Stocks Market
-
స్టాక్స్ బడిలో ‘టీనేజీ’ పాఠాలు!
పిల్లలు విద్యలో రాణిస్తుంటే తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. వారి భవిష్యత్ బంగారమేనని మురిసిపోతుంటారు. తమ వారసులకు నాణ్యమైన విద్య, ఉపాధి మార్గం చూపడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయినట్టు కాదు. సంపాదనను సంపదగా మార్చే విద్య కూడా వారికి చెప్పాలి. ఆర్ధిక అంశాలపై సమగ్రమైన అవగాహన వారిని స్థితిమంతులను చేస్తుంది. ఆర్ధిక సమస్యల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది. ప్రతి ముగ్గురు అమెరికన్ ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఒకరు 18 ఏళ్లకే ఈక్విటీల్లోకి అడుగు పెడుతున్నారు. మన దగ్గర 25 ఏళ్ల తర్వాతే ఎక్కువ మందికి ఈక్విటీల గురించి తెలుస్తోంది. స్టాక్స్ గొప్ప కాంపౌండింగ్ మెషిన్. ఎంత ముందుగా పెట్టుబడి మొదలు పెడితే, అన్ని రెట్లు అధిక ప్రతిఫలాన్ని ఇస్తుంది. గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని కమ్యూనిటీల్లో యుక్త వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులు స్టాక్స్ పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. పెట్టుబడుల వారసత్వాన్ని సైతం వారు ఎంతో కీలకంగా చూస్తారు. ఈ తరహా విధానం అందరికీ అనుసరణీయమేనన్నది నిపుణుల అభిప్రాయం. చిన్న నాటి నుంచే ఈక్విటీ పెట్టుబడుల పరిచయంతో భవిష్యత్తులో దాన్ని సంక్లిష్టంగా కాకుండా క్రమబద్ధంగా, సంపద సృష్టికి సులభమైన మార్గంగా చూడడం అలవడుతుందనేది ఈక్విరస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో అభిజిత్ భవే అభిప్రాయం. ‘‘ఆరంభానికి 16 ఏళ్ల వయసు అనువైనది. వాస్తవిక ఆర్ధిక విషయాలను వారు అప్పుడే అర్థం చేసుకోవడం మొదలవుతుంది. 17 ఏళ్ల వయసుకు రిస్క్, రాబడి, దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి తదితర అంశాలను అర్థం చేసుకోగలరు’’ అని అభిజిత్ భవే చెప్పారు. ‘‘టీనేజ్‌లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా పెట్టుబడుల గురించి వింటుంటారు. ఆ దశలోనే వారిలోని ఆసక్తిని గుర్తించి నేరి్పంచడం మొదలు పెట్టాలి. 15–16 ఏళ్లపుడు ఆరంభిస్తే.. 17–19 ఏళ్లు వచ్చే సరికి ఈక్విటీలను అర్థం చేసుకోగలరు. వీరిలో కొందరు కెరీర్‌గానూ మలుచుకునే అవకాశం ఉంటుంది’’ అని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా సూచించారు. ‘‘వారంతట వారే నేర్చుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. మెరుగైన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు లేదా స్టాక్స్‌ను గుర్తించే అవకాశం కలి్పంచాలి. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. నిర్ణయాలను నిందించకుండా, మంచి చెడుల పరంగా తీర్పు ఇవ్వకుండా తమ పెట్టుబడులు, తప్పిదాలు, విజయాల గురించి పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. తమను తాము ఆవిష్కరించుకునే అవకావం ఇవ్వాలి’’ అని సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెరి్నంగ్ చైర్పర్సన్ ఉమా శశికాంత్ అన్నారు. ఇలా స్వేచ్ఛా వాతావరణం ఉంటే పిల్లలు సంతోషంగా పంచుకుంటారు. అప్పుడు వారి నిర్ణయాల్లోని లోపాలను ఎలా సరిచేసుకోవాలో వివరించి చెప్పొచ్చు. టీనేజ్ నుంచే వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్ల సంపాదన మొదలయ్యే నాటికి వారు మెరికలుగా మారతారు. ‘‘ఈక్విటీల్లో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి)కు సమయం కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగా ఈక్విటీ పెట్టుబడులను పరిచయడం చేయడం వల్ల, మార్కెట్లను మెరుగ్గా అర్థం చేసుకోగలిగి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టించుకోగలరు’’ అని రూపీ విత్ రుషబ్ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు రుషబ్ దేశాయ్ పేర్కొన్నారు.ప్రాథమిక అంశాలు.. ఆర్ధిక అంశాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి స్కూల్ పాఠాల్లో ఉండదు. కనుక వీటి గురించి చెప్పే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. పదో తరగతి లేదా ఇంటర్లోకి వచి్చన వెంటనే ప్రాథమిక అంశాల గురించి అర్థమయ్యేలా వివరించి, కొన్ని కోర్సులను వారికి పరిచయం చేయాలి. దీంతో ఈక్విటీల గురించి మరింత లోతుగా నేర్చుకుంటారు. అయితే, మెజారిటీ తల్లిదండ్రులకు క్యాపిటల్ మార్కెట్లపై అవగాహన లేకపోవడం సమస్యగా పేర్కొన్నారు ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు మృణ్ అగర్వాల్. అయినా సంకోచించకుండా, తమ పిల్లలను ఫైనాన్షియల్ ప్లానర్లు/ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, కంపెనీలు, వాటి ఈక్విటీ, ఆదాయం, లాభాలు, యాజమాన్యం, రుణభారం, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్, వాటి పెట్టుబడుల విధానం, రిస్క్, రాబడులు, బేర్, బుల్ మార్కెట్లు, ఆటుపోట్లు (వోలటాలిటీ), పెట్టుబడుల్లో వైవిధ్యం, కాంపౌండింగ్, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం తదితర అంశాల గురించి చెప్పాలి. ముందుగా పెట్టుబడులు ఆరంభించడం వల్ల రాబడిపై రాబడి (కాంపౌండింగ్) తోడయ్యి వచ్చే అద్భుత రాబడుల సూత్రాన్ని వివరించాలి. అధిక రాబడులు ఎప్పుడూ కూడా అధిక రిస్‌్కతో ఉంటాయన్న వాస్తవాన్ని తెలియజేయాలి. ఈ రిస్క్‌ను అధిగమించే వ్యూహాలపై అవగాహన కలి్పంచాలి.పరిశోధన, అధ్యయనం 17–19 ఏళ్ల వయసులో ప్రాథమిక అంశాలను దాటి లోతైన విశ్లేషణ, అధ్యయనాన్ని టీనేజర్లు ఆరంభించేలా చూడాలి. మార్కెట్లు, కంపెనీలను విశ్లేíÙంచే సామర్థ్యాలు కచ్చితంగా తెలియాలి. అప్పటికే ఎన్నో ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టిన అనుభవం, మార్కెట్లపై సమగ్రమైన అవగాహన ఉంటే తల్లిదండ్రులే వీటి గురించి వివరంగా చెప్పొచ్చు. లేదంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోర్సుల్లో వారిని చేర్పించాలి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈతోపాటు మరికొన్ని సంస్థలు ఈక్విటీలు, పెట్టుబడులకు సంబంధించి పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. నిపుణులు రాసిన చక్కని పుస్తకాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు చెందిన నిపుణులు వర్క్‌షాప్‌లు, వెబినార్లను నిర్వహిస్తుంటారు. వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వార్తా పత్రికలు సమాచార వేదికలుగా ఉపయోగపడతాయి. తొలుత ఆరంభ స్థాయి, తదనంతరం అడ్వాన్స్డ్ కోర్సుల్లో చేర్పించొచ్చు. ఆర్థిక అంశాలు, ఆర్ధిక వ్యవస్థల గురించి అవగాహన తప్పనిసరి. కంపెనీ ఆర్ధిక మూలాలు, కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలు, వాటి ద్వారా ఆదాయం పొందుతున్న తీరు, కీలక రంగాలు, వాటి పనితీరు, అంతర్జాతీయ ధోరణులు మార్కెట్లపై ఎలా ప్రభావం చూపిస్తాయన్నది తెలియాలి. ఫండమెంటల్, టెక్నికల్ కోర్సులను నేరి్పంచాలి. ‘‘కంపెనీ బ్యాలన్స్ షీటును అర్థం చేసుకుని, విశ్లేషించే సామర్థ్యాలు అలవడితే, కంపెనీ నిధులను ఎలా వినియోగిస్తుందో తెలుసుకోగలిగితే అప్పుడు వారు తగిన కంపెనీని ఎంపిక చేసుకోగలరు. అప్పుడు అది పెట్టుబడి అవుతుందే కానీ, గ్యాంబ్లింగ్ కాబోదు. ఏమి చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అన్న స్పష్టత ఉండాలి’’ అని దినేష్ రోహిరా సూచించారు. రిస్క్‌లు/మోసాలు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కలు, మోసాల గురించి వివరంగా చెప్పాలి. తప్పుడు సలహాలతో ఏర్పడే నష్టం, వేరొకరి సూచనను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే రిస్‌్కల గురించి, భావోద్వేగాల నియంత్రణ ప్రాధాన్యాన్ని అర్థమయ్యేలా వివరించాలి. వేగంగా డబ్బులు సంపాదించేయాలన్న ధోరణి అస్సలు పనికిరాదు. ఒకవేళ మీ పిల్లల్లో ఈ ధోరణిని గుర్తిస్తే వెంటనే దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. నేటి యువతరం ఎక్కువ మంది ఇదే ధోరణితో స్టాక్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడుల విధానానికి బదులు ట్రేడింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. డెరివేటివ్స్ లావాదేవీల్లో లాభం వచి్చనా, నష్టం వచి్చనా రూ.వేలు, రూ.లక్షల్లో ఉంటుంది. డెరివేటివ్స్ స్పెక్యులేటివ్ ఆధారితం. ఇందులో రిస్‌్కల పట్ల పిల్లల్లో అవగాహన తప్పనిసరి. కష్టార్జితాన్ని కాపాడుకుంటూ, మెరుగైన రాబడులు సంపాదించడమే కర్తవ్యంగా ఉండాలి. కానీ, స్వల్పకాలంలోనే సంపద కూడబెట్టడం అసాధ్యం అన్నది పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ తదితర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే స్టాక్ రికమండేషన్ల ఉచ్చులో పడకుండా, టిప్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. ‘‘అన్ని మార్గాల ద్వారా వస్తున్న సమాచారంతో ఈక్విటీ మార్కెట్లో డబ్బులు సంపాదించడం తేలికన్న భావన యువతలో సహజంగా ఏర్పడుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అతిపెద్ద రిస్క్’’ అని మృణ్ అగర్వాల్ తెలిపారు. ఇతరులను గుడ్డిగా అనుసరిస్తే పెట్టుబడిని కూడా కోల్పోయే ప్రమాదం గురించి అర్థం కావాలి. నిజానికి సరైన రీతిలో వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల నుంచి ఎంతో కీలక సమాచారాన్ని పొందొచ్చు. సమాచార వడబోత గురించి టీనేజర్లకు తెలిస్తే తప్పటడుగులు వేయకుండా మెరుగైన రక్షణ ఏర్పడినట్టే. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్‌లో ఉండే అధిక రిస్్కపై అవగాహన కలి్పంచాలి. స్టాక్స్‌లో స్వల్పకాలిక అస్థిరతల ప్రభావంతో నియంత్రణ కోల్పోకుండా చూడాలి. పెట్టుబడులు–పర్యవేక్షణ టీనేజర్లలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఏ మేరకు అవగాహన, విజ్ఞానం వచ్చిందో కొంత పెట్టుబడి వారికి సమకూర్చి పరీక్షించొచ్చు. పిల్లలు అప్పటి వరకు దాచుకున్న పాకెట్ మనీ ఉంటే, దాన్ని కూడా పెట్టుబడిగా పెట్టేలా ప్రోత్సహించాలి. లేదంటే తల్లిదండ్రులే ఆరంభ పెట్టుబడి కింద రూ.10,000 సమకూర్చాలి. లావాదేవీలకు వీలుగా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు వారి పేరిట తెరిపించాలి. 18 ఏళ్లు నిండగానే ఈ పనిచేయాలి. 18 ఏళ్లలోపే పిల్లలు వీటి గురించి మెరుగ్గా తెలుసుకున్నారని భావిస్తే, అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పేరిట ఖాతా తెరిచి, పిల్లలకు అందుబాటులో ఉంచాలి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలి. కొంత కాలానికి ఈ రెండింటి పనితీరును వారు పోల్చుకోగలరు. స్టాక్స్‌లో ఆటుపోట్లు ఎక్కువ. వీటిని ఫండ్స్ ఎలా అధిగమిస్తున్నాయన్నది తెలుసుకునే ఆసక్తి ఏర్పడుతుంది. ప్రతి 15 రోజులకు, నెల రోజులకు ఒకసారి పిల్లల పోర్ట్‌ఫోలియోను సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. తప్పులను చూపించి నిందించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.వర్చువల్ ట్రేడింగ్ వేదికలు నియోస్టాక్స్: వర్చువల్ ట్రేడింగ్‌కు సులభంగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకుని, సెక్యూరిటీలను ఎంపిక చేసుకుని ట్రేడింగ్ ప్రారంభించొచ్చు. స్టాక్ ట్రెయినర్ : మన దేశంతోపాటు ! అమెరికా సహా 15కు పైగా దేశాల స్టాక్స్ డేటాను ఈ ఆండ్రాయిడ్ యాప్ ఆఫర్ చేస్తోంది. వాటిలో వర్చువల్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. పనితీరును విశ్లేషించుకోవచ్చు. నేర్చుకునేందుకు వేదికలు.. ఎన్ఎస్ఈ అకాడమీ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ (ఎన్సీఎఫ్ఎం): నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) నిర్వహిస్తున్న అకాడమీ ఇది. ఆన్లైన్ ద్వారా ఎన్నో రకాల కోర్సులను అందిస్తోంది. బిగినర్, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఇలా వివిధ దశల్లో వీటిని పొందొచ్చు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని, ఫీజు చెల్లించిన తర్వాత మెటీరియల్ పొందొచ్చు. సన్నద్ధమైన తర్వాత పరీక్షలు రాయవచ్చు. ఎన్ఎస్ఈ అకాడమీ డాట్ కామ్ పోర్టల్‌ను సంప్రదించాలి. బీఎస్ఈ ఇనిస్టిట్యూట్ బీఎస్ఈ సబ్సిడరీ ఇది. మూడేళ్ల గ్రాడ్యుయేట్, ఏడాది, రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను సైతం ఆఫర్ చేస్తోంది. ప్లస్2 తర్వాత వీటిలో చేరొచ్చు. రోజులు, వారాల నిడివితో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్‌లపై స్వల్పకాలిక ప్రోగ్రామ్‌లు, కోర్సులను సైతం అందిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం): సెక్యూరిటీలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సెబీ అందిస్తోంది. ఉడెమీ : ఇదొక ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్. ఉచిత కోర్సులు కూడా ఇక్కడ లభిస్తాయి. రూ.449 నుంచి చెల్లింపుల కోర్సులు కూడా ఉన్నాయి.నేర్చుకోండి.. నేర్చుకోండి.. నేర్చుకోండి.. సరిగ్గా జీవించడమంటే అన్ని వేళలా నేర్చుకోవడమే.– చార్లీ ముంగర్, విఖ్యాత ఇన్వెస్టర్ – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
కాసుల వర్షం కురిపించిన ఈ ఐదు షేర్లు..
-
రైల్ షేర్ల పరుగు కొనసాగేనా?
ఏడాది కాలంగా రైల్వే రంగ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఈ బాటలో అత్యధిక శాతం షేర్లు గత రెండు నెలల్లో 52 వారాల గరిష్టాలకు చేరాయి. మరికొన్ని స్టాక్స్ 2022 జనవరిలో నమోదైన గరిష్టాల నుంచి కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ పటిష్టంగా ట్రేడవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రైల్వే స్టాక్స్‌లో కొనసాగుతున్న బుల్ రన్‌కు కొద్ది రోజుల్లో బ్రేకులు పడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఏడాది కాలంగా పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటంవల్ల లాభాల స్వీకరణకు చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు రైల్వే రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. బడ్జెట్ ప్రకటనకు ఇక 30–40 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో యాక్టివిటీ తిరిగి ఊపందుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే నిజానికి రైల్ షేర్లలో సంస్థాగత ఇ న్వెస్టర్ల పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ర్యా లీలో నిలకడ లోపించవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక ధరల వద్ద ర్యాలీ కొనసాగేందుకు సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకమని తెలియజేశారు. వెరసి 2023–24 బడ్జెట్ వెలువడిన తదుపరి రైల్ షేర్లలో దిద్దుబాటు(కరెక్షన్)కు వీలున్నట్లు పేర్కొంటున్నా రు. లాభాల పరుగు రైల్వే సంబంధ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, రైట్స్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ, టిటాగఢ్ వేగన్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఏడాది కాలంగా ర్యాలీ వచ్చింది. ఈ కౌంటర్లు సుమారు 120–100 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇందుకు కొద్ది నెలలుగా రైల్వేలపై ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరగడం, షేర్లు అందుబాటు ధరలో లభిస్తుండటం, అధిక డివిడెండ్లు వంటి అంశాలు దోహదపడ్డాయి. చాలా కౌంటర్లు 10 పీఈ స్థాయిలో కదులుతుండటంతో ట్రేడర్లు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు 3–4 శాతం డివిడెండ్ ఈల్డ్ ఆకర్షణను పెంచినట్లు తెలియజేశారు. ఫలితంగా డిఫెన్స్ రంగ స్టాక్స్‌లో ర్యాలీ తదుపరి రైల్వే రంగ కౌంటర్లలోకి ఇన్వెస్టర్ల చూపు మరలినట్లు విశ్లేషించారు. 38 శాతంతో జోష్ గత బడ్జెట్(2022–23)లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల్లో విలువరీత్యా రైల్వే ప్రాజెక్టులకు 38 శాతం కేటాయింపులు చేపట్టడం ర్యాలీకి సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. 2019–20లో 43 శాతం కేటాయింపులను పొందిన రీతిలో రైల్వేకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు వివరించారు. ఈసారి రానున్న బడ్జెట్లో రైల్వేలు స్థూలంగా రూ. 1.5–1.8 లక్షల కోట్ల బడ్జెటరీ మద్దతును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో ఇది రూ. 1.37 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్తగా 300–400 వందే భారత్ రైళ్లకు తెరలేవనున్న అంచనాలతో ఈసారి రికార్డ్ బడ్జెటరీ మద్దతు లభించవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న 20–25 ఏళ్లలో కొత్తగా లక్ష కిలోమీటర్ల ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త లైన్లకూ కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాయి. వెరసి ఈ ప్రణాళికల కారణంగా రైల్వే సరఫరాదారులు, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు భారీ ఆర్డర్లు లభించవచ్చని పేర్కొంటున్నాయి. -
ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీల షేర్లు.. కారణం అదేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో అటూఇటుగా పనితీరు చూపిన టైర్ల తయారీ కంపెనీలు ఇకపై పుంజుకోనున్నాయి. ఇందుకు ప్రధానంగా ముడివ్యయాలు తగ్గుతుండటం, డిమాండు ఊపందుకోనుండటం దోహదపడనుంది. వెరసి టైర్ల కంపెనీల షేర్లు ఇకపై జోరందుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ఇటీవలే ముగిసిన ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో టైర్ల తయారీ కంపెనీలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. అయితే భవిష్యత్‌లో అమ్మకాలు బలపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వాహన తయారీ దిగ్గజాల(ఓఈఎం) నుంచి ఆర్డర్లు పెరగడంతోపాటు.. సెకండరీ(రీప్లేస్మెంట్) మార్కెట్ నుంచి టైర్లకు డిమాండు మెరుగుపడుతోంది. ఇది విక్రయాలకు ఊపునివ్వనుంది. ఇవికాకుండా మరోవైపు ముడిచమురు ధరలు దిగిరావడంతో సంబంధిత ముడిసరుకుల వ్యయాలు తగ్గుతున్నాయి. దీనికి నేచురల్ రబ్బర్ ధరలు నీరసించడం జత కలుస్తోంది. అమ్మకాలతో పోలిస్తే టైర్ల తయారీలో ఈ రెండింటి సంబంధ ముడివ్యయాలే 60 శాతాన్ని ఆక్రమిస్తుంటాయి. దీంతో లాభదాయకత మెరుగుపడేందుకు వీలుంటుంది. ముడివ్యయాల ఎఫెక్ట్ త్రైమాసికవారీగా చూస్తే క్యూ2లో సియట్ స్థూల మార్జిన్లను 0.82 శాతం, అపోలో టైర్స్ 0.1 శాతం చొప్పున మెరుగుపరచుకున్నాయి. అయితే మరో దిగ్గజం ఎంఆర్ఎఫ్ మార్జిన్లు మాత్రం 1.8 శాతం నీరసించాయి. భారీగా పెరిగిన ముడివ్యయాల ధరలను కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదిలీ చేయకపోవడం ప్రభావం చూపింది. ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఆఫ్‌రోడ్ టైర్ల దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్థూల మార్జిన్లు త్రైమాసికవారీగా 2.2 శాతం క్షీణించాయి. ప్రధానంగా ముడిసరుకులు, రవాణా వ్యయాలు పెరగడంతో టైర్ల పరిశ్రమ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తెలియజేసింది. అయితే చమురు డెరివేటివ్స్, రబ్బర్ ధరలు వెనకడుగు వేస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడవచ్చని అంచనా వేసింది. జులై నుంచి దిగివస్తున్న ముడిచమురు ధరలు మార్చిలో నమోదైన చరిత్రాత్మక గరిష్టం నుంచి 35 శాతం క్షీణించాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనలతో రబ్బర్ ధరలు సైతం కొన్నేళ్ల కనిష్టాలను తాకుతున్నాయి. కోవిడ్–19 ప్రభావంతో చైనా నుంచి టైర్లకు డిమాండు తగ్గడం ప్రభావం చూపుతోంది. మార్జిన్లకు బలిమి మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అంచనా ప్రకారం నేచురల్, సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ ధరలు 10 శాతం తగ్గితే.. నిర్వహణ లాభ మార్జిన్లు 1.6 శాతం, 0.8 శాతం, 1 శాతం చొప్పున బలపడతాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల నీర సించగా.. మార్జిన్ల ప్రభావంతో నెల రోజులుగా ఎంఆర్ఎఫ్ స్టాక్ హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది. ఇదే కాలంలో అపోలో టైర్స్, జేకే టైర్స్ సైతం ఒడిదొడుకులు ఎదుర్కోగా గత ఆరు నెలల కాలంలో ఈ రెండు స్టాక్స్ 17–47 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే గత మూడు నెలల్లో సియట్ షేరు 27 శాతం లాభపడటం గమనార్హం! -
వేదాంత డివిడెండ్ రూ.17.50
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ మరోసారి భారీ డివిడెండ్‌ను వాటాదారులకు ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున 2022–23 సంవత్సరానికి మూడో మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని మంగళవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ రూపంలో కంపెనీ రూ.6,505 కోట్లను చెల్లించనుంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.58,597 కోట్లుగా ఉంది. రుణాలు తీర్చడానికి బదులు వాటాదారులకు భారీ మొత్తంలో డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. దీంతో డివిడెండ్ రూపంలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ తేదీగా నవంబర్ 30ని ప్రకటించింది. వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ కింద రూ.31.50, రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.19.50 చొప్పున ఇవ్వడం గమనించాలి. ఈ మొత్తం కలిపి చూస్తే ఏడాది కాలంలో రూ.68.50 వరకు డివిడెండ్ కింద ఇచ్చినట్టయింది. -
యాహూ! డీమ్యాట్ అకౌంట్లోకి రూ.11 వేల కోట్లు, కొన్ని గంటల్లోనే..
ఒక్కోసారి అనుకోని ఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. అయితే అందులో కొన్ని శాశ్వతంగా నిలిచిపోగా మరికొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఈ తరహాలోనే ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన వల్ల కొన్ని గంటలు కోటీశ్వరుడిగా మారాడు. అదేంటి కొన్ని గంటల వరకే బిలియనీర్‌గా మారడం ఏంటని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రమేష్ సాగర్ గత ఆరు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతను కోటక్ సెక్యూరిటీస్‌లో ఏడాది క్రితం డీమ్మాట్ అకౌంట్‌ని తెరిచి అందులో అనేక స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టేవాడు. అయితే ఓ రోజు అనకోకుండా అతని అకౌంట్లో సుమారు 11వేల కోట్లు జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన రమేష్ మొదట కంగారు పడినప్పటికీ తర్వాత జాక్‌పాట్ కొట్టానని ఆనంద పడ్డాడు. వెంటనే అందులోంచి రూ. 2 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి సాయంత్రం వరకు రూ. 5 లక్షలు లాభాన్ని ఆర్జించాడు. అయితే ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయిన కొన్ని గంటలకే టెక్నికల్ సమస్య కారణంగా ఆ నగదు తన ఖాతాలో పడిందని, బ్యాంకు అధికారులు మెసేజ్ పంపారు. చివరకు బ్యాంకు నుంచి అతని ఖాతాలో క్రెడిట్ అయిన సొమ్ము కొన్ని గంటల్లోనే ఖాళీ అయ్యింది. కాగా బ్యాంకులో అవకతవకలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, బీహార్ గ్రామంలోని ఇద్దరు పిల్లలు అకౌంట్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల జమ అయిన సంగతి తెలిసిందే. చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు! -
ఐపీవో ధరల్ని నిర్ణయించడం సెబీ పని కాదు
ముంబై: ఆధునికతరం(న్యూఏజ్) టెక్నాలజీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టే విషయంలో ధరల నిర్ణయంపై సెబీ ప్రభావం ఉండబోదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. ఇది తమ బాధ్యత కాదని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ఇష్యూలకు సంబంధించి ఏవైనా ఆందోళనలుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు బాధ్యత తీసుకోవచ్చని తెలియజేశారు. ఐపీవో చేపట్టదలచిన స్టార్టప్‌లు కంపెనీ విలువలో ఏర్పడిన మార్పులు తదితర కొన్ని భవిష్యత్ అంశాలను వెల్లడించేందుకు సిద్ధపడాలని సూచించారు. ఐపీవోకు ముందు షేర్ల జారీ, ఐపీవోకు ఆశిస్తున్న ధర వ్యత్యాసం వంటి అంశాలను వివరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఐపీవోకు ఏ ధరను ఆశిస్తున్నారో అది మీ బిజినెస్‌ను ప్రతిబింబించాలని విశ్లేషించారు. పలు మార్పులు న్యూటెక్ కంపెనీల ఐపీవో ధరల నిర్ణయంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు బచ్ తెలియజేశారు. న్యూఏజ్ టెక్ కంపెనీల ఐపీవో ధరలను నిర్ణయించడం తమ బిజినెస్‌కాదంటూనే సంస్థలు తమ బిజినెస్ ఆధారంగా స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన బచ్ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ప్రసంగించారు. ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ చేపట్టిన పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే మూడోవంతుకు పతనమైన విషయం విదితమే. దీంతో ఇన్వెస్టర్లు న్యూఏజ్ టెక్ కంపెనీల ఐపీవోలకు అధిక ధరల నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా మరికొన్ని న్యూఏజ్ కంపెనీల షేర్లు సైతం ఐపీవో ధరలతో పోలిస్తే పతన బాటలో సాగుతున్నాయి. ఈ నేప థ్యంలో సెబీ చైర్‌పర్శన్ బచ్ వ్యాఖ్యలకు ప్రాధా న్యత ఏర్పడినట్లు నిపుణులు తెలియజేశారు. -
దేశీయ స్టాక్ మార్కెట్, కొనసాగుతున్న నష్టాల పరంపర!
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ సూచీలకు మూడోరోజూ నష్టాలు తప్పలేదు. ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బుధవారం సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 53,514 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 16,000 స్థాయి దిగువున 15,967 వద్ద నిలిచింది. మరోవైపు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, కార్పొరేట్ ఫలితాలకు వెల్లడి ముందు అప్రమత్తత, డాలర్ మారకంలో రూపాయి సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం తదితర అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. గత 3 సెషన్లలో సెన్సెక్స్ 967 పాయింట్లు, నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,840 కోట్ల షేర్లను అమ్మేయగా.. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,799 కోట్ల షేర్లు కొన్నారు. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అమ్మకాల ఒత్తిడి భారత ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడంతో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 54,210 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,128 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో ట్రేడింగ్ ప్రారంభం నుంచీ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌సెషన్ కల్లా ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు.., యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో మరింత ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(54,211) నుంచి 756 పాయింట్లు నష్టపోయి 53,455 వద్ద నిఫ్టీ 190 పాయింట్లను కోల్పోయి 15,950 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►తొలి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్‌సీఎల్ టెక్ షేరు ఒక దశలో 2.5% నష్టపోయి రూ.905 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి ఒకశాతం పతనంతో రూ.918 వద్ద స్థిరపడింది. ►ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణపై వివరణ ఇచ్చినప్పటికీ.. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరుకు నష్టాలు తప్పలేదు. మూడున్నర శాతం నష్టంతో రూ. 818 వద్ద ముగిసింది. ►నష్టాల మార్కెట్లోనూ అరబిందో పార్మా, లారస్ ల్యాబ్స్, దివీస్, లుపిన్ షేర్లు 4–5% రాణించాయి. -
మీదైన స్టయిల్ ఉండాల్సిందే..
టీనేజీలోనే స్టాక్స్‌లో పెట్టుబడి ప్రారంభం. 30 ఏళ్ల అనుభవం. రూ.800 కోట్లకు పైగా నెట్‌వర్త్. ఇది ప్రముఖ ఇన్వెస్టర్, కేడియా సెక్యూరిటీస్ అధినేత విజయ్ కేడియా ఈక్విటీ ప్రస్థానం. ఆయన పట్టిందల్లా బంగారం కాలేదు. కానీ, ఈక్విటీల్లో రాబడులు ఒడిసి పట్టడం ఎలాగన్నది ఆయనకు తెలుసు. స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసు. ఎంపిక చేసుకున్నది బెడిసి కొడితే తదుపరి ఏ అడుగు తీసుకోవాలో తెలుసు. అయినా సరే.. గత అనుభవాలు, గత విజయాలకు దోహదపడిన సూత్రాల ఆధారంగా ఒక స్టాక్‌లో పెట్టుబడి పెడితే.. రేపు అది 100 శాతం సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదంటారు. ఈక్విటీల్లో అటువంటి రిస్క్ఎప్పుడూ ఉంటుందన్నది ఆయన స్వీయ అనుభవం. అవును ఈక్విటీలంటే అంతే. ‘ఇన్నేళ్ల అనుభవం, ఇంత సంపద సృష్టి తర్వాత కూడా.. ‘నేను భయస్తుడిని. సామాన్యుడిని. అభద్రతా భావం ఉన్నవాడిని‘ అని తన గురించి కేడియా చెప్పుకోవడం వెనుక అంతరాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పెట్టుబడి సక్సెస్ ఇచ్చిందని ‘అంతా నాకే తెలుసు’ అనుకుంటే కష్టం. అనుభవం, అధ్యయనం, విశ్లేషణ, విజ్ఞానం అన్నింటినీ జోడించి జాగ్రత్తగా వెళితే ఈక్విటీ ప్రయాణం సక్సెస్‌ను ఇస్తుంది. విజయ్ కేడియా తరహా ఇన్వెస్టర్ల విజయానికి దోహదం చేసిన అంశాలను తెలుసుకోవడం వల్ల మన అవగాహన మరికొంత విస్తృతమవుతుంది. ∙ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, డాలీఖన్నా, విజయ్ కేడియా.. ఇలాంటి బడా ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు చాలా మందే మన మార్కెట్లో ఉన్నారు. వీరంతా ఈక్విటీల్లో నిలిచి గెలిచినవారు. నష్టాలను పాఠాలుగా చేసుకుని, అనుభవంతో సంపద సృష్టించుకున్నారు. వీరిని గమనిస్తే కొన్ని లక్షణాలు ఒకే రీతిలో కనిపిస్తాయి. కనీసం మూడు దశాబ్దాలకు పైగా అనుభవం, మార్కెట్ల ఎత్తు పల్లాలను చూసి, వాటికి ఎదురీది, అనిశ్చితుల్లో ఏమి చేయాలో తెలిసిన వారు. ఇలా విజయవంతమైన బడా ఇన్వెస్టర్లలో కేడియా సెక్యూరిటీస్ అధినేత విజయ్ కేడియా కూడా ఒకరు. ఆయన ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెట్టుబడులు, తాను అనుసరించే సూత్రాలు తదితర సమాచారాన్ని పంచుకున్నారు. ఈక్విటీ ప్రయాణం చేసే, కొత్తగా ఈక్విటీల్లోకి వచ్చే రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ సమాచారం ఎంతో కొంత మార్గదర్శనం చేస్తుంది. అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు.. నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు చాలా మందే ఉన్నారు. స్టాక్స్ ఎంపికలో చేసే పొరపాట్లతో ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఏ ప్రయాణం అయినా కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడంపైనే గమ్యస్థానం చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. కనుక ఒకటి రెండు నష్టాలు ఇచ్చాయని కుదేలు కాకూడదు. ఆ అనుభవంతో తదుపరి పెట్టుబడుల్లో ఫెయిల్యూర్ అవకాశాలను తగ్గించుకోవాలి. విజయ్ కేడియా తన సక్సెస్ రేటు 50 శాతమే అని చెప్పారు. మరి ఆయనకేమైనా తక్కువ అనుభవం ఉందా..? 19 ఏళ్లకే ఈక్విటీ జర్నీ మొదలు పెట్టి, 30 ఏళ్లకు పైగా మార్కెట్‌తో కలసి నడుస్తున్న వ్యక్తి. రిటైల్ ఇన్వెస్టర్‌గా మనం ఎంపిక చేసుకునే ప్రతీ స్టాక్ మల్టీబ్యాగర్ కావాలని భావిస్తాం. దీంతో కళ్ల ముందు స్వల్ప వ్యవధిలోనే రెండు మూడు రెట్లు పెరిగిన స్టాక్‌ను చూసి ఆకర్షితులవుతాం. రిస్క్ తీసుకుని అధిక ధర వద్ద కొనుగోలు చేస్తాం. కానీ, వాటిని ఎక్కువ కాలం పాటు అట్టి పెట్టుకుంటామా..? లేదు. అసలు ఏ అంశాలను చూసి ఇన్వెస్ట్ చేశామన్నది ప్రశ్నించుకోము. అన్నీ మర్చిపోయి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తాం. ఎంపిక చేసుకునే 10 స్టాక్స్‌లో ఒకటి లేదా రెండు మాత్రమే మల్టీబ్యాగర్లు అవుతాయన్నది విజయ్ కేడియా అనుభవసారం. వైవిధ్యం.. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోను గమనిస్తే 90 శాతం ఈక్విటీల్లోనే ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇక డెట్ సాధనాల్లో సున్నా. 8 శాతాన్ని రియల్ ఎస్టేట్‌పై పెట్టారు. మరో 2 శాతాన్ని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులు అన్నీ ఒకే చోట పెట్టుకూడదన్నది ప్రాథమిక సూత్రం. ఎందుకంటే ఒకే విభాగంలో పెట్టినప్పుడు.. ఏదైనా సంక్షోభం వచ్చి ఆయా విభాగంపై ప్రభావం పడితే..? అదే సమయంలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవాల్సి వస్తే..? అందుకుని ఈ రిస్క్‌ను తగ్గించుకునేందుకు కచ్చితంగా ఈక్విటీలతోపాటు డెట్, బంగారం ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోలో డెట్‌కు చోటు ఎందుకు లేదు...? అన్న సందేహం రావచ్చు. రాబడి, రిస్క్ కోణంలో ఆయనకు నచ్చని విభాగం అది. ‘‘నేను డెట్‌లో పెట్టుబడులు పెట్టను. నేను ఏవైనా షేర్లను విక్రయించాల్సి వస్తే ఆ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో 10–30 రోజుల కాలానికి ఉంచుతాను. నగదు రూపంలో ఉంటే నాకు నిద్ర పట్టదు’’ అని విజయ్‌కేడియా చెప్పారు. డెట్ ఆయనకు ఉద్వేగాన్ని ఇవ్వదట. పైగా రిస్క్ తీసుకోవడానికే తాను ఇష్టపడతానని చెప్పారు. అందుకే 90 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించారు. అదే సమయంలో 10 శాతాన్ని ఇతర సాధనాలకు కేటాయించడాన్ని గమనించాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. పెట్టుబడి విధానం స్నేహితుడో, సహచర ఉద్యోగి చెప్పాడనో.. లేదంటే అనలిస్ట్ సూచించాడనో బ్లైండ్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడికి సంబంధించి ఒక విధానం ఉండాలి. దీన్నే స్టయిల్ అనో, మరొకటో అనుకోవచ్చు. ఎంత రాబడి ఆశిస్తున్నారు, ఎంత కాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించగలరు? లేదంటే వారసులకు ఇవ్వడం కోసం స్టాక్స్‌ను పోగు చేస్తున్నారా..? ఏటా ఆయా కంపెనీల నుంచి ఎంత వృద్ధి ఆశిస్తున్నారు..? ఆయా కంపెనీలనే ఎందుకు ఇష్టపడుతున్నారు..? నష్టం వస్తే వెంటనే అమ్మేస్తారా..? లేదంటే దీర్ఘకాలం పాటు ఓపిక పడతారా..? ఇలా ఎన్నో అంశాలను ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే స్టాక్స్ ఎంపిక ఉంటుంది. విజయ్ కేడియా స్టాక్స్ ఎంపికకు ‘స్మైల్’ (టఝజీ ్ఛ) అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ఎంపిక చేసుకునే కంపెనీ చిన్నది అయి ఉండాలి. కంపెనీకి ఆయా వ్యాపారంలో మధ్యస్థ అనుభవం అయినా ఉండాలి. కంపెనీకి ఎంతో ఎత్తుకు ఎదగాలన్న బలమైన ఆకాంక్షలు ఉండాలి. దీనికి తగ్గట్టు మార్కెట్ అవకాశాలు అపారంగా ఉండాలి. వీటికి టిక్ పడితే ఆయన ఆ స్టాక్‌లో పెట్టుబడి పెట్టేస్తారు. అందుకే విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోలో స్మాల్‌క్యాప్ స్టాక్స్, మిడ్‌క్యాప్ స్టాక్స్ కనిపిస్తాయి. తాను పెట్టుబడి పెట్టినప్పుడు చిన్నగా ఉండి.. ఆ తర్వాత మల్టీబ్యాగర్ రిటర్నులతో లార్జ్ క్యాప్‌గా మారిందనుకోండి. అప్పుడు విజయ్ కేడియా మళ్లీ స్మాల్‌క్యాప్ జెమ్స్ అన్వేషణలో పడతారు. తాను అనుకున్న క్వాలిటీలతో కంపెనీ కనిపించిందనుకోండి.. వెంటనే అందులోకి పెట్టుబడి బదిలీ చేస్తారు. ‘‘నేను స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో ఆసక్తికరమైన కంపెనీ ఉందేమో చూస్తున్నాను. అవకాశం గుర్తిస్తే వెంటనే అందులోకి పెట్టుబడులు మార్చేస్తా’’అని చెప్పారు. స్వల్ప కాలం ఫలితం ఇవ్వదు మన చుట్టూ ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లను గమనిస్తే.. ఒక్కటి గుర్తించొచ్చు. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వెంటనే పెరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కొనుగోలు ధర నుంచి కిందకు పడిపోతే వారిలో ఆందోళన మొదలవుతుంది. నష్టాల్లోనే ఆ కంపెనీ కొంత కాలం పాటు కొనసాగితే ఇక ఉండబట్టలేక ఎంతో కొంతకు అమ్మేస్తారు. అందుకే పెట్టుబడికి ముందు అధ్యయనం అవసరం. కంపెనీ వ్యాపారం, పనితీరు తదితర అంశాల ఆధారంగానే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. స్టాక్ ధరను చూసి కాదు. ఇలా చేస్తే కనుక అది తప్పుడు మార్గమే అవుతుంది. పైగా, ఈక్విటీ పెట్టుబడికి స్వల్పకాలం ఫలితమివ్వదు. దీర్ఘకాలమే రాబడులకు మార్గం అవుతుంది. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియో గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభాన్ని ఇవ్వలేదు. గత ఏడాది కాలంలో ఆయనకు తేజాస్ నెట్వర్క్స్ షేరు మంచి రాబడినిచ్చింది. అదే సమయంలో అంబికా కాటన్ మిల్స్ ఫలితమివ్వలేదు. ‘‘నేను రాబడులను ఏటా చూసుకోను. నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ మంచి రాబడినిచ్చినవే. 2020లో నేను కొన్న కొన్ని స్టాక్స్ అయితే 10 రెట్లు పెరిగాయి. కానీ 2021 మే నుంచి మార్కెట్ పరిస్థితుల వల్ల స్టాక్స్ ఏ మాత్రం వృద్ధి లేకుండా అక్కడే ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి’’అని విజయ్ కేడియా తెలిపారు. రియల్ ఎస్టేట్ కూడా అంతే.. రియల్ ఎస్టేట్ రాబడులను కూడా కేడియా ఎప్పటికప్పుడు పరిశీలించుకోరు. ‘‘రియల్ ఎస్టేట్ పెట్టుబడి అన్నది దీర్ఘకాలం పాటు అంటే 10–40 ఏళ్ల కోసం. నేను అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిని సందర్భోచితంగా చేస్తుంటాను’’అని ఆయన చెప్పారు. పైగా రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒక ప్లాట్ కొనుగోలు చేయడం కాదు. దానిపై రాబడి వచ్చేలా చూసుకుంటారు. నెలవారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టే రెండు గోదాములు ఆయన రియల్టీ పెట్టుబడిలో భాగం. కేవలం స్టాక్ మార్కెట్ రాబడినే ఆయన నమ్ముకోరు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం ఆయన రియల్ ఎస్టేట్‌లో 8% పెట్టుబడులు పెట్టారు. భవిష్యత్తు పెట్టుబడి ఆలోచనలు.. ఈక్విటీలకు పెట్టుబడులు పెంచుకునేందుకు విజయ్ కేడియా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకానీ, మార్కెట్లలో అస్థిరతలు ఉన్నాయని చెప్పి పెట్టుబడులను కొంత విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవాలని అనుకోవడం లేదు. 2022 స్తబ్ధుగా ఉండడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ల పతనాలను చూసి భయంతో విక్రయాలు చేస్తుంటారు. నిజానికి ఈ తరహా అనిశ్చితులు పెట్టుబడులు పెంచుకునేందుకు అను కూలం. ఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా భిన్న ప్రాంతాల మధ్య వైవిధ్యీకరించుకోవాలని చెబుతుంటారు. కానీ, విజయ్ కేడియా ఈక్విటీ పెట్టుబడులు అన్నీ కూడా మన మార్కెట్లలోనే ఉన్నాయి. కాకపోతే గూగుల్ (ఆల్ఫాబెట్)లో మొదటిసారి ఆయన ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మినహా అమెరికా మార్కెట్లో మరే ఇతర టెక్నాలజీ షేరులో ఇన్వెస్ట్ చేయాలని ఆయన అనుకోవడం లేదు. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 2,50,000 డాలర్లను విదేశాలకు పంపుకోవచ్చు. తన పెట్టుబడులకు ఈ పరిమితి సరిపోతుందని, తన పోర్ట్‌ఫోలియోపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని కేడియా వివరించారు. అంతెందుకు హైనెట్వర్త్ ఇన్వెస్టర్లలో చాలా మందికి విదేశీ పెట్టుబడులు లేవనే చెప్పుకోవాలి. వారంతా మన ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉన్నారు. అత్యవసర నిధి అత్యవసర నిధి ఎవరికైనా ఉండాల్సిందే. అవసర సమయంలో రుణం కోసం పరుగెత్తే విధంగా ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను కూడా తాకకూడదు. అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా నిధిని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. విజయ్ కేడియా అయితే అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోలేదు. దీన్ని కూడా ఆయన పెట్టుబడి మార్గంగా మలుచుకున్నారు. కంపెనీల నుంచి డివిడెండ్లు, గోదాముల రూపంలో రెంటల్ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయనకు తగినన్ని ఆదాయ మార్గాలున్నాయి. రిషికేశ్, గోవా, కేరళలో ఆయనకు యోగా, వెల్నెస్ కేంద్రాలు మూడున్నాయి. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. దీంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి తదితర ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. అయితే ఆ ప్రభావం గురువారం సైతం మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికాలో క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ముదుపర్లు పెట్టుబుడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆ ప్రభావంతో పాటు భారత్ ఎకానమీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 9.17 నిమిషాలకు నిఫ్టీ 256 పాయింట్లు లాభపడి 57082 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 17122 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. హెచ్‌యూఎల్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా,యూపీఎల్,అపోల్ ఆస్పిటల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎథేర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్,ఎసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా,భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 702 పాయింట్లు లాభాంతో 57282.11 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ సైతం 213పాయింట్ల లాభంతో 17167 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. బజాజ్ ఆటో,ఇండస్ ఇండ్ బ్యాంక్,ఎంఅండ్ఎం, టాటా మోటార్స్,సన్ ఫార్మా,బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్,సన్ ఫార్మా, టాటా కాన్స్, ఐటీసీ,రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతుంది నో ఎఫెక్ట్ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదు. వెరసి దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా..చెనా రాజధాని బీజింగ్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి పలు ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండునెలలైనా ఆగలేదు. యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో కఠినతర ద్రవ్య విధానాలను అవలంబించాలని ఈసీబీ నిర్ణయించుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. -
ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు, హాట్ కేకుల్లా ఐపీవో సబ్స్క్రిప్షన్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవోలు) జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం నుంచి (ఈ నెల 4న) విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయోగ్నస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోలు మొదలయ్యాయి. తొలిరోజే వీటికి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల నుంచి పూర్తి చందాలు (సబ్స్క్రయిబ్) వచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కోస్టాకాఫీ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించే దేవయాని ఇంటర్నేషనల్ ఇష్యూకు తొలిరోజు 30,26,56,860 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఆఫర్ చేస్తున్న 11,25,69,719 షేర్లతో పోలిస్తే 2.7 రెట్లు అధికంగా బిడ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.86–90 ధరల శ్రేణితో దేవయాని ఇంటర్నేషనల్ ఆఫర్ చేస్తోంది. 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయించగా.. వారి నుంచి 11.37 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోట కూడా పూర్తిగా సబ్స్క్రయిబ్ అయింది. కృష్ణా డయోగ్నస్టిక్స్ డయోగ్నస్టిక్స్(వ్యాధి నిర్ధారణ) సేవలు అందించే కృష్ణా డయోగ్నస్టిక్స్ రూ.1,213 కోట్ల సమీకరణకు ఐపీవోను చేపట్టగా.. తొలిరోజే పూర్తి స్థాయి స్పందన అందుకుంది. 71,12,099 షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా.. 1,41,10,650 షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే రెండు రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ముఖ్యంగా రిటైలర్ల కోటా 9.59 రెట్లు అధికంగా బిడ్లు అందుకుంది. ఈ సంస్థ ఒక్కో షేరు ను రూ.933–954 ధరల శ్రేణిపై ఆఫర్ చేస్తోంది. ఎక్సారోటైల్స్ టైల్స్ తయారీలోని ఎక్సారోటైల్స్ ఐపీవోలో భాగంగా 1,14,50,675 షేర్లను ఆఫర్ చేస్తుంటే.. తొలి రోజే 4.67 రెట్ల అధిక స్పందన అందుకుంది. మొత్తం 5,35,23,750 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైలర్ల కోటాలో 9.29 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. విండ్లాస్ బయోటెక్ ఈ ఔషధ తయారీ సంస్థ ఐపీవోలో భాగంగా 61,10,317 షేర్లను ఆఫర్ చేస్తోంది. మొదటి రోజే మూడు రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైలర్ల కోటాలో 6 రెట్లు అధికంగా స్పందన వచ్చింది. -
కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్‌తో బోణీ
ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల వృద్ధితో 47,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 14,019 వద్ద స్థిరపడింది. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,980ను తాకగా.. నిఫ్టీ 14,050కు చేరింది. (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్) ఐటీ, ఆటో.. ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ 0.3 నీరసించగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 3.3 శాతం ఎగశాయి. ఈ బాటలో ఆటో, ఐటీ, రియల్టీ 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, సిప్లా 4.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ 1.4-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీహెచ్ఈఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో బీహెచ్ఈఎల్, చోళమండలం, ఐడియా, బీఈఎల్, పీఎన్బీ, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, లాల్‌పాథ్, పిరమల్, కెనరా బ్యాంక్ 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్బీఐ లైఫ్, బాలకృష్ణ, ఇండిగో, హావెల్స్, మదర్సన్, వేదాంతా 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,046 లాభపడగా.. 953 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
షేర్‌ఖాన్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
చివరి గంటలో అనూహ్యంగా అమ్మకాలు నెలకొనడంతో మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది. దీంతో సూచీల 5రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 346 పాయింట్లు పతనమై 36,329 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 10,706 వద్ద ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు 0.6-1 శాతం మధ్య నష్టాలతో ప్రారంభంకావడం, ఐదు రోజుల ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు మార్కెట్లకు షాకిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మధ్యకాలికానికి 3 షేర్లను సిఫార్సు చేస్తుంది. ఆ 3 షేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం... 1.షేరు పేరు: అపోలో టైర్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.135 విశ్లేషణ: ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంతో దేశీయ రిప్లేస్మెంట్ విభాగంలో ప్రధాన కంపెనీ అపోలో టైర్స్ బలమైన పిక్అప్ను చవిచూస్తుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. టైర్ల దిగుమతులపై కేంద్రం పరిమితులు విధించడంతో దేశీయ టైర్లు లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. టైర్ల తయారీ విడిభాగాల ధరలు దిగిరావడం, యూరోపియన్ నిర్వహణలో వ్యయ నియంత్రణ, మెరుగైన ఉత్పత్తులు తదితర అంశాలు కంపెనీ మార్జిన్లు పెరిగేందుకు దోహదం చేస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కరోనా వ్యాధి వ్యాప్తి జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూరం అంశానికి ప్రాధాన్యత పెరగడంతో ప్రజలు సొంతవాహనాల్లో ప్రయాణాలకు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో టైర్లకు డిమాండ్ పెరగవచ్చు. అయితే కంపెనీకి ప్రధాన మార్కెట్లైన భారత్, యూరప్‌లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుండటం, బలహీన వినియోగ సెంటిమెంట్లు ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. షేరు పేరు: బజాజ్ అటో రేటింగ్: కొనవచ్చు. టార్గెట్ ధర: రూ.3,250 విశ్లేషణ: ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అంచనాలకు మించి పిక్అప్ ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. ఇప్పటికీ అటోమొబైల్ రంగంలో బజాజ్ అటో షేరు టాప్‌గా ఉందని బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. గ్రామీణ, పట్టణ మార్కెట్లలో అమ్మకాల్లో వృద్ధిని సాధిస్తుందని కంపెనీ చేసిన వ్యాఖ్యలను బ్రోకరేజ్ సంస్థ కోట్ చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలు ప్రాంతీయ ప్రాంతాల్లో సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉందని బ్రోకరేజ్ తెలిపింది. సామాజిక దూరం అంశం నేపథ్యంలో అర్బన్ ప్రాంతంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఇండియాలో కోవిడ్-19 ధీర్ఘకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి క్షీణత, బలహీన వినియోగం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అలాగే డాలర్ మారకంలో రూపాయి అస్థిరత ఎగుమతుల మార్కెట్లో ఫైనాన్సియల్ సమస్యలను సృష్టిస్తోంది. షేరు పేరు: హీరోమోటో కార్ప్ రేటింగ్: కొనవచ్చు. టార్గెట్ ధర: రూ.2740.75 విశ్లేషణ: దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభకావడంతో అటోమోటివ్ అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మరింత పుంజుకోవాల్సి ఉంది. వచ్చే 2-3 క్వార్టర్‌లోగా అమ్మకాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయాని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. ఇండియాలో కోవిడ్-19 ధీర్ఘకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి క్షీణత, బలహీన వినియోగం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
శుక్రవారం వార్తల్లోని షేర్లు
క్యూ4 ఫలితాలు: ఎస్బీఐ, ఎల్అండ్టీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గుజరాత్ గ్యాస్,ఇన్ఫీబీమ్, జ్యోతి ల్యాబొరేటరీస్, ఐఆర్బీ ఇన్విట్ ఫండ్, స్నోమాన్ లాజిస్టిక్స్, ఆర్ఈసీ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్: అబుదాబికి చెందిన సావరిన్ ఇన్వెస్టర్ ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రూ.9,093.6 కోట్లు వెచ్చించి జియో ప్లాట్‌ఫామ్స్‌లోని 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. డీఎల్ఎఫ్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.1,857.76 కోట్లుగా నమోదైనట్లు రియల్టీ మేజర్ డీఎల్ఎఫ్ వెల్లడించింది. ఎన్ఐఐటీ: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 97 శాతం తగ్గి రూ.0.6 కోట్లుగా నమోదైందని ఎన్ఐఐటీ తెలిపింది. భారతీ ఇన్ఫ్రాటెల్: ఇండస్ టవర్స్‌ను తమ కంపెనీలో కలుపుకునే అంశంపై నిర్ణం తీసుకునేందుకు భారతీ ఇన్ఫ్రాటెల్ బోర్డు జూన్ 11న సమావేశం కానుంది. ఈ టవర్ల కంపెనీనీ సొంతం చేసుకోవడం ద్వారా 1,69,000 టవర్లతో భారతీ ఇన్ఫ్రాటెల్ ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటిగా నిలవనుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: గూగుల్ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీ ప్రకటించింది. కాస్మో ఫిల్మ్స్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24.37 శాతం తగ్గి రూ.20.85 కోట్లుగా నమోదైనట్లు కాస్మో ఫిల్మ్స్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.27.57 కోట్లుగా ఉన్నట్లు బీఎస్‌కీ ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. -
నో 52 వీక్ లోస్..ఓన్లీ గెయిన్స్
గురువారం ఎన్ఎస్ఈలో 20 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్, ఆల్కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బ్రైట్‌కామ్ గ్రూప్, బిర్లా టైర్స్, సిప్లా, డిజి స్పైస్ టెక్నాలజీస్, ఎడ్యూకాంప్ సొల్యూషన్స్, జీఎంఎం ఫాడ్లర్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, గ్రాన్యూల్స్ ఇండియా, లాయిడ్స్ స్టీల్స్ ఇండస్ట్రీస్, మార్క్సన్స్ ఫార్మా, మిట్టల్ లైప్ స్టైల్, ఆఫ్టో సర్య్కూట్స్(ఇండియా), ప్రకాశ్ స్టీలేజ్, రుచీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుబెక్స్లు ఉన్నాయి. నేడు ఏ ఒక్క షేరు కూడా ఏడాది కనిష్టాన్ని తాకలేదు. నిఫ్టీ50 ఇండెక్స్‌లో 25 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా మరో 25 షేర్లు నష్టాలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన వేదాంత, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, సిప్లా, బీపీసీఎల్‌లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్ కంపెనీ, ఏసియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్,హెచ్‌డీఎఫ్‌సీలు టాప్ లూసర్స్‌గా ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 12:15 గంటల ప్రాంతంలో బీఎస్ఈలో సెన్సెక్స్ 265.08 పాయింట్లు నష్టపోయి 33,844.46 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ 75.60 పాయింట్ల నష్టపోయి 9,985.95 వద్ద ట్రేడ్ అవుతోంది. -
52 వీక్స్ హైకు..23 షేర్లు
బుధవారం ఎన్ఎస్ఈలో 23 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, బ్రైట్‌కామ్ గ్రూప్, బిర్లా టైర్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డిజి స్పైస్ టెక్నాలజీస్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా), ఎడ్యుకంప్ సొల్యూషన్స్, ఎస్కార్ట్స్,జీఎంఎం ఫాడ్ల్లర్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, లాయిడ్స్ స్టీల్స్ ఇండస్ట్రీస్, మర్క్సన్స్ ఫార్మా, ఆఫ్టో సర్య్కూట్స్(ఇండియా), ప్రకాశ్ స్టీలేజ్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్, ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్‌లు ఉన్నాయి. కాగా గత రెండురోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండడంతో నేడు ఎన్ఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ మాత్రమే 52 వారాల కనిష్టానికి పతనమైంది. నిఫ్టీ50 ఇండెక్స్‌లో మొత్తం 39 షేర్లు గ్రీన్,11 షేర్లు రెడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్‌లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, విప్రో, ఎన్టీపీసీ, టీసీఎస్, కోల్ ఇండియాలు రెడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యహ్నాం 1:10 గంటల ప్రాంతంలో ఎన్ఎస్ఈలో నిఫ్టీ 1.3 శాతం లాభంతో 137.05 పాయింట్లు పెరిగి 10.116.15 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈలో సెన్సెక్స్ 1.2 శాత లాభపడి 430.97 పాయింట్ల పెరుగదలతో 34,256.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఏడాది గరిష్టానికి 26...కనిష్టానికి 4
దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా లాభాల్లో ట్రేడ్‌అవుతున్న నేపథ్యంలో మంగళవారం ఎన్ఎస్ఈలో 26 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బ్రైట్‌కమ్ గ్రూప్, బయోకాన్, సిప్లా, డిజిస్పైస్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబొరేటరీస్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా), ఎడ్యూకంప్ సొల్యూషన్స్, ఎరీస్ లైఫ్‌సైన్సెస్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్, క్యాపస్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, డీఎస్పీ లిక్విడ్ ఈటీఎఫ్, లాయిడ్స్ స్టీల్స్ ఇండస్ట్రీస్, మార్క్సాన్స్ ఫార్మా,ఆఫ్టో సర్య్కూట్స్(ఇండియా)లు ఉన్నాయి. కనిష్టానికి నాలుగు ఎన్ఎస్ఈలో 4 షేర్లు మాత్రమే 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో కండావాల సెక్యూరిటీస్, కృష్ణా ఫోస్కేమ్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్, రాజ్ రెయాన్ ఇండస్ట్రీలు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 1 గంట ప్రాంతంలో ఎన్ఎస్ఈలో నిఫ్టీ1.4 శాతం లాభంతో 144 పాయింట్లు పెరిగి 9,970.20 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈలో సెన్సెక్స్ 1.5శాతం లాభపడి 508.81 పాయింట్లు పెరిగి 33,812.33 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. -
అదాని గ్రీన్ఎనర్జీ, ఆల్కెమిస్ట్,అలోక్‌లు.. 52 వీక్స్ హై
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఎన్ఎస్ఈలో 23 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, బఫ్నా ఫార్మాసూటికల్స్, బేయర్ క్రాఫ్సైన్సెస్, బ్రైట్‌కమ్ గ్రూప్, బయోకాన్, బిర్లా టైర్స్, సిప్లా, ధనుకా అగ్రిటెక్, డిజి స్పైస్ టెక్నాలజీస్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా), ఎడ్యుకంప్ సోల్యూషన్స్, ఎస్కార్ట్స్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్, మిట్టల్ లైఫ్ స్టైల్, ఏబీబీ పవర్ ప్రోడక్ట్స్ అండ్ సిస్టమ్స్ ఇండియాలు ఉన్నాయి. కనిష్టాన్ని తాకిన షేర్లు ఎన్ఎస్ఈలో 14 షేర్లు మాత్రమే 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో బ్లూబ్లెండ్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఇయాన్ ఎలక్ట్రిక్, జీఈటీ అండ్ టీ ఇండియా, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఖండావాల సెక్యూరిటీస్, కృష్ణా ఫోస్కెమ్, రాజ్రెయాన్ ఇండస్ట్రీస్, రెప్కె హోం ఫైనాన్స్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, షా అలాయిస్, టరమట్ లిమిటెడ్, వెర్టోజ్ అడ్వర్టైజింగ్, వీడియోకాన్ ఇండస్ట్రీలు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో బీఎస్ఈలో సెన్సెక్స్ 900.36 పాయింట్లు లాభపడి 33,324.46 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ 243.80 పాయింట్లు లాభపడి 9,824.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఏంజెల్ బ్రోకింగ్ బ్రోకరేజ్ నుంచి 2స్టాక్ రికమెండేషన్లు
షేరు పేరు: వినతి ఆర్గానిక్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1,095 స్టాప్ లాస్: రూ.976 అప్‌సైడ్: 7శాతం విశ్లేషణ: లాక్‌డౌన్‌తో కొద్దిరోజుల పాటు ఒడిదుడుకులను ఎదుర్కోన్న కెమికల్ రంగం ప్రస్తుతం గాడిలో పడింది. ఈ స్టాక్ విషయానికొస్తే.., మార్చి నెలలో భారీ పతనం తర్వాత, రూ.700 స్థాయిల నుండి అద్భుతమైన రికవరీని సాధించింది. ఇటీవల, స్టాక్ ధర దాని 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ చుట్టూ దాదాపు 3వారాల పాటు కన్సాలిడేట్ అయ్యింది. అయితే చివరి శుక్రవారం, బలమైన కొనుగోళ్లతో మరో మద్దుతు స్థాయికి అధిగమించేందుకు ప్రయత్నం చేసింది. షేరు పేరు: కజారియా సిరామిక్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.378 స్టాప్ లాస్: రూ.316 అప్‌సైడ్: 10శాతం విశ్లేషణ: షేరు జనవరి గరిష్టం నుంచి దాదాపు 50శాతం కరెక్షన్కు లోనవడంతో, ఈ కౌంటర్ గత 4నెలలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. చివరి వారంలో కొన్నేళ్ల మద్దతు స్థాయిల వద్ద ఆగిపోయింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో, స్టాక్ ధరల బలమైన పెరుగుదలను చూసింది. ఇప్పుడు డైలీ ఛార్ట్‌ను పరిశీలిస్తే.., షేరు గడిచిన 3నెలల తర్వాత మొదటిసారి 20 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్‌పై ముగిసినట్లు స్పష్టమవుతోంది. అదనంగా, బలమైన మద్దతు జోన్ వద్ద బుల్లిష్ హ్యామర్ ప్యాట్రన్ నిర్ధారణను సూచిస్తుంది. -
3నెలల్లో 20శాతం వరకు రాబడినిచ్చే 3 షేర్లు ఇవే..!
మార్కెట్ ర్యాలీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు వికాస్ జైన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ర్యాలీలో మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్ల ప్రదర్శన తక్కువగా ఉందని, రాబోయే కొద్ది వారాల్లో ఈ షేర్లలో అద్భుతమైన ర్యాలీని చూడవచ్చని జైన్ అంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్ అప్‌సైడ్‌లో 9,750 వద్ద నిరోధ స్థాయిని కలిగి ఉందని, దాన్ని అధిగమిస్తే 9,800 వద్ద మరో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని జైన్ అంచనా వేస్తున్నారు. ఇక్ డౌన్‌సైడ్‌లో 9,250వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని, ఈ స్థాయిని కోల్పోతే 9,050వద్ద మరో కీలక మద్దతు ఉందన్నారు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ప్రదర్శన రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని జైన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జైన్ 3నెలల వ్యవధిలో 20శాతం వరకు రాబడులనిచ్చే 3స్టాకులను సిఫార్సు చేశారు. షేరు పేరు: సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.340 స్టాప్ లాస్: రూ.253 అప్ సైడ్: 20శాతం విశ్లేషణ: ఈ షేరు నెలవారీ ఎక్స్పైరీ ఛార్ట్‌లో హమ్మర్ క్యాండిల్ ప్యాట్రన్ రూపొందించింది. హయ్యర్ సైడ్‌లో బలమైన రివర్సల్ బ్రేక్అవుట్ను ఆశించవచ్చు. బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు 4వారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్ఎస్ఐ గత కొన్నివారాల నుంచి యావరేజ్ లైన్‌పై ట్రేడ్ అవుతోంది. కాబట్టి ట్రేడర్లు రూ.253ని స్టాప్ లాస్‌గా నిర్దేశించుకొని రూ.340 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.410 స్టాప్ లాస్: రూ.324 అప్‌సైడ్: 17శాతం విశ్లేషణ: ఈ షేరు దాని స్వల్ప మరియు మధ్యకాలిక యావరేజ్‌ల దగ్గర ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత స్థాయిల నుండి పైకి బ్రేక్అవుట్ కావొచ్చు. వీక్లీ ఛార్ట్‌లో హయ్యర్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఆశించవచ్చు . షేరు పేరు: టెక్ మహీంద్రా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.595 స్టాప్ లాస్: రూ.491 అప్ సైడ్: 12శాతం విశ్లేషణ: ఈ షేరుకు త్రైమాసికపు సగటు రూ.485 వద్ద కీలక మద్దుత స్థాయిని కలిగి ఉంది. ఇది తక్కువ శ్రేణి నుండి సానుకూల మూమెంటంను అందుకుంది. కీలకమైన ఆర్ఎస్ఐ ఇండికేటర్ దాని యావరేజ్ లైన్‌కు పైన ట్రేడ్ అవుతోంది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి బ్రేక్ అవుట్ అయ్యి తదుపరి ర్యాలీకి సిద్ధమవడాన్ని సూచిస్తుంది. -
టెక్‌షేర్ల జోరు..ఎన్ఐఐటీ టెక్నాలజీస్ 7% అప్
శుక్రవారం ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి.మధ్యహ్నాం12:20 గంటల ప్రాంతంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1శాతం లాభపడి రూ.13,809.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో రూ.13,622.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీఐటీ ఇండెక్స్ రూ.13,854.90 వద్ద గరిష్టాన్ని, రూ.13,571.65 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఎన్ఐఐటీ టెక్నాలజీస్ 7.8 శాతం లాభపడి రూ.1,555.50 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ.337.4 కోట్ల బైబ్యాక్ ఆఫర్ మే 29 నుంచి ప్రారంభమవుతుందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ వెల్లడించడంతో ఈ కంపెనీ షేర్లు లాభల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఇన్ఫోసిస్ 2.6 శాతం లాభంతో రూ.689.8 వద్ద, మైండ్‌ట్రీ 2శాతం లాభంతో రూ.902 వద్ద, జస్ట్‌డయల్ 1 శాతం లాభంతో రూ.353 వద్ద, టెక్ మహీంద్రా 0.79 శాతం లాభపడి రూ.524.15 వద్ద, టీసీఎస్ 0.75 శాతం లాభంతో రూ.2,006 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లోని కొన్ని షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో హెక్సావేర్ 1శాతం నష్టంతో రూ.236 వద్ద, టాటా ఎలక్సీ 0.45 శాతం నష్టంతో రూ.768 వద్ద, విప్రో 0.5శాతం నష్టంతో రూ.188 వద్ద, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 0.6శాతం నష్టంతో రూ.531 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. -
నేటి వార్తల్లోని షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్: కేకేఆర్ 11,367 కోట్లు వెచ్చించి జియో ప్లాట్‌ఫాంలోని 2.31 శాతం వాటా కొనుగోలు చేసింది. క్యూ4 ఫలితాలు: ట్రెంట్,వాబ్కో ఇండియా, సుప్రీం ఇండస్ట్రీస్, బీఏఎస్ఎఫ్ ఇండియా, బేయర్ క్రాప్‌సైన్సెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు శుక్రవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. భారతీ ఎయిర్టెల్: వాయిస్జెన్ కంపెనీలో10 వాతం వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ వెల్లడించింది. ఇమామీ: ఇమామి సిమెంట్‌ను నిర్మా ప్రమోటర్ గ్రూపునకు చెందిన నువొకో విస్తాస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. ఎన్ఐఐటీ టెక్నాలజీస్: రూ.337.4 కోట్ల బైబ్యాక్ ఆఫర్ మే 29 నుంచి ప్రారంభమవుతుందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ వెల్లడించింది. లాక్డౌన్ కారణంగా ఆఫర్ లెటర్‌ను 15 రోజుల్లో పంపించడానికి సెబీ ఆమోదం తెలిపింది. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన ఎన్సీడీల జారీ ద్వారా రూ.200 కోట్లు సమీకరింనున్నట్లు ఐఆర్బీ వెల్లడించింది. ఒక్కో ఎన్సీడీ విలువ రూ.10 లక్షలని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. హాకిన్స్ కుక్కర్స్: క్యూ4లో నికర లాభం 30.56 శాతం తగ్గి రూ.9.36 కోట్లుగా నమోదైందని హాకిన్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.13.48 కోట్లుగా ఉందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. బీఎస్ఈ: నాలుగో త్రైమాసికంలో నికర నష్టం రూ.1.94 కోట్లుగా నమోదైందని బీఎస్ఈ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది నికర లాభం రూ.51.86 కోట్లుగా ఉంది. హీరో మోటోకార్పొరేషన్: బహిరంగ మార్కెట్లో ఎల్ఐసీ 7.146 శాతం వాటా కొనుగోలు చేసి హీరోమోటోకార్పొరేషన్లో తన వాటాను పెంచుకుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్: పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని ఓఎన్జీసీ, ఎన్టీపీసీలు రెండు కలసిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. బజాజ్ హోల్డింగ్స్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54.36 శాతం తగ్గి రూ.361 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. -
ఈ 2 ఫైనాన్స్ షేర్లకు మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేటింగ్
ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ పైనాన్షియల్ షేర్లపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. ఈ రెండు షేర్లపై బ్రోకరేజ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సమగ్ర నివేదికను ఇప్పుడు పరిశీలిద్దాం... ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఫైనాన్స్ రంగ షేర్లు ప్రదర్శన అంత బాగాలేదు. ఇటీవల స్థూల ఆర్థికవ్యవస్థలో ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు ఫైనాన్స్ రంగంలో అధిక స్లిపేజ్‌లు, రుణ వ్యయాలకు దారితీశాయి. ఇంతకు ముందు కార్పోరేట్ ఎన్పీఏలు పెరగడం.. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఫైనాన్స్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు ఎన్బీఎఫ్సీలు, మధ్య స్థాయి బ్యాంకులకు అధిక ఎక్స్పోజర్ను కలిగి ఉంటాయని సిద్ధార్థ నివేదికలో పేర్కోన్నారు. ధీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు మధ్య స్థాయి బ్యాంకులు, ఎన్బీఎబీఎఫ్సీలతో పోలిస్తే ఈ రంగంలో పెద్ద బ్యాంకులుగా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు బ్యాంకులపై ఎక్స్పోజర్ల ఒత్తిడి స్వల్ప కాలానికే పరిమితమయ్యే ఆస్కారం ఉంది. ఒకటి లేదా రెండు క్వార్టర్లో మాత్రమే షేర్లపై ఎక్స్పోజర్ల ఒత్తిడి ఉండవచ్చు. అలాగే ఆస్తి నాణ్యత, అధిక స్లిప్పేజీలు మాత్రమే కాకుండా ప్రస్తుత వాతావరణంలో మనుగడ కోసం అదనపు మూలధనాన్ని సమీకరించుకోగలవు. కాబట్టి మేము ఈ రంగంలో ప్రధాన షేర్లైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌లను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నామని సిద్ధార్థ తెలిపారు. -
నేటి వార్తల్లోని షేర్లు
క్యూ4 ఫలితాలు: బజాజ్ ఫైనాన్స్, అపోలో టైర్స్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్ఈఐటీ, లార్సన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్, గ్యాబ్రెల్ ఇండియాలు మంగళవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. వేదాంత: ప్రమోటర్ అనీల్ అగర్వాల్ ప్రతిపాదించిన డీలిస్టింగ్ ప్రతిపాదనను వేదాంత కంపెనీ బోర్డు ఆమోదించినట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు ఇచ్చిన సమాచారంలో వేదాంత కంపెనీ పేర్కొంది. ఏయూస్మాల్ ఫైనాన్స్: బ్యాంక్ ప్రమోటర్లలో ఒకరైన చిరంజీ లాల్ అగర్వాల్ కంపెనీలోని 25 లక్షల షేర్లను బహిరంగ మార్కెట్లో రూ.103 కోట్లకు విక్రయించారు. రేమండ్: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన ఎన్సీడీల జారీ ద్వారా రూ.100 కోట్ల సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన రూ.1,030 కోట్లు సమీకరించినట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. డాక్టర్ పాత్‌ల్యాబ్స్: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 31.2 శాతం తగ్గి రూ.32.6 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. టాటా కన్జూమర్: బేవరేజ్ వ్యాపార విస్తరణలో భాగంగా నారీష్ కో బేవరేజెస్లో మిగిలిన మొత్తం వాటాను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. టొరంట్ పవర్: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.273.94 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.24.80 కోట్లుగా నమోదైందని తెలిపింది.