిటీషన్లో కలిసొచ్చే హెచ్ఈసీ హెచ్ఈసీ విద్యార్థులు సాధారణంగా డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను ఎంచుకుంటారు. హెచ్ఈసీ ఫౌండేషన్‌తో భవిష్యత్తులో పలు కాంపిటీటివ్ పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఎంతో ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి వీఆర్వో/వీఆర్ఏ వరకూ అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్‌ల ప్రశ్నలు తప్పనిసరిగా ఉండటం.. వాటిని ఇంటర్మీడియెట్, బీఏ స్థాయిలో అధ్యయనం చేసి ఉండటంతో హెచ్ఈసీ విద్యార్థులు పోటీలో ముందంజలో నిలుస్తారు. ప్రొఫెషనల్‌గా రూపుదిద్దుకుంటున్న బీఏ: హెచ్ఈసీ విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే బీఏ కోర్సు.. గ్రూప్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ల విషయంలోనూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రొఫెషనల్ రూపు సంతరించుకుంటోంది. ఈ క్రమంలో బీఏ స్థాయిలోనే కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ‘లా’ కోర్సులతో కెరీర్ కళ: ఇంటర్మీడియెట్ హెచ్ఈసీ విద్యార్థులకు సంప్రదాయ బీఏ కోర్సుకు ప్రత్యామ్నాయంగా నేటి పోటీ ప్రపంచంలో చక్కటి కెరీర్ అవకాశాలు అందించే మార్గంగా నిలుస్తున్న కోర్సు బీఏ-ఎల్ఎల్బీ. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ ‘లా’ కోర్సులోనూ కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్జెక్ట్‌లు (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా తదితర) మేజర్లుగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో లా పూర్తి చేసిన అభ్యర్థులు కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది. సీఈసీ.. కార్పొరేట్ కొలువులకు మార్గం ప్రస్తుత కార్పొరేట్ యుగంలో బహుళ జాతి సంస్థల్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు మార్గం సీఈసీ. దీని అర్హతగా అటు బ్యాచిలర్‌స డిగ్రీతోపాటు సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేయొచ్చు. తద్వారా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవచ్చు. సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులు.. బీకాం: సాధారణంగా సీఈసీ విద్యార్థుల్లో అధిక శాతం మందికి మొదటి ఆప్షన్ బీకాం (బ్యాచిలర్ ఆఫ్ కామర్స్). ఇప్పుడు బీకాం కోర్సు సైతం ఆధునికత సంతరించుకుంది. సంప్రదాయ కామర్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్లతోపాటు పోటీ ప్రపంచానికి, పరిశ్రమ అవసరాలకు సరితూగేలా బీకాం స్థాయిలోనే ఈ-కామర్స్, టాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ వంటి విభిన్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సులు: చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ.. సీఈసీ విద్యార్థులకు అనుకూలించే మూడు ముఖ్యమైన ప్రొఫెషనల్ కోర్సులు. వీటి లో తమకు సరితూగే కోర్సును పూర్తిచేయడం ద్వారా ఉజ్వల కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు. ఎంబీఏలకు దీటుగా జీతభత్యాలు అందుకోవచ్చు. రెగ్యులర్‌గా డిగ్రీ చదువుతూనే ఈ ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు సమయం వృథా కాదు. ఏకకాలంలో అటు డిగ్రీ కోర్సు, మరోవైపు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న చక్కటి ప్రొఫెషనల్ కోర్సు సర్టిఫికెట్ చేతికందుతుంది. ఉద్యోగావకాశాలు: సీఈసీ విద్యార్థులు అకౌంటింగ్లో స్వల్పకాలిక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కోర్సులు(ట్యాలీ, వింగ్స్, ఫోకస్ తదితర) పూర్తి చేస్తే కంపెనీల్లో అకౌంటెంట్ ఉద్యోగాలు అందుకోవచ్చు. బహుళ అవకాశాల బైపీసీ ఇంటర్మీడియెట్ స్థాయిలో విద్యార్థులకు మరో క్రేజీ గ్రూప్ బైపీసీ. డాక్టర్ కల నెరవేర్చుకునేందుకు ఎంబీబీఎస్‌లో చేరే అవకాశం ఉండటమే అందుకు కారణం. కానీ పరిమిత సీట్ల సంఖ్య కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని అందుకోలేని విద్యార్థులు ఎందరో! అలాంటి వారికి మెడికల్‌కు దీటుగా కెరీర్ అవకాశాలను కల్పించే మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిపై అవగా హన పొంది తమకు తగిన కోర్సును ఎంచుకుంటే అద్భుత కెరీర్ సొంతమవుతుంది. ఫార్మసీ కోర్సులు: బైపీసీ ఉత్తీర్ణులకు తమ కోర్ విభాగంలో మంచి భవిష్యత్తును అందించే కోర్సులు.. ఫార్మసీ. ప్రస్తుతం బీఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డీ), డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ విద్యార్థులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డీకి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి కోర్సు స్థాయి ఆధారంగా ఫార్మసీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి. మరెన్నో ప్రత్యామ్నాయాలు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స అండ్ యానిమల్ హస్బెండ్రీ, డైరీ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి మరెన్నో కోర్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో బీజడ్సీతోపాటు బయోకెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సులు కూడా చక్కటి కెరీర్ మార్గాలుగా నిలుస్తున్నాయి. వీటిని పూర్తి చేస్తే ప్రతిభ ఆధారంగా మంచి కెరీర్ అందుకోవచ్చు. మెడికల్ రంగంలోనే: బైపీసీ విద్యార్థుల లక్ష్యం మెడికల్ రంగంలో అడుగు పెట్టడం. అందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సెన్సైస్‌లు మొదటి వరుసలో ఉంటున్నాయి. ఇవి అందుకోలేనివారికి, మెడికల్ రంగంలోనే కెరీర్ కోరుకునే వారికి సైతం ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. పారా మెడికల్ కోర్సులు: ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటివి. వీటిని పూర్తి చేసుకున్నవారికి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నర్సింగ్: రోగులతో నేరుగా సంప్రదిస్తూ సేవలందించే విధంగా తోడ్పడే కోర్సు.. నర్సింగ్. ప్రస్తుతం బైపీసీ ఉత్తీర్ణులకు డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. దీని ద్వారా నాలుగేళ్లపాటు శిక్షణనిచ్చి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్‌తోపాటు ఇండియన్ ఆర్మీకి చెందిన హాస్పిటల్స్‌లో పర్మనెంట్ హోదాలో ఉద్యోగం ఖరారు చేస్తుంది. జాబ్స్: ఇంటర్ అర్హతగా నిర్వహించే పలు ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎనీ గ్రూప్.. ఉద్యోగ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష ఇది. ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు డేటా ఎంట్రీ, కంప్యూటర్ టైపింగ్‌లో అనుభవం ఉంటే ఈ పరీక్షలో సులువుగా రాణించొచ్చు. పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్: తపాలా శాఖలో ఆయా రాష్ట్రాల స్థాయిలోనే నియామకాలు చేపట్టే ఉద్యోగాలు పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్. వీటికోసం రాత పరీక్ష, కంప్యూటర్/టైపింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. పోలీస్ శాఖలో కానిస్టేబుల్: పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియెట్ కనీస అర్హత. దీంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా కొలువు సొంతం చేసుకోవచ్చు. పారా మిలిటరీ: జాతీయ స్థాయిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో-టిబెటిన్ బోర్డర్ ఫోర్స్ తదితర పారా మిలిటరీ విభాగాల్లోనూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్ అర్హతగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-4 ఉద్యోగాలు: రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి చేపట్టే గ్రూప్-4 నియామక పరీక్షలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే పోటీ పడొచ్చు. అదే విధంగా రెవెన్యూ శాఖ పరిధిలో వీఆర్ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టులకు కూడా అర్హులే. ఉన్నత విద్య మార్గాలు: గ్రూప్‌తో సంబంధం లేకుండా ఇంటర్మీడియెట్ విద్యార్థులందరూ డీఈడీ(డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్)లో చేరొచ్చు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు దోహదం చేసే కోర్సు ఇది. డైట్ సెట్లో ర్యాంకు ఆధారంగా ఈ కోర్సు పూర్తి చేసుకుంటే డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. పర్యాటకం, ఆతిథ్యం: ఇటీవల కాలంలో విస్తృ తంగా వృద్ధి చెందుతున్న రంగంగా పేరు పొందిన టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి ప్రస్తుతం పలు కోర్సులు బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు ఎన్నెన్నో అవకాశాలు ఎంపీసీ.. ఇంటర్మీడియెట్‌లో అత్యధికులు ఎంచుకునే గ్రూప్. ఇంటర్ ఎంపీసీ పూర్తయ్యాక ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో కోర్సుల్లో చేరొచ్చు. ఈ గ్రూప్‌తో అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగావకాశాలు.. ఇంజనీరింగ్: ఎంపీసీ విద్యార్థుల్లో 90 శాతం మంది లక్ష్యం ఇంజనీరింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మన దేశంలో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అందుకోసం ప్రతి ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎంట్రెన్సలు నిర్వహిస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు జేఈఈ: దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది మెయిన్, అడ్వాన్స్డ్ అనే రెండు దశలుగా ఉంటుంది. మెయిన్‌లో ఉత్తీర్ణులకు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశ కౌన్సెలింగ్‌కు అర్హత లభిస్తుంది. మెయిన్ మార్కులు, ఇంటర్మీడియెట్ మార్కుల పర్సంటైల్ ప్రాతిపదికన నిర్వహించే అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకోవచ్చు. ఎంసెట్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఎంసెట్. ప్రతి ఏటా మేలో ఈ పరీక్ష జరుగుతుంది. ఎంసెట్ ర్యాంకు ద్వారా రెండు రాష్ట్రాల్లోని 700కు పైగా కళాశాలల్లో అడ్మిషన్ కల్పిస్తారు. మూడు లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. బిట్‌శాట్: దీని ద్వారా ప్రముఖ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. అలాగే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తదితర ప్రముఖ ఇన్స్టిట్యూట్లు ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. బీఎస్సీ: ఎంపీసీ ఉత్తీర్ణులకు సంప్రదాయ డిగ్రీ కోర్సుగా పేరు గడించింది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ). ఇప్పుడు బీఎస్సీ కోర్సులోనూ కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ వంటి మల్టీడిసిప్లినరీ స్పెషలైజేషన్స్‌ను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. దాంతో బీఎస్సీని చక్కటి ఉన్నత విద్యా మార్గంగా ఎంచుకోవచ్చు. ఉద్యోగావకాశాలు: ఎంపీసీ అర్హతగా ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ (ఎస్సీఆర్ఏ). ఎన్డీఏ: ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడమీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నేషనల్ డిఫెన్స అకాడమీ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న విభాగం ఆధారంగా ఆయా అకాడమీల్లో శిక్షణ ఉంటుంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ డిగ్రీ; నేవల్ అకాడమీలో శిక్షణ పొందిన వారికి బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది. ఎస్సీఆర్ఏ: ఇండియన్ రైల్వేస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఉచితంగా బీటెక్ డిగ్రీతోపాటు రైల్వేలో కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతమవుతుంది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్తోనూ డిఫెన్స్‌లో ఎంట్రీ: త్రివిధ దళాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలపరంగా లభించే మరో అవకాశం ఇండియన్ ఆర్మీ నిర్వహించే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. అకడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహించే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తర్వాత శిక్షణ లభిస్తుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. పక్కా ప్లానింగ్‌తో పటిష్ట కెరీర్ విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ దశ నుంచి భవిష్యత్తు ప్రణాళిక పకడ్బందీగా సాగించాలి. అప్పుడే పటిష్టమైన కెరీర్‌కు మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు అధిక శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు లక్ష్యంగా ఎంచుకుని ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌ల్లో చేరుతున్నారు. ఆ తర్వాత నిరాశాజనక ఫలితాలు ఎదురైతే ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. విశాల దృక్పథంతో ఆలోచించే మనస్తత్వం అలవర్చుకోవాలి. కెరీర్ అంటే ఇంజనీరింగ్, మెడికల్ అనే భావన వీడాలి. వాటికి దీటుగా ఉన్న అవకాశాలను అన్వేషించాలి. వాటిలో ఉన్నతంగా రాణించేందుకు మార్గాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా కీలకపాత్ర వహించాలి. - డా॥సుశీలా రావు, డెరైక్టర్, సాఫ్ట్‌స్కిల్ ఇండియా లిమిటెడ్ కామర్స్ రంగంలో ఎన్నెన్నో అవకాశాలు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇప్పుడు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సీఏ, కాస్ట్ అకౌంటెన్సీ, సీఎస్ కోర్సులకు ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించినా అర్హత లభిస్తుంది. వీటిని పూర్తి చేస్తే లభించే ఉద్యోగాలు, హోదాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. ప్రత్యేకించి కావాల్సిన లక్షణాలు విశ్లేషణ నైపుణ్యం, తులనాత్మక అధ్యయనం. కాబట్టి ఇంటర్మీడియెట్ విద్యార్థులు కేవలం తమ గ్రూప్‌నకు సంబంధించిన అవకాశాలపైనే కాకుండా ప్రత్యామ్నాయాలపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే కొత్త మార్గాలు తెలుస్తాయి. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని ముందుకు సాగడానికి సంసిద్ధత లభిస్తుంది. - ఆర్. చెంగల్‌రెడ్డి, చైర్మన్, ఎస్ఐసీఏఎస్ఏ సహజ ఆసక్తికి అనుగుణంగా నేటి తరం విద్యార్థులు.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. కోర్సు, కెరీర్ ఎంపికలో ఇది ఎంతో ముఖ్యం. ఏ గ్రూప్ విద్యార్థులైనా ప్రస్తుతం మార్కెట్ అవసరాలు ఎలా ఉన్నాయి? తాము చదివిన గ్రూప్ అర్హతతో సదరు అవసరాలకు సరితూగే ఉన్నత విద్య కోర్సులు ఏంటి? అనే అంశంపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలోని విద్యార్థులకు మానసికంగా ఆ స్థాయి పరిపక్వత ఉండదు. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించాలి. విద్యార్థుల్లోని సహజ ఆసక్తిని గుర్తించి దానికి అనుగుణమైన కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుని సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఏ గ్రూప్ అయినా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. - ప్రొఫెసర్ టి.ఎల్.ఎన్.స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
పుట్టు పోరాట యోధుడు ఎం.టి.ఖాన్
ఒక ఆదర్శ ముస్లిం, ఒక ఆదర్శ కమ్యూ నిస్టు, ఒక ఉపాధ్యాయుడుగా ఎలా ఉండాలని ఎవరైనా అడిగితే ఎం.టి.ఖాన్ జీవితంలా ఉండాలని అంటారు. కర్తవ్య నిర్వహణకు పురస్కారాలు ఉండవు. ఒక వేళ పురస్కారం వంటిదేదైనా ఉంటుం దంటే అలాంటి అత్యున్నత పురస్కారాలు ఖాన్ గారికి వంగి సలాం చేయాల్సిందే. తానొక పుట్టు పోరాట యోధుడు. పూర్తి పేరు మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్. నివాసం హైదరాబాద్ లోని అబూ హాషీం మదాని దర్గా ప్రాంతం. పురానాపూల్‌కు ఈ కొసన ఉం టుంది. 1977లో కలిసినప్పుడు ఒక పాడుబడిన కొంపలో నివసించేవాడు. ఎలాంటి అదనపు వసతులు, సౌకర్యాలు ఉండేవి కావు. వాటిని ఆశించేవాడు కాదు. దర్మవంత్ విద్యా సంస్థలో ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా పనిచేశాడు. పదవీ విరమణ తర్వాత హిందూస్తాన్ సమాచార్, న్యూస్టైల్ సియాసత్, న్యూస్ టైం వంటి పత్రికలకు అనివార్యమై పనిచేశాడు. ఖాన్ గారి పుట్టుకే కల్లోల కాలంలో జరిగింది. సుమారు 90 ఏళ్ల క్రింద హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ పాలనా పద్ధతులన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉండేవి. ఒక వైపు స్వాతం త్య్రోద్యమం, మరోైవైపు ఆంధ్ర మహాసభ వేడిగాలితో నిజాం సంస్థానం ఉక్కిరిబిక్కిరయేది. ఆంధ్రమహాసభ అతి వాద, మితవాద మహా సభలుగా చీలిపోయినప్పుడు మక్దూం, మొహినుద్దీన్, రజ్వీ, రాజ్‌బహదూర్ గౌడ్లతో పాటు ఖాన్ సాబ్ సైతం అతివాదులవైపు నడిచారు. వీరితో సాహచర్యం మార్క్సిస్టు అధ్యయనానికి పనికొచ్చింది. రక్తంలో సూఫీ తత్వం ఎంత ఉన్నా మార్క్సిజాన్ని జీవి తంలో భాగం చేసుకు న్నారు. నిగర్వి, మృదు స్వభావి. అదే సమయం లో అన్యాయం పట్ల ఆగ్ర హోదగ్రుడయ్యే వారు. నిజాం కాలేజీలో ఒక సారి అస్ఘర్ అలీ ఇంజనీర్ ప్రసంగిస్తున్నప్పుడు అక స్మాత్తుగా అతనిపై బడి ఒక దుండగుడు రేజర్‌తో గొంతు కోయడానికి ప్ర యత్నించగా పొట్టివాడైన ఖాన్ సాబ్ కట్టలు తెగిన ఆగ్రహంతో అతడిపైకి దూకి ఒడిసి పట్టుకుని అప్పగించాడు. ఖాన్ సాబ్ జీవితాంతం తెల్లబట్టలే ధరించారు. సదా చిరునవ్వులు. మాట్లాడుతుంటే అమ్మ కంఠస్వరం వినిపించేది. చర్చలు వేడెక్కిన సందర్భాల్లోనూ మాట తూలేవాడు కాదు. సంయమనం, సుబోధన, తాత్విక అంశాలపై రాజీలేనితనం, నిరంతర అధ్యయనం.. ఒక మార్క్సిస్టు ఎలా ఉండాలో అతడిని చూస్తేనే తెలిసేది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు అతివాదం వైపు మొగ్గు చూపిన ఖాన్ సాబ్ జీవితాంతం రెబెల్‌గానే ఉంటూ వచ్చారు. స్వాతంత్య్రోద్యమంలో, తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. మార్క్సిస్టు పార్టీలో చీలిక వచ్చి విప్లవపార్టీ ఏర్పడినప్పుడూ ఖాన్ తన మద్దతు తెలిపారు. విరసం వ్యవస్థాపక సభ్యుడిగా, పౌరహక్కుల నేతగా తన పాత్ర ప్రశంసలకు పాత్రమైంది. ఎమర్జెన్సీకాలంలో పాతబస్తీ నుండి అరెస్టయిన మొదటి వ్యక్తి ఖాన్ గారే. హైదరాబాద్ కుట్రకేసులో అరెస్టై చాలాకాలం జైలులో ఉన్నాడు. పీపుల్స్‌వార్ నాయకులతో తన పరిచయం వారికి ఎంతగానో ఉపకరించింది. వారి అధికార పత్రిక పిలుపుకి ఖాన్ గారే సంపాదకులు. విప్లవోద్యమానికి చిరునవ్వుతో పునాదులు వేసినవారిలో తానొకరు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషల్లో అతని పాండిత్యం ఎనలేనిది. అన్ని భాషల్లో తర్జుమా చేసేవాడు. కవిగా, వచన రచయితగా తనకు తానే సాటి. గత రెండు దశాబ్దాల నుండి ఆయన కార్యక్రమాలకు దూరం అయ్యాడు. మీలాంటి వారికి ఎందుకు గుర్తింపు లేదంటే గుర్తింపు కోసం ఏ పనీ చేయలేదని నవ్వేవాడు. ప్రగతిశీల రంగంలో తెల్ల బొద్దింకలు చేరాక అది జావకారిపోయిందనేవాడు. నిర్మాణాల్లో అతడిని కుచించే ప్రయత్నం చేస్తూ తాము మాత్రం నిర్మాణేతర శక్తులుగా ఎదగాలని చూసేవారితో పేచీ పడింది. అందుకే ఖాన్ నిశ్శబ్దమయ్యాడు. కొన్నాళ్ల క్రితం నేను, ప్రముఖ కవి సూర్య వంశి ఆయన్ను చూడాలని వెళ్లి ఇంట్లోవారిని అడిగాం. నాలుగిళ్ల అవతల ఉన్న చిన్న బడ్డీకొట్టులో ఉన్నారని చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే ఖాన్ గాలిపటాలు అమ్ముకుంటున్నాడు. అదీ ఖాన్ బతుకు. డబ్బుల కోసం ఎన్నడూ చేయి చాచని అతని చేతిలో గాలిపటం. అతనితో పనిచేసిన వాళ్ల కొత్త బతుకులకీ, పురానా పూల్‌లో వికసించిన ఎర్రమోదుగ వెలుగులకీ ఎంత తేడా. అల్ట్రా ఉద్యమ కారులకీ, బతుకులోంచి ఉద్యమంలోకి వచ్చినవారికీ ఉన్న తేడా అది. (వ్యాసకర్త జానపద సాహిత్య పరిశోధకులు) -
రేమండ్స్ జ్ఞాపకం
మైఖేల్ జోభిమ్ మేరీ రేమండ్స్.. క్లుప్తంగా రేమండ్స్ అని పిలుస్తారు. గొప్ప సాహస వీరుడిగా ప్రతీతి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజి దగ్గర వున్న గన్‌ఫౌండ్రీ గురించి తెలుసు కదా? గన్‌ఫౌండ్రీ ఏర్పాటుకు ఆద్యుడు రేమండ్స్. రెండవ నిజాం ప్రభువు.. నిజాం ఆలీఖాన్ సంస్థానంలో కంట్రోలర్ ఆఫ్ ఆర్డినెన్స్ శాఖ అధిపతిగా రేమండ్స్ పనిచేశాడు. మందు గుండు సామగ్రి, ఫిరంగులు ఆయన నేతృత్వంలో తయారయ్యేవి. తుపాకీలు లేని ఆ రోజుల్లో నిజాం సైన్యం ఫిరంగులనే ఆయుధంగా వాడేవారు. హిందువులు అతడ్ని గొప్ప సాధువుగా ‘మూసా రాం’ అని ఆరాధించారు. భరత భూమిని ఎందరో ఏలారు.. అందులో విదేశీయులూ ఉన్నారు. చక్రవర్తులుగా చెలామణి అయిన రాజులకే కాదు.. దేశాన్ని లూటీ చేసిన ద్రోహులకూ చరిత్ర తన పుటల్లో స్థానాన్నిచ్చింది. రాజుల సంగతి అటుంచితే.. ముసాఫిర్లుగా భారతావనికి వచ్చిన వారికీ చరిత్ర తనలో చోటిచ్చింది. అలా స్థానం దక్కించుకున్న వారిలో ఒకడే మైఖేల్ జోభిమ్ మేరీ రేమండ్స్. ఈ సైనికుడి పుట్టుక ఫ్రాన్స్‌లోనే అయినా.. ఆయన ఆనవాళ్లు శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం మన హైదరాబాద్‌లోనే.. ముస్లింలు ‘మూసా రహీం’ అని ప్రేమించారు. హైదరాబాదీయులు రేమండ్స్‌ను అభిమానించినంతగా మరే విదేశీయుడినీ ఆరాధించి ఉండరు. 29 ఏళ్ల రేమండ్స్ వ్యాపారం కోసం 1775లో పాండిచ్చేరికి వచ్చాడు. అయితే వ్యాపారం చేయకుండా స్థానికంగా ఉన్న బ్రిటిష్ సైన్యంలో సైనికునిగా చేరాడు. ఆ తర్వాత మైసూరు వెళ్లి, హైదరాలీ సైన్యంలో చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని ఆనాటి నిజాం సంస్థానంలో చేరాడు. అనతి కాలంలోనే నిజాం మనసు గెలిచాడు. రేమండ్స్ మందు గుండు సామగ్రి తయారీలో సుశిక్షితుడు. అంతకంటే మిన్నగా గొప్ప స్నేహశీలి. ఐతే, దురదృష్టవశాత్తు.. 42 ఏళ్ల వయసులోనే, 1798 మార్చి 25న కన్నుమూశాడు. ఆ మహనీయుని గుర్తుగా రేమండ్స్ జ్ఞాపకాన్ని మలక్‌పేటలో, టీవీ టవర్ వెనకాల ఉన్న ఓ చిన్న గుట్టపై నిర్మించారు. 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో ఒక చూడచక్కని కట్టడాన్ని సమాధి చుట్టూతా నిర్మించారు. ఇక్కడి శిలాఫలకంపై ఇలా రాసి ఉంది. "Sacred to the memory of General Michel Joachim marie Reymonds, Controller of Ordnance, The Nizam's Army. Born September 25 th 1755. Died March 25th 1798. Faith unto Death, R.I.P' రేమండ్స్ సమాధిని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ చిన్న కొండ మీద నుంచి భాగ్యనగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. రాత్రిపూట మరింత శోభాయమానంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడచక్కని ప్రదేశం రేమండ్స్ జ్ఞాపకం. ఐతే, ఇక్కడి దాకా చేరడానికి ప్రస్తుతానికి సరైన రహదారి లేదు. దారి చూపించే సైన్ బోర్డులు కూడా సరిగ్గా లేవు. చుట్టుప్రక్కల చాలా భాగం అన్యాక్రాంతమై గజిబిజిగా ఉంది. ఈ నిర్మాణం పర్యాటక, పురావస్తుశాఖ ఆధీనంలో వుంది. వారు కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే గొప్ప పర్యాటక కేంద్ర ంగా విరాజిల్లుతుంది. చారిత్రక పర్యాటకాభిలాషులు అప్పటిదాక ఆగాల్సిన పన్లేదు. ఆసక్తిగలవారు రేమండ్స్ జ్ఞాపకాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు?
బిటిష్ పాలనలో విద్యా సంస్కరణలు ప్రాచీన కాలంలో తక్షశిల, నలందా, విక్రమశిల మొదలైన విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచినవి. 19వ శతాబ్దంలో మన విద్యా వ్యవస్థలో అనేక లోపాలున్నందువల్ల, ఆంగ్ల పద్ధతిలో బోధన ఉత్తమంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఆంగ్ల విద్యనే ప్రవేశపెట్టాలని, ఆ విద్యను అభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల భారతదేశంలో ప్రాచీన విద్య మనుగడ ప్రమాదంలో పడింది. ఆంగ్లేయులు వచ్చిన మొదటి శతాబ్దంలో విద్య గురించి ఎక్కువ శ్రద్ధ చూపలేదు. క్రీ.శ. 1781లో వారన్ హేస్టింగ్స తొలిసారిగా కలకత్తాలో పర్షియా, అరబిక్ భాషల్లో బోధన కోసం ‘కలకత్తా మదర్సా’ అనే విద్యా సంస్థను స్థాపించాడు. క్రీ.శ. 1791లో డంకన్ బెనారస్‌లో సంస్కృత కళాశాలను ఏర్పాటుచేశాడు. లార్డ వెల్లస్లీ క్రీ.శ. 1802లో ఆంగ్లేయ అధికారులకు భారతీయ భాషలను, సాంఘిక ఆచారాలను బోధించడానికి ‘విలియం కోట’ కళాశాలను స్థాపించాడు. కానీ, ఈ కళాశాలను బోర్డ ఆఫ్ డెరైక్టర్‌స ఆదేశం మేరకు మూసివేశారు. 1813 చార్టర్ చట్టం వచ్చేంతవరకు విద్యకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ ఎలాంటి చర్యలనూ చేపట్టలేదు. 1813 చార్టర్ చట్టంలో ఈస్టిండియా కంపెనీ విద్యావ్యాప్తికి ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించింది. విద్యావ్యాప్తి కోసం చట్టం ద్వారా ధనాన్ని కేటాయించడం అదే తొలిసారి. ఆంగ్లేయాది పరభాష గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువాదం చేయడానికి, సంస్కృతం, అరబ్బీ, పర్షియన్ భాషల్లో గ్రంథాలను అచ్చువేయడానికి ఈ ధనాన్ని వినియోగించారు. రెండు దశాబ్దాల వరకూ విద్యావిషయమై కంపెనీ ఏ చర్యా తీసుకోలేదు. తర్వాత భారతదేశంలో బోధన ప్రాచ్య విద్యలో ఉండాలా? పాశ్చాత్య (ఇంగ్లిష్) విద్యలో ఉండాలా? అనే వివాదం చెలరేగింది. ప్రాచ్య విద్యను ప్రవేశపెట్టాలని విల్సన్, ప్రిన్సెస్ సోదరులు సూచించారు. ఆంగ్లభాషలో విద్యను బోధించాలని రాజారామ్మోహన్రాయ్ మద్దతుతో ‘చార్లెస్ ట్రావెలియన్’ వాదించారు. ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య శాస్త్రాలు, పాండిత్యాన్ని బోధించాలని పాశ్చాత్య విద్యావాదులు చెప్పారు. క్రీ.శ.1835లో మెకాలే భారతదేశంలో బోధన ఇంగ్లిష్‌లో ఉండాలని ప్రకటించిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. దీనివల్ల ఆంగ్లేయులకు, భారతీయులకు ఇద్దరికీ లాభమని మెకాలే అభిప్రాయం. భారతదేశంలోని గ్రంథాలన్నీ కలిపినా ఆంగ్ల భాషలోని కొన్ని పుస్తకాలతో సరితూగవు అని ఇతడు పేర్కొన్నాడు. కాబట్టి ఆంగ్ల భాష నేర్చుకున్నట్లయితే ఆంగ్ల గ్రంథాలను చదివి భాషాశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలవుతుందని, అప్పుడు భారతీయులు ఆంగ్లేయులతో సరితూగగలరని మెకాలే అభిప్రాయం. అందువల్ల ఆంగ్ల విద్య భారతీయులకు లాభదాయకమని వాదించాడు. బొంబాయి ప్రభుత్వం 1845లో ఒక ఆర్డినెన్స జారీ చేస్తూ బెంగాల్, మద్రాస్ ప్రభుత్వాల మాదిరిగానే పాఠశాల, కళాశాల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, పాశ్చాత్య జ్ఞానాన్ని మాతృభాషలోనే బోధించాలని నిశ్చయించింది. ఆంగ్ల విద్య చరిత్రలో క్రీ.శ. 1854కు ప్రాముఖ్యం ఉంది. 1853లో బ్రిటిష్ పార్లమెంట్ భారత విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. ఫలితంగా క్రీ.శ. 1854లో బోర్డ ఆఫ్ డెరైక్టర్‌స అధ్యక్షుడైన సర్ చార్లెస్ ఉడ్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీ విద్య విధానానికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించింది. అదే ‘ఉడ్‌స డిస్పాచ్’గా ప్రసిద్ధి చెందింది. ఉడ్‌స ప్రణాళికలోని ముఖ్యాంశాలు: * భారతీయులను విద్యావంతులను చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి * ప్రభుత్వ సహాయంతో పాఠశాలను, కళాశాలలను ఏర్పాటు చేసేట్లుగా ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహమివ్వాలి. * ప్రతి ప్రావిన్‌సలో పాఠశాల ఇన్స్పెక్టర్లను, విద్యా డెరైక్టర్లను నియమించాలి. * పెసిడెన్సీ పట్టణాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. * భారతీయులకు పాశ్చాత్య విద్య.. ము ఖ్యంగా విజ్ఞానశాస్త్ర, తత్వజ్ఞాన, సాంఘిక శాస్త్రాలను బోధించి కంపెనీలో ఉద్యోగాలివ్వడానికి తగిన అర్హతలు కల్పించాలి. * ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి. పై అంశాలతో కూడిన బృహత్తర ప్రణాళికను ‘సర్ చార్లెస్ ఉడ్’ సూచించాడు. ఆ కాలం లో గవర్నర్ జనరల్‌గా పనిచేస్తున్న లార్డ డల్హౌసీ ఈ ప్రణాళికను అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాడు. ప్రభుత్వం ‘ఆక్స్ఫర్డ విశ్వవిద్యాలయం’ తరహాలో కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో విశ్వ విద్యాలయాలను స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయాల్లో చాన్సలర్, వైస్ చాన్సలర్లను నియమించారు. ‘సెనెట్’ అనే ఒక సమావేశ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని దశాబ్దాల వరకు చార్లెస్ ఉడ్ సూచించిన విధంగా భారతదేశంలో విద్యా విధానం కొనసాగింది. ఉడ్‌స ప్రణాళిక తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రిప్పన్ కాలంలో 22 మంది సభ్యులతో ‘హంటర్’ అధ్యక్షతన ఒక కమిషన్ ను క్రీ.శ.1882లో నియమించారు. ప్రాథమిక, స్త్రీ విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఈ కమిషన్ తన నివేదికలో సూచించింది. విద్య, సాంఘిక సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల మద్దతు పొందాలని ‘హంటర్’ సూచించాడు. క్రీ.శ. 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం, 1887లో అలహాబాద్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు. లార్డ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టాడు. ఆ మార్పుల్లో భాగంగా విద్యాధికారులందరినీ సిమ్లాలో సమావేశపర్చి కొన్ని అంశాలను చర్చించారు. ఆ అంశాలను పరిశీలించడానికి ‘సర్ థామస్ ర్యాలీ’ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా లార్డ కర్జన్ క్రీ.శ. 1904లో విశ్వ విద్యాలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. విద్య ద్వారా భారతదేశంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్ హెన్రీ బట్లర్’ క్రీ.శ. 1913లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు. తర్వాత పాట్నా, నాగపూర్, రంగూన్, కాశీ, అలీఘర్, హైదరాబాద్‌లలో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. క్రీ.శ. 1916లో పుణేలో డి.కె. కార్వే స్త్రీల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. క్రీ.శ. 1917లో నియమించిన ‘శాడ్లర్ కమిటీ’ ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని సూచించింది. బీఏ (హానర్‌స) కోర్సును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని, టీచర్ ట్రైనింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, స్త్రీ, వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. క్రీ.శ. 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో ‘విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని’ ఏర్పాటు చేశారు. క్రీ.శ. 1927లో సైమన్ కమిషన్‌తోపాటు విద్యా విషయాలను పరిశీలించేందుకు ‘హార్టాగ్ (ఏ్చట్టౌజ)’ కమిటీని నియమించారు. తర్వాత 1944లో సార్జంట్ విద్యాప్రణాళికలో కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. మహాత్మాగాంధీ మరికొంత మంది జాతీయ నాయకులు సమావేశమై క్రీ.శ. 1937లో ‘సేవాగ్రామ్’లో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంతవరకు ఈ ప్రణాళికను అమలు చేశాయి. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలో అనేకమార్పులు చోటుచేసుకున్నాయి. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో సరికానిది? (2001 సివిల్స్) 1) కలకత్తా మదర్సా:వారన్ హేస్టింగ్స (1781) 2) వారణాసి సంస్కృత పాఠశాల : జోనాథన్ డంకన్ (1792) 3) చార్లెస్ ఉడ్ డిస్పాచ్ : డల్హౌసీ (1854) 4) ఆంగ్ల విద్యాచట్టం: విలియం హార్వే (1828) సమాధానం: 4 వివరణ: 1835లో మెకాలే ‘లా’ కమిషన్ అధ్యక్షతన విలియం బెంటింక్(భారతదేశ తొలి గవర్నర్ జనరల్) ఆంగ్ల విద్యా చట్టాన్ని ప్రవేశపెట్టాడు. జోనాథన్ డంకన్ ‘వారణాసి’లో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో వారన్ హేస్టింగ్స మదర్సాను ఏర్పాటు చేశాడు. 2. కిందివాటిలో సరైంది ఏది? (2003 సివిల్స్) ఎ) ఇండాలజీ పితామహుడు: సర్ విలియం జోన్స బి) తులనాత్మక పితామహుడు: మాక్స్ ముల్లర్ సి) {పాచ్య పితామహుడు: వి.ఎ. స్మిత్ డి) పాశ్చాత్య పితామహుడు: జె.ఎస్. మిల్ 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, డి మాత్రమే 4) అన్నీ వాస్తవాలే సమాధానం: 4 వివరణ: సర్ విలియం జోన్స 1784లో ‘ఏసియాటిక్ సంస్థ’ను కలకత్తాలో ప్రారంభించి భారత సంస్కృతిని వెలుగులోకి తేవడానికి కృషి చేశారు. ఈ సంస్థ తరఫున కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)ను, జయదేవుని-గీతాగోవిందం(పద్యకావ్యం)ను, మనుస్మృతి-న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇతని సహాయకుడు చార్లెస్ విల్కిన్స ‘భగవద్గీతను’ ‘సెలిటీయస్ సాంగ్స’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. మాక్స్ ముల్లర్ తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి. ఇతను 1862లో రుగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘వేదముల్లర్’గా పేరు గడించారు. ఈ గ్రంథం లో ఆర్యుల జన్మప్రాంతం ‘మధ్య ఆసియా’గా పేర్కొన్నాడు. వి.ఎ. స్మిత్ 1867లో భారతదేశాన్ని సందర్శించి అనేక గ్రంథాలు రచించాడు. ఇతడు సముద్రగుప్తుడిని భారత నెపోలియన్‌గా పేర్కొన్నాడు. 1817లో జేమ్స్ మిల్స్ భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా క్రోడీకరించారు. 3. విద్యా వ్యవస్థపై వచ్చిన కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో వాస్తవమైంది? (2004 సివిల్స్) ఎ) హంటర్ కమిషన్ - లార్డ రిప్పన్ (1882) బి) సర్ థామస్ ర్యాలీ - 1904 కర్జన్ సి) శ్లాడర్ కమిటీ - లార్డ ఇర్విన్ (1926) డి) వార్టాగ్ కమిషన్ - 1917 చేమ్స్‌ఫర్‌డ 1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ సరైనవే సమాధానం: 2 వివరణ: 1882లో లార్డ రిప్పన్ ‘హంటర్’ కమిటీని నియమించారు. దీని ప్రకారం స్త్రీ విద్య, మత విషయాలతో సంబంధం లేని విద్య, నైతిక విద్య అవసరం అని పేర్కొన్నారు. 1904లో కర్జన్ థామస్ ర్యాలీ కమిటీని నియమించారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ సెనెట్లలో 20 మంది సభ్యులు, మిగతా ప్రాంతాల్లో 15 మంది ఉండాలని కమిటీ సూచించింది. శ్లాడర్ 1917లో ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలలో చేర్చాలని తీర్మానించాడు. 1927లో వార్టాగ్ కమిషన్‌ను లార్డ ఇర్విన్ నియమించాడు. 4. ‘1857 ఉడ్ డిస్పాచ్’ కమిటీ తీర్మానాల్లో లేని అంశం ఏది? 1) ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి 2) తెలివైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి 3) ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు వేరే శాఖలో ఉండాలి 4) విద్యావ్యాప్తి కోసం 50 లక్షల రూపాయలు కేటాయించాలి సమాధానం: 4 వివరణ: 1912 చట్టంలో రెండో హార్డింగ్ రాజ ప్రతినిధి విద్యకోసం, ఆధునిక విద్య ప్రోత్సాహానికి 50 లక్షల రూపాయలను కేటాయించారు. వైస్రాయ్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్హెన్రీ బట్లర్’ 1913 లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు.