rajanna district
-
గాంధీభవన్, తెలంగాణ భవన్ వద్ద మంత్రి పొన్నం దీక్ష చేయాలి
కథలాపూర్ (వేములవాడ/వేములవాడ అర్బన్ ): వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గాంధీభవన్ వద్ద, కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టినందుకు మంత్రి పొన్నం తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులను కలిసి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. ఇకనై నా కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మా టలు మానుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పొన్నం దీక్ష ఎందుకోసమో చెప్పాలి పొన్నం దీక్ష చేసేది కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకా? లేక కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ. 12 వేల కోట్ల నిధులిచ్చినందుకా? లేదా కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినందుకా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు చెన్న మనేని వికాశ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
సిరిసిల్ల: తెలంగాణలో పొలాలు ఎండుతున్నాయి.. మోటార్లు కాలుతున్నాయి.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతోనే కరువు వచ్చిందని ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఉత్త మట్టికుండలే ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, లంకెబిందెల కోసం రాత్రిపూట గడ్డపార, తట్టలతో వెతికేవాళ్లను ఏం అంటారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దొంగచేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది కాలం లేక కరువు వచ్చిందంటున్నారని, కానీ గతేడాది 14 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేసి నీళ్లను ఎత్తిపోస్తే.. ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్నారు. అదే కేసీఆర్ ముఖ్య మంత్రి అయి ఉంటే.. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన రెండు పిల్లర్లకు రిపేరు చేయించేవారన్నారు. దేశంలోని 5వేల టిప్పర్లను, 4వేల ప్రొక్లెయిన్లను తెప్పించి, కాంట్రాక్టర్‌తో మాట్లాడి రెండు నెలల్లో రిపేరు చేయించి నీళ్లు ఎత్తిపోసేవాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రైతుల రుణమాఫీ ఏది ? డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగానే రైతుల రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు రుణమాఫీ చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు ఎందుకు వేయలేదని నిలదీశారు. పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎందుకు ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రైతులకు బోనస్ ఇచ్చే జీవోను తేవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు ఉద్యమ నాయకుడిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకుని నోటికి ఎంత వస్తే అంత మాట్లా డుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేగులు మెడలో వేసుకుంటా.. గొంతు కోస్తా.. లాగులో తొండలు వదులుతా అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి దారుణంగా మాట్లాడుతు న్నారని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల్లో చూసుకుందాం.. రైతులు చావకముందే కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేసి ఎండిపోతున్న పొలాలకు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారులు కూడా కాంగ్రెస్ తొత్తుల్లాగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముందే చెప్పారని మోసపోతే.. గోసపడతామని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కాంగ్రెస్‌ను నమ్మి గోసపడుతున్నారన్నారు. పోయిన చోటే వెతుక్కో వాలనే చందంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అహంకారంతో ఇష్టానుసారం వ్యాఖ్యలు
వేములవాడ: అధికారం కోల్పోయి కూడా కేటీఆర్ అహంకారంతో బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని పంచాయతీరాజ్, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను గురువారం దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్ల గడీల పాలన నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంకా ప్రమాణస్వీకారం చేయడం లేదని, అధికారం ఉంటేనే ప్రజల్లోకి వచ్చే ఆలోచనలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటిస్తే.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు పెట్టింది గత ప్రభుత్వం కాదా?.. అని సీతక్క ప్రశ్నించారు. ప్రజాసంక్షేమాన్ని గాలి కొదిలేసి తమకిష్టమైన పనులు చేసుకుంటూ రాష్ట్రా న్ని దివాళా తీయించారని మండిపడ్డారు. వేముల వాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి నెల 5వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. -
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ యాక్సిడెంట్... బెలూన్లు ఓపెన్ కావడంతో..
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ అతివేగంతో రావడంతో ఆరు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా, పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కార్లలో రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన రిసోర్టర్లను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. (చదవండి: డీఎల్‌పీవోపై కొనసాగుతున్న విచారణ) -
అక్కడ ఎనీ టైం మందు.. ఫుల్ కిక్కే కిక్కు..!
సాక్షి,ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుమూల గిరిజన తండాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఏ సమయంలోనైన(ఏనీటైం) మద్యం బాటిళ్లు దొరకడంతో మందుబాబులు తెల్లవారు జాము నుంచే మత్తులో తూగుతున్నారు. అర్ధరాత్రి గడిచిన గ్రామాల్లో బెల్డ్షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తండాలు, గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో 18 గ్రామాలుండగా, 25 బెల్టుషాపులు అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. హోటళ్లు, బార్లను తలపిస్తున్నాయి. చీప్‌లిక్కర్‌తో మొదలుకొని అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి అందుబాటులో మద్యం వీర్నపల్లి మండలంలోని తండాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లో ఎప్పుడైనా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం దుకాణాలను రాత్రి పదిన్నర గంటలకే మూసివేస్తుండగా, ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. డోర్ డెలీవరీ పద్ధతిలోనూ మద్యం విక్రయాలు సాగడం మరో విశేషం. ఒకప్పుడు నాటుసారా, గంజాయి మత్తులో తూగిన పల్లెలు.. ఇప్పుడు మద్యం కిక్కులో ఉంటున్నాయి. చర్యలు తీసుకుంటాం అక్రమంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. దొంగచాటుగా మద్యం విక్రయాలు, హోటళ్లలో సిట్టింగులు పెట్టిన చట్టరీత్యనేరం. దాడులు చేసి బెల్టుషాపులను గుర్తించి మూసివేస్తాం. – ఎంపీఆర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ,ఎల్లారెడ్డిపేట -
‘రాజన్న సిరిసిల్ల’లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. తంగెళ్లపల్లి మండలంలోని మండెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, వాటి పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇదే గ్రామంలో ‘టైడ్స్’ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్)ను, సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నారు. సిరిసిల్ల మండలం రాగుడు గ్రామంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. రోడ్డు మార్గాన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ రాకను పురస్కరించుకొని శనివారం ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏర్పాట్లను సమీక్షించారు. -
‘రాజన్నకే శఠగోపం పెట్టిన సీఎం కేసీఆర్’
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆరేళ్లక్రితం వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ గుడిమెట్ల సాక్షిగా యేటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పటికీ నెరవేర్చలేదని, రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. రాజన్న ఆలయ అభివృద్ధికి నిధుల కొరతతో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే 15నెలలుగా పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నాయకులు సాగారం వెంకటస్వామి, సగ్గు పద్మ, ముడిగె చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు. చదవండి: Etela Rajender: కేసీఆర్ పతనం కావడానికి హుజూరాబాద్ వేదిక కావాలి -
పదేళ్ల వయస్సులోనే ప్రతిభ.. నాట్యం, మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నచిన్నారి..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): చిరుప్రాయంలోనే పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ఈ చిన్నారి పేరు గద్దె శ్రేష్ట. వేములవాడకు చెందిన ఈ చిన్నారి ఓవైపు శాస్త్రీయ నృత్యం, మరోవైపు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలు అందుకుంటోంది. వీటికి తోడు హస్తకళాకృతులను తయారు చేస్తూ తన సృజనాత్మకతను చాటుకుంటోంది. 2010 మే 17న జన్మించిన శ్రేష్ట ఉన్నత చదువుల కోసం ప్రస్తుతం కరీంనగర్లో తన తల్లిదండ్రులు స్వప్న–శ్రీవర్ధన్ వద్ద ఉంటోంది. నాలుగేళ్ల వయస్సులోనే టీవీలో వచ్చే వివిధ డ్యాన్స్ షోలను చూస్తూ అలవోకగా స్టెప్పులు వేయడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమె అభిరుచికి అనుగుణంగా కరీంనగర్‌లోనే చొప్పరి జయశ్రీ వద్ద డ్యాన్స్ నేర్పించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్’లో శిక్షణ ఇప్పించారు. ఇప్పటికే 20 వరకు నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ఆరెంజ్ బెల్ట్ సాధించి, పలు రాష్ట్రీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. లాక్డౌన్లో సమయాన్ని వృథా చేసుకోకుండా వ్యర్థ పదార్థాలతో అర్థవంతమైన ఆకృతులను తయారు చేస్తూ తనలోని సృజనాత్మకతను చాటుకుంటున్న శ్రేష్ట మరింత రాణించాలని కోరుకుందాం. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నేత మృతి
సాక్షి, ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్‌రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్‌రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విక్రమ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వివరించారు. ఆయనకు తల్లిదండ్రులు మంజుల– సత్యంరెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆరుట్ల విక్రమ్‌రెడ్డి విశేష కృషి చేశారు. యూత్ విభాగాన్ని బలోపేతం చేయడంలో అహర్నిశలు శ్రమించారు. విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందినట్లు తెలియడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చినా విక్రమ్‌రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదినుంచీ ఆయన వైఎస్సార్సీపీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ కార్యక్రమాలు చేపట్టినా విజయవంతంగా పూర్తి చేసేవారు. విక్రమ్‌రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం ప్రకటించింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలియడంతో హైదరాబాద్‌కి వెళ్లి ఆమెకు మద్దతు ప్రకటించారు. కొత్త పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని చెప్పి వచ్చారు. అనూహ్యంగా విక్రమ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం కలచివేసింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కన్నీటి పర్యంతమయ్యారు. విక్రమ్‌రెడ్డి స్వగ్రామం పదిరలో తీవ్ర విషాదం నెలకొంది. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, సింగిల్‌విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నర్సయ్య, తిరుపతిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. స్వగ్రామంలో విక్రమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి అన్నారు. చదవండి: తల్లీకొడుకులపై పిడుగు -
మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని పదిర, రాచర్ల, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వివాహిత మహిళలను మానసికంగా వేధిస్తున్న ముగ్గురిపై ఆదివారం రాత్రి వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన సొంత అక్క భర్త వేధిస్తున్నాడని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చీకటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే చనిపోతానంటూ ఆరేళ్లుగా వేధిస్తున్నాడని, పుట్టింట్లో ఉండగా చేయి పట్టుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముద్రకోళ్ల వంశీ అనే వ్యక్తి సహాయంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన పూసల శేఖర్ మూడేళ్లుగా ఫోన్ చేస్తూ వేధిస్తున్నట్లు ఒక వివాహిత ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో నెగెటివ్..
సాక్షి, వేములవాడ(సిరిసిల్ల): పట్టణంలోని మల్లారం రోడ్డులో ఉన్న మాతృశ్రీ అనే ఆసుపత్రిలో కరోనాపై తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. చిట్టి మంగమ్మ అనే పేషెంట్ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రికి చేరుకోవడంతో కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిందని అడ్మిట్ చేసుకున్నారు. ఇందుకు రూ.లక్షన్నర కావాలని చెప్పడంతో తన వద్ద డబ్బులు లేవని పేర్కొంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరోసారి కరోనా టెస్టు చేయించగా ఆమెకు నెగెటివ్ రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెగటివ్ రిపోర్టు ఆధారంగా ఆమె ఫిర్యాదు మేరకు మాతృశ్రీ ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
దారుణం: అద్దె మనుషులతో అంత్యక్రియలు, సెల్ఫోన్లో వీక్షణ
సాక్షి, వేములవాడ( రాజన్న సిరిసిల్ల): కంటికి కనబడని కరోనా రక్కసి విళయతాండవం చేస్తోంది. సామాన్యుడు మొదలు కొని నాయకుల వరకు ఎవరినీ వదలిపెట్టని ఈ రోగం, మానవాళికే సవాలు విసురుతోంది. ఆసుపత్రిలో కరోనాతో మృత్యువాత పడిన తమ వారిని చూసేందుకు కుటుంబసభ్యులు, రక్త సంబధీకులు వెనుకాడే పరిస్థితి. మృతదేహాన్ని ముట్టుకోవడానికి వీలులేకపోవడంతో కాష్టం పేర్చి, దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. మున్సిపల్ సిబ్బందే శ్మశానవాటికలకు తరలించి దహనసంస్కారాలు చేస్తుంటే కళ్లవెంట కన్నీరు కార్చడం తప్ప, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. అద్దె మనుషులతో అంతిమ సంస్కారం కరోనాతో మృతిచెందిన తమ కుటుంబసభ్యుల అంతిమ సంస్కారాలను అద్దె మనుషులతో పూర్తిచేయించాల్సి వస్తోంది. దహన సంస్కారాలను సెల్ఫోన్లో వీడియో తీసి, బంధువులకు పంపించి బోరున విలపిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ మృతి చెందిన వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇంటి యజమాని శవాన్ని ఇంటివరకు కూడా అనుమతించకపోవడంతో అనాథ శవంలాగే అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆస్తులు, అంతస్తులు, కుటుంబసభ్యులు ఎంతమంది ఉన్నా కరోనాతో మృతిచెందితే అనాథగా మరుభూమికి తరలుతున్నారు. అందరం ఉన్నా అనాథ శవంగానే వెళ్లిపోయావా అంటూ రోదనలే తప్ప, ఏమీ చేయలేని స్థితి. ఇలాంటి ఘటనలు మనుషుల్లో మానవత్వం మంటగలిసిందా అనే అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి. దూరమవుతున్న బంధుత్వాలు కరోనా కేసులు పెరగడంతో బంధుత్వాలు దూరమవుతున్నాయి. కనబడని కరోనా రోగం కుటుంబాలను కకావికళం చేస్తోంది. సెల్ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఒకరిఒకరు ఓదార్చుకుంటున్నారు. ఇండియాలో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఉపాధికోసం గల్ఫ్ వెళ్లిన కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని వైద్యులు కోరుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా పై విజయం సాధించడానికి ప్రభుత్వానికి సహకరిద్దాం. చదవండి: సూపర్ స్ప్రెడర్స్ లా పాజిటివ్ వ్యక్తులు.. -
Vemulawada: కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. భోళా శంకరునికే బురిడీ..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆలయ ఉద్యోగులే భోళాశంకరున్ని బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతీనెలా వేతనాలు పొందుతూనే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రసాదాల విక్రయ కేంద్రంలో రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ఖాళీ డబ్బాల ఆధారంగా రికార్డులు తారుమారు చేశారు. సుమారు 2.25లక్షల లడ్డూలు విక్రయించి రూ.45లక్షలు సొంతానికి వినియోగించారు. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. బాధ్యుడిపై బదిలీ వేటు వేశారు. మార్చి 13 నుంచి లడ్డూల విక్రయాలు.. మహాశివరాత్రి సందర్భంగా లడ్డూప్రసాదాల క్రయ, విక్రయాల బాధ్యతను తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు అప్పగించారు. మార్చి 12 వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయించి, మిగిలిన లడ్డూల నిల్వలను ఆలయ అధికారులకు అప్పగించారు. మార్చి 13 నుంచి రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ప్రణాళిక ప్రకారం లడ్డూలు విక్రయించిన రికార్డుల్లో చూపిస్తూ వచ్చారు. స్టాక్ దాచిపెట్టారు. ఆ తర్వాత 2.25 లక్షల లడ్డూలు విక్రయించారు. లడ్డూలను భద్రపర్చే ఖాళీ డబ్బాలను ఆధారంగా చేసుకుని రూ.45లక్షలు కాజేశారు. కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. కక్కించిన అధికారులు రాజన్న దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేయడం భక్తుల ఆనవాయితీ. ఈక్రమంలో ఒక్కో లడ్డూ రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే, కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈనెల18 – 22వ తేదీ వరకు ఆలయం మూసివేశారు. ఈ క్రమంలో ప్రసాదాల తయారీ విభాగం సూపరింటెండెంట్ తిరుపతిరావు ప్రసాదాల క్రయ, విక్రయాల తీరు, రికార్డులు తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా డబ్బాలు పరిశీలించగా ఖాళీగా కనిపించాయి. లడ్డూలు ఏమయ్యాయని వెంకటేశ్‌ను ప్రశ్నించి విచారణ చేపట్టారు. దీంతో 2.25 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన సొమ్మును సొంతానికి వినియోగించినట్లు తెలిసిపోయింది. దీంతో బాధ్యుడి నుంచి రూ.45లక్షలు స్వాధీనం చేసుకుని రాజన్న ఖాతాకు జమ చేయించారు. -
కరోనా సునామి.. పల్లెల్లో తగ్గుముఖం.. పట్టణాల్లో ఉత్పాతం..
సాక్షి, వేములవాడరూరల్: పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. కానీ ప్రస్తుతం పల్లెల్లో కరోనా కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. వేములవాడ మండలంలోని చాలా గ్రామాల్లో కరోనా కేసులు ఈ మధ్యకాలంలో పెరిగాయి. దీంతో గ్రామాల వారీగా ప్రత్యేకంగా కట్టడి చేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కొంతవరకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మండలంలోని ఫాజుల్‌నగర్, నూకలమర్రి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో కరోనా వాక్సిన్ను వైద్యాధికారులు ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రజలకు వేశారు. దీంతో పాటు మండలంలో అత్యధికంగా మల్లారం, జయవరం గ్రామాల్లో కేసులు పెరగడంతో ఆ రెండు గ్రామాల్లో సెల్ఫ్‌లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలలో వారు తీసుకున్న కరోనా నివారణ చర్యల్లో ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. కరోనా విలయ తాండవం వేములవాడ: వేములవాడలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందనడానికి వేములవాడలో నిత్యం వినిపించే మరణాలే నిదర్శనం. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయి కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండటం వేములవాడ ప్రాంతంలో జనం బేంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల్లో ఇరవైకిపైగా కరోనా కాటుకు బలైన ఘటనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తేరుకునేలోగానే.. కాస్త జ్వరం, జలుబు, దగ్గు అనిపించి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ కరోనా టెస్టులు చేయించుకుని హోమ్ క్వారంటైన్ ఉన్న నాగరాజు, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన కొబ్బరికాయల రాజు, అర్చకులు దామెదర్‌లు కేవలం పాజిటివ్ వచ్చిన వారం రోజులకే మృత్యువాతపడ్డారు. ఏం జరుగుతుందోనని తెలుసుకునేలోగానే వీరంతా తుది శ్వాస విడిచారు. గుడికి పెరుగుతున్న రద్దీ.. విచ్చలవిడిగా తిరుగుతున్న జనం వేములవాడ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రాజన్న గుడికి భక్తులు, స్థానికులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతుండటం స్థానికంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. రాత్రి 9 గంటల నుంచి చేపట్టే కర్ఫ్యూ సైతం అంతంత మాత్రంగానే కొనసాగుతుండటంతో మరింత భయం పెరిగింది. నాలుగు రోజుల్లోనే మాయమయ్యాడు నిత్యం కళ్లముందే బుల్లెట్ తిరుగుతుండే నాగరాజు వారం రోజుల క్రితం పాజిటివ్ వ చ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన వేములవాడకు అక్కడ్నుంచి కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని నాగరాజు బంధువులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో తుదిశ్వాస అందరినీ ఆప్యాయంగా మందలిస్తూ రాజన్న గుడి ముందు కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముకునే రాజు కరోనా కాటుకు బలయ్యాడు. కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని సహచర వ్యాపారులు చెబుతున్నారు. ఏం జరిగిందోనని తెలుసుకునేలోగానే.. నాంపల్లి గుట్టకు వెళ్లిన భక్తులను నవ్వుతూ పలుకరించడమే కాకుండా ఆశీర్వాదాలు ఇచ్చి పంపించే అర్చకుడు దామోదర్ వారం రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. వారి సమీప బంధువు వైద్యశాఖలో పని చేస్తున్నారు. మందులు తీసుకొచ్చే వాడుకోమని చెప్పారు. నాలుగు రోజుల క్రితం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని అనడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగానే ఆక్సీజన్ లెవెల్స్ 80 వరకే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈనెల 26న ఉదయం మరణించాడని ఆలయ అధికారి ఒకరు వివరించారు. -
మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..
సిరిసిల్లక్రైం: కోడి గుడ్లకోసం ఇంటిపక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లిన యువకుడిపై మాస్క్ ధరించలేదని కోనరావుపేట ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వంగళ భాస్కర్ వాపోయాడు. ఎస్సై తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి గురువారం సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి రాగా అత్యవసర ఫిర్యాదులు మాత్రమే పరిశీలిస్తున్నట్లు సిబ్బంది తెలపడంతో మీడియాకు గోడు వెల్లబోసుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన రాత్రి 9.30 ఇంటి సమీపంలోని కిరాణంలో కోడిగుడ్ల కోసం వెళ్లగా అటుగా పెట్రోలింగ్‌కు వచ్చిన ఎస్సై మాస్క్ ధరించలేదని కేసు నమోదు చేస్తానని బెదిరించి సెల్‌ఫోన్ తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరుసటిరోజు ఠాణాకు వెళితే కోపోద్రిక్తుడైన ఎస్సై తిడుతూ..్ఙనేను నీ గురించి ఎంక్వైరీ చేశా. నీవు నీ భార్యను కొడతవటా..వెళ్లి నీ భార్యను తీసుకుని రాపో..నేను కౌన్సెలింగ్ చేశాక.. నీ ఫోన్ ఇస్తానని అన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. మా భార్యాభర్తల విషయం మీకు అవసరం లేదని చెప్పినా వినకుండా నీ భార్యను తీసుకువస్తేనే ఫోన్ ఇస్తానని అన్నట్లు బాధితుడు వివరించాడు. రెండు గంటలపాటు ఠాణా ఆవరణలో నిలుచోబెట్టారని, ఇక మీద ఠాణా చుట్టూ నిన్ను తిప్పించుకుంటానని ఫోన్ ఇచ్చే సమయంలో అన్నట్లు తెలిపాడు. చిన్న తప్పిదానికి భయభ్రాంతులకు గురి చేసిన ఎస్సై నుంచి రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరేందుకు వచ్చినట్లు బాధితుడు తెలిపారు. -
దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి: పొన్నం
సాక్షి, రాజన్న సిరిసిల్లా: మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరిలిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరు ప్రాజెక్టుకు ఎందుకు నీటిన తరలించడం లేదన్నారు. ఇది మీ అసమర్థతనా లేక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారా అని మండిపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పే మీరు, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 6 ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే ఎవరిది బాధ్యత అని ధ్వజమెత్తారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కాకుండా, అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన కార్యాచరణ రూపొందిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పుర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇక పట్టణ ప్రగతి ప్రణాళిక
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో గురువారం రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళికను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అంతకుముందు మోహినికుంటలో మంత్రులు పర్యటించి ‘పల్లె ప్రగతి’ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని 12,751 గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, అదే స్ఫూర్తితో రెండో విడతను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల తర్వాత నూతన మున్సిపల్ పాలక వర్గాలకు శిక్షణ ఇచ్చి, పకడ్బందీగా పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మోహినికుంట తమ తాత సొంత ఊరు అని, స్థలం ఇస్తే ఇక్కడ తాత, నాయనమ్మల పేరిట సొంత ఖర్చులతో ఫంక్షన్ హాలు నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. మోహినికుంట వెళ్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెబితే.. ఆ ఊరి కోసం ఏదైనా మంచి పని చేయాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి వర్ధన్నపేట: ‘మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన అన్ని విధాల సమర్థుడు. కేటీఆర్ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. -
టిమ్ మరిచిన కండక్టర్..
తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి నేటికి 22రోజులు. రోజుకో రీతిన ఆందోళనలతో రోడ్డెక్కుతున్న డ్రైవర్లు.. కండక్టర్లు.. ఇతర సిబ్బంది జీవితం దుర్భరంగా మారింది. సెప్టెంబర్ మాసం జీతం అందక దసరా పండక్కు దూరమైన కార్మికుల జీవితాల్లో.. వెలుగులు నింపే దీపావళి సైతం చీకటినే మిగిలిస్తుందా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రోజులు గడుస్తున్నా.. ప్రాణత్యాగాలు జరుగుతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. దీంతో సగటు కార్మికుడి బతుకు‘చక్రం’ ఆగిపోయింది. సమ్మెను తిప్పికొట్టేందుకు సర్కారు ‘ప్రత్యామ్నాయ’ వ్యూహం లాభం చేకూర్చడం లేదనే చెప్పుకోవచ్చు. ‘తాత్కాలిక’ ప్రయాణంలో ప్రజలకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వరుస ప్రమాదాలతో బస్సుల్లో ప్రయాణం భద్రతనే ప్రశ్నిస్తోంది. కరీంనగర్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో కార్మికుల ఆవేదనలు.. ప్రయాణికుల ఇబ్బందులు.. సంస్థ పరిస్థితులపై ‘సాక్షి’ ఫోకస్... రీజియన్‌లో రూ.12.6 కోట్ల నష్టం. కరీంనగర్ : ఆర్టీసీ సమ్మె ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తోంది.సమ్మె చేస్తున్న కార్మికులతో పాటు ఆర్టీసీ ప్రయాణాన్నే నమ్ముకున్న ప్రజలకు తిప్పలుతప్పడం లేదు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు పట్టు విడవకపోవడం... ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎటువైపు దారితీస్తుందో తెలియని సందిగ్ధం నెలకొంది. ఇక తాడోపేడో... ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. సమ్మె విరమణకు పరిష్కార మార్గం దొరుకుతుందనుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలతో సమ్మె ముగింపునకు అవకాశాలు లేకుండా పోయాయి. కార్మికులు సెప్టెంబర్, అక్టోబర్ నెల జీతాలను కూడా నోచుకోలేదు.ఆర్టీసీ ఉండే అవకాశం లేదని సీఎం స్పష్టం చేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. భరోసా లేని ప్రయాణం... ప్రస్తుతం ఆర్టీసీలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బస్సులు తిరుగుతున్నా సమయపాలన లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాము పనిచేసే చోటికి సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల యజమానులు సందిట్లో సడేమియాలాగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. బస్సులు ఫుల్... కలెక్షన్ నిల్... ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కరీంనగర్ రీజియన్‌లో భారీ నష్టం వాటిల్లింది. గతంలో ప్రతి రోజు రూ.1.10 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుతం రూ.50 లక్షల పైచిలుకు మాత్రమే ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 90 శాతం బస్సులు నడిస్తే ఇంత అధ్వానంగా కలెక్షన్ ఎలా వస్తుందనేది జవాబు లేని ప్రశ్నగా మారింది. ప్రతి రోజు 60 లక్షల పైగా నష్టం వాటిల్లుతుండడంతో రీజియన్‌లో 9డిపోల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. చదవండి : సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ అదే పని నిలువు దోపిడీ.. సిరిసిల్లటౌన్: సమ్మెకు ముందు సిరిసిల్ల డిపో పరిధిలో 65 బస్సులు ప్రతిరోజు సుమారు 300 ట్రిప్పుల్లో 25వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేవి. సిబ్బంది లేక డిపోలో డీఎం ఒక్కరే పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖ తదితర శాఖల అధికారుల సహకారంతో బస్సులను నడిపిస్తున్నారు. 65 బస్సుల్లో ప్రతిరోజు 90శాతం నడిపిస్తున్నారే కానీ ట్రిప్పులు తగ్గాల్సి వచ్చింది. అందినకాడికి దోపిడీ..? జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్న సిబ్బందికి ఆర్ఎం నుంచి వచ్చిన చార్ట్ ద్వారా టిక్కెట్ ధరలు వసూళ్లు చేయాల్సి ఉంది.అయితే ఇప్పటికీ అద్దె, ప్రైవేటు బస్సుల్లో ఇష్టానుసారంగా వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తో్తంది.కొన్ని రూట్లలో అధికారులు టిమ్ మిషన్లద్వారా టిక్కెట్లు ఇప్పిస్తుండగా..తాత్కాలిక సిబ్బంది చిల్లరలేమి పేరుతో ఎక్కువ తీసుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. కరీంనగర్ నుంచి కామారెడ్డికి ఆర్డీనరీ చార్జీలు రూ.60కి బదులు రూ.100 వసూలు చేస్తున్నారు. ఆదాయం పెంచిన టిమ్ మిషన్లు? వారం రోజుల నుంచి ఎక్కువ రూట్లలో టిమ్మిషన్లను వినియోగించడంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో ఆదాయం పెరుగుతూవస్తోంది. సిరిసిల్ల డిపోలో 70శాతం మేరకు టిమ్ మిషన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.టిమ్ మిషన్ల నిర్వహణలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలు అధికారులకు తలనొప్పిగా మారాయి. పాసులు చెల్లుతలేవు సిరిసిల్ల బస్సుల్లోనే పాసులు చెల్లుతున్నాయి. కామారెడ్డి బస్సులో ఎక్కితే చార్జీలు తీసుకుంటుండ్రు. ఇదేం పద్ధతి. క్యాట్కార్డులది కూడా అదే పరిస్థితి. ఏ డిపో పరిధిలో తీసుకున్న వాటినే చెల్లుబాటు అవుతున్నాయి. ఇక కళాశాలల సమయానికి బస్సుల్లేక మాకు ప్రయాణానికే రోజుకు నాలుగు గంటల సమయం పడుతుంది. చదువుకునేదెప్పుడు. – అంకనగరి జాషువా, నర్మాల, పాలిటెక్నిక్ విద్యార్థి, అగ్రహారం సమయానికి బస్సులు నడపాలి పాసులు చెల్లుబాటు అవతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు సిరిసిల్ల బస్టాండుకు వచ్చినం. నాలుగన్నర వరకు బస్సులు లేవు. బస్సులు చెల్లుబాటు అవుతున్నాయి. ఆటోల్లో పోదామంటే భయం. పైగా డబ్బులు ఎక్కువ తీసుకుంటుండ్రు. సమ్మె ఎప్పుడు అయిపోతుందాని చూస్తున్నాం. విద్యాసంస్థల సమయానికి బస్సులు నడపాలి. – గంగు శృతి విద్యార్థి, చీర్లవంచ మా బతుకులు రోడ్డున పడ్డాయి జగిత్యాల: మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. జీతాలు లేకపోవడంతో పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. ఇటీవలే ఇల్లు కట్టుకున్న కొందరు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం రూ.50 వేల జీతం ఇస్తున్నామని చెబుతున్నారు. మా పే స్లిప్‌లు చూపెడుతున్నాం. రూ.50 వేల జీతం ఇస్తే సమ్మె విరమిస్తాం. ఒక్కో రోజు తినకుండానే నిద్రపోతున్నాం. ఇన్ని సార్లు డీజిల్ ధరలు పెరిగినా.. ప్రభుత్వం ఓట్ల కోసం టికెట్ల రేట్లు పెంచడం లేదు. ప్రజలంతా మాకు మద్దతివ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – ఉమారాణి, ఆర్టీసీ కార్మికురాలు టిమ్ మరిచిన కండక్టర్ మంథని: పక్క చిత్రం చూశారా..! మంథని బస్టాండ్‌లో గోదావరిఖనికి బోర్డుతో ప్లాట్‌ఫాంపై బస్సు ఆగింది. అప్పటికే బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు వెళ్లి బస్సులో కూర్చున్నారు. 30 మందితో బస్సు పట్టణశివారు దాటింది. తాత్కాలిక కండక్టర్ టిమ్ మిషన్ పట్టుకొని ఓ ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి సార్ ఎక్కడికి అన్నాడు. గోదావరిఖని ఒక టికెట్ అనగానే.. కండక్టర్ మిషన్‌లో గోదావరిఖని ఎంటర్ చేసే ప్రయత్నం చేశాడు. టికెట్ బయటకు రాలేదు. ఎందుకంటే తాత్కాలిక కండక్టర్ దగ్గర ఉన్నది భూపాలపల్లి రూట్ టిమ్. ఆగమైన కండక్టర్ వెంటనే డ్రైవర్‌కు చెప్పి బస్సును బస్టాండ్ తీసుకెళ్లాడు. బస్సులోని ప్రయాణికులు దిగి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టిమ్మార్చుకుని బయల్దేరాడు. ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదు గోదావరిఖనిటౌన్: ఇన్నాళ్లుగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్లిన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం సరికాదు. అందరం మానవులమే. వారికి అవసరాలు ఉంటాయని చూడని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందా, మరి ఎవరి కోసం పని చేస్తుందనేది తెలియలేని స్థితి నెలకొంది. – రాజయ్య, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ రూ.20వేల అప్పు.. ఇతను వేల్పుల ప్రభాకర్. 25 ఏళ్లుగా హుజూరాబాద్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అన్ని కటింగ్‌లు పోనూ నెలజీతం రూ. 16వేలు చేతికి వస్తుంది. హార్ట్ సర్జరీ కావడంతో నెలకు రూ.3వేలు మందులకే ఖర్చు అవుతోంది. 21రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వం సెప్టెంబర్ జీతాలు నిలిపివేసింది. ఇల్లుగడిచేందుకు ప్రభాకర్ వడ్డీకి రూ.20వేల అప్పు తీసుకొచ్చాడు. కుటుంబపోషణ కష్టంగా ఉందని.. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ప్రభాకర్ కోరుతున్నాడు. విధులకు ఆలస్యం.. ఇతను కుక్కడపు శ్రీనివాస్. మంథని స్వస్థలం. గోదావరిఖని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం 9.30కి కళాశాలలో బయోమెట్రిక్ వేలిముద్ర వేయాలి.కాలేజీకి వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 7.45కి మంథని బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సురావడంతో ఎక్కాడు. బస్టాండ్ నుంచి ఓ సారి డిపో వరకు తీసుకెళ్లిన డ్రైవర్.. గోదావరిఖని బయల్దేరి.. కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చాడు. దీంతో మంథనిలోనే తొమ్మిది కావొచ్చింది. అరగంటలో ఎలా వెళ్లేదని శ్రీనివాస్ మదనపడగా.. ప్రత్యామ్నాయం లేక అదే బస్సులో ఆలస్యమైనా కళాశాలకు వెళ్లాడు.. రోజుకు ఒక్కపూటే తింటున్నం కోరుట్ల: నా పేరు విజయ.మల్యాల మండల రామన్నపేట. కోరుట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.నెలకు రూ. 16వేలు జీతం వస్తుంది. నా భర్త రాజేశ్వర్ కూలీపని చేసేవాడు. వెన్నపూస ఆపరేషన్ కావడంతో ఇంట్లోనే రెస్టు తీసుకుంటుండు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు 5వ తరగతి, ఇంకొకరు 3వ తరగతి చదువుతున్నారు. నా భర్త తరఫున సంపాదన లేక.. నాకు రెండు నెలలుగా జీతం రాక మస్తు పరేషాన్ ఉంది. ఇన్ని రోజులు మిగుల్చుకున్న డబ్బులు బతుకమ్మ..దసరా పండుగకు అయిపోయినయ్..ఇప్పుడు మా ఇల్లంతా.. రోజుకు ఒక్క పూటే తిని కాలం గడుపుతున్నం. ఇంట్లో సామానులు లేవు. కిరాణంలో ఉద్దెర పెట్టి తెచ్చుకుంటున్నం. ఈ నెలాఖరులో ఇప్పటి వరకు కిరాణ సామానుకు అయిన డబ్బులు చెల్లించకుంటే వచ్చే నెలలో ఉద్దెర ఇవ్వనని కిరాణ షాపు ఓనరు చెపుతుండు. మా ఆయనకు అవసరమైన మందులు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. -
టీఆర్ఎస్ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు
సాక్షి, వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. యాదాద్రి తరహాలో వేములవాడలోనూ రాజన్న విగ్రహాన్ని తొలగించి కేసీఆర్ విగ్రహాన్ని పెట్టే ప్రమాదముందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి,అక్రమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తామన్నారు. సారు..కారు.. కేసీఆరు.. ఎమ్మెల్యే జర్మనీ పరారు.. అంటూ చలోక్తులు విసిరారు. వేములవాడ నియోజకవర్గం నుంచి రెండువేల మంది బీజేపీలో చేరగా ఎంపీ బండిసంజయ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడలో బీజేపీ జెండా ఎగురవేయకుంటే యాదాద్రి తరహాలో ఇక్కడా రాజన్న విగ్రహాన్ని తొలగించి కేసీఆర్ విగ్రహాన్ని పెట్టుకునే ప్రమాదముందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో గురువారం జరిగిన బీజేపీ సమావేశానికి హాజరయ్యారు.ఎంపీ మాట్లాడుతూ.. యాదా ద్రిలో దేవుళ్లు ఉండాల్సినస్థానాల్లో కేసీఆర్ బొమ్మలను పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలు మేల్కొనకుంటే వేములవాడలోనూ ఇదే ప్రమాదం జరగనుందన్నారు. రమేశ్‌బాబును నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమాత్రం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.తన నిధులతో రాజన్నగుడిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.సారు..కారు.. కేసీఆరు.. ఎమ్మెల్యే జర్మనీ పరారు.. అంటూ చలోక్తులు విసిరారు. అక్రమాలు వెలికితీస్తా... టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి,అక్రమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తామన్నారు.కరీంనగర్ నియోజకవర్గంలో ఏడుగురు మంత్రులను నియమించుకున్నా... టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడేది లేదన్నారు. బీజేపీలో 2వేల మంది చేరిక వేములవాడ నియోజకవర్గంలోని ఏడుమండలాల నుంచి తరలివచ్చిన 2వేల మంది ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరందరికీ ఎంపీ బండి సంజయ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్‌కి రైకనపాట క్రాంతికుమార్ ఆధ్వర్యంలో 200మంది యువకులు బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు.మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గోపు బాలరాజు, జిల్లా దళితమోర్చా అధ్యక్షుడు కుమ్మరి శంకర్, కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా ఇన్చార్జి రాంనాథ్, ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు. గల్లీలో ఉన్నోడిని ఢిల్లీకి పంపించారు.. వేములవాడరూరల్: గల్లీలో ఉన్నోడిని ఢిల్లీకి పం పిన ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. వేములవాడ మండలంలోని చెక్కపల్లిలో బీజేపీ పార్టీజెండా ఆవిష్కరించారు. విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి తన ఇంట్లో ఉన్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్‌ను సస్పెండ్ చేయించాడన్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అధికా రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని పేర్కొన్నారు. -
గేదె కడుపున పందిపిల్ల..?
సాక్షి, సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాలలో గేదె(బర్రె) కడుపులో పంది ఆకారంలో జంతువు జన్మించింది. దీంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు ఆదివారం పశువుల అంగడిలో బాలమల్లు అనే రైతు వద్ద గేదెను కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజే పంది ఆకారంలో ఉన్న దూడకు గేదె జన్మనిచ్చింది. వింత ఆకారంలో ఉన్న దూడను చూసేందుకు జనం తరలివచ్చారు. నెలలు నిండకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకున్నారు. -
కోడెగడుతా రాజన్నా; బ్లాక్ దందాతో ఎలాగన్నా?
సాక్షి, వేములవాడ : కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్నను మొక్కుకుని కొడుకు పుడితే కోడెగడుతా రాజన్నా అంటూ నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తరలివస్తుంటారు. రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుండి, ఆదాయంలోనూ మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో శ్రీస్వామి వారికి వచ్చే ఆదాయంలో సింహ భాగం కోడె మొక్కుల ద్వారానే సంక్రమిస్తుంది. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధిక శాతం భక్తులు కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరమే ఇతర మొక్కులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కోడె మొక్కు అనేది ఇతర దేవాలయాల్లో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న గుడిలో కొనసాగుతుంది. దీంతో రాజన్న గుడిలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేందుకు లేబర్లు, కాంట్రాక్టు లేబర్లు, బినామీలు, పైరవీకారులు ముందుంటున్నారన్న అంశం ఆలయ ఉద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. రద్దీ సమయంలో దందా షురూ.. పంటలు బాగా పండాలని రైతులు, కుటుంబాలు బాగుండాలని భక్తులు, తమ సమస్యలు తీరాలని మరికొందరు కుల, మతాలకు అతీతంగా ఎములాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకుంటుంటారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న సదరు బ్లాక్ టికెట్ దందా చేస్తున్న వ్యక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ఎక్కువ డబ్బులు చెల్లించి కోడె టికెట్లు కొనుక్కునేందుకు సరే అంటుంటారు. దీంతో వీరికి ఆదాయ వనరులు తెచ్చిపెడుతుంది. కౌంటర్లలో విధులు నిర్వహించే వారితో కుమ్మక్కై కోడె మొక్కుల టికెట్లు ముందస్తుగానే కొనుగోలు చేసి దగ్గర పెట్టుకుని భక్తులకు ఎక్కువ ధరలకు అందిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీనికితోడుగా కొంత మంది చెక్పోస్టులపై పని చేస్తున్న సిబ్బంది కోడెల టికెట్లను వేకువజామునుంచే పోగు చేసుకుని ఇలాంటి వ్యక్తుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వీరి దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందన్న వాదన వినవస్తోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన నర్సాగౌడ్ అనే భక్తుడికి నర్సయ్య అనే లేబర్ బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ ఎస్పీపీఎఫ్ సిబ్బందికి చిక్కడంతో ఇక్కడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో అధికారులు, సిబ్బంది పాత్ర ఉండొచ్చన్న భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న బినామీలు వేములవాడ రాజన్న ఆలయంలో బినామీల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొంత మంది కొన్ని రకాల పేర్లతో (పార్టీల పేర్లు, శాఖల పేర్లు, వీఐపీల పేర్లు) ఆలయ అధికారులు, సిబ్బందికి బురిడీ కొట్టించి తమ పబ్బం గడుపుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. భక్తులను తమ బంధువులుగా, అధికారుల బంధువులుగా చెప్పుకుంటూ అధిక ధరలకు టికెట్లు, దర్శనాలు అందిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు ఆధికారుల విచారణలో తేలింది. గతంలో పలువురు ఉద్యోగులు సైతం ఈ వ్యవహారంలో భాగస్వాములైతే ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వారిపై చర్యలు తీసుకున్నారు. నిఘా తీవ్రతరం చేస్తే మరిన్ని ఇలాంటి బాగోతాలు బయట పడతాయని భక్తులు పేర్కొంటున్నారు. -
ఆకట్టుకుంటున్న సర్కారు బడులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెచ్చులూడి ఎప్పుడు కూలుతాయో తెలియని తరగతి గదులు.. రంగు తగ్గిన భవనాలు.. ఆ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి ముందుకురాని తల్లిదండ్రులు. వెరసి ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు దగ్గరవుతున్న క్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల భాగస్వామ్యంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో సర్కారు బడులు కళారూపాలుగా మారుతున్నాయి. నిన్న రైలు బండిలాగా వీర్నపల్లి పాఠశాల, నేడు గోల్కొండ కోటలోని గడిగా వెంకటాపూర్ బడిని కళాత్మకంగా తీర్చిదిద్దారు. సర్కారు బడిలో నూతన ఒరవడి.. గతంలో నిధులు, ఉపాధ్యాయులు లేక కార్పొరేట్ పాఠశాలల పోటీని తట్టుకోలేక విలవిలలాడిన సర్కారు బడులు ప్రభుత్వ దిశానిర్దేశంతో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. పట్టణాల్లోని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభత్వ పాఠశాలలను ఆహ్లాదంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఓ వైపు హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచితే.. మరోవైపు రంగురంగుల బొమ్మలు కొత్త సోబగులు అద్దుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గది గోడలను రంగురంగుల బొమ్మలతో చిత్రించారు. చిన్నపిల్లలను ఆకర్షించేలా, సమాజానికి మెసేజ్‌ను ఇచ్చేలా కళాకారుడు చందు తన కళాత్మక (చుక్, చుక్ బడి) కుంచెతో గోడలపై వేసిన చిత్రాలు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. వీర్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను రైలు బండిలా తయారు చేసిన చందు వెంకటాపూర్‌లో గడికోటను తలపించే విధంగా సర్కారు బడిని తీర్చిదిద్దారు. కళాకారుడి ప్రతిభ నర్మాలకు చెందిన కళాకారుడు చందు గంభీరావుపేట ఎంపీడీవో సురేందర్‌రెడ్డి సూచన మేరకు ప్రాథమిక పాఠశాలలకు ఆకర్షించే రంగులు వేస్తున్నాడు. బడులను బతికించడంలో తనవంతు బాధ్యతను గుర్తించిన చందు వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలకు వేసిన రైలుబండి చిత్రంకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో మరిన్ని పాఠశాలల్లో పిల్లలను ఆకర్షించేలా విభిన్న ఆలోచనలతో రంగులు వేయాలని తలిచి వెంకటాపూర్ పాఠశాలకు గోల్కొండ కోటను తలపించేలా రంగులద్దాడు. వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలను రైలుగా మార్చిన చందు తన కుంచెతో మరో అద్భుతా నికి నాంది పలికారు. పక్కఫొ టో వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలది. విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నది పాత గడిలోకి కాదు. రంగులతో మంత్రముగ్దుల్ని చేసిన కొత్త సర్కారు బడిలోకి. పాఠశాలను చూసి విద్యార్థులు తమ కళ్లముందుకే గోల్కొండ కోట వచ్చిందని సంబుర పడుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగింది చందు రంగులతో బడిలి కోటలాగా మార్చాడు. చాలా మంది చూడటానికి వస్తున్నారు. గుహలాగా ఉన్న రంగురంగు గోడలు పిల్లలను బాగా> ఆకర్షిస్తున్నాయి. దీంతో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. అధికారులు చొరవ తీసుకొని బడిని తీర్చిదిద్దుతున్నారు. – పి. దేవయ్య,ప్రధానోపాధ్యాయుడు, వెంకటాపూర్ సహకారంతోనే సాధిస్తున్నా.. నాకు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు. ఎంపీడీవో కొత్తగా ఆటోచించమని ఇచ్చిన సలహాతోనే వీర్నపల్లిలో రైలుబండిని, వెంకటాపూర్‌లో పాఠశాలను కోటగా తయారు చేశాను. తాను వేసిన బొమ్మలను చూసి విద్యార్థులు ప్రభుత్వ బడులకు వస్తున్నారు. దీంతో బడులను బతికిస్తున్నాననే సంతృప్తి ఉంది. – నారోజు చందు, కళాకారుడు, నర్మాల ప్రైవేటు బడి మాన్పించిండ్రు ప్రైవేటు పాఠశాలకు వెళ్లి చదువుకునే వాడిని. ఊర్లోనే సర్కారు బడికి రంగులు వేసి అందరు బడికచ్చే విధంగా చేశారు. నాసోపతోళ్లు సర్కారు బడికి పోతుంటే వాళ్లను చూసి నేను కూడా ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేరాను. దీంతో మా తల్లిదండ్రులకు ఖర్చులు కూడా తగ్గినయ్. – గొట్టె జశ్వంత్, విద్యార్థి -
పరుచుకున్న పచ్చదనం
సిరిసిల్లటౌన్ : అందమైన చెమన్లు..రంగురంగుల పూలమొక్కలు..పిల్లలను అలరించే ఆటవస్తువులు..విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ..సందర్శకులను కట్టిపడేసే ఆంపిథియేటర్.. ఇవన్నీ ఎక్కడో నగరాల్లోని పార్కులో కనిపించే దృశ్యాలు. అయితే ఇవన్నీ ఇక కార్మికక్షేత్రంలోని సిరిసిల్లవాసులను కనువిందు చేయనున్నాయి. పక్షంరోజుల్లో ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కొత్త అందాలతో సిద్ధమైన నెహ్రూపార్కుపై కథనం.. అమాత్యుడి ఆదర్శం.. పట్టణానికి తలమానికం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆదర్శమైన ఆలోచనలతో పురాతన పార్కును పట్టణానికే తల మానికంగా నిలిచేలా తీర్చిదిద్దారు. కార్మికక్షేత్రమైన సిరిసిల్లలో చాలారోజులుగా పట్టణ ప్రజలు, ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం కొరవడిందని తెలుసుకున్న ఆయన ప్రత్యేక నిధులు కేటాయించి.. పట్టణంలో మున్సిపల్‌కు సంబంధించిన రెండు కొత్త పార్కులను ఏర్పాటు చేయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మితమైన పాత నెహ్రూపార్కు, ఇందిరా పార్కులను కూడా అభివృద్ధి పరిచేలా మున్సిపల్‌కు ప్రత్యేకంగా నిధులు అందించారు. అయితే నెహ్రూపార్కును ‘సోషల్ రెస్పాన్సిబిలిటీ’తో హైదరాబాద్‌కు చెందిన ‘ఫీనిక్స్’ ప్రముఖ కంపెనీ ఆధునిక సాంకేతికతో అభివృద్ధి చేసింది. ఆధునిక హంగులతో.. విస్తరిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని ప్రజల అవసరాల మేరకు విద్యానగర్‌లోని పాత నెహ్రూపార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు పూర్తికావచ్చాయి. 15న పార్కును ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా పార్కు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఏళ్ల తరబడి బోసిపోయిన అందాలతో కునారిళ్లిన ఈపార్కు ఇప్పుడు పూర్తిగా ఆధునిక హంగులతో అందాలను సొంతం చేసుకుంది. ఇందులోకి వెళ్లగానే సందర్శకులకు అందమైన చెమన్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆటకేంద్రంగా తయారైంది. వీటితో పాటు విజ్ఞానాన్ని పంచేలా విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ స్థానికంగానే అందుబాటులోకి రావడం విశేషం. డిజిటల్ సొగసులతో.. పాత నెహ్రూపార్కుకు హైదరాబాద్ కార్పొరేట్ సంస్థ డిజిటల్ సొగసులను మేళవించింది. సుమా రు 30గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈపార్కులో బోటింగ్ కొలను, డిజిటల్ లైబ్రరీ, పిల్లలకోసం ఆంపిథియేటర్, చూడముచ్చట గొలిపే వాటర్ ఫౌంటేన్లు, పిల్లల ఆటవస్తువులను ఏర్పాటు చేసింది. పార్కులోకి వెళ్లిన వారు మైమరిచిపోయేలా అత్యాధునిక పరిజ్ఞానంతో కొత్త నిర్మాణాలు చేపట్టింది. పార్కులోంచి నేరుగా పక్కనే ఉన్న మున్సిపల్ ఈతకొలనుకు సందర్శకులు వెళ్లే సౌకర్యం కల్పించింది. ఇప్పటికే తొంభైశాతం పనులు పూర్తయిన ఈపార్కు అందాలను సందర్శకులు వీక్షిస్తూ.. మున్సిపల్ అధికారులకు కితాబిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. పంద్రాగస్టుకు ప్రారంభిస్తాం పట్టణవాసులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచేలా పార్కును ఆధునికీకరించాం. హైదరాబాద్‌కు చెందిన బిల్డ్కాం కంపెనీ వారు పార్కును నవీకరిస్తున్నారు. పంద్రాగస్టులోగా పార్కులో అన్ని పనులు పూర్తి చేయించి మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేలా ఏర్పాటు చేస్తున్నాం. పట్టణ ప్రజలతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ముస్తాబైంది. – కేవీ రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
ప్రభుత్వాస్పత్రిలోప్రైవేటు కాన్పులు!
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కేసీఆర్ కిట్లతో ఆస్పత్రికి గర్భిణుల రాక పెరిగినప్పటికీ స్త్రీ వైద్యనిపుణులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నియామకమైన ఒక్కగానొక్క గైనకాలజిస్టు సేవలు సరిపోక ప్రైవేట్ వైద్యులతో ప్రసవాలు జరిపిస్తున్నారు. అత్యవసరమైతే కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా.. మొన్నటి వరకు ఒక్కరూ అందుబాటులో లేరు. దీంతో ప్రైవేటు వైద్యులతోనే ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు నిర్వహించాల్సిన దుస్థితి. పది రోజుల క్రితం గైనకాలజిస్టు హిందూజను నియమించినప్పటికీ మిగతా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అమ్మలాలనతో నాలుగేళ్లుగా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. కేసీఆర్ కిట్‌తో రెట్టింపయ్యాయి. కానీ గైనకాలజీ వార్డులో కేవలం 30 బెడ్లు ఉండడం, ఆస్పత్రిలో రెగ్యులర్‌గా స్త్రీవైద్యులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. కేసీఆర్ కిట్లతో రికార్డుస్థాయిలో ప్రసవాలు గతేడాది జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు గనణీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 13 పీహెసీలు, సిరిసిల్లలో జిల్లాస్పత్రి ఉన్నాయి. కేసీఆర్ కిట్లు అమలుకు ఆరు నెలల ముందు 1,208 ప్రసవాలు జరుగగా.. ఆరు నెలల తర్వాత 1,621 ప్రసవాలు జరిగాయి. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉండగానే అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ‘అమ్మలాలన’ ద్వారా అన్ని సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 2,615 ప్రసవాలు జిల్లా ఆస్పత్రిలోనే జరిగాయి. బెడ్ల కొరత ప్రసవాల కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులకు సరిపడేలా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందజేసిన పింక్, వైట్ బెడ్షీట్లు రోజూ మారుస్తున్నారు. అయితే వాటిని తొమ్మిది నెలల క్రితం అందజేయడంతో ఇప్పుడు వస్తున్న సంఖ్యకు సరిపోవడం లేదు. ఒక్కో రోజు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో 23 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఒకే సారి పెద్ద సంఖ్యలో గర్భిణులు ఆస్పత్రికి రావడంతో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ప్రసూతి వార్డుకు కనీసం వంద పడకలు అవసరం ఉండగా.. ప్రస్తుతం 30 మాత్రమే ఉన్నాయి. వెంటాడుతున్న వైద్యుల కొరత సిరిసిల్ల ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఎక్కువ సంఖ్యలో గర్భిణులు ప్రభుత్వాస్పత్రికే వస్తున్నారు. అయితే గైనకాలజిస్టులు లేకపోవడం సమస్యలు మొదలవుతున్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోనే ప్రైవేట్ వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారు. కనీసం నలుగురు నుంచి ఆరుగురు స్త్రీ వైద్యనిపుణులు అవసరం ఉండగా పదిరోజుల క్రితం ఒక్కరిని నియమించారు. అత్యవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేని సమయంలో కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నారు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయిన సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తుంది. సిరిసిల్లకు మంజూరైన మాతాశిశు సంరక్షణ కేంద్రం పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచి, వైద్యులు, మెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉంది.