One Day
-
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
ఇంగ్లండ్ దేశీవాళీ వన్డే కప్-2024లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాడ్లెట్ క్రికెట్ క్లబ్ వేదికగా మిడిలెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పృథ్వీ షా.. మిడిలెక్స్‌తో మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 58 బంతులు ఎదుర్కొన్న షా.. 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పృథ్వీతో పాటు గాస్ మిల్లర్(73), జైబ్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పృథ్వీ షా విషయానికి వస్తే.. దాదాపుగా మూడేళ్ల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యల కారణంగా భారత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశీవాళీ క్రికెట్లో కూడా తన మార్క్‌ను చూపించడంలో షా విఫలమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ తరపున షా 8 ఇన్నింగ్స్‌లలో 198 పరుగులు మాత్రమే చేశాడు. 10.5 | That's 50 for Prithvi Shaw! 👏The opener brings up his half-century off 33 balls.Steelbacks 75/2.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/JlIYPxjAjl— Northamptonshire Steelbacks (@NorthantsCCC) July 29, 2024 -
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అలహాబాద్ చరిత్ర ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్‌గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క రోజు రాజధాని మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్ కలిగిన లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్‌కు చేరింది. ఆ సమయంలో ఆయన అలహాబాద్‌లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్‌ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు. ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రలో నిలిచింది. పర్యాటక కేంద్రంగా.. ప్రయాగ్‌రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. చూడవలసిన ప్రదేశాలు మీరు ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? -
ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..
జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు.. ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది. ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి.. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా బంపర్ లిస్టింగ్ సాధించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్ఈసీ లిమిటెడ్ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది. -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు. ‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్‌కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు. -
దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు
దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోప్రా అర్చర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అర్చర్ నిలిచాడు. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్చర్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జోఫ్రా.. 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను అర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. 1993లో దక్షిణాఫ్రికాలో ప్రోటీస్‌తో జరిగిన ఓ వన్డేలో అక్రమ్ 16 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 30 ఏళ్ల అక్రమ్ రికార్డును అర్చర్ బ్రేక్ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్‌లోనే అర్చర్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అర్చర్‌కు వన్డేల్లో ఇదే కెరీర్ బెస్ట్ కూడా. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా.. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా అతడు నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ పేరిట ఉండేది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అర్చర్.. 12 ఏళ్ల వోక్స్ రికార్డు బ్రేక్ చేశాడు. చదవండి: IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ -
జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఘన విజయం..
18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన జింబాబ్వే ఓటమితో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. టౌన్స్ విల్లే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ మాధేవేరే 72 పరుగులతో రాణించడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ అయినా చేయగల్గింది. ఇక ఆసీస్ బౌలర్లలో యువ కామెరాన్ గ్రీన్ ఐదు వికెట్లతో చేలరేగగా.. జంపా మూడు, మార్ష్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్ 48 పరుగులతో(నాటౌట్)గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్ మూడు వికెట్లు పడగొట్టగా..రజా, నగర్వ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే ఇదే వేదికగా ఆగస్టు 31న జరగనుంది. చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్! -
ఒక్క రోజూ వేస్ట్ చేయను
ఎస్బీఎస్ నగర్ (పంజాబ్): ‘‘పంజాబ్ అభివృద్ధి కోసం ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతాం. ఒక్క రోజు కూడా వృథా చేయం. మనమిప్పటికే 70 ఏళ్లు ఆలస్యమయ్యాం. అవినీతి, నిరుద్యోగాలను రాష్ట్రం నుంచి పారదోలతాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ సింగ్ మాన్ (48) ప్రతిజ్ఞ చేశారు. పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. భగత్‌సింగ్ స్వగ్రామం కట్కర్‌కలాన్‌లో భారీ జన సందోహం సమక్షంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భగత్‌సింగ్‌కు అత్యంత ఇష్టమైన రంగ్ దే బసంతి పాట మారుమోగుతుండగా, జనం హర్షధ్వానాల మధ్య కార్యక్రమం జరిగింది. ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు భగత్‌సింగ్‌కు చిహ్నంగా భావించే పసుపురంగు తలపాగాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనం కూడా అవే తలపాగాలు ధరించి కన్పించారు. వారినుద్దేశించి మాన్ మాట్లాడారు. ముందుగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జో బోలే సో నిహాల్ అంటూ నినదించి జనాల్లో జోష్ నింపారు. వాళ్లు కూడా ఆయనతో ఉత్సాహంగా గొంతు కలిపారు. ఆప్‌కు బంపర్ మెజారిటీ కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మాన్ కొనియాడారు. ‘‘రాష్ట్రంలో స్కూళ్లు, ఆస్పత్రులను ఢిల్లీ తరహాలో మెరుగుపరుస్తాం. వాటిని చూసేందుకు విదేశాల నుంచి కూడా జనం వచ్చేలా చేస్తాం’’ అని చెప్పారు. అహంకారానికి తావివ్వొద్దని, వినయ విధేయతలతో మసలుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలకు సూచించారు. పంజాబ్ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన మాన్ కూతురు సీరత్ (21), దిల్షాన్ (17) ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాన్ దంపతులు 2015లో విడిపోయారు. అప్పటినుంచీ పిల్లలు తల్లితో పాటు అమెరికాలో ఉంటున్నారు. కమెడియన్ నుంచి సీఎం దాకా... ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్‌లోని సీఎం కార్యాలయంలో మాన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయనొక్కరే ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గం శనివారం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరిస్తుందని ఆప్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు, ఒడిశా సీఎంలు ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితరులు మాన్‌ను అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కలిసి పని చేద్దామని మాన్‌తో మోదీ చెప్పారు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన మాన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి రెండుసార్లు సంగ్రూర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2022 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు ఏకంగా 92 స్థానాల్లో ఆప్ ఘనవిజయం సాధించడం తెలిసిందే. -
మీరూ కావచ్చు.. ఒక్కరోజు బ్రిటిష్ హైకమిషనర్!
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ హైకమిషనర్‌గా పనిచేయాలని ఉందా?.. అయితే ఒక్క రోజు మాత్రమే. హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ఈ అవకాశం కలి్పస్తూ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీనికి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హులైన యువతులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు.. ‘యువజనం వాతావరణ మార్పుల్లాంటి సమస్యల పరిష్కారంలో ఏ రకంగా మెరుగైన మద్దతు ఇవ్వగలరు’అన్న అంశంపై నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రా మ్లో పోస్ట్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో@UKinIndiaMýకు ట్యాగ్ చేయడంతోపాటు # DayoftheGirl హ్యష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. సెప్టెంబర్ 28న విజేత వివరాలు వెల్లడి ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిక సాధికారతకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఇచ్చే ఛీవెనింగ్ ఫెలోషిప్‌లో 60 శాతం, స్కాలర్ షిప్‌ల్లో 52 శాతం మహిళలకు దక్కుతుండటం సంతోషదాయకం. ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ ద్వారా మహిళలు ఏదైనా సాధించగలరు అన్న అంశాన్ని చాటిచెప్పాలని నిర్ణయించాం’అని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ప్రకటనలో తెలిపారు. 2017 నుంచి బ్రిటిష్ హై కమిషన్ ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ను నిర్వహిస్తోందని, గత ఏడాది 18 ఏళ్ల చైతన్య వెంకటేశ్వరన్ దీనికి ఎంపికయ్యారని వివరించింది. దరఖాస్తుదారులందరి వివరాలను బ్రిటిష్ హైకమిషన్ నేతృత్వంలోని న్యాయనిర్ణేతలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తారని, సెప్టెంబర్ 28న విజేత వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తామని తెలిపారు. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం ఒక్కొక్కరు ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఆ వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను వీడియోలో ఉంచరాదని పేర్కొన్నారు. విజేత ఒక రోజుపాటు ఢిల్లీలో బ్రిటిష్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన రవాణా, వసతి ఖర్చులను కమిషన్ భరించదు. విజేత ఇతర ప్రాంతాల వారైతే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఢిల్లీకి రావడం, బస చేయడం పూర్తిగా వారి బాధ్యతేనని ఎల్లిస్ స్పష్టం చేశారు. చదవండి: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు -
ఉత్తరాఖండ్‌కు ఒక్కరోజు సీఎం
న్యూఢిల్లీ: జాతీయ బాలి కాది నోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. సీఎం హోదాలో హరిద్వార్‌కు చెందిన 20 ఏళ్ల గోస్వామి ఆదివారం అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకా లను సమీక్షించారు. దేశవ్యాప్తం గా జనవరి 24న జాతీయ బాలికాది నోత్సవం జరుపుకునే విషయం తెలిసిందే. బాలికాదినోత్సవం సందర్భంగా బాలికలకు ప్రధాని మోదీ శుభాకాం క్షలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు విద్య, వైద్యం అందించే దిశగా తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వివరించారు. బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలి కలందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు. మీ సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. -
ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ల పతకాల పంట
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–17 బాలుర 81 కేజీల విభాగంలో షేక్ లాల్ బషీర్ (విశాఖపట్నం) స్వర్ణం నెగ్గగా... జి. రవిశంకర్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం సాధించాడు. లాల్ బషీర్ (స్నాచ్‌లో 112+క్లీన్ అండ్ జెర్క్‌లో 142) మొత్తం 254 కేజీలు బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. రవిశంకర్ (స్నాచ్‌లో 106+క్లీన్ అండ్ జెర్క్‌లో 143) మొత్తం 249 కేజీలు బరువెత్తి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–21 బాలుర 89 కేజీల విభాగంలో ఆదిబోయిన శివరామకృష్ణ యాదవ్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం గెలిచాడు. శివరామకృష్ణ యాదవ్ (స్నాచ్‌లో 125+క్లీన్ అండ్ జెర్క్‌లో 150) మొత్తం 275 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ హల్వత్ కార్తీక్ మొత్తం 269 కేజీలు బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అండర్–17 బాలికల 76 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన చుక్కా శ్రీలక్ష్మి కాంస్య పత కాన్ని సొంతం చేసుకుంది. శ్రీలక్ష్మి మొత్తం 156 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. అండర్–21 బాలికల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో శ్రియ సాయి యనమండ్ర–గురజాడ శ్రీవిద్య (తెలంగాణ) జంట కాంస్యం సాధించింది. -
విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి
-
మహాకూటమి గెలిస్తే రోజుకో ప్రధాని
ఖాన్పూర్: దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిప్పులుచెరిగారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధాని మారతారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం బీజేపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహాకూటమి గెలిస్తే ప్రధానమంత్రిగా సోమవారం మాయావతి, మంగళవారం అఖిలేశ్ యాదవ్, బుధవారం మమతా బెనర్జీ, గురువారం శరత్ పవార్, శుక్రవారం దేవెగౌడ, శనివారం ఎంకే స్టాలిన్ ఉంటారని.. ఆదివారం ప్రధాని పదవికి సెలవిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని మహాకూటమిని డిమాండ్ చేశారు. బీజేపీలో నాలుగు ‘బీ’లు ఉన్నాయని.. ‘భడ్తా భారత్’, ‘బన్తా భారత్’అని అన్నారు. ఇక మహాకూటమిలో కూడా నాలుగు ‘బీ’లు ఉన్నాయని అవి బువా (ఆంటీ), భతీజా (అల్లుడు), భాయ్ (సోదరుడు), బెహెన్ (సోదరి) అని అన్నారు. -
వైజాగ్ వన్డేకు మాథ్యూస్ ఫిట్
విశాఖ స్పోర్ట్స్: శ్రీలంక జట్టుకు నిజంగానే ఇది ఊరటనిచ్చే వార్త. సీనియర్ ఆల్‌రౌండర్ మాథ్యూస్ నిర్ణాయక మూడో వన్డే కోసం ఫిట్‌గా ఉన్నాడు. ఆదివారం అతను బరిలోకి దిగుతాడని లంక టీమ్ మేనేజర్ అసంక గురుసిన్హా తెలిపారు. మొహాలిలో జరిగిన రెండో వన్డేలో మాథ్యూస్ అజేయ సెంచరీ సాధించాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ శుక్రవారం అతను ప్రాక్టీస్ సెషన్లో ఇబ్బంది లేకుండా పాల్గొన్నాడు. ‘మాథ్యూస్ కండరాల నొప్పి నుంచి కోలుకున్నాడు. నెట్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతనే కాదు... మా ఆటగాళ్లందరూ ఫిట్‌గానే ఉన్నారు’ అని గురుసిన్హా అన్నారు. ప్రాక్టీస్‌కు భారత్ ఆటగాళ్లు దూరం సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేకు ముందు శ్రీలంక ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేశారు. మరోవైపు భారత ఆటగాళ్లు శుక్రవారం ప్రాక్టీస్ చేయలేదు. పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ఆటగాళ్లెవరూ నెట్స్ వైపు కన్నెత్తి చూడలేదు. శనివారం మాత్రం ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతారని జట్టు వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం భారత ఆటగాళ్లను చూసేందుకు వైజాగ్ వాసులు స్టేడియానికి పోటెత్తారు. అయితే టీమిండియా ఆటగాళ్లెవరూ హోటల్ గదుల నుంచి ప్రాక్టీస్‌కు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో కాసేపు లంక ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తిలకించి నిష్క్రమించారు. ఆల్‌రౌండర్ మాథ్యూస్, కెప్టెన్ పెరీరా నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1–1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన చివరి వన్డే ఆదివారం ఉక్కునగరంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగనుంది. -
క్లీన్ స్వీప్ 'సిక్సర్'
శ్రీలంక గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కసారి కూడా శ్రీలంక ఏ జట్టు చేతిలోనూ క్లీన్‌స్వీప్ కాలేదు. ఇప్పుడు తొలిసారిగా కోహ్లి సేన ఆ జట్టును వైట్‌వాష్ చేసింది. మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇదివరకే కోల్పోయిన లంకకు ఇది వరుసగా రెండో దెబ్బ. ఏకపక్షంగా జరిగిన చివరి వన్డేలోనూ భారత్ చెలరేగింది. కోహ్లి రెండో శతకంతో రాణించగా... భువనేశ్వర్ కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లతో లంకను బెంబేలెత్తించాడు. ఓవరాల్‌గా ఐదు వన్డేల సిరీస్‌లను భారత జట్టు 5–0తో క్లీన్‌స్వీప్ చేయడం ఇది ఆరోసారి కావడం విశేషం. గతంలో భారత్ స్వదేశంలో 2008లో ఇంగ్లండ్‌పై, 2010లో న్యూజిలాండ్‌పై, 2011లో ఇంగ్లండ్‌పై, 2013లో జింబాబ్వేలో జింబాబ్వేపై, 2014లో స్వదేశం లో శ్రీలంకపై 5–0తో సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను ఆరోసారి క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ⇒ విరాట్ కోహ్లి 30వ శతకం ⇒ చివరి మ్యాచ్‌లోనూ శ్రీలంకపై భారీ విజయం కొలంబో: నాలుగు వన్డేల్లో ఇప్పటిదాకా జరిగినట్టుగానే చివరి వన్డేలోనూ అదే ఫలితం పునరావృతమైంది. భారత్ ఎప్పటిలాగే గెలిచింది... శ్రీలంక ఎప్పటిలాగే ఓడింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా కోహ్లి సేనకు పోటీ ఇస్తారని భావించినా అలాంటి సంచలనానికి లంక తావీయలేదు. ముందుగా భువనేశ్వర్ (5/42) పేస్ దెబ్బకు కకావికలమైన ఆతిథ్య జట్టు ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి (116 బంతుల్లో 110 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ శతకంతో కోలుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేదార్ జాదవ్ (73 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా శ్రీలంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తిరిమన్నె (67; 3 ఫోర్లు, 1 సిక్స్), మాథ్యూస్ (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించాడు. కెప్టెన్ ఉపుల్ తరంగ (34 బంతుల్లో 48; 9 ఫోర్లు) వేగంగా ఆడాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 239 పరుగులు చేసి నెగ్గింది. భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, రాహుల్, పాండ్యా, అక్షర్ స్థానంలో రహానే, కేదార్ జాదవ్, భువనేశ్వర్, చాహల్ ఆడారు. భువనేశ్వర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ ఈనెల 6న (బుధవారం) జరుగుతుంది. తిరిమన్నె, మాథ్యూస్ సెంచరీ భాగస్వామ్యం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఈసారి కూడా శుభారంభం అందలేదు. మూడో ఓవర్లోనే డిక్వెలా (2)ను భువనేశ్వర్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. కొద్దిసేపటికే మునవీర (4)ను కూడా భువీనే అవుట్ చేశాడు. మరోవైపు దూకుడు మీదున్న తరంగను బుమ్రా బోల్తా కొట్టించాడు. దీంతో జట్టు 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిరిమన్నె, మాథ్యూస్ అద్భుతంగా ఆడి నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో భువీ బౌలింగ్‌లో తిరిమన్నె అవుటవ్వడంతో లంక ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. చివర్లో భారత బౌలర్ల విజృంభణకు లంక 53 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. కోహ్లి వరుసగా రెండోసారి... తక్కువ స్కోరే అయినా భారత్ కూడా ప్రారంభంలో తడబడింది. సిరీస్‌లో తొలిసారిగా అవకాశం దక్కించుకున్న రహానే (5) విఫలమయ్యాడు. అటు వరుసగా రెండు సెంచరీలతో ఊపు మీదున్న రోహిత్ (16) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, మనీశ్ పాండే (53 బంతుల్లో 36; 2 ఫోర్లు) కుదురుగా ఆడి మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. పాండే అవుటయ్యాక వచ్చిన కేదార్ జాదవ్ మెరుగైన ఆటతీరును కనబరిచాడు. 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక కోహ్లి 107 బంతుల్లో కెరీర్లో 30వ సెంచరీని అందుకున్నాడు. విజయానికి మరో రెండు పరుగులు కావాల్సి ఉండగా జాదవ్ అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసి కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు. 1. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు (18 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి. 2. వన్డే క్రికెట్లో 100 స్టంపింగ్‌లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని. 3. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ సరసన కోహ్లి (30 సెంచరీలు). సచిన్ (49) అగ్రస్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు:- శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి అండ్ బి) భువనేశ్వర్ 2; తరంగ (సి) ధోని (బి) బుమ్రా 48; మునవీర (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 4; తిరిమన్నె (బి) భువనేశ్వర్ 67; మాథ్యూస్ (సి) ధోని (బి) కుల్దీప్ 55; సిరివర్దన (సి) శార్దుల్ (బి) భువనేశ్వర్ 18; హసరంగ (రనౌట్) 9; ధనంజయ (స్టంప్డ్) ధోని (బి) చాహల్ 4; పుష్పకుమార (బి) బుమ్రా 8; ఫెర్నాండో నాటౌట్ 7; మలింగ (సి) సబ్– రాహుల్ (బి) భువనేశ్వర్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 238. వికెట్ల పతనం: 1–14, 2–40, 3–63, 4–185, 5–194, 6–205, 7–212, 8–228, 9–228, 10–238. బౌలింగ్: భువనేశ్వర్ 9.4–0–42–5; శార్దుల్ 6–0–48–0; బుమ్రా 10–0–45–2; కుల్దీప్ 10–0–40–1; కేదార్ జాదవ్ 4–0–20–0; చాహల్ 10–0–36–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పుష్పకుమార (బి) ఫెర్నాండో 16; రహానే (సి) మునవీర (బి) మలింగ 5; కోహ్లి నాటౌట్ 110; పాండే (సి) తరంగ (బి) పుష్పకుమార 36; జాదవ్ (సి) డిక్వెలా (బి) హసరంగ 63; ధోని నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 239. వికెట్ల పతనం: 1–17, 2–29, 3–128, 4–237. బౌలింగ్: మలింగ 8–1–35–1; ఫెర్నాండో 7–0–40–1; ధనంజయ 10–0–49–0; మాథ్యూస్ 3–0–14–0; పుష్పకుమార 10–0–40–1; సిరివర్దన 4–0–28–0; హసరంగ 4.3–0–29–1. -
షమీ సూపర్ షో
⇒ నాలుగు వికెట్లు తీసిన పేసర్ ⇒ వెస్టిండీస్ 205/9 కింగ్స్టన్: గాయం కారణంగా రెండేళ్లు జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ (4/48) అదరగొట్టే ప్రదర్శనతో తన ఫామ్‌ను చాటుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న తను గత మ్యాచ్‌తోనే పునరాగమనం చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే గురువారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో మాత్రం చెలరేగి విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు. ఫలితంగా విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. షాయ్ హోప్ (98 బంతుల్లో 51; 5 ఫోర్లు), కైల్ హోప్ (50 బంతుల్లో 46; 9 ఫోర్లు), హోల్డర్ (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), పావెల్ (32 బంతుల్లో 31; 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్‌కు మూడు వికెట్లు దక్కాయి. చివర్లో తడబాటు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు లూయిస్ (9), కైల్ హోప్ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్‌ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్లో లూయిస్‌ను పాండ్యా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో విండీస్ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్ హోప్.. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ విండీస్‌కు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్ హోప్, చేజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్ (16)ను కేదార్ జాదర్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. ఈ దశలో షాయ్ హోప్, హోల్డర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్ హోప్‌తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్ వణికింది. హోల్డర్, షాయ్ హోప్ మధ్య ఐదో వికెట్‌కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది. స్కోరు వివరాలు:- విండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) కోహ్లి (బి) పాండ్యా 9; కైల్ హోప్ (సి) ధావన్ (బి) ఉమేశ్ యాదవ్ 46; షాయ్ హోప్ (సి) రహానే (బి) షమీ 51; చేజ్ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్ యాదవ్ 0; మొహమ్మద్ (సి అండ్ బి) కేదార్ జాదవ్ 16; హోల్డర్ (సి) ధావన్ (బి) షమీ 36; పావెల్ (సి) ధోని (బి) ఉమేశ్ 31; నర్స్ (సి) కుల్దీప్ (బి) షమీ 0; బిషూ (సి) ధోని (బి) షమీ 6; జోసెఫ్ నాటౌట్ 3; విలియమ్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–39, 2–76, 3–76, 4–115, 5–163, 6–168, 7–171, 8–182, 9–205. బౌలింగ్: షమీ 10–0–48–4; ఉమేశ్ యాదవ్ 10–1–53–3; పాండ్యా 6–0–27–1; జడేజా 10–1–27–0; కుల్దీప్ యాదవ్ 10–0–36–0; కేదార్ జాదవ్ 4–0–13–1. -
హైదరాబాద్‌లో నిరుద్యోగ జేఏసీ ఆందోళన
-
యూఎస్‌లో ఒక్కరోజు నలుగురు భారతీయులు హత్య
-
ఒక్క రోజు కాపురం చేసి.. పోస్టులో తలాక్!
యాకుత్‌పురా: రెండో వివాహం చేసుకొని ఒక్క రోజు కాపురం చేసి పోస్టుద్వారా విడాకులు పంపిన ఓ వ్యక్తిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రమేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్పల్లి ప్రకాశం పంతులునగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హనీఫ్ (38), బహదురున్నీసా (32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహదురున్నీసాకు పలుమార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. అయితే మగ పిల్లవాడు కావాలని నిర్ణయించుకున్న హనీఫ్ రెండో వివాహం చేసుకునేందుకు భార్య బహదురున్నీసాను ఒప్పించాడు. తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్ బేగంను రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే మొదటి భార్య నుంచి విడాకుల పత్రం లేకపోవడంతో ఖాజీ నిఖా చేసేందుకు నిరాకరించడంతో మరుసటి రోజు అందజేస్తామని చెప్పి గత నెల 9న మొఘల్‌పురాలోని కన్వీల్లా ఫంక్షన్ హాల్లో ఫర్హీన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెను కూకట్‌పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. పెళ్లి రోజు రాత్రి పర్హీన్‌తో గడిపిన హనీఫ్ ఉదయం వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫర్హీన్‌కు ఫోన్ చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని అప్పటి వరకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని సూచించాడు. అంతేగాకుండా ఈ నెల 18న పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. తాను పంపిన విడాకుల పత్రంలో పెళ్లి ఇష్టం లేదు... అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై బాధితురాలు ఫర్హీన్ బేగం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు, గురువారం రాత్రి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.