Retailers
-
క్విక్ కామర్స్‌తో రిటైలర్లకు సవాళ్లు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ నమూనా స్థానిక రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని, రాజకీయ అంశంగానూ మారొచ్చని వెటరన్ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.‘‘ఇది సానుకూల సంకేతమే. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలకు ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అదే సమయంలో యాపిల్, మెటా, యూనిలీవర్ వంటి బ్రాండ్లను భారత్ సృష్టించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా ఈ విధమైన ఆవిష్కరణల బలం కనిపిస్తుందంటూ.. భారత వ్యాపార సంస్థలు ఉత్పతాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు. దేశీయ సంస్థలకు, దేశీయ మార్కెట్ నుంచే రక్షణ కల్పించడం అన్నది దీర్ఘకాల పోటీతత్వం కోణంలో ప్రమాదకరమన్నారు.దేశీయ వ్యాపారాలను కాపాడుకోవడం కంటే అవి స్వేచ్ఛగా పోటీపడేలా చూడాలన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లలో 900 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని, ట్రంప్ పాలనలో వచ్చే మార్పులతో లేదా ఏదైనా అంతర్జాతీయ పరిణామంతో ఇందులో 5–10 శాతం మేర వెనక్కి మళ్లినా అందుకు సన్నద్ధమై ఉండాలని సూచించారు. -
ఫ్యాషన్ రిటైలర్స్ 15% ఆదాయ వృద్ధి
న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నెట్వర్క్ విస్తరణ ఇందుకు కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ద్రవ్యోల్బణం ఎదురుగాలులు ఉన్నప్పటికీ ఫ్యాషన్ రిటైలర్ల నెట్వర్క్ విస్తరణ 2024–25లో రాబడి పెరుగుదలకు తోడ్పడుతుంది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్–జూన్‌లో ఫ్యాషన్ రిటైలర్లు స్టోర్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టడం ద్వారా 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో ఈ రంగ కంపెనీలు మోస్తరు వృద్ధి నమోదు చేస్తాయి. పండుగ సీజన్లో ఆదాయ వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా అంత క్రితంతో పోలిస్తే 2024–25లో ఆదాయం 14–15 శాతం పెరుగుతుందని అంచనా’ అని ఇక్రా తెలిపింది.పరిమితంగానే డిస్కౌంట్లు.. ‘చదరపు అడుగుకు సగటు అమ్మకాల్లో జూన్ త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ 3 శాతం క్షీణించింది. అయినప్పటికీ వాల్యూ ఫ్యాషన్ విభాగాలు కొంత సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ విభాగం మహమ్మారి ముందస్తు స్థాయిని మొదటిసారి తాకింది. కొత్త స్టోర్స్ రాక, ప్రారంభించిన నూతన కేటగిరీల కోసం పెరిగిన ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చుల కారణంగా తగిన రాబడి కంటే తక్కువగా గతేడాదితో పోలిస్తే ఫ్యాషన్ రిటైలర్ల మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. 2023–24 రెండవ త్రైమాసికం నుండి డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు తమ స్థూల మార్జిన్లను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌తో ప్రకటనలు, ప్రమోషన్లపై రిటైలర్లు దూకుడుగా ఖర్చు చేస్తూనే ఉన్నారు’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. -
సామాన్యుడి సమయం... సోదాహరణం
ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న సోదాలు, హడావుడి ఈ సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లు సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులకు తీవ్రమైన చికాకు తెప్పిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు రవాణా, పంపిణీని నిలువరించేందుకు పటిష్టమైన ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే బదులు.. అడుగడుగునా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద రోజూ సాధారణ జనం నుంచి సైతం నిత్యం నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంతా చేస్తే.. ఈ తతంగమంతా వృథా ప్రయాసగానే మారుతోందని, చాలావరకు కేసుల్లో అసలు దోషుల్ని గుర్తించడం లేదని, కొన్ని కేసులు విచారణకు సైతం నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 90% డబ్బులు వెనక్కే.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఎన్నికల యంత్రాంగం.. ఎన్నికల అనంతరం నూటికి 96 శాతం తిరిగి సంబంధిత వ్యక్తులకు అప్పగించేశారు. ప్రస్తుతం కూడా వివిధ చెక్‌పోస్టుల్లో స్వాదీనం చేసుకుంటున్న కేసుల్లో 90 శాతం డబ్బును జిల్లా స్థాయి కమిటీలే తిరిగి సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నా..ఈ సందర్భంగా చిన్నా చితక వ్యాపారులు, సాధారణ జనాన్ని రోజుల తరబడి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో ప్రలోభాల కోసం రాజకీయ పక్షాలు అత్యధికంగా హవాలా, ప్రైవేటు బ్యాంకులు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుండి భారీగా రవాణా చేస్తున్నా..అలాంటి వాటిని వదిలి పోలీసులు సాధారణ జనం మీద పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాధారణ ట్రాఫిక్ సాఫీగా ముందుకు సాగిపోయే వీల్లేకుండా రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. పన్ను కట్టించుకుని వదిలేస్తున్న ఐటీ 2014–2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ స్వా«దీనం చేసుకున్న డబ్బు – శిక్షలు తదితర అంశాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆర్ఐటీ ద్వారా సమాచారం సేకరించగా, పది లక్షల లోపు అయితే జిల్లా అధికారులు, పది లక్షలు దాటితే ఐటీ అధికారులు పరిశీలించారు. ఐటీకి సంబంధించి ఒక వేళ పన్ను కట్టకపోతే పన్ను కట్టించుకుని, మరికొన్ని కేసుల్లో అడ్వాన్స్ పన్ను కట్టించుకుని ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేసినట్లు తేలింది.హవాలా ద్వారా భారీ ఎత్తున వెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకున్న మెజారిటీ కేసుల్లో ఇంకా న్యాయ విచారణలే మొదలు పెట్టకపోవటంతో ఒక్కరికీ శిక్ష పడలేదు. అడ్వాన్స్ ట్యాక్స్‌లు.. సాగని విచారణలు ♦ 2018 ఎన్నికల్లో జనగామ వద్ద రూ.5.8 కోట్లతో వెళుతున్న కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు (576–2018) చేసి కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు నమోదు చేసినా.విచారణ ముందుకు సాగలేదు. ♦ ములుగు పరిధిలో పట్టుకున్న రూ.19.95 లక్షల కేసులోనూ రాజకీయ పార్టీ కి సంబంధించిన ఆధారాలున్నా ఆ దిశగా విచారణ ముందుకు సాగటం లేదు. ♦ 2104 ఎన్నిక సమయంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విశ్వాస్‌కుమార్ అనే వ్యక్తి నుండి స్వాదీనం చేసుకున్న రూ.8.38 లక్షల డబ్బును ఐటీ విభాగానికి అప్పగించగా, అందులోనుండి రూ.3.38 లక్షలు అడ్వాన్స్‌ట్యాక్స్‌గా కట్టించుకుని మిగిలిన డబ్బును తిరిగి అప్పగించారు. ♦ 2018లో కొడంగల్ నియోజకవర్గం మిర్జాపూర్‌లో రూ.17.5 కోట్ల నగదు ఉందని సమాచారం వస్తే ఐటీ అధికారులు దాడి చేసి నగదు స్వాదీనం చేసుకున్నారు. తీరా రూ.51 లక్షలు మాత్రమే స్వాదీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ♦ 2018లో పోలీసులు రూ.79.23 లక్షలు (500 డినామినేషన్) స్వాదీనం చేసుకుని కేసు నమోదు (190–2018) చేశారు. ఎన్నికలయ్యాక..అందులో రూ.23,000 మాత్రమే ఒరిజినల్ నోట్లుగా తేల్చి మిగిలినవి నకిలీగా పేర్కొన్నారు. రాజకీయ లింకులు పరిశీలించాలి ఎన్నికల సమయంలో యంత్రాంగం స్వాధీనం చేసుకునే మొత్తం రూ.10 లక్షల లోపు అయితే జిల్లా కమిటీకి, రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖకు పంపుతున్నారు. కాగా జిల్లా స్థాయి కమిటీలు తగు రశీదులు సమర్పిస్తే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రతి వ్యక్తి వెనుక రాజకీయ లింకులను లోతుగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీకి వెళ్లిన డబ్బు విషయంలో కూడా రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలు, ఇతరత్రా లోతుల్లోకి వెళ్లకుండా..కేవలం నల్లధనమా లేక తెల్లధనమా అనేది చూస్తున్నారు. ఒక వేళ నల్లధనమైతే పన్ను కట్టించుకుని వదిలేస్తున్నారు. డబ్బును తీసుకువెళుతున్న కారణాన్ని విశ్లేషించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక భారీ మొత్తాలు దొరికిన సమయాల్లో రాజకీయ పార్టీ ల కార్యకర్తలు, వారు నియమించిన కూలీలు దొరికిన సందర్భాల్లో లోతైన విచారణలు చేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్వాల్వ్ చేయాలని సూచిస్తున్నారు. -
వస్త్ర రిటైలర్లకు మెరుగైన ఆదాయం
ముంబై: సంఘటిత వస్త్ర రిటైలర్ల అమ్మకాల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం వృద్ధి చెందుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. జూన్ క్వార్టర్లో విచక్షణారహిత వినియోగాన్ని ద్రవ్యోల్బణం ప్రభావితం చేసినప్పటికీ.. వివాహాలు, పండుగల సీజన్ డిమాండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అలాగే సంఘటిత రిటైల్ సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి తమ స్టోర్లను విస్తరిస్తుండడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, మధ్యకాలంలో అమ్మకాల వృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. కరోనా ముందు సంఘటిత వస్త్ర రిటైలర్ల అమ్మకాల్లో వృద్ధి 8 శాతం స్థాయిలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనా కారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో.. అక్కడ నుంచి చూసుకుంటే (లోబేస్) గత ఆర్థిక సంత్సరంలో (2022–23) వస్త్ర రిటైలర్ల ఆదాయంలో 38 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం మాదిరే 8 శాతంగా ఉంటాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మార్కెటింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ ఆ ప్రభావాన్ని తగ్గిన ముడి సరుకుల ధరలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలతో అధిగమిస్తాయని పేర్కొంది. స్టోర్ల విస్తరణ ఇక వస్త్ర రిటైల్ స్టోర్ల విస్తరణ కరోనా ముందు స్థాయిలోనే 2.2 మిలియన్ చదరపు అడుగుల మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంతవ్సంలో రిటైల్ స్టోర్ల విస్తరణ 3.7 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నట్టు గుర్తు చేసింది. 39 సంఘటిత అప్పారెల్ రిటైలర్లపై క్రిసిల్ రేటింగ్స్ అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది. గతేడాది వస్త్ర రిటైలర్ల రూ.1.9 లక్షల కోట్ల ఆదాయంలో ఈ సంస్థల వాటా 25 శాతంగా ఉంది. వినియోగదారులు బ్రాండెడ్ వ్రస్తాలకు ప్రాధాన్యం ఇస్తుండడం, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండంతో ప్రీమియం విభాగంలో డిమాండ్ క్రమంగా పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్సేథి తెలిపారు. మధ్యస్థ ధరలు, వ్యాల్యూ విభాగంలో తక్కువ డిమాండ్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రీమియం విభాగం డిమాండ్ సాయపడుతున్నట్టు చెప్పారు. వస్త్ర రిటైలర్ల ఆదాయంలో 60 శాతం మధ్యస్థ, తక్కువ శ్రేణి విభాగాల నుంచే వస్తున్నట్టు తెలియజేశారు. స్టోర్ల విస్తరణ, రాబోవు పండుగలు, వివాహాల సీజన్ ఫలితంగా మూడో త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్) మెరుగైన అమ్మకాలు నమోదవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
కస్టమర్ల ఫోన్ నంబర్లు తీసుకోవద్దు..రీటైల్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మొబైల్ నంబరు ఇవ్వని కస్టమర్లకు రిటైలర్లు సర్వీసులు, రిఫండ్లను నిరాకరిస్తున్న ఉదంతాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటువంటి విధానాలను మానుకునేలా తమ తమ పరిధిలోని రిటైలర్లను కట్టడి చేయాలని పరిశ్రమల సమాఖ్యలకు సూచించింది. ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే సమయంలో కస్టమర్ల సమ్మతి లేకుండా వారి మొబైల్ నంబర్లు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. సీఐఐ, ఫిక్కీ, అసోచాం, పీహెచ్‌డీసీసీఐ, రిటైలర్ల అసోసియేషన్ ఆర్ఏఐ, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. ఉత్పత్తి లేదా సర్వీసు కొనుగోలుకు వినియోగదారు తన మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయొద్దని సూచించారు. ‘మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం వల్ల పలు సందర్భాల్లో కస్టమర్లు తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత నుంచి వారికి రిటైలర్లు అసంఖ్యాకంగా మార్కెటింగ్, ప్రమోషనల్ సందేశాలు పంపిస్తుండటం సమస్యాత్మకంగా ఉంటోంది‘ అని సింగ్ పేర్కొన్నారు. విక్రయ సమయంలో.. కస్టమరుకు ఇష్టం లేకపోయినా, మొబైల్ నంబరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం అనేది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ నంబరు ఇవ్వలేదన్న కారణంతో వినియోగదారుకు విక్రయించకపోవడం, రిటర్నులు .. ఎక్ఛేంజీలు .. రిఫండ్లను అనుమతించకపోవడం లేదా వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించకపోవడం అనేవి అనుచిత వ్యాపార విధానాల కిందికే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్యలు సహకరించి, రిటైలర్లకు తగు సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు. -
ఫోన్ నంబర్ తీసుకుని విసిగిస్తున్నారా? వినియోగదారుల శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా? -
FRAI: చిన్న వర్తకుల పొట్ట గొడుతున్న నకిలీలు
గువహటి: చిన్న వర్తుకుల పొట్టగొడుతూ, ప్రభుత్వాల పన్ను ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. రోజువా రీ వినియోగించే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరింది. 2023–24 బడ్జెట్‌కు ముందు ఈ మేరకు తన డిమాండ్లను తెలియజేసింది. ఈ సమాఖ్య పరిధిలో 42 రిటైలర్స్ అసోసియేషన్లు భాగంగా ఉన్నాయి. వీటి పరిధిలో 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి రిటైల్ వర్తకులు సభ్యులుగా ఉన్నారు. నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు అక్రమ వాణిజ్యానికి వీలు కల్పిస్తున్నట్టు ఈ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రిటైల్ వర్తకులు ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసే నేరస్థులతో పోరాడాల్సి వస్తోందని ఎఫ్ఆర్ఏఐ పేర్కొంది. ‘‘80 లక్షల మంది రిటైల్ వర్తకుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. ఈ వర్తకులు అందరూ బిస్క ట్లు, సాఫ్ డ్రింక్‌లు, మినరల్ వాటర్, కన్ఫెక్షనరీలు, సిగరెట్లు తదితర వస్తువుల విక్రయంతో జీవనోపాధి పొందుతున్న వారే’’అని సమాఖ్య తెలిపింది. 25–30 శాతం నకిలీలే.. ‘‘చిన్న వర్తకులు కరోనా మహమ్మారికి ముందు నెలవారీగా రూ.6,000–12,000 సంపాదించే వారు. కొంచెం పెద్ద వర్తకులు, మధ్యస్థాయి రిటైలర్లు రోజువారీ ఆదాయం రూ.400–500 వరకు ఉండేది. సూక్ష్మ వర్తకుల ఆదాయం రోజుకు రూ.200గా ఉండేది. కానీ, కొంత కాలంగా మా వర్తకులు విక్రయించే ఉత్పత్తులు పోలిన నకిలీ ఉత్పత్తులు, అక్రమంగా రవాణా (పన్నులు కట్టని) అయినవి మార్కెట్లో పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి సులభంగా లభిస్తున్నాయి. వీటి వాటా 25–30 శాతంగా ఉంటుంది’’అని ఎఫ్ఆర్ఏఐ ప్రెసిడెంట్ రామ్ అస్రే మిశ్రా తెలిపారు. ఎఫ్ఆర్ఐఏలో సభ్యులుగా ఉన్న వర్తకుల్లో ఎక్కువ మంది చదువుకోని వారేనని, ఆర్థికంగా దిగువ స్థాయిలోని వారిగా పేర్కొంది. ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు వివరించింది. వారి కుటుంబాలకు ఇదే జీవనాధారమని పేర్కొంటూ.. నేరగాళ్లు అక్రమ, నకిలీ ఉత్పత్తులతో తమ ఉపాధికి గండి కొట్టడమే కాకుండా, ప్రభుత్వానికి పన్ను రాకుండా చేస్తున్నట్టు సమాఖ్య తన వినతిపత్రంలో పేర్కొంది. చిన్న వర్తకులు నకిలీ, అక్రమార్కులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. మనదేశంలో తయారైన నిత్యావసర వినియోగ వస్తువలపై అధిక పన్నులే అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నందున.. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా చిన్న వర్తకులను ఆదుకోవాలని కోరింది. ఖజానా ఆదాయానికి గండి.. ‘‘అక్రమార్గాల్లో తీసుకొచ్చిన, నకిలీ ఉత్పత్తులు పూర్తిగా పన్నులు ఎగ్గొట్టేవి. అవి చట్టబద్ధమైన ఉత్పత్తులతో పోలిస్తే సగం ధరకే లేదంటే మూడింట ఒక వంతు ధరకే లభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయం రాకుండా పోతోంది’’అని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు సిగరెట్లను ప్రస్తావించింది. 84ఎంఎం పొడువు ఉండే 20 సిగరెట్ల ప్యాకెట్ చట్టబద్ధమైన ధర రూ.300 అయితే, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన ఇదే మాదిరి ఉత్పత్తి రూ.80–150 ధరకే వినియోగదారులకు లభిస్తోందని తెలిపింది. -
1.5 లక్షల మొబైల్ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం
కోల్‌కతా: ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణలు, అనైతిక విధానాలతో దేశవ్యాప్తంగా 1.5 లక్షల స్మార్ట్ ఫోన్ రిటైల్ దుకాణాదారుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టు అఖిల భారత మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ) పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఈ కామర్స్ సంస్థల అనైతిక ధోరణులకు చెక్ పెట్టాలని కోరింది. చిన్న రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టం ‘‘ఆన్లైన్ విక్రయ సంస్థలు అనుసరిస్తున్న అనైతిక, వివక్షాపూరిత, గుత్తాధిపత్య వ్యాపార విధానాల వల్ల పరిస్థితి ఎంతో దిగజారింది. కొన్ని రిటైల్ షాపులు మూతపడ్డాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టెక్నాలజీ దన్నుతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనుసరిస్తున్న అనైతిక, గుత్తాధిపత్య విధానాలతో పోటీపడలేకపోతున్న 1,50,000 రిటైలర్లను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం’’ అని ఏఐఎంఆర్ఏ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బజోరియా తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి రెండు రోజుల పాటు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు. ‘‘38 బిలియన్ డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు)తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ మార్కెట్. కొన్ని అంతర్జాతీయ మొబైల్ ఫోన్ కంపెనీలు 2021లో భారత్‌కు అత్యధికంగా ఫోన్లను ఎగుమతి చేశాయి. దేశ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 50 శాతంగా ఉంది’’అని బజోరియా చెప్పారు. చిన్న మొబైల్ రిటైలర్లకు జీఎస్టీ ఇబ్బందికరంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పెద్ద రిటైలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ, చిన్న రిటైలర్లకు ముప్పుగా పరిణమించే వాతావరణం దేశంలో నెలకొందన్నారు. -
పసిడి పరుగులు, బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం పైపైకి!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) 12–15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం తెలిపింది. ఇందుకు స్థిరమైన గిరాకీ, పసిడి అధిక ధర ఇందుకు కారణమవుతాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 20–22 శాతం ఆదాయ అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. వార్షికంగా ఆదాయాలు తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, 2021–22లో భారీ ఆదాయాల నమోదుకు మహమ్మారి ప్రారంభ దశ (2020–21) లో బేస్ ఎఫెక్ట్ కారణమని తెలిపింది. క్రిసిల్ రేటింగ్స్ ఇస్తున్న 82 సంస్థల పనితీరు ఆధారంగా నివేదిక రూపొందింది. ఈ రంగ మొత్తం ఆదాయంలో వీటి వాటా 40 శాతం. క్రిసిల్ నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే... ►ఆపరేటింగ్ మార్జిన్లు 2022–2023 ఆర్థిక సంవత్సరంలో వార్షికంగా 50–70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శౠం) 7.3–7.5 శాతం శ్రేణిలో మెరుగుపడతాయి. పెరిగిన బంగారం ధరలు, మెరుగైన నిర్వహణ వంటి అంశాలు దీనికి కారణం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 12–15 శాతం పెరుగుతాయి. ఫలితంగా పరిశ్రమపై రుణ భారాలు తగ్గే వీలుంది. ►అధిక మూలధన వ్యయం, ఇన్వెంటరీలు ఉన్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థీకృత ఆభరణాల సంస్థల క్రెడిట్ ఔట్‌లుక్‌ను ‘స్థిరంగా’ ఉంటుంది. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల డిమాండ్ స్థిరంగా ఉంటుంది. డిమాండ్ పరిమాణం 8–10 శాతం వృద్ధి చెంది 600–650 టన్నుల మహమ్మారి ముందస్తు స్థాయిలకు చేరుకుంటుంది. కోవిడ్–19 అనంతరం వ్యాపార కార్యకలాపాలను మామూలు స్థితికి చేరుకుంటుండడం దీనికి ప్రధాన కారణం. ► డిమాండ్ స్థిరీకరణతో, వ్యాపార విస్తరణ విలువ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 200–250 కోట్లు ఉంటుంది. తద్వారా ఈ పరిమాణం మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. ► భారత్‌పై నాల్గవ వేవ్ సవాళ్లు తలెత్తడం, అలాగే సుంకాల పెంపు వంటి చర్యలు ఆభరణాల కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు ఆలోచనలో మార్పు తీసుకువస్తాయి. ► బంగారం అధిక దిగుమతులు భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) పెరగడానికి దారితీసే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం పైగా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
బాదుడు షురూ..ఒకేసారి డీజిల్‌పై రూ. 25 పెంపు..! బంకుల మూసివేత..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలుదేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాలు తరువాత ధరలు పెరుగుతాయని భావించడంతో ఎన్నడూ లేనంతగా జనాలు పెట్రోలు, డిజీల్ను భారీగా నిల్వ చేసుకున్నారు. అయితే బడ్జెట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ధరల పెంపుపై కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అయితే బల్క్ కస్టమర్లకు చమురు సంస్థలు గట్టి షాకిస్తూ బాదుడు షురూ చేశాయి. లీటరుకు రూ. 25 పెంపు..! బల్క్ కస్టమర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటరు డీజిల్‌పై రూ.25 మేర పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం మేర పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని పలు సంస్థలు వెల్లడించాయి. కాగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది. బంకుల మూసివేత యోచనలో..! బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రైవేట్ రిటైల్ కంపెనీలకు బంకుల నిర్వహణ కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో ఇంధనాన్ని విక్రయించడం వల్ల రిటైలర్లకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలకు నష్టాలు భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించే బదులు.. బంకులను మూసివేయడమే మంచిదనే యోచనలో ఈ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. బస్సులకు ఇంధనం.. బంకుల్లోనే.. బల్క్ డిజీల్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకొంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్‌ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్స్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలూ పెరుగుతున్నాయి. చదవండి: తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరలకు రెక్కలు -
నవంబర్‌లో ఊపందుకున్న రిటైల్ విక్రయాలు
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో మెరుగైన వృద్ధిని చూపించాయి. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 నవంబర్ నెలలోని గణంకాలతో పోలిస్తే 9 శాతం పెరిగినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఒకవేళ 2020 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే వృద్ధి 16 శాతంగా ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ భారతంలో 11 శాతంగా ఉంటే, తూర్పు, దక్షిణాదిన 9 శాతం చొప్పున, ఉత్తరాదిన 6 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదైనట్టు వివరించింది. వ్యాపార వాతావరణం మెరుగైందని.. ఇది నిలదొక్కుకుంటుందని భావిస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్, కరోనా మూడో దశకు సంబంధించి ఆందోళనలు అయితే ఉన్నాయన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు నవంబర్‌లో 32 శాతం వృద్ధిని చూపించినట్టు రాయ్ తెలిపింది. క్రీడా ఉత్పత్తులు 18 శాతం అధిక అమ్మకాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అలాగే, ఆహారం, గ్రోసరీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల విభాగంలోనూ వృద్ధి నమోదు కాగా.. పాదరక్షలు, సౌందర్య, విలాస ఉత్పత్తులు, ఫర్నిచర్ విభాగాలు కోలుకుంట్నుట్టు వివరించింది. -
గాడిలో పడ్డ వ్యాపారం
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగ్గా ఉన్నట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. కరోనా ముందు నాటి విక్రయాల్లో 96 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. 2020 సెపె్టంబర్లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే 2021 సెపె్టంబర్లో 26 శాతం వృద్ధి కనిపించినట్టు తెలిపింది. దక్షిణాది 33 శాతం వృద్ధితో ముందుండగా.. తూర్పు భారత్‌లో 30 శాతం, పశి్చమ భారత్‌లో 26 శాతం చొప్పున అమ్మకాలు పుంజుకున్నాయి. ఉత్తరాదిలోనూ 16 శాతం అధికంగా అమ్మకాలు జరిటినట్టు తెలిపింది. వినియోగదారు సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని రాయ్ పేర్కొంది. ‘‘కన్జ్యూమర్ డ్యురబుల్స్, ఎల్రక్టానిక్స్, ఆహారం, గ్రోసరీ, క్విక్ సరీ్వస్ రెస్టారెంట్లు కరోనా ముందు నాటి స్థాయికి పూర్తిగా కోలుకున్నాయి. క్రీడా ఉత్పత్తులు, వ్రస్తాలు కూడా గణనీయంగా పుంజుకున్నాయి. సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు (సెలూన్, పాదరక్షలు, ఆభరణాలు) ఇంకా కరోనా ముందస్తు నాటికి చేరుకోవాల్సి ఉంది’’అని రాయ్ తెలిపింది. -
రిటైల్ అమ్మకాలు పుంజుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయాలు గాడిన పడుతున్నాయి. కరోనా ముందు నాటి విక్రయాల్లో (2019 జూలై) 72 శాతానికి ఈ ఏడాది జూలైలో చేరినట్టు రిటైలర్ల జాతీయ సంఘం (రాయ్) తెలిపింది. రానున్న పండుగల సందర్భంగా విక్రయాలు మరింత జోరందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈఏడాది జూన్‌లో కరోనా ముందు నాటి విక్రయాల్లో 50 శాతానికి కోలుకున్నట్టు తెలిపింది. దక్షిణాదిన రిటైల్ అమ్మకాలు మరింత బలంగా ఉన్నట్టు వివరించింది. కరోనా ముందు నాటితో పోలిస్తే 82 శాతానికి పుంజుకున్నాయని తెలిపింది. పశ్చిమభారతావనిలో విక్రయాలు ఇంకా కోలుకోవాల్సి ఉందంటూ.. జూలైలో 57 శాతానికి చేరినట్టు వివరించింది. మహారాష్ట్రలో లాక్డౌన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. వేగంగా సేవలు అందించే రెస్టారెంట్ల వ్యాపారం (క్యూఎస్ఆర్) ఈ ఏడాది జూలైలో కరోనా ముందు నాటితో పోలిస్తే 97 శాతానికి చేరుకున్నట్టు రాయ్ తెలిపింది. ఆధునిక రిటైల్ వ్యాపారంపై ఆంక్షలను తొలగించి, సాఫీ కార్యకలాపాలకు వీలు కల్పిస్తున్నందున రానున్న పండుగల సీజన్లో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ వివరించారు. -
పేటీఎమ్ నుంచి ఆల్-ఇన్-వన్ పీవోస్ చెల్లింపుల వ్యవస్థ
ప్రముఖ డిజటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ వ్యాపారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎమ్ ఆల్-ఇన్-వన్ పీవోఎస్ మెషిన్ తో చిన్నవ్యాపారులు ఈ-కామర్స్ సహచరులైపోతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పీవోఎస్ మెషిన్‌తో చిన్న వ్యాపారులు ఈ-కామర్స్ సంస్ధల తరహాలో నో-కాస్ట్, ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తమ కస్టమర్లకు అందించవచ్చును. తన ఆల్-ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణాలతో ఈఎమ్ఐ ఆఫర్లు, ప్రముఖ బ్యాంక్ లు, భాగస్వామి బ్రాండ్ ల నుంచి క్యాష్ బ్యాక్ లతో దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, రిటైలర్లతో సహా వ్యాపా రులందరికీ సాధికారికత కల్పిస్తున్నట్లు భారతదేశ అగ్రగామి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ పేటీఎమ్ ప్రకటించింది. పేటీఎమ్ వాలెట్, క్యూఆర్ కోడ్స్ ద్వారా అన్ని యూపీఐ యాప్స్, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వా రా చెల్లింపులు స్వీకరించేందుకు ఆల్-ఇన్-వన్ పీవోఎస్ వీలు కల్పిస్తుంది. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లోని ఎంతో మంది దుకాణదారులు, చిన్న వ్యాపారాల యజమానులు ఇప్పటికే పేటీఎమ్ ఆల్-ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. పలు అగ్రగామి బ్యాంకులతో పేటియం ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పాదనలపై ఆ కర్షణీయ డిస్కౌంట్లు అందించేందుకు ప్రముఖ బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చకుంది. ఈ సందర్భంగా పేటీఎమ్ అధికారప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఆఫ్ లైన్ దుకాణదారులు, రిటైల ర్లతో సహా వ్యాపారులంతా కూడా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవ స్థలో అతి ముఖ్యభాగంగా ఉన్నారు. పేటీఎమ్ ఆల్-ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణంతో మేం వారికి ఈ-కామర్స్ సంస్థలు ఆన్ లైన్ లో అందించే డిస్కౌంట్లు, బ్యాంక్ డీ ల్స్ అందించేలా చేయగలుగుతున్నాం. అంతేకాకుండా వారు, సాంకేతికతపై లేదా బ్యాక్ ఎండ్ మౌలిక వసతులపై ఎలాంటి పెట్టుబడి లేకుండానే తమ వ్యాపార కార్యకలాపాలను సులభంగా డిజిటైలైజ్ చేసుకోవచ్చును. వ్యాపారులు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, డిజిటల్ ఇండియా మిషన్ లో వారు చేరేందుకు తోడ్పడేందుకు ఎంతో అవసరమైన డిజిటైలైజేషన్కు మా ఉపకరణాలు తోడ్పడతాయ’’ని అన్నారు. ఈ ఆల్ –ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణం కార్డ్ స్వైప్ నుంచి, క్యూఆర్ కోడ్స్ నుంచి చెల్లింపు లను ఆమోదిస్తుంది. జీఎస్టీ కాంప్లియెంట్ బిల్లులను అందించేందుకు అది ‘పేటీఎమ్ ఫర్ బిజి నెస్’ యాప్ తో ఇంటిగ్రేట్ చేశారు. అన్ని లావాదేవీలను, సెటిల్ మెంట్స్ ను కూడా వ్యాపారులు నిర్వహించుకోగలుగుతారు. అంతేకాకుండా రుణాలు, బీమా వంటి వివిధ వ్యాపార సేవలు, ఆర్థిక పరిష్కారాలను పొందడంలో ‘పేటీఎమ్ ఫర్ బిజి నెస్’ యాప్ వ్యాపారులకు తోడ్పడుతుంది. క్రెడిట్ సేల్స్, నగదు విక్రయాలు, కార్డు విక్రయాలతో సహా తమ లావాదేవీలన్నింటినీ నిర్వహించుకునేందుకు ‘బిజినెస్ ఖాతా’ ను కూడా ఉపయోగించుకోవచ్చు. -
ధాన్యం కొనుగోలుకు బల్క్ బయ్యర్లకు అవకాశం!
న్యూఢిల్లీ: ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేసేవారికి(బల్క్ బయ్యర్స్, బిగ్ రీటెయిలర్స్, ప్రాసెసర్స్) రైతులు, సహకార సంస్థల నుంచి ధాన్యాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనుమతినివ్వాలని కేంద్రం రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. మూడు నెలల పాటు వారికి ఆ అవకాశం కల్పించాలని కోరింది. తద్వారా వ్యవసాయ మార్కెట్లపై భారం తగ్గుతుందని, అలాగే, వినియోగదారుడికి తగినంత స్థాయిలో ఉత్పత్తులు లభిస్తాయని సూచించింది. అలాగే, వేర్‌హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టరైన గోదాములను ‘ఈ నామ్’ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్‌కు వీలైన మార్కెట్లుగా ప్రకటించాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ బుధవారం లేఖ రాశారు. అంబేడ్కర్ జయంతిన సెలవు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14ను కేంద్రం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాలు మూతపడనున్నాయి. -
నిత్యావసరాలకు ఆందోళన వద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు నిత్యావసర వస్తువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. విక్రేతల వద్ద సరిపడ నిల్వ ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) తెలిపింది. స్పెన్సర్, వీ–మార్ట్ వంటి కొన్ని కొన్ని సంఘటిత రిటైలర్లు పలు రకాల సరుకుల మీద నియంత్రణ పెట్టారని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో సరుకుల సరఫరా మీద ప్రభావం ఉందని స్పెన్సర్ రిటైల్ ఎండీ దేవేంద్ర చావ్లా తెలిపారు. ‘ప్రస్తుతం మా స్టోర్లలో నిత్యావసరాల పూర్తి స్థాయి స్టాక్ ఉంది. కొన్ని రకాల బ్రాండ్ల తయారీ సంస్థలతో మాట్లాడుతున్నాం. త్వరలోనే అవి కూ డా అందుబాటులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. కొనుగోళ్ల మీద నియంత్రణ.. గ్రాసరీల నిల్వ సరిపడా ఉన్నా సరే ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్ అండ్ గ్రాసరీ స్టోర్ చెయిన్ ఈజీడే క్లబ్, వీ–మార్ట్ కొనుగోళ్ల మీద నియంత్రణ పెట్టాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని వీ–మార్ట్ స్లోర్టలోనూ సరుకుల కొరత లేదని, వినియోగదారులు కొనుగోలు మీద నియంత్రణ పెట్టామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్ అండ్ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. ఉదాహరణకు బియ్యం 20 కిలోలు, పిండి 10 కిలోలు, పప్పు దినుసులు 4 కిలోలు, బిస్కెట్స్ 12 ప్యాకెట్లు, చక్కెర 5 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది. బిగ్ బజార్ స్టోర్లలో ఎలాంటి నియంత్రణ లేదని తెలిపింది. కార్మికుల కొరత.. ఫ్యాక్టరీలలో కార్మికుల కొరత, సరుకుల రవాణా వాహనాల లభ్యత ప్రధాన సవాళ్లుగా మారాయని హెచ్‌యూఎల్, ఐటీసీ, డాబర్ ఇండియా, పార్లే, జీసీపీఎల్, జ్యోతి ల్యాబ్స్ వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. వచ్చే 2–3 వారాల పాటు సరిపడే నిత్యావసరాల నిల్వ ఉందని, ఆ తర్వాత తయారీ ప్లాంట్ల కార్యకలాపాలకు, ఆయా ఉత్పత్తుల సరఫరా వాహన అనుమతులకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాయి. ‘లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని ప్లాంట్ల ఉత్పత్తి మీద ప్రభావం పడింది. అయినా ఇతరత్రా మార్గాల ద్వారా రోజువారీ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత చర్యలు తీసుకుంటున్నాం’ అని హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాటక్ తెలిపారు. ముడిసరుకుల వాహనాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సప్లయి ఆగిందని డాబర్ ఇండియా ఆపరేషన్స్ ఈడీ షారుఖ్ ఖాన్ తెలిపారు. స్థానిక ప్రభుత్వం అనుమతితో కొద్ది మంది కార్మికులతో నిత్యావసర సరుకుల తయారీ ప్లాంట్లలో మాత్రం ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నామని, పూర్తి స్థాయి అనుమతులకు మరికొంత సమయం పట్టే సూచనలున్నాయని ఐటీసీ తెలిపింది. ఉత్పత్తులకు కొరత రాకుండా ప్రభుత్వ అనుమతులతో 50% కార్మికులు, షిఫ్ట్‌ల వారీగా ప్లాంట్ నిర్వహణ చేస్తున్నామని పార్లే తెలిపింది. దేశవ్యాప్తంగా 90 లక్షల ట్రక్స్ ఉండగా.. కేవలం 5% మాత్రమే నడుస్తున్నాయని ఆల్ ఇండియా మోటార్ టాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపింది. లాక్‌డౌన్‌తో డ్రైవర్ల కొరతతోపాటూ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికుల కొరత ఉందని పేర్కొంది. ఉబెర్ ద్వారా ఇంటికి సరుకులు ట్యాక్సీ సేవల్లో ఉన్న ఉబెర్ తన కస్టమర్లకు కావాల్సిన సరుకులను డెలివరీ చేయనుంది. బిగ్‌బాస్కెట్‌తో ఈ మేరకు చేతులు కలిపింది. హైదరాబాద్ సహా బెంగళూరు, చండీగఢ్, నోయిడాలో ఈ సేవలను అందించనుంది. ద్విచక్ర వాహనాలు (ఉబర్ మోటో), కార్ల ద్వారా (ఉబెర్ గో, ఉబెర్ ఎక్స్ఎల్) సరుకులను వినియోగదార్ల ఇంటికే చేరవేస్తామని ఉబెర్ తెలిపింది. ఇటువంటి సేవల కోసం ఇతర సూపర్ మార్కెట్లు, ఫార్మాసీలతోనూ చర్చిస్తున్నట్టు వివరించింది. -
లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఫిబ్రవరి మొదట్లో ఆరంభమైన కరోనా మహమ్మారి (కోవిడ్-19) సంక్షోభంతో దేశీయంగా అనేక వ్యాపార సంస్థలు గణనీయంగా కీణించాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాల ఆదాయం భారీగా క్షీణించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులు రానున్ననెలల్లో కూడా కొనసాగితే 30 శాతం మోడ్రన్ దుకాణాలు మూతపడతాయని, లక్షలమంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అసోసియేషన్ అందించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి, వ్యాపారం 20-25 శాతం పడిపోయింది. లాక్ డౌన్ తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి. భారతదేశంలో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ద్వారా రూ .4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. దాదాపు 60 లక్షల మంది ఉద్యోగులున్నారు. అయితే గత ఒకటిన్నర నెలల్లో వ్యాపారం 15 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంచడానికి అనుమతించబడిన అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు నష్టాలు తప్పడం లేదని తెలిపింది. ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేకపోవడంతో ఆయా సంస్థలను నష్టాలను చవిచూస్తున్నాయని తెలిపింది. మొత్తంమీద, దుస్తులు, ఆభరణాలు, బూట్లు (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఐటి, టెలిఫోన్లు) రిటైల్‌పై గణనీయమైన ప్రభావం చూపిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే, 30 శాతం రిటైల్ దుకాణాలను మూసివేసే పరిస్థితి వస్తుందని, దీనివల్ల 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్, కెనడా, అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే రిటైల్ పరిశ్రమకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. అలాగే తమ కంపెనీల్లో చాలా మంది చిల్లర వ్యాపారులు తమ ఉద్యోగులకు 35-40 రోజుల చెల్లింపు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పామని, లాక్ డౌన్ సమయంలో వారికి వేతనం లభించేలా చూస్తామని వి-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. ఉద్యోగులకు జీతాల భరోసా ఇవ్వడంతో పాటు, సంస్థ తన అమ్మకందారులకు మద్దతుగా రూ .1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే ఎండీ కవి మిశ్రా చెప్పారు. -
తీరని బాకీ
‘నమస్తే సర్, నేను ఆడిటర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ లాస్ట్ ఇయర్ బాలెన్స్ షీట్ కాపీ మీ ఫైల్లో మిస్ అయ్యింది. మీ దగ్గరుంటే మెయిల్ చేస్తారా. అలాగే ఈ సంవత్సరం బ్యాడ్ డెట్స్ కి ప్రొవిజిన్ ఏమైనా ఉంచాలా అని సర్ అడగమన్నారు‘ . ఆదివారం పొద్దున్న కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉండగా వచ్చిన ఫోనది. ‘ఓకే కాపీ ఇప్పుడే మెయిల్ చేస్తాను. ఎప్పటి లాగే బ్యాడ్ డెట్స్‌కి ప్రొవిజిన్ అవసరం లేదని ఆడిటర్ గారికి చెప్పండి‘ అన్నాను మొదటి విషయం కొంచెం విసుగ్గా చివరి విషయం కొంచెం గర్వంగా చెబుతూ. ఫోన్లో డేటా అంతా వెతికితే దొరికింది లాస్ట్ ఇయర్ బాలెన్స్ షీట్. స్టాక్, క్యాష్, బ్యాంకు బాలెన్స్, గుడ్ విల్, షాపు మార్కెట్ వేల్యూ లాంటివి కలిపితే రెండు కోట్ల నికర ఆస్తి. ఆ ఫిగర్ చూస్తే కలిగే ఆనందం కన్నా, బ్యాడ్ డెట్స్ (రానిబాకీలు) దగ్గర ఉండే సున్నా చూస్తే నాకెక్కువ ఆనందం. ఫార్మా స్టాకిస్టుగా బిజినెస్ మొదలు పెట్టి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఇరవై లక్షలతో మొదలుపెట్టిన వ్యాపారం, డైటింగ్‌లో ఉన్న మెడికల్ ఎథిక్స్ సాక్షిగా, నాలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ పుణ్యమా అని పదేళ్లలో పదింతలైంది. సాధారణంగా రిటైలర్స్‌కి క్రెడిట్ బేసిస్‌లో స్టాక్ సప్లై చెయ్యాలి. కానీ నేను కేవలం మొనోపలీ ఉన్న కంపెనీ మందులే డీల్ చేస్తాను. కొంచెం మార్జిన్ తక్కువైనా సరే. అందుచేత రిటైలర్స్‌కి అరువు ఇవ్వను. ఇచ్చినా ఎక్కువ రోజులు ఇవ్వను. పాత బాకీ తీరిస్తే కానీ స్టాక్ పంపను. కొత్తలో కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళూ అలవాటు పడిపోయారు. నేను కూడా కంపెనీలకి అరువు పెట్టను. ’అప్పు, అబద్ధం కలిసి జీవిస్తాయి’ అన్న ఫ్రాన్స్ వ రెబ్లే మాటల్ని నేను గట్టిగా నమ్ముతాను. ఆడిటర్ ఆఫీస్‌కి మెయిల్ చేసి, ఆదివారం కావడంతో సంచి తీసుకుని పక్కనే ఉన్న రైతు బజార్ కి కూరలకి బయలుదేరాను. ‘‘బాబూ, వంకాయలెలాగ? ‘‘అడిగా . ‘నల్లవి కిలో పదహారు, తెల్లవి పద్దెనిమిది సారూ’ అన్నాడతను జాగా నా చేతికిస్తూ. ‘‘ఇదిగో తెల్లొంకాయలు ఓ పావు ఇయ్యి’’ అంటూ జాగాలో ఏరిన వంకాయలు ఆ రైతుకిచ్చా. ‘‘సారూ చిల్లర ఐదు రూపాయలుండాల’’ అంటూ పావుకి కొంచెం ఎక్కువగా ఉన్న వంకాయలు నా సంచీలో పోశాడా రైతు ఊడిపోయిన తన ఐ.డి కార్డుని తిరిగి చొక్కాకి తగిలించుకుంటూ. అది మా ఇంటికి దగ్గరలో ఉన్న రైతు బజార్. ఆరోజు ఆదివారం కావడంతో రైతుబజారంతా రద్దీగా ఉంది. కూరలెప్పుడూ ఇంటిపక్కనుండే బడ్డీ కొట్లో నా భార్యే కొంటుంది. మూడు రోజులనుంచి ఆ షాప్ తెరవటం లేదు. అందుకని ఆదివారం కదా అని నేనే రైతు బజార్‌కి బయలుదేరా. నా భార్య చెప్పిన ప్రకారం ఆ బడ్డీ కొట్లో కిలో అరవైకి తక్కువ ఏ కూరా ఉండదు. అవే కూరలు రైతు బజార్ లో పన్నెండు నుంచి ఇరవై నాలుక్కి మించి లేవు ఒక్క ఆగాకరకాయే కిలో ఏభై. అది బయట నూట ఇరవయ్యట. ఇలా కృష్ణదేవరాయల కాలంలా ఓ నూట ఏభై రూపాయలతో దాదాపు సంచి నిండిపోయింది మొత్తం తిరిగేసరికి. బయటకి వెళుతూ ఉంటే ఓ చోట జనం బాగా మూగి, ఒంగుని ఉన్నారు. ఏంటో చూద్దామని దగ్గరకి వెళ్ళాను. తన శరీరంలాగే ముడతలు పడిన నేత చీర, ముక్కుకి చేతి కడియమంత రింగు, పౌర్ణమి వెన్నెలలా తెల్లని జుట్టు, సాయంత్రం జెండాలా వంగిన నడుముతో ఓ అవ్వ చింత చిగురు అమ్ముతోంది. మొత్తం కలిపి ఆమె దగ్గర ఓ కేజీ, కేజిన్నర ఉంటుంది. వంద గ్రాములు ఇరవై రూపాయలట. కాటా పక్కనే న్యూస్ పేపర్ లో సిటీ ఎడిషన్‌ని ఒక్కో పేజీ రెండు ముక్కలు చేస్తోంది. అంతమంది ఆ కొద్దిపాటి చింత చిగురికీ పోటీ పడుతున్నందుకు అదే నేనైతే ఇరవై కాస్తా ఏభై చేద్దును. డిమాండ్ అండ్ సప్లై గురించి తెలియని ఆమె మాత్రం తూకం ఎక్కడా తగ్గకుండా, అలా అని మరీ ఎక్కువ మొగ్గకుండా చూసుకోవటంలో బిజీగా ఉంది. ఆమెకి షాపు దొరకలేదులా ఉంది ఓ చోట ఎండలో నేలమీదే అమ్ముతోంది. వీరుణ్ణి జోకొట్టే చీకటి పిరికివాణ్ణి భయపెట్టినట్టు, తీవ్రమైన ఎండ ఆమెనేం చేయలేక తన ప్రతాపమంతా మా మీద చూపిస్తోంది. ఒక్కొక్కరికీ వంద గ్రాములు తూచి పేపర్ లో పొట్లంగట్టి ఇస్తోంది. పేపర్లు అయిపోతే పక్కనే ఉన్న దుకాణం వాళ్ళని బతిమాలి అడిగి తెచ్చుకుంటోంది. ఎవరో అడిగారు ‘ఏమ్మా అందరిలాగే నువ్వుకూడా పోలిథిన్ కవర్లు పెట్టుకోవచ్చు కదా. ఈ పేపర్లు ఎంతకని చింపుతావు?’’ అని. దానికి ఆ అవ్వ నెమ్మదిగా ఆగి ఆగి ఆయాసంతో చెబుతోంది. తనది దగ్గర్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతమట. ఇంతకుముందు తనకి ఓ ఆవు ఉండేదట. అది ఉన్నపళంగా చచ్చిపోయిందట. పశువుల డాక్టర్ చూసి, వాళ్ళ వూరు విహారానికి వచ్చిన వాళ్ళు తిని పడేసిన పాలిథిన్ కవర్లు తినటం వల్ల చచ్చిపోయిందని చెప్పాడట. అప్పటినుంచి ఇలా తను మోయగలిగే బరువున్న చింతచిగురు కోసి పల్లెవెలుగు బస్సులో వచ్చి ఇక్కడ రైతుబజార్లో అమ్ముకుని పొట్ట పోసుకుంటోందట. ఎవరూ లేరా అని మరొకరడిగిన ప్రశ్నకి ఓ కొడుకుండేవాడని చెప్పింది. అలా చెప్పినప్పుడు ప్రస్తుతం తన ఒంటరితనాన్ని సూచించేలా ఆమె కళ్ళల్లో తడి. ఆమె కాలికున్న వెండి కడియం జీవితంలో ఆమె మోసిన బరువులకి ప్రతీకలా ఉంది. పగిలిన పాదాలు ఆమె లెక్కలేనన్నిసార్లు ఎక్కి దిగిన కొండదారులకి నిలువుటద్దంలా ఉన్నాయి. వెరసి అలసిన అనుభవంలా, అలలు లేని అర్ణవంలా ఉందా ఎనభైఏళ్ళ అవ్వ. ఇంతలో ఎవరో అడిగారు. ‘‘అవ్వా, ఇది ఎలా వండాలి’’? అని. ఆమె మొహం చేటంతయ్యింది. బోసి నోరుతో చేసే పని ఆపేసి చెప్పటం మొదలు పెట్టింది. పెసరపప్పుతో కలిపి వండి, వెల్లుల్లి పాయల పోపు పెట్టి, నెయ్యితో తింటే భలే రుచిగా ఉంటుందట. అలాగే మాంసంతో కూడా కలిపి వండుకోవచ్చట. అలా చెబుతున్నపుడు ఆమె కళ్ళల్లో రిటైర్ అయిపోయిన మాస్టారిని తిరిగి పాఠం చెప్పమన్నప్పుడు కలిగే ఆనందం. చివరకి నా వంతు వచ్చింది. నేనూ ఓ వందగ్రాముల పొట్లం తీసుకుని, జేబులో ఉన్న చిల్లరంతా అయిపోగా పర్సులోంచి ఐదొందల నోటు తీసిచ్చా. ‘‘సిల్లర నేదు బాబూ, మార్చి ఇవ్వు’’ అంటూ నా పెద్ద నోటు నాకు తిరిగిచ్చేసి నా తర్వాత వాళ్లకి తూకం వెయ్యటం మొదలు పెట్టింది. ‘రేయ్ ఈరోజు సోమవారం కదా, పార్సెల్ ఆఫీస్ కి స్టాక్ వచ్చిందో లేదో ఫోన్ చేసి కనుక్కో’ అని కుర్రాడికి చెప్తూ, ‘చెప్పండి మాస్టారు, లిస్ట్ తెచ్చారా’ అన్నాను ఎదురుగా ఉన్న పెద్దాయన్ని. అప్పటికే ఇద్దరు మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, మరో ఇద్దరు మెడికల్ షాపు వాళ్ళతో షాపు బిజీ గా ఉంది. ‘ఆ ఏం లేదు సర్, ముందు వాళ్ళ పని చూడండి‘ అన్నాడతను వినయంగా. ఆయన పేరు రామారావు. ప్రతీ నెలా ఓ.టి.సి మెడిసిన్స్, సింపుల్ యాంటీ బయోటిక్స్, మల్టీ విటమిన్ టేబ్లెట్లు లాంటివి ఓ ఐదువేల రూపాయలకి కొంటూ ఉంటాడు. మామూలుగా అయితే మేం రిటైల్ సేల్స్ చెయ్యకూడదు. ఓ డాక్టర్ గారి రిఫరెన్స్ ద్వారా పరిచయం అయ్యాడు. రిటైల్ షాపుల కంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామని ఇక్కడ కొంటూ ఉంటాడు. బహుశా చుట్టుపక్కల పల్లెటూర్లో ఓ చిన్న కిరాణా కొట్లో పెట్టి అమ్ముకుంటాడేమో. అందరినీ డిస్పోజ్ చేసి ఆయన కేసి తిరిగి అడిగా. ‘‘మాస్టారూ చెప్పండి ఏమిటి సంగతి’’ అని. ఎప్పటి లాగే ఆయన ఓ చీటీ ఇచ్చాడు. ఆ చీటీ మా కుర్రాడికి ఇచ్చి అవేవో చూసి ఇమ్మన్నా. అప్పుడతను నెమ్మదిగా, కొంచెం మొహమాటంగా అన్నాడు ‘సర్, ఈ అమౌంట్ నెక్ట్స్ట్మంత్ వచ్చినప్పుడు ఇవ్వొచ్చా, కొంచెం డబ్బులు అవసరం’’. అప్పుడు చూశాను అతనివైపు నిశితంగా. నెరిసిన తల, నలిగిన చొక్కా, కాలికి హవాయి చెప్పులు, ఓ పాత స్కూటరు, చూడగానే చిక్కిపోయిన సిబిల్ స్కోర్లా ఉన్నాడు. పైగా ఇలాంటి వాళ్ళ సంగతి నాకు కాకపోయినా, మా బిజినెస్ లో ఉన్నవాళ్ళకి అలవాటే. ఓ ఏడాది అలవాటుగా కొంటారు. మరోచోట కొంచెం ఎక్కువ డిస్కౌంట్ రాగానే, చివరగా ఏడాది పరిచయాన్ని నమ్మకంగా మార్చి అప్పు అడిగి మరింక కనబడరు. ఎన్ని వినలేదు. అయినా నన్ను అప్పు అడగటం అంటే నిప్పులో తడి, నీటిలో పొడి వెతకటమే. ‘మాస్టారూ, మాది హోల్ సేల్ బిజినెస్. ఇక్కడ రిటైల్‌గా మీకు పదిహేడు పర్సెంట్ డిస్కౌంట్‌తో మందులు అమ్మటమే ఎక్కువ. దానికి తోడు అప్పంటే కష్టం సర్. పైగా ఈ ఏడు బిజినెస్ అంతగా లేదు. ఏమీ అనుకోకండి. పేమెంట్ చేసి మందులు తీసికెళ్ళండి’ అంటూ అప్పటికే అలవాటు ప్రకారం మా కుర్రాడు ప్యాక్ చేసిన మందుల్ని నా కౌంటర్ వెనకాల పెట్టేసా. అతను మారు మాట్లాడకుండా, ‘‘సారీ సర్, ఇదిగో డబ్బులు. కొంచెం అర్జెంటు అవసరం పడి అడిగాను’’ అంటూ జేబులోంచి డబ్బులు తీసిచ్చి, మందులు తీసికెళ్ళాడు. వలని తప్పించుకున్న చేపలా విజయగర్వంతో ఆ డబ్బుని క్యాష్ కౌంటర్లో పెట్టుకున్నా. ఆ మర్నాడు యథావిధిగా ఉదయం తొమ్మిదింటికి భోజనానికి కూర్చున్నాను. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి బదులు లంచ్ చేసి ఇంటి కిందనే ఉన్న షాపుకి వెళ్ళటం నా అలవాటు. కంచంలో చింత చిగురు పప్పు. అచ్చం అవ్వ చెప్పినట్టే వెల్లుల్లిపాయల పోపుపెట్టి, నెయ్యి కలుపుకుని తింటే నిజంగానే చాలా రుచిగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ అవ్వకి నేను ఇరవై రూపాయలు బాకీ ఉన్న సంగతి. చిల్లర మార్చి ఇమ్మన్న తరువాత ఆ విషయమే మర్చి పోయాను. భోజనం అవగానే షాపుకి వెళ్లకుండా నేరుగా రైతు బజార్ కి వెళ్ళాను. నా షాపుకి మూడు షాపుల అవతలే రైతు బజార్. అంతా వెతికా. ఎక్కడా అవ్వ కనబడలేదు. బహుశా వెళ్లిపోయిందో లేక అసలు రాలేదో, సరే వచ్చే ఆదివారం తప్పకుండా వెళ్లి ఇచ్చేయాలి అనుకుని, షాపు కి వచ్చా. నా షాపు కి ఆనుకుని ఓ చిన్న టీ కొట్టుంది. అప్పుడప్పుడు రైతులు అక్కడకి వచ్చి టీ తాగుతూ ఉండటం చూశా. ఎవరో ఓ ఇద్దరు రైతుల్లా ఉన్నారు. కూర్చుని టీ తాగుతున్నారు. అప్పుడే అక్కడకి వచ్చిన రామారావుని చూసి వాళ్లిద్దరూ లేచి నించుని విష్ చేశారు. వాళ్లంతా ఏదో మాట్లాడుకున్నారు. కాసేపటికి రామారావు అక్కడనించి వెళ్ళిపోయాడు. పోనీ వీళ్ళకేమైనా అవ్వ విషయం తెలుస్తుందేమోనని వాళ్ళని దగ్గరకి పిలిచా. వచ్చారు. ‘‘ఏవయ్యా రైతు బజార్లో ఓ అవ్వ చింత చిగురు అమ్ముతూ ఉంటుంది. ఈరోజు వచ్చినట్టు లేదు. మీకేమైనా తెలుసా’’ అని అడిగా. ‘ఆ అవ్వ నిన్ననే పోయిందయ్యా, మా వూరే, ఆదివారం సులువుగానే తిరిగింది. మాతోబాటే వచ్చి, యాపారం అయిపోగానే బస్సులో వచ్చేసింది. రాత్రికి బాగా జొరం వచ్చింది. తెల్లవారి ఆసుపత్రికి తీసుకెళ్లటం కొంచెం ఆలీసం అయ్యింది. ఆ ముసలి పానం తట్టుకోలేకపోయిందయ్యా. ఇప్పుడు మాటాడాం కదయ్యా, ఆ బాబు ప్రతీ నెలా మా ఊరొచ్చి జొరానికీ, బలానికి మందులు పంచుతా ఉంటాడయ్యా. నిన్న కూడా ఆ బాబు కి ఫోన్ జేశాము. వొచ్చి ఆసుపత్రి కి తీసుకు పోతానన్నాడు. ఆ అయ్య వచ్చే కాడికి అవ్వ పానాలొగ్గేసింది. ఆసుపత్రికి తోల్క పోడానికి డబ్బులు కూడా తెచ్చినాడు. లెక్క కూడ్డానికి కూసింత లేటైనాదంట పాపం. ఆ డబ్బే అవ్వని దానపర్చటానికి(దహనానికి) పనికొచ్చినాయి. అదే ఆ బాబు, మేము బాదపడతా వుండాము’ అన్నారు ఇద్దరూ మార్చి మార్చి చెబుతూ. ఇంతలో నా ఫోన్లో జీమెయిల్ మెసేజ్. ఓపెన్ చేసి చూస్తే ఆడిటర్ పంపిన ఈ ఏడు బ్యాలెన్స్ షీట్. రెండు కోట్ల ఐదువేల ఇరవై రూపాయల నికర ఆస్తి. ఎప్పటిలాగే రానిబాకీలు సున్నా. బహుశా ఆ అవ్వకి కూడా బ్యాలెన్స్ షీట్ వేసే అలవాటుంటే అందులో బ్యాడ్ అండ్ డౌట్ ఫుల్ డెట్స్ లో నా పేరుండేదేమో. మిన్ను విరగలేదు. మన్ను పెగల్లేదు. నా చూపు మాత్రం నేలని దాటి పాతాళాన్ని తాకింది. ఎవరో నా నెత్తిమీద సుత్తితో కొట్టి మరీ నన్ను కుదించినట్టయింది. అరవై ఏళ్ళ వయసులో రామారావు చేసే సేవ బ్యాలెన్స్ షీట్లని దాటేసింది. నన్నడిగితే అప్పు తప్పకుండా పుడుతుందన్న ఐదున్నర అడుగుల అతని నమ్మకం ఏడడుగుల ఏరై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనడిగింది పెద్ద మొత్తమేమీ కాదు. నేనిచ్చినంత మాత్రాన ఆ అవ్వ ప్రాణాలు నిలబడతాయనీ కాదు. కనీసం గోటితో పోయేచోట కూడా తోటి వారిని నమ్మలేని నా అతి జాగ్రత్త నన్ను దోషిగా నిలబెట్టింది. ‘చిల్లర మార్చి ఇవ్వు బాబూ ‘అన్న ఎనభై ఏళ్ళ అవ్వ నమ్మకం నింగికి నిచ్చెనేసింది. వందేళ్ల చింత చెట్టు ఇంకా చిగురిస్తూనే ఉంది. నా టేబుల్ మీదున్న బోన్సాయ్ మొక్క నన్ను వెక్కిరిస్తోంది. - ఉమా మహేష్ ఆచాళ్ళ ∙ -
ప్లాస్టిక్‌పై బ్యాన్‌కు వ్యతిరేకంగా సమ్మె!
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
ప్లాస్టిక్‌పై బ్యాన్.. ఒక్కరోజే 3.5 లక్షల రూపాయలు
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
వెయ్యిమంది రిటైలర్స్‌పై వేటు!
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాల్లో ఇరుక్కున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు సైన్ అప్ చేస్తున్నప్పుడు సరైన ప్రక్రియను అనుసరించని రిటైలర్స్‌పై భారీ వేటు వేసింది. ఇ-కెవైసి లైసెన్స్ సస్పెండ్ కు దారితీసిన లోపాలను గుర్తించేందుకు చేపట్టిన విచారణ అనంతరం ఈ చర్య వెలుగులోకి వచ్చింది. తాజా నివేదికల ప్రకారం దాదాపు వెయ్యిమందికిపైగా రిటైలర్స్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. ‘ఎకనామిక్స్ టైమ్స్’ అందించిన నివేదిక ప్రకారం నిర్వహించిన అంతర్గత విచారణ అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు రిటైలర్ల భారీ జరిమానా కూడా విధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి సారి తప్పు చేసిన వారికి తాము చెల్లించిన కమీషన్‌పై 50 రెట్లు ఎక్కువ జరిమానా విధించింది. అలాగే రిపీట్ నేరస్థులను తమ నెట్వర్క్నుంచి తొలగించడంతోపాటు వాటిపై జరిమానా కూడా విధించింది. అయితే ఈ పరిణామాలపై ఎయిర్టెల్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా, కస్టమర్ల అనుమతి లేకుండానే వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుకు మళ్లించిన వ్యవహారంలో భారతి ఎయిర్టెల్ చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ లైసెన్సును రద్దు చేసింది. మరోవైపు ఈ వివాదం కారణంగా ఎయిర్టెల్ పేమెంట్‌బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
మరోసారి జీఎస్టీ మెగా సేల్: డిస్కౌంట్ల పండుగ
ముంబై : మరోసారి జీఎస్టీ మెగా సేల్ ప్రారంభం కాబోతుంది. ఈ డిసెంబర్లో ఇయర్-ఎండ్ సేల్‌ను నిర్వహించాలని రిటైల్ స్టోర్లు, చైన్లు సన్నద్దమవుతున్నాయి. జీఎస్టీ పాలన కింద ఉన్న నిబంధనల నుంచి విముక్తి లభించకపోతే, దుస్తులు, గాడ్జెట్లు, కిచెన్ వస్తువులు, బొమ్మలు వంటి వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయాలని రిటైలర్లు చూస్తున్నారు. జీఎస్టీ కంటే ముందు సంబంధిత ఇన్వాయిస్లు లేకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసిన రిటైలర్లకు, ఆరు నెలల తర్వాత ట్రాన్షిషనల్ క్రెడిట్ లభించదు. ఈ నేపథ్యంలో జీఎస్టీ ముందు కొనుగోలు చేసిన వస్తువులను త్వరగా విక్రయించాలని చూస్తున్నారు. ఈ డిసెంబర్న మెగా స్టాక్ క్లియరెన్స్ సేల్‌ను కొనుగోలుదారులు పొందవచ్చని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇప్పటి వరకైతే కొంత మంది పెద్ద పెద్ద రిటైలర్లు తమ స్టాక్‌ను నవంబర్ ముగింపు వరకు ఉంచుకోవాలని చూస్తున్నాయని, ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే డిస్కౌంట్లకు తెరతీయాలని ప్లాన్ వేస్తున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం త్వరలోనే తీసుకుంటుందని పన్ను నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రీ-జీఎస్టీ స్టాక్‌ను వదిలించుకోవడానికి దివాలి సమయంలోనే రిటైలర్లు ఆఫర్లు ప్రకటించాయి. ఇక డెడ్‌లైన్ మరింత పొడిగించే అవకాశం సన్నగిల్లుతున్న నేపథ్యంలో డిసెంబర్ ముగింపు కంటే ముందస్తుగానే ఎలాగైనా స్టాక్‌ను విక్రయించనున్నట్టు ఓ పెద్ద రిటైల్ చైన్ సీఈవో చెప్పారు. షర్ట్లు, కిచెన్ అప్లియెన్స్, చిన్న వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసిన హ్యాండిక్రాఫ్ట్లు వంటి వాటిపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే సింగిల్ బ్రాండు రిటైలర్లు, చైన్ స్టోర్లు డిసెంబర్లో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు ధృవీకరించారు. చిన్న చిన్న దుకాణదారులు కూడా వచ్చే నెలలో డిస్కౌంట్లు ఆపర్ చేయనున్నట్టు తెలిసింది. -
మా నాన్న.. మీ దరిద్రాన్ని మోశాడు
– వ్యాపారులపై మంత్రి అఖిల అనుచిత వ్యాఖ్యలు సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల వ్యాపారులపై మంత్రి అఖిలప్రియ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఆమె మాటలు విన్న వ్యాపారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదెక్కడి చోద్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాలలోని గాంధీచౌక్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్లో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరూక్, షరీఫ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ నౌమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి మీ దరిద్రాన్ని మోశాడు. కావున మార్కెట్ వ్యాపారులంతా మా వెంట నిలబడాల’ంటూ వ్యాఖ్యానించారు. పైగా వారికి కొన్ని హామీలు కూడా ఇస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. -
జీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీ
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్ సెంట్రల్ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అధియా సూచించారు. అయితే జీఎస్టీ కింద నెలకు నాలుగు రిటర్న్స్‌లను రిటైలర్లు దాఖలు చేయాల్సి ఉందని మార్కెట్లో ఊహాగానాలు వస్తున్నాయని, అవన్నీ నిజం కాదని పేర్కొన్నారు. నెలకు కేవలం ఒక్క రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుందని తెలిపారు. మిగతా రెండింటిని కంప్యూటర్ చేస్తుందని చెప్పారు. కంపోజిట్ రిటైలర్లు కూడా ప్రతినెలా రిటర్న్ దాఖలు దాఖలు చేయాల్సినవసరం లేదని, ప్రతి మూడు నెలలకు ఓ సారి దాఖలు చేస్తే కూడా సరిపోతుందని చెప్పారు. అదీ కూడా మొత్తం టర్నోవర్ వివరాలు మాత్రమేనన్నారు. జీఎస్టీ అమలుకు పెద్ద ఐటీ ఇన్ఫ్రా కూడా అవసరం లేదన్నారు. ''బిజినెస్ టూ బిజినెస్(బీ టూ బీ) లావాదేవీలకు కూడా పెద్ద సాఫ్ట్ వేర్ అక్కర్లేదని చెప్పిన అధియా, తాము ఉచితంగా సాఫ్ట్వేర్ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. అదనంగా బీ టూ బీ లావాదేవీలకు ఎక్స్ఎల్ ఫార్మాట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో ప్రతినెలా 10న ఇన్వాయిస్ వివరాలను అప్డేట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి వీలుంటుందన్నారు. పన్నులను సక్రమంగా చెల్లించే వారికి ఇది ఎంతో లబ్దిదాయకమని చెప్పారు.