Republic Day celebration
-
ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రేస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్- మాట, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరాన్నంటాయి. మాట, నాట్స్‌తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని, ప్రసంగించారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ అలరించారు.ఇక జాతీయ జెండాలను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుడ్ మరియు వెండర్ స్టాల్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌కు సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!) -
ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
నేడు కర్తవ్యపథ్ లో 75వ రిపబ్లిక్ డే వేడుకలు
-
రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రత్యక్షంగా చూడాలంటే..
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించాలనే ఆసక్తి కలిగినవారి కోసం ఈ వివరాలు.. పరేడ్ జరిగే సమయం రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26న ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు సాగుతుంది. ఈ పరేడ్‌ను 77 వేల మంది కూర్చుని తిలకించవచ్చు. ఇందుకు ఏర్పాటు చేసిన కుర్చీలలో 42 వేల సీట్లను సాధారణ పౌరులకు కేటాయించారు. ఇది కూడా చదవండి: ‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు? గణతంత్ర దినోత్సవ థీమ్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. ముఖ్య అతిథి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ముందుగా జనవరి 25న జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోదీని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న ఆయన రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు హాజరవుతారు. పరేడ్ టిక్కెట్ ధర ఎంత? ఎలా తీసుకోవాలి? రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రిజర్వ్డ్, అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. అన్రిజర్వ్డ్ సీట్లకు రూ. 500, రూ. 100 రూ. 20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయాలంటే.. 1) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2) పేరు, ఈ- మెయిల్ ఐడీ, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్లో వచ్చిన ఓటీపీని తెలియజేయడం ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాల్సి ఉంటుంది. 3) పరేడ్‌లో ఎఫ్డీఆర్ రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ ది రిట్రీట్ ఈవెంట్లు ఉంటాయి. దీనిలో టిక్కెట్ కొనుగోలుదారు తనకు కావలసిన ఈవెంట్‌ను ఎంచుకోవచ్చు. 4) టిక్కెట్ కొనుగోలుదారు తన ధృవీకరణ కోసం పేరు, చిరునామా, వయస్సు, లింగం, ఫోటో ఐడీ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్) జెరాక్స్ కాపీని సమర్పించాలి. 5) కొనుగోలు చేయాలనుకుంటున్న టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోవాలి. టిక్కెట్ల వర్గం ప్రకారం చార్జీలను చెల్లించాలి. 6) టిక్కెట్ల చార్జీలను చెల్లించిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో పాటు బుకింగ్ వివరాలు కలిగిన నిర్ధారణ ఇమెయిల్, ఎస్ఎంఎస్ అందుతుంది. 7) ఈ-టికెట్ హార్డ్ కాపీని అందుకున్నాక, టిక్కెట్ కొనుగోలుదారు తన ఒరిజినల్ ఫోటో. ఐడీలను పరేడ్‌లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లాలి. వేదిక ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రవేశం పొందవచ్చు. -
ప్రగతి భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్లో జాతీయ పతాకా విష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్తూపాన్ని సందర్శించి జ్యోతి ప్రజ్వలన చేయడంతో పాటు అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, మధు సూదనాచారి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎంవో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
గణతంత్ర దినోత్సవం.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: నేడు స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం తన సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘‘ఇప్పటికి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ కర్తలను స్మరించుకుందాం. వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం’’ అని సీఎం ట్విటర్లో పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం. #RepublicDay — YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2023 -
చిన్నారుల వెరైటీ గణతంత్ర వేడుకలు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు వాడవాడల ఘనంగా జరిగాయి. పల్లెపట్నం తేడా లేకుండా అన్ని చోట్ల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్కూల్లు, కార్యాలయాలు, స్వచ్చంధ సంస్థలు అన్ని ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాయి. కానీ ఒక హిల్ ఏరియాకి చెందిన చిన్నారులు నిర్వహించిన వేడుక మిగిలిన వాటికి భిన్నంగా నిలిచింది. ఎక్కడో ముంబైలో ఉన్న ఆనంద్ మహీంద్రా ఆ వేడుకలు గుర్తించేలా చేసింది. కల్మషం లేని మనుసుతో ఎంతో ఉత్సాహంతో తమ దగ్గరున్న వనరులతోనే ఆ చిన్నారులు వేడుకలు నిర్వహించారు. అచ్చంగా రిపబ్లిక పరేడ్‌ను తలపించేలా కొందరు లయబద్దంగా శబ్ధం చేస్తూంటే మధ్యలో మరో బుడత సైనిక కవాతు నిర్వహించాడు. ఆ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా వెంటనే తన పేజీపై షేర్ చేశారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ చిన్నారుల ఉత్సాహం, వనరులను వారు వినియోగించుకున్న తీరు ముచ్చటగా ఉంది. జాతీయ వేడుకలకు సంబంధించి గొప్ప వాటిలో ఇదీ ఒకటి అన్నట్టుగా కామెంట్ చేశారు. This just showed up in my #signalwonderbox No idea which state it’s from. But to me, their enthusiasm & resourcefulness made this one of the grandest Republic Day celebrations. pic.twitter.com/Uk2kfVFKC2 — anand mahindra (@anandmahindra) January 28, 2022 ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిన్నారులు పరేడ్ ఎంతో బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది పాత వీడియో అంటూ చెప్పగా.. వీడియో ఎప్పటిదైనా ఇండియన్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఎనర్జీ ఇస్తుందంటూ కౌంటర్లు ఇస్తున్నారు. చదవండి: సామాన్యుడితో ఆనంద్ మహీంద్రా డీల్ పూర్తి.. పాత బండికి కొత్త బొలెరో అందజేత -
రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటన జబల్పూర్ స్టేడియంలో జరిగింది. కాగా, అధికారులు వివిధ కార్యక్రమంలో భాగంగా డ్రోన్లను ప్రదర్శించారు. అయితే, ఈ డ్రోన్లు.. రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన వారి మీద పడ్డాయి. వేడుకలలో భాగంగా గిరిజన నృత్యం కొనసాగుతుంది. ఈ క్రమంలో.. డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పి నృత్యం చేస్తున్న వారిమీద పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఇందు కుంజమ్(38), గంగోత్రి కుంజమ్(18)లుగా గుర్తించారు. వీరు గిరిజన తెగకు చెందిన వారిగా.. దిండోరి జిల్లా నుంచి గణతంత్ర వేడుకలకు చూడటానికి జబల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరు పండిత్ రవి శుక్లా స్టేడియంలో గిరిజన నృత్యం చేయడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
ప్రపంచంపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
న్యూఢిల్లీ: కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రపంచదేశాల్లో పరిమితంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సాధారణ రోజుల్లో కన్నులపండువగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఆయా దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఈ సంబరాల్లో పాల్గొని జాతీయభావం చాటి చెప్పారు. చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లో భారత 72వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. చైనా, సింగపూర్, ఆస్ట్రేలియాల్లోని ప్రవాస భారతీయులు పరిమితంగా జరుపుకున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆన్లైన్లో వీక్షించారు. చైనా రాజధాని బీజింగ్‌లో భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భారత రాయబార కార్యాలయంపై భారత రాయబారి విక్రమ్ మిశ్రి జాతీయ పతాకం ఎగురవేశారు. బీజింగ్‌లోనూ, పరిసర ప్రాంతాల్లో కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అధికారులు, వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం చేశారు. భారత జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగాన్ని మిశ్రి చదివి వినిపించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాము గణతంత్ర వేడుకలను ఎంతో ఉత్సాహంగా చేసుకున్నట్లు భారత హై కమిషన్ ట్విటర్లో తెలిపింది. చార్జ్ డి అఫైర్స్ సురేశ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్రపతి సందేశంలోని కొన్ని భాగాలను వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి గీతాలను ఆలపించినట్లు వెల్లడించింది. కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ బంగ్లాదేశ్‌లో భారతీయులంతా గణతంత్ర దినోత్సవాలను చేసుకున్నట్లు ఢాకా హై కమిషన్ ట్వీట్ చేసింది. హై కమిషనర్ విక్రం దొరైస్వామి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హై కమిషన్‌లో హై కమిషనర్ గోపాల్ బాగ్లే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా హై కమిషనర్ గీతేష్ శర్మ మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్ పి.కుమారన్ గణత్రంత ఉత్సవాలకు సారథ్యం వహించారు. రాష్ట్రపతి ఉపన్యాసాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు. -
బంగారు తెలంగాణకు బలమైన పునాదులు
సాక్షి, హైదరాబాద్: ‘ఆరు దశాబ్దాల వలస పాలనతో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షే మం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లోనూ ఎంతో పురోగతి సాధించి, యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆకలి దప్పులు, ఆత్మహత్యలు లేని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ‘కొత్త పథకాలు, కొత్త చొరవ, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకం..’అని అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన 72వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. పదోన్నతుల తర్వాత ఒకేసారి ఖాళీల భర్తీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్తో జీతాలు పెంచింది. తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, 108 సిబ్బంది తదితరుల వేతనాలు పెంచింది. తాజాగా ప్రతి ఉద్యోగికీ, ప్రతి పెన్షనర్‌కు మరోసారి వేతనాలు పెంచాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితినీ పెంచాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌కు కళ్లెం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని, ప్రభావాన్ని, ప్రాణనష్టాన్ని గణనీయంగా అరికట్టగలిగింది. కోవిడ్ మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.4 శాతం అయితే తెలంగాణలో 0.54 శాతం మాత్రమే. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు అయిన వైద్య ఆరోగ్య సిబ్బంది, రేయింబవళ్లు సేవలందించిన పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద కార్యకర్తలను మనన్ఫూర్తిగా అభినందిస్తున్నా. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గడంతో బడ్జెట్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆదాయం తగ్గినప్పటికీ పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా కోత విధించలేదు. ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు పల్లె సీమల రూపురేఖలు మార్చాలనే మహదాశయంతో ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’కార్యక్రమం నమ్మశక్యం కాని అద్భుత ఫలితాలు అందించింది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందాయి. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. పట్టణాల్లో ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీరు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ప్రభుత్వం తాగునీటిని సరఫరా చేస్తోంది. 97 శాతం మంది పట్టణ వాసులు ఉచితంగా సురక్షిత మంచినీటి సౌకర్యం పొందగలుగుతున్నారు. పట్టణాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు ఇస్తోంది. మిషన్ భగీరథతో రాష్ట్రంలో మంచినీటి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. రాష్ట్రంలోని 23,968 ఆవాస ప్రాంతాలకు నేడు సురక్షిత మంచినీరు ప్రతిరోజూ అందుతోంది. 98.46 శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ప్రకటించడం మనం సాధించిన ఘనతకు దక్కిన గుర్తింపు. అన్నపూర్ణగా మారిన రాష్ట్రం వరి పంట సాగు 35 లక్షల ఎకరాల నుంచి కోటి 4 లక్షల ఎకరాలకు పెరగడం రాష్ట్రంలో మారిన వ్యవసాయ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రం నేడు దేశానికి అన్నపూర్ణగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరందడం ప్రారంభమయింది. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయడం ద్వారా దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రైతుబంధు కింద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.7,351 కోట్లను ప్రభుత్వం అందించింది. ‘రైతుబీమా’పథకం ప్రారంభించిన నాడు ఏడాది కిస్తీ రూ.630 కోట్లు ఉంటే, నేడు రూ.1,141 కోట్లకు చేరింది. రైతు కుటుంబాల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొత్తం కిస్తీ చెల్లించి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ధరణి పోర్టల్ 100 శాతం విజయవంతమైంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నడుస్తోంది. విద్యుత్, వైద్య రంగాల్లో పురోగతి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాడు స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 7,888 మెగావాట్లు కాగా, నేడు 16,245 మెగావాట్లకు చేరింది. తలసరి విద్యుత్ వినియోగం వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ కిట్ పథకం.. గర్భిణీలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, ప్రసవ సమయంలో జరిగే మరణాలు గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో.. తెలంగాణ వరుసగా మూడో ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రకటించడం వైద్యరంగంలో రాష్ట్రం సాధించిన పురోగతికి నిదర్శనం. 3.67 శాతం పెరిగిన పచ్చదనం వచ్చే విద్యా సంవత్సరం కోసం జరిగే పోటీ పరీక్షలు, ఎంట్రెన్స్ టెస్టులకు సిద్ధం చేసే విధంగా 9, ఆపై క్లాసుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 210.68 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. 14.59 లక్షల మందికి ఉపాధి టీఎస్–ఐపాస్ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రానికి 14,338 పరిశ్రమలు వచ్చాయి. 14,59,639 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక ఐటీ విధానం వల్ల విశ్వ విఖ్యాత ఐటీ కంపెనీలు తెలంగాణలో కార్యాలయాలు ప్రారంభించాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ రూ. 20,761 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో డేటా సెంటర్ రీజియన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దుష్ట శక్తులపై ఉక్కుపాదం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం రాజీలేని వైఖరి అవలంభిస్తోంది. సంఘ విద్రోహ శక్తులు, మహిళలను వేధించే దుష్టుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం తెలంగాణలోనే ఉండడం గమనార్హం. పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. సైనిక వందనం స్వీకరించిన గవర్నర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని భారత వాయుసేనకు చెందిన ఎయిర్ వార్ఫేర్ కళాశాల బలగాలు, టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైనిక కవాతు ఆకట్టుకుంది. గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించారు. -
సవాళ్ల మధ్య గణతంత్ర సంబరం
సరిగ్గా దేశ రాజధాని సరిహద్దులో రైతుల నిరసన మొదలై ఐదు నెలలా రెండు వారాలు దాటింది. గత నెలంతా ఢిల్లీ ఉష్ణోగ్రత సుమారు 9 డిగ్రీలను మించలేదు. గడ్డకట్టే చలిలో ఇప్పటికి 120 మంది రైతులు చనిపోయారని అంచనా. అయినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. రైతులూ పిడికిళ్లు దించడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలని కోరుతున్న రైతులకూ, వ్యవసాయ చట్టాల తోనే నూతన అధ్యాయానికి తెరలేస్తుందని నమ్ము తున్న కేంద్రానికీ మధ్య స్పష్టమైన రాజీ కుదరడం లేదు. రైతులే దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతు భారతంలో అన్నదాతలు నిరసనలో ఉన్నవేళ గణ తంత్ర దినోత్సవం వచ్చింది. ఏడాది కాలంగా కోవిడ్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను పాతాళంలోకి నెట్టింది. ఎంతోమంది నిరు ద్యోగులైనారు. రోగానికి విరుగుడుగా వచ్చిన కోవిడ్ టీకాల పంపిణీ ప్రారంభమైనప్పటికీ, ఎన్నో దేశాలు టీకా దిగుమతుల కోసం మనవైపు చూస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వాటి పారదర్శకత మీద జనానికి ఉన్న సందేహాలు సంపూర్ణంగా నివృత్తి కాలేదు. మరోవైపు సరిహద్దుల్లో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తోందనీ, బలహీనంగా నిర్ణయమై వున్న సరిహద్దు లను ఏకపక్షంగా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి అక్కడి నివాసాల్లోకి పంతంగా జనాన్ని తరలిస్తోందనీ వార్తలు వస్తున్నాయి. బహుశా చెప్పుకోవడానికి పెద్దగా ఏ సానుకూలాంశమూ లేని చిత్రమైన వేళ ఈ గణ తంత్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం రావడం దానికదే మహోజ్వల ఘట్ట మైనప్పటికీ, ఆ వచ్చిన స్వాతంత్య్రం తెల్లకాగితం లాంటిది. గణతంత్ర దినోత్సవం రోజే దేశం ఏ దిశగా సాగాలో నిర్దేశించే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చు కున్నాం. స్వాతంత్య్రం రావడానికి రెండు దశాబ్దాల క్రితమే, అంటే జనవరి 26, 1930 నాడే అప్పటి కాంగ్రెస్ ‘సంపూర్ణ స్వరాజ్యం’ కావాలని తీర్మానిం చింది. దాన్ని గుర్తుచేసుకుంటూనే రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దేశ నడవడికను శాసించే, దేశ నిర్మాణాన్ని రూపొందించే అడుగులు తొలి గణతంత్ర దినోత్సవంతోనే పడటం మొదలైంది. సుమారు ఐదువేల ఏళ్ల మహత్తర చరిత్ర కలిగిన భారతదేశం 71వ గణతంత్ర దినోత్సవం జరుపు కొంటుండటం ఒక వక్రోక్తి. ఇదే గడ్డ– మతం ఆధా రంగా రెండు దేశాలుగా విడిపోయి సుమారు ఇరవై లక్షలమంది శవాలుగా నేలకూలడం అంతటి జ్ఞానమూ మనిషిని వివేకవంతుడిని చేయలేదని తెలియజెప్పిన కఠిన వాస్తవం. రాజ్యాంగం నిర్దేశించుకున్న లౌకక స్ఫూర్తికి విరుద్ధమైన వాతావరణం నెలకొంటున్నదనే అనుమానపు మబ్బులు తిరిగి కమ్ముతుండటం ఇంకా మనల్ని మనం తర్కించుకోవాల్సిన ఆవశ్యకతను గట్టిగా కల్పిస్తోంది. పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నట్టుగా భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతోందా అనే భయాలను కేంద్ర ప్రభుత్వం పోగొట్టాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయానని ఒప్పుకోకపోవడమే కాకుండా, తీవ్ర విధ్వంసానికి ఒడిగట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ఆ దేశం పకడ్బందీగా గద్దె దించింది. దానికి అక్కడి వ్యవస్థల బలమే కారణమ న్నారు విశ్లేషకులు. వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ కొన్నేళ్లుగా ఇండియాలో వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నవాళ్లను సామాజిక మాధ్య మాల్లో దూషణలతో నోళ్లు మూయించడం తేలిక. కానీ వాళ్లు లేవనెత్తుతున్న అంశాల్లో స్వీకరించగలిగిందాన్ని స్వీకరించడం విజ్ఞుల లక్షణం. ఇంతటి విశిష్ట సందర్భాన్ని నిందలకు మాత్రమే సరిపుచ్చకూడదు. ఎందరో మహనీయుల ఆలోచనా ధార ఈ భారతాన్ని నిర్మించింది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో కూడా దేశ అంతస్సారం అందుకే చెక్కుచెదరలేదు. ఎన్నో గొప్ప నాగరికతలు చరిత్ర పుస్తకాల పుటలకే పరిమితమైనప్పటికీ భారతదేశం ఇంకా ఆ గత వైభవానికి 130 కోట్ల జనాభాతో సాక్ష్యంగా నిలిచివుంది. అలాంటి దేశాన్ని ఎన్నో సమ స్యలు, సవాళ్లు ఉన్నప్పటికీ గాడి తప్పకుండా కాపాడ గలిగేది రాజ్యాంగమే. రాజకీయం మాత్రమే పరమా వధి కాని పార్టీలూ, జనాకర్షణే పరమావధి కాని ప్రభు త్వాలూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా ఈ గణతంత్ర దినోత్సవ వేళ పునరంకితం కావాలి. – పి. శివకుమార్ -
గణతంత్ర వేడుకల్లో రఫేల్ జిగేల్
న్యూఢిల్లీ: భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా ఆంక్షల మధ్య జరగనున్నాయి. ఈ నెల 26న దేశ సైనిక సత్తా చాటడానికి త్రివిధ బలగాలు సిద్ధమయ్యాయి. అయితే కోవిడ్–19 కారణంగా భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రజా సందర్శనకి ఆంక్షలతో పాటు ఎన్నో కొత్త శకటాలు ఈ ఏడాది దర్శనమివ్వనున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఈ ఏడాది పెరేడ్లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్ లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్ ఈ సారి ప్రదర్శనలో పాల్గొంటారు. భారత వాయుసేనకు చెంది తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిధ్యం వహించబోతోంది. లేహ్ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. థిక్సే కొండలపై ఉన్న ఈ మఠం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వబోతోంది. భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 భారత్–పాక్ యుద్ధ సమయంలో నావికా దళ ఆపరేషన్‌ను శకటంగా ప్రదర్శిస్తోంది. ఇక వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు భారీ ర్యాలీకి సిద్ధం కావడంతో ఎలాంటి పరిణామలు ఎదురు కాబోతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. కరోనా ఆంక్షల ప్రభావం కోవిడ్–19 ఆంక్షల ప్రభావంతో ఈ సారి ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తొలుత రావడానికి అంగీకరించినప్పటికీ కరోనా విజృంభణతో పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో అయిదు దశాబ్దాల తర్వాత ముఖ్య అతిథి లేకుండానే వేడుకలు జరగనున్నాయి. గతంలో 1952, 1953, 1966లలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి కరోనా కారణంగా సందర్శకుల సంఖ్యని బాగా తగ్గించారు. గత ఏడాది లక్షా 50 వేల మందికి అనుమతినిస్తే ఈ సారి 25 వేల మంది హాజరుకానున్నారు. ఇక మీడియా సిబ్బంది సంఖ్య 300 నుంచి 200కి తగ్గించారు. ఈ సారి పాఠశాల విద్యార్థులు పెరేడ్లో ఉండరు. ఇక 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఇండియా గేట్ లాన్స్‌లోకి మాత్రమే అనుమతినిస్తారు. పెరేడ్ సమయాన్ని కూడా తగ్గించారు. ఇండియా గేట్ దగ్గర నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పెరేడ్‌కు అనుమతినిచ్చారు. ఇక శకటాలు మాత్రం ఎర్రకోట వరకు వెళతాయి మాజీ సైనికాధికారులు, మహిళా అధికారులు పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేశారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించే మోటార్ సైకిల్ స్టంట్స్ కూడా ఈ సారి ఉండవు. శనివారం రాజ్‌పథ్‌లో ఫుల్ డ్రెస్ రిహార్సల్లో భారత యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి -
గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని?
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆçహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 27న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే వచ్చేయేడాది బ్రిటన్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని, బోరిస్ ఆహ్వనించారు. ప్రధాని నిర్ణయంపై అంతా ఆశ్చర్యపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో భారత్, బ్రిటన్ల మధ్య సత్సంబంధాలను పెంచుకోవడానికి తన మిత్రుడు బోరిస్ జాన్సన్‌తో సుహృద్భావ చర్చలు జరిపినట్లు నవంబర్ 27న మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. చివరిసారి 1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. -
పల్లె స్ఫూర్తితో ‘పట్టణ ప్రగతి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పల్లెలు, పట్టణాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణతో ముందుకుపోతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రెండు విడతలుగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైందని, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజ లకు సూచించారు. ‘పల్లె ప్రగతిలో ప్రజలంతా కలిసి ఎవరి గ్రామాన్ని వారు అద్దంలా తీర్చిదిద్దుకున్నారు. మన ఊరిని మనమే బాగుచేసుకోవాలనే చైతన్యంతో ముందుకు సాగారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలి. పల్లెల మాదిరే పట్టణాల రూపురేఖలు కూడా మారాల్సిన అవసరం ఉంది. పల్లె ప్రగతి మాదిరిగానే ‘పట్టణ ప్రగతి’కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమంలోనూ ప్రజలంతా పాల్గొని, ఎవరి పట్టణాన్ని వారే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి’అని గవర్నర్ అభిలషించారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ హోదాలో తొలిసారి తమిళిసై ఆవిష్కరించారు. జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తన ఉపన్యాసంలో రాజ్యాంగ నిర్మాతలు, దేశ ప్రముఖులు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అత్యున్నత ఫలితాలు సాధించిందని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో బలమైన పునాదులు.. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అసంఖ్యాక సవాళ్లను అధిగమించి సుపరిపాలన అందిస్తోందని గవర్నర్ కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన అగాధం నుంచి తెలంగాణ వేగంగా కోలుకుని, అతి స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో గడిచిన ఆరేళ్లలో బలమైన పునాదులు నిర్మించుకుందని, సానుకూల దృక్పథంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం తనకు తానుగా పరివర్తన చెందుతూనే, ప్రజాస్వామ్య–గణతంత్ర భారతదేశంలో గుణాత్మక మార్పులకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. సరికొత్త సంస్కరణలతో పాలనా రంగంలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం పెంచడానికి ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని, కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టాల ప్రకారమే అత్యంత కట్టుదిట్టంగా పాలన జరుగుతోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రగతి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన జాబితాలో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాలకు చోటు దక్కిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. పల్లెలు, పట్టణాల ప్రగతి కోసం గతంలో ఉన్న నిధుల కొరత సమస్యను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని, కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సరిసమానంగా పల్లెలకు, పట్టణాలకు నిధులు అందచేయడానికి ముందుకొచ్చిందని గవర్నర్ తెలిపారు. ఈ ఏడాది రెండు టీఎంసీల ఎత్తిపోత.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది నుంచి ప్రతి రోజూ రెండు టీఎంసీల చొప్పున, వచ్చే ఏడాది నుంచి ప్రతి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తామని పేర్కొన్నారు. ‘కృష్ణా నది నీటి లభ్యతలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్య పరిష్కరం కోసం గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గోదావరి జలాల తరలింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ముందుకు పోయేందుకు సిద్ధపడింది’అని తెలిపారు. త్వరలో హెల్త్ ప్రొఫైల్.. కంటి వెలుగు కార్యక్రమం స్ఫూర్తితో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగానే నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు జరిపి, వాటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల, మహిళలపై అఘాయిత్యాలు చేసే వ్యక్తుల పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలోని 130 అతిపెద్ద నగరాల్లో అధ్యయనం చేసిన ప్రపంచ ప్రఖ్యాత జేఎల్ఎల్ సంస్థ, 20 అగ్రశ్రేణి నగరాల జాబితాను ఇటీవల ప్రకటిస్తే, అందులో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంతో ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు. -
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్..
సాక్షి, కృష్ణా: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పాల్గొని.. జాతీయి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మడ్ రిజర్వు పోలీసులు నిర్వహించిన ఉత్సవ కవాతు గౌవర వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాపై సమగ్ర నివేదికను కలెక్టర్ ఇంతియాజ్ అందించారు. స్వతంత్ర సమరయోధులను కలెక్టర్ ఘనం సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇంతియాజ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
రిపబ్లిక్ డే : కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఇండోర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ పతాకం ఆవిష్కరణకు హాజరైన కాంగ్రెస్ నేతలు.. దేవేంద్రసింగ్ యాదవ్, చందు కుంజీర్‌లు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇతర నాయకులు, కార్యకర్తలు చూస్తుండగానే ఘర్షణకు దిగారు. పార్టీ నేతలు వారించినా కూడా వినిపించుకోలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురు నేతలను అక్కడి నుంచి కొద్ది దూరం తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. అయితే వారిద్దరు ఏ అంశంపై ఘర్షణకు దిగారనే దానిపై స్పష్టత లేదు. కాగా, 15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2018 డిసెంబర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అధికార పంపిణీకి సంబంధించి మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. -
ఢిల్లీలో ముస్తాబవుతున్న ఏపీ శకటం
-
శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్
ముంబై/కోల్‌కతా: రిపబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వ ఆశలని కేంద్రం నీరుగార్చింది. వివిధ కారణాలు చూపుతూ ఆ రాష్ట్ర శకటాలని తిరస్కరించింది. 2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాల శకటాలని అనుమతించబోమని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిఉంటే రాష్ట్ర బీజేపీ ఇలాగే మౌనంగా ఉండేదా’అని సంజయ్ ప్రశ్నించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని నిందించారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలకు అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మహారాష్ట్ర, బెంగాల్ రెండూ కీలక పాత్ర పోషించాయని, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇరు రాష్ట్రాల ప్రజలను, అమరవీరులను ఈ చర్య ద్వారా కేంద్రం అవమానించింది’అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సంజయ్ దత్ అన్నారు. శకటాల ప్రదర్శన తిరస్కరణపై బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. బెంగాల్‌పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందునే బెంగాల్ శకటాన్ని తిరస్కరించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. -
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 10.52 శాతం
సాక్షి, అమరావతి: దేశ ఆర్థికాభివృద్ధి 7.3 శాతం కాగా ఏపీ ఆర్థికాభివృద్ధి 10.52 శాతంగా ఉందని ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఈబీసి కోటా కింద ప్రవేశ పెట్టిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ. లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుందని, మొదటి విడతగా రూ. 51,687 కోట్లు కేటాయించామన్నారు. అందులో భాగంగా రూ. 41,297 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. నాలుగేళ్లలో రైతులకు రూ. 24 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ హౌసింగ్ కింద 10,15,663 ఇళ్లు నిర్మించినట్టు వివరించారు. ఇప్పటికే కృష్ణా–గోదావరి అనుసంధానం చేశామని, గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేపట్టామన్నారు. రూ.20 వేల కోట్లతో అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టబోతున్నట్టు చెప్పారు. విమానాల ఇంధనంపై టాక్స్‌ను 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. ఈ ఏడాది గన్నవరం నుంచి సింగపూర్‌కి అంతర్జాతీయ విమాన స్వర్వీసులు ప్రారంభించినట్టు చెప్పారు. చంద్రన్న బాట కింద గ్రామీణ ప్రాంతాల్లో 23,550 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేశామని, మన ఊరు, మన బడి, బడి పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా విద్య ప్రాముఖ్యత తెలియజేశామన్నారు. నాలుగున్నరేళ్లలో వివిధ రంగాలలో జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి 660 అవార్డ్స్ సాధించినట్టు చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నట్టు గవర్నర్ చెప్పారు. జాతీయ పతాకం ఎగురవేసిన గవర్నర్.. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఎగురవేశారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంపై గవర్నర్ పెరేడ్‌ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. సీఎస్ పునేఠ, డీజీపీ ఠాకూర్ పెరేడ్లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు. కవాతులో ఇండియన్ ఆర్మీ ఫస్ట్... గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు(పెరేడ్) అందర్నీ ఆకట్టుకుంది. ఆర్ముడ్ విభాగంలో ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్పీ ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి. అన్ ఆర్ముడ్ విభాగంలో ఎన్సీసీ బాలురు, బాలికలు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. ఒడిశా కంటిజెంట్‌కు ప్రత్యేక బహుమతిని అందించారు. ఇండియన్ ఆర్మీ కటింజెంట్ ముత్తు పాండ్యన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అమిత్ కుమార్, ఒడిశా స్టేట్ పోలీస్ అశోక్ కుమార్ బ్రహ్మ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డి.మధుసూదనరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కృష్ణ ధర్మరాజు, ఎన్సీసీ బాలుర కటింజెంట్ కె.సురేంధర్, ఎన్సీసీ బాలికల కటింజెంట్ పి.భాగ్యశ్రీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్(బాయ్స్, గరల్స్) కటింజెంట్ సీహెచ్ కృష్ణవేణి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ (బాయ్స్, గరల్స్) కటింజెంట్ గంగుల చందు, యూత్ రెడ్ క్రాస్ బాయ్స్ కటింజెంట్ వై మురళీకృష్ణ ఆధ్వర్యంలో గవర్నర్‌కు గౌరవవందనం అందజేశారు. అనంతరం పైప్ /బ్రాస్ బ్యాండ్ విభాగాలు గౌరవ వందనాన్ని అందజేశారు. సమాచార శాఖ శకటం ఫస్ట్.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలలో జరుగుతున్న కార్యక్రమాలపై రూపొందించిన శకటాలు ప్రదర్శించాయి. సమాచార పౌరసంబంధాల శాఖ, అటవీశాఖ, పర్యాటక శాఖల శకటాలు మొదటి, రెండు, మూడు బహుమతులు గెలుచుకున్నాయి. వ్యవసాయ, సీఆర్డీఏ, విద్యాశాఖ, అటవీశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ, ఉద్యాన శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పర్యాటక శాఖ, జలవనరుల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు ప్రత్యేకంగా అలంకరించిన శకటాలు ప్రదర్శించాయి. ఉండవల్లిలో జాతీయజెండా ఎగురవేసిన సీఎం (బాక్స్) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి, జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఏవి రాజమౌళి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు’
సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..'రాజ్యాంగం రావటం అంటే.. రాజకీయ విప్లవం రావటమే. రాజ్యాంగ సమానతలు వచ్చాయి కానీ, సామాజిక సమానతలు మాత్రం రాలేదు. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలి. భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్. పాలకులు అధికారంలోకి వచ్చాము ఏదైనా చేయొచ్చు అనే భావన వదిలేయాలి. రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి పాలన సాగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు. ఎవరైనా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి. ఎన్నికల కమిషన్ సలహాలు అవసరం లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కోర్టుకు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం రజత్ కుమార్‌కి లేదు. అడిగే హక్కు మాకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్ మీద ఉంది. భారత రత్నలో తెలంగాణకు అన్యాయం జరిగింది. బాధ కలిగింది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి యోగెశ్వర రెడ్డి వెదిరె, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రుద్దిన్లతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి జైషే స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారని ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు. వీరు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ ఇంటిలోకి కొందరు అనుమానితులు వస్తున్నారని పసిగట్టిన పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘనీ నుంచి ఆయుధాలు, కొంత మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనీ అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాది అహ్మద్ భట్‌ను అరెస్ట్ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులకు సన్నాహకంగా ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో భట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. -
రిపబ్లిక్ డే సంబరాలు
కోరుట్లటౌన్ : 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకం ఎగిరింది. జాతీయ గీతాలాపనతో గణతంత్ర సంబరాలు అంబరాన్ని అంటాయి.కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ అల్లూరి వాణిరెడ్డి, వయోవృద్ధుల సంఘంలో మున్సిపల్ చైర్మన్ శీలం వేణు జెండా ఆవిష్కరించారు. కోరుట్ల : పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరణ కన్నుల పండువగా జరిగింది. కోరుట్లరూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో 69వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్ జెండాను ఆవిష్కరించారు. మెట్పల్లి : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జెండా ఆవిష్కరించారు. పట్టణంలో వివిధ పార్టీల కార్యాలయాల్లో ఆయా పార్టీల అధ్యక్షులు జెండావిష్కరించారు. కథలాపూర్ : కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో, మార్కెట్ కార్యాలయం, సింగిల్‌విండో కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలల్లో జాతీయజెండాను ఎగురవేసి ఉత్సవాలు జరిపారు. ఇబ్రహీంపట్నం : మండలంలో 69వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ కందరి లక్ష్మీ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రామ్‌నాయక్, జెండావిష్కరించారు. మల్లాపూర్ : మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు అన్నిగ్రామాల్లో శుక్రవారం 69వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పాఠశాలల్లో హెచ్ఎంలు జెండా ఆవిష్కరించారు. -
జిల్లా కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు
జగిత్యాలజోన్ : జిల్లా కేంద్రంలోని కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో అదనపు జడ్జి కృష్ణమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కవిత, మొదటి, రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు మధు, సతీశ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమనాతిని శంకర్, ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల క్రీడోత్సవాల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కోర్టులో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్యను జిల్లా జడ్జి అభినందించారు. వ్యవసాయ పరిశోధన స్థానంలో.. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో అసోసియేట్ డీన్ డాక్టర్ పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ ప్రియాంక, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో భాగ్యలక్ష్మి, ఉద్యానశాఖ కార్యాలయంలో ప్రతాప్‌సింగ్, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఎస్ఈ శ్రవణ్‌కుమార్, ఏడీ కార్యాలయంలో ఏడీఏ రాజేశ్వర్, జగిత్యాల జైల్లో జైలర్ ప్రేమ్‌కుమార్ జాతీయ జెండాలు ఎగురవేశారు. ఎస్పీ కార్యాలయంలో.. జగిత్యాలక్రైం :జిల్లా కేంద్రంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అనంతశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అటవీశాఖ కార్యాలయంలో... జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధికారి నర్సింహరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీధర్ జెండా ఆవిష్కరించారు. అగ్నిమాపక కేంద్రంలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
భారత మాతకు దివ్య హారతి
సాక్షి, హైదరాబాద్: భారత మాత వేషధారణలో 1,500 మంది విద్యార్థులు.. మూడు రంగుల వస్త్రధారణతో త్రివర్ణ పతాక ఆకృతి.. గంభీరంగా భారతమాత విగ్రహం.. దేశ ఔన్నత్యాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇవన్నీ భారత మాతకు దివ్య హారతినిచ్చాయి. దేశంలోనే మొదటిసారిగా శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న పీపుల్స్ ప్లాజాలో భారత మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగగా... రాత్రి 9.15 నిమిషాలకు భారతమాతకు హారతి, త్రివర్ణ పతాక హారతి, గంగా హారతి, గోప్రకృతి హారతి, మహనీయుల హారతి, భారత రత్న హారతి, త్రివిధ దళాల హారతి, వేద హారతి నిర్వహించారు. గర్వంగా చెప్పుకొందాం.. అందరం భారతీయులమని సగర్వంగా చెప్పుకొందామని.. విశ్వగురువుగా అడు గులు వేసే శక్తి ఈ దేశానికి ఉందని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. స్త్రీజాతికి ప్రథమ స్థానం ఇచ్చిన దేశం మనదని, మానవత్వమనే సందేశాన్ని పంచి.. మంచి, మర్యాదలను పెంచిందని చెప్పారు. భారతదేశం విలువ తెలియాలంటే.. దేశం దాటి ఇతర దేశాలకు వెళ్లాలని, ఒకటి రెండు రోజుల్లోనే మన దేశం విలువ తెలుస్తుందని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఎన్ని దేశాలు చుట్టినా.. చివరికి భారత గడ్డ మీద విమానం దిగగానే భూమిని ముద్దాడారని గుర్తుచేశారు. కార్యక్రమం అనంతరం పలువురు ప్రముఖులను కిషన్‌రెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం 15 వందల మంది విద్యార్థినులు ఒకే చోట భారత మాత వేషధారణతో నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. -
ముందుగా రాష్ట్రంలో గవర్నర్ జెండావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తొలుత తెలంగాణలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించనున్నారు. అనం తరం ఆయన ఏపీలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు విజయ వాడకు బయలుదేరనున్నారు. ముందు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఉదయం 9.15 గంటలకు జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడకు బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి.