sc cell
-
ఎస్టీ వర్గీకరణ ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గీకరణ ప్రక్రియ ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మాత్రం కేవలం ఎస్సీ వర్గీకరణపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఎస్టీ వర్గీకరణపై మాత్రం కమిటీ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఎస్టీ వర్గీకరణ అంశం కాస్త వెనకబడిపోయింది. అసెంబ్లీలో సీఎం ప్రకటన..: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు అమలు చేసే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన తీర్పు చెప్పడం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోకెల్లా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్ప టికే జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణను అమలు చేస్తామని స్పష్టం చేశా రు. ఇందులో భాగంగా గత నెల 12న రాష్ట్ర ప్రభు త్వం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన వర్గీకరణ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు, ఇందుకు అవసరమైన సూచనలను తమకు తెలియజేయాలని కమి టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు మూడుసార్లు సమావేశమైన కమిటీ.. వర్గీకరణపై ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖను ఆదేశించడంతోపాటు పంజాబ్, హరియాణా, తమిళనాడులో అమలవుతున్న వర్గీకరణపై అధ్యయనానికి అధికారుల బృందాన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. అధికారులు ఆ అధ్యయనాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు వన్‌మెన్ జ్యుడీíÙయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కానీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. వర్గీకరణ జాప్యంతో...: సీఎం ప్రకటనకు భిన్నంగా టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా విడుదల చేశారు. మొత్తం 11 వేల టీచర్ ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశారు. ఈ నెల 9న టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు సైతం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు 9 వేల ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియలోనూ దాదాపు 8 వేల సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియలో రెండో విడుత వెబ్ఆప్షన్ల ప్రక్రియ సైతం పూర్తి కావచి్చంది. వర్గీకరణ ప్రక్రియను తేల్చకపోవడంతో ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాలకు సరైన న్యాయం జరగడం లేదనే వాదన రోజురోజుకు పెరుగుతోంది. -
బీజేపీని గ్రామగ్రామాన విస్తరిస్తాం
సాక్షి, విజయవాడ: ఎస్సీలకు సామాజిక న్యాయం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేలు చేకూర్చిందని బీజేపీ రాష్ట్ర కో ఇంచార్జ్ సునీల్ థియోధర్ పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల వారు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని బాగా విశ్వసించారు. కానీ, కాంగ్రెస్ వారిని మోసం చేసిందని వ్యాఖ్యానించారు.బీజేపీ రానున్న ఐదేళ్లలో బలపడుతుందనీ, ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందని ఆయన విశ్లేషించారు. కుల, మతాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వివాస్ పేరుతో ఆదరిస్తుందని, గ్రామగ్రామాన పార్టీని తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్కా సునీల్ కూడా పాల్గొన్నారు. -
‘నక్కా ఆనంద్, కారెం శివాజిలు.. చంద్రబాబు చప్రాసీలు’
సాక్షి, విజయవాడ : దళితుల పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కారుకూతులు కూస్తే సహించేది లేదంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. బుధవారం వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున వైఎస్ జగన్‌పై దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనైతికంగా మాట్లాడుతూ పశువుల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నక్కా ఆనంద్ బాబు, కారెం శివాజి, జవహర్‌లు దళితులైనంతా మాత్రాన వైఎస్ జగన్ గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరన్న చంద్రబాబు వద్ద పని చేస్తూ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.. మీకు అంత సత్తా ఉంటే అరెస్ట్ చేయించండంటూ సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌ను చంపడానికి విజయమ్మ, షర్మిల ప్లాన్ చేశారని ఏకలవ్యుడు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు.. మీ నోట్లో ఏమన్నా అశుద్దం పోసుకున్నారా అంటూ మేరుగు తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్కా ఆనంద్, కారెం శివాజి, జవహర్‌లు దళితులని వారి చేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారు. దళితుల పేరుతో మా నాయకుడి గురించి కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు దగ్గర చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగబలిసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి పట్ల టీడీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే సత్తా టీడీపీ నేతలకు లేదని వెల్లడించారు. వైఎస్ జగన్ చమట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ రాజీనామాలను చంద్రబాబు ముఖాన విసిరేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అంతేకానీ దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టొద్దని కోరారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన ఒక్క దళితుడు కూడా వైఎస్ జగన్ నుంచి పక్కకు వెళ్లరని మేరుగు ధీమా వ్యక్తం చేశారు. -
వేరే రాష్ట్రంలో కోటా వర్తించదు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన ఒక వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలోను అదే వర్గంగా గుర్తిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందలేరంటూ సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏ శంతన గౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘ఒక రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఉద్యోగం, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాల్లో ఆ రాష్ట్రంలో అతనిని ఎస్సీ, ఎస్టీగా పరిగణించకూడదు. దాని వల్ల సొంత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు వారికోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు కోల్పోతారు’ అని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలో అదే వర్గంగా గుర్తించని పక్షంలో అతను ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ కోరవచ్చా? అని దాఖలైన 8 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందితే వారికి వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా అదే హోదా ఉండాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక కులం లేదా తెగను ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అర్హతను ఆ ప్రాంత పరిస్థితులు, ప్రతికూలతలు, ఆ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ఆధారపడి పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో రిజర్వేషన్ లబ్ధి పొందితే మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఆ రాష్ట్రం కేటాయించిన రిజర్వేషన్ ఫలాన్ని దక్కకుండా చేయడమే’ అని పేర్కొంది. అయితే వేరే రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తులు స్పష్టం చేయగా జస్టిస్ భానుమతి వారితో విభేదించారు. ‘కేంద్ర పాలిత ప్రాంతంలోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చినప్పటికీ అవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండవు’ అని తన తీర్పులో జస్టిస్ భానుమతి అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు వెనుకబాటు గీటురాయి కాదు ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంలో వెనుకబాటుతనాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు షరతులు విధిస్తూ 2006లో సుప్రీం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవరించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన రాజ్యాంగ బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2006 నాటి తీర్పును సమీక్షించండి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం సమర్పించాలని 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి. -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
చూడండి సారూ.. మా గోస
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకొని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘హాస్టల్లో భయం భయంగా’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురించిన కథనానికి ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, చేవేళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషితలు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సోమవారం ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి పెచ్చులూడుతున్న భవనాన్ని పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికే విద్యార్థులు హాస్టల్ ఎదుట భైఠాయించారు. విద్యార్థులంతా ఒక్కసారిగా తమ సమస్యలను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే తామందరం ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, మాకు టీసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే హాస్టల్ విద్యార్థులు ఉండేందుకు భవనాన్ని అద్దెకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషిత, ఇన్చార్జి వార్డెన్ సుశీలను ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి గృహంలో ఈ విధంగా సమస్యలు ఉంటే విద్యార్థినులు ఏవిధంగా చదువుకుంటారని వారిని ప్రశ్నించారు. హాస్టల్లో పనిచేసేందుకు కావల్సిన సిబ్బందిని వెంటనే నియమించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఎస్డబ్ల్యూను ఆదేశించారు. వాహనం ఎదుట భైఠాయింపు స్ధానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సీ హాస్టల్లో సమస్యలు నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. హాస్టల్ నూతన భవన నిర్మాణం, సమస్యల పరిష్కారం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినులతో కలిసి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వాహనం ఎదుట భైఠాయించారు. సమస్య పరిష్కారానికి మార్గం చూపే వరకు వెళ్లనీయమని విద్యార్థులు భీష్మించుకొని కూర్చోవడంతో ఆయన వినతిపత్రం స్వీకరించారు. అనంతరం విద్యార్థినులు హాస్టల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, మనోహర్, పవన్, సాయి, సుమన్, పవన్, జాంగారి రవి పాల్గొన్నారు. -
మరింత ‘బెస్ట్’గా..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత వసతితో బోధన అందించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి మరిన్ని హంగులు అద్దుతోంది. పరిమిత స్థాయిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని భావిస్తోంది. ఏటా గరిష్టంగా 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలకు క్రేజ్ పెరగడం.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీట్లు ఇవ్వడం కష్టమవడంతో ఈ ప్రత్యామ్నాయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బీఏఎస్ ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఉపక్రమించింది. ఒకటో తరగతి నుంచే.. రాష్ట్రంలో 185 పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా ఎస్సీ అభివృద్ధి శాఖ గుర్తించింది. పదేళ్లలో వచ్చిన ఫలితాలు, పాఠశాలల నిర్వహణ, బోధన సిబ్బంది సామర్థ్యం ఆధారంగా ఈ పాఠశాలలను ఎంపిక చేస్తారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ పథకం కింద 8,390 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. 2017–18లో 785 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. 91.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 27 మంది 9.5 కంటే ఎక్కువ జీపీఏ సాధించారు. బీఏఎస్ పథకం సత్ఫలితాలు ఇస్తుండటంతో మరింత విస్తృతం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏటా 5 వేల మందికి అవకాశం ఇచ్చేలా స్కూళ్ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. తాజాగా ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థికి ఏటా రూ. 35 వేలు బీఏఎస్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థికి ఏటా రూ. 35 వేలు సర్కారు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని భావిస్తుండటంతో ఫీజుల పైనా పరిశీలన చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీ పాఠశాలల వివరాల సేకరణతో పాటు అక్కడి ఫీజులను అంచనా వేస్తోంది. జిల్లాలో విద్యార్థి చెల్లిస్తున్న సగటు ఫీజులు అంచనా వేసి నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఫీజు ఖరారు చేయనుంది. -
హాస్టల్ విద్యార్థుల కిచిడిలో ఎలుక
జడ్చర్ల టౌన్ మహబూబ్ నగర్ : స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోని ఎస్సీ హాస్టల్లో బుధవారం అల్పాహారంలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అల్పాహారం కోసం సిబ్బంది కిచిడి తయారు చేశారు. వండి వార్చిన కిచిడిని విద్యార్థులకు వడ్డిస్తుండగా ఒక విద్యార్థి ప్లేటులో చిన్న ఎలుక కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే ఇతర విద్యార్థులకు అల్పాహారం వడ్డించకుండా బయటకు పారవేశారు. మళ్లీ వండి వార్చారు. హాస్టల్ వార్డెన్ ఆదినారాయణకు బాలానగర్ హాస్టల్ ఇన్చార్జ్ బాధ్యతలు ఉండటంతో ఆయన అక్కడ ఉన్నారు. విషయం తెలియగానే భవిష్యత్‌లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. అయితే బాదేపల్లి జెడ్పీహైస్కూల్‌కు ఎస్సీ వసతి గృహం నుంచి వెళ్లే విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎలుక విషయం వెలుగు చూసింది. హైస్కూల్‌కు నూతన గేట్ పెట్టి దానిని మూసివేయడంతో ఆలస్యమైన విద్యార్థులు బయటే ఉండిపోయారు. ఆలస్యానికి గల కారణాలను ఎంఈఓ మంజులాదేవి, ఉపాధ్యాయులు ఆరా తీయగా అల్పాహారంలో ఎలుక రావడం వల్ల వంట ఆలస్యమైందని విద్యార్థులు చెప్పారన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి
న్యూఢిల్లీ: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్ ఖాతాలో ఫీజు డిపాజిట్ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. -
మధ్యంతర ఉత్తర్వులుండవ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్ వర్తింపుపై 2006నాటి తీర్పు (ఎం.నాగరాజ్ తీర్పు అనికూడా పిలుస్తారు)కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘2006 తీర్పు’ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. మధ్యంతర ఉపశమన చర్యలు ఇచ్చేందుకు కేసు విచారించబోమని, కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఇందుకోసం ఎం నాగరాజు తీర్పుపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు 3న జరుగుతుందని స్పష్టం చేసింది. నియామకాలు ఆగిపోయాయ్: కేంద్రం వివిధ న్యాయపరమైన ప్రకటనల కారణంగా రైల్వేలు, ఇతర సేవా రంగాల్లో లక్షల ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన వినిపిస్తూ.. వివిధ బెంచ్‌లు, హైకోర్టులు ఇటీవల ఇచ్చిన తీర్పుల కారణంగా రిజర్వేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ‘స్టేటస్ కో’ నెలకొందంటూ ఓ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమవుతున్న సమయంలో జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధావన్ వాదనలను వేణుగోపాల్ సమర్థించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్‌పై గందరగోళం నెలకొందని.. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే మాత్రం.. ఈ విషయంలో గందరగోళం లేదన్నారు. పలు పక్షాలు వాదిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్రీమీలేయర్ వర్తించదు: నాటి తీర్పులో సుప్రీం 2006 నాటి ‘ఎం నాగరాజ్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ తీర్పును పునఃపరిశీలించాలా వద్దా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని గతేడాది నవంబర్ 15న ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో క్రీమీలేయర్ వర్తించదంటూ ఎం నాగరాజు తీర్పులో 2006లో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయండి
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నతాధికారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీం తీర్పును అనుసరించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ అన్ని విభాగాలకు ఉత్తర్వులు జారీచేస్తూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. అదే సమయంలో ఉత్తర్వుల్లో తప్పనిసరిగా .. ‘పదోన్నతి సుప్రీం కోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక అధికారి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని జూన్ 5న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. -
దళితుల కోసం ఖర్చుచేసిందెంత?: ఆరేపల్లి మోహన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఓటర్ల గణన తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు జరిగాయని, అయితే ఓటర్ల గణనలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల వారిగా కులసంఘాలతో చర్చించి రిజర్వేషన్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఒక్క సిరిసిల్లలోనే దళితులపై ఎందుకు దాడులు పెరుగుతున్నాయని మోహన్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దళితులకు బడ్డెట్ ఎంత కేటాయించిందో?, అందులో ఎంత ఖర్చు చేసిందో?, మిగులు నిధులు ఏం చేసిందో? ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా సుప్రీం తీర్పు: ఎంపీ బూర
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించేందుకు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్లైందని అభిప్రాయపడ్డారు. మరోవైపు లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్ ప్రైవేటు బిల్లును చర్చకు తీసుకుంటున్నట్టు లేఖ అందిందని చెప్పారు. వచ్చే సమావేశాల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, బిల్లు వల్ల పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో రైతేరాజుగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. -
చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు..
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత వ్యతిరేకని విమర్శించారు. అంబేడ్కర్ పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం పేరుతో కేటాయించిన రూ. 100 కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అందుకు నిరసనగా ఈ నెల( మే) 8న ఆందోళన చేస్తామన్నారు. అంతేకాక చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా మౌనదీక్షలు చేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. సాంఘిక సంక్షే మ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయని, వీటిలో చదివి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీల విద్యా ప్రమాణాలను పెంచడానికి, మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’పై ఆర్డినెన్స్?
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పునకు ముందున్న యథాస్థితికి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా సుప్రీంకోర్టు చేసిన మార్పుల్ని రద్దు చేసే అంశంపై ఇప్పటికే సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై సాగుతున్న చర్చలపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును నిరోధించేలా జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం, 1989ను సవరించేలా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది’ అని వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌తో తక్షణ ఫలితం ‘ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ఆ తర్వాత దానిని బిల్లు రూపంలో మార్చి పార్లమెంటు ఆమోదం పొందవచ్చు. రెండింటి ఫలితాలు ఒకటే అయినా ఆర్డినెన్స్‌తో తక్షణం ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వపు స్థితిలో అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్స్‌తో వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న నిరసనల్ని నియంత్రించవచ్చు’ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వబోమని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మనం పటిష్టంగా రూపొందించిన చట్టం ప్రభావితమయ్యేందుకు (సుప్రీంకోర్టు తీర్పు ద్వారా) అనుమతించమని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, సమీక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రభుత్వం కాగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్ జారీకి ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూ పిటిషన్‌తో తక్షణ ఫలితం రాకపోవచ్చని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలంగా ఉండకపోవచ్చని.. అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. వ్యతిరేకంగా వస్తే ఆర్డినెన్స్: పాశ్వాన్ దళితుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపరిచే చర్యల్ని ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో.. ఆర్డినెన్స్‌తో పాటు పలు ప్రత్యామ్నాయాల్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ‘తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. ఆ తర్వాతి రోజే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తుల అంశంపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. హైకోర్టుల్లో నామమాత్రంగా న్యాయమూర్తులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు. -
ఆ తీర్పు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు నిబంధనలను నిర్వీర్యం చేసేలా ఉందని, ఇది ప్రజల్లో ఆగ్రహానికి, అశాంతికి కారణమై దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, అందువల్ల దీనిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తక్షణం అరెస్టులు చేయకుండా మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషనదాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా గురువారం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక నివేదిక సమర్పించింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగంలో ప్రాథమిక భాగమనీ, చట్టాలు చేయగలిగే ఎలాంటి అవకాశమూ కోర్టులకు లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, సమీక్ష ద్వారా, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవటం ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దవచ్చని తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, కోర్టు తీర్పు ఫలితంగా గందరగోళం, ఆగ్రహం, అసంతృప్తి, అశాంతి దేశంలో చెలరేగాయని పేర్కొంది. ఈ తీర్పు చట్టాన్ని బలహీనపరిచేలా ఉందని తెలిపింది. తమ తీర్పును పూర్తిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ దీనిపై సమీక్షించేందుకు గత వారం సుప్రీంకోర్టు నిరాకరించింది. -
దళితులపై నేరాలు ఎనిమిదింతలు
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద నిందితుల్ని తక్షణ అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు) పెరిగాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. ఇక ఆదివాసీల(ఎస్టీ)పై నేరాల సంఖ్య ఈ పదేళ్లలో 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయని వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు. మధ్యప్రదేశ్ టాప్ 2006–16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799 నేరాలు జరిగాయి. గోవా, కేరళ, ఢిల్లీ, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నేరాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్(42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయంది. ఇక ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్–నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో ఆదివాసీలపై 81,322 నేరాలు జరగగా.. వాటిలో అత్యధికం కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంది. పోలీస్స్టేషన్లలో ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దోషుల సంఖ్య 10 శాతానికి మించడం లేదని తెలిపింది. కొండలా పేరుకుపోతున్న కేసులు దళితులు, ఆదివాసీలపై ఈ పదేళ్లలో నేరాలు పెరిగినప్పటికీ.. పోలీస్స్టేషన్లు, కోర్టుల్లో అదే స్థాయిలో కేసుల పరిష్కారం జరగడంలేదని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఫిర్యాదులపై పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ పదేళ్లలో 99 శాతం పెరిగాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 50 శాతం పెరిగాయని తెలిపింది. 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. తప్పుడు కేసులు అంతంతే: దళితులు నిందితులపై పెట్టిన తప్పుడు కేసు ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఎలాంటి పెరుగుదల లేదని ఆ నివేదిక తెలిపింది. 2006–16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులుగా తేలాయంది. వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో ముందుంది. శిక్షపడుతున్న సందర్భాలు చాలా తక్కువ దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదు. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2006లో ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని పేర్కొంది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారంది. –సాక్షి నేషనల్ డెస్క్ -
సుప్రీం అంటే దళితులకు భయం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నివారణ చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేయడం, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన జడ్జీలకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల వెల్లువెత్తిన నిరసనలు సుప్రీంకోర్టు అంటే దళితుల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఎగువ న్యాయ వ్యవస్థలో దళితులు, పేదలకు న్యాయబద్ధ ప్రాతినిధ్యం దక్కేలా ఆయన పార్టీ, ఎన్డీయే భాగస్వామి అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గురువారం ‘హల్లా బోల్, దర్వాజా ఖోల్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కుష్వాహ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థే మూల స్తంభం లాంటిదని, కానీ న్యాయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. ‘టీ అమ్మే వ్యక్తి ప్రధాని కావొచ్చు. దినసరి కూలీ బిడ్డ ఐఏఎస్ అధికారి కావొచ్చు. పేద కుటుంబాల నుంచి ఎంత మంది జడ్జీలు వచ్చారో సుప్రీంకోర్టు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కోరారు. -
ప్రతిపక్షాల మానవహారం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించటంలో అధికార ఎన్డీఏ విఫలమైందంటూ ప్రతిపక్షాలు గురువారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, వామపక్షాలు, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర 17 పార్టీల నాయకులు అరగంటపాటు మానవహారంగా ఏర్పడ్డారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు..’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. మరోమార్గం లేకనే ప్రభుత్వ వైఖరిపై ఈ నిరసన తెలిపామన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చు కునేందుకు.. వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం, ఎస్టీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలను తాము ప్రస్తావించకుండా అడ్డుకుం దని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. -
బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలి
సాక్షి, న్యూఢిల్లీ: మాదిగల అస్తిత్వ నినాదమైన ఎస్సీ వర్గీకరణను పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలని, ఈ నెల 14న మాదిగలు ప్రతిజ్ఞ చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి మంగళవారం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా స్వీకరించాలని, కాంగ్రెస్, బీజేపీలు చేసే మోసాన్ని పల్లెపల్లెకూ చేరవేయాలని కోరారు. తెలంగాణ భవన్లో ‘ఎస్సీ వర్గీకరణ’అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. -
వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. వర్గీకరణ చేపట్టాలంటూ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ మాదిగ జేఏసీ నేతలతో కలసి ఆయన మౌన దీక్ష చేపట్టారు. వర్గీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మంద కృష్ణల వల్ల మాదిగలు బలయ్యారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
భారత్ బంద్ హింసాత్మకం
న్యూఢిల్లీ/భోపాల్/లక్నో: ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటుచేసుకుంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు చోట్ల దళిత ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోవడంతో పాటు పోలీసులతో ఘర్షణ పడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో 9 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. జోధ్‌పూర్‌లో రాస్తారోకోలో పాల్గొన్న వందలాది మంది దళితులు, భీమ్ సేన కార్యకర్తలు మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్తాన్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు. పంజాబ్‌లో ఉదయం నుంచే ఆర్మీ, పారామిలటరీ బలగాల్ని సిద్ధంగా ఉంచారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్‌ల్లో కూడా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పలు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా రైళ్లను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణాకు తీవ్రంగా అంతరాయం కలిగింది. రైల్వే శాఖ 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఉత్తర, తూర్పు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిన బంద్ ఛాయలు దక్షిణాదిలో కనిపించకపోవడం గమనార్హం. ముంబైలో నిరసనకార్యక్రమంలో నినాదాలిస్తున్న కార్యకర్త హుటాహుటిన బలగాలు బంద్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆస్తుల దహనం, కాల్పులు, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఆందోళన సందర్భంగా ఎదురుకాల్పులు జరగడంతో మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ముగ్గురు, గ్వాలియర్ జిల్లాలో ఇద్దరు, మొరేనా జిల్లాలో ఒక్కరు మరణించారు’ అని మధ్యప్రదేశ్ ఐజీ (శాంతి భద్రతలు) మార్కండ్ దేవ్స్కర్ తెలిపారు. మృతుల్లో నలుగురు దళితులు, ఇద్దరు ఉన్నత కులాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒకరు, మీరట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఒకరు మరణించగా.. 9 మంది పోలీసులతో సహా 26 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లకు అల్లర్ల నిరోధానికి ప్రత్యేక్ష శిక్షణ పొందిన 1,700 మందిని హుటాహుటిన పంపింది. అలాగే యూపీకి ఎనిమిది కంపెనీలు, మధ్యప్రదేశ్‌కి నాలుగు, రాజస్తాన్‌కు మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని కేంద్రం తరలించింది. మధ్యప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ పరిస్థితి అదుపు తప్పడంతో మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్, భింద్, మొరేనా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. చంబల్, గ్వాలియర్, సాగర్ రీజియన్లలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల రాళ్లు రువ్వడం, దహనాలు, లూటీలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు కాల్పులు జరపడంతో మొరేనా జిల్లాలో విద్యార్థి నాయకుడు రాహుల్ పాఠక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా హింస మిగతా ప్రాంతాలకు విస్తరించడంతో గ్వాలియర్ పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ఉమేశ్ శుక్లా చెప్పారు. భింద్ జిల్లాలో మరణించిన వ్యక్తిని మహావీర్ సింగ్‌గా గుర్తించామని, మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఝబువాలో ఆందోళనకారులు దుకాణాల్ని లూటీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. భోపాల్‌లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు పలు వాహనాల్ని ధ్వంసం చేశారు. యూపీలో 75 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ హింసలో 40 మంది పోలీసులు సహా 75 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ (శాంతి భద్రతలు) ప్రవీణ్ కుమార్ చెప్పారు. విధ్వంసానికి, దహనాలకు పాల్పడిన 450 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరట్‌లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అజాంగఢ్‌లో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగ్రా, హాపూర్, మీరట్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలు పంపాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్ కేంద్రాన్ని కోరారు. యూపీలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లతో అనేక రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంజాబ్‌లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా హరియాణాలో అంబాలా, రోహ్‌తక్‌తో పాటు చండీగఢ్లోను ఆందోళనలు కొనసాగాయి. భారత్ బంద్ నేపథ్యంలో పంజాబ్‌లో జరగాల్సిన 10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల ఆందోళనకారులు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. డెహ్రాడూన్ , రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. ఘజియాబాద్‌లోని ఒక గుంపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మండి హౌస్ ప్రాంతంలో రోడ్లపై ఆందోళనకారులు బైఠాయించి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే ట్రాక్‌లు, రోడ్లను దిగ్బంధించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన 30 మందిని రాజస్తాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాలో ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌ను ముట్టడించి టికెట్ కౌంటర్లను మూయించివేశారు. పదుల సంఖ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఒడిశా, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనల వల్ల జన సామాన్యానికి అంతరాయం కలిగింది. గుజరాత్‌లోని ప్రధాన పట్టణాల్లో రోడ్లపై ఆందోళనలు చేపట్టడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సుప్రీం తీర్పులో ఏముంది? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దని మార్చి 20న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసుల్లో వారంలోగా ప్రాథమిక విచారణ నిర్వహించి ఫిర్యాదు సరైందేనని నిర్ధారించుకోవాలని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదైనా అరెస్టు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వోద్యోగిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఫిర్యాదు చేస్తే.. ఆ ఉద్యోగికి అరెస్టుకు సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పనిసరి అని చెప్పింది. ఇతరులపై ఫిర్యాదుల విషయంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డీఎస్పీ అనుమతి అవసరమంది. ఈ చట్టం ఆసరాగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలూ చాలా జరుగుతున్నాయంది. సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి వీలైనంత తొందరగా విచారించాలని కోరే చాన్స్ న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. దళితులు, గిరిజనులపై వేధింపుల్ని అడ్డుకునేలా ఉన్న నిబంధనలపై సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టం అసలు ఉద్దేశాన్ని నీరుగార్చేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. దేశంలోని గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. పార్లమెంటు శాసన విధానానికి ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ కేసును బహిరంగంగా విచారించాలంది. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా దళితులు, గిరిజనులు వెనుకబడే ఉన్నారనీ, వారిపై పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్‌ను వీలైనంత తొందరగా విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మంగళవారం సుప్రీంకోర్టును కోరే అవకాశముంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం విభేదిస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీం తీర్పును నిలిపివేయాలని ఆల్ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం నిరాకరించింది. సంయమనం పాటించండి హింసాత్మక సంఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదని, తీర్పు అంశాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో సమగ్ర రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రివ్యూ పిటిషన్‌పై ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయం తీసుకుందని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అభినందించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, మైనార్టీలపై అత్యాచారాల ఘటనలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత ఆజాద్ ఆరోపించారు.