peaceful
-
శ్రీలంకలో పోలింగ్ ప్రశాంతం
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలూ నమోదు కాలేదు. చివరి సమాచారం అందేసరికి 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ఈయూ, కామన్వెల్త్ తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. 38 మంది బరిలో దిగినా ప్రధాన పోటీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో పాటు జనాదరణతో దూసుకుపోతున్న జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్యే నెలకొనడం తెలిసిందే. రేసులో దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేస్తారు. పూర్తి మెజారిటీ సాధించే అభ్యర్థి విజేత అవుతాడు. -
Lok sabha elections 2024: తొలి దశ పోలింగ్ ప్రశాంతం
న్యూఢిల్లీ: పలు చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటిదాకా అందిన గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 స్థానాల్లో మొత్తంగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు అందిన సమాచారం మేరకు 62.37 శాతం మేర పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి చెప్పారు. పోలింగ్ శాతం ఇంకా పెరగవచ్చని తెలిపారు. మొత్తం లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా తొలి దశలోనే అత్యధిక స్థానాలకు పోలింగ్ జరిగింది. 2019లో ఇవే లోక్‌సభ స్థానాల్లో 69.43 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్‌ను అనుమతించారు. యువ ఓటర్లు.. నవ దంపతులు ఓటు హక్కు వచ్చాక తొలిసారి ఓటేసేందుకు భారీ సంఖ్యలో యువత ఆసక్తి చూపారు. కొత్త దంపతులు, వృద్దులు, దివ్యాంగులు సైతం పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేశారు. తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, అస్సాంలోని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అందిన సమాచారం ప్రకారం త్రిపురలో 80.17 శాతం, పశ్చిమబెంగాల్లో 77.57 శాతం, తమిళనాడులో 72.09 శాతం, అస్సాంలో 70.77 శాతం, మేఘాలయలో 74.21 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58 శాతం, మహారాష్ట్రలో 61.06 శాతం పోలింగ్ నమోదైంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో గిరిజన సంఘాల కూటమి ఇచ్చిన పిలుపు మేరకు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ప్రజలు అసలు పోలింగ్ కేంద్రాల వైపే రాలేదు. మణిపూర్‌లో 69 శాతానికి పైగా జాతుల మధ్య వైరంతో రావణకాష్టంలా రగిలిపోయిన మణిపూర్‌లో ఆశాజనకంగా 69.13 శాతం పోలింగ్ నమోదైంది. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్‌లోని నాలుగు పోలింగ్‌బూత్‌లలో ఆగంతకులు ఈవీఎంలను ధ్వంసంచేశారు. ఒక బూత్‌ను నాశనంచేశారు. తరచూ మావోలు, బలగాల ఎదురుకాల్పుల మోతతో దద్దరిల్లే బస్తర్ ప్రాంతం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 63.41 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గాల్గమ్ గ్రామంలో పోలింగ్ కేంద్రం సమీపంలో అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్ పొరపాటున పేలడంతో సీఆర్పీఎఫ్ జవాను దేవేంద్ర తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. తమిళనాడులో 72.09% ఓటింగ్ రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72.09 శాతం పోలింగ్ నమోదైంది. తాంబరంసహా కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలలో సాంకేతిక కారణాలతో పోలింగ్ గంట ఆలస్యంగా ఆరంభమైంది. సేలంలో ఇద్దరు వృద్దులు ఓటేసేందుకు పోలింగ్కేంద్రానికొచ్చి మరణించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ సీఎంలు పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామి, తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్‌కుమార్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో 2019 ఎన్నికల్లో 72.44 శాతం పోలింగ్‌నమోదైంది. తమిళనాడుసహా, ఉత్తరాఖండ్, అరుణాచల్, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షదీ్వప్లలో ఒకే దఫాగా అన్ని స్థానాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్, మణిపూర్, త్రిపుర, జమ్మూకశీ్మర్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ అసెంబ్లీకి 65.79% అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం మధ్యాహ్నం అందిన సమాచారం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లో 65.79 శాతం పోలింగ్ నమోదైంది. 60 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మిగతా పది చోట్ల బీజేపీ ఇప్పటికే ఏకగ్రీవంగా విజయం సాధించింది. సిక్కింలోని మొత్తం 32 శాసనసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 67.95 శాతం పోలింగ్ నమోదైంది. హైలైట్స్ ► జమ్మూకశీ్మర్ డోడా జిల్లాలో పెళ్లింట అప్పగింతల కార్యక్రమం ఆలస్యంకావడంతో వధువు మోనికా శర్మ ఆలోపు పోలింగ్‌స్టేషన్‌కు వెళ్లి ఓటేసి వచి్చంది ► జైపూర్‌లో 95 ఏళ్ల నేవీ మాజీ అధికారి ఆర్ఎన్ సింగ్, ఔరంగాబాద్‌లో 92 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ ఉదయ్ సింగ్ వీల్‌చైర్‌లో వచ్చి ఓటేశారు ► అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత అణగారిన షోంపెన్ గిరిజన తెగకుచెందిన ఏడుగురు తొలిసారిగా ఓటేశారు. ► బస్తర్ పరిధిలో తొలిసారిగా 56 గ్రామాలకు చెందిన ఓటర్లు తమ సొంత ఊళ్లలోనే బూత్‌లు ఏర్పాటుచేయడంతో ఓటేశారు. ► బిహార్, యూపీ, తమిళనాడులోని కొన్ని గ్రామల ప్రజలు తమకు కనీస సదుపాయాలు లేవంటూ పోలింగ్‌ను బహిష్కరించారు ► అస్సాంలోని లఖీంపూర్ స్థానంలో ఈవీఎంలున్న కారును తరలిస్తున్న పడవ నీటిలో మునిగింది ► కశ్మీర్లో సైలెంట్ విలేజ్ నుంచి తొలిసారిగా ముగ్గురు మూగ, చెవిటి అక్కాచెల్లెళ్లు ఓటేశారు ► ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా పేరొందిన జ్యోతి ఆమ్గే నాగ్‌పూర్ పట్టణంలో ఓటేశారు ► నాగ్‌పూర్‌లో 27 మంది ఉమ్మడి కుటుంబసభ్యులంతా ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ► బ్యాలెట్ పేపర్ అయితేనే ఓటేస్తానంటూ హరిద్వార్‌లో ఓ వృద్దుడు ఈవీఎంను నేలకేసి కొట్టాడు ► ఛత్తీస్‌గఢ్‌లోని 102 నియోజకవర్గాల్లో మహిళా సిబ్బంది ‘పింక్’ దుస్తుల్లో హాజరయ్యారు ► అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో పోలింగ్ సిబ్బంది 40 కిలోమీటర్లు కాలినడకన కొండకోనలు ఎక్కిమరీ మారుమూల ప్రాంతంలో ఏర్పాటుచేసిన మాలోగామ్ పోలింగ్స్టేషన్లో ఏకైక ఓటరైన 44 ఏళ్ల మహిళ సోకేలా తయాంగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రాజస్తాన్‌లో 75% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రవీణ్ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్‌గఢ్, ధోల్పూర్ జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాశ్ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్ జోథ్‌పూర్‌లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్‌లో, పైలట్ జైపూర్‌లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. స్వల్ప ఘటనలు.. దీగ్ జిల్లా కమన్ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్ జిల్లా ఎస్పీ చెప్పారు. సికార్ జిల్లా ఫతేపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ధోల్పూర్ బారి నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద పోలింగ్ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. టోంక్ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్పీ రాజశ్రీ రాజ్ చెప్పారు. సుమేర్పూర్ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్ శాంతి లాల్, ఉదయ్‌పూర్‌లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్ బూత్‌ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
శాంతియుత దేశం ఏది? అశాంతికి నిలయమెక్కడ? భారత్ పరిస్థితేంటి?
అది.. మొన్నటి అక్టోబర్ 7 నాటి ఉదయం.. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగినవార్త హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలాది క్షిపణులను హమాస్ ప్రయోగించింది. అక్కడి ప్రజలు ముందురోజు రాత్రిపూట ఎంత ప్రశాంతంగా నిద్రించారో.. మరుసటి రోజు నాటికి విగతజీవులుగా ఎలా మారారో తలచుకుంటేనే ఆవేదన పెల్లుబికి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచంలో శాంతి కరువైపోతున్నదనే భావన అందరిలో కలుగుతుంది. ఏ దేశంలో ఎప్పుడు దాడి జరగవచ్చో అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తుంది. ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఎవరూ చెప్పలేకపోయినా, అందుకు బదులుగా ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఇది 2008 నుండి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి. 2023లో ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశం ఆఫ్ఘనిస్తాన్. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇదే స్థాయిలో ఉంది. యెమెన్, సిరియా, సౌత్ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి. అత్యధిక జనాభా కలిగిన భారత దేశం 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్ (జీపీటీ)లో 126వ అత్యంత శాంతియుత దేశంగా ఉంది. హింసాత్మక నేరాలు తగ్గుముఖం, పొరుగు దేశాలతో సంబంధాలు, రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది దేశంలో శాంతి 3.5 శాతం మెరుగుపడింది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గింది. ఇది కూడా చదవండి: భారత్-యూరప్ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది? -
శాంతం–సంగీతం
వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి. వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు. ‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం. త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి. మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పరిషత్ ఎన్నికలు: పోలింగ్ ప్రశాంతం..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. మొత్తం 27,751 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా 60.91 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం కాస్త తగ్గినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటం, చివరి నిమిషం వరకు ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితి, కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇందుకు కారణమని తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎక్కువ హడావుడి ఉంటుంది. గ్రామంలో ఓటు ఉండి.. వివిధ కారణాలతో పొరుగు ఊళ్లలో తాత్కాలికంగా నివాసం ఉండేవారు ఈ రెండు రోజుల్లోనే స్వగ్రామాలకు చేరతారు. ఇలాంటి ఓటర్లు దాదాపు 10 శాతం వరకు ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆఖరి నిమిషం వరకు కొనసాగిన అనిశ్చితితో వారంతా స్వగ్రామాలకు చేరుకోలేకపోయారు. కొన్ని మండలాల్లో 81 శాతానికిపైనే ఓటింగ్.. గత వారం రోజులుగా పెరుగుతున్న కరోనా ఉధృతి పోలింగ్‌పై ప్రభావం చూపిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరోనా కేసుల నమోదు తక్కువగా ఉన్న జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటే 15 శాతానికిపైనే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైన పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 68.27 శాతం ఓటింగ్ నమోదైంది. అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రెండో జిల్లా విజయనగరం జిల్లాలో 67.13 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఆ జిల్లాలోని డెంకాడ మండలంలో 81.71 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మండలాల్లో 40 – 45 శాతం ఓట్లు మాత్రమే నమోదయినప్పటికీ.. విజయనగరం జిల్లాలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన సీతానగరం మండలంలో కూడా 56.84 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో చాలా మండలాల్లో 75 శాతానికి పైనే ఓటింగ్ శాతం నమోదైందని.. అదే సమయంలో కొన్ని మండలాల్లో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యల్ప శాతం రాష్ట్రంలో 8 జిల్లాల్లో 60 శాతం పైబడే ఓటింగ్ నమోదు కాగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యల్పంగా 51.68, 53.52 పోలింగ్ శాతం నమోదైంది. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలతోపాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 60 శాతానికి పైబడి ఓటింగ్ నమోదైంది. మూడు గ్రామాల్లో రీపోలింగ్.. కాగా, విజయనగరం, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు గ్రామాల్లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహణకు జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు అందాయి. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో తప్పులు దొర్లాయి. దీంతో ఆ ఎంపీటీసీ స్థానం పరిధిలోని మూడు పోలింగ్ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు రీపోలింగ్ జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తెలిపింది. ♦నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం చౌట భీమవరంలో ఒక పోలింగ్ బూత్‌లో బీజేపీ తరఫున ఏజెంట్‌గా కూర్చున్న వ్యక్తి బ్యాలెట్ బాక్స్‌ను అపహరించి నీళ్ల తొట్టిలో వేయడంతో అక్కడ కూడా రీపోలింగ్ జరగనుంది. ♦పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక, సూరంపూడిలో కూడా ఒక బూత్‌లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ.. ♦గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పర్యవేక్షించారు. ♦రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కమిషనర్ గిరిజా శంకర్ ఎప్పటికప్పుడు పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్ విధానంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు.. ♦శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పోలింగ్స్టేషన్లో ఓటరు స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఎన్నికల అధికారులను కలెక్టర్ జె.నివాస్ సస్పెండ్ చేశారు. టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన ఇచ్చినా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కొత్తూరు మండలంలో మాతలలో ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో మాతల నుంచి టీడీపీ తరఫున ఆయన సతీమణి కలమట ఇందిర పోటీ చేశారు. ♦రామకుప్పం మండలంలో అత్యధిక జనాభా ఉన్న రామాపురం తండాలో కాకుండా ననియాల తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్ ఆ గ్రామాలకు వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలంలో మూడు పంచాయతీల వారు నాటు పడవలపై మత్స్యగెడ్డ దాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుజనకోట పంచాయతీలోని 11 గ్రామాల గిరిజనులు గెడ్డ దాటి వచ్చి సుజనకోట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి శంభునిపాళెం గ్రామస్తులు తమను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. ♦ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్‌లో కొంత జాప్యం జరిగింది. ♦పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని ఎల్ఎన్డీపేట, పైడిపాక, మామిడిగొంది, దేవరగొంది గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎల్ఎన్డీపేటలో ఎస్టీలు లేకపోయినా ఎస్టీలకు కేటాయించారని, పైడిపాక పునరావాస కేంద్రంలోని గిరిజనేతరులను ఇటికిలకోట గిరిజన పంచాయతీలో కలిపారని, మామిడిగొంది, దేవరగొంది గ్రామాలను ఒకే పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్నికలను బహిష్కరించారు. ఇరగవరం మండలంలో రాపాక, సూరంపూడి ఎంపీటీసీ స్థానానికి బ్యాలెట్ పేపర్ మారిపోవడంతో ఎన్నిక నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల్లో జవాన్లు మృతి చెందడంతో ఏపీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 47.03 శాతం పోలింగ్ కేంద్రాలు ఉండటంతో పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరిషత్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 27,751 పోలింగ్ కేంద్రాల్లో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్‌ను పూర్తి చేసి బ్యాలెట్ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాడేపల్లి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ప్రక్రియపై నిఘా పెట్టి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 3,530 మందితో నిరంతర వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం: ఎస్ఈసీ నీలం సాహ్ని కొన్ని స్వల్ప ఘటనలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60.91 శాతం పోలింగ్ నమోదైందన్నారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ విధులకు హాజరైన ముత్తుపల్లి జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అబ్జర్వర్లతోపాటు పోలింగ్ సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. చదవండి: వీడియో వైరల్: హైదరాబాద్‌కు రజనీకాంత్ రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
రెండో విడతలోనూ ప్రభంజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండో దశలోనూ గులాబీ గుబాళించింది. అత్యధిక గ్రామ పంచాయతీలను దక్కించుకొని తిరుగులేని అధిక్యతను సాధించింది. శుక్రవారం ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో అన్నింట్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. తొలిదశలో కారుజోరు సాగగా.. రెండో విడతలో కూడా దుమ్ము రేపింది. ఏకంగా ఆ పార్టీ 85 గ్రామ పంచాయతీలను చేజిక్కించుకుంది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గణనీయంగా సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. తలకొండపల్లిలో ఏకంగా 24 గ్రామ సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకోగా.. కడ్తాల్‌లో 14, మాడ్గులలో 19 గ్రామాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 41 పల్లెలను హస్తగతం చేసుకుంది. ఆరు జీపీల్లో బీజేపీ, నాలుగు చోట్ల సీపీఎం, మూడు గ్రామాల్లో టీడీపీ విజయం సాధించింది. 12 చోట్ల స్వతంత్రులు విజయఢంకా మోగించారు. ఇదిలావుండగా, శివారు మండలాలు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. స్థిరాస్తి రంగం ప్రభావం గ్రామాలపై కనిపించడంతో సర్పంచ్, వార్డుల్లో పాగా వేసేందుకు ఇబ్బడిముబ్బడిగా నగదును వెదజల్లారు. రిజర్వ్డ్ స్థానాల్లో ఉప సర్పంచ్ పోస్టును కైవసం చేసుకోవడానికి రూ.లక్షలు వెచ్చించారు. 89శాతం పోలింగ్ రెండో దశ పంచాయతీ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 89శాతం పోలింగ్ నమోదైంది. తొలిదశతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ. ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలకుగాను 21జీపీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో మాడ్గుల మండలం ఫల్గుతండా సర్పంచ్ పదవి వివాదాస్పదమైంది. పదవిని వేలం వేశారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో ప్రస్తుతానికి దీన్ని పెండింగ్‌లో పెట్టారు. దీనిపై ఈసీ నిర్ణయం వెలువరించే వరకు వేచిచూడాల్సిందే! మరోవైపు ఏకగ్రీవం పోను మిగతా 160 పంచాయతీలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉత్కంఠ మధ్య సాగిన కౌంటింగ్‌లో విజేతలు నిలిచిన అభ్యర్థులు విజయ దరహాసంతో ఊరేగగా.. పరాజితులు ఓటమి భారంతో వెనుదిరగడం కనిపించింది. మాడ్గుల మండలం కొల్కుల్‌పల్లిలో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థి విజేత వర్గీయులపై రాళ్లురువ్విన సంఘటనలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. -
మలి విడత ప్రశాంతం
ఇచ్చోడ(బోథ్): జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారిని వాహనాలు, మంచాలపై పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి ఓటేయించారు. రెండో విడతలో బోథ్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 83 పంచాయతీలు, 322 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మండల కేంద్రాలతోపాటు పెద్ద పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. చివరి నిమిషం వరకు కూడ ఓట్లు వేశారు. ఎన్నికలు జరిగిన 83 పంచాయతీల పరిధిలో మొత్తం 94,463 మంది ఓటర్లు ఉండగా 78,407 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన వారిలో 40,051 మంది పురుషులు ఉండగా 38,356 మంది మహిళలు ఓటు వేశారు. పోలింగ్ జరిగింది ఇలా.. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఆయా పంచాయతీలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా, 9 గంటల వరకు పోలింగ్ అంతంత మాత్రమే జరిగింది 11 గంటల వరకు తలమడుగు మండలంలో 29.19 శాతం, గుడిహత్నూర్ మండలంలో 29.51 శాతం, బోథ్ మండలంలో 21.68, బజార్హత్నూర్ మండలంలో 22.07, నేరడిగొండ 31.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల నుంచి పోలింగ్ ఊపందుకుంది. బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, గిర్నూర్, పిప్రి పంచాయతీల్లో మినహా ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వచ్చారు. వికలాంగులు, వృద్ధులను ఆటోల్లో మోటార్ సైకిళ్ల ద్వార ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు. బోథ్ మండలంలోని కుచ్లపూర్ పంచాయతీ సర్పంచ్‌కు 6 వార్డులకు ఏకగ్రీవంగా కాగా కేవలం ఒక్క వార్డుకే ఎన్నికలు జరిగాయి. ఒక్క వార్డు కోసం రిటర్నింగ్ ఆధికారితోపాటు ఇద్దరు ఎన్నికల సిబ్బంది ద్వారా ఎన్నికలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వార ఓట్లు వేసిన ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వార ఓటింగ్‌కు కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. నిరక్షరాసులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలలో రెండు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడంతో తికమక పడ్డారు. ఎన్నికల సిబ్బంది ఓటర్లకు ఓటు వేసే విధానాన్ని వివరించి చెప్పడంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్తండాలో సర్పంచ్‌గా పోటీ చేసిన కళాబాయి తన ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా ఆమెకు ప్రాణపాయస్థితి తప్పింది. రెండో విడతలో 83.6శాతం నమోదు రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు. రెండో విడతలో 83.6శాతం నమోదు రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు. -
‘ఫస్టియర్’ ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రేటర్లో మొదటి పరీక్షలకు 5101 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు మొరాయించడంతో...అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు కాస్త ఇబ్బందిపడ్డారు. చాలా మంది వారికి లిఫ్ట్ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు వాహనంలో కొందరిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలు షెడ్యూలు ప్రకారం మార్చి 2 వతేదీ నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే (మార్చి 2న సెకండ్ ఇయర్) పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు నిర్థేశిత సమయానికి గంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదాబాద్ జిల్లాలో 79574 మంది విద్యార్థులకు 77258 మంది హాజరుకాగా, 2316 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 5803 మందికి 56538 మంది హాజరయ్యారు. 1515 మంది గైర్హజరయ్యారు. మేడ్చల్‌జిల్లాలో 60876 మందికి 59606 మంది పరీక్ష రాయగా, 1270 మంది గైర్హ జరైనట్లు ఆయా జిల్లాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. నిమిషం ఆలస్యం నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. నాలుగైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా లోనికి అనుమతించారు. తొలితప్పిదంగా భావించి వారిని హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్, మాస్‌కాఫియింగ్ వంటి ఎలాంటి కేసులు నమోదు కాలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో ఆయా సెంటర్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొరాయించిన ఆర్టీసీ బస్సు...పోలీసు వాహనంలో తరలింపు మారేడుపల్లి: ఇంటర్ పరీక్షలు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. పరీక్ష సెంటర్‌కు బయలుదేరే ముందే ఆర్టీసీ బస్సు మొరాయించడంతో విద్యార్థులు కంగారుపడ్డారు. చివరకు ఆ దారిలో వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడిగి కొందరు బయలుదేరగా...మరికొంత మందిని మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తన వాహనంలో ఎక్కించుకుని స్వయంగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాగ్నెట్ స్కూల్ అండ్ జూనియర్ మహిళా కళాశాలలో 78 మంది విద్యార్ధులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. వీరికి మారేడుపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో పరీక్ష సెంటర్ కేటాయించారు. ఉదయం 7:30 గంటలకు రాణీగంజ్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విద్యార్థులను తరలించేందుకు హాస్టల్‌కు చేరుకుంది. 7:45 గంటల ప్రాంతంలో విద్యార్థులు బస్సులో వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. తీరా బయలుదేరే ముందు బస్సు మొరాయించింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు ఆ దారిగుండా వచ్చే ఆటోలను ఆపి విద్యార్థులను పరీక్షహాల్‌కు తరలించారు. కొందర్ని తన వాహనంలో పరీక్ష సెంటర్‌కు తీసుకువెళ్ళారు. -
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి
– మంచిదారిలో పయనించాలి – ‘మమ్మాడే’ వేడుకల్లో కలెక్టర్ సత్యనారాయణ కామారెడ్డి క్రైం : మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పడే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓం శాంతి మందిరంలో మాతా జగదాంబ సరస్వతి వర్ధంతిని పురస్కరించుకుని మమ్మాడేను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ సత్యనారాయణ అక్కడున్న బ్రహ్మకుమార్లు, బ్రహ్మకుమారీలను ఉద్దేశించి మాట్లాడారు. మానవ జన్మ దేవుడిచ్చిన వరమన్నారు. ఈ జన్మకు సార్థకం చేసుకునేందుకు మంచి మార్గంలో పయనించాలని సూచించారు. మంచి, చెడు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయన్నారు. మంచి దారిని ఎంచుకుని ముందుకు వెళ్లేలా సమాజంలోని అందరికి బ్రహ్మకుమారీలు మార్గం చూపించాలన్నారు. క్షణికావేశం, తొందరపాటు నిర్ణయాలు మనిషిని తప్పుడు మార్గంలోని తీసుకువెళ్లకుండా మనస్సు అదుపులో ఉంచుకోవాలన్నారు. ఇవన్నీ ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో ఇటీవల కుకున్పల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఆత్మహత్యల సంఘటనలు చూస్తే తెలుస్తుందన్నారు. కామారెడ్డి ఓం శాంతి ద్వారా శాంతి సమాజ స్థాపన కోసం రాజయోగ కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. రాజయోగా ధాన్యం మానిసక ప్రశాంతత లభిస్తుందన్నారు. సమాపంలో అందరినీ రాజయోగ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం ఓం శాంతి మందిరం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన మాతా జగదాంబ సరస్వతి వర్ధంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆహారభద్రత కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలీసెట్ పరీక్ష
– వచ్చే నెల10వ తేదీన ఫలితాలు – 7 వేల మంది విద్యార్థులకుగాను 6716 మంది హాజరు కర్నూలు సిటీ: పాలీసెట్–2017 ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. కర్నూలు నగరం, నంద్యాల, శ్రీశైలంలలో ఏర్పాటు చేసిన 21 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. నగరంలోని ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో 4444 మంది విద్యార్థులకు గాను,4253 మంది, నంద్యాలలోని 8 కేంద్రాల్లో 2399 మందికిగాను, 2320 మంది, శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో 157 మందికికాను, 143 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పాలీసెట్–2017 ఫలితాలను వచ్చే నెల10 తేదీన విడుదల చేయనున్నారు. పలు కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు తనిఖీ చేశాయి. -
పరీక్ష ప్రశాంతం
- 176 కేంద్రాల్లో గ్రూపు-3 పరీక్ష - 56,076 మందికి 36,816 మంది హాజరు - వివరాలు సరిపోలక ఇబ్బందులు - అభ్యర్థుల అండర్‌టేకింగ్‌తో పరీక్షకు అనుమతి కర్నూలు(అగ్రికల్చర్): ఏపీపీఎస్సీ గ్రూపు-3 కేటగిరీలో పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన 176 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12.30 వరకు నిర్వహించిన పరీక్షకు 56,076 మందికిగాను 36,816 మంది హాజరయ్యారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల వారిని ఆళ్లగడ్డ, నంద్యాల.. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల వారికి ఎమ్మిగనూరులో సెంటర్లు కేటాయించడం వల్ల అభ్యర్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సాయిసుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిషు మీడియం స్కూల్ అడ్రసును బి.క్యాంపు మాధవీనగర్ అడ్రసుపై హాల్ టికెట్లు జారీ చేశారు. అయితే పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ కేంద్రం నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని బిషప్ చర్చి ఎదుట ఉన్నట్లు అ«ధికారులు ప్రకటించారు. అడ్రసు మారినందునా అభ్యర్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా అధికారులు రెండు కార్లు, 12 ఆటోలను సిద్ధంగా ఉంచారు. వివరాల్లో తేడాలతో ఇక్కట్లు... మొదటి సారిగా అభ్యర్థుల పూర్తి వివరాలతో ఓఎంఆర్ షీట్లను ముద్రించారు. అయితే ఓఎంఆర్ షీట్, హాల్ టికెట్‌లోని వివరాలు సరిపోలకపోవడంతో ఇన్విజిలేటర్లు అభ్యంతరం తెలిపారు. భార్య పేరుకు బదులు భర్త పేరుండటం, హాల్ టికెట్లో ఫొటోలు తారుమారు కావడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. కర్నూలు సిల్వర్ జుబ్లి కళాశాల, నంద్యాలలోని మరో సెంటరులో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొన్ని సెంటర్లలో ఇంటి పేర్లలోను తేడాలు వచ్చాయి. అయితే ఏపీపీఎస్సీ అధికారుల సూచనల మేరకు అభ్యర్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకొని పరీక్షకు అనుమతించారు. రెండు, మూడు అంతస్తుల్లో సీట్లు కేటాయించడంతో అక్కడికి చేరుకునేందుకు వికలాంగులు నానా ఇబ్బంది పడ్డారు. నలుగురు ఎపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు జిల్లాలో జరిగిన పరీక్షను పర్యవేక్షించారు. 11 మంది డిప్యూటీ కలెక్టర్లు అసిస్టెంటు కో ఆర్డినేటర్లుగా, 44 మంది తహసీల్దార్లు లైజన్ అధికారులుగా పరీక్షను పర్యవేక్షించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్సీ సీనియర్ సెక్షన్ అధికారి రమణ తెలిపారు. డీఆర్వో గంగాధర్‌గౌడు, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, డీటీ ఆదినారాయణ, ఇతర రెవెన్యూ అధికారులు బాగా సహకరించాలని కితాబిచ్చారు. -
ప్రశాంతం
ముగిసిన మండలి ఎన్నికల పోలింగ్ - ఓటు హక్కు వినియోగానికి ఉపాధ్యాయుల ఉత్సాహం - పెద్దగా ఆసక్తి కనపర్చని పట్టభద్రులు - ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన టీడీపీ అభ్యర్థులు - పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన పట్టభద్రుల నియోజవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేజే రెడ్డి - చాగలమర్రిలో అభ్యర్థి బచ్చల పుల్లయ్య రిగ్గింగ్ యత్నం - డోన్‌లో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతల వాగ్వాదం కర్నూలు(అగ్రికల్చర్): శానమండలి పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజవర్గం ఎన్నికల పోలింగ్ కర్నూలు జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ మందకోడిగా సాగింది. పోలింగ్ ప్రారంభం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ అంతంత మాత్రంగానే ఉంది. ఉపాధ్యాయ నియోజకవర్గం పోలింగ్ మాత్రం భారీగా జరిగింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్ రోజున కూడా టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించినప్పటికీ అధికారులు చూసీచూడనట్లు ఉండిపోవడం గమానార్హం. పలు పోలింగ్ కేంద్రాల్లో తమ పేర్లు గల్లంతయ్యాయని పట్టభద్రులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టభద్రుల నియోజవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేజే రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం విమర్శలకు తావిచ్చింది. పోలింగ్ రోజు అభ్యర్ధులకు మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ఇంత చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. చాగలమర్రిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థి బచ్చల పుల్లయ్య రిగ్గింగ్‌కు ప్రయత్నించినట్లు సమాచారం. తన మద్దతుదారులైన 10 మంది ఉపాధ్యాయులను వెంట పెట్టుకొని పోలింగ్ కేంద్రంలోకి దౌర్జన్యంగా వెళ్లి రిగ్గింగ్‌కు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డోన్‌లోని ఎస్కేపీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 249 పోలింగ్ కేంద్రంలో ఏజెంటుగా ఉన్న ఓ పత్రికా విలేకరి గేయానంద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం చెప్పడంతో తహసీల్దారు బయటికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు, ఉపాధ్యాయ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. బనగానపల్లిలో పోలింగ్ సమయం ముగుస్తుందనగా ఎక్కువ మంది ఓటర్లు రావడంతో పోలింగ్ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, ఎస్పీ, జేసీ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టరేట్ సమీపంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తన సతీమణితో వెళ్లి బి.క్యాంపు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రల పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేశారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సతీమణితో కలిసి పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు కోల్స్ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు జిల్లా అధికారులతో పాటు వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, నాయకుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. కాన్ఫరెన్స్ హాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తూ ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాన్ఫరెన్స్ హాల్ నుంచి జోనల్ అధికారులు, ఆర్డీఓలతో ఫోన్లో మాట్లాడుతూ పోలింగ్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. -
ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష
కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ త్రివిక్రమ వర్మ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఒంగోలు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన రాత పరీక్షకు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జడ్.రమేష్‌బాబు కన్వీనర్‌గా వ్యవహరించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జిల్లాలో 43 కేంద్రాల్లో నిర్వహించారు. 54 మంది అబ్జర్వర్లు, ఆరు స్క్వాడ్ బృంధాలతో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పోలీసులు ప్రత్యేకంగా ఐదు బస్సులను ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, నెల్లూరు బస్టాండ్ సెంటర్, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్, అద్దంకి బస్టాండ్ సెంటర్లలో బస్సులను ఉదయం నుంచే ఏర్పాటు చేశారు. నగర శివారుల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులను బస్సుల ద్వారా చేరవేశారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవటంతో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
ప్రశాంతంగా ఏఈఈ పరీక్ష
కాకినాడ సిటీ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS (ఏపీపీఎస్సీ) ద్వారా నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, అమలాపురంలలో 15 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. 5,621 మంది అభ్యర్థులకు గాను 4,182 మంది హాజరయ్యారు. కాకినాడలోని పలు సెంటర్లను జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, ఆర్డీఓ బి.ఆర్.అంబేడర్, ఏపీపీఎస్సీ సభ్యుడు కె.పద్మరాజు పరిశీలించారు. హాల్ టికెట్లలో పొరపాట్లు ఏఈఈ రాత ఈ పరీక్షలకు సంబంధించి పలువురు అభ్యర్థుల హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయి. కాకినాడలోని పలు సెంటర్లతో పాటు రామచంద్రపురం, రాజమండ్రిల్లో నిర్వహించిన కేంద్రాల్లో 12 మంది అభ్యర్థులకు ఇద్దరిద్దరికి ఒకే నంబర్ హాల్‌టికెట్లపై రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. మెకానికల్ సబ్జెక్టు అభ్యర్థులకు సివిల్ అని, సివిల్ అభ్యర్థులకు మెకానికల్ అని ఐదుగురికి వచ్చారు. దీంతో జిల్లా అధికారులు పొరపాట్లను గుర్తించి పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు ఒకే నంబర్ హాల్‌టికెట్ వచ్చిన అభ్యర్థులకు నంబర్ ’ఏ’ పెట్టి పరీక్షకు అనుమతించాలని, అలాగే సివిల్, మెకానికల్ అని హాల్ టికెట్ వచ్చిన తప్పులను అభ్యర్థులే సరిదిద్దుకొని డిక్లరేష¯ŒS తీసుకొని పరీక్షకు అనుమతించాలని సూచించడంతో ఆ మేరకు అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిపై జేసీ రాధాకృష్ణమూర్తిని వివరణ కోరగా కొందరి హాల్టికెట్లలో పొరబాట్లు వచ్చాయన్నారు. ఏపీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు అభ్యర్థులను పరీక్షకు అనుమతించామన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన మావో వారోత్సవాలు
పెదబయలు: మన్యం ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టుల వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. పెదబయలు, జి.మాడుగుల మండలాల సరిహద్దు గ్రామాల్లో నిర్మించిన స్థూపాల వద్ద ఎర్రజెండలు ఆవిష్కరించారు. గతంలో వారోత్సవాల సమయంలో∙మావోలు వేలాది మంది జనాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, అమరవీరులకు జోహార్లు అర్పించేవారు. అయితే ఈ సారి పోలీసు బలగాలు ఎక్కువగా మోహరించి, గాలింపు ముమ్మరం చేయడం, హెలికాప్టర్లతో కూడా గాలింపు జరపడంతో ఏవోబీలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోయారని తెలిసింది. ఏవోబీలో పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో కూడ స్థూపాల ఆవిష్కరించినట్లు సమాచారం. మొత్తం మీద వారోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో మన్యం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. -
ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుళ్ల సామర్థ్యపు పరీక్షలు
ఖమ్మం క్రైం : ఖమ్మం పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సామర్థ్యపు పరీక్షలు ఎస్పీ షానవాజ్ ఖాసీం అ«ధ్వర్యంలో మంగళవారం ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 1200 మందికిగాను 926 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 100 మీటర్ల పరుగు పందెంలో ఓ అభ్యర్థి పరిగెడుతూ కింద పడిపోవటంతో అతన్ని పోలీస్ సిబ్బంది స్టెచర్ మీద తీసుకోని వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికష్ణ, డీఎస్పీలు సురేష్‌కుమార్, అశోక్‌కుమార్, మాణిక్‌రాజ్, సంజీవ్, సీఐలు మొగిలి, వెంకటనర్సయ్య, ఎంటిఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ముగిసిన సమరం
♦ ప్రశాంతంగా ‘గ్రేటర్’ ఎన్నికలు ♦ జిల్లా పరిధిలోని 63 ♦ జీహెచ్ఎంసీ వార్డులకు ఓటింగ్ పూర్తి ♦ ఈనెల 5న ఓట్ల లెక్కింపు ♦ ఫలితాలపై పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీహెచ్ఎంసీ (హైదరాబాద్ మహానగర పాలక సంస్థ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీలోని 63 డివిజన్లున్నాయి. ఈ డివిజన్లలో పోలింగ్ పక్రియ పకడ్బందీగా సాగేందుకు 16వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలవరకు సాగింది. సమయం ముగిసేలోపు పోలింగ్ స్టేషన్లో ఉన్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ డివిజన్లలో మొత్తంగా 45శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. కీలక సీట్లలో గెలుపు కోసం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 150 డివిజన్లుండగా.. ఇందులో 63 డివిజన్లు జిల్లాలోనే ఉన్నాయి. 42 శాతం జిల్లా ఓటర్లే కావడంతో మేయర్ పీఠాన్ని జిల్లా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు. నగరంలో మజ్లిస్ సిట్టింగ్ సీట్లు మినహాయిస్తే మేయర్ గెలుపునకు జిల్లా సీట్లే కీలకం. దీంతో అన్నిపార్టీలు జిల్లా డివిజన్లపైనే గంపెడాశలు పెట్టుకుని పోరుకు దిగాయి. ఈ క్రమంలో అన్నిరకాల అస్త్ర, శస్త్రాలను ప్రయోగించిన అభ్యర్థులు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 5న ఫలితాలు.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈనెల 5న ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించనుంది. ఇప్పటివరకు గెలుపుకోసం కృషి చేసిన అభ్యర్థులు.. ఇక ఓటింగ్ సరళిని విశ్లేషించుకుని గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. ఇదిలావుండగా.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంకోసం నగరానికి తరలిన జిల్లా రాజకీయ నేతలు, కార్యకర్తలు సొంత ప్రాంతాలకు తిరుగుముఖం పట్టారు. శివారు ప్రాంతాల్లో స్థానిక నేతలకే ప్రచార బాధ్యతల్ని అప్పగించడంతో జిల్లాకు చెందిన నేతలంతా పక్షం రోజులపాటు నగరంలో తిష్టవేశారు. తాజాగా ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో తిరుగుపయనమయ్యారు. -
తొలి రోజు ప్రశాంతం
నో డీబార్ కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యూరుు. మొత్తం 63,128 మంది విద్యార్థులకు గాను 62,785 మంది విద్యార్థులు హాజరయ్యారు. 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలిరోజు జరిగిన పరీక్షలో మాస్‌కాపీయింగ్ పాల్పడినవిద్యార్థులు ఎవరూ లేకపోవడం విశేషం. జిల్లాలో 274 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా విద్యాధికారి 11 కేంద్రాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 85 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షను పర్యవేక్షించారు. మారిన సెలబస్‌లో పరీక్ష రాస్తున్న దృష్ట్యా అరగంట ముందే కేంద్రంలోని అనుమతిస్తారని, 15 నిమిషాలు ప్రశ్నాపత్రానికి సమయం ఇస్తారని ప్రకటించడంతో విద్యార్థులు ఉదయం 8గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రావడంతో అంతటా కోలాహలం కనిపించింది. బెస్టాఫ్ లక్, మంచిగా రాయు, టెన్షన్ పడకు, మొదటగా వచ్చినవి రాయు... అంటూ తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వారిని ఆశీర్వదించి పరీక్ష హాల్లోకి పంపించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. రాష్ట్ర పరిశీలకులు లక్ష్యారెడ్డి, జిల్లా విద్యాధికారి లింగయ్య పరీక్షల తీరును పర్యవేక్షించారు. అరకొర వసతులతో ఇబ్బందులు పది పరీక్షలను పక డ్బందీగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకొన్న జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ముందే ఏర్పాట్లను పూర్తి చేశాం... ఎక్కడా అసౌకర్యాలు లేవని చెప్పగా... జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అరకొర వసతుల నడుమ పరీక్షలను రాశారు. రామగుండం మండలంలోని పలు సెంటర్లలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు సరిపడే డెస్క్‌లను సమకూర్చలేకపోయారు. మంథని డివిజన్లోని పలు కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయడానికి బెంచీలు లేక నేలపై కూర్చుని రాశారు. జగిత్యాలలో సైతం అసౌకర్యాలతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కథలాపూర్ మండలంలోని ఓ పరీక్ష కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హల్చల్ చేశాయి. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్లతో పాటు సకల సౌకర్యాలు కల్పించడం విమర్శలకు తావిచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు సెంటర్లలో విద్యార్థులకు అసౌకర్యాలు తప్పలేదు. ఎన్టీపీసీ జ్యోతినగర్‌కు చెందిన యమున అనే విద్యార్థిని భారమైన హృదయంతో పరీక్ష రాసింది. అనారోగ్యంతో గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తండ్రి పీఠాపురం శంకర్(45) బు దవారం మృతి చెందాడు. తండ్రి మృతదేహం మా ర్చురీలో ఉండగా, యమున దుఃఖాన్ని దిగమింగుం టూ తెలుగు పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరై కన్నీటిపర్యంతమైంది. -
మొదటిరోజు ప్రశాంతం
విద్యార్థుల సంఖ్య 50,655 హాజరైనవారు 46,067 గైర్హాజరైనవారు 4,588 కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పరీక్ష సెంటర్ అడ్రస్ మారడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. నగరంలోని భారతి జూనియర్ కళాశాల కేంద్రం నంబర్ హాల్‌టికెట్‌లో కమాన్‌రోడ్ అని ఉండడం, కళాశాల కోతిరాంపూర్‌లోని బైపాస్‌రోడ్‌లో ఉండడంతో కాసేపు ఉరుకలు పరుగులు పెట్టారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల వెంబడి వారి తల్లిదండ్రులు, బంధువులు కేంద్రాల వద్దకు తోడుగా వచ్చారు. దీంతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడ చూసినా జనం రద్దీ కనిపించింది. నగరంలోని సైన్స్‌వింగ్ కళాశాలలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించడంలో పక్షపాతం వహిస్తున్నారని ఆలస్యంగా వచ్చిన కొందరిని అనుమతించి మరికొందరి అడ్డుకున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్ఐఓ సుహాసినితోపాటు పరీక్షల కేంద్రం అధికారులు సెంటర్‌ను సందర్శించి వివరాలు ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణ సజావుగా సాగినప్పటికీ మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం పరీక్ష రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేయకుండా కింద కూర్చోబెట్టి నిబంధనలను బేఖాతరు చేశారు. కళాశాలకు ఎక్కువ మంది విద్యార్థులను కేటాయించడంతో ఇరుకు గదులు సరిపోకపోవడంతో కింద కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు డిబార్... ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో సోమవారం ఇద్దరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కోహెడలో ఒకరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మపురిలో ఒకరు, ఇద్దరు మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడ్డట్లు ఆర్ఐఓ సుహాసిని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ విభాగంలో 45,233 మందికి 41,691 మంది, ఒకేషనల్ విభాగంలో 5422 మందికి 4,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో జిల్లావ్యాప్తంగా 50,655 మంది విద్యార్థులకు, 46,067 మంది హాజరుకాగా, 4,588 మంది గైర్హాజరయ్యూరు. -
శాంతియుతంగా నిరసనలు చేపట్టండి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు (సెంట్రల్): విద్యార్థుల సమస్యల పరిష్కారానికి శాంతియుతంగానే నిరసనలు చేపట్టాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరుసీటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆమోదంతో జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సుమారు 200 మంది విద్యార్థులు వైఎస్సార్ విద్యార్థి విభాగంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో విద్యార్థులు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ఉద్యమాలు చేపట్టే సమయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటిం చాలన్నారు. విద్యార్థులు పార్టీకి ఎంతో అవసరమన్నారు. పార్టీలో చేరినవారికి విద్యార్థి విభాగంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాలోకంటే నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అన్నిం టిలోనూ ముందుందని కొనియాడారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతామని ముం దుకు రావడం సంతోషకరమన్నారు. విద్యార్థుల న్యాయమైన సమస్యల పరి ష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు హరికుమార్, వైఎస్సా ర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, నగర అధ్యక్షుడు విశ్వరూపాచారి, రాష్ట్ర ఉప కార్యదర్శి హాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మదన్‌కుమార్‌రెడ్డి, హరికృష్ణ, సత్య, విద్యార్థి నాయకు లు వి.సురేష్, అవినాష్‌రెడ్డి, మన్సూర్, తేజ, ఆసిఫ్, కల్యాణ్ పాల్గొన్నారు. వైఎస్సార్ టీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన నివాసంలో సోమవారం అవిష్కరించారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.వాసు, ప్రధాన కార్యదర్శి బి.రఘురామిరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు కేవీ రమణారెడ్డి, కోవూరు మండల ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నిమజ్జనం
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్లలోని 23 చెరువులలో గణేశ్ నిమజ్జనం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగింది. గతేడాది పోలీసుల హడావుడి చేయడంతో నిర్వాహకులు నిమజ్జన ప్రక్రియను త్వరగా పూర్తి చేయగా..ఈ సారి పోలీసులు సహకరించడంతో నిదానంగా నిమజ్జనం చేశారు. అక్కడక్కడా ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలిగినా మొత్తం మీద చెప్పుకోదగ్గ సమస్యలు తలెత్తకపోవడంతో పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ ఊపిరిపీల్చుకున్నారు. గతనెల 29న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు నాలుగు రోజుల ముందు నుంచి సోమవారం జరిగిన నిమజ్జనం వరకు అనుసరించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. ఉదయం 11.15కి నిమజ్జనానికి బయల్దేరిన బాలాపూర్ గణేశుడితో ప్రధాన శోభాయాత్ర మొదలైంది. ఈ యాత్రకు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నగర పోలీసు కమిషరేట్ పరిధిలోకి వచ్చే కేశవగిరికి బాలాపూర్ గణేశుడు చేరుకున్నాడు. అక్కడి నుంచి నగర పోలీసులు ప్రధాన ఊరేగింపునకు బందోబస్తు వహించారు. చార్మినార్ వద్దకు ప్రధాన ఊరేగింపు చేరేలోపు ప్రార్థనల నేపథ్యంలో అక్కడి స్వాగత వేదికపై మూడు, నాలుగుసార్లు నేతల ప్రసంగాను పోలీసులు నిలిపివేయించారు. అలాగే ఊరేగింపును కూడా కొద్దిసేపు ఆపేశారు. ఆ తర్వాత ఊరేగింపు ముందుకు సాగింది. ఇదే సమయంలో పాతబస్తీలో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు సీపీలు అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించారు. రెండు గంటల పాటు అక్కడే అన్నారు. ఆ తర్వాత బషీర్‌బాగ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న మహేందర్‌రెడ్డి అక్కడి నుంచే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీల ప్రసారాలను తిలకిస్తూ అక్కడి నుంచే అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6.30కి బాలాపూర్ గణేశుడు చార్మినార్ దాటాడు. గతంలో బాలాపూర్ గణేశుడు వెనకాల ఎలాంటి విగ్రహాలు వచ్చేవికావు. ఈసారి అలా కాకుండా ముందుగా బాలాపూర్ గణేశుడిని దాటించడం.. ఆ తర్వాత పాతబస్తీలోని విగ్రహాలు బయలు దేరడం జరిగింది. రాత్రి 9 గంటల వరకు కూడా పాతబస్తీలో ఊరేగింపులు కొనసాగుతునే ఉన్నాయి. ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా వచ్చిన గణనాథులు లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిశాయి. ట్యాంక్‌బండ్, మిరాలంట్యాంక్, రాజన్నబావి,ఐడీపీఎల్ చెరువు, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పుర చెరువు, సఫిల్‌గూడ చెరువు, సరూర్‌నగర చెరువు, అల్వాల్ కొత్త చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్, షామీర్పేట, సూరారం, ఐడీఎల్ , వెన్నెలగడ్డ, లింగం, కాప్రా, కీసర, పూడురు చెరువులు, అలాగే, ఎల్లమ్మపేట, దుర్గం, హిమాయత్‌నగర్, మేకంపూర్ , బోయిన్, సున్నం చెరువు (మూసాపేట), మల్కన్, గంగారామ్చెరువులో నిమజ్జనం కొనసాగింది. నగరంలో 30 వేల మంది, సైబరాబాద్‌లో 9400 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం ఇంకా పూర్తికాకపోవడంతో మంగళవారం కూడా బందోబస్తు యథావిధిగా కొనసాగుతుంది. -
ప్రశాంతంగా కొనసాగుతున్న సర్వే
-
బంద్ ప్రశాంతం
-
బంద్ ప్రశాంతం
సాక్షి నెట్వర్క్: పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ లోక్‌సభలో బిల్లు ఆమోదించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ పిలుపు మేరకు శనివారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. బోనాల నేపథ్యంలో మినహాయింపు ఇచ్చిన సికింద్రాబాద్ మినహా తెలంగాణవ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. పది జిల్లాల్లోనూ దాదాపుగా జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు ముందే సెలవు ప్రకటించాయి. బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ నేతలు, టీజేఏసీ, ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. హైదరాబాద్‌లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం సహా పార్టీలు, సంఘాల నేతలు 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ చేపట్టిన బంద్ ఖమ్మం జిల్లాలో శనివారం బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఖమ్మం పట్టణంతో పాటు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో సంపూర్ణంగా జరిగింది. ఎక్కడా బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. వ్యాపార సముదాయాలు, సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, విద్యాసంస్థలు మూసివేశారు. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీలు, వాటి అనుబంధ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొని ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పోలవరం వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో ప్రదర్శన నిర్వహించారు. అరెస్టులు, స్వల్ప ఉద్రిక్తత మధ్య... హైదరాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. మొజంజాహీ మార్కెట్, ఆర్టీసీక్రాస్‌రోడ్డు, దిల్సుఖ్నగర్, ఉప్పల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో దుకాణాలు, విద్యాలయాలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లను ఆందోళనకారులు మూసివేయించారు. ఆర్టీసీ సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ఎంఎంటీఎస్ రైళ్లు యధావిధిగా నడిచాయి. టీఆర్ఎస్, వామపక్షాల నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆందోళనకు దిగారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సహా సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్, వేదకుమార్ సహా పలువురు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ధూంధాం, ఆటాపాటలతో నిరసన తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ జంట కమిషనరేట్లలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల వెల్లువ.. ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బిల్లు ఆమోదించడంపై వరంగల్ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం బంద్‌కు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపారుు. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు సంపూర్ణ సహకారం అందించడంతో వరంగల్‌తోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలు బోసిపోయి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీతో పాటు టీజేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యాసంస్థలు ముందే బంద్ ప్రకటించాయి. ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్‌ల్లో బంద్ సంపూర్ణంకాగా.. ఆదిలాబాద్, ఊట్నూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, భైంసా ప్రాంతాల్లో పాక్షికంగా జరిగింది. టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని చోట్లా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. జిల్లాలోని ఆరు డిపోల నుంచి బస్సులు సాయంత్రం వరకు బయటికి రాలేదు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, సీపీఎం, పీడీఎస్‌యూ, జేఏసీ నాయకులు నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల మోడీ, చంద్రబాబు, వెంకయ్య దిష్టిబొమ్మలను దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో ధూంధాం.. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండలో ఆర్టీసీ డిపో ఎదుట టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిప్పర్తిలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చౌటుప్పుల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడల్లో ప్రధాన జాతీయ రహదారిపై టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు రాస్తారోకో చేశారు. మిర్యాలగూడ, భువ నగిరిలో ధర్నాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం బంద్ ప్రశాంతంగా జరిగింది. పెట్రోలు బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేశారు. సాయంత్రం వరకూ జిల్లాలోని అన్ని డిపోల పరిధిలోని బస్సులు ఎక్కడికక ్కడ నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా, ఉద్యోగ సంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోడీ, బాబు దిష్టిబొమ్మల దహనాలు.. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ చేపట్టిన బంద్ మెదక్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం, మోడీ దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. పలుచోట్ల రాస్తోరోకోలు చేసి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ్‌ఖేడ్, సిద్ధిపేట, జోగిపేట, గజ్వేల్, మెదక్, జహీరాబాద్‌ల్లో బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, వికారాబాద్ డిపోల్లో నుంచి శనివారం బస్సులు బయటకు రాలేదు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.