Tim David
-
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం -
ఆసీస్‌ను గెలిపించిన టిమ్ డేవిడ్
వెల్లింగ్టన్: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన తొలి టి20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఆ్రస్టేలియాను గెలిపించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో ఆ్రస్టేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) తక్కువే చేసినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్ ఆఖరి బంతికి హిట్టర్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు ఆసీస్ గెలిచేందుకు 19 బంతుల్లో 44 పరుగులు కావాలి. కాసేపటికే అది కాస్తా 9 బంతుల్లో 32 పరుగుల సమీకరణం కష్టంగా మారింది. ఈ దశలో మిల్నే వేసిన 19వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని డేవిడ్ 4, 6, 6లుగా బాదేశాడు. దాంతో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన సౌతీ వైడ్ సహా 3 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలిన 3 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... డేవిడ్ 6, 2, 4లతో ఆసీస్ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టి20 మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్‌లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
క్రికెట్ చరిత్రలోనే విచిత్ర ఘటన.. ఇప్పటి వరకు చూసుండరు!
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇది మీకు వినడానికే కొత్తగా ఉండవచ్చు.. అసలేం ఏం జరిగిందో ఓ లూక్కేద్దాం. అసలేం ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో పేసర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డెవిడ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు అందించాడు. బంతిని అందుకున్న స్పెన్సర్ జాన్సన్ బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అది క్లియర్‌గా ఔట్ అనుకుని జాన్సన్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత రిప్లేలో బిగ్ స్క్రీన్‌పై కూడా బెయిల్స్ కిందపడేటప్పటికి జోషఫ్ క్రీజుకు దూరంగా ఉన్నట్లు కన్పించింది. దీంతో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు డేవిడ్ సైతం సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయారు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించగా.. రనౌట్‌కు ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించానని బదులిచ్చాడు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం తను అప్పీల్ చేశానని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అతడితో కెప్టెన్ మార్ష్ కూడా అంపైర్ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం, అప్పీల్ లేకుండా అంపైర్లు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించకూడదు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! ONE OF THE RAREST MOMENTS ...!!! Johnson attempted the run out, big screen showed its out, but nobody appealed so the on-field umpire dismissed the decision. pic.twitter.com/5b0x6y6KaF — Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024 -
విధ్వంసకర వీరుడికి బంఫరాఫర్.. ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో వన్డే జట్టులో టిమ్ డేవిడ్ పేరును ఆసీస్ సెలక్టర్లు చేర్చారు. కాగా తొలుత ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో డేవిడ్‌కు చోటు దక్కలేదు. డేవిడ్‌కు కేవలం టీ20 జట్టులో మాత్రమే సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, స్టార్క్ వంటి ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కావడంతో డేవిడ్‌కు లక్కీ ఛాన్స్ లభించింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదేవిధంగా లిస్ట్-ఏ క్రికెట్లో డేవిడ్ కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి లిస్ట్-ఏ కెరీర్లో బ్యాటింగ్ సగటు 82.77గా ఉంది. ఇక ఇదే విషయంపై ఆసీస్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.."టీ20 సిరీస్ కోసం డేవిడ్ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అతడికి వన్డే జట్టులో కూడా అవకాశం ఇస్తున్నాము. టిమ్ తన దూకుడు వన్డేల్లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ప్రోటీస్‌ను కంగారూ జట్టు చిత్తు చేసింది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ఆసీస్ జట్టు: పాట్ కమ్మిన్స్(కెప్టెన్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ స్యాంగ్, టాన్హాన్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రోటీస్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడ్డాడు. కింగ్స్‌మేడ్ మైదానంలో మార్ష్ బౌండరీలు వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక మార్ష్‌తో పాటు టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ప్రోటీస్ బౌలర్లలో విలియమ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, గెరాల్డ్, షమ్సీ తలా వికెట్ సాధించారు. కుప్పకూలిన ప్రోటీస్.. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా 4 వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(56) మినహా అందరూ విఫలమయ్యారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో శుక్రవారం జరగనుంది. చదవండి: Asia Cup 2023: శ్రీలంక గడ్డపై భారత జట్టు -
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
రోహిత్ నిద్రలేని రాత్రులు గడిపాడు.. ముంబై బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాంఖడే వేదికగా నిన్న (ఏప్రిల్ 30) జరిగిన ఐపీఎల్ థౌంజండ్వాలాలో (ఐపీఎల్ 100వ మ్యాచ్) రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ లక్ష్యఛేదనలో (213) ముంబై బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగి, తమ కెప్టెన్‌కు (ఏప్రిల్ 30న రోహిత్ బర్త్ డే) అద్భుత విజయాన్ని బహుమతిగా ఇచ్చారు. తొలుత గ్రీన్ (26 బంతుల్ల 44), సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 55) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 45 నాటౌట్) హ్యాట్రిక్ సిక్సర్లు బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. టిమ్ డేవిడ్ విధ్వంసం దెబ్బకు ముంబై మరో 3 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టిమ్ మాట్లాడుతూ.. చారిత్రక మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించి, తమ కెప్టెన్‌కు గిఫ్ట్ ఇచ్చామని అన్నాడు. ఇదే సందర్భంగా టిమ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. ప్రస్తుత ఐపీఎల్లో తాము (ముంబై ఇండియన్స్ సభ్యులు) ఆశించిన మేరకు రాణించకపోవడంతో తమ కెప్టెన్ నిద్రలేని రాత్రులు గడిపాడని, అంతిమంగా అతని బర్త్ డే రోజు గెలుపును కానుకగా ఇవ్వగలిగామని అన్నాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది ఆర్ఆర్తో మ్యాచ్‌లో తిలక్ వర్మ రిధమ్‌లో లేనట్లు కనిపించాడని, అతను షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడంతో ముంబైని ఎలాగైనా తానే గట్టెక్కించాలని భావించానని తెలిపాడు. మ్యాచ్‌ను ఇలా ముగించాలనే కసితో షాట్లు ఆడానని, హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను ఫినిష్ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నాడు. జట్టులో సభ్యులంతా తమ వంతు ప్రదర్శనలతో చెలరేగారు. నా ఛాన్స్ కోసం వెయిట్ చేసి నేను కూడా సక్సెస్ అయ్యానని తెలిపాడు. చారిత్రక మ్యాచ్‌లో (1000వ మ్యాచ్) తమ జట్టును ఇలా గెలిపించడం పట్ల చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, టిమ్ ఊచకోత ధాటికి రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (62 బంతుల్లో 124; 16 ఫోర్లు 8 సిక్సర్లు) సుడిగాలి శతకం మరుగున పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. జైస్వాల్ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. జైస్వాల్ మినహా రాజస్థాన్ టీమ్‌లో కనీం ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు. చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! -
MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
IPL 2023- MI Vs RR: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడీ టీ20 నంబర్ 1 బ్యాటర్. ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలిసారి అర్ధ శతకం సాధించిన ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి అభిమానులకు కనువిందు చేశాడు. అదరగొట్టేశాడు వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్య 29 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫామ్‌లోకి వచ్చిన సూర్య ఆటతీరును ఇలాగే కొనసాగిస్తే జట్టుకు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. అదే విధంగా ముంబై- రాజస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య గ్రహణం వీడింది.. ‘‘ముంబై లక్ష్య ఛేదన అంత సులువుగా ఏమీ జరిగిపోలేదు. సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. మునుపటి లయను అందుకున్నాడు. ఇన్నాళ్లు.. సూర్యగ్రహణం పట్టింది.. ఇప్పుడిప్పుడే గ్రహణం వీడి సూర్యుడు ప్రకాశించడం మొదలుపెట్టాడు. నిజానికి ఈరోజు రోహిత్ శర్మ తొందరగా అవుటైపోయాడు. తన పుట్టినరోజు అయినప్పటికీ సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అలాంటి క్లిష్ట సమయంలో కామెరాన్ గ్రీన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి పట్టుదలగా నిలబడ్డాడు. కామెరాన్ గ్రీన్ భవిష్యత్ సూపర్‌స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు భవిష్యత్ సూపర్‌స్టార్ మానసికంగా.. శారీరకంగా అతడు ఫిట్నెస్ కాపాడుకోగలిగితే కచ్చితంగా రాక్‌స్టార్‌గా వెలుగొందుతాడు. తనదొక విభిన్న శైలి. తను అద్బుతంగా బౌలింగ్ కూడా చేయగలడు. గ్రీన్ ఒక సంచలనం అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ఆకాశ్ చోప్రా ముంబై బ్యాటర్ల ఆటను విశ్లేషిస్తూ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా సొంతమైదానంలో రాజస్తాన్‌తో తలపడ్డ ముంబై మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి విధించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఇషాన్ 28 పరుగులు సాధించాడు. టిమ్ డేవిడ్ విధ్వంసం వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్ 26 బంతుల్లో 44 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 29, టిమ్ డేవిడ్ 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. చివరి ఓవర్లో మొదటి మూడు బంతుల్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబై గెలుపును ఖరారు చేశాడు. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 201 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 57. ముంబై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్- రాజస్తాన్- బ్యాటింగ్ ►రాజస్తాన్- 212/7 (20) ►ముంబై- 214/4 (19.3) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్(రాజస్తాన్)- 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 124 పరుగులు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్ 1️⃣0️⃣0️⃣0️⃣th IPL match. Special Occasion... ...And it ends with an electrifying finish courtesy Tim David & @mipaltan 💥💥💥 Scorecard ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/qK6V5bqiWV — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది
ఐపీఎల్-2023లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై విజయంలో ఆ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్లో ముంబై గెలుపుకు 17 పరుగులు అవసరమవ్వగా.. టిమ్ డెవిడ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక విజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. జైస్వాల్, టిమ్ డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని రోహిత్ కొనియాడాడు. Photo Credit : IPL Website జైస్వాల్ ఒక యువ సంచలనం.. "ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేదించడం చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా మేము దగ్గరకు వచ్చి ఓటమిపాలైం. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మా జట్టులో పొలార్డ్ స్థానాన్ని డేవిడ్ భర్తీ చేశాడు. పొలార్డ్ చాలా సీజన్లపాటు మా జట్టులో ఉన్నాడు. మేము ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలవడంలో పాలీ తనవంతు పాత్రపోషించాడు. ఇప్పడు డేవిడ్ కూడా అదే పనిచేస్తాడని ఆశిస్తున్నాము. Photo Credit : IPL Website టిమ్‌కు చాలా బ్యాటింగ్ పవర్ ఉంది. లోయార్డర్‌లో డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాడు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అటువంటి పవర్ హిట్టర్ క్రీజులో ఉంటే ఎటువంటి బౌలరైనా ఒత్తడికి లోనవుతాడు. ఇక ప్రతీ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్ధితులు బట్టి జట్టును ఎంపికచేస్తాం. ఇక జోఫ్రా అర్చర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అదే విధంగా అతడు చాలా కాలం పాటు బంతి పట్టుకోలేదు. కాబట్టి అతడికి ఇంకా చాలా ప్రాక్టీస్ అవసరం. అయినా ఈ మ్యాచ్‌లో మంచి పేస్‌తో బౌలింగ్ చేశాడు. సూర్య కూడా తన రిథమ్‌ను తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇక జైశ్వాల్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. గతేడాదే అతడు అద్భుతంగా ఆడటం నేను చూశాను. కానీ ఈ ఏడాది అంతకు రెట్టింపు ఆడుతున్నాడు. Photo Credit : IPL Website బ్యాటింగ్‌లో అంత పవర్‌ను ఎలా జనరేట్ చేస్తున్నవాని జైస్వాల్‌ను ఇన్నింగ్స్ బ్రేక్‌లో ఆడిగా. అందుకు బదులుగా జిమ్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల సాధ్యపడుతుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అతడిని ఆపడం మాతరం కాలేదు. నిజంగా మేము భయపడ్డాం. ఇక అతడు అద్భుతఫామ్‌లో ఉండడం.. రాజస్తాన్‌తో పాటు భారత క్రికెట్‌కు కూడా చాలా మంచిది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: #Yashasvi Jaiswal: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. తొలి క్రికెటర్‌గా! -
పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే
ఎస్ఆర్హెచ్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాడు. కనీసం పరిగెత్తడంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లతో సుందర్ టచ్‌లో కనిపించాడు. Photo: IPL Twitter ఓవర్ ఐదో బంతిని ఫుల్‌టాస్ వేయగా సుందర్ మిడాఫ్ దిశగా డ్రిల్ చేశాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సుందర్ మొదట్లో వేగంగానే పరిగెత్తుకు వచ్చాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ టిమ్ డేవిడ్ నేరుగా బంతిని డైరెక్ట్ త్రో వేశాడు. మరి డేవిడ్ వేసిన బంతి వికెట్లకు తాకదనుకున్నాడో.. తాను ఔట్ కానని నమ్మకమో తెలియదు కానీ క్రీజుకు అడుగు దూరంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఆ నిర్లక్ష్యమే సుందర్‌ను దెబ్బకొట్టింది. రిప్లేలో సుందర్ క్రీజులోకి వచ్చేలోపే టిమ్ డేవిడ్ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. పరిగెత్తడంలో అలసత్వం ప్రదర్శించిన సుందర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పుమన్నాయి. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు.. పరిగెత్తడంలో ఇంత నిర్లక్ష్యమా.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అంటూ ద్వజమెత్తారు. Extreme sloppy and lazy running from Washington Sundar! When you are hitting the ball so well, why to get run out like that!!#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MSDhoni𓃵 #washingtonsundar #Sundar #SRHvsMI #TATAIPL2023 #Rohit #IPLOnStar #IPL2O23 #kavyamaran pic.twitter.com/H0LtWKJcPV — Cricket Fanatic (@CricketFanati20) April 18, 2023 చదవండి: #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే.. అగమ్యగోచరంగా ముంబై ఇండియన్స్ పరిస్థితి
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడేలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించగా.. ముంబై 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (ఆర్సీబీ, సీఎస్కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తున్న ముంబై టీమ్‌కు రిలాక్స్ అయ్యే లోపే మరో షాక్ తగిలింది. తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కేకేఆర్‌తో మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్ సంసిద్దతపై అతని సహచరుడు టిమ్ డేవిడ్ ఓ క్లూ వదిలాడు. ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు టిమ్ తెలిపాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్ అందుబాటులో ఉండేది లేనిది చివరి నిమిషం వరకు చెప్పలేమని పేర్కొన్నాడు. శనివారం ఆర్చర్ కొద్దిసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడని, అనంతరం నెట్స్‌లో భారీ షాట్లు సైతం ఆడాడని, అయినా ఇదంతా అతను మెడికల్ టీమ్ పర్యవేక్షనలో చేస్తుండటం కొంత ఆందోళనకరమేనని చెప్పుకొచ్చాడు. మరోవైపు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్‌ను ఢీకొనడం పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న పని అని, ఇలాంటి ప్రత్యర్ధిపై బలమైన బౌలింగ్ ఆప్షన్స్ లేకపోత చాలా కష్టమవుతుందని తెలిపాడు. గత 3 మ్యాచ్‌ల్లో 200 ప్లస్ స్కోర్ చేసిన కేకేఆర్‌ను నిలువరించాలంటే తమ బౌలింగ్ పటిష్టంగా ఉండాలని, మ్యాచ్ సమయానికి ఆర్చర్ అందుబాటులోకి వస్తే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని అన్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలను నిలువరించడం తమకు కత్తి మీద సామే అవుతుందని పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంబై బ్యాటర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో వైరల్
ఐపీఎల్-2023 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ కోసం ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన డేవిడ్.. ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో డేవిడ్ తన హార్డ్ హిట్టింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నాడు. గురువారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు సాయంతో 23 పరుగలు సాధించి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతికి బౌండరీ బాదిన అతడు.. రెండో బంతికి రెండు పరుగులు, మూడో బంతికి ఫోర్, అనంతరం రెండు సిక్స్‌లు, ఓ సింగిల్‌తో ఓవర్‌ను ముగించాడు. డేవిడ్ పవర్ హిట్టింగ్ సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో టిమ్ డేవిడ్‌ను రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2022లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ 186 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఏ మెరకు డేవిడ్ రాణిస్తాడో వేచి చూడాలి. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్2న బెంగళూరు వేదికగా ఆర్సీబీతో తలపడనుంది. 2️⃣3️⃣ तोड़-फोड़ at Wankhede 😍#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @timdavid8 MI TV pic.twitter.com/R5IYZQoLDy — Mumbai Indians (@mipaltan) March 31, 2023 చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషీ, అయినా..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల డామినేషన్ పతాక స్థాయిలో నడుస్తుంది. లీగ్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఫలితంగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. నిన్న (మార్చి 7) ముల్తాన్ సుల్తాన్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పరుగుల ప్రవాహం కొనసాగింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు పోటాపోటీగా విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. షాన్ మసూద్ (50 బంతుల్లో 75; 12 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (18 బంతుల్లో 33; ఫోర్, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరలెవెల్లో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఊచకోత ధాటికి ఇస్తామాబాద్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాదాబ్ ఖాన్ (4-1-26-2) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. సుల్తాన్స్ బ్యాటర్ల కంటే ఎక్కువగా రెచ్చిపోయి భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే (19.5 ఓవర్లలో 209/8) ఊదేశారు. ఇస్లామాబాద్ బ్యాటర్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. రహమానుల్లా గుర్భాజ్ (14 బంతుల్లో 25; 5 ఫోర్లు), కొలిన్ మున్రో (21 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ వసీం జూనియర్ (7 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఫలితంగా ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సుల్తాన్స్ బౌలర్లు అన్వర్ అలీ (3/33), ఇహసానుల్లా (2/35), ఉసామా మీర్ (2/38) బంతితో ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. కాగా, ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ విధ్వంసాన్ని చూసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. భారీ కాయుడు ఇదే తరహా విధ్వంసాన్ని ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు. గత సీజన్లోనూ మెరుపులు మెరిపించిన టిమ్.. రాబోయే సీజన్లో మరింత రెచ్చిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆసీస్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
సూర్య కాదు.. అతడే నాకు స్ఫూర్తి! నిజమే.. నీకు ‘స్కై’తో పోలికేంటి?
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇటీవల వార్తల్లో నిలిచాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్.. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 97 పరుగులు సాధించాడు. తన తండ్రి మొయిన్ ఖాన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గ్లాడియేటర్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఎదురైన ఘోర పరాభవానికి కారణమయ్యాడు. ఫిబ్రవరి 24 నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 220 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తుపాన్ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆజం ఖాన్. ఈ క్రమంలో అతడిని టీమిండియాస్టార్, టీ20 వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యతో పోలికపై ఆజం ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆదర్శమని, అతడి ఆట తీరుతో స్ఫూర్తిపొందానని చెప్పుకొచ్చాడు. సూర్య కాదు.. టిమ్ డేవిడ్.. ఎందుకంటే ఇందుకు గల కారణం వెల్లడిస్తూ.. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నా స్థానం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. 40కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌కు వెళ్లి మ్యాచ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను టిమ్ డేవిడ్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నా. అతడు భారీ షాట్లు ఆడతాడు. తన పాత్రను చక్కగా పోషిస్తాడు. జట్టుకు ఏం కావాలో అదే చేస్తాడు. నేను కూడా తనలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను కదా! అయితే, సూర్యకుమార్ మాత్రం ఎక్కువగా వన్‌డౌన్‌లో వస్తాడు. టాపార్డర్‌లో ఆడటానికి నా బ్యాటింగ్ పొజిషన్‌కు తేడా ఉంటుంది కదా!’’ అని ఆజం ఖాన్ పాక్‌టీవీతో పేర్కొన్నాడు. నిజమే నీకు సూర్యతో పోలికేంటి? ఇక ఆజం ఖాన్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నిజం చెప్పావు ఆజం ఖాన్! అయినా.. సూర్యతో నీకు పోలికేంటి? ఒక్క ఇన్నింగ్స్‌తో అందరూ చాలా ఊహించేసుకుంటున్నారు. సూర్య నంబర్ 1గా ఎదగడానికి ఎంతలా కష్టపడ్డాడో.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో అతడి ఆట తీరు గమనిస్తే మీకు తెలుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆజం ఖాన్ 2021లో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 3 టీ20లు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 5. అయితే, పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో మాత్రం రాణిస్తున్నాడు. చదవండి: NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
ముంబై జట్టుకు స్టార్ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఎంట్రీ!
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఏంఐ కేప్‌టౌన్ కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఆఖరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లివింగ్‌స్టోన్ చేతివేలికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్ స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌తో ఏంఐ కేప్‌టౌన్ భర్తీ చేసింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ఏంఐ కేప్‌టౌన్ ఓ వీడియోను షేర్ చేసింది. "టిమ్ డేవిడ్ ఇప్పుడు ఏంఐ కేప్‌టౌన్ ఫ్యామిలీలో చేరాడు అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. కాగా డేవిడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బిగ్‌బాష్ లీగ్-(2022-23)లో హోబార్ట్ హారికేన్స్ తరపున డేవిడ్ అదరగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 8.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ 186 పరుగులు సాధించాడు. చదవండి: Murali Vijay: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే Tim in blue-and-gold in Cape Town - here we go! 😉💙#MICapeTown #OneFamily @timdavid8 pic.twitter.com/pizLgh2hiu — MI Cape Town (@MICapeTown) January 30, 2023 -
పంజాబ్ కింగ్స్ బౌలర్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ థండర్స్‌తో ఇవాళ (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఆటగాళ్లు నాథన్ ఇల్లీస్ (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్), టిమ్ డేవిడ్ (ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్) రెచ్చిపోయారు. ఇల్లీస్ హ్యాట్రిక్ వికెట్లతో (4/27) నిప్పులు చెరగగా.. టిమ్ డేవిడ్ (41 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హోబర్ట్ టీమ్ 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్.. ఇల్లీస్, ప్యాట్రిక్ డూలీ (3/22), రిలే మెరిడిత్ (2/14), ఫహీమ్ అష్రాఫ్ (1/28) ధాటికి నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. చాలాకాలం తర్వాత బీబీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, ఒలివర్ డేవిస్ (45), బెన్ కట్టింగ్ (20), కెప్టెన్ క్రిస్ గ్రీన్ (21) ఓ మోస్తరుగా రాణించారు. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్.. టిమ్ డేవిడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రెచ్చిపోయిన ఇల్లీస్.. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా, సిడ్నీ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా, ప్రస్తుత సీజన్లో మైఖేల్ నెసెర్ (బ్రిస్బేన్ హీట్) తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2012-13 సీజన్లో జేవియర్ డోహర్తీ సిడ్నీ తరఫున తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టగా.. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఆండ్రూ టై (రెండు సార్లు), జోష్ లాలర్, రషీద్ ఖాన్, హరీస్ రౌఫ్, జేవియర్ డోహర్తీ, గురిందర్ సంధు, కెమరూన్ బాయ్స్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్‌బాష్ లీగ్‌లో చారిత్రక విజయం
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
టిమ్ డేవిడ్ తుపాన్ ఇన్నింగ్స్.. 110 మీటర్ల భారీ సిక్స్
బ్రెస్బేన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న డేవిడ్.. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు సాధించాడు. కాగా డేవిడ్ కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన మెక్కాయ్ బౌలింగ్‌లో.. నాలుగో బంతిని డేవిడ్ డిప్ మిడ్ వికెట్ దిశగా 110 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై ఆస్ట్రేలియా 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(41 బంతుల్లో 75), డేవిడ్(42) పరుగులతో అదరగొట్టారు. విండీస్ బౌలర్లలో జోషఫ్ మూడు వికెట్లు, మెక్కాయ్ రెండు, స్మిత్ ఒక్క వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. కరీబియన్ బ్యాటర్లలో చార్లెస్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమ్మిన్స్ రెండు, గ్రీన్, జంపా ఒక్క వికెట్ పడగొట్టారు. చదవండి: Faf Du Plesis: 'మరో మూడు వారాల్లో పూర్తిగా తెలుసుకుంటారు' -
టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. పవర్ హిట్టర్ ఎంట్రీ!
టీమిండియాతో టీ20 సిరీస్, టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. భారత్‌తో సిరీస్‌కు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సెలక్టెర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు మాత్రం వార్నర్ ఎంపిక చేశారు. కాగా భారత పర్యటనకు వార్నర్ స్థానంలో కామెరాన్ గ్రీన్‌కు జట్టులో చోటు దక్కింది. అదే విధంగా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరపున ఆంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. అతడిని టీ20 టీ20 ప్రపంచకప్ ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ మూడు టీ20ల సిరీస్ నిమిత్తం భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్ 20న మొహాలి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అదే విధంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. టీ20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , కామెరాన్ గ్రీన్ చదవండి: IND VS HK: గ్రౌండ్‌లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో వైరల్! -
ఆ యువ ఆటగాడు సైమండ్స్‌ను గుర్తు చేస్తున్నాడు: రికీ పాంటింగ్
యువ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టిమ్ డేవిడ్ తన ఆటతీరుతో ఆసీస్ మాజీ ఆల్ రౌండర్, దివంగత ఆండ్రూ సైమండ్స్‌ను గుర్తుకు తెస్తున్నాడని పాంటింగ్ కొనియాడాడు. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో డేవిడ్ ఖచ్చితంగా ఉండాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా సింగపూర్‌లో జన్మించిన టిమ్ డేవిడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు ఎదురుచేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డేవిడ్ అకట్టుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఏకంగా 8.25 కోట్ల భారీ దక్కించుకోంది. అయితే గత కొంత కాలంగా డేవిడ్ టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నా.. ఆస్ట్రేలియా జాతీయ ఇంకా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. "నేను సెలెక్టర్‌గా ఉన్నట్లయితే.. ఇప్పటికే డెవిడ్‌ను ఎంపిక చేసేవాడిని. అతడు అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్. అటువంటి ఆటగాడు ఇప్పటికే జట్టులో ఉండాలి. అతడిని టీ20 ప్రపంచకప్-2022కు ఎంపిక చేయండి. డేవిడ్ నా సహచరుడు సైమండ్స్‌ను గుర్తుచేస్తున్నాడు. 2003 వన్డే ప్రపంచ కప్‌లో సైమండ్స్ ఏ విధంగా అయితే రాణించాడో.. ఇప్పడు డేవిడ్ కూడా అదే చేయగలడని నేను భావిస్తున్నాను. అతడిని జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాగా ఆస్ట్రేలియా జట్టులో మిడిల్ ఆర్డర్లో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారని నాకు తెలుసు. కానీ గత రెండేళ్లుగా డేవిడ్ కూడా టీ20ల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారైనా అతడికి ఆడే అవకాశం ఇవ్వాలి అని పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..! -
టిమ్ డేవిడ్‌పై ప్రేమను ఒలకబోస్తున్న ఆర్సీబీ.. వీ లవ్ యు అంటూ..!
సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ పుట్టి ముంచి, ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేర్చిన ముంబై హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై ఆర్సీబీ ప్రేమను ఒలకబోస్తుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ నోటి కాడి విజయాన్ని లాగేసుకుని తమ చేతిలో పెట్టిన టిమ్‌పై ఆర్సీబీ ప్రశంసల వర్షం కురిపిస్తుంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి సొంత జట్టును గెలిపించడంతో పాటు తమకు పరోక్షంగా సహకరించిన టిమ్‌కు ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. We love you @timdavid8! ❤️ You’re doing great. More power to you. 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/uKV5zqFUqu — Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022 ‘‘మేం నిన్ను ప్రేమిస్తున్నాం టిమ్. నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు ఇలాగే రెచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అంటూ ఆర్సీబీ జెర్సీలో ఉన్న టిమ్ ఫొటోను తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఓవరాక్షన్ చేస్తుందని కొందరు.. ప్లే ఆఫ్స్ అవకాశం కోసం ఇంతలా దిగజారాలా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, టిమ్ డేవిడ్ గతేడాది ఆర్సీబీ జట్టులో ఉన్న విషయం చాలా మందికి తెలీదు. గత సీజన్లో అతను గాయపడిన ఫిన్ అలెన్ స్థానంలో ఆర్సీబీ చేరాడు. ఆ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ (సీఎస్కే) ఆడిన టిమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అలవోకగా సిక్సర్లు బాదగల సత్తా ఉన్న టిమ్‌ను ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మెగా వేలంలో 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే, నిన్న (మే 21) ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో టిమ్ మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 34; 4 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆడి ముంబైని గెలిపించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్తును కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబైని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన టిమ్.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ పాలిట విలనయ్యాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్‌ను ముగించగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చదవండి: టిమ్ డేవిడ్‌కు గిఫ్ట్ పంపిన ఆర్సీబీ కెప్టెన్..! -
టిమ్ డేవిడ్‌కు గిఫ్ట్ పంపిన ఆర్సీబీ కెప్టెన్..!
IPL 2022: ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్ ఫోర్కు చేరేలా చేసిన ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు ఆర్సీబీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ ఓ అపురూప కానుక పంపాడు. తనతో పాటు విరాట్, మ్యాక్స్‌వెల్‌లు ముంబై కిట్‌లో ఉన్న ఫోటోను డుప్లెసిస్ టిమ్‌కు మెసేజ్ చేశాడు. ఈ విషయాన్ని టిమ్ స్వయంగా వెల్లడించాడు. సదరు ఫోటోను త్వరలోనే తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తానని టిమ్ చెప్పుకొచ్చాడు. కాగా, నిన్న (మే 21) ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో టిమ్ మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 34; 4 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆడి ముంబైని గెలిపించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్తును కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబైని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన టిమ్.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ పాలిట విలనయ్యాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్‌ను ముగించగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యంతో ఢిల్లీ ఓటమిపాలవగా, ఆర్సీబీ దర్జాగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కాగా, సింగపూర్‌కు చెందిన టిమ్ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలంలో 8.25 కోట్లకు కొనుగులు చేసింది. చదవండి: IPL 2022: ఢిల్లీని చిత్తు చేసిన ముంబై.. ఎగిరి గంతేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
విలన్‌గా మారిన పంత్.. ఆ రివ్యూ తీసుకొని ఉంటే
ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంతా అనుకున్న వేళ ముంబై ఇండియన్స్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరోక్షంగా ప్రధాన కారణమయ్యాడు. గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్లే చాన్స్ ఉండడంతో పంత్‌పై తీవ్ర ఒత్తిడి ఉండడం సహజం. దానిని తట్టుకొని నిలబెడితేనే ఫలితం వస్తుంది. అప్పటికే ఒత్తిడిలో సింపుల్ క్యాచ్ మిస్ చేసిన అతను రివ్యూ తీసుకోవడంలోనూ విఫలమయ్యాడు. ఇదే మ్యాచ్‌కు ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఔట్ విషయంలో పంత రివ్యూ తీసుకోకపోవడం.. ఫలితంగా గోల్డెన్ డక్ అవ్వాల్సిన బ్యాట్స్‌మన్ ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చకచకా జరిగిపోయాయి. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతికి శార్దూల్.. అప్పటికే కుదురుకున్న డెవాల్డ్ బ్రెవిస్‌ను(25 పరుగులు) ఔట్ చేశాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ గుడ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. టిమ్ డేవిడ్ బంతిని కవర్స్ దిశగా పుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ పక్కనుంచి వెళ్లి కీపర్ పంత్ చేతుల్లో పడింది. బ్యాట్‌కు తాకినట్లు శబ్ధం రావడంతో పంత్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ తగల్లేదంటూ నాటౌట్ ఇచ్చాడు. అయితే పంత్ తీరు చూసి కచ్చితంగా రివ్యూ తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పంత్ రివ్యూకు వెళ్లలేదు. శార్దూల్‌తో సుధీర్ఘ చర్చ అనంతరం డీఆర్ఎస్ కోరకుండానే వెనక్కి వచ్చేశాడు. డీఆర్ఎస్కు వెళ్లకుండా పంత్ ఎంత పెద్ద తప్పు చేశాడో మరుక్షణంలోనే తెలిసిపోయింది. ఒక బంతి పూర్తైన తర్వాత రిప్లేలో బ్యాట్‌కు బంతి తాకినట్లుగా అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా గోల్డెన్ డక్ నుంచి బతికిపోయిన టిమ్ డేవిడ్ ఆ తర్వాత 11 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో విధ్వంసం సృష్టించి 34 పరుగులు చేశాడు. ఒక రకంగా మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ చేతిలోకి రావడంలో టిమ్ డేవిడ్‌ది కీలకపాత్ర,. ఆ తర్వాత అతను ఔటైనా రమన్‌దీప్ సింగ్ ముంబైని గెలిపించి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను చిదిమేశాడు. అయితే పంత్ ఆ రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. టిమ్ డేవిడ్ గోల్డెన్ డక్ అయి ఉంటే ముంబై కచ్చితంగా ఓడిపోయేది.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ రిషబ్ పంత్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. పనికిమాలిన విషయాల్లో తలదూర్చే పంత్.. అసలు విషయంలో మాత్రం చతికిలపడ్డాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు దూరమవ్వడానికి ప్రధాన కారణం రిషబ్ పంత్.. కెప్టెన్‌గా పంత్ పనికిరాడు.. రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: పాత గాయాన్ని గుర్తుపెట్టుకొని చావుదెబ్బ తీసింది..