reveals
-
ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ అంటే..? ఎలా తీసుకోవాలంటే..
చాలామంది బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఏదో తిన్నాంలే అనుకుంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ రోజులో తొలి భోజనమైన ఈ అల్పాహారం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఆ విషయం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులు, పిలల్లు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని నిర్లక్ష్య చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు.అల్పాహారంలోని కేలరీ కంటెంట్, పోషక నాణ్యత ఎలా ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుందనే దానిపై అధ్యయనం చేశారు స్పానిష్ పరిశోధకులు. వారి పరిశోధనలో వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం అనేది అత్యంత కీలకమని తేలింది. అల్పాహారమే అని అల్పంగా చూస్తే.. దీర్ఘకాలిక హృదయ ఆరోగ్యంపై గట్టి ప్రభావమే చూపిస్తుందని చెప్పారు. మన దినచర్యలో ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని భాగం చేసుకునే యత్నం చేస్తే దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతాయని అన్నారు. ముఖ్యంగా జీవన నాణ్యాత మెరుగుపరిచి, ఒబెసిటీ వంటి అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం తగ్గుతుందన్నారు పరిశోధకులు. అందుకోసం 55 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న.. దాదాపు 383 మంది వ్యక్తులపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరి హెల్త్ ట్రాక్‌ల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించినట్లు తెలిపారు. ఉదయం తక్కువ కేలరీలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న వారిలో ఆరోగ్య ఫలితాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, పైగా వారి బాడీ సరైన ఆకృతిలో లేకపోవడమే గాక, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువుగా ఉన్నట్లు పరిశోధనలో వెలడైందని చెప్పారు.అంతేగాదు ఈ పరిశోధన అల్పాహారం నాణ్యాత ఎంత ముఖ్యమో అలాగే క్వాంటిటీ కూడా ముఖ్యమని పేర్కొంది. దీర్ఘకాలిక గుండె జబ్బులతో ఉన్నవారు, వృద్ధులు అల్పాహారం విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. దీంతోపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారాన్ని స్కిప్ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్‌లో ప్రచురితమైంది. 'ఐడియల్ అల్పాహారం' అంటే..సమతుల్యమైన పోషకాలతో కూడినా ఆహారమే ఐడియల్ అల్పహారం. ఇందులో రోజువారీగా కనీసం 20% నుంచి 30% కేలరీలు ఉండాలని పరిశోధన చెబుతోంది. అందుకోసం తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు కూరగాయలతో కూడినవి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన వాటికి దూరంగా ఉండాలన్నారు. సరైన మొత్తంలో అధిక-నాణ్యత కలిగిన పోషకాహారంతో మనం రోజును ప్రారంభిస్తే.. జీవక్రియ మెరుగై మొత్తం ఆరోగ్యమే బాగుటుందని పరిశోధన చెబుతోంది. రోజులో అతిముఖ్యమైన భోజనం అల్పాహరం అని స్పష్టం చేసింది. అయితే ఏం తింటున్నారు, ఎలాంటిది తింటున్నారు అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా పరిమాణం, పోషక నాణ్యత అనేవి అత్యంత కీలకమైనవని చెప్పారు పరిశోధకులు. (చదవండి: పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ) -
అమ్మ పెట్టె నల్ల చుక్కలు.. స్నానమే చేయలేదనుకుంటారు: అనన్య పాండే (ఫోటోలు)
-
బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
కీటోజెనిక్ లేదా కీటో డైట్‌ని మొట్టమొదటగా 1921లో మూర్చ వ్యాధికి ఉపయోగించేవారు. ఈ డైట్లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఉంటాయి. ఇటీవల అంతా బరవు తగ్గడం కోసి రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ డైట్‌తో బరువు తగ్గడం జరుగుతుంది కానీ పరిశోధనలో ఈ డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయని తేలింది. ఇది అంత ఆరోగ్యకరమైనది కాదని వెల్లడయ్యిందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటానికి సమహయపడే డైట్‌ని అనుసరించడం ముఖ్యమని చెబుతున్నారు. అసలు ఈ డైట్ ఎలా మంచిది కాదో సవివరంగా చూద్దాం. కీటో డైట్ ఆరోగ్యానికి సురక్షితమైనదేనా కాదా? అని సుమారు 53 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వారికి తక్కువ చక్కెరతో కూడిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఇవ్వగా వారి శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్‌కి బదులుగా కాలేయం నిల్వ చేసిన కొవ్వులను ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని గుర్తించారు. దీన్ని కీటోన్ బాడీల ద్వారా కొవ్వులను కాల్చడం అని అంటారు. ఈ డైట్ ప్రకారం వారంతా 20 నుంచి 50 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇలా కీటోసిస్ స్థితికి చేరడానికి కొన్ని రోజుల పడుతుంది. ఇందుకోసం అదిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది హానికరమేనని చెబుతున్నారు. ఇక్కడ కీటోడైట్‌లో తీసుకునే ఆహారాల్లో కొబ్బరి నూనె, వెన్న, చికెన్, గుడ్లు, అని కూరగాయలు, కాయధాన్యాలు, పిండి, వోట్స్, చిక్కుళ్ళు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, కాటేజ్ చీజ్, మేక, ఫెటా చీజ్ తదితరాలు ఉంటాయి. అలాగే ఈ డైట్ కోసం వోట్స్, కేకులు శుద్ధి చేసిన పిండితో చేసిన డెజర్ట్‌లు, అధిక కార్బ్ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ కీటో డైట్‌ని అనుసరిచిన 12 వారాల తర్వాత సగటున శరీరంలో 2.9 కిలోల మేర కొవ్వు తగ్గుతుందన పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ చక్కెర నిరోధిత ఆహారం కారణంగా 2.1 కిలోల బరువు కోల్పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ఈ డైట్‌ని అనుసరించేందుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు పరిశోధకులు. ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు..ఈ కీటో డైట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ డైట్‌ని అనుసరించే వారి రక్తంలో అననూకూల స్థాయిలో కొవ్వులు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ డైట్‌ని ఫాలో అయితే దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారీతీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ తక్కువ చక్కెర ఆహారం చెడు కొలస్ట్రాల్‌ని గణనీయంగా తగ్గించింది కూడా అని చెప్పారు.కీటో డైట్ గట్ మైక్రోబయోమ్ కూర్పును మార్చింది. ముఖ్యంగా బిఫిడోబాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రోబయోటిక్స్‌లో తరచుగా కనిపించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఇది. ఇది 'బీ' విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రకోప ప్రేగు వ్యాధి వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధకత తగ్గి దీర్ఘకాలికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు పరిశోధకులు.కీటో డైట్ గ్లూకోస్ టాలరెన్స్‌ని తగ్గించింది. అంటే..శరీరం కార్బోహైడ్రేట్లను నిర్వహించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఎప్పుడైన అధిక కార్బోహైడ్రేట్ తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మంచివే కానీ ఫైబర్‌తో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు నిపుణులు.(చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వుతామో తెలుసా!
కితకితలు పెడుతున్నారనంగానే నవ్వు ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. ముఖ్యంగా చిన్నిపిల్లల ఏడుపు ఆపించాలనుకున్నప్పుడూ కితకితలు పెడుతుంటా. జస్ట్ అలా పెట్టేందుకు యత్నించంగానే నవ్వు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆపుకోవడం కష్టం కూడా. అయితే మనంతట మనం పెట్టుకుంటే నవ్వు రాదు. అవతలివాళ్లు పెడితేనే నవ్వు వస్తుంది. ఎందుకిలా? అస్సలు కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వు వస్తుంది?. తదితర ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం! ఇలా చక్కిలిగింతలు పెట్టగానే నవ్వడానికి వెనుకున్న సైన్స్ ఉందంట. సాక్షాత్తు ఎవల్యూషనరీ బయాలజిస్టులు, న్యూరో సైటింస్టులే చక్కిలగింతలు పెడితే కచ్చితంగా నవ్వుతామని, దాని వెనుకు ఉన్న కారణాలను కూడా వివరించారు. సున్నితమైన స్పర్శను అనుభవించినపుడు మెదడులోని హైపోథాలమనస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందిట. చేతుల క్రింద, గొంతు దగ్గర, పాదాల క్రింద చక్కిలిగింతలు పెడితే నవ్వు ఆపుకోలేం. అందుకే కితకితలు పెడితే అరవడం, విదిలించుకోవడం, ఎగరడం వంటివి చేస్తుంటాం. అయితే కొందరిలో చక్కిలిగింతలు ఇష్టపడరు. వారిలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తారు. నవ్వు ఎలా వస్తుంది? మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్. ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్ సింగులేట్ కార్టెక్స్. ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. మనకు మనం పెటుకుంటే నవ్వు ఎందుకు రాదంటే.. మెదడు వెనుక భాగంలో ఉన్న చిన్న మెదడు మీకు మీరే కితకితలు పెట్టుకోబోతున్నారని ముందుగానే మెదడుకి సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల మెదడు సరైన సంకేతాలు ఇవ్వదట. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. పిల్లల్ని ఆట పట్టిస్తూ చక్కిలిగింతలు పెడతారు. వారిలో నవ్వడం నేర్పడానికి అలా చేస్తారు. నవ్వు అనేది ఒక అంటువ్యాధిలా అంతటా ఆవరిస్తుంది. ఒకరు నవ్వడం ప్రారంభిస్తే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా నవ్వుతారు. నవ్వు వల్ల సమాజంలో మంచి సానుకూల బంధాలు ఏర్పడతాయి. చక్కిలిగింతల రకాలు 1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..) -
డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా?
డబ్బుతో అన్ని కొనగలం గానీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కొనలేం అని తెలిసిందే. అందుకే పిసినారుల్లా, డబ్బు కోసం పడిగాపులు పడొద్దని పెద్దలు హితవు చెబుతుంటారు. అయితే ఈ విషయంపై పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు కూడా. అందుకు సమాధానం కనుగొన్నారు. ఆ అధ్యయనాల్లో డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చు అనిపించేలా ఫలితాలు వచ్చాయి. ఆదాయాలు పెరగడంతో కొందరూ సంతోషంగా ఉన్నామని చెప్పగా, అల్రెడీ ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో సంతోషం కనిపించలేదు. ఇక్కడ పెరుగుతున్న ఆదాయాలు సంతోషానికి కారణమవుతాయని తేలింది గానీ చివరిగా అందరూ ఒక్కదానికే ఏకగ్రీవంగా ఓటేశారు. అలా చేస్తేనే చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఇంతకీ అందరూ దేన్నీ హైలెట్ చేసి చెప్పారంటే... వివరాల్లోకెళ్తే..పరిశోధకులు డేనియల్ కాహ్నెమాన్, మాథ్యూ కిల్లింగ్స్‌వర్త్ ద్యయం చేసిన అధ్యయనం నిర్ధిష్ట ఆదాయ పరిమితిని చేరుకున్న తర్వాత సంతోషంగా ఉండగలమా? అనే దాన్ని సవాలు చేసిందన్నారు. ఈ మేరకు పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా సుమారు 33 వేల మందిపై అధ్యయనం చేసి వారి డేటాను సేకరించింది. అయితే వారిలో పెరుగుతున్న ఆదాయాలతో సంతోషం పెరుగుతుందని తేలింది. తక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు అధిక సంపాదన కలిగిన వారితో పోలిస్తే పెరిగిన ఆదాయం కారణంగా సంతోషంగా ఉండగలరని వెల్లడయ్యింది. వార్షిక జీతం దాదాపు 74 లక్షలు వరకు ఉంటే మానసిక ఆనందంలో మెరుగుదల కనపించింది. అంతకుమించి ఆదాయం పెరిగితే.. అవి ఆనందానికి, మానసికి సంతోషానికి మధ్య సంబంధాల పరిమితి ఏర్పడుతున్నట్లు గమనించారు. ఇక కిల్లింగ్సవర్త్ 2021 అధ్యయనం ప్రకారం దాదాపు రూ. 4 కోట్ల ఆదాయం ఉన్నప్పుడూ.. ఆనందంపై డబ్బు సానుకూల ప్రభావం కనిపించింది. అదేసమయంలో దాదాపు 83 లక్షలు కంటే ఎక్కువ జీతాలు అందుకున్న వ్యక్తుల్లో సంపద పెరిగినప్పటికీ వారి ఆనందంలో మెరుగుదల కనిపించలేదు. వారు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సంతోషాన్ని పొందడంలో అనుబంధాల పాత్ర అత్యంత కీలకమనిపేర్కొంది. మంచి జీవితానికి సంబంధాలు అవసరమని అందుకు సంపద కూడా ఒకింత కారణమని చెప్పారు. భౌతకపరమైన సంపదకంటే అనుభవాలతో ఆర్జించుకున్న సంతోషమే గొప్పదని తేలింది. కొంతమంది సామాజికి సంబంధాలతో సంతోషాన్ని పెంపొందించుకున్నారు. డబ్బుతో పనిలేదని ప్రూవ్ చేశారన్నారు. 2008లో ఎలిజబెత్ డన్ ఆమె సహచరులు నిర్వహించిన అధ్యయనంలో ఒక సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన అధ్యయనంలో కెనడాలోని వాంకోవర్ వీధిలో నడిచే వ్యక్తులకు కొంత డబ్బు నోటులు ఇచ్చి మీ కోసం లేదా ఇతరుల కోసం ఖర్చే చేయమని చెప్పారు. చివరిగా వారంతా తమ కోస కంటే ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలిగినట్లు ముక్తకంఠంతో చెప్పారు. పరోపకారమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది అని అన్నారు. అలాగే మిస్సౌరీ-కొలంబియా విశ్వవిద్యాలయంలోని సైకలాజి పరిశోధకుల అధ్యయనంలో ఇతరులను సంతోష పెట్టడం వల్ల ఆనందం అర్థవంతంగా ఉందన్న విషయాన్ని హైలెట్ అయ్యింది. దయతో కూడిన పరోపకార చర్యలే ఎక్కువ సంతోషానికి కారణమవుతాయని ఆ పరిశోధనలో తేలింది కూడా. ఈ అధ్యయనం ఇతరుల ఆనందానికి తోడ్పడటం అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ పరిశోధనల సారాంశం అవసరాలకు సరిపడ ఆదాయ పెరుగుదల మన సంతోషానికి కారణమవ్వడం తోపాటు ఇతరులకు సాయం చేయడం వల్ల మనం మరింత మానసిక సంతోషాన్ని పొందగలమని వెల్లడించింది. (చదవండి: చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు! ధర ఏకంగా..!) -
ఆ సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట!
కేలరీలు బర్న్ అవ్వాలని రకరకాల వ్యాయామాలు, ఏవేవో ఫీట్లు చేస్తుంటా. అంతా చేసిన కాస్తో కూస్తో బరువు తగ్గుతాం. కానీ ఆ సినిమాలు చూస్తే వందల కొద్ది కేలరీలు ఖర్చు అవ్వడమే గాక ఆకలి తగ్గి తెలియకుండానే మితంగా తింటమట. బరువు కూడా ఈజీగా తగ్గుతామని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదెలా సాధ్యం పైగా కూర్చొని సినిమా చూస్తే కేలరీలు తగ్గిపోతాయా..? అనిపిస్తుంది కదా!. కానీ ఇది నిజం అని బల్లగుద్ది మరీ నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హారర్ మూవీలు చూసే అలవాటు ఉంటే..ఇంకా మంచిది అంటున్నారు పరిశోధకులు. హాయిగా హారర్ మూవీలు చూస్తూ.. ఈజీగా కేలరీలు తగ్గించుకోండి అని అంటున్నారు. ఈ మేరకు వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం మూవీ రెంటల్ కంపెనీ సాయంతో సుమారు పదిమందిపై ఈ పరిశోధన చేశారు. వారంతా హారర్ మూవీలు చూస్తున్నప్పుడూ.. వారికి హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ తీసుకుని కార్బన్డయాక్సైడ్ని వదులుతున్న రేటును కొలిచే పరికరాలను కూడా అమర్చారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆ పదిమందికి సినిమాలు చూస్తున్నప్పుడూ.. హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరిగాయని, తత్ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్ అయినట్లు కనుగొన్నారు. అంతేగాదు ఈ కేలరీలు బర్న్ అవ్వడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని అన్నారు. కాగా ఈ పరిశోధనలో 90 నిమిషాల భయానక చిత్రం సగటున 150 కేలరీలను బర్న్ చేస్తుందని తెలిపారు. అది దగ్గర దగ్గరగా.. మనం చేసే జాగింగ్ లేదా 30 నిమిషాల పాటు చేసే వాకింగ్‌లో తగ్గే కేలోరీలకు సమానం అని చెప్పారు. తమ అధ్యయనం పాల్గోన్న ఆ పదిమంది చూసిన మొదటి పది రకాల భయానక చిత్రాలు వరుసగా ఎన్ని కేలరీలను బర్న్ చేశాయో కూడా వివరించారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే అడ్రినల్ వేగంగా విడుదలై ఆకలిని తగ్గించి, బేసల్ మెటబాలిక్ రేటును పెంచి అధిక స్థాయిలో కేలరీలను తగ్గిస్తుందని డాక్టర్ రిచర్డ్ మాకెంజీ అన్నారు. ఈ పరిశోధన రోజూవారి వ్యాయామాన్ని, సక్రమమైన ఆహారపు అలవాట్లను మానేయమని సూచించదని హెచ్చరించారు. ఆరోగ్యకరంగా బరువు, జీవనశైలి ఉండాలంటే హారర్ మూవీలు ఒక్కటే చూడటం సరిపోదని చెప్పారు. సులభంగా కేలరీలు తగ్గించే పరిశోధనల్లో భాగంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామే గానీ ఇదే సరైనదని చెప్పడం లేదన్నారు. (చదవండి: 'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..) -
అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని
ట్విటర్ మాజీ ఉద్యోగిని ఎస్తేర్ క్రాఫోర్డ్.. ఈమె పేరు చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. క్రాఫోర్డ్ ట్విటర్లో పనిచేస్తున్నప్పుడు రాత్రిళ్లు అక్కడే ఆఫీస్‌లోనే నిద్రిస్తున్న ఫొటో గతేడాది నవంబర్‌లో వైరల్ అయిన తెలిసిందే. ప్రొడక్ట్ మేనేజర్‌గా అంతలా కష్టపడి పనిచేసినా ఆమెను ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కనికరించలేదు. ట్విటర్ గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన లేఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఇదంతా తెలిసిందే. అయితే ఐదు నెలల తర్వాత ఆమె మస్క్‌తో పనిచేయడం ఎలా ఉంది, ఆయన అసాధారణ ప్రవర్తన ఉద్యోగులను ఎలా భయపెట్టేది తదితర ఆసక్తికర విషయాలు తెలియశారు. ఎలాన్ మస్క్ ఆధీనంలో లేక ముందు ఇతర కంపెనీల మాదిరిగానే ట్విటర్ కూడా చాలా బాగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం పని చేస్తేనే సరిపోదు.. రాజకీయాలు కూడా చేస్తేనే రాణిస్తారంటూ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవల ట్విటర్లో సుదీర్ఘ పోస్ట్‌లో రాశారు. అపరిచితుడు! ఇక ఎలాన్ మస్క్‌తో కలిసి పని చేయడం గురించి వివరిస్తూ.. “వ్యక్తిగతంగా ఎలాన్ మస్క్ చాలా అసాధారణంగా ఉంటాడు. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు. చెప్పన కథలు, జోకులే పదే పదే చెప్తాడు” అని పేర్కొంది. ఇక ఉద్యోగులు ఎదుర్కొన్న సవాలు ఏమిటంటే, మస్క్ ఉత్సాహంగా ఉన్న బాస్ నుంచి క్షణాల్లో కోపంగా మారిపోతాడని రాసుకొచ్చారు. ఇదీ చదవండి ➤ 'X' Replacing Twitter Blue Bird Logo: పిట్ట పోయి ‘ఎక్స్’ వచ్చె.. మారిపోయిన ట్విటర్ లోగో "అతను ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉంటాడో, ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. దీంతో మీటింగ్‌కి పిలిచినప్పుడల్లా ఉద్యోగులు భయపడేవారు. ఆయనతో ప్రతికూల విషయాలను చర్చించడానికి సంశయించేవారు" అని క్రాఫోర్డ్ పేర్కొన్నారు. కాగా 2022 నవంబర్‌లో ట్విటర్ భారీ తొలగింపులు చేపట్టిన సమయంలో ఎస్తేర్ క్రాఫోర్డ్.. తాను ఆ కంపెనీలో ఉన్నందుకు సంతోషిస్తున్నానంటూ మస్క్ ఆలోచనలను సమర్థించడంపై సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. -
గూగుల్ జాబ్ అంత ఈజీ కాదు గురూ.. రెజ్యూమ్ ఇలా ఉంటే మాత్రం..
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఈ సంస్థలో పని చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. గూగుల్ జాబ్ కోసం ఏటా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే గూగుల్‌లో జాబ్ కొట్టడం చాలా కష్టమని భావిస్తుంటారు. గూగుల్ జాబ్ కోసం తీవ్రమైన పోటీతో పాటు నియామక ప్రక్రియ కూడా అంత ఆషామాషి కాదు. జాబ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల రెజ్యూమ్‌లోని ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కొన్ని కిటుకులను తెలియజేశారు. ఈ రెండు తప్పులు చేయొద్దు.. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. నోలన్ చర్చ్ 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులను తెలియజేశారు. కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటిది సూటిగా లేని సమాచారం. అంటే మీ సామర్థ్యం, నైపుణ్యాల గురించి అర్థం కాకుండా పేరాలు పేరాలు రాయడం. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.వ ఇదీ చదవండి ➤ Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన.. ఇక రెండవది స్పష్టత లేకపోవడం. అంటే మీరు మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీరు మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే, ఆఫీస్‌లో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని ఇది సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి చాట్‌జీపీటీ, గ్రామర్లీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవచ్చని చర్చ్ సూచించారు. కాగా వ్యయ నివారణలో భాగంగా గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా, తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. -
నిజాయితీ నిల్! మగవాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారట!
అబద్ధాలు చెప్పేవాళ్ల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతోందట. అందులో మగవాళ్లే, స్త్రీల కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. 1980 నుంచి 2021మధ్య జన్మించిన వ్యక్తుల వారిగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో పెద్ద, చిన్నా తేడా అనే తారతమ్యం లేకుండా అందరూ అబద్ధాలే చెబుతున్నారని, నిజాయితీగా ఉండే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్లేస్టార్ అనే ఆన్లైన్ క్యాసినో దాదాపు 1306 మంది చొప్పున యుఎస్‌లోని వివిధ రాష్ట్రాలపై జరిపినలో సర్వేలో తేలిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వారంతా వివిధ పరిస్థితుల్లో ఎలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారో గమనించినట్లు పేర్కొంది. ఈ మేరకు యూస్‌లోని కొలరాడో,ఇల్లనాయిస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టేనస్సీ, విస్కాన్సిన్లతో సహా అన్ని రాష్ట్రాలలో సుమారు వెయ్యి మంది చొప్పున చేసిన సర్వేలో ఈవిషయం వెల్లడించింది. వారిలో నిజాయితీ లేని వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సుమారు 13 శాతం మంది కనీసం ఒక్కసారైన అబద్ధం చెబుతున్నామని అంగీకరించనట్టు పేర్కొంది. 1965-1980 మధ్య జన్మించిన వ్యక్తులను 'జెడ్‌గా' 1997-2021 మధ్య జన్మించిన వ్యక్తులను ఎక్స్‌గా విభజించి పోల్చి చూస్తే రెండు గ్రూప్‌లలో కేవలం 5 శాతం మంది రోజు అబద్ధాలు చెబుతున్నట్లు అంగీకరించారని తెలిపింది. అలాగే కార్యాలయాల్లో తమ బాస్‌కి రెజ్యుమ్‌లో తప్పుడు సమాచారమే ఇస్తున్నట్లు తేలింది. ప్రతి ఐదు మిలియన్ల మందిలో ఇద్దరూ ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. సోష్ల్ మీడియాలో కూడా ఇదే తంతని, అక్కడ ఈ అబద్ధాల చెప్పే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. వారంతా ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఈ అబద్ధాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అందులో 58 శాతం మంది ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు, ఇక 42 శాతం మంది గోప్యత కోసం, మరో 42 శాతం మంది తాము చులకన అవ్వకుండా ఉండేందుకు, తమ వ్యక్తి గత రక్షణ కోసం చెప్పినట్లు తెలిపారు. చివరిగా సర్వేలో మహిళలతో పోలిస్తే పురుషులే రోజుకు ఒక్కసారైనా అబద్ధం చెప్పకుండా ఉండలేరని , వారు కూడా దీన్ని అంగీకరించారని సర్వే పేర్కొంది. (చదవండి: భార్యను చంపి, ఆమె పుర్రెని యాష్ ట్రేగా..) -
Odisha Train Accident: ఆ దుర్ఘటనలో కీలకంగా ఆ లోకోపైలట్ చివరి మాటలు
ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతోనే గూడ్స్ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే లూప్లైన్లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకోపైలట్ గుణనిధి మొహంతి చెప్పారు. మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్ మొహంతి కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా. అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్విస్టెగేషన్(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం. #WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl — ANI (@ANI) June 4, 2023 (చదవండి: -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
ఎంబీబీఎస్ పూర్తి అయ్యి 16 ఏళ్లట. ఇప్పటికీ అదే జీతమట!
కొందరి ఉద్యోగంలో ఉన్నతి ఉండక, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే! అన్నట్లుగా ఉంటుంది. ఏం చేద్దాం అన్న కలిసిరాదు. కనీసం ఏళ్లుగా చేస్తున్నాడు కదా అని యజమాన్యం కూడా జాలి చూపదు. ఆ ఉద్యోగి నా వల్ల కాదని రాజీనామ చేసేంత వరకు పరిస్థితి అంతే అన్నట్లు ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితిని ఓ డాక్టర్ ఎదర్కొంటున్నాడు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లోని అపోలా హాస్పటల్స్‌లో పనిచేస్తేన్న బిహార్‌కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అరకొర జీతాన్ని ఎంత పొదుపుగా వాడాలో నేర్చుకున్నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తాను 2004లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, 16 ఏళ్ల నుంచి ఒకే జీతం అందుకున్నట్లు తెలిపాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటి నుంచి అంతే జీతం అని చెబుతున్నాడు. దీంతో తన కుటుంబసభ్యులు ఎవరూ కూడా చూసేందుకు రావడం కూడా మానేసిట్లు తెలిపాడు. అలాగే తన నాన్న పనిచేసే ప్రభుత్వ కార్యాలయం ఫ్యూన్ జీతం, కొడుకు జీతం ఒకటేనని అమ్మ బాధపడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తమిళనాడులోని వెల్లూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు వైద్యుడు సుధీర్ తెలిపారు. తాను అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఐదేళ్లు ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు కూడా తన ఖర్చులన్నీ తానే నిర్వహించుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఆ సమయంలో తనను చూసేందకు కూడా వచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు. ఒక జూనియర్ డాక్టర్ తను జీవించడానికే ఇంతలా కష్టపడుతున్నప్పుడూ.. ఎలా సామాజిక సేవ చేయగలను అని పోస్ట్ పెట్డడంతో రిప్లైగా సదరు వైద్యుడు సుధీర్ తన గురించి వివరించాడు. ఈ విషయం నెట్టిట వైరల్ అవ్వడంతో నెటిజన్లు భారతదేశంలో వైద్యులకు తగిన జీతాలు లభించడం లేదని ఒకరు, పేషంట్ల దగ్గర నుంచి భారీగా వసూలు చేసే ఆస్పత్రి యాజమాన్యం వైద్యులకు మాత్రం తగిన జీతాల ఇవ్వదంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. Apollo Hospitals' doctor says his salary was Rs 9,000 10 years after completing MBBS #MedTwitter #equity #investments https://t.co/mI1FmfE6xp — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) April 6, 2023 (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి) -
Air India Urination Case: వెలుగులోకి కీలక ఈమెయిల్స్
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎయిర్‌లైన్ ఆ ఘటన జరిగిన రోజే అధికారులకు ఈమెయిల్స్ పంపినట్లు తేలింది. వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, త్వరితగతిన స్పందించకపోవడం, నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాల్లో జాప్యం గురించి సర్వత్ర పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రశ్నించగా ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదని ఎయిర్ ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ గతంలో సమర్థించుకుంది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తోసహా ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా క్యాబిన్ సూపర్వైజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 1 గంట సమయంలో బేస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్(ఐఎఫ్‌సీడీ), హెచ్ఆర్ హెడ్‌కి ఈమెయిల్ పంపినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే కస్టమర్ కేర్ ఫిర్యాదులు గురించి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌కి ప్రత్యుత్తరాలు కూడా అదే రోజు 3.47 గంటలకు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆరోజు టెలిఫోన్ చర్చల అనంతరం ఈమెయిల్స్ పంపించినట్లు కూడా పేర్కొంది. అంతేగాదు అదే రోజు రాత్రి 7.46 గంటలకు ఈమెయిల్ కస్టమర్స్ విభాగం ఇన్‌ఫ్లైట్ సర్వీస్ హెడ్లకు ఈమెయిల్స్ పంపించినట్లు తేలింది. పైగా అదేరోజు సాయంత్రం బాధితురాలి అల్లుడు నుంచి ఈ మెయిల్ అందుకున్న విల్సన్ కస్టమర్ కేర్ ఆ మెయిల్స్ ఫార్వర్డ్ చేసి తనకు వచ్చిన మెయిల్స్‌పై దృష్టిపెట్టినట్లు కమ్యూనికేషన్లు చూపిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా మేనేజింగ్ డ్రైరెక్టర్(సీఎండీ) క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ..ఎయిర్‌లైన్ తన సిబ్బందిలోని లోపాలను విచారించడానికి, ఎందుకు ఆల్యసంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో విచారించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన గురించి విమానంలో ల్యాండింగ్ అయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించినట్లు తేలింది. ఐతే పైలట్ నిందితుడు శంకర్ మిశ్రా స్ప్రుహ లేనప్పుడూ చేసిన ఘటనగానే భావించాడు. బాధితురాలి పట్ల జరిగిన వికృత ఘటనగా సీరియస్ భావించకపోవటం, పైగా ఇరువురు మధ్య రాజీ కుదిర్చి సర్థి చెప్పేందుకు యత్నించాడమే గాక గొడవ రాజీ అయినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఆరోజు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శంకర్ విశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మిశ్రా కూడా కామ్‌గా ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నిష్క్రమించినట్లు తేలింది. ఎప్పుడైతే బాధితురాటు ఎయిర్ ఇండియా చైర్మన్‌కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్స్ అధికారులకు ఇరువురు మధ్య ఆర్థిక రాజీ కుదరిందని అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి ఫిర్యాదు చేయడం జాప్యం అయ్యిందని తదుపరి విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ విమానయాన సంస్థ మరియు దాని చీఫ్‌లకు మాత్రమే కాకుండా మొత్తం విమాన సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే డీజీసీఏ ఈ ఘటనపై ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా, పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ మూడు నెలలపాటు సస్పెన్షన్ తోపాటు ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ ఇన్‌ఫ్లైట్ సర్వీస్‌కు కూడా సుమారు రూ. 3 లక్షల జరిమాన విధించి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
శ్రద్ధా కేసు: రంపంతోనే కోసినట్లు నిర్ధారణ
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసి ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో ఇప్పటి వరకు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో పోస్ట్‌మార్టం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులో వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన డీఎన్ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని నిర్ధారించగా.. తదనంతరం వాటిని శవపరీక్షలకు పంపించారు. అలాగే ఆ ఫ్లాట్‌లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ నమునాను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి కస్టడీలోనే ఉన్నాడు. ఈ నెలాఖారులోపు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. (చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ని తరలిస్తున్న వ్యాన్‌పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు) -
సీనియర్ ఎన్టీఆర్‌గా తారక్‌ను అందుకే తీసుకోలేదు: అశ్వినీదత్
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఆయన మనవడు, యంగ్ హీరో నాగ చైతన్య పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం ఎవరూ చేయలేదు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ రోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సింది. పలు కారణాల వల్ల అలా కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయిద్దామని అనుకున్నాం. కానీ ఈలోగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమో అని అనిపించింది. ఒకవేళ తారక్ చేసినా బాగుండదేమో అని కూడా అనిపించింది. నాగ్ అశ్విన్‌తో చెబితే అసలు ఆయన పాత్ర లేకుండానే తీస్తా అని చెప్పి తెరకెక్కించాడు. ఆయన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చేప్పారు. మిగతా అంతా మేనేజ్ చేశాం'' అని వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! -
కాఫీ విత్ ఖతీక్!
సాక్షి, హైదరాబాద్: బాధితులు అంతా మధ్య, దిగువ మధ్య తరగతికి చెందిన వారు... ఒక్కో రూపాయి కూడగట్టుకుంటేనే తులం బంగారం చేకూరేది... స్నాచింగ్‌లో పోగొట్టుకున్నది సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న మంగళసూత్రాలు... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్‌ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇవే కనిపించాయి. కేవలం తమ ఠాణా పరిధిలోని బాధితులే కాకుండా మూడు కమిషనరేట్లకు చెందిన వారికీ న్యా యం చేయాలని భావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉమేష్‌ను చాకచక్యంగా విచారించారు. చివరకు ‘కాఫీ విత్ ఖతీక్’తో అసలు గుట్టు బయటపెట్టేలా చేశారు. మూడు నేరాలు పేట్ బషీరాబాద్‌లోనే... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ఐదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సింగిల్... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్‌ను ఈ నెల రెండో వారంలో పేట్ బషీరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఎనిమిదింటిలో మూడు నేరాలు ఈ ఠాణా పరిధిలోనివే కావడంతో ఈ అధికారులే ముందడుగు వేశారు. విచార ణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరు తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతించడంతో ఈ నెల 20న కస్టడీలోకి తీసుకుని తమ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అతడి ఆరోగ్యం, గత చరిత్ర నేపథ్యంలో... ఉమేష్‌కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో పోలీసు కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర కూడా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమికంగా ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు. కస్టడీలోకి వచ్చిన తొలి రోజు ఉమేష్ పారిపోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు మరో రెండు రోజుల పాటు సాధారణంగా ప్రశ్నించారు. ఏమాత్రం తొణకని, బెణకని అతగాడు అహ్మదాబాద్ పోలీసులకు చెప్పినట్టే ‘తెంచినవన్నీ పడిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు తమ శైలి మార్చాలని భావించారు. లాకప్‌లో కూర్చుని కాఫీ తాగుతూ... నేరాలు చేయడంతో ఆరి తేరిన, ఇప్పటికే అనేకసార్లు అరెస్టు అయిన, ఓ సందర్భంలో గురజాత్ పోలీసుల పైనే ఆరోపణలు చేసిన ఉమేష్ ఖతీక్‌ను రోటీన్‌కు భిన్నంగా ‘బ్రేక్’ చేయించాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఓ నేరగాడి నుంచి నిజాలు రాబట్టడాన్ని పోలీసు పరిభాషలో బ్రేక్ చేయడం అంటారు. దీంతో ఒక రోజు అతడితో ప్రేమ పూర్వకంగా మెలిగిన అధికారులు ఎలాంటి హాని ఉండదనే నమ్మకం కలిగించారు. ఆపై అతడితో కలిసి లాకప్ గదిలోనే కూర్చుని కాఫీ కూడా తాగారు. ఈ పరిణామంతో ఉమేష్ వ్యవహారశైలిలో మార్పు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఐదో రోజు నోరు విప్పాడు... పేట్ బషీరాబాద్ పోలీసుల తీరుతో ‘మంత్రముగ్ధుడైన’ ఉమేష్ ఖతీక్ ఐదో రోజు కస్టడీలో నోరు విప్పాడు. ఇక్కడ కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే దాచానంటూ బయటపెట్టాడు. ఈ విషయం అహ్మదాబాద్ పోలీసులకు చెబితే అక్కడి కేసుల్లో రికవరీ చూపించేస్తారని, జైలు నుంచి వచ్చాక తనకు ఏమీ మిగలదనీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు బయటపెట్టాడు. సాధారణంగా స్నాచింగ్ చేసిన బంగారం వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకుంటానని, అలాంటప్పుడు బయటపెట్టినా రిసీవర్ల నుంచి రివకరీ చేస్తారు కాబట్టి తనకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడు. ఈ బంగారం అమ్మని కారణంగానే అలా చెప్పానని వివరించాడు. ఇలా అసలు విషయం తెలిసి అహ్మదాబాద్ వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు అతడి ఇంటి నుంచి 19 తులాలు రికవరీ చేసుకువచ్చారు. (చదవండి: ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) -
Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా'
Tamannaah Reveals About Her Health Issue: 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. విభిన్న పాత్రలతో ఎంటర్టైన్ చేస్తున్న తమన్నా ఇటీవలె మాస్ట్రో సినిమాలో విలన్ రోల్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా..'కొన్నాళ్లుగా తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది. 'నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా వర్కవుట్స్ చేయడం, ఒత్తిడి కారణంగా ఓ అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నాను.దాన్నుంచి బయటపడేందుకు నిపుణుల సూచనలతో వ్యాయామాలు చేస్తున్నా. ఫ్రై ఫుడ్ ఐటమ్స్ పూర్తిగా మానేశా. ప్రస్తుతం సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నా. అంతేకాకుండా క్రమం తప్పకుండా నోని లేదా తొగరి ఫలం(Noni juice)ను తీసుకుంటా. ఈ జ్యూస్ నాకున్న సమస్య నుంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని తెలిపింది. అంతేకాకుండా ప్రతిరోజు ఉసిరి రసం, బాదం పాలు,పసుపు, కొబ్బరి నీళ్లు తన డైట్లో ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్య ఏంటన్న దాన్ని మాత్రం తమన్నా బయటపెట్టలేదు. చదవండి: మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు Bigg Boss Telugu 5: 'అర్థపావు భాగ్యం'.. ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే.. -
లుక్ ట్రిక్
సినిమా మ్యాజిక్కే వేరు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించడం సినిమాకు చాలా మామూలు విషయం. అందుకు తాజా ఉదాహరణ చిరంజీవి లుక్. ఇటీవలే చిరంజీవి గుండుతో ఉన్న లుక్‌ను ఆన్లైన్లో షేర్ చేసి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన తదుపరి చిత్రాల్లో ఓ సినిమాకు సంబంధించిన లుక్ అని తెలిపారు. అయితే నిజంగానే చిరు గుండు చేయించుకున్నారని చాలామంది భావించారు. కొంతమంది చేయించుకోలేదన్నారు. ఆ లుక్ కేవలం ట్రిక్ అని మంగళవారం అసలు విషయం బయటపెట్టారు చిరంజీవి. మేకప్ టెక్నిక్తొ ఆ లుక్ ట్రై చేశాం అని, ఆ లుక్ కోసం ఎలా శ్రమించారో ఓ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. ‘‘ఎటువంటి లుక్ అయినా సరే నిజమేమో? అని నమ్మించగలిగే సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. సినిమా మ్యాజిక్కు సెల్యూట్’’ అన్నారు చిరంజీవి. -
వేధింపులపై గూగుల్ ఉక్కుపాదం
న్యూయార్క్: సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్ నాటన్ వెల్లడించారు. వీరిలో 13 మంది సీనియర్ మేనేజర్, అంతకంటే ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. సాగనంపినవారిలో ఎవ్వరికీ ఎగ్జిట్ ప్యాకేజీ ఇవ్వలేదు. లైంగికవేధింపుల కారణంగా గూగుల్ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబీన్కు రూ.659.38 కోట్లు(90 మిలియన్ డాలర్లు) ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో పిచాయ్, ఐలీన్ కంపెనీ ఉద్యోగులకు సంయుక్తంగా లేఖ రాశారు. ఉద్యోగులకు సురక్షితమైన పని ప్రదేశాన్ని కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని లేఖలో పిచాయ్ పేర్కొన్నారు. బాధితుల గోప్యతను పరిరక్షించేందుకు వీలుగా వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓ మహిళా ఉద్యోగిపై 2013లో హోటల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆండీ రూబీన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాది కంపెనీ నుంచి తప్పుకున్న ఆయనకు గూగుల్ వీడ్కోలు పలికిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన ఇష్టప్రకారమే గూగుల్‌ను వీడినట్లు రూబీన్ వివరణ ఇచ్చారు. -
భర్త స్నేహితుడే హతమార్చాడు
సనత్‌నగర్: ఎర్రగడ్డ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన సౌమ్య హత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలు సౌమ్య భర్త నాగభూషణం స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. నందనగర్, సూరజ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్, 104 ప్లాట్‌లో నివసించే మెట్రో ఎల్ అండ్ టీ సివిల్ ఇంజనీర్ అయిన నాగభూషణం భార్య సౌమ్య సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. కత్తితో పొడిచిన దుండగుడు ఆమెపై నూనె పోసి నిప్పటించి గది బయట గడియపెట్టి పరారయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎస్ఆర్నగర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్ టీం బృందాలు నాగభూషణం స్నేహితుడు, అతని సహోద్యోగి అనంతపురంకు చెందిన ప్రకాష్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాగభూషణం మెట్రోలో చేరకముందు అస్సోంలో నాలుగేళ్ల పాటు పనిచేశాడు. ఈ సమయంలో ప్రకాష్ పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ తరుచూ నాగభూషణం ఇంటికి వచ్చిపోతుండేవాడు. హత్య జరిగిన రోజు కూడా నాగభూషణం, ప్రకాష్ కలిసి మద్యం సేవించడమేగాక కలిసి భోంచేశారు. అనంతరం ఇద్దరూ బయటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన ప్రకాష్ సౌమ్యను హత్య చేసి పరారయ్యాడు. అయితే హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
నాగ చైతన్య పెళ్లి డేట్ రివీల్
హైదరాబాద్: ఎప్పటినుంచో ఊరిస్తున్న మోస్ట్ లవబుల్ పెయిర్ అక్కినేని నాగ చైతన్య- సమంతల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. జనవరిలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట 2017 చివరిలో పెళ్ళి పీటలెక్కుతారని తరచూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఎపుడు అనే సస్పెన్స్ మాత్రం అభిమానులను వీడడంలేదు. ఎట్టకేలకు చైతు-సామ్స్పెళ్లి తేదీ రివీల్ అయింది. తాజాగా సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరైన చైతూ తన మ్యారేజ్ డేట్ అక్టోబర్ 6 అని అఫీషియల్ గా ప్రకటించినట్టు ఫిలింఫేర్ అవార్డ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అక్టోబర్ 6 ఈజ్ బిగ్ డేట్ అని ట్వీట్ చేసింది. జూన్17న హైదరాబాద్ లో జరగనున్న 64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్(సౌత్) నిర్వహించనున్న సందర్భంగా జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా హాజరైన చేతూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్...అక్టోబర్ 6 అంటూ సిగ్గుల మొగ్గ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు మంచి రొమాంటిక్ ఫిలిం లభిస్తే.. సమంతతో కలిసి పనిచేయడం తనకు సంతోషమేనని ప్రకటించారు. జితేష్ పిళ్లై, రిలయన్స్ జియో తెలంగాణా సీఈవో కెసీ రెడ్డి తరుతరులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. .@chay_akkineni reveals his wedding date at the #JioFilmfareAwards (South) press con. October 6 is the big day! pic.twitter.com/BoXUWdxDio — Filmfare (@filmfare) June 8, 2017 -
కేరళ సోలార్ స్కాంలో తీర్పు వెల్లడి
-
పన్ను చెల్లింపులు 4 శాతమే!
న్యూ ఢిల్లీః పన్ను ఎగవేతదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారన్న విషయం ప్రభుత్వ తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉన్నా... వారిలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య కేవలం మూడున్నర కోట్లు కూడ మించడం లేదన్న విషయం ఇటీవలి ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి. పెద్దమొత్తంలో సంపాదించే వారు కూడ ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పన్ను చెల్లింపులు ఏమాత్రం పెరగడం లేనట్లు లెక్కలు చెప్తున్నాయి. నెలసరి ఆదాయం 21 వేల రూపాయలు దాటితే ఆ వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లింపు పరిథిలోకి వస్తాడు. దేశంలో సంవత్సరానికి కోటి రూపాయలు మించి ఆదాయం ఉన్నవారు అధికంగానే ఉన్నా చెల్లింపులు మాత్రం నాలుగు శాతానికి మించడం లేదని ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టాక్స్ చెల్లింపులు ధాఖలు చేసిన భారతీయులు కేవలం 4 శాతమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వార్షిక ఆదాయం పది లక్షలకు మించి ఉన్నవారు అధికంగానే ఉన్నా... పన్ను చెల్లింపుల విషయంలో మాత్రం పది లక్షల మంది కూడ కనిపించడం లేనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం మించి ఉన్నవారిలో... పన్ను చెల్లింపులు దాఖలు చేసినవారు 20,000 కు లోపుగానే ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేవలం 3.1 కోట్ల చెల్లింపులు మాత్రమే ఆ సంవత్సరంలో దాఖలయ్యాయి. 2000-01 నుంచి 2014-15 వరకు విశ్లేషణాత్మక గణాంకాలను ఇటీవల ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. అయితే ఈ గణాంకాల విడుదల ఓ మైలు రాయిగా చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. పన్ను చెల్లింపులపై పారదర్శకతను తెలియజేయడానికి ఇదో మంచి విధానం అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. -
ఆ పాట.. నా అంత్యక్రియల్లో వినిపించండి!
అందాల తార.. అమందా హోల్డెన్... ఇప్పుడో విచిత్ర ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది. తనకు ఇష్టమైన అబ్బా డ్యాన్సింగ్ క్వీన్ సాంగ్ ను తన అంత్య క్రియల సమయంలో ప్లే చేయాలంటూ వేదికపై వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో ఆడిషన్స్ జరుగుతుండగా ఆ పాటను ఎంతో ఉద్వేగంగా పాడిన ఆమె... ఆ తర్వాత అదే సాంగ్ తనను సమాధిలో ఉంచే సమయంలో పాడాలంటూ కోరడం విన్నవారికి విస్మయం కలిగించింది. ఇంతకూ అమందా ఆవేదన వెనుక కారణం ఏమయ్యుంటుంది? హాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచే అందాల నటిగానే కాక, మంచి సింగర్ గానూ, ప్రెజెంటర్ గానూ పేరుతెచ్చుకున్న 'అమందా లూయిస్ హోల్డెన్'... బ్రిటన్ ఐటీవీ కార్యక్రమం 'బ్రిటన్ గాట్ ట్యాలెంట్' షోలో జడ్జిగా కూడా ప్రత్యేక ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు అదే వేదికపై టాలెంట్ షో ఆడిషన్ కు ముందు తనకు ఎంతో ఇష్టమైన, తాను మొదటిసారి మనసుకు నచ్చి, మెచ్చి పాడుకున్న పాట (అబ్బా డ్యాన్సింగ్ క్వీన్) ఎంతో శ్రావ్యంగా ఆలపించింది. ఇంతలో ఏమైందో ఏమో ''ఇది నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట. నా మనసునుంచి జాలువారిన గీతం. నా మరణానంతరం నన్ను సమాధిలో ఉంచే సమయంలో ఈ పాటను ప్లే చేయండి'' అంటూ అమందా వెల్లడించింది. కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో సహ జడ్జి సైమన్ కోవెల్ చేసిన సరదా కామెంటే ఆమె అప్రస్తుత ప్రకటన వెనుక కారణమై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. బిజిటి ఆడిషన్స్ సమయంలో సైమన్ కోవెల్... అమందా మాజీ భర్త.. హాస్యనటుడు లెస్ డెన్నిస్ పై చేసిన సరదా కామెంట్.. ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఊహించని ఉద్వేగానికి లోనయ్యింది. అదే సమయంలో డైనోసార్ డ్రెస్ తో డ్యాన్స్ ట్రూప్ స్టేజ్ పైకి రావడం ఆమెకు కలసి వచ్చింది. ఇంకేముందీ... వారికి ఓ పక్క అభినందనలు తెలుపుతూనే ఆ డైనోసార్ నావైపే చూస్తోందని, దాని మోసపూరిత ప్రవర్తన గురించి నాకు ఎప్పుడో తెలుసునని మిస్టర్ నాస్టీగా కూడా దానికి పేరు అందుకే వచ్చిందని ఇలా అనేక వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమయానికి డెన్నిస్ వేదిక ముందు ఉండటం.. సైమన్ వెక్కిరించడం ఆమెను ఆవేశానికి గురి చేశాయి. ఆమె ప్రవర్తనకు సర్ది చెబుతూ 'లీవ్ లెస్ ఎలోన్' అంటూ డెన్నిస్ ను ఉద్దేశించి సైమన్ అనడం కూడా అమందాను పట్టలేని ఉద్వేగానికి లోను చేశాయి. ఆమె చేతిలో సుమారు ఏభై వేల రూపాయల ఖరీదైన ఫోన్ ను విసిరికొట్టి నాశనం చేయడమే కాక, అక్కడున్న గ్లాసుల్లో నీటిని కూడా సైమన్ పై పోసి నానా హంగామా చేసింది. అమందా ప్రవర్తనపై ఇంతకు ముందే ఓసారి అనుభవం ఉండటంతో ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సైమన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గతంలో బ్రిటన్ గాట్ మోర్ ట్యాలెంట్ సమయంలో కూడా అమందా ఇలాగే ప్రవర్తించింది. అప్పట్లో అతిథిగా వచ్చిన స్టీఫెన్ ముల్లెన్... అమందాను.. న్యూయార్క్ సామాజిక వేత్త జోస్లిన్ వైల్డెన్ స్టిన్ తో పోలుస్తూ వెక్కిరించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. నట జీవితంలోనూ, సింగర్ గానూ, జడ్జిగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమందా వివాహ జీవితం మాత్రం ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నోసార్లు మోసపోవడం కూడా ఆమె కోపం వెనుక కారణాలై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. 1995 లో లెస్ డెన్నిస్ ను వివాహమాడిన అమందా ఎనిమిదేళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో 2003 లో విడిపోయారు. అనంతరం 2008 లో తిరిగి క్రిస్ హూగ్స్ ను పెళ్ళి చేసుకుంది. 44 ఏళ్ళ అమందాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో జడ్జింగ్ ప్యానెల్ లో సైమన్ తో పాటు... అంమందా కూడా జడ్జిగా కొనసాగుతోంది.