Radiation
-
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్‌తో సంబంధం లేదు!
స్మార్ట్‌ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్‌ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
కేన్సర్ రిస్క్ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం కేన్సర్. కేన్సర్ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్‌కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా, మహిళలు బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ కేన్సర్ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్లు, రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్, సన్ రేస్, ఊబకాయం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. (ఎన్ఆర్ఐ మహిళకు బ్యాంకు మేనేజర్ టోకరా) ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం ♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు. ♦ పిల్లలకు హెపటైటిస్ బీ, హెచ్‌పీవీ వ్యాక్సిన్లు అందించడం ♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం. హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. ♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం ♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా దాన్ని పరిమితం చేసుకోవడం ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్ సోకి వున్నా, వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా కేన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
ఇక పైకప్పులన్నీ కూల్కూల్గానే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల ఒకటోతేదీ నుంచి అమలులోకి వ చ్చిన కూల్‌రూఫ్ పాలసీని రాబోయే ఐదేళ్లలో 300 చదరపు కిలోమీటర్ల మేర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పైకప్పుల కంటే కూల్ రూఫ్ సూర్యుడి నుంచి తక్కువ వేడిని తీసుకుంటుంది. ఇది సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడం ద్వారా, థర్మల్ రేడియేషన్‌ను విడుదల చేసి, వేడిని తగ్గిస్తుంది. సాధారణ పైకప్పులు 20 శాతం సూర్యరశ్మిని మాత్రమే తిరిగి ప్రతిబింబిస్తే, కూల్ రూఫ్‌లు దాదాపు 80 శాతం సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తాయి. తద్వారా కూల్రూఫ్లతో భవనాలు గణనీయంగా చల్లబడతాయి. ఈ కూల్‌రూఫ్ విధానాన్ని 2023–24లో జీహెచ్ఎంసీలో 5 చ.కి.మీ మేర... మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో 2.675 చ.కిమీల మేర అమలు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాల్లో ఈ సంవత్సరం కూల్‌రూఫ్ పాలసీ అమలుకు సంబంధించిన విధి విధానాలను, విస్తీర్ణం వివరాలతో సీడీఎంఏ ఎన్. సత్యనారాయణ శనివారం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 3,468 వార్డుల్లో తొలి ఏడాది ఇంటి పైకప్పులను చల్లబరిచే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2.675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 287.9 లక్షల చదరపు అడుగుల మేర ఇంటి పైకప్పులను కూల్‌రూఫ్ పాలసీ కిందికి తీసుకురానున్నారు. ఏ ఇళ్లకు కూల్‌రూఫ్ విధానం తప్పనిసరంటే... 600 చదరపు గజాలు, అంతకు పైబడిన స్థలాల్లో నిర్మించే గృహ నిర్మాణాల అనుమతులకు ఇక నుంచి కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. ఈ విస్తీర్ణంలో కూల్‌రూఫ్ విధానంలో నిర్మించిన వాటికి మాత్రమే పురపాలక శాఖ ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ ఇవ్వనుంది. ఇక అన్ని ప్రభుత్వ భవనాలు కూల్ రూఫ్ విధానంలోనే నిర్మాణం జరగాలి. సైట్ ఏరియా, బిల్డప్ ఏరియాతో సంబంధం లేకుండా అన్ని రకాల నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ ఇదే విధానంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇక 600 చదరపు గజాలకన్నా తక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస గృహాలకు కూల్‌రూఫ్ పాలసీ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే కూల్ రూఫ్ విధానంలో నిర్మించకపోయినా, అనుమతులకు ఇబ్బందులేం ఉండవు. ఇంటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న వారు సైతం శీతలీకరణ కోసం కూల్‌రూఫ్ విధానంలోకి మారే ఆప్షన్ ఉంటుంది. వచ్చే మూడేళ్లలో నివాసేతర గృహాలకు రెట్రా ఫిట్టింగ్ చేసుకోవడం కూడా ఆప్షన్‌గా సీడీఎంఏ పేర్కొంది. పాత ఇళ్లకు కూల్‌రూఫ్ ఎలా..? ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న నివాసాలను కూడా కూల్‌రూఫ్ విధానంలోకి తీసుకువచ్చేలా విధివిధానాలను రూపొందించారు. ఇందుకోసం ఆయా మునిసిపాలిటీల్లోని వార్డుల్లో నిర్దేశించిన విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ఇళ్లకు కూల్రూఫ్ను తప్పనిసరి చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయనుంది. ఆయా ఇళ్ల పైకప్పులకు సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ చేస్తారు. తెల్లటి టైల్స్‌తో లేదా తెల్లటి పొరతో పైకప్పులను కప్పి పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గించాలనేది నిర్ణయం. -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
మిరుమిట్ల మాటున ముప్పు
సాక్షి, అమరావతి: ఏదైనా నగరంలో రాత్రివేళ ఎత్తయిన భవనంపై నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది?!... మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతి వెలుగులతో ఆ నగరం అంతా మెరిసిపోతూ ఉంటుంది. నిశిరాత్రే పట్టపగలు మాదిరిగా గోచరిస్తుంది. అయితే ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. ఆ మిరుమిట్ల వెలుగుల చాటున పర్యావరణానికి, జీవజాలానికి పెనుముప్పు పొంచి ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాంతి కాలుష్యం వర్తమాన ప్రపంచానికి పెను సవాల్‌గా మారుతోందని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘సైన్స్ మ్యాగజైన్’ అధ్యయనం ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశంలో ఏటా 20 శాతం పెరుగుతున్న స్కై గ్లో అభివృద్ధి పేరుతో నగరాల్లో రాత్రుళ్లు మితిమీరిన విద్యుత్ వెలుగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చీకటిని పారదోలుతున్నాయి. ఈ విద్యుత్ కాంతుల నుంచి వెలువడే రేడియేషన్‌ను ‘స్కై గ్లో’ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘స్కై గ్లో’ ఏటా 10 శాతం చొప్పున పెరుగుతుండటం గమనార్హం. న్కూయార్క్, వాషింగ్టన్, లండన్ వంటి నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనూ ‘స్కై గ్లో’ ఏటా 20 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ ‘స్కై గ్లో’ ఆకాశంలోని చిన్న చిన్న నక్షత్రాలను సైతం మసకబారుస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అంటున్నారు. 2011– 2022 మధ్య 10 శాతం చిన్న నక్షత్రాలు మసకబారిపోయినట్టు అధ్యయనంలో వెల్లడైంది. అంతరిస్తున్న కార్పెంటర్ తేనెటీగలు.. కాంతి పరావర్తనాన్ని బట్టి మొక్కల పెరుగుదల ఉంటుందన్న సంగతి తెలిసిందే. ‘స్కై గ్లో’ పూల వికాసంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పూలు సహజసిద్ధంగా వికసించడం లేదని.. నిర్ణీత సమయానికి కంటే ముందుగానే వికసిస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పూలపై ఆధారపడి పరాగ సంపర్కం చేసే తేనెటీగలు సందిగ్ధతకు గురవుతున్నాయి. దీంతో వాటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. భారత్‌లోనే ప్రత్యేకంగా ఉండే ‘కార్పెంటర్ తేనెటీగ’ ఉనికి ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చీకట్లో పరాగ సంపర్కం జరపడం ‘కార్పెంటర్ తేనెటీగ’ ప్రత్యేకత. కృత్రిమ వెలుగులతో చీకటి తగ్గిపోతుండటంతో ఈ తేనెటీగలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ముంబైకి 100 కి.మీ. దూరంలో ఉన్న భీమశంకర్ అభయారణ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ముంబై నగరం చిమ్మే వెలుగులతో ఆ అభయారణ్యంలో కార్పెంటర్ తేనెటీగలు క్రమంగా అంతరిస్తున్నాయని గుర్తించారు. ఏటా లక్షల పక్షులు బలి.. నక్షత్రాల వెలుగునే ఆధారంగా చేసుకుని వివిధ ఖండాల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చేపక్షులకు స్కై గ్లో నుంచి ముప్పు ఏర్పడుతోంది. విద్యుత్ వెలుగులతో జిగేల్మంటున్న భారీ భవంతులతో వలస పక్షులు సందిగ్ధతకు లోనవుతున్నాయి. పక్షులు కాంతి పరావర్తనాన్ని గుర్తించలేవు. దీంతో కృత్రిమ కాంతిని చూసి అదే తమ గమ్యస్థానమని భావిస్తున్నాయి. నేరుగా వచ్చి ఎత్తైన భవనాల అద్దాలను ఢీకొట్టి లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కాగా వలస పక్షుల విసర్జకాలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. వలస వచ్చే సముద్ర పక్షులు ప్రపంచవ్యాప్తంగా ఏటా బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.8,500 కోట్లు) విలువైన సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి వచ్చే పెలికాన్ పక్షులు సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇంతటి ప్రయోజనాన్ని అందిస్తున్న వలస పక్షులు స్కై గ్లో బారిన పడుతుండటం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. డార్క్ స్కై లైటింగ్ విధానాలే పరిష్కారం ప్రమాదకరమైన ‘స్కై గ్లో’ను తగ్గించే దిశగా నిపుణులు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాలు డార్క్ స్కై లైటింగ్‌ను ప్రవేశపెట్టాయి. అమెరికాలోని పిట్స్బర్గ్ నగరంలో ‘డార్క్ స్కై లైటింగ్’ అమల్లో ఉంది. అంటే మిరుమిట్లు గొలిపే కాంతిని కాకుండా తక్కువ కాంతిని వెదజల్లే లైట్లను అమరుస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా అవకాశం ఉన్నంతవరకు రాత్రి వేళల్లో సహజసిద్ధమైన చీకటి ఉండేలా చూస్తోంది. ఎత్తైన భవనాలకు ముదురు రంగులు వేస్తోంది. దాంతో కాంతి పరావర్తనం చెందదు కాబట్టి వలస పక్షులకు ఇబ్బంది ఉండదు. -
గోహత్యపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు
గుజరాత్ కోర్టు గో హత్యపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోర్టు అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తి కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. గో హత్య నిలిపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు జడ్జి పేర్కొన్నారు. సదరు వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆవుపేడతో చేసిన ఇళ్లు రేడియోషిన్‌కి గురికావని సైన్స్ రుజువు చేసింది. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని, 68 కోట్ల పవిత్ర స్థలాలకు, 33 కోట్ల దేవతలకు నిలయమని అన్నారు. అందుకు సంబంధించిన శ్లోకాలను ప్రస్తావిస్తూ..ఆవులను హింసిస్తే మన సంపద, ఆస్తులు నశిస్తాయని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలకు కోపం, ఆవేశం వంటివి పెరిగిపోవడానికి గోవధే కారణం. దీనిని పూర్తిగా నిషేధించే వరకు వాతావరణం మార్పులకు(కాలుష్యానికి) గురికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సదరు వ్యక్తిని గతేడాది ఆగస్టులో 16 ఆవులు అక్రమంగా రవాణ చేయడంపై అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించడమే గాక సుమారు రూ. 5 లక్షల జరిమాన విధించింది. (చదవండి: 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!) . -
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్‌కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్‌సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
Health: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..
క్యాన్సర్ కణాన్ని తుదముట్టించడానికి సర్జరీ, కీమో, రేడియేషన్ లాంటి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా కీమోలో. అదే క్యాన్సర్‌ను చంపేసే అదే రసాయనాన్ని చాలా కచ్చితత్త్వంతో కేవలం క్యాన్సర్ కణంపైనే ప్రయోగించేలా చూడగలిగితే...? అదే ‘ప్రెసిషన్ ఆంకాలజీ’!! అంటే క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో రసాయనాన్ని గురిపెట్టి కొట్టడమనే ఆ ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్యాన్సర్ కణాలను తొలగించడానికి సర్జరీలు, రేడియేషన్, కిమో చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిల్లో ఆరోగ్యవంతమైన కణాలకు ఎంతకొంత ముప్పు ఉంది కాబట్టి... ఆ అనర్థాలను తప్పిస్తూ... సరిగ్గా క్యాన్సర్ కణాన్నే గురిపెట్టేలాంటి (టార్గెట్ చేసేలాంటి) మందుల పైనా, చికిత్స ప్రక్రియలపైనా మొదట్నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కచ్చితంగా క్యాన్సర్ కణాన్నే దెబ్బతీసేలాంటి చికిత్స కాబట్టి... దీన్ని ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటారు. కేవలం క్యాన్సర్ కణాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి టార్గెటెడ్ థెరపీ అంటున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన కణానికి ఏమాత్రం దెబ్బతగలకుండానో లేదా అత్యంత తక్కువగా నష్టం జరిగేలాగానో జరిగే మందులు రానున్నాయి. అది కూడా కొంత బాధాకరమైన కీమోలోలా రక్తనాళంలోకి ఎక్కించడం కాకుండా... సింపుల్‌గా నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో అందుబాటుకి ఇప్పటికే వచ్చాయి, ఇంకా రానున్నాయి. దెబ్బతిన్న జన్యువుకు గురిపెట్టి, క్యాన్సర్‌ను మొగ్గలోనే తుంచేయడం ఎలా? ఈ సహస్రాబ్దం మొదట్లో అంటే 2001లో మానవ జన్యుపటలాన్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమైంది. ఈ జన్యుపటలంలో ని ఏ కణమైతే దెబ్బతిన్నదో, అది ఇష్టం వచ్చినట్లుగా అపరిమితంగా అనారోగ్యకరంగా పెరిగి క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జన్యుపటలంలో సరిగ్గా నిర్దిష్టంగా ఏ కణం తాలూకు జన్యువు దెబ్బతిని, అక్కడ్నుంచి అది క్యాన్సర్‌గా మారుతుందో తెలుసుకుని, సరిగ్గా అపరిమితమైన కచ్చితత్త్వంతో దాన్ని మాత్రమే తుదముట్టించేలా ఔషధాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడు పెరగబోయే క్యాన్సర్ గడ్డను సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ పెరగదు. ఇది స్థూలంగా ‘టార్గెటెడ్ థెరపీ’ తాలూకు సిద్ధాంతం. ఇందుకు ఉపయోగపడేదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ తల్లిదండ్రుల తాలూకు వీర్యకణం, అండం కలిసి పిండం ఏర్పడి... అదే తర్వాత బిడ్డగా ఎదుగుతుంది. ఓ జీవరాశి కలిగి ఉన్న వ్యక్తికి కణం ఎలా మూలమో, ఓ కణానికి దాని తాలూకు జన్యువులు అలా మూలం. ఆ జన్యుపటలంలో ఏదైనా జన్యువు దెబ్బతిని ఉంటే... ఆ తర్వాతి తరం వ్యక్తిలో అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందుకే తర్వాతి తరం బిడ్డకు ఎలాంటి జీవకణాలు రాబోతున్నాయో తెలుసుకునేందుకు ఓ పరీక్ష ఉపయోగపడుతుంది. అదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ పరీక్ష. దీన్నే సంక్షిప్తంగా ‘ఎన్జీఎస్’ అంటారు. దీనితో భవిష్యత్తులో బిడ్డపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతగా ఉందో తెలుస్తుంది. అలా క్యాన్సర్ గనకా వస్తే అది భారమే కదా. అందుకే ఆ భారాన్ని ‘ఎన్జీఎస్ ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్’గా పేర్కొంటారు. ఇలా రాబోయే తరాల్లో ఎవరెవరికి క్యాన్సర్ రానుందో తెలుసుకుని... సరిగ్గా క్యాన్సర్‌ను కలగజేయబోయే ఆ నిర్దిష్ట జన్యువుకు తగిలేలా చికిత్స అందించడం అన్నదే ఈ ప్రక్రియ వెనకనున్న సిద్ధాంతం. ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జన్యువు తీరును బట్టి ప్రత్యేకమైన చికిత్స (టైలర్ మేడ్) చికిత్సలూ సాధ్యం కానున్నాయి. అప్పుడు నొప్పి, బాధాలేని అనేక దీర్ఘకాలిక క్యాన్సర్లను తేలిగ్గా తగ్గించే రోజు త్వరలోనే రానుంది. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’కి మంచి ఉదాహరణ ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ పదేళ్ల కిందట నాలుగో దశలోని లంగ్ క్యాన్సర్ అంటే ఇక అది మరణంతో సమానం. కేవలం 7 శాతం మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పడు ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ ప్రక్రియ ద్వారా ఏ జన్యువులు దెబ్బతిన్నాయో వాటిని మార్చడం వల్ల బతికి బయటపడే వారు 40 శాతానికి పెరిగారు. పూర్తిగా ఆశవదిలేసుకున్న బాధితులు సైతం కనీసం ఐదేళ్లకు మించి ఆయుష్షు పొందారు. అంతేకాదు... వీళ్లు సాధారణ కీమోతో మిగతా అవయవాలకూ, కణాలకూ జరిగే నష్టాన్ని, తద్వారా వాళ్లకు కలిగే అమితమైన బాధనుంచి విముక్తమయ్యారు. రొమ్యు క్యాన్సర్ నుంచి విముక్తం కావడం కూడా ప్రెసిషన్ ఆంకాలజీకి ఓ మంచి ఉదాహరణ. ఈ క్యాన్సర్‌లో ‘హర్ 2’ అనేది ఓ రకం. దీనికి గురైనవారిలో తొలిదశలో క్యాన్సర్ కణాలు చాలా చురుగ్గా, దూకుడుగా పెరుగుతాయి. వేగంగా ఇతర కణాలకు వ్యాపిస్తాయి. అయితే అమితమైన కచ్చితత్త్వంతో మంచి కణాలను వదిలేసి, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే దెబ్బతీసే టార్గెట్ థెరపీ మందులు రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఓ విప్లవాన్నే తీసుకొచ్చాయి. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ –హెమటో ఆంకాలజిస్ట్ -
క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి
Chhavi Mittal About Her First Radiation Therapy Experience: ప్రముఖ టీవీ నటి ఛవి మిట్టల్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గత నెల తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన ఆమె ఏమాత్రం బాధపడకుండా తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా వేదికగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రొమ్ము క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకున్న ఆమె ఈ రోజు తొలి రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె తొలి రేడియేషన్ థెరపీ అనుభవాన్ని పంచుకుంది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ‘నా రేడియేషన్ థెరపీ ఈ రోజే మొదలైంది. దీనికి ముందు ఈ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని కొందరితో చర్చించాను. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని నాకు చెప్పారు. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి మన ప్రాణాలు కాపాడడంపైనే కానీ, మన సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరం చేయడంపై కాదు’ ఆమె రాసుకొచ్చింది. చదవండి: భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్ ‘అయితే నేను కేవలం జీవించాలనుకోవడం లేదు. నా లైఫ్‌ని సంతోషంగా గడపాలనుకుంటున్నా. ఎలాగు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను. అందుకే రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఇక ఈ జర్నీలో నాకు సహాకరిస్తూ వెన్నంటే ఉంటున్న నా డాక్టర్లకు కృతజ్ఞతలు. ఈ రేడియేషన్ థెరపీ అనేది 4 నెలల పాటు వారానికి లేదా 5 రోజుల చొప్పున 20 సైకిల్స్‌గా ఇవ్వనున్నారు’ అని ఛవి మిట్టల్ పేర్కొంది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) -
అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్
Russian troops first sign of illness from radiation: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా దాడి సాగిస్తూనే ఉంది. రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన పేరుతో ఉక్రెయిన్ పై మరిన్ని వైమానిక బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక దాడుల కారణంగా ఉక్రెయిన్ ఊహించనట్లుగానే యూరప్ దేశాలకు పెనుముప్పు వాటిల్లనుంది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించినప్పుడే చెర్నోబిల్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంలో భాగంగా అణుకర్మాగారంపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ సేనలు అణుకర్మాగారంలో వ్యాపించిన మంటలను అదుపు చేసి పర్యవేక్షించారు. అంతేకాదు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ అణుకర్మాగారం అతిపెద్దదని గతంలో అది ఎంత పెను విధ్వంసం సృష్టించిందో కూడా వివరించారు. అయితే ఇప్పుడూ ఆ అణుకర్మాగారం నుంచి రేడియేషన్లు వెలువుడుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అందులో భాగంగానే చెర్నోబిల్ వద్ద రష్యా దళాలు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం బెలారస్‌లోని ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలి వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈమేరకు ఉక్రెనియన్ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్చుక్ కూడా రష్యన్లు రేడియేషన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. చెర్నోబిల్ వద్ద కార్మికులు నివసించే సమీపంలోని స్లావుటిచ్ పట్టణం నుంచి రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయమై యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో చెర్నోబిల్‌కు తన తొలి సహాయం అందించనున్నట్లు ఐఏఈఏ పేర్కొనడం విశేషం. (చదవండి: మా ఆంక్షలు నిర్వీర్యం చేయోద్దు!..హెచ్చరించిన యూఎస్) -
చిన్న బుక్.. 1,500 ఏళ్ల డేంజర్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎటూ తేలడం లేదు. చివరికి అణు దాడికీ పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల విషయంగా చాలా దేశాలు వణికిపోతున్నాయి. మరి ఇంత భయానికి కారణం.. రేడియేషన్. అలాంటి రేడియేషన్‌తో ప్రమాదమెంత?ఎంతకాలం ప్రభావం ఉంటుందనే వివరాలు తెలుసుకుందామా.. అణువే.. బ్రహ్మాండం.. అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. కానీ దానికి ఉండే శక్తి మాత్రం అపారమైనది. ఇది అది అని కాదు.. అత్యంత ప్రాథమికమైన హైడ్రోజన్ నుంచి.. అణ్వస్త్రాల్లో వాడే యురేనియం, ఫ్లూటోనియం దాకా అన్ని మూలకాల్లో అపరిమిత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించి, మనకు అనుకూలంగా వాడుకోవడం కోసం శాస్త్రవేత్తలు వందల ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1898లో అణు ధార్మికత (రేడియేషన్)ను.. రేడియం, పోలోనియం మూలకాలను కనుగొన్నారు. ఆ పుస్తకాలు, వ్రస్తాలు ప్రమాదకరమే.. రేడియం మూలకం అత్యంత తీవ్రస్థాయిలో రేడియో ధార్మికతను విడుదల చేస్తుంది. తక్కువ పరిమాణంలోని రేడియంపైనే మేరీ క్యూరీ ప్రయోగాలు చేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా పడింది. దానితోనే ఆమె శరీరంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) దెబ్బతిని ప్రాణాలు కోల్పోయింది. క్యూరీ పరిశోధన చేసిన ల్యాబ్‌లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, ఆమె వస్త్రాలు, పరిశోధన వివరాలు రాసిన నోట్‌బుక్స్ అన్నీ రేడియం ప్రభావానికి లోనయ్యాయి. ఎంతగా అంటే.. ఆమె పుస్తకాలు, వ్రస్తాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. ఇప్పుడే కాదు.. మరో 1,500 ఏళ్ల పాటు వాటిలో రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ► మేరీ పరిశోధనలకు గుర్తుగా ఆమె నోట్‌బుక్స్‌ను ఫ్రాన్స్‌లోని బిబ్లియోథెక్ మ్యూజియంలో భద్రపర్చారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ బయటికి రాకుండా సీసపు పెట్టెల్లో వాటిని ఉంచారు. ► మేరీ క్యూరీ శరీరం నుంచీ రేడియేషన్ వెలువడుతుండటంతో.. ఆమె మృతదేహాన్ని ఒక అంగు ళం మందంతో తయారు చేసిన సీసపు పెట్టెలో ఉంచి ఖననం చేయడం గమనార్హం. ► అణుధార్మిక మూలకాల నుంచి వెలువడే రేడియేషన్‌ను సీసం సమర్థవంతంగా పీల్చుకోగలుగుతుంది. అందుకే రేడియో యాక్టివ్ మూలకాలను నిరంతరం సీసపు పెట్టెల్లోనే ఉంచుతారు. ‘ఎలిఫెంట్ ఫుట్’.. బతికేది ఐదు నిమిషాలే.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ప్రమాదానికి లోనైన అణు విద్యుత్ కేంద్రం చెర్నోబిల్. 1986 ఏప్రిల్‌లో అందులోని ఒక రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ లీకైంది. దాని ప్రభావంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వేలాది మంది ఆ రేడియేషన్‌కు లోనై.. వివిధ వ్యాధుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పట్లో రియాక్టర్ పేలినప్పుడు.. అందులోని అణు ఇంధనం, చుట్టూ ఉన్న లోహ పరికరాలు, కాంక్రీట్ శ్లాబ్‌లు, బీమ్‌లు కరిగి దిగువకు కారిపోయాయి. అవి దిగువన కాస్త వెడల్పుగా విస్తరించిన పొడుగాటి స్తంభంలా ఏర్పడ్డాయి. అది చూడటానికి ఏనుగు కాలు ఆకారంలో ఉండటంతో ‘ఎలిఫెంట్ ఫుట్’అని పేరుపెట్టారు. ఇది జరిగి 38 ఏళ్లయినా ఇప్పటికీ దాని నుంచి రేడియేషన్ వెలువడుతూనే ఉంది. ఎవరైనా దాని దగ్గరగా వెళ్లి.. ఐదు నిమిషాలుగానీ ఉంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఈ రేడియేషన్ బయటికి రాకుండా.. దాని చుట్టూ రెండు వరుసలుగా సీసం, ఇతర లోహాలతో ప్రత్యేకంగా కంటైన్మెంట్ చేసి మూసేశారు. ► ప్రస్తుతం ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. ఆ దేశంలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాదీనంలోకి తెచ్చుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనది కూడా ఇందుకే.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..?
సీతంపేట (విశాఖ ఉత్తర): ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లో చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచ కిచలు నేడు కరువయ్యాయి. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. చదవండి: అద్భుతాలు సృష్టించి.. వాటికే బలై.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా? పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంట్లో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహా్మ్రస్తాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‌తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కలి్పస్తున్నారు, ఏ ఏడాది ‘ఐ లవ్ స్పారో’ థీమ్‌తో వరల్డ్ స్పారో డే నిర్వహిస్తున్నారు. వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు ,కళాశాలల్లో అవేర్నెస్ క్యాంపైన్స్, , వ్యాసరచన, సమావేశలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 23 ఏళ్లుగా కృషి చేస్తున్నాం పట్టణీకరణ, కాలుష్యం, రేడియేషన్ కారణంగా సున్నితమైన పిచ్చుక సంతంతి నానాటికీ తగ్గిపోతోంది. పిచ్చుకలు మానవాళికి ఎంతో ప్రయోజకరమైనవి. పిచ్చుకల పరిరక్షణకు 2000 సంవత్సరంలో గ్రీన్ క్లైమేట్ సంస్థను స్థాపించి 23 ఏళ్లుగా వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాం. సభలు, సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పిచ్చుకల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణకు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని వివరిస్తున్నాం. ఈ విధంగా గ్రీన్ క్లైమేట్ టీం వేలాది మంది విద్యార్థులకు , యువతకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు అవగాహన కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు వెళ్లి పిచ్చుకల పరిరక్షణకు ఏం చెయ్యాలో అవగాహన కల్పించి విద్యార్థులను భాగస్వామ్యం చేశాం. పిచ్చుకలు కనిపించే ప్రాంతాలకు వెళ్లి వాటిని కాపాడటానికి గూళ్లు, ఆహారం, నీరు ఏర్పాటు చెయ్యమని చైతన్య పరిచాం. 2002లో చెక్కతో తయారు చేసిన పిచ్చుకల గూళ్లు నగర ప్రజలకు పరిచయం చేసి విరివిగా ఏర్పాటు చెయ్యాలని ప్రచారం చేశాం. అలాగే 2005లో మట్టితో చేసిన గూళ్లు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చి ఇంటి పరిసరాలలో ఉంచాలని అవగాహన కల్పించాం. టీమ్ సభ్యుల సుదీర్ఘ కృషితో విశాఖనగరంలో ప్రస్తుతం 280 ప్రాంతాలలో పిచ్చుకలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు తమ ఇళ్ల బాల్కనీలు, మెట్ల కింద మట్టితో చేసిన గూళ్లు, ఆహారం, నీళ్లు ఏర్పాటు చెయ్యాలి. –జేవీ రత్నం, వ్యవస్థాపకుడు, గ్రీన్ క్లైమేట్ సంస్థ పిచ్చుకల అవసరం ఎంతో ఉంది పెదవాల్తేరు (విశాఖ తూర్పు): పిచ్చుకలను పరరిక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకుడు జేవీ రత్నం, పేర్కొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని శనివారం చినవాల్తేరులో గల –జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది పిచ్చుకల దినోత్సవం ఇతివృత్తం ‘నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను’ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో దినోత్సవాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీ.కృష్ణవేణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారు పిచ్చుకలను పరిరక్షిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చుకల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. వాటికి నివాసయోగ్యంగా ప్రజలు సౌకర్యాలు కల్పించాలి. డోడో పక్షి అంతరిస్తే జరిగిన నష్టం మనం తెలుసుకున్నాం. అందుకే మన ఇంటి చుట్టు ఉన్న పిచ్చుకలను కాపాడుకోవాలి. పిచ్చుకలవల్ల మన ఇంటికి, వ్యవసాయానికి మేలుజరుగుతుంది. –ఈయూబీ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, పర్యావరణ విభాగం ఆహారం..నీరు అందించాలి పిచ్చుకలు అంతరించిపోతే పంటలకు హానికలుగుతుందని గ్రహించాలి. మనకు, పంటలకు హానికలిగించే క్రిమి కీటకాలను నివారించే సున్నితమైన పక్షి. మనం పిచ్చుక జాతిని పరిరక్షించుకోవాలి, పిచ్చుకల ఆవశ్యకతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వాటి మనుగడకు అవసరమైన గూళ్లు, ఆహారం, నీరు ఇంటి పరిసరాలలో అందుబాటులో ఉంచాలి. ఇతర జీవుల వల్ల వాటి సంతతికి నష్టం కలగకుండా చూడాలి. – హేమలత, జువాలజీ లెక్చరర్ సంతతి తగ్గుముఖం పిచ్చుకల సంఖ్య ఘనణీయంగా తగ్గిపోయింది. పిచ్చుకల సంతతి పెరిగేలా చేపట్టాల్సిన చర్యలపై భావితరాలకు అవగాహన కలి్పంచాలి. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల ఆవశ్యకతపై అవగాహన కలి్పంచి వాటి పరిరక్షణలో భాగస్వామ్యం చెయ్యాలి. పిచ్చుకల రక్షణ బాధ్యత పూర్తిగా మనదే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. – సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత కులపతి, కృష్ణా యూనివర్సిటీ -
అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం
సౌర మంట అనేది సూర్యునిపై అకస్మాత్తుగా పెరిగిన ప్రకాశం, సాధారణంగా ఇది సూర్యని ఉపరితలం వద్ద లేదా సూర్యరశ్మి సమూహానికి దగ్గరగా ఉంటుంది. ఈ మంటల నుంచి రేడియో తరంగాల నుండి గామా కిరణాల వరకు అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా వ్యాపించి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. చాలా దృశ్య శక్తి పరిధి వెలుపల ఉన్న పౌనఃపున్యాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వేగవంతమైన చార్జ్డ్ కణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్లు, ప్లాస్మా మాధ్యమంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఈ మంటలు సంభవిస్తాయి. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) అరోరా అనేది ఒక సహజ విద్యుత్ దృగ్విషయం. ఇది ఆకాశంలో.. ముఖ్యంగా ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతికి సంబంధించిన స్ట్రీమర్ల రూపాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దీనిని వరుసగా అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ అరోరా ఆస్ట్రాలిస్ లేదా సదరన్ లైట్స్ అని పిలుస్తారు. అయితే జీవిత కాలంలో ఎప్పుడో అరుదుగా లభించే చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి థామస్ పెస్క్వెట్ తీశారు. We were treated to the strongest auroras of the entire mission, over north America and Canada. Amazing spikes higher than our orbit🤩, and we flew right above the centre of the ring, rapid waves and pulses all over. #MissionAlpha https://t.co/5rdb08ljhx pic.twitter.com/0liCkGvRCh — Thomas Pesquet (@Thom_astro) November 6, 2021 అంతేకాదు ఆయన గ్రహం ఉత్తర భాగంలో మిరుమిట్లు గొలిపే అరోరాస్ (ఎర్రటి లేదా ఆకుపచ్చ)తో బలమైన సౌర మంట వెలుగుతున్న క్షణాన్ని ఫోటో తీశాడు.పైగా ఈ మండుతున్న సూర్యుని కాంతి భూమి వైపు దూసుకుపోతున్న అద్భుతమైన సమయంలో తీశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోతోపాటు "మా మిషన్ మొత్తం ఉత్తర అమెరికా నుంచి కెనడా మీదుగా ప్రసరిస్తున్న సౌర కాంతిని చూశాం. అయితే మా కక్ష్య కంటే అద్భుతమైన ఎత్తులో ఆ కాంతి ప్రసరిస్తుంది. మేము తరంగ ధైర్ఘ్యాల మధ్యలో ఉన్నాం" అని పెస్క్వెట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌కి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి మీరు చూడండి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) -
ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!
విశ్వంలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఛేదించడం కోసం మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని దృగ్విషయాల చిక్కుముడి విప్పి ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అందులో చెప్పుకోదగినదే.. ఈవెంట్ హారిజోన్.. ఈ ఈవెంట్ మొట్టమొదటి సారిగా కృష్ణ బిలాల( బ్లాక్‌హోల్) ఫోటోను తీయడానికి ఉపయోగపడింది. కాగా ప్రస్తుతం నైరుతి ఆఫ్రికాలోని నమీబియా శాస్త్రవేత్తల బృందం సుదూరాన ఉన్న గెలాక్సీలో జరిగిన నక్షత్ర భారీ విస్పోటనాన్ని గుర్తించారు. సుమారు ఈ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ విస్పోటనం ద్వారా అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన గామా-రే పేలుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. గామా రే పేలుళ్ల నుంచి అత్యంత శక్తివంతమైన రేడియేషన్ వెలువడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేషన్ విశ్వంతరాలపై జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గామా రే పేలుడు భూమి నుంచి సుమారు ఒక బిలియన్ కాంతి సంవత్పరాల దూరంలో జరిగింది. కాగా ఈ విస్పోటనం భూ గ్రహానికి అత్యంత సమీపంలో జరిగింది. సాధారణంగా గామా రే పేలుళ్లు భూమి నుంచి 20 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేలుడు ప్రస్తుతం ఉన్నగామా రే పేలుళ్ల సిద్ధాంతాన్ని సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో ఎక్స్ రే, గామా పేలుళ్లలో భారీగా సారుప్యతలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశీలనకు సంబంధించిన విషయాలను డ్యూయిష్ ఎలెక్ట్రోనెన్-సింక్రోట్రోన్ (DESY) లో ప్రచురించారు. ఇది జర్మనీకి చెందిన అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అంతేకాకుండా హెల్మ్హోల్ట్జ్ అసోసియేషన్‌లో భాగం.ఈ పేలుళ్లలకు సంబంధించిన సిములేషన్ వీడియోను ఈ సంస్థ పోస్ట్ చేసింది. కాగా ఈ పేలుడు నుంచి వెలువడే అత్యంత ప్రకాశంతమైన నీలి రంగు కాంతిని కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు ఏంటి ఈ గామా రే పేలుళ్లు... సాధారణంగా నక్షత్రాలు తమ జీవితకాలన్ని ముగిసిపోయి, సూపర్నోవాగా రూపాంతరం చెంది అప్రకాశవంతమైన వస్తువులుగా మారి క్రమేపి కృష్ణబిలాలుగా మారుతుంటాయి. నక్షత్రాల్లో పేలుళ్లు సంభవించినప్పుడు అత్యంత శక్తివంతమైన ఎక్స్ రే, గామా దృగ్విషయాలు వెలువడుతుంటాయి. గామా-రే పేలుళ్లు సుదూరంగా ఉన్న గెలాక్సీలలో జరిగే అపారమైన శక్తివంతమైన పేలుళ్లు. ఈ పేలుళ్లు విశ్వంలో సంభవించే అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత సంఘటనలు. గామా రే పేలుళ్లు కొన్ని సార్లు పది మిల్లీసెకన్ల నుంచి కొన్ని గంటల వరకు జరుగుతుంటాయి. -
5జీ నెట్‌వర్క్‌తో పర్యావరణానికి పెనుముప్పు
న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంపై బాలీవుట్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 5జీ నెట్‌వర్క్‌తో విపరీతమైన రేడియేషన్ వెలువడుతుందని, తద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుందని చెప్పారు. ఇది మనుషుల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విలువైన జంతుజాలం, పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను వ్యతిరేకిస్తూ జుహీ చావ్లా సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సి.హరిశంకర్ ముందుకు విచారణకు రాగా, ఆయన దాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జుహీ చావ్లా పిటిషన్‌పై జూన్ 2న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. 5జీ నెట్‌వర్క్‌తో రేడియేషన్ ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 100 రెట్లు పెరిగిపోతుందని జుహీ చావ్లా పేర్కొన్నారు. భూమిపై ఉన్న ఏ ఒక్క మనిషి, జంతువు, పక్షి, కీటకం, చెట్టు ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోలేవని తెలియజేశారు. అంతేకాకుండా మన పర్యావరణానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుందన్నారు. -
మనసు చలించి జడ దానం.. గ్రేట్ కదా..!
నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది. బీటెక్, ఎంటెక్ తర్వాత మాస్టర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్‌తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్‌కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమధుర ఆర్ట్ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
ఆవుపేడతో రేడియేషన్‌కు చెక్ పెట్టొచ్చట..!
న్యూఢిల్లీ: ఆవు హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలానే ఆవు పేడ, మూత్రాన్ని కూడా అనేక రకాలుగా వినియోగిస్తారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. ఇక ఆవు పేడను కూడా ఇప్పటికే దీన్ని ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆవు పేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడకు రేడియేషన్‌ను ఎదుర్కోవడంతోపాటు దాన్ని తగ్గించే సామర్ధ్యం ఉందని కతిరియా తెలిపారు. ఆవు పేడతో తయారైన చిప్‌ని ప్రదర్శించిన కతిరియా మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నపుడు మనుషులను ప్రభావితం చేసే రేడియేషన్‌ని నివారించడానికి ఈ ఆవు పేడ చిప్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. ‘‘ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది, దీనికి రేడియేషన్ నిరోధకత ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆవు పేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ఇది ప్రజలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది’’ అన్నారు కతిరియా. (చదవండి: అమెరికాలో పిడకల వేట!) ఫోన్లలో ఆవుపేడ ఆధారిత చిప్ ఉంచితే అది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆవు పేడ చిప్‌ని ఆవిష్కరించిన కామధేను ఆయోగ్ ఛైర్మన్ దానికి ‘గౌసత్వా కవచ్’ అని పేరు పెట్టారు. రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధులను నివారించాలనుకుంటే, ఆవు పేడతో చేసిన చిప్‌ను ఫోన్లలో వాడాలని కతిరియా ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడమే కాకుండా వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహిచేందుకు కేంద్రం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ సంస్ధను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ గోవులకు సంబంధించిన ప్రతీ ఉత్పత్తిని శాస్త్రీయంగా పరీక్షించి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్‌ను సంస్ధ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది. ‘గౌసత్వ కవచ్’ పేరుతో రూపొందించిన ఈ చిప్‌ను గుజరాత్‌కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. -
యమ డేంజర్..యూవీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత నాలుగైదు రోజులుగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో ఆల్ట్రా వయోలెట్ (యూవీ) రేడియేషన్ తీవ్రత ఎనిమిది పాయింట్లు ఉండగాల్సి ఉండగా, తాజాగా 11 పాయింట్లుగా రికార్డు అవుతుంది. ఫలితంగా నీడలో ఉన్నా మంట, వేడిగాలులు తప్పడం లేదు. ఉక్కపోతకు తోడు..వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం సిటిజన్లు ఇష్టం లేకపోయినా ఏసీ, కూలర్లను వినియోగించాల్సి వస్తుంది. కరోనా భయంతో గత కొంతకాలంగా వీటి వినియోగానికి దూరంగా ఉన్న వినియోగదారులు ప్రస్తుతం వీటి కొనుగోలుకు పోటీ పడుతున్నారు. రోజంతా వాటిని వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదువుతుంది. తాజాగా బుధవారం 68 ఎంయూలు నమోదైంది. ఈ ఏడాది.. ఈ సీజన్లో ఇదో రికార్డు. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కరెంట్ వినియోగం అనూహ్యంగా పెరగడంతో సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. హైఓల్టేజీ సమస్యతో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం ఆయా పవర్ ట్రాన్స్ఫార్మర్లకు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం విశేషం. ♦ రికార్డు స్థాయిలో వినియోగం... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 48 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడు లక్షల వరకు వాణిజ్య కనెక్షన్లు ఉండగా, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 50 వేల వరకు ఉన్నాయి. లక్షకు పైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. హోటళ్లు, సినిమా హాళ్లు, భారీ మాల్స్ ఇంకా తెరుచుకోకపోయినా విద్యుత్ వినియోగం మాత్రం భారీగా నమోదవుతుంది. నిజానికి శీతల గాలుల్లో కరోనా వైరస్ బలపడే ప్రమాదం ఉందని భావించిన గ్రేటర్ వాసులు భయంతో గత రెండు నెలలుగా ఏసీలు, కూలర్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వడగాల్పులు వీస్తుండటంతో ఇష్టం లేక పోయినా ఏసీలు, కూలర్లను ఆన్ చేశారు. ఫలితంగా గత నాలుగైదు రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం ఫీక్ స్టేజ్‌కి చేరుకుంటుంది. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినియోగం తక్కువే అయినప్పటికీ...మార్చి, ఏప్రిల్ నెల రోజువారి సగటు వినియోగంతో పోలిస్తే...లాక్డౌన్ స డలింపు తర్వాత వినియోగం క్రమంగా పెరగడం విశేషం. మే మొదటి వారంలో గ్రేటర్లో రోజువారి సగటు వినియోగం 54 ఎంయూలు ఉండగా...ప్రస్తుతం 68 ఎంయూలకు చేరుకోవడం గమనార్హం. వెంటాడుతున్న నిర్వహణ లోపం.... వేసవికి ముందే లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలు తొలగించడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో తలెత్తే ఆయిల్ లీకేజీలను అరికట్టడం, ఫీడర్లలో ఎర్తింగ్ సమస్య లేకుండా చూడటం వంటి పునరుద్ధరణ పనులు నిర్వహించాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇందుకు ఏటా వంద కోట్లుకు పైగా ఖర్చు చేస్తుంది. నిర్వహణ లోపానికి అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో హై ఓల్టేజీ సమస్య తలెత్తినప్పుడు సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లలో మంటలు తలెత్తి కాలిపోయే ప్రమాదం ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా కామినేని ఆస్పత్రి సమీపంలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో తలెత్తిన విద్యుత్ ప్రమాదానికి ఇదే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ మొదటి వారంలో గాలివానతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లూజ్ కాంటాక్ట్‌లు, వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించక పోవడంతో షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. అంతేకాదు ప్రస్తుతం నగరంలోని అనేక ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీ తదితర సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని సరి చేయక పోవడం వల్ల వాటిలో మంటలు వచ్చి కాలిపో యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పిట్ట కథలు
మనకు తొట్టతొలి పిట్టకథ రామాయణం. క్రౌంచ మిథు నాన్ని ఒక బోయ చంపాడు. తొలి సహగమనం కూడా అక్కడే జరిగింది. శోకం లోంచి శ్లోకం పుట్టింది. మహేతిహాసానికి నాంది వాక్యమైంది. క్రౌంచ పక్షుల్ని వాడుకలో కవుజు పిట్టలంటారు. చుక్కల చుక్కల రెక్కలతో చూడముచ్చటగా ఉంటాయి. పిట్టమాంస ప్రియులు కవుజు రుచి పరమాద్భుతం అంటారు. వేటగాళ్లు దీన్ని చాలా తెలివైన పిట్టగా చెబుతారు. అనవసరంగా ఇది ఎక్కడా కూత వెయ్యదు. కూతతో ఉనికిని చాటుకుని ప్రాణం మీదికి తెచ్చుకోదు. అందుకే వేటగాళ్లు దీన్ని వేటాడాలంటే కవుజు సాయమే తీసుకుంటారు. షికారీల దగ్గర పెంపుడు కవుజులుంటాయ్. నూకలుజల్లి కౌజుల్ని అక్కడ వదులుతారు. పెంపుడు కౌజు చేత ‘ఇక్కడ మేతలు న్నాయ్ రమ్మని’ కూతలు వేయిస్తారు. పాపం నమ్మి బయటి కవుజులు వచ్చి ముగ్గులో వాల్తాయ్. మరు క్షణం వేటగాడి వలలో పడతాయి. మనిషి తిండి కోసం ఎవరినైనా ఎన్ని మోసాలైనా చేస్తాడు. దేశంలో పిట్టలు, అనేకానేక పక్షి జాతులు కను మరుగవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రకృతి ప్రియుల్ని చాలా బాధపెడుతోంది. నగ రీకరణ, అడవుల కొరత, పర్యావరణ కాలుష్యం, మనిషి జిహ్వ చాపల్యం–ఇవన్నీ పిట్టలు కనుమ రుగు అవడానికి కారణం. ఎక్కడ దాక్కున్నా మనిషి పిట్టల్నీ బతకనీయడం లేదు.మనిషి భూమిని, ఆకా శాన్ని, సముద్రాన్నీ ఇప్పటికే వశపరచుకున్నాడు. ఇప్పుడు ఇతర గోళాలమీద దృష్టి సారించాడు. చివ రకు మనిషి త్రివిక్రముడిగా మిగులుతాడో, భస్మాసు రుడుగా కనుమరుగు అవుతాడో కొన్ని తరాలు ఆగి చూడాల్సి ఉంది. అనేకానేక పరిశోధనల తర్వాత పక్షులు కూడా డైనోసార్స్ నుంచే ఆవిర్భవించాయని తేల్చి చెప్పారు. సమస్త చరాలకు డైనోయే మూల మని రుజువైంది. మనదేశంలో చాలామంది పక్షి ప్రియులున్నారు. వాళ్లు టెలిస్కోపులు, కెమెరాలు వేసుకుని కంచెలెంబడి అస్తమానం తిరుగుతుం టారు. వాటి కూతల్ని రికార్డు చేసి ఆనందిస్తుంటారు. ఒకప్పుడు ఎటుచూసినా గుంపులుగా కనిపించే కాకులు ఇప్పుడు అపురూపమైపోయాయి. పిచ్చు కలు ఇళ్లలో కిచకిచలాడుతూ, అద్దాల్ని చూసి ఆడు కుంటూ ఎక్కడంటే అక్కడ గూళ్లుపెట్టి గుడ్లు పెడుతూ నానా యాగీ చేస్తుండేవి. ఇప్పుడు లేవు. సెల్‌ఫోన్ టవర్స్ రేడియేషన్ కారణంగా పిచుకలు పోయాయని చెబుతారు. పల్లెటూళ్లలో అతిపెద్ద పరి మాణంలో రాబందులు, కనిపించేవి. ఇవ్వాళ వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. వాటిని పెంచ డానికి లక్షలు వెచ్చించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. చెట్ల తొర్రలో కాపురముండే రామ చిల కలు, గువ్వలు, గోరువంకలు ఒకనాడు మనుషుల బాల్యాన్ని ఆనందంగా నింపేవి. అన్నం తినక మారాం చేసే పిల్లలకు చందమామ, పావురాలు, రామచిలకల్ని చూపి తల్లలు బువ్వలు తినిపించే వారు. తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట. ఎగిరే ఇంద్ర ధనుస్సులా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దా మంటే విజయదశమి పండగరోజు కూడా దర్శనమీ యడం లేదు. తక్కువ ఎగురుతూ, ఎక్కువ పరు గులు పెడుతుండే కంచెకోడి బలే రంగురంగుల పిట్ట. నిజంగా దాన్ని చూసి ఎన్నాళ్లు అయిందో. కోయిల కూతకి బదులు కూత వేస్తూ పిల్లలని కవ్వించేది. అది ఎప్పుడూ కన్పించడం తక్కువే. ఇప్పుడు ఉగాది పండగ చిత్రాల్లో పంచాంగం పక్కన, మామిడి పిందెల సరసన వేపకొమ్మకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నల్లటి కోయిల. తీతువుపిట్ట అరుపులు విన్నాంగానీ ఎప్పుడూ అది కంటపడలేదు. వడ్రంగిపిట్ట బాగా పరిచయం. మునుపు తమిళనాట పక్షి తీర్థం అని క్షేత్రం ప్రసిద్ధి. సరిగ్గా మధ్యాహ్నం వేళకు ఎక్కడినుంచో అయిదు గద్దలు అక్కడకు దిగేవి. అర్చక స్వాములు సమర్పిం చిన ప్రసాదం తిని తిరిగి ఎగిరిపోయేవి. ఏరోజూ వేళ తప్పేవి కావు. వాటిని గరుత్మంత అవతారాలుగా భావించేవారు. పాతికేళ్ల క్రితం వంద ఉన్న చాలా పక్షులు ప్రస్తుతం మూడు, అయిదుకి పడిపోయాయి. ఇప్పటికీ ఎక్కువ రకాల పక్షులు, పాములు తిరుమల ఏడుకొండలమీదే ఉన్నాయని చెబుతారు. పక్షుల్ని సంరక్షించే బాధ్యత ఏడుకొండలవాడికే అప్పగిం చాలి. అనువైన ఒక కొండని పక్షి ఆశ్రయంగా, కణ్వా శ్రమంగా తీర్చిదిద్దాలి. అపురూపమైన అరుదైన పక్షి జాతుల్ని స్వామి సన్నిధిలో కాపాడాలి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
పిట్ట ‘కొంచెమే’!
సాక్షి, హైదరాబాద్ : ఏడాదికి వివిధ రకాల సాధారణ పక్షుల్లో 80 శాతం వరకు తగ్గిపోతున్నాయి. గత 25 ఏళ్ల కాలంలో దేశంలోని ఐదో వంతుకు పైగా వివిధ పక్షి జాతుల (షార్ట్ టోవ్డ్స్నేక్ ఈగిల్ (గద్ద) మొదలుకుని సర్కిర్ మల్కోటాగా పిలిచే చిన్నపక్షి వరకు) సంఖ్య తగ్గిపోయింది. ఊర పిచ్చుక, పిట్ట వంటి సాధారణంగా కనిపించే పక్షిజాతి క్షీణత నుంచి కొంత మెరుగు పడినా... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలోనే తొలిసారిగా వివిధ రకాల పక్షి జాతులపై స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్–2020 (ఎస్‌వోఐబీ) పేరిట డబ్ల్యూడబ్ల్యూఎఫ్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, వైల్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వెట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, ఏ ట్రీ, బీఎన్హెచ్ఎస్ ఇండియా, ఎఫ్ఈఎస్, ఎన్సీబీఎస్, సాకాన్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సమగ్ర నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ–బర్డ్ ప్లాట్‌ఫామ్‌పై 867 భారత పక్షుల రకాలకుసంబంధించి 15,500 మందికి పైగా పక్షి వీక్షకులు తమ పరిశీలనాంశాల ఆధారంగా ఒక కోటికి పైగా అప్లోడ్ చేసిన వివరాలు, సమాచారం ప్రాతిపదికన ఈ నివేదికను తయారు చేశారు. పక్షుల సంఖ్య తగ్గిపోవడానికి స్పష్టమైన కారణాలు కనుక్కోవాల్సిన అవసరముందని సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నివేదిక విడుదల సందర్భంగా ఎస్‌వోఐబీ సభ్యుడు సోహెల్ ఖాదర్ పేర్కొన్నారు. రామ చిలుకల నుంచి కాకుల దాకా... రాష్ట్రంలో రామ చిలుకలు, పాలపిట్ట, పిచ్చుకలు, గద్దలు చివరకు కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. అదే సమయంలో మనుషులకు ఆరోగ్యపరంగా నష్టం చేకూర్చే పావురాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతోంది. పావురాల విసర్జనలు ఎండిపోయాక పొడిగా మారి గాలిలో కలిసి మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పక్షుల్లో మొండిజీవిగా, ఎక్కడైనా బతకగలిగే ఓర్పు, నేర్పు ఉన్న జీవిగా గుర్తింపు పొందిన కాకులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. గతంలో ఎక్కడ చూసినా కాకుల గుంపులు కనిపించేవి.. ఇప్పుడు ఇక్కడొకటి అక్కడొకటి మాత్రమే కనిపిస్తున్నాయని ఆయా రకాల పక్షుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పక్షుల సంఖ్య ప్రమాదకరంగా తగ్గిపోవడానికి... నగరీకరణ పెరిగి చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం ఒక కారణం కాగా.. కాలుష్యం, వివిధ రూపాల్లోని రేడియేషన్ మరో కారణం. అదేవిధంగా పంటలు పండించడంలో, పండ్ల చెట్ల పెంపకంలో పురుగు మందులు, రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం ముఖ్య కారణం. కాలుష్యం, రేడియేషన్ ప్రభావం ‘పక్షులు స్వేచ్ఛగా పెరిగే వాతావరణం తగ్గిపోవడం, కాలుష్యం పెరగడంతో పాటు వివిధ రూపాల రేడియేషన్‌తో పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. గత 15 ఏళ్లుగా ఆయా అంశాలను దగ్గర నుంచి గమనిస్తున్న నాకు పక్షుల సంఖ్యలో తగ్గుదల స్పష్టంగా గోచరిస్తోంది. పక్షులను కాపాడుకోవడంలో ప్రజల జీవన విధానం, అనుసరిస్తున్న పద్ధతుల్లో కచ్చితమైన మార్పు రావాల్సిన అవసరముంది. కాలుష్యం, రేడియేషన్ పెరగడంతో పక్షులు గుడ్లు పెట్టినా వాటిని పొదగడం లేదు. ఆధునిక వసతులతో కూడిన వ్యవస్థ, దానితో పాటు ప్రకృతి, పర్యావరణం రెండూ అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటేనే ప్రాణకోటికి మనుగడ. పక్షులను కాపాడుకుని, అవి సహజ సిద్ధంగా ఉండేలా చేసినపుడే మానవాళికి కూడా వివిధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది’. –సాక్షితో జి.సాయిలు, ఫారెస్ట్ ప్లస్ 2.0 రీజినల్ డైరెక్టర్, బయో డైవర్సిటీ కన్జర్వేషనలిటిస్ట్ భారీగా పెస్టిసైడ్స్ వినియోగంతో తీవ్ర నష్టం ‘పంటల దిగుబడి పెంచేందుకు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయనాల వినియోగం పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలపిట్ట వంటి పక్షి పంట పొలాలపై క్రిములను తిని జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం పెస్టిసైడ్స్‌ను అడ్డూఅదుపు లేకుండా ఉపయోగిస్తుండటంతో క్రిమి, కీటకాలు లేక పాలపిట్టల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రామ చిలుకలు, ఊర పిచ్చుకలదీ ఇదే పరిస్థితి. పండ్ల చెట్లు ఎక్కువ ఫలాలు ఇచ్చేందుకు పురుగు మందులు వినియోగిస్తుండటంతో వాటిని తిని రామచిలుకలు చచ్చిపోవడమో లేక వాటి పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమో జరుగుతోంది’. – ‘సాక్షి’తో శంకరన్, వల్డ్లైఫ్ విభాగం ఓఎస్డీ -
ప్రకృతి సేద్యంతోనే భూతాపానికి చెక్!
వాల్టర్ యన.. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన సుప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్టు, వాతావరణ శాస్త్రవేత్త. హెల్దీ సాయిల్స్ ఆస్ట్రేలియా సంస్థ వ్యవస్థాపకులుగా రైతులతో మమేకమై పనిచేస్తుంటారు. భూతాపోన్నతికి, కరువు కాటకాలకు ఎటువంటి ఆచ్ఛాదనా లేని భూమి ఎండ వేడిమిని వాతావరణంలోకి తిరగ్గొట్టడం (రీ రేడియేషన్) వల్ల సహజ నీటి చక్రం (నేచురల్ వాటర్ సైకిల్) చెదిరిపోవడమే మూల కారణమన్నది ఆయన విశ్లేషణ. ఏడాది పొడవునా బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచేలా(గ్రీన్ కవర్) ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తే వాతావరణంలోని కర్బనాన్ని జీవద్రవ్యం ద్వారా భూమిలో స్థిరీకరించడం (సాయిల్ కార్బన్ స్పాంజ్) సాధ్యమవుతుందని, తద్వారా భూమిని చల్లబరిచి సహజ నీటి చక్రాన్ని పునరుద్ధరించుకోవచ్చని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. తీవ్ర కరువున్న ప్రాంతాల్లో సైతం క్రమంగా పదేళ్లలో కరువును శాశ్వతంగా పారదోలవచ్చని, భూతాపోన్నతిని ఉపశమింపజేయవచ్చని అంటున్నారాయన. మన దేశానికి మొదటి సారి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఇటీవల సందర్శించారు. అనంతపురం వంటి తీవ్ర కరువు జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో రుతుపవనాల రాకకు ముందే విత్తనం వేసే (ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్) వినూత్న పద్ధతి రైతులకు ఉపయోగపడటంతోపాటు భూతాపాన్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని అంటున్న వాల్టర్‌తో ‘సాగుబడి’ ముఖాముఖి.. ► భూతాపోన్నతితో నెలకొన్న వాతావరణ ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రపంచం అంతటా ఇవ్వాళ మనం చూస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం(ప్రపంచవ్యాప్తంగా దీన్నే రీజనరేటివ్ అగ్రికల్చర్ అని అంటున్నారు) ద్వారా మాత్రమే పరిస్థితిని చక్కదిద్దగలమని గత కొన్నేళ్లుగా మీరు చెబుతున్నారు కదా.. అదెలా..? భూతాపం, కరువులకు ప్రధాన కారణం విచక్షణా రహితంగా అడవులను నరికివేస్తూ నేలను ఎండబారిన పడెయ్యడం, పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో గత వందేళ్లుగా ఏక పంటలను సాగు చేయడం వల్ల ప్రతి హెక్టారు భూమిలో నుంచి ఏటా 5–10 టన్నుల కర్బనాన్ని చేజేతులా గాల్లో కలిపేస్తున్నాం. భూముల్లో 5%గా ఉండాల్సిన సేంద్రియ కర్బనం.. అత్యంత కనిష్ట స్థాయి 0.3%కి దిగజారింది. అందువల్ల మన భూములు నీటిని నిలుపుకోలేక ఉత్పాదకతను కోల్పోయాయి. అంతేకాదు, యావత్ వాతావరణాన్ని చల్లబరిచే ప్రాణశక్తిని సైతం కోల్పోయాయి. అందువల్ల ‘సహజ నీటిచక్రం’ దెబ్బతిన్నది. కరువు కాటకాలు, అకాల వర్షాలు, భూతాపం అపరిమితంగా పెరిగిపోవడం.. ఇవన్నీ ‘సహజ నీటి చక్రం’ దెబ్బతినటం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలే. ► దెబ్బతిన్న నీటిచక్రాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వ్యవసాయం వల్ల సాధ్యమవుతుందా? సాధ్యమే. భూతాపాన్ని నిజంగా తగ్గించాలంటే.. మనం మొదట చేయాల్సింది రసాయనాలతో పారిశ్రామిక వ్యవసాయం చేయటం మాని, భూములను సజీవవంతం చేసే çపకృతి వ్యవసాయం చేపట్టాలి. భూమి అంతటికీ దట్టమైన ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పించాలి. భూములు ఎండ బారిన పడకుండా ఒకటికి నాలుగు పంటలతో, తోటలు చెట్లతో 365 రోజుల పాటు కప్పి ఉంచేలా గ్రీన్‌కవర్ పెంచగలిగితే భూతాపాన్ని తగ్గించెయ్యవచ్చు. వాతావరణంలో అతిగా పోగుపడిన కర్బనాన్ని తిరిగి భూమిలోకి జీవ ద్రవ్యం రూపంలో స్థిరీకరించవచ్చు (ఈ ప్రక్రియనే ‘సాయిల్ కార్బన్ స్పాంజ్’ అంటున్నారు). సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉండి స్పాంజ్ మాదిరిగా నీటిని పట్టి ఉంచే సజీవ భూముల సాయంతో మాత్రమే 365 రోజులు గ్రీన్ కవర్ పెంచగలుగుతాం. అప్పుడే గతి తప్పిన నీటి చక్రాన్ని పునరుద్ధరించుకోగలం. భూతాపాన్ని అరికట్టడం వీలవుతుంది. పారిశ్రామిక వ్యవసాయాన్ని వదిలెయ్యకుండా, భూములను తిరిగి సజీవవంతంగా చేసుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టకుండా భూతాపాన్ని అరికట్టడం అసాధ్యం. పదిహేనేళ్లుగా నేను ఇదే చెబుతున్నాను. అయితే, భారత దేశంలో మీరు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇందుకు దోహదపడతాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న భూములను స్వయంగా పరిశీలించారు కదా. మీకెలా అనిపించింది? ప్రకృతి వ్యవసాయ పద్ధతి భూములకు, రైతులకు, వాతావరణానికి నిస్సందేహంగా ఎంతో మేలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే.. అనంతపురం వంటి తీవ్ర కరువు ప్రాంతాల్లో కూడా రుతుపవనాల రాకకు ముందే విత్తనాలు వేయడం(ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్) చాలా అద్భుత ఫలితాలనిచ్చే ప్రయోగం. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏడాది పొడవునా పంటలతో నిండి ఉండేలా భూములకు సజీవ ఆచ్ఛాదన కల్పించడానికి ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పొలాలు చూసి నేనెంతో ముగ్ధుడినయ్యాను. చాలా దేశాలు తిరిగాను. ఇలాంటి మెరుగైన సాగు పద్ధతి క్షేత్రస్థాయిలో అమలులో ఉండటం మరెక్కడా చూడలేదు. ఇది ప్రపంచానికే అనుసరణీయమైన గొప్ప ఉదాహరణగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అయితే, సీజనల్ పంటల సాగుతోపాటు.. పండ్ల తోటలు వేయటం, ఇతర ప్రయోజనకరమైన జాతుల చెట్లు పెంచుతూ వాటి మధ్యలో రకరకాల పంటలను ఏడాది పొడవునా సాగు చేయడం(ఆగ్రో ఫారెస్ట్రీ) ద్వారా భూమిని సాధ్యమైనంత వరకు కప్పి ఉంచేలా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత పరిపుష్టం చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వంతోపాటు చిన్న, సన్నకారు రైతులు కీలకపాత్ర పోషించాలి. ► రుతుపవనాల రాకకు ముందే పొడి వాతావరణంలో విత్తనాలు వేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఏ విధంగా విశిష్టమైనదో శాస్త్రీయంగా వివరిస్తారా? ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేయడంతోపాటు ఒకటికి పది రకాల ఏక దళ, ద్విదళ పంటల విత్తనాలను బీజామృతంతో శుద్ధిచేసి వర్షం రాకకు ముందే విత్తుతున్నారు. గడ్డీ గాదాన్ని, పొట్టు వంటి పంట వ్యర్థాలను నేలపై ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ద్రవజీవామృతం పిచికారీ చేస్తున్నారు. వర్షం రావడానికి ముందుగానే విత్తినప్పటికీ.. అంతటి పొడి వాతావరణంలోనూ దొరికిన కొద్దిపాటి తేమతోనే ఈ విత్తనాలు మొలకెత్తి, మిశ్రమ పంటలు పచ్చగా పెరుగుతున్నాయి. వర్షానికి ముందే అతికొద్ది పరిమాణంలోనైనా మూడు రకాలుగా నీరు సమకూరటం వల్లనే ఈ విత్తనాలు మొలిచి పెరుగుతున్నాయి. వర్షం పడిన తర్వాత మరింత పుంజుకొని భూమికి గ్రీన్ కవర్‌గా మారుతున్నాయి. వానకు ముందే వేసిన విత్తనం మొలవడానికి దోహదపడుతున్న నీటి వనరులు ఇవి.. ఘనజీవామృతం, జీవామృతంలోని పిండిపదార్థాన్ని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసినప్పుడు నీరు విడుదలవుతుంది. ప్రతి గ్రాము పిండి పదార్థానికి 6 గ్రాముల చొప్పున నీరు విడుదలవుతుంది. రెండోరకం నీటి వనరు.. ఎండాకాలంలో కూడా మట్టి కణాల చుట్టూ సూక్ష్మ స్థాయిలో నీటి జాడ(వాటర్ ఫిల్మ్) ఉంటుంది. కానీ, ఈ నీటిని మొక్కల పీచు వేర్లు కూడా పీల్చుకోలేవు. అయితే, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ద్వారా వేర్ల దగ్గర పెరిగిన మైకోరైజా శిలీంధ్రపు పోగులు (ఒక మీటరు ఘనపు మీటరు సజీవవంతమైన మట్టిలో 25 వేల కిలో మీటర్ల పొడవు వరకు శిలీంధ్రపు పోగులు విస్తరిస్తాయి) ఈ నీటిని పీల్చుకొని వేర్లకు అందిస్తాయి. పొడి వాతావరణంలో విత్తనం మొలకెత్తడానికి తేమ ఇలా లభిస్తుంది. మూడో రకం.. మొలక వచ్చిన తర్వాత ఆ ఆకులు వాతావరణంలో నుంచి నీటి తేమను రాత్రి పూట పీల్చుకొని పెరుగుతాయి. ఎండాకాలం బొత్తిగా నీరే లేదు అనుకున్న ప్రాంతాల్లో కూడా ఇలా నీటి వనరులు ప్రకృతిలోనే నిగూఢంగా దాగున్నాయి. ఉపాయంతో ఆ వనరులను అందిపుచ్చుకోవడానికి ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ వంటి వినూత్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. పంటకు– పంటకు మధ్యలో నవధాన్యాలను పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసి, భూమిలో కలియదున్ని (ఇలా భూమిలోకి చేరిన సేంద్రియ కర్బనం ఒక గ్రాముకు 8 గ్రాముల నీటిని పట్టి ఉంచగలుగుతుంది).. కొద్ది రోజుల్లోనే మళ్లీ పంటలు వేసుకుంటూ ఏడాది పొడవునా భూమిని కప్పి ఉంచుతున్న రైతులను కూడా ఇక్కడ కలుసుకున్నాను. ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ► అనంతపురం జిల్లాలో కూడా ఇలా జరిగిందా? ఇందులో శాస్త్రీయత ఎంత? అవును. ఇదంతా శాస్త్రీయంగానే జరిగింది. గత మే నెలలో వానకు ముందే విత్తిన పంటలు మొలిచాయి. జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 100 ఎం.ఎం. వర్షం పడింది. పంటలు మాత్రం హెక్టారుకు 12 నుంచి 15 టన్నుల బరువు మేరకు పెరిగాయి. 15 టన్నుల బరువున మొక్కలు (బయోమాస్) పెరగాలంటే 15 వేల టన్నుల నీరు అవసరం. ఒక గ్రాము బయోమాస్ పెరగాలంటే ఒక లీటరు నీరు అవసరం. 100 మిల్లీ మీటర్ల వర్షం హెక్టారు పొలంలో కురిస్తే, వెయ్యి మెట్రిక్ టన్నుల నీరు లభించినట్లు లెక్క. అనంతపురంలో కురిసిన 100 ఎం.ఎం. వర్షంతో లభించిన వెయ్యి మెట్రిక్ టన్నులు పోను.. 12 టన్నుల పంటల బయోమాస్ పెరగడానికి దోహదపడిన మిగతా 11 వేల టన్నుల నీరు ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలో నుంచే! ► 365 రోజులూ భూమిని పంటలు, చెట్ల పచ్చదనంతో కప్పి ఉంచినప్పుడు రైతుకు ఎన్నాళ్లలో ప్రయోజనం కనిపిస్తుంది? ప్రకృతి వ్యవసాయ సూత్రాలన్నీ పాటించే పొలంలో రైతుకు మొదటి సంవత్సరం నుంచే దీని సత్ఫలితాలు కనిపిస్తాయి. భూమి సజీవవంతం అవుతుంది. మట్టి భౌతిక జీవ రసాయనిక స్థితిగతుల్లో, దిగుబడిలో మొదటి మూడేళ్లూ చాలా ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తుంది. ► భూతాపం తగ్గి, కరువు పూర్తిగా పోవడానికి ఒక ప్రాంతంలో కనీసం ఎంత విస్తీర్ణంలో గ్రీన్ కవర్ కల్పించాల్సి ఉంటుంది? కనీసం 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ కవర్ పెంచితే ఉష్ణోగ్రతలో క్రమంగా తేడా తెలుస్తుంది.10 ఏళ్ల కాలంలో 90% మేరకు నీటి చక్రం పునరుద్ధరణ సాధ్యమవుతుంది. నేను నివసించే కాన్బెర్ర(ఆస్ట్రేలియా రాజధాని)లో వెయ్యి హెక్టార్లలో గ్రీన్ కవర్ ఉండటం వల్ల ఇతర ప్రాంతాలతో పోల్చితే అక్కడ 12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తేడా వచ్చింది. ఆసియాలో గత 20 ఏళ్లలో రుతుపవనాల విశ్వసనీయత 30 శాతం తగ్గిపోయింది. భూములను పచ్చదనంతో నింపితే వాతావరణంలో రీరేడియేషన్ తగ్గి కూలింగ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. మేఘాలు వర్షించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఎక్కువగా మొక్కలు నాటడంతోపాటు.. భూములను 365 రోజులూ పంటల పచ్చదనంతో కప్పి ఉంచేలా వ్యవసాయ పద్ధతిని మార్చుకుంటే తప్ప భూతాపాన్ని తగ్గించడం, కరువును శాశ్వతంగా పారదోలడం అసాధ్యం. (Walter jehne వీడియో ప్రసంగాల కోసం యూట్యూబ్‌లో వెతకండి) ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగవుతున్న పత్తి పంటను పరిశీలిస్తున్న వాల్టర్ యన రైతులతో ముచ్చటిస్తున్న వాల్టర్ యన తదితరులు -
సెల్‌ఫోన్ వినియోగం తగ్గించండిలా...
ఇటీవల సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్ కారణంగా మెదడుపై, శరీరభాగాలపై చెడు ప్రభావం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో ఇది నిత్యం చర్చల్లో ఉండే ఒక (డిబేటబుల్) అంశం. ఇక సెల్‌ఫోన్ కారణంగా మన దేహంపై పడే దుష్ప్రభావాలపై ఇంకా చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దుష్ప్రభావాలు ఎక్కువ అన్న విషయం స్పష్టంగా ఇంకా తేలకపోయినా... దీనినుంచి రేడియేషన్ వెలువడుతుందన్నది నిర్వివాదాంశం. ఇక రేడియేషన్‌తో మనకు ప్రమాదమే అన్న విషయం కూడా తెలిసిందే. అందుకే సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరిగా చేటు చేస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని వైద్యనిపుణులు, పరిశోధకులు/అధ్యయనవేత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తలివి... మీ మొబైల్‌ఫోన్ మీ శరీరానికి వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. సెల్‌ఫోన్‌ను షర్ట్ జేబులో గుండె దగ్గర, మన ప్రైవేట్ పార్ట్స్‌కు దగ్గరగా ఉండేలా ప్యాంట్ పాకెట్స్‌లో ఉంచడం అంత మంచిది కాదు. పౌచ్‌లో ఉంచడమే మంచిది. వీలైతే బ్రీఫ్‌కేసులు, హ్యాండ్‌బ్యాగులలో ఉంచడం ఇంకా బెటర్. సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్‌ను ఉపయోగించకుండానే పనులు జరిగేలా చూసుకోండి. మీటింగులు, కాన్ఫరెన్స్‌హాల్స్, దేవాలయాలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయండి. పన్నెండేళ్ల లోపు పిల్లలను దీని నుంచి తప్పనిసరిగా దూరంగా ఉంచండి. అదనపు ఫీచర్లు ఉన్న సెల్ఫోన్లను పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు గేమ్స్ ఆడటానికి కూడా సెల్‌ఫోన్ ఇవ్వకండి. ఎక్కువసేపు సంభాషణను కొనసాగించాల్సి వస్తే.. తప్పనిసరిగా ల్యాండ్లైన్నే ఉపయోగించాలి. ఇక సెల్ఫోన్లోనే ఎక్కువ సేపు కాల్ చేయాల్సి వస్తే తరచు ఫోన్‌ని కుడి చెవికి, ఎడమ చెవికి ఇలా మారుస్తుండాలి. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నపుడు మాట్లాడడం ప్రమాదకరం. సెల్‌ఫోన్స్‌తో పోలిస్తే హెడ్ సెట్స్ నుంచి రేడియేషన్ వెలువడటం తక్కువ. అందుకే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే హెడ్‌ఫోన్స్ కూడా వాడటం మంచిదే. వినేటప్పుడు కంటే మాట్లాడేటప్పుడు మన ఫోన్ ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం కొంత మేలు. దేహంలోని మృదువైన కండరాలపై రేడియేషన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హృదయానికి ఎదురుగానో, ఒళ్ళో పెట్టుకునో మాట్లాడడం వద్దు. ఏంటెన్నా క్యాప్స్, కీపాడ్ కవర్స్ వంటివి కనెక్షన్ నాణ్యతను తగ్గిస్తాయి. ఇది ఫోన్‌ను మరింత శక్తిమంతంగా పని చేసేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా రేడియేషన్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. సెల్‌ఫోన్‌ను ఉపయోగించండిలా... సెల్‌ఫోన్‌ను అత్యవసర వినియోగానికి మాత్రమే పరిమితం చేయండి. మాట్లాడటం కంటే వాట్సాప్, మెసేజెస్ రూపంలోనే వీలైనంతవరకు ఎక్కువ సమాచారం పంపండి. సెల్‌ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా అనవసరమైన కాల్స్‌ను చాలావరకు తగ్గించుకోవచ్చు. పొద్దున్న లేవడానికి అలారంతో మొదలుపెట్టి రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్ మీదే అతిగా ఆధారపడిపోవడం అడిక్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి ఫోన్‌ను కేవలం సంభాషణలకు మాత్రమే పరిమితం చేయండి. ఎక్కువగా ఫోన్ వాడే అవసరం ఉన్నవాళ్ళు ఇంట్లో ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకోవడం మేలు. కనీసం ఇంట్లో ఉన్నపుడైనా సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు. డ్రైవింగ్ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్ మాట్లాడకూడదని వ్యక్తిగతంగా దృఢమైన నిర్ణయం తీసుకోండి. అది ప్రాణానికి ప్రమాదం. అది చట్టరీత్యా నేరం కూడా. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడటం అన్నది మీ సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. ఈ సూచనలు పాటించడం అన్నది మీ ఆరోగ్యమూ ఇటు మెడికల్గానూ, అటు సామాజికంగానూ చాలాకాలం బాగుండేలా చేస్తుంది.