swati maliwal
-
ఢిల్లీలో హీట్ పాలిటిక్స్.. సీఎం ఇంటి వద్ద ఆప్ ఎంపీ వినూత్న నిరసన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్ సర్కార్‌పై మండిపడ్డారు. దీంతో, ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్లో నింపాను.నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX— ANI (@ANI) November 2, 2024ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad... I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8— ANI (@ANI) November 2, 2024 -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌కు బెయిల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
స్వాతి మలివాల్ కేసు: హైకోర్టుకు సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ భివవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ మే 18న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. తనను స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అక్రమగా అరెస్ట్ చేశారని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో బిభవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిభవ్ తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిభవ్ కుమార్ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతి మలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారన్న ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశం అయింది. బీజేపీ కుట్రంలో భాగంగా స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణులు చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. -
కోర్టులో ఎంపీ కన్నీరు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మలివాల్ వాపోయారు. ఆమెపై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఉదంతంలో ఎంపీ కావాలనే సమస్యలు సృష్టించారని బిభవ్ న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగిందని ఆమె చెప్పడంలో దురుద్దేశం దాగుందన్నారు. దాంతో ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్ ట్రోల్ ఆర్మీ తనను తీవ్రంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. బిభవ్‌కు బెయిలిస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదమని వాదించారు. ఈ ఉదంతంలో నిబంధనలను ఉల్లంఘించింది బిభవ్ కుమారేనని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ ఈనెల 13న తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ అరెస్టయ్యారు. ఫోన్‌ను ఫార్మాట్ చేసి, సీసీటీవీ ఫుటేజిని తొలగించిన బిభవ్ అమాయకుడు కాదని స్వాతి తరఫు లాయర్ వాదించారు. అనంతరం బిభవ్‌కు బెయిల్‌ను నిరాకరిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ అనూజ్ త్యాగి పేర్కొన్నారు. -
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్‌ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్‌కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్‌లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు. -
చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
న్యూఢిల్లీ: చంపేస్తామని, అత్యాచారం చేస్తామని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. తన మీద సీఎం కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన దాడి ఘటనపై ఓ యూట్యూబ్ ఛానల్లో వన్‌సైడ్ వీడియో పెట్టారని, ఆ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం(మే26) ఎక్స్(ట్విటర్)లో ఆమె ఒక ట్వీట్ చేశారు. యూట్యూబ్ ఛానళ్లు నడిపే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఆప్ అధికార ప్రతినిధుల అవతారమెత్తడం సరికాదన్నారు. దాడి ఘటనపై ఆ జర్నలిస్టులకు తన వెర్షన్ చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదన్నారు. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. -
మరో ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సమయంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్ స్పందించారు.‘‘ హార్వార్డ్ యూనివర్సిటీలో ఓ సెమినార్ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను. ఆప్ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న భారత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో టచ్ ఉన్నాను. ...ఆప్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారత్‌లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్ వెళ్లి ఇటీవల భారత్ తిరిగి వచ్చారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో రాఘవ్ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. -
స్వాతిమలివాల్‌పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాగా, మే13న ఎంపీ స్వాతిమలివాల్ సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని మలివాల్ తొలుత ఆరోపించారు. వివాదం పెద్దదైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో ఆప్ నేతలు, స్వాతిమలివాల్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
బిభవ్ కుమార్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, కేజ్రీ వాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. శనివారం కేజ్రీవాల్ ఇంటికి బిభవ్ వచ్చాడని తెల్సుకుని ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్లారు. బిభవ్‌ను ప్రశ్నించే నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్ట్‌చేసినట్లు తర్వాత ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా బిభవ్ విచక్షణరహితంగా, నెలసరి బాధ ఉందని చెప్పినా వినకుండా చెంపలు చెళ్లుమనిపించి, ఛాతి, పొట్ట, పొత్తికడుపుపై పలుమార్లు తన్నాడని బిభవ్‌పై మలివాల్ ఫిర్యాదు చేయడం తెల్సిందే. శుక్రవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్చేయడం గమనార్హం. కోర్టు ఎదుట బిభవ్‌ను హాజరుపరిచి దర్యాప్తు నిమిత్తం తమ కస్టడీకి కోరతామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఆరోజు ఘటనాస్థలిలో ఉన్న 10 మంది నుంచి స్టేట్మెంట్లు నమోదుచేశామని వెల్లడించారు. బిభవ్ ఫిర్యాదును పట్టించుకోండి: అతిశిఢిల్లీ పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావిస్తే మలివాల్‌పై బిభవ్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోద ుచేయాలని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిశి శనివారం డిమాండ్‌చేశారు. పత్రకాసమావేశంలో అతిశి సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఏసీబీ నమోదుచేసిన ఒక అక్రమ నియామకాల కేసులో మలివాల్ ఇరుక్కున్నారు. అరెస్ట్ నుంచి తప్పించాలంటే కేజ్రీవాల్‌ను కేసులో ఇరికించాలని ఆమెను బీజేపీ బ్లాక్మెయిల్ చేసింది. బీజేపీ చేసిన ఈ కుట్రలో మలివాల్ ఒక పావు మాత్రమే. అపాయింట్మెంట్ లేకుండా సీఎం ఇంటికి ఆమె ఎందుకొచ్చినట్లు? ఒకవేళ సీఎంను కలిసి ఉంటే వాళ్ల ప్లాన్ ప్రకారం బిభవ్‌తో గొడవ, అరెస్ట్ జరిగేవి కాదు. బీజేపీకి ఒక విధానం ఉంది. మొదట కేసులు పెడతారు. తర్వాత బెదిరించి వినకపోతే జైల్లో పెడతారు. సీఎం ఆఫీస్‌లో డ్యూటీలో ఉన్న భద్రతా అధికారిపై మలివాల్ దుర్భాషలాడి గొడవ పడ్డారు. అనుమతిలేకుండా లోపలికి వచ్చారు. ఈ ఉల్లంఘన అంశాలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేరు? ఎఫ్ఐఆర్ ప్రతిని పోలీసులు కోర్టుకు ఇవ్వరట. నిందితుడి లాయర్‌కు ఇవ్వరట. కానీ రెండ్రోజులుగా మీడియాలో అది చక్కర్లు కొడుతోంది. ఈ కుట్ర ఎంతపెద్ద స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతోంది ’’ అని మోదీ సర్కార్‌పై అతిశి ఆరోపణలు గుప్పించారు. మరో వీడియో విడుదలఘటన జరిగిన రోజునాటి సీసీటీవీ ఫుటేజీ మరొకటి బయటికొచ్చింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది మలివాల్‌ను చేయిపట్టుకుని ఇంటి బయటకు బలవంతంగా తీసుకొచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ చేతిని మలివాల్ విదిలించుకుని దూరం జరిగి, అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో రికార్డయింది. అయితే ‘‘మలివాల్ ఆరోపించినట్లు ఆమె నడవలేకపోతున్నట్లు వీడియోలో లేదు. మామూలుగానే నడుస్తున్నారు. మహిళా పోలీస్ అధికారిని నెట్టిపడేశారు. షర్ట్ చిరిగిందని, బటన్స్ ఊడిపోయాయని చెప్పిందంతా అబద్ధమని ఈ వీడియోలో తేలిపోయింది’’ అని అతిశి ఆరోపించా. అయితే పూర్తి నిడివి ఫుటేజీ విడుదలచేయకుండా కత్తిరించి అతికించిన ఎడిటెడ్ వీడియోను విడుదలచేసి ఆప్ మలివాల్ వ్యక్తిత్వహననానికి పాల్పడుతోందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ తీవ్రంగా తప్పుబట్టారు. బిభవ్ అరెస్ట్‌తో ఆప్ చెత్త చరిత్ర పేజీలు ఇప్పుడు బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మలివాల్‌కు చేసిన వైద్యపరీక్షల వివరాలు బహిర్గతమయ్యాయి. మెడికో లీగల్ సర్టిఫికెట్ ప్రకారం మలివాల్ ఎడమ కాలు బొటనవేలు సమీపంలో, కుడి చెంపపై గాయాలున్నాయి. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
న్యూఢిల్లీ: బెయిల్‌పై బయటికొచ్చాక ఆప్ ఎన్నికల ప్రచారపర్వంలో ఎన్నికల వేడిని రాజేసిన కేజ్రీవాల్ శనివారం ప్రధాని మోదీకి కొత్త సవాల్ విసిరారు. తన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీజీ మీరు కొత్తరకం జైలు ఆట ఆడుతున్నారని తెలుసు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ ఇలా ఆప్ నేతలను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపిస్తున్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు నేను, నాతోపాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వస్తాం. ఎంత మందిని అయితే మీరు జైలులో పడేద్దామనుకుంటున్నారో అంత మందిని ఒకేసారి అరెస్ట్‌చేసి జైల్లో వేసేయండి’’ అని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ‘ సంజయ్ సింగ్‌ను చెరసాలలో వేశారు. ఈరోజు బిభవ్ కుమార్‌ను అరెస్ట్‌చేశారు. కంటికి శస్త్రచికిత్స తర్వాత మా ఎంపీ రాఘవ్ చద్దా లండన్ నుంచి తిరిగొచ్చారు. ఆయనను కూడా జైలుకు పంపుతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్లనూ కారాగారంలో వేస్తామని గతంలో బీజేపీ వెల్లడించింది’ అని ‘ఎక్స్’లో కేజ్రీవాల్ ఒక వీడియోను షేర్చేశారు. డ్రామాలు ఆపండి: బీజేపీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ‘‘ ఈ డ్రామాలు ఆపండి. మేం చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాం. మీ సొంతిట్లో మీ పార్టీ ఎంపీని చితకబాదితే ఆరు రోజులైనా మీరు మౌనం వీడట్లేరు. మహిళా ఎంపీపై దాడి ఉదంతంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంపై మీరెందుకు స్పందించట్లేరు? చర్యలెందుకు తీసుకోవట్లేరు?’’ అని సచ్దేవ్ నిలదీశారు. -
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై రాష్ట్ర మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికి స్వాతీ మలివాల్ బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆమెపై దాడి జరిగినట్లు చెబుతున్న సోమవారం రోజు.. సీఎం ఇంట్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను శనివారం ఆప్ బయటపెట్టగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Footage of Swati Maliwal being escorted out of Kejriwal's residence by lady security officer.She seems fine and cooperative. pic.twitter.com/xwnfJtBCDS— Nehr_who? (@Nher_who) May 18, 2024 ఈ వీడియోలో స్వాతీ మలివాల్ లేడీ పోలీసు భద్రత, పర్యవేక్షణలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లి.. బయటకు రావటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో వెళ్లినప్పుడు.. మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా లేడీ పోలీసు వెంటనే ఉంటూ చేయ్యి పట్టుకొని ఉన్నారు. ఆమె తనను పట్టుకొవద్దంటూ వారిని విడిపించుకోవడానికి వారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి అతిశీ శనివారం మీడియాతో మాట్లాడారు.‘స్వాతీ మలివాల్‌పై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానినే ఆమె బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణుల చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. స్వాతీ మలివాల్ ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా.. పోలీసులనే ఆమె బెదిరించటం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్ కుమార్‌ను సైతం ఆమె తీవ్రంగా దూషించారు. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి ఆమె ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది’ అని అతిశీ స్వాతీ మలివాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టించాయి. తపై బిభవ్ కుమార్ దారుణంగా దాడి చేశాడని, గాయాలు కూడా అయినట్లు స్వాతీ మలివాల్ ఆరోణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఆమెపై దాడి వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్‌మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్ హిట్‌మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో సీఎం కోసం ఆప్ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్ కుమార్ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్ కుమార్‌ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్‌ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్‌ను రీక్రియెట్ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆప్ ఎంపీని కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Arvind Kejriwal's residence as police is expected to recreate what happened with her here on 13th May pic.twitter.com/bM7w8kygO3— ANI (@ANI) May 17, 2024 కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలుదాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్‌కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్ నివాసంలో మలీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.Analysing the #SwatiMaliwal case through this video:If this video was recorded before the alleged assault, there's no way she could have been assaulted the way she has written in the FIR after this, in presence of so many security staff including a female staff. If this video… pic.twitter.com/RNnmzYkC04— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 17, 2024దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.#WATCH | AAP MP Swati Maliwal leaves from Delhi CM Arvind Kejriwal's residence after recreation of May 13 incident by Police pic.twitter.com/8n3K6sAbZ5— ANI (@ANI) May 17, 2024 -
మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హంఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు.తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు -
మలివాల్ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ పీఎస్ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీచేసింది. కేజ్రీవాల్ మౌనమేల?: బీజేపీ సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి ‘ఎక్స్’లో హిందీలో పోస్ట్‌చేశారు. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎల్జీ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్ మూతపడుతుంది. కమిషన్ ప్యానెల్లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా కమిషన్ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని ‘ఎక్స్’ వేదికగా ఉన్నారు.LG साहब ने DCW के सारे कॉंट्रैक्ट स्टाफ को हटाने का एक तुग़लकी फ़रमान जारी किया है। आज महिला आयोग में कुल 90 स्टाफ है जिसमें सिर्फ़ 8 लोग सरकार द्वारा दिये गये हैं, बाक़ी सब 3 - 3 महीने के कॉंट्रैक्ट पे हैं। अगर सब कॉंट्रैक्ट स्टाफ हटा दिया जाएगा, तो महिला आयोग पे ताला लग जाएगा।…— Swati Maliwal (@SwatiJaiHind) May 2, 2024ఢిల్లీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. తాజా చర్యలతో మరోసారి ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. -
ఆప్ తరఫున రాజ్యసభకు మలివాల్ సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్‌కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. -
రాజ్యసభకు స్వాతి మలివాల్!
ఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఆప్ నామినేట్ చేసింది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను పార్లమెంటు ఎగువ సభకు ఆప్ మరోసారి నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈరోజు నామినేషన్లను ప్రకటించింది. స్వాతి మలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను రెండవసారి రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని ఆప్ నిర్ణయించింది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాల ప్రస్తుత పదవీకాలం జనవరి 27, 2024తో ముగియనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంజయ్ గుప్తా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆప్ అభ్యర్థన మేరకు సంజయ్ సింగ్ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ సభ్యునిగా పదవీ కాలం ముగుస్తున్న సుశీల్ కుమార్ గుప్తా స్థానంలో స్వాతి మాలీవాల్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది జరగనున్న హర్యానా ఎన్నికల్లో ఆప్ పోటీ చేయాలనుకుంటోంది. సుశీల్ కుమార్ గుప్తాకు హర్యానా బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎగువ సభలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఆప్‌కి ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. పంజాబ్‌లో విజయం తర్వాత రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా పెరిగింది. అటు.. ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు జనవరి 3న ప్రారంభమయ్యాయి. జనవరి 19న పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో ఆప్‌కి 62 స్థానాలు ఉన్నందున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు -
ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ వేధింపులు!
ఆతిథ్యంలో విదేశీయులను మురిపించేందుకు ఓ పక్క ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క కొందరు మాత్రం తమ చేష్టలతో అతిథి దేవోభవ అనే సూత్రానికి తూట్లు పొడుస్తున్నారు. తాజాగా ఓ ఆటోడ్రైవర్.. ఓ విదేశీ పర్యాటకురాలితో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఆటో డ్రైవర్ ఫారినర్లను వెంబడిస్తూ.. వాళ్లతో పాటే నడుస్తూ.. ఆమె మీద ఎక్కడపడితే అక్కడ చేతులేస్తూ వెళ్లాడు. ఆ క్షణం ఆమె ఇబ్బందిగా ఫీలవుతున్నా సరే పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడతను. దీంతో అతన్ని వదిలించుకునేందుకు ఆ జంట ప్రయత్నించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇది చోటు చేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఈ వీడియోను తన ట్విటర్ వాల్ మీద పోస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లట్, రాజస్థాన్ పోలీసులను కోరారు. Just came across this video where this man can be seen inappropriately touching a foreign tourist. It is very shameful. Tagging @ashokgehlot51 and @PoliceRajasthan for action. These incidents are bringing bad name to the nation! pic.twitter.com/1eo9u6Baky — Swati Maliwal (@SwatiJaiHind) July 3, 2023 అయితే.. రాజస్థాన్ పోలీసులు ఇప్పటిదాకా బాధితులను, నిందితుడిని గుర్తించలేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి.. భలే ట్విస్ట్ ఇచ్చిందిగా! -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్‌నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్‌కు అంకుల్‌నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్‌లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
మా నాన్న లైంగికంగా వేధించాడు.. స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు..
సాక్షి,న్యూఢిల్లీ: కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల చెప్పడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఇలాంటి విషయాన్నె వెల్లడించడం షాక్‌కు గురిచేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన స్వాతి మలివాల్.. కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని చెప్పారు. అతని భయానికి బెడ్ కింద దాచుకునేదానినని దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారు. 'నా చిన్నప్పుడు తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను బాగా కొట్టేవాడు. భయంతో వెల్లి మంచం కింద దాచుకునేదాన్ని. జుట్టుపట్టుకుని నా తలను గోడకేసి బాదేవాడు. దీంతో తల పగిలి రక్తం వచ్చేది. ఓ వ్యక్తిపై ఇలాంటి దాడులు జరిగినప్పుడే అవతలి వాళ్ల బాధ బాగా అర్థం అవుతుంది. ఈ ఆగ్రహ జ్వాల మొత్తం వ్యవస్థనే షేక్ చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలకు ఎలా న్యాయం చేయాలి, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలి అని ప్రతి రోజు ఆలోచించే దాన్ని.' అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. తన నాలుగో తరగతి వరకు తండ్రితోనే ఉన్నానని, చాలా సార్లు తనను వేధించాడని చెప్పారు. నటి ఖుష్బూ సుందర్ కూడా ఇటీవలే తన తండ్రి లైంగికంగా వేధించాడని చెప్పడం సంచలనం సృష్టించింది. తన 8 ఏళ్ల వయసులోనే ఇది జరిగిందని, అదే తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితి అని పేర్కొంది. 15 ఏళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించినట్లు చెప్పింది. అప్పుడే అతను ఇళ్లు వదిలి వెళ్లిపోయాడని వివరించింది. చదవండి: నేను వెళ్లిపోతున్నా ఎప్పటికీ తిరిగిరాను అని మెసేజ్.. లవర్‌తో కలిసి కొండపై నుంచి దూకి..