Panjagutta police station
-
పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: ప్రజాభవన్ రోడ్డు ప్రమాద కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడు(ఏ11). బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను దుర్గారావే తప్పించినట్లు అభియోగం నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దుర్గారావును సస్పెండ్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే.. విచారణకు హాజరు కాకుండా ఆయన పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా.. గుంతకల్లు రైల్వే పోలీసుల సాయంతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహె, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్‌ను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్‌గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్‌కుమార్‌కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం
-
HYD: పంజాగుట్ట పీఎస్ మొత్తం సిబ్బందిపై వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మొదలు.. హోంగార్డ్ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. వివాదాల పోలీస్‌స్టేషన్‌గా పేరు పడ్డ పంజాగుట్టను రిపేర్ చేయలేమని భావించిన పోలీస్ శాఖ మొత్తానికి మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట స్టేషన్లో హోంగార్డు నుంచి ఇన్స్పెక్టర్ దాకా ఎన్నో వివాదాలు ఉన్నాయి. పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది. -
ప్రీ వెడ్డింగ్ షూట్ కు పోలీస్ వాహనాన్ని వాడుకున్న మహిళా ఎస్సె
-
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
పెరుగు అడిగితే చంపేశారు!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: బిర్యానీ తింటూ అదనంగా రైతా(పెరుగు) అడిగిన పాపానికి రెస్టారెంట్ సిబ్బంది ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు వచ్చినా వారి ముందు కూడా కొట్టడం.. పోలీస్‌స్టేషన్‌లో ఊపిరి ఆడటం లేదని చెప్పినా పోలీసులు సైతం పట్టించుకోకుండా చివరి నిమిషంలో ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని మెరీడియన్ రెస్టారెంట్లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మినరల్ వాటర్ వ్యాపారం చేసే పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ లియాకత్ (32) ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో తన స్నేహితులైన తొమ్మిది మందితో కలిసి పంజగుట్ట కూడలిలో ఉన్న మెరీడియన్ రెస్టారెంట్‌కు వచ్చారు. బిర్యానీ తింటున్న సమయంలో లియాకత్ రైతా అదనంగా కావాలని వెయిటర్‌ను కోరారు. రెండు సార్లు అడిగినా వెయిటర్ నుంచి నిర్లక్ష్యపు సమాధానం, పరుషపదజాలం రావడంతో లియాకత్‌కు, అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడి: దీంతో మరో ఇద్దరు వెయిటర్లు, రెస్టారెంట్ మేనేజర్, సూపర్వైజర్ వచ్చి విచక్షణారహితంగా లియాకత్‌తో పాటు అతడి స్నేహితులపై దాడికి దిగారు. ఇంతలో ఓ రెస్టారెంట్ ఉద్యోగి సమాచారంకో అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసుస్టేషన్ గస్తీ సిబ్బంది ఎదుటే రెస్టారెంట్ సిబ్బంది, నిర్వాహకులు లియాకత్ తదితరులపై దాడి కొనసాగించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తూ రెస్టారెంట్‌పై అంతస్తు నుంచి కింది వరకు తీసుకువచ్చారని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వీరి దెబ్బలు తాళలేకపోయిన లియాకత్ ఆయాసంతో అక్కడే కూలబడిపోయాడు. దీంతో పోలీసులు అతడితో పాటు స్నేహితులు మహ్మద్ జమీర్, మహ్మద్ నాసర్, మహ్మద్ ముస్తఫాను ఠాణాకు తీసుకువచ్చారు. ఠాణాకు తీసుకువచ్చినా నిర్లక్ష్యం... అప్పటికే లియాకత్ తనకు తీవ్రంగా ఆయాసం వస్తోందని, ఊపిరి అందట్లేదని చెప్తున్నా డ్యూటీలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పట్టించుకోలేదని అంటున్నారు. ‘నాటకాలు ఆడుతున్నావా..?’ అంటూ అతడినే గద్దించారు. కొద్దిసేపటికి లియాకత్ అక్కడే కుప్పకూలిపోవడంతో కారు తాళాలు ఇచ్చి స్నేహితులతోనే సోమాజీగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్ళడంతో... అప్పటికే లియాకత్ చనిపోయినట్టు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఆస్పత్రి వద్దకు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ పంజగుట్ట పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయించారని సమాచారం. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. హత్య కేసు నమోదు... లియాకత్ స్నేహితుడు, బండ్లగూడకు చెందిన హస్ర చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెయిటర్లు బీహార్ వాస్తవ్యుడు, అమీర్‌పేట హాస్టల్లో ఉండే కృష్ణ సూర్య ప్రకాష్ (33), అమీర్‌పేట బాపూ నగర్‌కు చెందిన మెగావత్ పాండు (36), సరూర్‌నగర్‌కు చెందిన మేనేజర్ సయ్యద్ హఫ్తాబ్ హైదర్ (55), జగద్గిరిగుట్టకు చెందిన సూపర్వైజర్ అబ్దుల్ మోయిన్(40), సనత్‌నగర్‌కు చెందిన సూపర్వైజర్ మహ్మద్ అజీజుద్దీన్ (23)పై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. -
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?: వైఎస్ విజయమ్మ
సాకక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ విజయమ్మను ఇంటివద్దే అడ్డుకున్న పోలీసులు కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమ్మను ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మరొకవైపు వైఎస్ షర్మిలను ఎస్ఆర్నగర్ పీఎస్‌లోనే ఉంచడంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా? పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు. ‘ కుమార్తెను చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటారా?, షర్మిల చేసిన నేరమేంటి?, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?, పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా?, ప్రజల కోసం నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు. ప్రజా సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోంది. షర్మిల వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తా’ అని విజయమ్మ మీడియాకు తెలిపారు. ఎస్ఆర్నగర్ పీఎస్‌కు బ్రదర్ అనిల్ షర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు. కాగా, నిన్న(సోమవారం) టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతి కష్టం మీద కారు డోర్లు తెరిచి షర్మిలను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లారు. మరోవైపు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్‌కు షర్మిల అనుచరులు, వైఎస్సార్టీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భవనం పైకి ఎక్కి వి వాంట్ జస్టిస్ అంటూ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిలా తయారైందన్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. చదవండి: హైదరాబాద్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత -
Telangana: టీ కాంగ్రెస్ నేతలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. అనుమతులు లేకుండా గురువారం చలో రాజ్‌భవన్ నిర్వహించినందుకు పోలీసులు రంగంలోకి దిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా పది మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావుతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతల పేర్లను చేర్చారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారని, అనుమతి లేకుండా రాజ్‌భవన్ ముట్టడికి వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పదమూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. జన జీవనానికి ఇబ్బంది కలిగించడమే కాకుండా .. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ప్రస్తావించారు పోలీసులు. -
ఎస్సైతో దురుసు ప్రవర్తన!.. రేణుకా చౌదరిపై కేసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్‌భవన్ సందర్భంగా.. పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్ పట్టుకున్నారు ఆమె. దీంతో ఎస్ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. చలో రాజ్‌భవన్‌లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది. ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్‌కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు. #WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE — ANI (@ANI) June 16, 2022 -
పంజాగుట్ట: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం -
టాలీవుడ్ క్లబ్‌పై దాడులు.. అర్ధనగ్న నృత్యాలు, వికృత చేష్టలు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టాలీవుడ్ క్లబ్ పబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లో శుక్రవారం అర్థరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ క్లబ్ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడవడమే కాక.. సమయం దాటిన తరువాత కూడా యువతి యువకులు పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అర్ధనగ్న నృత్యాలు, డీజే స్టెప్పులతో రచ్చ చేశారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి, నోటీసులు జారీ చేశారు. అయినప్పటికి పబ్ యాజమాన్యం తన తీరు మార్చుకోవడం లేదు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది -
Hyderabad: రెండు కేజీల బంగారు నగల బ్యాగు మిస్సింగ్
హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున్న బంగారం అదృశ్యమైన కేసు నమోదు అయ్యింది. ముంబై నుంచి తీసుకొస్తున్న రెండు కేజీల బంగారు నగల బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ముంబై బోరివాలి(ముంబై) నుంచి ఆభరణాలు ఉన్న బ్యాగుతో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అమీర్‌పేట్ వచ్చేసరికి మెలుకువ రావడంతో చూడగా.. బ్యాగ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని ముంబైలోని నగలవ్యాపారికి తెలియజేశారు. అతను సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించగా.. కేసును పంజగుట్ట పోలీసులకు బదలాయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కే నాగయ్య.. బృందాలుగా విడిపోయిన పోలీసులు బోరివాలి-హైదరాబాద్ మధ్య సీసీటీవీఫుటేజీల ఆధారంగా కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. -
Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా మీద అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో తన ఫోన్ నంబర్‌ను వాడుకున్నారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండానే వకీల్ సాబ్‌లో ఓ చోట తన ఫోన్ నంబర్‌ను స్క్రీన్ మీద చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనివల్ల ఎంతో మంది తరచూ ఫోన్లు చేస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపాడు. కొందరైతే నోటికొచ్చినట్లు తిడుతున్నారని వాపోయాడు. ఇప్పటికే ఈ విషయంపై బాధితుడి తరపు లాయర్ వకీల్ సాబ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపాడు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది. కాగా 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని వకీల్‌సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్'కు రీమేక్‌గా తెరకెక్కిందీ చిత్రం. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. చదవండి: ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ -
రాజు నన్ను వేధించాడు: ముమైత్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బిల్లు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న డ్రైవర్‌పై నటి ముమైత్ ఖాన్ గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నా మీద వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు.12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. నాకు క్యాబ్ డ్రైవర్ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ కి 23500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. డ్రైవర్ రాజు నన్ను వేధించాడు. ఫ్లయిట్స్‌లో పెట్స్‌ను అనుమతించకపోవడంతో క్యాబ్‌లో వెళ్లాను.’ అన్నారు ముమైత్. (చదవండి: థియేటర్లో తొలి సినిమా కరోనా వైరస్: ఆర్జీవీ) ఇక తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. -
నిర్మాత అశోక్‌రెడ్డి లొంగుబాటు
-
మరో ట్విస్ట్: 36 మంది అత్యాచారం వాస్తవం
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన మిర్యాలగూడకు చెందిన యువతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసి పోలీసుల శాఖను ముప్పుతిప్పలు పెట్టి.. రెండు రోజులకే మాట మార్చింది. ఆ తరువాత తనపై ఎవరూ అత్యాచారానికి పాల్పడలేదని రాజశేఖర్‌రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పేర్కొని కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం మరో ప్రకటన చేసింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని, 36 మంది మాత్రమే అత్యాచారం చేశారని పేర్కొంది. మొత్తం 53 మంది తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తెలిపింది. డాలర్ బాయ్ తనను చిత్రహింసలకు గురిచేశాడని, తన బలవంతం మేరకే సెలబ్రిటీల పేర్లు చెప్పాల్సి వచ్చిందని వివరించింది. (ఎన్జీఓ డాలర్ భాయ్ ప్రధాన నిందితుడు!) తొలుత డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం వెళ్లానని, అప్పటి నుంచి తన గురించి తెల్సుకుని ఈ విధంగా వాడుకున్నాడని తెలిపింది. డాలర్ బాయ్ తన మీద అనేక రకాలుగా చిత్రహింసలకు పాల్పడ్డాడని, 36 మంది అత్యాచారం చేయడం మాత్రం వాస్తవమని స్పష్టం చేసింది. అతనితో తనకు ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్ భాయ్‌పై సీసీఎస్ మహిళా ఠాణాలో ఇదివరకే ఓ కేసు నమోదై ఉంది. ఇటీవల జరిగిన ఫోన్ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది. అయితే అప్పుడు ఆమె చెప్పిన వివరాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. (డాలర్ బాయ్ వ్యవహారంలో సంచలన విషయాలు) -
రేప్ కేసు: అతడే ప్రధాన నిందితుడు!
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు బాధితురాలికి ‘అండగా’ ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ప్రధాన నిందితుడిగా మారనున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. న్యాయస్థానంలోనూ స్టేట్మెంట్ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదకొండేళ్ళుగా 143 మంది తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో కొందరు ప్రముఖులు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సుకత రేపిన ఈ కేసు దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళ ఠాణా ఏసీపీ శ్రీదేవిని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తుండగానే సోమవారం బాధితురాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు కొత్త ట్విస్ట్‌కు కారణమయ్యాయి. సోమాజిగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ, తనకు సాయం చేస్తున్నట్లు నటించిన రాజశేఖర్‌రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అతగాడు చెప్పిన పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచానంటూ వెల్లడించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఈ కేసులో డాలర్ భాయ్‌ని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. బాధితురాలి నుంచి గతంలో ఓసారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే అప్పుడు ఆమె చెప్పిన వివరాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఈ కేసు నిందితుల జాబితాలో మార్పు చేయనున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆమెతో న్యాయస్థానంలోనూ 164 స్టేట్మెంట్ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్ భాయ్‌పై సీసీఎస్ మహిళా ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఇటీవల జరిగిన ఫోన్ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది. -
143 మంది అత్యాచారం కేసు : 42 పేజీల ఎఫ్ఐఆర్!
-
143 మంది అత్యాచారం చేశారు
పంజగుట్ట: రాష్ట్ర పోలీసు చరిత్రలో అత్యంత అరుదైన కేసు రికార్డులకు ఎక్కింది. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, దేశంలోనే రెండో బెస్ట్ ఠాణా రికార్డుల్ని సొంతం చేసుకున్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గురువారం నమోదైన ఈ కేసు వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ సోమాజిగూడలో నివసిస్తున్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 42 పేజీలతో ఇది జారీ కావడం గమనార్హం. ఇందులో యువతి పేర్కొన్న ప్రకారం.. 138 మంది ప్రముఖు లు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు రిజిస్టర్ చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన బాధితురాలికి (25) 2009లోనే వివాహమైంది. ఆమె మైనర్‌గా ఉండగానే మిర్యాలగూడకు చెందిన కె.రమేశ్‌తో పెళ్లి జరిగింది. ఆమె భర్త, ఆడపడుచు, అత్త, మామ, సోదరులతో పాటు వారి బంధువులు దాదాపు 20 మంది శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని బాధితురాలు 9 నెలల తర్వాత తన తల్లికి చెప్పింది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్న యువతి పుట్టింటికి చేరుకుని తన చదువు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఈమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించాడు. ఇతనితోపాటు గడిచిన 11 ఏళ్లలో అనేక మంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 5 వేల సార్లు అత్యాచారం.. ఇప్పటివరకు 5 వేల సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు తెలిపింది. వీరిలో 138 మంది పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచిన బాధితురాలు గుర్తుతెలియని మరో ఐదుగురు ఉన్నట్లు వెల్లడించింది. వీళ్లంతా తన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని భయపెట్టేవారని, బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసుల వద్ద వాపోయింది. తాము చెప్పినట్లు వినకపోతే గన్‌తో కాల్చేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని కొందరు బెదిరించేవారని, తనతో కూడా బలవంతంగా మద్యం తాగించేవారని, కొన్ని సందర్భాల్లో తాను గర్భవతిని అయ్యానని, ఆ దుండగులే బలవంతంగా గర్భం తీయించారని తెలిపింది. దళితురాలినైన తనను కులం పేరుతో దూషించేవారని, వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుని మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బాధలు భరించలేకపోయిన తాను గాడ్ పవర్ ఫౌండేషన్ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారిలో కొందరు తనపై హత్యాయత్నం చేశారని, ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. బాధితురాలు ఫిర్యాదు అందించేందుకు బురఖా ధరించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన పంజగుట్ట అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేశారు. -
31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. -
పంజగుట్ట ఠాణా ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ గేటు ముందే అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. చెన్నైకి చెందిన సానం లోకేశ్వరికి (37) అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌తో 2000లో పెళ్లి జరిగింది. కూతురికి 8 నెలల వయసు ఉన్నప్పుడే భార్యాభర్తలు విడిపోయారు. 2012లో లోకేశ్వరికి వారాసిగూడకు చెందిన ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు. 2013లో లోకేశ్వరిని ప్రవీణ్ నగరానికి తీసుకువచ్చి బీఎస్ మక్తాలో ఓ గదిలో ఉంచి సహజీవనం చేశాడు. ఇద్దరూ కలిసి సోమాజిగూడలోని బాబూఖాన్ ఎస్టేట్‌లో బీఎస్పీ జువెలర్స్ పేరుతో ఓ నగల దుకాణం తెరిచారు. లోకేశ్వరి దుకాణం నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసింది. 2014లో లోకేశ్వరిపై ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లోకేశ్వరిని అరెస్టు చేసిన పోలీసులు.. 23 తులాల ఆభరణాలను రీకవరీ చేశారు. 2014 డిసెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చిన లోకేశ్వరి తిరిగి చెన్నై వెళ్లిపోయింది. కాగా, గత శుక్రవారం తన స్నేహితుడు కన్నన్‌తో కలిసి లోకేశ్వరి హైదరాబాద్‌కు వచ్చింది. ప్రవీణ్ తనను మోసం చేసి రూ.కోటి తీసుకున్నాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు లోకేశ్వరి తెలిపినట్లు సమాచారం. ప్రమాదంలో లోకేశ్వరి శరీరం 70 శాతం మేర కాలిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పంజాగుట్ట పీఎస్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయ ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. లోకేశ్వరి(45) అనే మహిళ మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రవీణ్ అనే వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. వెంటనే స్పందించిన కానిస్టేబుళ్లు మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. లోకేశ్వరి శరీరం తీవ్రంగా కాలిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఘటనా స్థలానికి పంజాగుట్ట ఏసీపీ చేరుకున్నారు. -
యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్!
సాక్షి, హైదరాబాద్ : వెన్నునొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి శరీరంలో బుల్లెట్ బయటపడటం నిమ్స్ ఆస్పత్రిలో కలకలం రేపింది. వివరాలు.. ఫలక్‌నుమా జహ్నుమా ప్రాంతంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె(18) స్థానికంగా కుట్టుమిషన్ పనిచేస్తోంది. 3 నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆమె నిమ్స్‌లో చేరింది. వైద్యులు ఎక్స్‌రేతోపాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వెన్నుపూస, ఉదర కోశం భాగంలో గాయమున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సదరు యువతికి శస్త్రచికిత్స నిర్వహించగా బుల్లెట్ బయటపడింది. దీంతో కంగుతిన్న వైద్యులు బుల్లెట్ ఎక్కడ నుంచి వచ్చిందని యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు తెలియదని సమాధానం ఇచ్చారు. యువతి శరీరంలో బుల్లెట్ రెండు, మూడేళ్ల క్రితం నుంచి ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. దీనిపై నిమ్స్ ఉన్నతాధికారులు పంజగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో వీరు ఎక్కడ నివాసం ఉన్నారు..? ఆ ప్రాంతంలో ఏదైనా ఫైరింగ్ పాయింట్ ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
సస్పెండ్ చేశారని.. హోంగార్డు హల్చల్
పంజగుట్ట: అకారణంగా తనను విధుల్లోనుంచి సస్పెండ్ చేశారని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడతానని ఓ హోంగార్డ్ హల్చల్ చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నార్సింగ్‌కు చెందిన యాదీలాల్ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతను మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 7న ఫిర్యాదు దారులతో సరిగ్గా ప్రవర్తించనందున అతడిని హోంగార్డ్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. గురువారం అతడిని పిలిచిన హెడ్ క్వార్టర్స్ అధికారులు నిన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అందినందున, డ్యూటీకి రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఉత్తర్వులను అందించారు. దీంతో నేరుగా పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యాదీలాల్ ఆత్మహత్య చేసుకుంటానని హల్ చేశాడు. హంగామాచేశాడు. ఈ సందర్భంగా యాదీలాల్ మాట్లాడుతూ అకారణంగా తనను సస్పెండ్ చేశారని, తాను సరిగా విధులు నిర్వహించడం లేదని, ఫిర్యాదు దారులతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపిస్తున్న అధికారులు అందుకు ఆధారాలు చూపాలని కోరాడు. మే 5న పోలీస్‌స్టేషన్ బ్యారెక్‌లో కొందరు హోంగార్డులు గొడవపడ్డారని, అందుకు తనను బాధ్యుడిని చేస్తూ చర్య తీసుకోవడం దారుణమని ఆరోపించాడు. తనను విధుల్లోంచి తొలగిస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదనవ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేదని భీష్మించుకున్నాడు. ఆరోపణలు అవాస్తవం.. హోంగార్డు యాదీలాల్ ఆరోపణలు అవాస్తవమని పంజగుట్ట ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. అతడి ప్రవర్తన సరిగా లేనందున పలుమార్లు హెచ్చరించామని, అయినా వైఖరిలో మార్పు రాకపోవడంతో మే 7న హోంగార్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు అతడిని అటాచ్ చేసినట్లు తెలిపాడు. యాదీలాల్సస్పెన్షన్ విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్