swathi lakra
-
29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలాకాలం తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేయడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీలు ఇలా.. ► అదనపు డీజీ ఆర్గనైజేషన్స్‌గా ఉన్న అదనపు డీజీ రాజీవ్రతన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. ► అడిషనల్ డీజీ రైల్వేస్ రోడ్ సేఫ్టీగా ఉన్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ► గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని అదనపు డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ చేశారు. ► అదనపు డీజీ పర్సానెల్గా ఉన్న బి.శివధర్‌రెడ్డి రైల్వేస్, రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. ► టీఎస్ఎస్పీ అదనపు డీజీగా ఉన్న అభిలాష బిస్త్‌ను అదనపు డీజీ వెల్ఫేర్, స్పోర్ట్స్‌గా బదిలీ చేశారు. అదేవిధంగా హోంగార్డ్స్ అదనపు డీజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న షికా గోయల్‌ను అదనపు డీజీ ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్, భరోసా సెంటర్స్‌గా బదిలీ చేశారు. ►టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావుకు అదనపు డీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి స్వాతిలక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయింటింగ్‌లో ఉన్న విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► నార్త్‌జోన్ అదనపు డీజీగా ఉన్న వై.నాగిరెడ్డిని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు. ►పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న విక్రమ్ మాన్సింగ్ను హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా నియమించారు. ► రాచకొండ అదనపు కమిషనర్‌గా ఉన్న జి.సుదీర్‌బాబును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు సీపీగా బదిలీ చేశారు. ► మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న షాహ్నవాజ్ ఖాసీంకు మల్టీజోన్ –2 ఐజీగా బాధ్యతలు అప్పగించారు. ► వెయిటింగ్లో ఉన్న తరుణ్ జోషిని ఐజీ ట్రైనింగ్స్గా నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న వీబీ కమలాసన్‌రెడ్డికి ఐజీ పర్సానెల్గా బాధ్యతలు అప్పగించారు. ► రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మల్టీజోన్–1 ఐజీగా బదిలీ చేశారు. ► హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా ఉన్న ఎం.రమేశ్‌ను డీఐజీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్‌గా బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ సీపీగా ఉన్న కార్తికేయను డీఐజీ ఇంటిలిజెన్స్‌గా నియమించారు. ► తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేశ్‌నాయుడును రాజన్న జోన్ డీఐజీగా బదిలీ చేశారు. ► సీఐడీ డీఐజీగా ఉన్న ఎం.శ్రీనివాసులును హైదరాబాద్ సిటీ సీఏఆర్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను డీఐజీ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డా.గజరావు భూపాల్‌ను రాచకొండ జాయింట్ సీపీగా నియమించారు. ► నల్లగొండ ఎస్పీగా ఉన్న రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నల్లగొండ ఎస్పీగా కూడా కొనసాగుతారు. ► వెయిటింగ్లో ఉన్న ఎల్ఎస్ చౌహాన్‌ను జోగుళాంబ జోన్ డీఐజీగా ఎస్పీ ర్యాంకులో నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న కె.నారాయణ్ నాయక్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు. ► సీఐడీలో ఎస్పీగా ఉన్న జె.పరిమళ హన నూతన్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్‌గా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న ఆర్.భాస్కరన్‌ను కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీగా నియమించారు. -
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–8
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదే శాల ప్రకారం ఏటా రెండు విడతల్లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–8ని వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్నట్టు మహి ళలు, చిన్నారుల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. జూలై 1 నుంచి నెల పాటు జరిగే ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. అలాగే తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నారు. ఈ ఆపరేషన్‌పై మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్ విభాగాలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించినట్టు స్వాతిలక్రా తెలిపారు. ఈ సమా వేశంలో మహిళాభివృద్ధి, చిన్నారుల సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక క్యార్యదర్శి డి.దివ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ, శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు. (క్లిక్: 38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్) -
Myra: సెలబ్రిటీ ర్యాంప్ వాక్.. ఫ్యాషన్ షో అదుర్స్
మహిళల్లో వచ్చే కేన్సర్లు చాలా వరకు నయం చేయగలిగేనని క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ‘మైరా’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సమాజంలో మహిళల విశిష్ట పాత్ర నేపథ్యంగా నిర్వహించిన కార్యక్రమంలో కేన్సర్‌ను జయించిన పిల్లలతో సెలబ్రిటీలు ర్యాంప్‌వాక్ చేశారు. కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్‌రంజన్, డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, గగన్ నారంగ్, పుల్లెల గోపీచంద్, మాజీ మంత్రి డీకే అరుణ, శిఖా గోయల్, సినీనటి ప్రగ్యా జైస్వాల్, మధుశాలిని, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపారెడ్డి పాల్గొన్నారు. –మాదాపూర్ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆమె రన్.. అదిరెన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ను నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, షీ టీమ్స్ ఐజీ స్వాతిలక్రా తదితరులు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఉమెన్స్ డే సందర్భంగా తొలిసారి ఓ మహిళను లా అండ్ ఆర్డర్లో ఎస్హెచ్ఓగా నియమిస్తామని తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన రన్ ట్యాంక్‌బండ్ పైనున్న లేపాక్షి వరకు సాగి తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరింది. రన్లో కళాశాలల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. – ఖైరతాబాద్ ఫ్యాషన్ షో అదుర్స్ మహిళా దినోత్సవం సందర్భంగా కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో అంతర్జాతీయ ఫ్యాషన్ షో నిర్వహించారు. గ్రాండ్ ఫ్యాషన్ షోలో పలువురు మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. – రాయదుర్గం చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్‌పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్‌మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్‌లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్‌లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్‌కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్‌చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్‌ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్‌ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్‌గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్‌క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్‌గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్‌లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్‌కాల్, మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్‌లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్‌కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్‌కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
ఆ పని చేస్తేనే మహిళలపై వేధింపులు ఆగుతాయ్..
సాక్షి, హైదరాబాద్: చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు కళ్లెం పడుతుందని వివిధ రంగాల మహిళా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వార్షికోత్సవం, మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో సోమవారం వెబినార్ ద్వారా వర్క్‌షాప్ జరిగింది. ఇందులో ‘పని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు-అధిగమించే మార్గాలు’ అనే అంశంపై వివిధ రంగాల మహిళా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. పని ప్రాంతాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించి అధిక శాతం కేసులు నమోదు కావడం లేదన్నారు. కాగా, ఇటీవల వచ్చిన మీ-టూ ఉద్యమం నేపథ్యంలో పని ప్రాంతాల్లో వేధింపులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పారు. వర్క్‌ప్లేస్‌లో మహిళలపై వేధింపులు, ఇతర విధానాల్లో జరిగే వేధింపులపై నమోదయ్యే కేసుల దర్యాప్తును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ నిష్టా జైస్వాల్ వెల్లడించారు. పని ప్రాంతాల్లో వేధింపులను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా స్వాతి లక్రా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ జెండర్ విభాగం వైస్ చైర్మెన్ శృతి ఉపాధ్యాయ్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసింగ్ ఉద్యోగం కాదు.. సమాజసేవ
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: పోలీసింగ్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి చేసే సేవ అని షీటీమ్స్, భరోసా ఇన్చార్జ్, ఏడీజీ స్వాతి లక్రా అన్నారు. హిమాయత్‌సాగర్‌లోని రాజ్‌బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో బుధవారం 3వ ఆర్మ్డ్ రిజర్వ్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్(పీవోపీ) జరిగింది. 637 మంది కానిస్టేబుళ్లు 9 నెలలుగా ఇక్కడ శిక్షణ పొందారు. వీరి ఔట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా స్వాతి లక్రా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం, దర్యాప్తు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని తెలిపారు. కోవిడ్ కాలంలో రాష్ట్ర పోలీసులు సమాజసేవలో గొప్ప పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పోలీస్ విభాగంలో 33 శాతం రిజర్వేషన్ అమలు జరుగుతోందన్నారు. మహిళలు, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళా పోలీసులు మరింత మెరుగ్గా విధులు నిర్వహించేందుకు డీజీపీ తీసుకున్న పలు చర్యలను కేడెట్లకు వివరించారు. టీఎస్పీఏ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతిభ చూపిన కామెరి స్నేహ (ఆదిలాబాద్), కడాలి హారిక (మేడ్చల్), బండారపు మమత(పెద్దపల్లి)కు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఐపీఎస్ అధికారులు కె.రమేశ్‌నాయుడు, డాక్టర్ బి.నవీన్‌కుమార్, శ్రీబాలాదేవి, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా కేడెట్ల కుటుంబాలను ఈ వేడుకకు ఆహ్వానించలేదు. రాష్ట్రంలోని 28 కాలేజీల్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల ఔట్‌పరేడ్ వేడుకలు శుక్రవారం వరకు ఇక్కడ జరగనున్నాయి. -
గుడ్డిగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు
-
‘సైబ్ హర్’తో సురక్షిత సైబర్ ప్రపంచం
సాక్షి, హైదరాబాద్ : మహిళలు–చిన్నారులు అధికంగా సైబర్ నేరాల బారిన పడుతున్న క్రమంలో సురక్షిత సైబర్ ప్రపంచంపై అవగాహన కోసం విమెన్‌సేఫ్టీ వింగ్ చేపట్టిన ‘సైబ్ హర్’కార్యక్రమం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం సైబ్ హర్ కార్యక్రమాన్ని ఆయన ఆన్లైన్లో ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ విపత్తు సమయంలో డేటా వినియోగం 70 శాతం వరకు పెరిగిందన్నారు. అదే సమయంలో మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాలు కూడా అధికమయ్యాయన్నారు. సైబర్ నేరాల నివారణ, సురక్షిత సైబర్ ప్రపంచం పై అవగాహన కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి యూనిసెఫ్‌లాంటితో పాటు జాతీయ సంస్థలు భాగస్వాములుగా నిలవడం గర్వకారణంగా ఉంద ని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన సంస్థలు, ఎన్జీవోలు, మీడియాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించిన సినీనటుడు నాని, యాంకర్ సుమ, షట్లర్ పీవీ సింధులకు కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజులపాటు కార్యక్రమం ఏడీజీ స్వాతీ లక్రా మాట్లాడు తూ.. నెలరోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమంలో క్విజ్, వ్యాసరచన, చర్చలు తదితర వినూత్న కార్యక్రమాలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అన్ని ప్రభుత్వ విభాగాల కు డీఐజీ సుమతి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీజీపీ పోస్టర్ ఆవిష్కరించారు. సుమ, పీవీ సింధు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై భర్తలు వేధిస్తున్నారని కుమిలిపోవద్దని.. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా బాధిత మహిళలు ఎన్నారై సెల్‌ను సంప్రదించవచ్చని విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా చెప్పారు. బాధిత మహిళలకు తమ వంతుగా చట్టపరమైన సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఎన్నారై భర్తల వేధింపులు–గృహహింసపై పరిష్కారం చూపేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌నకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ వెబినార్‌లో 80 మందికిపైగా ఫిర్యాదుదారులు/బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్ 17న విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎన్నారై సెల్‌కు అద్భుతంగా పనిచేస్తుందన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఎన్ఆర్ఐ సెల్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఎన్నారై భర్తల వల్ల వేధింపులు, గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు పలు న్యాయ సాయమందిస్తూ పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. బాధితులు ఏ దేశంలో ఉన్నా నిరాశ చెందకుండా.. ఎన్ఆర్ఐ సెల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. డీఐజీ బడుగుల సుమతి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నారై సెల్‌కు 101 ఫిర్యాదులు రాగా అందులో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 కేసుల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, ఏడుగురి పాస్‌పోర్టులు కోర్టుకు సమర్పించామని, 44 కేసుల్లో నిందితులను భారత్‌కు రప్పించేలా ఒత్తిడి చేసేందుకు వారు పనిచేసే కంపెనీలకు లేఖలు రాశామని వివరించారు. యూకేలోని వెన్ ఎన్జీవోకు చెందిన గీతా మోర్ల, చికాగో నుంచి చాందిని మాట్లాడుతూ.. ఎన్నారై భర్తల విషయంలో వేధింపులు ఎదు ర్కొంటున్న బాధితులకు చట్టపరంగా సాయం అందజేస్తామని ముందుకొచ్చారు. -
మాస్క్ లేకపోతే అంతే : స్వాతి లక్రా
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేతుంపర్ల వల్ల వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు బయటకు వెళ్లినప్పుడు, పని ప్రదేశంలో ఉన్నప్పుడు ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అదేశించాయి. ఇక వైరస్‌ను అరికట్టడంలో మాస్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్వాతి లక్రా ప్రస్తుత కాలంలో మాస్క్ ధరించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేసే ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మాస్క్ ధరించకపోతే క్రిములు ఎలా వ్యాపిస్తాయో చూడండి’అని కామెంట్ జత చేశారు. How bacteria spreads if you don't wear a mask.....#MaskUp Save yourself and save others too. #StaySafe pic.twitter.com/lOtrtaFUo9 — Swati Lakra (@SwatiLakra_IPS) June 29, 2020 మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ.. ఇతరుల్ని రక్షించండని స్వాతి లక్రా పేర్కొన్నారు. ఇక ఆమె పోస్ట్ చేసిన ఫొటోలో.. తుమ్మినప్పుడు, ఒక నిమిషం పాటు పాట పాడినప్పుడూ, ఇతరులతో మాట్లాడినప్పుడూ, దగ్గినపప్పుడు మాస్క్ ధరించేవారిలో, ధరించని వారిలో క్రిములు ఎలా వ్యాపిస్తాయి.. వాటి తీవ్రతను ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలుస్తోంది. -
ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా టీనేజీ, యువతలో మానసికంగా మునుపెన్నడూ చూడనంత మార్పు వచ్చింది. కరోనా పుణ్యమాని విద్యాసంస్థలేవీ ఇపుడు మునుపటిలా పనిచేసే అవకాశాల్లేవు. దీంతో వారంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఇకపై పాఠాలు, తరగతులన్నీ ఆన్లైన్లోనే. అయితే, చాలామంది టీనేజీ పిల్లలకు, యువ విద్యార్థులకు ఆన్లైన్లో ఉన్న ఆపదలు, మోసాలు, అపాయాలపై అవగాహన లేదు. అలాగే, విద్యార్థులు ఆన్లైన్లో ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆపదలు ఉంటాయన్న విషయంపై వారికీ తగినంత పరిజ్ఞానం లేదు. దీంతో విద్యార్థులు– తల్లిదండ్రుల మధ్య కొంత దూరం తలెత్తుతోంది. అందుకే, ఈ దూరాన్ని తగ్గించి విద్యార్థులు– తల్లిదండ్రులకు సురక్షిత ఆన్లైన్ సేవల వినియోగమే లక్ష్యంగా మహిళా భద్రతా విభాగం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ ప్రచారం పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు. ఆన్లైన్ సర్వేకు శ్రీకారం! విద్యార్థులు తల్లిదండ్రులకు ఆన్లైన్ ఆపదలపై ఎంత పరిజ్ఞానం ఉందన్న అంశంపై ఆన్లైన్లోనే ఓ సర్వే చేపట్టింది. ఇందులో టీనేజీ, తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రశ్నావళి రూపొందించింది. ఉదాహరణకు మీకు రాన్సమ్ వేర్ అంటే తెలుసా? మీ మెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు హాక్ అయితే ఏం చేస్తారు? సైబర్ వేధింపులకు దిగితే ఎలా స్పందిస్తారు? తదితరాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇక మీ పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఏయే కంటెంట్ చూస్తున్నారు? ఏం గేములు ఆడుతున్నారు? వేటి వల్ల ఎంత ముప్పు? వాటిని అధిగమించేందుకు వారిచ్చే సలహాలు తీసుకుంటున్నారు. ప్రశ్నావళిలో సమాధానాలు ఇవ్వలేకపోయిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి వాటిపై భవిష్యత్తులో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపైన 15 లక్షలకుపైగా విద్యార్థినులు ఉంటారు. ఈ సర్వే ప్రారంభించిన 24 గంటల్లోనే సుమారు 3000 మంది పాల్గొనడం విశేషం. ప్రతీరోజూ దాదాపు ఐదువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వేలో భాగస్వామ్యం అయ్యేలా ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని సంకల్పించారు. రంగంలోకి విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ సర్వే కార్యక్రమం ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులను కలుపుకుంటే దాదాపు 30 లక్షలమందిని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. వీరందరూ తమ అభిప్రాయాలను తెలిపితే రాష్ట్రంలోని విద్యార్థులు– తల్లిదండ్రులు ఆన్లైన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక స్పష్టత వస్తుంది. అందుకే, ఈ కార్యక్రమంలో విద్యా, స్త్రీ శిశు సంక్షేమశాఖల సాయం కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లా విద్యాధికారులు (డీఈఓ)లకు ఈ సర్వే లింక్ చేరింది. వారి ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు చేరనుంది. అలాగే త్వరలోనే ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, వర్సిటీలూ ఈ ఆన్లైన్ అవగాహన సర్వేలో పాల్గొనేలా చర్యలు చేపట్టనున్నారు. పోస్టర్లను విడుదల చేస్తున్న ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి -
ఇలాంటి మనుషులు కూడా ఉంటారు!
-
వైరల్: మీ మనసును టచ్ చేసే వీడియో!
కేరళలో జరిగిన అమానుష ఘటన యావద్ధేశాన్ని కదిలించింది. మానవత్వం ఉన్న ప్రతీ మనిషి కళ్లు బాధతో చెమ్మగిల్లాయి. గర్భంతో ఉన్న ఏనుగుపై ఘోరానికి పాల్పడిన వారిపై జనం భగ్గుమన్నారు. దాన్నో క్రూరమైన చర్యగా అభివర్ణించటమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు సైతం మూగజీవం కోసం గళమెత్తారు. ఈ నేపథ్యంలో అందరు మనుషులూ ఒకేలా ఉండరని, మానవత్వం, జంతుప్రేమ ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని తెలిపే ఓ పాత వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా గురువారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ( 'ఛీ, వినడానికే దరిద్రంగా ఉంది' ) కుక్క కోసం శ్రమిస్తున్న మానవతావాదులు, జంతుప్రేమికులు ‘‘ఆనందంతో మనసు పులకరించే వీడియో.. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వీరిని తప్పు బట్టగలమా?’’ అని ఆమె పేర్కొన్నారు. ఓ పెద్ద కాలువలో చిక్కుకు పోయిన కుక్కను కాపాడటానికి కొంతమంది ప్రాణాలకు తెగించి ప్రయత్నాలు చేశారు. మనిషి, మనిషికి తోడు, ఆ మనిషి ఓ మూగజీవానికి తోడు అన్నట్లుగా దాన్ని పైకి చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మానవత్వం బ్రతికే ఉంటది.. వీరు మానవత్వపు వీరులు, అందుకే ప్రాణాలకు తెగించి మీర కుక్కను రక్షిస్తున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా! ) -
పోలీసులకు సహకరించడం మన బాధ్యత: సాయి పల్లవి
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, వారు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని హీరోయిన్ సాయి పల్లవి అన్నారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని అభిప్రాయపడ్డారు. హెచ్ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ సదస్సులో హీరోయిన్ సాయిపల్లవితో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఐజీ స్వాతి లక్రా, సైంటిస్ట్ టెస్సీ థామస్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. చదువు, ఉద్యోగాల కోసం సిటీకి వచ్చే మహిళలు, యువతులు, వారి తల్లిదండ్రులు భయపడేవారని కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారన్నారు. పోలీసులకు సహకరించడం మనందరి బాధ్యత అని సాయి పల్లవి అన్నారు. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నా: థామస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు సెల్యూట్ చేస్తున్నట్టు సైంటిస్ట్ టెస్సీ థామస్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మహిళలకు భద్రత ఎక్కువగా ఉందని కొనియాడారు. ‘సమానత్వం అంటారు. కానీ ఆస్తులు పురుషుల పేర్లపై పది శాతం ఉంటే మహిళల పేర్లపై ఒక శాతం మాత్రమే ఉంటున్నాయి. నిర్ణయాలు స్వతహాగా తీసుకునేలా మహిళలు తయారవ్వాలి. మిస్సైల్ అగ్ని-4కు డైరెక్టర్‌గా నన్ను నియమించినప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందు భయపడ్డాను. మన ముందు ఉండే సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్దం అయితే విజయం సాధిస్తాం. ఎదుటి వారి విమర్శలను కూడా పాజిటీవ్‌గా తీసుకోవాలి’ అని థామస్ వ్యాఖ్యానించారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ సేఫ్ అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఈ సదస్సులో పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: త్వరలో ‘షీ సేఫ్’ యాప్ ‘రష్మిక చించావ్ పో’.. అది నేనన్లేదు -
త్వరలో ‘షీ సేఫ్’ యాప్
గచ్చిబౌలి: మహిళల భద్రత కోసం త్వరలో ‘షీ సేఫ్’యాప్‌ను తీసుకురానున్నామని రాష్ట్ర షీ టీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద శనివారం రాత్రి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ‘షీ సేఫ్ నైట్ వాక్’ను స్వాతి లక్రా, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పద్మశ్రీ పీవీ సింధు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... రాష్ట్రంతో పాటు నగరంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో రాత్రి సమయంలో విధులు నిర్వహించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారంతా పోలీసుల సహాయం లేకుండా సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రతపై మహిళలకు అవగాహన కల్పించేందుకే నైట్ వాక్ నిర్వహించామని పేర్కొన్నారు. ‘షీ సేఫ్ నైట్ వాక్’లో పాల్గొన్న ప్రజలు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ..ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రతపై మహిళలకు భరోసా కల్పించేందుకే షీ సేఫ్ నైట్ వాక్‌ను నిర్వహించామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్, పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు అక్కడి నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు షీ సేఫ్ నైట్ వాక్ కొనసాగింది. గైనకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, నటి ఇషా రెబ్బా, ఎ‹స్సీఎస్సీ వైస్ చైర్మన్ భరణి కుమార్, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్చార్జ్, డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీ ఉమెన్ ఫోరం లీడర్ ప్రత్యూష, బిత్తిరి సత్తి, ఐటీ ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు. -
వైరల్ : అమ్మా! మీ పిడకల వేట అదుర్స్
హైదరాబాద్ : ఉమెన్స్ సేప్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా తన డ్యూటీలో ఎంత సిన్సియర్‌గా ఉంటారో సామాజిక మాధ్యమాల్లో కూడా అంతే చురుకుగా ఉంటారు. తాజాగా ఆమె ట్విటర్లో షేర్ చేసిన వీడియో గ్రామీణ భారతం, పనిపట్ల శ్రద్ధ ఎలా ఉండాలనే విషయాన్ని గురించి చెబుతుంది. అంతెత్తున్న గోడపై ఓ మహిళ.. అలవోకగా పిడకలు వేస్తున్న నైపుణ్యం పట్ల స్వాతి లక్రా అబ్బుర పడ్డారు. ‘వావ్..! ఎంత కచ్చితత్వం’అని క్యాప్షన్ పెట్టి వీడియోను షేర్ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అమ్మ ప్రతిభకు జోహార్లు అని కొందరు, అసలైన భారత్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని మరికొందరు పేర్కొన్నారు. WOW, What accuracy! pic.twitter.com/8HxuLX2yd3 — Swati Lakra IPS (@IGWomenSafety) February 5, 2020 -
కనిపిస్తే చెప్పండి..!
ఆపరేషన్ స్మైల్–6లో భాగంగా అనాథలు, వీధిబాలలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికుల సమాచారాన్ని తమకు అందజేయాలని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతిలక్రా విజ్ఞప్తి చేశారు. అలాంటి చిన్నారులు ఎక్కడ కనిపించినా.. డయల్ 100, ఫేస్బుక్, హాక్ఐ, వాట్సాప్, 1098లకు సమాచారం అందించాలని కోరడంతోపాటుగా సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీనిచ్చారు. వివిధ కారణాల వల్ల ఏటా వందలాది మంది చిన్నారులు వెట్టిచాకిరీలో బందీలుగా మారుతున్నారని, ఈ తరహా బాధిత చిన్నారులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు జరగనున్న ఆపరేష న్ స్మైల్‌లో ప్రత్యేక బృందాలు రద్దీ ప్రాంతాల్లో చిన్నారులను కాపా డేందుకు రంగంలోకి దిగాయి. ఇప్పటి దాకా దాదాపు 900 మందికిపైగా చిన్నారులను కాపాడారు. వారిలో ముగ్గురిని దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్ : వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో 2015లో చేపట్టిన ఆపరేషన్ స్మైల్– ముస్కాన్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు దాదాపు 32 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 15 వేలమందిని తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 16 వేలమందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో చేప డుతున్న కార్యక్రమం రెండు నెలలపాటే జరుగుతుంది. ఏడాది మొత్తం సాధ్యమేనా? బాలకార్మికులు, వీధిబాలల రక్షణకు ఈ స్పెషల్ డ్రైవ్ ఏడాది మొత్తం చేపట్టాలని పోలీసుశాఖకు శిశు సంక్షేమ, లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి పలువురు నిపుణులు సూచనలు చేశారు. దీనికి డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జనవరి, జూలై రాగానే..పనులు చేయించుకునేవారంతా ఆ పిల్లలు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకే, ఏడాదిమొత్తం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే, మానవ వనరుల కొరత, ఇతర కారణాల వల్ల సాధ్యం కాకపోయినా..ఈసారి ఏడాది మొత్తం వెట్టిచాకిరీ, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని పోలీసులకు డీజీపీ సూచించారు. ఈ నేపథ్యంలో పిల్లలను తరలించే స్మగ్లర్లు, ఏజెంట్లు, యజమానులపై ఈసారి పీడీ యాక్టులు పెట్టాలన్న ఒత్తిడి సర్వత్రా వ్యక్తమవుతోంది. వేధిస్తోన్న సదుపాయాల లేమి..! స్మైల్ సందర్భంగా చేపట్టే ఆపరేషన్‌లో పోలీసులు వేలాదిమంది చిన్నారులను కాపాడుతుంటారు. వారందరికీ వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య ఎదురవుతోంది. ఈసారి ప్రతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ హామీనిచ్చింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడం వల్ల బిహార్, గుజరాత్, ఒడిశా, అస్సాం నుంచి వస్తోన్న బాలల వివరాలు, చిరునామా కనుక్కోవడం చాలా క్లిష్టంగా మారుతోంది. పదేపదే పోలీసులకు దొరుకుతున్న బాలల్లో మార్పుకోసం సైకాలజిస్టును నియమించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈసారి భాష అనువాదానికి దుబాసీ, పిల్లల మానసికస్థితిని అంచనా వేసేందుకు సైకాలజిస్టుల నియామకం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఏటేటా పట్టుబడుతున్న పిల్లల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. -
షీ–టీమ్‌ల బలోపేతానికి నోడల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షీ–టీమ్‌ల పనితీరును మరింత బలోపేతం చేసే దిశగా వుమెన్ సేఫ్టీ వింగ్ ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని షీ–టీమ్‌లకు శిక్షణ ఇవ్వడం, ఫిర్యాదులపై నియమిత సమయంలో చర్యలు చేపట్టారా? లేదా? వంటి పలు అంశాలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్ టీమ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మహిళా రక్షణ విభాగం కార్యాలయంలో గురువారం ఈ ప్రత్యేక షీ–టీమ్ విభాగాన్ని వుమెన్ ప్రొటెక్షన్ విభాగం ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. హైదరాబాద్‌లో క్యాబ్‌లను బుక్ చేసుకోగానే బుక్ చేసిన వారి సమాచారంతోపాటు క్యాబ్ ప్రయాణించే మార్గాన్ని తెలుసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని స్వాతి లక్రా తెలిపారు. -
సినిమా వేరు.. జీవితం వేరు..
‘మేం చూసిన క్రైం సీరియళ్లు, సినిమాల్లో నేర సన్నివేశాల ప్రేరణతో దిశను చంపిన తరువాత ఆధారాలు మాయం చేయాలనుకున్నాం. అందుకే శవాన్ని చటాన్‌పల్లికి తీసుకెళ్లి పెట్రోల్‌తో కాల్చాం’ అని దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు విచారణలో పోలీసులకు తెలిపారు. ‘దంగల్ సినిమా చూశాక.. నా కూతురిని స్కేటింగ్‌లో జాయిన్ చేశాను. ఏడాది ప్రాక్టిస్ తరువాత 2018 ఔరంగాబాద్ నేషనల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడం జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చింది’ అని ఓ తండ్రి తన కూతురిని చూసి మురిసిపోయాడు. సినిమా, టీవీ సీరియళ్లు చాలా శక్తిమంతమైన మాధ్యమాలు. ఇవి రెండువైపులా పదును ఉన్న కత్తుల వంటివి. వీటి ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుంది. ప్రజల ఆలోచనలను ఇవి మార్చగలవు. ప్రభుత్వాలను పడగొట్టగలవు. మంచి వ్యక్తులను తయారుచేయగలవు. 2016లో దంగల్ సినిమా విడుదలయ్యాక మైదానాలకు వచ్చి ప్రాక్టీస్ చేసే యువతులు, బాలికల సంఖ్య పెరిగింది. అయితే మంచి కంటే చెడు త్వరగా వ్యాపించడం ఆందోళనకరంగా మారింది. సినిమాలు, యూట్యూబ్, ఇతర వెబ్ సిరీస్‌లు, క్రైం సీరియళ్లు ప్రజలను ముఖ్యంగా టీనేజర్లను కలుషితం చేస్తున్నాయి. మితిమీరిన హింస, విశృంఖలతతో పెడదోవ పట్టిస్తున్నాయి. మనిషిని మృగం కంటే భయానకంగా మారుస్తున్నాయి. 2014లో విడుదలైన దృశ్యం సినిమా హత్యోదంతాన్ని అనేక మంది హంతకులు వాడుకున్న తీరు విస్మయం గొలుపుతోంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో నమోదైన పలు హత్య కేసుల్లో నిందితులు శవాన్ని, సాక్ష్యాలను మాయం చేసిన తీరు ఆ సినిమాలో చూపినట్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం. కానీ, సినిమాలో హీరో కాబట్టి దొరకలేదు. నిజ జీవితంలో మాత్రం వారంతా 24 గంటల్లో పోలీసులకు పట్టుబడటం గమనార్హం. నియంత్రణ కరువు యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ పరిధిలోకి రావు. అందుకే హత్యలు, అశ్లీల సన్నివేశాలతో నింపేసి ట్రైలర్లను ముందు యూట్యూబ్‌లో వదులుతున్నారు. సినిమా సెన్సార్‌కు వెళ్లినప్పు డు ఆ దృశ్యాలకు కత్తెరపడుతోంది. యూట్యూబ్‌లో వ్యూస్ కారణంగా వీరు పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నా యి. అందుకే నిర్మాతలు లాభాల కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ బోర్డు కిందకి రాకపోవడంతో వాటిలో ప్రసారమయ్యే సీరియళ్లు, సినిమాల్లో ఎలాంటి కత్తెర ఉండదు. ఇప్పుడు ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్, వెబ్ చానళ్ల యాప్‌లు డీఫాల్ట్‌గా వచ్చేస్తున్నాయి. ఫోన్లో ఉచిత డేటా కూడా ఉంటుంది. అవే యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. వెబ్ చానళ్లలో ప్రసారమయ్యే పలు సీరిస్‌లలో అధికశాతం విదేశాలవే. అక్కడ వీటికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. సెన్సార్ సర్టిఫికెట్లు ఉంటాయి. కానీ, అందులో కంటెంట్ భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉండటమే ఇక్కడ సమస్య. పైగా నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో చిత్రీకరించి మరీ చూపిస్తున్నారు. వీటి వల్ల వివాహేతర సంబంధాలు, చిన్నారులపై లైంగిక దాడులు, అనైతిక బంధాలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల జరిగిన దిశ హత్యాచారం, హయత్‌నగర్ ఉదంతాలే దీనికి నిదర్శనంగా మారాయంటే అతిశయోక్తి కాదు. – సాక్షి, హైదరాబాద్ చట్టాలు చేయాలి ప్రస్తుతం ఇంటర్నెట్లో ప్రసారమవుతున్న పలు వెబ్ సిరీస్‌లు మన దేశానికి సంబంధించినవి కావు. వారి దేశాల్లో అలాంటి సన్నివేశాలు తప్పు కాదు. సమస్యల్లా అవి మన దేశంలో ప్రసారం కావడమే. అందుకే, వీటిపై మరింత నిఘా పెరగాలి. పలు యాప్స్ కూడా టీనేజీ పిల్లలను పెడదోవపట్టిస్తున్నాయి. విపరీతంగా నేరాలు, అడల్ట్ కంటెంట్‌తో వారి బుర్రలను పాడుచేస్తున్నాయి. వీటికి కళ్లెం వేసేందుకు ‘ఒక ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ’ఏర్పాటు కావాలి. ఆ బాధ్యత కేంద్రం చేతుల్లోనే ఉంది. -అనిల్ రాచమల్ల,ఎండ్ నౌ ఫౌండేషన్ త్వరలో నిర్మాత, రచయితలతో సమావేశం సినిమాలు టీనేజీ పిల్లలపై బాగా ప్రభావం చూపుతాయి. కొన్ని సినిమాల వల్ల వీరిపై చెడు ప్రభావం పడుతోంది. వీటి వల్ల సంభవించే నేరాల్లో అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు. ఒక్కోసారి వారే నిందితులవుతున్నారు. అందుకే, వీటిపై బాధ్యత తీసుకోవాల్సిందే. సినిమాల్లో హింస, అశ్లీలత, ఇతర అభ్యంతర సన్నివేశాలకు పగ్గాలు వేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్మాత, రచయితలతో సమావేశం ఏర్పాటు చేసి చెడు సినిమాల వల్ల సమాజంపై పడుతున్న దుష్ప్రభావాన్ని వివరించాలనుకుంటున్నాం. – ఐజీ స్వాతి లక్రా పశ్చాత్తాపం కనబడదు సినిమాలు, ఇతర వీడియోలు చూసి నేరాలకు పాల్పడేవారిది చాలా భయంకర మనస్తత్వం. తమకు కావాల్సిన దానికోసం ఎంత కైనా తెగిస్తారు. పోలీసులకు చిక్కినందుకు బాధపడతారు తప్ప.. చేసిన తప్పుకు చింతించరు. వారి చర్యల వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడతార న్న చింత వారిలో అణువంతైనా ఉండదు. ఏది ఏమైనా.. వారు అనుకున్నదే చేస్తారు. అందుకే వీరి నేరాలకు కన్నవారు, కట్టుకున్నవారు బలవుతుంటారు. – వీరేందర్, సైకాలజిస్ట్ -
అవగాహనతోనే వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత–రక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అప్పుడే వేధింపుల నివారణ సాధ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘దిశ’ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం హోంమంత్రి కార్యాలయంలో పలువురు మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ– షీటీమ్స్ స్వాతి లక్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. మహిళలు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కేసులు నమోదు చేయాలి. పోలీస్స్టేషన్ల పరిధులతో సంబంధం లేకుండా ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. షీటీమ్స్ మరింత బలోపేతానికి హాక్ ఐ వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. హెల్ప్లైన్లు, పోలీసు యాప్స్ వినియోగం పెరిగే లా మహిళల్లో అవగాహన కల్పించాలి. డయల్ 100, 181, 1098, 112 హెల్ప్‌లైన్ నెంబర్లను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే, మెట్రో, పార్కులు, ఆటో, క్యాబ్‌ల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించాలి. బాలబాలికలు, ఉద్యోగులకు వేధింపులు లింగసమానత్వంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ–లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి తేవాలి. సినిమాహాళ్లు, టీవీల్లో లఘుచిత్రాలు, స్లైడ్లు ప్రదర్శించాలి. షీటీమ్స్‌తో కలిసి విద్యాసంస్థల్లో అమ్మాయిలపై వేధింపులపై అవగాహన కల్పించే సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ. గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు అంగన్వాడీ, ఆశా, సెర్ఫ్ తదితర సంఘాలను మహిళా భద్రతపై ప్రచారానికి వినియోగించాలి. పిల్లలు నడుచుకుంటున్న విధానంపై తల్లిదండ్రులతో స్కూలు ఉపాధ్యాయులు చర్చించాలి. -
7నిమిషాల్లో.. మీ ముందుంటాం
సాక్షి, హైదరాబాద్ : మూడు నిమిషాలు టైమిస్తే పని ముగించేస్తానంటూ పోలీసాఫీసర్ పాత్రలో ఓ హీరో చెప్పిన పాపులర్ డైలాగ్.. దీన్ని రాష్ట్ర పోలీసులు ఏడే ఏడు నిమిషాలు అంటున్నారు. పోలీసు సాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయల్ 100కు ఎవరైనా ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో చేరుకుంటున్నామంటున్నారు. బాధితులెవరైనా 100కు డయల్ చేస్తే మూడు నిమిషాల్లోనే వారికి తిరిగి కాల్ చేసి రెండే రెండు నిమిషాల్లో పోలీసులు చేరుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. శంషాబాద్‌లో దిశ హత్య ఘటన తర్వాత డయల్ 100కు కాల్స్ పెరిగాయి. సాధారణంగా రోజు వచ్చే కాల్స్ కంటే 2 నుంచి మూడువేల కాల్స్ అదనంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీ సులు ఘటనాస్థలానికి వచ్చే సమయంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం స్పందించారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే తాము స్పందిస్తున్నామని, దగ్గరలోని గస్తీ (పెట్రోలింగ్) వాహనాన్ని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కాల్ చేసిన వారి వద్దకు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఉంటే కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ఇక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయం 10 నిమిషాలుగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి నగరాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్న సమయం 7 నుంచి 10 నిమిషాలు ఉంటుండగా.. గ్రామాల్లో ఇది 10 నుంచి 12 నిమిషాలు ఉంటుంది. ఎక్కువ ఫోన్‌కాల్స్ వాటివే.. సాధారణంగా డయల్ 100 కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవేనని ఆ తర్వాతి స్థానంలో గొడవలు, అగ్నిప్రమాదాలు, ఈవ్‌టీజింగ్ ఇతర నేరాలు ఉంటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలో ఈ సగటు 300 నుంచి 500 వరకు ఉండగా..నగరం, పట్టణాల్లో 900 నుంచి 3000 వరకు ఉందని వెల్లడించారు. ఒక రోజుకు వచ్చే మొత్తం కాల్స్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచే దాదాపుగా సగభాగం ఉంటున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు డయల్ 100కు 75లక్షలు పైగా కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. ధైర్యం కోల్పోవద్దు ఆపద ఎదురైనపుడు ఆడపిల్లలు, మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా విజ్ఞప్తి చేశారు. ఎవరు వేధించినా, బెదిరించినా..వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. ఏదైనా ఉపద్రవం ముంచుకు వస్తుందని అనుమానం వచ్చినా, ఎవరైనా వెంటాడినా సరే వెంటనే హాక్ ఐ యాప్‌లోని ఎమర్జెన్సీ బటన్ని వినియోగించుకోవచ్చ న్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతోపాటు, షీటీమ్స్ సిబ్బంది కూడా నిమిషాల్లో మీకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. – స్వాతి లక్రా, ఐజీ విమెన్‌సేఫ్టీ వింగ్ -
ప్రజలకు చేరువైన ‘షీ–టీమ్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన షీటీమ్స్ అద్భుత ఫలితాలు సాధిస్తూ ప్రజలకు చేరువైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హైదరా బాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం వేడు కలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణలో షీ–టీమ్స్ సాధించిన విజయాలు వారి పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు సైతం షీ టీమ్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నేరాలను తగ్గిస్తూ.. నిందితుల్లో పరివర్తన కోసం కౌన్సెలింగ్ చేస్తోన్న షీ–టీ మ్స్ విధానాన్ని ప్రశంసించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశంలోని పలు మెట్రో నగరాల్లో షీటీమ్స్‌ను స్ఫూర్తిగా ప్రత్యేకదళాలను ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.షీ–టీమ్స్ అధిపతి, ఐజీ స్వాతి లక్రామాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ మేలన్న నినాదంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు. -
ఎక్కడికి పోతావు చిన్నవాడా!
సాక్షి, హైదరాబాద్: ‘చెరపకురా చెడేవు..’అనేది నానుడి. ‘ఏడిపించకురా ఏడిచేవు..’అన్నది ’న్యూ’నుడి. ఆడపిల్లలను వేధించే పోకిరీలకు షీ టీమ్స్ పరోక్షంగా ఇచ్చే సందేశం ఇదే. మఫ్టీలో సేఫ్టీ.. పెట్టీ కేసులు.. ఆనక ‘పిడి’కిలి.. ఇదీ షీటీమ్స్ వ్యూహం. మహిళారక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ–టీమ్స్ నిఘా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 2014లో హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘షీ–టీమ్స్’మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మహిళలు, బాలికలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలపై 100కు డయల్, ఫోన్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు నిమిషాల్లోనే స్పందిస్తున్నాయి. షీటీమ్స్‌ను క్రమంగా తెలంగాణలోని 33 జిల్లాలకు విజయవంతంగా విస్తరించారు. తొలిసారి తెలిసీ తెలియకుండా ఆడవారిని వేధించేవారిని హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడతారు. కావాలని ఏడిపించినవారిపై పెట్టీ కేసులు పెడుతున్నారు. మరింత తీవ్రమైన నేరం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పదేపదే నేరాలను పునరావృతం చేసినవారిపై ప్రివెంటివ్ డిటెన్షన్(పి.డి.)యాక్ట్ అమలుకు సిద్ధమవుతున్నారు. కేసుల రికార్డు నిర్వహణకు షీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా ఆన్లైన్లో సరి్టఫికెట్ కోర్సు కూడా నిర్వహిస్తున్నాయి. నివారణమార్గాలు వెతుకుతున్నాం ఆడవారిని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం అనే దానిని కేవలం సామాజిక సమస్యగానే కాదు, మానసిక, ఆరి్థక, సాంస్కృతిక కోణాల్లోనూ పరిగణిస్తున్నాం. సమస్య తలెత్తాక స్పందించడం కంటే నివారణ మార్గాలు వెతుకుతున్నాం. పకడ్బందీ నిఘావ్యవస్థను ఏర్పాటు చేశాం. ఎన్జీవోలు, మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నిమిషాల్లో వాలిపోతాం 33 జిల్లాల్లో మా బృందాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. ఆడవారిని ఏడిపించాలనుకున్న వారు ఎక్కడున్నా.. మా నిఘాను దాటిపోలేరు. కేసు నమోదు దగ్గర నుంచి నిందితులకు శిక్ష పడేంత వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.– సుమతి, ఎస్పీ(సీఐడీ), విమెన్ సేఫ్టీ వింగ్ -
‘85 శాతం మంది ఆచూకీ లభిస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ‘ఏమైపోతున్నారు’ పేరిట ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ పోలీస్‌శాఖ స్పందించింది. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే వార్తలు సరికావని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా అన్నారు. అన్ని కేసుల మాదిరగిగానే కిడ్నాప్ కేసులపై కూడా సత్వర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను డీజీపీ మహెందర్‌రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. కిడ్నాప్ అవుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఆచూకీ దొరుకుతోందని స్వాతిలక్రా వెల్లడించారు. ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు అదృశ్యమవుతున్నారని చెప్పారు. పరీక్షా ఫలితాలు, ప్రేమ వ్యవహారాలు, వృద్ధులపట్ల పిల్లల నిరాదరణ వంటి కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసుకుని, బాధిత కుంటుంబ సభ్యుల సహకారంతో వారి ఆచూకీ కనుగొనేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. గస్తీ వాహనాలు, బ్లూకోల్ట్స్, దర్యాప్తు అధికారులకు కిడ్నాపైన వారి ఫొటోలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సి న పనిలేదని, అదృశ్యమైన ప్రతి ఒక్కరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ పనిచేస్తుందని ఆమె భరోసానిచ్చారు.