Srilanka vs Bangladesh
-
శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 2 వికెట్ల తేడాతో విజయం
టీ20 వరల్డ్‌కప్-2024ను బంగ్లాదేశ్ విజయంతో ఆరంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. శ్రీలంక ఆఖరి వరకు పోరాడనప్పటికి విజయం మాత్రం బంగ్లానే వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ధనుంజయ డి సిల్వా(21), అసలంక(19) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హోస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. టాస్కిన్ అహ్మద్ రెండు, టాంజిమ్ హసన్ షకీబ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహిద్ హృదయ్(40), లిటన్ దాస్(36) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలవగా.. ఆఖరిలో మహ్మదుల్లా(16) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో నువాన్ తుషారా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగా రెండు, పతిరాన ఒక్క వికెట్ సాధించారు. -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ సూచన మెరకు హసరంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో టెస్టు క్రికెట్‌కు విడ్కోలు హసరంగా విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న వనిందు.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ శ్రీలంక జట్టులో హసరంగా చోటు దక్కించుకున్నాడు. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వా సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వనిందు హసరంగాతో పాటు యువ క్రికెటర్లు నిషాన్ పీరిస్, చమిక గుణశేఖరలకు చోటు దక్కింది. అదేవిధంగా కుసాన్ రజితా సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 29 ఏళ్ల హసరంగా చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌తో టెస్ట్ ఆడాడు . శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర -
శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్‌తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా విజయంతో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో కీలక పాత్ర పోషించాడు. నజ్ముల్ హుస్సేన్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో శాంటో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముస్తిఫికర్ రహీమ్(73 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మధుషాన్, కుమారా తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో లియాంగే(67) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(59) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం, టాన్జిమ్ హసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఛటోగ్రామ్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే? -
BAN vs SL: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ లాహిరు కుమార పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో కుమారకు చోటు దక్కింది. అతడితో పాటు బంగ్లాతో టీ20 సిరీస్‌లో అకట్టుకున్న కమిందు మెండిస్‌కు వన్డే జట్టులో కూడా చోటు దక్కింది. అదే విధంగా ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నేకు ఛాన్నాళ్ల తర్వాత సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. ఇక వన్డే సిరీస్‌కు సైతం స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20లో ఐదు వికెట్లతో చెలరేగిన నువాన్ తుషారాకు వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. మార్చి 13 నుంచి ఛటోగ్రామ్ వేదికగా ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌ను 2-1తో లంక సొంతం చేసుకుంది. శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, కమిన్నన్‌ల దస్సన, దిల్షన్ మదుషాన, దిల్షాన్ మదుషాన , సహన్ అరాచ్చిగే, చమిక కరుణరత్నే. -
చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పించిన శ్రీలంక బౌలర్.. ఏకంగా 36 బంతులు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు. టీ20 మ్యాచ్‌లో ఓ బౌలర్ 24 బంతులు వేయాల్సి ఉండగా.. పతిరణ ఏకంగా 36 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పతిరణ తన నాలుగు ఓవర్ల కోటాలో తొమ్మిది వైడ్లు, మూడు నో బాల్స్ వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన పతిరణ.. తన స్పెల్ రెండో ఓవర్లో 2 నో బాల్‌లు, 3 వైడ్లు.. మూడో ఓవర్లో 6 వైడ్లు.. నాలుగో ఓవర్లో నో బాల్ సహా మూడు బౌండరీలు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. పతిరణ.. ఈ చెత్త ప్రదర్శనను తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలాగోలా విజయం సాధించి కాబట్టి సరిపోయింది. లేకపోతే లంక అభిమానులు పతిరణను ఆట ఆడుకునే వారు. ఓ అంతర్జాతీయ స్థాయి బౌలర్ ఒక్క మ్యాచ్‌లో ఇన్ని బంతులు వేస్తాడా అని ఏకి పారేసేవారు. కాగా, 207 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించింది. ఆతిథ్య జట్టు లక్ష్యానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (59), సమరవిక్రమ (61 నాటౌట్) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అసలంక (44 నాటౌట్) బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారీ లక్ష్య ఛేదనలో తొలుత తడబడ్డ బంగ్లాదేశ్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమదుల్లా (54), జాకిర్ అలీ (68) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్ష్యం దిశగా పయనించింది. వీరికి పతిరణ చెత్త బౌలింగ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే షనక ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి బంగ్లా గెలుపును అడ్డుకున్నాడు. -
అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అలా చేయొద్దు! బదులుగా..
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్ అవుట్’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఘాటు విమర్శలు చేశాడు. చేసిన తప్పునకు అతడికి తగిన శాస్తే జరిగిందంటూ కుండబద్దలు కొట్టాడు. అయితే, ఇలాంటి నిబంధన మాత్రం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. క్రీజులోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం(2 నిమిషాల్లో)లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఆటగాడిగా హెల్మెట్ విషయంలో జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో మాథ్యూస్ మైదానాన్ని వీడక తప్పలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలుతో ఏకీభవించిన అంపైర్లు అతడిని టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ విషయంపై క్రికెట్ వర్గాలు రెండు చీలిపోయి చర్చలు సాగిస్తున్నాయి. మాథ్యూస్ పట్ల షకీబ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాల్సిందని కొంతమంది అంటుండగా.. నిబంధనల ప్రకారం షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. అందుకు సంసిద్ధంగా లేరనే అర్థం ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం ఈ విషయంలో షకీబ్ వైపే నిలిచాడు. ‘‘బ్యాటర్లుకు సమయం చాలా ముఖ్యమైంది. ఒకవేళ టైమ్‌కి రాకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఏంజెలో మాథ్యూస్ దేనికైతే అర్హుడో అదే జరిగింది. మీకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వికెట్ పడిన వెంటనే క్రీజులోకి వెళ్లి రెండు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. ఒకవేళ మీరలా చేయలేదంటే బ్యాటింగ్‌కు చేసేందుకు మీరు సంసిద్ధులు కాలేదనే అర్థం కదా!’’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. 12 పరుగులు పెనాల్టీ విధించాలి మాథ్యూస్ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించాని బ్రాడ్ హాగ్ పరోక్షంగా వారిని సమర్థించాడు. అయితే, ఇలా బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్ చేయడం తనకు నచ్చలేదన్న ఈ మాజీ బౌలర్ ఓ పరిష్కారాన్ని సూచించాడు. ‘‘నాకు ఇలాంటి డిస్మిసల్ నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, మళ్లీ ఇలాంటివి జరగాలని నేను కోరుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించే బదులు.. బ్యాటింగ్ జట్టుకు 12 పరుగుల మేర కోత విధిస్తే బాగుంటుంది. అపుడైనా ఇలా ఆలస్యం చేసేవాళ్లు కాస్త తొందరగా రెడీ అవుతారు. వికెట్ పడగానే క్రీజులోకి పరిగెత్తుకుని వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Brad Hogg (@brad_hogg) -
అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్
Angelo Mathews- Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ అవుట్’ విషయంలో షకీబ్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. క్రీడాస్ఫూర్తిని మరిచిన అతడు శ్రీలంకలో అడుగుపెడితే అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రెవిన్ పేర్కొన్నాడు. షకీబ్‌కు రాళ్లతో సన్మానం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య, అరుదైన రీతిలో అవుటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) ఆలస్యం చేశాడు.. అనుభవించకతప్పలేదు న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ అవుటయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్ 2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్‌లోకి మాథ్యూస్ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. తన హెల్మెట్‌ను సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా, చమిక మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ‘అవుట్’గా ప్రకటించారు. ఈ క్రమంలో తన హెల్మెట్ సమస్యను మాథ్యూస్ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు. బతిమిలాడినా మనసు కరగలేదు ఆ తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకోమని షకీబ్‌ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్ వెనుదిరగక తప్పలేదు. దీంతో.. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో జెంటిల్మన్ గేమ్‌లో షకీబ్ క్రీడాస్ఫూర్తిని విస్మరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాళ్లు విసరడం ఖాయం దక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము నిరాశకు గురయ్యాం. బంగ్లాదేశీ కెప్టెన్‌కు క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. జెంటిల్మన్ గేమ్‌లో అతడు మానవతా దృక్పథం కనబరచకలేకపోయాడు. ఇకపై అతడికి శ్రీలంకలో ఎవరూ స్వాగతం పలకరు. ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ లేదంటే లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఇక్కడికి వస్తే.. అతడిపై రాళ్లు విసురుతారు. అభిమానుల నుంచి అతడు ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా బంగ్లాదేశ్ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అప్పటికి షకీబ్- మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఫోర్త్ అంపైర్ చెప్పిందిదే లంక ఇన్నింగ్స్ అనంతరం.. మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్‌స్టాక్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ‘మాథ్యూస్‌కు హెల్మెట్ సమస్య కూడా రెండు నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటికీ అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్‌లోకి వచ్చే ముందు ఎక్విప్‌మెంట్‌లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్‌దే బాధ్యత’ అని ఆయన చెప్పారు. దాంతో షకీబ్ క్రీడా స్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించడం సరైందే కదా అని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా షకీబ్‌ను అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ కూడా వాచీ చూసుకుంటున్నట్లుగా అభినయిస్తూ నీ టైమ్ అయిపోయిందిక అన్నట్లు సైగ చేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకపై తొలి విజయం నమోదు చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... అభిమానులకు బ్యాడ్‌న్యూస్! ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే.. -
WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
ICC WC 2023- Shakib Al Hasan: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి శ్రీలంకపై గెలిచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లో తొలిసారి లంకపై పైచేయి సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే కూడా ‘టైమ్డ్ అవుట్’కు అప్పీలు చేసిన కారణంగానే బంగ్లా జట్టు వార్తల్లో నిలిచింది. టైమ్డ్ అవుట్ అప్పీలుతో చరిత్రకెక్కిన షకీబ్ లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడనే కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలు చేశాడు. ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం అతడు రెండు నిమిషాల్లోపు బాల్‌ను ఫేస్ చేయలేదన్న విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్ చరిత్రకెక్కగా.. షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. క్రీడా వర్గాల్లో ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగానే.. బంగ్లాదేశ్‌కు ఓ షాక్ తగిలింది. చేతివేలికి గాయం శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మధ్యవేలుకు తగిలిన గాయం తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే తీయించగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్‌కు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం కోసం షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బేజెదుల్ ఇస్లాం ఖాన్ తెలిపినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘అవుట్’ కాగా శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో మాథ్యూస్ విషయంలో అప్పీలుతో మరోసారి వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డ షకీబ్.. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు 2 వికెట్లు కూడా కూల్చిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో షకీబ్ వికెట్‌ను మాథ్యూస్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే, మాథ్యూస్ విషయంలో బంగ్లా జట్టుకు వికెట్ దక్కినప్పటికీ.. అప్పటికి ఓవర్ కంటిన్యూ చేస్తున్న బౌలర్(షకీబ్ అల్ హసన్) ఖాతాలో మాత్రం జమకాదు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరకున్నా.. ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు కాగా ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశాలు బంగ్లాకు సజీవంగా ఉంటాయి. చదవండి: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
WC 2023: అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు! మరి రూల్స్?
#BanvsSL- #Angelo Mathews- #ShakibAlHasan: వన్డే వరల్డ్‌కప్-2023.. ఢిల్లీ.. అరుణ్‌జైట్లీ స్టేడియం.. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్.. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్ల మధ్య పోటీ.. ఇందులో గెలిచినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం లేదు.. కానీ.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించాలంటే మాత్రం ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం... పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీ బరిలో నిలవాంటే... అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పైచేయి సాధించాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపి బంగ్లాకు శుభారంభం అందించాడు పేసర్ షోరిఫుల్ ఇస్లాం. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(19)ను షకీబ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(41), సదీర సమరవిక్రమతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిసాంక అవుటైన తర్వాత చరిత్ అసలంక సమరవిక్రమకు తోడయ్యాడు. అయితే.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి.. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. సమరవిక్రమ షకీబ్ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హైడ్రామా మొదలైంది అప్పుడే దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక వ్యూహాత్మకంగా ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను బరిలోకి దింపింది. కానీ దురదృష్టవశాత్తూ మాథ్యూస్ రాంగ్ హెల్మెట్ వెంట తెచ్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ పొజిషన్ తీసుకోకముందే ఈ విషయాన్ని గమనించిన అతడు.. వేరే హెల్మెట్ కావాలంటూ డ్రెస్సింగ్‌రూం వైపు సైగ చేశాడు. సబ్‌స్టిట్యూట్ కరుణరత్నె వెంటనే హెల్మెట్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది! ఇదంతా జరగడానికి రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పుడే షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా.. మాథ్యూస్ విషయంలో ‘టైమ్డ్ అవుట్’కి అప్పీలు చేశాడు. అంతేకాదు ఈ నిబంధన అమలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ప్రయత్నం చేయకుండానే వికెట్ దీంతో అంపైర్లు ఏంజెలో మాథ్యూస్ అవుటైనట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వికెట్ దొరికిన సంబరంలో బంగ్లాదేశ్ మునిగిపోగా.. ఈ అనూహ్య ఘటనతో శ్రీలంక శిబిరంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. బంగ్లా సంబరం.. శ్రీలంక అయోమయం ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఓ బ్యాటర్ ‘టైమ్డ్ అవుట్’గా వెనుదిరగడం ఇదే తొలిసారి. అలా.. నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున ఏంజెలో మాథ్యూస్ ఈ ‘శిక్ష’ అనుభవించకతప్పలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) బతిమిలాడినా కరుణించలేదు హెల్మెట్ కారణంగా జరిగిన తాత్సారం మూలంగా అతడు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంపైర్లు, షకీబ్ దగ్గరికి వెళ్లి మరీ విషయం ఏమిటో వివరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మాథ్యూస్ బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నట్లు షకీబ్ నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పీలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగిపోయాడు. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ సైతం బంగ్లాదేశ్ కోచ్ చండిక హతుర్సింఘతో ఈ విషయం గురించి చర్చించాడు. ఫోర్త్ అంపైర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లారు. తప్పు ఎవరిది? కానీ అప్పటికే కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడం బ్యాటింగ్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అంతగా ఆసక్తి కలిగించదనుకున్న మ్యాచ్ కాస్తా ఈ అనూహ్య ఘటన మూలంగా.. క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ ఘటనపై చర్చిస్తున్నారు నెటిజన్లు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లో క్రీడాస్ఫూర్తి కొరవడిందని చాలా మంది ట్రోల్ చేస్తుంటే.. ఇదంతా నిబంధనలకు అనుగుణమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎంసీసీ నిబంధన ప్రకారం.. ఓ జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే ఆటగాడు.. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. లేదంటే బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఇక ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం.. రెండు నిమిషాల్లోపే బ్యాటర్ బాల్‌ను ఫేస్ చేయాలి. ఈ నిబంధనను ఆధారం చేసుకునే షకీబ్ అల్ హసన్ ఏంజెలో మాథ్యూస్ విషయంలో అప్పీలుకు వెళ్లి సఫలమయ్యాడు. అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు అయితే, దీని మూలంగా.. జెంటిల్మన్గేమ్లో క్రీడాస్ఫూర్తిని మరచిన ఆటగాడిగా అతడు చరిత్రలో మిగిలిపోతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి గతంలో.. తమకు(స్థానిక లీగ్ మ్యాచ్) ప్రతికూల ఫలితం వచ్చినపుడు అంపైర్ల పట్ల షకీబ్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి వ్యక్తి నుంచి స్పోర్ట్స్‌మెన్‌షిప్ ఆశించినవాళ్లదే తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. షకీబ్ తీరే అంత అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టైమ్బ్యాడ్ అని సరిపెట్టుకోకతప్పదంటూ మాథ్యూస్‌కు హితవు పలుకుతున్నారు. సమయం వృథా చేయడం వల్ల మూల్యం చెల్లించావంటూనే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో.. మాథ్యూస్లాగే మహ్మద్ రిజ్వాన్ టైమ్ వేస్ట్ చేసినపుడు విరాట్ కోహ్లి చేతిగడియారం చూసుకుంటున్నట్లు అభినయించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎటువైపు ఉంటారు?! చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! #BANvSL "Angelo Mathews" what is this? pic.twitter.com/JIsQo6cPut — Ankur Jain 🇮🇳 (@aankjain) November 6, 2023 Angelo Mathews becomes the first cricketer in history to be out on 'timed out' If you Expect sportsmanship from Shakib-al-hasan then it's your Mistake He didn't even respect Umpires 🤮#SLvBAN #ODIWorldCup2023 #ICCWorldCup2023 #SLvsBAN pic.twitter.com/PGqQfM9HFQ — Troll Mafia (@offl_trollmafia) November 6, 2023 -
శ్రీలంకకు బంగ్లాదేశ్ షాక్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సన్నహాక మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిసాంక (68), ధనంజయ (55) అర్ధ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 264 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు సాధించి గెలిపొందింది. బంగ్లా బ్యాటర్లలో తన్జీద్ (84), మిరాజ్ (67 నాటౌట్), లిటన్ దాస్ (61) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం.. 38 గంటలు విమానంలోనే! బెయిర్ స్టో ఫైర్ -
World Cup Warm Up Matches: బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, శ్రీలంక
భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ 2023 వార్మప్ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్ 29) నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతి వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్ల మధ్య తివేండ్రం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. తివేండ్రంలో భారీ వర్షం పడుతుండటంతో టాస్ కూడా పడలేదు. మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ అయ్యాయి. తొలి వికెట్ కోల్పోయిన పాక్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఇమామ్ ఉల్ హాక్ (1) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 31/1గా ఉంది. అబ్దుల్లా షఫీక్ (12), బాబర్ ఆజమ్ (16) క్రీజ్‌లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక థాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (25), కుశాల్ పెరీరా (21) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 46/0గా ఉంది. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి -
రాణించిన బంగ్లా బౌలర్లు.. నామమాత్రపు స్కోరుకే పరిమితమైన శ్రీలంక
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ 93 పరుగలతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్(50), నిస్సంకా(40) పరుగులతో రాణించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. షోర్ ఫుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించారు. చదవండి: Asia Cup 2023: 'అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్ కప్ జట్టులో అతడు ఉండాల్సింది' -
Asia Cup 2023: సెంచరీ చేజార్చుకున్న మెండిస్.. శ్రీలంక భారీ స్కోర్
ఆసియా కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. పథుమ్ నిస్సంక (40 బంతుల్లో 41; 6 ఫోర్లు), అసలంక (43 బంతుల్లో 36; 2 ఫోర్లు, సిక్స్), దునిత్ వెల్లెలెగె (39 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కరుణరత్నే (35 బంతుల్లో 32; 6 ఫోర్లు), తీక్షణ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. లంక ఇన్నింగ్స్‌లో సమరవిక్రమ (3), కెప్టెన్ షనక (5) మాత్రమే విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 2.2 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోయి 10 పరుగులు చేసింది. కసున్ రజిత బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి రహానుల్లా గుర్భాజ్ (4) ఔటయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ (6), గుల్బదిన్ నైబ్ క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి సూపర్-4కు చేరుకుంటుంది. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, భారత్‌లు సూపర్-4కు చేరుకున్నాయి. -
Asia Cup: ఆటగాళ్ల జెర్సీలపై పాక్ పేరు లేకపోవడానికి కారణమిదే! అనవసరంగా..
Asia Cup 2023- Pakistan- Sri Lanka: ఆసియా కప్-2023 టోర్నీ నేపథ్యంలో ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా మేజర్ క్రికెట్ ఈవెంట్లలో ప్లేయర్లు ధరించే జెర్సీలపై హోస్ట్ పేరు కూడా ఉంటుంది. అయితే, ఈసారి ఆసియా కప్ విషయంలో మాత్రం ఇలా జరుగలేదు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023 ఈవెంట్ ఆతిథ్య హక్కులు మొదట పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో శ్రీలంక లైన్లోకి వచ్చింది. కావాలనే చేశారంటూ ఉక్రోషం భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగే విధంగా హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహణకు ఏసీసీ.. పీసీబీని ఒప్పించింది. ఈ నేపథ్యంలో ఆగష్టు 30 నుంచి ఈ వన్డే ఈవెంట్ ఆరంభమైంది. అయితే, ఆటగాళ్ల జెర్సీలపై లోగో మిస్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కావాలనే పాకిస్తాన్ పేరును మిస్ చేశారంటూ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మొహ్సిన్ ఖాన్ ఏసీసీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆటగాళ్ల జెర్సీలపై తమ లోగో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అసలు విషయం ఇదీ! అనధికారిక సంభాషణలో భాగంగా.. ఈ ఏడాది నుంచి ఆసియా క్రికెట్ మండలి కొత్త నిబంధనను తీసుకువచ్చిందని.. దాని ప్రకారం ఆతిథ్య జట్ల లోగోలు ఆటగాళ్ల జెర్సీలపై ఉండవని చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది. ఇక నుంచి ఏ జట్టుకైనా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పినట్లు సమాచారం. కాగా ఆసియా వన్డే కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్.. నేపాల్‌పై గెలవగా.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌ను ఓడించింది. చదవండి: Ind Vs Pak: మా భయ్యా ఎట్టకేలకు.. ఇక్కడ ఇలా.. షమీపై సిరాజ్ కామెంట్స్! -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ప్రపంచంలోనే తొలి జట్టుగా!
ఆసియాకప్-2023లో శ్రీలంక బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నజుముల్ హొసేన్ శాంటో(89) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో యువ సంచలనం మతీశా పతిరన నాలుగు వికెట్లతో బంగ్లాను దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. చరిత్ అసలంక (92 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సమరవిక్రమ (77 బంతుల్లో 54; 6 సిక్స్‌లు) రాణించారు. చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టీమ్‌గా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్గాదేశ్ను ఆలౌట్ చేసిన లంక.. ఈ ఘనతను తమ పేరిట లిఖించుకుంది. లంక వరుసగా 11 సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్ చేసింది. అంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. ఈ రెండు జట్లు వరుసగా 10 సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్ చేశాయి. చదవండి: Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
పల్లెకెలె: ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నీలో శ్రీలంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. నజు్మల్ హొసేన్ (122 బంతుల్లో 89; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ షకీబ్ (5) సహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మతీశా పతిరన (4/32) బంగ్లాదేశ్ వెన్నువిరిచాడు. తీక్షణకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. చరిత్ అసలంక (92 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సమరవిక్రమ (77 బంతుల్లో 54; 6 సిక్స్‌లు) రాణించారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శనివారం ఇదే మైదానంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నయీమ్ (సి) నిసాంక (బి) ధనంజయ 16; తాన్జిద్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 0; నజు్మల్ (బి) తీక్షణ 89; షకీబ్ (సి) కుశాల్ (బి) పతిరన 5; తౌహిద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షనక 20; రహీమ్ (సి) కరుణరత్నే (బి) పతిరన 13; మిరాజ్ (రనౌట్) 5; మెహిదీ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగె 6; తస్కిన్ (సి) తీక్షణ (బి) పతిరన 0; ఇస్లామ్ (నాటౌట్) 2; ముస్తాఫిజుర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరన 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–25, 3–36, 4–95, 5–127, 6–141, 7–162, 8–162, 9–164, 10–164. బౌలింగ్: కసున్ రజిత 7–0–29–0, తీక్షణ 8–1–19–2, ధనంజయ 10–0–35–1, పతిరన 7.4–0–32–4, వెలలగె 7–0–30–1, షనక 3–0–16–1. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రహీమ్ (బి) ఇస్లామ్ 14; కరుణరత్నే (బి) తస్కిన్ 1; కుశాల్ (బి) షకీబ్ 5; సమరవిక్రమ (స్టంప్డ్) రహీమ్ (బి) మెహదీ హసన్ 54; అసలంక (నాటౌట్) 62; ధనంజయ (బి) షకీబ్ 2; షనక (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (39 ఓవర్లలో 5 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–15, 3–43, 4–121, 5–128. బౌలింగ్: టస్కిన్ 7–1–34–1, ఇస్లామ్ 4–0–23–1, షకీబ్ 10–2–29–2, ముస్తఫిజుర్ 3–0–12–0, మిరాజ్ 5–0–26–0, మెహదీ హసన్ 10–0–35–1. చదవండి: ‘వయాకామ్ 18’ చేతికి భారత క్రికెట్ -
Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ.. తిప్పేసిన తీక్షణ
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. ఫాస్ట్ బౌలర్ మతీష పతిరణ నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించి 4 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ (8-1-19-2) తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరికి ధనంజయ డిసిల్వ (10-0-35-1), దునిత్ వెల్లలగే (7-0-30-1), కెప్టెన్ షనక (3-0-16-1) తోడవ్వడంతో బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హొసేన్ షాంటో (122 బంతుల్లో 89; 7 ఫోర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, తన జట్టు ఓ మోస్తరు స్కోరైనా చేసేందుకు తోడ్పడగా.. తౌహిద్ హ్రిదోయ్ (20), ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (16), ముష్ఫికర్ రహీమ్ (13) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. తంజిద్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ డకౌట్లు కాగా.. కెప్టెన్ షకీబ్ 5, మెహిది హసన్ మీరజ్ 5,మెహిది హసన్ 6, షోరిఫుల్ ఇస్లాం 2 పరుగులతో అజేయంగా నిలిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్లు కోల్నోయి ఎదురీదుతోంది. ఆ జట్టు 43 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. పథుమ్ నిస్సంక (14).. షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీంకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. కరుణరత్నేను (1) తస్కిన్ అహ్మద్, కుశాల్ మెండిస్‌ను (5) షకీబ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 14 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 58/3గా ఉంది. సమరవిక్రమ (25), అసలంక (8) క్రీజ్‌లో ఉన్నారు. -
శ్రీలంక లయన్స్ వర్సెస్ బంగ్లా టైగర్స్.. గెలుపెవరిది?
ఆసియాకప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా క్యాండీ వేదికగా గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం శ్రీలంక.. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు ఆతిథ్య శ్రీలంక వరుస షాక్‌లు తగిలాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. బ్యాటింగ్ పరంగా లంక పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పేలవంగా ఉంది. లహురు కుమారా,థీక్షణ మినహా పెద్దగా అనుభవం ఉన్న బౌలర్లు లేరు. యువ సంచలనంచ,పేసర్ మతీషా పతిరానా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం లంకకు కలిసిచ్చే ఆంశం. అదే విధంగా స్వదేశంలో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఆడిన 5 వన్డేల్లోనూ లంక విజయం సాధించింది. సొంత గడ్డపై ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న లంక.. వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్లోనూ దుమ్మురేపింది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్‌ను శ్రీలంకనే సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బంగ్లా జట్టు తమ ఆఖరి రెండు వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లా జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో అనముల్ హక్కు అవకాశం ఇచ్చారు. లిట్టన్ దాస్ దూరమైనప్పటికీ అఫీఫ్ హొస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తోవిద్ హృదయ్ రూపంలో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా బౌలింగ్‌లో కూడా టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మన్, షకీబ్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. వీరి చెలరేగితే లంక బ్యాటర్లకు కష్టాలు తప్పవు. తుది జట్లు(అంచనా) బంగ్లాదేశ్ అఫీఫ్ హొస్సేన్, నయీమ్ షేక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తోవిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్ శ్రీలంక పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, మతీశ పతిరణ చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
SL Vs Ban: ఆ అవసరం లేదు.. బంగ్లాదేశ్ డైరెక్టర్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
Asia Cup 2022- Sri Lanka vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్‌కు శ్రీలంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. 11 మంది అన్నదమ్ములు జట్టులో ఉన్నపుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అక్కర్లేదంటూ ఖలీద్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా గ్రూప్- బిలో ఉన్న శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య గురువారం కీలక మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్-4కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంక.. బంగ్లాదేశ్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో దసున్ షనక బృందం టోర్నీలో మరో ముందడుగు వేయగా.. బంగ్లాదేశ్ ఇంటిబాట పట్టింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక.. బంగ్లాదేశ్‌పై సులువుగానే విజయం సాధిస్తామంటూ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కు ముందు మాటల యుద్ధం బంగ్లాదేశ్ పసికూన అన్న ఉద్దేశంలో.. వాళ్ల జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నాడని వ్యాఖ్యానించాడు. బంగ్లా కంటే అఫ్గనిస్తాన్ బలమైన జట్టుగా కనిపిస్తోందని లంక కెప్టెన్ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన.. బంగ్లాదేశ్ డైరెక్టర్ ఖలీద్.. ‘‘దసున్ మమ్మల్ని ఎందుకు అంత తేలికగా తీసిపారేసాడో అర్థం కావడం లేదు. అఫ్గనిస్తాన్ టీ20 జట్టు గొప్పగా ఉండొచ్చు. అందుకే అలా అన్నాడేమో! అయితే, మాకు కనీసం ఇద్దరైనా ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారు. కానీ శ్రీలంక జట్టులో ఒక్క వరల్డ్‌క్లాస్ బౌలర్ కూడా లేడు కదా’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో స్వీయ తప్పిదాలతో బంగ్లాదేశ్ భారీ మూల్యం చెల్లించగా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంక జయకేతనం ఎగురవేసింది. ట్వీట్‌తో తాజాగా యువ బౌలర్! ఈ నేపథ్యంలో మహీశ్ తీక్షణ ట్విటర్ వేదికగా ఈ మేరకు ఖలీద్‌కు రీకౌంటర్ వేశాడు. మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో సమిష్టిగా రాణిస్తే సరిపోతుందని, తమ సహోదరులతో కలిసి ఈ లాంఛనం పూర్తిచేశామన్న ఉద్దేశంలో 22 ఏళ్ల మహీశ్ ట్వీట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రూపంలో కీలక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ T20 WC 2022- England Squad: ప్రపంచకప్ టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అతడికి మొండిచేయి! No need to have world class players, when you have 11 brothers ❤️ pic.twitter.com/H0rYESlF6i — Maheesh Theekshana (@maheesht61) September 2, 2022 -
Asia cup 2022: బంగ్లాదేశ్ అవుట్! ఏడ్చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్!
ఆసియాకప్-2022 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్-4కు అర్హత సాధించిగా.. బంగ్లాదేశ్ మాత్రం ఇంటిముఖం పట్టింది. కాగా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ స్వీయ తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓ బుడ్డోడు అయితే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. బంగ్లాదేశ్ ఓటమి పాలైన అనంతరం బంగ్లా జెర్సీ ధరించి ఉన్న ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. పక్కన అతడి తల్లి ఓదారుస్తూ కనిపించింది. తమ జట్టు గెలుపు ఖాయమనుకున్న ఆ యువ ఆభిమాని.. తమ జట్టు ఆఖరికి ఓడిపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. కాగా గతంలో కూడా బంగ్లా జట్టు ఓటమి పాలైతే అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. #BANVSSL #SLvBAN emotions pic.twitter.com/j0zUbBojz9 — Wasif (@Wasif_93) September 1, 2022 చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ -
ఇబాదత్ హొస్సేన్ అరుదైన ఫీట్.. తొలి బంగ్లాదేశ్ పేసర్‌గా! చెత్త ప్రదర్శన కూడా!
బంగ్లాదేశ్ యువ పేసర్ ఇబాదత్ హొస్సేన్ తన టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ పేస్ బౌలర్‌గా ఇబాదత్ హొస్సేన్ రికార్డులకెక్కాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇబాదత్ మూడు వికెట్టు సాధించినప్పటికీ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అఖరి రెండు ఓవర్లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. చివరి 2 ఓవర్లలో శ్రీలంక విజయానికి 25 పరుగులు కావల్సిన నేపథ్యంలో 19వ ఓవర్ వేసిన ఇబాదత్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. ఇక అఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమవ్వగా.. శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కాగా శ్రీలంక సూపర్-4కు ఆర్హత సాధించగా.. బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టింది. చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ -
Asia Cup 2022: లంక చేతిలో మా ఓటమికి ప్రధాన కారణం అదే: బంగ్లా కెప్టెన్
Asia Cup 2022 SL Vs Ban- Bangladesh Knocked Out Of Tourney: ఆసియా కప్-2022 టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసింది. దుబాయ్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బృందం ఓటమి పాలైంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మెగా ఈవెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఇక గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్‌తో పాటు లంక సూపర్-4కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఓటమిపై స్పందించాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో పరాజయంతో ఇంటిబాట పట్టినందుకు చింతిస్తున్నామంటూ అభిమానులను క్షమాపణ కోరాడు. అదరగొట్టిన కుశాల్, దసున్ గురువారం(సెప్టెంబరు 1) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆఫిఫ్ హొసేన్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుత ఆరంభం అందించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ విఫలం కావడంతో లంక కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ దసున్ షనక 33 బంతుల్లో 45 పరుగులు చేసి లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కొంప ముంచిన ఇబాదత్! కానీ.. ఆ తర్వాత వనిందు హసరంగ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో గెలుపు కోసం చివరి 2 ఓవర్లలో లంకకు 25 పరుగులు అవసరమయ్యాయి. దీంతో బంగ్లా విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే 19వ ఓవర్ వేసిన బంగ్లా బౌలర్ ఇబాదత్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో లంక గెలుపు సమీకరణం 8 పరుగులకు చేరగా.. అసిత ఫెర్నాండో లాంఛనం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వైడ్లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లాకు చేదు అనుభవం తప్పలేదు. మా ఓటమికి కారణం అదే! ఈ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. ‘‘చెత్త బౌలింగ్ కారణంగా ముఖ్యంగా డెత్ ఓవర్లలో విఫలమైనందున భారీ మూల్యం చెల్లించాం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి చేతిలో నాలుగు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మా బౌలింగ్ అధ్వాన్నంగా సాగింది. నిజానికి, శ్రీలంక బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దసున్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేము వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలని అనుకున్నాం. కానీ.. మా బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. గత ఆర్నెళ్లుగా మా జట్టు ప్రదర్శన అస్సలు బాగుండటం లేదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో బాగానే ఆడాం. ఏదేమైనా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పకతప్పదు. ఎక్కడివెళ్లినా మా మీద మీ ప్రేమ తగ్గడం లేదు. అయితే, మేము మిమ్మల్ని నిరాశ పరుస్తున్నాం. సారీ’’ అని పేర్కొన్నాడు. చదవండి: Asia cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ICC Players of the Month- May: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్ విభాగంలో మే నెలకుగానూ శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్.. మహిళల విభాగంలో పాకిస్తాన్ స్పిన్ సంచలనం తుబా హసన్ ఈ అవార్డు గెలుచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీ మీడియా ప్రకటన విడుదల చేసింది. తొలి ఆటగాడిగా కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక.. బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా చట్టోగ్రామ్, మీర్పూర్ టెస్టుల్లో కలిపి అతడు 344(వరుసగా 199, 145) పరుగులు సాధించాడు. తద్వారా లంక సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికై ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచిన తొలి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసి మాథ్యూస్.. తనకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, సిబ్బంది.. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మనపై మనకు నమ్మకం ఉంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదని, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి.. ఇక తుబా విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ శ్రీలంకతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో మొత్తంగా 5 వికెట్లు పడగొట్టిన ఆమె.. పాక్ ఏకపక్ష విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన తుబాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Ind Vs SA 3rd T20: వైజాగ్‌లో గ్రౌండ్ చిన్నది.. అతడిని తప్పక ఆడించండి.. లేదంటే! Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
ఈ విజయం శ్రీలంక ప్రజలకు అంకితం: దిముత్ కరుణరత్నే
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ విజయాన్ని తమ దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ట్విటర్ వేదికగా తెలిపాడు. కాగా శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుత పరిస్ధితులను మెరుగుపరచడానికి కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే విదేశీ సహాయం కోసం చూస్తున్నారు." ఈ విజయాన్ని నేను శ్రీలంక ప్రజలందరికీ అంకితం చేయాలనుకుంటున్నాను. దేశంలో ప్రజలు కష్ట పరిస్ధితులను ఎదర్కొంటున్నారు. ఈ విజయం వారి ముఖాల్లో కొంత సంతోషాన్ని నింపుతుంది" అని కరుణరత్నే ట్విట్ చేశాడు. చదవండి: BAN Vs SL 2nd Test: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది!