Soggade Chinni Nayana
-
ఈ సినిమాలు ఆగిపోలేవు..
ఉందా? లేదా? లేదట.... కాదు.. కాదు.. ఉందట! ఈ మధ్య కొన్ని చిత్రాల గురించి జరిగిన చర్చ ఇది. ‘ఆగిపోయింది’ అంటూ ఆ చిత్రాలపై వచ్చిన వార్తలకు స్పందించి... ‘ఉందండోయ్’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ఆ చిత్రాలేంటో చూద్దాం. బంగార్రాజు వస్తాడు ఐదేళ్ల క్రితం సంక్రాంతి పండగకి నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. బంగార్రాజుగా పంచె కట్టుకుని, ‘సోగ్గాడే చిన్ని నాయనా.. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..’ అంటూæ అమ్మాయిలతో నాగ్ వేసిన స్టెప్పులు అదుర్స్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో బంగార్రాజు, రాము పాత్రల్లో నటించారాయన. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ని ఎప్పుడో ప్రకటించారు. ప్రీక్వెల్ అంటే.. ముందు జరిగిన కథ అన్నమాట.. ‘సోగ్గాడే..’లో బంగార్రాజు చనిపోతాడు... అసలు బంగార్రాజు కథేంటి అనేది ప్రీక్వెల్. అయితే ‘సోగ్గాడే..’ వచ్చి ఐదేళ్లు కావడంతో ప్రీక్వెల్ ఇంకా మొదలుపెట్టలేదు కాబట్టి, ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ, ఆగలేదు. ఈ విషయాన్ని ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్ అప్పుడు నాగార్జున స్వయంగా చెప్పారు. సో... ‘బంగార్రాజు ఈజ్ బ్యాక్’. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉంది. ఆన్‌లోనే ఉంది హీరో అల్లు అర్జున్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఎప్పుడో రూపొందాల్సింది కానీ, ఇప్పటివరకూ జరగలేదు. ఇక ఈ కాంబినేషన్ లేనట్లే అని ఈ మధ్య చాలామంది ఫిక్సయ్యారు. దానికి కారణం ‘పుష్ప’ పూర్తి చేశాక కొరటాల శివ సినిమాలోనే అల్లు అర్జున్ చేయాలి. కానీ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వం వహించే సినిమా తెరపైకి వచ్చింది. దాంతో బన్నీ–కొరటాల సినిమా లేనట్లే అని ఎవరికివారు ఫిక్సయ్యారు. కానీ, ‘ప్రాజెక్ట్ ఆన్‌లోనే ఉంది’ అని నిర్మాణ సంస్థ యువసుధ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ సినిమా ఆరంభం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ లేదనే వార్తలు వచ్చాయి కానీ, ‘ఐకాన్’ ఉంటుందని ఇటీవల ‘దిల్’ రాజు పేర్కొన్నారు. మారలేదు ‘ప్లాన్ మారలేదు.. ముందు అనుకున్న ప్రకారమే ముందుకు వెళతాం’ అంటూ ఇటీవల ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ ప్రకటించింది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా గురించే ఈ ప్రకటన. ఈ సినిమా లేదంటూ వచ్చిన వార్తలకే ‘ఉంది’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’లో నటిస్తున్నారు. సుకుమార్ ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ చిత్రాలు పూర్తి చేశాక.. వీరి కాంబినేషన్ సినిమా ఆరంభమవుతుంది. భారతీయుడు ఆగడు! కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (భారతీయుడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం వచ్చిన పాతికేళ్లకు ‘ఇండియన్ 2’కి శ్రీకారం చుట్టారు కమల్–శంకర్. కొన్నాళ్లు షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్లో జరిగిన ప్రమాదం వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల కోసం కమల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో రామ్‌చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా ప్రకటించడం, అలాగే రణ్వీర్ సింగ్‌తో ‘అన్నియన్’ (అపరిచితుడు) రీమేక్ ప్రకటించడంతో ‘భారతీయుడు 2’ ఏమైంది? అనే టాక్ మొదలైంది. ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా కూడా కూడా శంకర్ ఈ సినిమాని మధ్యలో వదిలేయడం సరికాదని కోర్డుకెక్కింది. ‘‘నేనేం వదల్లేదు.. ‘భారతీయుడు ఆగడు’. దీనికి విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. అలాగే కమల్ డేట్స్ ఇస్తే.. నేను షూట్‌కి రెడీ’ అని శంకర్ విన్నవించుకున్నారు. చిన్న బ్రేక్.. అంతే! కరణ్‌జోహార్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట. గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్’ అనే సినిమాని ప్రకటించారు కరణ్ జోహార్. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ‘తక్త్’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్ పడింది.. అంతే’’ అని కరణ్ జోహార్ అన్నారు. ‘ఖిలాడి’గా రవితేజను, ‘టక్ జగదీష్’గా నానీని, ‘వరుడు కావలెను’లో నాగశౌర్యను ఇదివరకే చూశాం. పలు సందర్భాల్లో ఈ చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి, శ్రీరామ నవమికి కూడా ఈ చిత్రాల ఫొటోలు విడుదలయ్యాయి. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక, హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు, నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రా నికి లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. -
బంగార్రాజు భలే నాయనా
సోగ్గాడే చిన్ని నాయనా.. బొమ్మ అదిరింది నాయనా అని సినిమా చూసినవాళ్లు అన్నారు. మూడేళ్ల క్రితం సంక్రాంతికి సోగ్గాడిగా సందడి చేసిన బంగార్రాజుని మళ్లీ చూపించనున్నారు చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఫస్ట్ పార్ట్‌లో నాగార్జున మాత్రమే సందడి చేశారు. రెండో భాగంలో కొడుకు నాగచైతన్య కూడా కలుస్తున్నారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ తాతామనవళ్లలా కనిపించనున్నారు. తొలి భాగంలో నాగ్ సరసన నటించిన రమ్యకృష్ణ మలి భాగంలోనూ ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కథ బాగా కుదిరిందని, ప్రతి పాత్ర ఆడి యన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది. అంటే ఈసారి బంగర్రాజు భలే నాయనా అనిపిస్తాడన్నమాట. ప్రీ–ప్రొడక్షన్ పనులను త్వరలోనే కంప్లీట్ చేసి సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మన్మథుడు’ సినిమా సీక్వెల్ చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కాకుండా బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’ అనే పీరియాడికల్ మూవీలో నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
తాతామనవడు
నాగార్జున, నాగచైతన్య నిజజీవితంలో తండ్రీ కొడుకులు. కానీ చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారని అక్కినేని అభిమానులు సరదాగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య తాతామనవళ్లుగా నటించబోతున్నారు. రెండేళ్ల క్రితం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్లోనే ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఇందులో నాగచైతన్య కూడా నటిస్తారు. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ఆరంభం కానుందని సమాచారం. ఇంతకుముందు ‘మనం’ సినిమాలో నాగార్జునకు నాన్న పాత్రలో నాగచైతన్య కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం మనవడిగా మారారు. ఈ సంగతి ఇలా ఉంచితే... 2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి కూడా స్వీకెల్ చేస్తున్నారట నాగార్జున. ఈ సినిమాకు నటుడు, ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ పోర్చ్గల్లో స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. -
బంగార్రాజు ఈజ్ బ్యాక్
2016 సంక్రాంతికి బంగార్రాజుగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగార్జున ఏ రేంజ్లో అల్లరి చేశారో తెలిసిందే. ఇందులోని బంగార్రాజు పాత్రకు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అని పలు సందర్భాల్లో నాగార్జున పేర్కొన్నారు కూడా. బంగార్రాజు తిరిగి రావడానికి రంగం సిద్ధం అయింది. మార్చిలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ ప్రీక్వెల్‌కు సంబంధించిన కథను దర్శకుడు కల్యాణ్ కృష్ణ పూర్తి చేశారట. స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చాయట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఫస్ట్ పార్ట్‌లో నాగార్జున సరసన నటించిన రమ్యకృష్ణ, మిగతా తారాగణమంతా కనిపిస్తారో లేదో వేచి చూడాలి. సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం బంగార్రాజు పాత్రతో పూర్తి కథంటే ‘సోగ్గాడే..’ కంటే రెండింతల ఎనర్జీతో నాగ్ కనిపిస్తారని ఊహించవచ్చు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన కల్యాణ్ కృష్ణ ప్రీక్వెల్‌ని మరింత ఎంటర్టైనింగ్గా ప్లాన్ చేస్తున్నారట. -
బంగార్రాజు నాగార్జునే
బంగార్రాజు పేరు వినగానే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ గుర్తుకురాక మానదు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ బంగార్రాజు పాత్రలో నాగ్ పల్లెటూరి సోగ్గాడిగా అలరించారు. ‘సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌గా నాగార్జునతో ‘బంగార్రాజు’ సినిమాకు ప్లాన్ చేశారు కల్యాణ్ కృష్ణ. కానీ, ఇప్పుడా సినిమా ప్రస్తావన లేకపోవడంతో నాగ్ ఆ సినిమా చేయడం లేదనీ, రవితేజతో ‘బంగార్రాజు’ తీసేందుకు కల్యాణ్ రెడీ అవుతున్నారనే వార్త షికారు చేస్తోంది. రవితేజకు కథ కూడా వినిపించారట. ‘‘అసలు ఆ రూమర్ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు. ‘బంగార్రాజు’ కథ ఒక వెర్షన్ రాశా. అది నాగ్‌సార్‌కి అంతగా నచ్చకపోవడంతో వేరేలా తయారు చేస్తున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ ‘బంగార్రాజు’ నాగార్జున సారే. రవితేజకు నేను కథ చెప్పిన విషయం వాస్తవమే. కానీ, అది వేరే కథ. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని క్లారిటీ ఇచ్చి, రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించే పనిలో ఉన్నారు కల్యాణ్ కృష్ణ. మరి నాగార్జున, వెంకటేశ్–నాగచైతన్య, రవితేజ.. ఎవరి సినిమా ముందు సెట్స్‌పైకి వెళుతుందన్నది సస్పెన్స్. వారి డేట్స్‌ని బట్టి ఎవరితో సినిమా ముందు మొదలవుతుందో త్వరలో తెలుస్తుంది. -
సోగ్గాడిగా మాస్ మహరాజ్..?
దాదాపు రెండేళ్ల విరామం తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు. అంధుడిగా కనిపిస్తూనే తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా రవితేజ తీసుకున్న జాగ్రత్తలు మంచి విజయాన్ని అందించాయి. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు ఈ మాస్ హీరో. ఇప్పటికే టచ్ చేసి చూడు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ, పలువురు దర్శకులతోజరుపుతున్నాడు. రవితేజ రవితేజ నెక్ట్స్ సినిమాల లిస్ట్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరిందన్న ప్రచారం జరుగుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడి మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు పేరుతో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా తెరకెక్కించాలని భావించాడు. అయితే ప్రస్తుతం నాగ్ ప్రాజెక్ట్ చేసేందుకు సుముఖంగా లేకపోవటంతో అదే కథను కొద్దిపాటి మార్పులతో రవితేజ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్తలు ఫిలిం నగర్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. -
కోలీవుడ్ మీద కన్నేసిన సోగ్గాడు
ప్రయోగాత్మక చిత్రాలు చేయటమే కాదు, వాటినొ కమర్షియల్ సక్సెస్ చేయటంలోనూ కింగ్ అనిపించుకున్నాడు సీనియర్ హీరో నాగార్జున. ఇప్పటికే టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న కింగ్ ఇప్పుడు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇటీవల ఊపిరి సినిమాను తోళాగా తమిళనాట కూడా రిలీజ్ చేసి సక్సెస్ సాధించిన నాగార్జున, మరో తెలుగు సినిమాను తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతి బరిలో సూపర్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాను తమిళ్లో రిలీజ్ చేయనున్నాడు. నాగార్జున అచ్చమైన పల్లెటూరి కథతో చేసిన ఈ సినిమాను తమిళ్లో 'సోక్కాలి మైనర్' అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు పల్లెటూరి యాసతో నాగ్ చెప్పిన డైలాగ్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని జాగ్రత్తగా డబ్బింగ్ పనులు చేస్తున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఇమేజ్ చూడను కాబట్టే స్టార్డమ్ వచ్చింది
ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్ వివాహాల గురించి ప్రశ్నించగా.. త్వరలో ఓ శుభప్రదమైన రోజున పెళ్లి వివరాలు వెల్లడిస్తానని నాగార్జున పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కుమారులతో నిర్మిస్తున్న చిత్రాల గురించి నాగ్ మాట్లాడుతూ - ‘‘కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించబోయే సినిమా ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో ఉంటుంది. కానీ, ఆ సినిమాకి రీమేక్ కాదు. ‘మనం’ చేస్తున్నప్పుడే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఓ కథ చెప్పాడు. ఆ తర్వాత తను బిజీ. ఆ కథ ఇప్పుడు చేయడానికి వీలు కుదిరింది. మొన్ననే తన పెళ్లయింది కదా. త్వరలో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నవంబర్‌లో షూటింగ్‌కు వెళ్తాం. వచ్చే ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ చేస్తాను’’ అన్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నట్లు నాగార్జున చెప్పారు. ‘‘మంచి కథ ఎప్పుడూ ఆ కథకు కావల్సిన హీరో, ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ కథ రోషన్‌ను వెతుక్కుంది. ఇందులో నేను ముఖ్య పాత్ర చేశాను. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఇటువంటి పాత్రలు చేశాను కాబట్టే ఈ స్టార్‌డమ్‌కి వచ్చాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. జి.నాగ కోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోషన్ సాలూరి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 8న విడుదల చేయనున్నారు. నాగార్జున మాట్లాడుతూ - ‘‘తెలుగులో ఇలాంటి చిత్రాలు వచ్చి చాలా రోజులైంది. ప్రేమ దేన్నైనా జయిస్తుందనే సందేశంతో తెరకెక్కింది. సెకండాఫ్ అంతా నా పాత్ర ఉంటుంది. రోషన్, శ్రేయాశర్మ జంట చూడముచ్చటగా ఉంది. రోషన్ నటన చూస్తే మొదటి సినిమాగా అనిపించలేదు. హీరోగా తొలి రోజుల్లో అందరూ నా గొంతు బాగోలేదనేవారు. సంగీత దర్శకుడు రోషన్ ‘మీ గొంతు బాగుంటుంది, మీరు ఈ పాట పాడితే ఇంకా బాగుంటుంది. పాడండి’ అని అడిగాడు. హ్యాపీగా పాడేశాను. ఈ నెల 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతగా నా మొదటి చిత్రమిది. లవ్ ఈజ్ ఇన్స్పిరేషన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ రెండూ కలిసుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే చిత్రమిది. భవిష్యత్తులో భారీ చిత్రాలు నిర్మిస్తానో, లేదో చెప్పలేను. కానీ, చిన్న చిత్రాలు మాత్రం తీస్తాను. వ్యక్తిగా నాకు మంచి సంతృప్తినిచ్చిందీ చిత్రం’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ - ‘‘చదువు పూర్తయిన తర్వాత రోషన్‌ని నటుడిగా పరిచయం చేయాలనేది మా ఫ్యామిలీలో అందరి అభిప్రాయం. చిన్న పాత్రే కదా, ఎక్స్పీరియన్స్ ఉంటుందని ‘రుద్రమదేవి’లో చేయమన్నాను. ఓరోజు దర్శకుడు వచ్చి ఈ కథ చెప్పారు. వింటున్నంత సేపూ.. ‘ఇంత మంచి కథ నాకెందుకు చెప్తున్నాడు, ఇందులో నా క్యారెక్టర్ ఏంటి?’ అనేది అర్థం కాలేదు. కథ పూర్తయిన తర్వాత రోషన్ కోసం అన్నారు. నిర్మాతలు ఎవరు? అనడిగితే.. నాగార్జున, ప్రసాద్ గార్లని చెప్పారు. మంచి నిర్మాణ సంస్థ ద్వారా ఓ ఆర్టిస్ట్ పరిచయం కావాలంటే అదృష్టం ఉండాలి. నాగార్జున గారితో కలసి నేను నటించాను. ఆయన నటీనటులకు ఎంత విలువిస్తారో తెలుసు. దాంతో ఓకే చెప్పేశా. రోషన్‌కు, మాకు జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
సెప్టెంబర్ స్పెషల్ గురూ!
అఖిల్ రెండో సినిమాకి దర్శకుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెర పడింది. ‘మనం’తో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానులకు మధురమైన చిత్రం అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సిసింద్రీ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో అక్కినేని నాగార్జునకి సూపర్ హిట్ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘సెప్టెంబర్ రాక్స్ ఫర్ మి. నా స్టార్ డెరైక్టర్స్ కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య, విక్రమ్ కుమార్‌తో అఖిల్ సినిమాలు చేయబోతున్నారు. త్వరలో ఇవి సెట్స్‌కి వెళతాయి’’ అని నాగ్ పేర్కొన్నారు. కొత్త కథలను ఎంపిక చేయడంలోనూ, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలోనూ నాగార్జున ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు. కొత్తకు పట్టం కడుతూ ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలు ఆ కోవలోనివే. ఈ రెండిటితో పాటు ‘ఊపిరి’తో వరుస విజయాలు సాధించిన నాగార్జున జోరుగా ‘నమో వెంకటేశాయ’లో నటిస్తున్నారు. అదే జోరు మీద కుమారుల కోసం సినిమాలు సెట్ చేసే పనిలో పడ్డారాయన. -
'స్ట్ట్వి' తిప్పి చదవండి
ఒక ఫ్లోలో పోతున్న కథ సడన్‌గా మలుపు తిరుగుతుంది. దాన్నే ట్విస్ట్ అంటారు. పైన హెడ్డింగ్ తిప్పి చదివితే కనపడేది ట్విస్టే. చిన్నా పెద్దా సినిమా తేడా లేకుండా ఇలాంటి ట్విస్టులు హీరోల, డైరక్టర్ల, ప్రొడ్యూసర్ల కెరియర్లకు మంచి ట్విస్ట్ ఇస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన కొన్ని ట్విస్టులు ఇవి. బాహుబలి తెలుగు సినిమాకు ప్రాంతీయ హద్దులు చెరిపేసి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా ‘బాహుబలి’. తన సినిమాలలో ఇంటర్వెల్‌కి మంచి బ్యాంగ్ ఇవ్వడం దర్శకుడు రాజమౌళి అలవాటు. ఆయన గత చిత్రాలన్నీ అదిరిపోయే ఇంటర్వెల్‌తో వచ్చినవే. ‘బాహుబలి’ కథను రెండు పార్టులుగా చెప్పాలనుకున్నప్పుడు, మొదటి పార్ట్‌ను ఫస్ట్ హాఫ్‌లా ట్రీట్ చేశారు. క్లైమాక్స్‌లో ఇంటర్వెల్ లాంటి ట్విస్ట్ ఇచ్చారు. అదే కట్టప్ప బాహుబలిని చంపే సీన్. రాజు మాట శిరసావహించి ప్రాణాలైనా ఇచ్చే కట్టుబానిస కట్టప్ప రాజుని ఎందుకు చంపాడన్నది ఆసక్తికరమైన మలుపు. బాహుబలి ద బిగినింగ్ క్లైమాక్స్‌లో వచ్చిన ఈ సీన్... మొత్తం సినిమాకే హైలైట్ గా మారింది. శివుడిగా ప్రభాస్ చేసిన సాహసాలు, అవంతిక క్యారెక్టర్లో తమన్నా అందాలు, భారీ సెట్టింగ్‌లు, కనువిందు చేసే గ్రాఫిక్స్, ఫ్రీ క్లైమాక్స్‌లో యుద్ధ సన్నివేశాలు... ఇవన్నీ ఒక ఎత్తై... ఫ్లాష్ బ్యాక్ చివర్లో బాహుబలిని కట్టప్ప చంపడమే ఎక్కువ గుర్తుండిపోయింది. రెండో పార్ట్ సినిమాగా రావడానికి ఈ ట్విస్టే క్యూరియాసిటీని నిలబెడుతోంది. సోగ్గాడే చిన్ని నాయన బంగార్రాజు సరసం, సాయం తెలిసిన వ్యక్తి. ఊళ్లో పెద్ద తలకాయ. బడులు కట్టడం, గుడి సంపదలు కాపాడటం బాధ్యతగా భావిస్తుంటాడు. ఒక రోజు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆత్మగా మారి మళ్లీ ఇంటికొస్తాడు. రొమాన్స్ తెలీని కొడుకుతో కోడలు విడాకులు తీసుకునేందుకు సిద్ధపడితే ఆత్మ రూపంలో కొడుకు శరీరంలోకి వెళ్లి ఆ కాపురాన్ని నిలబెడతాడు. బంగర్రాజు రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని యాక్సిడెంట్ చేసి చంపారనేది కథలో ట్విస్ట్. బంగర్రాజు ట్రస్టీగా ఉన్న గుడిలో ఉన్న విలువైన ఆభరణాల కోసం ఆయన బంధువులే చంపేస్తారు. ఆత్మరూపంలో వచ్చిన బంగర్రాజుకు ఈ విషయం తెలుస్తుంది. దేవుడి సహాయంతో బంగార్రాజు గుడి ఆభరణాలు కాపాడతాడు. ట్విస్టు అల్లినట్లు కాకుండా కథలో నిజాయితీగా కలిసిపోవడం వల్ల ‘సోగ్గాడే చిన్ని నాయన’ సక్సెస్ఫుల్ సినిమా అయ్యింది. టెంపర్ ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరో రౌడీలతో కుమ్మక్కై లక్షలు దండుకునే పోలీస్ క్యారెక్టర్ చేయడమే పెద్ద ట్విస్ట్. అయితే కథలోనూ మంచి ట్విస్ట్ ఉంది. అవినీతి పోలీసు ఆఫీసర్ నిజాయితీ ఆఫీసర్‌గా మారడమే ఒక్క లైన్లో ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా. అయితే కథానాయకుడు ఒక అమ్మాయి కన్నీటి గాథ విని మారాడని చూపిస్తే రొటీన్ అవుతుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ అలా సాదాసీదాగా స్టోరీ చెబుతాడా? ఏదో పవర్ఫుల్ ఎలిమెంట్ తీసుకొస్తాడు. క్లైమాక్స్‌లో అసలు సిసలు ట్విస్ట్ చూపించాడు. నేరస్తులను నేరుగా పట్టివ్వలేకపోయిన హీరో తానే నేరం (అత్యాచారం) చేశానని జైలుకెళ్లి విలన్ల భరతం పడతాడు. ఈ ట్విస్ట్ పండింది. జెంటిల్మన్ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అమ్మాయిలు స్నేహితులవుతారు. సరదాగా మాటల్లో పడతారు. ఇద్దరి ప్రేమ విషయాలు పంచుకుంటారు. ఒక అమ్మాయి తనకు త్వరలో పెళ్లి జరగబోతోందని చెబుతుంది. మరో అమ్మాయి తన లవ్ స్టోరీ చెప్పేస్తుంది. ఇలా ఒకరికొకరు తన లైఫ్ ‘బాయ్’ గురించి మాట్లాడు కుంటారు. విమానం ల్యాండ్ అవగానే ఎదురొచ్చిన కుర్రాడు అ ఇద్దరు ఇప్పటిదాకా చెప్పుకున్న వ్యక్తే. ఇదే సినిమాలో అసలు సిసలు ట్విస్ట్. కథానాయకుడు ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లికి ఎలా సిద్ధపడ్డాడన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇంటికెళ్లగానే ప్రేమికుడు చనిపోయాడన్న వార్త తెలియడం మరో మలుపు. ఇలా రెండు ట్విస్టులతో కథను టేకాఫ్ చేసిన దర్శకుడు అనేక సన్నివేశాల్లో దీనికి కారణాలు చూపిస్తూ క్లైమాక్స్ ల్యాండింగ్ చేస్తాడు. ఇది క్లుప్తంగా నాని కొత్త సినిమా ‘జెంటిల్మన్’ కథ. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తన కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నమిది. ఇన్నోసెంట్ కామెడీ సినిమాలు చేస్తున్న నానీకి కొత్త తరహా చిత్రమే. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ మంచి ప్రయత్నంగా మిగిలింది. క్షణం ఈ ఏడాది అనూహ్య విజయాన్ని సాధించిన సినిమా ‘క్షణం’. ఒక పాప కిడ్నాప్ మిస్టరీని అనేక మలుపులతో ఆసక్తికరంగా తెరక్కెకించాడు దర్శకుడు రవికాంత్ పేరేపు. కాలిఫోర్నియాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఉద్యోగం చేసుకునే రిషీ.....శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్లిద్దరు శారీరకంగా ఒక్కటవుతారు. కూతురు ప్రేమ విషయం తెల్సుకున్న తండ్రి వేరే కుర్రాడికిచ్చి హడావిడిగా పెళ్లి చేసేస్తాడు. వీళ్లకు పుట్టిన పాపను కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. భర్త పట్టించుకోకపోవడంతో రిషీ సాయం కోరుతుంది శ్వేత. ఇండియాకు వచ్చిన రిషీ....అపహరించిన పాపను కాపాడతాడు. శ్వేత భర్తే పాపను కిడ్నాప్ చేయించాడన్నది కథలో మేలిమలుపు. నేను.. శైలజ... లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చినుకులు పడ్డ ఓ సాయంత్రం కలల సుందరి లాంటి అమ్మాయి ఎదురైతే....గుండె లవ్ లవ్ అంటూ కొట్టుకుంటుంది. ‘నేను శైలజ’ సినిమాలో ఇలాంటి సందర్భమే హీరో రామ్‌కు ఎదురవుతుంది. మనసు ఆ అమ్మాయికి ఇచ్చి... ప్రేమ మాయలో పడిపోతాడు. ఈ హీరోకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో ఎదురెదురు ఇళ్లలో పిల్లలుగా తనూ శైలజ. ఆ చిన్నారి స్నేహితురాలే ...ప్రస్తుతం తను ప్రేమిస్తున్న శైలజ అని తెలియడం ఈ ప్రేమకథలో ట్విస్ట్. కుటుంబంలో పరిస్థితులు హీరోయిన్‌కు ప్రతిబంధకాలవుతాయి. ఆ కష్టాలను తీర్చి... ప్రేమికురాల్ని తన దగ్గరకు చేర్చుకుంటాడు హీరో. సహజత్వానికి దగ్గరగా మన చుట్టూ జరిగే కథగా తెరకెక్కిన ‘నేను శైలజ’ ...ఈ మలుపులతో బాక్సాఫీస్ గెలుపు బాట పట్టింది. దృశ్యం... ఒక అందమైన పల్లెటూరు, అందులో అనుబంధాల పొదరిల్లు. తండ్రి కేబుల్ ఆపరేటర్. తల్లి, ఇద్దరు ఆడపిల్లలు. పొరుగూరు షాపింగ్‌కి వెళ్లడం వాళ్లకో పెద్ద కల. సరదాలతో ప్రతి రోజూ పండగ రోజులా గడుపుతుంటారు. ఇంతలో ఈ హ్యాపీ ఫ్యామిలీని కుదిపేసే సంఘటన ఒకటి జరుగుతుంది. వాళ్లకది తట్టుకోలేని విషాదం. అయితే పెడబొబ్బలు పెట్టి విషయాన్ని బయటపడకుండా ప్రతీకారం తీర్చుకోవాలని అంతా అనుకుంటారు. తన కూతురుని చెరచాలని చూసిన యువకుణ్ణి చంపేసి పోలీస్ స్టేషన్ కిందే పూడ్చిపెట్టడం పెద్ద ట్విస్ట్. అనుమానంతో అణువణువూ వెతికిన పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కుండా కథనాయకుడు, అతని కుటుంబం ఆడిన మైండ్ గేమ్ అబ్బురపరుస్తుంది. ఒక క్రూరత్వానికి కుటుంబం వేసిన శిక్ష సరైనదే అనిపిస్తుంది. దేశంలో సినీ పరిశ్రమ ఉన్న అన్ని భాషల్లోకి అనువాదమవుతున్న అరుదైన సినిమా ‘దృశ్యం’. ఈ మళయాల కథలోని ట్విస్టే పేక్షకులను థ్రిల్ చేసింది. తెలుగులో వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. రైట్ రైట్ ట్విస్టు కథలతో తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్ కాలేదు. ‘శౌర్య’, ‘రైట్ రైట్’ లాంటి సినిమాలు అపజయాలనూ చవిచూశాయి. హీరోయిన్ను విలన్లు చంపడం చూసుంటాం కానీ, ‘శౌర్య’ సినిమాలో హీరోనే నాయికను చంపానని కోర్టులో చెబుతాడు. ఇలా ఎందుకు చెప్పాడన్నది కథలో మలుపు. దర్శకుడు దశరథ్ తెరకెక్కించిన ‘శౌర్య’ సినిమాకు బాక్సాపీస్ దగ్గర కూడా ట్రాజెడీ ఫలితమే దక్కింది. చేదు ఫలితాన్ని చూసిన మరో ట్విస్ట్ సినిమా ‘రైట్ రైట్’. బస్ కండక్టర్, డ్రైవర్ స్నేహితులవుతారు. బస్సు వెళ్లే ఊళ్లో ఓ మాస్టారు వీళ్లకు సాయం చేస్తుంటాడు. ఓసారి ప్రయాణంలో డ్రైవర్ తాగి కండక్టర్‌ను బస్సు నడపమంటాడు. ఆ బస్సు ఓ వ్యక్తిని ఢీ కొంటుంది. మరణించిన వ్యక్తి మాస్టారు కొడుకు కావడం విషాదం. ఐతే బస్సు ఢీ కొట్టడం వల్ల మాస్టారు కొడుకు చనిపోలేదని...చంపి బస్సు కింద పడేశారన్నది కథలో ట్విస్ట్. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న అతన్ని చంపిందెవరు అనేది క్లైమాక్స్‌లో తేలుస్తాడు దర్శకుడు. ‘రైట్ రైట్’ బాక్సాఫీస్ దగ్గర నిరాశపర్చింది.. -
మరోసారి మాయ చేస్తారట..!
'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది. తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్‌ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సమంతను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెర మీదే కాదు తెర వెనక కూడా వీరి మధ్య ఏదో ఉందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో సినిమాలో కలిని నటించటం ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యంగ్ జనరేషన్ లో రామ్ చరణ్, కాజల్ తప్ప మరే జంట నాలుగు సినిమాల్లో కలిసి నటించలేదు. దీంతో ఈ రికార్డ్ సాధించిన రెండో జంటగా నిలిచారు చైతన్య, సమంత. -
పదిహేడేళ్ల తర్వాత!
‘వాస్సి వాడి తస్సాదియ్యా...’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. జోరుగా ఉండే తండ్రి పాత్ర, కూల్‌గా ఉండే కొడుకు పాత్రను నాగ్ అద్భుతంగా పోషించారు. అన్ని ఏరియాల వాళ్లనీ ఆకట్టుకున్న చిత్రం ఇది. ఇప్పుడీ రెండు పాత్రల్లో కన్నడ ప్రేక్షకులు ఉపేంద్రను చూడనున్నారు. విలక్షణమైన పాత్రలతో కన్నడిగులనే కాదు.. తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న ఉపేంద్రకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చాలా నచ్చిందట. అందుకే కన్నడ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలుగులో రమ్యకృష్ణ చేసిన పాత్రను కన్నడంలో ప్రేమ చేయనున్నారు. విశేషం ఏంటంటే... 1999లో ఉపేంద్ర, ప్రేమ జంటగా ‘ఉపేంద్ర’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. పదిహేడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ జతకట్టనున్న చిత్రం ఇదే. మరో విశేషం ఏంటంటే... ఈ చిత్రంతోనే ప్రేమ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. అరుణ్ లోకనాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘మత్తె హుట్టి బా, ఇంతి ప్రేమ’ అనే టైటిల్ నిర్ణయించారు. ఆ సంగతలా ఉంచితే నాగ్ మంచి రొమాంటిక్ హీరో. ఉపేంద్ర ఫుల్ మాస్ హీరో. అందుకే తన ఇమేజ్‌కీ, కన్నడ ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్టుగా ‘సోగ్గాడే..’ కథను మలుస్తున్నారట. -
ఆ కాంబినేషన్లో మరో సినిమా
'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది. తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్‌ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సమంతను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు, ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోగ్గాడే చిన్నినాయనా మరో సంచలనం
ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా పది రోజులకు మించి థియేటర్లలో కనిపించే పరిస్థితి లేదు. సినిమా సక్సెస్‌ను కూడా ఎన్ని రోజులు ఆడింది అన్న దాంతో కాకుండా ఎంత కలెక్ట్ చేసిందీ అనే లెక్కలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడటం సాధ్యమేనా..? ఈ ప్రశ్నకు సమాధానం చూపించాడు నాగార్జున. సరైన కథా కథనాలతో ఆడియన్స్ ముందుకు వస్తే ఇప్పటికీ రికార్డ్ సెంటర్స్‌లో 50 రోజుల సినిమాలు సాధ్యమే అని ప్రూవ్ చేశాడు. సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన సినిమా సోగ్గాడే చిన్నినాయనా. మూడు సినిమాలతో పోటి పడి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించటమే కాదు భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇప్పటికే చాలా సెంటర్స్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా 50 రోజులు రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న సోగ్గాడే చిన్నినాయనా 110 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది 53 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తున్న సోగ్గాడే చిన్నినాయనా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. -
హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు..!
యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టపడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం భారీ సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో మంచి విజయాలు సాధిచిన టాలీవుడ్ మన్మథుడు ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేశాడు. మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న కింగ్ మరో సక్సెస్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన తొలి సీనియర్ హీరోగా రికార్డ్ సృష్టించాడు నాగార్జున.. ఇప్పుడు అదే జోష్‌లో ఊపిరి సినిమాతో మరో భారీ సక్సెస్ మీద కన్నేశాడు. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి నటిస్తున్నాడు నాగ్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఊపిరి మార్చ్ 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నాగ్ పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగ్ మరోసారి తన మార్క్ పర్ఫామెన్స్తో అలరించగా, కార్తీ ఎనర్జీ మరింత ప్లస్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుండటం కూడా సినిమా బిజినెస్‌కు ప్లస్ అవుతుందటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఊపిరితో నాగ్‌కు హ్యట్రిక్ కన్ఫామ్ అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
సోగ్గాడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు
సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా.. అన్నింటికంటే పెద్ద హిట్‌గా నిలిచిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఎన్టీఆర్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా.. భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఇంతవరకు సాధ్యం కాని కలెక్షన్ల రికార్డ్లను సాధించి సత్తా చాటాడు నాగ్. ఇప్పటివరకు పవన్, మహేష్, అర్జున్, చరణ్, ఎన్టీఆర్లకు మాత్రమే సాధ్యమైన 50 కోట్ల మార్క్ ను 4 వారాల్లో రీచ్ అయ్యాడు నాగార్జున. యంగ్ హీరోలు చాలామంది ఈ రికార్డ్ సాధించినా.., ఇంత పోటీలో లో నాగార్జున లాంటి సీనియర్ హీరో 50 కోట్ల కలెక్షన్లు సాధించటం అరుదైన ఘనతగానే భావిస్తున్నారు విశ్లేషకులు. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో దర్శకుడి పరిచయం కావటమే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ సాధించి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. నాగ్ తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాతో బిగ్ హిట్‌తో పాటు భారీ కలెక్షన్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. -
సోగ్గాడి కొడుకే హీరో నాయనా!
మొన్న సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంచలన విజయం సాధించి త్వరలో 50 కోట్ల క్లబ్లో చేరనుంది. నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకునిగా పరిచయమయ్యారు. రొమాన్స్, ఫాంటసీ మిళితమైన ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో కల్యాణ్‌కృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయన రెండో చిత్రం ఎవరితో చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రానికి సోగ్గాడి కొడుకే హీరో! నాగచైతన్య హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణ్‌కృష్ణ చెప్పిన కథ అటు నాగార్జునకు, ఇటు నాగచైతన్యకు విపరీతంగా నచ్చేసిందట. చైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో పాటు మలయాళ ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’లో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత కల్యాణ్ కృష్ణతో సినిమా చేయడానికి ఈ యువ హీరో ఆసక్తిగా ఉన్నారు. -
సోగ్గాడి సీక్వెల్ బంగార్రాజు..?
సంక్రాంతి బరిలో ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా సక్సెస్ సాధించిన సినిమా కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా. నాగ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా ఈ సినిమాలో సోగ్గాడిగా నాగ్ లుక్, పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. అదే జోష్‌లో సీక్వెల్తోనూ ఆకట్టుకోవాలని ఫ్లాన్ చేస్తున్నారు. సీక్వెల్‌కు 'బంగార్రాజు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. అన్నపూర్ణ బ్యానర్‌పై బంగార్రాజు సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్న నాగ్, 2017 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. -
జోరు చూపిస్తున్న సోగ్గాడు
సంక్రాంతి పండుగకు విడుదలైన నాలుగు సినిమాల్లో ఎలాంటి నెగిటివ్ టాక్ లేకుండా ఆకట్టుకున్న సినిమా సోగ్గాడే చిన్నినాయనా. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ లాంటి సినిమాలు పోటి ఉన్నా, సోగ్గాడిగా వచ్చిన నాగ్ సత్తా చాటాడు. ముఖ్యంగా ఎ, బి సెంటర్స్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు కావటం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా రిలీజై ఇప్పటికే రెండు వారాలు దాటిన కలెక్షన్ల జోరు మాత్రం తగ్గటంలేదు. రివ్యూలతో పాటు, మౌత్ టాక్ కూడా బాగా వస్తుండటంతో నాగ్ కెరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంక చాలా చోట్ల హౌస్‌ఫుల్ అవుతుండటంతో పాటు శాటిలైట్ రైట్స్ లాంటి వాటితో 50 కోట్ల మార్క్‌ను ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. థియేటర్లలో మరికొద్ది రోజుల పాటు సోగ్గాడి సందడి ఉంటుందంటున్నారు అక్కినేని అభిమానులు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనూప్ అందించిన సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. -
దిల్‌రాజు బ్యానర్లో నాగ్..?
సంక్రాంతి బరిలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ నాగార్జున. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఈ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకోవాలని భావించిన వరుస ఆఫర్లు వస్తుండటంతో గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయడానికే రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రానికి రెడీ అవుతున్న నాగ్ మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మీద కూడా దృష్టి పెట్టాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు రవితేజ హీరోగా ఓ సినిమాను ప్రారంభిచాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకుడు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, తరువాత కథ విషయంలో దిల్‌రాజు, రవితేజలకు అభిప్రాయ బేధం రావటంతో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో నాగార్జున హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దిల్‌రాజు. మరి రవితేజ కాదన్న కథను నాగ్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. -
మరో చారిత్రక పాత్రలో నాగార్జున
సీనియర్ హీరోలలో తన వయసుకు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకోవటంలో ముందున్న హీరో కింగ్ నాగార్జున. మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన నాగ్ మరోసారి భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నాగార్జున త్వరలో వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు 'హాథీరాం బాబా'గా కనిపించనున్నాడు. శిరిడి సాయి సినిమా తరువాత ఇంతవరకు దర్శకుడు రాఘవేంద్రరావు మరో సినిమాను ప్రారంభించలేదు. వెంకటేశ్వర స్వామి కథతో ఓ సినిమా చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించినా, నాగార్జున డేట్స్ కాళీ లేకపోవటంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. సోగ్గాడే చిన్నినాయనా తరువాత మరో సినిమా అంగీకరించని నాగ్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
ట్రాక్టర్ల మీద వెళ్లి మరీ సోగ్గాణ్ణి చూస్తున్నారు : నాగార్జున
‘‘మొదటి రోజు కన్నా ఈ సినిమాకు కలెక్షన్స్ రెండో రోజు బాగా పెరిగాయి. విజయవాడ, కడపల్లో ఎక్స్ట్రా షోస్ కూడా వేస్తున్నారు’’ అని నాగార్జున చెప్పారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి ముఖ్యతారలుగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఆదివారం జరిగింది. నాగార్జున మాట్లాడు తూ- ‘‘నేను ‘మాస్’ సినిమా ఆడియో ఫంక్షన్లో డ్యాన్స్ చేశాను. అది హిట్. ఆ తర్వాత ‘సోగ్గాడే...’ పాటల వేడుకలోనూ స్టెప్పులు వేశాను. ఈ సినిమాకు మంచి రిజల్ట్ వస్తుందని ముందే తెలుసు. నేను ఊహించినదే జరిగింది. మొదటి మూడు రోజులు 15 కోట్లు వసూలు చేసింది. నా సినిమాల్లో హయ్యస్ట్ కలెక్షన్స్ వచ్చిన చిత్రమిదే. పూర్వం బండ్లు కట్టుకుని సినిమాలకు వెళ్లేవాళ్లని విన్నాను. చాలా కాలం తర్వాత ట్రాక్టర్ల మీద ఈ సినిమాకు వెళుతున్నారని వింటున్నా. పంచెకట్టయితే మళ్లీ ఓ ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యేలా ఉంది. నేనూ ఇకనుంచి పంచె కట్టాలనుకుంటున్నా. అంతలా నచ్చేసింది’’ అన్నారు. ‘‘ప్రతి ఊరిలోనూ కనీసం నలుగురు బంగార్రాజులు ఉంటారు. అలాగే ప్రతి మనిషిలోనూ ఓ బంగార్రాజు ఉంటాడు. అలా ఇన్స్పైర్ అయి బంగార్రాజు పాత్రను క్రియేట్ చేశా’’ అని కల్యాణ్ కృష్ణ తెలిపారు. అనూప్ రూబెన్స్, లావణ్యా త్రిపాఠి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి సోగ్గాడు
చిత్రం: ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తారాగణం: నాగార్జున, లావణ్యా త్రిపాఠీ, రమ్యకృష్ణ మూలకథ: పి. రామ్మోహన్ స్క్రీన్‌ప్లే: సత్యానంద్ కళ: ఎస్. రవీందర్ కెమేరా: పి.ఎస్. వినోద్, ఆర్. సిద్ధార్థ్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాత: అక్కినేని నాగార్జున రచన - దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల కొత్త సినిమా గురూ! సాంఘికం, పౌరాణికం, జానపదం, సోషియో ఫ్యాంటసీ- ఇలా సిన్మాలు పలు కోవలు. ఒక్కో కోవలో - రొమాంటిక్ లవ్, రివెంజ్ ఫార్ములా, ఘోస్ట్, యాక్షన్ లాంటి సవాలక్ష ఫార్ములాలు. ఇవన్నీ పాత చింతకాయలే కావచ్చు. కానీ ఆ రకరకాల జానర్స్ సినిమాలకూ, ఈ పలు రకాల ఫార్ములాలకూ అంటు కడితేనో? పువ్వులు, పండ్లు కొత్తగా ఉంటాయి. రొమాంటిక్ కథ, సోషియో- ఫ్యాంటసీ లైన్, రివెంజ్ యాంగిల్- ఇలా అన్నిటికీ అంటుకట్టడంతో వచ్చిన వెరైటీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. గోదావరి జిల్లాల్లోని శివపురం గ్రామంలో బంగార్రాజు (నాగార్జున) పిల్ల జమీం దార్. ఆ సరసాల సోగ్గాడి భార్య సత్యభామ (రమ్యకృష్ణ). ఆమె కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతాడు. ‘ఎక్కని గడప, దూకని గోడ లేని’ భర్త లానే పుట్టిన కొడుకు రాము (నాగార్జునే)ను అమ్మాయిలకు దూరంగా, అతి జాగ్రత్తగా పెంచుతుంది. రాము భార్య సీత (లావణ్యా త్రిపాఠీ). అమెరికాలోని టాప్ ఫైవ్ డాక్టర్స్‌లో ఒకడిగా స్థిరపడ్డ రాముకి పనే లోకం. భార్య మీద ప్రేమను కూడా పైకి వ్యక్తం చేయని అమాయకుడు. దాంతో, విడాకులకు సిద్ధమై, సత్యభామకు చెప్పడం కోసం ఇండియాలోని ఊరికొస్తారు. వీటన్నిటికీ మొగుడు బంగార్రాజు కారణమని తల్లి నిందిస్తుంది. అప్పుడు యముడి అనుమతితో తండ్రి ఆత్మ భూలోకానికి వస్తుంది. ఈ ఫ్రెండ్లీ ఘోస్ట్ ఇక్కడ భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే కథ చాలా మలుపులు తిరుగుతుంది. ఒకదానికొకటి సంబంధం లేని బంగార్రాజు, రాము పాత్రల్ని గెటప్, మనిషి, మాట తీరుతో సహా నాగ్ చాలా సహజంగా చేశారు. బంగార్రాజు లాంటి నవ మన్మథ పాత్రలు ఆయనకు స్వభావసిద్ధం. అమాయ కుడైన కొడుకుగా కూడా అంతే డిగ్నిఫైడ్ లుక్‌తో, యాక్షన్‌తో మెప్పించారు. ఇక, వయసు మీద పడుతున్నా అందాన్నీ, దర్పాన్నీ వదులుకోని ఈ సత్యభామ పాత్రకు రమ్యకృష్ణ సరిగ్గా సరిపోయారు. పెళ్ళయి మూడేళ్ళయినా, మూడుసార్లకు మించి కలవని కెరీరిస్ట్ డాక్టర్ భర్తతో విడాకులు కావాలని కోరుకొనే భార్య సీత పాత్ర వేదన ఆధునిక సమాజంలో కనిపించేదే. అందులో లావణ్యా త్రిపాఠీ ఒదిగారు. ఆత్మలతో మాట్లాడతాననే ‘ఆత్మానంద’ స్వామిగా బ్రహ్మానందం నవ్విస్తారు. కుర్ర నాగార్జున పక్కన వరసయ్యే మరదళ్ళుగా అనసూయ, హంసానందిని కనువిందు కోసం కనిపిస్తారు. బంగార్రాజు ఆత్మ కిందకు రావడమేమిటి, భార్యకే కనపడడం, వినపడడమేమిటి, మళ్ళీ ఆత్మానందా నికీ కన్వీనియంట్‌గా తెలియడమేమిటి లాంటి లాజిక్‌లు అడ్డం పడినప్పుడల్లా యముడి పాత్రలో నాగబాబు వచ్చి, కన్వీనియంట్‌గా వివరణలిస్తారు. స్వర్గీయ ఏయన్నార్ హిట్ పాట ‘సోగ్గాడే చిన్ని నాయనా...’ రీమిక్స్ ఫ్యాన్స్‌కు పండగ. ప్రధానంగా చెప్పు కోవాల్సింది - కెమేరా వర్క్. గ్రామీణ వాతావరణాల సొగసును ప్రతిఫలిం చింది. ఒకరికి నలుగురు అమ్మాయిలతో తిరిగే పిల్ల జమీందార్లు పల్లెటూళ్ళలో సాధారణం. కానీ, హీరోకు అలాంటి క్యారెక్టరైజేషన్ పెట్టి, అదే సమయంలో అతడు మంచివాడనిపించేలా చేయడం ఒక సవాలు. దానికి తోడు చిలిపి చేష్టల్ని చెబుతూ, చూపెడుతూనే, హద్దులు దాటకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఒప్పించడం మరొక సవాలు. దర్శక, రచయితలు ఆ పరీక్ష పాసయ్యారు. మగవాళ్ళే కాదు... ఆడవాళ్ళు కూడా ముసిముసి నవ్వులతో మురిసి పోతూ కథకు కనెక్టయ్యేలా ఆ సెన్సుయల్ రొమాన్స్‌ను ఎంటర్టైనింగ్గానే తెరపైకి తేగలిగారు. ఒకప్పుడు ఇలాంటివన్నీ ‘అశ్లీలం’ అనుకొన్న ప్రేక్షకులు కాలంతో పాటు ఎంతగా మారారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అలాగే, తండ్రి, కొడుకుకు సరసాన్ని నేర్పించడమనేది నిజానికి వినడానికీ, ఏ మాత్రం తేడా వచ్చినా తెర మీద చూపించడానికీ తప్పుగా ధ్వనించే ప్రమాదం ఉంది. కానీ, అంగీకారయోగ్యంగా చూపించడం రచన చేసిన అనుభవజ్ఞుల నేర్పుకు నిదర్శనం. ‘చిత్రిక పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉన్నావే’, ‘తొక్కి నార తీయడం’ లాంటి సహజమైన తెలుగు పలుకుబడులు చాలా రోజులకి తెరపై వినిపించాయి. కథలో ‘మూడు పుష్కరాల (36 ఏళ్ళ) క్రితం... శివరాత్రి ముందు రాత్రి’ విలన్ ముఠాకు తాచుపాము కాటు, బంగార్రాజు చనిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ, సినిమాలో 30 ఏళ్ళ క్రితం బంగార్రాజు పోయాడని ఒకటి, రెండుసార్లు అనిపి స్తారు. పాటలో అలా మెరిసి, ముగిసే కృష్ణకుమారి పాత్రలో హాట్ హీరోయిన్ అనూష్క కనిపించడం ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్. అయితే, బంగార్రాజు అమితంగా ఇష్టపడ్డ ఆ కృష్ణకుమారి పాత్రకు క్లారిటీ, కన్‌క్లూజన్ వెతక్కూడదు. ఎంత ఆత్మ వచ్చి దూరినా, కొడుకు పాత్రొచ్చి ఆమెతో అప్పటి సరసాలు సరదాలు గుర్తు చేసినప్పుడు అసహనం సహజం. బంగార్రాజు ఆత్మను మళ్ళీ భూలోకానికి యముడు పంపడానికి కారణం లాంటివి వెతక్కూడదు. సినిమా చూసి బయటకొచ్చాక దీర్ఘంగా ఆలోచిస్తే, ఇలాంటివన్నీ బుర్రకు తడతాయి. కానీ, గమ్మత్తేమిటంటే చూస్తున్నంత సేపూ అసలీ ఆలోచనలేవీ రానివ్వకుండా సినిమాను నడిపించడం! అది ఈ సినిమాకు పెద్ద ప్లస్. తొలిచిత్ర దర్శకుడైన కల్యాణ్‌కృష్ణకు సమష్టి కృషి తోడుగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌కు ఇది ముందడుగు. వెరసి, మన పల్లెటూళ్ళు, మన వాతావరణం, మన తెలుగువారి పంచెకట్టు, మన బంధుత్వాలు, సరదాలను తెరపైకి తేవడంతో ఇది అచ్చమైన సంక్రాంతి ఫెస్టివల్ ఫిల్మ్. కుటుంబమంతా హ్యాపీగా చూసే అవకాశాలతో సంక్రాంతి రిలీజుల బాక్సాఫీస్ పందెంలో గెలుపుకోడి. - రెంటాల జయదేవ -
'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ
టైటిల్ : సోగ్గాడే చిన్ని నాయనా జానర్ : ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, నాజర్, బ్రహ్మనందం సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్మాత : నాగార్జున టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం సినిమాలో ఏఎన్నార్‌తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్‌ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా. చాలా కాలం క్రితం టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్‌కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యింది..? సంక్రాంతి బరిలో సోగ్గాడి స్టామినా ఎంత..? కథ : రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పని లోకం తప్ప భార్య సీత(లావణ్య త్రిపాఠి) గురించి అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత . ఆ విషయం చెప్పడానికి అత్తగారు సత్తమ్మ (రమ్యకృష్ణ) దగ్గరికి వస్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది. నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేయడానికి యముడి అనుమతితో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు బంగార్రాజును ఎవరు ఎందుకు చంపారు..? వారి బారి నుంచి బంగార్రాజు తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ..? నటీనటులు : అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్న పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్‌ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్‌తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. కొద్ది రోజులుగా కామెడీ పండించలేక ఇబ్బంది పడుతున్న బ్రహ్మనందం, ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు మరింత హెల్ప్ అవ్వగా, అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. సాంకేతిక నిపుణులు : చాలా కాలం క్రితమే తెలుగు తెర మీద సందడి చేసిన ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ మంచి విజయాన్నే సాధించాడు. ముఖ్యంగా నాగార్జున ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. పల్లెటూరి యాసలో నాగార్జున చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాగ్ గెటప్ విషయంలో తీసుకున్న కేర్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద పల్లె అందాలను బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఆడియోతో సినిమా రిలీజ్‌కు ముందే మంచి విజయం సాధించిన అనూప్ నేపధ్య సంగీతంతో సినిమా స్థాయిని మరో మెట్టెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : నాగార్జున, రమ్యకృష్ణ సెకండాఫ్ కామెడీ నేపధ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్ట్రాంగ్ విలనిజం లేకపోవటం స్లో నారేషన్ రొటీన్ టేకింగ్ ఓవరాల్‌గా సోగ్గాడే చిన్నినాయనా, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే మంచి ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
సంక్రాంతి సోగ్గాడు
నాన్న గారి హిట్ పాట... సెంటిమెంట్ పంచె... వాచీ... రమ్యకృష్ణ హిట్ కాంబినేషన్... గ్రామీణ నేపథ్యం... అన్నీ కలసి అక్కినేని నాగార్జున ఈ 15న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనిపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో ‘సాక్షి’ ముఖాముఖి ఇప్పుడు ఈ ‘సోగ్గాడి’ వేషం వేయాలనెందుకు అనిపించింది? తెరపై గ్రామీణ నేపథ్యపు సినిమాలు వచ్చి చాలా రోజులైపోయింది. ఎక్కువగా పట్టణ ప్రాంత కథలే వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘మనం’ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో నా మీద నడిచే ఎపిసోడ్ వచ్చింది. అయితే, అక్కడ పాత్రధారుల మధ్య అనుబంధాల లాంటివి ఏమీ చూపించలేదు. గ్రామీణ నేపథ్యంలో అవన్నీ చూపిస్తూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనే ఆలోచన చేశాం. అలా ‘మనం’ నుంచి ఈ సినిమా ఐడియా పుట్టింది. పైగా, గతంలో నేను చేసిన గ్రామీణ నేపథ్య చిత్రాలు ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’, ‘అల్లరి అల్లుడు’ బాగా హిట్టయ్యాయి. ఈ ప్రయోగాన్ని కొత్తవాడైన కళ్యాణ్‌కృష్ణ చేతికిచ్చారేం? ఇలాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటున్న టైమ్‌లోనే నిర్మాత పి. రామ్మోహన్ నాకో కథ చెప్పారు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఈ కథను మామూలు బ్యాక్‌డ్రాప్‌లో కూడా చేయవచ్చు. అలాకాక, గ్రామీణ నేపథ్యంగా మార్చి చెబితే అని ఆలోచించాం. అప్పుడు మిత్రుల ద్వారా కళ్యాణ్ కృష్ణ నేటివిటీ తెలిసిన మంచి రైటర్ అని తెలిసింది. అతనికి కథ ఇస్తే, నెలరోజుల్లో స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసుకొచ్చాడు. తెలివైన, చురుకైన అతనికే దర్శకత్వం చాన్స ఇచ్చి, మంచి టీవ్‌ును సమ కూరిస్తే సినిమా చేయిం చుకోవచ్చనుకున్నాం. నాన్నగారి హిట్ పాట టైటిల్ పెట్టారే... ‘సోగ్గాడు’ అని పెడ దామనుకున్నాం. తండ్రి, కొడుకు - రెండు పాత్రలు న్నాయని ఈ టైటిల్ పెట్టాం. సంక్రాంతి పోటాపోటీలో ఇప్పుడు రిలీజ్ ప్లాన్ చేశారేం? నిజానికి గత జనవరిలో షూట్ మొదలైంది. దసరాకు రిలీజనుకున్నాం. ఇంతలో అఖిల్ సినిమా వస్తోందని వాయిదా వేసి, సంక్రాంతికి ప్లాన్ చేశాం. మీరెప్పుడూ క్రిస్మస్ ముందు డిసెంబర్లో రిలీజ్ చేస్తారుగా! ఇది డిసెంబర్‌కు రావాల్సిన సినిమా కాదు. పండగ సీజన్లో రావాల్సిన ఫెస్టివల్ మూడ్ ఫిల్మ్. ఆ మాటకొస్తే, అంతా డిసెంబర్ రిలీజంటే బ్యాడ్ సీజన్ అనుకొనే రోజుల్లోనే, క్రిస్మస్ ముందు ‘మన్మథుడు’ రిలీజ్ చేశా. ఆ సంక్రాంతికి 3 సినిమాలుండడంతో, క్రిస్మస్ సెలవుల్లో సోలోగా రావచ్చని అలా చేశా. హిట్ వచ్చింది. తర్వాత ‘మాస్’కు అదే చేశా. డిసెంబర్లో సినిమాల రిలీజ్ ట్రెండ్ నేను సెట్ చేసిందే. ద్విపాత్రాభినయం, ఒక పాత్ర ఆత్మ అని ముందే చెప్పాశారే! హాలీవుడ్‌లోలా ట్రైలర్లోనే కథ నేపథ్యం చెప్పి, జనాన్ని సిద్ధం చేయడాన్ని నేను ఇష్టపడతా. నమ్ముతా. అలా ట్రైలర్ చూసుకొనే, నేను సినిమాలకెళతా. అందుకే, ‘రాజన్న’కీ ముందే కథ చెప్పేశా. నేపథ్యం చెప్పినా ట్విస్టులు చెప్పం కాబట్టి ఏం ఫరవాలేదు. ‘సోగ్గాడే...’కి కూడా రెండో ట్రైలర్లోనే చాలామంది గర్లఫ్రెండ్స ఉన్న తండ్రి బంగా ర్రాజు పాత్ర ఆత్మ అనీ, అమెరికా నుంచొచ్చిన డాక్టర్‌గా కొడుకు రామ్ పాత్ర వట్టి అమాయకుడనీ చెప్పేశాం. ఆత్మంటున్నారు. మీరు కూడా హార్రర్ కామెడీ, థ్రిల్లర్ల బాటలో.. లేదు లేదు. నాకు హార్రర్ సినిమాలిష్టం లేదు. వర్మ అప్పట్లో ‘శివ’ బదులు ‘రాత్’ తీద్దామంటేనే వద్దన్నా. సోగ్గాడే..లో బంగార్రాజు ఆత్మ భయపెట్టదు. కవ్వించి, నవ్విస్తుంది. ఇది చూశాక పిల్లలు బంగార్రాజు ఆత్మ లాంటి ఫ్రెండ్ ఉండాలనుకుంటారు. ఇక, ఫ్యామిలీలు మెచ్చే రొమాన్స ఉంది. పాము, గుడి లాంటి ఫ్యాంటసీ అంశాలున్నాయి. సినిమా అర్థమవుతుందా? లేక క్లిష్టమైన స్క్రీన్‌ప్లేతో ఏమైనా..! అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఆ మాటకొస్తే, ‘మనం’ కథ విన్నప్పుడు చాలామంది క్లిష్టమైన స్క్రీన్‌ప్లే అన్నారు. కానీ, జనానికి అర్థమైంది, నచ్చిందిగా. తాపీగా పాప్ కార్న తింటూ పక్కకు తిరిగినా, మళ్ళీ తెరపై చూస్తే కథ అర్థమవ్వాలని నేను భావిస్తా. ఇది అలానే ఉంటుంది. సినిమాకు రీషూట్స్ కూడా చేశారని వార్తలు వచ్చాయి! నేనెక్కువ టీమ్ వర్కను నమ్ముతా. మరీ ముఖ్యంగా, కొత్త డెరైక్టర్‌కి టీవ్ువర్క అవసరం. నిర్మాతగా నేనెప్పుడూ కథ ఫైనలైజ్ చేశాక టీమ్ లోని ఆ యా శాఖల హెడ్సతో కలసి కూర్చొని, చర్చిస్తాం. సినిమా తీసి ఎడిటింగ్ పూర్తయ్యాక చూసి, మళ్ళీ చర్చిస్తాం. దీనివల్ల లాజిక్లలో తేడాలు, లోటుపాట్లు సరిచేసుకోవచ్చు. ఈ సినిమాకీ అంతే. సెప్టెంబర్‌లో షూటింగైపోయాక, కొత్త రైటర్సని కూడా కన్సల్ట్ చేసి, 5-6 రోజులు రిపేర్లు, రీషూట్లు చేశాం. అలా చేయడం ఈజీ. అంతేకాక, దానివల్ల తుది ప్రొడక్ట్‌లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదే చేశాం. ఏమైనా ఈ చిత్ర స్క్రీన్‌ప్లే, డెరైక్షన్‌కి మెయిన్ కళ్యాణ్‌కృష్ణ. 80 శాతం అతనిదే. మిగిలినది టీమ్ వర్క. కథలో ఏ పాయింట్, ఎక్కడ బయటపెడుతూ, ఆసక్తిగా కథను నడపాలో సత్యానంద్ గారి లాంటి సీనియర్ గైడ్ చేశారు. నవంబర్ నుంచి డి.ఐ, ఆర్ఆర్ లాంటి ముస్తాబులు చేశాం. డిసెంబర్ 31న అందరం ఫస్ట్ కాపీ చూసేశాం. అదే యథాతథంగా సెన్సార్‌కీ పంపిన కాపీ. కానీ, మీ గత సోషియో ఫ్యాంటసీ ‘ఢమరుకం’ రిజల్ట్... (మధ్యలోనే) నా కెరీర్లో ‘మనం’ తర్వాత అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమా అంటే అదే. రూ. 30 కోట్లొచ్చింది. సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేయకపోవడం దానికి దెబ్బయింది. ఈ సినిమాకు మీరు ఏయన్నార్‌గారి పంచె, వాచీ వాడారట. అవును. ఏయన్నార్ పంచెలని నాన్న గారి పంచెలు ఫేమస్. నేను, నాగచైతన్య, అఖిల్ ముగ్గురం కలసి పంచెకట్టులో టీవీ చానల్లో ప్రమోషన్ కోసం కనిపించాం. ఇక, ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ, హంసానందిని ఇలా చాలామంది గర్లఫ్రెండ్స ఉన్నా, ‘కృష్ణకుమారి’ అనే మరో గర్లఫ్రెండ్ పాత్ర కూడా ఉంది. అదెవరన్నది సస్పెన్స. మొత్తానికి రొటీన్ సినిమాలకు భిన్నంగా రూట్ మార్చారు. అవును. ‘భాయ్’ తర్వాత ఇక రొటీన్ సినిమాలు చేయరాదనీ, చేసినా జనం చూడరనీ అర్థమైంది. 32 ఏళ్ళుగా చేస్తున్నా. కొత్తరకం సినిమాలు చేయాల్సిన ఏజ్, టైమ్ వచ్చేసింది. మీ తదుపరి చిత్రం ‘ఊపిరి’ ఆ వరసలోదేనా? అది ఫ్రెంచ్ సినిమా ‘ఇన్‌టచబుల్స్’కి రీమేక్. నేను వీల్‌ఛైర్‌కే పరిమితమైన పాత్ర చేస్తున్నా. పూర్తి ఎంటర్టైన్ మెంట్. నేను, కార్తీ నటిస్తున్నాం. ముందుగా చిన్న ఎన్టీయార్ అనుకున్నా, ‘నాన్నకు ప్రేమతో’ డేట్స్క్లాష్తో కుదర్లేదు. మీరూ, బాలకృష్ణ కలసి మల్టీస్టారర్ చేసే ప్లాన్ ఏమైంది? అనుకున్నాం కానీ, కుదర్లేదు. దర్శక, నిర్మాతలెవరన్నా వస్తే చేయడానికి రెడీనే. నేను నటిస్తూ, రీమేక్ చేయాలన్నా- నాన్న సినిమాల్లో కూడా ‘డాక్టర్ చక్రవర్తి’ లాంటి మంచి సినిమాలున్నాయి. కానీ, వాటిని చేసే డెరైక్టర్‌స కావాలి. ‘శివ’ చిత్రం డిజిటలైజ్ చేశారన్నారు. రిలీజెప్పుడు? రీరిలీజ్ చేద్దామంటే, గ్యాప్ లేకుండా రిలీజ్లొస్తున్నాయి. కొన్నినెలలుగా ప్రతివారం ఇన్నేసి ఫిల్మ్స్ రావడం ఇబ్బందేగా! ఇబ్బందే. ఇన్ని రిలీజైతే, బాగున్నా ఇన్ని సినిమాలు జనం చూడలేరు. కాబట్టి, ఎగ్జిబిటర్సలో ప్లానింగ్ ఉండాలి. కానీ, సంక్రాంతి లాంటి పండగలకు ఒకేసారి చాలా సినిమాలు వస్తాయి. ప్రతిసారీ అంతే. వచ్చేసారీ అంతే. ఈసారి నందమూరి, అక్కినేని వంశాల పోటీ అని టాక్? అటువంటిదేమీ లేదు. అయినా, నన్ను వివాదాల్లోకి లాగకండి బాబూ. 32 ఏళ్ళుగా చేస్తున్నా. మంచి సినిమాలు నటించడం, నిర్మించడమే తప్ప, నేను అవుట్ ఆఫ్ ది రేస్. నాన్న గారు పోయి రెండేళ్ళవుతోంది. స్మారకచిహ్నాలేమైనా? విగ్రహాలు పెట్టడం లాంటివి నాన్న గారు, మేమూ నమ్మం. జనవరిలో కాదు కానీ, ఏటా నాన్న గారి పేరిట జాతీయ అవార్డులివ్వడం కొనసాగిస్తాం. అలాగే, చాలా ప్లాన్స ఉన్నాయి. అవన్నీ త్రీడీ ప్రెజెంటేషన్ చేసి మరీ చెబుతా. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మీకు ఆత్మతృప్తి నిస్తోందా? బాధల్లో ఉన్నవారి నుంచి విజేతల దాకా అందరి మాటలూ పంచుకొనే వేదికగా తృప్తి ఉంది. మార్చి దాకా ఆ షో షూటింగ్‌తో బిజీ. ‘అఖిల్’ సినిమా రిజల్ట్ ఎక్కడ తేడా వచ్చింది? నిరాశపడ్డారా? కచ్చితంగా నిరాశపడ్డాం. కానీ దర్శకుడు వినాయక్, నిర్మాతల లోపమేమీ లేదు. కొత్తతరం హీరో మళ్ళీ అవే డ్యాన్సలు, ఫైట్స్ చేస్తే చూడరనీ, కొత్త ఆలోచనలు, కథలతో వెళ్ళాలనీ విలువైన పాఠం అఖిల్ తొలి సినిమాకే నేర్చుకున్నాడు. నేను 8 సినిమాల తర్వాత గ్రహించి, మణిరత్నం గారిని పట్టుకొని ‘గీతాంజలి’ చేశా. అది, ‘శివ’ తరువాతే నన్ను జనం స్టార్‌గా అంగీకరించారు. అఖిల్ తరువాతి సినిమా ‘యే జవానీ హై దివానీ’ అట? అది అఖిల్ ఫస్ట్ సినిమాకు 6 నెలల ముందనుకొన్న మాట. అఖిల్‌కు అలాంటి సినిమా ఛాయలైతే బాగుం టుందని కొందరు దర్శకులతో ప్రస్తావించా. అంతే తప్ప ఆ ఫిల్మ్ చేయాలని కాదు. ఆ వార్త ఇప్పుడు బయటకొచ్చింది. ఇంట్లో మీరు, అమల, నాగచైతన్య. అఖిల్ అందరూ ఇప్పుడు నటనతో బిజీ అయిపోయారు? మాట్లాడే టైం దొరకుతోందా? హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. చాలామంది రాత్రి భోజనం దగ్గరే... కబుర్లతో సరిపెడతారు. అది సరైనది కాదు. అక్కడ తిండి ఎంజాయ్ చేయాలి. మా ఫ్యామిలీ మెంబర్స రోజూ కనీసం 2-3 గంటలు మాట్లాడుకుంటాం. పైరసీపై చర్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి విజ్ఞప్తి చేశారు? అవును. ఇక్కడ పైరసీ చేస్తే 500 జరిమానాతో సరిపెట్టేస్తారు. కానీ, తమిళనాట నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, మూడు నెలల జైలు. అందుకే అక్కడ తమిళ సినిమాలు పైరసీ కావు. అలాంటి జీవో ఇక్కడా తేవాలి. కేటీఆర్ మీకు క్లోజ్... మీకు ఫ్యాన్ అట? రామ్(కేటీఆర్) నాకు పదేళ్ళుగా తెలుసు. మంచి ఫ్రెండ్. స్టూడియోను రిలయన్స్‌తో కలిసి విస్తరిస్తున్నారని అప్పట్లో...? (అందుకుంటూ...) అవన్నీ తప్పుడు వార్తలే. కాకపోతే, చాలా ప్లాన్స ఉన్నాయి. అందులో తొలి అడుగు ‘అన్నపూర్ణా ఏడెకరా’ల్లో కట్టిన ఫ్లోర్లు, పెట్టిన వసతులు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్లు కూడా మాకిలాంటి స్టూడియోలు లేవే అని బాధపడుతున్నారు, మన తెలుగు పరిశ్రమకిది వర ం. అన్నపూర్ణా ఫిల్మ్ స్కూల్ ఎలా నడుస్తోంది? అద్భుతంగా రన్ అవుతోంది. బిజినెస్ గురించి చదివే వాళ్లకి ఐఎస్బీ లాగా, సినీపరిశ్రమకు ఈ స్కూల్ అవుతుంది. - రెంటాల జయదేవ