Pattabhi
-
టీడీపీ పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై కారుమూరి ఫైర్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి. రాజకీయాల కోసం టీడీపీ నేతలు దిగజారిపోయారి ఎద్దేవా చేశారు. తన పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటున్నామని ప్రశ్నించారు. కాగా, కారుమూరి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం మాట్లాడటం లేదు. ఇలాంటి నీచ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు?. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో చెప్పాలి. మా ప్రభుత్వ పాలనలో మేం చేశామో మేం చెబుతాం. మీ నైతిక పొత్తుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదు. పట్టాభి, అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టించడం చంద్రబాబు అలవాటే. నోరు అదుపులో పెట్టుకొండి.. మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను. ఒళ్లు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొండి. మీ మాదిరిగా మేము మాట్లాడితే, ఒక్కరోజు కూడా మీరుండ లేరు. మాకు సంస్కారం ఉంది. అదే మాకు మా నాయకుడు నేర్పారు. మేము రాజకీయాల్లో ఫెయిర్‌గా ఉన్నాం. ఓడినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉన్నాం. అఖండ మెజారిటీతో గెల్చాం. మళ్లీ 2024లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కచ్చితంగా మళ్లీ ఘన విజయం సాధిస్తాం. ప్రజలే బుద్ధి చెబుతారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విలువలు, విశ్వసనీయత, ప్రజలను నమ్ముకున్నారు. మీ మాదిరిగా పొత్తులు, అనైతిక రాజకీయాలు చేయబోం. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా, ఎన్ని బూతులు తిట్టించినా మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. మళ్లీ మా విజయాన్ని ఆపలేరు. అంతేకానీ, ఈ తరహాలో విమర్శలు, మీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటే, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. పాలిటిక్స్‌లో క్లియర్‌గా ఉండండి. ఓపెన్‌గా రండి అంటూ సవాల్ విసిరారు. -
పట్టాభి ఎందుకు రెచ్చిపోయారు?.. టీడీపీలో ఏం జరిగింది.. ఏం జరుగుతోంది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘బీసీలు అంటే వెన్నెముక. వెనుకబడిన వర్గాల వారు కాదు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఆ వర్గాలను అదే స్థాయిలో చూస్తున్నారు. పదవుల అంశంలో అంతే ప్రాధాన్యమిస్తున్నారు. బీసీలకు మంచి చేయడంలో వైఎస్సార్ సీపీ అధినేతకు యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆదరణ లభిస్తోంది. ‘మరి మన పార్టీలో ఏం జరిగింది. ఇప్పుడేం జరుగుతోంది. బీసీలు అన్నింటినీ బేరీజు వేసుకుంటున్నారు. మాటలతో మనం ఇంకెంత కాలం మభ్యపెట్టగలం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఆ పార్టీకి చెందిన సీనియర్లు వాపోయారు. గన్నవరంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ వర్గాల ముఖ్యనేతల అంతర్గత చర్చల్లో వచ్చిన అంశాలు అధినేత చెవికి చేరాయి. దీనిపై తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తక్షణ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ‘గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తగుదునమ్మా అంటూ నేను వస్తున్నా. నేనే పోటీచేస్తా అంటూ పట్టాభిరాం అక్కడకు ఎలా వెళతారు. అర్జునుడు బీసీ వర్గానికి చెందినందునే అంత ధీమాగా, బహిరంగంగా ఆయన చాలెంజ్ చేయగలిగారు. అదే పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు అక్కడ ఇంచార్జిగా ఉన్నట్లయితే ఆ మాట అనగలిగే వారా? సామాజికవర్గం అండ చూసుకునే రెచ్చిపోయారు. మీ దన్ను అంతలా ఉండబట్టే పట్టాభి ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది పార్టీలో మెజార్టీ అభిప్రాయం’ అని టీడీపీ సీనియర్లు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారనేది సమాచారం. ‘క్యాడర్, క్యారక్టర్ ఏవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతులు మాట్లాడిన వారికి పదవులు ఇచ్చేస్తారనేది ముఖ్య శ్రేణులు భావిస్తున్నాయి. మంగళగిరి, గన్నవరం పార్టీ ఆఫీసులపై దాడులు ఎవరివల్ల జరిగాయి? ఎందువల్ల జరిగాయో మీరే విశ్లేషించుకోండి’ అని పార్టీ నాయకులు అనడంతో బాబు ఆలోచనల్లో పడ్డారని తెలిసింది. అయినా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర బీసీ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. గన్నవరంలో పార్టీకి ఏదైనా సమస్య ఉందని భావిస్తే అర్జునుడు తీవ్ర అస్వస్థతో ఉన్నందున కొనకళ్ల, కొల్లు, లేదా బచ్చుల కుమారుడు, మరెవరినైనా సీనియర్లను అక్కడకు పంపి ఉండవచ్చు. కానీ పట్టాభిని పంపి రెచ్చగొట్టించడాన్ని బట్టి బీసీలంటే మీకు చిన్నచూపు ఉందనే భావన ప్రజల్లోకి, పార్టీ క్యాడర్‌లోకి బాగా వెళ్లిపోయిందని వివరించడంతో బాబు కంగుతిన్నారని సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. బీసీల గురించి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఎంతమేరకు ఉందనేది బేరీజు వేసుకుంటున్నారని కూడా అన్నారనేది సమాచారం. మాటలు చెపితే సరిపోదు... ‘ఎమ్మెల్సీల్లో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతపై మా వెనుకబడిన వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. అంతకుముందు కూడా వివిధ పదవుల్లో దక్కిన ప్రాధాన్యతను ఇప్పటికే గుర్తించారు. ఇక నుంచి మీకు మేమంత చేశాం.. ఇంత చేసేశాం.. అని టీడీపీ చెపితే వినే దశలో బీసీ వర్గాలు లేవు. అన్నీ విశ్లేషించుకుంటున్నాయి. గణాంకాలతో సహా ముఖ్యులకే పాఠాలు అప్పజెపుతాయి’ అని విజయవాడకు చెందిన బీసీ ముఖ్య నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు. గన్నవర్గానికి కో– ఆర్డినేటర్ కమిటీ చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం కమిటీని నియమించారు. కమిటీ కో–ఆర్డినేటర్‌గా కొనకళ్ల నారాయణ, సభ్యులుగా బచ్చుల అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురికి చోటు కల్పించారు. సీఐ కనకారావుపై చేసిన దాడిని పోలీసువర్గాలు తీవ్రంగా భావిస్తున్నాయని. టీడీపీ అల్లరిమూకలు ఇంతలా బరితెగిస్తాయని అనుకోలేదని వారంటున్నారని చంద్రబాబు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సంఘటన జరిగినప్పుడు గాయం తీవ్రత బాగా తెలిసిందని, ఏడు కుట్లు పడ్డాయని వివరించారు. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? -
Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
సాక్షి, అమరావతి: తనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరని, అతన్ని ఆ పీఠంపై తిరిగి కూర్చోబెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ‘ఈనాడు’ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపింది. ఒక్కో రోజు ఒక్కో కట్టు కథతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటికి మొన్న టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా.. కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేసింది. ప్రజలు గుర్తించి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోయడంతో తప్పు ఒప్పుకుంటూనే.. తిరిగి అవే తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ తాజాగా మరో కథనాన్ని వండివార్చింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేయాలనే దుర్బుద్ధి కనిపిస్తోంది. గత ప్రభుత్వం పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వకుండా బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంధకారంలోకి నెట్టిన విషయాన్ని ఏ రోజూ మాట మాత్రంగానైనా రామోజీ ప్రశ్నించ లేదు. ఈ ప్రభుత్వం వరుసగా రాయితీలు విడుదల చేస్తున్నా, తప్పుడు రాతలతో విషం కక్కడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే. కోవిడ్ సమయంలో పరిశ్రమలు భారీగా ఆదాయం నష్టపోయినా, రీస్టార్ట్ ప్యాకేజీతో ఈ ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుందన్న పచ్చి నిజాన్ని దాచడం దుర్మార్గం కాదా? భారీ సంక్షోభాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం న్యాయమా? ఆరోపణ: రాయితీలు ఇవ్వలేదు వాస్తవం: గత ప్రభుత్వం రూ.3,409 కోట్ల రాయితీలను పరిశ్రమలకు బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి సకాలంలో రాయితీలను విడుదల చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.46 కోట్లు, 2020–21లో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.993.30 కోట్ల రాయితీలను విడుదల చేయడం ద్వారా కోవిడ్ సంక్షోభంలో 8,000 ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంలో 2021–22లో రూ.666.86 కోట్ల రాయితీలను విడుదల చేశారు. 2022–23కు సంబంధించి ఆగస్టులో పారిశ్రామిక రాయితీలను విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్‌ను విశాఖలో నిర్వహిస్తున్న తరుణంలో దానికి ఒక నెల ముందు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతలో ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాయితీల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అయిపోగానే పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వాస్తవాలను ఏమాత్రం ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ముందు రాష్ట్రం పరువు తీయాలని ఈనాడు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. ఆరోపణ: విద్యుత్ డిమాండ్ చార్జీల సంగతీ అంతే.. వాస్తవం: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఏటా క్రమం తప్పకుండా రాయితీలను విడుదల చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా చేదోడుగా నిలబడటంతో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తిగా 100 శాతం రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడటం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మూడు నెలల కాలానికి విద్యుత్ రంగానికి చెందిన ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు భారీ పరిశ్రమలకు ఎటువంటి పెనాల్టీలు లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్ బడుగు వికాసం కింద 9,631 యూనిట్లకు రూ.661.58 కోట్ల రాయితీలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 2,207 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు రూ.111.08 కోట్లు, 424 ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.24.31 కోట్ల రాయితీలు అందుకున్నారు. వైఎస్సార్ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రుణాలను ప్రభుత్వం రీ–షెడ్యూల్ చేసింది. -
‘ఈనాడు’పై ఆగని నిరసన జ్వాల
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ‘వంశీ సంగతి నేనే స్వయంగా తేలుస్తా.. ఏమనుకుంటున్నాడో నేనంటే ఏమిటో చూపిస్తా’ అని మరీ సవాలు చేసి.. గన్నవరం వెళ్లి రచ్చ చేసి.. ఎమ్మెల్యే వంశీ వర్గీయులను రెచ్చగొట్టింది టీడీపీ నేత పట్టాభి. ఇది పద్ధతి కాదని చెప్పబోయిన వంశీ అనుచరులపై బరితెగించి దాడులకు పాల్పడిందే కాక.. గొడవ నివారించడానికి వచ్చిన పోలీసులపైకీ రాళ్లు రువ్విందీ పట్టాభి అండ్ కో. ఆ దాడిలో సీఐ కనకారావు గాయపడ్డాక.. పట్టాభి, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతి నుంచి ఎల్లో మీడియా విష ప్రచారం శ్రుతిమించి సాగింది. పట్టాభిని పోలీసులు ఇష్టానుసారం కొట్టారంటూ దుష్ప్రచారం చేశారు.‘ఈనాడు’ మరో అడుగు ముందుకు వేసి.. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ఓ తప్పుడు కథనాన్ని పతాక శీర్షికన ప్రచురించింది. అవి 2021లోని ఫొటోలని జనం సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. దీంతో తేలు కుట్టిన దొంగలా ఎక్కడో లోపలి పేజీలో ‘సవరణ’ వేయడం ద్వారా ఈనాడు తన తప్పు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అవి పాత ఫొటోలేనని, సాంకేతిక కారణాల వల్ల అవి పొరపాటున ప్రచురిత మయ్యాయని లెంపలేసుకుంది. ఈనాడు రెండు నాల్కల ధోరణిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిలో చర్చ మొదలైంది. ‘రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు మరీ ఇంత దిగజారిందా.. చంద్రబాబు కోసం తన పరువు తీసుకోవడానికి సైతం సిద్ధపడటం ఏ పాత్రికేయ ప్రమాణాలకు నిదర్శనం..’ అని జోరుగా చర్చించుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇంత జరిగాక కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన తీరు మార్చుకోలేదు. తగుదునమ్మా అంటూ శుక్రవారం గన్నవరం వెళ్లారు. పట్టాభిని కొడతారా.. అంటూ నిలదీశారు. పట్టాభిని పోలీసులు కొట్టలేదని తెలిసినా.. అబద్ధాన్ని నిజం చేయాలని పదే పదే ప్రస్తావిస్తూ పరితపించిపోయారు. ఇప్పుడు రండి చూసుకుందాం.. అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కూడా నోరు పారేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎల్లో ఈనాడు, మిగతా మీడియా మరోసారి పెద్ద ఎత్తున అవాస్తవాలకు పెద్దపీట వేస్తూ ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్న తీరును ప్రజలు గమనిస్తూ నిప్పుడు చెరుగుతున్నారు. ఈ క్రమంలో ‘ఈనాడు’ పత్రిక ప్రతుల దహనం కార్యక్రమం శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. పాత్రికేయ వృత్తికే అవమానం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో పాత్రికేయ వృత్తికే అవమానం కలిగేలా దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా నిరసన ఎగసిపడింది. అది చంద్రబాబు కరపత్రిక అని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు నినదించారు. అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఎదుట ఈనాడు ప్రతులను దహనం చేశారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసి సమాజంలో జర్నలిజం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన పత్రిక ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. గోరంట్ల, రాప్తాడు, పెనుకొండలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు జిల్లా సదుం, శ్రీరంగరాజపురం, ప్రకాశం జిల్లా దర్శి, గిద్దలూరు, నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరులో ‘ఈనాడు’ ప్రతులను దహనం చేశారు. గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన విద్యార్థి నేతలు అనంతరం అక్కడి నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మాచర్ల, చిలుకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండలో ఈనాడు ప్రతులు, రామోజీ చిత్రపటాలను దహనం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, మైలవరంలో రామోజీ దిష్టి బొమ్మను దహనం చేశారు. గుంటూరు నగరంలోని లాడ్జిసెంటర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నేతలు అసత్య కథనాలు రాస్తే సహించేది లేదు ఉన్నతాశయంతో పని చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏలూరులో ప్రజలు మండిపడ్డారు. ఏలూరు, గాలాయగూడెం, నూజివీడు, భీమడోలు, భీమవరంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. కాకినాడలో రామోజీ దిష్టిబొమ్మను ఊరేగించారు. కిర్లంపూడి మండలం జగపతినగరంలో ప్రధాన రహదారిపై కాకినాడ ఎంపీ వంగా గీత, తదితర నేతల ఆధ్వర్యాన ఈనాడు ప్రతులను దహనం చేశారు. రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిఠాపురంలో పలువురు డిమాండ్ చేశారు. తుని, కోటనందూరు, ఒంటిమామిడి జంక్షన్, పెద్దాపురం, సామర్లకోటలో నిరసన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి మండలం పోతుకుర్రులో ఈనాడు ప్రతులను దహనం చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, హిరమండలం, నరసన్నపేట, పలాస తదితర ప్రాంతాల్లోఈనాడుపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బొబ్బిలి, కురుపాం, విశాఖ నగరంలో పలుచోట్ల ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. -
కట్టుకథలు రాస్తున్న ఈనాడుపై జనాగ్రహం.. ఉవ్వెత్తున ఎగసిన నిరసనలు
సాక్షి, అమరావతి: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగసిపడింది. తప్పుడు వార్తలు రాసి.. ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు పత్రిక ప్రతులను గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో దహనం చేశారు. రామోజీరావు ఇంతగా దిగజారిపోవడం దారుణం అని ఛీకొట్టారు. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఈనాడు చేసిన కుట్ర మరోసారి బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. వైఎస్సార్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్న సెంటర్లలో ఈనాడు రామోజీ రావు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అవి 2021లోని ఫొటోలని సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఎవరికీ కనిపించని రీతిలో రెండో పేజీలో సింగిల్ కాలంలో ‘సవరణ’ వేసి చేతులు దులుపుకుందని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి అని పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబును సీఎం చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు, కథనాలు రాస్తోందని మంత్రులు ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయాలని, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే దురుద్ధేశం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి, చంద్రబాబుకు ప్రజలను చేరువ చేయాలని రాజగురువు రామోజీ కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు దుయ్యబట్టారు. ఈనాడు దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక అని పలు ప్రాంతాల్లో నినదించారు. ఇవి సోషల్ మీడియా రోజులు పట్టాభి అనే వ్యక్తి జాతీయ నేతలా ఎల్లో మీడియా జాకీలు వేసి లేపుతోందని, ఇవి ఎల్లో మీడియా రోజులు కావని.. సోషల్ మీడియా రోజులు అని ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అనుబంధ సంస్థలు ప్రచురిస్తున్న, చూపుతున్న వార్తలు, కథనాలు చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వారికి మెట్లు ఏమీ లేవు అని నిరూపించుకున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు మాత్రమే బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతం.. రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తూర్పారబ్టారు. కుట్రల రామోజీని బట్టలూడదీసి ప్రజల ముందు నిలబెడతామని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేటప్పుడు బ్యానర్ ఐటమ్స్.. సవరణకు మాత్రం సింగిల్ కాలమా? అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. రామోజీ ఆరాటమే తప్ప.. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసం చేయాలని ఈనాడు యాజమాన్యం కుట్ర చేసిందని, సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిందని వైఎస్సార్సీపీ సీనియర్ శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు చంద్రబాబు మాత్రం బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతమని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ‘ఈనాడు’ ప్రతులను తగలబెడుతున్న స్థానికులు పెల్లుబికిన ఆగ్రహం అసత్యాలను ప్రచారం చేస్తున్న ఈనాడు పత్రికను బహిష్కరించాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఎక్కడికక్కడ ఈనాడు ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, తదితర పట్టణాల్లో ఈనాడు ప్రతులు కాల్చివేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీ–5లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తన క్యాంపు కార్యాలయం ఎదుట ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో ఈనాడు దినపత్రిక పత్రులను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఎమ్మెల్యేలతో కలిసి ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రామోజీరావు దిష్టి బొమ్మ దహనం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న జగన్మోహన్రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై ఈనాడు విషం చిమ్ముతుండటాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని విజయవాడలో పలువురు నేతలు మండిపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ మంటల్లో ఈనాడు ప్రతులను తగులబెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ‘పచ్చ’రాతలపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విషపు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ పత్రికను వైఎస్సార్సీపీ శ్రేణులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి. నిరసన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా దద్దరిల్లింది. ఇకనైనా నీచపు రాతలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.. రామోజీకి హితవు పలికారు. ప్రభుత్వంపై కక్ష కట్టి ఈనాడు రాస్తున్న అబద్ధపు రాతలను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేతలు ఖండిస్తూ నిరసన తెలిపారు. -
చిల్లర నేత చిందులాట.. రామోజీకి తన సినిమా డైలాగ్ గుర్తుందో లేదో?
కుట్రలు, కుతంత్రాలు ఏదో ఒక రోజు బటయపడతాయని అంటారు. అబద్దాలు ఆడేవారు ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారన్నది నానుడి. సరిగ్గా ఈనాడు మీడియా పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విషం కక్కుతున్న వైనం ఇప్పుడు మరింత ఓపెన్‌గా బహిర్గతమైంది. తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడిని మహానాయకుడిగా చూపించడానికి, అతగాడు చేసే విన్యాసాలను మహా పోరాటంగా చిత్రించడానికి ఈనాడు పడ్డ పాట్లు ఇట్టే తెలిసిపోయాయి. రామోజీ ఈ డైలాగ్ గుర్తుందా? ఈనాడు బ్యానర్ చూడగానే ప్రఖ్యాత స్వాతంత్రయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏమైనా బతికి వచ్చారా? ఆయనకు ఏమైనా జరిగిందా? అన్న సందేహం వచ్చింది. తీరా మొత్తం కథనం చదివితే ఇదంతా ఒక చిల్లర నేత చేసిన ఆరోపణ అని అర్ధం అవుతుంది. ఈనాడు ఈ రకంగా తన స్థాయిని ఇంతగా దిగజార్చుకుంటుందని గతంలో ఊహించలేకపోయాం. తన క్షుద్ర రాజకీయం కోసం ఈనాడు ఎంతకైనా పతనం అవుతుందని ఈ ఘటన తెలియచెబుతుంది. సుమారు 35 ఏళ్ల క్రితం ఈనాడు అధినేత రామోజీరావు ఒక సినిమా తీశారు. దాని పేరు ప్రతిఘటన. అందులో కొన్ని పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. ఒక రౌడీకి ఖద్దరు చొక్కా తొడిగి రాజకీయ నాయకుడిని చేశారని అందులో ఒక స్వాతంత్ర యోధుడు అంటారు. సరిగ్గా ఇప్పుడు ఈనాడు అదే పనిలో ఉన్నట్లు అనిపిస్తుంది. బురద చల్లడమే ఈనాడు కర్తవ్యం.. తెలుగుదేశంలో ఎవరు చిల్లరమల్లరగా వ్యవహరిస్తారో, నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ను దూషిస్తారో వారందరికీ విపరీత ప్రాధాన్యం ఇస్తూ వారిని మహా నాయకులుగా చిత్రీకరించడానికి తంటాలు పడుతోంది. తద్వారా వైఎస్సార్సీపీపై బురద చల్లడమే ఈనాడు తన కర్తవ్యంగా పెట్టుకుంది. బుధవారం నాటి పత్రిక గమనిస్తే సహజంగానే సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రకమైన ఆరోపణలను టీడీపీ చేసిన విషయం గుర్తుకు వస్తుంది. ఒక చోటా నేతను పోలీసులు కొట్టారంటూ ఏవో కొన్ని ఫొటోలను అప్పట్లో ప్రచురించారు. అదే తరహాలో మళ్లీ ఫొటోలు వచ్చాయేమిటా అనిపించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లో అసలు రహస్యం బట్టబయలు అయింది. గతసారి వేసిన ఫొటోలనే ఇప్పుడు కూడా వేసి ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథ అల్లింది. సరే, కోర్టులో కూడా అదే తరహాలో చెప్పారు. అది వేరే సంగతి. వైద్యులు ఆ చోటా నేతను పోలీసులు కొట్టలేదని ధృవీకరించారు. ఈలోగా ఈనాడు ఎందుకో భయపడింది. రెండేళ్ల క్రితం వేసిన ఫొటోలనే ప్రచురించి తప్పు చేశారన్న సంగతి సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవడంతో తప్పనిసరి స్థితిలో టీవీలలో పాత ఫొటోలను ప్రచారం చేశామని, అది సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని.. ఇందుకు విచారిస్తున్నామని తెలిపింది. దీంతో, ఈనాడు మీడియా పరువు పూర్తిగా పోయినట్లయింది. బహుశా తాను చేసిన మోసాన్ని పోలీసులు పట్టుకుని కేసులు పెడతారని ఆందోళన చెంది ఈనాడు వారు ఈ వివరణ ఇచ్చి ఉంటారనిపిస్తుంది. అందులో కూడా నిజాయితీ కనిపించలేదు. ఇదే మొదటిసారి కాదు.. మంగళవారం తీసిన ఫొటో అంటూ సన్నాయి నొక్కుడుకు పాల్పడింది. మంగళవారం నాటి ఫొటోనే అయితే.. రెండేళ్ల క్రితం ఫొటో అక్కడ ఎలా ప్రత్యక్షమవుతుందో తెలియదు. ఇదంతా అబద్దమని, చేసిన తప్పును సమర్ధించుకునే యత్నమని తెలిసిపోతుంది. ఈనాడు ఇవ్వాళ ఒక్కరోజే ఇలా చేసిందని అనుకోజాలం. కొద్ది రోజుల క్రితం ఛీప్ సెక్రటరీ వైఎస్సార్ జిల్లాలో పర్యటించినప్పుడు కడపలో వేరే కేసులో సీబీఐ విచారణకు హాజరైన ముఖ్యమంత్రి.. ఓఎస్డీని కారులో ఎక్కించుకుని వెళ్లారంటూ తప్పుడు వార్తను ప్రచారం చేసింది. దానిని ఛీప్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అప్పుడు ఏ మీడియా అయినా ఏం చేయాలి. వారు ప్రచారం చేసిన వార్త సరైనదే అయితే, తమ వార్తకు కట్టుబడి ఉన్నామని చెప్పాలి. లేదా విచారం వ్యక్తం చేయాలి. కానీ.. వారు కేవలం సీఎస్ ఇచ్చిన ప్రకటనను కొద్దిగా ఇచ్చేసి వదలివేశారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌ను, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈనాడు విశేష కృషి చేస్తోంది. 86ఏళ్ల వయసులో ఆ పత్రిక అధినేత రామోజీరావు తన పరువు, ప్రతిష్ట మంటకలిసిపోయినా ఫర్వాలేదు కానీ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో లోటుపాట్లు వార్తలుగా ఇస్తే తప్పు కాదు. కానీ, అదే పనిగా తప్పుడు ప్రచారం చేయడానికి, అభూత కల్పనలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకే తరహా వార్తలను తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను ఇస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు కనిపించవా? ఉదాహరణకు తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడి వచ్చినా, చాలా గొప్ప విషయంగా మొదటి పేజీలో ప్రచురిస్తుంటారు. అదే ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, అసలు ప్రాధాన్యమే ఇవ్వరు. ఈ మధ్య జమ్మలమడుగు వద్ద 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్త జిందాల్ శంకుస్థాపన చేస్తే దానిని మొక్కుబడిగా కవర్ చేశారు. పైగా బ్యానర్‌గా రోజువారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే ఒక చెత్త వార్తను ప్రచురించారు. విశాఖలో రిషి కొండపై ఎన్ని దారుణమైన వార్తలు రాస్తున్నారో చూస్తున్నాం. ఇదే రిషి కొండపై గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వేస్తే, కొండకే హారం చుట్టినట్లు రాసిన ఈ పత్రిక.. ఇప్పుడు అక్కడ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను మాత్రం విధ్వంసంగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు కన్నా ఆయనే తోపా? ఈ రెండు క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా ఒకటని కాదు.. అనేక కథనాలలో ఇలాగే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్న ఈనాడు బుధవారం నాటి పత్రికలో గన్నవరంలో ఆ పార్టీ చోటా నేత, మరికొందరు చేసిన అల్లరి పక్కనపెడితే, ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథనాలు ఇచ్చారు. స్క్రిప్ట్ ప్రకారమే ఆ చోటా నేత కూడా తనను పోలీసులు హింసించారంటూ కోర్టుకు తెలిపారు. ఈ వార్తలకు ఈనాడు పత్రిక ఏకంగా మూడు పేజీలను కేటాయించిందంటే వారు ఎంత కక్షకట్టారో ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీలో ఆ చోటా నేతే చంద్రబాబు కన్నా ప్రముఖుడు అన్నట్లుగా వార్తలు ఇవ్వడం టీడీపీలోని వారికే మింగుడు పడటంలేదు. ఇతగాడు పార్టీ పరువును తీస్తున్నాడని వాపోతున్నారట. అసలు ఈయనకు ఇంత ధైర్యం అన్న విశ్లేషణ చేస్తే ఒక విషయం బయటపడుతోంది. గతసారి ముఖ్యమంత్రి జగన్‌ను దూషించిన కేసులో గౌరవ హైకోర్టు వారు అడ్వాన్స్ బెయిల్ ఇచ్చారు. దాంతో అతనికి అతి విశ్వాసం వచ్చి ఉండవచ్చు. న్యాయ వ్యవస్థను తేలికగా తీసుకోవచ్చన్న భావన ఏర్పడి ఉండవచ్చు. ఈ క్రమంలో అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయి వైఎస్సార్సీపీ వారిపై దూషణలకు పాల్పడటం, నిత్యం అబద్దాలు ప్రచారం చేయడం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ.. ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఇతర ముఖ్యనేతలే ఆశ్చర్యం చెందుతున్నారు. ఎప్పుడో ఓసారి ఇతను ఏకుమేకై చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారట. వల్లభనేని వంశీపై వ్యతిరేక ప్రచారం.. నిజంగా గన్నవరం ఘటనల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా కొట్టి ఉంటే ఎవరూ సమర్దించరు. కానీ, పోలీసులను గాయపరచడమే కాకుండా, వారినే బెదిరించడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకుంటున్నారు. దానివల్ల వారికి రాజకీయ ప్రయోజనం వస్తుందనుకుంటే అది భ్రమే అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. తదుపరి ఆయన పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి ఆయనపై టీడీపీ సోషల్ మీడియాలో దారుణమైన వ్యతిరేక ప్రచారం చేస్తుంటారట. దానిని ఆయన తిప్పికొడుతూ తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ చోటా నేత ఎంటర్ అయి వంశీపైన నోరుపారేసుకోవడం, లేని ఆరోపణలు చేయడం, వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించడం చేశారని వార్తలు వచ్చాయి. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా కొంత తొందరపడి ఉండవచ్చు. పోలీసులు రెండువైపులా కేసులు పెట్టారు. ఇరుపక్షాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అనడం ఆనవాయితీగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఏదో విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని తెలుగుదేశం, ఈనాడు వంటి మీడియా సంస్థలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ వారిని ఎలాగోలా రెచ్చగొట్టేలా చేయాలన్నది వారి వ్యూహం కావచ్చు. చంద్రబాబు కన్నింగ్ ప్లాన్ ఇదే.. దానికి తోడు ప్రభుత్వం లేదా వైఎస్సార్సీపీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా భావిస్తారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 18 స్థానాలకు గాను 11 మంది బీసీలకు పదవులు ఇవ్వడానికి వైఎస్సార్సీపీ ప్రకటన చేసిన రోజునే ఈ గొడవ సృష్టించడంలో ఆంతర్యం ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మొత్తం పరిణామక్రమం, టీడీపీ రాజకీయ చరిత్ర గమనిస్తే, ఇది వాస్తవమే అనిపిస్తుంది. అయినప్పటికీ టీడీపీ రెచ్చగొట్టినా వైఎస్సార్సీవారు ఆవేశపడకుండా ఉండాలని ఈ ఘటన తెలియచెబుతుంది. వారు సంయమనంగా లేకపోతే మొత్తం నెపం అంతా ప్రభుత్వంపైన, వైఎస్సార్సీపీపైన నెట్టేసి బద్నాం చేయాలని టీడీపీ యత్నిస్తుంది. ఇదే సందర్భంలో మరో మాట చెప్పాలి. పాదయాత్ర చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్.. వైఎస్సార్సీపీ వారు ఒక్క టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే, తాము వంద వైఎస్సార్సీపీ ఆఫీసులపై దాడి చేస్తామని అనడం శోఛనీయం. అంతేకాదు.. కట్ డ్రాయర్ల మీద ఉరికిచ్చి కొడతారట. ప్రభుత్వం వస్తే ఈయనే పోలీసుల పోస్టింగ్స్ ఇస్తారట. ఇన్ని రకాలుగా రెచ్చగొడుతూ పోలీసు అధికారులను బెదిరిస్తున్న తీరు అర్దం అవుతూనే ఉంది కదా!. వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టాలన్నదే వారి వ్యూహం. కనుక ఈ ఎన్నికల సంవత్సరంలో అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా, పూర్తి సంయమనంగా ఉండాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
పవన్ ట్వీట్లకు కొడాలి నాని కౌంటర్
-
పట్టాభిని కొట్టారంటూ దుష్ప్రచారం చేశారు: కొడాలి నాని
-
ఈనాడు ఫేక్ వార్తపై స్పందించిన కొమ్మినేని.. ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ విషయంలో ఈనాడు తప్పుడు కథనాలు రాసి ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, తప్పుడు కథనాలపై ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం కొమ్మినేని మాట్లాడుతూ.. పట్టాభిని కొట్టారంటూ ఈనాడు పత్రికలో పాత ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసగించడం దురదృష్టకరం. 2021 ఫిబ్రవరి 3వ తేదీ నాటి ఫొటోలు ముద్రించడం దారుణం. ప్రభుత్వం, పోలీసులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే లక్ష్యంతోనే కథనం రాసింది. అనంతరం, సాంకేతికలోపం అంటూ సమర్థించుకునే తీరు అభ్యంతరకరం. పట్టాభి వార్తలను బ్యానర్‌గానే కాకుండా పుంఖానుపుంఖాలుగా మూడు పేజీల్లో రాసిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఈనాడు పత్రికా ప్రమాణాలు, విలువలను దిగజార్చడం బాధాకరం. ఈనాడులో వివరణ ఇవ్వడంలోనూ నిజాయితీ లోపించింది. పట్టాభి పాత ఫొటోలను మొదటి పేజీలో ప్రచురించిన ఈనాడు.. వివరాలను మాత్రం లోపలి పేజీల్లో కనిపించని రీతిలో వేయడం ఆక్షేపణీయం. ఈనాడు మీడియా ఇలాంటి దుష్టపోకడలను మానుకోవాలి అని సూచించారు. -
ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్ మీడియా కాలమిది: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: టీడీపీ, ఎల్లో మీడియాపై మాజీ మంత్రి కన్నబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. విష ప్రచారమే అజెండాగా ఎల్లోమీడియా పనిచేస్తోందన్నారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడని ఘాటు విమర్శలు చేశారు. కాగా, కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లోమీడియా రోజురోజుకూ దిగజారుతోంది. చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు బరితెగించి విష ప్రచారం చేస్తున్నారు. గన్నవరంలో పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడు. ఈనాడులో తప్పుడు ఫొటోలు వేసి దుష్ప్రచారం చేశారు. పట్టాభిని కొట్టారంటూ అబద్ధపు రాతలు రాశారు. తప్పుడు వార్తలు రాసి సవరణ మాత్రం సింగిల్ కాలమ్‌లో వేశారు. ఇవి ఎల్లో మీడియాలో రోజులు కావు.. సోషల్ మీడియా రోజులు అని అన్నారు. జాకీలు పెట్టి లేపినా లేవలేని పరిస్థితి టీడీపీది. ఈనాడు చంద్రబాబు కరపత్రిక అని మరోసారి రుజువైంది. పట్టాభిని ఎవరూ కొట్టలేదని వైద్యులే ధృవీకరించారు. ఈనాడు విషపురాతలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక విప్లవానికి తెరతీశారు. దేశంలో ఎవరూ చేయని సాహసం సీఎం జగన్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వంపై ఈనాడు కుట్ర చేస్తోంది. అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో టీడీపీ ఉంది. -
పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ దీనస్థితిపై ఆ పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది. తమ గొయ్యి తామే తవ్వుకొంటున్నామని ఆ పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. పార్టీకి హైప్ తేవాలనే కొత్త వ్యూహాలతో కష్టాలు కొని తెచ్చుకొంటున్నామని అంటున్నారు. గన్నవరం వ్యవహారంలో పట్టాభి ఓవరాక్షన్ వల్లే ఇంత నష్టం చవిచూడాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఆయనకు సంబంధంలేని గన్నవరానికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేను దుర్భాషలాడటం అంటే ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేస్తున్నారు. గన్నవరం బాధ్యతలు చూస్తున్న బచ్చల అర్జునుడు అనారోగ్యంతో ఉన్నాడనే ఓ సాకు ఆధారంగా పట్టాభి చక్రం తిప్పాలని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే వంశీపై మాటల యుద్ధం మొదలు పెట్టాడు. ఐదు, ఆరు రోజుల తరువాత నేరుగా గన్నవరానికి వెళ్లి తన తడాఖా చూపిద్దాం అనుకున్నాడు. గొడవ సృష్టించడం ద్వారా టీడీపీకి సానుభూతి వచ్చేలా అడుగువేద్దామనుకున్నాడు. అయితే ఆయనతోపాటు, టీడీపీ శ్రేణుల చిల్లర చేష్టలు, దిగజారుడు వ్యాఖ్యలతో వంశీ వర్గీయులు తీవ్రంగా బాధపడిపోయారు. టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దూసుకొస్తుండటంతో ప్రతిఘటించక తప్పలేదు. పోలీసులను భయపెట్టి... పోలీసులను భయపెట్టి లబ్ధిపొందాలని చూసిన పట్టాభి అండ్ గ్యాంగ్ వ్యూహం బెడిసికొట్టింది. సీఐకి గాయం అయినప్పటికీ పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత కూడా టీడీపీ నేతలు అతి చేయడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టాభి చేసింది సబబేనని సమర్థిస్తూ మాట్లాడాలని అధిష్టానం నుంచి సూచనలు అందటంపై భగ్గుమంటున్నారు. చంద్రబాబు తీరుపై... ఇంతటితో ఈ వ్యూహానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన చంద్రబాబు తగుదునమ్మా అంటూ ప్రత్యేక విమానం వేసుకొని విజయవాడకు రావటం, పట్టాభి భార్యను పరామర్శించడం ముమ్మాటికీ వ్యూహాత్మక తప్పిదమని ఆ పార్టీలోని పలువురు సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఇలానే ఓవరాక్షన్ చేసి, అనక దొరికి పోయి తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవాల్సి వచ్చిందన్న విషయం తమ అధిష్టానం గుర్తిస్తే బావుటుందని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని సాగదీసేకొద్దీ వంశీకి విస్తృత ప్రచారం వస్తుందనే విషయాన్ని తమ బాబు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నటన ఫెయిల్‌తో అభాసుపాలు.. నటన ఫెయిల్ కావడంతో పట్టాభి మరింత అభాసుపాలయ్యాడు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకపోయినా కొట్టారని నమ్మించేందుకు గన్నవరం కోర్టులో ఆయన చేసిన నటన అంతా ఇంతా కాదని అంటున్నారు. ఇది టీడీపీ పరువు మరింత తీసిందని పేర్కొంటున్నారు. దీంతో అభాసుపాలు కావాల్సి వచ్చిందని చెబుతున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించే యత్నాన్ని, అతని నటనను గుడివాడ, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులు బహిర్గతం చేశాయి. చదవండి: ‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ ఇరువర్గాల ఘర్షణలో చేతికి చిన్న గాయం తప్ప, ఆయనకు ఎలాంటి గాయాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం మీద గన్నవరం ఎపిసోడ్లో పట్టాభి పార్టీ పరువు తీశాడని, కొంత మంది టీడీపీ నేతలే మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని, ప్రజల వద్దకు వెళితే మంచిదనే భావన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. -
టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకారావుపై రాళ్లతో దాడి చేసి గాయపరచడంతోపాటు హత్యాయత్నానికి అనుచరులను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బుధవారం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుపరచాలని జడ్జి శిరీష పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు. పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్ సర్టిఫికెట్‌పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్‌జైలుకు తనను రిమాండ్‌కు పంపించాలని పట్టాభి కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం పోలీసులు పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. అయితే సబ్ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీరందరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్ యూనస్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితోపాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. -
‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ.. ఆపై చింతిస్తున్నామని సవరణ
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక ఎందుకింతలా దిగజారిపోతోంది? ఒక పార్టీపై బురద జల్లడానికి.. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి... పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి... ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెండేళ్ల కిందటి ఫొటోలు ఇవ్వాల్టివేనని అబద్ధాలు చెబుతూ ప్రచురించే స్థాయికి ఎందుకు పడిపోయింది? అసలిలాంటి పత్రికను ఎవరైనా నమ్మొచ్చా? చంద్రబాబును అధికార పీఠంపైకి తేవటం కోసం ఈ రాష్ట్రాన్ని ఏం చేసినా ఫర్వాలేదనుకునే రామోజీరావు మనస్తత్వాన్ని క్షమించవచ్చా? ‘పట్టాభినీ కొట్టారు’ అంటూ పతాక స్థాయిలో వేసిన శీర్షికలోనే కాదు... ఆ వార్తలో ప్రతి అక్షరం అబద్ధాలతో కూడిన కాలకూట విషమే. అసలు పట్టాభిని కొట్టనే లేదని పోలీసులు కోర్టులో చెబితే... దాన్ని వైద్యాధికారులు సైతం ధ్రువీకరిస్తే... కొట్టారంటూ ‘ఈనాడు’లో వార్తలేంటి? పైపెచ్చు... ‘తీవ్రంగా కొట్టారు. అరచేతిపైనా, కాళ్లపైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించారంట దుర్మార్గపు రాతలేంటి? ఆ రాతలన్నీ నిజమని నమ్మించటానికి వాటికి రుజువులుగా ఎప్పుడో రెండేళ్ల కిందట ‘2021 ఫిబ్రవరి 3న’ తన పత్రికలోనే వేసిన ఫొటోలను మళ్లీ ఇప్పుడు వేసేసిన దౌర్భాగ్యపు పరిస్థితేంటి? అంటే... మీ దృష్టిలో మీ పాఠకులంతా వెర్రివాళ్లా రామోజీరావు గారూ? మీరు ఏం రాసినా నమ్మేస్తారనే భ్రమల్లోనే ఇంకా బతుకుతున్నారా? అదంతా ఒక చరిత్ర అని... ‘సాక్షి’ రాకముందు కొన్నాళ్లపాటు తెలుగు పత్రికారంగం ఎదుర్కొన్న సంధికాలమని ఇప్పటికీ తెలియటం లేదా? ‘సాక్షి’ ఆవిర్భవించిన నాటి నుంచీ మీ ఏకఛత్రాధిపత్యానికి కాలం చెల్లిందని... వార్తలకు రెండోవైపున ఏమున్నదో కూడా జనం చూస్తున్నారని మరిచిపోయారా? ఇంటర్నెట్ వేదికగా వ్యక్తులే శక్తిమంతమైన మీడియాగా మారుతున్న ఈ రోజుల్లోనూ మీరు పచ్చి అబద్ధాలను పోగేస్తే నమ్మేస్తారని ఎలా అనుకుంటున్నారు? అసలు ఏనాటికైనా మారుతుందా ‘ఈనాడు’? ‘బీసీ’ల అభ్యున్నతి జనానికి చేరకుండా... సోమవారం శాసనమండలి అభ్యర్థులను ప్రకటిస్తూ... ఉన్న 18 స్థానాల్లో 14... అంటే ఏకంగా 68 శాతాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయిస్తూ కొత్త చరిత్రను లిఖించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. ఆనందంతో ర్యాలీలు చేశారు. ఇప్పటికే బీసీల్లో బలం పెంచుకున్న వై.ఎస్.జగన్‌కు... దీనివల్ల మరింత ఖ్యాతి వస్తుందని భావించిన తెలుగుదేశం, దాని మిత్ర మీడియా... వ్యూహం ప్రకారం అదేరోజున ‘గన్నవరం’ కుట్రకు తెరతీశాయి. తామే రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వటమే కాక... విజయవాడ నుంచి గన్నవరానికి వెళ్లి మరీ పట్టాభి సహా టీడీపీ నేతలు అక్కడి ఎమ్మెల్యే వంశీ అనుచరులతో ఘర్షణకు దిగారు. దాదాపు అన్ని ఛానెళ్లలోనూ బీసీలకు పట్టం కట్టిన వ్యవహారం రాకుండా... టీడీపీ చక్రం తిప్పింది. మంగళవారం నాడు ‘ఈనాడు’లో ... గన్నవరంలో ప్రభుత్వమే దారుణాలకు పాల్పడ్డట్టుగా... పోలీసులే దౌర్జన్యం చేసినట్లుగా దారుణమైన కథనాలు వండివార్చేశారు. ఆ ఘర్షణల సందర్భంగా అరెస్టయిన పట్టాభిని పోలీసులు దారుణంగా కొట్టారంటూ బుధవారం దాన్ని కొనసాగించారు. అందుకు రుజువులుగా ఎప్పుడో 2021 ఫిబ్రవరి 3నాటి ఫోటోలను... ఇప్పటివేనంటూ వేసేశారు. అదీ జరిగిన కథ!!. ఔరా రామోజీ?? 2021, ఫిబ్రవరి 3 ‘ఈనాడు’ ఏం రాసిందంటే... ‘కర్రలు, రాడ్లతో పట్టాభిపై దాడి’ అని ‘ఈనాడు’ బ్యానర్‌గా ప్రచురించిన వార్త ఇది. టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ‘ఈనాడు’ హడావుడి చేసింది. విజయవాడలోని తన ఇంటి నుంచి కారులో వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని... కారు అద్దాలు పగలగొట్టారని... పట్టాభిని కారు నుంచి బయటకులాగి... ఎడమ మోచేయి, ఎడమ మోకాలు, తొడపై ఇష్టారాజ్యంగా కొట్టారని వార్త ప్రచురించింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పట్టాభి భార్య చందన ఆవేదన వ్యక్తం చేసినట్టు మరో వార్త ఇచ్చింది. పోలీసులు స్పందించి ఆ దాడిని మెడికో లీగల్ కేసుగా నమోదు చేస్తాం... ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తామంటే పట్టాభి వద్దన్నారని, దాంతో... పోలీసులు బలవంతంగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఇంకో వార్త వేసింది. పట్టాభికి సంఘీభావంగా చంద్రబాబు హుటాహుటిన ఆయన నివాసానికి వచ్చి పరామర్శించటమే కాక... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కూడా వేసింది. ఇక పట్టాభి శరీరంపై గాయాలు... పట్టాభిపై దాడికి ఉపయోగించిన కర్ర... ధ్వంసమైన పట్టాభి కారు అద్దాలు...పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళుతుండటంతో విలపిస్తున్న పట్టాభి... పట్టాభిపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన తరువాత పోలీసులతో మాట్లాడుతున్న చంద్రబాబు... పట్టాభి శరీరంపై గాయాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అంటూ పెద్దపెద్ద ఫొటోలతో విపరీతమైన హడావుడి చేసి... రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందనే భావన కలిగించాలని కుట్ర పన్నింది. కానీ... ఆ కుట్ర బెడిసికొట్టింది చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే ఆ దాడి గురించి ఫిర్యాదు చేయడానికి పట్టాభి ఇష్టపడలేదు. ఎవరిపైనయినా అనుమానం ఉందా? అంటే కూడా చెప్పలేదు. పోలీసుల దర్యాప్తునకు సహకరించలేదు. పోలీసులు దర్యాప్తు జరపటానికే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? వాస్తవానికి పట్టాభికి సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, కొందర్ని ఆయన చేసిన మోసాలు అప్పట్లో కథలుకథలుగా వినిపించాయి. తన వ్యక్తిగత రహస్యాలను బయటపడకుండా బ్లాక్‌మెయిలింగ్ చేసేందుకు పట్టాభే ఆ దాడి డ్రామా ఆడించారని టీడీపీ వర్గాలు లోలోపల వ్యాఖ్యానించాయి కూడా. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆయన దర్యాప్తునకు ఇష్టపడలేదు. దీంతో పట్టాభిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టింది. అయినా... మనసు మారలేదు అప్పట్లో చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టినా... ‘ఈనాడు’ మాత్రం మారలేదు. మళ్లీ బుధవారంనాడు పాత స్కీమునే పునరావృత్తం చేసింది. పట్టాభి అరికాళ్లు, తొడలపై దెబ్బలు అంటూ అలనాటి 5 ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించింది. ‘దేశమంతా ఐపీసీ చట్టం.. రాష్ట్రంలో వైసీపీ చట్టం’ అంటూ మరో కథనంతో మొదటి, రెండు పేజీలను నింపేసింది. ‘నా భర్త ప్రాణాలకు ముప్పు’ అంటూ పట్టాభి భార్య చందన వాపోతున్నట్టుగా మరో వార్తను ఏకంగా అయిదు ఫొటోలతో ప్రచురించి 3వ పేజీని నింపేసింది. ‘ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తారా’అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మరో వార్త కూడా వేసింది. అంటే... రెండేళ్ల కిందటి ఘటనతో బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ ఆ స్కీమ్‌ను పునరావృత్తం చేశారు రామోజీరావు గారు. కాకపోతే మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలోనే అందరూ నిజానిజాలు చెబుతూ ‘ఈనాడు’ వలువలు ఊడదీసేశారు. ఇప్పటికైనా రామోజీ మారతారా? పట్టాభిని పోలీసులు కొట్టనే లేదు – వైద్య పరీక్షల్లో నిర్ధారణ పట్టాభిని పోలీసులు కొట్టారన్న టీడీపీ ఆరోపణలు అవాస్తవమని స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో పట్టాభికి విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్దారించారు. వైద్యులు రెండు సార్లు పరీక్షించి మరీ ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దాంతో తనను కొట్టారంటూ పట్టాభి ఆడిన డ్రామా... వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలు... రాష్ట్రంలో ఐపీసీ కాదు వైసీపీ అమలు అవుతోందంటూ ఈనాడు చేసిన దుష్ప్రచారం అంతా పక్కా ముందుస్తు కుట్రేనన్నది స్పష్టమైంది. సీఐ దళితుడు కాదంటూ టీడీపీ అసత్యవాదన... – ఆయన దళితుడేనని ధ్రువీకరించిన తహశీల్దార్ పట్టాభి, మరికొందరు టీడీపీ నేతలు దళితవర్గానికి చెందిన గన్నవరం సీఐ కనకరావును కులం పేరుతో దూషిస్తూ ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఆయన తలకు తీవ్రగాయం కావడంతో వైద్యులు 8 కుట్లు వేయాల్సి వచ్చింది. దాంతో కనకారావు ఫిర్యాదుపై పట్టాభితోపాటు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా టీడీపీ తమ న్యాయవాది ద్వారా న్యాయస్థానంలో అవాస్తవ వాదనలు వినిపించడం విస్మయం కలిగిస్తోంది. అసలు సీఐ కనకరావు దళితుడే కాదని టీడీపీ న్యాయవాది వాదించడం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. కానీ సీఐ కనకరావు మాల(ఎస్సీ) సామాజిక వర్గానికి చెందినవారని గన్నవరం తహశీల్దార్ ధ్రువీకరించారు. దాంతో టీడీపీ పన్నాగం మరోసారి విఫలమైంది. -
పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు: ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత పట్టాభి విషయంలో ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభి విషయంలో ఏం జరిగిందో ఎస్పీ జాషువా కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ లీడర్ పట్టాభిని పోలీసులు కొట్టారనేది అవాస్తమని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ జాషువా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నిందలు వేయడం సరికాదు. పట్టాభి అవాస్తవంతో కోర్టును తప్పుదారి పట్టించాలని చూశారు. పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు. డాక్టర్ల బృందం రెండుసార్లు పరీక్షించినా ఎలాంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైంది. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా సుమోటోగా కేసు నమోదు చేశాం. వీడియో ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. -
బూతులు తిట్టడంలో పరీక్ష పెడితే పట్టాభికి డిస్టింక్షన్ వస్తుంది: సజ్జల
-
పట్టాభిని కొట్టారంటూ ఈనాడు తప్పుడు రాతలు
-
అడ్డంగా బుక్కైన ‘ఈనాడు’.. ఫేక్ వార్తల్లో పచ్చ మీడియా స్టైలే వేరు!
అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!. సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో.. సీఎం జగన్ సర్కార్‌పై తప్పుడు రాతలు, ఫేక్ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. తాజాగా బొక్కబొర్లాపడే రీతిలో మరో అడుగేసింది ఈనాడు. అదీ మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం!. ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడూ అసత్య ప్రచారమే చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ ప్రజలకు నిజలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకుని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ, అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తప్పులు సహజం కావొచ్చు. కానీ, ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. రెండేళ్ల క్రితం గన్నవరం ఘటనలో జగన్ సర్కార్‌పై కూడగలుపుకుని ‘ఈనాడు’, టీడీపీ దుష్ప్రచారం చేశాయి. టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ విష ప్రచారం చేశాయి. చంద్రబాబు డైరెక్షన్లో.. రామోజీ యాక్షన్‌లో ఈనాడు ఓ పె.. ద్ద కథనం రాసుకొచ్చింది. అయితే, 2021 నాటి ఘటనలోని ఫొటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అభాసుపాలైంది. రెండేళ్ల క్రితం ఫొటోలను ప్రచురించి.. ప్రస్తుతం జరిగిన ఘటనలో పట్టాభిని కొట్టారంటూ కలరింగ్ ఇచ్చింది ఈనాడు. ఇక, దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం. టీడీపీ.. ఈనాడు తప్పుడు ఫొటో కథనాలను ట్వీట్ చేసి సీఎం జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారంటూ కోర్టులో ఈనాడు ఫొటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం, వైద్యులు.. పట్టాభికి ఎలాంటి గాయాలు లేవని పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించారు. అయితే, వైద్యుల ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ప్చ్.. చేసేదేమీ లేకపోవడంతో చింతిస్తున్నామంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలు 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్‌గా చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రికా విలువలను పక్కనపెట్టి.. పరువు పొగొట్టుకుంది. -
గన్నవరం: సీఐపై దాడి కేసులో 10 మంది టీడీపీ నేతలకు రిమాండ్
గన్నవరం/నాగాయలంక (అవనిగడ్డ)/కోనేరుసెంటర్/పటమట/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లా గన్నవరంలో విధి నిర్వహణలో ఉన్న సీఐ పి.కనకారావును కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొట్టి గాయపరిచిన కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి, పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. గన్నవరంలో సోమవారం టీడీపీ నేతలు సృష్టించిన ఘర్షణకు సంబంధించి పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. వీటిలో మూడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. ఒకటి ఎమ్మెల్యే అనుచరులపై నమోదైంది. పట్టాభి తనను కులం పేరుతో దూషించడమేగాక ఆయనతోపాటు దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు మరో ఎనిమిదిమంది తనను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతోపాటు చంపేవిధంగా అనుచరులను ప్రేరేపించారని సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తమను నెట్టేసినట్లు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కుండేటి రఘుబాబు, మేకల కోటేశ్వరరావు, కొలుసు వరప్రసాద్ తదితరులపై ఎస్ఐ రమేష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై మరో కేసు నమోదైంది. టీడీపీ నేతలు పట్టాభి, మూల్పూరి కళ్యాణి, కోనేరు సందీప్, గూడవల్లి నరసయ్య, జాస్తి వెంకటేశ్వరరావు తనను కులం పేరుతో దూషించినట్లు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు యతేంద్రరామకృష్ణ, మోహన్‌రంగా తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించినట్లు టీడీపీ నేత దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐపై దాడికేసులో.. సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు పట్టాభి, చిన్నా, వీరంకి గురుమూర్తి, లావు వంశీకృష్ణ, జాస్తి ఆదిశేషు, లావు వంశీకృష్ణ, చల్లగుళ్ల సందీప్, గురివిందగుంట దేవేందర్, ముప్పరాజు కార్తీక్, గుజ్జర్లపూడి బాబూరావు, కంచర్ల సూర్యప్రకాష్‌లను అరెస్ట్‌చేసి మంగళవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి తనను పోలీసులు కొట్టినట్లు ఆరోపించడంతో ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యచికిత్స చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి బి.శిరీష పోలీసులను ఆదేశించారు. మిగిలిన పదిమందికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పట్టాభిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, మిగిలినవారిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. పోలీసులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం గన్నవరం ఘటనకు సంబంధించి మచిలీపట్నం, నాగాయలంకల్లో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గన్నవరం నుంచి తొమ్మిదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మచిలీపట్నంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్నవరం టీడీపీకి చెందిన ఒక న్యాయవాది తొమ్మిదిమంది అనుచరులతో అక్కడికి వెళ్లి భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసి పోలీసులు నిర్భంధించిన తొమ్మిదిమంది నాయకులు, కార్యకర్తలను కారుల్లో తప్పించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ జాషువ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జీపీఎస్ ద్వారా తప్పించుకున్న వారిని వెంబడించి నిమిషాల వ్యవధిలో న్యాయవాదితో సహా అందరినీ పట్టుకుని బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వాణి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరం ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను సోమవారం అర్ధరాత్రి నాగాయలంక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు, స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. బోడెని చూసేందుకు అనుమతించాలంటూ సీఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ మహిళా నేత తలశిల స్వర్ణలత, కొందరు తెలుగు తమ్ముళ్లు సచివాలయ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా మాట్లాడారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ స్టేషన్లో బోడెను పరామర్శించారు. బోడె ప్రసాద్‌ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసులతో పట్టాభి భార్య వాగ్వాదం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టాభి ఇంటివద్ద మంగళవారం ఆయన భార్య చందన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె నిరపరాధి అయిన తన భర్తను విడుదల చేయకపోతే డీజీపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించటంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీనిపై ఆమె పోలీసులతో పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి పలువురు టీడీపీ నేతలు పట్టాభి ఇంటిపైకెక్కి ఆందోళన చేపట్టారు. పట్టాభి కుటుంబ సభ్యులను మంగళవారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం టీడీపీ నాయకుడు పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయని ఎస్పీ పి.జాషువ చెప్పారు. ఆయన దాడికి ప్రేరేపించడంతోనే సీఐ కనకారావు గాయపడ్డారని తెలిపారు. మచిలీపట్నంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై దాడికి సంబంధించి వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. సుమోటోగా రైటింగ్, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ వారి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును మంగళవారం పోలీసుల సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు జయపాల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మస్తాన్‌ఖాన్ పరామర్శించారు. -
రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ
‘‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళతా!. ఎవడేం పీకుతాడో చూస్తా. ఆ వంశీ సంగతి తేలుస్తా. నియోజకవర్గంలోంచి బయటకు విసిరేస్తా’’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ముందు రెచ్చగొట్టింది... టీడీపీ నాయకుడు పట్టాభి. ‘‘దొంతు చిన్నా ఇంటికి వచ్చి వంశీ మనుషులు బెదిరించారని మీరంతా కేసు పెట్టండి. నేనూ వస్తా. వంశీ సంగతి తేలుస్తా’’ అని గన్నవరం టీడీపీ నేతలతో చెప్పింది... పట్టాభి. అన్నట్టుగానే వెళ్లాడు. తనతో పాటు కొంతమందిని అక్కడికి తీసుకువెళ్లటంతో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులను కూడా వెంటేసుకుని... దండయాత్రకు బయలుదేరాడు. అక్కడ అలజడి సృష్టించబోయాడు. వంశీ అనుచరులు, అభిమానులు దీన్ని అడ్డుకోబోయారు. అప్పుడే ఇరువర్గాలకూ ఘర్షణ జరిగింది. తెలుగుదేశం నేతలు ముందే ఘర్షణకు సిద్ధమై మారణాయుధాల్లాంటి పరికరాలు తీసుకెళ్లటం వల్లే... స్థానిక సీఐ కనకారావు నుదుటిపై తీవ్ర గాయమైందనేది ప్రత్యక్ష సాక్షుల మాట. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటో తెలుసా? బాధితులను పరామర్శించటానికంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయన అనుకూల మీడియా రభస మొదలెట్టింది. మొత్తానికి అందరూ కలిసి... అసలిక్కడ ప్రజాస్వామ్యమే లేదంటూ ఆక్రందనలు మొదలుపెట్టారు. అదీ కథ. (సాక్షి ప్రతినిధి, విజయవాడ): అసలిక్కడ బాధితులెవరు? చంద్రబాబు నాయుడు ఓదార్చాల్సింది ఎవరిని? ఓదార్చటం కన్నా ముందు తెలుగుదేశం నేతల్ని మందలించాలి కదా? ఇలాంటి సవాళ్లు, బెదిరింపులు రాజకీయాల్లో సరికాదని చెప్పాలి కదా? గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన బచ్చుల అర్జునుడు దురదృష్టవశాత్తూ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో చేరితే... ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇంత అత్యుత్సాహం తగదని పట్టాభికి చెప్పాలి కదా? అవేమీ లేకుండా పట్టాభికి తోడుగా మీరంతా ఎందుకు వెళ్లలేదని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడే క్లాసు తీసుకున్నారంటే ఆయన మానసిక స్థితిని ఎలా అంచనా వేసుకోవాలి? రాజకీయ పునర్వైభవం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారనేగా అర్థం!!. పట్టాభి కూడా అంతే. అవును మరి! ఆవు చేలో మేసినపుడు దూడ గట్టున మేస్తుందా!!? విజయవాడే కాదు. కృష్ణా జిల్లాలో అందరికీ ఇటీవల సంకల్పసిద్ధి అనే ఫైనాన్స్ కంపెనీ చేసిన మోసం గురించి తెలిసే ఉంటుంది. నిర్వాహకులను పట్టుకోవటంతో పాటు పోలీసులు కేసులూ పెట్టారు. అయితే దాన్ని అదునుగా తీసుకున్న తెలుగుదేశం నేతలు కొన్నాళ్లుగా సంకల్పసిద్ధి నిర్వాహకులతో సంబంధం ఉందంటూ గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు ఆ సంస్థ వివరాలు గానీ, నిర్వాహకుల ఊరూపేరూ గానీ ఏమీ తెలియవని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అయినా సరే తెలుగుదేశం నేతలు తమ విమర్శలు కొనసాగిస్తుండటంతో... దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు వల్లభనేని వంశీ. కాకపోతే దీన్ని కూడా తెలుగుదేశం నేతలు ఎగతాళి చేశారు. అసలు వంశీకి పరువంటూ ఉంటే కదా... కేసులు వెయ్యాల్సింది? అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వంశీని విమర్శిస్తూ... ఆయన సంగతి తేలుస్తానని టీడీపీ నేత దొంతు చిన్నా ఆవేశంతో ఊగిపోయాడు. ఇదిగో... ఇదే కారణంతో వంశీ అనుచరులు చిన్నా ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి ఆయన లేకపోవటంతో... ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని, నోరు అదుపులో ఉంచుకోమని ఆయనకు చెప్పాలంటూ చిన్నా భార్యతో మాట్లాడి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న పట్టాభి... దీన్నో అవకాశంగా మార్చుకుని అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నారు. విజయవాడ నుంచి మనుషులను తీసుకుని వెళ్లి మరీ అక్కడ వారందరితో కలిసి ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే బాధితులు వెళితే సరిపోదా? ఇన్ని వందల మంది ర్యాలీగా వెళ్లాలా? అలా వెళ్లారంటే ఏమిటర్థం? వాళ్లు వెళ్లింది దండయాత్రకనేగా? క్లుప్తంగా గన్నవరంలో ఘర్షణలకు దారితీసిన ఘటనలు ఇవే. సోమవారం టీడీపీ మూక పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా ఇరు వర్గాలూ ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చల్లబరిచారు. తరవాత టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ముందే పగలగొట్టిన నాపరాళ్లతో పాటు చేతికందిన కర్రలు, రాడ్లు సిద్ధం చేసుకున్నారు. అంతలో అటుగా వెళుతున్న వంశీ అనుచరులను చూసి రెచ్చగొట్టేలా అరవటంతో... అక్కడ ఇరువర్గాలూ ఘర్షణకు దిగాయి. వీరిని వారించబోయిన పోలీసులకూ టీడీపీ నేతల చేతిలో గాయాలయ్యాయి. ఎస్పీ జాషువా అప్రమత్తంగా వ్యవహరించి, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కుదుట పడింది. అదీ జరిగిన కథ. దూషణల్లో నెంబర్–1 చంద్రబాబే... వాస్తవానికి కొన్నాళ్లుగా ముఖ్యమంత్రితో సహా ఆయన కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరందరిలోనూ చంద్రబాబే ముందుంటూ... ఎక్కడకు వెళ్లినా, ఏ సభలోనైనా పదుల సార్లు ‘సైకో’ అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర దూషణకు దిగుతున్నారు. అదే కోవలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలకు, జీతగాళ్లకు కూడా చెబుతున్నారు. ఏ చిన్నఘటన జరిగినా వారిని ఉసిగొల్పుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయిస్తున్నారు. తనకు వంత పాడే మీడియా సహకారంతో అధికార పార్టీనే తిరిగి వేలెత్తి చూపిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివద్ధి పాలనలో వేలెత్తి చూపే అంశాల్లేక... ప్రజల్లోకి వెళ్లడానికి మొహం చెల్లక ఇలాంటి రచ్చకు దిగుతున్నారనేది తెలియనిదేమీ కాదు. ఈ నెలలోనే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలో మూడు ఘటనలు జరిగాయంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. చిన్న విషయాలను పెద్దవి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. మచిలీపట్నం, గుడివాడలోనూ.. మచిలీపట్నంలో ఈ నెల 7న ఇదే విధంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. నిబంధనలు పాటించాలని కోరిన పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని, దానిని అడ్డుకొంటామంటూ రవీంద్ర కార్యకర్తలతో కలిసి వచ్చి అమలులో ఉన్న 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లంఘించారు. పోలీసులు ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతుందని, ధర్నాకు అనుమతి లేదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు. దీంతో రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రవీంద్ర పోలీసులను నెట్టుకుంటూ, దుర్భాషలాడుతూ, నడి రోడ్డులో ఎస్సైపై చెయ్యి చేసుకున్నారు. ఆ మరునాడే గుడివాడలోనూ టీడీపీ నాయకులు బరితెగించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు మునిసిపల్ అధికారులకు వేలు చూపిస్తూ బూతులతో రెచ్చిపోయారు. కోర్టు ఆదేశాలను అడ్డుకోవడం నేరమని చెప్పిన పోలీసులు, అధికారులపై జులుం ప్రదర్శించారు. -
గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్..
గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన 10 మందిని రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు. కాగా గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీ ఆఫీస్ నుండి పట్టాభి నాపై దుష్ర్పచారం చేశారు: వంశీ
-
‘చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు’
న్యూఢిల్లీ: చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు లోకేష్, బోండా ఉమ, దేవినేని ఉమ, పట్టాభి వ్యాఖలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పై అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని వివరించామని తెలిపారు. అనాగరికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోని.. ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరామన్నారు. రాజ్యంగా బద్ధంగా జరిగే ఎన్నికలలో టీడీపీ ఉగ్రవాదులకు స్థానంలేదని మండిపడ్డారు. కాగా, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై కేసులు పెడితే తప్పేంటని ఎన్నికల సంఘం ప్రశ్నించిందని అన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నంబర్లను పంపాలని ఈసీ కోరిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి -
చూడవయ్యా నీ మంత్రే ఏమన్నాడో..
-
‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’
సాక్షి, విజయవాడ: ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో చంద్రబాబుకు తెలుసా. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టి మోదీ, అమిత్ షా అపాయింట్ కూడా ఇవ్వలేదు’’ అని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాసివ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా) ‘‘పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించి ఉంటే బావుండేది. గతంలో చంద్రబాబు ప్రధాని మోదీకి నిరసన స్వాగతం పలికారు. అమిత్ షా కుటుంబతో సహా తిరుమలకు వస్తే దాడులు చేయించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీని వ్యతిరేకిస్తూ దీక్షలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడాలని చంద్రబాబు భావిస్తున్నారు’’ అని విజయ్ బాబు తెలిపారు. చదవండి: పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి -
పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని
కాకినాడ(తూర్పుగోదావరి): మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ఆ పార్టీ నేత పట్టాభికి ప్రాణహాని పొంచి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైఎస్సార్ సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరిత తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) స్థానిక డి కన్వెన్షన్‌లో ద్వారంపూడి సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయిట్మెంట్ కోరడంపై స్పందిస్తూ.. ఒకప్పుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించిన చంద్ర బాబు ఈవేళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలని అన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌పై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం