srikalahasti
-
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. నెల్లూరుకు చెందిన వినయ్(23), హేమలత(23) ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. తిరుమల దర్శనార్థం శుక్రవారం బయలుదేరారు. శనివారం తిరిగి నెల్లూరుకు బైక్‌పై వెళుతుండగా శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద హేమలత బ్యాగు లారీకి చిక్కుకోవడంతో ఆమె లారీ కింద పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందింది. వినయ్ స్వల్పగాయాలతో బయటపడడ్డాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో రిసార్ట్ కూల్చివేతకు కుట్ర
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి తెగబడుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 175 నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున 2017 టీడీపీ హయాంలోనే నిర్మించిన రివర్వ్యూ రిసార్ట్‌ను... నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అల్లుడు శేఖర్‌రెడ్డికి చెందిన రిజి్రస్టేషన్ స్థలంలో రివర్ వ్యూ రిసార్ట్ నిరి్మంచారు. రిసార్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెంచురెడ్డి కుమార్తె వెల్లడించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేసింది. అందువల్లే వారిపై శేఖర్‌రెడ్డికి చెందిన రివర్ వ్యూ రిసార్ట్‌ను కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామునే వచ్చి... మున్సిపల్ అధికారులు, పోలీసులు శనివారం వేకువజామున రివర్ వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులలో ఏమిటీ దౌర్జన్యమని నిలదీశారు. అప్పటికే ప్రహరీ కొంత భాగాన్ని కూల్చి వేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమన వెంటనే శ్రీకాళహస్తిలోని రివర్వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని, నిబంధనలు పాటించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హోటల్ వద్దకు చేరుకుని నిర్మాణాలు కూల్చివేతను తప్పుబట్టారు. ఇంతలోనే మరోసారి అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్, అధికారులకు చదివి వినిపించారు. రిజిస్టర్ భూమిలో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని? అక్రమ నిర్మాణమే అయినా వారం ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ నిర్మాణాలు అయినా శని, ఆదివారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పోలీసులు వెనకడుగు వేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ కమిషనర్, పోలీసులపై ఒత్తిడి రావటంతో ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు. ఒకవైపు అక్రమం అంటూనే.. మరోవైపు పరిహారం చెల్లిస్తామని.. ఉదయం నుంచి రివర్వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని, కూల్చివేస్తామని అధికారులు హడావుడి చేశారు. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం ‘స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం స్థలం అవసరం ఉంది. కొంత తీసుకుంటాం. అందువల్ల కూల్చివేసిన నిర్మాణాలకు ఎంత నష్టం అయ్యిందో చెబితే పరిహారం చెల్లిస్తాం’అని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత కూల్చివేతలు నిలిపివేసి అందరూ వెళ్లిపోయారు. కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ లేని సమయంలో సాయంత్రం అధికారులు మరోసారి జేసీబీతో వచ్చి రివర్ వ్యూ రిసార్ట్ ముఖద్వారాన్ని పూర్తిగా కూల్చివేశారు. -
Tirupati: శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత..
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా ఏడు గంగమ్మల జాతర (ఫొటోలు)
-
శ్రీకాళహస్తి ఆలయం వద్ద అఘోరీ హల్ చల్
-
ఎవరి అర్థాలు వాళ్లవి...
దసరా పండుగ నాడు ఢిల్లీ ‘భారత మండపం’లోని ‘గతిశక్తి అనుభూతి కేంద్ర’ను మోదీ హఠాత్తుగా సందర్శించారు. ఆ రోజు ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కేంద్రం మూడవ వార్షికోత్సవం వేళ అక్కడికి వెళ్లి తన ప్రాధాన్యాన్ని దేశానికి వెల్లడించారు. అయితే, ఇది అందరికీ ఒకేలా అర్థం కావాలనే షరతు ఏమీ లేదు. వీటి తాత్పర్యం చంద్ర బాబుకు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డికి మరొక లాగా అర్థం కావొచ్చు. అందుకు వాళ్ళ వయస్సు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన కాలం, వారి ప్రాపంచిక దృక్పథం, మరెన్నో కారణాలు కావొచ్చు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ పదేళ్ళలో అదీ దేశానికి తూర్పున ఈ చివరన ఉన్నామేమో, ఇందులో ‘మనకు ఏముంది’ అని చూసినప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఎక్కువే ఉంది.ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15.39 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 208 భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు ఉన్నాయి. దీని అమలుకు వేర్వేరు శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం ఒక ‘నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్’ పనిచేస్తున్నది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ – ఇంటర్నల్ ట్రేడ్’ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా... ‘ఇందులో 101 జాతీయ రహదారులు, 73 రైల్వే ప్రాజెక్టులు, 12 పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, 4 చమురు–గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి’ అంటున్నారు. ఈ నాలుగు రంగాలు కూడా ప్రాంతాల మధ్య దూరాలనుతగ్గించి వాటిని చేరువ చేస్తూ, విద్యుత్తు భద్రత, పట్టణీకరణ లకు దోహదం చేస్తాయి. ఇందులో కీలకమైన అంశం ‘పి.ఎం. గతిశక్తి’... ‘బ్రాడర్ విజన్’ పేరుతో దేశవ్యాప్తంగా 1600 రకాల ‘జియో స్పైటల్ డేటా’ను సేకరించి ఈ ‘నేషనల్ మాస్టర్ ప్లాన్’ ప్రాజెక్టు కోసం ఇక్కడ భద్రపరుస్తున్నారు. పక్కా ‘డేటా’తో అభివృద్ధి ప్రణాళికల తయారీకోసం వీటిని సేకరిస్తున్నారు. ఇందులో ‘నేచురల్ రిసోర్సెస్ డేటా’ సేకరణ ఒక అంశంగా ఉంది. ప్రాంతాల స్వరూపం తెలి యడం కోసం ‘ల్యాండ్ రికార్డ్ డేటా’ అవసరం. అలాగే సాగు కోసం భూగర్భ జలాల వినియోగం ఎంతో తెలియడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చాలి. నిజానికి ఇవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన వీటిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో అల్లరి చేసిందీ తెలిసిందే. ‘అభివృద్ధి’ గురించి ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మార్చి 2023లో విశాఖలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏమిటో చూడాలి. ఇందులో కీలకం ఏమంటే, ఆయన దృష్టి ఆసాంతం ఢిల్లీ నుంచి కిందికి దక్షిణాదికి దిగే క్రమంలో ఢిల్లీ యంత్రాంగాన్ని నేరుగా తూర్పు తీరానికి చేర్చడంపై పెట్టారు. ‘ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి అక్కణ్ణించి నాగపూర్ వచ్చి అక్కణ్ణించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని చెబుతూ... ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయనీ, అవి పూర్తి అయితే వాటిలో ఒకటైన ‘రాయపూర్–విశాఖపట్టణం’ రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు ఏపీ పోర్టులు అందుబాటులోకి వస్తాయనీ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ. 33.540 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్నామన్నారు. ఇలా ఢిల్లీ నుంచే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణాన మన సముద్ర తీరానికి రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరవచ్చన్నారు. సరే, ఇది విని ‘ఎందుకు?’ అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నాలుగు నెలల తర్వాత కాకినాడలో దొరికింది. అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ ప్రారంభానికి హాజరై ఆంధ్ర సముద్ర తీరం డిల్లీకి ఎంత కీలకమో చెప్పకనే చెప్పారు. ఇక వెనకబడిన మెట్ట కరవు ప్రాంతాలను ‘ఓపెన్’ చేయడానికి నడికుడి– శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ మార్చి నాటికి పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనదైన సంక్షేమ ముద్రను ప్రతి రంగం మీద వేసింది. కుర్చీ ఎక్కిన ఆరు నెలల్లోనే వచ్చిన ‘కరోనా’ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోనే ‘ఏపీ’ ముందు నిలిచింది. జగన్ ముందు చూపు అప్పట్లో అందరికీ అర్థం కాలేదు. కేంద్రం ‘గతిశక్తి సంఘటన్’ పేరుతో చేస్తున్న మౌలిక వసతుల కల్పన వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ ప్రభుత్వం ప్రజల పాటవ నిర్మాణం (కెపా సిటీ బిల్డింగ్) పై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, విద్య–వైద్యం ప్రాధాన్యత పెంచింది. కొత్త జిల్లాలతో ప్రభుత్వాన్ని, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్యాన్ని కొత్త ప్రాంతాలకు చేర్చింది. నైపుణ్యాలు తప్పనిసరి అయ్యే సామాజిక వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవిక కోసం ‘స్కిల్ డెవలప్మెంట్’పై దృష్టి పెట్టింది. అయినా ఎన్నికలప్పుడు ‘అభివృద్ధి ఏది?’ అనే విమర్శ చేయడం చాలా తేలిక. కానీ ‘అభివృద్ధి’ అంటే ‘మానవాభివృద్ధి’ అని అర్థమయ్యేట్టుగా చెప్పడం మరీ కష్టం. వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
గుడి కూల్చేసిన టీడీపీ నేత
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీ«ధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమేగాక అడ్డుకున్న కాలనీవాసుల్ని బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి నాలుగు నెలల కిందట ఆరడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు.ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారి అయిన టీడీపీ నేత వెంకటేష్ శెట్టికి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరూ కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి, కడుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో రెండడుగుల మేర ఉందని మార్క్ వేశారు. ఆ రెండడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి, మండల సర్వేయర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్‌శెట్టి జేసీబీతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు.అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానంటూ బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే రూ.2.5 లక్షలు ఖర్చయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సర్వేయర్ హరిని అడగగా.. వెంకటేష్ స్థలంలో రెండడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్నా గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు కుందేటివారి వీధి ఎస్టీకాలనీ వాసులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. ఇక్కడ అందరూ రోజువారీ కూలీలే. పైసాపైసా కూడబెట్టి గ్రామదేవత గంగమ్మ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఆపై దాతల సాయంతో కొంత మొత్తాన్ని సేకరించారు. తర్వాత వారే కూలీలుగా ఆలయాన్ని నిరి్మస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యాపారి వెంకటేష్ శెట్టి తన స్థలానికి బేరం కుదరడంలేదన్న సాకుతో ఆలయం మొత్తాన్ని కూల్చేసేందుకు స్కెచ్ వేశారు.సర్వేలో ఆలయం తన స్థలంలోకి రెండడుగుల మేర వచ్చిందన్న సాకుతో మరింత రెచ్చిపోయారు. ఆలయం మొత్తాన్ని రాత్రికిరాత్రే జేసీబీతో కూల్చేశారు. శిథిలాలను ట్రాక్టర్ల ద్వారా రాత్రికిరాత్రే తరలించారు. అడొచ్చినవారిపై చిందులేస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదిలేక ఆలయాన్ని కూల్చేస్తున్నా ఆవేదనగా చూస్తూ ఉండిపోయారు. వెంకటేష్ శెట్టికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడం వల్లే ఎస్టీలమైన తమపై ప్రతాపం చూపుతున్నాడని వారు మండిపడుతున్నారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
ఏర్పేడులో ఆర్. కృష్ణయ్యపై రాయితో దాడి
సాక్షి, తిరుపతి: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండల కేంద్రంలో కృష్ణయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ అగంతకుడు వెనుక నుంచి రాయి విసరడంతో ఆయన వీపునకు తగిలి గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ.. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారని తెలిపారు. పేదలకు మేలు చేస్తున్న జగన్‌కు బీసీలు అండగా నిలుద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
మా మధు అన్నకు ఈ సారి మంత్రి పదవి ఇవ్వండి అన్న
-
సంక్షేమం అందించే ప్రభుత్వమే కావాలి: శ్రీకాళహస్తి ప్రజలు
-
సీఎం జగన్ తో సెల్ఫీ కోసం బస్సు వెంట పరిగెత్తిన యువకుడు
-
డ్రైవర్లంటే చంద్రబాబుకి అంత చులకనా.. 40 రోజుల్లో మెమెంటో చూపిస్తాం..
-
కాళహస్తిలో సెల్ఫీ వీడియో.. టీడీపీ నేతపై ఆగ్రహం
తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు. ఆలయ చైర్మన్ వివరణ ఇది.. ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు -
ముగిసిన గ్రహణం..తెరుచుకున్న ఆలయం
తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. తిరుమలలో ఆదివారం ఉదయం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాల పూజలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. గ్రహణాల సమయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేకాభిõషేకాలు నిర్వహించారు. ఆదివారం వేకువజాము 1 గంటకు మొదటి కాలాభిషేకం, 1:45 గంటలకు రెండోకాలాభిషేకం, 2.30 గంటలకు మూడో కాలాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. -
26 మంది టిడిపి లీడర్లపై కేసు నమోదు
-
పోలీస్ స్టేషన్ ఎదురుగా టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి రౌడీయిజం..!
-
ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్కే గ్రూప్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు. -
టీడీపీలో టికెట్ వార్.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా?
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరింది. నేతల సంగతి దేవుడెరుగు.. కార్యకర్తలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతున్నారనే కలరింగ్ ఇస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ అభ్యరి్థత్వంపై హామీ ఇచ్చి మభ్యపెడుతున్నారు. ప్రధానంగా బొజ్జల సుదీర్‌రెడ్డి.. ఎస్సీవీ నాయుడు.. మునిరామయ్య మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అరకొరగా మిగిలిన శ్రేణుల్లో సైతం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తమ్ముళ్ల నడుమ తకరారు పెట్టి చోద్యం చూస్తున్నారు. దీంతో ఏ నేత వెంట వెళితే ఏం ముంచుకొస్తుందో అని కార్యకర్తలు అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, తిరుపతి : శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరి రోజులు గడవక ముందే ఆ పారీ్టలో కోల్డ్ వార్ మొదలైంది. నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోసం చంద్రబాబు వేసిన ఎత్తులకు బొజ్జల, ఎస్సీవీ, సత్రవాడ బలవుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆ ముగ్గురు నాయకుల మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఓటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సర్వేల్లో తేలిపోయింది. విషయం తెలిసినా.. బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్రవాడ మునిరామయ్య, ఎస్సీవీ నాయుడు నడుమ అగ్గి రాజేసి ఆజ్యం పోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థత్వం కోసం ఈ ముగ్గురు నేతలు పోటీపడుతున్నారని, అందుకే ఎవరినీ ఖరారు చేయకుండా మభ్యపెడుతూ వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తరచూ పారీ్టలు మారే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏపార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు నెరుపుతూ.. చిన్నగా అందులోనే చేరడం ఎస్సీవీ నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా టీడీపీ అధికారం కోల్పోవటంతో వైఎస్సార్సీపీలో కొనసాగుతూ శ్రీకాళహస్తిలో చక్రం తిప్పాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుండటంతో వ్యక్తిగతంగా తనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని భావించిన ఎస్సీవీ నాయుడు మరోసారి టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పార్టీలో చేరక ముందు నుంచే వర్గాలు ! శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీచేయాలనే లక్ష్యంతో టీడీపీలో చేరిన ఎస్సీవీ నాయుడు ఆరు నెలల ముందు నుంచే తమ్ముళ్లందరితో సఖ్యతగా ఉండటం ప్రారంభించారు. బొజ్జల, మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య వర్గీయులతో తరచూ మాట్లాడుతుండటం, వారిని ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా మంతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ అ«ధినేత చంద్రబాబుని కూడా తరచూ కలిసేవారని విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్‌రెడ్డిపై ప్రజల్లో సానుకూల దృక్పథం లేదని చంద్రబాబుకు పదే పదే చెప్పేవారని తెలిసింది. అందులో భాగంగానే ఎస్సీవీని టీడీపీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థగా ఎస్సీవీకి గట్టి హామీ ఇవ్వటంతోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఎస్సీవీ నాయుడు పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చారు. పార్టీని నమ్ముకుని ఉన్న బొజ్జల సు«దీర్‌రెడ్డి తనకే టికెట్ అని భావించి తన వంతు నియోజక వర్గంలో పర్యటించటం, నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడటం చేస్తున్నారు. అయితే చంద్రబాబు లోపాయికారీ ఒప్పందంలో భాగంగా ఎస్సీవీ నాయుడికే టికెట్ అనే విషయం బొజ్జలకు ఆలస్యంగా తెలియటంతో పలుమార్లు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. బస్సుయాత్రలో బయటపడిన విభేదాలు టీడీపీ నేతలు చేపట్టిన బస్సుయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తనకు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తనకు పొలం ఇచ్చారని, అందులో తననే సాగు చేసుకోమని చెప్పారని పరోక్షంగా తెలియజేశారు. సందర్భం లేకుండా ఎస్సీవీ నాయుడు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనే విషయం టీడీపీ శ్రేణులకు అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న బొజ్జల సుదీర్‌రెడ్డి మాత్రం ఎస్సీవీ నాయుడు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని, నేటి వరకు శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా మరో వైపు మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కూడా తన వంత తాను ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే పైకి తామంతా ఒక్కటేనని, ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని చిలక పలుకులు వల్లిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల బొజ్జల సు«దీర్‌రెడ్డి, ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరికి వారు తనకే టికెట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా బస్సుయాత్రలోనే ఎస్సీవీ నాయుడు, ఆయన వర్గీయులకు బొజ్జల ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులను బస్సులో ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారే ప్రచారం జరుగుతోంది. ఇలాగైతే కొనసాగలేం అడుగడుగునా అవమానాలు భరిస్తూ టీడీపీలో కొనసాగలేమని ఎస్సీవీ నాయుడు ముఖ్య అనుచరుడు శివా యాదవ్ తదితరులు ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో నిమ్న వర్గాలకు ప్రాధాన్యత లేదని మీడియా ఎదుట వాపోయారు. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ బస్సు యాత్రలో పాలుపంచుకున్న తనపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని శివ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎస్సీవీ నాయుడు అనుచరుడినని చెబుతున్నా వినకుండా బస్సు దిగమన్నాడని, అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషిస్తూ అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు నాయుడుని ఎస్సీవీ సుమారు 500 మందితో కలిశారని, అప్పుడు కూడా బొజ్జల సుధీర్‌కి టికెట్ ఇస్తామని పార్టీ అధినేత చెప్పలేదని వివరించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని మాత్రమే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ ఆఫీసుకి వస్తే దాడి చేస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, బొజ్జల సు«దీర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని శివ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు వర్గం దూసుకుపోవడం సహించలేక బొజ్జల సు«దీర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేయటం గమనార్హం. తుస్సుమన్న బస్సు యాత్ర! – వరదయ్యపాళెంలో వెలవెల పోయిన రచ్చబండ వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగ మండలం పల్లమాల నుంచి యాత్ర ప్రారంభించారు. బీఎన్‌కండ్రిగ, వేణుగోపాలపురం మీదుగా వరదయ్యపాళెంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంతో యాత్ర ముగిసింది. అయితే రచ్చబండ జనం లేక వెలవెల పోయింది. రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ వారి ఊక దంపుడు ప్రసంగాలు వినలేక జనం నెమ్మదిగా జారుకున్నారు. అంతకు ముందు వరదయ్యపాళెంలో నిర్వహించిన ర్యాలీలో సైతం పట్టుమని 100 మంది కూడా లేకపోవడం గమనార్హం. కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్షి్మ, మాజీ ఎమ్మెల్యేలు హేమలత, ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, పరసారత్నం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి హెలన్ ఉన్నారు. -
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, మృతులు విజయవాడకు చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్దలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి.. -
అల్లూరయ్య అక్రమాలు.. టీడీపీ ముఖ్యనేత సతీమణికి భారీగా అవినీతి సొమ్ము
తీగలాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగి ఇంట్లో సోదాలు చేస్తే మాజీ మంత్రి బొజ్జల అనుచరుల అక్రమాల పర్వం వెలుగుచూసింది. రాజీవ్‌నగర్‌లో నిరుపేదలకు కేటాయించిన స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వైనం పట్టణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేశారనే విషయం తెలియడంతో లబి్ధదారులు లబోదిబోమంటున్నారు. మాయమాటలు చెప్పి తమ పట్టాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో తెగనమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మరికొందరు పచ్చనేతలు అందినకాడికి స్థలాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో దివంగత నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో మంచి డిమాండ్ ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని ప్లాట్లను బొజ్జల అనుచరులు ఒక్కొక్కటిగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. అసలైన లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో అల్లూరయ్య అనే మున్సిల్ ఉద్యోగి నివాసంలో అధికారులు చేపట్టిన సోదాలో బయటపడ్డ పట్టాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌నగర్ కాలనీ పేరుతో ఇల్లులేని పేదలకు గూడు కల్పించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో అందుకు అవసరమైన భూములను సేకరించారు. సుమారు 6వేల మంది పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ నగర్ అభివృద్ధి అటకెక్కింది. తర్వాత ప్రభుత్వాలు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక కలి్పంచకపోవటంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు లబి్ధదారులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో హౌసింగ్‌శాఖలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అల్లూరయ్య మాయమాటలు చెప్పి లబి్ధదారుల పట్టాలను తీసిపెట్టుకున్నాడు. అరాకొర ధరలకే కొన్ని ప్లాట్లను అమ్ముకుని జేబులో వేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లోనే బయటపడడంతో నాటి ప్రభుత్వం వెంటనే అల్లూరయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది. టీడీపీ హయాంలో రెచ్చిపోయి.. టీడీపీ ప్రభుత్వంలో అల్లూరయ్య శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తొలుత అటెండర్‌గా చేరి అవినీతి పర్వానికి తెరతీశాడు. ఆ సమయంలోనే 30 మంది మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సస్పెండయ్యాడు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత సతీమణికి రూ.20లక్షలు ముట్టజెప్పి, 2018లో అదే కార్యాలయంలో జూనియర్ అసిప్టెంట్గా ఉద్యోగం పొందాడు. ఇక అప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లో అల్లూరయ్య ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. అదే సమయంలో అల్లూరయ్య వద్ద ఉన్న ఇంటి పట్టాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బొజ్జల అనుచరులు నలుగురు రంగంలోకి దిగారు. లబి్ధదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.100 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. దొరికిన స్థలాలను దొరికినట్లు ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. వందలాది పట్టాలు వెలుగులోకి.. రాజీవన్నగర్లో నాడు రూ.30వేలు ఉన్న ఇంటి స్థలం.. నేడు రూ.5లక్షలకు చేరడంతో అల్లూరయ్య దగ్గర ఉన్న పట్టాలను టీడీపీ నేతలు బయటకు తీయించారు. తాము ఇది వరకే సిద్ధం చేసుకున్న రూ.100 డాక్యుమెంట్లను చూపించి కొనుగోలుదారులను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. తమకు నగదు అవసరమని, అందుకే రూ.5లక్షల ప్లాటుని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకే ఇచ్చేస్తున్నామని ప్రచారం చేపట్టారు. ఆ ప్రాంతంలో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ప్లాటు వస్తుందని స్థానికులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేశారు. ఇలా సుమారు వెయ్యి ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా అల్లూరయ్య ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో మరో 2,309 పట్టాలు దొరకడం గమనార్హం. టీడీపీలోని నలుగురు నేతలు, అల్లూరయ్య చేస్తున్న అక్రమాలను తెలుసుకున్న మరికొందరు ఆ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఆక్రమించుకున్నట్లు సమాచారం. భాగోతం బట్టబయలు! రాజీవ్‌నగర్‌లో ఇంటి స్థలాలకు రేటు పలకుతుండడంతో అల్లూరయ్య దగ్గర పట్టాలు ఇచ్చిన లబి్ధదారుల్లో కదలిక వచ్చింది. తమ పట్టాలను వెంటనే ఇవ్వాలని అల్లూరయ్యను కోరారు. అయితే తన వద్ద ఎలాంటి పట్టాలు లేవని తెగేసి చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విచారణకు ఆదేశించడంతో బొజ్జల అనుచరుల భాగోతం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన డిమాండ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గం అభివృద్ధి పథంలో పయనించింది. అక్కడ జగనన్న కాలనీ పేరుతో 2 వేల మందికి పైగా పక్కాఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లే అవుట్‌ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సైతం ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. జగన్న కాలనీకి ఎదురుగానే ఉన్న రాజీవ్‌నగర్‌కి పైన కొండచుట్టు కోసం ‘దేవుడి బాట’ పేరుతో 20 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేశారు. కాలనీకి పకడ్బందీగా నీటి సౌకర్యం కలి్పంచారు. దీంతో రాజీవ్‌నగర్ కాలనీలోని ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. -
శ్రీకాళహస్తిస్వరుడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
నేటి నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీకాళహస్తిలో యాంకర్ అనసూయ పూజలు.. ఫోటోలు వైరల్