Tata Sons
-
చిప్ ప్రాజెక్టుల కోసం మాతోనే టాటా గ్రూప్ జట్టు ..
ముంబై: సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికల్లో ఉన్న టాటా సన్స్ తమ దేశాన్ని కీలక భాగస్వామిగా ఎంచుకుంటుందని సింగపూర్ ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ దేశంగా తమకు పేరుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపింది. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం సింగపూర్ హోమ్ అఫైర్స్ శాఖ మంత్రి కె. షణ్ముగం ఈ విషయాలు తెలిపారు. సమావేశంలో సెమీకండక్టర్లపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తిలో 20 శాతం వాటా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. చిన్న దేశమే అయినప్పటికీ తమ దేశంలో 25 సెమీకండక్టర్ల ఫౌండ్రీలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, దాదాపు అయిదు దశాబ్దాలుగా సింగపూర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ తమతో జట్టు కట్టగలదని షణ్ముగం చెప్పారు. టాటా గ్రూప్ రూ. 91 వేల కోట్లతో గుజరాత్లో, రూ. 27,000 కోట్లతో అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) చేతులు కలిపింది. -
నోయల్ టాటా ఎంట్రీ: ఒకేసారి రెండు బోర్డులలో..
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.ఎవరీ నోయల్ టాటానోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. -
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయం
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. ఆయన తనకు గొప్ప మిత్రుడు, గురువు, మార్గదర్శకుడు అని చెప్పారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారని చెప్పారు. మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, జంతు సంరక్షణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. రతన్ టాటా కుటుంబానికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. ‘రతన్ టాటా ఒక టైటాన్’ అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్‡్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వివిధ రంగాలలో రతన్ టాటా సంస్థలు సంపదలో 65% విరాళం రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్‌గా సేవలందించారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనితరసాధ్యుడు..బాల్యం..విద్యాభ్యాసం.. పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. 100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎల్రక్టానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే. వితరణశీలి.. ఇన్వెస్టరు.. రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. శ్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.పురస్కారాలుపారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు. సిమీ గ్రేవాల్‌తో అనుబంధం..రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్‌తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.మిస్త్రీతో వివాదం..టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. ఆయన మార్గదర్శకత్వం అమూల్యం ఆనంద్ మహీంద్రా రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేక పోతున్నా. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందడుగులో ఉంది. మనం ఈ స్థానంలో ఉండటానికి రతన్ జీవితం, పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉంది. ఈ సమయంలో అతని మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్ధిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్‌కి మరణం లేదు.దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త ప్రధాని నరేంద్ర మోదీ రతన్ టాటా దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త. దయార్ధ్ర హృదయం కలిగిన అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఇదే సమయంలో ఇతని సహకారం బోర్డు రూమ్‌ను మించిపోయింది. ఎంతో మందికి ఆప్తుడయ్యారు.లక్షలాది మంది జీవితాలను తాకిన దాతృత్వంరతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాము. ఎంతో మందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూప్‌కు.. ఆయన చైర్పర్సన్ కంటే ఎక్కువ. వ్యాపార వేత్తలందరికీ ఆయన ఓ దిక్సూచి. టాటా దాతృత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ని ఇష్టపడే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్‌గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్‌కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దేశంలో అత్యధిక వేతనం.. ఈయనదే..
దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్‌లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు.చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్‌లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్‌మీల్స్‌లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్‌జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్‌జైన్‌కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్‌జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్‌జైన్‌తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్‌కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్‌లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్‌కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్‌కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్‌లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్‌లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్‌కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్‌లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
నమ్మరు కానీ రతన్ టాటా తమ్ముడితడే.. చిన్న అపార్ట్మెంట్లో..
Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'. రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్‌లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time. Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq — Harsh Goenka (@hvgoenka) January 19, 2022 RGP ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్‌లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్‌లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్డేట్లను పొందుతారని తెలిసింది. -
టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి
సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్ కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. టాటా ట్రస్ట్స్ తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్‌లో భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఫౌండేషన్‌లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్ అయ్యారు అపర్ణ. జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్‌లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్షిప్ , మేనేజ్మెంట్ అనుభవం ఆమె సొంతం. ఇక 2022లో టాటా ట్రస్ట్‌ల సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ ప్లేస్‌లో సిద్ధార్థ్ శర్మ శర్మ ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్‌లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్ సొంతం. -
‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్!
రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్‌లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్‌కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
బీ20 చెయిర్‌గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్‌లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్‌నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్‌లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
క్యాంప్‌బెల్ విల్సన్: ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది!
ఎయిరిండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విల్సన్‌ను ఎయిరిండియాకు సీఈవోగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్‌తో కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐకానిక్ ఎయిరిండియా “ఐకానిక్ ఎయిరిండియాకు నాయకత్వం వహించడానికి, అత్యంత గౌరవనీయమైన టాటా గ్రూప్‌లో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. ఎయిరిండియా ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. భారతీయ ఆతిథ్యం ప్రతిబింబించేలా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తోంది. ఆ ఆశయాన్ని సాకారం చేసే లక్ష్యం దిశగా ఎయిరిండియా, టాటా సహోద్యోగులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది"అంటూ ఎయిరిండియా కొత్త బాస్ విల్సన్ తెలిపారు. ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగిన కొత్త ఎయిర్ ఇండియా బాస్ క్యాంప్ బెల్ విల్సన్ న్యూజిలాండ్ కాంటర్బరీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..ఎందుకో మనసు యూరప్, అమెరికాపై మళ్లింది.ఆ రెండు దేశాలు తిరిగి స్వదేశమైన న్యూజిల్యాండ్‌కు వచ్చిన ఆయనకు జర్నీలపై పిచ్చి పెరిగింది. ఆ జర్నీ పిచ్చే విల్సన్ ఎయిరిండియా సీఈవో అయ్యేందుకు దోహద పడిందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిల్యాండ్‌కు తిరిగి వచ్చిన ఆయనకు విమానయాన రంగంపై మక్కువతో సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ)లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ స్కూట్కి సీఈవో స్థాయికి చేరుకున్నారు. అనేక పదవుల్లో చక్రం తిప్పారు ఏప్రిల్ 1996 నుండి ఎస్ఐఏ గ్రూప్‌లో ఉన్న అతను అనేక పదవులు చేపట్టారు. మే 2011లో అంటే స్కూట్‌లో చేరడానికి ముందు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్‌గా,హాంకాంగ్‌కు ఎస్ఐఏ జనరల్ మేనేజర్‌తో పాటు, కెనడా ఎస్ఐఏకు వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్ఐఏ హెడ్ ఆఫీస్ నెట్వర్క్ ప్లానింగ్, నెట్వర్క్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగాలలో 3ఏళ్లు విధులు నిర్వహించారు. విల్సన్ ఎస్ఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్, మార్కెటింగ్)గా పనిచేశారు. దీంతో పాటు ధర, పంపిణీ, ఇ-కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్‌లైన్ యొక్క విదేశాల్లో ఉన్న ఎస్ఐఏ కార్యాలయాల్ని పర్యవేక్షించారు. ఏప్రిల్ 2020లో స్కూట్ సీఈవోగా పదోన్నతి సాధించారు. ఇప్పుడు ఎయిరిండియా సీఈవోగా ఆ సంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదవండి👉టాటా గ్రూపుకి షాక్! సీఈవో పోస్టు వద్దన్న ఇల్కర్ ఆయ్‌సీ -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్‌కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా సన్స్‌లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్‌కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
ఎయిరిండియాకు కొత్త బాస్..
ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో ఎండీని నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్ ఆయ్‌సీని కొత్త బాస్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్వేస్కి చీఫ్‌గా ఐకెర్ ఆయ్‌సీ ఉన్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. బిల్కెంట్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిష్టేషన్ పట్టాను 1994లో పొందరు ఐకర్ ఆయ్‌సీ. అనంతరం యూకేలని లీడ్స్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్ ఫెడరేషన్ బోర్డ్ మెంబర్‌గా కూడా ఐకెర్ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా ఇటీవల టాటా సన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పాలనపరమైన సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీలను నియమిస్తున్నట్టు టాటాసన్స్ చీఫ్ చంద్రశేఖరన్ వెల్డించారు. -
ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం తన సొంత గూటి(టాటా)కి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తూ టాటా గ్రూప్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ పేరు పెట్టడానికి అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది. 1946లో టాటా సన్స్ విభాగం నుంచి టాటా ఎయిర్ లైన్స్ ఒక సంస్థగా విస్తరించినప్పుడు, సంస్థ దానికి ఒక పేరు పెట్టవలసి వచ్చింది. భారతదేశం మొదటి విమానయాన సంస్థకు సంస్థ 4 పేర్లను(ఇండియన్ ఎయిర్‌లైన్స్, పాన్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్-ఇండియా)లను ఎంపిక చేసింది. ఆ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా బాంబే హౌస్‌లోని టాటా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉద్యోగులు తమ మొదటి, రెండవ ప్రాధాన్యతలను సూచించమని సంస్థ వారిని కోరింది. (2/2): But who made the final decision? Read this excerpt from the Tata Monthly Bulletin of 1946 to know. #AirIndiaOnBoard #WingsOfChange #ThisIsTata pic.twitter.com/E7jkJ1yxQx — Tata Group (@TataCompanies) February 6, 2022 మొదటి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్'కు - 51 ఓట్లు, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28 ఓట్లు, పాన్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు - 19 ఓట్లు వచ్చాయి. ఇందులో అధిక ఓట్లు వచ్చిన మొదటి రెండు పేర్లను ఎంపిక చేసి మరలా ఓటింగు ప్రక్రియను చేపట్టింది. అయితే, రెండవసారి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో తమ తమ నూతన విమానయాన సంస్థకు 'ఎయిర్-ఇండియా' అని పేరు పెట్టినట్లు ఆ ట్వీట్లో సంస్థ పేర్కొంది. (చదవండి: జియోబుక్ ల్యాప్‌టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!) -
విస్తారా ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్.. రూ.977కే ఫ్లయిట్ జర్నీ!
విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్‌ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్‌కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్‌లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది. విస్తారా వెబ్సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. (చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!) -
ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!
మన దేశంలో టాటా గ్రూప్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో ఏ ప్రైవేట్ సంస్థకు లేని ఆదరణ టాటా గ్రూప్ సొంతం. ఇంత పెద్ద టాటా గ్రూప్, ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సన్స్ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు దక్కించుకున్నప్పుడు రతన్ టాటా ఒక బావోద్వేగా ట్వీట్ చేశారు. జెఆర్‌డీ టాటా ప్రస్తుతం జీవించి ఉంటే చాలా సంతోషించి ఉండేవారిని ఆ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. చాలా వరకు మన దేశంలోని ప్రజలు, మేధావి వర్గాలు ప్రైవేట్ కరణను వ్యతిరేకిస్తారు. కానీ, టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. అయితే, ఈ ఎయిరిండియా కొనుగోలు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. రతన్ టాటా అలా ట్వీట్ చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీ గురుంచి తెలుసుకుందాం.. ఎయిరిండియాను వ్యాపారం కోసం రతన్ టాటా దక్కించు కోలేదు. ఎయిర్ ఇండియా అనేది జెఆర్‌డీ టాటా కలల ప్రాజెక్టు. టాటా ఎయిర్ లైన్స్ ఏప్రిల్ 1932లో జెహంగీర్ రతన్ జీ దాదాభోయ్(ప్రేమగా జెఆర్‌డి అని పిలుస్తారు) టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్ లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్ టాటా గ్రూప్ ఛైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జెఆర్‌డి. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 ఎయిరిండియా ఇంటర్నేషనల్ జెఆర్‌డి కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలలో టాటా ఎయిర్‌లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో, 99.4% సమయపాలనతో సేవలు అందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర్య అనంతరం టాటా ఎయిర్ లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబరులో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిరిండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కోరితే వారు కూడా మూడు వారాల్లో ఆమోదించారు. బాంబే నుంచి లండన్ కు మొదటి ఎయిరిండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో(కైరో, జెనీవా వద్ద ఆగిపోయిన కూడా) దిగింది. స్వాతంత్ర్యం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, కెఎల్ఎమ్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్ లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మీ పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిరిండియా విమానంలో వెళ్ళింది. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జెఆర్‌డీ టాటాకు లేఖ రాసింది. ఇక క్రమ క్రమంగా ఎయిరిండియాకు ప్రజాదరణ వస్తుంది. ఈ సమయంలోనే అసలు సమస్య ఉత్పన్నం అయ్యింది. ఒడిదుడుకులు ప్రారంభం అప్పటి దేశ కమ్యూనికేషన్ మంత్రి భారతదేశం నాలుగు మూలలను కలిపే తపాలా సేవలను ప్రారంభించడానికి ఎయిరిండియా సేవలను కోరారు. ఆ ఆలోచన చాలా మంచిదే కానీ, ఎయిర్ ఇండియా ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జెఆర్‌డి టాటా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల రాత్రి వేల తపాలా సేవలను అందించాలని భావించారు. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. రాను రాను ప్రభుత్వానికి, జెఆర్‌డీ టాటాకు మధ్య దూరం పెరిగింది. దీంతో అప్పటి కమ్యూనికేషన్ మంత్రి మరిన్ని ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో అనేక దేశాల కంపెనీలు మన దేశంలో అడుగ పెట్టాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనేక డకోటా విమానాలను మన దేశంలో విమానయాన సేవల కోసం మార్కెట్లోకి పంపింది. ఏటువంటి వ్యాపార అనుభవం లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టడంతో కొన్ని సంస్థలు నష్ట పోయాయి. పోస్టల్ సర్వీస్ ఆలోచనను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి ఎయిరిండియా, ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఎయిర్ వేస్(ఇండియా), ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్లతో ఒక సమావేశాన్ని జెఆర్‌డి టాటా ఏర్పాటు చేశారు. ఈ సమావేశ విషయం దేశ కమ్యూనికేషన్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కి తెలవడంతో చాలా కలత చెందాడు. హిమాలయన్ ఏవియేషన్ అతను 1948లో హిమాలయన్ ఏవియేషన్ అనే కొత్త విమానయాన సేవలను ప్రారంభించాడు. జెఆర్‌డి టాటా, కమ్యూనికేషన్ మంత్రికి బహిరంగ లేఖ రాశారు. లాభాల గురించి మేము విమానయాన సేవలను నడిపించడం లేదు అని అతనికి రాశాడు. ఈ బహిరంగ లేఖతో కోపంతో ఉన్న కిద్వాయ్ జెఆర్‌డి టాటాకు ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం కాస్త అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకు తెలిసింది. టాటాలు మంచి పని చేస్తున్నారని, ఎయిరిండియా సమర్థవంతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రికి, జెఆర్‌డి టాటాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి జెఆర్‌డి టాటా ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.ఎస్.రాజధ్యక్ష ఆధ్వర్యంలో నిర్ఘాంతకమిటీ ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా లైసెన్స్ లు జారీ చేసినందుకు ప్రభుత్వాన్ని మందలించింది. “నాలుగు కంపెనీలు మనుగడ సాగించలేని చోట విచక్షణారహితంగా డజనుకు పైగా లైసెన్స్ లను జారీ చేయడం ఏకపక్షంగా ఉంది” అని కమిటీ తెలిపింది. దీంతో కమ్యూనికేషన్ మంత్రి కుట్ర వైఖరి నిరూపితమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా జాతీయీకరణ త్వరలోనే ఎయిరిండియా జాతీయీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఆర్‌డి టాటా ఈ రంగాన్ని జాతీయం చేయడం దేశానికి మంచిది కాదని, ఇది రాజకీయం చేయడానికి దారితీస్తుందని, ఇది వినాశకరమైనదని అన్నారు. జాతీయసంస్థల కోసం పనిచేసే బ్యూరోక్రాట్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించారు. ఈ రంగంలో పోటీ తట్టుకోవాలంటే స్వతంత్ర నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోలేరు అని అన్నారు. ప్రధానమంత్రికి ఆయన ఇంటర్వ్యూ కాపీని నెహ్రూకు పంపారు. నెహ్రూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే జెఆర్‌డి టాటా భయపడినట్లుగా అంబికా ఎయిర్ లైన్స్, జూపిటర్ ఎయిర్ వేస్ అనే రెండు కంపెనీలు దివాలా ప్రకటించాయి. చివరగా 1953లో అన్ని విమానయాన సంస్థలను ఒకటిగా విలీనం చేసి ప్రభుత్వం కిందకు తీసుకొని వచ్చింది. చివరి ప్రయత్నంగా, జెఆర్‌డి టాటా రెండు కంపెనీలగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకటి దేశీయ రంగానికి, మరొకటి అంతర్జాతీయ కార్యకలాపాల కోసం తెలిపారు. కాని నెహ్రూ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. విలీనం అవుతున్న కంపెనీలకు పరిహారం చెల్లించడానికి స్వతంత్ర కమిటీని నియమించాలని జెఆర్‌డి టాటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా తిరస్కరించారు. దీంతో జెఆర్‌డి టాటా తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇంకా పట్టు విడవలేదు. ఆ తర్వాత వచ్చిన అప్పటి కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ తో జరిగిన సమావేశంలో జెఆర్‌డి టాటా ఇలా అడిగారు.. “మీరు ఇతర విభాగాలను నడుపుతున్న విధంగా విమానయాన సంస్థను నడపడం సులభమని మీరు భావిస్తున్నారా? మీరే చూస్తారు” అని అన్నారు. దానికి జగ్జీవమ్ రామ్ ఇలా జవాబిచ్చాడు” ఇది ప్రభుత్వ శాఖ కావచ్చు, కానీ మీ సహాయంతో దానిని నడపాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జెఆర్‌డి టాటా ఆ విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబరు 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జెఆర్‌డి టాటాని ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్ తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్షపదవి నుంచి, ఇండియన్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జె.ఆర్.డీ.ని తప్పించింది. పైసా పారితోషికం తీసుకోలేదు ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. కానీ, అతని కలల ప్రాజెక్టు విషయంలో భాగ కలత చెందాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె చైర్మన్ గా కాకపోయినా రెండు విమానయాన సంస్థల బోర్డులో జె.ఆర్.డీ.ని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్ గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జె.ఆర్.డీ.ని బోర్డులలో సేవలను కొనసాగించారు. 1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం టాటాలను కొత్త దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుందా అని ప్రశ్నించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరొక అవకాశం వచ్చింది, టాటాలు ఈ ప్రతిపాదనను ఒకే చేసే లోపే ప్రభుత్వం పడిపోయింది. 1994లో ప్రధానమంత్రి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. ఆ తర్వాత 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియా వల్ల ₹671 కోట్ల నష్టం వచ్చింది. ఇలా నష్టాలతో కొనసాగుతున్న సంస్థను 2001లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటాను అమ్మకానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్కటి 20% వాటాను కొనడానికి ఎస్ఐఎ(సింగపూర్ ఎయిర్ లైన్స్), టాటా సన్స్ ముందుకు వచ్చాయి. కొందరు పెట్టుబదుదారుల కుట్రలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల పరిస్థితులు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఎస్ఐఎ తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. విమానయాన రంగంలో టాటాల ప్రవేశం నిలిచిపోయింది. అలా అప్పటి నుంచి ఆ కొనుగోలు ఒప్పందం అగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాదిలో ఎయిర్ ఇండియాను కొనుగోలు టాటా సన్స్ దక్కించుకుంది.