Seattle
-
Turkish Airlines: విమానం నడుపుతూ పైలట్ మృతి
న్యూయార్క్: సియాటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యంలోనే పైలట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసేలోపే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 204 సియాటెల్‌లో మంగళవారం రాత్రి టేకాఫ్ అయ్యింది. కెప్టెన్‌గా 59 ఏళ్ల ఇల్సిన్ పెహ్లివాన్ విధుల్లో ఉన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే పెహ్లివాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ కెప్టెన్‌ను కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. సాధారణంగా పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెహ్లివాన్ మార్చి 8నే అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. -
జాహ్నవిపై అనుచిత వ్యాఖ్యలు..ఆ పోలీసు తొలగింపు
న్యూయార్క్/సియాటెల్: అమెరికాలోని సియాటెల్‌లో గతేడాది తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23) పోలీసు వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. ఆమెకు పెద్దగా విలువేమీ లేదనేలా డేనియల్ ఆడెరర్ అనే పోలీసు అధికారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అవి జాహ్నవి కుటుంబానికి ఎంతో వేదన కలిగించి ఉంటాయని దీనిపై విచారణ చేపట్టిన అధికారి స్యూ రాహ్ర్ అన్నారు. అడెరర్ అమానవీయ వైఖరి పోలీసు వృత్తికే కళంకం తెచ్చిపెట్టిందన్నారు. ‘‘ఇలాంటి అధికారిని ఇంకా కొనసాగనీయడం మొత్తం పోలీసు విభాగానికే అవమానకరమవుతుంది. అందుకే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు అతడిని విధుల నుంచి తొలగిస్తున్నాం’ అని ప్రకటించారు. కారును వేగంగా నడిపిన మరో అధికారి కెవిన్ డేవ్‌పై నేరారోపణలను నమోదు చేయలేమంటూ కింగ్ కౌంటీ అధికారులు ఈ ఏడాది జనవరిలో స్పష్టం చేశారు. అయితే, ఈ నేరం కింద డేవ్‌కు 5 వేల డాలర్ల జరిమానా విధిస్తూ సియాటెల్ సిటీ అటార్నీ తీర్పు వెలువరించారు. -
అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్‌లో కొత్తగా రెండు వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది. -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్‌పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
కందుల జాహ్నవి కేసు.. ఇదెక్కడి న్యాయం?
కిందటేడాది తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23) అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది కూడా. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సదరు పోలీస్ అధికారిపై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బుధవారం వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. కందుల జాహ్నవి మృతి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా.. ఆమె యాక్సిడెంట్ కేసులో సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని, కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవు’’ అని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు.. ఈ ప్రకటనపై జాహ్నవి బంధువులు, పలువురు భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్ కెవిన్ డేవ్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై అవమానించేలా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఏవని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే కెవిన్‌పై క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC — India in SF (@CGISFO) September 13, 2023 సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ ఆమె మృతిపై చులకనగా మాట్లాడాడు. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించినట్టు రికార్డయింది. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు ఆ తర్వాత దర్యాప్తులోనూ కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు. డేనియల్ ఆర్డరర్ వ్యాఖ్యల వీడియోపై అధికారులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని డేనియల్ ఆర్డరర్ గతంలో వివరణ ఇచ్చాడు. -
సీయాటెల్ సిద్ధం ఫర్ ‘యాత్ర 2’ ఈవెంట్
అమెరికాలోని సీయాటెల్లో యాత్ర2 మెగా ప్రీమియర్ షో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. YSRCP USA, సోషల్ మీడియా, జగనన్న కనెక్ట్స్ ఆధ్వర్యంలో 'సీయాటెల్ సిద్ధం ఫర్ యాత్ర2 ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ దుష్యంత్ రెడ్డి తెలిపారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవ్, నిర్మాత శివ మేక, చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు. సీయాటెల్ నలుమూలల నుంచి వైఎస్సార్, సీఎం జగన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్ర 2 సెలబ్రేషన్ లో పాలు పంచుకున్నారు. YSRCP USA , సోషల్ మీడియా కమిటీ సభ్యులు.. చిన్నారులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ పాలనని గుర్తు చేసుకున్నారు. వైస్సార్ అడుగు జాడల్లో నవరత్నాలతో పాటు విన్నూతన మైన పథకాలు AP ప్రజలకి అందించిన CM YS జగన్ పరిపాలన ని గుర్తు చేస్తూ , రాబోయే ఎలక్షన్ లో 140 పై చిలుకు స్థానాల లో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఈ సందర్భం గా తెలియ జేశారు. ఈ ఈవెంట్ లో YSRCP USA సభ్యులు మునీశ్వర్ రెడ్డి నాగిరెడ్డి , వినయ్ రెడ్డి, అనిల్ బెల్లపు , JC రెడ్డి , వెంకట్ సుబ్బా రెడ్డి, ప్రకాష్ కొండూరు ,శంకర్ తిప్పల ,ప్రకాష్ మామిడి,జితేందర్ రెడ్డి ,శ్రీనివాస రెడ్డి మల్లంపాటి ,భాస్కర్ రెడ్డి , వినోద్ ,సునీల్ బలభద్ర ,నరేన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి,రాజ శేఖర్ రెడ్డి ,ప్రదీప్, బాల ,కరుణాకార్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సహాయ సహకారాలు అందజేశారు. కమ్యూనిటీ లీడర్స్ మనోజ్ చింతి రెడ్డి , సాయిరెడ్డి కంచరకుంట్ల ,సువీన్ రెడ్డి ఉప్పల ,నవీన్ గోలి ప్రసంగించి యాత్ర 2 మూవీ కి ధన్యవాదాలు తెలియజేశారు. -
సీటెల్‌లో ఘనంగా టీటీఏ బోర్డు సమావేశం!
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డ్ సమావేశం సీటెల్‌లో ఘనంగా జరిగింది. వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల సీటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని మరణించిన జాహ్నవి కందుల మృతికి బోర్డ్ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన 2024 మే 24 నుంచి 26 వరకు సియాటిల్ నగరంలో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి చర్చించారు. ఈ బోర్డు సమావేశంలో టీటీఏ కన్వెన్షన్ వెబ్సైట్, సరికొత్త లోగోను ప్రారంభించింది. ఈ సమావేశానికి టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సలహా మండలి విజయపాల్ రెడ్డి, మోహన్ పటోళ్ల, భరత్ మాదాడి, అధ్యక్షుడు వంశీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్, ప్రధాన కార్యదర్శి కవిత, EC, BoD, జాతీయ బృందం అంతా కలిసి వివిధ అంశాలఫై చర్చించారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సీటెల్ లో వచ్చే ఏడాది జరగనున్న 2024 మెగా కన్వెన్షన్ సక్సెస్ చేయాలని, అవసరమైన నిధుల సమీకరణకు బోర్డ్ సభ్యులు కృషి చేయాలని కోరారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి తెలియజేశారు. అడ్వైజరీ కో-చైర్ మోహన్ పాటల్లోల, సభ్యుడు భరత్ మాదాడి 2023 డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా దినోత్సవాలు, అలాగే కన్వెన్షన్ గురించి వివరాలను తెలియజేశారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ గురించి ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని బోర్డు సభ్యులందరినీ కోరారు. ఈ బోర్డ్ మీటింగ్‌లో దాదాపు 1 మిలియన్ డాలర్లు నిధుల సేకరణకు హామీలు వచ్చాయి. అలాగే టీటీఏ మెగా కన్వెన్షన్ కు వేదికైన సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ ని బోర్డు సభ్యులు పరిశీలించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ది, సెక్రటరీ కవితా రెడ్డితో పాటు టీమ్ సభ్యులు, పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. కన్వెన్షన్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ సభ్యులందరితో సాయంత్రం టీటీఏ కార్య నిర్వాహక వర్గం కలిసి సాంస్కృతిక కార్యక్రమములో పాల్గొన్నారు. విజ్ఞేశ్వర స్తుతితో మొదలైన ఈ కార్యక్రమము ఆద్యంతం ప్రేక్షకులకు స్వచ్చమైన తెలంగాణ సంప్రదాయముల మధ్య అంగ రంగ వైభవముగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన వంశీ రెడ్డి గారు సియాటెల్ వచ్చిన టీటీఏ ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత అతిధులందరిని పేరు పేరునా వేదిక మీదకి ఆహ్వానించి శాలువాలతో సత్కరించినారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టీటీఏ విరాళాల రూపంలో ఒకే రోజులో 2 మిలియన్ డాలర్లను విజయవంతంగా సేకరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, సియాటిల్ నగరంలో ఇంత పెద్ద కన్వెన్షన్ జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేసి, తమ మద్దతు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , APNRTS Regional Co ordinator దుష్యంత్ రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి , రామ్ పాలూరి, భాస్కర్ గంగిపాముల, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..) -
సీటెల్ లో TTA బోర్డ్ సమావేశం విజయవంతం
-
ఆ పోలీసును తొలగించాలి
వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్‌గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన విడుదల చేశాడు. -
‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’
సియాటెల్‌లో రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం.. తెలిసిందే. ఆ అధికారి తీరుపై ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సైతం అమెరికాను డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావంటూ అధికారి డేనియల్ ఆర్డరర్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ అడెరెర్ రాసిన లేఖను సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వాను అంతే.. అని డేనియల్ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యింది. అయితే, ఇలాంటి కేసుల్లో కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే నేను మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్ తన లేఖలో వివరించారు. అంతేగానీ.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్ అవుతాయని అన్నారు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్, డేనియల్ అడెరెర్‌కు మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది. మరోవైపు డేనియల్ అడెరెర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు మొదలయ్యాయి. -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
Jaahnavi Kandula: జాహ్నవికి మరణానంతర డిగ్రీ
వాషింగ్టన్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణానంతర డిగ్రీ అందనుంది. ఈ విషయాన్ని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్ పట్టా అందజేస్తామని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలువాసి అయిన జాహ్నవి.. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కింద 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేరిందామె. కెరీర్లో త్వరగా సెటిల్ అయ్యి.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని ఆమె కల. ఈ ఏడాది డిసెంబర్లో జాహ్నవి డిగ్రీ పూర్తి కావాల్సి ఉంది. పాపం ఈలోపే ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి..ప్రమాద సమయంలో సమాచారం అందుకున్న ఓ అధికారి.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు చులకనగా మాట్లాడిన మాటల్ని తాజాగా అక్కడి పోలీస్ శాఖనే బయటపెట్టింది. దీంతో భారతీయులు భగ్గుమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఇప్పుడు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నార్త్ఈస్ట్రన్ (Northeastern University) ఛాన్సలర్ ‘‘ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో మా క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ సమయంలో వారికి మేం అండగా ఉంటాం. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని మేం ఆశిస్తున్నాం. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని మేం నిర్ణయించాం. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తాం’’ అని తెలిపారు. -
జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు వైరల్
సియాటెల్: అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై వెటకారం, వెకిలి వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారి తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఘటనపై పైఅధికారి సమాచారం కోరితే.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు నవ్వుతూ మాట్లాడాడు సదరు అధికారి. ఆ క్లిప్‌ను సియాటెల్ పోలీసులే విడుదల చేయగా.. అది వైరల్ కావడంతో అధికారి చర్యలు తీసుకోవాలని అక్కడి భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ.. భారతీయులకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. జాహ్నవి యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అయితే.. సోలన్ ఆ కాల్‌కు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. సోమవారం అధికారులు ఈ వీడియో రిలీజ్ చేసి.. విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీళ్ల మాటలు వింటుంటే గుండె పగిలిపోతోందంటూ పోస్ట్ చేసింది. సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించాల్సి ఉందని, ఇలాంటి వాటిని సహించేదే లేదని తేల్చి చెప్పింది. కేవలం తాము కచ్చితంగా విచారణ చేపడుతున్నామని ప్రజలకు తెలియజేసేందుకే ఈ వీడియో విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని, అప్పటి వరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులోలో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై జాహ్నావి దగ్గరి బంధువు అశోక్(హౌస్టన్) స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ల కూతుళ్లు, మనవరాళ్ల జీవితాలకు మాత్రమే విలువ ఉంటుందా? ప్రాణం ఏదైనా ప్రాణమే కదా అని అసహనం వ్యక్తం చేశారాయన. జాహ్నవి ఈ డిసెంబర్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ తీసుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇదిలా ఉంటే జాహ్నవి ఘటనపై కింగ్ కౌంటీ అటార్నీ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది. -
డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) తొలి ఎడిషన్‌లో భాగంగా సీటెల్ ఓర్కాస్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో సీటెల్ ఓర్కాస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీటెల్ ఆర్కాస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(50 బంతుల్లో 88 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్ కింగ్స్ సీటెల్ ఆర్కాస్ బౌలర్ల దాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌లో డేనియల్ సామ్స్ 26 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కోడి చెట్టి, డెవాన్ కాన్వేలు తలా 24 పరుగులు చేశారు. సీటెల్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు తీయగా.. ఇమాద్ వసీమ్ రెండు, గానన్, హర్మీత్ సింగ్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 127 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీటెల్ ఓర్కాస్ 15 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నుమాన్ అన్వర్ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికి స్నేహన్ జయసూరియా(34 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి డికాక్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎలిమినేటర్‌లో వాషింగ్టన్‌ను చిత్తు చేసిన ముంబై న్యూయార్క్ కాగా ముంబై న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్ 16 పరుగులతో విజయం సాధించి చాలెంజర్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిది. అనంతరం బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. శనివారం తెల్లవారుజామున చాలెంజర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చాలెంజర్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ జట్టుతో టైటిల్ పోరులో తలపడనుంది. A TRUE QDK masterclass! @MLCSeattleOrcas clinch their spot in the inaugural #MajorLeagueCricket Championship Final! 💚 🐳 🏏 pic.twitter.com/3v71g4bn52 — Major League Cricket (@MLCricket) July 28, 2023 QDK GOES BIG WITH TWO SIXES! Quinton De Kock sends TWO SIXES over the LEG 🦵side boundaries to RAISE🖐️ his FIFTY and MORE! 7⃣9⃣/1⃣ (10.3) pic.twitter.com/hEjU1GIweU — Major League Cricket (@MLCricket) July 28, 2023 చదవండి: బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
కులవివక్షను నిషేధించిన సియాటిల్
వాషింగ్టన్: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడారు. కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు. ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. పలు సంస్థల వ్యతిరేకత! సియాటిల్ కౌన్సిల్ నిర్ణయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్ఏఎఫ్ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్ కల్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్య సియాటిల్‌లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్–పూలే నెట్వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్ అండ్ బహుజన్స్కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. -
విషాదం.. అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి..
ఆదోని అర్బన్ (కర్నూలు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలను విద్యార్థిని తాత సూర్యబాబు, మామ శ్రీనివాసులు బుధవారం తెలియజేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంబళ్లూరు క్యాంప్‌నకు చెందిన శ్రీకాంత్, విజయలక్షి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీకాంత్ కానిస్టేబుల్ కాగా, విజయలక్షి ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం శ్రీకాంత్ దంపతులు ఆదోని వచ్చి స్థిర పడ్డారు. పెద్ద కుమార్తె జాహ్నవి (23) ఆదోనిలో డిగ్రీ వరకు చదివింది. ఆమె 2021లో అమెరికాలోని సీయాటిల్ నగరంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరింది. మరో నాలుగు నెలల్లో జాహ్నవి ఎంఎస్ కోర్సు పూర్తికానుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం రాత్రి సియాటిల్‌లో కాలేజీ నుంచి రూమ్‌కు వస్తూ రోడ్డును దాటుతుండగా సీయాటిల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. వాహనం కింద చిక్కుకున్న జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన తల్లి విజయలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతుందని ఆశించిన కుమార్తె అకాలమరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. జాహ్నవి మృతదేహాన్ని మరో మూడు రోజుల్లో స్వదేశానికి తీసుకువస్తారని తెలిసింది. -
Seattle Film Critics Society: ఆర్ఆర్ఆర్ ఫైట్స్‌కి అవార్డ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో అవార్డు చేరింది. సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సొసైటీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలెవ్ స్టంట్స్ కో ఆర్డినేటర్లుగా చేయగా, ప్రేమ్ రక్షిత్, దినేశ్ కృష్ణన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్, ది నార్త్మేన్, టాప్ గప్: మ్యావరిక్’లతో పోటీపడి ‘ఆర్ఆర్ ఆర్’ అవార్డు దక్కించుకోవడం విశేషం. -
సియాటెల్ లో వైఎస్ఆర్ 73వ జయంతి వేడుకలు
-
సియాటెల్‌లో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు: స్పెషల్ ఫుడ్ డ్రైవ్
వాషింగ్టన్: జులై 8న మహానేత డా.వైయస్సార్ 73వ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైయస్సార్ అభిమానులు ఫుడ్ డ్రైవ్ సేవాకార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలనతో, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన చెరగని ముద్రవేసి ప్రజలగుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత డా. వైఎస్సార్ అని కొనియాడారు. ఈ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైఎస్సార్ అభిమానులు రెండు వేల డాలర్లతో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేవాకార్యక్రమాలలో పాల్గొని స్వయానా ఫుడ్ డ్రైవ్ డ్రాప్ బాక్సులు, ఫుడ్ డ్రైవ్ ప్యాకెట్లు తయారు చేసివాటిని ఆకలితో ఉన్నవారికి అందించి మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. మహానేత సువర్ణపాలన, గొప్ప నాయకత్వ లక్షణాలు, ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ పలువురు అభిమానులు వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. ఆయన గొప్పతనం తెలుసుకున్న స్థానిక అమెరికన్లు సైతం అబ్బురపోవడం విశేషం. అలాంటి నాయకులను పొందడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ మహానేత పేరుతో క్రమం తప్పకుండా తమ ప్రాంతాలలో ఫుడ్ డ్రైవ్‌లు, సేవా కార్యక్రామాలు ఏర్పాటు చేస్తున్న అభిమానులని అభినందించి కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ వేడుకలలో భాగంగా ఫుడ్ డ్రైవ్ & సేవాకార్యక్రమాలలో తమ సహాయసహకారాలు అందించిన విక్రమ్ రెడ్డి గార్లపాటి సువీన్ రెడ్డి గారికి, చెన్నా రెడ్డి మహీధర్ రెడ్డి రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు జేసి రెడ్డిమునీశ్వర్ రెడ్డి , దామోదర్ అన్నకు, రామ్ , లోకనాథ్ , శేఖర్ గుప్త, విన్నకోట, భాస్కర్ రావికంటి , Dr వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ - USA అండ్ ఆళ్ళ రామిరెడ్డితోపాటు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయసహకారాలు అందించిన అందరికీ వైఎస్సార్ అభిమాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు -
సియాటెల్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
సియాటెల్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డెబ్భై మూడవ జన్మదిన వేడుకలు సియాటెల్ నగరంలో వైఎస్సార్సీపీ యూఎస్ఏ సియాటెల్ అండ్ పోర్ట్లాండ్ రీజియన్ టీం , దుష్యంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ అభిమానులు, సీఎం జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ యూఎస్ఏ(సీటెల్ అండ్ పోర్ట్లాండ్) టీం మునీశ్వర్‌రెడ్డి, ప్రకాష్ కొండూరు, అనిల్‌రెడ్డి, పృథ్వీరాజ్, సువీన్రెడ్డి, జయంద్రారెడ్డి, అజయ్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, చంద్రసేన, సునీల్ బలభద్ర, కృష్ణారెడ్డి, బాలరెడ్డి, మధురెడ్డి, శివ వెదురుపర్తి, సుమన్‌రెడ్డి, ప్రణీత్ మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి వైఎస్సార్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దుష్యంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తన పరిపాలనలో ప్రవేశపెట్టిన పథకాలైన వైఎస్సార్ జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలతో ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని, ఆ మహానేత ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని స్మరించుకున్నారు. ప్రకాశ్ కొండూరు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌తో తనకున్న మొదటి పరిచయాన్ని నెమరువేసుకున్నారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు!
అమెరికాలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించారు నార్త్ వెస్ట్ అమెరికా సియాటెల్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన వంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి,సువీన్ రెడ్డి, చెన్నా రెడ్డి, మహీధర్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు,జేసి రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, దామోదర్, రామ్, లోకనాథ్, శేఖర్ గుప్త విన్నకోట, భాస్కర్ రావికంటి, ఆళ్ళ రామిరెడ్డిలు పాల్గొన్నారు. -
సియాటిల్‌లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: సియాటిల్‌లో ఇటీవల ప్రవాస భారతీయుల వర్చువల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వాషింగ్టన్ గవర్నర్ జే రాబర్డ్ ఇన్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజీ విశ్వ ప్రసాద్, వారి సతీమణి వందన ప్రసాద్ నిర్వహించిన ఈ వర్చువల్ ఫండ్ రైజర్‌లో ప్రవాస భారతీయులతో గవర్నర్ సమావేశమయ్యారు. వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతోపాటు రాష్ట్రానికి సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ ఇన్సీ పాత్ర ప్రత్యేకమైనదని ప్రవాస భారతీయులు ప్రశంసించారు. దేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా గవర్నర్‌ను ప్రశంసించారు. ఈ సమావేశంలో భారత పార్లమెంట్ ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370ను గవర్నర్ ఇన్సీ చర్చలోకి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే తమ పరిధిలో ఉన్న కమ్యూనిటీకి సేవలందించడంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలున్నాయని, మన అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. అదే విధంగా 2021 సంవత్సరంలో 75 వసంతాల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సియాటెల్‌లో భారీగా నిర్వహించబోతున్నట్లు టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 20 వేల మందితో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 2021 ఆగష్టు నాటికి కోవిడ్ పరిస్థితి తగ్గిపోతుందని, ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించవచ్చని ఆయన ఆశించారు. 2012లో విశ్వప్రసాద్ అప్పటి గవర్నర్ క్రస్టిన్ గ్రెగోయర్ వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి సమన్వయపరిచారని, అలాగే 2021లో భారత దేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని విశ్వ ప్రసాద్ గవర్నర్ ఇన్‌స్టీని కోరారు. గవర్నర్ ఈ విషయంపై స్పందించి తమ సానుకూలతతను తెలిపారు. -
నేను ఉండలేను
సియాటెల్ పోలిస్ చీఫ్ కార్మెన్ది పెద్ద వయసేమీ కాదు. కనీసం రిటైర్ అయ్యే వయసు కూడా కాదు. యూఎస్ పోలిస్ డిపార్ట్మెంట్లో 63 ఏళ్ల వరకు, ఫిట్‌గా ఉంటే ఆ పైన కూడా ఉద్యోగంలో వుండొచ్చు. కార్మెన్ వయసు 55. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ ఉండగానే ఆమె తన రిటైర్మెంట్కు బుధవారం నాడు నోటీసు ఇచ్చేశారు. పేరు, పొజిషన్ ఉన్న పోలిస్ ఆఫీసర్ రాజీనామా (హుందాగా ఆమె ‘రిటైర్మెంట్’ అని ఆ లేఖలో రాశారు) చేశారంటే తగిన కారణమే ఉంటుంది. సిటీ కౌన్సిల్ వాళ్లు ఈ ఏడాది కేటాయించిన 409 మిలియన్ డాలర్ల సియాటెల్ పోలిస్ శాఖ బడ్జెట్లో ఆకస్మాత్తుగా 3.5 మిలియన్ డాలర్ల కోత విధించారు! అది ఆమెకు ఆగ్రహం కలిగించింది. తగ్గించింది పెద్ద మొత్తంగా కనిపించక పోయినా, అసలు ‘తగ్గించడం’ అనేదే డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం లాంటిదని, అంటే.. అదొక నేరం వంటిదని కార్మెన్ తన రాజీనామా పత్రంతో నిరసన వ్యక్తం చేశారు. ‘వాళ్లు తగ్గించింది బడ్జెట్‌ను కాదు. పోలిస్ డిపార్ట్మెంట్ కాన్ఫిడెన్స్‌ని’ అంటున్నారు కార్మెన్. ఇప్పుడామె చేత తన ‘పదవీ విరమణ రాజీనామా’ నోటీసును వెనక్కు తీయించడానికి పైస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మే 25న జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసుల ప్రవర్తనా నియమావళి కఠినతరం అయింది. పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలూ తగ్గిపోయాయి. -
సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం
వాషింగ్టన్/లండన్: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్, రేషార్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్‌లో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్ డౌన్‌టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్‌పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్డీ చేశానని ఆమె తెలిపారు. 2006లో సోషలిస్ట్ ఆల్టర్నేటివ్‌లో చేరి 2013లో సిటీ కౌన్సిల్ ఉమెన్‌గా ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో జాతివివక్షపై కమిషన్.. బ్రిటన్‌లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. జార్జి ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్లో ‘ఆల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు