SIB
-
నేను ఇల్లీగల్ పనులు చేయలేదు.. అమెరికా నుంచి ప్రభాకర్ లేఖ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇండియాకు మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు వచ్చేదెప్పుడు?
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే.. అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిందితులపై బెయిల్‌పై.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు. తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్ లపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిర్ణీత గడువు 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి మాండేటరీ బెయిల్ కోసం ఈ ఇద్దరు కోర్టును అభ్యర్థించారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి తతిప్పి పంపింది. అయితే.. ఎవిడెన్స్ మెటీరియల్‌గా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఆధారలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టును కోరారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఓనర్‌ను త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో సోదాలు చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు 5 మాక్ మినీ డివైజ్‌లు సిట్ సీజ్ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించినట్లు సిట్ వెల్లడించింది.. .. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. -
విదేశాల్లో ప్రభాకర్‌రావు, శ్రావణ్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజగుట్ట పోలీసులు మంగళవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే అరెస్టయిన పోలీసు అధికారులు దుగ్యాల ప్రణీత్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులతోపాటు పరారీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, శ్రావణ్ రావులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు. పరారీలో ఉన్న ఇద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో కుట్ర, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసు ఆపై ట్యాపింగ్ టర్న్ తీసుకుంది. దీంతో టెలిగ్రాఫ్ యాక్ట్, సైబర్ టెర్రరిజం చట్టాలను జోడించారు. నిందితుడిగా ఉన్న ప్రణీత్‌ను మార్చి 12న, భుజంగరావును తిరుపతన్నలను 23న, రాధాకిషన్‌రావును 28న అరెస్టు చేశారు. చట్ట ప్రకారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో అతడిపై అభియోగపత్రం దాఖలు చేయకుంటే న్యాయస్థానం అతడికి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మంగళవారం ఈ కేసులో సప్లిమెంటరీ చార్జ్ïÙట్ దాఖలు చేశారు. ట్యాపింగ్... వసూళ్లు ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సంబం«దీకులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా అక్రమ నిఘా ఉంచినట్లు వివరించారు. అలాగే, బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారని, అలా తెలుసుకున్న విషయాలతో వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు. మొత్తమ్మీద నిందితులు 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని, బాధితుల్లో హైకోర్టు న్యాయమూర్తి కాజా శరత్ కూడా ఉన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోపక్క డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు జరిగాయని నిందితుల తరఫు న్యాయవాది, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. -
డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్‌రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రణీత్ ప్రవర్తనపై ఫిర్యాదులు వరంగల్ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశారు. ఐపీఎస్ అధికారి రాజేష్ కుమార్ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్‌రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్‌రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్‌ను బీబీనగర్ ఎస్సైగా ప్రభాకర్‌రావు నియమించారు. 2016లో ప్రభాకర్‌రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్‌కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్‌రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్‌గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్ రావు వద్ద పని చేయాలని ప్రణీత్‌కు ప్రభాకర్‌రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్‌కు అందేవి. అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... ప్రభాకర్‌రావు చొరవతోనే ప్రణీత్‌కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌కు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. వాటిలోనే లాగర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ 17 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌తో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ల కథ నడిపారు. బీఆర్ఎస్లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడటమే ఎస్ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్‌రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రణీత్ వద్ద 8 ఫోన్లు ఎస్ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్‌లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్‌రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ టీమ్ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్ టీమ్ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు. బీఆర్ఎస్ ఓడిపోతోందని రావడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని గత నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్‌లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు సూచించారు. దీంతో ప్రణీత్ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్ సహకారంతో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్‌డిస్క్‌ల్ని ఆర్ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్లిస్క్ల్ని ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్ చేసి, పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్ చేసిన సెల్ఫోన్లు, పెన్డ్రైవ్స్ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మొదటిసారి స్పందించారు. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరిగాయి. తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.‘‘నేను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. నేను కూడా కేసీఆర్ బాధితుడినే. కారణం లేకుండానే నన్ను నల్లగొండ నుంచి బదిలీ చేశారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కేసీఆర్‌ది, నాది ఒకే కులం అయినందున నన్ను నిందిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నా.. చికిత్స పూర్తయ్యాక ఇండియాకు వస్తా’’ అని ప్రభాకర్ రావు తెలిపారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
ట్యాపింగ్ ద్వారానే ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ అధీనంలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీజేపీ అగ్రనేత బీఎల్.సంతోష్ సహా పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తేలింది. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిస్వామి ట్రాప్ కావడం, పట్టుబడటంలో అప్పట్లో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) పనిచేసిన పి.రాధాకిషన్‌రావుతోపాటు సైబరాబాద్‌కు చెందిన మరో అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సిట్ గుర్తించింది. రాధాకిషన్‌ను వారంరోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో గురువారం వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. ఈయన నుంచి కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించాల్సి ఉందని పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు. భారీ స్కెచ్...: 2022లో మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. మెయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో తిరుపతికి చెందిన సింహయాజిస్వామి, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నగరవ్యాపారి నందకుమార్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కారు. వీరు అప్పటి అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నట్టు మొయినాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. బీజేపీ ఎర వేసినట్టు ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు హర్షవర్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతరావు ఉన్నారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఎర అంశం వెలుగులోకి రావడంతో ఆయన ప్రభాకర్‌రావును అప్రమత్తం చేశారు. అప్పటి సర్కారుకు సమాచారం ఇచ్చిన ప్రభాకర్‌రావు టాస్క్‌ఫోర్స్‌కు ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్‌రావుతో కలిసి భారీ స్కెచ్ వేశారు. సైబరాబాద్ అధికారులతో కలిసి అమలు... వీరు వేసుకున్న పథకం ప్రకారం బీజేపీ తరఫున వస్తున్న సింహయాజిస్వామి, సతీష్ శర్మ, నందకుమార్‌లను ట్రాప్ చేయడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్ ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నందకుమార్ ఫోన్‌ను కూడా కొన్నాళ్లు ట్యాప్ చేయడం ద్వారా మరికొంత సమాచారం సేకరించారు. రాధాకిషన్‌రావు సహా మరికొందరు అధికారులు ట్రాప్ జరగడానికి ముందు రోజు (2022 అక్టోబర్ 25) ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అవసరమైన ప్రాంతాల్లో రహస్యంగా సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మైక్‌లు.. ఇలా మొత్తం 75 సాంకేతిక ఉపకరణాలు అమర్చారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్‌రావుతో పాటు సైబరాబాద్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి కీలకంగా వ్యవహరించినట్టు తేలింది. 2022 అక్టోబర్ 26 రాత్రి ఫామ్‌హౌస్ సమీపంలో వలపన్ని ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ ఎస్ఓటీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న ముగ్గురినీ పట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించినది అయినా.. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు రంగంలోకి దిగారని తెలుస్తోంది. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో... ఎమ్మెల్యేల ఎర కేసును తొలుత మొయినాబాద్ పోలీసులే దర్యాప్తు చేశారు. అయితే లోతైన దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. దీని దర్యాప్తు తుది దశకు చేరిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, తాము ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తి చేస్తోందంటూ హైకోర్టు ఆదేశాలను నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ అక్కడే పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా కేసులో భాగంగా నాటి ‘ఎర కేసు’లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఎస్ఐబీలో అనధికారికంగా, రహస్యంగా, చట్ట విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్‌లను అభివృద్ధి చేయడంలో రాధాకిషన్‌రావు కీలకపాత్ర పోషించారు. కొంతమంది వ్యక్తుల ఆదేశానుసారం వాటిని రాజకీయపార్టీకి అనుకూలంగా, పక్షపాత ధోరణిలో ఉపయోగించుకోవడంలో మరికొందరితో కలిసి పన్నిన కుట్రలో భాగస్వాముడయ్యారు. ఆ నేరాలకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారం సేకరించే కోణంలో దర్యాప్తు అధికారి, ఆయన బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది’అని పేర్కొన్నారు. -
నిందితుల చేతిలో ‘పోలీసుల’ భవిత!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా క్రిమినల్ కేసుల దర్యాప్తులో నిందితుల భవిష్యత్తు పోలీసుల చేతు ల్లో ఉంటుంది. ఎవరెవరిని నిందితులుగా చేర్చాలి? వారిపై ఏఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపాలి? అనేది కేసుల దర్యాప్తు ఆధారంగా వీళ్లే నిర్ణయిస్తారు. అయితే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొందరు పోలీసు ఉన్నతాధికారుల భవిత ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చేతిలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లు చెప్పే అంశాలపై డీజీ పీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు నోటీసులు ఇవ్వాలా? వద్దా? అనేది ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలావుండగా ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును ఈ నెల 10 వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసు కస్టడీ పూర్తయి, జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును అదనపు కస్టడీకి కోరుతూ పంజగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు దగ్గరే ఆగిన కేసు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితులుగా ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగింది. దర్యాప్తు అధికారులు కూడా ప్రస్తుతానికి ఇంతవరకే పరిమితం అవుతున్నారు. అయితే ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ.. ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. విదేశాలనుంచి ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అరెస్టు అయిన పోలీసులతో పాటు అరెస్టు కాబోయే వారు, విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు పట్టుబడిన తర్వాత.. ఉన్నతాధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని వారు చెప్తే వారికీ నోటీసులు ఇవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్ అదుపులో వేణుగోపాల్‌రావు పోలీసులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా బంజారాహిల్స్ ఠాణాకు వచ్చిన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ వేణుగోపాల్‌రావును బుధవారం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐబీలోని ఎస్ఓటీలో కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారుల్లో ఓఎస్డీ హోదాలో పని చేసిన ఈయన కూడా ఒకరు. అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఓఎస్డీగా పని చేశారు. ప్రత్యేక విభాగాలు కమిషనర్ల అదీనంలో టార్గెట్ చేసిన ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు తదితరులపై సాంకేతిక నిఘా ఉంచడం, వారి ఫోన్లు ట్యాప్ చేయడం ఎస్ఐబీ అ«దీనంలో ఎస్ఓటీ చేసింది. అయితే వారిని పట్టుకోవడం, నగదు స్వాదీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న ప్రత్యేక విభాగాలు చేశాయి. దీంతో ఇప్పటివరకు జరిగిన అక్రమ ఆపరేషన్లు ఆ విభాగాలకు నేతృత్వం వహించిన కమిషనర్లకు తెలియకుండానే జరిగాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయాలపై నిందితులు ఏదైనా చెబితే ఆయా ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించడం అనివార్యంగా మారుతుంది. దీనిపై ఓ రిటైర్డ్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆయా ఉన్నతాధికారులు కేసులో నిందితులు కాకపోయినా, వారి పర్యవేక్షణ లోపం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లు క్రిమినల్ చర్యలకు కాకపోయినా..డిపార్ట్మెంటల్ యాక్షన్‌కు అర్హులే’అని అన్నారు. -
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్‌లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్ కేసులు 5, హార్డ్‌డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్‌డిస్క్‌లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
అయిందేదో అయింది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ట్యాపింగ్ కేసులో తన చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో విదేశాల్లో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు రాయబారాలు మొదలు పెట్టారు. అయిందేదో అయింద ని.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కఠిన చర్యలు తీసుకో వద్దని కోరుతూ కొందరు ప్రతినిధులను ప్రభుత్వ పెద్దల వద్దకు పంపినట్టు తెలిసింది. కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ‘ముఖ్య’ నాయకుడు ఈ దశ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసి నట్టు సమాచారం. మరోవైపు తమ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను సిట్ అధికారులు ఆదివారం కూడా లోతుగా ప్రశ్నించారు. ఉన్నతాధికారి వద్ద భంగపడటంతో.. ఎస్ఐబీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాల ధ్వంసంపై అంతర్గత విచారణ గత ఏడాది డిసెంబర్లోనే మొదలైంది. దీనిపై ఆ విభాగంలోని తన మనుషుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్‌రావు.. ఓఎస్డీ పదవికి రాజీనామా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లిపోయారు. తర్వాత అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడం, ప్రణీత్‌రావు అరెస్టు తదితర పరిణామాలు జరిగాయి. పంజగుట్ట పోలీసులు గత నెల మూడో వారంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ఓ మీడియా అధినేతలపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్నవారి ఇళ్లలో సోదాలు చేసి పలు ఆధారాలు సేకరించారు. దీనితో ఇలాంటి చర్యలు వద్దంటూ అమెరికా నుంచే ప్రభాకర్‌రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. ఆయన సమాధానం విని కంగుతిని ఫోన్ కట్ చేశారు. రాధాకిషన్‌రావు అరెస్టుతో మారిన సీన్.. తర్వాత కొందరితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ప్రభాక ర్రావు మేకపోతు గాంభీ ర్యం ప్రద ర్శించారు. అక్రమ ట్యాపింగ్‌కు తానే ఎలా బాధ్యు డిని అవుతానని? తనపై ఉన్న అదనపు డీజీ, డీజీపీలకూ బాధ్యత ఉంటుందనే ధోరణిలో మాట్లాడారు. ఎస్ఐ బీ, ఇంటెలిజెన్స్‌ల్లో పనిచేసిన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతోపాటు మరో కీలక నిందితుడిగా ఉన్న హైదరా బాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్ రావునూ అరెస్టు చేశారు. దీనితో ప్రభాకర్‌రావు హడలిపో యారు. స్వదేశానికి తిరిగొచ్చాక తనకూ ఇది తప్పదని భావించి.. ప్రభుత్వ పెద్దలు, ‘ముఖ్య’ నాయకుడి వద్దకు రాయబారం ప్రారంభించారు. తమ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుల ద్వారా కొందరు మధ్యవర్తులను పంపారు. వారు ఇటీవల ప్రభుత్వ పెద్దలను, ‘ముఖ్య’ నాయ కుడిని కలిశారు. అప్పటి పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా ట్యాపింగ్, ఇతర చర్యలకు పాల్పడాల్సి వచ్చిందని, తదుపరి చర్యలు కఠినంగా లేకుండా చూడాలని ప్రభాకర్‌రావు కోరు తున్నట్టు వివరించారు. కానీ సదరు ‘ముఖ్య’ నాయకుడు తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ అంశంలో పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తు న్నారని.. స్వదేశానికి తిరిగొచ్చి, దర్యాప్తు అధికారుల ఎదుట పూర్తి వాస్తవాలు బయట పెట్టాల్సిందేనని పేర్కొ న్నట్టు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావుకు సమీప బంధువైన ఓ మహిళ.. సీనియర్ ఐపీ ఎస్‌లను, ఉన్నతాధికా రుల భార్యలను కలుస్తూ ప్రభాకర్‌రావు తరఫున రాయబారాన్ని ప్రయత్నించినట్టు అయితే అన్ని ప్రయ త్నాలూ బెడిసికొట్టడంతో ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి రావాలని ప్రభాకర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల పరిశీలన సిట్ అధికారులు తమ కస్టడీ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు ఆదివారం వివిధ కోణాల్లో ప్రశ్నించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్ టాప్‌లను విశ్లేషిస్తున్నారు. ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌ల లో వీరి కింద పనిచేసిన పలువురు అధికారులు, సిబ్బందిని సిట్ ప్రశ్నించి.. వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఎస్ఐబీ పోలీసులు తమ వాహ నాల్లో ఓ పార్టీకి సంబంధించిన నగదు రవాణా చేసినట్టు ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అదనపు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్‌కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబీ చీఫ్‌గా ఉండి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు.. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుకు సైతం14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు. వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివాదాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. యూఎస్ నుంచి ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది! -
HYD: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్ఐబీ కీలుబొమ్మగా మారింది. అధికారులు ఎస్ఐబి కంట్రోల్ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ డీఐజీ నేతృత్యంలో ఎస్ఐబీ నడిచింది. ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్లో ఎస్ఐబీ నడిచింది. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డిఎస్పీలు అక్కడే తిష్ట వేశారు. ప్రణీత రావు నేతృత్వంలో మాజీ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రణీతరావుకి పూర్తిగా ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు గుర్తించారు. ఎస్ఐబిలో మొత్తం 38 మంది సిబ్బందితో ప్రణీత్‌రావు లాగర్ రూమ్ నడిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురి నంబర్లను ట్రాప్ చేసిన మాజీలు.. రిటైర్డ్ అయిన అధికారులు ఓఎస్డీ పేరుతో ఎస్ఐబీలో చలామణి అయ్యారు. సర్వీస్‌లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డీలు అక్రమాలను సిట్ గుర్తించింది. ప్రణీత్ రావుకి సహకరించిన వారందరినీ విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర -
రీల్ కాదు.. ‘కాల్’ నాయక్!
సాక్షి, హైదరాబాద్: రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ‘నాయక్’ అనే సినిమాలో.. నాయక్ భాయ్‌గా మారిన కథానాయకుడు ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తుల్ని, రౌడీలను పిలిచి ఓ మీటింగ్ పెడతాడు. వారిని భయపెట్టి, దండించి వారు చేసిన నేరాలు, అలాగే వారు సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని పత్రా లపై సంతకాలు చేయించడం ద్వారా వారి స్థిర చరాస్తులు అనాథాశ్రమాలకు చెందేలా చేస్తాడు. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీల్ సీన్‌తో కొన్ని సారూప్యతలు ఉన్న రియల్ సీన్ ఒకటి గతంలో హైదరా బాద్ శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శివారు కమిషనరేట్ అప్పటి ఉన్నతాధికారి.. ఓ పార్టీకి విరాళాలు సేకరించి ఇచ్చేందుకు ఈ తరహా పద్ధతిని అనుసరించారు. నేను సైతం.. అనుకున్న ఈయన కూడా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నుంచి అందిన ఫోన్ ట్యాపింగ్ రికార్డుల్ని ఆధారంగా చేసుకున్నారు. పలువురు వ్యాపారు లను వేర్వేరుగా తమ ప్రాంతానికి పిలిపించారు. ఎవరి రికా ర్డులు వారికి వినిపించి ‘కప్పం’ కట్టేలా చేశారు. ఇందులో ఓ అధికారి నేతృత్వంలోని స్పెషల్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీనిపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం. టార్గెట్లు నిర్దేశించి మరీ.. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో ఓఎస్డీలుగా పని చేసిన టి.ప్రభా కర్రావు, పి.రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌లో వెలుగులోకి వచ్చి న అంశాల ఆధారంగా బెదిరింపు వసూళ్లకు, విరాళాల సేకరణకు తెగబడినట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. ఓపక్క వీరి వ్యవహారాలు ఇలా సాగుతుండగా.. శివారు ప్రాంత కమిషనరేట్ ఉన్నతాధికారి కూడా తన వంతుగా ఎంతోకొంత చేయాలని భావించారు. ప్రభాకర్‌రావు నుంచి తనకు అందిన ట్యాపింగ్ రికార్డులను విశ్లేషించి, అవతలి వ్యక్తులను సంప్రదించడానికి వీలుగా స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశా రు. వీరిలో ఫార్మా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన వాళ్లూ ఉన్నట్టు సమాచారం. కాగా స్పెషల్ టీమ్‌కు నేతృత్వం వహించిన అధికారి తన సిబ్బందితో ఆయా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు నిర్దేశించిన సమయాల్లో మీటింగ్‌కు వచ్చేలా ఒత్తిడి చేసేవారు. ఇలా వచ్చిన వారితో సమావేశమయ్యే శివారు ఉన్నతాధికారి ట్యా పింగ్ ఆడియోలను వినిపించే వారు. అందులోని సున్నిత, వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి వాళ్లు ఇవ్వాల్సిన మొత్తానికి సంబంధించి టార్గెట్లు ఇచ్చేవారు. వారు ఎప్పుడు? ఎలా? ఎవరికి? ఆయా మొత్తాలు చెల్లిస్తారో అప్పటికప్పుడే తెలుసు కునేవారు. ఇక వారి వెంటపడి వసూలు చేసే బాధ్యతల్ని స్పెషల్ టీమ్ ఇన్చార్జికి అప్పగించేవారు. కాగా ఇలా వసూ లైన మొత్తం ఓ పార్టీకి విరాళంగా అందినట్లు సమాచారం. తిరుపతన్నకు ‘ద్వితీయ శ్రేణి’ బాధ్యతలు నాటి ప్రతిపక్ష నేత, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్‌ను ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ప్రణీత్‌రావు టీమ్ చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేత లేదా ఆ స్థాయిలో ప్రాధాన్యం లేని, ద్వితీయ శ్రేణికి చెందిన వారి నంబర్లు ట్యాప్ చేసే బాధ్యతల్ని తిరుపతన్న తన బృందంతో కలిసి నిర్వర్తించినట్లు సిట్ చెప్తోంది. ఆ వ్యక్తుల్ని, వారి నంబర్లు గుర్తించే బాధ్యతల్ని టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.రాధాకిషన్‌రావు నిర్వర్తించారు. తన టీమ్ ద్వారా ఇతర మార్గాల్లో వివరాలను సేకరించే ఈయన, వాటిని తిరుపతన్నకు అందించేవారు. వీటిపై ప్రభాకర్‌రావుకు సమాచారం ఇచ్చే తిరుపతన్న ట్యాపింగ్ రికార్డులను కూడా ప్రభాకర్‌రావుకే అందించేవారని తెలిసింది. ప్రాథమిక విచారణలోనే ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు తిరుపతన్న నేరాంగీకార వాంగ్మూలంలోనూ దాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీమ్ గత ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి కాంగ్రెస్ నాయకుల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. దీనికోసం కొన్నాళ్లు బెంగళూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వచ్చినట్లు తెలిసింది. పరిచయస్తులకు ప్రభాకర్‌రావు ఫోన్లు! ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో తన ఒక్కడినే బాధ్యుణ్ణి ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం. ట్యాపింగ్ జరిగిన సమయంలో తాను రెగ్యులర్ అధికారిని కాదని, పద వీ విరమణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) మాత్రమే అని చెప్తున్నట్లు సమాచారం. తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగాధిపతు లుగా పని చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని, వారికి తెలిసే ఎస్ఐబీ కేంద్రంగా వ్యవహారా లు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుత్రరత్నం లీలలు.. ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి ఇతను తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా శివారు పోలీసులకు మన‘శ్శాంత్’ లేకుండా చేసినట్లు సమాచారం. నగరం వెలుపల ఇతను ఓ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకోగా.. అక్కడి నిర్మాణాలు, జనరేటర్‌తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల ‘సౌజన్యమే’ అని తెలుస్తోంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్ లైన్ నుంచి ఏదో ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి, తన కుమారుడు ఫోన్ చేస్తాడని చెప్పేవారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసే సుపుత్రుడు తన డిమాండ్ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి షాక్ ఇచ్చాడని తెలిసింది. ఈయనకు ఫోన్ చేసిన సుపుత్రుడు ఐదు జేసీబీలు, ఐదు టిప్పర్లు ఫామ్‌హౌస్ వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేశారని, దీంతో ఆ డీఎస్పీ ‘డబ్బు ఎవరు ఇస్తారు? ఎంత డిస్కౌంట్ కావాలి?’ అంటూ ప్రశ్నించడంతో ఫోన్ పెట్టేశారని సమాచారం. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక వ్యక్తుల పేర్లు
-
Phone tapping case: బెదిరింపుల దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. అనుకోకుండా దొరికిన అవకాశంతో.. ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్‌రావు తనవారైన మరింత మందిని ఎస్ఐబీలోకి తీసుకువచ్చారు. ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు.. ప్రభాకర్‌రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్‌రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్‌లోని వార్‌రూమ్‌లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది. ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్‌రావు.. విషయాన్ని ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్‌లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం. ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్ ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్‌గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్‌రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్‌లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్‌రావు.. అతని పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును ఐదో రోజైన గురువారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీళ్లు గతంలో ‘ప్రభాకర్‌రావు సైన్యం’లో కీలక సభ్యులని సమాచారం. హోదా ఏదైనా బాధ్యత మాత్రం చీఫే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబీకి డీఐ జీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్‌గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్‌రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల నేపథ్యంలోనే అడ్డదారి ఎస్ఐబీలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్ (ఎల్ఐ)గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్‌రావు, అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు.. అక్రమ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నంబర్లతో సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రభాకర్‌రావు బృందం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యా పింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించి వచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదిక సమర్పించింది. కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రవి పాల్ టెక్నికల్ అనుభవం ఉన్న రవి పాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవి పాల్ సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఇజ్రాయెల్ నుంచి సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. ‘ఆదిలాబాద్’కోసం వినియోగించారు 2018లో ఆదిలాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొన్న సమయంలోనూ ఎస్ఐబీ అధికారులు ఈ బ్రీఫ్‌కేస్ ఉపకరణాన్ని వినియోగించారు. రెండు వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో ఇద్దరి నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా.. మరో నలుగురికి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పరార్!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌కు అండగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్‌రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2018 నుంచే అక్రమ ట్యాపింగ్ దందా మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఇజ్రాయిల్ నుంచి అత్యాధునిక ఉపకరణాలు ఖరీదు చేయగా, రామ్ గోపాల్ కన్సల్టెంట్, అడ్వైజర్‌గా వ్యవహరించారు. ఆదిలాబాద్ ఘర్షణ సమయంలో అక్కడ వినియోగించినట్లు గుర్తించారు. ప్రణీత్‌రావు కేసులో మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. కాగా, మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండగా ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా?
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ‘ప్రణీత్‌రావు అండ్ కో’ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు... ఈ నెల తొలి వారం నుంచి పోలీసులు లీకుల రూపంలో చెబు తున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్ కేసు, ఆయన రిమాండ్ రిపోర్టులో ఎక్కడా ట్యాపింగ్ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు టార్గెట్ వేరే ఉందా? అనే అనుమానాలు కలు గుతున్నా యి. ప్రణీత్ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్క ట్లేదు. కేసులో ఒక్కటి మినహా అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఏపీలో నమోదైన ‘స్కిల్డెవల ప్మెంట్’ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409సెక్షన్ ఈ కేసులోనూ ఉండటంతో ప్రణీత్ జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లాడని నిపుణులు చెప్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అస్పష్టంగా.. ఎస్ఐబీలో అంతర్భాగమైన స్పెషల్ ఆపరే షన్స్ టార్గెట్ (ఎస్ఓటీ) బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్.. ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్ఐబీ అంతర్గత విచారణలో ఆయన చేసిన అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ విభాగాధిపతి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణీత్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొంత వరకు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఎస్ఓ టీకి ఉద్దేశించిన లీజ్డ్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రణీత్ దుర్వినియోగం చేశారని అందులో ఆరోపించారు. అందులోనే 42 హార్డ్‌డిస్క్‌లు మార్చేయడం, ధ్వంసం చేయడం అంశాన్నీ ప్రస్తావించారు. ఈ సస్పెన్షన్ జరిగిన వారం తర్వాత ఎస్ఐబీ ఏఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో ప్రణీత్, ఇతరులపై కేసు నమోదైంది. ఆ రెంటిలో కనిపించని ప్రస్తావన... ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు మూడు చట్టాల్లోని 9 సెక్షన్ల కింద అభియోగాలు చేశారు. ఐపీసీ, ఐటీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లు వాడారు. ఈ నెల 13న అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్లో ఐపీసీలోని 120బీ (కుట్ర) ఉండగా... రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్ కనిపించలేదు. సెక్షన్ 34 చేర్చినప్పుడు 120బీ ఉండాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్టులో తొలగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. అయితే ఓ నిందితుడిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయాలంటే కచ్చితంగా టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడించాలి. అయితే ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ రెండింటిలోనూ ఎక్కడా ప్రత్యక్షంగా ట్యాపింగ్ ప్రస్తావన, ఈ యాక్ట్ కనిపించకపోవడం గమనార్హం. ఆ అధికారులూ బాధ్యతులే అవుతారు... ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ కేసులో దీన్ని ప్రస్తావించకపోవడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేయడం చాలా ఖరీదుతో కూడిన అంశం. అధికారికంగా ట్యాప్ చేయాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ సహకారం అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం వారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇది డీఎస్పీ ప్రణీత్ వద్ద నుంచే వచ్చి... ఎస్పీ సహా కొందరు ఉన్నతాధికారులు ఫార్వర్డ్ చేయాలి. ఈ లేఖలు సర్వీస్ ప్రొవైడర్ వద్ద నిర్ణీత కాలం వరకు భద్రంగా ఉండాలి. ట్యాపింగ్ కోణంలో దర్యాప్తు చేస్తే ఆధారాలు సేకరించడం, తదుపరి చర్యలు తీసుకోవడం తేలికే అయినప్పటికీ... అప్పట్లో లేఖలు ఫార్వర్డ్ చేసి, ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అసలు లేఖలే లేకుండా లేదా ప్రాపర్ చానల్లో రాకుండా ట్యాపింగ్‌కు సహకరిస్తే సర్వీస్ ప్రొవైడర్ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారికంగా ఎక్కడా ట్యాపింగ్ ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని టార్గెట్ వేరేది ఏదో ఉంటుందని, అది తెలియాలంటే మరికొన్నాళ్లు పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
ప్రణీత్‌రావుతో చాటింగ్ చేసిన బీఆర్ఎస్ ముఖ్యనేత?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. విచారణ ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్‌రావు ఫోన్లను సీజ్ చేసిన స్పెషల్ టీం.. ఆ ఫోన్లలోని వాట్సాప్ ఛాటింగ్‌లను రిట్రీవ్(డిలీట్ చేసిన సమాచారాన్ని సేకరించడం) చేసినట్లు తెలుస్తోంది. ఈ వాట్సాప్ సంభాషణలనే కీలకంగా భావిస్తూ.. దర్యాప్తులో ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రణీత్‌రావు ఛాటింగ్‌లో ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ నేత ఇచ్చిన సూచనల మేరకే ప్రణీత్ కొంత మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణ బృందం గుర్తించింది. బీఆర్ఎస్కు చెందిన ఆ ముఖ్యనేత వంద ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావు ఇచ్చారని.. ఆయా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయాలని ప్రణీత్‌రావును ఆదేశించారని తెలుస్తోంది. .. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు?.. ఎక్కడ కలుస్తున్నారు? అనే వివరాల్ని ఆ బీఆర్ఎస్ నేత ప్రణీత్‌రావు నుంచి కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి సోదరులు, అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ల ఫోన్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్ చేశారు. అంతేకాదు ట్యాపింగ్ చేసిన ఆ సమాచారాన్ని రాత్రికి రాత్రే ప్రణీత్‌రావు ఆ బీఆర్ఎస్ పెద్దకు చేరవేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ప్రణీత్‌రావు గతంలో చెప్పిన పోలీసు అధికారులతో(మాజీలు) పాటు సదరు బీఆర్ఎస్ ముఖ్య నేతను సైతం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు ఆ ముఖ్యనేత ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా ఇప్పుడు నెలకొంది. -
Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్‌లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్ టీం భావిస్తోంది. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్‌లపై నిఘా పెట్టాను.. .. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రణీత్‌రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది. -
ట్యాపింగ్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసుల అదుపులో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. కాగా సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్తున్న దర్యాప్తు అధికారులు ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో నిఘా విభాగానికి చెందిన అధికారులు పాల్గొంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసిన ప్రణీత్‌రావును హైదరాబాద్ తరలించిన అధికారులు ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్ ఏర్పాటు చేసుకున్న స్పెషల్ టీమ్‌లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిసింది. వీరిని సైతం దర్యాప్తు అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తూ వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు ప్రణీత్ ఫోన్ ప్రణీత్ నుంచి సీజ్ చేసిన ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపారు. అక్క డి నిపుణులు ఆ ఫోన్ నుంచి వెళ్లిన ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాలను రిట్రీవ్ చేయగలిగారు. వాటి ఆధారంగానే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్ద రు ఉన్నతాధికారులను గుర్తించగలిగారని సమాచారం. ఫలా నా నంబర్ లేదా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటూ వీరి నుంచి ప్రణీత్‌కు సందేశాలు రావడం, ఆ ట్యాపింగ్‌కు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రణీత్ వీరికి పంపినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు అప్పటికే పదవీ విరమణ పొంది, ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగిన అధి కారి కాగా.. మరొకరు ఇప్పటికీ సర్వీసులో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరికొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆ అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో 2 లక్షలసంభాషణలు రికార్డు ప్రణీత్‌రావు పోలీసు శాఖ జారీ చేసిన అధికారిక ఫోన్ తో పాటు మరికొన్ని ప్రైవే ట్ నంబర్లను విని యోగించినట్లు గుర్తించారు. ఈ ఫోన్ నంబర్లను సేకరించిన అధికారులు గడిచిన కొన్నేళ్లల్లో వాటికి వచి్చన, వెళ్లిన కాల్స్, ఎస్ఎమ్ఎస్ల వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రణీత్‌రావు 2018 నుంచి ఎస్ఐబీలో ఆ విభాగం చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు కనుసన్నల్లో పని చేశాడు. ఐదేళ్లలో అతడు వివిధ ఫోన్ నంబర్లకు సంబంధించిన దాదాపు 2 లక్షల సంభాషణల్ని ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. గతే డాది డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసిన హార్డ్డిసు్కల్లో ఇవి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని రికార్డులను అతను కార్యాలయం నుంచి బ యటకు కూడా తరలించినట్లు భావిస్తున్న అధికారులు వాటి కోసం ఆరా తీస్తున్నారు. ప్రణీత్‌రావు కేవలం ప్రతిపక్షాలు, కొందరు ప్రముఖుల ఫోన్లు మాత్రమే కాకుండా బీఆర్ఎస్కు చెందిన కొందరివి, పోలీసు అత్యున్నత అధికారులవీ ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. వీళ్లు ఎవరు? ఎవరు చెప్పడంతో చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా నిధుల తరలింపు! గత ఎన్నికలతో పాటు ఇటీ వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రణీత్‌రావు ఓ పార్టీ నిధుల తరలింపులోనూ కీలక పాత్ర పోషించినట్లు పోలీసు లు అనుమానిస్తున్నారు. తన అధికారిక వాహనంతో పాటు ఎస్ఐబీ, గ్రేహౌండ్స్‌కు సంబంధించిన వాహనాలను దీనికోసం వినియోగించాడని తెలుస్తోంది. నగదు, బంగారం, వెండి ఆభరణా లతో పాటు ఇతర వస్తువులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేర్చడంలో ప్రణీత్ కీలక పాత్రధారని పోలీసులు చెప్తున్నారు. పోలీస్ కస్టడీ కోసంనేడు పిటిషన్ ప్రణీత్‌రావును బుధవారం రాత్రి పోలీసులు కొంపల్లిలోని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఆయన ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా ప్రణీత్‌ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇలావుండగా అయితే తాను మరికొందరితో కలిసి ఈ నేరం చేసినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించాడని వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.విజయ్‌కుమార్ వెల్లడించారు. ఈ కేసును జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రణీత్‌రావు విచారణ కోసం స్పెషల్ టీం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుతో వార్తల్లోకి ఎక్కిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ కోసం ఇప్పుడు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ఈ బృందం.. ప్రణీత్‌రావును విచారణ చేపట్టి.. ఆ వివరాలతో సహా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావును మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఇక.. ఎస్ఐబీ లాగర్ రూమ్‌లో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు కోసం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడు.. ప్రణీత్‌రావు చేసిన నిర్వాకమిది! మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరమే ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సైతం అయ్యింది. అంతకు ముందు.. ఆయన పోలీసుల అదుపులోనే రహస్య ప్రదేశంలో ఉన్నారని.. విచారణ జరుగుతోందన్న ప్రచారం నడిచింది. అయితే ప్రణీత్ రావు కోసం రెండ్రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేసినట్లు ఇప్పుడు తేలింది. ప్రణీత్‌రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం ప్రత్యేక టీం విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.