syndicate
-
లిక్కర్ స్కామ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్‌లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్‌ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు సర్కార్ అధికారిక సిండికేట్
-
అడ్డగోలు దోపిడీకి అధికారిక సిండికేట్
అందులో ఉన్నవి నాలుగు ఐటీ ఆధారిత సేవల సంస్థలే ఏ శాఖ అయినా.. ఏ పనికైనా వాటి సేవలను పొందాల్సిందే కొత్త మద్యం విధానం సహా అన్నింటికీ అవే వీటిద్వారా దోపిడీకి రాచబాట వేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలుసాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ కోసం అధికారిక సిండికేట్‌కు తెరతీసింది. అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం కట్టబెట్టింది. టెండర్లు లేకుండానే ఏకపక్షంగా కన్సల్టెన్సీల నియామకానికి విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఏకపక్షంగా కన్సల్టెన్సీ నియామకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని శాఖలకూ వర్తింపజేస్తూ ఏకీకృత దోపిడీ వ్యవస్థను రూపొందిస్తోంది.వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెన్సీల నియామకానికి మార్గదర్శకాలతో ఇటీవల జారీ చేసిన జీవో–86 ప్రభుత్వ పెద్దల దోపిడీ పన్నాగానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖలు ఏవైనా ప్రాజెక్టులు, ప్రొక్యూర్మెంట్, కొత్త విధానం, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవలు, పౌర సేవలు వంటి వాటి కోసం కన్సల్టెన్సీల నియామకంలో పారదర్శక టెండర్లకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం దారులు దాదాపుగా మూసివేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్విసెస్ (ఎన్ఐసీఎస్ఐ)లో ఎంపానల్ అయిన కన్సల్టెన్సీలనే ఎంపిక చేయాలని షరతు విధించింది.ఎన్ఐసీఎస్ఐ జాబితాలో ఈ అండ్ వై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ అనే నాలుగు కంపెనీలే ఉన్నాయి. ఏ శాఖ అయినా ఈ సంస్థలకు తమ ప్రాజెక్టుకు అర్హత లేదని భావిస్తే టెండర్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరాలి. అయితే, అసలు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకే వీల్లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. ఏ శాఖ అయినా టెండర్లు పిలుస్తామని కోరినా ప్రభుత్వం తిరస్కరిస్తుందనే సంకేతాలిచ్చింది. మరోపక్క వివిధ శాఖలకు సేవలందిస్తున్న కన్సల్టెన్సీలను తక్షణం వైదొలగాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా అన్ని శాఖలు ఈ నాలుగు కంపెనీలతోనే సేవలు పొందేలా రాచబాట వేసింది. పారదర్శకతకు పాతర ఈ నాలుగూ ప్రధానంగా ఐటీ కంపెనీలు. ఐటీ ఆధారిత సేవలను మాత్రమే అందించగలవు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎక్సైజ్, పర్యాటక, పట్టణాభివృద్ధి, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం.. ఇలా అన్ని శాఖల కన్సల్టెన్సీ సేవలను వీటికే కట్టబెట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ 2021లో జారీ చేసిన ప్రొక్యూర్మెంట్–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే కన్సల్టెన్సీలకు సాంకేతిక అర్హతలు 30 శాతం మించకూడదు.ఆర్థికపరమైన అర్హతలు ఎక్కువ ఉండాలి. బాబు ప్రభుత్వం ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి, కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక అర్హతలు 70 శాతం లేదా 60 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంటే ఆర్థిక అర్హతలు 30 లేదా 40 శాతం ఉంటే సరిపోతుందని చెప్పింది. సిండికేట్‌లోని నాలుగు కంపెనీలు ఐటీ ఆధారిత సేవల సంస్థలైనందున, వాటికి సాంకేతిక అర్హతలే ఎక్కువ ఉంటాయనే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. భారీ దోపిడీకి పక్కా పన్నాగం ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి మార్గం సుగమం చేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ పెద్దలు ముందుగానే తమకు అనుకూలమైన విధివిధానాలను అనధికారికంగా రూపొందిస్తారు. అనంతరం అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థను నియమించి, తాము రూపొందించిన విధానాన్నే దాని ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం దానిని ఆమోదిస్తుంది. తద్వారా యథేచ్చగా దోపిడీకి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొడతారు.ఇన్నర్ రింగ్ రోడ్డు దోపిడీ తరహాలోనే..రాష్ట్ర విభజన అనంతరం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో దోపిడీకి పన్నిన వ్యూహాన్నే ఇప్పుడు ఏకంగా అన్ని శాఖలకు వర్తింపజేస్తోంది. అప్పట్లో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి ప్రభుత్వ పెద్దలు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కెచ్ పెను సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠా ముందుగానే ఓ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను అనధికారికంగా ఖరారు చేసింది.చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు అప్పటికే భారీగా కొన్న భూములను ఆనుకుని ఆ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారు. తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనకు ఓ అస్మదీయ కన్సల్టెన్సీని నియమించారు. తాము రూపొందించిన అలైన్‌మెంట్‌నే ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు ఆ అలైన్‌మెంట్‌కు అటూ ఇటూ కొన్న భూముల విలువ అమాంతం పెరిగింది. తద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. అదే దోపిడీ విధానాన్ని ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నిన వ్యూహమే ఈ కన్సల్టెన్సీల సిండికేట్ జీవో అనేది స్పష్టమవుతోంది. -
పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం సిండి‘కేట్ల’ను తరిమికొట్టారు. మద్యపాన నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను, అడుగడుగునా వెలసిన బెల్టు షాపులను తుదముట్టించి సిండికేట్ల నడుం విరగ్గొట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వాటి సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పీల్చి పిప్పిచేస్తున్న మద్యం సిండికేట్లు కుదేలయ్యాయి. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి, మద్యం సిండికేట్ల ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ఈ విపక్షాలు, పత్రికలకు ఈ పరిణామం కంటగింపుగా మారింది. తమకు ఆదాయాన్ని పంచే మద్యం సిండికేట్ల కోసం అవి రంగంలోకి దిగాయి. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పైన దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. మద్యం సిండికేట్లకు కొమ్ముకాసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయ్యారు. దీంతో మద్యం సిండికేట్ల బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నెత్తిన ఎత్తుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఆమె మాటలు, చర్యలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన పురందేశ్వరి ఆ పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడుతూ.. కుటుంబం, మద్యం సిండికేట్ల కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు, డిస్టిలరీల విషయంలో ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రాజకీయ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో ఏర్పాటయినవే. 20 డిస్టిలరీల్లో 12 చంద్రబాబు సీఎంగా ఉండగా అనుమతిచ్చినవే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజారోగ్యం దృష్ట్యా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ వాస్తవాలను విస్మరించి, పురందేశ్వరి అసత్య ప్రచారానికి దిగారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమేనన్నది సుస్పష్టం. బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలు నేషన్ ఫస్ట్–పార్టీ నెక్ట్స్–సెల్ఫ్ లాస్ట్ (దేశం తొలి ప్రాధాన్యత–పార్టీ మలి ప్రాధాన్యత–వ్యక్తిగత ప్రయోజనాలు ఆఖరు) అనేది బీజేపీ సిద్ధాంతం. కానీ, ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చారు. పార్టీ కంటే సొంత కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఆమె చర్యలు ఉన్నాయని బీజేపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ఆమె రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రయోజనాలకంటే కుటుంబ ప్రయోజనాల కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ మోదీకి, బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పురందేశ్వరి ఎన్టీఆర్ నాణెం ముద్రణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి, అ కార్యక్రమంలో చంద్రêబును, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానించి, వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్‌పైనా ఇదే తీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపూర్ణ మద్య నిషేధం విధించడంతో మద్యం సిండికేట్లకు అడ్డుకట్ట పడింది. ఈ సిండికేట్లకు మద్దతుగా అప్పట్లో చంద్రబాబు తదితరులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ వెంటనే చంద్రబాబు సీఎం పీఠమెక్కారు. సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. మళ్లీ సిండికేట్ల రాజ్యం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలు వెలిశాయి. వీధికో బెల్టు షాపు వచ్చింది. వేయి తలల మద్య రక్కసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని చిదిమేసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో, ఆ తర్వాత చంద్రబాబు పీఠాన్ని అధిష్టించడంలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా∙భాగస్వామ్యం ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలే చెప్పాయి. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆమె ఎక్కడా దానిని వ్యతిరేకించలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వెన్నుపోటు రాజకీయం, సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడవడంలో చంద్రబాబుకు సహకరించిన కొన్ని పత్రికలే ఇప్పుడు రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ పత్రికల కథనాలను అనుసరిస్తూ పురందేశ్వరి ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే స్థాయికి వచ్చారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ ఆరోపణలు చేసినా.. రాష్ట్రానికి 2014–19 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబు అవినీతిపై స్వయంగా ప్రధాని మోదీనే అనేక ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో వచ్చిన అనేక ఆరోపణల్లో ఒకటైన స్కిల్ స్కామ్‌లో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయగానే, ఆ అరెస్టును తప్పు పడుతూ టీడీపీ నాయకులకంటే ముందే పురందేశ్వరి సామాజిక మా«ధ్యమాల్లో ఖండించారు. రెండు రోజుల క్రితం లోకేశ్ ఢిల్లీలో అమిత్ షాను కలిస్తే.. ఆ భేటీ వివరాలు, ఫొటోలను కూడా లోకేశ్కంటే అరగంట ముందే పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఇరువురి భేటీ వివరాలను పురందేశ్వరి సూచన మేరకు బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం మీడియా ప్రతినిధులకూ వెంటనే తెలియజేసింది. అవినీతిపరుడని స్వయంగా ప్రధానే ఆరోపించిన చంద్రబాబు విషయంలో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బీజేపీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సిన పురందేశ్వరి కీలక ఎన్నికల సమయంలో టీడీపీ ఆడే డ్రామాలో పావుగా మారారని, వచ్చిన అవకాశాలను కూడా∙చేజేతులా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు ధ్వజమెత్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పూర్తి నైరాశ్యంలో ఉన్నారని, వారిలో కొందరు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని పురందేశ్వరి వినియోగించుకోకపోగా, టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారా.. అనే అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు
కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది. పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా...ఒక సెమిస్టర్లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్ కోల్పోరు. ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్, ల్యాబ్, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని పేర్కొంది. (చదవండి: అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు) -
మందు బాబులు జర జాగ్రత్త.. లేదంటే జేబులు ఖాళీ!
కోహెడరూరల్(హుస్నాబాద్): సిండికేట్ల కనుసన్నల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్ నిమోజకవర్గంలో మద్యం వ్యాపారులు మద్యం వినియోగదారుల జేబులు ఖాళీ చేసేందుకు కుమ్మక్కయ్యారు. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల పరస్పర అవగాహనతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లో కొన్ని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారుల తీరుతో మందుబాబులు విసిగిపోతున్నారు. కొద్ది రోజులుగా మద్యం అమ్మకాల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారి మత్తు దిగేలా చేస్తున్నాయి. కోరింది కాకుండా స్కీం ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటలు అన్ని రకల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది. (చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే! ) వ్యాపారుల ఇష్టారాజ్యం మద్యం కొనుగోలుదారులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు లబ్ధిచేకూర్చే కంపెనీల బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు. లాభం ఎక్కువ ఇచ్చే(స్కీం)కంపెనీల మద్యాన్ని మాత్రమే విక్రయించేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్కీంలు భారీగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రధాన బాండ్ల విక్రయాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో వాటిని అమ్ముతున్నప్పటికీ స్థానిక వ్యాపారులు సిండికేటుగా మారడంతో కొన్ని బ్రాండ్ల మద్యం లభించడం లేదు. దీంతో మద్యం ప్రియులు వారు అంటగడుతున్న వాటినే తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. స్కీం లేకుంటే అంతే.. యువత ఎక్కువగా బీరు తాగుతుంటారు. అత్యధికంగా కింగ్ ఫిషర్ లైట్ లేదా స్ట్రాంగ్ పైనే మక్కువ చూపుతుంటారు. బీర్ల విక్రయాల్లో ఎక్కువగా అమ్మడు పోయిదే ఈ బ్రాండ్ మాత్రమే. మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ కావడంతో కొద్దిరోజులుగా ఆ కంపెనీ స్కీం రూపంలో వైన్‌షాప్‌లకు ఇచ్చే ప్రోత్సహకాలకు నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో ప్రోత్సాహకాలు(స్కీం)ఇవ్వని బ్రాండ్లు అమ్మకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు వినికిడి. వినియోగదారులు కోరినా స్టాక్ లేదంటూ ఇతర కంపెనీల బీర్లను అంటగడుతున్నారు. (చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. ) ఎక్సైజ్ అధికారుల అండతో.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం వ్యాపారుల సిండికేట్ నడుస్తోంది. సిండికేట్ నడుస్తోందని తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు హుస్నాబాద్ పరిధిలో మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అమ్ముతున్నట్టు మాకు సమాచారం లేదు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఉండకూడదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ధరలకు మద్యం విక్రయించకూడదు – విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ, హుస్నాబాద్ సరికొత్త రేట్లతో విక్రయాలు మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిల్‌పై రూ.20 నుంచి 30, హాఫ్ బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు, క్వాటర్ సీసాపై రూ.10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. బీరుపై రూ.10 నుంచి 20 అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా మద్యం సీసాలపై స్టిక్కర్లు వేసి బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. -
‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!
పాఠశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వీ రాఘవ్ ఆనందో బ్రహ్మ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తరువాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. యాత్ర తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహి, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు మహి. ‘ఓ దర్శకుడు కథ చెప్పటం కన్నా, ఏ కథ చెప్పాలి అని నిర్ణయించుకోవటమే కష్టమైన పని. బాక్సాఫీస్ ట్రెండ్స్, బడ్జెట్, నటీనటులు ఇవేవి కథ ఎంపికకు సాయపడవు. నిశ్శబ్ధంలో వచ్చే ఓ ఆలోచన.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్ డ్రామా. టైటిల్ ‘సిండికేట్’. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ‘SYNDICATE’ pic.twitter.com/6DAyGGqjFf — Mahi Vraghav (@MahiVraghav) July 30, 2019 -
కలరింగ్ ఇచ్చేందుకు అధికారులు నానాపాట్లు
సాక్షి, ఏలూరు టౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సి రావటం.. ఎన్నికల విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నామని కలరింగ్ ఇచ్చేందుకు అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ప్రతి రోజూ భారీఎత్తున దాడులు చేస్తున్నట్టు, అక్రమ మద్యం స్వాధీనం.. అరెస్టులు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇంతకీ ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని, పేరుకే దాడులు తప్ప చర్యలు శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని మరీ కాగితాల మీద లెక్కలు చూపించుకునేందుకు అధికారులు తాపత్రయపడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే సిండికేట్లతో ఒప్పందాలు చేసుకుని దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిండికేట్లతో రహస్య ఒప్పందం జిల్లా వ్యాప్తంగా మద్యనియంత్రణ, ఆబ్కారీ శాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో మొబైల్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ట్రైన్ చెకింగ్ టీమ్‌లతో పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. కానీ ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగానే మద్యం సిండికేట్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ రోజుకు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తూ మద్యాన్ని సీజ్ చేయటం, అరెస్టులు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎన్నికల అనంతరం వారికి అప్పగించేలా ఒప్పందాలు చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే సిండికేట్లు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేయటం, అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ డీసీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న మద్యం అంతా ఎన్నికలు ముగిసిన వెంటనే తిరిగి వారికి అప్పగించేలా ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. ముందుగా సిండికేట్లు మద్యం కేసులను ఒక చోట ఉంచి, ఎక్సైజ్ అధికారులకు చెప్పటం, అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవటం అంతా ఒప్పందంలో భాగమేనంటున్నారు. పోలీసులు దాడుల్లో మద్యం బాటిళ్లు దొరుకుతుంటే, ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో మాత్రం ఏకంగా అట్టపెట్టెలతో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల అనంతరం మళ్లీ తిరిగి అట్టపెట్టెలతో సహా మద్యం బాటిళ్లను మద్యం షాపుల యజమానులకు వాటిని అప్పగించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆక్వా రైతులపై సిండ్‘కాటు’
- కీలక కౌంట్ ధరల తగ్గింపు - లబోదిబోమంటున్న రైతులు అమలాపురం : ఆక్వా ధరలు మరోసారి దారుణంగా పడిపోయాయి. కీలక కౌంట్ ధరలు నెల రోజుల వ్యవధిలో కేజీకి రూ.50 నుంచి 120 వరకు పడిపోవడంతో రైతులు కుదేవుతున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి మరోసారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లుగా కాసులు కురిపిస్తున్న వెనామీ సాగు ఈ ఏడాది రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన ఊరూపేరూ లేని హేచరీల్లో నాణ్యత లేని సీడ్ వల్ల కొంత వరకు చెరువులు దెబ్బతినగా, మిగిలిన చెరువుల పట్టుబడి సమయానికి దగ్గరకు వచ్చే సరికి వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించి వేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో రొయ్యలు సహజసిద్ధంగా చనిపోతున్నాయి. దీనికితోడు డీవో (డెడ్ ఆక్సిజన్) కారణంగా వందలాది ఎకరాల చెరువుల్లో రొయ్యలు మరణిస్తున్నాయి. ఆందోళనతో ఉన్న రైతులు పట్టుబడులు ఆరంభించారు. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేటయ్యారు. ఎక్కువుగా వస్తున్న కౌంట్లను చూసి వాటి ధరలను ఆమాంతంగా తగ్గించేశారు. కొనుగోలుదారులు రేట్లు తగ్గుతున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయడంతో రైతులు ముందస్తు పట్టుబడులకు వెళుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువుగా 40 కౌంట్ (కేజీకి 40 రొయ్యలు) నుంచి 80 కౌంట్ వరకు వస్తున్నాయి. దీంతో ఈ కౌంట్ ధరలను గుణనీయంగా తగ్గించి వేశారు. 40 కౌంట్ ధర కేజీకి రూ.70, 43 నుంచి 50 కౌంట్ ధర రూ.120, 60 కౌంట్ ధర రూ.110, 63 నుంచి 70 కౌంట్ ధర రూ.90, 73 నుంచి 80 కౌంట్ ధర రూ.70 చొప్పున తగ్గించేశారు. వీటితోపాటు 83 నుంచి 90 కౌంట్ ధర రూ.50, 100 కౌంట్ ధర రూ.30 చొప్పున తగ్గించి రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. ధరలు తగ్గించే విషయంలో కొనుగోలుదారులు ఒకే మాట, ఒకే ధర అన్నట్టుగా సిండికేటు కావడంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 50 కౌంట్ ధర రూ.120 తగ్గడంతో రైతులు ఎకరాకు సగటున దిగుబడిగా వచ్చే రెండు టన్నుల రొయ్యల ఉత్పత్తిపై రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా. ఇటీవల కాలంలో వెనామీ సాగు వైపు రెతులు ఎక్కువగా మొగ్గు చూపడంతో చెరువుల లీజుల ధరలు, సీడ్, మేత ధరలతోపాటు కూలి ధరలు భారీగా పెరిగాయి. చివరకు వేసవి సీజన్ కావడంతో రూ.200 ఉండే క్యాన్ ఐస్ ధర ప్రస్తుతం రూ.400ల నుంచి రూ. 500 వరకు పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం పైగా పెట్టుబడి పెరిగిందని అంచనా. ఈ సమయంలో వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడంతో పంటపండినా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. కౌంట్ గత నెల 25న తాజాగా 20 కౌంట్ 640 640 25 కౌంట్ 540 540 30 కౌంట్ 530 460 40 కౌంట్ 430 360 42 కౌంట్ 410 340 43 నుంచి 50 కౌంట్ 380 260 60 కౌంట్ 350 240 63 నుంచి 70 కౌంట్ 320 230 73 నుంచి 80 కౌంట్ 290 220 83 నుంచి 90 కౌంట్ 260 210 93 నుంచి 100 కౌంట్ 230 200 -
తెల్లవార్లూ మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్లు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయాలు రహస్యంగా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భాలలో జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన మంత్రులను బూచీగా చూపిస్తున్నారు. రాత్రిళ్లు షాపులో బయట తాళాలు వేసినా షట్టర్‌కు చేసిన రంధ్రం ద్వారా తెల్లవార్లు మద్యం విక్రయిస్తున్నారు. రాత్రిళ్లు బాటిల్‌ను నిర్ణీత మొత్తం కంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : జిల్లాలో 545 మద్యం షాపులు ఉండగా రెండు నెలల క్రితం లాటరీ పద్ధతిలో 521 షాపులకు కేటాయింపులు చేశారు. మరో 24 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై నుంచి కొత్త లైసెన్సులు అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారు. మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో కూడా మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అమ్మకాలు సాగించాలి. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవార్లూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో అప్సరా థియేటర్ వద్ద షాపులో ఉదయం 5 గంటల సమయంలో అమ్మకాలు సాగిస్తున్నందుకు ఏజీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలమూరులో కూడా రెండు షాపులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చక్రం తిప్పుతున్న సిండికేట్లు మద్యం సిండికేట్లే మద్యం రేట్లు నిర్ణయిస్తున్నారు. మద్యం కంపెనీలు రేట్లు పెంచినందున లాభాలు రావడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుకొని అమ్ముకుంటామని మద్యం వ్యాపారులు గతంలో ప్రభుత్వానికి అనుమతిని కోరుతూ లేఖ రాశారు. అయితే ప్రభుత్వం విధానం ఇంకా ప్రకటించకుండానే వ్యాపారులు రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తుంటే.. ఆ రేట్లకు మించి ఒక్కో బాటిల్‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా రేటు నిర్ణయించారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపులు మూసి వేయాలనే విధానంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండడంతో పాత షాపులనే కొనసాగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకే ఎక్కువ షాపులు.. ఎక్సైజ్ అధికారులు ఇటీవల జిల్లాలో నిర్వహించిన లాటరీలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువ షాపులను దక్కించుకున్నారు. అధికారులును ప్రలోభాలకు గురి చేసి షాపులకు ఎవరూ అడ్డు రాకుండా చేసుకోగలిగారు. కొన్ని చోట్ల 20 ఏళ్లుగా షాపు నిర్వహిస్తున్న వ్యక్తికే తిరిగి షాపు దక్కేలా పావులు కదిపారు. ఎవరైనా ఆ షాపు కోసం దరఖాస్తు చేస్తే మొదటిలోనే అడ్డుకొని దరఖాస్తు చేసిన వారిపై దౌర్జన్యం చేసి భయపెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లాటరీ పద్ధతిపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోలేకపోతున్న అధికారులు ప్రతి షాపులో ఎమ్మార్పీకే విక్రయాంచాలన్న నిబంధన అమలుపై ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు అందినప్పటికీ షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండడంతో వారి ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చర్యలు చేపడతాం మద్యం షాపుల అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. షాపుల కేటాయింపు పారదర్శకంగా జరిగింది. జూ¯ŒS 30తో పాత షాపులు గడువు ముగుస్తుంది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్టు దృష్టికి వస్తే షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – బత్తుల అరుణరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ -
లాతరీలో.. అన్నీ మోషాలే..
మద్యం షాపుల లాటరీ మాయాజాలం l సిండికేట్లతో అధికారుల లాలూచీ l అమలాపురంలో నాలుగు షాపుల తీరు గందరగోళం సీసీ కెమెరాలు... ఎంట్రీ పాస్‌లు... గుర్తింపు కార్డులు... టోకెన్లు... నఖశిఖ పర్యంతం తనిఖీలు... పారదర్శకతకు అద్దం పట్టేలా.. సవాలక్ష నిబంధనల నడుమ జిల్లాలో మద్యం షాపులకు నిర్వహించిన లాటరీ విధానం వివాదా స్పదమైంది. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు... కోర్టుల్లో కేసుల వరకూ దారి తీస్తోంది. అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : కాకినాడలో గత నెల 31న మద్యం షాపుల కేటాయింపునకు నిర్వహించిన ఈ లాటరీ విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని లాటరీలో అడ్డగోలు చర్యల వల్ల షాపులు కోల్పోయిన దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు, బడా సిండికేట్లకు అధికారులు తెరచాటు సహకారం అందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అమలాపురంలో నాలుగు షాపులకు సంబంధించిన లాటరీల్లో కేటాయింపులు వివాదాస్పదం కావడంతో బాధిత దరఖాస్తుదారుల్లో కొందరు జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. మరికొందరు ఎక్సైజ్ అధికారుల చేసిన తప్పిదాలపై కోర్టులను ఆశ్రయించారు. బినామీల రంగప్రవేశం అమలాపురంలో నాలుగు షాపుల కేటాయింపులపై చెలరేగిన దుమారంతో జిల్లాలో మి గిలిన ప్రాంతాల్లో కూడా లాటరీ లోపాలు, అధికారుల తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. అమలాపురంలో 190, 191, 192, 193 షాపుల కేటాయింపు వివాదా స్పదం అయిన సంగతి తెలిసిందే. ఒక షాపులో మొదటి దరఖాస్తుదారుడికి లాటరీలో వచ్చినప్పటికీ సంబంధిత సిండికేటర్ దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని అధికారుల ముందు నిర్ణీత సమయంలో హాజరు పరచలేకపోయారు. మరో షాపునకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని హాజరుపరచి అతనే అసలు వ్యక్తిగా నమ్మించి అతడితో సంతకం పోర్జరీ చేయించారు. 193 షాపునకు ఒకటో దరఖాస్తుదారుడు కాకుండా మరో వ్యక్తి (బినామీ) డ్రాలో పాల్గొన్నాడు. దరఖాస్తులో ఉన్న వ్యక్తి సంతకాన్ని అతడే చేశాడు. 193 షాపులో రెండో దరఖాస్తుదారుడు జవ్వాది వెంకట కృష్ణ నాగేశ్వరరావు ఈ తప్పిదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. 192 షాపు వ్యవహారం కూడా ఇలాంటి వివాదంపైనే కోర్టు వరకూ చేరింది. పాటించని నిబంధనలు.. లాటరీ డ్రా నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత షాపు దరఖాస్తుదారుడు విధిగా హాజరై ఉండాలి. ఈ నిబంధనను అధికారులు కచ్చితంగా పాటించి ఉంటే లేదా ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. లాటరీ డ్రాలో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడికి ఫోటో గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. దరఖాస్తుదారుడికి బదులు మరో వ్యక్తి డ్రాలో పాల్గొని ఫోర్జరీ సంతకం చేయడంపై ఎక్సైజ్ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపుల నిర్వహణలో ఏళ్ల తరబడి బలంగా పాతుకుపోయిన సిండికేటర్లు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఉన్న సంబంధాలతోనే ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఆ రోజు లాటరీ డ్రా సమయంలో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. లాటరీ డ్రాకు ఎక్సైజ్ శాఖ విధించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించి తిరిగి డ్రాలు నిర్వహిస్తే ఆ షాపులు తమకే దక్కుతాయని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. -
సిండికేట్‌గా రేషన్ మాఫియా
రేషన్ బియ్యం అక్రమంగా తరలించి అమ్ముకోవడం కొత్తేమీ కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే.. రెండేళ్ల కిందటి వరకు ఇలా పేదల బియ్యాన్ని బొక్కే దొంగలంతా విడివిడిగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుడొకరు వీరినందరినీ ఒక తాటిపైకి తెచ్చాడు. ఆ విధంగా రేషన్ డీలర్ల మాఫియా తయారైంది. అధికారులు వారికి జీ హుజూర్ అంటున్నారు. ఇక రేషన్ దోపిడీ పట్టపగ్గాలు లేకుండా సాగుతోంది. మాచర్ల: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయకుండానే డీలర్లు సిండికేట్‌గా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకులకు అమ్మేస్తున్నారు. తాజాగా శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ రామాంజనేయలు స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే బియ్యం లారీని పట్టించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడవకముందే మరోసారి రేషన్ బియ్యం దొరికాయి. దీనినిబట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థమవుతోంది. దందా నడిపిస్తున్న నామినేటెడ్ నాయకుడు.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాలుగా వున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులందరినీ తన కనుసన్నలలో ఉంచుకుని ఓ నామినేటెడ్ నాయకుడు దందాను నడిపిస్తున్నాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే పీఆర్కే పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. వారం కిందట దుర్గి మండలంలోని అడిగొప్పల ప్రాంతంలో 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకుని పోలీసులకు పట్టించారు. అయినప్పటికీ పోలీసులు అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి దొరికిన డ్రైవర్‌పైనే కేసులు నమోదు చేసి అసలు సూత్రధారులను గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే అక్రమ రేషన్ బియ్యం లారీని పట్టుకున్న సమయంలో దొరికిన ఐదుగురు మినహా మిగతా వారు ఎవరనేది పోలీసులు తేల్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దుర్గి మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి పేర్లను నమోదు చేశామని చెబుతున్నా, వారిని అరెస్టు చేశారా లే దా అనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా శుక్రవారం మాచర్ల శివారులో గుంటూరు రోడ్డులోని రాయవరం జంక్షన్ వద్ద 52 బస్తాల బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఈసారీ డ్రైవర్ ఒక్కడిపైనే కేసు నమోదు చేశారు. అసలు నిందితులను తేల్చకుండా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పథకం ప్రకారం డంపింగ్.. అధికార పార్టీ నాయకులు ముందుగా వివిధ మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి ఒక చోట డంప్ చేస్తారు. అక్కడ నుంచి వివిధ చోట్లకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంటుంది. పోలీసు పెట్రోలింగ్ చేసే సమయంలోనే లోడ్లను తీసుకెళ్తున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రూరల్ æపరిధిలోని ఓ పోలీసు అ«ధికారి అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు బియ్యం పట్టుకున్న ప్రతిసారీ దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. కీలక సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదు. -
శంషాబాద్‌లో నీళ్ల వ్యాపారుల దోపిడీ
శంషాబాద్ నీళ్ల వ్యాపారుల దోపిడీ మరింత పెరిగింది. గత పదిహేను రోజులుగా రూ.10 కు విక్రయించే 20 లీటర్ల నీటిని అమాంతం రెట్టింపు చేశారు. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించకుండా ఫిల్టర్ నీటిని అమ్ముకునే వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గత పదేళ్లుగా పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఫిల్టర్ వ్యాపారులపై ఇంతరకు అధికారులు తనిఖీలు, అజమాయిషి కాస్తా లేకపోవడంతో వీరిది ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవల సిండికేట్‌గా మారి రేట్లు కూడా పెంచేవారు. ఫ్లోర్ ఫ్లోరుకు ఓ లెక్కన రేట్లు తీసుకుంటున్నారు. నీటి సమస్యతో .. శంషాబాద్‌లో ప్రస్తుతం పాత గ్రామానికి కృష్ణా నీరు సరఫరా అవుతోంది. రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. అయితే, రైల్వే ట్రాక్‌కు కుడివైపున ఉన్న కాలనీలకు కృష్ణా నీరు అందటం లేదు. దీంతో ఇక్కడి వారు ఫిల్టర్ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. శంషాబాద్ పట్టణంలో సుమారు 40 వేల జనాభాకు సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో నీటి వ్యాపారులు ఇదే అదనుగా ధరలను పెంచేసి దోపిడి చేస్తున్నారు. మురుగునీటి ప్రవాహనం పక్కనే బోర్లు వేసి కూడా నీటిని అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీ కొరడా.. ఇటీవల గ్రామసభలో సమస్య ప్రస్తావనకు రావడంతో ఎట్టకేలకు శంషాబాద్ పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిల్టర్ నీటిని సరఫరా చేసే వారు నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లను పొందడంతో పాటు పంచాయతీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా సోమవారం ఫిల్టర్ వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. పెంచిన రేట్లను కూడా వెంటనే తగ్గించాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు రంగంలోకి దిగడంతో వ్యాపారులు దిగొస్తారా.. లేదా యధాతథంగా తమ దందాను కొనసాగిస్తారా..? లేదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
సర్కారు నోట్లో దుమ్ము
సాక్షి’ చెప్పిందే నిజమైంది.. ఇసుక వేలంలో వ్యాపారుల సిండికేట్ వ్యాపారులను బెదిరించిన టీడీపీ నేతలు కనిష్టంగా రూ.116కు టెండర్ ప్రభుత్వ ఆదాయానికి భారీగా తూట్లు ఏడు రీచ్‌లకు రూ.27.44 కోట్లు మాత్రమే సాక్షిప్రతినిధి, గుంటూరు : ఇసుక రీచ్‌ల వేలంలో వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. టీడీపీ నేతలు ఇందులో ముఖ్యభూమిక వహించారు. దరఖాస్తుదారుల వివరాలను ముందుగానే తెలుసుకుని పోటీపడి టెండర్లు వేస్తే ఇబ్బంది పడతారని వారిని టీడీపీ నేతలు బెదిరించారు. తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు టీడీపీ నేతల ఆదేశాలను పాటించి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా దరఖాస్తులో పేర్కొన్నారు. సిండికేట్ కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. క్యూబిక్ మీటరుకు రూ.500 ధరను ప్రభుత్వం నిర్ణయిస్తే, సిండికేట్ కారణంగా రూ.కనిష్టంగా రూ.116, గరిష్టంగా రూ.356 ధరలకు టెండరు వేశారు. కొన్ని రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, స్థానిక సమస్యలు ఉండడంతో వ్యాపారులు ధర తక్కువగా వేశారని, సిండికేట్ అయినట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు చెబుతున్నారు. గుండిమెడ రీచ్‌కు రూ. 8 కోట్లు ‘సాక్షి ’ దినపత్రిక మొదటి నుంచి ఇసుక రీచ్‌ల టెండర్లలో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నారని ప్రచురించింది. గుండిమెడ రీచ్‌లో వ్యాపారులు సిండికేట్ అయ్యారని కూడా ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ రీచ్‌లో జరిగిన విధంగానే మిగిలిన రీచ్‌ల విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించి అంతా సిండికేట్ అయ్యే విధంగా చేయగలిగారు. దరఖాస్తుదారుల వివరాలను తెలుసుకుని, వారినందరినీ సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే, సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మొత్తం ఏడు రీచ్‌ల్లో గుండిమెడకు రూ.8 కోట్లకు వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. వేలంలో ఆ రీచ్‌ను పాడుకున్న వ్యాపారి ఇతర వ్యాపారులకు ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా సిండికేట్ అయ్యారు. మరికొన్నిటిలో దరఖాస్తుదారులంతా ఆ రీచ్‌ల్లో వ్యాపారులుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.వారిలో ఒకరిని రీచ్ నిర్వాహకునిగా ఏర్పాటుచేసుకుని, మిగిలిన వారు భాగస్వాములుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రీచ్‌ల వారీ వ్యాపారులు చెల్లించనున్న ధరల వివరాలు ... ప్రభుత్వం నిర్ణయించిన విధంగా క్యూబిక్ మీటరుకు రూ.500 మించి విక్రయించరాదని ఆదేశాలు జారీ చేయడంతో దాని కంటే రేటును తక్కువ వేశారు. ఆ రేటుతోపాటు రీచ్‌ల్లోని ఖర్చులు, వివిధ శాఖల అధికారులకు చెల్లించే పర్సంటేజీలు, లాభంతో కలిపి రూ.500లోపు వ్యాపారులు విక్రయించాలి. గుండిమెడ రీచ్‌కు రూ.154, జువ్వలపాలెం రూ.138, కస్తల రూ.356, కోసూరు రూ.356, పోతార్లంక రూ.152, వల్లభాపురానికి రూ.142, ఉద్దండ్రాయునిపాలెంకు రూ.116లు చెల్లించే విధంగా వ్యాపారులు టెండరు వేశారు. రూ. 50 కోట్ల మేరకు నష్టం .. ఏడు రీచ్‌లకు జరిగిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.27.44 కోట్ల ఆదాయం లభించనుంది. వ్యాపారులు సిండికేట్ కాకుండా పోటీపడి టెండరులో రేటు వేసి ఉంటే ప్రభుత్వానికి కనీసం రూ.50 కోట్లపైనే ఆదాయం లభించేదని ఆ రంగంలోని సీనియర్లు చెబుతున్నారు. నది నుంచి ఇసుక తవ్వేవిధానం ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లో ఉండడంతో అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ప్రభుత్వ రేటుపై క్యూబిక్ మీటరుకు రూ.16 అదనంగా వేశారు. మిగిలిన రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, రేటు ఎక్కువ వేయలేదు. కృష్ణానది దిగువ భాగం లోని రీచ్‌లన్నీ పాటదారులకు ఈ ఏడాది కోట్లు కురిపించను న్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం ఏడు రీచ్‌లకు 58 మంది టెండర్లు వేస్తే, అందులో 12 మంది అనర్హులయ్యారు. 46 మంది వ్యాపారుల దరఖాస్తులను పరిశీలించి ఏడురీచ్లను ఖరారు చేశారు. వీటి ద్వారా రూ.27.44 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. ఈ ప్రక్రియ తరు వాత కొత్త రీచ్‌ల్లో ఇసుక తవ్వకాల ప్రారంభానికి మరో పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఔను.. వాళ్లు ఒక్కటయ్యారు!
♦ సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు ♦ అసోసియేషన్ పేరుతో దందా ♦ రైతుకు ‘మట్టి’కొట్టేందుకు ఎత్తుగడ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వ్యాపారులంతా ఒక్కటయ్యారు. ప్రాజెక్ట్ నుంచి నల్లమట్టి తరలించే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పెంచి రైతులను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతకు ‘మట్టి’ కొట్టేందుకు ఆదివా రం సమావేశమైన వ్యాపారులు.. తెలంగాణ టిప్పర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అసోసియేషన్‌కు చెందిన పోస్టర్లను టిప్పర్లకు అతికించి మరీ నల్లమట్టిని తరలిస్తున్నారు. ఒక్కటైన వ్యాపారులంతా ఒకే ధరకు మట్టిని విక్రయించాలని నిబంధనలు విధించుకున్నారు. అంతే కాకుండా ధరల పట్టికను కూడా సిద్ధం చేశారు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి పోగేసిన డబ్బు ‘మట్టి’పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడే ఎందుకో..? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు రెండున్నర నెలలుగా నల్లమట్టిని రైతుల కోసమంటూ తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి భారం కాకుడదని ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా మట్టిని తరలించేందుకు అనుమతించారు. ఇన్నాళ్లు ఎవరికి వారే మట్టిని తరలించిన వ్యాపారులు సిండి‘కేటుగాళ్లు’గా మారారు. అంతా కలిసి అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అయితే, ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయని అసోసియేషన్ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ ఏర్పాటుకు ముందు అధికారులు ఎక్కడా నల్లమట్టి తరలింపును అడ్డుకోలేదు. మరి అలాంటప్పుడు ‘అసోసియేషన్’ ఎందుకో వ్యాపారులకే తెలియాలి. అసోసియేషన్‌కు సభ్యత్వ రుసుం.. తెలంగాణ టిప్పర్ అసోషియేషన్‌లో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. టిప్పరు రూ.1000, డంపర్‌కు రూ.2 వేల చొప్పున చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు సుమారు 150 వరకు టిప్పర్లు, డంపర్ల పేరుతో అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమేనా..?! ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలించేందుకు కొందరు వ్యాపారులు తమిళనాడు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చారు. దీంతో పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు తక్కువ ధరకే నల్లమట్టిని విక్రయించారు. దీనివల్ల రైతులకు కొంత ఊరట లభించింది. అయితే, పోటీ వల్ల దందా దెబ్బ తింటుందని భావించిన వ్యాపారులు.. ‘ఒకే ధర’ నిబంధనను అమలు చేసేందుకు అసోసియేషన్‌గా ఏర్పడినట్లు తెలిసింది. దీనివల్ల రైతులపై ధరాభారం పడనుంది. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా రైతుల పేరుతో మట్టి దందాకు శ్రీకారం చుట్టారు! పోస్టర్ ఉంటేనే.. సభ్యత్వం తీసుకున్న టిప్పర్లకు ‘తెలంగాణ టిప్పర్ అసోషియేషన్’కు చెందిన పోస్టర్లను అతికించారు. ఎస్సారెస్పీ నుంచి నల్ల మట్టి తరలించే ప్రతి టిప్పర్‌కు అసోసియేషన్ పోస్టర్ ఉండాలి. లేదంటే నల్లమట్టి తరలించేందుకు వీలు లేదనే నిబంధన పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టిని తరలించేందుకు ప్రాజెక్ట్ అధికారులకు సీనరేజ్ చెల్లించాలి. కానీ సీనరేజ్ చెల్లిస్తే ఆ భారం అంతిమంగా రైతుపైనే పడుతుందని చిలుక పలుకులు పలుకుతున్న వ్యాపారులకు.. అసోసియేషన్ సభ్యత్వ రుసుము భారం కూడా రైతులపైనే పడుతుందని తెలియదా..? -
మద్యం మాఫియా మహాదోపిడీ
జిల్లాలో అధికార పార్టీ లిక్కర్ సిండికేట్ వ్యవహారం మూడు ఫుల్‌బాటిళ్లు... ఆరు నిబ్బులుగా సాగిపోతోంది. అసలే పక్తూ మద్యం వ్యాపారులు...పైగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా.. దీంతో అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తం మద్యం దుకాణాలను గుప్పిటపట్టిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరిదీ. సిండికేట్‌గా ఏర్పడి దుకాణాల కేటాయింపులో చక్రం తిప్పారు. లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఇప్పుడు మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏకంగా నెలకు రూ.15కోట్లుపైగా కొల్లగొడుతున్నారు. - ధరల మాయాజాలం - ఎంఆర్పీ కంటే అధికంగా రేట్లు - అడ్డగోలుగా నెలకు రూ.15కోట్లు అవినీతి - ఇద్దరు ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఊళ్లు పంచుకున్న చందంగా జీవీఎంసీ, రూరల్ జిల్లాలను పంచేసుకున్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి సిండికేట్‌లో జీవీఎంసీ పరిధిలో 169 దుకాణాల్లో వందకుపైగా దుకాణాలున్నాయి. తొలిసారి ఎన్నికైన మరో ప్రజాప్రతినిధి కుటుంబ సిండికేట్‌లో రూరల్ జిల్లాలో మద్యం దుకాణాలు ఉన్నాయి. 198 మద్యం దుకాణాల్లో 125 వరకు ఆ ప్రజాప్రతినిధి చెప్పిందే సాగుతోంది. వేలం నోటిఫికేషన్ నుంచే కథ నడిపి అంతా తాము అనుకున్నట్లు చేసుకోగలిగారు. వ్యూహాత్మకంగా దుకాణాలను గుప్పిట్లో పెట్టుకున్న ఆ ఇద్దరు తాజాగా అసలు కథకు తెరతీశారు. మద్యం గరిష్ట ధర(ఎంఆర్పీ) కంటే 10శాతం నుంచి 15శాతం వరకు ఎక్కువగా ధరలు పెంచేశారు. దుకాణాలన్నీ వారి చేతుల్లోనే ఉండటంతో వారు చెప్పిందే ధరగా మారింది. బీరు బాటిల్ మీద రూ.20 అధికంగా అమ్ముతున్నారు. బ్రాండ్లను బట్టి విస్కీ, రమ్ము, ఇతర మద్యాన్ని క్వార్టర్ బాటిల్మీద రూ.10, ఆఫ్బాటిల్ మీద రూ.15, ఫుల్‌బాటిల్ మీద రూ.25వరకు అధికంగా విక్రయిస్తున్నారు. ఇందులో ఏముందిలో అనుకుంటున్నారేమో!... చిన్న విషయమేమీ కాదు. జిల్లాలో అధికారికంగా 367 దుకాణాలున్నాయి. జిల్లాలో నెలకు రూ.110కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం నెలకు జీవీఎంసీ పరిధిలో రూ. 69కోట్లు, రూరల్ జిల్లాలో రూ.41కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎంఆర్పీ కంటే ధరలు పెంచేయడంతో జీవీఎంసీ పరిధిలోనే నెలకు అక్రమంగా రూ.9కోట్లు వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో నెలకు రూ.6కోట్ల వరకు అధికంగా గుంజుతున్నారు. ఆ లెక్కన నెలకు జిల్లాలో రూ.15కోట్లు అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఏడాదికి మద్యం విక్రయాల్లో రూ.180కోట్ల అవినీతి యథేచ్ఛగా సాగిపోతోంది. ఇదంతా అధికారిక మద్యం దుకాణాల్లో విక్రయాల్లో జరుగుతున్న అవినీతి. బెల్టు దుకాణాలకు వచ్చేసరికి మద్యం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ ఇష్టానుసారంగా ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కిమ్మనడం లేదు. కనీసం అటువైపు చూడటమే లేదు. ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిండికేట్‌ను నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యమే. వారు చేసింది చూడటం... ఇచ్చింది తీసుకోవడం అన్న తీరుగా వ్యవహరిస్తోంది. -
పోలీస్ vs వ్యాపారులు
మామూళ్ల పంచాయితీ నగరంలో 55 మద్యం షాపులు, 117 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిల్లో విక్రయాలు, పనివేళలు, పార్కింగ్ విషయాల్లో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. ఇందుకుగాను వ్యాపారులు వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెబుతారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడీ విషయంలో ఇరువర్గాల మధ్య పంచాయితీ నడుస్తోంది. విజయవాడ సిటీ : పోలీసు అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య మామూళ్ల పంచాయితీ నడుస్తోంది. ఇప్పటివరకు ఇస్తున్నట్లే షాపుల నుంచి నేరుగా నెలవారీ మామూళ్ల కోసం పోలీసు అధికారులు పట్టుబడుతుంటే.. సిండికేట్ ద్వారా ఇస్తామంటూ మద్యం వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. దీనికి ససేమిరా అంటున్న పోలీసు అధికారులు పార్కింగ్, నిర్దేశిత వేళలు, బహిరంగ మద్య సేవనంపై హడావుడికి తెరతీశారు. ఈ పరిస్థితి కొనసాగితే ఇద్దరికీ నష్టమేనంటూ ఇరువర్గాల పెద్దల అభిప్రాయం. వివాదం ముదరకుండా చూసేందుకు చర్చలు సాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొద్ది రోజుల్లో వీరి మధ్య వివాదానికి తెరదించి సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో 55 మద్యం షాపులు, 117 రెస్టారెంట్ అండ్ బార్లు ఉన్నాయి. వీటిని చూసీ చూడనట్లుగా వ్యవహరించినందుకు పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలి. లేదంటే నిబంధనలను సాకుగా చూపించి పోలీసులు హడావుడి చేస్తారు. రానున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కూడా పోలీసుల ఆదేశాలను పాటించి మామూళ్లు ముట్టచెబుతుంటారు. కొత్తగా లెసైన్స్‌లు మంజూరైన మద్యం వ్యాపారులతో కుదిరే అవగాహన కోసం బార్ల్ల నిర్వాహకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదీ జరిగింది.. నగరంలో 55 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఆరు షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా మిగిలిన 49 ప్రైవేటు వ్యక్తులవి. రాజకీయ నేతలు భాగస్వాములుగా ఉన్న సిండికేట్లకు ఎక్కువ ప్రైవేటు షాపులు దక్కాయి. ఇప్పటివరకు షాపు ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు షాపు యజమానులు పోలీసు స్టేషన్‌కి ముట్టచెప్పారు. కొత్త షాపులు దక్కిన వారిలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నందున అంతంత మొత్తాల్లో మామూళ్లు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. పెరిగిన అద్దెలు, ఉద్యోగుల జీతాలు, నెలవారీ వడ్డీలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే తగ్గించి ఇవ్వాలనేది వీరి నిర్ణయం. విడిగా ఇవ్వడం వలన సాధ్యపడదని భావించిన మద్యం వ్యాపారులు సిండికేట్ ద్వారా మంత్లీ మామూలు నిర్ణయించి శ్లాబు (అన్ని చోట్లా ఒకే రేటు) విధానం అమలులోకి తేవాలనేది నిర్ణయంగా ఉంది. దీనికి పోలీసు అధికారులు అంగీకరించడం లేదు. గత అనుభవాల దృష్ట్యానే.. సిండికేట్ ద్వారా మామూళ్లు తీసుకునేందుకు పోలీసు అధికారులు నిరాకరించడానికి కారణం గత అనుభవాలేనని తెలిసింది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆధిపత్యపోరులో మద్యం వ్యాపారంపై ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో సిండికేట్ల ద్వారా మంత్లీ మామూళ్లు తీసుకునే పోలీసు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. సిండికేట్ చిట్టాల్లో పలువురు అధికారుల పేర్లు ఉండటంలో కేసులు నమోదు చేశారు. ఇంకా కేసు విచారణ సాగుతోంది. సిండికేట్ల ద్వారా తీసుకోవడం వల్లే ఇది జరిగిందనేది ఇప్పుడు అధికారుల అభిప్రాయం. ఇదే నేరుగా తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనా పేర్లు వెలుగులోకి రావనేది వారి భావన. -
కిక్కు షురూ..
నెల్లూరు(క్రైమ్): మద్యం కిక్కు షురూ అయింది. 2015 -17 ఆబ్కారీ సంవత్సరానికి లెసైన్సులు పొందిన వ్యాపారుల్లో 50 శాతం మందికి పైగా బుధవారం అరకొర వసతుల నడుమే మద్యం దుకాణాలను ప్రారంభిం చారు. కొత్త భవనాల కోసం వెతుకులాడటం వల్ల సమ యం వృథా అవుతుందని పాత దుకాణాల్లోనే అమ్మకాలు మొదలుపెట్టారు. కొందరు సెంటిమెంట్ కోసం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా పర్వాలేదని కొత్త భవనాల కోసం వెతుకులాట ప్రారంభించారు. 2014-15 గడువు మంగళవారం అర్థరాత్రి ముగిసింది. జిల్లాలోని 313 మద్యం దుకాణాలకు గత నెల 29వ తేదీన లాటరీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే. నూతన హంగులతో.... మందుబాబులను ఆకట్టుకొనేందుకు మద్యం వ్యాపారు లు దుకాణాలను నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మద్యం సేవించేలా సిట్టింగ్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే తినేందుకు వివిధరకాలైన ఆహారపదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. విక్రయాల్లో అక్రమాలను నిరోధించేందుకు స్కానర్లు తదితరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. పలు దుకాణాల్లో మద్యం నిల్.... బుధవారం పలు దుకాణాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు వ్యాపారులు ఐఎంఎల్‌డిపో నుంచి సకాలంలో మద్యం తీసుకొచ్చుకోవడంతో ఉదయం నుంచే విక్రయాలు ప్రారంభించారు. కొందరికి ఆలస్యం కావడంతో ఆ దుకాణాల్లో మద్యం అందుబాటులో లేకుండాపోయిం ది. తొలిరోజు కావడంతో వ్యాపారులు అన్నీ సమకూర్చుకొనే పనిలో ఉండటంతో మద్యం తాగేందుకు సరైన వసతుల్లేక మందుబాబులు బహిరంగ మద్యపానం చేశారు. ఐఎంఎల్ డిపో వద్ద సందడి తొలిరోజు కావడంతో తె ల్లవారుజామునే అధికశాతం మంది మద్యం వ్యాపారులు దేవరపాలెంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్(ఏపీఎస్‌బీసీఎల్)కు చెందిన ఐఎంఎల్ డిపోకు చేరుకున్నారు. అక్కడ నగదు డిపాజిట్ చేసి ప్రత్యేక వాహనాల్లో మద్యంను దుకాణాలకు తరలించారు. దీంతో దేవరపాలెంలో మద్యం వ్యాపారులు, వివిధ మద్యం కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సందడిగా మారింది. మద్యం లారీలు ఐఎంఎల్‌డిపో వద్ద బారులు తీరాయి. ఎమ్మార్పీ అమలు జరిగేనా? ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు సాగించాలని, బెల్టుషాపులను ఉపేక్షించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే వీటి అమలు సాధ్యమేనా? అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. గతంలోనూ ఇదే తరహాలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోలేదు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడడంతో పాటు బెల్టుషాపుల్లో మద్యం ఏరులై పారింది. ఈ విషయం ఆబ్కారీ శాఖ అధికారులకు తెలిసినా ముడుపులు పుచ్చుకొని మొక్కుబడి దాడులు చేశారని విమర్శలున్నాయి. ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ బిల్లింగ్, స్కానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినా అమలుకు నోచుకోలేదు. దేవుళ్ల పేర్లు పెట్టడకూడదని, హైవేకి దూరంగా ఉండాలని నిబంధనలు పాటించాల్సి ఉంది. వీటి గురించి ఎక్సైజ్ అధికారులతో మాట్లాడగా ఈసారి నుంచి తప్పకుండా ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. -
ధరల ‘కిక్కు’
ధరల కిక్కుతో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ప్రివిలేజ్ ఫీజు పేరుతో అదనపు వసూళ్లకు దిగారు. వ్యాపారులంతా సిండికేటై దోపిడీకి పూనుకున్నారు. షాపుల్లో ఉన్న ధరల పట్టికను సైతం పక్కకు పడేసి యథేచ్ఛగా అదనపు ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుటే అదనపు ధరల దోపిడీ కనబడుతున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మద్యం వ్యాపారులు బరి తెగించారు. లెసైన్స్ గడువు ముగుస్తుండటంతో అంతా సిండికేట్ అయ్యి ధరలు పెంచేశారు. ఏ బ్రాండ్ అయినా ఒక్కో ఫుల్‌బాటిల్‌కు రూ.20 నుంచి 30 వరకు అదనంగా రేటు పెంచి అమ్ముతుండటంతో మందుబాబుల జేబుకు భారీగానే చిల్లు పడుతోంది. దండిగా మామూళ్లు అందుకుంటున్న ఎక్సైజ్ అధికారులు రెట్టింపు వ్యాపారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వినపడుతున్నాయి. జిల్లాలో ప్రతినెల రూ.50 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ఈ అదనపు బాదుడుతో మందుబాబులు మరో రూ.10 కోట్లు వదిలించుకోక తప్పదు. జూన్ 30వ తేదీతో వైన్ షాపుల లెసైన్స్ గడువు ముగియనుండటంతో మద్యం దుకాణాలు రెట్టింపు ధరలతో ఊగిపోతున్నాయి. ‘ప్రివిలేజ్’ దెబ్బకు సిండికేట్ విరుగుడు జిల్లాలో మొత్తం 148 లెసైన్స్డ్ వైన్ షాపులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.50 కోట్ల మద్యం వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వం ఏడాది కాలపరిమితో జారీ చేసిన లెసైన్స్ గడువు వచ్చే నెలాఖరుతో ముగస్తుంది. ప్రభుత్వం షాపుల యజమానుల అదనపు ఆదాయానికి గండి పెడుతూ ప్రివిలేజ్ (నిర్దేశించిన దానికన్నా ఎక్కువ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి చెల్లించేది) ఫీజు విధించింది. దీని ప్రకారం మద్యం అమ్మకాలపై లాభాల రేటు కాస్తా అటు ఇటుగా 17 శాతం లభించనుంది. లెసైన్స్‌ల జారీ సమయంలో నిర్ణీత లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు సాగించినా షాపు యజమానులకు లాభాల్లో కోత పెట్టే సరికొత్త నిబంధనను దీంట్లో చేర్చారు. జిల్లాలో ఇప్పటికే అన్ని వైన్ షాపులు ఈ ప్రివిలేజ్ ఫీజు పరిధిలోకి వచ్చాయి. ఒక్కసారిగా లాభాలు పడిపోయాయనుకున్న వ్యాపారులు ఈ అదనపు అమ్మకాల వ్యవహారానికి ప్లాన్ వేసి సిండికేట్ అయ్యారు. ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై చివరి మూడు నెలల పాటు తాము ఇష్టమొచ్చినట్లు అమ్ముకునే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంటే 40 రోజుల తర్వాత తమ లెసైన్స్ ఉంటుందో..? ఊడుతుందోనన్న ఆలోచనకు వచ్చిన వైన్స్ యజమానులు అదనపు రేట్లకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ ఏదైనా రూ.20 నుంచి 30 వరకు, బీర్లకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు లెసైన్స్ పొందిన వ్యాపారులు మార్చి వరకు జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ నుంచి ఏకంగా ఈ ధరల పట్టికను దుకాణదారులు తీయించి వేయటం గమనార్హం. నగరంలోనే యథేచ్ఛగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎక్సైజ్ సిబ్బంది మాత్రం తమ దృష్టికి ఫిర్యాదులు రాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే లెసైన్స్ జారీలో ప్రభుత్వం ఇదే తరహా లాటరీ ద్వారా కేటాయిస్తుందో..? ప్రభుత్వమే అమ్మకాలకు దిగుతుందో..? తెలియని పరిస్థితుల్లో మద్యం వ్యాపారులు దీపం ఉండగానే ఇల్లుచక్క బెట్టుకునే పనిలో పడ్డారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో తారా స్థాయిలో అమ్మకాలు సాగాయి. ఇప్పుడు అలాంటివేవి లేకపోవడం.. పైగా ప్రివిలేజ్ ఫీజు విధించటంతో మద్యం వ్యాపారులు సిండికేట్‌కు తెరదీశారు. ఏప్రిల్ నుంచి కేసులే లేవట..! ఎమ్మార్పీ రేట్ల కన్నా అధిక ధరకు వైన్స్ యజమానులు మద్యం విక్రరుుస్తున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గత ఏడాది జూలై 1 నుంచి మార్చి చివరి వరకు 37 కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. అన్ని దుకాణాల్లో ఎమ్మార్పీ రేట్ల అమ్మకాలను యజమానులు భేఖాతర్ చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు కనీసం దాడులు కూడా చేయకపోవడం గమనార్హం. పట్టణాల్లో సిండికేట్‌తో అదనంగా వసూళ్లు చేస్తుండగా గ్రామాల్లోని బెల్టు షాపులోనూ రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. లెసైన్స్ ముగింపు గడువు సమీపిస్తుండడంతో వచ్చే నెలలో రూ.5 అదనంగా ఫుల్‌బాటిల్, బీరుకు పెంచాలన్న యోచనలో మద్యం వ్యాపారులు ముందడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు మహేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్, ఎక్త్సెజ్ శాఖ జిల్లాలో ఎమ్మార్పీ రేట్ల కన్నా మద్యం అధిక ధరలకు విక్రయిస్తే సదరు షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం కొనుగోలు చేసేవారు ఏ షాపులోనైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆయా సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో అన్ని స్టేషన్లను ఈ మేరకు ఆదేశించాం. -
చెరువులకు లెస్ రహదారులకు ప్లస్
నల్లగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చెరువుల పున రుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులకు తీవ్ర పోటీ ఏర్పడింది. చాలాకాలం తర్వాత రహదారులు, చెరువుల పనులకు మోక్షం లభించడంతో కాంట్రాక్టర్లు సంబరపడ్డారు. అయితే రహదారుల పనులు దక్కించుకోవడంలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. అదే మిషన్ కాకతీయ విషయానికొస్తే కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు. దీంతో చెరువుల పునరుద్ధరణ పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యత సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతూనే ఉంది. కానీ మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు పోటీపడి మరీ బినామీ వ్యక్తులతో తక్కువ రేట్లకు టెండర్లు వేయించారు. ఇదిలాఉంటే పంచాయతీరాజ్ (పీఆర్), ఆర్ అండ్‌బీ పనులకు మాత్రం సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. పీఆర్ పనుల్లో కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కుదరగా...కొన్ని పనులకు ఎక్కువ (ఎక్సెస్) రేట్లను కూడా కోడ్ చేశారు. ఆర్అండ్బీ అధికారులు పనుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు పనుల వివ రాలు బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు తెలిసింది. లెస్..లెస్..లెస్... చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలి విడత జిల్లాలో 952 చెరువులు ఎంపిక చేశారు. దీంట్లో 119 చెరువుల్లో నీళ్లు ఉండడంతో వాటిని మినహాయించి మిగిలిన 833 చెరువులకు ప్రతిపాదనలు రూపొం దించి ప్రభుత్వానికి పంపారు. 609 చెరువుల పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 469 చెరువుల పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.177 కోట్లు. ఈ మొత్తం 469 చెరువుల్లో 352 చెరువుల పనులు రూ.50 లక్షల లోపు అంచనా వ్యయంతో ఉన్నవి. ఈ చెరువుల పనులకే ఎక్కువ పో టీ ఎదురైంది. ఒక్కో చెరువుకు 6 నుంచి 14 మంది వరకు టెండర్లు వేశారు. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు కావడంతో పనులు ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో 18 నుంచి 20 శాతం వరకు తక్కువ (లెస్) రే ట్లు కోడ్ చేశారు. ఇక రూ.50 లక్షల పైబడి ఉన్న 117 పనులకు కాంట్రాక్టర్లు సిండి కేట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్కో పనికి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే టెండర్లు వేశారు. 2-3 శాతానికే తక్కువ రేట్లు కోడ్ చేశారు. నల్లగొండ డివిజన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఎక్సెస్ రేట్లను కూడా కోడ్ చేసినట్లు తెలిసింది. పనులు ఎలా సాధ్యం..? చెరువు పనులకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలు మాత్రం లాభదాయకంగా లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ సహాయంతో చెరువుల్లో మట్టి తవ్వేందుకు మాత్రమే ధర నిర్ణయించారు. కానీ తవ్విన మట్టిన త రలించేందుకు ధర నిర్ణయించలేదు. ఈ మట్టిని వ్యవసాయ భూముల్లో చల్లేందుకు రైతులే స్వచ్ఛందంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ రైతులు ముందుకు వచ్చినా కూలీలకు డబ్బులు ఎవరు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకం. ఇక పనులు జరుగుతున్న తీరును ఎప్పటిక ప్పుడు ఫొటోల తీసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి అప్లోడ్ చేయాలి. నాణ్యతలో రాజీపడకుండా పనులు జరగాలని ప్రభుత్వం చెబుతుంది కానీ..కాంట్రాక్టర్లు ఇంత భారీ స్థాయిలో లెస్‌లకు వెళ్లారు కాబట్టి పనులు చేయడం సాధ్యం కాదని అధికారులే అంటుండడం గమనార్హం. పీఆర్ కాంట్రాక్టర్లదే గుత్తాధిపత్యం... పంచాయతీరాజ్ శాఖ ఎం.ఆర్.ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద జిల్లాకు 408 పనులు మంజూరు చేసింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.207 కోట్లు. ఈ మొత్తం పనులను 59 ప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. గతేడాది నవంబర్లోనే టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికి కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు సాగిన నేపథ్యంలో ఫిబ్రవరి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాల్సి వచ్చింది. ఈ పనులన్నీ హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టాల్సి ఉండటంతో పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా పోయింది. జిల్లాలో హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు 38 మంది ఉన్నారు. దీంతో ఈ 38 కన్స్ట్రక్షన్ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఎవరి పరిధిలోకి వచ్చే పనులకు మరొకరిని రానివ్వకుండా సింగిల్ టెండర్లు వేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ రేట్లు కోడ్ చేస్తే టెండర్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధార ణ రేట్ల ప్రకారం తక్కువ మోతాదులో ధరలు కోడ్ చేశారు. 0.01 శాతం నుంచి 6.66 శాతం వరకు లెస్ కోడ్ చేసి పనులు దక్కించుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న పనులకు మాత్రం ఎక్సెస్ రేట్లు కోడ్ చేశారు. ఇప్పటి వరకు 353 పనుల టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనుల అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఒకటి, రెండు ప్యాకేజీలు మినహా మిగిలిన వాటికి ఒకటే టెండరు దాఖలు కావడాన్ని బట్టి పరిశీలిస్తే...బడా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టెండర్లు నోటిఫికేషన్ వెలువడగానే కాంట్రాక్టర్లు తొలుత ముందుకు రాలేదు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సంస్థలను చర్చలకు రప్పించి..వారిని మెప్పించిన తర్వాతే టెండర్లు ప్రక్రియ వేగం పుంజుకుంది. నవంబర్‌లో టెండర్లు పూర్తయి డిసెంబర్లో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి ఇప్పటి వరకు ఇంకా టెండర్లు ప్రక్రియ కొనసాగుతుందంటే కాంట్రాక్టర్ల ప్రభావం ప్రభుత్వంపై బలంగానే పనిచేసినట్లు స్పష్టమవుతోంది. మిషన్ కాకతీయ పనుల్లో లెస్‌లు కోడ్ చేస్తుంటే...రహదారుల పనుల్లో మాత్రం కాంట్రాక్టర్లు సిండికేట్ కావడం...ఎక్సెస్ రేట్లు కోడ్ చేయడం...దానికి ప్రభుత్వం అండదండలు ఉండటం గమనార్హం. ఎక్సెస్ రేట్లతో పనులు దక్కించుకున్న సంస్థలు... మండలం కన్స్ట్రక్షన్ సంస్థ కోడ్ చేసింది పనివిలువ గుండాల జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 3.23 కోట్లు మోతె ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 5.64 కోట్లు చింతపల్లి సుజనా కన్స్ట్రక్షన్స్ 0.00 శాతం రూ.4.02 కోట్లు మునగాల బీపీఎస్సీ ఇన్ఫ్రా ప్రాజెక్టు 3.75 శాతం రూ.95 లక్షలు నడిగూడెం సత్యనారాయణస్టోన్ అండ్క్రషర్స్ 4.99 శాతం రూ.2.24 కోట్లు నార్కట్‌పల్లి చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్టు 0.8 శాతం రూ.4.71 కోట్లు పెన్‌పహాడ్ ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 0.00శాతం రూ.92 లక్షలు ఆత్మకూరు(ఎస్) ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 0 శాతం రూ.1.82 కోట్లు అర్వపల్లి బీపీఎస్సీ ఇన్ ఫ్రా ప్రాజెక్టు 3.14 శాతం రూ.2.85 కోట్లు మోత్కూరు జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ.3.56 కోట్లు -
ఎక్సైజ్ దోపిడీ!
సాక్షి, గుంటూరు : జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అందిన కాడికి దోచేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి మద్యం సిండికేట్లతో కుమ్మక్కై వాటాలు అందుకుంటున్నారని వినిపిస్తున్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని, ఎక్కడా బెల్టుషాపులు ఉండకూడదనే నిబంధనలు జిల్లాలో అమలవుతున్నట్టు కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలకు ప్రస్తుతం 313 షాపులు నడుస్తున్నాయి. గుంటూరులోని మద్యం దుకాణదారులు క్వార్టర్ బాటిల్ ధరపై పది రూపాయల వరకు అధిక ంగా వసూలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 25 నుంచి రూ. 30 వరకు అధికంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.కొత్త మద్యం విధానం ద్వారా దుకాణాలు కేటాయించిన ప్రభుత్వం ఎమ్మార్పీకి విక్రయాలు జరపాలని నిబంధన పెట్టినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీని కాదని అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనికి ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని ఎక్కడైనా మందుబాబులు హడావుడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండులను పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని కొత్తరకం బ్రాండ్లను బయటకు తీసి అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు అలవాటు పడిన బ్రాండ్ మద్యం మాత్రమే తాగుతారని తెలిసిన వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం వసూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్ వద్ద బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మగా వచ్చే లాభాల్లో తమకూ వాటా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. తమపై అధికారులకు నెలవారీ పంపాలంటూ మద్యం దుకాణాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో బెల్టు షాపులు ... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తూ చేసిన సంత కానికి విలువ లేకుండాపోయింది. నేటికీ అనేక గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ షాపులను తొలగించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలకు చెందిన మద్యం దుకాణాలు ఉండడంతో అధికారులు వాటి జోలి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు... మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల అనంతరం షట్టర్లకు తాళాలు వేసి దొడ్డి గుమ్మం నుంచి విక్రయాలు జరుపుతున్నారు. ఏ సమయంలో అమ్మితే మాకేంటి అనుకున్నారేమోగానీ ఎక్సైజ్ అధికారులు ఫోన్లు పక్కన పడేసి హాయిగా నిద్దరోతున్నారు. కొందరు పోలీసులు సైతం నెలవారీ సొమ్ములకు కక్కుర్తి పడి చూసీచూడనట్టు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రి వేళ నిబంధనలతో పనిలేకుండా మద్యం విక్రయాలు జరుపుకునేందుకు వ్యాపారులు పోలీసు శాఖలో జీపు డ్రైవర్ నుంచి అధికారి స్థాయి వరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రతినెలా అందజేస్తున్నట్లు సమాచారం. -
మందుల ముఠా
సాక్షి, హన్మకొండ : ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా... నాణ్యత ప్రమాణాలపై నిఘా పెట్టేలా ప్రభుత్వం ఔషధ ధరల నియంత్రణ చట్టం తెచ్చింది. దీనికి మెడికల్ స్టోర్స్ యజమానులు తూట్లు పొడుస్తున్నారు. ముఠాగా ఏర్పడి చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోగాల ఆసరాతో సరికొత్త ఎత్తుగడలతో రోగుల జేబులకు చిల్లులు పెడు తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మెడికల్ సిండికేట్ కారణంగా ఆస్పత్రుల పాలైన రోగులు మందులు కొనేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒకే నాణ్యతా ప్రమాణాలతో తయారైన వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లో హెచ్చుతగ్గులతో ఉంటాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఉత్పత్తి సంస్థలు ధరల్లో ఈ తేడాను పాటిస్తాయి. వినియోగదారులకు తమ కొనుగోలు శక్తి ఆధారంగా వస్తువులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మెడికల్ దుకాణదారుల సిండికేట్ కారణంగా జిల్లాలో ఔషధాలు కొనుగోలు చేసే రోగులకు ఈ స్వేచ్ఛ లేకుండా పోయింది. మెడికల్ షాప్ నిర్వాహకులందరూ కలిసి ఎక్కడా... మందుల ధర తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్లో ఎవరైనా తక్కువ ధరకు ఔషధాలను అమ్మేందుకు ప్రయత్నిస్తే... వారికి జరిమానా వేస్తున్నారు. అంతేకాదు... తక్కువ ధరకు ఔషధాలు అమ్మే మెడికల్ షాప్‌లకు మందులు సరఫరా చేయొద్దని మెడికల్ ఏజెన్సీలకు హుకుం జారీ చేస్తున్నారు. మాట వినకుంటే వారి ఉత్పత్తులను జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బ్యాన్ చేస్తున్నారు. బెదిరింపుల పర్వం ఏడాది కిందట ఎక్కువ డిస్కౌంట్ ఇస్తూ తక్కువ ధరకు ఔషధాలను అమ్ముతామంటూ నగరంలో ఓ మెడికల్ దుకాణం వెలిసింది. నగరంలో మిగిలిన మెడికల్ షాప్‌లలో కంటే తక్కువ ధరకు మందులు అమ్ముతుండడంతో రోగులు దీన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెడికల్ దుకాణాల సిండికేట్ ముఠా కన్ను దీనిపై పడింది. ఇలా అయితే తమ వ్యాపారం దెబ్బతిన్నట్లేనని భావించి సదరు ఔషధ విక్రయ దుకాణంపై కన్నెర్ర చేసింది. ఆ మెడికల్ స్టోర్‌కు మందులు సరఫరా చేయొద్దని వరంగల్ నగరంలో హోల్‌సేల్ ధరకు ఔషధాలు అమ్మే మెడికల్ స్టాకిస్టులు, ఏజెన్సీల నిర్వాహకులను ఆదేశించింది. ముఠా మాట వినకుండా ఈ దుకాణానికి మందులు సరఫరా చేసినందుకు నలుగురు మెడికల్ స్టాకిస్టులకు ఇటీవల భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది. అంతేకాకుండా... రోగులకు డిస్కౌంట్ ఇస్తున్న మెడికల్ స్టోర్‌కు మందులు సరఫరా చేసే ఏజెన్సీకి సంబంధించిన ఔషధాలను జిల్లావ్యాప్తంగా బ్యాన్ చేయించింది. ఈ వ్యవహారాలను రాతపూర్వకంగా చేపడితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో... ఫోన్లలోనే బెదిరింపుల పర్వం కొనసాగిస్తోంది. వీరి బెదిరింపులకు భయపడి సదరు మెడికల్ స్టోర్‌కు మందులు సరఫరా చేసేందుకు స్టాకిస్టులు, ఏజెన్సీలు వెనకడుగు వేశాయి. దీంతో ఈ దుకాణాదారు హైదరాబాద్ నుంచి మందులు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. పన్ను ఎగవేతలు కూడా... జిల్లా వ్యాప్తంగా 2,500 మెడికల్ షాప్‌లు ఉండగా... వీటిలో సగానికి పైగా షాపుల్లో కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వడం లేదు. కేవలం తెల్లకాగితాలు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ వె నుకవైపు బిల్లులు రాసి ఇస్తున్నారు. దీనివల్ల మెడికల్ షాప్‌ల నిర్వాహకులు ప్రభుత్వానికి చె ల్లించాల్సిన పన్ను తగ్గుతోంది. అంతేకాదు... మందుల తయారీదారులు ఇచ్చే డిస్కౌంట్లు సైతం గాల్లో కొట్టుకుపోతున్నాయి. మొత్తానికి మెడికల్ సిండికేట్వ్యవహారం కారణంగా జిల్లాలో ఔషధాల ధరలు చుక్కలనంటుతున్నాయి. -
సందు చూసి..
పండుగ పూట వైన్ షాపుల దందా బెల్ట్ షాపులకు మందు డోర్ డెలివరీ ఎక్సైజ్ అండదండలతో వ్యాపారుల ఇష్టారాజ్యం ధనదాహంతో నిబంధనలకు తిలోదకాలు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం సాక్షి ప్రతినిధి, వరంగల్ : దసరాకు ముందే పల్లెలను మత్తులో ముంచెత్తి... జేబులు నింపుకునేలా మద్యం వ్యాపారులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని వైన్‌షాపుల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి.. ట్రాలీ ఆటోలతో మద్యం సీసాలను నేరుగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలన్న చందంగా కొనసాగుతోంది. అంతేకాదు... మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ అధికారు లు విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. ప్రభుత్వం అధికారికంగా కేటాయించి న వైన్ షాపులు, బార్లలోనే మద్యం అమ్మకాలు జరగాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నిబంధనలకు ఎక్సైజ్ శాఖ అధికారులే పాతర వేస్తున్నారు. బెల్ట్ షాపుల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన వారు... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం తెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. వైన్‌షాపుల నుంచి బెల్ట్ షాపులకు ఆటోల్లో మద్యం సరఫరా దందా వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఎక్కువగా జరుగుతోంది. వర్ధన్నపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని మండలాల్లో ఈ రకమైన దందా ఇంకా ఎక్కువగా ఉంది. దీనిపై పలువురు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. సిండికేట్‌గా మారి... వర్ధన్నపేట మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు, ఇదే మండలంలోని ఇల్లంద, పంథిని, ఐనవోలు గ్రామాల్లో ఒకటి చొప్పున వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 1 నుంచి ఈ ఆరు వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. వైన్ షాపులు తెరుస్తూనే నీళ్లు కలిపిన మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయించడం మొదలుపెట్టారు. దీనికి ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తారుు. చివరకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఒక వైన్ షాపులో తనిఖీ చేసి మూసివేశారు. సదరు నిర్వాహకుడు ఫైన్ చెల్లించి... ఆ షాపును మళ్లీ తెరిచాడు. ఆరు షాపుల్లో పోటీ వల్ల దాడులు జరిగాయని భావించి... అన్ని షాపుల యజమానులు ఒక్కటయ్యారు. ఆరు వైన్ షాపులకు వచ్చిన మద్యాన్ని ఒకే గోదాంలో పెట్టి... ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆరు వైన్ షాపులకు సంబంధించిన అమ్మకాల్లో వాటా ఎలా అనే దానికి కొత్త ఉపాయం రచించారు. ఆరు వైన్ షాపుల సరుకులో ఏ మద్యం సీసా ఎవరిది అనే దాన్ని గుర్తించేందుకు ఆయా వైన్ షాపుల పేరులో మొదటి అక్షరంతో స్టిక్కర్లను ముద్రించారు. వీటి ఆధారంగా అమ్మకాలకు సంబంధించిన డబ్బులు పంచుకుంటున్నారు. ఎక్సైజ్ పని మారింది... బెల్ట్ షాపులను నియంత్రణను పక్కనబెట్టిన ఎక్సైజ్ శాఖ కొత్త రకమైన విధులను చేపట్టింది. బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నది ఆయా ప్రాంతాలకు చెందిన వైన్ షాపుల మద్యం సీసాలేనా అని మాత్రమే చూస్తోంది. తనిఖీకి వచ్చిన అధికారులు బెల్ట్ షాపును మూసివేయకుండా... వెళ్తూ వెళ్తూ ఒకటిరెండు ఖరీదైన మద్యం సీసాలు తీసుకెళ్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమాలకు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్దతు ఇస్తుండడంతో... మద్యం వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే దసరా సీజన్లో ఇష్టారాజ్యంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.