Pill
-
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్‌గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్‌లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ‘లీకేజీ’ని సీబీఐకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం లీకేజీ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిల్‌పై అభ్యంతరాలను పక్కకు పెట్టి, పిటిషన్‌కు నంబర్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం రిజిస్ట్రీని ఆదేశించింది. ఫైలింగ్ నంబర్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ చైర్మన్, హైదరాబాద్ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. అలాగే పేపర్ లీకేజీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలతో ఈ పిల్ దాఖలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించలేదు. సీజే ధర్మాసనం వద్ద విచారణ సందర్భంగా హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితులపై కేసు నమోదు, అరెస్టు, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది.. వంటి అంశాలపై సిట్ మూడు నివేదికలను కూడా కోర్టుకు సమర్పించిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ బక్క జడ్సన్.. కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పారు. నిష్పక్షపాతంగా సిట్‌ను దర్యాప్తు చేయకుండా ధిక్కరణ పిటిషన్లు కూడా వేస్తూ అడ్డుకుంటున్నారని చెప్పారు. కిందిస్థాయి సిబ్బందిపైనే కేసులు.. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శరత్ కుమార్ వాదనలు వినిపించారు. పేపర్ లీకేజీ అంశంలో టీఎస్పీఎస్సీకి చెందిన కిందిస్థాయి సిబ్బందిపైనే సిట్ కేసులు పెట్టిందని.. ఉన్నతాధికారులను మాత్రం వదిలేసిందని చెప్పారు. పాస్వర్డ్ లీక్‌కు కారణమైన టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని నియామక పరీక్షల పేపర్లు లీక్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని వెల్లడించారు. పిల్‌కు నంబర్‌కు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించడంతోపాటు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌ను కూడా ఈ పిల్‌కు జత చేసేలా దరఖాస్తు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రీతి కుశ్వాహా అనే 33 ఏళ్ల మహిళ భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్రం తీసుకుంది. దీని వల్ల సమస్యలు తలెత్తి తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. అయితే ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రీతి మళ్లీ గర్బం దాల్చినట్లు తేలింది. ఇప్పటికే చిన్న పాప ఉన్నందున ఇంత త్వరగా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసింది. అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పగా.. అందుకు అతను ఒప్పుకోలేదు. అయితే సోమవారం సాయత్రం భర్త బయటకు వాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రీతి అబార్షన్ మాత్ర తెచ్చుకుని వేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భరించలేని కడుపునొప్పితో పాటు రక్తస్రావమైంది. భర్త ఆస్పత్రికి తీసుకెళ్తానంటే ఆమె వద్దంది. కానీ మంగళవారం ఉదయం ప్రీతి స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే ప్రీతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ మాత్ర వల్లే మహిళ చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించడంలేదని పేర్కొన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
మెర్క్ కరోనా మాత్రకు యూఎస్ ఆమోదం
వాషింగ్టన్: కరోనాను నియంత్రించేందుకు మెర్క్ కంపెనీ తయారు చేసిన మాత్ర– మోన్యుపిరావిర్కు అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫైజర్ మాత్రకు ఎఫ్‌డీఏ ఓకే చెప్పింది. ఫైజర్ పిల్‌తో సైడ్ ఎఫెక్ట్స్’ తక్కువ, కానీ మెర్క్ పిల్‌తో సైడ్ఎఫెక్ట్స్ అధికం. అందుకే దీన్ని సెకండ్ ఛాయిస్ పిల్‌గా అనుమతించారు. కరోనా ఆరంభ లక్షణాలున్న వయోజనులు, అందులో ఆస్పత్రి పాలయ్యే రిస్కు అధికంగా ఉన్నవారికి ఈ పిల్‌ను ఇవ్వవచ్చని సంస్థ తెలిపింది. రోగులు 5 రోజుల పాటు రోజుకు 2మార్లు 4 మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్సు మొత్తం మీద 40 మాతల్రు అవసరపడతాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చేసి దాని ప్రత్యుత్పత్తిని తగ్గించేందుకు ఈ ఔషధం తోడ్పడుతుంది. గత నవంబర్‌లో మెర్క్పిల్కు యూకే ఆమోదముద్ర వేసింది. ఈ మాత్రతో పోలిస్తే ఫైజర్ మాత్ర మూడురెట్లు అధికంగా ప్రభావం చూపుతుందని, తక్కువ దుష్ప్రభావాలున్నాయని గణాంకాలు తెలిపాయి. -
Covid Pill: కొవిడ్ చికిత్సకు టాబ్లెట్.. ఆమోదించిన బ్రిటన్
లండన్: కరోనా వైరస్ చికిత్స కోసం అమెరికన్ కంపెనీ మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ మొదటిసారిగా టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మెర్క్ కంపెనీ తయారు చేసిన మోల్నుపిరవిర్ టాబ్లెట్‌కు బ్రిటన్ మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. గత నెలలో చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టాబ్లెట్‌ను మెరుగైన ఫలితాలు చూపించినట్లు మెర్క్ సంస్థ పేర్కొంది. చదవండి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడ 5 లక్షల మరణాలు కోవిడ్‌తో మృతి లేదా ఆస్పత్రిపాలు అయ్యే రిస్క్‌ను ఈ మాత్ర 50 శాతం వరకు తగ్గిస్తుందని పేర్కొంది. వీలైనంత త్వరలో దేశంలో అధ్యయనం చేసి కోవిడ్ రోగులకు మోల్నుపిరావిర్‌ను అందించే ప్రణాళికలను రూపొందించడానికి ప్రభుత్వం, ఆరోగ్య సేవల విభాగం(ఎన్హెచ్ఎస్)తో కలిసి పనిచేస్తుందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ తెలిపారు. ప్రపంచంలో కరోనా చికిత్స కోసం టాబ్లెట్‌ను ఆమోదించిన తొలిదేశంగా బ్రిటన్ నిలిచింది. -
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్‌ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ఈ రోస్టర్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ కొత్త రోస్టర్ ప్రకారం.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను, లెటర్ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మరో ఏడుగురు న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆరు నుంచి ఏడు ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేసులను సీజేఐ విచారిస్తారు. ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యూడీషియల్ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్ సంబంధిత కేసులను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుంది. -
‘సోషల్ డిస్టెన్సింగ్’ పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: సోషల్ డిస్టెన్సింగ్ పదాన్ని వినియోగించరాదంటూ దాఖలైన పిల్‌ని కోర్టు కొట్టివేయడమే కాకుండా పిల్ దాఖలు చేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సోషల్ డిస్టెన్స్‌కి బదులు, ఫిజికల్ డిస్టెన్స్ అనే పదాన్ని వాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ బీ.ఆర్ గవాయ్ లతోకూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి, ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణార్హం కాదని కోర్టు కొట్టివేసింది. డిస్టెన్సింగ్ అనే పదం వివక్షతో కూడుకున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ అందుకే ఆ పదం వాడుక మార్చాలనీ షకీల్ ఖురేషీ పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది. -
సామాన్యుల నుంచే ‘టోల్’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై టోల్ ట్యాక్స్ వసూళ్ల నుంచి మినహాయింపు పొందిన వీఐపీలు, వీవీఐపీల వివరాలు అందజేయాలని ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు వసూలు చేయొద్దంటూ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది డి.విద్యాసాగర్, ఇతరులు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వీవీఐపీల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని, సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది శశికిరణ్ పేర్కొన్నారు. ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారో పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం నాలుగు వారాలు వాయిదా వేసింది. -
గుజరాత్ ఉపఎన్నికలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకోసం వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ కాంగ్రెస్ వేసిన పిల్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో జూన్ 24లోగా స్పందన తెలపాలని బుధవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జూన్ 25న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం తెలియజేసింది. గుజరాత్ కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా మాట్లాడుతూ, ఈ విషయంలో గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వాదించారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ, ఎన్నికల షెడ్యూల్ ఒకటే ఉన్నప్పటికీ ప్రత్యేక స్థితిలో ఏర్పడిన ఖాళీలను వేర్వేరుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. -
హీరా కుంభకోణంపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఆ గ్రూపు వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ అరెస్టు, దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హీరా గ్రూపు యాజమాన్యం తన కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘రాఫెల్’పై 10న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు కోసం ఫ్రెంచి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను ‘సీల్డు కవర్’లో అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాఫెల్ ఒప్పందం అమలుపై స్టే విధించాలంటూ తాజాగా దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి దీనిపై ఈ నెల 10న విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం నిర్ణయించింది. భారత్, ఫ్రెంచి కంపెనీ డసో మధ్య కుదిరిన రూ.58వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రధానిపై అవమానకరమైన, నీతిబాహ్యమైన రీతిలో ఆరోపణలు చేస్తున్నాయని పిటిషనర్ లాయర్ వినీత్ ధండా పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదానికి తెరదించాలని సుప్రీంకోర్టును కోరారు. -
ప్రగతి నివేదన సభకు అనుమతి రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ పేరు తో సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్ వద్ద నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సభకిచ్చిన అనుమతులను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. సభ పేరిట 25లక్షల మందిని ఒకచోట చేర్చే బదులు తమ పార్టీ పాలనలో సాధించిన ఘన విజయాలను తెలియచేసేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకునేలా టీఆర్ఎస్ను ఆదేశించాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సీఎస్, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ రామ సుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ ప్రస్తావించారు. కేసు ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని నివేదించారు. దీంతో ధర్మాసనం వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ప్రగతి నివేదన సభ కోసం 1600 ఎకరాలను చదును చేస్తున్నారని, ఇందులో ఉన్న చెట్లన్నింటినీ నరికేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఈ సభకు 25 లక్షల జనాన్ని సమీకరించాలని అధికార పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, దాదాపు లక్ష వాహనాలను వినియోగించనున్నారన్నా రు. ఈ సభ వల్ల సామాన్య ప్రజానీకం రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్న సభ లక్ష్యం ప్రభుత్వం ఘన విజయాలను ప్రజలకు తెలియచేయడమేనన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వంటి సాధానాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సభ వల్ల పంటలకు, ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లితే దానిని టీఆర్ఎస్ నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. -
పిల్ విచారణలో తీవ్ర వ్యాఖ్యలొద్దు: సుప్రీంకు కేంద్రం హితవు
న్యూఢిల్లీ: ప్రజాహిత వాజ్యాల (పిల్)ను విచారించే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం హితవు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, జడ్జీలూ ఈ దేశ పౌరులేననీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో జడ్జీలకు తెలుసునని స్పష్టం చేసింది. అయినా తామేమీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ విమర్శించడం లేదనీ, ముందు చట్టం ప్రకారం ప్రభుత్వం నడచుకోవాలని కోర్టు సూచించింది. దేశంలోని 1,382 జైళ్లలో ఖైదీల పరిస్థితి అమానవీయంగా ఉందంటూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా, అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్, జడ్జీల మధ్య ఈ సంభాషణ జరిగింది. ఏజీ మాట్లాడుతూ ‘నేను సుప్రీంకోర్టును విమర్శించడం లేదు. కానీ గతంలో సుప్రీం∙తీర్పులతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు’ అని అన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై తీర్పు, రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. లక్షన్నర కోట్లతో ఏమైనా చేయొచ్చుగా.. ఏజీ వ్యాఖ్యలకు న్యాయమూర్తులు స్పందిస్తూ ‘ మా తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పోయుండొచ్చు. మా తీర్పుల వల్లే ప్రభుత్వానికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో మీరేమైనా చేయొచ్చుగా? నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 30 వేల కోట్ల రూపాయలతో మీరు వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు కొన్నారు’ అంటూ మండిపడ్డారు. కాగా, జైలు సంస్కరణలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. జైళ్లలో పెరుగుతున్న ఖైదీల రద్దీ సహా ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది. -
వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనం వృథా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వ్యక్తిగత మొక్కుబడులను తీర్చుకునేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృ«థా చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని, ఇందుకు ఖజానా నుంచి రూ.5 కోట్ల మేర డబ్బు ఖర్చుచేయడం, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేక విమానం ద్వారా తీసుకెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ మొత్తాన్ని తిరిగి ఖజానాకు జమచేసేలా కేసీఆర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శిని, వ్యక్తిగత హోదాలో కేసీఆర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ పలు దేవాలయాలను సందర్శించి బంగారు ఆభరణాలను మొక్కుబడులుగా సమర్పిస్తున్నారని పిటిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా గత నెల 28న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి తమ మొక్కు తీర్చుకున్నారని వివరించారు. ఇందుకైన వ్యయాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారని తెలిపారు. వజ్రాలు పొదిగిన ముక్కుపుడకను రూ.5 కోట్లు వెచ్చించి తయారుచేసి అమ్మవారికి సమర్పించారన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించాల్సిన నిధులను ఈ విధంగా ఖర్చు చేయడం ఎంత మాత్రం సరికాదన్నారు. అలాగే తిరుమల వేంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లు, తిరుచానూరు అమ్మవారికి రూ.45వేలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ.59 లక్షలు వెచ్చించి బంగారు ఆభరణాలు చేయించారని ఆయన తెలిపారు. 2015లో అయుత చండీయాగాన్ని రూ.6 కోట్ల వ్యయంతో నిర్వహించిన కేసీఆర్ ఆ మొత్తాన్ని తన కుటుంబసభ్యులు, తన సంక్షేమం కోరుకునే వ్యక్తులు భరించారని స్వయంగా చెప్పారని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. -
ఆ పిల్‌ను విచారించలేను
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్ ‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు. ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్ సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది. ఆరు నెలలుగా... సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు. ► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ. ► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం. ► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. ► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ. ► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ ► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం. -
సుప్రీంలో త్వరలో పారదర్శక రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంలో దాఖలయ్యే సున్నితమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను(పిల్) ధర్మాసనాలకు కేటాయించే విషయంలో మరింత పారదర్శతక కోసం అందిన సలహాలను సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పరిశీలించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేసులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. మరోవైపు సుప్రీం సంక్షోభం నివారణకు సీజేఐతో నలుగురు సీనియర్ జడ్జీలు సోమవారం భేటీ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. -
ఆ అధికారులపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: అడవి తల్లినే నమ్ముకున్న గిరిజనులపై అటవీ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసి ఇళ్లు కూల్చివేశారని, బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జలగలంచలోని అటవీ ప్రాంతంలో గొత్తికోయలపై అటవీ శాఖ సిబ్బంది విచక్షణారహితంగా దాడులు చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుంటి రవీందర్ పిల్ దాఖలు చేశారు. గత నెల 16న పస్రా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిరీష, తాడ్వాయి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జోగీందర్ సారథ్యంలో రెండు వందల మంది సిబ్బంది జేసీబీలు, ట్రాక్టర్లు, బుల్డోజర్లతో వచ్చి 36 ఇళ్లను కూల్చేశారని పేర్కొన్నారు. తాగు, సాగుకు ఆధారమైన ఏకైక బోరును తొలగించారని, గిరిజనులకు తాగునీరు కూడా లేకుండా చేశారని తెలిపారు. ‘అడ్డుకోబోయినవారిని చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గర్భవతులైన కుంజం నందిని, మాధవి ఐతై, మాధవి మునితలను కూడా కొట్టారు. అధికారుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే బోర్వెల్ ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించాలని, కూల్చిన ఇళ్లను నిర్మించాలని, దెబ్బతిన్న ఇండ్లు, పంటలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలివ్వాలి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో దర్యాప్తునకు ఆదేశించాలి. అటవీ అధికారులు శిరీష, జోగీందర్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
డీజేపై నిషేధం విధించండి
అభ్యంతర పదాలున్నాయంటూ హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వాటిని తొలగించే వరకు సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపనుంది. డీజే సినిమాలోని శృంగార గీతాల్లో అభ్యంతరకర పదాలున్నాయని..వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా పరిగణనలోకి తీసుకోలేదని, మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తెలిపారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించే వరకు డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కృష్ణమోహన్ కోరారు. -
రేవంత్ ‘పిల్’పై స్పందించిన హైకోర్టు
నకిలీ విత్తనాలపై వ్యాజ్యం విచారణకు స్వీకరణ సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాల వినియోగం వల్ల కలిగిన నష్టాన్ని సదరు విత్తన కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు అందచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్, కావేరీ సీడ్స్, గంగా కావేరీ సీడ్స్, అంకూర్ సీడ్స్, రాశీ సీడ్స్, మోన్శాంటో, శ్రీరామ్ బయోసీడ్స్, నూజివీడు సీడ్స్, జె.కె.అగ్రి జెనెటిక్స్ విత్తన కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్న కంపెనీల స్థిర, చరాస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద విక్రయించి, ఆ మొత్తాలను రైతులకు పరిహారంగా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం, విత్తన కంపెనీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని రేవంత్‌ను ఆదేశించింది. పలు విత్తన కంపెనీలను ఆయన ప్రతివాదులుగా చేర్చడంతో వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని తెలిపిన ధర్మాసనం.. ప్రభుత్వానికి, విత్తన కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. -
వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించండి
జయ ఆస్తులపై హైకోర్టులో గరీబ్ గైడ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఆస్తుల విషయంలో శశికళ, ఇతరులు జోక్యం చేసుకోకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి ఈ వ్యాజ్యాన్ని ఇటీవల దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు జీడిమెట్ల, శ్రీనగర్ కాలనీల్లో ఆస్తులు ఉన్నట్లు జయలలిత ప్రకటించారన్నారు. ఈ ఆస్తుల విషయంలో జయలలిత ఎటువంటి వీలునామా రాయలేదని, అందువల్ల వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు. హైకోర్టు వెబ్సైట్ ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ఇంకా ప్రధాన నెంబర్ కేటాయించలేదు. -
కోర్టుల్లో రాజకీయాలకు తావు లేదు
సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో రాజకీయాలకు తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవచ్చా అనే అంశంపై వాదనల సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘వారి ఆందోళన రాజకీయాలను కోర్టు ముందుకు తెచ్చేలా కనిపిస్తోంది. దీనిని మేము అంగీకరించబోము. రాజకీయాలు న్యాయస్థానాలకు బదిలీ కావాలని మేము కోరుకోవడం లేదు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిల్ దాఖలు చేశారు. ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా పిటిషన్ దాఖలు చేసినట్లయితే.. కోర్టులు దానిని విచారించవచ్చని ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఎన్జీవో ఈ పిల్ దాఖలు చేసిందని, ఇందులో రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కలుగజేసుకుని ప్రజాప్రయోజనమా? పార్టీల ప్రయోజన మా? అనేది ఎలా వేరు చేస్తారని ప్రశాంత్ భూషణ్‌ను ప్రశ్నించింది. పార్టీల ప్రతిచర్య వెనుక ప్రజాప్రయోజనం ఉంటుందని, ఒకవేళ అందులో ప్రజాప్రయోజనం లేదని భావిస్తే కోర్టు కొట్టేయొచ్చన్నారు. రాజకీయ పార్టీలు తమ వాదనను వినిపించేందుకు పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. స్వరాజ్ ఇండి యాను రాజకీయ పార్టీగా గుర్తించే విష యంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూస్తామంటూ తదుపరి విచారణను జనవరి 18కి వారుుదా వేసింది. -
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి
హైకోర్టులో ఎమ్మెల్సీ రామచంద్రరావు పిల్ సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు తెలంగాణలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, వెంటనే వీటి మరమ్మతులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఇటీవలి వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, వీటిపై వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారని తెలిపారు. రోడ్లను వేసే సమయంలో నాణ్యత పాటించడం లేదని, నాసిరకం మెటీరియల్‌ను వాడటం వల్ల తక్కువ కాలానికే దెబ్బతింటున్నాయన్నారు. ఇవికాక విద్యుత్, సీవరేజీ, నీటి అవసరాల నిమిత్తం రోడ్లను తవ్వేస్తున్నారని, వాటికి తిరిగి రిపేర్లు చేయడం లేదని వివరించారు. -
ఉపఎన్నికలపై పిల్
► అభ్యర్థులను అనర్హులను చేయండి ►తంజావూరు, అరవకురిచ్చిల ఉపఎన్నికలపై వ్యాజ్యం ►విచారిస్తామని న్యాయమూర్తుల హామీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన తంజావూరు, అరవకురిచ్చి అభ్యర్థులు తాజా ఉపఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కరూరు జిల్లా పల్లపట్టి గ్రామానికి చెందిన ఏఏ సాధిక్ ఆలి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో మధురై జిల్లా అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థిసెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామి, తంజావూరు నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఓటర్లను మభ్యపెట్టే రీతిలో వ్యవహరించారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులపై అనేక క్రిమినల్ కేసులు దాఖలయ్యారుు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఇవే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, 19వ తేదీన పోలింగ్ జరుగుతుండగా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ధిక్కరించి అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలు, ఎన్నికల చిహ్నం, అభ్యర్థులపై భారత ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సదరు అభ్యర్థులకు సంజారుుషీ నోటీసులు జారీచేయాల్సి ఉంది. వారి నుంచి వివరణ వచ్చే వరకు ఆయా పార్టీలు, అభ్యర్థులు, చిహ్నం లపై తాత్కాలిక నిషేధాన్ని విధించాల్సి ఉంది. అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో అటువంటి చర్యలు ఏమీ చేపట్టలేదు. అరవకురిచ్చి, తంజావూర్లలో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికలు సజావుగా, నీతిబద్ధంగా జరగాలంటే అన్నాడీఎంకే, డీఎంకే తదితర అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సెంథిల్ బాలాజీ, కేసీ పళనిస్వామి పేర్లను ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్ల నుంచి తొలగించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి. అన్నాడీఎంకే, డీఎంకే ఎన్నికల చిహ్నంను వారికి కేటారుుంచరాదు. ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులని ప్రకటించాలని ప్రజాప్రయోజన వాజ్యంలో పేర్కొన్నాడు. ఈ వాజ్యం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్‌ల ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం అమల్లో ఉంది. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలైన వారిని కూడా అనర్హులుగా చేయాలనే అంశం ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. తంజావూరు, అరవకురిచ్చిలపై ఇప్పటికే మరో కేసు విచారణలో ఉన్నందున ఈ వాజ్యాన్ని సైతం వాటితో కలిపి విచారిస్తామని న్యాయమూర్తులు బదులిచ్చారు. -
ఏదో తెలియని అభద్రత...
సందేహం నేను కాస్త లావుగా ఉండేదాన్ని. బరువు తగ్గాలని ప్రతిరోజూ స్కిప్పింగ్ చేసేదాన్ని. దాని వల్ల నా బ్రెస్ట్ లూజ్ అయింది. దాంతో నాకు ఏదో తెలియని అభద్రతా భావం కలుగుతోంది. మరో ఆరు నెలల్లో నాకు పెళ్లి జరగబోతోంది. దీనివల్ల నా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. నా బ్రెస్ట్‌ని మళ్లీ టైట్‌గా చేసుకోవడానికి ఏమైనా సలహా ఇవ్వండి. - జాహ్నవి స్కిప్పింగ్ చెయ్యడం వల్ల బ్రెస్ట్ లూజ్ అవ్వదు. స్కిప్పింగ్ వల్ల మీరు బరువు తగ్గి, బ్రెస్ట్‌లో ఉండే కొవ్వు, దాని చుట్టూ ఉండే కొవ్వు కరగడం వల్ల లూజయి ఉండొచ్చు. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. రొమ్ములు బిగుతుగా అవ్వడానికి రెగ్యులర్‌గా వలయాకారంలో బ్రెస్ట్ మసాజ్ చేసుకోవాలి. దాంతో రక్తప్రసరణ పెరిగి, రొమ్ముల పటుత్వం పెరిగి, టైట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఛాతీ వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అలా చేసినా... ఉపయోగం లేకుండా మరీ ఇబ్బందిగా ఉంటే ఓసారి ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి వారి సలహా పాటించవచ్చు. నా వయసు 21. ఎనిమిది నెలల క్రితమే నాకు పెళ్లైంది. నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరం బాగా సెటిల్ అయ్యాం. కాకపోతే వేరువేరు చోట్ల ఉద్యోగం చేస్తుండటం వల్ల శారీరకంగా నెలకు రెండుమూడుసార్లు మాత్రమే కలుస్తుంటాం, అలా కలిసినప్పుడు ఓసారి గర్భం రాకుండా ఉండేందుకు ఒక పిల్‌ను వేసుకున్నాను. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. పీరియడ్ కూడా రెగ్యులర్‌గా వచ్చింది. కానీ అప్పటి నుంచి దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతోంది. అలాగే అది వేసుకున్న తర్వాత శారీరకంగా కలిసినప్పుడు నొప్పిగా అనిపించింది. ఈ పిల్ వేసుకోవడం వల్ల నాకు భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు వస్తాయా? పిల్లలు కలగడానికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? - స్నేహ మీరు వేసుకున్న పిల్ ఎప్పుడో ఒకసారి జాగ్రత్తలు తీసుకోకుండా కలిసినప్పుడు, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు తయారు చేయబడింది. కానీ అది 100 శాతం గర్భం రాకుండా అవుతుందని చెప్పలేం. అది వాడినా 10-15శాతం మందిలో గర్భం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పిల్ వాడటం వల్ల వైట్ డిశ్చార్జ్, దురద, దుర్వాసన, నొప్పి వంటివి ఏమీ ఉండవు. ఒకసారి వాడటం వల్ల పిల్లలు కలగడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. మీకు ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్, పొత్తి కడుపులో నొప్పి వచ్చి ఉండవచ్చు. ఇంకా అలాగే ఉంటే ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ పిల్ మాటిమాటికీ వేసుకోవడం మంచిది కాదు. దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, హార్మోన్లలో మార్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి? - పేరు రాయలేదు కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండడం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడడం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండడం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్