retired teacher
-
Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ
ఆమె ఊహల్లో కథ అల్లుకుపోతే అవి బొమ్మలై మన ముందు కదలాడతాయి. చూసే పిల్లల మొహాల్లో ఆశ్చర్యానందాలను పెద్దల మెదళ్లలో ఆలోచనలను కొత్తగా వికసింపజేస్తాయి. ముప్పైఏళ్లుగా పప్పెట్రీతో స్నేహం చేస్తూ ‘మా బొమ్మల టీచర్’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరు నోరి రత్నమాల. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలనీలో ఉంటున్న ఈ విశ్రాంత టీచరమ్మను కలిస్తే ఎన్నో అందమైన కథల మాలను మన ముందుంచుతారు. ‘విష్ణుశర్మ అడవి గుండా ప్రయాణిస్తుంటాడు. దారిలో బావిలోనుంచి మమ్మల్ని కాపాడండీ.. అని కేకలు విని అక్కడకు వెళ్లి లోపలకు చూస్తాడు. అందులో ఒక పులి, కోతి, పాముతో పాటు మనిషి ఉంటాడు. వారందరినీ కాపాడే సమయంలో ‘మనిషిని మాత్రం కాపాడవద్దు’ అని చెబుతాయి మిగతా జంతువులు...’ అంటూ మనిషిలో ఉండే స్వార్థం ప్రాణాపాయం ఎలా కలిగిస్తుందో చెబుతూనే నేటి సాయంత్రం హైదరాబాద్‌లో ప్రదర్శించబోతున్న కథనాన్ని, అందుకోసం చేసుకున్న ఏర్పాట్ల గురించి చెబుతూనే తనలో ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి దారి తీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ఈ టీచరమ్మ. ‘‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ టీచర్‌గా వర్క్ చేశాను. పిల్లలకు ఆసక్తి గొలిపేలా సృజనాత్మకతను పరిచయం చేసే ఆ సబ్జెక్ట్ నాకెంతగానో రచ్చింది, ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకోవడం ఎలా అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్న పప్పెట్రీ గురించి గుర్తొచ్చింది, నా చిన్నతనంలో మా నాయనమ్మ నన్ను తోలుబొమ్మలాటకు తీసుకెళ్లేది. అందులో రామాయణ భారత కథలను తెల్లవార్లూ ప్రదర్శించేవారు. బాల్యంలో నా మనసులో నాటుకుపోయిన ఆ కళ ఆ తర్వాత నాకు విద్యార్థులకు పరిచయం చేయడానికి తోడ్పడింది. స్కూల్ నుంచి మొదలు సంప్రదాయ తోలుబొమ్మల తయారీ అంటే అంత సులువు కాదు. అందుకని కాగితం, క్లాత్, ఇతర వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి పప్పెట్రీ బొమ్మలు తయారుచేసేదాన్ని. వాటిద్వారా పిల్లలకు పంచతంత్ర వంటి ఎన్నో కథలు చెప్పేదాన్ని. పిల్లలు కూడా ఈ బొమ్మల ద్వారా తమ ఆసక్తులను కనబరిచేవారు. అక్కడ నుంచి ఇతర టీచర్లకు శిక్షణ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. దూరదర్శన్లోనూ బాలల వికాసానికి పప్పెట్రీతో కార్యక్రమాలు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక అవగాహన కలిగించే అంశాలెన్నో కథలుగా రూపొందించి, ప్రదర్శించాను. కదిలించే కథనాలు.. స్వాతంత్య్రానికి ముందు మనకున్న అవగాహన కార్యక్రమాలలో ప్రధానమైనది తోలుబొమ్మలాటనే. ఇది దేశవ్యాప్త కళ. బొమ్మలను తెరముందు కదిలిస్తూ, దీపం వెలుతురు సాయంతో ప్రదర్శన ఉండేది. సంప్రదాయ బొమ్మల తయారీ ఇప్పుడు కొంచెం కష్టమే. ఇక ప్రదర్శన ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అలాగని నేర్చుకున్న కళను మన దగ్గరే ఉంచలేం. పదిమందికి తెలిసినప్పుడే ఆ కళ బతుకుతుంది. సామాజిక అవగాహనకు నా భాగస్వామ్యమూ ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ నుంచి ఇన్నేళ్లలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాలలోనూ పప్పెట్రీ ప్రదర్శన చేయడం, అభినందనలు, అవార్డులు, మరచిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీమ్ వర్క్ విజయం బొమ్మల తయారీ, బొమ్మలు కదల్చడానికి, మంచి కథనానికి, పాటలకు, నేపథ్య సంగీతానికి.. ఇలా ఇదంతా టీమ్ వర్క్‌తో కూడుకున్నది. ఇందుకోసం మావారితోపాటు పిల్లలనూ ఆ తర్వాత వారి పిల్లలనూ ఈ పనిలో భాగస్థులను చేశాను. దీనివల్ల వారి లోపల ఉన్న వారికే తెలియని కళ బయటకు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న మా పిల్లలు కూడా కథనానికి తగ్గ వాయిస్ డబ్బింగ్‌ను క్లిప్పింగ్స్ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇందులో నా కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు, కొందరు స్వచ్ఛందంగానూ మేం చేసే పనిలో భాగమవుతుంటారు. ఈ కళ బతికుంది అనడానికి ఇంతకుమించి నిదర్శనాన్ని చూపలేం. డిజిటల్ మీడియాలోనూ.. కరోనా సమయంలో నోరి ఆర్ట్ అండ్ పప్పెట్రీ పేరుతో యూ ట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేశాను. పిల్లల కోసం పప్పెట్రీ ద్వారా కొన్ని వందల కథలను పరిచయం చేశాను. అవన్నీ ఒక్కదాన్నే చేశాను. పెద్దవాళ్లూ ఆస్వాదించారు. ఎంతోమంది అభినందనలు తెలియజేశారు. ఏ దేశానికి లేనన్ని సంప్రదాయ కళలు మన దగ్గర ఉన్నాయి. వాటికి పునరుజ్జీవం కలగాలంటే ప్రభుత్వాలు, సంస్థలు, ఆసక్తి కలవారు ముందుకు రావాలి. పిల్లల్లో ఈ కళలను బతికిస్తే చాలు– ముందు తరాలకు అవి వారసత్వంగా ప్రయాణిస్తాయి. ఏ దేశంలో ఉన్నా మన ప్రత్యేకతను ఈ కళలే చాటుతాయి. అందుకే ప్రాచీన కళలకు ప్రోత్సాహమిద్దాం’’ అని వివరించారు ఈ పప్పెట్రీ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి -
మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని
సాక్షి, హైదరాబాద్: ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ అని నేర్పించాల్సిన టీచర్ బుద్దే వక్రంగా మారింది. ఇంటి మేడ మీద ఆకులు పడుతున్నాయని, చెట్టు వేర్లు గోడ లోపలికి చొచ్చుకుపోతున్నాయని లేనిపోని తగాదాతో తంటాలు తెచ్చుకుంది ఓ రిటైర్డ్ మహిళా టీచర్. చెట్టును కొట్టేయాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించారు. దీంతో మొదలైన గొడవ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే వరకు వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లికాంబ (పేరు మార్చాం) ఎల్బీనగర్లోని ఫతుల్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటి వెనక ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు వృద్ధురాలి భవనం మేడ మీద పడుతున్నాయని ప్రతి రోజు అద్దెవాసులతో గొడవ పడేది. దీంతో వారు పలుమార్లు కొమ్మలను కొట్టేశారు. అయినా ఓర్వలేక చెట్టు వేర్లు గోడల్లోపలికి వెళుతున్నాయని మళ్లీ గొడవ పెట్టుకుంది. కిరాయిదారులు వినకపోవడంతో చెట్టును తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోపోవడంతో ఈసారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. చెట్టుతో తన ఇంటికి నష్టం వాటిళ్లుతోందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. చేసేదిలేక సంబంధిత అధికారులు మామిడి చెట్టును కొట్టేశారు. ఇటీవల అద్దె వసూలు చేసేందుకు ఇంటికి వచ్చిన యజమాని మామిడి చెట్టు కొట్టేసి ఉండటాన్ని గుర్తించి అద్దెవాసులను ప్రశ్నించాడు. వారు అసలు విషయం చెప్పడంతో మల్లికాంబ, ఇంటి యజమాని, అద్దెదారులకు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరడంతో.. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రిటైర్డ్ టీచర్ వాళ్ల మోహం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఇరుగుపొరుగును విచారించిన అధికారులకు ఆమె వైఖరి తెలుసుకుని అవాక్కయ్యారు. కాలనీలోని ప్రతి ఒక్కరితోనూ ఆమెకు తగువులాటేనని, ప్రతి చిన్న విషయానికి దూర్భాషలాడుతుందని చెప్పారు. అద్దెదారుల ఫిర్యాదు మేరకు మలికాంబపై ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయకుండా 41–ఏ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఎస్సీఎస్టీ కేసులో చార్జిషీటు దాఖలు చేయాలంటే బాధితులు, నిందితులు ఇరువర్గాల కుల ధ్రువీకరణ పత్రం అనివార్యం. దీంతో పోలీసుల సూచన మేరకు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా.. మీరెవరు, ఎందుకు వచ్చారు. వారిపై విరుచుకుపడింది. దీంతో విస్తుపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారని, వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనూ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. -
వయసు 84.. చలో యూరప్
మహిళ తన కలలను సాకారం చేసుకోగలిగేది కుటుంబ అవసరాలన్నీ పూర్తయిన తర్వాతే. అంటే అన్ని బాధ్యతలు తీరాక అప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే అది ఆమె అదృష్టంగా మారుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోయంబత్తూర్ వాసి 84 ఏళ్ల లలితాంబాల్ భారతదేశం బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆరు దశాబ్దాల తన కలను నెరవేర్చుకుంటోంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ రిటైర్డ్ టీచర్ అధిగమిస్తున్న విధానం చాలా ఆసక్తిదాయకంగానూ, ఎంతోమంది అనుసరించదగినదిగానూ ఉంటుంది. 60వ దశకంలో లలితాంబాల్ జాగ్రఫీ, హిస్టరీ టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆమె ప్రపంచాన్ని పర్యటించాలని కలలు కనేవారట. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఒక విదేశీ గడ్డపై అడుగుపెట్టింది. పాస్‌పోర్ట్ వచ్చిన వేళ ‘‘చిన్నవయసులోనే పెళ్లి అవడం, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలకేప్రా ధాన్యం ఇస్తూ వచ్చాను. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆర్థిక కష్టాలు, ఇతరప్రా ధాన్యాలతో కుటుంబ భవి ష్యత్తు వైపే ఉండటానికి నిర్ణయించు కున్నాను. నా సమయమంతా అందుకే కేటాయించాను. అయితే, నా కలలు మాత్రం ఎప్పుడూ నన్ను వీడిపోలేదు. పుస్తకాల్లో చదివిన విషయాలు, విద్యార్థులకు బోధించే సమయంలోనూ ‘ఎప్పుడైనా బయట ప్రపంచం వైపుగా ప్రయాణం చేయగలనా..’ అని అనుకునేదాన్ని. కానీ, ప్రయాణం మాట అటుంచితే కనీసం పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేకపోయాను. రెండేళ్ల క్రితం నా కూతురు మేఖల పాస్‌పోర్ట్‌కు అప్లై చేయమని చెప్పింది. ప్రయత్నించాను. 83 ఏళ్ల వయసులో నా చేతుల్లోకి పాస్‌పోర్ట్ వచ్చింది. నాలుగేళ్ల క్రితం.. నెదర్లాండ్స్‌లో నా మనవరాలు స్థిరపడింది. తన పొదుపు మొత్తంతో నా కలను నిజం చేయడానికి తను బాధ్యత తీసుకుంది. నా దగ్గర కూడా కొంత పొదుపు మొత్తాలున్నాయి. అయితే, మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా నా భర్త మరణించడంతో అన్నీ ఆగిపోయాయి. యూరప్ అంతా... ప్రస్తుతం ఉన్న వయసు, ఆరోగ్యస్థితి కారణంగా విదేశాలకు వెళ్లగలనా, కుటుంబంలో మిగతా అందరికీ ఆందోళనగా మారుతుందా అని మొదట్లో సంకోచించాను. కానీ, పిల్లలు ఇచ్చిన ధైర్యంతో ఎట్టకేలకు ఆమ్‌స్టర్‌డామ్‌లో దిగాను. మా అమ్మాయితో కలిసి మూడు నెలల పాటు యూరప్ అంతా ప్రయాణించాను. భౌగోళికం, చరిత్రలో విద్యార్థులకు బోధించిన విషయాలు కళ్లారా చూడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందులో ఒక ఉదాహరణ.. రిజ్క్ మ్యూజియంలోని అతి పెద్ద వాటర్లూ యుద్ధం పెయింటింగ్ చూసి ఊపిరి పీల్చుకున్నాను. ఊహల్లోకంటే వాస్తవికంగా చూసినప్పుడు ఆ పెయింటింగ్ మరింత అద్భుతంగా అనిపించింది. ఈతరాణిగా.. విమానాల్లో తిరగడం, నీటిపై లాంచీలో విహారం ఎన్నో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతితో కలిసి ప్రజలు సాగిస్తున్న జీవితాలను చూశాను. ఒక ట్రిప్ నుండి మరొక ట్రిప్‌కు వెళ్లడంలో ఎన్నో భయాలు దూరమయ్యాయి. నా చిన్నతనం కేరళలో గడిచింది. మేమున్నప్రా ంతంలో ‘ఈతరాణి’ అనే పేరుండేది నాకు. కానీ, ఆ తర్వాత జీవనంలో అదీ మర్చిపోయాను. 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈత కొడుతున్నాను. ఒకప్పుడు స్వేచ్ఛగా ఈదుతూ భవిష్యత్తు గురించి కొంచెం ఎక్కువ కలలు కనే అదే చిన్న అమ్మాయిగా ఇప్పుడు మారిపోయాను. లొంగిపోవద్దు.. నాకు స్వతంత్రంగా ఉండే మహిళలంటే చాలా గౌరవం. వారి శక్తి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలోనే ఎన్నో పోరాటాలు, గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు లేదా వ్యక్తులకు ఎప్పుడూ వంగి, ఆధిపత్యానికి లొంగిపోవద్దు. మీ మూలాలను అస్సలు మరచిపోవద్దు. ఆర్థిక స్వాతంత్య్రం ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో సొంత నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. ఇదే విషయం చెబుతూ నా ఇద్దరు పిల్లలను, ముగ్గురు మనవళ్లను పెంచాను. ఇప్పుడు వారి సాయంతో నా దశాబ్దాల కలను నెర వేర్చుకుంటున్నాను’’ అని చెబుతుంది లలితాంబాల్. 84 ఏళ్ల వయసులో మహిళలు విస్తృతంగా ప్రయాణించడం చాలా అరుదు. కానీ, లలితాంబాల్ జీవన ప్రయా ణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్‌కు దక్కిన విజయం
మైసూరు: సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాల్లో వస్తువులను విచ్చలవిడి ధరలకు అమ్ముతుంటారు. గత్యంతరం లేక జనం కొంటూ ఉంటారు. కానీ ఎంఆర్పీ ధర కంటే వ్యాపారి రూ.20 అదనంగా తీసుకోవడంపై రిటైర్డు ఉపాధ్యాయుడు మూడేళ్లు న్యాయ పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఈ సంఘటన మైసూరులో జరిగింది. వివరాలు.. సత్యనారాయణ 2019లో హనుమంతరాజు షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొన్నాడు. ఒక్కోటి రూ.30 కాగా మొత్తం రూ.90 అవుతుంది. కానీ హనుమంతరాజు రూ.110 వసూలు చేశాడు. ఇందుకు బిల్లు కూడా ఇచ్చాడు. ఎందుకు ఎక్కువ తీసుకున్నావని సత్యనారాయణ ప్రశ్నించగా అతడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో సత్యనారాయణ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి వ్యాపారి నిర్వాకానికి గాను రూ.61 వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు. ఇప్పటివరకు విచారణ కొనసాగింది. వ్యాపారి చేసింది తప్పని నిర్ధారణ కావడంతో ఫోరం అతనికి రూ.6,020 జరిమానా విధిస్తూ, ఆ సొమ్మును బాధితునికి ఇవ్వాలని తెలిపింది. చదవండి: (Chandana: పుట్టిన రోజు నాడే డెత్ నోట్ రాసి..) -
రిటైర్డ్ హెచ్ఎం రాంభూపాల్‌రెడ్డి ఔదార్యం
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్‌కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు. గతంలో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన) -
ఏమైందో ఏమో! ప్రేమగా పెంచుకున్న కుక్కే ఉసురు తీసింది!
ఒక్కోసారి మనం ప్రేమగా పెంచుకునే జంతువుల వల్లే ఇబ్బందులు తలెత్తిన ఘటనలు కోకొల్లలు. అవి ఒక్కొసారి యమపాశంగా మారి మన ప్రాణాలను తీసేంత వరకు వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధురాలు తన కొడుకు పెంచుకునే జంతువు చేత హతమయ్యింది. వివరాల్లోకెళ్తే...లక్నోలోని కైసర్‌బాగ్‌లో 82 ఏళ్ల సుశీల త్రిపాఠి అనే వృద్ధురాలు తన కొడుకుతో కలిసి ఉంటుంది. ఏమైందో ఏమో గానీ వాళ్లు పెంచుకుంటున్న బ్రౌనీ అను కుక్క ఆమె పై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో జరిగింది. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో...ఆమెకు సాయం చేద్దామని ఇరుగుపొరుగు వారు స్పదించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే లోపల నుంచి తాళం వేసి ఉండటంతో వారు కూడా ఏం చేయలేకపోయారు. ఇంతలో ఆమె కొడుకు వచ్చి చూచేట్టప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అతను ఆస్పత్రికి తరలించిగా...ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె శరీరం పై సుమారు 12 చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఆమె కొడుకు పిట్‌బుల్, లాబ్రడార్ అనే రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. అతని తల్లిపై దాడి చేసిన బ్రౌని అనే కుక్కను మూడేళ్ల క్రితమే తీసుకువచ్చారు. ఏదీఏమైన పెంచుకున్న కుక్క దాడిచేయడం అత్యంత బాధకరం. (చదవండి: ఎప్పుడూ ల్యాప్‌టాపేనా?.. స్కూటర్‌పైన వెళ్తూ కూడా అవసరమా!!) -
మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’
దేవరుప్పుల/బయ్యారం: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి కామారెడ్డిగూడెంలో కన్నుమూసిన విశ్రాంత ఉపాధ్యాయుడు, టీఆర్ఎస్ మండల నేత బిల్లా సోమిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి వరకు మాస్టారి పాడె మోసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. సోమిరెడ్డి భౌతికకాయాన్ని మంత్రి మంగళవారం సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. తాను పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి రాజకీయ సూచనలు, సలహాలు అందజేసిన మాస్టారు సేవలు మరువలేనివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పంచాయతీలకు బాకీ లేదు: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు సర్పంచులను రెచ్చగొడుతున్నారన్నారు. కరోనా మూలంగా మూడేళ్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయని మాట వాస్తవమేనన్నా రు. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. చదవండి: (పలుమార్లు లైంగిక దాడి.. వారం రోజుల క్రితం) -
100 మందికి సుకన్య సమృద్ధి యోజన
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణతో వచ్చిన సంపాదనతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం వాసి రాంభూ పాల్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అంశాన్ని ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ‘‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలే నంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూ పాల్ రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెం ట్ తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతో పాటు వారికి రూ.25 లక్షలు డిపాజిట్ చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. (క్లిక్: ఇందుకూరు పేట.. కూరగాయల తోట) -
అక్షరానికి దూరమైన బాల్యం కోసం ‘ఆమె’ తాపత్రయం..!
Sabiha Hashmi Story In Telugu: ఒక మంచి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మార్గం కూడా ఉంటుంది. సమయం కూడా వస్తుంది. అందుకు ఉదాహరణ సబిహా హష్మి. స్కూల్ డ్రాప్ అవుట్లుగా మిగులుతున్న బాలికల కోసం ఆమె ఏడు పదుల వయసులో మళ్లీ ఉద్యోగం చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన సబిహా హష్మి నేషనల్ మ్యూజయమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్జర్వేషన్ అండ్ మ్యూజయాలజీలో పీహెచ్డీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్లోని హెరిటేజ్ స్కూల్లో పిల్లలకు స్కెచింగ్, పెయింటింగ్, కళల చరిత్ర బోధించేవారు. పిల్లలకు బోధనేతర విజ్ఞానం కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లేవారు. ఓసారి ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి కుగ్రామాల్లో నివసించే అమ్మాయిలను చూసి బాధపడేవారామె. స్కూలు వయసులోనే చదువు మానేసి పెళ్లి చేసుకుని చంకలో బిడ్డతో, ఇంటి బాధ్యతలు మోస్తున్న ఆడపిల్లలు కనిపించేవారు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. అక్షరానికి దూరమైన బాల్యం ఆమె గుండెను కదిలించేది. అయితే వాళ్ల కోసం తాను చేయగలిగిందేమీ ఆమెకు కనిపించలేదు. అప్పటికామె చేయగలిగింది బాధపడి ఊరుకోవడమే. ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్లకు ఆమె పిల్లల దగ్గరకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె 2010 లో కర్నాటక, రామనగర జిల్లా, జ్యోతిపాళయ గ్రామానికి వచ్చారు. ‘‘ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా హిమాలయ పర్వత గ్రామాల్లో చూసినటువంటి దృశ్యాలు కనిపించాయి. నేను అక్కడ చూసినప్పుడు అక్కడి అమ్మాయిల కోసం ఏదైనా చేయాలంటే తగిన ఆర్థిక వెసులుబాటు లేదు. ఇప్పుడైతే నాకు చేతనైనదేదో చేయగలను... అనిపించింది. గ్రామం శివారులో మా పొలానికి సమీపంలో చిన్న కాటేజ్ కట్టించి బాలికలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలు పెట్టాను. నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చే బాలికల్లో ఓ ఎనిమిది మందికి పుస్తకాలు కొనుక్కోవడం కూడా కష్టమేనని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. వాళ్ల చదువు కొనసాగాలంటే పుస్తకాల వంటి కనీస అవసరాలు తీరాలి. నాకు కొంత స్థిరమైన సంపాదన ఉంటే తప్ప సాధ్యం కాదనిపించింది. దాంతో స్థానికంగా ఓ స్కూల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అలాగే నాకు ఆర్ట్, క్రాఫ్ట్ కూడా తెలిసి ఉండడంతో పిల్లలకు పాఠాల తర్వాత బొమ్మలు వేయడం, కార్డ్‌బోర్డుతో బుక్ రాక్, పెన్సిల్ హోల్డర్, రిమోట్ బాక్సులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలు వంటి ఇంటి వాడుకలో అవసరమైన వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం కూడా నేర్పిస్తున్నాను. వీటిని నెలకోసారి నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న స్కూల్లో స్టాల్ పెడతాం. చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా ఉత్పత్తులను తీసుకుంటుంది. అలా వచ్చిన డబ్బుతో జ్యోతిపాళయంలో చదువుకు దూరమైన ఆడపిల్లల చదువు కొనసాగుతోంది. నలుగురు విద్యార్థినులు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఈ మధ్యనే ఒకమ్మాయి బీఈడీ పూర్తి చేసింది. ఒకమ్మాయి బీకామ్ 74 శాతంతో పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేస్తోంది. నా దగ్గర చదువుకుంటున్న వాళ్లలో బాలికలతోపాటు పెళ్లయిన యువతులు, బిడ్డ తల్లులు ఉన్నారు. పరీక్షలు రాసి పై చదువులకు వెళ్లలేకపోయినప్పటికీ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటామని వచ్చే వాళ్లు, చదువుకోవడం ద్వారా తమకంటూ ఒక గుర్తింపు కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లను చూసినప్పుడు వాళ్ల చేత స్కూల్ డ్రాప్ అవుట్ చేయించి పెళ్లి చేసినన తల్లిదండ్రుల మీద ఆగ్రహం కలుగుతుంటుంది కూడా’’ అంటారు సబిహా హష్మి. అజ్జి లైబ్రరీ! సబిహ తన డెబ్బై రెండేళ్ల వయసులో తన అక్షరసేవను పాఠ్యపుస్తకాల నుంచి కథల పుస్తకాలకు విస్తరింపచేశారు. పిల్లల పుస్తకాలతో ఒక మోస్తరు లైబ్రరీని ఏర్పాటు చేశారామె. ఆ లైబ్రరీ పేరు ‘అజ్జిస్ లెర్నింగ్ సెంటర్’. అజ్జి లైబ్రరీకి జ్యోతిపాళయం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా వారానికోసారి వచ్చి పుస్తకాలు తీసుకెళ్లి చదువుకుంటున్నారు. ఆమె సర్వీస్‌ను చూసిన వాళ్లు ప్రశంసలతో సరిపుచ్చకుండా లైబ్రరీ విస్తరణ కోసం విరాళాలిస్తున్నారు. దాంతో ఆమె కంప్యూటర్ ట్రైనింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అజ్జి లెర్నింగ్ సెంటర్‌ను పిల్లల సమగ్ర వికాసానికి దోహదం చేసే వేదికగా మలచాలనేదే తన కోరిక అంటారామె. ఇలాంటి వాళ్లు ఊరికొక్కరు ఉన్నా చాలు. బడికి దూరమైన అమ్మాయిల జీవితాలు అక్షరాలా బాగుపడతాయి. చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే.. -
జ్ఞానాన్ని పంచుతూ.. పఠనాసక్తిని పెంచుతూ..!
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్‌గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి. అధునాతన వసతులతో నూతన భవనం ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్‌లు, రీడింగ్హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు. ముప్పైకి పైగా రచనలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రామానికి గర్వకారణం కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం. – ఎడ్ల మహేందర్‌రెడ్డి, సర్పంచ్, వెల్లంకి -
వయసు 73.. వరుడు కావలెను; నెటిజన్ల ప్రశంసలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇటీవల 73ఏళ్ల రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు జీవిత భాగస్వామి కోసం ‘వరుడు కావలెను’ అని పెళ్లి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన స్థానికంగానూ, సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా చర్చకు దారితీసింది. చాలామంది ఆమె ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనను మెచ్చుకోగా, మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినవారూ ఉన్నారు. ఇంకొందరు ఈ బామ్మ ట్రెండ్‌సెటర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరు, వయసేంటో మర్చిపోయావా బామ్మా అని ఇంకొకరు.. ఇలా తలా ఒక మాట అన్నవారూ ఉన్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అంతర్లీన సమస్యపై మాత్రం ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు. ఒంటరి జీవితం.. ప్రకటనలో ఆమె ..‘సంప్రదాయ కుటుంబం, ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్ల పైబడిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాన’ని తెలిపింది. ఆమె తన గురించి తెలియజేస్తూ– ‘నాకు నా సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా మొదటి వివాహం, విడాకులు బాధాకరమైనవి కావడంతో ఇన్నేళ్లుగా తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒంటరి జీవితం నన్ను భయపెడుతోంది. ఎవరి సాయం లేకుండా బస్‌స్టాప్ నుండి ఇంటికి, ఇంటి నుండి బయటకు నడవడానికి, ఇంట్లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడుతున్నాను. అందుకే జీవితభాగస్వామి కోసం చూస్తున్నాన’ని తెలిపింది. మూసధోరణులు విచ్ఛిన్నం వివాహం, జీవిత భాగస్వామి అనే విషయాలు ఇంకా మన వ్యవస్థలో సంప్రదాయక కోణం నుంచే ఆలోచిస్తున్నారు. కానీ, ఒంటరి జీవితానికి ఏ వయసులోనైనా తోడు అవసరం అనే విషయం అంతగా పట్టించుకోరు. అందుకే, ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే, యువత నుంచి మాత్రం ఆమె నిర్ణయం సమాజంలో సాంస్కృతిక మూసలను విచ్ఛిన్నం చేస్తుందని విపరీతంగా ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తలు ఈ విషయం పట్ల స్పందిస్తూ ‘మహిళలు అనేకాదు మగవారు కూడా ఒంటరితనం పట్ల భయపడుతుంటారు. అయితే, భాగస్వామి కోసం ఎంచుకునే స్వతంత్రం మగవారికే అధికంగా ఉంటుంది. దీనినే ఇప్పటివరకు సమాజం ఆమోదిస్తూ వచ్చింది. ఇలాంటి ధోరణికి ఈ ప్రకటన ఓ సమాధానం అవుతుంది’ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అద్దం ‘సమాజంలో వృద్ధుల పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయని’ మానసిక నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఒంటరిగా ఉండే వాళ్లు తోడు కోరుకుంటారు. అయితే, ఆమె సంప్రదాయ కోణంలో జీవితాంతం ఉండే తోడు అవసరం గురించి ఆలోచించి ఆ ప్రకటన ఇచ్చింది. చాలాకాలంగా మూస పితృస్వామ్య ఆలోచనకు, యవ్వనంగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటారనే ఆలోచనలకు ఈ ప్రకటన ఒక అడ్డంకిని తొలగిస్తుంది. ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన 69 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు తోడుగా ఉంటాననే స్పందన రావడం గమనార్హం. -
67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు!
చెన్నై: ఉద్యోగవిరమణ చేసిన వారు, వయసుపైబడిన వృద్ధులు కృష్ణా..రామా అనుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడిపేందుకు మొగ్గుచూపుతారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు... వయసులో ఉన్నప్పుడు చేయలేనివి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడితో తాము కోల్పోయిన వాటిని సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ తాతయ్య గేట్ పరీక్ష రాసి ఔరా అనిపించాడు. సాధారణంగా ఇరవై ఏళ్లు లేదా ముఫై ఏళ్లలోపు విద్యార్థులు గేట్ పరీక్షను క్లియర్ చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటిది మనవళ్లు ఉన్న 67 ఏళ్ల శంకరపాండియన్ ఈ ఏడాది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)–21లో ఉత్తీర్ణత సాధించి సంచలనం సృష్టించారు.తమిళనాడుకు చెందిన పాండియన్ హిందూ కాలేజీలో మ్యాథమేటిక్స్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత తన చిరకాల కోరికైన గేట్ పరీక్ష కోసం సన్నద్దమయ్యి విజయం సాధించారు. ఈ ఏడాది గేట్లో ఉత్తీర్ణత సాధించిన వారిలో పాండియన్ అతిపెద్ద వయస్కుడు. ఎక్కువమంది విద్యార్థులు తమ స్పెషలైజేషన్ సబ్జెక్టు ఆధారంగా ఒక్క పేపర్‌ను ఎంచుకుంటారు. పాండియన్ రెండు పేపర్లు తీసుకుని మంచి మార్కులు సాధించారు. మ్యాథమేటిక్స్‌లో 338 మార్కులు, కంప్యూటర్ సైన్స్‌లో 482 మార్కులు సాధించి గేట్ పరీక్ష పాసయ్యాడు. రెండు పేపర్లను ఒకేరోజు రెండు షిప్టుల్లో రాసి ఉత్తీర్ణత సాధించడం విశేషం. వర్చువల్ రియాల్టీలో పరిశోధనలు చేయడం కోసమే గేట్ పరీక్ష రాశానని పాండియన్ చెప్పారు. అగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్)లో పరిశోధనలు చేస్తానని, ముఖ్యంగా ‘స్పెసిఫిక్ ప్రాబ్లం అకల్షన్’పై దష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు. కాగా రియల్ వరల్డ్ ఆబెకట్ట్స్కు హోలోగ్రామ్స్ తయారు చేయడంలో ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది.పాండియన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది గేట్ పరీక్షలో ఫెయిల్ అయినా మరోసారి కచ్చితంగా గేట్ పరీక్ష రాసేవాడిని. ఫెయిల్ అవుతానన్న భయం నాకులేదు. ఇది చాలా పోటీతోకూడుకున్న పరీక్ష. గేట్పరీక్షకు హాజరయ్యేవారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. నేను డిగ్రీ కోసమో, మంచి ప్యాకేజీ ఇచ్చే జాబ్ కోసమో ఈ పరీక్ష రాయలేదు. అగ్మెంటెడ్ రియాల్టీలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేసి నా జ్ఞానాన్ని మరింత పెంచుకోవాలనుకున్నాను. అందుకే ఎటువంటి టెన్షన్ పడకుండా 30 రోజుల్లో కాన్సెప్ట్స్ నేర్చుకుని... చాలా ఆనందంగా ఈ పరీక్ష ను రాశాను. 35 ఏళ్ల క్రితం ఒకసారి 1987 లో గేట్ పరీక్ష రాసాను. అప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చింది. అప్పటి గేట్ పేపర్‌కు ఇప్పటి పేపర్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో పరీక్ష రాస్తే ఫలితాలు రావడానికి నెలలు పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం వల్ల త్వరగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి పరీక్షల వ్యవస్థ సౌకర్యంగానే గాక వేగంగా కూడా ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘పరీక్ష రాయడానికి హాలులోకి వెళ్లినప్పుడు పేరెంట్స్ వెయిటింగ్ హాల్ అటువైపు ఉంది వెళ్లండని సిబ్బంది చెప్పారు. నన్ను చూసినవారంతా పరీక్ష రాయడానికి వచ్చానని అనుకోలేదు’’ అని పాండియన్ నవ్వుతూ చెప్పారు. -
తెలుగుపై మమకారం.. సామాజిక రుగ్మతలపై చైతన్యం
సాక్షి, మహబూబ్‌నగర్ : సామాజిక రుగ్మతలు వెలుగు చూసినా.. అమానవీయ సంఘటన జరిగినా.. వాటి కుళ్లును తన కవితల ద్వారా ఇట్టే కడిగేస్తారు కవి ఖాజామైనొద్దీన్.. తెలుగు భాష కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా తన కవితాగానంతో భాషాభిమానుల హృదయాలను చూరగొంటున్నారు.. వివిధ రాష్ట్రాల్లో పలు సంస్థలు నిర్వహించే తెలుగు, ఇంగ్లిష్, హిందీ సాహిత్య సభల్లో అనువాదకుడిగా పాల్గొంటూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ కవులు నరసింహమూర్తి, వల్లభాపురం జనార్దన, సోదరుడు మహమూద్‌ల స్ఫూర్తితో కవిగా రాణిస్తున్నాను. మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని చవిచూశాను. సామాజిక మార్పే లక్ష్యంగా రచనలు రావాలి. సాహిత్యరంగం ద్వారా నేటికీ సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మరో తెలుగు కవితా సంపుటిని వెలువరిస్తాను. – ఖాజామైనొద్దీన్, కవి కుటుంబ నేపథ్యం.. పెబ్బేరు మండల కేంద్రానికి ఖాజామైనొద్దీన్ తన విద్యాభ్యాసం పెబ్బేరు, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో పూర్తి చేసుకున్నారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన హిందీ విద్వాన్లో పాసై టీటీసీలో శిక్షణ పొందిన అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకమై 2014లో రిటైర్డ్ అయ్యారు. సాహిత్యసేవను ప్రవృత్తిగా మార్చుకొని కవిత్వంపై ఉన్న ఉత్సాహంతో కవిగా, రచయితగా ఎదిగి కవి సమ్మేళనాల్లో పాల్గొని తనదైన బాణిలో కవితాగానం చేస్తూ సాహిత్యాభిమానుల మన్ననలు పొందుతున్నారు. బహుమతులు, సన్మానాలు.. ఖాజామైనొద్దీన్ కవితలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందడమే కాకుండా అనేక మ్యాగజైన్లు, పత్రికల్లో ప్రచురించబడ్డాయి. విద్యార్థి దశలో రచించిన కవితలకు నగదు బహుమతులు, ప్రశంసపత్రాలు లభించాయి. పాలమూరు గోస, పాలమూరు కవితలు అనే సంకలనాల్లో కొన్ని చోటు దక్కించుకున్నాయి. 1972లో పాఠశాల స్థాయిలో మినీ కథను రాసి ప్రథమ బహుమతి అందుకున్నారు. 1973లో జూనియర్ కళాశాల స్థాయి మ్యాగజిన్లో మొదటి కవిత ప్రచురణ అయ్యింది. 1977లో డిగ్రీలో ఖాజామైనొద్దీన్ సంపాదకత్వంలో పత్రిక విడుదల చేశారు. 1978లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన కవితలలో మొదటి బహుమతి దక్చించుకున్నారు. 2006లో పాలమూరు జిల్లాతోపాటు హైదరాబాద్, కర్నూలు, కృష్ణ, ఖమ్మం, వరంగల్, విజయనగరం, కడప జిల్లాల్లో జరిగిన కవి సమ్మేళనాలకు హాజరై ప్రతిభచాటారు. 2008 హర్యానా రాష్ట్రంలోని అంబాలలో నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. 2009 నాగార్జునసాగర్‌లో నిర్వహించిన సజన సంగమం కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే భువనేశ్వర్, వార్దా, చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ రైటర్స్ ఫెడరేషన్ సదస్సుల్లో పాల్గొన్నారు. డెహ్రడూన్‌లో జరిగిన లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ సెమినార్ వారి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పలు రాష్ట్రస్థాయి తెలుగు సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 2014లో ‘చెమట ప్రవాహమై పారినా’ కవితా సంపుటిని రచించారు. హైదరాబాద్‌లో ప్రసిద్ధ రచయిత సినారేచే ప్రశంసాపత్రం అందుకున్నారు. 2016లో చత్తీస్గడ్ రాష్ట్రం దుర్గ్, 2017లో విశాఖపట్నంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. 2017లో కరీంనగర్, అనంతపూర్‌లలో జరిగిన గిన్నిస్ రికార్డు కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితాగానాన్ని వినిపించారు. 2018లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో, బెంగుళూర్లో జరిగిన ఇండోఏషియన్ అకాడమీ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ ఏడాదిలో పలుచోట్ల జరిగిన కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితలు వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
బామ్మ బాట.. బంగారం పంట
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: ఉద్యోగ విరమణ పొందాక ఆమె విశ్రాంతిని కోరుకోలేదు. వ్యవసాయం చేస్తూ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ సాగుబాట పట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమే జంగారెడ్డిగూడెంకు చెందిన కేసనపల్లి లక్ష్మీకాంతం. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా తండ్రి శ్రీరాములు వ్యవసాయదారుడు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 1954లో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరాను. పోలవరం, కోండ్రుకోట, లక్ష్మీపురం, పైడిపాక, చేగొండపల్లి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1992లో ఉద్యోగ విరమణ పొందాను. బాధ్యతలన్నీ తీరిపోవడంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో నాకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాను. సేంద్రియ ఎరువులతోనే పామాయిల్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు వేసి వ్యవసాయాన్ని ప్రారంభించాను. జామను ఒడిశాలో కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం పామాయిల్, కోకో పంటలు సాగుచేస్తున్నాను. పొలానికి నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం తదితర పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయమే నా ఆరోగ్య రహస్యం. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పనులు ముగించుకుని పొలానికి వెళ్తుంటాను.’ -
చందాలు వేసుకుని సర్పంచ్‌గా గెలిపించి..
నాంపల్లి (మునుగోడు) : 29సంవత్సరాలుగా బోధనావృత్తిలో కొనసాగి రిటైర్డ్ అయిన ఆ ఉపాధ్యాయుడిని ఆ ఊరి ప్రజలు చందాలు వేసుకుని సర్పంచ్‌గా గెలించారు. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ఈ సారి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇందుకు తీర్మానాలు సైతం చేశారు. దీంతో 95శాతం మంది గ్రామస్తులు మునగాల సుధాకర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. కానీ కొందరు నామినేషన్ వేసిన కారణంగా గ్రామస్తులంతా ముందుకొచ్చి ఎలాగైనా సుధాకర్‌రెడ్డిని సర్పంచ్‌గా గెలిపించుకోవాలని ఇంటికి తమకు తోసినంతా చందాలు వేశారు. మొత్తంగా రూ.లక్ష 7వేలు జమ చేశారు. వీటిలోనుంచే రూ.2వేలు నామినేషన్, రూ.3,700 పేపర్లు, వాల్ పోస్టర్లకు ఖర్చు చేశారు. గ్రామంలో 1,118 ఓట్లు ఉంటే అందులో 970 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుధాకర్‌రెడ్డి 880ఓట్లు సాధించారు. దాదాపు 800 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే ఈ గ్రామస్తులు మాత్రం ఓ మంచి వ్యక్తిని సర్పంచ్‌గా నిలబెట్టి తమ సొంతఖర్చుతో గెలి పించుకోవడం గొప్ప విశేషం. సుధాకర్‌రెడ్డి తండ్రి మునగాల రాంరెడ్డి ఉమ్మడి ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రంలో 1956లో మొట్ట మొదటిగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యి 1978 వరకు సేవలందించారు. ఇప్పుడు ఆయన కొడుకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన గ్రామప్రజల రుణం తీర్చుకుంటా. గ్రామాభివృద్ధికి పాటుపడాను. గ్రామానికి బస్సు వచ్చేలా కృషి చేస్తా. గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. -
సీపీఎస్ రద్దు ఉద్యమానికి మద్దతు
విజయనగరం అర్బన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు కోరుతూ చేపడుతున్న ఉద్యమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పలువురు పదవీ విరమణ ఉపాధ్యాయులు ప్రకటించారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలువురు పదవీ విరమణ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వచ్చే నెల 1న స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న ముట్టడి కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలుపుతామని తెలిపారు. న్యాయపరమైన హక్కుల సాధన పోరాటాల వల్లే సాధ్యమని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు అన్నారు. పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులు ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి జేసీ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.కృష్ణ, పదవీ విరమణ చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉపాధ్యాయిని హత్య
కావలి అర్బన్: విశ్రాంత ఉపాధ్యాయురాలు హత్యకు గురైన ఘటన శనివారం మధ్యాహ్నం స్థానిక కచ్చేరిమిట్ట పోస్టాఫీస్ సమీపంలో వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీసుల సమాచారం మేరకు.. స్థానిక కచ్చేరిమిట్టలో గోసిపాతల సుధాకర్, దావులూరి జయలక్ష్మి (68) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. చాలా ఏళ్ల క్రితం భర్త సుధాకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా, కుమారుడు శాంతివర్ధన్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. జయలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కచ్చేరిమిట్ట పోస్టాఫీస్ సమీపంలోని తన ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఇంట్లోకి పురుగులు వస్తున్నాయని లైట్లు కూడా ఆపేసినట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే ఆమె ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. శనివారం మధ్యాహ్నం ఆమె హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జీఎల్ శ్రీనివాసరావు, ఎస్సై వెంకటేశ్వర రాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసి ఆధారాలు గుర్తించకుండా కారం చల్లినట్లు గుర్తించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ సభ్యులు వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ ఇంట్లోని మృతదేహం వద్ద నుంచి కచ్చేరిమిట్టలోని వెంకటేశ్వరస్వామి వీధిలో దక్షిణం వైపుగా కొంతదూరం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ అయ్యానంటూ మామకు అల్లుడి ఫోన్
సాక్షి ప్రతినిధి, వరంగల్: హన్మకొండలో నివాసముంటున్న ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో ఉంటున్న అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘మామయ్య నేను హైదరాబాద్‌లో వేరే చోట ఉన్నాను. అర్జంటుగా పద్నాలుగు లక్షల రూపాయలు రెడీ చేయండి. ఎందుకు ? ఏమిటీ అనే వివరాలు మీకు తర్వాత చెప్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అదే నంబర్‌కు మళ్లీమళ్లీ ఫోన్ చేస్తే... అవతలి వైపు వ్యక్తులు మారుతున్నారు.. కానీ డబ్బులు సిద్ధం చేయాలనే డిమాండ్ మారడం లేదు. దీంతో అల్లుడు కిడ్నాప్ అయ్యాడని భావించిన మామ నగదు సిద్ధం చేసే పనిలో పడిపోయాడు. ఒక్కరోజులో అంత డబ్బు సర్దుబాటు చేయలేక ఇబ్బందిపడ్డాడు. శ్రేయోభిలాషుల ద్వారా ఓ మాజీ ఎంపీకి సమస్య చెప్పుకున్నాడు. అలాఅలా విషయం పోలీసులకు చేరింది. పబ్లిక్ గార్డెన్లో అనుమానితులు అదుపులోకి.. ఒకేసారి రూ.14 లక్షలు సర్దుబాటు చేయలేమని, కేవలం రూ.4 లక్షలు ఇవ్వగలనంటూ మామ ఫోన్లో అవతలి వ్యక్తులకు చెప్పాడు. ఈ నగదుతో తాము హైదరాబాద్ రాలేమని, మీరే వరంగల్ రావాలంటూ కోరాడు. సాయంత్రం పబ్లిక్ గార్డెన్లో నగదు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. దీంతో హైదరాబాద్ నుంచి డబ్బుల కోసం ముగ్గురు వ్యక్తులు బయల్దేరారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు పబ్లిక్ గార్డెన్‌కు వచ్చి డబ్బులు తేవాల్సిందిగా ఫోన్ చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో అక్కడే వేచి ఉన్నారు. తీరా డబ్బులు ఉన్నట్లుగా భావిస్తున్న బ్యాగును ఇచ్చే సమయంలో మఫ్టీలో ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ హఠత్పరిమాణానికి వారిలో ఒకరు పారిపోగా .. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడే ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. బాకీ తగాదాయే కారణం.. ఉమ్మడి వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ఇతర పార్ట్నర్లతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో పార్ట్నర్లకు భారీ మొత్తంలో బాకీపడ్డాడు. బాకీ ఎంతకు ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లో ఓ పోలీస్‌స్టేషన్‌కు పం చాయతీ చేరింది. అక్కడ విషయం సెటిల్ చేసేందుకు రంగం సిద్ధమైంది. భాగస్వాములు,పోలీసుల నుంచి ఒత్తి డి పెరగడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి... తన అప్పులు తీర్చేందుకు డబ్బులు ఇవ్వాలంటూ వరంగల్‌లో ఉన్న మామను ఫోన్లో కోరాడు. మొత్తం విషయం చెప్పకుండా అర్జంటుగా డబ్బులు కావాలంటూ కంగారుగా, గాబరాగా చెప్పడంతో అల్లుడు కిడ్నాప్ అయినట్లుగా మామ భయపడ్డాడు. చివరకు కిడ్నాప్ జరగలేదని, పార్ట్ నర్ల మధ్య తగదా అని తేలడంతో కథ సుఖాంతమైంది. -
రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
వాల్మీకిపురం: కలకడ మండలంలో రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు. వారు శనివారం వాల్మీకిపురం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా చిన్నమండెం మండలం వండాడి తూర్పుపల్లెకు చెంది న ప్రతాప్‌రెడ్డి (26), సంబేపల్లె మండలం చిన్నపాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆనందరెడ్డి (26), చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల గ్రామానికి చెందిన యశ్వంత్ (20), తెలం గాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పూలకల్లు మండలం కొరంపల్లెకు చెందిన బాలరాజు (24), కలకడ మండలం కోన గ్రామానికి వెంగన్నగారిపల్లి హరిజనవాడకు చెందిన క్రిష్ణయ్య కుమారుడు రామాంజులు (25) ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. కలకడ మండలం కోన గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గుడ్ల రాజన్నను ఈ నెల 4వ తేదీన కిడ్నాప్ చేశారు. మదనపల్లిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాజన్న కుమారుడు కాశీనాథ్‌కు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాశీ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ శ్రీధర్‌నాయుడు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ ఈఎంఐ నెంబర్లు ఆధారంగా శుక్రవారం తలకోనలో పట్టుకున్నారు. వారు వాడిన ఇండికా కారును, సెల్ఫోన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ సమక్షంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. ఎస్ ఐలు వెంకటేష్, చాన్‌బాషాను డీఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు. -
ఉపాధ్యాయుడి కిడ్నాప్ కలకలం
చిత్తూరు, కలకడ : పట్ట పగలు దుండగులు విశ్రాంత ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారు. రూ.10 లక్షలు వెంటనే ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. తర్వాత రోడ్డుపై వదిలేశారు. ఈ సంఘటన బుధవారం కలకడ మండలం కోన గ్రామంలో జరిగింది. బాదితుడు, పోలీసుల కథనం మేరకు.. కోనకు చెందిన గుడ్ల రాజన్న(75) విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆయనకు బుధవారం గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. బొప్పాయి పంటను కొనుగోలు చేస్తామని బుధవారం ఉదయం 8 గంటలకు కోనలోని పొలం వద్దకు రావా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన రాజన్నను దుండగులు మాటల్లో పెట్టి కారులో బలవంతంగా ఎక్కించారు. కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గుర్రంకొండకు, అక్కడి నుంచి చెర్లోపల్లె వద్దకు తీసుకువచ్చారు. దీంతో హతాశుడైన రాజన్న నగదు కలకడ బ్యాంకులో ఉందని, అక్కడికి తీసుకెళితే ఇస్తానని చెప్పాడు. కలకడ సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్దకు చేరుకోగానే తమ గ్రామానికి చెందిన వ్యక్తి నగదు తీసుకువచ్చాడని రాజన్న చెప్పడంతో దుండగులు వాహనం నిలపకుండా చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలోని మహల్ క్రాస్ వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు అతన్ని దించేశారు. తాము తిరిగి గురువారం వస్తామని, నగదు సిద్ధంగా ఉంచాలని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు తన కుమారులకు సమాచారం అందించగా పోలీసులు ఫిర్యాదు చేశారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, కలకడ ఎస్ఐ చాన్‌బాష కేసు దర్యాప్తు చేపట్టారు. -
మోదీకి లేఖ రాసిన 84ఏళ్ల వృద్ధురాలు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 84ఏళ్ల రిటైర్డ్ టీచర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రే స్వయంగా మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా వెల్లడించారు. తాను ఇచ్చిన 'గివ్ ఇట్ ఆప్' పిలుపుకు స్పందించిన ఆమె సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకుందని చెప్పారు. ఆమె లేఖలో సారాంశం ఇలా ఉంది. దేశంలోని పేద తల్లులకు మీరు మంచి చేస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వారికి విముక్తిని కల్పిస్తున్నారు. దేశంలోని పేద తల్లులకు పొగరాని పొయ్యిలను అందించడానికి తన వంతుగా 50వేల రూపాయల సాయం చేస్తున్నానని ఆమె తెలిపారు. కాగా లేఖపై స్పందించిన మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ఆమె గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఎంత డబ్బు సాయం చేశారనేది ముఖ్యం కాదని అన్నారు. పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న ఓ తల్లి దేశంలోని సోదరుల కోసం సాయం చేయడం గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. దేశంలోని గొప్ప తల్లుల దీవెనలు తనకు ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లేఖలో ఆమె తనను ప్రధానమంత్రి మోదీగా కాకుండా మోదీ భయ్యా అని సంభోదించారని ఉద్వేగంగా తెలిపారు. ఇటువంటి సంఘటనలు దేశ ప్రజలకు ఏదైనా చేయాలనే స్ఫూర్తిని తనలో రగుల్చుతుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా 'గివ్ ఇట్ అప్' పిలుపు మేరకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పీఎం తరఫున ఆమె ఇంటికి వెళ్లిన ప్రతినిధి ఒకరు మోదీ స్వయంగా రాసిన ఉత్తరాన్ని అందజేశారు. ఎల్పీజీ సబ్సిడీ కనెక్షన్ ను వదులుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. -
అర్చకుడు.. హంతకుడు
బాబాయిని కొట్టి చంపిన కుమారుడు బైరాన్‌పల్లిలో విషాదం మద్దూరు : దేవుడి గుడిలో నిత్యం పూజలు చేసే చేతులు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. అర్చకుడి చేతిలో ఓ విశ్రాంత ఉపాధ్యాయు డు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండలంలోని బైరాన్‌పల్లిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం.. మద్దూరు మండలంలోని బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గుడ్డం లింగయ్య(72)కు, అతడి అన్న కుమారుడైన స్థానిక అంగడి వీరన్న దేవాలయ పూజారి గుడ్డం ఈశ్వరయ్యకు గ్రామ శివారులో పక్క పక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ క్రమంలో తాను సాగు చేసిన మొక్కజొన్న చేనును కోతుల బారి నుంచి రక్షించేందుకు లింగయ్య మంగళవారం కంచె వేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం తనకున్న భూమిలో కంచె వేశాడని ఈశ్వరయ్య ఆ కంచెను తొలగించాడు. ఈ విషయమై బుధవారం తెల్లవారుజామున లింగయ్య తన పాలేరు దేవులపల్లి నర్సయ్యతో కలిసి ఈశ్వరయ్య ఇంటికి వెళ్లి నిలదీశాడు. అప్పటికే ఇంట్లో పూజ చేస్తున్న ఈశ్వరయ్య కోపంతో పక్కనున్న కర్రతో బయటికి వచ్చి లింగయ్య తలపై బాదాడు. దీంతో పక్కనే ఉన్న నర్సయ్య భయంతో పరుగు పెట్టి లింగయ్య కుమారుడు వీరభద్రంకు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చే లోపే చుట్టుపక్కల వాళ్ల కేకలతో ఈశ్వరయ్య పారిపోయాడు. దీంతో రక్తపుమడుగులో ఉన్న లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ముగ్గురు భార్యలు ఉండగా.. గతంలో ఒక భార్య అనారోగ్యంతో చనిపోయింది. భార్యలు ఈశ్వరమ్మ, సోమేశ్వరమ్మ, కుమారుడు వీరభద్రం, కూతురు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చం ద్రశేఖర్, ఎస్సై తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేర్యాలకు తరలించారు. కాగా, ఈశ్వరయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. -
‘ఆవు’ద్బాంధవుడు
♦ మూగజీవాలతో విరాజిల్లుతున్న గోశాల ♦ కుకునూరులో 36 ఏళ్ల క్రితం ఏర్పాటు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోవులపై మమకారంతో గోశాలను ఏర్పాటుచేసి 36 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆయన కుటుంబం సైతం గోరక్షణలో పాలుపంచుకుంటోంది. అంతేకాదు గ్రామస్తులందరూ ఆవులను తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. వెల్దుర్తి: మండలంలోని కుకునూరు గ్రామంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు 36 ఏళ్ల క్రితం ఆరు గోవులతో ఏర్పాటు చేసిన శ్రీసీతారామ గోశాల ప్రస్తుతం అరవై మూగజీవాలతో విరాజిల్లుతోంది. గ్రామంలోని దాతల సహకారంతో పాటు తనకొచ్చే పెన్షన్‌లో సగం డబ్బులను వాటి సంరక్షణకే ఖర్చుచేస్తున్నారు. ఆవులు సంఖ్య పెరగడంతో గ్రామానికి చెందిన ఓ దాత ప్రత్యేకంగా షెడ్డు నిర్మించారు. రోజూ రూ.1200 ఖర్చు శ్రీనివాసరావు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డులో 1980లో బ్రాహ్మణులకు దానంగా వచ్చిన ఆరు ఆవులతో ఈ గోశాల ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇక్కడ 60 గోవులున్నాయి. గోశాల పక్కనే ఉన్న సీతారామ దేవస్థానం అభివృద్ధి కమిటీ గోశాల రక్షణకు పాటు పడుతున్నారు. ప్రతిరోజు మేత, దాణ కోసం రూ. 1200 ఖర్చు చేస్తున్నారు. టీటీడీ పూజలు ఏటా జనవరి 16వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో సంగారెడ్డికి చెందిన విశ్విహ ందూ పరిషత్ నిర్వాహకులు గోశాలలో గోమాత పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ మహిళలు ఆవులకు మంగళహారతులు ఇచ్చి.. బెల్లం, కుడుకలు, ఇతర ఆహార పదార్థాలు అందజేస్తారు. పండగలు, శుభకార్యాలకు గోపూజలు చేయడం పరిపాటిగా మారింది. ఆవులకు పాత షెడ్డు సరిపోకపోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడిన గ్రామస్తుడు గజవాడ వెంకటేశం రూ. 2.20 లక్షలతో ప్రత్యేక షెడ్డు నిర్మించారు. శుభకార్యాలకు పాల పంపిణీ ఆవు పాలను గ్రామంలోని ఆలయాల్లో పూజలు, ఇళ్లలో శుభకార్యాల కోసం అందజేస్తున్నారు. ఆవుల పెంపకం, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఇద్దరు కూలీలను ఏర్పాటు చేశారు. దాతలు ముందుకొచ్చి గోశాల సంరక్షణ చేపట్టాలని నిర్వాహకులు, గ్రామస్తులు కోరుతున్నారు. గోశాల అభివృద్ధికి కృషి నాతో పాటు 15 మంది సభ్యులం సీతారామ ఆలయ కమిటీగా ఏర్పడ్డాం. ఆలయ అభివృద్ధితో పాటు దాతల సహకారంతో గోశాలను అభివృద్ధి చేస్తున్నాం. ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజు అన్నదానం చేయగా వచ్చిన కట్నాలను గోశాల ఖర్చులకు వినియోగిస్తున్నాం. - నరేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శేష జీవితం ఇక్కడే మా శేష జీవితం గోశాల రక్షణకే. మాకొచ్చే 18 వేల పెన్షన్‌లో భోజనం, మందుల ఖర్చు పోగా రూ. 10 వేల వరకు ఆవుల సంరక్షణకు ఖర్చు చేస్తున్నాం. దాతలు కూడా సహాయం చేస్తున్నాం. నా కుమారులిద్దరూ నాచారం లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పూజారులు. వారు కూడా గోవుల రక్షణకు సహకరిస్తున్నారు. - శ్రీనివాసరావు, పద్మమ్మ, నిర్వాహకులు -
సార్.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను...
ఆదోని: సర్, నేను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దానిపై ఉన్న నెంబర్లు చెబితే అన్‌లాక్ చేస్తాం అని ఓ అఘంతకుడు ఫోన్ చేయగానే పట్టణంలోని సంతపేటకు చెందిన రిటైర్డ్ టీచర్ ఆరీఫుల్లా వెనకాముందు ఆలోచించకుండా ఏటీఎం కార్డుపై ఉన్న నంబరును చెప్పేశారు. 20నిమిషాల వ్యవధిలో రూ.41,900, 47,900 మొత్తం రూ.96,800 అరీఫుల్లా బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా అయ్యాయి. అయితే తన అకౌంట్ నుంచి రెండు విడతల్లో మొత్తం రూ.96,800 డ్రా అయినట్లు గురువారం తన సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ఆరీఫుల్లా అవాక్కయ్యారు. వెంటనే తన అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంక్‌కు వెళ్ళి విచారించారు. సదరుమొత్తం బెంగుళూరులోని ఓ ఏటీఎం నుంచి డ్రా అయినట్లు మేనేజర్ తెలిపారు. దిక్కు తోచని రిటైర్డ్ టీచర్ వన్ టౌన్ పోలీసుల వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నారు. గుర్తు తెలియని అఘంతకులు ఫోన్ చేసి అడిగితే ఏటీఎం నంబరు ఎలా చెప్పారంటూ ఎస్ఐ రామయ్య అడిగిన ప్రశ్నకు బాధితుడి నోట మాట రాలేదు. అగంతకులు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో పత్రికలు, టీవీల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నా అమాయకులు బలవుతూనే ఉన్నారని చెప్పేందుకు అరీఫుల్లా తాజా ఉదాహరణ. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 420ఛీటింగ్, 66సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రామయ్య తెలిపారు. రెండు విడతల్లో డ్రా అయిన మొత్తం ఫ్లిప్‌కాట్, అమెజాన్ సంస్థల బ్యాంక్ అకౌంట్లకు జమ అయినట్లు బెంగుళూరులో ఉన్న అరీఫుల్లా బంధువుల ద్వారా తెలిసిందని, అఘంతకులు ఆ రెండు సంస్థల్లో పలు వస్తువులు కొనుగోలు చేసి అరీఫుల్లా ఏటీఎం కార్డును దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోందని ఎస్ఐ రామయ్య అన్నారు. వస్తువులు ఇంకా సంబంధిత వ్యక్తులకు పంపలేదని, ఆ రెండు సంస్థల ద్వారా అగంతకులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు.