self
-
గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు) A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది. కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. -
కర్రసాము.. మార్షల్ ఆర్ట్స్.. ఇప్పుడు 'హర్ ఘర్ దుర్గ'!
కోల్‌కతాలో అభయ... హైదరాబాద్‌లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పిస్తోంది.కర్రసాము... మార్షల్ ఆర్ట్స్స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్‌గూడ, ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్‌ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.అబ్బాయిలకు కూడా!‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
దుర్గాపూజ లిస్ట్.. చిన్న కత్తి పెప్పర్ స్ప్రే!
కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ‘మహిళల భద్రత’ అంశాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శ్రేయసి బిస్వాస్ అనే ఇన్ఫ్లూయెన్సర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘రాబోయే దుర్గా పూజ కోసం మీ షాపింగ్ లిస్ట్‌లో ఉండాల్సిన ఐటమ్స్’ అనేది వీడియో సారాంశం. ఇన్ఫ్లూయెన్సర్స్ శ్రేయసి ‘దుర్గా పూజా జాబితా’లో పండగకు అవసరమైన వస్తువులతో పాటు చిన్న కత్తి, పెప్పర్ స్ప్రే, అలారమ్ కీచైన్... లాంటివి జత చేసింది. ‘పెప్పర్‌స్ప్రే, అలారమ్ కీచైన్ల మీద వీడియో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కోల్‌కతా దుర్ఘటన నేపథ్యంలో తప్పకుండా చేయాలనిపించింది. మహిళల భద్రత ప్రమాదంలో పడింది. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో మహిళలు తమ భద్రత గురించి తామే జాగ్రత్త పడాలి. బ్యాగులో సెల్ప్–డిఫెన్స్ టూల్స్ తప్పనిసరిగా ఉండాలి’ అంటుంది శ్రేయసి బిస్వాస్. సెల్ఫ్–డిఫెన్స్ టూల్స్‌ను ప్రేక్షకులకు చూపుతూ వాటి వల్ల ఉపయోగం ఏమిటో చెప్పింది శ్రేయసి. ‘ఈ సెల్ఫ్–డిఫెన్స్ ్రపాడక్ట్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. జస్ట్ సెర్చ్ చేయండి చాలు’ అని సలహా కూడా ఇచ్చింది. ఈ వీడియో 7.6 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘కోల్‌కతా దుర్ఘటన తరువాత కొత్త వాళ్లు ఎవరైనా మిల్లీ సెకన్ నా వైపు చూసినా చాలా భయంగా ఉంది’ అని ఒక యూజర్ రాసింది. ‘మా పరిస్థితి కూడా అదే’ అన్నారు చాలామంది. ‘భయపడితే ఎలా! మహిళలలో దుర్గాదేవి అంశ ఉంది. దుర్మార్గుల అంతు చూసే అపార శక్తి ఉంది’ అని ఒక యూజర్ రాశారు. -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!
స్మార్ట్‌ఫోన్ యుగం వచ్చాక ఎక్కడికైన వెళ్లినా..ఏదైన వింత చోటు కనిపించినా.. వెంటనే ఫోన్‌కి పనిచెప్పేస్తారు. సెల్ఫీలు దిగేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం చేస్తోంది నేటి యువత. ఒకప్పటిలా కెమెరామెన్తో ఫోటోలు తీయించుకునే పనే లేదు. నచ్చిన యాంగిల్స్‌లో మనకు మనమే ఫోటోలు తీసేసుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీలు మోజు నేటిది మాత్రం కాదు. వందేళ్ల ఏళ్ల క్రితమే దీనికి క్రేజ్ ఉంది. పైగా నాటి కాలంలోనే వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు కూడా. ప్రపంచంలోనే తొలి సెల్ఫీని అక్టోబర్ 1839లో రాబర్ట్ కార్నెలియస్ తీశారు. ఆయన డాగ్యురోటైప్ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఇది అయోడిన్-సెన్సిటైజ్డ్ సిల్వర్ ప్లేట్, పాదరసం ఆవిరిని ఉపయోగించే ప్రారంభ ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ. ఆయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తన ఇంటి పెరట్లో తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగేందుకు దాదాపు మూడు నుంచి 15 నిమిషాల వ్యవధి తీసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ ఫోటో వెనుక సవివరంగా వివరించాడు కూడా. ఈ ఫోటోనే 1839లో తీసిన సెల్ఫీ లైట్ పిక్చర్‌గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. అయితే మన ఇండియాలో తొలి సెల్ఫీ దిగింది రాజకుటుంబానికి చెందిన ఓ జంట. రాచరికపాలన సాగే త్రిపుర రాష్ట్రంలో సెల్ఫీ ఫోటోగ్రాఫ్ 1880లో దిగడం జరిగింది. మహారాజా బీర్ చంద్ర మాణిక్య అతని భార్య మహారాణి ఖుమాన్ చాను మన్మోహినీ దేవి ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాజు మంచి ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు. అతను అనేక ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. అంతేగాదు ఆయన చనిపోయేంత వరకు ఫోటోగ్రాఫిక్ సోసైటీలో సభ్యుడు కూడా.రాజు కారణంగా ఆ కళపై మహారాణి కూడా మక్కువ పెంచుకుంది. అలా ఆమె కూడా ఫోటోగ్రాఫర్‌గా మారడం జరిగింది. చెప్పాలంటే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ కళలో ప్రావీణ్యం పొందిన తొలి భారతీయ మహిళ ఆమెనే కావడం విశేషం. కాగా, త్రిపుర మహారాజు తీసుకున్న సెల్ఫీలో మహారాణితో కౌగిలించుకుని దిగినట్లుగా ఫోటో కనిపిస్తుంది. అంతేగాదు ఈ ఫోటోనే భారతదేశంలోని తొలి సెల్ఫీగా నిలిచింది కూడా.(చదవండి: దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!) -
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్ కేన్సర్‌ని జయించాడు!
కేన్సర్ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్ రిచర్డ్ స్కోలియర్ బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్ ..తన స్నేహితుడు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్ ట్రయల్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్ లాంగ్ అన్నారు. (చదవండి: 'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?) -
తానే వాదిస్తాడనుకుంటే.. వెనక్కి తీసుకున్నాడు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించాలని అనుకున్నారు. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. అయితే.. సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు అంగీకరించగా.. ఆయన వేసిన పిటిషన్‌ను ఆగమేఘాల మీద శుక్రవారం వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ నిన్న రాత్రే ఆయన అత్యవసర విచారణ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అయితే ఆ టైంలో కోర్టు దానిని స్వీకరించలేదు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే సీజేఐ ధర్మాసనం విచారణకు అంగీకరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవస విచారణ చేపట్టాలని కోరారు ఆయన తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. దీంతో ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్‌కు పంపించారు. అక్కడా అత్యవసర విచారణ జరపాలని లాయర్ సింఘ్వీ కోరగా.. రెగ్యులర్ కేసుల విచారణ తర్వాత స్పెషల్ బెంచ్ ఈ కేసును విచారిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అయితే.. రౌస్ ఎవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఈ అత్యవసర పిటీషన్ ఉపసంహరించుకున్నారాయన. అలా వీలుందా? మైలార్డ్.. యువర్ ఆనర్ అంటూ ఊగిపోతూ సినిమాల్లో సొంతంగా వాదించుకోవడం సినిమాల్లోనే మనం చూస్తున్నాం. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. లా చదవని ఆయన కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారనే అనుమానాలు కలగడం సహజం. అయితే.. పార్టీ ఇన్ పర్సన్(Party In Person)గా కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ ఇన్ పర్సన్‌గా.. ఒక కేసులో సొంతంగా వాదించుకునేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. పార్టీ ఇన్ పర్సన్‌గా ఉండాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజు.. ఇలా కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. ఒక అప్లికేషన్ సమర్పిస్తే.. మీకు ఆ అర్హత ఉందని భావిస్తే దానికి కోర్టు అనుమతిస్తుంది. అయితే అవగాహన లేకున్నా సాధారణంగా అడ్వకేట్ల మీద నమ్మకం లేకనో, లేకుంటే అడ్వకేట్ల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దరఖాస్తులు సమర్పించి కోర్టు అనుమతులతో వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో.. చట్టాల గురించి తెలిసి ఉండి.. తమ కేసును తామే వాదించుకోగలమన్న నమ్మకం ఉన్నప్పుడు పార్టీ ఇన్ పర్సన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కేజ్రీవాల్ ఇప్పుడు అలానే దరఖాస్తు చేసుకుని.. ఆ అనుమతితో వాదించాలనుకున్నారు. కానీ, చివరకు పిటిషణ్ ఉపసంహరణతో అది జరగలేదు. ఇదీ చదవండి: కేజ్రీవాల్ సీఎంగా కొనసాగొచ్చా?.. రాజ్యాంగం, చట్టం ఏం చెబుతోందంటే.. -
స్వభావం
‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం. ‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం. ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది. తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు. స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం. సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి. మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు. ‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో తెలుసా!
ఓ సూఫీ జ్ఞాని చెప్తున్నారు...మనిషి ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది. అది చివరకు భగవంతుడినే చేరుతుంది. అది అంతిమంగా భగవంతుడిని ఎప్పుడు చేరుతుందో అప్పుడే దాని ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే అదొక వలయం. అనేక పుట్టుకలు, అనేక మార్గాలు ఇలా ఎలాగైనా అనుకోవచ్చు. చెప్పాలంటే జీవితంలో ఏదో ఒక అన్వేషణ అంటూ ఉంటూనే ఉంటుంది. మనసు ఏదో ఒకటి కోరుతూ ఆ దిశలో పయనిస్తుంది. కానీ అది ఏది కోరుకుంటుందోఎక్కడ తృప్తి చెందుతుందో స్పష్టత ఉండదు. దీనినే ఆ జ్ఞాని ఆత్మాన్వేషణ ప్రయాణం అని చెప్పారు. ఇదంతా వింటున్న ఓ శిష్యుడికి ఓ సందేహం కలిగింది. ‘‘గురువుగారూ, ఆత్మ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుందన్నారు కదా... అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరుకోవడమే అవుతుందిగా’’ అని అడిగాడు. ‘‘అవును... అందులో సందేహమేముంది? కాస్తంత ముందు వెనుకలు అంతే..అంతకన్నా మరొకటి కాదు... అందరూ చివరికి భగవంతుడిని చేరుకోవలసిందే’’ అన్నారు జ్ఞాని. ‘‘మరి మత పెద్దలు కొందరు మాత్రమే భగవంతుడిని చేరుకుంటున్నారని చెప్పారుగా?’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు జ్ఞాని ‘‘నువ్వో పని చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి, వీలున్నంతమందిని కలిసి వారి కోరికేమిటో తెలుసుకుని రా’’ అని సూచించారు. సరేనని శిష్యుడు కొన్ని కాగితాలు, కలం తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు.అనేకమందిని కలిశాడు. వారు ఏం కావాలనుకుంటున్నారో, వారి లక్ష్యమేమిటో అడిగాడు. వారి మనసు ఏది పొందితే తృప్తి పడుతుందో చెప్పమన్నాడు. వారు చెప్పినవన్నీ రాసుకున్నాడు. జ్ఞాని వద్దకు వచ్చాడు. ‘‘అయ్యా, ఊళ్ళో రాజు మొదలుకుని కూలీవరకూ ఎందరినో కలిసాను. వారు చెప్పినదంతా చదువుతాను వినండి’’ అంటూ మొదలుపెట్టాడు... ‘‘రాజేమో మరిన్ని దేశాలను గెలవాలనుకున్నాడు. యువరాజేమో తెలివైన యువరాణిని పెళ్ళాడాలనుకున్నాడు... ధనవంతుడేమో మరింత డబ్బు గడించాలనుకుంటున్నాడు... ఇలా ఒక్కొక్కరూ ఆశ పడుతున్నారు...’’ చెప్తుండగానే జ్ఞాని చదవడం ఆపమన్నారు. ‘‘అదంతా పోనివ్వు... వారిలో ఎంతమంది భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మొదట చదువు’’ అన్నారు జ్ఞాని. ఒక్కరు కూడా లేరన్నాడు శిష్యుడు. ‘‘అంటే నువ్వు కూడా లేవా ఆ జాబితాలో?’’ అని అతనివంక నవ్వుతూ చూశారు జ్ఞాని. శిష్యుడు తల దించుకున్నాడు. – జగద్రేణు (చదవండి: మంగళకరం) -
మీకోసం మీరు ఆలోచించండి.. ఈ పదిహేను మీ కోసమే మరి! (ఫొటోలు)
-
ఇన్స్టాగ్రామ్ పరిచయమే కొంప ముంచింది! క్లాస్‌రూంలోనే బీటెక్ విద్యార్థిని
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రేమ ఆ విద్యార్థిని పాలిట యమపాశమైంది. నయవంచకుడి మాటలకు మోసపోయిన ఆమె గర్భం ధరించింది. తర్వాత ప్రేమికుడు ముఖం చాటేశాడు. పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాననే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడింది. హాస్టల్ గదిలోనే స్వీయ గర్భస్రావానికి ఒడిగట్టి అపస్మారక స్థితికి చేరుకోగా.. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కక చివరకు ప్రాణాలొదిలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మధు దంపతుల ఏకైక కుమార్తె కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అధిక రక్తస్రావం కావడంతో.. కాగా, ఈ నెల 7, 8 తేదీల్లో ఆ విద్యార్థిని తరగతులకు హాజరుకాకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. అదేమని అడిగితే ఆరోగ్యం బాగాలేదని సహచర విద్యార్థినులకు చెప్పింది. 8వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో అదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థిని భోజనం తీసుకు వెళ్లగా.. ఆమె తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉంది. గది నిండా రక్తం ఉండటం, డస్ట్‌బిన్‌లో పిండం పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థిని కేకలు వేయడంతో మరికొందరు గదిలోకి వెళ్లారు. వెంటనే అధ్యాపకులకు తెలియజేయడంతో వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. స్వీయ గర్భస్రావానికి ప్రయతి్నంచిన విద్యార్థిని అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. సీఐ పి.శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఎస్ఐ కోటిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలికి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ శశికుమార్‌తో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం శశికుమార్‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాగా.. అది కాస్తా ప్రేమకు దారితీసిందని తెలిసింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు ఆమె గర్భం దాల్చిందని సమాచారం. పరువు పోతుందన్న భయంతోనే ఆ విద్యార్థిని స్వీయ గర్భస్రావానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని వైద్యులు, పోలీస్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని గర్భవతి అయిన విషయంలో ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. మరో ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నట్టు సమాచారం. లేకలేక పుట్టిన సంతానం మృతురాలి తల్లి పోలియో బాధితురాలు కాగా.. తండ్రి వ్యవసాయ కూలీ. పెళ్లయిన పదేళ్ల తర్వాత పుట్టిన ఏకైక గారాలపట్టి కావడంతో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఆ విద్యార్థిని చదువుల్లో రాణిస్తోంది. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడుతుందని భావిస్తున్న తమ కలల్ని కల్లలుగా మార్చి ఒక్కగానొక్క కుమార్తె తమకు గర్భశోకం మిగిల్చిందని తల్లిదండ్రులు బావురుమంటున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. నా భార్యతోనే చనువుగా ఉంటావా అంటూ.. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఇంటికి వచ్చిందని.. బంధుమిత్రులతో సందడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. చివరకు ఆమె విగతజీవిగా గ్రామానికి రావడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ప్రేమ పేరుతో యువతిని వంచించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. -
నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్
అమెరికన్ టెక్నాలజీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ త్వరలోనే పూర్తిస్థాయి సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తేనుంది. విద్యుత్తుతో పనిచేసే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను ‘మోనార్క్ ట్రాక్టర్’ పేరుతో రూపొందిస్తోంది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ ట్రాక్టర్ పూర్తిగా విద్యుత్ వాహనం. దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి పది గంటలు పడుతుంది. దీని మోటార్ 70 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎంతటి పొలాన్నయినా ఇది సునాయాసంగా దున్నేస్తుంది. అంతేకాదు, దీనికి హార్వెస్టర్స్, సెపరేటర్స్ వంటి గాడ్జెట్స్‌ను కూడా అమర్చుకోవచ్చు. వాటితో పంట కోతలు, కలుపు ఏరివేత పనులు కూడా ఈ ట్రాక్టర్ తేలికగా చేయగలదు. ‘ఫాక్స్‌కాన్’ దీని ధరను ఇంకా ప్రకటించలేదు గాని, భారీగానే ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. -
ప్రపంచానికి ఇదొక శుభవార్త.. ఓజోన్ పొర స్వయం చికిత్స
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తద్వారా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స చేసుకుంటోంది. ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదికలో తెలిపింది. ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని పేర్కొన్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్ ప్రోటోకాల్ నిర్ధేశిస్తోంది. -
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్‌లోని యాక్సెస్ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్‌లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష
కటక్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష జరుపుకుంది. ఈ మేరకు వార్షిక నివేదిక–2021ను ఇటీవల విడుదల చేసింది. జవాబుదారీతనంతో ఉండటం, నిర్దేశిత లక్ష్యంతో పనిచేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఎదురైన సవాళ్లు, ప్రధాన తీర్పు, పేరుకుపోతున్న కేసుల తీరును వివరించింది. ఇందులో..హైకోర్టులో 40 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 400కుపైగానే ఉన్నట్లు తెలిపింది. కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటపై ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కరోనా సమయంలో కోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగించడం ప్రధాన సవాల్‌గా మారిందని పేర్కొంది. కోవిడ్ కారణంగా ఏడాదిలో 67.20 రోజులను జిల్లా కోర్టులు నష్టపోయాయని తెలిపింది. -
నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్!
తనను తానే పెళ్లాడి.. ఎంచక్కా సోలో హనీమూన్ ప్లాన్ చేసుకున్న గుజరాత్ యువతికి షాక్ తగిలింది. ఆమె వివాహాన్ని అడ్డుకుని తీరతామని బీజేపీ ప్రకటించింది. వడోదరా మాజీ డిప్యూటీ మేయర్ సునీతా శుక్లా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుంటానని(మోలోగమీ) ప్రకటించుకుంది. సాధారణ పెళ్లి లాగే అంతా పద్ధతి ప్రకారం వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్ని ఆర్భాటాలతో (ఒక్క వరుడు, బరాత్) తప్పా అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోవాలనుకుంది. అయితే.. క్షమా ప్రకటన మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. దేశంలో ఇదే తొలి సోలోగమీ వివాహమంటూ చర్చ కూడా నడుస్తోంది. చాలామంది వ్యతిరేకిస్తుంటే.. కొందరు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షమా ప్రకటనను సునీతా శుక్లా తీవ్రంగా ఖండించారు. క్షమా వివాహాన్ని అడ్డుకుని తీరతామని ప్రకటించారామె. ‘‘ఈ తరహా వివాహాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఆమె ఏ గుడిలో వివాహం చేసుకోవడానికి మేం అనుమతించం. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధం. ఇలాంటి వాళ్ల చేష్టలతో హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉంది. మతానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. ఏ చట్టమూ ఒప్పుకోదు’’ అని పేర్కొన్నారామె. Gujarat | I'm against the choice of venue, she'll not be allowed to marry herself in any temple. Such marriages are against Hinduism. This will reduce the population of Hindus. If anything goes against religion then no law will prevail: BJP leader Sunita Shukla (03.06) https://t.co/Jf0y13WOiE pic.twitter.com/3Cus9JMwsR — ANI (@ANI) June 4, 2022 ఇదిలా ఉంటే.. హరిహరేశ్వర్ ఆలయంలో తనను తాను వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం ఖరారు చేసుకుంది క్షమా బిందు. తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి.. -
అయ్యో ఎంత పని: బాత్ వీడియో వైరల్, యువతి ఆత్మహత్య
భోపాల్: గోప్య, వ్యక్తి గతమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న టీనేజర్లకు ఈ సైట్స్ వినియోగం ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో తెలిపే ఘటన ఇది. తెలిసో తెలియకో, సరదాకోసమో చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదికి తీసుకొస్తాయి. ఇలాంటి పొరపాటు పనే ఒక యువతి ప్రాణం తీసింది. తన కాబోయే భర్తకు తనకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను పంపాలనుకుంది. కానీ కాస్తా వికటించి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్, ఉజ్జయిని పరిధిలోని తోబ్రిఖేడా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. తోబ్రిఖేడాకు చెందిన యువతికి 15 రోజుల క్రితం ఇండోర్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సరదాగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఏమైందో తెలియదుగానీ స్నానం చేస్తున్న వీడియోను భర్తకు పంపాలనుకుంది. అనుకున్నట్టుగా వీడియోను తీసుకుంది. కానీ ఇక్కడే దారుణం జరిగిపోయింది. వాట్సాప్ ద్వారా తన కాబోయే భర్తకు పంపాల్సిన వీడియోను, పొరపాటున తన మరో ఫ్రెండ్‌కి పంపేసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి బదులుగా మిగిలిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. చివరికి ఈ విషయం బాధిత యువతి తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే మార్గం తోచక, పరువు పోతుందనే భయంతో ఆమె విషం తాగేసింది. వెంటనే ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది. దీంతో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తమ బిడ్డ శ్మశానానికి తరలి పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం
పటమటకు చెందిన వెంకట్‌కు 45 ఏళ్లు.. గత కొన్నేళ్లుగా సుగర్‌తో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన తీసుకోకుండా ఎవరో స్నేహితులు మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మి.. వేరే ఎవరికో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడాడు. అందులో స్టెరాయిడ్స్ ఉండటంతో సుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయి పరిస్థితి విషమంగా మారింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన వ్యక్తి ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్‌తో చికిత్స పొందాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్గా పనిచేస్తుందని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్ని, మరొకరు పాజిటివ్ రాగానే సొంతంగా వాడేస్తున్నారు. అలాంటి వారిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, అవసరం మేరకు మాత్రమే వాడాలి. అంతేకానీ ప్రివెంటివ్ పేరుతో మందులు విచ్చలవిడిగా వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోతాయని చెబుతున్నారు. అపోహలు.. సొంత వైద్యాలు.. మొదటి వేవ్ సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, మీజిల్స్–రూబెల్లా వ్యాక్సిన్, ఐవర్‌మెక్టిన్, హెచ్ఐవీ బాధితులకు వాడే లొపినావీర్ 50, రిటోనావీర్ 200 వంటి మందులను వైద్య రంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్ లేదు కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటిని వాడుతున్నారు. ఇక ఇటలీలో కరోనా రోగికి పోస్టుమార్టం చేశారని, రక్తనాళాల్లో బ్లాక్స్‌కు ఆస్పిరిన్ వాడితే సరిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్, ఎకోసై్పన్ మందులను వాడేస్తున్నారు. వాటితో పాటు వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు వాడే ఫాబి ఫ్లూ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇక విటిమిన్ సీ, డీ, జింక్, మందులను రెగ్యులర్‌గా వేసే వాళ్లు ఉన్నారు. ఒకరి ప్రిస్క్రిప్షన్.. మరొకరు.. కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను, తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకుని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మందులు వాడాల్సి ఉంది. అలా కాకుండా మధుమేహం ఉన్న వారు సైతం స్టెరాయిడ్స్ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుండా కొన్ని రకాల మందులతో డ్రగ్ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు. నష్టాలే ఎక్కువ.. యాంటీ వైరల్ డ్రగ్‌ను వైరస్ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్ వంటి యాంటిబయోటిక్ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూబుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాక యాంటిబయోటిక్స్ ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, జబ్బు చేసినప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.. ఇప్పటి వరకు కరోనాకు ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్యం చేస్తున్నారు. ఆ మార్గదర్శకాల్లో ఫాబి ప్లూ మందులేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కూడా తొలగించడం జరిగింది. కరోనా సోకిన తర్వాత లక్షణాలు ఆధారంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. శరీరంలో పారామీటర్స్ పెరిగినట్లు స్టెరాయిడ్ లాంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆస్పిరిన్, ఎకోస్పైన్ మందులు రక్తం పలచపడటానికి వాడతాం. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఉండటంతో ఎక్కువగా వాడుతున్నారు. అయితే బ్రెయిన్లో గాయాలు ఉన్న వారు. రక్తం గడ్డకట్టే గుణం కోల్పోయిన వ్యాధులు ఉన్న వారు ఈ మందులు వాడకూడదు. కరోనా నుంచి రక్షించేది టీకా మాత్రమే. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. – డాక్టర్ విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్ చదవండి: వ్యాక్సినేషన్లో అందరికీ ఆదర్శంగా ఏపీ పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి -
కరోనా :ఎవరి జాగ్రత్తలపై వారి శ్రద్ధ ఉండాలి
-
సెల్ఫ్ క్వారంటైన్లో సీనియర్ నటి
సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్‌నుంచి తిరిగి వచ్చిన ఆమె దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్‌గా ఉన్నట్టు తెలిపారు. మార్చి 15 ఉదయం బుడాపెస్ట్ నుండి తిరిగి వచ్చాను. మార్చి 30 వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో వుండాలని నిర్ణయించుకున్నానంటూ షబానా ట్విటర్లో ప్రకటించారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ ప్రయాణ వివరాలను గోప్యంగా ఉంచుతూ ప్రమాద తీవ్రతను పెంచుతున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా మహమ్మారికి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 2.5 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. I have returned from Budapest on 15th March morn and am practising self isolarion till 30th March — Azmi Shabana (@AzmiShabana) March 19, 2020 -
సన్నద్ధం
ఈ అమ్మాయిని చూడండి. ప్రెట్టీగా ఉంది కదా! కానీ పేరేమిటో తెలీదు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ‘పత్లీ చోక్రీ’ గాప్రశంసలు అందుకుంటోంది. çపత్లీ చోక్రీ అంటే ‘సన్నటి పిల్ల’ అని అర్థం. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ‘పత్లీ’గా లేదు. ఒకప్పుడు ఉండేది. అప్పుడు అందరూ తనపై ప్రశంసల పూలజల్లులు కురిపించారు. అయితే మరీ సన్నగా ఉండడం అనారోగ్యమే తప్ప అందంగా కాదని ఆమె గ్రహించింది. ఆ గ్రహింపును ఫేస్బుక్లో ఒక పోస్ట్‌గా పెట్టింది! సన్నబడాలని కోరుకునే టీనేజ్ ఆడపిల్లలకు పనికొచ్చే పోస్ట్ ఇది. అందుకే ఈ పోస్ట్‌కు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ప్రముఖ సోషల్‌సైట్ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇంతకీ ఈ ‘పత్లీ చోక్రీ’ రాసిన పోస్ట్‌లో ఏముంది?! టీనేజ్ గర్ల్స్‌ని ఈమె దేనికి సన్నద్ధం చేస్తోంది? ‘‘నాకప్పుడు పందొమ్మిదేళ్లు. టైఫాయిడ్ జ్వరంతో మూడు వారాలపాటు మంచం పట్టాను. ఒక్కసారిగా పదకొండు కిలోల బరువు తగ్గిపోయాను. జ్వరం నుంచి కోలుకుని కాలేజ్‌కి వెళ్తున్నాను. స్నేహితులంతా ఆశ్చర్యంగా చూశారు నన్ను. ‘ఏయ్! ఏం చేశావ్’ అని సంభ్రమంగా అడిగారు కొందరు. ‘చేయడానికి ఏముంది?’ ఆ ప్రశ్న అర్థం కాలేదు మొదట్లో. ‘ఎంత స్లిమ్‌గా ఉన్నావో తెలుసా, ఏ జిమ్కెళ్లావు’ అంటూ ప్రశంసలతో కూడిన ప్రశ్నలు. నిజమా! అంత బాగున్నానా... నాకూ విచిత్రంగానే అనిపించింది. ‘టైఫాయిడ్ జ్వరం వచ్చింది’ అని నేను మాట పూర్తి చేసే లోపు వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. ‘ఎంత అదృష్టమో నీది’ అని! జిమ్‌కెళ్లి వర్కవుట్లు చేసే పనిలేకుండా బరువు తగ్గినందుకు ఒకటే పొగడ్తలు. నాలో కూడా ఆసక్తి మొగ్గతొడిగింది. అప్పుడు నా బరువు 41 కిలోలు. ఇక ఏ మాత్రం బరువు పెరగకూడదనుకున్నాను. రోజూ వాంతి చేసుకోవడమే. నిజమే! భోజనం చేయడం, బాత్రూమ్లోకి వెళ్లి గొంతులో వేళ్లు పోనిచ్చి తిన్నది వాంతి చేసుకోవడం నా డైలీ రొటీన్. పత్లీ చోక్రీ (సన్నటి అమ్మాయి) అని ఎవరైనా అంటుంటే తల మీద నాకేదో కిరీటం పెట్టినట్లుండేది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. వందగ్రాములు కూడా బరువు పెరగకుండా మెయింటెయిన్ చేశాను ఆ రెండేళ్లలో. అప్పుడు తెలిసింది అదొక మానసిక సమస్య అని. బరువు పెరుగుతామనే భయంతో తిన్న అన్నాన్ని వాంతి చేసుకునే వ్యాధిని ‘బులీమియా’ అంటారని. అప్పుడు తొలిసారిగా నా ఆరోగ్యం గురించి బెంగ పట్టుకుంది. ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పాను. డాక్టర్‌కు చూపించారు నన్ను. అప్పటి నుంచి భోజనం చేసిన తరువాత నన్ను బాత్రూమ్లోకి వెళ్లనివ్వకుండా కాపు కాశారు ఇంట్లో వాళ్లంతా. నా వంతు ప్రయత్నంగా ఆహారం పరిమాణాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయాను. నేను కోల్పోయిన బరువును తిరిగి పొందాను. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా దేహాకృతిని ఉన్నదున్నట్లుగా స్వీకరించడం నేర్చుకున్నాను. సన్నదనం మీద నా వ్యామోహం ఇంకా కొనసాగి ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యేవో తలుచుకుంటే భయమేస్తోంది’’.. అని 22 ఏళ్ల ముంబయి అమ్మాయి ఫేస్బుక్లో తన అనుభవాన్ని స్నేహితులతో పంచుకుంది. కౌన్సెలింగ్ కూడా ఇస్తోంది ఇప్పుడామె ‘బాడీ ఇమేజ్’ కారణంగా మానసిక ఆందోళన పడుతూ, డిప్రెషన్‌కు లోనయ్యే వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. అమ్మాయిలకు ఆమె చేస్తున్న సూచన ఒక్కటే. ‘మనమేమీ సినిమాల్లో నటించడం లేదు, పత్రికల కవర్ పేజీకి పోజులివ్వడమూ లేదు. అలాంటప్పుడు దేహాకృతి నాజూకుగా ఉండాలనే కోరిక అర్థం లేనిది. బాడీ ఫిజిక్ కోసం గంటలు గంటలు సమయం కేటాయించాలంటే ఉద్యోగాలతో సాధ్యమయ్యే పని కాదు. స్థూలకాయంతో అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త పడితే చాలు. బొద్దుగా ఉంటే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’ అని చెప్తోంది. ఆమె సోషల్ మీడియాలో చెప్పిన మంచిమాటలను ప్రధాన స్రవంతి మీడియా అందిపుచ్చుకుంది. కానీ ఆమె పేరు మాత్రం పత్లీ చోక్రీగానే ఉండిపోయింది. నవ్వులో నీరసం.. ఓ లక్షణం టీనేజ్ అమ్మాయిల్లో పాతికశాతం మంది ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. కొంతమంది సరిగా తినకుండా ‘అనెరొక్సియా నెర్వోజా’ బారిన పడుతుంటే, మరికొందరు తిన్న తర్వాత పావు గంట లోపే (అది జీర్ణమై శక్తిగా ఒంటికి పట్టే అవకాశం ఇవ్వకుండా) వాంతి చేసుకుంటూ ‘బులీమియా’ బారిన పడుతున్నారు. పలకరిస్తే నీరసంగా నవ్వడం, ఎక్కువ మాట్లాడే ఓపిక లేక పొడి పొడిగా మాట్లాడి సరిపెట్టుకోవడం, ఎక్కువ సేపు ఒక పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి వీళ్లలో కనిపించే లక్షణాలు. అందం అనేది సన్నగా ఉండడంలో ఉండదని, ఆరోగ్యంగా ఉండడంలోనే ఉంటుందని తెలియచెప్పడానికి ఇప్పుడు డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా పత్లీ చోక్రీ కేసునే ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. – మంజీర -
గూడేల్లో ఎగిరిన నల్లజెండాలు
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామా ల్లో తుడుందెబ్బ నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ‘మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో నినాదాలు మారుమోగాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నల్ల జెండాలు ఎగురవేస్తూ ఆదివాసీలు నిరసనలు తెలిపారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గూడేలతోపాటు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అరెస్టుచేశారు. మా భూమి మాకివ్వండి నేరడిగొండ మండలంలోని వాగ్ధారిలో తమ 105 ఎకరాల భూమిని లంబాడాల పేరుపై పట్టా చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ముందుగా వాగ్ధారి గ్రామంలో కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి నుంచి ధస్నాపూర్ వరకు 500 మంది ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో వచ్చేంత వరకు అక్కడే బైఠాయించారు. మా భూమి మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్డీవో సూర్యనారాయణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలకు ఆదివాసీలు వినతి పత్రం అందించారు. ఉపాధ్యాయుల అడ్డగింత ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో లంబాడా మహిళా ఉపాధ్యాయులను బహిష్కరించాలని ఆదివాసీ విద్యార్థులు అడ్డుకున్నారు. తరగతులకు రానివ్వకుండా ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ మండలంలోని కుమురంభీం చౌరస్తాలో, అంకోలి గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల జెండాను ఎగురవేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నేతలు నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. గుడిహత్నూర్ మండల కేంద్రం, బీంపూర్ మండల కేంద్రం, బోథ్ మండంలోని పట్నపూర్‌లో నల్ల జెండాలు ఎగురవేశారు. ఉట్నూర్ మండలంలోని చిన్నసుద్దగూడ, పెద్దసుద్దగూడ, పర్కుగూడ, కల్లూరిగూడల్లో.. నార్నూర్ మండలంలోని మంకాపూర్, నాగల్కొండ, బలాన్పూర్, శేకుగూడతోపాటు దాదాపు జిల్లావ్యాప్తంగా అన్ని ఆదివాసీ గూడెల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. -
మా ఊళ్లో మా రాజ్యం
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్ : మావ నాటే.. మావ రాజ్ (మా ఊళ్లో మా రాజ్యం) అనే నినాదంతో ఆదివాసీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి గూడేల్లో స్వయం పాలనను ప్రకటించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో ముందుకు కదులుతున్నారు. స్వయంపాలనలో భాగంగా లంబాడా అధికారులను గూడేల్లోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషితో ఆదివాసీ పోరాట సమితి అధ్యక్షుడు సోయం బాపురావు ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు సచివాలయంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆదివాసీ నేతలు స్వయం పాలనకు పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్లో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉద్యమం సాగింది. గత డిసెంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణల తర్వాత ప్రభుత్వం ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించింది. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీ సింగ్‌తోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలో పర్యటించి ఆదివాసీలు, లంబాడాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా జనవరి 4న ఆదివాసీలు ప్రభుత్వానికి మెమొరాండం అందజేశారు. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్ 1 నుంచి స్వయంపాలనకు వెళ్తామని హెచ్చరించారు. డిసెంబర్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘర్షణలు సద్దుమణిగినప్పటికీ ఆదివాసీలు ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తూ వచ్చారు. తుడుందెబ్బ నాయకులు చెప్పినట్లు శుక్రవారం నుంచి ఆదివాసీ గూడేల్లో స్వయం పాలన ప్రారంభించాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం.. శైలేంద్రకుమార్ జోషితో చర్చల సందర్భంగా సమితి ప్రతినిధులు తమ డిమాండ్లను సీఎస్ ముందుంచారు. ఎస్టీ(షెడ్యూల్డ్ తెగలు) జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఆర్టికల్ 342 ప్రకారం 9 తెగలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చారని, కానీ 1976 తర్వాత వలస మార్గంలో వచ్చిన లంబాడీలు అక్రమంగా ఎస్టీల్లో చేరారన్నారు. ఎలాంటి కమిషన్ వేయకుండా వారిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. అలాగే ఏజెన్సీ ధ్రువీకరణ పొందిన వేలాది లంబాడా యువత ఆదివాసీల ఉద్యోగాలను తన్నుకుపోయినట్లు స్పష్టంచేశారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తేనే న్యాయం జరుగుతుందని సీఎస్‌కు ఏకరువు పెట్టారు. దీనిపై జోషి స్పందిస్తూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తానని సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అయితే ప్రధాన డిమాండ్‌పై స్పష్టత రాకపోవడంతో చర్చల ప్రసక్తే లేదంటూ సమితి ప్రతినిధులు సీఎస్ చాంబర్ నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. ఇక స్వయం పాలనే: సోయం బాపురావు ప్రభుత్వంతో చర్చల అనంతరం బాపురావు మీడియాతో మాట్లాడారు. చర్చలు సఫలీకృతం కానందున తమ కార్యచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలనకు పిలుపునిచ్చారు. మా ఊరు– మా రాజ్యం పేరుతో ముందుకెళ్తామన్నారు. రాష్ట్రానికి వలసలుగా వచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాలో దొడ్డిదారిన చేరిన లంబాడీలు ఆదివాసీల హక్కులను పూర్తిగా హరించారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాక ఉద్యమం ఆపేదిలేదన్నారు. జూన్ 2న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న లంబాడా అధికారుల విధులను అడ్డుకుంటామన్నారు. మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడీలు మధ్యప్రదేశ్‌లో ఓసీ కేటగిరీలో ఉన్నట్లు చెప్పారు. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీలుగా, రాజస్థాన్ ఓసీలుగా చలామణి అవుతున్నారని, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీలుగా ఉన్నట్లు వివరించారు. -
స్వయం ఉపాధితో పదిమందికీ ఉపాధి చూపండి
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో మరో పదిమందికి ఉపాధి చూపేవిధంగా ఎదగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. లీప్ సంస్థ ట్రైనీ మేనేజర్ డాక్టర్ పీవీ రామరాయలు ఆధ్వర్యంలో ‘ఇంక్యుబేషన్ సెంటర్’పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువును కాపాడినట్టుగానే.. విద్యార్థులు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ దోహదపడుతుందన్నారు. వ్యాపార, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు, అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి ఏవిధంగా పొందవచ్చననే విషయాలపై సంస్థ తోడ్పాటునందిస్తుందన్నారు. స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెడితే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ కేఎస్ రమేష్, డీన్ డాక్టర్ ఎస్.టేకి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌బాబు, డాక్టర్ మట్టారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.