ravanth reddy
-
రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పరాభవం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రేవంత్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు. -
రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం: బండి సంజయ్
సాక్షి, వికారాబాద్: కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశారు.. అది ఏమైంది?. మళ్లీ గణన ఎందుకు..? ఆ రిపోర్ట్ వాళ్లు బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.‘‘కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి..?’’ అని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్ -
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
20న తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్వోఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు -
సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ, పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం.. వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.గోషామహల్లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. -
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ-ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని రేవంత్ చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్ అమలుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. -
‘ఫోర్త్ సిటీ’ వెనుక కాంగ్రెస్ సర్కార్ భూదందా: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా కొనసాగుతోందని.. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర జరుగుతోందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం.. గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు.ధరణిపై భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ భూదోపిడీపై చర్యలేవి?. కాంగ్రెస్‌కు హిందూ పండగలంటే అంత చులకనెందుకు?’’ అంటూ ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని.. ఆ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు. -
పద్దులపై చర్చ.. సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందిరైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసింది.వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదు.పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగింది నిన్న 18 గంటలు...19 పద్దుల పై చర్చ జరిగింది: స్పీకర్ గడ్డం ప్రసాద్పద్దుల పై వరుసగా ఒకేసారి సభ్యులు మాట్లాడాలిసమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరుసగా అన్ని పద్దుల పై మాట్లాడాలిసభ సజావుగా జరిగేందుకు నిన్న అందరూ సహకరించారు.ఇవాళ సైతం 19 పద్దుల పై చర్చ జరగాలి.. సభ్యులు సహకరించాలిప్రారంభమైన తెలంగాణ శాసన సభఆరో రోజు శాసన సభ సమావేశాలుప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన సభస్కిల్ యూనివర్సిటీ పై మొదలైన చర్చస్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం..వ్యవసాయ ఉత్పత్తులతో వేధికను అలంకరించిన వ్యవసాయ శాఖలక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపురెండో విడుత నిధులు విడుదల చేయనున సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క17 మంది రైతులకు రుణమాఫీ చెక్కు లను అందజేయనున్న సీఎంసాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024–25 వార్షిక బడ్జెట్ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది. సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 19 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ ప్రారంభమైంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది. -
ఎన్టీపీసీ పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘ఇందులో భాగంగా.. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో.. మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023 తేదీన, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చి 2024 తేదీన ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు...ఈ 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఎన్టీపీసీతో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుంది.ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. STPP-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే.. పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. 5 అక్టోబర్, 2023 తేదీన, 9 జనవరి, 2024 తేదీన, 29 జనవరి, 2024 తేదీన.. ఆ తర్వాత మొన్న 29 ఏప్రిల్, 2024 నాడు లేఖలు రాస్తే.. వీటికి ట్రాన్స్‌కో నుంచి సమాధానం లభించలేదు.ఇన్నిసార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న STPP-II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో.. దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది ఎన్టీపీసీ రాసిన లేఖల సారాంశం.30 మే 2024న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్ఠంగా (పీక్ పవర్ డిమాండ్)15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ NTPC పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది.తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా.. దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం.. NTPC రాస్తున్న లేఖలపై స్పందించి.. PPA చేసుకుంటే అంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
సభలో మా గొంతు నొక్కుతున్నారు.. హరీష్‌రావు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మా గొంతు నొక్కుతున్నారని.. ఏ పార్టీకి ఎంత సమయం ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగం చేశారని.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చేసే ప్రకటనలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు.‘‘ఉదయ్ స్కీం వల్ల కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు గతంలో మాకు ఇస్తామన్న మేము ఒప్పుకోలేదు. వ్యవసాయ బోర్డు దగ్గర మీటర్లు పెట్టకూడదని 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాం. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు కాకుండా.. పాత మీటర్ల చోట కొత్త మీటర్ల అంశం అందులో ఉంది. వ్యవసాయ భూములు మీటర్లు ప్రైవేటుపరం చేయకూడదని మేము కేంద్రం పెట్టిన నిబంధనలకు ఒప్పుకోలేదు. కేంద్రం పెట్టిన నిబంధనలకు మేము ఒప్పుకుంటే ప్రతి ఏడాది 5000 కోట్లు మొత్తం ఐదేళ్లు 30 వేల కోట్లు వచ్చేవి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎంహరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టదు. తలకిందులుగా తపస్సు చేసిన రైతులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. -
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ''మనకు పనికిమాలిన ప్రభుత్వం అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది'' అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్‌పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. కానీ నేటికీ, ఇది ప్రారంభోత్సవం కోసం వేచి ఉంది, ఎందుకంటే ఢిల్లీలోని ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ శాసనసభ్యుల ఇళ్ల మధ్య సీఎం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కంటే తమ వ్యక్తిగత ప్రజాప్రతినిధులే ముఖ్యమని భావిస్తోంది'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఫ్లై ఓవర్‌ను ప్రజల ఉపయోగం కోసం తెరవాలని నేను కోరుతున్నాను.. లేదంటే ప్రజలు స్వయంగా దానిని ప్రారంభిస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అసలు ఉన్నట్టా? లేనట్టా?.. సీఎం రేవంత్‌కి హరీష్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆగమ్య గోచరంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. ''రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?'' అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.సీఎంగా కేసీఆర్.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని లేఖలో పేర్కొన్న హరీష్‌రావు.. పలు డిమాండ్లను ప్రస్తావించారు. ‘‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి'' అని కోరారు.బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి'' అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
ఇది మతిలేని చర్య.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్‌కు చేతకాదంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది!’’అంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని… pic.twitter.com/E2EWqT0hve— KTR (@KTRBRS) July 10, 2024 -
విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు?: అంబటి
సాక్షి, తాడేపల్లి: ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని.. అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించారు.‘‘నాగార్జునసాగర్ కుడి కెనాల్‌కు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదు. టీటీడీ బోర్డు, ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరింది. పోర్టుల్లో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏ ద్రోహాన్నిచేయబోతున్నారు?’’ అని అంబటి రాంబాబు నిలదీశారు.‘‘రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే అర్థమేంటి?. తెలంగాణ డిమాండ్లను చంద్రబాబు అంగీకరించినట్టేనా?. నాగార్జునసాగర్‌లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ చొరవతో పోలవరం విషయంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో వివాదాలు పరిష్కారం అయ్యాయి. పోలవరం విషయంలో ఏపీకి ద్రోహం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. కాంట్రాక్టర్లను మార్చడం, రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఆలస్యం కాలేదు. చంద్రబాబు నది మధ్యలో కాఫర్ డ్యాం కట్టడం వల్లే పోలవరం ఆలస్యానికి కారణం’’ అని అంబటి వివరించారు.‘‘రాష్ట్ర విభజన వలన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన జరిగాక మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు. పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండేది. అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు?. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. చంద్రబాబు తప్పు చేసినందునే మెడ పట్టుకుని గెంటేశారు. రాష్ట్రానికి రావాల్సినది ఏదీ తీసుకుని రాకుండా ఎందుకు పారిపోయారు. తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏపీకి అన్యాయం చేశారు...మొన్నటి సీఎంల సమావేశంలో అసలు చంద్రబాబు ఏం చర్చించారు?. విద్యుత్ బిల్లు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉండగా దానిపై ఎందుకు చర్చించలేదు?. నాగార్జునసాగర్ లో నీరు విడుదల చేయటానికి కూడా తెలంగాణ మీద ఆధారపడేలా చేశారు. శ్రీశైలంలో విద్యుత్ సరఫరా విషయమై ఎందుకు మాట్లాడటం లేదు?. ఏపీలో సముద్రం తీరంలో టీటీడీలో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ కోరింది...ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు వ్యక్తిగత అంశాల కోసం ఏపీకి చెందిన గ్రామాలను తెలంగాణలో కలిపేస్తారా?. అసలు ఇద్దరు సీఎంల మధ్య సమావేశాలు జరిగితే దేని గురించి చర్చించారో ఎందుకు చెప్పటం లేదు?. చర్చలను రహస్యంగా ఉంచటానికి కారణం ఏంటి?. రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని చంద్రబాబు అనటం వెనుక కుట్ర ఏంటో బయట పెట్టాలి. పోలవరానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపబోతున్నారు. పోలవరం కాంట్రాక్టరుని మార్చటం వలనో, రివర్స్ టెండర్ వలనో నష్టం జరగలేదు. చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటం వలనే నష్టం జరిగింది..వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు ఇంకా మాట్లాడుతున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోతే జగన్ విజృంభిస్తారు. విభజనచట్టంలో ఉన్న ప్రత్యేక హోదా హామీని చంద్రబాబు ఎందుకు అడగటం లేదు?. 9, 10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాన్ని ఎందుకు అడగటం లేదు. పోలవరంపై ఏం చర్చించారో బయట పెట్టాలి. అసలు విషయాలను పక్కన పెట్టి డ్రగ్స్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్సార్ జయంతిని ఎవరైనా జరుపుకోవచ్చు. ఆయనకు అభిమానులు ఎక్కువ’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
బాబూ.. రేవంత్‌తో ఏం చర్చించావ్.. ఏం సాధించావ్?: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు.. రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారో రాష్ట ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరస్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజామా కాదా?. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలింది. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు. ఏపీకి చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారు.’’ అంటూ కాకాణి నిలదీశారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఆరంభ శూరత్వాలే. ఆయన అనుకూలం మీడియా ఆహా.. ఓహో అనడం తప్ప సాధించిన ఫలితాలు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశంపై ఎంతో హైప్ క్రియేట్ చేశారు. ఈ భేటీలో ఏ అంశాలపై స్పందించారో.. వేటికి పరిష్కారం లభించిందనే విషయాన్ని వెల్లడించలేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కోసం ఒక ఆర్కిటెక్ మాదిరిగా చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచినట్టుంది’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.ఈ సమావేశానికి ఒక దశ.. దిశా లేదు.. పరా డబ్బా.. పరస్పర డబ్బా తప్ప సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వీరి చర్యలు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి ఐదు గ్రామాలు ఇవ్వాలని తెలంగాణ కోరినట్లు.. దానిపై చంద్రబాబు ఏమి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించలేదు. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆ గ్రామాలపై నిర్ణయం తీసుకుంటే భారీ తప్పిదమే అవుతుంది.’’ అని గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు.ముంపు మండలాల్లోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. టీటీడీలో కూడా వాటా అడిగినట్లుగా సమాచారం వచ్చింది.. దీనిని మంత్రులు ఎవరూ ఖండించలేదు. ఓటుకు నోటు కేసులో.. చిక్కుకున్న చంద్రబాబు హడావుడిగా.. అక్కడ నుంచి వచ్చేశారు.. దీనివల్ల లక్షన్నర కోట్ల మేర ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగింది. 9,10 షెడ్యూల్ కింద రావాల్సిన ఆస్తులు ఎన్నో ఉన్నాయి.. వీటిపై చంద్రబాబు స్పందించ లేదు’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. -
విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: విభజన సమస్యలపై లోతుగా చర్చించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై చర్చించామని.. రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ మంత్రులు ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశాం. సీఎంల భేటీలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కారం కోసం సీఎస్‌లతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం’’ అని చెప్పారు.‘‘మంత్రులతో కూడిన మరో కమిటీ వేయాలని నిర్ణయించాం. 2 వారాల్లోగా త్రీమెన్ కమిటీ కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తాం. డ్రగ్స్‌ను నియంత్రించడానికి రెండు రాష్ట్రాలు ముందుకు వెళ్లాలని నిర్ణయించాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పేర్ని నాని ఆసక్తికర ట్వీట్
సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్ చేశారు.తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !— Perni Nani (@perni_nani) July 6, 2024 కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్‌లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్‌భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. -
రేపు ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజా భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు. ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు.మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. -
హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించే ఛాన్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: నేతన్నలవి ఆత్మహత్యలు కావు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అంటూ సీఎం రేవంత్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటివరకు 10 మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు అందిన ప్రతి పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా?. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.