Satire
-
కమలా హ్యారిస్ ఖాళీ బుక్... బెస్ట్ సెల్లర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్’ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ‘ది అచీవ్మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. వాల్‌మార్ట్ బుక్‌స్టోర్‌లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశారు. తర్వాత జాక్ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్’గా పేరు పొందిన అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం. ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో -
నాపై ఈడీ దాడులు.. చాయ్ బిస్కెట్లతో వెల్కమ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలకు దిగారు. తనపై త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసే అవకాశం ఉందని అన్నారాయన. అందుకు తన చక్రవ్యూహ్ ప్రసంగమే కారణమని చెబుతూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. : రాహుల్ గాంధీనాపై ఈడీ దాడులు జరగొచ్చు. ఓ అధికారి నుంచి నాకు దానిపై సమాచారం వచ్చింది. జులై 29న నేను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొందరికి నచ్చలేదు. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.. అదీ ఛాయ్ బిస్కెట్లతో అని ఛమత్కారంగా ఓ సందేశం ఉంచారాయన. Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned. Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024 పార్లమెంట్లో ఈ మధ్య ప్రవేశపెట్టిన.. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభ చర్చ జరిగింది. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. -
ఆలిండియా ముద్దపప్పు.. తెలంగాణ పప్పు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పప్పు రేవంత్‌రెడ్డి, ఆల్ ఇండియా ముద్దపప్పు రాహుల్ గాంధీ దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. ఇద్దరు బిత్తిరోళ్లు ఎగేసుకుని పోయి కాళేళ్వరం ప్రాజెక్టును చూసి వచ్చి మహా ఇంజనీర్లలా బ్రిడ్జి కూలిపోతుందని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉండే ఎక్స్పాన్షన్ జాయింట్ల ఫొటోలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడం రాహుల్, రేవంత్‌ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి గడ్డం నాగరాజు గురువారం తన అనుచరులతో కలసి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఏఐసీసీ అంటే అల్ ఇండియా చెత్తాచెదారం, టీపీసీసీ అంటే తెలంగాణ పెరట్లో చెత్తా చెదారంలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, నోటుకు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్లో పశువుల్లా అమ్ముతున్న రేవంత్‌ను పక్క న పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అయిన రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాందీని కూడా కోఠిలో చారాణాకో, ఆఠాణాకో అమ్మేస్తాడు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి వరమైతే కాంగ్రెస్ పార్టీ దేశానికి శనీశ్వరం. బీఆర్ఎస్ది కుటుంబ పాలనంటూ మాట్లాడుతున్న రాహుల్ తన కుటుంబ నేపథ్యం ఏమిటో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాలను పెద్దవిగా చూపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జీవనదుల నడుమ ఉన్న తెలంగాణను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ కరువు కోరల్లోకి నెట్టింది. కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణలో నేల నెర్రెలు వారింది. విప్లవ ఉద్యమాల నెత్తురుతో ఎర్రవారింది. రాహుల్ గాం«దీకి తెలంగాణ చరిత్ర తెలియదు. తెలుసుకొనే సోయి, పరిజ్ఞానం కూడా లేదు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్ పాలన సక్రమంగా జరిగి ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందుకు ఉద్యమించారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చి దాడి చేస్తే ఊరుకోం.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరి సాగులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ప్రాజెక్టు ఫెయిలైతే 3.50 కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండింది? కాళేశ్వరం గురించి ఆయన పక్కన ఉన్న సన్నాసులు చెప్పేది కాకుండా రాహుల్ అసలు విషయాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? కుంభకోణా ల కుంభమేళా కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయతీ గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఇది ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నడుమ జరుగుతున్న ఎన్నిక. మోదీ విధానాలు జుమ్లా లేదా హమ్లా. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణపై దాడి చేస్తే సహించేది లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దరువు ఎల్లన్న, సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు. -
అతనికి మెంటల్ ఒక అంబులెన్సు పంపండి
-
పవన్‌పై మంత్రి అంబటి సెటైరికల్ ట్వీట్
సాక్షి, గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం సెటైరిక్‌గా ఓ ట్వీట్ చేశారు. విప్లవ యోధుడు చే గువేరా పుట్టినరోజు సందర్భగా.. ఓ ప్రశ్న అంటూ పవన్‌ను ఉద్దేశించే పరోక్షంగా ట్వీట్ చేశారాయన. ఆ ట్వీట్ పరిశీలిస్తే.. చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న: టీ షర్ట్ మీద చే గువేరా గుండెల్లో చంద్రబాబు ఎవరతను ? — Ambati Rambabu (@AmbatiRambabu) June 14, 2023 ఇదీ చదవండి: మళ్లీ చంద్రబాబు కోసం పవన్ పనిచేసేది! -
ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..!
పాదయాత్రలో లోకేష్ చేస్తోన్న వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా మారుతున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ట్రైనింగ్ ఇదేనా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనపై ఉన్న ముద్రను మార్చుకోవడానికి తరచుగా నేను మూర్ఖుడినంటూ చెప్పుకోవడం కూడా ద్వారా లోకేష్ ఏం ఆశిస్తున్నాడో కానీ.. జనం మాత్రం అది నిజమేమో అన్నట్టుగా ఉన్నారు. తరచుగా ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. లోకేష్ చెప్పిందేమిటి.. చెప్పాలనుకున్నదేమిటి?.. ప్రశాంతతను.. ప్రశాంతి అత్త అని, జీవో నెంబర్ 1ని.. జియో 1, పనిముట్లను పంది ముట్లు , అద్దెని అద్దు అంటూ పలకడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇవి కొన్ని మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. ఇక బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సైకిల్ పోవాలి అంటూ ఆయన చేసిన కామెంట్ సంచలనం సృష్టించింది. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసి లోకేష్ నవ్వులపాలయ్యారు. లోకేష్ తన పొలిటికల్ కెరీర్లో చేసిన చిత్ర, విచిత్ర ప్రకటనలు: ►కుల పిచ్చి, మత పిచ్చి, అవినీతి, బంధుప్రీతి కల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. ►సైకిల్ కి ఓటేస్తే ఉరేసుకున్నట్టే.. ►వర్ధంతి సందర్బంగా మీ అందరికీ శుభాకాంక్షలు ►NTR ఆశయాలు నాశనం చేయడానికే మీ ముందుకు వచ్చా ►మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా TDP అధికారంలోకి వస్తామనిపిస్తుంది. ►ఊ ఆ అంటే దెంగూ (డెంగ్యూ )వస్తుంది ►12 ఏళ్ల వచ్చేవరకు మా నాన్నను చూడలేదు ►కనీసం 12 కేసులుంటేనే నా దగ్గరకి రండి ►బందర్ పోర్టును కేసీఆర్ ఎత్తుకుపోతాడు ► 1 GB నెట్ వాడితే 1 శాతం జీడీపీ పెరుగుద్ది ►ఇసుక కొరత వలన స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇలాంటి తప్పులు, వ్యాఖ్యలు చేయకూడదన్న ఉద్దేశ్యంతో పాదయాత్రకు ముందు లోకేష్‌కు భారీగా ట్రైనింగ్ ఇచ్చారని తెలుగుదేశం తమ్ముళ్లు చెప్పుకుంటారు. మదీనాగూడ ఫాంహౌస్‌లో తెలుగు భాషలో నిష్ణాతులైన ఐదుగురితో పాటు వివిధ అంశాల్లో దిట్ట అనిపించుకున్న వారితో లోకేష్‌కు శిక్షణ ఇచ్చారట. ఇంత చేసినా.. గ్రౌండ్లోకి లోకేష్ వచ్చి మాట్లాడినప్పుడు ఆ నైపుణ్యం ఏదీ రాకపోగా.. దానికి విరుద్ధమైన, నవ్వులపాలయ్యే ప్రకటనలు వస్తున్నాయి. చదవండి: లోకేష్‌పై కొడాలి నాని ఫైర్.. ఎమ్మెల్యేగా ఓడిపోయినోడితో.. ఇక ఇటీవల పాదయాత్రలో మరో అడుగు ముందుకేసి 1994కు ముందు హైదరాబాద్ అంటే ఎవరికీ తెలియదన్నారు లోకేష్. దానిపై నెటిజన్లు మండిపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర ఏ లక్ష్యం సాధిస్తుందో తెలియదు కానీ.. కోటలు దాటే ఆయన మాటలు మిస్‌ఫైర్ అయి సొంత పార్టీనే దెబ్బతీసేలా ఉన్నాయని పార్టీలో తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఇప్పటికే పాతాళానికి చేరిన పార్టీ ప్రతిష్టను మరింత లోతుకు తీసుకువెళ్తారా అని ఆందోళన చెందుతున్నారు. -
మోదీ చేసిన అప్పు 100 లక్షల కోట్లు.. బీఆర్ఎస్ సర్కారు అప్పు ఎంతంతే?
ఇండియన్ ‘లోన్’ మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లయితే, మోదీ ఎనిమిదిన్నరేళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల రూపాయల రుణభారం మోపారు. – కేటీఆర్ కామెంట్ ....... కౌంటర్.. ‘స్టేట్’మెంట్ తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లయ్యింది. రెండేళ్లలోనే బీఆర్ఎస్ సర్కారు రూ. 87 వేల కోట్ల అప్పును చేసింది. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. మన పిల్లలకు అప్పు మిగులుస్తున్నారు. సరాసరి తలసరి రూ. 94 వేల అప్పును మోపుతున్నారు – బండి సంజయ్, కిషన్‌రెడ్డి విమర్శలు ....... అప్పుల ‘మధ్య’తరగతి.. ‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం..’’ అంటారు. కళ్ల తడి కామన్ కానీ, ఈ రోజుల్లో అసలు అప్పు చేయకుండా జీవితం దాటనేలేం. కుటుంబాలన్నీ అప్పుల కుప్పలే. ‘ఈఎంఐ’.. అని రుణాల పేరు పోష్‌గా మారిందంతే. వాయిదాల్లేకుండా బతికేదెవ్వరు.. ఇంటికి, బండికి, చదువుకు, పెళ్లికి.. చిట్లు.. ఒక్కటేమిటి ముఖ్యంగా మధ్యతరగతి బతుకంటేనే అప్పులు కదా...! చిన్నప్పుడు ‘తీసివేతలు’ నేర్పుతున్నప్పుడు లెక్కల మాస్టారు ‘ఒకటి అప్పు తీసుకోరా ..’ అని ఎప్పటి నుంచి చెప్పారో, అప్పటినుంచి బతుకు లెక్కంతా అప్పులే. రుణాలు తీసుకుంటూనే ఉన్నాం. వడ్డీలు, కిస్తులు కడుతూనే ఉన్నాం. అప్పూ గొప్పే... రిచ్ క్లాస్‌లో ఇదేం నామోషీ కాదు. అంబానీ నుంచి అదానీ దాకా అపరకుబేరులైనా అప్పు చేయా ల్సిందే. నిజానికి ఇలాంటి వారికే ఎక్కువ అప్పు లిస్తారు కూడా. ఈ రేంజ్లో ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేసి అప్పులిచ్చి గౌరవించడం, ఎగ్గొడితే ఫ్లయిట్లలో విదేశాలకు పంపడం కూడా మనకు తెలిసిందే కదా.. అప్పుకు మారుపేరైన.. ‘ఈఎంఐ’ల్లో పుట్టి (హాస్పిటల్ చార్జీలు కూడా ఈఎంఐలో కట్టేంతగా ఉంటాయి), ఈఎంఐల్లో పెరిగి, ఈఎంఐలతో చదువుకుని, ఈఎంఐల్లో పోవడమే మధ్య, పేద తరగతి జీవితం. కానీ, అప్పుల్లోనూ అంత ఖదర్‌గా బతికే బిజినెస్, రిచ్ క్లాసూ ఉంది. రుణ.. పురాణం నిజానికి ఈ అప్పు లొల్లి, అప్పుల్లోనూ పేద ధనిక తారతమ్యం పురాణాల కాలం నుంచీ ఉన్నట్టుంది. బూడిద పూసుకుని, కనీసం ఒంటిపై బ్రాండెడ్ బట్టల్లేకుండా పులి చర్మాలు, నారచీరలు ధరించి శ్మశానాల్లో తిరుగుతూ ఉండే ‘శంకరుడి’కి కుబేరు డెప్పుడయినా లోన్ ఆఫర్ చేసిన సందర్భాలు కనిపిస్తాయా..? గడ్డ కట్టుకు పోయే చలిలో హిమాలయాల్లో నివసించే శివుడు కనీసం ‘హోమ్‌లోన్’కు అప్లయి చేసుకున్న దాఖలాలూ లేవు. యుగాల తరబడి అదే నందీశ్వరుడిని యూజ్ చేశాడే కానీ, ఎవరైనా శివుడికి ‘వెహికల్ లోన్’ అరేంజ్ చేశారా..? పుష్పక విమానంలో తిరిగే కుబేరుడు ఆఫర్ చేశాడా.. ఎందుకంటే ఆయన పేద దేవుడు. పైగా ఎవరేం అడిగినా ఇచ్చేసే భోళా శంకరుడాయే.. ‘కొల్లాటరల్ సెక్యూరిటీ’ చూపే శక్తి లేదు. ప్రధానుల, ముఖ్యమంత్రుల రికమండేషన్ కూడా లేనట్టుంది. ... ఇప్పటి మన రైతులు, పేదోళ్ల పరిస్థితిలాగా! అదే, విష్ణుమూర్తిని చూడండి. ఆయన మ్యారేజీకి కుబేరుడు ఎంత డబ్బిచ్చాడు! తిరుపతి వెంకన్నఇంకా కిస్తులు కడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ అప్పెలా వచ్చింది. ఆ అప్పు ఎందుకు తప్పు కాలేదు..? ఎందుకంటే ఆయన బాగా రిచ్చి. స్వయంగా లక్ష్మీదేవియే అర్ధాంగి. దేవుళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు. ఘనంగా అల వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో నివసిస్తాడు. పెద్దోళ్లందరికీ కావలసినవాడు. ఇంకేం ఎంతైనా అప్పు పుట్టుద్ది... మన రిచ్ పీపుల్ లాగా. – ఇక మన ఆర్థిక మంత్రి సీతారామన్ లాంటి వాళ్లెవరైనా ఉంటే దేవుళ్లలో ఇప్పటికే వెంకన్న రుణం అంతా ‘రైటాఫ్ ’ అయిపోయేది. అప్పు.. సంపన్నం ఇది చూడండి.. మనం ఆరాధనగా చూసే అమెరికా, సింగపూర్ తలసరి అప్పులు ఎక్కువే. అక్కడ సింగపూర్‌లో ఒక్కొక్కరిపై 97.46 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. జపాన్, కెనడా, బెల్జియం వంటి సంపన్న దేశాల వారి తలసరి అప్పులు ఎక్కువ. రిచ్‌నెస్ అలా ఉంటది మరి. అప్పుల్లోనూ.. పూర్ ఆఫ్గానిస్థాన్ , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, మడగాస్కర్, లైబీరియా వంటి చిన్న దేశాల్లో తలసరి అప్పు తక్కువే. విదేశాల నుంచి అప్పులు దొరకడం కష్టం. ఆదాయమే సరిగ్గా లేని వాళ్లకు అప్పులెలా ఇస్తారు.. అదీ సంగతి ....... .. ఇంతకీ బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా చెప్పొచ్చేదేమంటే.. ఎంత అప్పుంటే అంత దర్జా.. ఎంత దర్జా ఉంటే అంత అప్పు... కనుక ‘పక్కోడు చేసే అప్పులు..’ పెరుగుతున్నాయని చింతించవలదు. డబ్బున్నోడికి అప్పు ఈజీ కదా.. అంటే అప్పుంటే డబ్బు, దర్పం ఉన్నట్టే కదా! అంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరి. ....... కానీ, ‘...మన మీద పడే అప్పులపై ’ చింతించే మిడిల్ క్లాస్ ఒకటి ఉందండోయ్.. ‘ఇప్పటికే ఏళ్ల తరబడి ఇంటి లోన్ కడుతున్నాను, ఈ మధ్యే పిల్లాణ్ణి స్కూల్లో వేయడానికి ఓ లక్ష అప్పు చేశాను, కరోనా మింగిన నాలుగు లక్షల తాలూకు అప్పు, వడ్డీ అలాగే ఉన్నాయి. రెండో అమ్మాయి స్కూల్లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ ఖర్చులిలా ఉండగా మన ‘డబుల్ ఇంజన్ సర్కార్లు’ వాళ్లు చేసిన అప్పులన్నీ మనతోనే కట్టిస్తారు.. వాళ్ల జేబు లోంచి కట్టరుగా... అని మా ఆవిడ భయంగా అడుగుతోంది..’ – కేటీఆర్, సంజయ్ ΄పోటా పోటీ ‘అప్పుల’ విమర్శలు చూసి ఓ నెటిజన్ పోస్టు ఇది. ఆలోచించదగ్గ ఆందోళనే. అక్కడిదాకా రాకుండా చూడండి. ఇప్పటికే అప్పులు కట్టలేక చస్తున్నాం. (క్లిక్ చేయండి: బయటపడిన అమెరికా డొల్లతనం) -
Telidevara Bhanumurthy: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండంత్రాల బంగ్లల బేతాలు డుంటున్నడు. ఎటూ పొద్దుబోక టీవీ జూస్కుంట గూసున్నడు. విక్రమార్కుడు బొందల గడ్డకు బోయిండు. బేతాలుని ఇంటి ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతాలుడు ఇంట్ల కెల్లి ఇవుతల కొచ్చిండు. మోటరెన్క సీట్ల గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ‘‘నన్ను గూసుండ బెట్టుకోని ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతవు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు తిక్క లేవొచ్చు. కోపం రావొచ్చు. యాస్ట లేకుంట ఉండె తంద్కు నీకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ అని మోటరెన్క సీట్ల గూసున్న బేతాలుడన్నడు. ‘‘నీకు కత జెప్పుడు, నాకు ఇనుడు అల్వాటే గద’’ అని మోటర్ నడ్పుతున్న విక్రమార్కుడన్నడు. ‘‘గీనడ్మ తెలంగానలున్న కమ్మం పట్నంల తెలుగు దేసం శంకు సప్పుడు సబ బెట్టింది. గాడ కిష్నుని యేసంల శంకమూదుతున్న ఎన్టీఆర్ కటౌట్ బెట్టిండ్రు. పచ్చ జెండలు ఎగిరేసిండ్రు. పచ్చ తోర్నాలు గట్టిండ్రు. బుక్క గులాల్లెక్క తెలుగు దేసమోల్లు ఒకల మీద ఒకలు పస్పు జల్లుకుండ్రు. శంకు సప్పుడు సబ కాడ రెండేల్లు సూబెడ్తున్న చెంద్రబాబు కటౌట్ గుడ్క బెట్టిండ్రు. ‘తెలుగుదేసం పిలుస్తున్నది కదలిరా. సైకిల్ పంపు దీస్కోని ఉర్కిరా’ అని రాసి ఉన్న బ్యానర్లను గట్టిండ్రు’’ అన్కుంట బేతాలుడు ఇంకేమొ జెప్పబోతుంటె – ‘‘సైకిల్ పంపు దీస్కోని వొచ్చుడెందుకు?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాలిబోయిన టీడీపీ సైకిల్ల గాలిగొట్టెతంద్కు. శంకు సప్పుడు సబకు చెంద్రబాబొస్తుంటె జెనం గాయిన మీద పస్పు జల్లిండ్రు. నందమూరి సుహాసిని పస్పుతోని గాయినకు బొట్టు బెట్టింది. కడ్మ టీడీపీ ఆడి లీడర్లు గాయినకు మంగలార్తి ఇచ్చిండ్రు. పచ్చంగి దొడుక్కున్న గాయిన గాల్లకు రెండేల్లు సూబెట్టిండు. ‘తెలుగుదేసం జిందాబాద్, చెంద్రబాబు జిందాబాద్’ అని తెలుగు దేసపోల్లు లాసిగ వొల్లుతుండగ గాయిన స్టేజ్ ఎక్కిండు. ముందుగాల పచ్చ రంగు శంకం దీస్కోని ఊదిండు. గని జెర్ర సేపటికే గాయినకు దమ్మొచ్చింది. ఇక దాంతోని శంకమూదుడాపి గాయిన గిలాస నీల్లు దాగిండు.’’ ‘‘తెలుగుదేసంను ఇడ్సిపెట్టి పోయిన తెలుగు తమ్ముండ్లూ మల్లొక్కపారి మీ ఇంటికి రాండ్రి. సైకిల్ పంపుచర్లు జుడాయించి గాలి గొట్టుండ్రి. టీడీపీ తెలంగానలనే పుట్టింది. తెలంగానలనే పెరిగింది. (‘తెలంగానలనే సచ్చింది’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు) నేను ఒక్క తీర్గ బత్మిలాడంగ బత్మిలాడంగ బిల్స్ గేట్స్ పట్న మొచ్చిండు. కుద్దు నేనే గాలి మోటర్ అడ్డంకు బోయి గాయినకు మంగలార్తి ఇచ్చిన. మూడు నచ్చత్రాల హోటల్ల ఉంచి కుద్దు నేనే ఒక కోపుల చాయ్ ఇచ్చిన. గాయినకు ఒక్క తీర్గ మస్క గొట్టి హైటెక్ సిటీ దెచ్చిన. గాలి మోటర్ల దునియ అడ్డను నేనే గట్టిపిచ్చిన. నేను జెయ్యబట్కెనే ఇయ్యాల పట్నంల కరోన టీక తయ్యారైంది. తెలంగాన, ఆంద్ర నాకు రొండు కండ్లు. గీ రొండు కండ్లు ఒక్కటి గావాలని సిగ్గు శరం లేనోల్లు అంటున్నరు. ఏ కన్నుకు ఆ కన్ను ఉంటెనే నాకు మల్ల ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్తది. టీడీపీ సైకిల్ ఒక గిర్రల ఆంద్ర తమ్ముండ్లు గాలిగొడ్తున్నరు. ఇంకొక గిర్రల తెలంగాన తమ్ముండ్లూ గాలి గొట్టుండ్రి. మీరు గాలిగొడ్తెనే నా సైకిల్ నడుస్తది. నా సైకిల్ నడుస్తనే బీజేపీ కాడికెల్లి అన్ని పార్టిలు నా దిక్కు జూస్తయి. నాతోని సోపతి జేస్తయి అన్కుంట చెంద్రబాబు సుత్తిగొట్టిండు.’’ ‘‘తెలంగానలనే గాకుంట ఆంద్రల గుడ్క చెంద్రబాబు సబలు బెట్టిండా?’’ ‘‘గిదేం కర్మ రాస్ట్రంకు సబలు బెట్టిండు. ముక్యమంత్రి కుర్సి పోయిన కాన్నుంచి నాకు బువ్వ దిన బుద్దయితలేదు. కన్ను మలుగుతలేదు. కన్ను మల్లకుంటె కలలు యాడబడ్తయి. కలలు బడక ఆకర్కి కలల గుడ్క ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్త లేదు. ఫికర్ తోని బక్కగైన. నన్ను ముక్యమంత్రిని జేస్తిరా అంటె అందరి ఇండ్లకు పచ్చ రంగేపిస్త. ఇండ్లకే గాకుంట బళ్లకు, గుళ్లకు, సర్కార్ దప్తర్లకు పచ్చరంగు ఏపిచ్చి ఆంద్రప్రదేస్ను బంగారి రాస్ట్రం జేస్త. గిదేం కర్మ రాస్ట్రంకు...’’ అని గాయిన ఇంకేమొ మాట్లాడబోతుంటె – ‘నువ్వే కర్మ రాస్ట్రంకు’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు. చెంద్రబాబుతోని ముచ్చట బెట్టెటప్పుడు బిల్‌గేట్స్ తప్పిజారి గూడ గాయిన ఈపు ఎందుకు సూబెట్టలేదు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ టైర్లల్ల గాలి బోతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఈపు గిన గండ్లబడ్తె చెంద్రబాబు యాడ ఎన్నుపోటు పొడుస్తడోనని బిల్‌గేట్స్ బయపడ్డడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంటి దిక్కు బోయిండు. (క్లిక్ చేయండి: కొంపలు ముంచే కొత్త దుక్నాలు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: మందల బడి మురుస్తాంది గొర్రె
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడు ఉంటు న్నడు. పొద్దుబోకుంటె టివిల ఫుట్‌బాల్ మ్యాచ్ జూస్కుంట గూసున్నడు. ఇంటి ముంగట మోటరాపి విక్రమార్కుడు హారన్ గొట్టిండు. టివి బంద్ జేసి బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. ‘‘ఇగమున్నా, సిగలేటు ముట్టిచ్చెతంద్కు ఇంగలం దొరకకున్నా, ఆనగొట్టి తొవ్వలు చెర్ల తీర్గ అయినా మోటర్ దీస్కోని వొస్తవు. గుంతలు, ఎత్తు గడ్డలని సూడ కుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న సైడియ్యకుంటె నీకు కోపం రావొచ్చు. నీ యాస్టనంత యాది మర్సెతందుకు బీఆర్ఎస్ కత జెప్త ఇను’’ అని అన్నడు బేతాలుడు. ‘‘చెప్పుడు నీ పనైతె ఇనుడు నా పనే గదా’’ అని విక్రమార్కుడు అన్నడు. ‘‘కతంత అయినంక నేనడ్గేటి సవాల్‌కు జవాబ్ జెప్పుడు గుడ్క నీ పనే. బొంతు పుర్గు సీతాకోక చిల్క అయిన తీర్గ టీఆర్ఎస్ పార్టి బీఆర్ఎస్ అయ్యింది. టీఆర్ఎస్ జెండల తెలంగాన నక్ష ఉన్నది గని బీఆర్ఎస్ జెండల బారతదేసం జెండ ఉన్నది. బీఆర్ఎస్ అంటె బరండి, రమ్ము, స్కాచ్ అని కొందరనబట్టిండ్రు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది; బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయితదని రేవంత్ రెడ్డి అసువంటోల్లు అనబట్టిండ్రు.’’ ‘‘ఇంతకు బీఆర్ఎస్ అంటె ఏంది?’’ ‘‘భారత రాష్ట్ర సమితి. ముందుగాల రాస్ట్రం సంగతి జూస్కోవాలె. అటెంకల దేసంను బాగ జేస్త ననాలె. గట్ల గాకుంట కేసీఆర్ ఇల్లు మించిన పందిరేస్తున్నడు. ఎంటిక పోసతోని గుట్టను గుంజాలని సూస్తున్నడు.’’ ‘‘తెలంగాన గురించి కేసీఆర్ ఎన్నిటినో జేస్తె గిట్లంటవేంది?’’ ‘‘శాన జేసిండు. మాటల్తోని కోటలు గట్టిండు. రొండేండ్ల కిందట వాసాల మర్రి ఊరును దత్తు దీస్కుండు. యాడాదిల గా ఊరును బంగారి మర్రి జేస్తనన్నడు. రొండు నూర్ల గజాల వొంతున అందర్కి ఇండ్లు గట్టిపిచ్చి ఇస్తనన్నడు. శ్రమదానం కమిటి, హరిత హారం కమిటి అసువంటి కమిటిలు ఏసిండు. మొగులు మీది సర్గంను కిందికి దించుతనని ఒక్క తీర్గ జెప్పిండు. తొవ్వ ఏసెతంద్కు అడ్డమున్నయని శానమంది ఇండ్లను కూలగొట్టిండ్రు. అంగన్వాడి, బడి, పంచాయతి ఆపిస్, చెర్వులను బాగ జేసెతందుకు 150 కోట్లు కర్సయితదని అప్సర్లు సర్కార్‌కు జెప్పిండ్రు. గని ఇదువర దాంక సర్కార్ ఒక్క రూపాయి గుడ్క మంజూరు జెయ్యలేదు. గిప్పుడు వాసాల మర్రిల వాసాలే మిగిలినయి. కొత్త ఇండ్లేమొగని ఉన్న ఇండ్లు బోయినయి’’ అని బేతాలుడు అన్నడు. ‘‘ఇంతకు కేసీఆర్, బీఆర్ఎస్ జెండను యాడ ఎగిరేసిండు?’’ ‘‘డిల్లిల సర్దార్ పటేల్ మార్గ్‌ల ఒక బంగ్లను కిరాయికి దీస్కుండు. తీస్కునే ముంగట గది వాస్తు ప్రకారం మంచి గున్నదా లేదా అని అర్సుకుండు. పెండ్లాం, పిల్లలను దీస్కోని డిల్లికి బోయిండు. అయ్యగార్లు బెట్టిన మంచి మూర్తంల నవ చండీయాగం జేసిండు. యాగ మైనంక ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని వొచ్చి నోల్లందరు వొర్లుతుండంగ బీఆర్ఎస్ జెండ ఎక్కిచ్చిండు. మంగలార్తి దీస్కోని పార్టి అపిస్లకు బోయిండు.’’ ‘మోదీ జైశ్రీరాం అంటడు. జైశ్రీరాం గాదు జైసియా రాం అనాలని రాహుల్ గాందీ అంటున్నడు. రాంరాం అన్కుంట సీతా మాతను ఇడ్సిపెడ్తె ఎట్లని అడుగు తున్నడు. మన దేసమే గాకుంట దునియంత మంచి గుండెతందుకే రాజ శ్యామల యాగం జేసిననని కేసీఆర్ అంటున్నడు. గీల్లు గిట్లెందుకు జేస్తున్నరు’’ అని విక్ర మార్కుడు అడిగిండు. ‘‘లీడర్లందరు మతం పేరు మీద మాయలు జేస్తుంటరు. గుళ్లు గట్టిస్తరు. దీపాలు ముట్టిస్తరు. జెనా లను గొర్లను జేస్తరు. జెనం గొల్రు గుడ్క లీడర్ల యెంబడి దిరుక్కుంట మురుస్తుంటయి. రేపొద్దుగాల ఏమైతయో మరుస్తుంటయి. దేసంల అన్నిటి కన్న ఎక్వ గొర్లున్న రాస్ట్రం తెలంగాన అని గీనడ్మ ఒక పేపర్ల రాసిండ్రు ఎందుకు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్ప కుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ముందుగాల నీ లెక్కనే నాకు అర్తం గాలేదు. జెర సోంచాయిస్తె అర్తమైంది. ఆడు అబద్దం రాయలేదు. ఉన్న నిజమే రాసిండని’’ విక్ర మార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. తోక:– ‘‘నేను ఇంటర్ల ఫస్ట్ కిలాస్ల పాసైన. గీ సదువుతోని నీకు కొల్వు యాడ దొరుక్తది. డిగ్రి మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జిలు ఏస్కోని బత్కాలె అని మా నాయిన అన్నడు. డిగ్రిల ఫస్ట్ కిలాస్ల పాసైన. కొల్వు దొర్కలే. బిటెక్ మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బండి బెట్టుకోని బత్కాలె అని మా కాక అన్నడు. బిటెక్ల మంచి మార్కులొచ్చినయి. కొల్వు దొర్కలే. ఎంబిఏ మంచిగ సదివితివా అంటె సర్కార్ కొల్వు దొరక్తది. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జీలు ఏస్కోని బత్కాలె అని మా మామ అన్నడు. ఎంబిఏ గుడ్క మంచి మార్కులతోని పాసైన. ఏం లాబం. కొల్వులు లెవ్వు. మిర్చి బజ్జీలేస్కోని బత్కు అని సర్కా రోల్లు జెప్పిండ్రు. ముప్పై రూపాయలకు నాలుగు మిర్చి బజ్జీలు. మీకెన్ని బజ్జీలు గావాలె.’’ (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మా ‘బాబూ’ బాద్ మెల్లమెల్లగా మహబూబాబాద్ అయ్యిందట!
ఆంద్రప్రదేస్ బోక శానొద్దులైంది. ఒకపారి గా రాస్ట్రం బోయొస్తె బాగుంట దని నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అనుకుంట మొగులు మీద్కెల్లి ఎల్లిండు. నర్కం దిక్కుబోతున్న యముని దున్న పోతు ఎదురుబడ్డది. ‘‘యాడ్‌కి బోతున్నవు నారదా!’’ అని అడిగింది. ‘‘ఆంద్రప్రదేస్ బోతున్న’’ ‘‘ఫుజూల్గ ఎందుకు బోతవు?’’ ‘‘నేను బోకుంటె గాడి సంగతులన్ని ఎట్లెర్కైతయి?’’ ‘‘గా రాస్ట్రంల ఏమైతున్నదో నేను జెప్త గద.’’ ‘‘గట్లయితె మంచిదే. నాకు బోయే బాద దప్పుతది’’ అని నారదుడన్నడు. ‘‘అన్ని నిజాలే జెప్త. అబద్దాలస్సల్ జెప్ప అని గీనడ్మ చెంద్ర బాబు అంటున్నడు’’ అని దున్నపోతు ఇంకేమొ జెప్పబోతుంటె అడ్డం దల్గి– ‘‘గాయిన సంగతి ఎవ్వలికెర్కలేదు. అస్కిని బుష్కిని జేసుడే గాకుంట అబద్దంను నిజమని నమ్మిచ్చెతంద్కు గాయిన ఒకతీర్గ తన్లాడ్తడు’’ అని నారదుడన్నడు. ‘‘అబద్దంను ఊకూకె జెప్తె గది నిజమై గూసుంటది. చెంద్ర బాబు హైటెక్ సిటీనే గాకుంట మహబూబాద్‌ను గుడ్క గట్టిపిచ్చిన్నని అంటున్నడు. ముంజాత గాదాని పేరు మా ‘బాబూ’ బాద్ట. మా బాబూబాద్ మెల్లమెల్లగా మహబూబా బాద్ అయ్యిందట. గదే తీర్గ మా బాబూనగర్ మహబూబ్ నగరైందని గాయిన ఒక్కతీర్గ జెప్తున్నడు. ఎన్కట చెంద్రబాబు గిరిని గాయినే గట్టిపిచ్చిండట. గా చెంద్రబాబు గిరినే గీ జమానల అందరు చంద్రగిరని అంటున్న రట. నాకు ఆక్రి మోక ఇయ్యిండ్రి. మల్లొకపారి ముక్యమంత్రిని జెయ్యిండ్రి. గట్ల జేస్తిరా అంటె కొత్త చరిత్ర రాయిస్త. గిసువంటి నిజాలు జెనంకు ఎర్కయ్యేటట్లు జేస్త అని చెంద్రబాబు అనబట్టిండు’’. ‘‘చెంద్రబాబు ఇంకేం జెప్పిండు?’’ ‘‘మా టిడిపి సర్కారుండంగ జన్మభూమి, శ్రమదానం అసుంటి పద్కాలు బెట్టినం. జన్మభూమి కింద చెట్లు నాటేటోల్లు. శ్రమదానం కింద నాటిన చెట్లను పీకెటోల్లం. గీ పద్కాలు జెయ్యబట్కె ఎందరికో పని దొర్కింది. గిప్పుడు మాసరకు గిసువంటి ఒక్క పద్కమన్న ఉన్నదా? నా జమానల రైతులు ఎరు వులు, ఇత్తుల కోసం తిప్పలుబడెటోల్లు గాదు. ఎరువులు, ఇత్తులు గావాలంటె కంప్యూటర్ల డవున్లోడ్ జేస్కునేటోల్లు. అన్కుంట చెంద్రబాబు పల్ల పల్ల ఏడ్సిండు’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘అంత బాగున్నది గని ఎందుకేడ్సిండు?’’ అని నారదుడు అడిగిండు. ‘‘ముక్యమంత్రి కుర్సి యాదికొచ్చి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘బాబు జెప్పుడేనా? చేసుడేమన్న ఉన్నదా?’’ ‘‘పవన్ కల్యాన్‌ను గల్సినంక కూసమిడిచిన పాము తీర్గ బాబు ఆగుతలేడు. గిదేం కర్మ రాస్ట్రంకు పోగ్రాం కింద రొండు గోదావరి జిల్లలల్ల దిరుక్కుంట మీటింగ్‌లు బెట్టిండు’’ అన్కుంట దున్నపోతు జెప్తుంటె మల్ల నారదుడు అడ్డం దల్గి – ‘‘గిదేం కర్మరా బాబూ! అని అనుకోబట్కెనే ఆంద్ర జెనాలు చెంద్రబాబును ముక్యమంత్రి కుర్సి మీదకెల్లి దించిండ్రు. రాజకీయాలల్ల వజీప దీస్కొని మన్మనితోని ఆడుకోమన్నరు’’ అని అన్నడు. ‘‘గాయిన వజీప దీస్కుంటె పాపం లోకేశ్‌ను ఎవలు గాన్తరు. సైకిల్ల గాలిబోయింది. రొండు పయ్య లూసిపోయినయి. హైండిల్ ఇర్గిపోయింది. ఫిర్బిల్ పనిజేస్తలేదు. ఫైడిల్లు పతా లేకుంట బోయి నయి. ఇగ దాంతోని లోకేశ్ సైకిల్ జోడో యాత్ర జేస్తనంటున్నడు. గిదేం కర్మ రాస్ట్రానికి ప్రోగ్రాం కింద నిడదవోలుల చెంద్రబాబు మీటింగ్ బెట్టిండు. నా ముక్యమంత్రి కుర్సి నాగ్గాకుంట బోంగనే మన రాస్ట్రంకు శని బట్టింది. అంగట్ల అన్ని ఉన్నా అల్లుని నోట్లె శని అంటె గిదే అని అన్నడు’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘అంగట్ల అన్ని ఉన్నయి. అల్లుడు శని గూడ ఉన్నడు అంటె బాగుంటది’’ అని నారదుడన్నడు. ‘‘గిదేం కర్మ రాస్ట్రంకు ప్రోగ్రాం కింద తెలుగుదేసం తాడేపల్లి గూడెంల మీటింగ్ బెట్టింది. బుక్కా గులాల్లెక్కగా మీటింగ్‌ల తెలుగుదేసమోల్లు ఒగల మీద ఒగలు పస్పు జల్లుకున్నరు. టిడిపి జిందాబాద్, గిదేం కర్మ రాస్ట్రంకు అని తెలుగుదేసమోల్లు లాసిగ ఒల్లుతుండంగ చెంద్రబాబు మైకు ముంగట్కి వొచ్చిండు. రొండేల్లు సూబెట్టిండు. పోలవరం నా పానం. మా సర్కారుం డంగ పతొక్క సోమారంను పోలవారం అనుకున్నం. అనుకోని గా దాని గురించే మాట్లాడుకునేటోల్లం. నెలకొక్కపారి నేను పోలవరం ప్రాజెక్టు చూసొచ్చేటోన్ని. సంటరే గీ ప్రాజెక్టు గటిపిచ్చేదుంటె కమీషన్ల కోసం నేను గాదాన్ని గట్టిచ్చుడు షురువు జేసిన్నని నన్ను బద్నాం జేసిండ్రు. నాకు ఆక్రి మోక ఇయ్యండ్రి’’ అన్కుంట చెంద్రబాబు స్పీచ్ గొట్టిండు. మల్ల గలుస్త అన్కుంట దున్నపోతు నర్కం దిక్కు బోయింది. ఫీచేముడ్ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. తోక: పొద్దుమీకింది. ఎప్పటి తీర్గనే పాన్ డబ్బ కాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట, సిగిలేట్లు దాక్కుంట మా దోస్తులు ముచ్చట బెడుతున్నరు. ‘‘ఢిల్లిల జి–20 మీద ప్రతాని మోదీ మీటింగ్ బెట్టిండు. అన్ని రాస్ట్రాల ముక్యమంత్రులను, పార్టీల ప్రెసిడెంట్లను బిల్సిండు. గప్పుడు చెంద్రబాబును జూసి శాన బక్కగైండ్రు అని మోదీ అంటె గీ నడ్మ రాస్ట్రంల బగ్గ దిర్గుతున్న అని బాబు జెప్పిండు’’అని యాద్గిరి అన్నడు. ‘‘చెంద్రబాబు తిరుగుడు తోని బక్కగ గాలేదు. ముక్యమంత్రి కుర్సి మీద ఫికర్తోని బక్కగైండు’’ అని సత్నారి జెప్పిండు. -తెలిదేవర భానుమూర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99591 50491 -
ఎలాన్ మస్క్ ట్వీట్..ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల సెటైరికల్ రిప్లయి అదిరింది!
ట్విటర్ బాస్‌గా అవతారం ఎత్తిన ఎలాన్ మస్క్..ఊహించని నిర్ణయాలతో నిత్యం ఏదొ ఒక అంశంపై సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ట్విటర్లో భారీగా ఉద్యోగుల తొలగింపులు, సంస్థాగత నిర్మాణం (organizational structure)లో మార్పులు చేస్తున్నారు. పనిలో పనిగా ట్విటర్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. సందర్భాను సారం ట్వీట్లు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల చూపు తన వైపు మరల్చేలా చేస్తున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా మస్క్ చేసిన ట్వీట్. ఆ ట్వీట్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు రిప్లయి ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. ట్విటర్ సీఈవోగా ఆ సంస్థ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆఫీస్‌లో జరిగే మీటింగ్స్, డెవలప్‌మెంట్స్‌ను ఎప్పటికప్పుడు ట్వీట్ల రూపంలో నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ తరుణంలో మస్క్.. ‘వెయిట్ , నేను ట్వీట్ చేస్తే, అది పనిగా మీరు పరిగణిస్తారా?’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని ఆకర్షించింది. వెంటనే మస్క్ ట్వీట్‌కు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ‘వెయిట్,@uppolice మీ సమస్యలను ట్వీట్ ద్వారా పరిష్కరిస్తే, అది మీరు పనిగా పరిగణిస్తారా?’ అని పోలీసు శాఖ రిప్లయి ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికి యూపీ పోలీసులు ఆ ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి నెట్టింట్లో షేర్ చేశారు. పోలీసులు ఇచ్చిన ఎపిక్ రిప్లయ్పై నెటిజన్లకు ఫిదా అవుతున్నారు. వావ్, సెల్యూట్, బ్యూటిఫుల్ రిప్లయి ఇస్తున్నారు. ఇంకెందుకు అలస్యం ఆ ట్వీట్లను మీరూ చేసేయండి. Yes it does!#TwitterSevaUPP @elonmusk pic.twitter.com/qfGxAdvjkj — UP POLICE (@Uppolice) November 25, 2022 😂😂 Love it https://t.co/sjgEvvHBt7 — Anshuman Rai (@AnshumanRai3) November 26, 2022 Beautiful reply by @Uppolice https://t.co/W7pW7cbyMZ — Commando Sumit Bhardwaj (@commando_sumit) November 26, 2022 చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది -
కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కొని బొందల గడ్డ కాడ్కి బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. విక్రమార్కుడు మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు బేతాలుడు– ‘‘ఎండ గొడ్తున్నా, ఆనదంచి గొడ్తున్నా, సలి వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం వొస్తవు. గుంతలు, ఎత్తుగడ్డలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న నీ మోటర్‌కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ గాక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. నువ్వు యాస్ట మర్సెతంద్కు ఒక మజేదార్ ముచ్చట జెబ్త ఇను’’ అని అన్నడు. ‘‘చెప్పుడు నీ పని. ఇనుడు నా పని’’ అని విక్ర మార్కుడన్నడు. ‘‘చెంద్రబాబుకు ముక్యమంత్రి కుర్సి ఉన్నా నిద్ర రాదు. లేకున్నా నిద్ర రాదు’’ అన్కుంట బేతా లుడింకేమో జెప్పబోతుంటె అడ్డం దల్గి, ‘‘ఎందుకు రాదు’’ అని విక్రమార్కుడ డిగిండు. ‘‘చెంద్రబాబు ముక్యమంత్రిగ ఉండంగ కుర్సి దిగితె పౌరన్ ఎవలన్న గా కుర్సిల గూసోవొచ్చనేటి బయంతోని నాత్రిపూట గుడ్క నిద్ర పోలేదు. ఏం జేస్తె ముక్యమంత్రి కుర్సి వొస్తదా అని పగటీలి నాత్రి పూట ఒక్క తీర్గ ఆలోచన జేస్తుండ బట్కె గాయినకు నిద్రొస్తలేదు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం గిప్పుడు గాయినేం జేస్తున్నడు?’’ ‘‘గీ నడ్మ గాయిన పవన్ కల్యాన్ తాన్కి బోయిండు. గ్లిజరిన్ కంట్లె ఏస్కుంటె నీకు ఏడ్పొస్తది. గని గ్లిజరిన్ లేకున్నా నాకు ఏడ్పు వొస్తది. నా పెండ్లాంను తిట్టిండ్రనుకుంట అసెంబ్లిల నేను పల్ల పల్ల ఏడ్సిన. నువ్వు నేను గల్సి జెనం తాన్కి ఏడ్సు కుంటబోదాం. మోదీని బత్మిలాడు. గాయినను గుడ్క మనతోని గల్సి రమ్మను. ముగ్గురం గల్సి ఏడిస్తిమా అంటె మన ఏడ్పుల జగన్ సర్కార్ కొట్క బోతది. కాపుదనంకు కమ్మదనం గలిస్తె ఎదురుండదు అని చెంద్రబాబు పవన్తోని అన్నడు. అనుడే గాకుంట గిదే నాకు ఆక్రి మోక అన్కుంట ఒక్క తీర్గ ఏడ్సిండు.’’ ‘‘మల్ల మున్పటి లెక్క టీడీపీతోని సోపతి జెసెతంద్కు బీజేపీ రడీగున్నడా?’’ ‘‘అసల్ లేదు. సైకిల్ బిరక్ ఫేలైంది. పయ్య లల్ల గాలిబోయింది. గిప్పుడు గది శీకట్ల ఉన్నది. తెల్లా రంగనే మా తామరపువ్వు విచ్చుకుంటది. పగటీ లంత గట్లే ఉంటది. శీకట్ల ఉండేటి టీడీపీ తోని మా పార్టి సోపతి జేసే సవాల్ లేదు అని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు అన్నడు. జనసేన తోని పొత్తు గూడ్తం. గా పార్టితోని గల్సి వొచ్చేటి అసెంబ్లి ఎలచ్చన్ల పోటీ జేస్తం. టీడీపీకి మాకు జమా యించదు. చెంద్రబాబును సస్తె నమ్మం అని ప్రతాని అన్నడు.’’ ‘‘చెంద్రబాబు గిన జెనం తాన్కి బోయిండా?’’ ‘‘గీ నడ్మ మూడు దినాలు చెంద్రబాబు కర్నూలు జిల్లల దిర్గిండు. గిప్పుడున్నది శాసనసబ గాదు. కౌరవుల సబ. నేను ముక్యమంత్రినైతె గది పాండవుల సబ అయితది. నేను ముసలోన్ని అయిన. నాకు గిదే ఆక్రి మోక. నన్ను ముక్యమంత్రి కుర్సి మీద గూసుండబెడ్తె అమరావతిని రాజదాని జేస్త. ఇంద్రుని రాజదాని అమరావతి. గదే తీర్గ గీ చెంద్రుని రాజదాని గుడ్క అమరావతే అని చెంద్ర బాబు అన్నడు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం చెంద్రబాబు ఇంకేం జేసిండు?’’ ‘‘బాబు ఒక సన్నాసి తాన్కి బోయిండు. గాయిన కాల్లు మొక్కిండు. మల్ల ముక్యమంత్రిని గావాలంటె ఏం జెయ్యాలని అడిగిండు. దినాం తెల్లారి నాలుగ్గొట్టంగనే నిద్ర లెవ్వాలె. నెత్తిమీది కెల్లి తానం జెయ్యాలె. శివుని గుడికి బోవాలె. లింగంకు అబిసేకం చేసి మారెడాకులతోని పూజ జెయ్యాలె. శ్రీశైలం బోవాలె. వెయ్యిమందికి మెడల ఏస్కునే తంద్కు బంగారి లింగాలు ఇయ్యాలె. పెయ్యికి బూడ్ది బూస్కోవాలె అని జెప్పిండు. సన్నాసి జెప్పిన తీర్గనే చెంద్రబాబు జెయ్య బట్టిండు. గట్ల జేస్తుండంగ ఒక నాత్రి గాయినకు కల బడ్డది. గా కలల శంకరుడు గండ్లబడ్డడు. దేవా! జగన్ సర్కార్‌ను గూలగొట్టెతంద్కు నాకు పాశుపతాస్త్రం ఇయ్యి అని శివున్ని అడిగిండు. గాయినకు శంకరుడా అస్త్రమిచ్చిండా? జవాబు ఎర్కుండి గూడ జెప్పకుంటివా నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘అన్ని అస్త్రాలను మించిన వెన్నుపోటు అస్త్రం నీ తాన ఉండంగ వేరె అస్త్రంతోని పనేంది అని శంకరుడున్నడు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బొందల గడ్డ దిక్కు బోయిండు. తోక: గీ నడ్మ కుల నిర్మూలన సబకు మా సత్నారి బోయిండు. ‘‘సార్! మీ స్పీచ్ అదిరింది’’ అని ఒక పెద్దాయనతోని గాడు అన్నడు. ‘‘ఇంతకు మీరేంటోల్లు’’ అని గాయిన సత్నారి నడిగిండు. (క్లిక్ చేయండి: పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..
లష్కర్ల రేల్ గాడి ఎక్కితె అద్ద గంటల మా వూర్కి బోవచ్చు. మా వూరు బోన్గిరి. బోన్గిరిల బాహర్పేటల మేము ఉండెటోల్లం. ఊల్లె నాకందరు సుట్టాలే. పొట్ట తిప్పలకు పట్న మొచ్చి యాభై ఏండ్లయితున్నది. బోన్గిరిల పోశమ్మ గుడి ఎదురుంగ మా ఇల్లున్నది. మా పక్కింట్ల యాద్గిరి మామ ఉన్నడు. మామ అంటె సంత మామ గాదు. వర్సకు మామ. పనిబడ్తె గాయిన పట్నమొచ్చిండు. పనంత అయినంక ఆనంద్ బాగ్ల ఉంటున్న మా ఇంటికొచ్చిండు. గాయినను సూడంగనే నాకు మా వూరును సూసినట్లనిపిచ్చింది. పట్నం మంచి చెడ్డ లర్సుకునే తంద్కు కుద్దు వూరే నడ్సుకుంట నాతాన్కి వొచ్చినట్లు గొట్టింది. ‘మామా! బాగున్నావె’ అని అడ్గిన. ‘బాగున్నర’ అని యాద్గిరి మామ అన్నడు. గా ముచ్చట గీ ముచ్చటైనంక గాయిన రాజకీయాలల్లకు దిగిండు. ‘ఏం మామా! ఎప్పుడు రాజకీయాలు మాట్లాడ్తవేందే?’ ‘రాజకీయాలు గాన్ది ఏమన్న ఉన్నదా? రామాయనమంత రాజకీయమే. బారతమంత రాజకీయమే’ అన్కుంట యాద్గిరి మామ సిగిలేట్ ముట్టిచ్చిండు. ‘విబీషనుడు గోడ దుంకి రాముని దిక్కుకు వొచ్చిండు. గోడ దుంకె బట్కె అన్న జాగల లంకకు రాజైండు. గదే తీర్గ తెలుగు దేసం కెల్లి టీఆర్ఎస్లకు దుంకిన తలసాని, కాంగ్రెస్ కెల్లి దుంకిన సబితా ఇంద్రారెడ్డి అసుంటోల్లు మంత్రులయ్యిండ్రు. ఎలచ్చన్ల ముంగట గోడ దుంకుట్లు ఎక్వయితయి. గోడ దుంకె టోల్లందరు గల్సి విబీషనునికి గుడి గట్టియ్యాలె. గాయినకు మొక్కి నంకనే పార్టి ఫిరాయించాలె.’ ‘బారతం సంగతేందే?’ ‘గంత ఆత్రమైతే ఎట్లరా? కౌరవులు, పాండవుల నడ్మ జాగ పంచాతి అయింది. గా పంచాతిని తశ్వ జేసెతంద్కు కిష్నుడు ఒక్క తీర్గ కోషిస్ జేసిండు. గాయినెంత కోషిస్ జేసినా సూది మొనంత జాగ గుడ్క పాండవులకిచ్చే సవాల్లేదని దురియోదనుడన్నడు. దాంతోని పాలోల్ల నడ్మ విద్దమొచ్చింది. కర్నున్ని ఎవ్వలు లేని జాగలకు కిష్నుడు దీస్క బోయిండు. నువ్వు సూతుని కొడ్కువు గాదు. కుంతి కొడ్కువు. నువ్వు పాండవుల దిక్కుకొస్తివా అంటె పెద్దన్నా అన్కుంట గాల్లు నీ కాల్లు మొక్కుతరు. నిన్ను రాజును జేస్తరు అని కిష్నుడన్నడు. గాయిన ఎంత గనం జెప్పినా కర్నుడిన లేదు. బీజేపీ దిక్కుకెల్లి ఇద్దరు సన్నాసి గాల్ల తోని ఇంకొకడు మొయినాబాద్ ఫాంహౌజ్కొచ్చిండ్రు. తలా నూరు కోట్ల రూపాయలే గాకుంట గనుల సుంటియి గుత్తకిప్పిస్తం అని ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతా రావు, హర్షవర్దన్ రెడ్డిలను బుద్గ రిచ్చినా గాల్లు గోడ దుంక లేదు. ఇక ముంగట ఎవలన్న గోడ దుంకుమని అంటె చెప్పుతోని కొడ్తమని అనుండ్రి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కేసీఆర్ జెప్పిండ్రు’ అన్కుంట యాద్గిరి మామ గిలాస్ నీల్లు దాగిండు. ‘ఆంద్ర సంగతేంది?’ ‘ఆంద్రప్రదేస్ల పవన్ కల్యాన్ చెప్పు చేత్ల బట్కోని చెంగడ బింగడ ఎగురుతుండు. నాకు తిక్కుంది, గా దాన్కి లెక్క లేదు అన్కుంట శిగమూగుతుండు. విశాకపట్నం, చోళ హోటల్ల ప్రతాని మోదీని గల్సిండు. రొండు చేతులతోని చెప్పులు బట్కోని శిగమూగుత. ఒక చెప్పు మీరియ్యుండ్రి. ఇంకో చెప్పు చెంద్రబాబిస్తడు. చెప్పులను చేతులల్ల బట్టుకుంట. ముక్యమంత్రినైత అని అన్నడు.’ ‘శానేండ్ల కింద ముక్యమంత్రి కుర్సి కోసం చిరంజీవి ప్రజా రాజ్జెం బెట్టిండు. గప్పుడు గాయిన పార్టి గుర్తు సూర్యుడు. అరచేతి నడ్డుపెట్టి సూర్య కాంతి నాపలేరన్నడు. గని గా అరచెయ్యే సూర్యున్ని మాయం జేసింది. ప్రజా రాజ్జెంను దీస్కబోయి కాంగ్రెస్‌ల గల్పిండు. గాయిన తీర్గనే పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో మామా’ ‘కల్పినా కల్పొచ్చురా. పవన్ అనేటి పతంగిని చెంద్రబాబు ఎక్కిస్తున్నడు. వైఎస్సార్సీపీ మోదీ కాల్లు మొక్కుతున్నదని జనసేన లీడర్ బొలివేటి అంటె మల్లీ పారి అంటివా చెప్పు తెగుతది అని మల్లాది విష్ను అన్నడు. వారీ! నువ్వు కొల్వు ఇడ్సి పెట్టి పాత చెప్పుల దుక్నం బెట్టురా! రేల్ గాడికి సైమమైంది. వొస్తరా!’ అన్కుంట మామ బోయిండు. (క్లిక్ చేయండి: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) తోక: మొన్న చాచా నెహ్రూ జయంతి అయ్యింది. ‘బాల్ దివస్ శుభాకాంక్షలు’ అని ఒక లీడర్‌కు జెబ్తె – ‘నా బాల్ (జుట్టు) నల్ల గున్నది’ అని గాయిన అన్నడు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ఇండియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!
కరెన్సీ నోట్ల, రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, అరవింద్ కేజ్రీవాల్, ఇండియాగేట్, ఎలాన్ మస్క్, ట్విట్టర్, రిషి సునాక్, సరికొండ చలపతి ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ.. ‘ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్ కొన్నాడురా ‘వార్నీ! అంత డబ్బు ఎందుకు వేస్ట్ చేశాడు? మనలాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయేది కదా!’’ – ఫ్రెండ్ చమత్కారం ..... దాదాపు ఇంతే చమత్కార సూచన ఓ ముఖ్యమంత్రి నుంచి సీరియస్‌గా వచ్చింది. చూడండి: ‘‘ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా తగ్గుతోంది. సామాన్య ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. దేవతల ఆశీస్సులు కావాలి. ఆ చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే వారి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. మన నోట్లపై గణేశ్, లక్ష్మీదేవిల చిత్రాలు వేద్దాం. అప్పుడే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది భారతదేశం సంపన్న దేశంగా మారుతుంది.’’ – ఈ అరవింద్ కేజ్రీవాల్ సూచనను జనం కాసింత క్రేజీ ఐడియాగానే చూశారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్, వల్లభభాయ్ పటేల్, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం ఇలాంటి వారి బొమ్మలు కూడా ఉండాలన్న దేశభక్తితో పాటు... లక్ష్మీదేవి, గణేశ్ లాంటి దేవుళ్ల ఫొటోలు ఉండాలన్న మతపర విశ్వాసాలు ఆక్షేపణీయమేమీకాదు. – కానీ.. పడిపోతున్న రూపాయి విలువ పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి మూలికా వైద్యం స్థాయి చిట్కాలు... అదీ ఓ ముఖ్యమంత్రి నోట, అందునా ఓ ఐఐటీ మేధావి నోటి వెంట రావడం చర్చకు దారితీసింది. రిషి సునాక్! వింటున్నారా... కాసింత ముందుగా ఈ చిట్కా చెప్పివుంటే బాగుండేది. ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టలేక 45 రోజులకే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయేది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరి, ధరాభారం మోయలేక సామాన్యులు నానా యాతనలు పడుతున్నారు. మినీ బడ్జెట్‌తో దాన్ని బాగు చేయలేక మార్కెట్లన్నీ కుదేలయి పోతుంటే విధిలేక ప్రధానిగా ట్రస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఐడియా ఆమె చెవిలో వేసుంటే బాగుండేది కదా, అక్కడి కరెన్సీపై వాళ్ల దేవుళ్ల బొమ్మ ముద్రించి బయటపడేది కదా. –అని నెటిజన్లు చురకలేస్తున్నారు. ‘‘రిషి సునాక్ .. వింటున్నారా? కేజ్రీవాల్ చెప్పిన మేడ్ ఈజీ ఫార్ములా, చిన్న చిట్కాతో మీ దేశం బాగుపడిపోతుంది.. అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోపాటు అనేక కారణాలతో ప్రధాన దేశాలు ఆర్థిక మాంద్యం దిశలో నడుస్తున్నాయి. 2023 కల్లా దాదాపు సగానికి తగ్గొచ్చన్న సంకేతాలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్ జీ! కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి రాసే లేఖలో... ఈ చిట్కాను ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కూడా ప్రస్తావించాలని కోరండి. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలోంచి బయటపడే అవకాశం ఉంది. మాంకాళమ్మ, పోలేరమ్మ... ఇదేమీ సీరియస్ కాదు. మోదీ మత రాజకీయాలపై కేజ్రీవాల్ వ్యంగాస్త్రమిది. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహం. ఇప్పుడు చూడండి బీజేపీ గింగిరాలు తిరుగుతోంది. –అని ఓ అభిమాని ఆనందం. అవునవును.. రూపాయికీ, గుజరాత్ ఎన్నికల్లోనూ దైవసాయం అవసరమే. అయితే, దీన్ని ఇంకా పవర్‌ఫుల్‌గా వాడుకోవచ్చుననే సలహా కూడా వినిపిస్తోంది.. గణేశ్, లక్ష్మీదేవిలతో పాటు మాంకాళమ్మ, పోలేరమ్మ, ఉప్పలమ్మ, కట్టమైసమ్మలాంటి గ్రామ దేవతల ఫొటోలు కూడా కరెన్సీ నోట్లపై ముద్రిస్తే... రూరల్ ఓటింగ్ అంతా మనకే. – సూపర్ ఐడియా! గుమ్మడికాయ మంత్రం... కేజ్రీవాల్ దారిలోనే ఇంకాస్త అడుగు ముందుకు వేసిన తుంటరి కుర్రాళ్లు ఇలా సూచిస్తున్నారు. ‘‘నిరుద్యోగం పెరిగిపోతోంది, పేదరికం పెరిగిపోతోంది, మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే, జనం చేతిలో డబ్బులు ఆడడం లేదు. విద్య, వైద్యం పరిస్థితి ఏం బాగాలేదు. గ్రామాల పరిస్థితి అంతంతే. పట్టణాల్లో కాలుష్యం బాగా పెరిగి పోతోంది. టపాసులతో దీపావళి చేసుకునే పరిస్థితి లేదు. చాలా విషయాల్లో ఇతర దేశాలకన్నా వెనుకబడిపోతున్నాం. పైగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలనుంచి నరదిష్టి ఎక్కువయింది. వీటన్నింటికి విరుగుడుగా ఇండియా గేట్‌కు ‘గుమ్మడి కాయ’ కడితే ఫలితం ఉంటుందేమో. మేమయితే మా ఇంటికి గుమ్మడి కాయే కడుతున్నాం.’’ – మంచి చిట్కా యాక్ట్ ఆఫ్ గాడ్.. అంతా దైవికం! ఇలా దేవుడిని లాగడం గతంలో కూడా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కరోనా వల్లే ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందనీ, జీడీపీ తగ్గుముఖం పట్టడానికి, జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి అదే కారణం అని అంతా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ (దైవిక చర్య )అనడం పెనుదుమారమే లేపింది. మీ తప్పిదాలను దేవుడిపై నెడతారా అని విపక్షాలవారు, నెటిజన్లు విరుచుకు పడ్డారు. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదనీ, యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనీ విమర్శలు గుప్పించారు. అంతకుముందు సంవత్సరం పరిస్థితేమిటని ప్రశ్నించారు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరు మీద ప్రజలు పన్ను చెల్లించడం మానేస్తే ఓకేనా అని ప్రశ్నించారు. కాస్త కొంటె నెటిజన్లు ఇండియాలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఇంతకీ ఏ దేవుడి పుణ్యం ఇది అని వెక్కిరించారు. ముస్లిం దేవుళ్లు, క్రిస్టియన్ దేవుళ్లు, ఇతర మైనారిటీ మతాల దేవుళ్ల పాత్ర ఏమైనా ఉందా అని ట్రోల్ చేశారు. వారందరినీ కోర్టుకు లాగుతున్నారా లేదా అని వ్యంగాస్త్రాలు సంధించారు. కరెన్సీకి ఎక్స్పైరీ డేట్... కరెన్సీ ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చేది నవంబర్ 8, 2016 నాటి డీమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఆరేళ్లు. నల్లధనం ఏమీ బయటికి రాకపోగా దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కరెన్సీపై 10వ తరగతి కుర్రాడి ఐడియా ఒకటి సోషల్ మీడియాలో నడుస్తోంది. అన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంటోంది కదా, కరెన్సీ నోట్లపై కూడా ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉండదు? ఎన్నేళ్ల దాకా చెల్లుబాటు అవ్వాలో మేధావులు ఆలోచించి వాటిపై కూడా ఐదేళ్లో ఆరేళ్లో ఎక్స్పైరీ డేట్ ముద్రించాలి. ఆ టైమ్ దాటాక ప్రజలు పాత నోట్లు తీసుకువెళ్లి కొత్తవి తీసుకుంటారు. అంటే కరెన్సీ అంతా బ్యాంకుకు వస్తుంది. ఇక నల్లధనం అనే మాట ఉండదు కదా. – మన ఐఐటీయన్ సీఎం ఐడియా కన్నా టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఐడియా బాగున్నట్లుంది కదా! (క్లిక్ చేయండి: ఉప ఎన్నికలూ జిందాబాద్!) -
Telidevara Bhanumurthy: సిత్రాలు సూడరో శివుడో శివుడా!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు ఎప్పటిలెక్కనే మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగటాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ‘‘నువ్వు ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. బల్రు అడ్డం రావొచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతె నీకు తిక్కలెవ్వొచ్చు. నువ్వు బేచైన్ గాకుంట ఉండెతంద్కు మునుగోడు ముచ్చట జెప్త ఇను’’ అన్నడు. ‘‘ఊకూకె మునుగోడు, మునుగోడు అంట వేంది?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘ఎందుకంటె అందర్కి ఒక్క దినమే దివిలె. ఎలచ్చన్ల జాత్ర జెయ్యబట్కె మునుగోడు జెనంకు దినాం దివిలెనే. దినాం దావత్లే. దినాం మందుల తేలకుంట మున్గుడే. అన్ని పార్టిల లీడర్లు ఒక్క తీర్గ చక్కర్లు గొడ్తున్నరు.’’ ‘‘కల్లమున్న కాడ బిచ్చగాల్లు. ఓట్లున్న కాడ లీడర్లు’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి నిలవడ్డ పాల్వాయి స్రవంతి ప్రచారం జేస్కుంట బోతుంటె బీజేపోల్లు అడ్డమొచ్చి శేర్ పటాకులు గాల్సిండ్రు. కాల్లల్ల కట్టె పెట్టినట్లు జేసిండ్రు.’’ ‘‘కాంగ్రెసోల్లు ఊకున్నరా?’’ ‘‘ఎందుకూకుంటరు. తమ్ల పాకుతోని గీల్లంటె తల్పు చెక్కతోని గాల్లన్నరు. బీజేపీ దిక్కుకెల్లి పోటీ జేస్తున్న రాజగోపాల్‌రెడ్డి జీపు ముంగట కాంగ్రె సోల్లు ఒక్క తీర్గ భూచెక్రాలు గాల్సి అడ్డం బడ్డరు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మందు బోస్తున్నయి. పైసలిస్తున్నయి. నరకాసురుని మీద్కి బానాలిడ్సిన సత్యభామ అసువంటిది మా స్రవంతి అని రేవంత్ రెడ్డి అన్కుంట గామెతోని బీజేపీ, టీఆర్ఎస్ల దిక్కు రొండు రాకిట్లు ఇడిపిచ్చిండు’’. ‘‘టీఆర్‌ఎసోల్లు పటాకులు గాల్వలేదా?’’ ‘‘గాల్సిండ్రు. సంస్థాన్ నారాయన్పురంల 18 వేల కోట్ల స్టిక్కర్ తోని తయారు జేసిన పటాకులను మంత్రి గంగుల కమలాకర్ గాల్సిండు. రాజ గోపాల్‌రెడ్డి బోతుంటె టీఆర్‌ఎసోల్లు అడ్డం దల్గి బాంబులు గాల్సిండ్రు. నాకే అడ్డం దల్గుతరా? మీ తోడ్కల్ దీస్త అన్కుంట గాయిన కప్పగంతులు ముట్టిచ్చిండు. ఇగ టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేస్తున్న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి లక్ష్మిబాంబు బత్తి ముట్టిచ్చిండు. గది ధన్మనకుంట తుస్సు మన్నది’’. ‘‘గీ మూడు పార్టీలే గాకుంట కడ్మోల్ల ప్రచారం సంగతేంది?’’ ‘‘కడ్మోల్లు అంటె ఇండిపెండెట్గ నిలవడ్డ కె.ఎ.పాల్ ప్రచారం గురించి రొండు ముచ్చట్లు జెప్త. గాయిన గుర్తు ఉంగ్రం. ఏలుకున్న ఉంగ్రం సూబెట్టుకుంట ఓట్లడ్గుతుంటె మాకు బంగారి ఉంగ్రం జేపిచ్చిస్తవా అని కొందరడిగిండ్రు. నన్ను గెలిపిస్తె మునుగోడును అమెరిక జేస్త. గాలి మోటర్ అడ్డ బెట్టిపిస్త అని పాల్ అన్నడు. రాంగ్ సైడ్ల కొస్తున్నవని ఒక పోలీసాయిన మోటరాపితె నేనంటె ఎవ్వరనుకుంటున్నావు, కాబోయె తెలం గాన ముక్యమంత్రి ననుకుంట పాల్ బెదిరిచ్చిండు. అందరు సూస్తుండంగ ఇంకోతాన చెంగడ బింగడ డ్యాన్సు జేసిండు.’’ ‘‘మునుగోడు ఎలచ్చన్ల ప్రచారంల కొత్త సంగతేమన్న ఉన్నదా?’’ ‘‘ఇంతకుముందు ఎన్నడు లేని తీర్గ గీ బై ఎలచ్చన్ల పోస్టర్ల జంగ్ నడుస్తున్నది. మీ అభిమాన సత్యం థియేటర్లో నేడే బ్రహ్మాండమైన విడుదల. మునుగోడు కాంతి స్రవంతి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ నీతి నిజాయితీల అడ్డ. దర్శకత్వం: విరాట్ కొహ్లీ అసుంటి రేవత్ రెడ్డి అని కాంగ్రెస్ పోస్టర్ ఏసింది. నేడే విడు దల. అమిత్ షా ప్రొడక్షన్స్ వారి పద్దెన్మిది వేల కోట్ల రూపాయలు. దర్శకత్వం: కోవర్టు రెడ్డి. నర్తకి 70 ఎం.ఎం. థియేటర్ అని టీఆర్ఎస్ పోస్టర్ అంటిచ్చింది. బండి సంజయ్ దర్శకత్వంలో నేడే విడు దల రాజన్న రాజినామా. ముక్యమంత్రి, మంత్రుల బ్యాంకు కాతాలల్ల బడ్డ నిర్వాసితుల బకాయిలు. గొల్రు కొనెతంద్కు గొల్ల కురుమలకు రూపా యలు. కడ్మ సిన్మ ఎండి పర్ద మీద సూడుండ్రి అని బీజేపీ ఏసింది. కానీ గీ ఎలచ్చన్ల ఎవలు గెల్సినా పరకేం బడదు. జెనం బత్కులేం మారయి. పెట్రోలు, గ్యాస్ బండ దరలు మొగులు మీద్కి బోతనే ఉంటయి. రూపాయి బక్కగైతనే ఉంటది. ఎన్కట రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు గదే రూపాయి బిల్ల మీద బొటనేలు బొమ్మ ఎందుకున్నది. గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటే నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఎన్కట అందర్కి బువ్వ దొర్కుతుండె బట్కె రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు బువ్వ దొర్కకుండ బట్కె బొటనేలు చీక్కుంట బత్కుండ్రి అని గిప్పటి రూపాయి బిల్ల మీద బొమ్మ జెప్తున్నది’’ అని విక్రమార్కుడు అన్నడు. ఇంతల బొందల గడ్డొచ్చింది. విక్రమార్కుడు మోటరాపిండు. బేతాలుడు మోటర్ల కెల్లి దిగి బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
గరికపాటిపై చిరంజీవి సెటైర్
-
గరికపాటిపై చిరంజీవి సెటైర్.. పంచ్ మామూలుగా లేదుగా!
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! ఆ కార్యక్రమంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు మహిళలు ఆసక్తి చూపగా అక్కడే ఉన్న గరికపాటి నరసింహరావు.. వెంటనే ఫొటో సెషన్ ఆపేసి చిరంజీవి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ఆ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అంతా చూశారు. గరికపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇప్పటివరకు దీనిపై పెద్దగా రియాక్ట్ కాని చిరంజీవి తాజాగా గరికపాటిపై పరోక్షంగా సెటైర్ వేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలోనూ చిరంజీవితో ఫొటోలు దిగేందుకు కొందరు మహిళలు వేదిక మీదకు రాగా.. వెంటనే చిరు.. ''ఇక్కడ వారు లేరు కదా?'' అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. 'వారు ఇక్కడ లేరు' అంటూ పక్కనవాళ్లు సమాధానమివ్వగా హమ్మయ్యా.. అంటూ గుండెల మీద చేయి పెట్టుకుని రిలాక్స్ అయినట్టు చిరంజీవి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దీంతో చిరు సైలెంట్‌గానే బలే సెటైర్ వేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
Munugode Bypoll: సర్కార్ ఎవల్తోని నడుస్తున్నది?
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటర్ ఎన్క సీట్ల గూసుండు. ‘‘ఎత్తుగడ్డలు, గుంతలు సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. బల్రు అడ్డం రావొచ్చు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతే తిక్కలేవొచ్చు. బేచైన్ గాకుంట ఉండెతంద్కు రొండు ముచ్చట్లు జెప్త ఇను’’ అని అన్నడు. ‘‘నువ్వు జెప్తె ఇనకుంట ఉన్ననా?’’ అని విక్రమార్కుడన్నడు. ‘‘మునుగోడు అంటె ఏందో ఎర్కేనా? మును అంటె ముందుగాల, గోడు అంటె గోస. బై ఎలచ్చన్లు వొచ్చె బట్కె సంటర్ మంత్రులు, ముక్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు గదిస్తం గిదిస్త మనుకుంట బొంబై తమాస సూబెడ్తున్నా ఇక ముందుగాల గుడ్క జెనం గోస బదలాయించదు.’’ ‘‘బాగనే ఉన్నది గని ఇంతకు జెనమేమంటున్నరు?’’ ‘‘గిదొక జాత్ర. అందరితాన పైసల్ దీస్కుంటం. మేం జేసేది జేస్తం. తింటం. తాగుతం. ఇంట్ల పంటం. ఏ పార్టి లీడరొస్తె గా పార్టి కండ్వలు గప్పుకుంటం. ఇదువర దాంక ఏ లీడరేం బీకలేదు. ఇంక నాల్గు నెలలల్ల ఏం బీక్తరు. ఫ్లోరైడ్ నీల్లట్లనే ఉంటయి. తొవ్వలల్ల గుంతలట్లనే ఉంటయి’’ అని మునుగోడు జెనమంటున్నరు. ‘‘మునుగోడుల ఎవ్వలెట్ల ప్రచారం జేస్తున్నరు?’’ ‘‘రూపాయలు ఏర్ల లెక్క బారుతున్నయి. మా పార్టి చోటామోటా లీడర్లు, సర్పంచ్‌లు మమ్ములనే డిమాండ్ జేస్తున్నరు... అవుతల లచ్చల రూపాయిల ఆఫర్ ఉన్నదంటున్నరు. గిట్లయితె ఏం జెయ్యాలెరో అని ఒక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుండు.’’ ‘‘రాహుల్ గాంది బారత్ జోడో అసరు మునుగోడు మీద ఏమన్న ఉంటదా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాయిన జోడో అంటె గీల్లు తోడో అన్కుంట కొట్లాడ్తున్నరు. కాంగ్రెస్‌ల ఏ లీడర్ కా లీడర్ తీస్మార్ఖాన్ ననుకుంటడు. మునుగోడుల ప్రచారం జేసెతందుకు నా అసువంటి హోంగార్డుల అవుసరం లేదు. ఎస్పీలే పోతరు. గాయిన మీద నూరు కేసులు పెట్టినా వొచ్చే అసెంబ్లీ ఎలచ్చన్ల గెలిపిచ్చి కాంగ్రెస్‌ను హుకూమత్లకు దెస్తనని ఒక పెద్దమన్సి అన్నడు. గాయిననే మునుగోడుల కాంగ్రెస్‌ను గెలిపిస్తడని గా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బనాయించిండు.’’ ‘‘బీజేపీ, టీఆర్ఎస్ల సంగతేంది?’’ ‘‘బీజేపీ దిక్కుకెల్లి నిలబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రొండెక్రాలల్ల క్యాంప్ ఆపీస్ బెట్టిండు. దినాం మటన్, చికెన్ తోని వెయ్యిమంద్కి దావత్ ఇయ్యబట్టిండు. ప్రచారం జేస్కుంట అవ్వా నీ ఓటు నాకే ఎయ్యాలె అని గాయిన అన్నడు. తప్పకుంట చెయ్యి గుర్తుకే ఓటేస్త అని గామె అన్నది. చెయ్యి గాదు పువ్వు అన్కుంట రాజగోపాల్ రెడ్డి మొత్తుకుండు.’’ ‘‘బండి సంజయ్, కేటీఆర్‌ల సంగతేంది?’’ ‘‘ప్రగతి బవన్ల ఒక మంత్రగానితోని కేసీఆర్ పూజలు జేపిస్తున్నడు అని బండి సంజయ్ అన్నడు. పిచ్చి ముదురుతున్నది, కరుస్తడేమో అని కేటీఆర్ అన్నడు. కావలి కుక్క లెక్క ఉండుమని కుర్సిమీద గూసుండబెడ్తె కచరా కుక్కల్లెక్క, పిచ్చికుక్కల్లెక్క కర్సెతంద్కు ఊరిమీద బడ్డరు అని బండి సంజయ్ అన్నడు. పూజూల్గ గీ లీడర్లు మమ్ములను బద్నాం జేస్తున్నరనుకుంట పట్నంల కుక్కలన్ని రాస్తారోకో జేసినయి.’’ ‘‘చండూరు ర్యాలీ ఎట్లయింది?’’ ‘‘టీఆర్ఎస్ దిక్కుకెల్లి నిలబడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేసన్ ఏసినంక చండూరుల మీటింగ్ బెట్టిండ్రు. కేటీఆర్ పక్కపంటే మైకు బట్కోని, నామినేషన్ కొచ్చిన నందమూరి తారక రామారావు గారికి, తమ్మినేని సీతారాం గారికి అనుకుంట కూసుకుంట్ల మాట్లాడబట్టిండు. యాల పొద్దుగాలే మందుగొట్టినట్లున్నడు అని కేటీఆర్ గాయినను ఎన్కకు బొమ్మన్నడు. ఒక మంత్రి అయితె మన బీఎస్పి పార్టీ అనబట్టిండు. ఇంతకు టీఆర్ఎస్ లీడర్లు పగటీలనే మందు ఎందుగ్గొడ్తున్నరు. గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటె నీ మోటర్‌కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బీఆర్ఎస్ అంటే ఏంది?) ‘‘గీ సర్కార్ ముక్యమంత్రితోని నడుస్త లేదు. మంత్రుల తోని నడుస్త లేదు. ఎమ్మెల్యేలతోని నడుస్త లేదు. పోలీసోల్లతోని నడుస్త లేదు. మందుతోని నడుస్తున్నదని గాల్లు పగటీలనే మందుగొట్ట బట్టిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: బీఆర్ఎస్ అంటే ఏంది?
ఇయ్యాల ఆనగొట్టింది. రేపు ఎండ గొట్టొచ్చు. ఎల్లుండి సలిబెట్టొచ్చు. దినాలెప్పుడు ఒక్క తీర్గనే ఉండయి. మా తాత జమాన్ల విక్రమార్కుడు నడ్సుకుంట బొందలగడ్డ కాడ్కి బోయెటోడు. బేతాలుడు చెట్టు మీద ఉండెటోడు. గాన్ని బుజం మీదేస్కోని విక్రమార్కుడు నడ్సెటోడు. గాడు జెప్పేటి కత ఇని ఆకర్కి అడిగిన సవాల్‌కు జవాబ్ జెప్పెటోడు. మా నాయిన జమాన్ల విక్రమార్కుడు సైకిల్ మీద బొందలగడ్డ దిక్కుబోతే, సైకిలెన్క గూసోని బేతాలుడు కత జెప్పెటోడు. జమానా బదల్ గయా. గిప్పుడు విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ కాడ్కి బోయి హారన్ గొడ్తున్నడు. గాడ రొండంత్రాల బంగ్లలున్న బేతాలుడు ఇవుతల కొస్తున్నడు. మోటరెన్క సీట్ల గూసుంటున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ఎప్పటి తీర్గనే ఎన్క గూసున్న బేతాలుడు కత జెప్పబట్టిండు. మున్పటి లెక్క గాకుంట గాల్లిద్దరు ముచ్చట బెట్టుకుంట మోటర్ల బోబట్టిండ్రు. ‘అయ్యగారు బెట్టిన మూర్తంల దస్రనాడు కేసిఆర్ కొత్త పార్టీ బెట్టిండు’ అని బేతాలుడన్నడు. ‘మల్ల టీఆర్ఎస్ ఏమైంది?’ విక్రమార్కుడు అడిగిండు. ‘టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. ముల్లు బోయి కత్తి వొచ్చె ఢాంఢాం. తెలంగాన బోయి భారతొచ్చె రాంరాం’. ‘గది వీఆర్ఎస్ అయితదా?’ ‘కేటీఆర్ ముక్యమంత్రి గావాలంటె కేసీఆర్‌కు వీఆర్ఎస్ తప్పది. ఎప్పటి సందో ప్రతాని కుర్సి మీద గూసున్నట్లు గాయినకు కలలొస్తున్నయి. తెల్లారి నాలుగ్గొట్టంగ బడేటి కలలు నిజమైతయని ఒక సన్నాసి గాయినకు జెప్పిండు’. ‘కేసీఆర్ ఏం జేసిండు?’ ‘కర్నాటక రాస్ట్రం బోయిండు. కుమారస్వామిని గల్సిండు. వొచ్చె అసెంబ్లీ ఎలచ్చన్ల కోట్లు ఇస్త అన్నడు. గట్ల మాట ఇచ్చినంకనే కేసీఆర్‌తోని కుమారస్వామి ఫోట్వ దిగిండు. గని గాయిన తోని పని గాదు. అడుగు మాడదు, అట్టు పేరదు. బిహార్ ముక్యమంత్రి నితీశ్ కుమార్‌నే గాకుంట లాలూప్రసాద్ యాదవ్‌ను గుడ్క కేసీఆర్ గల్సిండు. చౌతాలను గల్సిండు. అందరం ఒక్కటై బీజేపీతోని కొట్లాడ్దామని అన్నడు. గని అస్సయ్ అంటె అదే సహి, దూలా అంటె ఇదే సహి అనె తంద్కు గాల్లు టీఆర్ఎస్ మంత్రులసొంటోల్లు గారు. కేసీఆర్ కడ్మ రాస్ట్రాల రైతు లీడర్లకు గాడి కిరాయి లిచ్చిండు. గాల్లు పట్నమొస్తె దావత్ ఇచ్చిండు. రైతుబందు పద్కంను తారీఫ్ జెయ్యమన్నడు. దేసమంత గా పద్కం బెడ్తె మంచిగుంటదని గాల్లతోని జెప్పిచ్చిండు’. ‘బేతాలా! ఏ బట్ట కాబట్ట మాస్క అయితెనే మంచి గుంటది. ఒక రాస్ట్రం పద్కం ఇంకొక రాస్ట్రంకు మంచి గుండదు.’ ‘నివొద్దే. మన్మన్ని, పెండ్లాంను దీస్కోని కేసీఆర్ యాద్గిరిగుట్టకు బోయిండు. నర్సిమ్మసామికి కిల పదారు తులాల బంగారమిచ్చిండు. దేవుడా! నన్ను ప్రతానిని జేస్తె నీ గుడినంత బంగారం జేస్త అని మొక్కిండు’ ‘ఇంకేం జేసిండు?’ ‘పట్నంల బిహార్ కూలోల్లు సస్తె గాల్ల కుటుంబాలకు తలా పది లచ్చలు ఇచ్చి వొచ్చిండు. మహారాస్ట్ర బోయి తీస్ మార్కాన్ నన్నడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టి బెడ్తె టీఆర్ఎస్ లీడర్లు ఏం జేసిండ్రు! కొందరు దేస్ కీ నేతా కేసీఆర్ అని వొల్లిండ్రు. కొందరు గాయిన ఫోట్వలకు పాలతోని అబిసేకం జేసిండ్రు. ఇంకొందరు కోవ పేడలు బంచిండ్రు. పటాకులు గాల్చిండ్రు. వరంగల్ టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరైతె డిస్కో డాన్సు జేసిండు. హమాలోల్లకు తలా ఒక కోడి, కోటర్ విస్కి సీస ఇచ్చిండు. కేసీఆర్ ప్రతానమంత్రి అయితున్నడని సాటిచ్చిండు. ఇగ కేసీఆర్ ప్రతాని గావాలనుకుంట చౌటుప్పల్‌ల బువ్వ దినే ముంగట మంత్రి మల్లారెడ్డి టీఆర్ ఎసోల్లకు మందు బోసిండు. గాయిన విస్కి సీసలెందుకు బంచిండు? గీయిన మందు ఎందుకు బోసిండు? గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) ‘బీఆర్ఎస్ అంటె బిరండి, రమ్ము, స్కాచ్ అనుకోని ఒకలు విస్కి సీసలు బంచితె, ఇంకొకలు గిలాసలల్ల మందు బోసిండ్రు’ అని విక్రమార్కుడు జెప్పిండు. సరింగ గప్పుడే బొందల గడ్డొచ్చింది. మోటరాగింది. మోటర్ల కెల్లి దిగి బేతాలుడు ఇంటికి బోయిండు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
చిరంజీవిపై గరికపాటి ఫైర్.. వారు చెప్పే శాంతి వచనాలకు విలువెక్కడిది?
రాజకీయ నాయకులు, ఆద్యాత్మిక వేత్తలు, భక్తి విషయాలకు రాజకీయ అంశాలకు ముడిపెట్టి మాట్లాడడం పద్దతేనా? ఇలాంటివాటివల్ల ప్రజలకు ఏమైనా మంచి సందేశం వెళుతుందా? ఆలయానికి వెళ్లి ప్రార్ధన చేసి, ఏవో కోర్కెలు కోరుకుని వెళ్లిపోవడం రివాజు. కాని రాజకీయ నేతలు దేశం కోసమే ప్రార్ధించామని చెబుతుంటారు. నిజంగా వారు అచ్చం ప్రజల కోసమే పూజలు చేసి ఉంటే మెచ్చుకోవలసిందే. కానీ ఎక్కువ మంది తమ అదికారం కోసమో, మరే రాజకీయ ప్రయోజనం కోసమో చేస్తుంటారు. అదేమి రహస్యం కాదు. అది తప్పుకూడా కాదు. కానీ బయటకు వచ్చి చెప్పే కబుర్లే ఒక్కోసారి అనవసర వివాదాలకు తావిస్తుంటాయి. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దసరా నాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించుకుని పూజలాచరించిన తర్వాత అమరావతి రాజధాని విషయమై మాట్లాడిన సంగతులలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగులుతాయన్న భావన కలుగుతుంది. అలాగే ప్రముఖ ఆద్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్య ఒకటి ఆయనలోని పరిజ్ఞానాన్ని ప్రశ్నించేలా ఉంది. ముందుగా చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని అన్నారు. ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి రాజధానిగా నిర్ణయించాం. ప్రస్తుతం రాజధాని అమరావతిపై రోజుకోమాట మార్చడం మంచిదికాదు.. అలాంటి వాళ్లను దుర్గమ్మ కూడా క్షమించదు .. అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి తన వైఖరిపై రాజకీయంగా ఏమి మాట్లాడినా చంద్రబాబును ఆక్షేపించనవసరం లేదు. కాని దుర్గమ్మ తల్లికి లింక్ పెట్టి మాట్లాడడమే అభ్యంతరకరం. మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదని అంటే, అందువల్లే ఆయన 2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలయ్యారా? రాజధాని 29 గ్రామాల పరిధిలోనే ఉండాలని, రాష్ట్ర ప్రజలందరి సొత్తు తీసుకువచ్చి ఆ గ్రామాలలోనే పెట్టాలని దుర్గమ్మ ఏమైనా చెప్పారా? (చదవండి: గరికపాటిపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు, నువ్వేంటో..!) చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ బదులు ఇస్తూ, దుర్గమ్మ అన్ని ప్రాంతాల ప్రజల మేలు కాంక్షిస్తారని అన్నారు. చంద్రబాబును 23 సీట్లకే పరిమితం చేసి జగన్ కు 151 సీట్లను దుర్గమ్మ ఇచ్చినట్లే కదా? అసలు మాట తప్పడం అంటే ఏమిటి? లక్షకోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం మాట తప్పినట్లు అవుతుందా? లేదా? కాపులను బిసిలలో చేర్చుతామని చెప్పి చేయలేకపోవడం మాట తప్పడం అవుతుందా? 400 ఎన్నికల హామీలను ఇచ్చి అమలు చేయకపోవడాన్ని ఏమంటారు. రాజకీయ నేతలు ఇలాంటి విషయాలలో సెంటిమెంట్ జోడించి ప్రసంగాలు చేస్తే అవి వారికే తగులుతాయన్న సంగతి అర్ధం చేసుకోవాలి. ఇక గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యను గమనిద్దాం. ఏడు కొండలని రెండు కొండలు చేస్తే ఏమైందో చూశాం కదా అని అన్నారు. ఇది ఫక్తు రాజకీయ విమర్శ. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాజకీయంగా కుట్ర చేయడానికి అప్పట్లో కొందరు ఈ దుష్ప్రచారం చేశారు. నిజానికి స్థానిక ఎన్నికల వల్ల పవిత్రత దెబ్బతినకూడదని ఆనాటి ప్రభుత్వం కొంత విస్తీర్ణం పేర్కొంది. పైగా అది కూడా గత ప్రభుత్వాల టైమ్ నుంచి ఉన్నదే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మీడియా వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కు చెందిన కొందరు దీనిని వివాదం చేసి వైఎస్ కు పులమడానికి యత్నం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించడమే కాకుండా, తిరుమల అంటే ఏడు కొండలేనని వైఎస్ జిఓలు కూడా ఇచ్చారు. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా గరికపాటి అభ్యంతరకరంగా మాట్లాడారు. కేవలం ఏదో వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని మాట్లాడారేమో అనిపిస్తుంది. పైగా అలయ్ బలయ్ వంటి ప్రోగ్రాంలో ఈ ప్రస్తావనే అవసరం లేదు. పోనీ ఏదైనా శాపం వల్లే నేతలు చనిపోతారన్నది నిజమే అని పురాణ ప్రవచనకర్త గరికపాటి భావిస్తుంటే ఆయన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. మహాత్మా గాంధీని గాడ్సె దారుణంగా కాల్చి హత్యచేశాడు. దేశ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలో మరణించిన తీరు మిస్టరీ. మరో ప్రధాని ఇందిరాగాంధీ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పులలోనే చనిపోయారు. ఇంకో ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీలంక తీవ్రవాదులు బాంబులు పేల్చి హత్యచేశారు. ఇందిరాగాందీ రెండో కుమారుడు సంజయ్ గాందీ హెలికాఫ్టర్ కూలి మరణించారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రోజుల్లోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా గల్లంతైపోయింది. టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, హరికృష్ణ, లాల్ జాన్ భాష లు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పదవీచ్యుతుడై కుటుంబం నుంచే ఘోర పరాభవంతో కుమిలి, కుమిలి మరణించారు. మాజీ ప్రధాని, గొప్ప నేత అయిన అటల్ బిహారీ వాజ్ పేయి తన చివరి సంవత్సరాలలో జ్ఞాపక శక్తి కోల్పోయి చాలాకాలం మంచానికే పరిమితం అయ్యారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉదాహరణలు ఉంటాయి. వీళ్లంతా గొప్పవారు. కాని వారి జీవితాలు ఇలా ముగియడం దురదృష్టకరం. కాని అంత మాత్రాన ఏదో శాపం అనో, పాపం అనో ఆద్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి? అందువల్ల గరికపాటి వంటివారు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. మరో సంగతి. ఆద్యాత్మికవేత్తలకు మరీ కోపం ఎక్కువ ఉండకూడదు. కాని అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి గరికపాటి అంత కటువుగా వ్యవహరించి ఉండవలసింది కాదు. ప్రశాంతంగా ఉండవలసిన ఆద్యాత్మికవేత్తలు తోటి ప్రముఖుడిపైనే ఫైర్ అయితే, వారు చెప్పే ప్రవచనాలకు, శాంతి వచనాలకు ఏమి విలువ ఉంటుంది? వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా
యాల పొద్దుగాల. తుప్పర్లు బడ్తున్నయి. విజయవాడ కండ్లు దెరుస్తున్నది. సీపురు కట్ట బట్కోని సపాయోల్లు తొవ్వలు ఊక్తున్నరు. పాలపాకెట్లు అమ్మెటోల్లు పాలపాకిట్లు అమ్ముతున్నరు. బాసండ్లు తోమెతంద్కు పనిమన్సులు బోతున్నరు. వేరె గల్లి కెల్లి వొచ్చిన కుక్కను జూసి గల్లి కుక్కలు మొర్గుతున్నయి. కొంతమంది లీడర్లు సుత గప్పుడే నిద్ర లేసిండ్రు. మోటర్ల ఎన్క గూసున్నోల్లు గూడ సీటు బెల్టు బెట్టు కోవాలని జెప్తున్నరు. మంత్రి కుర్సికి ఆకర్కి ముక్యమంత్రి కుర్సికి గుడ్క సీటు బెల్టు బెట్టుకుంటె మంచిగుంటదని లీడర్లు అన్కుంటున్నరు. గట్ల జేస్తె సచ్చెదాంక కుర్సిమీద గూసుండొచ్చు. ఎలచ్చన్లు, గిలచ్చన్లు లేకుండబోతె మజా చెయ్యొచ్చని గాల్లు జెప్తున్నరు. తొమ్మిది గొట్టింది. తుప్పర్లు బందైనయి. మబ్బుల సాటుకెల్లి సూర్యుడెల్లిండు. పల్చటి ఎండ గొట్టబట్టింది. టీడీపీ లీడర్ యనమల రామకిష్నుడు కాఫి దాగిండు. ఆరాం కుర్సిల గూసోని పేపర్ సద్వబట్టిండు. ఏం కొంప మున్గిందేమొగని ఒక విలేకరి గాయిన తాన్కి బోయిండు. ‘నమస్తే సార్’ అని అన్నడు. ‘నమస్తే. ఏందివయా యాల పొద్దుగాలే వొచ్చినవ్’ అని యనమల అడిగిండు. ‘బల్క్ డ్రగ్ పార్క్ మా రాస్ట్రంల బెట్టుండ్రి అంటె మా రాస్ట్రంల బెట్టుండ్రనుకుంట పదిహేడు రాస్ట్రాలు దర్కాస్తు బెడ్తె మూడు రాస్ట్రాలల్ల బెట్టెతంద్కు పర్మిషన్ ఇచ్చిండ్రు. గా మూడు రాస్ట్రాలల్ల మన ఆంద్రప్రదేశ్ గూడ ఉన్నది గదా’. ‘అవ్ ఉన్నది’. ‘మన రాస్ట్రంల బల్క్ డ్రగ్ పార్క్ బెట్టొద్దని సంటర్కు కారటెందుకేసిండ్రు’. ‘గదిగిన బెడ్తె కాకినాడ కాడ రైతుల బత్కులే గాకుంట బెస్తోల్ల బత్కులు బండలైతయి. గాలి, నీల్లు కరాబైతయి’. ‘గవి కరాబ్ గాకుంట ట్రీట్మెంట్ ప్లాంట్ బెడ్తరు. గది బెడ్తెనే బల్క్ డ్రగ్ పార్క్‌కు పర్మిషనిస్తరు. గా పార్క్ తోని ఇర్వై వేల మందికి కొల్వులు దొరుక్తయి. గంతేగాకుంట గాదాంట్ల రోగాలు తక్వజేసేటి మందులు తయారు జేస్తరు’. ‘అన్ని రోగాలు తక్వ జేసేటి మందుండంగ గా మందుల్తోని పనేమున్నది. మందుగొడ్తె ముసలోడు గుడ్క మైకేల్ జాక్సన్ లెక్క డాన్సు జేస్తడు. కీసల పైసలేనోడు గూడ అమరావతి బూములు గొంటనంటడు. ఏబీసీడీలు రానోడు సుత అంగ్రేజిల మాడ్లాడ్తడు. మొన్నటిదాంక మా అయ్యన్న పాత్రున్కి విశాక డిస్టిలరి ఉండె. మా వియ్యంకునికి పి.ఎం.కె. డిస్టిలరి ఉన్నది. ఆదికేశవులు నాయుడికి శ్రీకిష్న డిస్టిలరి ఉన్నది. గివన్ని మా చెంద్రబాబు జమానకెల్లే నడుస్తున్నయి. గివన్ని ఉండంగ వేరె బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు? బ్రాంది తాగినోడు బ్రహ్మలోకమున కేగు విస్కిగొట్టినోడు విష్ణువు చెంత జేరు ఏమి తాగనోడు ఎడ్డోడు చెడ్డోడు మందు భాగ్యశీల మరి మాటలేల’ అని యనమల పద్దెం బాడిండు. ‘వహ్వా! వహ్వా! క్యా ఖూబ్’ అన్కుంట విలేకరి బోయిండు. ఒక దిక్కు గిట్లుంటె ఇంకో దిక్కు లోకేశ్, చెంద్రబాబు తాన్కి బోయిండు. ‘నాయినా! నాయినా!’ అని బిల్సిండు. ‘ఏం గావాలె బిడ్డా!’ అని చెంద్రబాబు అడిగిండు. ‘రాహుల్ గాంది బారత్ జోడో యాత్ర జేస్తుండే’. ‘గాయిన జేస్తె నీకేందిరా?’ ‘నేను గూడ ఏపీ జోడో యాత్ర జేస్తనే’. ‘నువ్వు జేసుడెందుకు?’ ‘రాహుల్ గాందిని అందరు పప్పు అంటరు. నన్ను గూడ పప్పనే అంటున్నరు. పెద్ద పప్పు పాదయాత్ర జేస్తుండంగ చిన్న పప్పు జెయ్యకుంటె ఏం బాగుంటదే’. ‘రాజకీయాలు ఎన్నడు నేర్సుకుంటవురా. చెట్టు మనది గాకున్నా పండ్లు మనమే దీస్కోవాలె. పంట మనం పండియ్యకున్నా పంటంత మనదే అనాలె’. ‘గదెట్లనే’. ‘వొచ్చెపారి బాలకిష్ననే ముక్యమంత్రి క్యాండేట్ అనాలె. మా కాక అన్కుంట జూనియర్ ఎన్టీఆర్ గాయిన దిక్కుకెల్లి ప్రచారం జేస్తడు. మల్లొక పారి టీడీపీ సర్కారొస్తది. బాలకిష్న ముక్యమంత్రి అయితడు’. (క్లిక్ చేయండి: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘మా మామ ముక్యమంత్రి అయితె నాకేం ఫాయిద?’ ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు బొడ్సి నేను ముక్యమంత్రిని గాలేదా? నా తీర్గనే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు బొడ్సి నువ్వు ముక్యమంత్రివి గావొచ్చు. షార్ట్‌కట్ ఉండంగ పాదయాత్రలు, గీదయాత్రలు మనకెంద్కు బిడ్డా’ అని చెంద్రబాబు అన్నడు. దాంతోని లోకేశ్ బోది చెట్టు కింది బుద్దుడయ్యిండు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..
నాటకాలు బాగా ప్రదర్శిస్తున్న రోజుల్లో ఓ సరదా సంభాషణ ప్రాచుర్యంలో ఉండేది. ‘ఏమోయ్.. నాటకం బాగా రక్తి కట్టిందటగా ఏ మాత్రం కలెక్ష వచ్చిందేమిటి?’.. కొంచెం వ్యంగ్యంగా అన్న ప్రశ్నకు.. ‘మహా బాగా వచ్చాయి.. బాటా తొంభై, నాటు నలభై.. అన్నీ ఎడమ కాలివే..’ అని నిష్ఠూరపు సమాధానం. ఇప్పుడు నాటకాలు పాలిటిక్స్‌లో బాగా రక్తి కడుతుండడంతో ఆ బాటా, నాటు జోళ్ల అవసరం, ప్రస్తావన ఇక్కడ బాగా పెరిగింది.. ఏదైనా పరస్పర విరుద్ధం అని చెప్పడానికి ఉప్పు, నిప్పు అంటారు. రాజకీయాల్లో విరుద్ధమైన రెండింటికీ ‘చెప్పు’ ఒక్కటే చాలు. స్వామిభక్తిని చాటడానికైనా. నిరసన తెలప డానికైనా.. ‘చెప్పు’ చేతపడితే చాలు. ఇలారండి .. భారత రాజకీయాలు ఎలా చెప్పుచేతుల్లో ఉన్నాయో చూద్దాం.. ‘షూ’ట్ ఎట్ షార్ట్‌కట్.. నిజానికి చెప్పుల కథ ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టంగానీ.. రామ భరతుల కాలంనాటి ‘పాదుకా పట్టాభిషేకం’ మనకు ఎరుకే. ఆ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ. అసలు ఏ అధికార పదవిలోనూ లేని సంజయ్ గాంధీ చెప్పులు తివారీ చేతందు కోవడం మొదలు తరచుగా నాయకులు పాదుకా స్పర్శలో ‘అమితా’నందాన్ని పొందుతూనే ఉన్నారు. నిన్నటి బండి సంజయ్ – అమిత్ షా చెప్పుల ఉదంతం చూశాం... ఎప్పుడో 2015 నాటి నారాయణసామి – రాహుల్ చెప్పుల కథను ప్రధాని మోదీ ప్రస్తావించడం.. ఇప్పుడది ట్రోల్ అవుతుండటం చూస్తున్నాం.. నాడు రాహుల్ కాళ్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని.. కాంగ్రెస్ నేత నారా యణసామి చెప్పులు చేతబట్టుకుని మరీ కాపలా కాశారు. రాహుల్ బూట్లు అలా విప్పగానే చటుక్కున తన చెప్పులు ఆయన కాళ్ల వద్ద పెట్టి స్వామి భక్తిని ‘చెప్పు’కున్నారు. ‘రాహుల్ వంటి సీనియర్‌ను గౌరవించుకోవడం తప్పా..?’ అని కూడా ఈ 68 ఏళ్ల వయసున్న పెద్దాయన అప్పట్లో చెప్పారు. 2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి రమేశ్ బాగ్వే ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పులను కాసేపు ‘గౌరవం’గా చేత పట్టుకున్నారు. ఇదే రాహుల్‌గాంధీ ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ‘చెప్పు’డు విమర్శ లకు దిగారు. తాము అమిత్‌షా నివాసానికి వెళితే ఇంటి బయటే చెప్పులు విప్పించారని, లోపల అమిత్‌షా మాత్రం చెప్పులు వేసుకునే ఉన్నారని మణిపూర్ ప్రజాప్రతినిధులు తనతో చెప్పారంటూ.. అమిత్‌షా క్షమాపణ చెప్పా లంటూ డిమాండ్ చేశారు కూడా. కొన్నేళ్ల కింద బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి.. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోసేందుకే అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా రనుకోండి ‘షూ’ట్ ఎట్ ఫైట్ ఇక యూపీలోని సంత్ కబీర్‌నగర్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పబ్లిక్ ముందే చెప్పులాటకు దిగారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ బఘేల్‌ను చెప్పుతో కొడితే.. రాకేశ్ తిరిగి లెంపకాయతో బదులిచ్చారు. ‘షూ’ట్ ఎట్ సైట్ ఎప్పుడూ భక్తి తన్మయత్వమేనా.. అప్పు డప్పుడూ నిరసనల కోపం కూడా చెప్పులను చేతబట్టించింది. ► 2009లో దైనిక్ జాగరణ్ రిపోర్టర్ జర్నైల్ సింగ్ నాటి కేంద్ర మంత్రి చిదంబరంపై విసిరిన బూటు దేశంలో కలకలం రేపింది. ► 2016లో యూపీలోని సీతాపూర్ జిల్లాలో రోడ్‌షో చేస్తున్న రాహుల్ గాంధీ వైపు హరిఓం మిశ్రా అనే సామాజిక కార్యకర్త విసిరిన నిరసన బూటు దూసుకొచ్చింది. 2012లో డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ► 2016లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడుతుంటే.. వేద ప్రకాశ్ శర్మ అనే రాజకీయ కార్యకర్త చెప్పు విసిరి తన నిరసన చెప్పుకున్నాడు. ► విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదంటూ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలూ వచ్చాయి. ► అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్పపై చెప్పుదాడి జరగడంతో.. చెప్పుల లొల్లి చెప్పలేనంత తలనొప్పిగా మారిందని నాటి ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ తల పట్టుకున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఆపడానికి ఏదో ఒకటి చేయాలనీ అన్నారు. ‘షూ’ట్ ఎట్ హైట్ కొందరు రాజకీయ నేతలు చెప్పుల ఎత్తు పెంచుకుని.. కొత్త ఎత్తులకు వెళ్లారని పాశ్చాత్య మీడియా అప్పుడప్పుడూ కోడై కూస్తుంటుంది. లీడర్ల అసలు ఎత్తుకు, అధికారికంగా చెప్పే ఎత్తుకు సంబంధం ఉండదని అంటూ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎత్తు బూట్లు వేసుకుని ఎత్తయిన వ్యక్తిలా కనిపించే ప్రయత్నం చేస్తారని అది ఆయన విజయ రహస్యమనీ చాలాసార్లు వార్తలూ వచ్చాయి. కొన్నేళ్ల కింద అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తు చెప్పులు వేసుకెళ్లారని గోల చేశారు కూడా. ఇక మన దీదీ మమతా బెనర్జీ హవాయి చెప్పుల ‘సింప్లిసిటీ’కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా! నువ్వేం ‘షూ’టర్? అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్‌పై ఓ నిరసనకారుడు బూటు విసిరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ జోక్.. బూటు విసిరిన వ్యక్తికి జడ్జి మూడేళ్లు జైలుశిక్ష వేశారు. ‘కేవలం బూటు విసిరితే మూడేళ్లు జైలా?’ అని నిందితుడు వాపోతే.. ‘కాదు.. విసిరినందుకు ఒక్క ఏడాదే.. అది తగలకుండా మిస్సయినందుకు మిగతా రెండేళ్లు జైలు’ అని జడ్జి ఆగ్రహం! (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇది ‘షూ’పర్.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మన అమ్మల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ‘చెప్పు’ లేనట.. ఆ భయం చూపి.. అల్లరిపిల్లలను దారిలో పెడుతున్నారని సరదా కామెంట్. ఇలా అమ్మలు వారి ఆయుధాన్ని విరివిగా వాడి పిల్లలను డిసిప్లిన్‌లో పెడితే... ముందు తరాల రాజకీయాల్లో చెప్పుల అవసరం బాగా తగ్గుతుందని ఓ నెటిజన్ ఉవాచ. -
ఫోన్లపై వంద శాతం డిస్కౌంట్.. చైనా కంపెనీ వెటకారం!!
గ్లోబల్ మార్కెట్లో అమెరికా వర్సెస్ చైనా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో రంగంలో పోటాపోటీ పైచేయితో దూసుకుపోతున్నాయి. అయితే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా ఆంక్షలు, నిషేధాలకు సైతం వెనుకాడడం లేదు. ఈ తరుణంలో హువాయ్‌పై నిషేధం విధించిన విషయమూ తెలిసిందే. హువాయ్అమెరికా తాజాగా తన వెటకారాన్ని ప్రదర్శిచింది. బ్లాక్ ఫ్రైడ్ పేరుతో ఫోన్లపై 100 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది కంపెనీ. ఇది అమెరికన్లను మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అంటూ సోమవారం తన ట్విటర్ పేజీలో ఓ పోస్ట్ కూడా చేసింది. అయితే అమెరికా నిషేధాన్ని నిరసిస్తూ ఈ రకంగా హువాయ్ సెటైర్లు వేసింది. Black Friday special! 100% OFF all phones we currently sell in the US.🙃 — HuaweiUSA (@HuaweiUSA) November 22, 2021 ఈ ట్వీట్‌కు విపరీతమైన లైకులు షేర్లు వచ్చాయి. దీంతో హువాయ్ మరో ట్వీట్ ద్వారా స్పందించింది. ఇదంతా జోక్అని, బ్లాక్ ఫ్రైడే సందర్భంగా తమ నుంచి ఎలాంటి అమ్మకాలు అమెరికాలో ఉండబోవని స్పష్టం చేసింది. ఇక నవంబర్ 26న బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ, హువాయ్ మాత్రం ‘చిప్ ఆంక్షల’ కారణంగా నిషేధం ఎదుర్కొంటూ గమ్మున ఉండిపోయింది. OK, everyone. It's just a joke. We can't sell anything in the USA 😭😭😭 #ReadyWhenYouAre — HuaweiUSA (@HuaweiUSA) November 22, 2021 ఒకప్పుడు హువాయ్ ఉత్పత్తులు అమెరికా మార్కెటింగ్ వల్లే ప్రపంచం మొత్తంలో భారీగా అమ్ముడు పోయేవి. అయితే అమెరికా ఆంక్షలు, నిషేధం తర్వాత నుంచి భారీగా పతనం అవుతూ వస్తోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 32 శాతం అమ్మకాలు పడిపోగా, మొదటి అర్థభాగంలో 29.4 శాతం క్షీణత కనిపించింది. -
చంద్రబాబును తెలంగాణ తండ్రి అని అంటాడేమో: కేటీఆర్
-
ట్రంప్‌కు దిమ్మదిరిగే పంచ్!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి స్వీడిష్ యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. గతంలో ఒకసారి చిల్ ట్రంప్ చిల్ అంటూ ట్రంప్‌పై కౌంటర్ ఎటాక్ చేసిన గ్రెటా తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్) లాస్ట్ పంచ్ నాదైయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా లాస్ట్ పంచ్‌తో అదరగొట్టేశారు గ్రెటా. ట్రంప్‌పై తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయనపదవీ విరమణ సమయాన్ని కరెక్టుగా వాడుకున్నారు. గ్రెటా ట్వీట్‌ను పరిశీలించినవారు ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు. తన ట్వీట్లో గ్రెటా ఏమన్నారంటే.. 'ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వృద్దుడిలా ట్రంప్ కనిపిస్తున్నారు. ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ గ్రెటా థన్ బర్గ్ ట్వీట్ చేశారు. దీనికి ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడుతున్న ఫోటోను షేర్ చేయడం విశేషం కాగా గత ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించిన గ్రెట్ ప్రపంచ పర్యావరణ అంశాన్ని ప్రపంచాధినేతలు నిర్లక్క్ష్యం చేస్తున్నారని నిర్భయంగా వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదంటూ అగ్రనేతలకు ఆమె చురకలంటించారు. అయితే దీనిపై స్పందించిన అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 'ఆమె ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు 'టైమ్' మేగజీన్ 2019 సంవత్సరానికి గాను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా గ్రెటా పేరును ప్రకటించినప్పుడు చిల్ గ్రెటా చిల్!' అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా చిల్ చిల్ డొనాల్డ్ అంటూ గట్టి చురకలే అంటించిన సంగతి తెలిసిందే. కానీ తాజా పరిణామంలో ఆసక్తికర విషయం ఏమిటంటే ట్విటర్ ట్రంప్‌ను శాశ్వతంగా ఇప్పటికే నిషేధించింది.. సో.. లాస్ట్ పంచ్ కిక్ గ్రెటాదే కదా! He seems like a very happy old man looking forward to a bright and wonderful future. So nice to see! pic.twitter.com/G8gObLhsz9 — Greta Thunberg (@GretaThunberg) January 20, 2021