Rayadurgam
-
HYD: బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీ
సాక్షి,హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించడమే కాకుండా రూమ్‌లో బందించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్,ఒక ఆపిల్ ల్యాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.దోపిిడీకి పాల్పడిన ఇద్దరిలో ఏ1 నిందితుడు శుభమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన నిందితులిద్దరూ గతంలో తేవర్ బార్లో పనిచేశారు. మూడు నెలల క్రితం ఈ ఇద్దరినీ బార్ ఓనర్ పనిలో నుంచి తీసివేశాడు. ఇది మనసులో పెట్టుకునే దోపిడీకి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు. -
HYD: స్కూల్‌కు వెళ్లిన బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇక, ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్‌కు గురైంది. బుధవారం స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలను దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పాపను ఎటు వైపు తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
గోల్డ్‌మ్యాన్ దుర్గం శ్రవణ్..
రాయదుర్గం: ‘బంగారం’ అంటే ఎవరికి ప్రేమ, మమకారం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారంతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం ఎంతో మక్కువ, మమకారం. కాగా మగవాళ్లకు ఇటీవలి కాలంలో బంగారం ధరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఆ ట్రెండ్ ఇటీవలి కాలంలో గుర్తింపు సాధించింది మాత్రం దుర్గం శ్రవణ్‌కుమార్ అని చెప్పక తప్పదు. గత 20 ఏళ్లుగా బంగారు నగలు, ఉంగరాలు ధరిస్తూ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన దుర్గం శ్రవణ్‌కుమార్ బంగారు ఆభరణాలు ధరిస్తూ మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్‌మ్యాన్’గా గుర్తింపు సాధించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరిస్తూ అగుపించడంతో రాష్ట్రమంతటా ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్‌మ్యాన్’ గుర్తింపు సాధించడం విశేషం.గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో తాత ముత్తాతల నుంచి దుర్గం శ్రవణ్‌కుమార్ కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సులో ఉండే శ్రవణ్‌కుమార్ తండ్రి దుర్గం లక్ష్మయ్య, తల్లి పెంటమ్మకు చిన్న తనం నుంచే బంగారంపై చాలా మక్కువ ఉండేది. ఆ తర్వాత ఒక వయస్సు వచి్చన తర్వాత 25 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభం నుంచే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఫైనాన్స్ చేస్తూ రెండింటిలోనూ రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.బంగారం ధరించేందుకు నాన్నే స్ఫూర్తి..మా నాన్న దుర్గం లక్ష్మయ్యనే బంగారం ధరించడానికి నాకు స్ఫూర్తి. ఒక గొలుసు, రెండు ఉంగరాలు ధరించే వాళ్లు. ఆయన వాటిని నాకు ఇచ్చేశారు. ఆయన నుంచి కష్టపడేతత్వాన్ని నేర్చుకున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం కలిగింది. దీంతోనే బంగారం కొనుగోలు మొదలైంది. మొదట హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌గా పిలిచేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గోల్డ్‌మ్యాన్‌గా పిలవడం సంతోషాన్నిస్తుంది. నా కష్టార్జితంతోనే వీటిని ధరించడం అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందనేది నా నమ్మకం. రాయదుర్గం నాగార్జున ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదివాను. ఆపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ప్రతి రూపాయి చెమటోడ్చి సంపాధించినదే, ఇందులో కొంత ఆపదలో ఉన్నవారికి నా వంతూ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అలవాటు. – దుర్గం శ్రవణ్‌కుమార్, తెలంగాణ గోల్డ్ మ్యాన్, రాయదుర్గం -
రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు
-
పరిశ్రమల భూములు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.దీనికోసం హైదరా బాద్‌లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్‌ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది. బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకిఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్‌లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. -
బైక్ రేసర్ల హల్ చల్
-
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.అబ్దుల్ తనయుడు సోహైల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళపై టీడీపీ నేత అకృత్యం
రాయదుర్గం : టీడీపీ నేత అకృత్యంతో అనంతపురం జిల్లా హోసగుడ్డంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురుబ కావేరి (26) అనే వివాహితపై లోకేశ్ అనే టీడీపీ నేత కన్నేశాడు. మార్చి 31 రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నంలో భర్త గోనప్ప కాలు తొక్కాడు. దీంతో మేల్కొన్న గోనప్ప లైటువేసి టీడీపీ నేతను పట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో లోకేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏప్రిల్ 1న కావేరి దంపతులు డి.హీరేహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. టీడీపీ నేత లోకేశ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్నాళ్లు నాటకం ఆడాడు. కాగా.. గురువారం గ్రామంలోకి వచ్చి తిరుగుతూ కనిపించాడు. దీనిని అవమానంగా భావించిన కావేరి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తన భార్య చావుకు లోకేశ్ కారణమని ఆమె భర్త గోనప్ప, తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ అని, రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతా. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెబుతున్నారు. సీఎం జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశా. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్! -
రాయదుర్గంలో విజయ యాత్ర
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు విజయయాత్ర చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని వైఎస్ జగన్ అండతో తాము ఎంత ఉన్నతంగా బతుకుతున్నదీ వెల్లడించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో రాయదుర్గం కళకళలాడింది. వీధివీధిలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. ముందుగా శాంతినగర్‌లోని వైఎస్ విగ్రహానికి మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి వేలాది మందితో ప్రారంభమైన బస్సు యాత్ర తేరుబజారులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంది. అప్పటికే వేలాది మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. వారికి యాత్రలో వచ్చిన ప్రజలు కలిసి ఆ ప్రాంతమంతా జనసంద్రంలా కనిపించింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పడంతో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షం వ్యక్తమైంది. మనకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమం: మంత్రి ఉషశ్రీచరణ్ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలిచి, అనేక కార్యక్రమాలతో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేస్తేనే పేదలకు పథకాలు అందేవని, సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న స్కీమ్‌ల ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు స్కామ్‌ల సీఎం అని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో సీఎం జగనన్నపై ఎల్లో మీడియా దుష్ప్రచారం మరీ ఎక్కువవుతుందని, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుడూ సైనికుడిలా దానిని తిప్పికొట్టాలని అన్నారు. తలరాతలు మార్చిన బ్రహ్మ సీఎం జగన్: మంత్రి గుమ్మనూరు జయరాం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల తలరాతలు మార్చిన బ్రహ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. అట్టడుగు వర్గాలను నవరత్నాల పథకాలతో ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఏకంగా రూ.2.50 లక్షల కోట్లు వారికి పంచిపెట్టారని అన్నారు. 2019లో ఒక ఓటు వేసినందుకే ఇన్ని కోట్లు పేదలకు పంచిపెట్టారని, 2024లో మళ్లీ సీఎం అయితే మన జీవితాలు మరింత బాగుపడతాయని వివరించారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏరోజైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది చోట్లా డిపాజిట్లు కూడా రాని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమి ఉద్దరిస్తారని నిలదీశారు. ముగ్గురు భార్యలకు గ్యారంటీ ఇవ్వలేని పవన్ ఇక ప్రజలకు ఏమి గ్యారంటీ ఇస్తారని అన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు బీసీ కాదని, కే బ్రాండ్ బీసీ అని వ్యాఖ్యానించారు. -
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
మాజీ మంత్రి నారాయణకు షాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియ.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితురాలు ప్రియ ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నారాయణ.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు.. కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్టు వీడియోలో ఆరోపించారు. ఇక, తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియ.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ -
తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర.. మొరాయించిన ప్రచార రథం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ సర్కిల్లో జరగాల్సిన సభను రద్దు చేశారు. ఇరుకుగా ఉండే వినాయక సర్కిల్లో తూతూమంత్రంగా సభ నిర్వహించారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇరుకు సందులో ఓ భవనం పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రసంగించారు. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
అభినందన మరచి అభాండమా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు తీరుపై విమర్శలు
సాక్షి, అనంతపురం: రాజకీయాలు ఎప్పుడూ హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజాశ్రేయస్సుకు, వ్యవస్థల పనితీరుకు దోహదపడాలి. నేతలు హుందాగా వ్యవహరించినప్పుడే అది సాధ్యపడుతుంది. కానీ ప్రతిపక్ష నేతలు రాజకీయ కట్టుబాట్లు పాటించడం లేదు. మరీ ముఖ్యంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యవహారశైలి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటోంది. నిక్కచ్చిగా పనిచేస్తూ జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులను అభినందించాల్సింది పోయి..వారికి రాజకీయ దురుద్దేశాలను అంటగడుతున్నారు. ఇటీవల జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి, ఆయుధాల సరఫరా ముఠాను అరెస్టు చేసిన విషయం విదితమే. దేశవ్యాప్త నెట్వర్క్ కల్గిన ఈ ముఠా ఆట కట్టించడానికి పోలీసులు ఎంతగానో శ్రమించారు. కానీ వారి శ్రమను వృథా చేసేలా కాలవ వ్యాఖ్యలు చేశారు. ముఠా సభ్యుల్లో ఒకరితో అధికార పార్టీ నేతలకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కేసు దర్యాప్తులో పోలీసులకు ఆటంకాలు సృష్టించేలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలను పోలీసు అధికారులు నేరుగా ఖండించాల్సిన పరిస్థితులను కల్పించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి..రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సమర్థతకు నిదర్శనాలెన్నో.. జిల్లా పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. ‘చాట్‌బాట్’ సేవల ద్వారా గతే ఏడాది ఆఖరు వరకు సుమారు రూ.7 కోట్లు విలువ చేసే 4,294 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 2021–22 మధ్యకాలంలో మత్తుపదార్థాలు, పేకాట, మట్కా, గుట్కా, బెట్టింగ్ తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఒక్క జూదాలపైనే 5,236 కేసులు నమోదు చేశారంటే పోలీసు వ్యవస్థ సమర్థతను అర్థం చేసుకోవచ్చు. నకిలీ ఎన్ఓసీలు, ఆధార్‌కార్డుల మార్ఫింగ్, రియల్ ఎస్టేట్ దందాల ముఠాల ఆట కట్టించారు. ఈ కేసుల్లో పలువుర్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. డీజీపీ నుంచి ప్రశంసలు ఆయుధాల సరఫరా ముఠా అరెస్టులో ‘అనంత’ పోలీసులు చూపిన తెగువను స్వయాన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశంసించారు. ఈ ముఠా సభ్యులకు నకిలీనోట్ల చెలామణి మొదలుకుని..గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, కిరాయి హత్యలు తదితర వాటితో సంబంధాలు ఉన్నాయి. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను గత డిసెంబరులో అరెస్టు చేసిన జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టి ఆయుధ నెట్వర్క్ మూలాలను గుర్తించారు. ముఠా సభ్యుల్లో కీలకమైన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌పాల్‌సింగ్ ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆయుధాల తయారీ కేంద్రాలపైనా దాడులు నిర్వహించారు. కొత్త ప్రాంతాల్లో, అది కూడా ఆయుధ ముఠా కేంద్రాలపై దాడులు చేయడమంటే ఆషామాషీ కాదు. అయినప్పటికీ జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి దాడులు చేసి..ఆయుధాలను, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించిన పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించగా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మాత్రం వారి శ్రమను తక్కువ చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు పోలీసు వర్గాలను విస్మయానికి, వేదనకు గురి చేశాయి. కాలవ తీరు హేయం జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి ఆయుధ ముఠాను పట్టుకున్నారు. వారి శ్రమను గుర్తించాల్సింది పోయి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అభాండాలు వేయడం హేయమైన చర్య. స్వార్థ రాజకీయాల కోసం కేసునే తప్పుదారి పట్టించేలా మాట్లాడటం పద్ధతిగా లేదు. – బీటీపీ గోవిందు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎక్కడా రాజీ పడలేదు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల ఆట కట్టించడానికి డీజీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుదీర్ఘంగా ఆపరేషన్ చేశాం. ఈ ముఠాలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్నా ధైర్యంగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తులో ఎక్కడా రాజీపడలేదు. ఈ కేసు విషయంలో అనవసరమైన ఆరోపణలు చేయడం తగదు. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ సంబంధం లేని అంశాలను తేవొద్దు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం. ఆయుధ ముఠాను పట్టుకోవడంలో మన పోలీసులు చూపిన ప్రతిభ రాష్ట్రానికే తలమానికం. డీజీపీ నుంచి రివార్డు అందుకోవడం గర్వంగా ఉంది. దర్యాప్తుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం మంచిపద్ధతి కాదు. – బి.శ్రీనివాసులు, డీఎస్పీ, కళ్యాణదుర్గం -
హైస్పీడ్‌లో మెట్రో పనులు.. రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మధ్య అలైన్మెంట్ ఖరారు!
సాక్షి, సిటీబ్యూరో: ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యన అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులను వేగవంతం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మార్గంలో జరుగుతున్న సర్వే పనులను ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో కాలినడకన వెళుతూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు తగిన సూచనలిచ్చారు. దిశానిర్దేశం ఇలా.. - మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారి జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్‌ను శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు. ఈ కారిడార్ విమానాశ్రయ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ, శివార్లలో నివసించే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఎనీ్వఎస్ రెడ్డి ఆదేశించారు. - ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్‌ను డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఆకాశహరŠామ్యలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి ఊహించలేనంతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, స్కై వాక్‌ల నిర్మాణం ఉండాలని సూచించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. - రాయదుర్గ్ స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు స్టేషన్‌ను పొడిగించనున్న నేపథ్యంలో.. నూతన టెరి్మనల్ స్టేషన్, ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానానికి మార్గాలను అన్వేíÙంచాలన్నారు. స్థలాభావం కారణంగా ఐకియా భవనం తర్వాత రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. - మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించిన కొత్త బ్లూ లైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని అన్నారు. జేబీఎస్ స్టేషన్, అమీర్‌పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండాలని సూచించారు. ఈ రూట్లో ట్రాన్స్‌కో సంస్థ ఇటీవల వేసిన 400 కేవీ అదనపు హై ఓల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో వయాడక్ట్ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని సూచించారు. హై ఓల్టేజ్ అండర్‌గ్రౌండ్ కేబుళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా చూడాలి. సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రే స్టేషన్‌ను నిర్మించే సమయంలో.. ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలని ఎండీ సూచించారు. నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. ∙నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌కు ఆవల నుంచి వచ్చే ప్రయానికులను అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
మెట్రో.. మెట్రో: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోతో సమయం, డబ్బు, ట్రాఫిక్ లేకుండా రాకపోకలు సాగించే వీలుండడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. కొన్ని రోజులుగా మధురానగర్, ప్రశాంత్‌హిల్స్ కాలనీ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్య కాలనీ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ల్యాంకోహిల్స్, నానాక్‌రాంగూడ ప్రాంతాలలో మెట్రోపై అందరూ చర్చించుకుంటున్నారు. గచ్చిబౌలి డివిజన్ అనగానే ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఉన్నత విద్యా, శిక్షణ సంస్థలకు నిలయం. అలాంటి ప్రాంతానికి మెరుగైన రవాణా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మెట్రో రూటు ఇదే.. ►రాయదుర్గం సర్వే నంబర్–83కి చేరువలోనే ఉన్న రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తారు. ►ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్కు కూడలి చేరువ నుంచి మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాం గూడ ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి పక్కనే ఉన్న సరీ్వస్ రోడ్డు ద్వారా నార్సింగి మీదుగా శంషాబాద్ వరకు మెట్రో రైలు నడపాలని భావిస్తున్నారు. ►ఈ మెట్రోతో గచి్చ»ౌలి, మధురానగర్, రాయదుర్గం, ప్రశాంత్‌హిల్స్, ఖాజాగూడ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్యకాలనీ, ల్యాంకోహిల్స్, నానక్‌రాంగూడ, పరిసరాల్లోని వారికి మేలు కలుగుతుంది. ►ఇటీవల ఈ ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు విరివిగా పెరగడం, ఇంకా పలు భవనాలు నిర్మాణంలో ఉండడంతో వీరంతా సంతోíÙస్తున్నారు. ►ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల లోని ఐటీ, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా మెట్రో రాకతో సొంత వాహనాలు పక్కనపెట్టి మెట్రోలోనే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతోనే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీరామారావు ప్రత్యేక చొరవతోనే గచ్చిబౌలి డివిజన్‌కు మెట్రో సౌకర్యం ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే లింకురోడ్లు, ఫ్లైఓవర్లతో చాలా వరకు తగ్గినా ఈ మెట్రోతో మా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం మరింతగా చేరువ కానుండడంపై అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది. –సాయిబాబా, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ రైలు సౌకర్యం వస్తుందని అనుకోలే.. మా మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, పరిసరాలకు మెట్రో సౌకర్యం కలుగుతుందనే భావన ఎంతో సంతోషానిస్తోంది. ఇటీవల అపార్ట్మెంట్లు విపరీతంగా వెలిశాయి. దీనికితోడు ఐటీ సంస్థలు, స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. అది చాలా వరకు తగ్గుతుంది. – రమేష్‌గౌడ్,మధురానగర్ మెట్రో రావడం చాలా సంతోషం.. మెట్రోతో ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. మియాపూర్, మాదాపూర్ వరకు వచి్చంది. మాకు కూడా వచి్చంటే బాగుండు అనుకున్నం. శంషాబాద్, నార్సింగి, గచ్చి»ౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలతోపాటు ఇతర చోట్లకు వెళ్ళేందుకు సమయం, డబ్బు ఆదాతోపాటు వేగంగా Ðð ళ్లేందుకు అవకాశం కలుగుతుంది. –పొన్నయ్య, ఖాజాగూడ -
టీహబ్–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్–2లో సుమారు 200 అంకుర సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలతోపాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. జూన్ నెలలో ఐటీ శాఖ ఈ హబ్‌ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబరు తొలి వారం నుంచి పలు సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించినట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా సుమారు రెండు వేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. టీహబ్–2 ప్రత్యేకతలివే.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతం కావడంతో టీహబ్–2 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ► ఈ కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని..ప్రపంచంలోనే రెండవదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ► కాగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీహబ్ మొదటిదశను ఐఐఐటీ–హైదరాబాద్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్,నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నెలకొల్పారు. ► స్టారప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు,ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకేచోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. ► అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ స్ఫూర్తితో.. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టీహబ్ మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. తొలిదశ టీహబ్‌లో ఏడేళ్లుగా ఇందులో 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడుపోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ,విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతికసహకారం అందిస్తున్నాయి. ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమో డే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. (క్లిక్: బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’) ఐటీ భూమ్..హైహై టీహబ్ ఒకటి, రెండోదశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత పురోగమించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. (క్లిక్ చేయండి: పండక్కి కొత్త బండి కష్టమే!) -
లిక్కర్ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పొలిటికల్ హీట్ ఇంకా తగ్గలేదు. లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. దీంతో తెలంగాణలో ఊహించని విధంగా పొలిటికల్ టెన్షన్ చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ శుక్రవారం ఉదయం మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇక, హైదరాబాద్‌లో 25 ప్రాంతాల్లో 25 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని రాయదుర్గం, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ దక్కించుకున్న కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. లిక్కర్ స్కామ్‌పై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ తెలంగాణలోనే చెబుతామన్నారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఇది కూడా చదవండి: సర్వే రిపోర్టులతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు ! -
కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని..
బెళుగుప్ప(అనంతపురం జిల్లా): దశాబ్దాలు వేగంగా మారుతున్నాయి.. సాంకేతిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషికి చావే లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కుల జాడ్యం మాత్రం మనుషుల మధ్య చిచ్చుపెడుతూనే ఉంది. తాజాగా కుల పట్టింపులకు ఓ ప్రేమ జంట బలైంది. తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో నిండు నూరేళ్లు కలసి బతకాల్సిన ఆ యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి రాయదుర్గం పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకన్య (20) స్థానిక నర్సరీలో పనిచేసేది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన బోయ ధనుంజయ (23) పట్టణంలోని ఓ సెల్‌ఫోన్ రిపేరీ షాపులో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలిపారు. అయితే కులాలు వేరు కావడంతో ఇరువైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన శ్రీకన్య, ధనుంజయ కలిసి బతకలేమని భావించారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ బెళుగుప్ప మండలం నరసాపురం సమీపంలోని ఓ తోట వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషద్రావకం తాగారు. ఆ తర్వాత తమ స్నేహితులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని తెలిపారు. దీంతో వారు బెళుగుప్ప పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ వెంటనే 108 వాహనం రావటంతో అందులో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకన్య గురువారం తెల్లవారుజామున, రాత్రి ధనుంజయ మృతి చెందారు. ఈ ఘటనపై యువతి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు. -
అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల
సాక్షి, అనంతపురం (డి.హీరేహాళ్, రాయదుర్గం): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేన రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. స్వయాన ఆయన భార్య స్రవంతి మంగళవారం మీడియాకు ఆధారాలు అందజేశారు. ఆమె తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన స్రవంతికి డి.హీరేహాళ్ మండలంలోని మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేనతో 2008 సంవత్సరంలో వివాహమైంది. ఇద్దరు పిల్లలు జన్మించే వరకు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత అనంతసేన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆలయానికి వచ్చే మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల వేసేవాడు. ఈ క్రమంలో కొందరిని లొంగదీసుకుని రాసలీలలు సాగించాడు. మరోవైపు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించాడు. ఆలయానికి వచ్చే మహిళలు ఎంతో అందంగా ఉంటారని, నీవు మాత్రం వారిలా లేవంటూ తరచూ మనోవేదనకు గురిచేసేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో స్రవంతి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపారు. తర్వాత అతని సెల్ఫోన్లో వీడియోలు, ఫొటోలు చూసి ఆమె విస్తుపోయింది. పరాయి మహిళలతో రాసలీలల వ్యవహారంపై భర్తను నిలదీసింది. అయినా అతను పద్ధతులు మార్చుకోలేదు. పైగా భార్యను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసి ఆమె పిల్లల సహా రాత్రికి రాత్రే పుట్టింటికి వెళ్లిపోయారు. తర్వాత అతను స్రవంతికి మతిస్థిమితం లేదంటూ విడాకుల నోటీసు పంపించాడు. పెద్దమనుషుల సమక్షంలో ఘర్షణ విడాకుల నోటీసు విషయంపై మాట్లాడేందుకు స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం మురడికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకుడు అనంతసేనను నిలదీశారు. అలాగే అతను ఇతర అమ్మాయిలను ముద్దు పెడుతూ అభ్యంతరకరంగా దిగిన ఫొటోలను పెద్ద మనుషుల సమక్షంలో చూపడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. పోలీసులు, పెద్దలే తనకు న్యాయం చేయాలని స్రవంతి వేడుకున్నారు. అనంతరం ఆమె రాయదుర్గం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. -
Anantapur: కాలవా.. కంత్రీ వ్యవహారాలు మానుకో
సాక్షి, అనంతపురం: ‘రాయదుర్గం ప్రజల దీవెనలతో రాష్ట్రానికి మంత్రిగా చేశావ్. నీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. అదే మేము ప్రజలకు మంచి చేస్తుంటే సంతోషించాల్సింది పోయి కంత్రీలా వ్యవహరిస్తావా’ అంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన రాయదుర్గంలోని తన కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ ముస్తాక్, జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహేష్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాలవ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో కూర్చొని చెంచాగాళ్లయిన కొందరికి డైరెక్షన్ ఇస్తూ తమను అడ్డుకోవాలని కుట్ర పన్నడం, దాన్ని ఏదో జరిగిపోయినట్టు ఎల్లోమీడియా చిత్రీకరించడం, ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉన్నట్టు దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. డి.కొండాపురంలో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో మూడు రేషన్‌కార్డులుంటే రూ.2.40 లక్షలు, వడ్రవన్నూరులోనూ టీడీపీ నాయకుడి కుటుంబానికి రూ.2.50 లక్షల ప్రభుత్వ సహాయం అందిందని, అందుకు సంబంధించిన బ్రోచర్లను తాము అందించామని తెలిపారు. ఇలా లబ్ధి పొది కూడా పచ్చ నాయకులు విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చదవండి: (పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్) ఐటీ కట్టినోడికి అమ్మఒడి ఎలా ఇవ్వాలి? ‘రాయదుర్గం 8వ వార్డులో టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్తకు గత రెండేళ్లు అమ్మఒడి వచ్చింది. ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినందున జాబితాలో పేరు రాలేదు. అంతమాత్రాన ఉద్యోగులు, వలంటీర్ పట్ల రౌడీలా ప్రవర్తిస్తాడా? ఇంటి వద్దకెళ్లిన నా పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడమని డైరెక్షన్ ఇస్తావా కాలవా? అతనిపై వలంటీర్ ఫిర్యాదిస్తే నీవు గుంపును వెంటేసుకుని రచ్చ చేస్తావా? కర్ణాటక రాష్ట్రం రాంపురంలో బిందెల కంపెనీ పెట్టి ఆ ప్రాంత ప్రజలతో చీపుర్లతో కొట్టించుకున్న వ్యక్తికి నీలాంటి ద్రోహులు అండగా నిలవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నార’ని విప్ కాపు అన్నారు. ఇటీవల కణేకల్లులోనూ అప్పులు ఎగ్గొట్టిన టీడీపీ నాయకుడికి కాలవ అండగా నిలవడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కాలవ.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యభిచారిగా మారిన అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టకరమన్నారు. అప్పుడేం పీకావ్? ‘రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావ్? పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఎందుకివ్వలేదు? మీ అసమర్థత వల్లే ఈ రోజు మా ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాల్సి వచ్చింది. నీ హయాంలో టెంకాయ కొట్టిన రోడ్లను సైతం మేమే బాగుచేశాం. దమ్మూ ధైర్యముంటే మాతో పాటు గడప గడపకూ రా! నీవేం చేశావో.. మేమేం చేస్తున్నామో ప్రజలనే నేరుగా అడుగుదాం’ అని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. నీవొక అడుగు ముందుకేస్తే..తాను పదడుగులు ముందుకేస్తానని, తగ్గేదేలేదని అన్నారు. సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్లు దేవరాజు, పద్మ, శారద, గోవిందరాజులు, ఫకృద్దీన్, కృష్ణమూర్తి, పొరాళ్ల శివ, వైజాక్ రిబ్కా, గుమ్మఘట్ట మండల కన్వీనర్ బోయ మంజునాథ, ఎస్సీసెల్ రాష్ట్రకార్యదర్శి గోవిందు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మార్కెట్‌యార్డు డైరెక్టర్ నారాయణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో కథ కంచికేనా..?
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం లండన్.. మన దేశంలోని కోల్‌కతా తరహాలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని మూడేళ్లక్రితం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్ రూట్లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విదితమే. ఇదీ అండర్‌గ్రౌండ్ మెట్రో ప్లాన్.. రాయదుర్గం–శంషాబాద్ మార్గంలో 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయాల్సిన రూట్లో కేవలం 3 కి.మీ. మార్గంలో... శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు భూగర్భ మెట్రో ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించింది. విమానాల ల్యాండింగ్.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించడం విశేషం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించి మూడేళ్లు గడిచినా అడుగు ముందుకుపడడంలేదు. ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా..? మొదటి దశ తరహాలో పబ్లిక్ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందా అన్న అంశంపై సస్పెన్స్ వీడడం లేదు. (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) ఎయిర్పోర్ట్ మెట్రో ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ వి మానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. ► కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను డిజైన్ చేశారు. ► ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసింది. సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు అవస్థలుండవు. ► ఈరూట్లో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ► స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ► మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. స్థలపరిశీలన కూడా పూర్తైంది. (క్లిక్: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ!) -
'అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత
సాక్షి, తాడిపత్రి: అదనపు కట్నం తీసుకురాలేదన్న కక్షతో భార్యను, కన్నబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడు. అనంతరం తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. రాత్రంగా చలిలోనే భర్త ఇంటి ఎదుట బిడ్డతో కలిసి బాధితురాలు నిరీక్షించింది. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బాధితురాలు శ్రుతి వేదన ఆమె మాటల్లోనే.. ‘మాది రాయదుర్గం. నాన్న బి.భాస్కర్, అమ్మ శకుంతల. 2014లో నాకు తాడిపత్రిలోని సంజీవనగర్ మూడో రోడ్డుకు చెందిన డి.శ్రీకృష్ణ కిషోర్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.2లక్షల కట్నంతో పాటు 18 తులాల బంగారు నగలను మా తల్లిదండ్రులు ఇచ్చారు. అప్పట్లో ఆయన శ్రీరామ్ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొన్ని నెలలు మా జీవితం సాఫీగానే సాగింది. 2015లో ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు. అదే ఏడాది డిసెంబర్లో మాకు కుమార్తె శాన్విత జన్మించింది. ఉద్యోగం లేక ఖాళీగా ఇంటి పట్టునే ఉంటున్న నా భర్త, అతని తల్లి లక్ష్మీదేవి, చెల్లెలు అర్చన (2012లో కర్నూలుకు చెందిన వ్యక్తితో వివాహమై భర్తను వదిలి పుట్టింటిలోనే ఉంటోంది) నన్ను తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. రూ. 5లక్షలు తీసుకుని రావాలంటూ పుట్టింటికి పంపారు. అయితే అంత పెద్ద మొత్తం తామిచ్చుకోలేమని అల్లుడికి మా అమ్మ తెలిపింది. అయితే మీ కూతురిని మీ ఇంట్లోనే పెట్టుకోండి అంటూ పుట్టినింటిలోనే నన్ను వదిలేసి వచ్చేశారు. పెద్దల జోక్యంతో తిరిగి అత్తింటికి చేరుకున్నా.. అప్పటి నుంచి నాపై వేధింపులు ఎక్కువయ్యాయి. చదవండి: (అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు) విడాకులకు దరఖాస్తు.. నాకు తెలియకుండానే మా ఆయన 2018లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించాను. దీంతో శనివారం రాత్రి నా భర్త కృష్ణకిషోర్‌తో పాటు వారి అమ్మ, చెల్లెలు నన్ను, పాపను కొట్టి ఇంట్లోనుంచి బయటకు గెంటేశారు. రాత్రి చలికి తట్టుకోలేకపోయాం. దిక్కుతోచని స్థితిలో 100కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చారు. నా భర్తకు నచ్చజేప్పేందుకు సీఐ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారు వినలేదు పైగా తన తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. శనివారం రాత్రంతా ఇలా ఇంటి బయటే ఉండిపోయా. నా భర్తకు నచ్చచెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి.’ అమ్మా నాన్నను కలపండి సారూ ‘మా డాడీ మా అమ్మను వదిలేసి పోతానంటున్నాడు. నాకేమో డాడీ, మమ్మీ ఇద్దరూ కావాలి. మా అమ్మ, నాన్నను కలపండి సారూ..’ – శాన్విత చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!)