Rakesh Sharma
-
Rakesh Sharma Birthday: రాకేష్‌శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవరి 13). ఆయన 1949 జనవరి 13న జన్మించారు. భారతదేశ చరిత్రలో తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సాగించిన అంతరిక్ష ప్రయాణం దేశానికి గర్వకారణంగా నిలిచింది.1949, జనవరి 13న పంజాబ్‌లోని పటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ(Rakesh Sharma), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)మాజీ పైలట్, వ్యోమగామి. రాకేశ్‌శర్మ 1984లో 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ టీ-11లో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఆయనను జాతీయ హీరోగా చేయడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.నాటి అంతరిక్ష మిషన్ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని శర్మను అడిగినప్పుడు ఆయన ‘సారే జహాన్ సే అచ్ఛా" (ప్రపంచమంతటి కంటే మెరుగ్గా) అని సమాధానమిచ్చారు. ఈ దేశభక్తి భావన లక్షలాది మంది భారతీయులతో ప్రతిధ్వనించింది.దేశ సమిష్టి జ్ఞాపకంలో శాశ్వతంగా నిలిచిపోయింది.రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత, శర్మ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఏరోస్పేస్ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ తరాల కలలను సాకారం చేసేందుకు, సైన్స్, అంతరిక్ష పరిశోధనలలో మరింత ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది.ఇది కూడా చదవండి: కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక -
స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర 40వ వార్షికోత్సవం
3 ఏప్రిల్ 1984న భారతదేశ అంతరిక్ష చరిత్రలో ముఖ్యమైన రోజు. ఈ రోజు సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. 3 ఏప్రిల్ 2024, అంతరిక్షంలో రాకేశ్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్‌కు 40 ఏళ్లు పూర్తయ్యాయి. రాకేష్ శర్మ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో పాటు సోయుజ్ T-11 ఎక్స్‌పెడిషన్ ద్వారా 3 ఏప్రిల్ 1984న సాయంత్రం 6.18 IST గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లారు.. ప్రయోగించిన తర్వాత Orbital Module రష్యా అంతరిక్ష కేంద్రానికి "Salyut 7" డాక్ చేయబడింది. రష్యా అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన తర్వాత రాకేష్ శర్మతో పాటు మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు సోయుజ్ T-10 సహాయంతో 11 ఏప్రిల్ 1984న సాయంత్రం 4.18p.m IST సమయంలో భూమికి తిరిగి వచ్చారు. *ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్ ప్రారంభించబడింది: రాకేష్ శర్మ యొక్క మిషన్ రాబోయే గగన్‌యాన్ గురించి అవగాహన కల్పించడానికి. ప్లానెటరీ గ్రూప్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్‌తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది. ముఖ్యంగా NASADIYA(నాసదీయ) అనే ఆస్ట్రానమీ, స్పేస్ టెక్ క్లబ్‌ను రిటైర్డ్ ISRO సీనియర్ సైంటిస్ట్ Er రామకృష్ణ పాఠశాలలో ప్రారంభించారు. ఎన్.శ్రీ రఘునందన్ కుమార్ డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు స్కూల్ డైరెక్టర్లు ఎన్.రేవతి రాజు & యామిని రాజు, ఏజేఎస్ ప్రకాష్ బిజినెస్ హెడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు, క్లబ్ సభ్యులు హాజరయ్యారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షునిగా రాకేశ్ శర్మ
న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్)కి 2023–24 కాలానికి నూతన అధ్యక్షునిగా రాకేశ్ శర్మ(ఆజ్ సమాజ్) ఎన్నికయ్యారు. వార్తాసంస్థలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ సంస్థల సంఘమైన ఐఎన్ఎస్ 84వ వార్షిక సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా సంస్థకు కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి) అధ్యక్షునిగా కొనసాగిన విషయం తెల్సిందే. 2023–24 కాలానికిగాను ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శ్రేయాంస్ కుమార్(మాతృభూమి), వైస్ ప్రెసిడెంట్‌గా వివేక్ గుప్తా(సన్మార్గ్), గౌరవ ట్రెజరర్‌గా తన్మైయ్ మహేశ్వరి(అమర్ ఉజాలా) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి), ఐ.వెంకట్(ఈనాడు, అన్నదాత)సహా 41 మంది ఎన్నికయ్యారు. సొసైటీకి సెక్రెటరీ జనరల్‌గా మేరీ పాల్ ఎంపికయ్యారు. మరోవైపు అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో తనకు పూర్తి సహాయక సహకారాలు అందించిన ఐఎన్ఎస్ ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, తదితరులకు మాజీ అధ్యక్షుడు కె.రాజ ప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి) కృతజ్ఞతలు తెలిపారు. -
దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు!
ఇస్రో పంపించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని మీద దిగిన తరువాత ప్రపంచమే భారతదేశం వైపు చూస్తోంది. నిజానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయాణం ఈ రోజు మొదలైంది కాదు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఈ రోజు యావత్ ప్రపంచాన్ని ఆకర్శిస్తోందంటే దాని వెనుక ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1957లో సోవియన్ యూనియన్ అంతరిక్షమాలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ప్రయోగించిన తరువాత ప్రపంచం ద్రుష్టి అంతరిక్ష పరిశోధనవైపు మరలింది. 1960లో భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్న సమయంలో అంతరిక్ష పరిశోధన కోసం అడుగులు వేసింది. హోమీ బాబా అణు ఇంధన శాఖకు అధిపతిగా ఉన్న రోజుల్లో 1962 నాటికి అంతరిక్ష పరిశోధన కమిటీ ఒక ప్రత్యేక విభాగంగా అవతరించింది. దానికి విక్రమ్ సారాభాయ్ చీప్ అయ్యారు. అప్పట్లో ఆధునిక రాకెట్ టెక్నలాజి తెలిసిన దేశాలు ఆ విషయాలను చాలా రహస్యంగా ఉంచాయి. ఆ సమయంలో మనదేశంలో పరిశోధన కేంద్రానికి దక్షిణ భారతదేశం అనువైన ప్రదేశంగా నిలిచింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యువ శాస్త్రవేత్తలు అరవముతన్, రామకృష్ణారావు, అబ్దుల్ కలాం వంటి వారు శిక్షణ కోసం నాసా వెళ్లారు. మొదటి అడుగు.. 1963లో నాసా భారతదేశానికి 'నైక్-అపాచీ' రాకెట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ తరువాత ఇండియా మొదటి రాకెట్ ప్రయోగాన్ని 1963లో ప్రయోగించింది. ఇదే మనదేశం ఈ రంగంలో వేసిన మొదటి అడుగు అనే చెప్పాలి. 1965లో తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందింది. 1975 ఏప్రిల్ 19 భారతదేశానికి చెందిన మొదటి అంతరిక్ష నౌక 'ఆర్యభట్ట' ప్రయోగించారు. 1981 నాటికి టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన 'ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పరిమెంట్'ను ప్రయోగించింది. విద్యుదయస్కాంత పరిశుభ్రత కోసం దీనిని పరీక్షించడానికి, ISRO ఎద్దుల బండిపై అమర్చిన తాత్కాలిక పరీక్షా సదుపాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారతీయ పౌరుడి అంతరిక్ష యాత్ర.. భారత వ్యోమగామి 'రాకేష్ శర్మ' భారతదేశానికి చెందిన అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములలో రాకేష్ శర్మ 138వ వాడు కావడం గమనార్హం. PSLV అరంగేట్రం.. క్రమంగా అధునాతన రాకెట్లు అవసరమని తలచి భారత్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అభివృద్ధి ప్రయత్నాలను ప్రారంభించింది. 1993లో మొదటి పీఎస్ఎల్వీ విఫలమైంది, కానీ 1994లో ప్రయోగించిన పీఎస్ఎల్వీ విజయవంతమైంది. ఆ తరువాత ప్రయోగించిన 95 శాతం పీఎస్ఎల్వీ రాకెట్లు విజయవంతమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పువాల్సినవి 2008లో చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-1, 2013లో మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్, 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం. అంగారకుడిపై భారత్.. 2007లో అప్పటి ఇస్రో చీప్ మాధవన్ నాయర్ అంగారకునిమీదకు ప్రోబ్ పంపాలని ప్రతిపాదించారు. దీనిని 2012లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మొత్తానికి తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? చంద్రయాన్.. చంద్రయాన్-1 & 2 రెండు విఫలమయ్యాయి. అయితే ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 గొప్ప విజయం సాధించి భారతీయ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది. కాగా ఇటీవల ఆదిత్య-ఎల్1 కూడా ప్రయోగించారు. సుమారు ఆరు దశాబ్దాలు దిన దిన ప్రవర్ధమానం చెందుతూ గొప్ప విజయనాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఖాతాలో వేసుకుంది. ఇది భారతీయులందరికి గర్వకారణం అనే చెప్పాలి. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్‌లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్‌కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
చేతక్ వాహనప్రియులకు షాక్: మళ్లీ బ్రేకులు
ముంబై: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన 48 గంటల్లోనే కంపెనీ మళ్లీ నిలిపివేసింది. సప్లయి చెయిన్‌లో అనిశ్చితే ఇందుకు కారణమని తెలిపింది. తదుపరి బుకింగ్ రౌండ్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. బజాజ్ కంపెనీ చేతక్ ఈ-స్కూటర్స్ బుకింగ్స్‌ను ఈ నెల 13న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్లైన్లో రీ-ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత బెంగళూరు, పుణే నగరాల్లో మాత్రమే బుకింగ్స్‌కు అవకాశం కల్పించింది. కస్టమర్ల నుంచి అధిక స్పందన లభించిందని.. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో విపరీతమైన అంతరాయాలు, సుదీర్ఘ నిరీక్షణ కాలం ఉన్నప్పటికీ బుకింగ్స్‌ను చాలా తక్కువ రద్దు చేశామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. ఇప్పటికే బుకింగ్స్ తీసుకున్న కస్టమర్లు త్వరగా డెలివరీలను స్వీకరించి, రైడింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సరఫరా గొలుసు సమస్యలను పరిష్కరించి.. వీలైనంత త్వరగా బుకింగ్స్‌ను రీ–ఓపెన్ చేస్తామని.. వచ్చే త్రైమాసికంలో మరిన్ని నగరాలలో కూడా బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చేతక్‌లో అర్బన్, ప్రీమియం రెండు మోడల్స్ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రత్యేకమైన యాప్‌కు కనెక్ట్ చేయబడిన ఈ–స్కూటర్లకు ప్రమాదం జరిగినా లేదా దొంగిలించబడినా సరే సంబంధిత స్కూటర్ యజమానికి నోటిఫికేషన్స్ వెళతాయి. ధరలు అర్బన్ రూ.1.22 లక్షలు, ప్రీమియం రూ.1.26 లక్షలు(పుణే ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. -
అంతరిక్షంలో ఉన్న రాకేశ్‌ను ఇందిర ఏమడిగారో తెలుసా?
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు ఎవరంటే..! ఠక్కున చెప్పే పేరు రాకేశ్ శర్మ. మొట్టమొదటి సారిగా భారతీయుని అంతరిక్షయాత్ర కల సాకారమైంది ఈ రోజునే. రష్యా సహాకారంతో రాకేశ్‌శర్మ రోదసీలోకి వెళ్లి నేటికి 37 ఏళ్లు. సోవియట్ రష్యాకు చెందిన సోయజ్ టి-11 వ్యోమ నౌక ద్వారా 1984 ఏప్రిల్ 3 న ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. రాకేశ్ శర్మ రోదసీలో సుమారు 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అడిగిన ప్రశ్నకు రాకేశ్ శర్మ కవి ఇక్బాల్ రచించిన "సారే జహాసే అచ్చా" (మిగతా ప్రపంచం కంటే ఉత్తమం) అంటూ సమాధానమిచ్చారు. కాగా, ప్రస్తుతం రాకేశ్ శర్మ జీవితంపై బాలీవుడ్లో ‘సారే జహాసే అచ్చా’ బయోపిక్ సినిమా రానుంది. ఈ సినిమాలో షారుఖ్ నటిస్తున్నాడు. ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక భారత్ మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్‌యాన్ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అందుకుగాను మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు, రష్యాలో ఏడాది శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు. మానవ సహిత యాత్ర కోసం భారత ప్రభుత్వం పదివేల కోట్లను కేటాయించింది. చదవండి: Gaganyaan Mission: మరో కీలక ముందడుగు -
అంతరిక్షానికి ప్రయాణం
అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాబోతున్నారు ఫర్హాన్ అక్తర్. వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని చుట్టేయాలనుకుంటున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కెమెరామేన్ మహేష్ మతై ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. త్వరలోనే రష్యాలో ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించనున్నారని సమాచారం. ఈ బయోపిక్ లో రాకేష్ శర్మ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే వార్తల్లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సుశాంత్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు గతంలో తెర మీదకు వచ్చాయి. చివరికి ఫర్హాన్ అక్తర్ ఈ పాత్రలో నటించనున్నారు. -
జూన్‌లోపు నిర్ణయిస్తా
షారుక్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నాడు? అటు బాలీవుడ్‌లోనూ ఇటు ఆయన అభిమానుల్లోనూ ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. ‘జీరో’ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంచెం ఆలోచనలో పడ్డట్టున్నారీ కింగ్ ఖాన్ రాకేశ్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఏంటి? అనే ప్రశ్న షారుక్ ముందుంచితే – ‘‘ప్రస్తుతానికి కథలు మాత్రమే వింటున్నాను. ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. జూన్‌లోపు ఏ సినిమా చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని పేర్కొన్నారు. ‘డాన్’ సిరీస్‌లో ‘డాన్ 3’, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా.. ఇలాంటి వార్తలు ప్రస్తుతానికి షికారు చేస్తున్నాయి. మరి.. షారుక్ ఏం చేస్తారో తెలిసేది జూన్ తర్వాతే. -
షారుక్ పోయె.. విక్కీ వచ్చె...
నిన్న మొన్నటివరకు బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన విక్కీ కౌశల్ ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్’ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఆయన తొలిసారి ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. విక్కీ ఇప్పుడు భారత వ్యోమగామి రాకేశ్ శర్మ బయోపిక్ ‘సారే జహాసే అచ్చా’లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ బయోపిక్‌లో తొలుత ఆమిర్‌ఖాన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సడన్‌గా షారుక్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే... ‘డాన్ 3’ సినిమా కోసం షారుక్‌ఖాన్ రెడీ అవుతున్నారని, అందుకే ఆయన స్థానంలో విక్కీ కౌశల్ నటించబోతున్నారని బాలీవుడ్ తాజా ఖబర్. -
సూపర్‌స్టార్‌ను తీసేసి యంగ్ హీరోతో..!
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ తరువాత అదే స్థాయిలో స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న నటుడు షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస విజయాలతో బాద్షాగా వెలుగొందిన కింగ్ ఖాన్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. తాజాగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్‌కు మరో భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీరో భారత్‌లో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. దీంతో షారూఖ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా మార్పలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ నుంచి షారూఖ్‌ను తొలగించటం ఫ్యాన్స్ అవమానంగా భావిస్తున్నారు. వయసు కారణంగానే షారూఖ్‌ను కాదని యంగ్ హీరోల వైపు చూస్తున్నట్టుగా నిర్మాతలు చెపుతున్నా మార్కెట్ లేని కారణంగానే బాద్షాను పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది. షారూఖ్ స్థానంలో యంగ్ హీరో విక్కీ కౌషల్ పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ పరిస్థితులనుంచి కింగ్ ఖాన్ ఎలా బయటపడతాడో చూడాలి. -
సెల్యూట్‌కి సెలక్టేనా?
‘దంగల్’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఫాతిమా సనా షేక్. ఇటీవల ఆమె నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ నటిగా ఆమె కష్టాన్ని గురించారు బాలీవుడ్ దర్శకులు. ఇప్పుడు ఆ కష్టాన్నే గుర్తించి షారుక్ అండ్ టీమ్ ‘సెల్యూట్’ సినిమాలో ఫాతిమాను హీరోయిన్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మరి..ఫైనల్‌గా ఆమె హీరోయిన్ ప్లేస్‌ను కన్ఫార్మ్ చేసుకుంటారా? లేక వేరే ఎవరైనా దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో ‘సెల్యూట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని బాలీవుడ్ టాక్. -
జోహ్రిపై విచారణకు కమిటీ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ఇందులో ఉన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. -
సారే జహాసే అచ్చా
‘జీరో’ తర్వాత రాకేశ్ శర్మ బయోపిక్‌లో షారుక్ ఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సారే జహాసే అచ్చా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. షారుక్ ముఖ్య పాత్రలో మహేశ్ మతాయి తెరకెక్కించనున్న స్పేస్ మూవీ ఇది. భూమి పెడ్నేకర్ హీరోయిన్గా ఎంపికయ్యారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్, రోనీ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మించనున్నారు. వ్యోమగామి రాకేశ్ శర్మ పాత్రలో షారుక్ కనిపిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
ప్రియాంక పోయి పెడ్నేకర్ వచ్చె?
హాలీవుడ్ నుంచి రిటర్న్ అయ్యాక ప్రియాంకా చోప్రా ‘భారత్, సెల్యూట్’ సినిమాల్లో కనిపిస్తారని ఊహించారంతా. ‘భారత్’ సినిమా షూట్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత తప్పుకున్నారు. కానీ ‘సెల్యూట్’ సినిమా విషయంలో మాత్రం ముందే రేసులో నుంచి తప్పుకున్నారట. దాంతో ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌లో భూమి పెడ్నేకర్ వచ్చారని బాలీవుడ్ టాక్. షారుక్ ఖాన్ హీరోగా మహేశ్ మతై దర్శకత్వంలో ‘సెల్యూట్’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) రాకేశ్ శర్మ బయోపిక్ ఇది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ప్రియాంకా చోప్రా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు భూమి పెడ్నేకర్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కేవలం రాకేశ్ శర్మ ప్రొఫెషనల్ లైఫ్‌ని మాత్రమే కాకుండా భార్యతో ఆయనకున్న అటాచ్‌మెంట్‌ను కూడా చర్చించనున్నారట. దాంతో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది. ‘ధమ్ లగా కే హైశా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భూమి ‘టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ, లస్ట్ స్టోరీస్’లతో పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు ఏకంగా షారుక్ పక్కన చాన్స్ కొట్టేయడమంటే మెల్లిగా టాప్ లీగ్‌లోకి ఎంట్రీ పాస్ కొట్టేసినట్టే. షారుక్ తాజా చిత్రం ‘జీరో’ పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. -
సెల్యూట్‌కి గ్రీన్ సిగ్నల్
వివాహం చేసుకున్న తర్వాత కథానాయిక కరీనా కపూర్ ఒక కీలక పాత్రలో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం గురించి అధికారిక వార్త ఏమీ రాలేదు. ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా నటించబోయే ‘సెల్యూట్’ సినిమాలో కథానాయిక పాత్ర పోషించడానికి కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా ‘సెల్యూట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా అక్టోబర్‌లో స్టార్ట్ కానుందని టాక్. షారుక్‌తో కరీనా నటించిన చివరి చిత్రం ‘రా. వన్’. 2011లో ఈ చిత్రం విడుదలైంది. -
స్పేస్‌లోకి..
షారుక్ ఖాన్ బ్యాగ్ సర్దుకొని ఓ రెండు నెలలు పాటు స్పేస్‌లో ఉండబోతున్నారట. అక్కడ తనకు అప్పగించిన ప్రాజెక్ట్‌ను నిర్వర్తించడంలో బిజీ అయిపోతారట. మ్యాటరేంటంటే.. ఈ స్పేస్ సెట్టింగంతా రాకేశ్ శర్మ బయోపిక్ ‘సెల్యూట్’ కోసం. పైలెట్ రాకేశ్ శర్మ పాత్రలో షారుక్ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేశ్ మతాయి డైరెక్ట్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రెండు నెలలపాటు గ్యాప్ లేకుండా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సెట్లో షూటింగ్ జరపనున్నారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో షారుక్ ప్రెస్టీజియస్ మూవీ ‘జీరో’ను ప్రమోట్ చేయ నున్నారు. ‘సెల్యూట్’ 2019లో విడుదల కానుంది. ‘జీరో’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. -
ఆమిర్ స్థానంలో షారూఖ్..?
చంద్రుడిపై అడుగుపెట్టిన భారత వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్టు ఆ మధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా కబురు ఏమిటంటే.. ఈ సినిమా నుంచి ఆమిర్ తప్పుకొని తెరపైకి కింగ్ ఖాన్ షారుఖ్ వచ్చాడట. ఈమేరకు చక్కర్లు కొడుతున్న రూమర్లపై తాజాగా షారూఖ్ స్పందించాడు. 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న షారూఖ్‌ను ఈ విషయమై అడగగా.. ఇప్పటివరకు కొత్త సినిమాకు సైన్ చేయలేదని స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం ఆనంద్ ఎల్. రాయ్ సినిమాలో నటిస్తున్నానన్నాడు. ఆ సినిమాలో ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆ సినిమా కోసమే సమయం కేటాయించానన్నాడు. సిద్దార్థ్ రాయ్ కపూర్‌తో పాటు, మరికొందరు నిర్మాతల్ని కలిసినప్పటికీ, మరో రెండు నెలల తర్వాతే తన తదుపరి సినిమాపై స్పష్టతనిస్తానని తెలిపాడు. దీంతో రూమర్లకు తెర పడినట్లయింది. -
సరైనోడు దొరకాలిగా!
టాప్ హీరోయిన్స్‌కు తరచూ ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. ఇదే ప్రశ్నను ప్రియాంకా చోప్రా ముందుంచితే.. ‘‘అయినా పెళ్లి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అవ్వదు. మనసుకి నచ్చినవాడు దొరకాలి కదా. అలాంటి వాడు ఇంకా నాకు తారస పడలేదు’’ అని పేర్కొన్నారు ఈ 35 ఏళ్ల ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చేసి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు ప్రియాంక. ‘‘సినిమాలు చేయడానికే టైమ్ సరిపోతోంది. ఇక పెళ్లి గురించి ఆలోచించే టైమ్ ఎక్కడుంది?’’అని సన్నిహితులతో అంటున్నారట ప్రియాంక. ‘ఎ కిడ్ లైక్ జెక్’, ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ వంటి చిత్రాలతో హాలీవుడ్లో బిజీ బిజీగా ఉన్నారామె. మరి.. బాలీవుడ్ చిత్రాల సంగతేంటి? అంటే.. వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ కోసం తనను సంప్రదించినట్టు ప్రియాంక పేర్కొన్నారు. ఇందులో రాకేష్ శర్మగా ఆమిర్ ఖాన్ కనిపిస్తారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. -
ఆ సినిమా నుంచి 'మిస్టర్ పర్ఫెక్ట్' తప్పుకున్నాడా?
చంద్రుడిపై అడుగుపెట్టిన భారత వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో తాను నటిస్తున్నట్టు ఆమిర్ ఖాన్ గతంలో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'సెల్యూట్' అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే, 'మిస్టర్ పెర్ఫెక్ట్' ఆమిర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం చిత్ర యూనిట్‌తో విభేదాలేనని తెలుస్తోంది. కొన్ని విషయాల్లో సినిమా క్రియేటివ్ టీమ్‌కు ఆమిర్‌కు అభిప్రాయభేదాలు వచ్చాయట. దీంతో ఈ బయోపిక్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. మహేష్ మఠీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అమీర్ భార్యగా ప్రియాంకా చోప్రా నటిస్తారని గతంలో భావించారు. 2018 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం థాయిలాండ్‌లో కొనసాగుతున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' హూటింగ్ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్లో అమీర్ పాల్గొంటాడని అనుకున్నారు. స్కిప్ట్ చివరిదశలో విభేదాలు రావడంతో ఆమిర్ టాటా చెప్పాడని, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడానికి షారుఖ్ ఖాన్‌ను నిర్మాతలు సంపద్రించారని బాలీవుడ్ మీడియా తాజా కథనంలో తెలిపింది. దీనిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. -
ఆమిర్‌కు జోడిగా తొలిసారి..!
హాలీవుడ్ లో సత్తా చాటుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఓ ప్రస్టిజియస్ ప్రాజెక్ట్ లో నటించనున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బయోపిక్ లో పీసీ లీడ్ రోల్ లో నటించనున్నారు. ఆమిర్ ఖాన్ త్వరలో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథతో తెరకెక్కుతున్న 'శాల్యూట్' సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో రాకేశ్ భార్య పాత్రలో ప్రియాంక చోప్రా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రకు 'దంగల్' సినిమాలో నటించిన ఫాతిమా షేక్ సనాను ఫైనల్ చేశారు. ఇప్పుడు మరో కీలక పాత్రకు ప్రియాంక చోప్రా పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ చేయలేక సంజయ్ లీలా భన్సాలీ గుస్తాకియాన్ సినిమాను వదులుకున్న పీసీ.. ఆమిర్ సినిమాకు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
సారే జహాసే అచ్ఛా
‘సారే జహాసే అచ్ఛా...’ అన్న గీతం ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఓ విధమైన ఉద్వేగం, ఉత్తేజం కలుగుతాయి కదూ! అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మను నాటి ప్రధాని ఇందిరా గాంధీ, ‘అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఎలా ఉంది?’ అనడిగితే, ‘సారే జహాసే అచ్ఛా..’ అని సింపుల్‌గా చెప్పేసి, దేశంపై తనకున్న మక్కువ చూపుకున్నారు. ఇప్పుడాయన జీవిత కథను సినిమాగా తీసేందుకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ రెడీ అయిపోయారు. కొత్తదర్శకుడు మహేష్ మతై తెరకెక్కించనున్న ఈ సినిమాకు ‘సారే జహాసే అచ్ఛా..’ అన్న టైటిల్‌నే ఖరారు చేసేశారట. మొదట ‘సెల్యూట్’ అనే టైటిల్‌ను అనుకున్నా, చివరకు ‘సారే జహాసే అచ్చా’కే ఫిక్స్ అయ్యారట. ‘దంగల్’ అంటూ ఈ మధ్యే ఓ బయోపిక్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఆమిర్ వెంటనే మరో బయోపిక్కు రెడీ అయిపోవడం విశేషంగా చెప్పుకోవాలి. -
కెనరా బ్యాంక్ లాభం రూ. 214 కోట్లు
► 57% తగ్గిన ఎన్పీఏ కేటాయింపులు ► ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్ బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.214 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కెనరా బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,905 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేశ్ శర్మ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ.2,708 కోట్లకు తగ్గాయని వివరించారు. మొత్తం ఆదాయం రూ.12,116 కోట్ల నుంచి రూ.12,889 కోట్లకు పెరగిందని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,708 కోట్లు నికర వడ్డీ ఆదాయం14 శాతం వృద్ధితో రూ.2,708 కోట్లకు పెరిగిందని రాకేశ్ శర్మ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.1,981 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రూ.2,937 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏ క్వార్టర్లోనూ ఈ స్థాయి నిర్వహణ లాభం రాలేదని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ కూడా 2.19 శాతం నుంచి 2.24 శాతానికి పెరిగిందని వివరించారు. 2015–16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 9.4 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 9.63 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 6.42 శాతం నుంచి 6.33 శాతానికి తగ్గాయని వివరించారు. ఇక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.2,813 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,122 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. -
'సారే జహాసే అచ్ఛా' అంటున్న ఆమిర్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. పీకే సినిమాతో భారతీయ సినీ రికార్డ్లను తిరగరాసిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది దంగల్ సినిమా సెట్స్ మీద ఉండగానే మూడు సినిమాలకు ఓకె చెప్పాడు ఆమిర్. ఇప్పటికే అద్వైత్ చౌహాన్ తెరకెక్కిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ షూటింగ్ పూర్తి చేశాడు. తొలి సారిగా అమితాబ్‌తో కలిసి నటిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాను సెట్స్ మీదకు తీసకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను 2018 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత మరోసారి బయోపిక్‌లో నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ నటించనున్నాడు. ఈ సినిమా కోసం సెల్యూట్, సారే జహాసే అచ్ఛా అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
వ్యోమగామిగా ఆమిర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. పికె సినిమాతో భారతీయ సినీ రికార్డ్లను తిరగరాసిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా బయోపిక్‌లోనే నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ నటించనున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.