Tirumalagiri
-
రాళ్లు, గుడ్లతో దాడి.. తిరుమలగిరిలో హైటెన్షన్
-
వరుసకు బాబాయ్.. మద్యం మత్తులో బాలికపై అత్యాచారం, హత్య!
సాక్షి, మహబూబ్‌నగర్/రాజాపూర్: వావి వరుసలు మరిచాడు.. వరుసకు అన్న కూతురు అనీ చూడలేదు.. బాలిక అనే కనికరమూ చూపించలేదు.. మద్యం మత్తులో స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని అంతా కలిసి కిరాతకంగా గొంతు నులిమి బాలికను చంపేశారు. పైగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టుగా వేలాడదీశారు. తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తులు, బాధిత కుటుంబం చెప్పిన వివరాల మేరకు ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడినా.. ఘటన జరిగిన తీరుపై భిన్నమైన వివరాలు ప్రచారంలో ఉన్నాయి. తల్లిదండ్రులు ఊరెళ్లడంతో.. సదరు తండాకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె ఇంటర్, చిన్న కుమార్తె (15) పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం బంధువుల ఇంట్లో పోశమ్మ పండుగ ఉండటంతో తల్లిదండ్రులు కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లారు. పెద్ద కుమార్తె హాస్టల్లో ఉండగా చిన్నకుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పటికే ఆమెపై కన్నేసిన నేనావత్ శ్రీనుకు ఈ విషయం తెలిసింది. బాలికకు వరుసకు బాబాయి అయిన శ్రీను.. తన స్నేహితుడు అడ్వొకేట్ అయిన శ్రీనివాస్, పక్క గ్రామానికి చెందిన టీవీ మెకానిక్, కేబుల్ ఆపరేటర్ శివతో కలిసి అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. బెల్టుషాపు కావడం.. పరిచయం ఉండటంతో.. బాలిక తల్లిదండ్రులు స్థానికంగా కిరాణా దుకాణంతోపాటు బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. పక్కనే శ్రీను (నిందితుడు) నివాసం ఉంటున్నాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో.. మద్యం తాగుదామని తన స్నేహితులు అడ్వొకేట్ శ్రీనివాస్, శివను రప్పించుకున్నాడు. అంతా కలిసి అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లారు. శ్రీను వరుసకు బాబాయి కావడం, కేబుల్ ఆపరేటర్‌గా శివ పరిచయం ఉండటంతో బాలిక అభ్యంతరం చెప్పలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్తున్నారు. నిందితులు మద్యం తాగాక మత్తులో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. విషయం బయటపడుతుందని గొంతు నులిమి చంపి, ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అంటున్నారు. అయితే నిందితుల్లో ఒకరైన శివ ముందే ఆ బాలిక ఇంట్లో ఉన్నాడని.. శ్రీను, శ్రీనివాస్ వెళ్లి అతడిని కొట్టి పంపించేసి, బాలికపై దాషీ్టకానికి పాల్పడ్డారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆడియో ప్రచారమవుతోంది. మరోవైపు మృతురాలు రాసినట్టుగా పేర్కొంటూ ఓ సూసైట్ నోట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు బాలికపై దారుణానికి సంబంధించి నేనావత్ శ్రీను, అడ్వొకేట్ శ్రీనివాస్, టీవీ మెకానిక్ శివలపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇక ఈ ఘటన నిందితులు ముగ్గురూ పరారీలోనే ఉన్నారు. నిందితుల ఆస్తులు ధ్వంసం బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన విషయం తెలియడంతో తండా వాసులు ఆందోళనకు దిగారు. నిందితుడు శ్రీను ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. మరో నిందితుడు శ్రీనివాస్‌కు చెందిన ఇంటి పైకప్పు రేకులను ధ్వంసం చేశారు. పక్క గ్రామానికి ట్రాక్టర్లలో వెళ్లి నిందితుడు «శివకు చెందిన కారును తగలబెట్టారు. అతడి టీవీ మెకానిక్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, తండావాసులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. కాగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దారుణానికి పాల్పడినవారికి త్వరగా శిక్ష పడేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలోనూ చెడు ప్రవర్తన! నిందితుడు నేనావత్ శ్రీను గతంలోనూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇక మరో నిందితుడు శివపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నట్టు సమాచారం. వారిని చూశా.. ఇంత పని చేస్తారనుకోలేదు ‘‘అర్ధరాత్రి 12 అవుతోందనుకుంటా.. వీధి దీపాలు కూడా లేవు. బయట చప్పుడైతే వెళ్లి చూశాను. బెల్టుషాపు వద్ద శ్రీను, శివ ఉన్నారు. ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారని అడిగా. మద్యం కోసం వచ్చామన్నారు. శ్రీనుకు కూడా బెల్టుషాపు ఉంది కదా అని అడిగాను. మద్యం అయిపోయిందని, అందుకే ఇక్కడికి వచ్చామని అన్నాడు. తెలిసినవాళ్లే కదా అని వెళ్లిపోయా. ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదు. – రాందాస్, సమీపంలోని ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి చదవండి: (హోమ్ ట్యూషన్ చెప్పేందుకు వెళ్లి.. అఖిల్ వచ్చాడని సారిక వాట్సాప్ మెసేజ్ చేసి..) -
నిశ్చితార్థమైంది వదిలేయాలని కోరితే.. సన్నిహిత వీడియోలు కాబోయే భర్తకు పంపిస్తానని
సాక్షి, హైదరాబాద్: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రవణ్‌కుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్‌గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్ కిషన్ భాగ్ ప్రాతానికి చెందిన దూరపు బంధువు నిహాల్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. గత ఏడాది జూలై 1న అత్తాపూర్ వెళ్లిన ఆమెను నిహాల్‌సింగ్ టెర్రస్ పైన ఉన్న గదికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిహాల్ సింగ్ పలు మార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా నిశ్చితార్థం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. గత ఫిబ్రవరిలో ఆమెకు నిశ్చితార్థం జరగడంతో తనను వదిలివేయాలని కోరగా తనతో కలిసి ఉన్న వీడియోలు తీశానని తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేగాక కాబోయే భర్తకు కూడా పంపిస్తానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక నిహాల్ సూచన మేరకు పెళ్లి కూడా రద్దు చేసుకుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు గుర్తించిన బాధితురాలు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడంతో ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన: బాధితురాలిని ట్రాప్ చేసింది ఎవరంటే.. -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి భారీ కుంభకోణానికి పాల్పడే ప్రయత్నాల్లో గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్న గోపీ కృష్ణ వ్యవహారాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహా స్కామ్‌లు చేసిన చెన్నై పోలీసులకు మూడుసార్లు చిక్కిన ఇతగాడు విలాసాలు, జల్సాలకే భారీ మొత్తాలు ఖర్చు చేసినట్లు తేలింది. ఇతడి వ్యవహారాలను హైదరాబాద్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దీనికోసం చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ►చెన్నైలోని భారతినగర్‌కు చెందిన గోపీ కృష్ణ ఆరేళ్ల నుంచి కాల్ సెంటర్ మోసాలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో స్కీముల పేరుతో స్కాములు చేశాడు. ఈ నేరాలకు సంబంధించి అక్కడి పోలీసులు 2015, 2016ల్లో అరెస్టు చేశారు. ►జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి కొత్త ప్రాంతంలో, మరో పేరుతో తన దందా మొదలెట్టేవాడు. 2020లో చెన్నైలోని వలసరివక్కం కేంద్రంగానే మరో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ►ప్రతి సందర్భంలోనూ తక్కువ జీతాలకు ఎక్కువ మంది టెలీకాలర్లను నియమించుకునే వాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 400 మందిని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు. చదవండి: (మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..) ►లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆకర్షించేలా పలు ఇన్వెస్టిమెంట్ స్కీములు రూపొందించాడు. తమ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే ప్రతి రోజూ కనీసం రూ.200 వరకు రాబడి ఉంటుందని నమ్మించాడు. ఇలా మూడు సందర్భాల్లోనూ కలిపి దాదాపు 2 వేల మంది నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశాడు. 2020లో ఇతడిపై చెన్నై పోలీసులు గూండా యాక్ట్ ప్రయోగించి ఏడాది జైల్లో ఉంచారు. ►గతేడాది అరెస్టు చేసినప్పుడు ఇతడితో పాటు అనుచరుల నుంచి చెన్నై పోలీసులు బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్, హోండా తదితర కంపెనీలకు చెందిన 13 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ►విలాసాలకు అలవాటు పడిన వీరంతా తరచూ థాయ్‌లాండ్, దుబాయ్, హాంగ్‌కాంగ్‌లకు వెళ్లి వారాల పాటు గడిపి వచ్చే వాళ్లు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ప్రముఖ క్యాసినోల్లో ఒకటైన బల్లీస్కు గోపీ రెగ్యులర్ కస్టమర్. ►ఆ క్యాసినోలో పేకాట ఆడటానికి వెళ్లే వాళ్లు టేబుల్ కోసం కొన్ని గంటలు, రద్దీ ఎక్కువ ఉంటే రోజులు ఎదురు చూడాలి. అయితే గోపీకి మాత్రం అందులో శాశ్వతంగా ఓ టేబుల్ ఉండేది. దీనికోసం ఇతడు రూ.కోటి ఖర్చు పెట్టినట్లు చెన్నై పోలీసులు గుర్తించారు. ►ఆఖరుసారిగా చెన్నై పోలీసులకు తిరుముల్లాయ్వోయల్ ప్రాంతంలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ చిక్కాడు. మూడుసార్లు ఒకే తరహా నేరాలు చేస్తూ చిక్కడంతో ఇతడిపై అక్కడి పోలీసుల నిఘా పెరిగింది. ►దీంతో జైలు నుంచి వచ్చిన ఇతగాడు తిరుమలగిరికి మకాం మార్చాడు. యునైటెడ్ ఇండియా హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. అతడి పథకం పారక ముందే టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. -
అల్వాల్‌లో రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరిలోని కారులో సోమవారం విజయ్ మృతదేహం లభ్యమైంది. కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కారులోనే దుండగులు కత్తితో విజయ్ రెడ్డి మెడపై పొడిచి చంపారు. కాగా సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మద్యవర్తులే చంపినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలియజేశారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
తిరుమలగిరి బాలానగర్‌లో బాత్రూమ్లో నివసిస్తున్న కుటుంబం.
-
ముంచేసిన ‘ముడిసరుకు’.. ఒత్తిడితో కొంత వెనక్కు పంపి..
నగరంలో సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఓ సంస్థ కాంబోడియాకు చెందిన కంపెనీ చేతిలో మోసపోయింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆరా తీయడంతో కొంత ఉపశమనం లభించింది. మిగిలిన సొమ్ము పంపకపోవడంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరికి చెందిన నోవీస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి చైనా నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటుంది. అక్కడి సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి కొన్నేళ్లుగా ముడిసరుకు ఖరీదు చేస్తోంది. సదరు కంపెనీ ప్రతినిధిగా చెప్పుకున్న ఓ మహిళ కొన్నాళ్ల క్రితం నోవీస్ సంస్థ నిర్వాహకులకు ఆన్లైన్లో పరిచయమైంది. తమకు కాంబోడియాలోనూ ఓ బ్రాంచ్ ఉందని, అక్కడ నుంచి ముడిసరుకు ఖరీదు చేస్తే చైనా కంటే తక్కువ ధరకు అందిస్తామని నమ్మబలికింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మెయిల్ చేసింది. నోవీస్ సంస్థ రెండు.. మూడు దఫాలు అక్కడ నుంచే సరుకు తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ముడిసరుకు కోసం నగర సంస్థ కాంబోడియాలోని సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్‌కు 1.46 లక్షల డాలర్లు (రూ. 1,06,66,424) చెల్లించింది. ఈ మొత్తం అందుకుని నెలలు గడుస్తున్నా సరుకు రాకపోవడంతో పాటు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు.ఈ విషయాన్ని నోవీస్ సంస్థ కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి ఆధారాలు సమర్పించింది. దీనిపై రాయబార కార్యాలయ అధికారులు ఆరా తీశారు. భయపడిన సదరు సంస్థ నోవీస్ సంస్థకు 50 వేల డాలర్లు (రూ. 36,52,885) తిరిగి చెల్లించింది. మిగిలిన మొత్తంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వారి నుంచి స్పందన లేదు. నోవీస్ సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. చదవండి: ద్విచక్ర వాహనంపై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే! -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఇక రాష్ట్రవ్యాప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నలుదిశలా దళితబంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటు అమలుచేయాలని సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఎంపికైన ఆ నాలుగు మండలాలు ఇవే.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం: చింతకాని మండలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: తిరుమలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం: చారగొండ మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలం ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
వీధి వీధిలో విద్య..
ఆ ఊరి నుంచి ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూలుకు వెళ్లరు.. గ్రామంలోని వీధి వీధిలో విద్య అందుబాటులో ఉంటుంది.. వారికి నచ్చిన చోట కూర్చొని చదువుకోవచ్చు.. ఆంగ్లం పదాలు టకాటకా చెప్పగలరు.. గణితం కూడికలు, తీసి వేతలు, ఎక్కాలు చకచకా చదవగలరు.. ఇదీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శిల్గాపురం ప్రత్యేకత. అక్కడి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సైదయ్య ఆలోచన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తిరుమలగిరి (నాగార్జునసాగర్): కరోనా నేపథ్యంలో పాఠశాలలు బంద్ కావడంతో ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అవి వినే పరిస్థితి అంతంతే. ఆన్లైన్ పాఠాలకు సెల్ఫోన్లు, సిగ్నల్స్, డాటా అందుబాటులో లేక 50 శాతం మంది విద్యార్థుల చదువు సాగడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శిల్గాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టెబోయిన సైదయ్య ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని వీధుల్లో బ్లాక్‌బోర్డులు, ఫ్లెక్సీలు, చార్టులపై వర్ణమాల, సరళ పదాలు, ఏబీసీడీలు.., ఒత్తులు, పదాలు, ఎక్కాలు, జంతువులు, ఆంగ్లపదాల్లో జంతువులు, పండ్లు, పక్షుల చిత్రా లను ప్రతి వీధిలో ఏర్పాటు చేశారు. దీనికి పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం తీసుకున్నారు. ప్రతి వీధికి ఓ ఇన్చార్జ్ని నియమించి విద్యార్థులను చదివించే బాధ్యతను వారికి అప్పగించారు. ఇలా గ్రామంలో 65 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరవుతూ విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. ఇన్చార్జీలు వారిని ఎలా పోత్సహిస్తున్నారు అనే అంశాలను పర్యవేక్షిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రైవేట్ స్కూల్ వాహనాలు బంద్.. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కు పంపిస్తుండటంతో చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శిల్గాపురం పాఠశాలలో ఐదేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఐదేళ్ల నుంచి ఒక్క విద్యారి్థని కూడా ప్రైవేట్ పాఠశాలకు ఆ ఊరి నుంచి పంపిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుంచే పది మంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధిస్తుండటం విశేషం. -
డ్యాన్స్ స్కూల్: కొవ్వు తగ్గిస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి..
సాక్షి, కంటోన్మెంట్: డ్యాన్స్ స్కూల్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించిన వివరాల మేరకు తిరులమగిరి దుర్గావిహార్ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అర్బన్ డ్యాన్స్ వరల్డ్‌లో మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంబంధిత డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడు సుదర్శన్ బాలిక నడుము వద్ద కొవ్వును తగ్గిస్తానని, అందుకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8గంటల సెషన్లో వర్కవుట్స్‌కు రావాల్సిందిగా సూచించాడు. దీంతో బాలిక గత నెల 26 నుంచి ఉదయం వేళలో వర్కవుట్స్‌కు వెళ్తోంది. తను ఇచ్చే శిక్షణకు సంబంధించి ఇన్‌స్ట్రాగామ్ రీల్ చేయాల్సి ఉంటుందని బాలికకు సూచించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వర్కవుట్స్ సమయంలో డ్యాన్స్ స్కూల్‌కు వచి్చన బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు బాలిక ఇంట్లో వాళ్లకు విషయం తెలుపగా డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి.. -
లాక్‌డౌన్‌ను పట్టించుకోని కానిస్టేబుల్
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ నిబంధనలు అతిక్రమించాడు. మాల్దీవుల నుంచి వచ్చిన ముగ్గురికి ఇంట్లో ఆశ్రయం కల్పించడమే కాకుండా వారితో బయట తిరిగి జల్సాలు చేశాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన ప్రతాప్, నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన ప్రదీప్, బి.హరీశ్‌లు మాల్దీవులలోని ఓ రిసార్ట్‌లో ఏడాదిన్నర కాలంగా వెయిటర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 21న హైదరాబాద్‌కు వచ్చారు. ఐదు రోజులు అక్కడే ఉండి అనంతరం ఈ నెల 26న తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మాండ్ర శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాల్సిన వారు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో కలసి బయట తిరగడంతో పాటు జల్సాలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, సీఐ శ్రీనివాస్, వైద్యాధికారి ప్రశాంత్‌బాబు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లగా శ్రీనివాస్ వారితో దురుసుగా ప్రవర్తించాడు. కాగా, వైద్య శాఖ సిబ్బంది.. మాల్దీవుల నుంచి వచ్చిన ముగ్గురితో పాటు కానిస్టేబుల్‌కు స్టాంపులు వేసి 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలియజేయాలని వారు ప్రజలను కోరారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి సగం జీతం పేదలకే..
సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్) : సొంతలాభం కొంత మానుకో పొరుగువారికి తోడ్పడవోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. దీనిని అక్షరాల నిజం చేస్తున్నాడు తిరుమలగిరి మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కట్టెబోయిన అనిల్‌కుమార్ యాదవ్. మంచి మనస్సు ఉంటే పొరుగువారికి సాయం అందించడం కష్టమేమి కాదని నిరూపిస్తున్నాడు. ఆయనది దిగువ మధ్య తరగతి కుటుంబం. తన తల్లిదండ్రులు కూలిపనులు చేస్తూ అనిల్‌ను ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఒమ్ముచేయకుండా పట్టుదలతో చదివిన అనిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్యాక్‌సెట్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నాడు. తాను సంపాదించిన దానిలో కొంచమైనా తనను ప్రయోజకుడిని చేసిన పాఠశాలకు, గ్రామానికి, నేటికీ మౌలిక వసతులకు దూరంగా ఉన్న పాఠశాలలకు, నిరుపేద విద్యార్థులకు పంచాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పమే నేడు వేల మంది విద్యార్థులకు సాయం చేసేలా చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు అనిల్. చిన్ననాటి నుంచే తాపత్రయం.. సమాజం మనకు ఏమిచి్చందనే ఆలోచనతో కాకుండా మనం సమాజ వికాసానికి ఏం చేస్తున్నామనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. మనకున్న దానిలో కొంతైనా ఇతరులకు సాయం చేయాలని అనిల్ చిన్ననాటి నుంచే తాపత్రయపడుతుండేవాడు. దీనిలో భాగంగానే 2011 తన స్వగ్రామమైన శిల్గాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన సొంత డబ్బులతో నోట్‌బుక్స్, బ్యాగులు, పెన్నులు, పెన్సిల్, టైబెల్ట్లతోపాటు వివిధ రకాల సామగ్రిని అందజేశాడు. ఈ క్రమంలోనే మరికొంత మంది పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఆలోచనతో తాను పనిచేసే ఫ్యాక్‌సెట్ కంపెనీని భాగస్వామ్యం చేసి తన గ్రామంతోపాటు కొంపల్లి, తిరుమలగిరి, ఎల్లాపురం, ఎల్లాపురంతండా, ఆంజనేయతండా, చల్మారెడ్డిగూడెం, అనుములచ శ్రీరాంపల్లి, ఊట్లపల్లి, పులిచర్ల, వెనిగండ్ల, ముప్పారం, గుడిపల్లి, నేరేడుచర్ల నాయనేనికుంట, బొత్తలపాలెం, తెప్పలమడుగు తదితర గ్రామాల్లోని పాఠశాలలకు బీ రువాలు, నోట్‌పుస్తకాలు, బెంచీలు తదితర వస్తువులతోపాటు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు, పాఠశాలల్లో దంత వైద్యపరీక్షలు చేయించి ఉచితంగా బ్రెష్‌లు, పేస్టులు అందజేశారు. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం.. వీటితోపాటు పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రతి ఏటా నగదు ప్రో త్సాహకాలు అందజేస్తున్నారు. తనకున్న అనుభవాలను, చదువులో ఎలాంటి మెళకువలు నేర్చుకొని జీవితంలో ముందుకు సాగాలనే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు. నేను సంపాదించిన దాంట్లో సగం పేదలకు ఖర్చుచేయాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగానే ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్‌బుక్, లైబ్రరీ, బెంచీలు తదితర సామగ్రిని అందజేశా. నాతోపాటు నేను పనిచేసే సంస్థను కూడా భాగస్వామ్యం చేసి, ఎక్కువ మంది విద్యార్థులకు సాయపడుతున్నాం. భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ మందిని, సంస్థలను భాగస్వామ్యం చేసి నిరుపేద విద్యార్థులకు సాయ పడుతాం. – కట్టెబోయిన అనిల్‌కుమార్ యాదవ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి -
నాయకుని తండాలో నాటు బాంబుల మోత
తిరుమలగిరి(నాగార్జునసాగర్): నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఆదివారం అర్ధరాత్రి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. నాటుబాంబుల మోతతో తండాలో భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. సుమారు 40 ఇళ్లు, వాటిలోని సామగ్రి ధ్వంసమైంది. తండాకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య కొంతకాలంగా రాజకీయ వైరం కొనసాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఈ క్రమంలో ఈ నెల 13న టీఆర్ఎస్కు చెందిన స్వామి, కాంగ్రెస్‌కు చెందిన భిక్షాలు ఓ శుభకార్యానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ విషయాన్ని స్వామి తన కుమారుడు దస్రూకు చెప్పాడు. మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం దస్రూ.. తండాలో ఉన్న భిక్షాలు దగ్గరికి వెళ్లి తన తండ్రిని తిడతావా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. తండావాసులు ఇరువర్గాలుగా విడిపోవడంతో వాగ్వాదం కాస్త తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒకరిపైఒకరు రాళ్లు, బీరు సీసాలు విసురుకున్నారు. ఆ తర్వాత చేపల వేటకు ఉపయోగించే నాటుబాంబులను ప్రత్యర్థుల ఇళ్లపై విసిరారు. దీంతో ఇళ్లలోని మనుషులు బయటికి పరుగులు తీశారు. బాంబుల ధాటికి ఇరువర్గాలకు చెందిన వారి ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన దస్లీ, మేరావత్ సోమ్లాకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున తండాకు చేరుకున్నారు. అయితే అప్పటికే దాడులకు పాల్పడిన వారు పరారయ్యారు. నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్‌ల ఆధ్వర్యంలో తండాలో పోలీసు పహారా నిర్వహించారు. దీనిపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తిరుమలగిరి ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. -
సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఘనంగా సదర్ ఉత్సవాలు
-
ప్రేమించకపోతే మీ తల్లిదండ్రుల్ని చంపేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు దిగడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అదేకాకుండా తమ స్నేహితున్ని ప్రేమించకుంటే యువతి తల్లిదండ్రులను చంపేస్తామంటూ నిందితుని ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఇటీవల బెదిరింపులకు దిగారు. దీంతో తనవారిని ఏం చేస్తారోనని భయపడిన సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
8 మంది దొంగలు.. 8 బృందాలు
సాక్షి, హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం నగరంలోని తిరుమలగిరిలో జరిగిన దోపిడి కేసును ఛేదించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. దోపిడికి పాల్పడిన 8 మంది దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అంజన్ కుమార్ మాట్లడుతూ ‘ఈ నెల 1న తిరుమలగిరిలో దోపిడి జరిగింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఇంటి యజమాని పేరు అడుగుతూ వచ్చి దోపిడికి పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. చివరకూ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు వీరిని అరెస్ట్ చేశార’ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ గ్యాంగ్‌లో మొత్తం ఎనిమంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు చితికి పోవడంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేయడం కోసం ఓ కారును కూడా వాడనట్లు తెలిసింది. వీరంతా దోపిడి సమయంలో మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఈ గ్యాంగ్‌కి సయ్యద్ మూజుద్ లీడర్‌గా వ్యవహరించాడు. ఈ దోపిడి కేసులో సయ్యద్ జమీల్ ఏ1గా, సయ్యద్ ముజీద్‌ను ఏ2గా ఉన్నారు. ఏ1, ఏ2లపై గతంలో కేసుల కూడా ఉన్నాయి. ఈ కేసులో ఏ1 అయిన సయ్యద్ జమీల్ గతంలో సనత్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడ’ని తెలిపారు. ఈ గ్యాంగ్ నుంచి 30 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, 11 మొబైల్ ఫోన్స్‌తో పాటు మహీంద్ర కారును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలగిరి మండలం అల్వాల్‌లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఓ వివాహిత, ఆమె తరపు బంధువులు మరో మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పథకం ప్రకారమే కేర్ టేకర్‌గా చేరి..
హిమాయత్‌నగర్ : కేర్ టేకర్‌గా చేరి వృద్ధురాలిని హత్య చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీస్‌శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎనిమిది టీంలతో పనిచేసిందని, హత్య అనంతరం అక్కడ కాజేసిన బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించిన నిందితుల్ని ఎట్టకేలకు పట్టుకుని అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకృష్ణరావు నేతృత్వంలోని టీం ఎంతో చాకచక్యంగా ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు నిందితుడి తల్లిని కూడా అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి నుంచి 4 తులాల గోల్డ్ నెక్లెస్, తులం చెవి దుద్దులు, తులం గోల్డ్ కాయిన్, 10 తులాల వెండి పట్టీలు, 2 సెల్ఫోన్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ తిరుమలగిరిలోని కమల లయ ఎన్‌క్లేవ్‌లో జి.సులోచన (66), భర్త కాంతరావు(72) నివాసం ఉంటున్నా రు. భర్త కాంతరావు పెరాలసిస్‌తో బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. వీరికి కేర్ టేకర్ అవసరమని గత నెలలో పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రకటన ఆధారంగా నిజమాబాద్ జిల్లా, సుద్దపల్లి గ్రామానికి చెందిన నిధి అరుణ్(29) 7వ తేదీన కేర్‌టేకర్‌గా చేరాడు. ప్లాన్‌తోనే చేరాడు వృద్ధులకు కేర్ టేకర్‌గా అంటే ఆస్తి అంతా కాజేయవచ్చు అనే ఆలోచనతోనే చేరినట్లు పోలీసులు నిర్ధారించారు. అరుణ్ వ్యవహారశైలిలో అనుమానాలు రావడంతో సులోచన తన కుమారుడికి చెప్పింది. కొద్దిరోజులు ఓపిక పట్టమని అన్నాడు. కేర్ టేకర్‌ను మార్చేద్దామని హామీ ఇచ్చాడు. ఈ మాటలు విన్న అరుణ్ ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ జిల్లా మెట్రస్‌పల్లికి చెందిన పరిచయస్తురాలు మాచర్ల సరస్వతిని నగరానికి తీసుకొచ్చాడు. పథకం ప్రకారం చేశారు రాత్రి 7.30గంటలకు తిరుమలగిరిలోని అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చి బయట మెట్లపై సరస్వతిని కూర్చోబెట్టి అరుణ్ ఇంట్లోకి వెళ్లాడు. రాత్రి 10.30గంటలకు సులోచన, కాంతరావు నిద్రపోయారు. ఆ తరువాత సరస్వతిని ఇంట్లోకి తీసుకొచ్చి ఒకే గదిలో రెండు గంటల పాటు ఉన్నారు. రాత్రి 12.30గంటల తరువాత అరుణ్ దిండు తీసుకుని సులోచన ముఖంపై పెట్టి నులుముతుండగా ఆమె కాళ్లను సరస్వతి పట్టుకుంది. ఐదు నిమిషాల్లోనే సులోచన ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోలేదేమోననే అనుమానంతో వంటగది లో ఉన్న కత్తిని తీసుకుని కడుపులో బలంగా పొడి చాడు అరుణ్. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. రక్తం ఎక్కువగా రావడంతో పౌడర్ చల్లారు. ఆ తరువాత సులోచన మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని వెండి, నగదును తీసుకుని కవర్లో పెట్టుకున్నారు. అప్పటికప్పుడు వెళితే అనుమానం వస్తుందని భావించిన వీరు తెల్లవారు జా మున 3.30గంటల ప్రాంతంలో బంగారం, నగ దు, వెండిని తీసుకుని పారిపోయారు. ఇక్కడ దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును తీసికెళ్లి అరుణ్ తన తల్లి రాజమణికి ఇచ్చాడు. నగరంతో పాటు, నిజామాబాద్ ప్రాం తాల్లో వీరు అమ్మిన బంగారు ఆభరణాల ద్వారా పోలీసులను వీరిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో అరెస్టు చేసినట్లు అంజనీకుమార్ తెలిపారు. గతంలోనూ హత్య చేశాడు అరుణ్‌పై గతంలో నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. 2016లో ఓ వ్యక్తిని చంపి, రూ.5వేలు కాజేసి పరారయ్యా డు. నిజమాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బైకు దొంగిలించిన కేసులో ఇతడిపై కేసు నమోదైంది. సిబ్బందిని అభినందించిన సీపీ కేసును త్వరతగతిన పరిష్కరించినందుకు కమిషనర్ అంజనీకుమార్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. డీసీపీ రాధకృష్ణరావు, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రవి, శ్రీకాంత్, శ్రవణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. -
తిరుమలగిరి మృతులకు ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నామని.. ఈ ప్రమాదంపై డీసీపీ స్థాయి అధికారితో ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన జీహెచ్ఎంసీ వాహన డ్రైవర్ మద్యం సేవించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబం రోడ్డున పడిందని వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. చికిత్స పొందుతున్న తల్లీ కుమార్తెల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నగరంలో పనిచేయని సీసీ కెమెరాలపై పోలీస్ కమిషనర్‌తో చర్చించి సీసీ కెమెరాలు బాగు చేస్తామన్నారు. -
తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ట్రక్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. బైక్ పై దంపతులు, వారి ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో వెళ్తుండగా ట్రక్ వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో ఈ ప్రమాదంలో ట్రక్ కింద ఇరుక్కుపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులను మహమ్మద్ ఆజాద్(37), అమన్(9), అషివియ, అలినా లుగా గుర్తించారు. అజాద్ భార్య ఇమ్రానాను గాంధీ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మంత్రి కేటీఆర్ అధికారుల కంటే ముందుగానే ప్రమాదస్థలానికి చేరుకున్నారు. అధికారులు, పోలీసులను సహాయ చర్యల కోసం అప్రమత్తం చేశారు. ఓ పాపకు సీరియస్‌గా ఉండటంతో కేటీఆర్ స్వయంగా పాపను కారులో చికిత్స కోసం తీసుకెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే తన సిబ్బందితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని అత్యవసర చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు ప్రమాదం ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
తిరుమలగిరి(సూర్యాపేట జిల్లా): మండలకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. నకిరేకల్ మండలానికి చెందిన అనిల్ కుమార్(17) ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి గురువారం బైక్‌పై తిరుమలగిరి వెళ్లాడు. బైక్‌పై వెళ్తుండగా మండలకేంద్రంలో వెనక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నామ్’ కే వాస్తే..!
తిరుమలగిరి : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం (నామ్)ను ప్రవేశపెట్టింది. 2016 ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆన్లైన్ ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని వ్యవసాయ మార్కెట్లో ప్రారంభించి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇతర ప్రాంతాల నుంచి మాత్రం ఆన్లైన్ ట్రేడింగ్‌కు నోచుకోవడం లేదు. దీనికి కారణం ఈ–నామ్‌ను ప్రారంభించిన అధికారులు ఇతర మార్కెట్లో ఉండే కొనుగోలుదారులకు వీలయ్యే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను తయారు చేసే విధానంలో విఫలమయ్యారు. దీంతో గతంలో లాగానే ఏ మార్కెట్లో ఉన్న ట్రేడర్లు ఆ మార్కెట్లోనే సరుకులను కొనుగోలు చేస్తున్నారు. మొదట తిరుమలగిరి మార్కెట్లోనే... ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక సరుకులు వచ్చే మార్కెట్‌గా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు పేరుంది. సంవత్సరం పొడవునా సరుకులు వస్తుండడంతో క్రయ విక్రయాలు సాగుతాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఈ–నామ్ విధానాన్ని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో కూడా ప్రారంభించారు. మొదటి రోజు మాత్రం ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు సంబంధించిన ట్రేడర్లు ఇక్కడి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొదటి రోజు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. తొమ్మిది నెలలు దాటుతున్నా ఈ విధానం ద్వారా ట్రేడింగ్ అమలు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ–నామ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ట్రేడర్లు ఆన్లైన్లో చూసి పోటీ పడితే తమ దిగుబడులకు అధిక ధర వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. కొనుగోలు విధానం ఇది... మార్కెట్లోకి రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని రాగానే గేట్ ఎంట్రీలోనే రైతు వివరాలు, సరుకుల పరిమాణం, ఊరు పేరు, ఏ కమీషన్‌కు తీసుకుని వెళుతున్నాడో తెలుసుకుని ఒక ఐడీని ఇస్తారు. ఆ ఐడీని సరుకులపై ఉంచుతారు. తదుపరి వివరాలను మార్కెట్ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. కొనుగోలుదారులు రైతులు తీసుకొచ్చిన సరుకుల ఐడీతో ఈ–బిడ్డింగ్ నిర్వహిస్తారు. అందులో అత్యధికంగా ఏ ధరకు కొనుగోలు చేశారన్నది ఆన్లైన్లో వెంటనే తెలిసిపోతుంది. ఆన్లైన్లో వ్యాపారస్తులు కోరిన గరిష్ఠ ధర పండించిన రైతుకు గిట్టుబాటు అనిపిస్తే అదే ధర వద్ద అమ్ముకునేందుకు అనుమతిస్తే మార్కెట్ సిబ్బంది అంగీకారం తెలిపి క్రయవిక్రయాలు కొనసాగిస్తారు. అందుకు ధర సరిపడా మార్కెట్ చార్జీలు రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వ్యాపారి రైతు ఖాతాలో నగదును జమ చేస్తాడు. రైతులకు కొనుగోలుదారులకు మార్కెటింగ్ శాఖ అనుసంధానకర్తగా పని చేస్తుంది. ఈ విధానం ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రేడర్లు ఆన్లైన్ ద్వారా చూసి బిడ్డింగ్ వేయాల్సిఉండేది. కానీ, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేకపోవడంతో కేవలం ఆ మార్కెట్లో ఉన్న ట్రేడర్ల ద్వారానే ఈ విధానం అమలవుతోంది. స్థానిక మార్కెట్లో ఉన్న ట్రేడర్లలో ఎవరు ఎక్కువ ధరకు కోడ్ చేస్తే వారికే రైతులు సరుకులు అమ్ముకుంటున్నారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేదు... మార్కెట్లో నామ్ విధానం ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి ట్రే æడింగ్ చేయడానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేకపోవడంతో వేరే ప్రాంతం నుంచి కొనుగోళ్లు జరగడం లేదు. – నవీన్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి -
జిల్లాకు చేరిన గోదావరి జలాలు
తిరుమలగిరి : ఎట్టకేలకు జిల్లా రైతుల నిరీక్షణ ఫలించింది. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాలు బుధవారం రాత్రి జిల్లాకు చేరుకున్నాయి. వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలో 69వ డీబీఎంకు 450, 71 డీబీఎంకు 850 క్యూసెక్కుల నీరు విడుదలైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండి గేట్లు తీయడంతో ఎల్ఎండికి నీరు చేరింది. ఎల్ఎండి నుంచి 8 టీఎంసీల నీటిని కాకతీయ కాల్వకు, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు నీటిని విడుదల చేశారు. దీంతో నల్లగొండ జిల్లాలో 2,52,545 ఎకరాలకు ఉపయోగపడుతుంది. వారం రోజుల క్రితం వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి నీటిని విడుదల చేసినా వరద తగ్గడంతో 69వ డీబీఎంకు నీటి విడుదల ఆగిపోయింది. అయితే ఎల్ఎండీ నుంచి గోదావరి జలాలు విడుదల కావడంతో ఎట్టకేలకు నల్లగొండ జిల్లాకు గోదావరి నీళ్లు చేరుకున్నాయి. ఈ నీటిని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి ఉపయోగిస్తున్నట్లు 69 డీబీఎం డీఈ శోభారాణి తెలిపారు. -
ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం
తిరుమలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరిలో ఎస్సారెస్పీ కాల్వలపై, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను తుంగతుర్తి , సూర్యాపేట నియోజక వర్గాలలోని చెరువులను, కుంటలను నింపాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ రెండవ దశ కాలువలు 69 ,71 డీబీయంలపై ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు. నీటిని వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. త్వరలోనే ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. వర్షాలు అధికంగా కురుస్తున్న దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సీ వెంకటేశ్వర్రావు, ఈఈ ప్రభు కాల్యాన్, సుధీర్, డీఈ శోభారాణి, ఏఈ మల్లేష్, పాల్గొన్నారు.