Srikakulam
-
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
నాలుగు నెలల్లోనే బాబు సర్కార్ ఘోర వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో లైంగికదాడికి గురైన బాలికల కుటుంబాన్ని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.అనంతరం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో బాలికలపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశామన్నారు.‘‘నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నాలుగు నెలల్లో భారీగా పెంచారు. చంద్రబాబుకు అబద్దాల చెప్పడం ఎప్పుడూ అలవాటే. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ నిర్మించిన, ఇక్కడ ప్రజలకు 700 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’’ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. -
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ బరితెగింపు
-
కూటమి ప్రభుత్వంలో ఆగని అఘాయిత్యాలు
-
బిగ్ బాస్ 'ప్రియాంక సింగ్' ఇంట్లో విషాదం
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున ఆమె తండ్రి బీబీ సింగ్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. తన తండ్రి మరణించారని సోషల్ మీడియా ద్వారా ప్రియాంక సింగ్ ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె స్నేహితులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని ఓదార్చుతున్నారు.శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందే. సాయితేజగా ఉన్న తను లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. అయితే, తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం మొదట తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచారు. అయితే, బిగ్‌బాస్5 హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తానొక ట్రాన్స్‌జెండర్ అనే విషయం తన తండ్రికి తెలియాలని ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్ చేయించుకున్నట్టు, అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపారు.కొంత కాలం తర్వాత ప్రియాంక సింగ్ నిర్ణయాన్ని బీబీ సింగ్ కూడా గౌరవించారు. తన తండ్రికి ఓ ప్రమాదంలో కళ్లుపోతే .. అన్నయ్యలు, చెల్లెల్లు తమకు పట్టనట్లు ఉండటంతో తానే తల్లిదండ్రుల బాధ్యతలు స్వీకరించినట్లు ప్రియాంక చెప్పింది. ఈ క్రమంలో వారికి ప్రియాంక సొంత ఇల్లు కూడా కట్టించారు. ఎంతో ఇష్టమైన తన తండ్రి మరణంతో ప్రియాంక సింగ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. -
అమ్మానాన్నను విడిచి ఉండలేక.. జడ రిబ్బనతో చిన్నారి ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి ఉండలేక ఏడవ తరగతి విద్యార్థిని తనువు చాలించింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడవ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను గురువారం ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేధనకు గురైంది. తల్లిదండ్రులు వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
పేదలపై కక్ష! దుర్మార్గంగా టీడీపీ నేతలు
-
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. -
లావేరు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న అదపాక గెడ్డ
-
టీడీపీ గూండాల దాడిలో YSRCP కార్యకర్త మృతి
-
అర్ధరాత్రి పచ్చ మూక అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అర్దరాత్రి అరాచకం.. టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు. -
ఆ తీరమంతా..సువాసనంట
ఆ వంశధార తీరానికి చేరుతూనే బిర్యానీ సువాసన స్వాగతమంటూ పిలుస్తుంది. ఊరి పొలిమేరలోనే ఆ వాసనకు కడుపులో జఠరాగ్ని రాజుకుంటుంది. ఒక్కో వీధి దాటుకుంటూ వెళ్తుంటే ఆకలి అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఎర్రగా కారం పట్టిన మాంసం ముక్కను మధ్యలో దాచుకున్న ఓ బిర్యానీ ముద్ద నాలిక కొసన తగలగానే కడుపు, మనసు రెండూ ఆనందాన్ని ప్రకటించేస్తాయి. వసప బిర్యానీ చేసే మాయ ఇది. 200 గడపలుండే ఈ చిన్న ఊరు బిర్యానీకి పెట్టింది పేరు.కొత్తూరు: కొత్తూరు నుంచి నివగాం వెళ్లే పాలకొండ–హడ్డుబంగి రోడ్డుకు ఆనుకుని ఉండే చిన్న గ్రామం పేరే వసప. కొత్తూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. ఊరు చిన్నదే అయినా నిత్యం ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్, హడ్డుబంగి, కాశీనగర్, పర్లాఖిమిడితో పాటు ఉమ్మడి జిల్లాలోని కొత్తూరు, పాతపట్నం, పలాస, పాలకొండ, సీతంపేట, హిరమండలం, భామినితో పాటు జిల్లా కేంద్రం శ్రీకాకుళం వాసులు కూడా నిత్యం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి బిర్యానీ రుచి అలాంటిది మరి. శ్రీకాకుళానికి వీఐపీలు ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి పొట్లాలు పట్టుకెళ్లాల్సిందే. నాణ్యమైన బియ్యం, మసాలా ది నుసుల వాడకమే ఇక్కడి రుచికి కారణమని తయారీ దారులు చెబుతుంటారు. వసప గ్రామంలో మొదటి సారిగా బిర్యానీ పెట్టిన కొయిలాపు వెంకటరావు దగ్గర రుచి భలేగా ఉంటుందని తిన్నవారు చెబుతుంటారు. ఆ రోడ్డుపక్కగా వెళ్తూ బిర్యానీ కొనని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉదయం 10 గంటలు నుంచి రాత్రి వరకు అక్కడ బిర్యానీ ఘుమఘుమలాడుతూనే ఉంటుంది. కార్తీకం వచ్చిదంటే చాలు ఇక్కడ ఖాళీ ఉండదు. శుభకార్యాల భోజనాలు, యువకులు పార్టీల కోసం వసపనే ఆశ్రయిస్తారు. అక్కడ మొత్తం 8 బిర్యానీ పాయింట్లు ఉన్నాయిప్పుడు.హైదరాబాద్‌లో నేర్చుకున్నా..దమ్ బిర్యానీ కోసం ముందుగా వేడి చేసిన నీటిలో బియ్యం ఎసరు పెడతాను. మసాలా దినుసులు మంచి కంపెనీలవి తీసుకుంటాను. నాణ్యమైన బియ్యం కొనుగోలు చేస్తాను. వీటితో నా శైలిలో దమ్ బిర్యానీ తయారు చేస్తాను. నేనూ హైదరాబాద్‌లోనే ఈ విద్య నేర్చుకున్నాను. – కొయిలాపు వెంకటరావురుచి అమోఘంవసప బిర్యానీ చాలా బాగుంటుంది. ఒడిశా నుంచి వచ్చి కొంటూ ఉంటాను. వెంకటరావు దగ్గర బిర్యానీ మరింత రుచికరంగా ఉంటుంది.– పి.రవి, హడ్డుబంగి, ఒడిశా -
వద్దన్నా వచ్చేవాడు.. పైన చేతులు వేసి
-
కనుమరుగవుతున్న బుడితి కళాకారులు..
-
ఆ యాప్‌లు చెల్లవు
కరెంటు బిల్లు.. పాతపట్నం:విద్యుత్ బిల్లుల చెల్లింపులో కీలకమైన మార్పులు జరిగాయి. డిజిటలైజ్ అయ్యాక చాలా మంది విద్యుత్ బిల్లులను ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐల ద్వారా నేరుగా కట్టేసేవారు. కానీ ఇప్పుడలా కుదరదు. యూపీఐ యాప్ ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఏపీఈపీడీసీఎల్ స్వస్తి పలికింది. ఇక నుంచి కేవలం ఏపీఈపీడీసీఎల్ వెబ్ సైట్, ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీల ద్వారా చెల్లింపులకు నో చెప్పింది. ఇందుకోసం ఈస్ట్రన్ పవర్ మొబైల్ యా ప్ను సిద్దం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనల నేపథ్యంలో ఇకపై ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశాలు జారీ చేశారు.కొత్త మార్గదర్శకాలువిద్యుత్ బిల్లులను చాలామంది వినియోగదారులు కౌంటర్లలో చెల్లిస్తారు. గ్రామాల్లో నెలకు ఒకసారి ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించిన సిబ్బంది వచ్చి కట్టించుకుంటున్నారు. మరి కొందరు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వెబ్సైట్, మొబైల్ యాప్ లలో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ వాటి నుంచే జరుగుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఆర్బీఐ భారత్ బిల్ పేమెంట్స్ మార్గదర్శకాల ప్రకారం నేరుగా యాప్‌ల నుంచి చెల్లింపులను నిలిపివేశారు.పేమెంట్ సులభంసాధారణంగా యాప్‌ల ద్వారా బిల్లు చెల్లించడం చాలా సులువుగా ఉండడంతో చాలా మంది వినియోగదారులకు ఆ విధానంలో కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ బిల్లుల చెల్లింపు విషయంలో కూడా సులభమైన పేమెంట్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేర కు ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని ప్రజలకు చేరువ చేసింది.డౌన్లోడ్ చేసుకునే విధానంAఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలనుకునే వినియోగదారులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. దీని ద్వారా చాలా సులభంగా బిల్లులు కట్టవచ్చు.A వెబ్సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలనుకునే వినియోగదారులు డబ్లూడబ్లూడబ్లూ.ఏపీఈస్ట్రన్పవర్.కమ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.A యాప్, వెబ్సైట్లలో బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలుఫోన్పే, గూగుల్‌పే, పేటీఎంలతో ఇక కుదరదుఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా బిల్లుల చెల్లింపులుచాలా సులువుఈస్ట్రన్ పవర్ యాప్‌ను, వెబ్సైట్ల ద్వారా వినియోగదారులు చాలా సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. ఈ మేరకు పాతపట్నంతో పాటు, టెక్కలి డివిజన్, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ద్వారా అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి సంస్థ ఈ విధమైన చర్యలు చేపట్టింది.– జి.ప్రసాదరావు,డీఈఈ, విద్యుత్‌శాఖ, పాతపట్నం -
ఆగని టీడీపీ గుండాల దాడులు పచ్చని పల్లెలో కక్ష పెట్టిన "కారు" చిచ్చు
-
"మా జీతాలు ఎక్కడ ?" రిమ్స్ ఉద్యోగుల నిరసన
-
శ్రీకాకుళంలో తండేల్
శ్రీకాకుళంలో ల్యాండ్ అయింది ‘తండేల్’ టీమ్. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ‘లవ్‌స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్యతో ఈ సినిమా కోసం మళ్లీ జోడీ కట్టారు సాయి పల్లవి. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత నాగచైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.2018లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్‌లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీకాకుళంలో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో నాగచైతన్య, సాయి పల్లవిపై లవ్, ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
సిక్కోలులో తండేల్ టీమ్.. చైతూకు మాస్ వెల్కమ్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మాస్ వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.Fans Celebrating Visuals Before Chay Arrival !! #ChayMass 💥 Dhullakotti Dhupameseyyala .. #Thandel ♥️⚓ Guri Thappedheles #NagaChaitanya @chay_akkineni Nuvvante Abhimanam Gundela Ninda Kani Thanks Custody Lu Antene Badha🙇Jai Chaithu Jai Jai Chaithu 💥🥳 https://t.co/SCGOeQ58el pic.twitter.com/KPv62UssGT— Chay (@PurnaMaaya_) June 19, 2024Srikakulam resonated with "Jai chaithu" slogans 🔥❤🔥🤙Yuva Samrat @chay_akkineni arrived to srikakulam for #Thandel Shoot ⚓#Nagachaitanya @ThandelTheMovie @GeethaArts pic.twitter.com/6TiK9owOGC— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) June 19, 2024తండేల్ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వెళ్లిన నాగచైతన్య ,సాయి పల్లవి కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అరసవల్లి టెంపుల్ దర్శనం కు వెళ్లిన సాయిపల్లవి చూసెందుకు ఫ్యాన్స్ ఉత్సాహాం చూపారు..#nagachaitanya #Saipallavi#Thandel #ramayan pic.twitter.com/5WgINPftRN— suzen (@Suzenbabu) June 19, 2024 -
కూన ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటనలో మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? మరేదైనా కారణం ఉందా అన్నది తెలీదు గానీ టీడీపీలో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కూన రవికుమార్ గుర్రుగా ఉండటం వల్లనే రాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.మంత్రి పదవిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ అంచనాలు తలకిందలయ్యాయి. కింజరాపు ఫ్యామిలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపారే తప్ప కూన రవికుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. ప్రెస్మీట్లు, సమావేశాలు పెట్టి నిరసన కూడా తెలియజేశారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా సమయం వచ్చి నప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళింగులు ఎన్ని చేసినా ఫలి తం కనిపించడంలేదు. చంద్రబాబు నుంచి సాను కూలత రావడం లేదు. చిన్నా చితకా పదవి ఇచ్చి సరిపుచ్చుకునేలా ఉన్నారు. ఈ క్రమంలో భారీ ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ కూడా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవమిదా అని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు.కూన రవికుమార్‌తో పాటు కాళింగ సామాజిక వర్గమంతా అసంతృప్తితో ఉన్న వేళ.. జిల్లాలోకి అడుగు పెట్టిన కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు ఒక వర్గం హాజరు కాలేదు. సోమవారం రాత్రి జరిగిన ఆత్మీయ సభలోనూ పాల్గొనలేదు. మంగళవారం జిల్లా అధికారులతో జరిగిన తొలి సమావేశం ప్రాంగణానికి కూడా రాలేదు. ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సభకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. కానీ, కూన రవికుమార్, బెందాళం అశోక్ ఎక్కడా కనిపించలేదు. మంగళవారం జెడ్పీలో జరిగిన అధికారుల సమావేశంలో కూడా వీరిద్దరూ పాల్గొనలేదు. కాళింగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపారన్న అసంతృప్తితో ఉద్దేశకపూర్వకంగా గైర్హాజరయ్యారా? లేదంటే మరే కారణం చేతో రాలేదా? అన్నది తెలియదు గాని పార్టీ శ్రేణులు మాత్రం కాళింగులకు జరిగిన అవమానం వలనే దూరంగా ఉండి ఉండవచ్చని అని చర్చించుకుంటున్నాయి. -
పసుపు బిళ్ల .. అచ్చెన్న తొలి జెల్ల!
‘ నేను మాటిస్తున్నాను.రేపు అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను.రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరకు వెళ్లినా..ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా.. ఎండీఓ దగ్గరకు వెళ్లినా..ఏ ఆఫీసుకు వెళ్లినా..మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి.. మీ పనేంటి అని అడిగి మీ అందరికీ పనిచేయించే విధంగా అధికారులను లైనులో పెడతాను.ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా’..కార్యకర్తల ఆత్మీయ సభ, ఉద్యోగుల తొలి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.ఇప్పుడీ వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియానూ కుదిపేస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు రాష్ట్రంలో సంచలనంతో పాటు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకొచ్చాక చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను కుదిపేశాయి. టీడీపీ శ్రేణులను ప్రభుత్వ కార్యాలయాలకు దూకుడుగా వెళ్లేలా ప్రోత్సహించేలా ఉన్నాయి.అచ్చెన్నాయుడుకు మంత్రిగా పనిచేయడం కొత్తేమీ కాదు. 2014–19లో కూడా పనిచేశారు. అప్పట్లో కూడా కాస్త కటువుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఈ సారి అలా ఉండబోరని, ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చిన తొలి పర్యటనలోనే ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయా వర్గాలు స్వీకరించలేకపోతున్నాయి. జాగ్రత్తగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రండి, ప్రజల్ని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి, ఏదైనా పనుల కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే చూసి చేయండి, ప్రభుత్వ లైన్లో పనిచేయండి అనే విధంగా ఎవరైనా మాట్లాడుతారని.. కానీ అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు హెచ్చరిస్తూ మాట్లాడటాన్ని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.‘టీడీపీ కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ల వేసుకుని వెళ్లండి. అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు. ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు’ అని కార్యకర్తల ముందు చెప్పడం సరికాదని ఉద్యోగులు బాధపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బెదిరింపు ధోరణిగానే ఉన్నాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సంచలనమయ్యాయి. సోషల్ మీడియాలోనైతే హల్చల్ చేశాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి. -
కింజరాపు ఫ్యామిలీకి డబుల్ బొనాంజా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు. వారి ఆశలపై నీళ్లు.. వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్యాట్రిక్ విజయాలు.. టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. -
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయస్సులో.. ఎంపీ రామ్మోహన్నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్‌సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కుటుంబ నేపథ్యం.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం రామ్మోహన్నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
కుమారుడి మృతి తట్టుకోలేక..
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి నిరోష అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కుమారుడు సాయివినీత్ మంగళవారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. తన కుమారుడు కళ్లెదుటే కాలి బూడిదవ్వడంతో చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇక తానెందుకు బతకాలి అంటూ కుమిలిపోయి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మొత్తంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టెక్కలి జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.