Padma Devender Reddy
-
ఈసారి రసవత్తవరంగా మెదక్ ఎన్నికలు
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 7 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014, 2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు. ధీమాగా బీఆర్ఎస్ నేతలు.. టికెట్ కోసం ఎదురుచూపులు! తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్కు మెదక్ కంచుకోటగా మారింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అనేది బీఆర్ఎస్ నేతల ధీమా. ఈ క్రమంలోనే సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పద్మ దేవేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు. విజయశాంతి, బట్టి జగపతి వంటి హేమాహేమీలను సైతం ఆమె ఓడించారు. మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలాకాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్‌లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈసారి ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రాజకీయ పార్టీల వారీగా టికెట్లు కోసం పోటీపడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ పద్మాదేవేందర్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పట్లోళ శశిధర్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) కంఠ తిరుపతిరెడ్డి(మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు) మ్యాడo బాలకృష్ణ(టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ) సుప్రభాత్ రావ్(టిపిసిసి సభ్యులు). బిజెపి తాళ్లపల్లి రాజశేఖర్(న్యాయవాది బిజెపి నాయకులు) గడ్డం శ్రీనివాస్(బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు) నందా రెడ్డి(బిజెపి నాయకులు మెదక్ ) చోళ రాంచరణ్ యాదవ్(బిజెపి నాయకులు మెదక్) నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: గత కొన్ని రోజులుగా రామాయంపేట ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.. అన్ని ప్రాంతాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం జరగలేదు. అన్ని ప్రాంతాలలో అన్ని మండలాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్. నిజాంపేట, నార్సింగీ నూతన మండల కేంద్రముల లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. బస్టాండ్ కూడా లేని పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదని ఈ ప్రాంత యువత భావిస్తున్నారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేటలో ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నూతన రోడ్లు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. రామయంపేట మున్సిపాలిటీలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల అభ్యర్థన. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బస్టాండ్, మరియు డిగ్రీ కళాశాల నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. ధరణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఒకరి భూమి మరొకరిపై పడిందని అట్టి సమస్యలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని ధరణి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళల రుణాలు మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఏం తినలేక పోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఇంటి ఖర్చులు వ్యయం పెరిగి ఇబ్బందుల పాలవుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని కొన్ని కంపెనీల వారు పిఎఫ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు అత్యంత ప్రభావితం చేసే రాజకీయ అంశాలు : మెదక్‌లో మెడికల్ కాలేజ్నిని మంజూరు చేపిస్థామని ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నిజాం షూగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తామని 9 సంవత్సరాలు అవుతున్న దానిని ఓపెన్ చేయించకపోవడం ముఖ్యంగా మెదక్‌కు రింగ్ రోడ్ లేదు.. 9 సంవత్సరాల పాలనలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి భౌగోళిక పరిస్థితులు: పర్యాటకం: కాకతీయులు పరిపాలించిన మెదక్ కిల ఉంది ఇక్కడే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ(CSI) చర్చి. నదులు: మంజీరా నది, వనదుర్గ ప్రాజెక్టు, పసుపులేరు వాగు. పోచారం అభయారణ్యం కొంత భాగం మెదక్ నియోజకవర్గంలో ఉంది. చిన్న శంకరంపేట రామయంపేట హవేలీ ఘనపూర్ మండలాలు అడవులు విస్తరించి ఉన్నాయి. ఆలయాలు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ csi చర్చి అత్యంత పర్యాటక ప్రాంతాలు.. -
పద్మక్క డాన్స్ అదరగొట్టింది
-
సొంత గూటిలోనే కుంపటి.. హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు ఈసారి కష్టమే!
వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లని గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. మరి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సీటు గురించి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు నాలుగోసారి సీటు కష్టమేనా? ఇంతకీ మెదక్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్నదెవరు? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ క్యాడర్‌ను పెంచుకుంటున్న మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి తాను పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఇన్ని రోజులు తనకు పెద్దగా పోటీ ఇచ్చేవారు ఎవరూ లేరనుకున్న పద్మా దేవేందర్ రెడ్డికి మైనంపల్లి రోహిత్ రాక తలనొప్పిగా మారింది. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్ నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మైనంపల్లి తనయుడు రోహిత్. సీఎం కేసీఆర్‌తో మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించినా.. మెదక్ సీటుపై ఎక్కడో తేడా కొడుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్లో రోహిత్ ఎంట్రీతో జోష్ పెరిగింది. నియోజకవర్గంలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే రామాయంపేట అభివృద్ధి చెందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని గిరిజన తండాలలో మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయం లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా పద్మా దేవేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కేడర్‌లోనూ.. ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకతను తనకు సానుకూలంగా మార్చుకునేందుకు మైనంపల్లి రోహిత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలే లక్షంగా నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించి, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద యువతుల వివాహానికి పుస్తెలు, కాలి మట్టెలు అందిస్తున్నారు. నిరుపేదలు మృతి చెందితే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. నిజాంపేట మండలంలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రామాయంపేట మండలం, చిన్నశంకరంపేట మండలాల్లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి గులాబీ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ కొనసాగుతున్నారు. మూడు సార్లు గెలిచి, డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వరిస్తుందని ఆశించినా నెరవేరలేదు. టిక్కెట్ ఆశించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న తమ నాయకురాలు పద్మా దేవేందర్ వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఖాయమని ఆమె వర్గీయులు చెబుతున్నారు. -
టీఆర్ఎస్ నుంచి మురళీయాదవ్ సస్పెన్షన్
మెదక్ మున్సిపాలిటీ: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ ఇప్పటికే ఆయన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి, ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిందని గుర్తు చేశారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..
సాక్షి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనకాల నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి వాహంలోనే ఉన్నారు. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి హాజరు కావడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. చదవండి: రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం -
లాక్డౌన్: దండంపెట్టి చెబుతున్నా..!
సాక్షి, రామాయంపేట(మెదక్) : దండంపెట్టి చెపుతున్నా... ఎవరూ దయచేసి బయట తిరగకండని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానికంగా బాలాజీ ఫంక్షన్‌హాలులో గురువారం మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. భయంకరమైన కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్షి్మతో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆమె వెంట ఎంపీపీ భిక్షపతి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పుట్టి యాదగిరి, సరాపు యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, సుందర్‌సింగ్, దేమె యాదగిరి పాల్గొన్నారు. (కరోనా వైరస్ ; నటుడిపై దాడి ) వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం నిజాంపేట(మెదక్): ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని గురువారం నిజాంపేటలో నిత్యావసర సరుకులు పంపీణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తన స్నేహితుల ఆర్థిక సహాయంతో మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆటో కార్మికులకు, పారిశుధ్య కారి్మకులకు నిత్యావసర సరుకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుందని, దీన్ని నిర్మూలించాలంటే ప్రతీ ఒక్కరు ఇంటిలో ఉంటూ బయటకు రాకుండా ఉండడమే సరైన మార్గమని తెలిపారు. (మంచి వార్త తెలిసింది : ట్రంప్ ) కొనుగోలు కేంద్రాన్ని సది్వనియోగం చేసుకోండి పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందన్నారు. (కరోనా: మరో 5 పాజిటివ్‌లు) విరాళాల వెల్లువ రామాయంపేట(మెదక్): లాక్డౌన్ దరిమిలా పేదలను ఆదుకోవడానికి వ్యాపారులు, ఎన్ఆర్ఐ ముందుకువచ్చారు. ఇందులో భాగంగా గురువారం రామాయంపేటకు వచి్చన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్రెడ్డికి 1987 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి పూర్వ విద్యార్థులు రూ. 30 వేల నగదును అందజేశారు. వీరితోపాటు కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఐ రవీందర్‌రెడ్డి రూ. రెండు లక్షలు, వ్యాపారులు మంచికట్ల శ్రీనివాస్ రూ.లక్ష, పల్లెర్ల అశోక్ రూ. 75 వేలు, మురికి రవీందర్ రూ. 71వేలు, పుట్నాల రాములు రూ. 50వేలు, సరాపు శిల్ప ప్రవీణ్, తోటరాజు, కొత్త శ్రీనివాస్, మద్దెల రమేశ్ రూ. 25 వేల చొప్పున సీబీఆర్ రూ. 15వేలు, మెట్టు యాదగిరి రూ. 12 వేలు, బట్టల వర్తక సంఘం ప్రతినిధులు, వెంకటేశ్వర్రావు, మాసులరామరాజు, అభిరుచి హోటల్, గజం యాదగిరి, మాసుల రామరాజు, సహాయం అందజేశారు. విరాళాలు అందజేసినవారిని ఎమ్మెల్యే ప్రశంసించారు. (కరీంనగర్లో కరోనా కేసులు ఇలా...) -
నేనున్నా.. ఆదుకుంటా
సాక్షి, రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించి నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నాలుగు పురిళ్లు దగ్ధంకాగా, నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు, ఇతర వస్తువులు మంటలకు ఆహుతై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పూర్తివివరాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులను ఆదుకుంటామని, పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె నాలుగు కుటుంబాలకు సరిపడే దుప్పట్లు, వంట సామగ్రి, దుస్తులు, కూరగాయాలు, ఇతర నిత్యావసర సరుకులు, బకెట్లు, ఇతర సామగ్రిని ప్రత్యేకంగా ఆటోలో తెప్పించి వారికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని దయాలక్ష్మి స్వామి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ ఆత్మకమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, సహకార సంఘం చైర్మన్ బాజ చంద్రం, కౌన్సిలర్ నాగరాజు, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, మెదక్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శేఖర్‌రెడ్డి, సర్పంచులు సుభాశ్రాథోడ్, మైలారం శ్యాములు పాల్గొన్నారు. -
మీకు కడుపు నిండా భోజనం పెడతాం: మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్ : మంత్రి చొరవ తీసుకొని రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను సోమవారం పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి ముందుగా నేను రావాలని అనుకోలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ వాటాదారులు. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ తప్పింది. అందుకు కారణం మీరే. మంత్రివర్గ సమావేశంలో మీకు శుభవార్త తీసుకు వస్తా.. ఈ మేరకు సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. మీకు కడుపునిండా భోజనం పెడతాం’ అని పేర్కొన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పగా.. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. సమిష్టిగా సేవ చేస్తున్న రేషన్ డీలర్ల కష్టానికి తగిన ఫలం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 7000 వేలు రేషన్ డీలర్లు సేవ చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. -
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, మెదక్: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వితంతవులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. అంగన్వాడీల ద్వారా మాత, శిశువులకు పోషక ఆహారాన్ని ఇస్తున్నామని తెలిపారు. రేపటి భావిభారత పౌరుల నిర్మాణానికి పోషకాహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంగారెడ్డి: ఆందోల్, జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోల్ మండలానికి చెందిన 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. -
విషయం తెలియక వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదని వచి్చన వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ వీడ్కోలు సమావేశానికి రావాల్సిందిగా నాకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ వచి్చంది. అయితే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయాల్సిన ఫోన్ నాకు పొరపాటున వచి్చనట్లుగా తర్వాత గుర్తించారు. ఆ విషయం తెలియక నేను ప్రగతిభవన్‌కు వెళ్లాను. మంత్రు లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం ఉండటంతో.. అదే సమయంలో వచి్చన మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ లోనికి వెళ్లి ఉంటారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఏమీలేదు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు’ అని ఆమె అన్నారు. -
రేక్ పాయింట్ వచ్చేనా?
సాక్షి, రామాయంపేట: రైతన్నలకు మరింతగా ఎరువులను అందుబాటులోకి తీసుకురావడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా తొమ్మిది రేక్‌పాయింట్ల ఏర్పాటుకై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు కోసం రెండేళ్లక్రితమే ఆ శాఖ స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో ముఖ్య కూడలిలో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటుచేస్తే అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది. ఇక్కడి రేక్ పాయింట్‌ను అర్థాంతరంగా ఎత్తివేశారు. ఇక్కడ రేక్‌పాయింట్ కొనసాగిన సమయంలో ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎరువుల సరఫరా జరిగిందని, స్టేషన్‌లోని షెడ్డులో ఎరువుల స్టాక్ దించి జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేశారని అధికారులు తెలిపారు. గతంలో నిర్మించిన పెద్ద షెడ్డు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సరఫరాకు గాను ప్రస్తుతం ఉన్న తొమ్మిది రేక్ పాయింట్లతోపాటు మరో అదనంగా మరో తొమ్మిదింటిని ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు గతంలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేశారు. జిల్లాలోని అక్కన్నపేటతోపాటు బీబీనగర్, మహబూబాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, ఉప్పల్, కొత్తగూడెం, వికారాబాద్, బాసరలో రేక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖవారు ప్రతిపాదనలు పంపారు. రేక్‌పాయింట్ ఏర్పాటైతే... అక్కన్నపేటస్టేషన్‌లో రేక్‌పాయింట్ ఏర్పాటైతే రైళ్లలో నేరుగా పరిశ్రమల నుంచి స్టేషన్‌కు ఎరువుల బస్తాలు వస్తాయి. దీంతో ఇక్కడ స్టాక్‌పెట్టి జిల్లాపరిధిలో అవసరమైన పట్టణాలకు, గ్రామాలకు సరఫరా చేస్తారు. సకాలంలో రైతులకు ఎరువులు అందడంతోపాటు ఖర్చు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్కన్నపేట స్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేస్తే ఈప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని, తద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖవారు పలుమార్లు శిథిలమైన గోదాంను పరిశీలించారు. నాలుగైదు నెలల్లో రేక్‌పాయింట్ ఏర్పాటుకై ఆదేశాలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం సుముఖత అక్కన్నపేట రైల్వేస్టేషన్‌వద్ద రేక్ పాయింట్ ఏర్పాటుకోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ఉన్నతాధికారులకు విన్నవించాం. ఈ మేరకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ స్టేషన్నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, సమీపంలో ఉన్న జిల్లాలకు ఎరువులు, సిమెంట్, తదితర సామగ్రి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్ రేక్‌పాయింట్ ఏర్పాటు చేయాలి జిల్లా వ్యాప్తంగా అన్నివిధాలుగా అందుబాటులో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలి. గతంలో ఇక్కడ రేక్ పాయింట్ ఉండేది. ఈ మేరకు పెద్ద షెడ్డుకూడా సిద్ధంగా ఉంది. అవసరమైతే అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తాం. ఇది ఏర్పాటుచేస్తే రైతులకు ఎంతోమేలుగా ఉంటుంది. వ్యవసాయరంగానికే కాకుండా వ్యాపారానికి సంబంధించి ఉత్పత్తులు సరఫరా చేసుకోవచ్చు. – ముస్కుల స్రవంతి, వైస్‌ఎంపీపీ, రామాయంపేట -
రైతుబీమాతో కుటుంబాలకు ధీమా
సాక్షి, మెదక్: రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. జిల్లాలోని వేలాది మంది రైతులకు మేలు జరుగనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది మరికొందరు కొత్తగా ఈ బీమాపథకంలో చేరే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ప్రమాదవశాత్తు లేక ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల తరఫున ఎల్ఐసీకీ బీమా ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని తక్షణం అందించేలా ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. రైతు కుటుంబంలో భరోసా పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియం పెరిగిన ప్రభుత్వం పథకం అమలును కొనసాగిస్తుంది. గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ కాలపరిమితికి ప్రీమియం రూపంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3457 చొప్పున ప్రీమియం చెల్లిస్తోంది. భూములు కలిగిన వారికి ఈ నెల 14 నుంచి 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఇది నిరంతర పక్రియగా కొనసాగనుంది. 615 మంది రైతు కుటుంబాలకు పరిహారం జిల్లాలో మొత్తం 2.20 లక్షల మంది రైతులు ఉండగా వారిలో బీమా పథకానికి అర్హులైన వారు 1.8 లక్షల మందిరైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో 675 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారిలో 615 మంది రైతులకు రూ.30.7 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 60 మంది రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. యువరైతుల నమోదు ఇలా... రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల లోపు ఉండాలి. 18 ఏళ్లు నిండిన యువరైతుల పేర్లు నమోదు చేస్తారు. వీరు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి రైతుపట్టాపాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు ఆధార్ కార్డు ఇస్తే సంబంధిత అధికారులు రైతుబీమాలో నమోదు చేసుకోవాలి.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం ఒక్క ఏడాదితో ఆగేదికాదు గతేడాది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడు సైతం దాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఇది నిరంతర పక్రియగా కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ -
ప్రజాధనం వృథా చేయొద్దు
సాక్షి, మెదక్: ప్రభుత్వ సొమ్మును నాశనం చేస్తున్నారు. నాణ్యత లోపం పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. రూ.200 కోట్లతో జరుగుతున్న రైల్వేలైన్ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్ వద్ద నిర్మిస్తున్న ప్లాట్‌ఫాం నాణ్యతా లోపంతో నిర్మించడంతో పూర్తిగా కుంగిపోయింది. ఫ్లాట్‌ఫాం రెండు ముక్కలుగా పగిలిపోవడాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. ఇంత దారుణంగా నిర్మాణం జరుగుతున్నా అధికారుల కంటికి కనిపించడం లేదా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పనులు జరుగుతుంటే అధికారులకు కనిపించడం లేదా? ఏం చేస్తున్నరంటూ మండిపడ్డారు. అరకిలో మీటర్ మేర వేసిన ప్లాట్‌ఫాం పూర్తిగా దెబ్బతిన్నదని, దాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఖర్చు కాంట్రాక్టరే భరించాలన్నారు. ఈ విషయంపై రైల్వే ఇంజనీర్ ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడుతూ నాణ్యతలేని పనులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే విధంగా రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లోపల అన్ని పగుళ్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం ఇప్పుడే పగుళ్లుంటే ఎన్నిరోజులుంటుందని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలన్నారు. మంగళవారం ఎంపీ ఆధ్వర్యంలో రైల్వే అధికారులతో రివ్యూ నిర్వహిస్తానని, అధికారులంతా హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీవైస్‌చైర్మన్ లావణ్యరెడ్డి, ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ రవికుమార్, ఎంపీపీ యమున, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఆర్కెశ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి, కృష్ణ, తొడుపునూరి శివరామకృష్ణ, గూడూరి అరవింద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే -
కాళేశ్వరం నిర్వాసితులను ఆదుకుంటాం
సాక్షి,మెదక్: కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శంకరంపేట కాలువకోసం భూములు అందించిన మడూర్ గ్రామ రైతులకు 26 ఎకరాలకు రూ.1కోటి94 లక్షలను 94 మంది రైతులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. కాళేశ్వరం కాలువ కోసం భూములను అందిస్తున్న రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకరంపేట కాలువ ద్వారా మండలంలోని 18 వేల ఎకరాల భూములకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. దీంతో రైతుల భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. కరువును పారదోలి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నార్సింగి మండలంలోని శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్ గ్రామాల కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రె కృపావతి, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, నూతన జెడ్పీటీసీ పట్లోరి మాధవి, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు మల్లేశం, షరీఫ్ పాల్గొన్నారు. -
మా ఆయన బంగారం: పద్మా దేవేందర్ రెడ్డి
సాక్షి, మెదక్ : అమ్మే ధైర్యం.. ఆమె ఆశీర్వాదమే నా బలం అని అంటున్నారు అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి. అమ్మకు తోడుగా మా వారి అండతోనే ఈ స్థాయికి చేరా.. ఆయనే నా రాజకీయ గురువు.. వారి ప్రోద్బలంతోనే తెలంగాణ ఉద్యమం, ప్రత్యక్ష రాజకీయాల్లో నాదైన ముద్ర వేసుకున్నా.. అని గర్వంగా చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య రాజకీయాల్లో తలమునకలైన ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపి గుర్తులు, ఇష్టమైన వంటకాలు, స్నేహితులు, బంధువులతో అనుబంధాన్ని పంచుకున్నారు. పుట్టినిల్లయినా.. అత్తారిల్లయినా.. మా ఇళ్లే ఒక బృందావనం అని అంటున్న పద్మాదేవేందర్‌రెడ్డి ‘పర్సనల్ టైం’ ఆమె మాటల్లోనే.. పుట్టినింట్లో ప్రెండ్లీగా ఉండేటోళ్లం. అత్తారింటికి వచ్చాక పద్ధతులు మారాయి. అక్కడైనా, ఇక్కడైనా క్రమశిక్షణతో ఉండడం అలవర్చుకున్నా. ఏ ఇల్లు అయినా ఒక బృందావనమే. చిన్న కోడలు కావడంతో అత్తవారింట్లోకి ఒకింత భయంతో అడుగుపెట్టినా.. మా ఆయన బంగారం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఆ ఉత్తరం తీపి జ్ఞాపకం మాది కరీంనగర్ జిల్లా నామాపూర్ గ్రామం. అమ్మ విజయ, నాన్న భూమిరెడ్డి. మేం ముగ్గురు సంతానం. నేనే పెద్ద కూతురిని. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆదిలాబాద్ జిల్లా తోటపల్లి జెడ్పీహెచ్ఎస్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటి వద్ద అమ్మ ఒక్కతే మా ఆలనాపాలనా చూసేది. నాన్న సెలవు రోజుల్లో వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకుని.. మళ్లీ డ్యూటీకి వెళ్లేవారు. దీంతో అమ్మతోనే ఎక్కువ అనుబంధం ఉండేది. అమ్మ నాతో స్నేహితురాలిగా మెలిగేది. అమ్మ ఆశీర్వాద బలంతోనే తెలంగాణ ఉద్యమంలోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. నాన్న దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో మొదటిసారి నాన్నకు ఉత్తరం రాయించింది. నేను అప్పుడు మూడో తరగతి చదువుతున్నాను. అది ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకం. విద్యాభ్యాసం సొంతూరు కరీంనగర్ జిల్లా నామాపూర్‌లో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించా. ఎనిమిది నుంచి డిగ్రీవరకు కరీంనగర్లో చదువుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజీలో న్యాయ విద్యనభ్యసించా. స్నేహబంధం కంటిన్యూ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్నేహబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ, మంగ, అరుణ ఇంకొందరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. పెళ్లి అయినప్పటికీ స్నేహితుల ఇళ్లలో జరిగే ఏ కార్యక్రమాలకైనా హాజరయ్యేదాణ్ని. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కొంత తగ్గినప్పటికీ.. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ఇంట్లో అందరం స్నేహితులం కలుస్తాం. నేను వెళ్లినా.. వెళ్లకున్నా.. ఈ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతుండడం సంతోషంగా ఉంది. గ్రామాలే విడిది కేంద్రాలు చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాం. కోడి కూతతో తెల్లవారడం.. పాడి పశువులు ఇంటిబాట పట్టినప్పుడు పొద్దుగూకడం వంటి వాతావరణంలో పెరిగినం. చిన్నప్పుడైనా కావొచ్చు.. ఇప్పుడైనా కావొచ్చు విలేజీ వాతావరణంలోనే ఉండాలని అనిపిస్తుంది. మేము, మా కుటుంబ సభ్యులం ప్రత్యేకంగా ఎలాంటి టూర్లకు వెళ్లం. చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం ఉంటే అమ్మమ్మ, నానమ్మ వాళ్లింటికి వెళ్లేటోళ్లం. ఇప్పడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. మాకు గ్రామాలే విడిది కేంద్రాలు. ప్రస్తుతం పల్లెలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నప్పటికీ.. పల్లె వాతావరణమే మాకు ఇష్టం. చెంపదెబ్బలు ఫన్నీ నేను ఐదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా సార్ చొక్కారావు.. ‘బృహలేశ్వరాలయం’ అని పలకాలని విద్యార్థులకు చెప్పారు. ఎవరు కూడా ఆ పేరు పలకలేకపోయారు. నేను మాత్రమే చెప్పడంతో సార్ నన్నెంతో మెచ్చుకుని, తోటి విద్యార్థులకు చెంపదెబ్బలు వేయించారు. నేను మెల్లిగా కొడితే దగ్గరుండి మరీ గట్టిగా వేయించారు. ఈ సంఘటన నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. పునీత్.. హ్యాపీ మూమెంట్ నా కొడుకు పునీత్‌రెడ్డి పుట్టడం జీవితంలో మరచిపోలేను. అది ఇప్పటికి, ఎప్పటికీ నాకు హ్యాపీ మూమెంట్. డిప్యూటీ స్పీకర్ అయ్యే వరకు నేనే స్వయంగా వంట చేసే దాణ్ని. నేను వంట చేస్తేనే నా కొడుకు పునీత్ తినేటోడు. ఇప్పటికీ అప్పుడప్పుడు నా కొడుకు కోసం వంట చేస్తా. కూరగాయలతో భోజనం ఇష్టమైనప్పటికీ.. నాన్‌వెజ్ వంటకాలు బాగా చేస్తా. గోళీలాట, చిర్రగోనె ఇష్టం రాజకీయ రంగంలోకి రాకముందు ఖాళీ సమయాల్లో సినిమాలు చూసేదాణ్ని. దోస్త్‌లతో కలిసి షాపింగ్ అంటే ఇష్టముండేది. ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే టీవీ చూస్తున్నా. పుస్తకాలు, నవలలు చదువుతా. చిన్నప్పుడు గోళీలాట, చిర్రగోనె ఆడడం ఇష్టం. రాజకీయాల్లోకి రాక ముందు దినపత్రికలు చదివేదాణ్ని కాదు. ఇప్పుడు ప్రతి పేపరు తప్పకుండా చదువుతా టీచర్. న్యాయవాది కావాలనుకున్నా.. చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలని కోరిక. నాన్న టీచర్ కాబట్టి చిన్నçప్పుడు నాకు టీచర్కావాలనే కోరిక ఉండేది. పెళ్లి అయిన తర్వాత మా ఆయనను చూసి న్యాయవాది కావాలనుకున్నా. లా చదివినప్పటికీ ఆ తర్వాత వృత్తిని చేపట్టలేదు. ఆ తర్వాత తల్లి ధైర్యం, భర్త ప్రోత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నా. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. మా ఆయన బంగారం మా ఆయన దేవేందర్‌రెడ్డి బంగారం. మా మధ్య చిన్న తగవు కూడా లేదు. దేవేందర్‌రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, రాజకీయ రంగంలో నా భర్త ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఉద్యమ సమయంలో జైలుకెళ్లడం వంటి ఘటనలతో నా పుట్టింటి వారు, అత్తింటి వారు కొంత ఆందోళనకు గురయ్యారు. మా ఆయన పూర్తిగా సహకారం అందించడంతో తెలంగాణ సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించా. అనంతరం మా ఆయన ప్రోద్బలంతో 2001లో జెడ్పీటీసీగా గెలిచా. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయ్యా. అప్పుడు నాకు ఎలా చేయాలి.. ఏం చేయాలి వంటి విషయాలు పెద్దగా తెలవదు. నా భర్త సహకారంతో అన్నీ తెలుసుకున్నా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2004లో రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో మూడు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యా. కూతురుగా అభివర్ణించడం మరిచిపోలేను తెలంగాణ ఏ విధంగా అన్యాయానికి గురైంది వంటి అంశాలను పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకున్నా. ప్రధానంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ స్పీచ్ నన్ను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్.. నన్ను కూతురుగా అభివర్ణించడం, అలానే చూసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో సంతోషాన్నిచ్చిన సంఘటన అది. విద్యతోనే మహిళా సాధికారత ఆడ, మగ పిల్లలనే తేడా చూపొద్దు. నేటి సమాజంలో ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి. అదే నా మొదటి ఆకాంక్ష. మహిళల ఆర్థిక స్వాలంబన, మహిళా సాధికారత రావాలంటే విద్యే మూలం అని నా నమ్మకం. మహిళలను పురుషులతో సమానంగా చదివించాలి. ప్రొఫైల్ పేరు : పద్మాదేవేందర్‌రెడ్డి పుట్టిన తేదీ : 1969 జనవరి 6 పుట్టిన ఊరు : నామాపూర్ (కరీంనగర్) అత్త గారి ఊరు : కోనాపూర్ (మెదక్) వివాహం : 1988 చదువు : ఎల్ఎల్బీ కుటుంబం తల్లి : విజయ తండ్రి : భూమిరెడ్డి సోదరుడు : వంశీధర్‌రెడ్డి చెల్లెలు : అనిత సంతానం : పునీత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం : 2001–04 : జెడ్పీటీసీ (రామాయంపేట), టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ 2009–14 : మెదక్ ఎమ్మెల్యే 2014–18 : మెదక్ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 2018 డిసెంబర్ నుంచి : మెదక్ ఎమ్మెల్యే -
‘ఆయన గాలిలో కొట్టుకుపోవడం ఖాయం’
దుబ్బాక: తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కేసులు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిపైనే ఉన్నాయని టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హరీష్ రావు, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. రోజుకొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణా ప్రజలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్చూచిగా తెలంగాణా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు వేసి ఢిల్లీ చుట్టూ తిరుగుడు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్ర నిథులు ముక్కు పిండి రాబట్టవచ్చునని అన్నారు. వచ్చే నెల 3న నర్సాపూర్‌లో కేసీఆర్ సభ ఉందని, అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాలిలో కొట్టుకుపోవడం ఖాయం: పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాస్యమాడారు. దుబ్బాకలో చెల్లని రూపాయి అయిన రఘునందన్ రావు మెదక్‌లో చెల్లడం సాధ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి పుట్టగతులు లేవని, 16 ఎంపీ సీట్లు గెలిచినట్లయితే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కీలకమవుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. -
బోనమెత్తిన ఎమ్మెల్యే
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బోనమెత్తారు. బుధవారం రాత్రి శ్రీసోమేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి సమర్పించారు. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
జిల్లాకు మొండిచేయి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. కొత్తగా 9 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్వపు మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు వరుసగా ఆరో పర్యాయం విజయం సాధించడంతో పాటు, ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చిన శాసనసభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏ ఒక్క శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గజ్వేల్ నుంచి వరుసగా రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హోం శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు రెండు నెలల తర్వాత తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మంగళవారం ముహూర్తం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో తొమ్మిది మంది శాసనసభ్యులకు మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉద్యమనేతగా, నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. పిన్న వయసులోనే వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డుతో పాటు, ఏకంగా లక్షా ఇరువై వేల మెజారిటీతో విజయం సాధించిన ఘనత హరీశ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకు ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కుతుందని భావించినా, తాజా విస్తరణలో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. మరో ఇద్దరు నేతలకు నిరాశ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ, అసెంబ్లీకి నాలుగో పర్యాయం ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. మరో ఉద్యమ నేత, అసెంబ్లీకి మూడో పర్యాయం ఎన్నికైన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, హరీశ్‌తో సహా ఇతర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో హరీశ్‌కు చోటు కల్పించిన విషయాన్ని ఆయన అనుచరులు ప్రస్తావిస్తున్నారు. 70వ దశకం తర్వాత ఇదే తొలిసారి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1970వ దశకం నుంచి ఏర్పాటైన ప్రతీ మంత్రిమండలిలోనూ జిల్లాకు చెందిన శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 1970వ దశకంలో పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లా నుంచి మదన్ మోహన్ ప్రాతినిధ్యం వహించారు. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలోనూ మదన్‌మోహన్‌తో పాటు బాగారెడ్డికి మంత్రి పదవి దక్కింది. టి.అంజయ్య జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనూ మదన్మోహన్కు మంత్రి పదవి దక్కింది. 1983, 85లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరణం రామచంద్రరావు, 1989లో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గాల్లో గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం పి.రామచంద్రారెడ్డి కూడా కోట్ల మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. 1994 నాటి ఎన్టీఆర్ కేబినెట్లో కరణం రామచంద్రరావు, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో కరణం, ముత్యంరెడ్డి, బాబూమోహన్ పనిచేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ అటు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లోనూ కొంతకాలం మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో గీతారెడ్డి, ఫరిదుద్దీన్, దామోదర రాజనర్సింహ, సునీత లక్ష్మారెడ్డి మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
హ్యాపీ క్రిస్మస్
మెదక్ జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఏసీ సాలమాన్‌రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆ«రాధనలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్ దైవ సందేశం వినిపించారు. మానవుల పాపాలను కడిగేసేందుకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రారాజు ఏసయ్య అన్నారు. అనంతరం ప్రెస్బిటరీ ఇన్చార్జి ఆండ్రోస్ ప్రేమ్ సుకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వమంతా నిండి ఉన్న దేవుడు ఏసయ్య అని కొనియాడారు. భక్తులు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రముఖులు... స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డిలు చర్చ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏసుక్రీస్తు బోధించిన పరలోక మార్గం సూత్రాలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ: క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సుమారు 10 వేల లీటర్ల పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండల్‌రెడ్డి, సతీష్‌కుమార్, గంగాధర్, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి భారతీ సిమెంట్ మెదక్ డీలర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పద్మ వికాసం!
మెతుకుసీమగా పేరొందిన మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి ఇక్కడ గెలుపుపై గురిపెట్టారు. కూటమిలో లుకలుకలు, టీజేఎస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన ఆమెకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. మహిళా ఎమ్మెల్యేగా ఆమెకు కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం. ఇక తాను చేపట్టిన పనులు, టీఆర్ఎస్కున్న బలమైన కేడర్, ప్రత్యర్థుల బలహీనతలే తన బలంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా నియోకజవర్గం పరిధిలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. మరోసారి తనను గెలిపిస్తే మెదక్ రూపురేఖలు మారుస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సీటు ముందే ఖరారు కావడంతో ఆమె రెండు నెలల ముందునుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి ఎవరనే విషయంలో కొంత స్పష్టత లోపించింది. మొదట ఈ స్థానాన్ని మహా కూటమి తరపున టీజేఎస్‌కు కేటాయించారు. టీజేఎస్ తరపున చిన్నశంకరం పేటకు చెందిన జనార్దన్‌రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాపన్నపేటకు చెందిన ఉపేందర్‌రెడ్డికి కూడా బీ ఫాం ఇచ్చింది. దీంతో ఆయన కూడా నామినేషవేశారు. సిట్టింగ్ ప్రొఫైల్ రామాయంపేట మండలం కోనాపూర్‌కు చెందిన మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. బీఏ ఎల్ఎల్బీ చదివిన ఆమె 2001లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2001 నుంచి 2004 వరకు రామాయంపేట జెడ్పీటీసీగా పనిచేశారు. 2004లో మొదటి సారిగా రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడారు. 2009లో మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి తిరిగి ఓటమి చవిచూశారు. 2014లో విజయశాంతిపై పోటీచేసి 39,600 మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ తొలి శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. Segment Graph ప్రత్యేకతలు - పంచాయతీరాజ్ ద్వారా రూ.156 కోట్లతో రహదారుల నిర్మాణం - మెదక్ పట్టణానికి రూ.880 కోట్లతో రింగ్‌రోడ్డు - రూ.38 కోట్లతో సమీకృత కలెక్టరేట్, రూ.18 కోట్లతో పోలీసు కార్యాలయం భవనాలు నిర్మాణం - రైతుల కోసం మండలానికి ఒక గోదాము నిర్మించారు. - మెదక్ పట్టణంలో 300 పడకల ఆసుపత్రి - వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. - మెదక్ పట్టణంలో మినీట్యాంక్‌బండ్, బ్యూటిఫికేషన్ - రైతు బంధు ద్వారా 59,835 మందికి లబ్ది చేకూరింది. - సీఎంఆర్ఎఫ్ ద్వారా 2329 మంది సహాయం. ప్రధాన సమస్యలు - వ్యవసాయ ప్రధానమైన మెదక్‌లో సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. - చెరుకు రైతులకు ఉపయోగపడే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపించాల్సి ఉంది. - ఘనపురం ప్రాజెక్టు పనులు పెండింగ్. - పీజీ, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యా సంస్థలు లేవు. యువత ఉపాధి సమస్య ఎదుర్కొంటోంది. .:: ఇన్పుట్స్: నాగరాజు కాకోళ్ల, మెదక్ -
మిలియన్ మామ్స్ ర్యాలీ ప్రారంభించిన ఆకాశ్ పూరీ
శంషాబాద్: నిత్యం కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే అమ్మలందరూ ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నొవాటెల్ హోటల్ వద్ద మిలియన్ మామ్స్ కార్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అమ్మ బాగుంటేనే కుటుంబంలోని సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై చైతన్యపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీ విజయవంతం కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఆకాంక్షించారు. సమయం, వేగం, గమ్యం ఆధారితంగా నిర్వహించే ఈ ర్యాలీలో మొత్తం 75 మంది మహిళలు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులైన షాదాన్ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇందులోంచి ఇద్దరిని విజేతలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నొవాటెల్ నుంచి కాళీమందిర్ సమీపంలోని షాదాన్ కాలేజీ వరకు ఉంటుందన్నారు. మొత్తం మిలియన్ మంది మహిళలను చైతన్యం చేసే విధ ంగా కార్యక్రమాలను రూపొందించినట్లు డాక్టర్ మనిపవిత్ర తెలిపారు. విజేతలను సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు, నటుడు ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్లకు బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష
-
‘అలాంటిది ఏదైనా ఉంటే గుండు కొట్టించుకుంటా’
లక్డీకాపుల్ : వచ్చే నెల(జూలై) 5వ తేదీ వరకు రేషన్ డీలర్లకు రావాల్సిన బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్డీకాపుల్‌లో శుక్రవారం జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతూ... సమ్మె నోటీసులు ఇచ్చిన చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించారని, కానీ రాష్ట్రంలో డీలర్ల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఒకవేళ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే కేసీఆర్‌కు లారీలతో పాలాభిషేకం చేస్తామని తెలిపారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ల అసోసియేషన్ తమకు మద్దతుగా ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది డీలర్లు తమతో పాటు సమ్మెలో పాల్గొనేందుకు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు శాంతియుతంగా దీక్ష చేశామని, ఇకపై జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓఆర్ కట్టకుండా సహకరించిన ప్రతీ ఒక్క డీలర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కడుపు కాలినా పట్టించుకోరా.. రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్స్ సప్లై విభాగంలో అవార్డులు రావడానికి కారణం మేము కాదా అంటూ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటువంటి డీలర్లను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడం దారుణమన్నారు. కడుపు కాలి బాధను వెళ్లగక్కుతూ సమ్మె చేసినా తమను ప్రభుత్వం పట్టించుకోలేవడం లేదని ఆరోపించారు. నకిలీ వేలి ముద్రలు, బ్లాక్ మార్కెట్‌తో డీలర్లకు ఎటువంటి సంబంధం లేదన్న రాజు.. అలాంటిది ఏమైనా ఉందని తేలితే గుండు కొట్టించుకుంటానంటూ వ్యాఖ్యానించారు. 35 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామని.. 2015 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పోరాటం చేస్తామన్నారు. డీలర్లను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సరుకులు సరఫరా చేసేందుకు మహిళ సంఘాలు 80శాతం వరకు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాలు తమకు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. డీలర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ముఖం చూసైనా తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. ఈ విషయంలో ఆమె చెప్పినట్లుగా నడుచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
అంత్యక్రియల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్
దుబ్బాక: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మేనమామ దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొత్త గాలిరెడ్డి(71) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించాడు. బుధవారం ఉదయం జరిగిన గాలిరెడ్డి అంత్యక్రియల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి పాల్గొన్నారు. గాలిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తలచారు. గాలిరెడ్డి గంభీర్పూర్ గ్రామ పంచాయతీకి 15 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.